Patna
-
హోలీ డ్యాన్స్ చేస్తావా.. సస్పెండ్ చేయించమంటావా?
పాట్న: హోలీ వేడుకల సమయంలో డ్యాన్స్ చేస్తావా లేక సస్పెండ్ చేయించమంటావా అంటూ ఒక పోలీసును ఆర్జేడీ నేత, మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్ బెదిరించడం వివాదం రేపుతోంది. మాజీ సీఎంలు లాలు ప్రసాద్, రబ్డీదేవీల పెద్ద కుమారుడు ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ అధికార నివాసం వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రి లాలు మాదిరిగానే హోలీ వేడుక సమయంలో పండగ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మద్దతు దారుల చొక్కాలను తేజ్ ప్రతాప్ చించివేశారు. అనంతరం స్కూటర్‌పై ‘పిల్లిమొగ్గల చిన్నాన్నకు హోలీ శుభాకాంక్షలు’అని పరోక్షంగా సీఎం నితీశ్‌కుమార్‌ను ఉద్దేశించి తన నివాసం చుట్టుపక్కల వీధుల్లో కేకలు వేస్తూ తిరిగారు. అదేవిధంగా, తాత్కాలికంగా ఏర్పాటుచేసిన వేదికపై సోఫాలో కూర్చుని.. ‘ఏయ్ పోలీస్.. దీపక్..ఇప్పుడు మేమొక పాట వేస్తాం. డ్యాన్స్ చేయాలి. లేదంటే నువ్వు సస్పెండ్ అవుతావ్. ఏమనుకోకు, ఇది హోలీ పండగ’ అని అక్కడే ఉన్న దీపక్ అనే కానిస్టేబుల్నుద్దేశించి అంటున్న వీడియో వైరల్‌గా మారింది. దీంతో, ఆ కానిస్టేబుల్ అక్కడి వారితో కలిసి కొద్దిసేపు డ్యాన్స్ చేశారు. దీనిపై బీజేపీ మండిపడింది. ‘తండ్రి మాదిరిగానే కుమారుడు కూడా. అప్పట్లో సీఎంగా లాలు చట్టాన్ని డ్యాన్స్ చేయించాడు. బిహార్‌ను జంగిల్ రాజ్‌గా మార్చాడు. ఇప్పుడు కుమారుడు అధికారంలో లేకున్నా, చట్టాన్ని, రక్షకులను డ్యాన్స్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి వారికి అధికారం ఇవ్వరాదు’ అని పేర్కొంది. VIDEO | A policeman was seen dancing on the instruction of RJD leader Tej Pratap Yadav during Holi celebration at his residence in Patna. #tejpratapyadav #Holi #Patna pic.twitter.com/oCIP0kL03r— Press Trust of India (@PTI_News) March 15, 2025 -
రెచ్చిపోయిన గ్రామస్తులు.. పోలీసులపై దాడి.. ఏఎస్ఐ మృతి
పాట్నా: ఓ ఊరి గ్రామస్తులు దారుణానికి ఒడిగట్టారు. ఊర్లో పెళ్లి చేసుకుంటున్న క్రిమినల్‌ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై దాడుల చేశారు. గ్రామస్తులు చేసిన దాడుల్లో ఏఎస్ఐ దుర్మరణం పాలయ్యారు.బీహార్ రాష్ట్రం, అరారియా జిల్లా ఫుల్కహా అనే గ్రామంలో అన్మోల్ యాదవ్ ఓ పేరు మోసిన క్రిమినల్. పలు నేరాలకు పాల్పడి.. పోలీసులు కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే ఈ క్రమంలో బుధవారం అన్మోల్ యాదవ్ తన స్వగ్రామంలో పెళ్లి చేసుకుంటున్నాడనే సమాచారం పోలీసులకు అందింది.వెంటనే ఫుల్కహా గ్రామంలో పోలీసులు మోహరించారు. పెళ్లి చేసుకుంటున్న క్రిమినల్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో గ్రామస్తులు రెచ్చిపోయారు. పోలీసులపై దాడులకు తెగబడ్డారు. దాడుల్లో ఏఎస్ఐ రాజీవ్ రంజన్ మాల్ దెబ్బలకు తాళలేక స్పృహ కోల్పోయాడు. అప్రమత్తమైన పోలీసులు రాజీవ్ రంజన్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు.వైద్య పరీక్షల్లో ఏఎస్ఐ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని ఎస్పీ అంజన్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో ఆరుగురు ఆనుమోల్ యాదవ్ మద్దతుదారుల్ని అరెస్ట్ చేశారు. అనుమోల్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. -
పట్టపగలే దొంగల ముఠా బీభత్సం.. భారీ దోపిడీ!
పాట్నా: బీహార్ రాష్ట్రంలో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం స్పష్టించారు. ఓ నగల షాపులో ప్రవేశించి సుమారు రెండు కోట్ల రూపాయిల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించారు. రాష్ట్రంలోని బోజ్ పూర్ జిల్లాలోని గోపాలి చౌక్ వద్ద ఉన్న తనిష్క్ నగల దుకాణంలోకి ప్రవేశించిన ఒక ముఠా వారిని బెదిరించి భారీ ఎత్తును నగలను, నగదును తస్కరించుకుపోయారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో పట్ట పగలే ఇలా ఒక దుకాణంలోకి ప్రవేశించి నగలను, భారీ ఎత్తును డబ్బును దోచుకుపోవడంతో స్థానికంగా కలకలం రేగింది.అరగంటకు పైగా షాపులోనే..దోపిడీ ప్రణాళిక వచ్చిన ఒక ముఠా సుమారు అరగంట పాటు షాపులోనే ఉన్నారు. పెద్ద ఎత్తున తుపాకులతో వచ్చిన దొంగల ముఠా.. ఎటువంటి అనుమానం రాకుండా అరగంటకు పైగా షాపులోనే గడిపారు. ముందుగా నగల షాపులో ఉన్న వారిని బెదిరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నగలను, క్యాష్ కౌంటర్ లో ఉన్న నగదును దొంగిలించుకుపోయారు.సెక్యూరిటీ గార్డు గన్ ను దొంగిలించి..నగల షాపు దోచుకున్న అనంతరం సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న గన్ ను సైతం దొంగలు దొంగిలించి అక్కడ నుంచి పారిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వచ్చేసరికి దొంగలు అక్కడ నుంచి పారిపోయారు.నలుగురు తప్పించుకున్నారు.. ఇద్దరు దొరికారుదీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆ ప్రాంతంలో జల్లెడ పట్టే యత్నం చేశారు. అయితే ఆ దొంగల్లో ఇద్దరు పోలీసులను చూసి తప్పించుకోవాలని చూశారు. దాంతో పోలీసులు షూట్ చేసి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి నాలుగు బండిల్స్ జ్యూయలరీని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకో నలుగురు తప్పించుకున్నారు. ఈ భారీ దొంగతనంపై సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్న పోలీసులు.. త్వరలోనే మిగతా నలుగుర్ని పట్టుకుంటమన్నారు. -
Mahakumbh: పట్నా నుంచి ప్రయాగ్‌రాజ్‌కు బస్సులు.. చౌకలో ప్రయాణం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివెళుతున్నారు. ఇప్పుడు బీహార్ నుండి మహా కుంభమేళాకు వెళ్లే వారికి బీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పట్నా నుండి ప్రయాగ్‌రాజ్‌కు బస్సు సర్వీస్ నడుపుతున్నట్లు తెలిపింది. ఈ బస్సు సర్వీసు ఫిబ్రవరి 28 వరకు నడుపుతున్నట్లు పేర్కొంది. మహా కుంభమేళా(Great Kumbh Mela)కు వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం ఈ కొత్త బస్సు సర్వీసును ప్రారంభించినట్లు తెలిపిన బీఎస్‌ఆర్టీసీ ఈ సర్వీసును రాత్రిపూట నడుపుతున్నట్లు పేర్కొంది. ఈ బస్సు ఎక్కినవారు ఉదయానికల్లా గమ్యస్థానానికి చేరుకుంటారని వెల్లడించింది. మహాకుంభ్‌లో పెరుగుతున్న భక్తుల సంఖ్య దృష్ట్యా, రెండు కొత్త బస్సులను నడపాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బస్సులు బీహార్ రాజధాని పట్నా నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్(Prayagraj) వరకు నడుస్తాయి.బీహార్ రాష్ట్ర రవాణా కార్యదర్శి సంజయ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ మహా కుంభమేళాకు వెళ్లే ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బస్సుల ద్వారా భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించి మహా కుంభమేళాకు చేరుకోవచ్చని తెలిపారు. పట్నా నుండి ప్రయాగ్‌రాజ్‌కు బస్సు ఛార్జీ రూ. 550. ఈ బస్సు పట్నాలో రాత్రి 8:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4 గంటలకు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం(Return journey)లో ఈ బస్సులు ప్రయాగ్‌రాజ్ నుండి రాత్రి 10 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు ఉదయం 5 గంటలకు పట్నా చేరుకుంటాయని సంజయ్‌కుమార్ తెలిపారు. ఇది కూడా చదవండి: కుంభమేళా నుంచి అయోధ్యకు జనప్రవాహం -
కూలదోయబోయి కూలబడ్డారు
పట్నా: వరుసగా రెండు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచామన్న విజయగర్వంతో రాజ్యాంగాన్నే కూలదోసే సాహసంచేసి, మూడోసారి మెజార్టీ తగ్గడంతో మళ్లీ రాజ్యాంగం వద్ద ప్రధాని మోదీ ప్రణమిల్లారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. శనివారం పట్నాలోని చరిత్రాత్మక సదాఖత్ ఆశ్రమం వద్ద గాందీజీ విగ్రహం వద్ద నివాళులర్పించాక పార్టీ కార్యకర్తలతో ‘కార్యకర్తా సమ్మేళన్’తర్వాత ‘సంవిధాన్ సురక్షా సమ్మేళన్’సభల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాజ్యాంగ ప్రతిని చేతబట్టుకుని ప్రసంగించారు. ‘‘మూడో సా రి కూడా మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టి ఉంటే ఈ రాజ్యాంగాన్ని కూలదోసేవారు. కానీ విపక్షాలు ఐక్యంగా పోరాడటంతో ఆయన కల లు కలగానే మిగిలిపోయాయి. 400పార్ నినాదాన్ని ఓటర్లు దారుణంగా తిరస్కరించడంతో మెజారిటీ తగ్గిపోయి మోదీ మళ్లీ రాజ్యాంగం వద్ద సాగిలపడ్డారు’’అని రాహుల్ అన్నారు. దీంతో అక్కడున్నవాళ్లంతా గొల్లున నవ్వారు. 543 సీట్లున్న లోక్‌సభలో 400కుపైగా సీట్లొస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తామని పలువురు బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు ఎన్డీఏ కూటమి భారీ విజయశాతాన్ని తగ్గించేసిన సంగతి తెల్సిందే. ‘‘బుద్ధుడు, అంబేడ్కర్, నారాయణ గురు, మహాత్మా ఫూలేవంటి ఎందరో ప్రముఖుల ప్రగతిశీల భావనల నుంచే రాజ్యాంగం ఆవిర్భవించింది’’అని రాహుల్ అన్నారు. -
బీహార్‌లో ఉద్రిక్తతలు.. ప్రశాంత్ కిషోర్‌పై కేసు నమోదు
పట్నా: బీహార్‌లో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(BPSC) ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకల వ్యవహారం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అభ్యర్థులు ఆందోళన చేస్తున్న క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో, పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేత ప్రశాంత్ కిషోర్, కోచింగ్ సెంటర్ల యజమానులు, మరో 700 మంది నిరసనకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.బీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలపై బీహార్‌లో ఉద్రిక్తతలకు దారి చేసింది. ఆదివారం వేలాది మంది అభ్యర్థులు పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో సీఎం నివాసం వైపు ర్యాలీగా బయల్దేరేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.అంతకుముందు.. విద్యార్థుల నిరసనకు జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మద్దతు ప్రకటించారు. అయితే, నిరసనలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ర్యాలీలకు, నిరసనలను అనుమతి లేకున్నా ప్రశాంత్ కిషోర్ అభ్యర్థులను రెచ్చగొట్టారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రేరేపించారని పోలీసులు తెలిపారు. తమ మార్గదర్శకాలను పాటించని కారణంగా ప్రశాంత్ కిషోర్, కోచింగ్ సెంటర్ల యజమానులు, మరో 700 మంది నిరసనకారులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. Mild-Lathi Charge according to ANI. pic.twitter.com/64cfgklI07— Mohammed Zubair (@zoo_bear) December 29, 2024ఇదిలా ఉండగా.. డిసెంబర్ 13న నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత 10 రోజులకు పైగా నిరుద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. పరీక్షను రద్దు చేసి.. కొత్తగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్పారు. అయితే, ఈ పరీక్షలను పారదర్శకంగానే నిర్వహించామని.. విద్యార్థుల వాదనలకు ఎలాంటి ఆధారాల్లేవని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ ఆందోళనల్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. -
పట్నా నాటి ఔన్నత్యానికి దర్పణం
పట్నా టూర్ అనగానే నాకు ‘చాణక్య’ చారిత్రక నవల, టీవీ సీరియల్ ఒకదానితో ఒకటిపోటీ పడుతూ కళ్ల ముందు మెదిలాయి. ‘సున్న’ తో ప్రపంచ గణితాన్ని గాడిలో పెట్టిన ఆర్యభట్ట గుర్తొచ్చాడు. ఖగోళ పరిజ్ఞానంలో మన మేధ ఎంతో పరిణతి చెందినదనే విషయం మరోసారి గుర్తొచ్చింది. అలాగే వర్తమానంలో బిహార్ అనుభవిస్తున్న పేదరికమూ, జంగిల్ రాజ్ అనే వార్తకథనాలు కూడా గుర్తొచ్చాయి. పాటలీపుత్ర నుంచి పట్నా వరకు ఈ నగరం అనుభవించిన ఆటుపోట్లన్నీ కళ్లముందు మెదిలాయి. పట్నాలో అడుగు పెట్టిన తర్వాత దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్నీ గతంలోకి వెళ్లి విశ్లేషించుకుంటూ ముందుకు సాగాను. ఆర్యభట్ట నాలెడ్జ్ యూనివర్సిటీలో చూపుడువేలితో ఆకాశాన్ని చూపిస్తున్న ఆర్యభట్ట విగ్రహం ముందు మోకరిల్లాను.బిహార్‌లో ఆలూపట్నా ప్రజల జీవనశైలి నిరాడంబరంగా కనిపించింది. కూరగాయల బళ్ల మీద బంగాళదుంప రాశి, పక్కనే మరో బస్తా ఉంటాయి. కాయగూరలు నామమాత్రమే. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఒక సందర్భంలో ‘సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బిహార్‌లో లాలూ ఉంటాడు’ అన్న మాట గుర్తొచ్చింది. ఇప్పుడు లాలూ లేడు కానీ ఆలూ మాత్రం ఉంది. బిహార్ జీవనశైలిలో ఆకుపచ్చ కూరగాయల కంటే బంగాళదుంపకేప్రాధాన్యం. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో జిలేబీ, భోజనంలో మధ్యమధ్య పచ్చిమిర్చి కొరుక్కుంటూ తినడం ఈ రెండూ కొత్తగా అనిపిస్తాయి. జీవనశైలి విలాసవంతంగా లేకపోయినప్పటికీ కళల పట్ల ఆరాధన మెండుగా ఉంది. సంగీతకార్యక్రమాలు, వేడుకల్లో నాట్య ప్రదర్శనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఊరేగింపులో వాహనాల మీద జరిగే నాట్యప్రదర్శనల్లో నర్తకి రక్షణ కోసం గ్రిల్ ఉంటుంది. బాలికల చదువు, రక్షణ కోసం టోల్ ఫ్రీ నంబర్‌తో ప్రచారం బాగున్నాయనిపించింది.ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలుపట్నా నగరం పర్యావరణానికిప్రాధాన్యం ఇస్తోంది. ఆటో రిక్షాలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్సే. వాహనాల విషయంలో పర్యావరణ స్పృహ మెండుగానే ఉంది. ప్లాస్టిక్ వాడకం మీద నిషేధం ఏమీ లేక΄ోవడంతో సామాన్యుల్లో ఆ ధ్యాస కనిపించదు. గంగాతీరంలో పూజలు చేసి పూలు, అగరవత్తులు తీసుకెళ్లిన పాలిథిన్ కవర్లను అక్కడే పడేస్తున్నారు. తీరమంతా ΄్లాస్టిక్ వ్యర్థాల తోరణంగా కనిపించింది. గంగానది నీరు స్వచ్ఛంగా ఉన్నాయి, నదిలో పడవ విహారం మాత్రం అద్భుతమైన అనుభూతినిచ్చింది. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో నది విహారం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది.గోల్ఘర్పట్నాలో తప్పకుండా చూడాల్సిన వాటిలో గోల్ఘర్ ఒకటి. ఇది మగధరాజ్య ధాన్యాగారం. ఈ ధాన్యాగారం ఇనుప నిర్మాణం. రాజ్యంలో రైతులు పండించిన ధాన్యంలో వారి అవసరాలకు పోగా మిగిలిన వాటిని సేకరించి ఇందులో భద్రపరిచేవారు. ఒక ఏడాది కరువు, వరదలు వచ్చినా సరే రాజ్యంలో ఆకలి లేకుండా తిండి గింజలను అందుబాటులో ఉంచడం కోసమే ఈ ఏర్పాటు. ΄ాలనలో ఇంతటి ముందు చూపుకు చాణుక్యుని అర్థశాస్త్రమే మూలం. ప్రాచీన కాలంలో ఇక్కడ పర్యటించిన ఫాహియాన్, మెగస్తనీస్ వంటి విదేశీ యాత్రికులు పట్నా నగరాన్ని ప్రపంచానికి మోడల్‌గా చూపించారు. మెగస్తనీస్ అయితే ఏకంగా ‘గ్రేటెస్ట్ సిటీ ఆన్ ద ఎర్త్’ అని రాశాడు. అంతటి చైతన్యవంతమైన, ఉచ్ఛస్థితిని చూసిన నగరం పట్నా. సామాన్యులతో మాటలు కలిపితే ఆ మూలాల ప్రభావం ఇప్పటికీ ఉందనిపిస్తుంది. వారిని చూస్తే పేదరికంతో పోరాడుతూ జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కానీ మాటల్లో వారిలో సమృద్ధిగా ఉన్న రాజకీయ చైతన్యం వ్యక్తమవుతుంది. ప్రాచీన కాలంలోకి ఎంట్రీపట్నా నగరం ప్రపంచంలో అత్యంత పురాతన కాలం నుంచి జనజీవనం కొనసాగుతూ వస్తున్న ప్రదేశం. ఆర్యభట్ట, వాత్సాయనుడు, చాణుక్యుడు, సిక్కుల గురువు గురుగోవింద్‌సింగ్ వంటి మేధావులు పుట్టిన నేల. నంద, మౌర్య, గుప్త రాజవంశాల రాజధాని. ఇన్ని ప్రత్యేకతలను సొంతం చేసుకున్న నేల మీద నడిచేటప్పుడు మనకు తెలియకుండానే నేటి నుంచి అక్షరాలలో చూసిన నాటికి వెళ్లిపోతాం. ఇక్కడ పర్యటించడం రియల్లీ ఏ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియెన్స్. పరిణిత శిల్పకళ ప్రాచీన పట్నా జీవనశైలిని చూడాలంటే బిహార్ మ్యూజియంలో అడుగుపెట్టాలి. మొదటగా ఆకర్షించేది యక్షిణి శిల్పం. గంగానది తీరాన దిదర్గంజ్ గ్రామం నుంచి సేకరించిన ఈ శిల్పం శిల్పం అద్దంలా మెరుస్తుంటుంది. శిల్పచాతుర్యాన్ని ఫొటోలో చూడాల్సిందే తప్ప వర్ణించడం అసాధ్యం. రీజనల్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రలేఖనాలు మధుబని ఆర్ట్‌లో కృష్ణుడు, గోపికల ఘట్టాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక పటంలో ఒక గ్రంథం ఇమిడి ఉంటుంది. బొమ్మలు వేయడానికి చిత్రకారులు వాడిన బేసిక్ కలర్స్ నుంచి సెకండరీ కలర్స్ వాడకం వరకు చిత్రవర్ణాల పరిణామ క్రమం అర్థమవుతుంది. చిత్రాలను, శిల్పాలను పరిశీలించినప్పుడు అప్పటి కాలంలో చిత్రకళ కంటే శిల్పకళ ఉచ్ఛస్థితిలో పరిణతి చెందినట్లు అనిపించింది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
'పుష్ప2'పై కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్
పుష్ప2 పట్నా ఈవెంట్ కోసం భారీగా ప్రేక్షకులు వచ్చారు. అయితే, ఆ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిద్ధార్థ్ చేసిన కామెంట్లపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అయితే, తాజాగా తన వ్యాఖ్యలకు సిద్ధార్థ్ వివరణ ఇచ్చారు. ఇండస్ట్రీలో తనకు ఎవరితోను వ్యక్తిగత సమస్యలు లేవని క్లారిటీ ఇచ్చారు. సిద్ధార్థ్ కొత్త సినిమా 'మిస్ యూ' ప్రమోషన్స్‌లో భాగంగా పట్నాలో జరిగిన పుష్ప2 ఈవెంట్ కోసం భారీగా బన్నీ ప్యాన్స్ రావడంపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారు. అదంతా సినిమా కోసం చేసిన ఆర్గనైజ్ జనాలు అని అన్నారు. బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ కోసమే ఎక్కువగా జనాలు వెళ్తారని, పట్నా ఈవెంట్‌పై సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. దీంతో తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు.అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేఖత రావడంతో సిద్ధార్థ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. 'ఇండస్ట్రీలో నాకు ఎవరితోనూ వ్యక్తిగత సమస్యలు లేవు. అలాంటిది అల్లు అర్జున్‌తో సమస్య ఎందుకు ఉంటుంది. 'పుష్ప2' మంచి విజయం సాధించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. పుష్ప సినిమా హిట్ కావడంతో సీక్వెల్‌గా వచ్చిన పార్ట్2 కోసం భారీగా ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. సినిమా ఈవెంట్లకు జనాలు ఎక్కువగా వస్తే చాలా మంచిదే అనేది నా అభిప్రాయం. ఈ క్రమంలో థియేటర్లకు కూడా జనాలు భారీగా రావాలని ఆశిద్దాం. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ కళకళలాడుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలోని నటీనటులుగా మేము అందరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. అయితే, ఇక్కడ 100 సినిమాలు రిలీజ్ అయితే ఒకటి హిట్ అవుతుంది. ఈ క్రమంలో సినీ ఆర్టిస్టులందరికీ వారి కష్టానికి తగిన విధంగా ప్రతిఫలం అందాలి' అని సిద్ధార్థ్ అన్నారు.'పుష్ప' ఈవెంట్‌పై సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యల వల్లే వివాదం'పుష్ప 2 కోసం పట్నా ఈవెంట్లో 3 నుంచి 4 లక్షల మంది జనం రావడం అనేది ప్రమోషన్స్ జిమ్మిక్ తప్ప మరేమీ కాదు. మన దేశంలో, ఒక JCB తవ్విన స్థలాన్ని కూడా చూసేందుకు ప్రేక్షకులు ఎగపడుతారు. కాబట్టి, బీహార్‌లో అల్లు అర్జున్‌ని చూడటానికి ప్రజలు గుమిగూడడం అనేది పెద్ద విషయమేమి కాదు. వాళ్లు ఆర్గనైజ్ చేస్తేనే జనాలు ఉంటారు. భారతదేశంలో జనాలు వస్తేనే గొప్ప అనుకోవద్దు. అదే నిజమైతే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తప్పక గెలవాలి. బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ కోసమే ఎక్కువగా వెళ్తారు.' సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
'పుష్ప2'పై సిద్ధార్థ్ వ్యాఖ్యలు.. అల్లు అర్జున్స్ ఫ్యాన్స్ ఆగ్రహం
కోలీవుడ్‌కు చెందిన సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్లినా వివాదాలు వెంటాడుతూనే ఉంటాయి. తాజాగా పుష్ప సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే అనేకమార్లు బోలెడన్ని వివాదాలలో సిద్ధార్థ్ పేరు ఉండనే ఉంటుంది. కస్తూరి, చిన్మయి, సుచిత్రల మాదిరే అప్పుడప్పుడు ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు వివాదాలను తీసుకురావడమే కాకుండా ట్రోలింగ్ కూడా అవుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 సినిమాపై ప్రశంసలు వస్తున్న సమయంలో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు తన అపరిపక్వతను చూపుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇండస్ట్రీకి చెందిన వారి నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేఖత వస్తుంది.సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా 'మిస్ యూ' డిసెంబర్ 13న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో పట్నాలో పుష్ప2 ఈవెంట్ కోసం భారీగా జనాలు వచ్చారు కదా.. దానిపై మీ అభిప్రాయం ఏంటి అని సిద్ధార్థ్‌కు ప్రశ్న ఎదరురైంది. అయితే, తాను కూడా ఇండస్ట్రీలో భాగమే కదా అనే భావన లేకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన అభ్యంతరంగా ఉన్నాయి.అదంతా 'పుష్ప' కోసం జిమ్మిక్: సిద్ధార్థ్'పుష్ప 2 కోసం పట్నా ఈవెంట్లో 3 నుంచి 4 లక్షల మంది జనం రావడం అనేది ప్రమోషన్స్ జిమ్మిక్ తప్ప మరేమీ కాదు. మన దేశంలో, ఒక JCB తవ్విన స్థలాన్ని కూడా చూసేందుకు ప్రేక్షకులు ఎగపడుతారు. కాబట్టి, బీహార్‌లో అల్లు అర్జున్‌ని చూడటానికి ప్రజలు గుమిగూడడం అనేది పెద్ద విషయమేమి కాదు. వాళ్లు ఆర్గనైజ్ చేస్తేనే జనాలు ఉంటారు. భారతదేశంలో జనాలు వస్తేనే గొప్ప అనుకోవద్దు. అదే నిజమైతే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తప్పక గెలవాలి. బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ కోసమే ఎక్కువగా వెళ్తారు.' సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.నువ్వు ఐటెమ్ డ్యాన్స్ చేసినా రారు: బన్నీ ఫ్యాన్స్సిద్ధార్థ్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సిద్ధార్థ్ వీధుల్లో ఐటెమ్ డ్యాన్స్ చేసినా, బీహార్‌లో కాకుండా తమిళనాడులో కూడా అతన్ని చూడటానికి ఎవరూ రారని విరుచుకుపడుతున్నారు. తెలుగు నటులే కాకుండా ఇలాంటి వారు కూడా పుష్ప2 విజయం పట్ల అసూయతో ఉన్నారని వారు ఆరోపించారు. వివాదాల పేరుతో తన సినిమా ప్రమోషన్ కోసం సిద్ధార్థ్ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని చాలా మంది అంటున్నారు. అతను ఇటీవల పుష్ప 2తో తన సినిమా క్లాష్ అవ్వడం గురించి అడిగినప్పుడు 'పుష్ప 2 భయపడాలి, నేను కాదు' అని చెప్పాడు. కానీ తరువాత, అతను తన సినిమాను డిసెంబర్ 13కు వాయిదా వేసుకున్నాడు. ఈ కారణంగానే అల్లు అర్జున్ సినిమాపై ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేస్తున్నాడని తెలుస్తోంది. SHOCKING: Siddharth compares Pushpa 2 patna event with crowd which comes to watch JCB construction👷🚧🏗️ pic.twitter.com/BMyVUo3sWa— Manobala Vijayabalan (@ManobalaV) December 10, 2024 -
స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు
పట్నా/చెన్నై: సాంకేతిక లోపాలు తలెత్తడంతో సోమవారం స్పైస్‌జెట్‌కు చెందిన రెండు విమానాలను అధికారులు దారి మళ్లించారు. వీటిలో ఒకటి ఢిల్లీ–షిల్లాంగ్ సరీ్వసు కాగా, మరోటి చెన్నై–కోచి విమానం. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి షిల్లాంగ్‌కు టేకాఫ్ తీసుకున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. అధికారుల సూచనల మేరకు ఉదయం8.52 గంటల సమయంలో పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. అదేవిధంగా, చెన్నై నుంచి కోచికి 117 మంది ప్రయాణికులతో టేకాఫ్ తీసుకున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో, విమానాన్ని తిరిగి చెన్నై విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండ్ చేశామని అధికారులు తెలిపారు. ఈ రెండు విమానాల ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు. -
Jharkhand: పట్నా వెళుతున్న బస్సు హజారీబాగ్‌లో బోల్తా.. ఏడుగురు మృతి
హజారీబాగ్: జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీహార్‌లో పట్నా వెళుతున్న బస్సు హజారీబాగ్ జిల్లాలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతిచెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ బస్సు కోల్‌కతా నుంచి పాట్నా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. బర్కతాలోని గోర్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని గోర్హర్ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా? -
'ఆ విషయంలో నన్ను క్షమించండి'.. ఫ్యాన్స్‌కు ఐకాన్ స్టార్ రిక్వెస్ట్
ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా బిహార్‌లోని పాట్నాలో జరిగిన భారీ ఈవెంట్లో పుష్ప-2 ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు హాజరైన అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వేదికపై మాట్లాడారు.బన్నీ మాట్లాడుతూ..' నమస్తే.. బీహార్ గడ్డకు, ప్రజలందరికీ నా శతకోటి ప్రణామాలు.. బీహార్‌కు మొదటిసారి వచ్చా. మీ ప్రేమ, అభిమానానికి నా ధన్యవాదాలు. పుష్ప ఎప్పుడు తలవంచలేదు.. కానీ మొదటిసారి మీ ప్రేమకు తలవంచుతున్నా. మీరంతా ఎలా ఉన్నారు? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్. నా హిందీ కొంచెం బాగుండదు. ఈ విషయంలో నన్ను క్షమించండి. పుష్పపై మీరు చూపిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా. మీ ప్రేమే ఈ సినిమా ఇంత గొప్పగా తీయడానికి, ఇంత గొప్పగా అందరికీ నచ్చడానికి కారణం. పుష్ప టీమ్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈవెంట్‌కు సహకరించిన పోలీసులు, అభిమానులకు థ్యాంక్స్. డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా రాబోతోంది. అందరికీ నచ్చుతుంది. థ్యాంక్యూ బీహార్. థ్యాంక్యూ పాట్నా' అంటూ ఐకాన్ స్టార్ మాట్లాడారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా... ఫ్లవర్ కాదు..’ అంటూ డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు ఐకాన్ స్టార్.హీరోయిన్ రష్మిక మందన్నా మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. ఇంతటి ప్రేమను అందించిన పాట్నా ప్రజలందరికీ నా ధన్యవాదాలు. పుష్ప శ్రీవల్లి ఈ కార్యక్రమానికి మీ అందరిని ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నా. ఈ చిత్రం కోసం రెండు సంవత్సరాల మీ ఎదురుచూపులు కచ్చితంగా మీరు ఊహించిన దానికి మించి ఉంటుందిన. ఇంతమంది అభిమానులు పుష్ప ప్రపంచంలోకి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చూడాలని నేను కోరుకుంటున్నా' అని అన్నారు శ్రీవల్లి.కాగా.. ఈ ఈవెంట్లో భారీ ఎత్తున ఐకాన్ స్టార్స్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్ షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ రిలీజైన మాస్ ట్రైలర్ ఏకంగా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టనుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పుష్ప 2 ట్రైలర్ చూసేయండి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న పుష్ప-2 థియేటర్లలో విడుదల కానుంది. -
Pushpa 2: వెయిటింగ్ ఈజ్ ఓవర్.. పుష్ప-2 ట్రైలర్ వచ్చేసింది
ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. బిహార్‌లోని పాట్నాలో జరిగిన భారీ ఈవెంట్లో పుష్ప-2 ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్లో భారీ ఎత్తున ఐకాన్ స్టార్స్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్ షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ రిలీజైన మాస్ ట్రైలర్ ఏకంగా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టనుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పుష్ప 2 ట్రైలర్ చూసేయండి.తాజాగా విడుదలైన ట్రైలర్లో బన్నీ డైలాగ్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. పుష్ప అంటే పేరు కాదు.. పుష్ప అంటే బ్రాండ్ అంటూ రష్మిక చెప్పే డైలాగ్ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ బన్నీ అదరగొట్టేశాడు. అలాగే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా?.. వైల్డ్ ఫైర్ అంటూ అభిమానులను ఊర్రూతలూగిస్తోంది. ఇక ట్రైలర్ చూస్తే బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలే పూనకాలు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
పాట్నాలో పుష్ప-2 ఈవెంట్.. చరిత్రలోనే తొలిసారి అలా!
మరికొన్ని గంటల్లో పుష్ప రాజ్ సందడి చేయనున్నాడు. బిహార్‌లోని పాట్నాలో నిర్వహించే భారీ ఈవెంట్లో పుష్ప-2 ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నార్త్ స్టేట్‌లో ఇంత భారీఎత్తున ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. నగరంలోని గాంధీ మైదానంలో ఈవెంట్ కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.అయితే ఈవెంట్‌ను అక్కడి ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. ఎప్పుడు లేని విధంగా ఏకంగా 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీని కేటాయించింది. అయితే ఒక ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు బిహార్ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున భద్రత సిబ్బందిని కేటాయించడం ఇదే మొదటిసారి. దీన్ని బట్టి చూస్తే పాన్ ఇండియా స్టార్‌కు నార్త్‌లోనూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఇండియా ఈవెంట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. పాట్నా నగరంలో గాంధీ మైదానంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను భారీస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రబృంద సభ్యులు పాట్నా చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల చేయనున్నారు. -
పాట్నాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ హంగామా!
-
పాట్నాలో ఐకాన్ స్టార్.. ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్ వెల్కమ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. ఈ మూవీ ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేయనున్నారు. పాట్నాలో ఏర్పాటు భారీ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఈవెంట్లో పాల్గొనేందుకు ఐకాన్ స్టార్ ఇప్పటికే పాట్నా చేరుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు ఘనస్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నగరంలో గాంధీ మైదానంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను భారీస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రబృంద సభ్యులు పాట్నా చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల చేయనున్నారు.Pushpa Raj aka @alluarjun is arriving in style to rule Patna! 💥Get ready for the MASSIVE #Pushpa2TheRuleTrailer Launch Event at Gandhi Maidan! ❤️🔥Watch Live Here 👇 https://t.co/JTQseKpgjQEvent by @MediaYouwe#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/HPG6eegYUJ— YouWe Media (@MediaYouwe) November 17, 2024 -
దోస ప్రింటింగ్ మెషీన్ : వైరల్ వీడియో
‘దోసెలందు డెస్క్‌టాప్ దోసెలు వేరయా’ అని ఎవరూ అనలేదు కానీ ఈ మనసు దోచే దోసెను చూస్తే మాత్రం అనక తప్పదు. పట్నాలోని పూల్‌బాగ్ పట్న కాలేజి’కి ముందు ఉన్న చిన్న హోటల్ యజమాని తయారుచేసే ‘దోశ’‘హార్ట్’ టాపిక్‌గా మారింది. దీనికి కారణం ఆ దోసెను ప్రింటింగ్ మెషీన్‌తో తయారు చేయడం! ఈ ‘యంత్ర దోశ’ను చూసి ఆశ్చర్యపడి, అబ్బురపడి‘ఎక్స్’లో ‘22వ శతాబ్దం ఆవిష్కరణ’ కాప్షన్‌తో మోహిని అనే యూజర్ పోస్ట్ చేశారు. ఇది చూసి ముగ్ధుడై ముచ్చటపడిన పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ‘ది డెస్క్ టాప్ దోశ’ అనే కాప్షన్స్‌తో ఈ వీడియోను రీపోస్ట్ చేశారు.ఇంతకూ ఆ వీడియోలో ఏముంది?’ అనే విషయానికి వస్తే... సదరు హోటల్ యజమాని మెషిన్లోని ఐరన్ ప్లేట్‌పై రుబ్బిన పిండి పోసిన వెంటనే ఇటు నుంచి ఒక రోలర్ వచ్చి ‘దోశ’ ఆకారాన్ని సెట్ చేస్తుంది. దీనిపై తగిన దినుసులు వేయగానే అటు నుంచి రోలర్ వచ్చి రోల్ చేస్తుంది. నిమిషాల వ్యవధిలో ‘ఆహా’ అనిపించేలా దోశను అందిస్తుంది.The Desktop Dosa… https://t.co/gw6EHw3QZ7— anand mahindra (@anandmahindra) November 14, 2024 ఇక సోషల్ మీడియావాసుల రెస్పాన్స్ చూస్తే.... ‘భవిష్యత్తులో ఈ దోసె మెషిన్ ఆహార పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు’ అన్నారు చాలామంది. కొద్దిమంది మాత్రం... ‘చాల్లేండి సంబడం. ఎంతైనా దోసెకు మనిషి స్పర్శ ఉండాల్సిందే. మనిషి చేసిన దానితో ఇలాంటి యంత్ర దోసెలు సరితూగవు’ అని తూలనాడారు. లోకో భిన్న‘రుచిః’!‘ఇంతకీ ఈ మెషిన్ ఎలా పనిచేస్తుంది..’ అనేది చాలామందికి ఆసక్తి కలిగించే విషయం. ఆ రహçస్యం గురించి అడిగితే... ‘అమ్మా.... ఆశ దోశ అప్పడం వడ... నేను చెప్పనుగాక చెప్పను’ అంటాడో లేక ‘ఇది నా ట్రేడ్ సీక్రెట్టేమీ కాదు. అందరూ బేషుగ్గా చేసుకోవచ్చు’ అని చెబుతాడో... వేచి చూడాల్సిందే. -
వెయిటింగ్ ఈజ్ ఓవర్.. పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ తేదీని ప్రకటించిన మేకర్స్.. అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందుకు మార్చారు. అంటే డిసెంబర్ 5న పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయనున్నాడు.తాజాాగా పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ తేదీని ప్రకటించారు మేకర్స్. ఈనెల 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అల్లు అర్జున్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఆ రోజు సాయంత్రం 06 గంటల 03 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను బిహార్‌లో పాట్నాలో భారీఎత్తున నిర్వహిస్తున్నట్లు ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.కాగా.. పుష్ప-2లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా శ్రీవల్లిగా మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు. పుష్ప పార్ట్-1 లాగే ఈ సినిమాలో ప్రత్యేక ఐటమ్ సాంగ్‌ను ప్లాన్ చేశారు. పార్ట్-1లో సమంత ఫ్యాన్స్‌ను అలరించగా.. పుష్ప-2లో కన్నడ బ్యూటీ శ్రీలీల అభిమానులను మెప్పించనుంది. ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. Dropping an EXPLOSIVE BANGER before the MASS festival begins in Cinemas ❤🔥Experience the MASSIVE #Pushpa2TheRuleTrailer on 17th November at 6:03 PM 🌋🌋With a Blasting Event at PATNA 💥💥#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5thIcon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/nCFKC4kYA5— Pushpa (@PushpaMovie) November 11, 2024 -
దారుణం: రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి
పట్నా: బీహార్‌లోని బెగుసరాయ్‌లోని బరౌని రైల్వే జంక్షన్లో దారుణం ఘటన చోటుచేసుకుంది. రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఓ ఉద్యోగి మృతి చెందాడు. శనివారం జరిగిన షంటింగ్ ఆపరేషన్‌లో రైల్వే పోర్టర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోన్పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని స్టేషన్లో పనిచేస్తున్న పోర్టర్ అమర్‌కుమార్‌రావుగా గుర్తించారు. లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ లక్నో జంక్షన్ నుంచి రావటంతో బరౌని జంక్షన్ ప్లాట్‌ఫారమ్ 5పై తన విధులు నిర్వర్తిస్తున్నప్పుడు మృతి చెందాడు.రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు ఇంజిన్-బోగీల మధ్య కప్లింగ్ విడదీసేందుకు యత్నించిన సమయంలో రైలు అనూహ్యంగా రివర్స్ కావడంతో అతను రెండు క్యారేజీల మధ్య ఇరుక్కుపోయి మృతి చెందాడని తెలిపారు. ఘటన జరిగిన అనంతరం రైలు డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారైనట్లు సమాచారం.A tragic incident occurred at Barauni Junction, Bihar, where a railway worker lost his life due to negligence during shunting operations.Meanwhile, the Railway Minister remains occupied with PR and social media.It seems that the railway prioritizes neither passenger safety… pic.twitter.com/teR9r4rzuj— Fight Against Crime & Illegal Activities (@FightAgainstCr) November 9, 2024చదవండి: లక్కీ కారుకు సమాధి.. రూ. 4 లక్షల ఖర్చు, 1500 మంది జనం! -
యు ముంబా ఉత్కంఠ విజయం
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో యు ముంబా ఉత్కంఠ విజయం అందుకుంది. ఆధిపత్యం చేతులూ మారుతూ సాగిన పోరులో ఆఖరి క్షణాల్లో పట్నాను ఆలౌట్ చేసిన ముంబా పైచేయి సాధించింది. అజిత్ చవాన్ 19 పాయింట్లతో విజృంభించడంతో బుధవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ 11 లీగ్ దశ మ్యాచ్‌లో యు ముంబా 42–40 తేడాతో పట్నాను ఓడించింది. ముంబా తరఫున రెయిడర్ అజిత్ చవాన్ తో పాటు మంజీత్ (5) ఆకట్టుకున్నాడు. పట్నా జట్టులో దేవాంక్ 15 పాయింట్లు, అయాన్ 8 పాయింట్లతో సత్తా చాటినా ఫలితం లేకపోయింది. ఏడు మ్యాచ్‌ల్లో ముంబాకు ఇది నాలుగో విజయం కాగా.. ఆరు మ్యాచ్‌ల్లో పట్నా మూడోసారి ఓడిపోయింది.హోరాహోరీలో ముంబా పైచేయితొలి అర్ధభాగంలో ఆరంభం నుంచి చివరి వరకు ఇరు జట్లూ నువ్వా నేనా అన్నట్టు పోరాడాయి. పట్నా తరఫున రెయిడర్ దేవాంక్, అయాన్ అదరగొట్టగా.. అటు యు ముంబా రెయిడర్ అజిత్ చవాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. సోంబీర్ పట్టు నుంచి తప్పించుకొని దేవాంక్ పట్నా పైరేట్స్ జట్టు ఖాతా తెరవగా.. మంజీత్ ముంబాకు తొలి పాయింట్ అందించాడు. దేవాంక్ జోరుతో పట్నా 9–6తో ముందంజ వేసింది. కానీ, డిఫెన్స్‌లో మెరుగైన ముంబా వరుసగా రెండు సూపర్ ట్యాకిల్స్‌తో 11–11తో స్కోరు సమం చేసింది.డూ ఆర్ డై రైడ్‌లో సందీప్ ఓ పాయింట్ రాబట్టగా.. కోర్టులో మిగిలిన సునీల్, మంజీత్‌ను అయాన్ ఔట్ చేశాడు. దాంతో ముంబైని ఆలౌట్ చేసిన పట్నా 16–12తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో అజిత్ తన రెయిడింగ్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. వరుసగా రెండు సూపర్ రెయిడ్స్‌తో ఐదుగురిని కోర్టు బయటకు పంపించాడు. దాంతో పైరేట్స్‌ను ఆలౌట్ చేసి ప్రతీకారం తీర్చుకున్న ముంబా 21–17తో ఆధిక్యంలోకి వచ్చింది. అదే జోరుతో 24–-21తో మూడు పాయింట్ల ఆధిక్యంతో తొలి అర్ధభాగం ముగించింది. దేవాంక్ దూకుడు.. చివర్లో ముంబా మ్యాజిక్విరామం నుంచి వచ్చిన వెంటనే పట్నా పైరేట్స్ జట్టు పుంజుకుంది. అటువైపు అజిత్ రెయిండింగ్ జోరు కొనసాగించినా.. పైరేట్స్ ఆటగాడు దేవాంక్ ముంబా డిఫెండర్లను ఏమార్చాడు. సోంబీర్ పట్టు నుంచి తప్పించుకొని వస్తూ ఒకే రెయిడ్‌లో మూడు పాయింట్లు రాబట్టాడు. దాంతో పైరేట్స్ 30–28తో మళ్లీ ఆధిక్యం అందుకుంది. పట్నా డిఫెండర్లు కూడా పుంజుకొని ముంబా రెయిడర్లను నిలువరించారు. ఈ క్రమంలో జఫర్దానేష్ను ట్యాకిల్ చేసిన పట్నా జట్టు ముంబాను రెండోసారి ఆలౌట్ చేసి తన ఆధిక్యాన్ని 33–29కి పెంచుకుంది.దేవాంక్ మరో రెండు టచ్ పాయింట్లు రాబట్టడంతో పైరేట్స్ ఆరు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా అజిత్‌కు తోడు ఆల్‌రౌండర రోహిత్ వెంటవెంటనే రెండు పాయింట్లు రాబట్టడంతో ముంబా 36–37తో ప్రత్యర్థికి చేరువై మ్యాచ్‌ను మరింత రసవత్తరంగా మార్చింది. ఆపై డూ ఆర్ డై రైడ్‌లో అజిత్ విజయం సాధిచడంతో స్కోరు 37–37తో సమం అయింది. చివరి నిమిషంలో పైరేట్స్ కోర్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగలగా.. దీన్ని ముంబా సద్వినియోగం చేసుకుంది. పట్నా ఆటగాడు సందీప్ ఓ పాయింట్ తెచ్చి జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ, చివరి క్షణాల్లో అతడిని ట్యాకిల్ చేసిన ముంబా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి రెండు పాయింట్లతో ఉత్కంఠ విజయం అందుకుంది -
పప్పూ యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలు
పట్నా: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ విషయంలో దూరంగా ఉండకపోతే.. హత్య చేస్తామని బీహార్ ఎంపీ పప్పూ యాదవ్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. ఈ మేరకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోమవారం ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఆడియో బిహార్‌లో కలకలం రేపుతోంది.‘‘ఎంపీ పప్పూ యాదవ్ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నాం. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన విషయాల నుంచి ఆయన దూరంగా ఉండాలి. అలా ఉండకపోతే హత్య చేయడానికి కూడా వెనకాడము. అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ సిగ్నల్ జామర్లను డిసేబుల్ చేయడానికి గంటకు రూ.1 లక్ష చెల్లిస్తున్నారు. పప్పూ యాదవ్‌తో నేరుగా కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఆయన మాత్రం మా కాల్స్‌కు స్పందించటం లేదు’’ అని ఆడియోలో క్లిప్‌లో ఓ వ్యక్తి మాట్లాడారు.ఇక.. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలో ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ హత్యపై బిహార్‌లోని పూర్నియా నియోజకవర్గం ఎంపీ (స్వతంత్ర) పప్పూ యాదవ్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అనుమతి ఇస్తే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కేవలం 24 గంటల్లో అంతం చేస్తానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. సోమవారం వచ్చిన బెదిరింపులపై పప్పూ యాదవ్ బిహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.చదవండి: చొరబాట్లకు మమత సర్కారే కారణం: అమిత్‌షా -
కల్తీ మద్యం తాగి.. 20 మంది మృతి
పట్నా: బిహార్‌లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. మంగళవారం రాత్రి బిహార్‌లోని సివాన్, సారణ్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగిన పలువురు తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించగా.. బుధవారం నాటికి మృతుల సంఖ్య 6కు చేరింది. అయితే ఇవాళ మృతుల సంఖ్య 20కి చేరిందని ఎస్పీ శివన్ అమితేష్ కుమార్ వెల్లడించారు.#UPDATE | Bihar: The death toll in Siwan, Bihar after consuming illicit liquor, rises to 20: SP Siwan Amitesh Kumar https://t.co/GhfIE9961h— ANI (@ANI) October 17, 2024 భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లోని భగవాన్‌పూర్ ఎస్హెచ్ఓ, ప్రొహిబిషన్ ఏఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇంకా.. పలువురు కల్తీ మద్యం బాధితులకు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. సుమారుగా 73 మందికి పైగా కల్తీ మద్యం తాగినట్లు తెలుస్తోంది. -
ప్రశాంత్ కిశోర్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు
పట్నా: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్.. ‘జన్ సురాజ్’ పేరిట కొత్త పార్టీని ప్రకటించారు. బుధవారం పట్నాలో ప్రముఖుల సమక్షంలో తన రాజకీయ పార్టీ ‘జన్ సూరాజ్ పార్టీ’ని ప్రారంభించారు. మరోవైపు.. జన్ సురాజ్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రశాంత్ కిషోర్ బుధవారం వెల్లడించారు.ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. ‘‘కార్యకర్తలు, ప్రజలు, అభిమానులంతా ‘జై బీహార్’ అని గట్టిగా నినాదించాలి. ఇకనుంచి మిమ్మల్ని మీ పిల్లలను ఎవరూ ‘బీహారీ’ అని పిలవరు. అలా పిలవటం దుర్భాషలాగా అనిపిస్తుంది. మీ వినిపించే గళం ఢిల్లీకి చేరాలి. బీహార్‌కు చెందిన విద్యార్థులను దాడి చేసిన బెంగాల్‌కు కూడా మీ గళం చేరుకోవాలి. బీహారీ పిల్లలను ఎక్కడ వేధించినా, దాడి చేసినా.. అది తమిళనాడు, ఢిల్లీ, బొంబాయికి ఎక్కడికైనా మీ గళం అక్కడికి చేరాలి’ అని అన్నారు. ఇటీవల బెంగాల్‌లోని సిలిగురికి పరీక్ష రాయడానికి వెళ్లిన ఇద్దరు బిహార్ యువకులను వేధించిన ఘటనలో ఇద్దరు బెంగాల్ వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఇవాళ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.ఇదిలా ఉండగా.. ప్రశాంత్ కిశోర్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘ గత 25 నుంచి 30 ఏళ్లలో లాలూ ప్రసాద్‌కు భయపడి బీజేపీకి ఓట్లు వేసిన రాజకీయ నిస్సహాయతను అంతం చేయడమే ‘జన్ సూరాజ్’ ప్రచారం ముఖ్య ఉద్దేశం. దీని కోసం బీహార్ ప్రజలు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ప్రత్యామ్నాయం బిహార్ ప్రజలందరూ కలిసి ఏర్పాటు చేయాలనుకునే పార్టీగా ఉండాలి’ అని అన్నారు.చదవండి: బద్లాపూర్ ఎన్కౌంటర్: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం -
పట్నాకు గంగ ముప్పు.. పాఠశాలలు మూసివేత
పట్నా: బీహార్‌లోని పట్నా జిల్లాలోని పలు ప్రాంతాల్లో గంగా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా 76 ప్రభుత్వ పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.ఈ పాఠశాలలు సెప్టెంబర్ 26 వరకు మూసివేయనున్నారు. పట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గంగా నది చాలా చోట్ల ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నందున ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లోని పలు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు దానిలో పేర్కొన్నారు.జిల్లా యంత్రాంగం విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం సోమవారం ఉదయం 6 గంటల సమయానికి పట్నాలోని గాంధీ ఘాట్ వద్ద గంగా నది ప్రమాదకర స్థాయి (48.60 మీటర్లు) దాటి ప్రవహిస్తోంది. అలాగే హతిదా, దిఘా ఘాట్ల వద్ద గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపధ్యంలో డిఎండి అదనపు ప్రధాన కార్యదర్శి (ఎసీఎస్) ప్రత్యయ అమృత్ 12 జిల్లాల అధికారులతో ఆన్లైన్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గంగానది నీటిమట్టం పెరిగితే అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.గంగా నది ఒడ్డున ఉన్న దాదాపు 12 జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న దాదాపు 13.56 లక్షల మంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. అలాగే బక్సర్, భోజ్‌పూర్, సరన్, వైశాలి, పట్నా, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్, ఖగారియా, భాగల్పూర్, కతిహార్ తదితర 12 జిల్లాలకు చెందిన ప్రజలను ప్రత్యేక సహాయ శిబిరాలకు తరలించారు.ఇది కూడా చదవండి: వరదలకు కొట్టుకుపోయిన రోడ్డు.. డోలీనే అంబులెన్స్‌గా మార్చి.. -
పాట్నా ఎన్ఐటీలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య
పాట్నా: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్ధిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) పాట్నాలో ఆత్మహత్యకు పాల్పడింది. బిహ్తాలో క్యాంపస్‌లోని శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. ఘటనా స్థలంలో సూసైడ్ లేఖ కూడా లభ్యమైనట్లు పోలీసులు శనివారం తెలిపారు.శుక్రవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో విద్యార్థిని హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించిన తోటి విద్యార్ధులు యాజమాన్యానికి తెలియజేశారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకుని విద్యార్ధినిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతురాలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ అని, ఆమె కుటుంబసభ్యులకు సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైందని, ఆ దిశగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే విద్యార్ధిని మృతికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని చెప్పారు. మరోవైపు విద్యార్థి మరణవార్త తెలియడంతో పెద్ద సంఖ్యలో ఇన్స్టిట్యూట్కు చెందిన విద్యార్థులు క్యాంపస్ వెలుపల ఆందోళన చేపట్టారు. ఇన్స్టిట్యూట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
Patna: బీజేపీ నేత దారుణ హత్య
పట్నా: బీహార్ రాజధాని పట్నాలో బీజేపీ నేత శ్యామ్ సుందర్‌శర్మ హత్యకు గురయ్యారు. పట్నాలోని చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దేవ్ మహతో కమ్యూనిటీ హాల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు పాల్పడిన అనంతరం నిందితులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం బీజేపీ నేత శ్యామ్ సుందర్ శర్మ అలియాస్ మున్నా శర్మ చౌక్ మండల బీజేపీ మాజీ అధ్యక్షునిగా పనిచేశారు. సోమవారం ఉదయం ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చారు. అతని మెడలోని బంగారు గొలుసును అటుగా వచ్చిన దుండగులు లాక్కుపోయే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో శ్యామ్ సుందర్ వారిని అడ్డుకున్నారు. దీంతో దుండగులు తుపాకీలో శ్యామ్ సుందర్ తలపై కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసు సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ లభ్యమైన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వీటి ఆధారంగా దర్యాప్తు చేపట్టనున్నారు. -
Lucknow: 24 గంటల్లో రెండు వందేభారత్ రైళ్లపై దాడి
లక్నో: కొందరు అల్లరిమూకలు వందేభారత్ రైళ్లపై రాళ్లదాడికి పాల్పడ్డారనే వార్తలను అప్పుడప్పుడు మనం వింటుంటాం. తాజాగా గడచిన 24 గంటల్లో రెండు వందేభారత్ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటి సంఘటన బుధవారం రాత్రి యూపీలోని లక్నో- పట్నా వందే భారత్‌పై జరగగా, రెండవ ఘటన గురువారం ఉదయం రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలుపై జరిగింది.బుధవారం రాత్రి లక్నో నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలుపై అల్లరి మూకలు భారీగా రాళ్లు రువ్వారు.ఈ దాడి కారణంగా రైలులోని సీ-5 కోచ్ అద్దాలు పగిలిపోయాయి. యూపీలోని వారణాసి స్టేషన్ నుండి రైలు బయలుదేరిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. రైల్వేశాఖ కూడా విచారణ చేపట్టింది.ఇదేవిధంగా జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందే భారత్ రైలుపై గురువారం ఉదయం రాళ్ల దాడి జరిగింది. 24 గంటల్లోనే రెండు వందేభారత్ రైళ్లపై దాడి జరిగిందని రైల్వేశాఖ తెలిపింది. రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలు నంబర్ 22350లోని బోగీ నంబర్ ఈ వన్‌పై రాళ్ల దాడి జరిగింది. ఇందులో ఐదు, ఆరో నంబర్ సీట్ల సమీపంలోని అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటన హజారీబాగ్‌లోని చార్హి- బేస్ రైల్వే స్టేషన్ మధ్య జరిగింది.ఈ రాళ్లదాడిలో కిటికీ అద్దాలు పూర్తిగా పగిలిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో రైలులో కూర్చున్న ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైల్వేశాఖ అధికారులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా అల్లరి మూకలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. -
జేడీ(యూ) కీలక పదవికి కేసీ త్యాగి రాజీనామా
పట్నా: జనతాదళ్(యునైటెడ్) సీనియర్ నేత కేసీ త్యాగి పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యక్తిగత కారణలతో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లు పార్టీ అధ్యక్షుడు, సీఎం నితీశ్ కుమార్‌కు రాసిన లేఖలో త్యాగి పేర్కొన్నారు.ఇటీవల కాలంలో పార్టీ అధికార ప్రతినిధి హోదాలో కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అందుకే ఆయన తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలో చర్చ జరుగుతోంది. మరోవైపు.. కేసీ త్యాగి స్థానంలో కొత్త జాతీయ అధికార ప్రతినిధిగా రాజీవ్ రంజన్ ప్రసాద్‌ను నియమించినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ అఫాక్ అహ్మద్ ఖాన్ ప్రకటించారు.ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై ఇటీవల చేసిన త్యాగి చేసిన వ్యాఖ్యలు పార్టీ లైన్‌కు దూరంగా ఉన్నాయని పార్టీ నాయకత్వం భావించినందునే యాన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. గాజాలో శాంతి, కాల్పుల విరమణకు భారతదేశం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. పార్టీ నేతలను సంప్రదించకుండానే త్యాగి చేసిన వ్యాఖ్యల కారణంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో విభేదాలు తలెత్తినట్లు పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వంలో జేడీ(యూ) కీలక భాగస్వామ్య పార్టీగా కొనసాగుతోంది. -
Bihar: బీజేపీ నేత దారుణ హత్య
బీహార్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. రాజధాని పట్నాలో మంగళవారం అర్థరాత్రి బీజేపీ నేత, పాల వ్యాపారి అజయ్ షాపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. బాధితుడిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి మృతిచెందినట్లు ధృవీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే పట్నా సిటీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.మృతుడిన బీజేపీ నేత అజయ్ షా(45)గా పోలీసులు గుర్తించారు. పట్నా సిటీ పోలీస్ సబ్ డివిజనల్ ఆఫీసర్ మీడియతో మాట్లాడుతూ మిల్క్ పార్లర్ నడుపుతున్న అజయ్ షా ఘటన జరిగిన సమయంలో తన దుకాణం వద్ద కూర్చునివున్నాడన్నారు. ఇంతలో ఇద్దరు దుండగులు మోటార్‌సైకిల్‌పై అక్కడికి వచ్చారని, వారు ఏదో విషయమై అజయ్షాతో గొడవపడ్డారని తెలిపారు. ఈ క్రమంలోనే ఆ దుండగులు అజయ్ షాపై కాల్పులు జరిపారు. వెంటనే అజయ్ షా గాయపడి కింద పడిపోయాడు. చుట్టుపక్కల వారు అతనిని ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు ఎఫ్ఎస్ఎల్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనకు భూవివాదాలే కారణం కావచ్చని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
అసెంబ్లీ, మంత్రుల నివాసాలకు వరద నీరు
పాట్నా: బిహార్ రాజధాని పాట్నాలో ఆదివారం(ఆగస్టు12) కురిసిన భారీ వర్షానికి వరదలు పోటెత్తాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయింది. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలోకి వరదనీరు వచ్చింది. అసెంబ్లీకి కొద్ది దూరంలో ఉన్న మంత్రుల బంగ్లాలున్న ప్రాంతంలోనూ భారీగా నీరు నిలిచింది. గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గండక్, కోసి, గంగా, మహానంద, కమల నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సీఎం నితీశ్‌కుమార్ పాట్నాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాలు పడినపుడు వరద నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
కేంద్ర మంత్రికి నిరసన సెగ.. కాన్వాయ్ వదిలి బైక్‌పై పరార్
పట్నా: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్‌కు సొంత నియోజకవర్గమైన బీహార్‌లోని బెగుసరాయ్‌లో నిససన సెగ తగిలింది. తీవ్ర నిరసన నేపథ్యంలో ఆయన తన కాన్వాయ్‌ను దిగి ఆ ప్రాంతం నుంచి ఒక బైక్‌పై వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక దాక్ బంగ్లా రోడ్లో ఆదివారం ఓ పార్క్ శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర మంత్రిని ఏఎన్ఎం కార్యకర్తలు అడ్డుకొని నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి కారును చుట్టుముట్టి ఆందోళన చేశారు. దీంతో అక్కడి కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకింది.ఈక్రమంలో వారు తమ డిమాండ్లతో కూడిన ఒక వినతిపత్రాన్ని మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆయన వారిని ఏమాత్రం పట్టించుకోకుండా వెంటనే తన కాన్వాయ్ దిగి ఓ వ్యక్తి బైక్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించాలనుకొన్నామని, కేంద్ర మంత్రి పట్టించుకోకుండా పరారు అయ్యారని ఏఎన్ఎం కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.Giriraj Singh को Asha workers ने Begusarai में ही घेर लिया, गाड़ी छोड़ Bike से भागे...#GirirajSingh #Begusarai #AshaWorkers #Bihar #BiharNews #बिहार_न्यूज़ #बिहार #LiveCities pic.twitter.com/qUFAnSAw34— Live Cities (@Live_Cities) August 4, 2024 -
దారి చూపే దివిటీలు
పిల్లల కంటే ముందే వారి కలలు తల్లిదండ్రులు కంటారు. ‘నేను సాధించగలను’ అని పిల్లలు అనుకోవడానికి ముందే ‘మా పిల్లలు సాధించగలరు’ అనే బలమైన నమ్మకం తల్లిదండ్రులకు కలుగుతుంది. తమ పిల్లలను పై స్థాయిలో చూడాలని కలలు కంటారు. కేవలం కలలకే పరిమితం కాకుండా ‘పిల్లల కోసమే మా జీవితం’ అన్నట్లుగా కష్టపడతారు. ఆ నిబద్ధతే ఎంతోమంది పిల్లలు విజేతలుగా నిలవడానికి కారణం అవుతుంది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే తల్లిదండ్రులు పిల్లల్ని తీర్చిదిద్దే శిల్పులు. వారి భవిష్యత్ చిత్రపటాన్ని అందంగా మలిచే చిత్రకారులు.తండా నుంచి ఐఐటీ దాకా...ఈ ఫొటో చూడండి...దారి కూడా సరిగ్గా లేని ఒక మారుమూల గిరిజన తండా. అబ్బాయిల సంగతి ఎలా ఉన్నా తండా దాటి పై చదువులకు వెళ్లడం అనేది అమ్మాయిలకు అంత సులువేమీ కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని గోన్యానాయక్ తండాకు చెందిన బదావత్ రాములు, సరోజ దంపతులు ‘మా అమ్మాయి చదివింది’ చాలు అని ఎప్పుడూ రాజీ పడలేదు.‘నువ్వు ఎంత పెద్ద చదువు చదివితే మాకు అంత సంతోషం’ అనేవాళ్లు తమ కూతురు మధులతతో. ఈ మాటలు మధులతకు బలమైన టానిక్‌లా పనిచేశాయి. ‘ఏదో ఒకటి సాధించి తల్లిదండ్రుల కలను నిజం చేయాలి’ అని బలంగా అనుకునేలా చేశాయి. రాములు, సరోజ దంపతుల చిన్న కూతురు మధులత. పెద్ద కూతురు మంజుల, రెండో కూతురు మమతను డిగ్రీ వరకు చదివించారు. మూడో తరగతి వరకు వీర్నపల్లి సర్కారు బడిలో చదివిన మధులత నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరరకు సిరిసిల్ల సంక్షేమ హాస్టల్లో ఉంటూ గీతానగర్ జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకుంది. సారంపల్లి గిరిజన సంక్షేమ బాలికల గురుకులంలో తొమ్మిది నుంచి పదవ తరగతి వరకు చదువుకుంది. ఇంటర్మీడియట్లో 939/1000 మార్కులు సాధించింది. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు రావడంతో తన మీద తనకు నమ్మకం బలపడింది. ఆ నమ్మకం వృథా ΄ోలేదు. అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా భావించే జేఈఈ (అడ్వాన్స్డ్)లో ఆల్ ఇండియా స్థాయిలో 824 ర్యాంకు సాధించింది. మధులతకు సంబంధించి ఇదొక అపురూప విజయం. ఎందుకంటే...ఆమె కుటుంబ నేపథ్యం. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, పేదవాళ్లు.‘మా బిడ్డ గొప్ప చదువులు చదువుతుంది’ అనే నమ్మకం తప్ప వారి దగ్గర ఏమీ లేదు. అయితే తల్లిదండ్రుల ్ర΄ోత్సాహం, తన మీద పెట్టుకున్న ఆశలు మధులతను ముందుకు నడిపించాయి. ‘నీ దగ్గర లేని దాని గురించి ఆలోచించకు. ఉన్న దాని గురించి దృష్టి పెట్టు’ హైస్కూల్ రోజుల్లో తాను చదివిన మంచి మాట మధులతకు బాగా గుర్తుండి ΄ోయింది. పేదరికం తప్ప తన దగ్గర ధనం లేక΄ోవచ్చు, కాని విద్య రూపంలో విలువైన నిధి ఉంది. ఆ నిధిపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది మధులత. ఏదో సాధించాలనే తపనతో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.ఖరీదైన కోచింగ్‌లు లేక΄ోయినా సొంతంగా ఆల్ ఇండియా స్థాయిలో ‘జేఈఈ’లో ర్యాంక్ తెచ్చుకునేలా చేసింది. పట్నా ఐఐటీలో సీటు సాధించిన మధులతకు ఉన్నత చదువుపై ఆసక్తి ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఆమెను ఇంటికే పరిమితం అయ్యేలా చేశాయి. ఇక ఏమీ చేయలేక, పై చదువులకు వెళ్లలేక తండాలో మేకలు కాయడం మొదలుపెట్టింది మధులత. మధులత దీన పరిస్థితిపై ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఐఐటీకి వెళ్లలేక మేకల కాపరిగా’ కథనం చూసి స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి మధులత చదువుకు అయ్యే ఖర్చులు మొత్తం భరిస్తామని ప్రకటించారు. ఆరోజు ఎంత బాధ పడ్డానో!‘చదివించింది చాలు. ఎందుకంత కష్టపడతావు’ అనే వాళ్లు కొందరు. అయితే మధు మీద మాకు చాలా నమ్మకం, చదువు తనకు ్ర΄ాణం. పట్నంలో ఎప్పుడైనా పెద్ద ఆఫీసర్ అమ్మలను చూసినప్పుడు వారిలో నా బిడ్డే కనిపించేది. ఏదో ఒకరోజు నా బిడ్డను ఇలా గొప్పగా చూస్తాను అనుకునేవాడిని. డబ్బులు లేక, పై చదువుకు పట్నాకు వెళ్లలేక మధు ఇంట్లోనే ఉండి΄ోవాల్సి రావడం నాకు చాలా బాధగా ఉండేది. చదువు ఇచ్చిన దేవుడు దారి చూడడా! అనుకునే వాడిని. దేవుడు దయ తలిచాడు.– బదావత్ రాములు, మధులత తండ్రిచదువే లోకం...నా బిడక్డు చదువే లోకం. సెలవులకు వస్తే కూడా చదువుకొనుడు లేదా మా మేకలతో వెళ్లేది. మా తండాకు తొవ్వ కూడా లేదు. ఇప్పుడు మా బిడ్డకు ర్యాంకు వచ్చిందని మండల అధికారులు మా ఇల్లు వెతుక్కుంటూ రావడం సంతోషంగా ఉంది. మా బిడ్డ బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నా. – సరోజ, మధులత తల్లి – వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’ సిరిసిల్ల– ఫొటోలు: వంకాయల శ్రీకాంత్ -
నీట్ పేపర్ లీక్ కేసు: నలుగురు విద్యార్థులపై సీబీఐ విచారణ
పట్నా: నీట్ పేపర్ లీక్, నిర్వహణలో అవకతవకలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా గురువారం సీబీఐ అధికారులు నలుగురు పట్నా ఎయిమ్స్ విద్యార్థులను అదుపులోకి తీసుకుంది. పేపర్ లీక్‌కు సంబంధించి వారిని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పట్నా ఎయిమ్స్ డైరెక్టర్ బీజే పాల్ మీడియాతో మాట్లాడారు.‘సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న నలుగురు విద్యార్థులు విచారణకు సహకరిస్తున్నారు. సీబీఐ విచారణ నుంచి విద్యార్థులు ఇంకా తిరిగి రాలేదు. సీబీఐ విచారణ చేస్తున్న విద్యార్థులు చందన్ సింగ్, రాహుల్ అనంత్, కుమార్ షాను, కరణ్. ముందుగా ఇన్స్టిట్యూట్కు సీబీఐ అధికారులు సమాచారం అందించి.. నలుగురు విధ్యార్థులను వారి హాస్టల్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. నీట్ పేపర్ లీవ్ విషయంలో వారిని విచారణ చేసేందుకు సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు’ అని తెలిపారు.విచారణలో భాగంగా విద్యార్థుల రూంలను అధికారులు సీజ్ చేశారు. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్,డీన్ సమక్షంలో సీబీఐ టీం విద్యార్థుల ఫోటోలు , మొబైల్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఇక జూలై 17 పేపర్ లీక్ ప్రధాన నిందితుడు పంకజ్ త్రిపాఠి, అతని సహాయకుడు రాజు సింగ్‌ను సీబీఐ అధికారులు జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో అరెస్ట్ చేశారు. ఇటీవల పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ ట్రంక్ పెట్టె నుంచి నీట్ పేపర్ దొంగిలిచిన ఇద్దరిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది.మరోవైపు.. ప్రధాన నిందితుడు పంకజ్ త్రిపాఠికీ సీబీఐ ప్రత్యేక కోర్టు.. 14రోజుల సీబీఐ కస్టడీ, అతని సహాయకుడు రాజు సింగ్‌కు 10 రోజుల కస్టడీని విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో సీబీఐ అధికారులు 14 మందిని అరెస్ట్ చేశారు. -
‘కావాలంటే కాళ్లు మొక్కుతా’.. ఇంజనీర్‌పై బిహార్ సీఎం అసహనం
పట్నా: బిహార్‌లోని జేపీ గంగా బ్రిడ్జ్ పనులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సహానం కోల్పోయారు. జేపీ గంగా ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఇంజనీర్‌పై వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రాజెక్టు మొత్తం 12. 5 కిలోమిటర్ల దూరం నిర్మించాల్సి ఉంది. అయితే ఇంకా 4. 5 కిలో మీటర్ల నిర్మాణం పెండింగ్‌లో ఉండటంతో ప్రాజెక్టు ఇంజనీర్‌పై సీఎం నితీష్ తీవ్ర అసహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంజనీర్‌తో మాట్లాడుతూ.. ‘‘మీరు కావాలనుకుంటే.. మేము కాళ్లు మొక్కుతాం. తొందరగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయండి’’ అని చేతులు జోడించి కోపంతో ఊగిపోయారు. దీంతో ‘‘సర్, మీరు దయ చేసి అలా మాట్లాడవద్దు’’ అని సదరు ఇంజనీర్ తిరిగి సీఎంకు చేతులు జోడించి వివరణ ఇచ్చారు. దీంతో సీఎం నితీష్ శాంతించారు. ఈ కార్యకమ్రంలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, స్థానిక ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.Watch: Bihar CM Nitish Kumar urged an IAS officer to expedite the extension of JP Ganga Path up to Kangan Ghat in Patna, says "I touch your feet; please complete the work on time" pic.twitter.com/bAkFU6aAOK— IANS (@ians_india) July 10, 2024 ఇక.. ఇటీవల బిహార్‌లో పలు బ్రిడ్జ్‌లు, కాజ్‌వేలు కుప్పకూలడంతో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో 15 మంది ఇంజనీర్లపై బిహార్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసింది. అనంతరం ప్రభుత్వం వరుస బ్రిడ్జ్‌లు కుప్పకూలటంపై ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 17 రోజుల్లో 10 బ్రిడ్జ్‌లు కూలిపోవడానికి ఇంజనీర్ల నిర్లక్ష్యం, సరిగా పర్వవేక్షించపోవటమే కారణమని దర్యాప్తు బృందం నివేదిక ఇచ్చినట్లు బిహార్ జలవనరుల విభాగం అడిషినల్ చీఫ్ సెక్రటరీ చైతన్య ప్రసాద్ పేర్కొన్నారు. -
బీహార్‌లో అయోధ్యను మించిన రామాలయం
అయోధ్య రామాలయం.. ఈ మాట వినగానే ఇది శ్రీరామునికి సంబంధించిన ఘనమైన ఆలయం అని మనకు అనిపిస్తుంది. అయితే దీనికి మించిన ఆలయం బీహార్‌లో నిర్మితమవుతోంది. పైగా ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలను కూడా సంతరించుకోనుంది.బీహార్‌లోని తూర్పు చంపారణ్ జిల్లాలో కేసరియా-చాకియా రహదారిపై నిర్మిస్తున్న విరాట్ రామాయణ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొదటి దశ పనులు 2023, జూన్ 20 నుండి ప్రారంభమయ్యాయి. ఇటీవలే రెండో దశ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని మహావీర్ టెంపుల్ ట్రస్టు కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్ తెలిపారు. రెండవ దశలో 26 అడుగుల ఎత్తున ఉండే ప్లింత్‌ను నిర్మిస్తారు. దీన్ని పటిష్టం చేసేందుకు 1080 అడుగుల పొడవు, 540 అడుగుల వెడల్పుతో కాంక్రీట్ పైకప్పును నిర్మిస్తారు. ఆ తర్వాత మూడు అంతస్తుల నిర్మాణం సాగనుంది. ఒక్కో అంతస్తు 18 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు.22 దేవాలయాల సముదాయమైన ఈ ఆలయంలో రామాయణంలోని ముఖ్య ఘట్టాలకు సంబంధించిన శిల్పకళా దృశ్యాలు కనిపించనున్నాయి. అలాగే ప్రధాన దేవతల ఆలయాలు నిర్మితం కానున్నాయి. ఆలయ నిర్మాణ పనులు ఏడాదిన్నర, రెండేళ్లలో పూర్తి చేయాలని మహావీర్ టెంపుల్ ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది. విరాట్ రామాయణ దేవాలయ రెండో దశ నిర్మాణానికి రూ.185 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రధాన శిఖరం 270 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది అయోధ్యలో రామ మందిరం కంటే అతిపెద్ద రామాలయంగా పేరు తెచ్చుకోనుంది. ఈ ఆలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించనున్నారు. -
‘బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. అదే మన ఆశ’
పట్నా: దీర్ఘకాంలంగా ఉన్న బిహార్ ప్రత్యేక ఇవ్వాలనే డిమాండ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్తానని కేంద్రమంతి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో బిహార్ ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడారు.‘ఇది ఒత్తిడి చేసే రాజకీయం కాదు. ఇది మన దీర్ఘకాల డిమాండ్. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఏ పార్టీ బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయదు. ఏ పార్టీ అయినా బిహార్‌కు ప్రత్యేక హోదా అంగీకరిస్తుందా?. కానీ, మేము బిహార్‌కు ప్రత్యేక హోదా విషయంలో అనుకూలంగా ఉన్నాం. మేము ఎన్డీయే ప్రభుత్వంలో ఉన్నాం. ..ఎన్డీయే కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీ. ప్రధాని మోదీ మా లీడర్. మేము ఆయనపై నమ్మకం పెట్టుకున్నాం. ప్రధాని మోదీ ముందు ఈ డిమాండ్‌ను మేము పెట్టకపోతే.. మరి బిహార్‌కు ప్రత్యేకహోదా ఎవరు అడుగుతారు?. బిహార్ ప్రత్యేక హోదా ఇవ్వాలి. అదే మన ఆశ. బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించే క్రమంలో మార్చాల్సిన కొన్ని నిబంధనలపై మేము చర్చిస్తాం’ అని అన్నారు.అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా ఇవ్వటం లేని కేంద్రం గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. బీహార్, ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎన్డీయే కూటమిలో భాగంగా ఐదుస్థానాల్లో పోటీచేసీ ఐదింటిలో విజయం సాధించింది. -
‘అవును.. నీట్ పేపర్- లీక్ పేపర్ ఒక్కటే!’
పాట్నా: దేశవ్యాప్తంగా ‘నీట్’ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. నీట్ అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని అవి కోరుతున్నాయి. ఇంకోపక్క.. నీట్ అభ్యర్థులతో ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఈలోపు విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది.పరీక్షకు ముందే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యిందనే వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న బీహార్ పోలీసులు.. దాదాపుగా ఆ విషయాన్ని నిర్ధారించుకున్నారు!. ఈ కేసులో అరెస్టైన నీట్ అభ్యర్థి అనురాగ్ యాదవ్(22) ఆ విషయాన్ని అంగీకరించినట్లు తేలింది. లీక్ అయిన ప్రశ్నాపత్రం, పరీక్షలో వచ్చిన పత్రం ఒక్కటేనని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఇందుకు సంబంధించిన లేఖ(Confession Letter) ఓ జాతీయ మీడియా సంస్థ ద్వారా బయటకు వచ్చింది.పాట్నా నీట్ పరీక్ష కేంద్రంలో రాసిన విద్యార్థులకు ముందుగానే పశ్నాపత్రం చేరిందనే విషయం బయటకు పొక్కింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేసిన బీహార్ పోలీసులు.. అమిత్ ఆనంద్ అనే వ్యక్తి ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు. ప్రశ్నాపత్రం లీక్‌కు రూ.30-32 లక్షలు తీసుకున్నట్లు అతను ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక సికిందర్ ప్రసాద్ యాదవేందు అనే ఇంజినీర్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాడు. అనురాగ్ యాదవ్‌కు యాదవేందు దగ్గరి బంధవు కూడా. పరీక్షకు ముందు యాదవేందు అనురాగ్‌కు ఓ ప్రశ్నాపత్రంతో పాటు సమాధానాలను కూడా ఇచ్చాడట. అయితే పరీక్షలోనూ అవే ప్రశ్నలు వచ్చాయని అనురాగ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో ఈ ఘటనపై బీహార్ పోలీసులను కేంద్ర విద్యాశాఖ వివరణ కోరింది. అంతకు ముందు ఈ కేసులో యాదవేందు ఇచ్చిన స్టేట్మెంట్ కలకలం రేపింది. ఈ మొత్తం వ్యవహారంలో ఓ మంత్రి జోక్యం ఉందని, ఆయనే తనతో(యాదవేందు) మరికొందరికి ప్రభుత్వ బంగ్లాలో సౌకర్యాలు కల్పించారని వాంగ్మూలం ఇచ్చాడు నిందితుడు. దీంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరగనుంది? రాజకీయంగా ఎలాంటి దుమారానికి కారణం కానుంది? అనే ఆసక్తి నెలకొంది.దేశవ్యాప్తంగా నీట్-యూజీ ఎగ్జామ్ మే 5 తేదీన జరగ్గా.. 4,750 సెంటర్లలో 24 లక్షల మంది రాశారు. జూన్ 14న ఫలితాలు రావాల్సి ఉండగా.. మూల్యాంకనం త్వరగా ముగియడంతో జూన్ 4వ తేదీనే విడుదల చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించుకుంది. -
Bihar: గంగా నదిలో పడవ మునక.. నలుగురు గల్లంతు
పాట్నా: బిహార్ రాష్ట్రం పట్నా జిల్లాలో గంగా నదిలో పడవ మునిగిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. బర్హ్ సబ్ డివిజన్లోని ఉమానాథ్ గంగా ఘాట్ వద్ద ఆదివారం ఉదయం 9.15 గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పడవలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నది మధ్యలో ఉండగా పడవ బోల్తా పడి మునిగిందని, 13 మందిని రక్షించి, ఒడ్డుకు చేర్చామని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ శుభమ్ కుమార్ చెప్పారు. కనిపించకుండాపోయిన ముగ్గురు పురుషులు, ఒక మహిళ జాడ కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. -
పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు
బీహార్ రాజధాని పట్నాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగా నదిలో ప్రయాణీకులతో నిండిన పడవ బోల్తా పడింది. ఉమానాథ్ ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు పడవలో 17 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.పడవ బోల్తా పడిన వెంటనే 11 మంది ఈదుకుంటూ బయటికి రాగా, ఆరుగురు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.గంగా దసరా సందర్భంగా ఒకే కుటుంబానికి చెందిన 17 మంది స్నానం చేయడానికి డయారా వైపు పడవలో వెళుతుండగా, గంగా నది మధ్యలో పడవ బోల్తా పడింది. సమాచారం అందుకున్న ఎస్డీఎం శుభం కుమార్ తన బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పెరిగిన నితీశ్ ఇమేజ్.. పాట్నాలో ‘టైగర్ జిందాహై’ పోస్టర్లు
పాట్నా: లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ అద్భుత ప్రదర్శన తర్వాత ఆ పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎన్డీఏ మూడో టర్ము ప్రభుత్వంలో జేడీయూ కీలకంగా మారడం ఆ పార్టీ క్యాడర్‌కు ఉత్సాహాన్నిస్తోంది. ఇందులో భాగంగానే బిహార్ రాజధాని పాట్నాలోని మెయిన్ సెంటర్లో ఆ పార్టీ కార్యకర్తలు టైగర్ జిందాహై అని పెద్ద హోర్డింగ్ పెట్టారు. ఈ పోస్టర్‌పై పులి బొమ్మతో పాటు నితీశ్‌కుమార్ భారీ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇదొక్కటే కాకుండా పట్టణంలోని పలు చోట్ల నితీశ్‌ను కీర్తిస్తూ పెద్ద పెద్ద పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టారు.‘ఫలితాలకు ముందు నితీశ్ ఇమేజ్ ఫలితాల తర్వాత నితీశ్ ఇమేజ్‌కు చాలా వ్యత్యాసం ఉంది. బిహార్ ఓటర్లలో నితీశ్ పాపులారిటీ పెరిగింది’అని జేడీయూ నేత నీరజ్‌కుమార్ చెప్పారు.కాగా, మోదీ మూడో టర్ము ప్రభుత్వంలో జేడీయూ కీలక మంత్రిత్వ శాఖలను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు బిహార్‌కు ప్రత్యేక హోదా, అగ్నివీర్ స్కీమ్‌లో మార్పుల కోసం జేడీయూ కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని గట్టిగా అడిగే అవకాశం ఉంది. -
ఓటు బ్యాంకు కోసం డ్యాన్సులు కూడా చేస్తారు: ప్రధాని మోదీ
పాట్నా: ఓటుబ్యాంకు ముందు ఇండియా కూటమి నేతలు అవసరమైతే డ్యాన్సులు వేస్తారని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు కోసం ఎస్సీ,ఎస్టీ,బీసీలకు భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు లాక్కుంటానంటే తాను మాత్రం చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. శనివారం(మే25) బిహార్‌లోని పాటలీపుత్రలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి నేతలు వారి ఓటు బ్యాంకు కోసమే పనిచేస్తారని, తనకు మాత్రం రాజ్యాంగమే సుప్రీం అని స్పష్టం చేశారు. ‘బిహార్ ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాలకు నేను హామీ ఇస్తున్నా. మోదీ బతికున్నంతవరకు మీ హక్కులు ఎక్కడికి పోనివ్వను.ఓటుబ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తామంటే ఇండియా కూటమి నేతలను చేయనివ్వండి. నాకు మాత్రం రాజ్యాంగమే ముఖ్యం. ఆర్జేడీ,కాంగ్రెస్ కూటమి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తున్నారు’అని మోదీ మండిపడ్డారు. -
పరుగులకు మరో ‘వందేభారత్’ సిద్ధం
పట్టాలపై పరుగులు తీసేందుకు మరో వందేభారత్ రైలు సిద్ధంకానుంది. పట్నా- ఢిల్లీ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో పట్టాలు ఎక్కనుంది. ఈ రైలు రాకతో పట్నా నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి పట్నాకు కేవలం తొమ్మది గంటల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం పట్నా-న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్, సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్ వంటి హై స్పీడ్ రైళ్లు ఢిల్లీ నుండి పట్నా చేరుకోవడానికి 13 గంటలు పడుతోంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం రైల్వే బోర్డు త్వరలో పట్నా- ఢిల్లీ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనుంది. అంటే త్వరలోనే పట్నా- న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ విడుదల కానున్నది. భారతీయ రైల్వే తొలిసారి ఢిల్లీ-హౌరా లైన్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపింది. అయితే అది గయ జంక్షన్ మీదుగా ఢిల్లీకి చేరుతుంది. అయితే ఇప్పుడు మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను బీహార్ రాజధాని పట్నా నుండి నడపడానికి ప్లాన్ చేస్తున్నది.న్యూఢిల్లీ- పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటకు 130 కి.మీ. వందే భారత్ పట్నా నుండి అర్రా, బక్సర్ మీదుగా 9 గంటల ప్రయాణంతో ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ రైలులో ఒక కోచ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ క్లాస్, ఏడు కోచ్‌లు ఎయిర్ కండిషన్డ్ చైర్‌కార్‌గా ఉండవచ్చు. ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌లో 52 సీట్లు, ఎయిర్ కండిషన్డ్ చైర్‌కార్‌లో 478 సీట్లు ఉండనున్నాయి. కాగా పట్నా-ఢిల్లీ మార్గంలో వందేభారత్‌ను నడిపే విషయమై భారత రైల్వే నుండి ఇంకా అధికారిక సమాచారం రాలేదు. -
పాట్నాలో హైటెన్షన్.. అసలేం జరిగిందంటే..
బీహార్ రాజధాని పాట్నా నిరసనలతో అట్టుడికిపోతోంది. కోపంతో ఊగిపోతున్న కొందరు నడివీధుల వెంట చేరి చేతికి దొరికిన వస్తువుల్ని కాలుస్తున్నారు. ఆ ఆగ్రహావేశాలకు కారణం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో చిన్నారి అనుమానాస్పద రీతిలో చనిపోవడం. పాట్నాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పదరీతిలో చనిపోవడం, ఆ విషయాన్ని దాచేందుకు స్కూల్ సిబ్బంది యత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. బాధిత కుటుంబానికి అండగా తోడైన ఓ కులం.. పాట్నాలో నిరసనలకు దిగింది. రోడ్లపై మంటలు పెట్టి.. సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. టినీ టాట్ అకాడమీ స్కూల్లో చదివే చిన్నారి.. గురువారం స్కూల్ ట్యూషన్ అయ్యాక కూడా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో స్కూల్‌కు వచ్చారు. అయితే పాఠశాల సిబ్బంది పొంతన లేని సమాధానం ఇవ్వడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. బలవంతంగా స్కూల్లోకి అర్ధరాత్రి దాకా వెతికారు.చివరకు.. ఈ వేకువ ఝామున 3గం. ప్రాంతంలో స్కూల్ ఆవరణలోని డ్రైనేజీలో ఆ చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన కుటుంబ సభ్యులు స్కూల్‌కు నిప్పటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్కూల్‌కు చేరుకుని ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చే యత్నం చేశారు. ఎస్పీ చంద్రప్రకాష్ స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.#WATCH | Patna, Bihar: An angry crowd sets a school on fire after the body of a student was allegedly found on school premises. More details awaited. pic.twitter.com/6OwmDe8mjY— ANI (@ANI) May 17, 2024 స్కూల్లోకి వెళ్లిన చిన్నారి.. తిరిగి బయటకు వెళ్లిన సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యింది. దీంతో ఆ అవరణాలోనే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించుకున్నాం. అయితే చిన్నారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్పీ అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, సిబ్బంది మృతదేహాన్ని దాచే యత్నం ఎందుకు చేసిందో తేలాల్సి ఉందన్నారు. మరోవైపు ఉద్రిక్తతలు విస్తరించకుండా పోలీస్ బలగాలను మోహరించినట్లు తెలిపారాయన. -
ఎన్నికల వేళ.. జేడీయూ యువనేత దారుణ హత్య
పాట్నా: సార్వత్రిక ఎన్నికల వేళ బిహార్‌లో అలజడి రేగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కి చెందిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) యువ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాట్నాలో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా బుధవారం అర్ధరాత్రి ఆయన్ను దుండగులు కాల్చి చంపారు. బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు జేడీయూ నేత సౌరభ్ కుమార్ తలపై రెండుసార్లు కాల్చారు. ఆయన వెంట ఉన్న సహచరుడు మున్మున్‌పైనా కాల్పులు జరిపి పరారయ్యారు. నెత్తుటి మడుగులో ఉన్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, సౌరభ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మున్మున్ పరిస్థితి విషమంగా ఉంది.పాట్నా పోలీసుల ప్రత్యేక బృందం రాత్రి తర్వాత సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. ఈ హత్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు రోడ్డును దిగ్బంధించారు. సమాచారం అందుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి కూడా పున్‌పున్‌కు చేరుకుని బాధితుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
అరెస్ట్ వారెంట్ జారీ, త్వరలో జైలుకి మాజీ సీఎం ‘లాలూ’?
పాట్నా : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మధ్య ప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ నగర ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయన మరోసారి జైలు శిక్షను అనుభవించనున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్వాలియర్‌లోని కోర్టులో కొనసాగుతున్న అక్రమ ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన కేసు నిందితుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు. ఆయుధ చట్టం కింద 30 ఏళ్ల నాటి కేసుకు సంబంధించి గ్వాలియర్ ప్రత్యేక కోర్టు ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు చట్టపరమైన చిక్కుల్ని ఎదుర్కోనున్నారు. 30 ఏళ్ల నాటి కేసు 1997లో మధ్యప్రదేశ్ పోలీసులు అక్రమ ఆయుధాల కేసును నమోదు చేశారు. ఇందులో నిందితులుగా 22 మందిని చేర్చారు. అయితే, ఆ నిందితులు గ్వాలియర్‌లోని మూడు వేర్వేరు సంస్థల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసి 1995 నుంచి 1997 మధ్య కాలంలో బీహార్‌లో విక్రయించినట్లు అభియోగాలు మోపారు పోలీసులు. అందుకు తగ్గ ఆధారాల్ని కోర్టు ముందుంచారు. అప్పటి నుంచి గ్వాలియర్ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది. నిందితుల్లో లాలూ ఒకరు మొత్తం 22 మంది నిందితుల్లో 14 మంది పరారీలో ఉండగా, ఆరుగురు విచారణలో ఉండగా, ఇద్దరు చనిపోయారు. ఈ కేసులో అభియోగాలు మోపబడి పరారీలో ఉన్న 14 మందిలో ఒకరే లాలూ ప్రసాద్ యాదవ్. తాజాగా, గ్వాలియర్‌లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అక్రమ ఆయుధాల కేసుపై విచారణ చేపట్టింది. విచారణ అనంతరం కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
చిరాగ్ పాశ్వాన్‌కు ఎదురుదెబ్బ.. 22 మంది నేతల రాజీనామా
పట్నా: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎన్డీయే కూటమిలోని లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్)(LJP)కి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి షాకిస్తూ పలువురు నేతలు రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కబర్చిన 22 మంది నేతలకు టికెట్ లభించకపోవటంతో వారంతా రాజీనామా బాటపట్టారు. రాష్ట్ర మాజీ మంత్రి, జాతీయ ఉపాధ్యక్షురాలు రేణు కుష్వాహ, మాజీ ఎమ్మెల్యే, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్, సంస్థాగత కార్యదర్శి రవీంద్ర సింగ్ రాజీనామా చేశారు. అదేవిధంగా వారి మద్దతుదారులు పెద్దఎత్తున రాజీనామాలను రాష్ట్ర అధ్యక్షుడు రాజు తివారీకి పంపించారు. శాంభవీ చౌదరీ( సమస్తిపూర్), రాజేశ్ వర్మ (ఖాగారియా), వీణా దేవి ( వైశాలీ) వంటి నేతలకు టికెట్లు కేటాయించటంపై రాజీనామా చేసిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి చిరాగ్ పాశ్వాన్, అతని సన్నిహితులు... డబ్బులకు పార్టీ టికెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. అయితే ఈ సీట్లలో అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో సీనియర్ నేతల అభిప్రాయలు తీసుకోలేదని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఇక.. నామినేషన్ల ప్రక్రియ సమయంలో తమ నేతలకు టికెట్ కేటాయించకుండా పక్కనపెట్టడంపై పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి పొత్తులో భాగంగా ఎల్జేపీకి బీజేపీ ఐదు సీట్ల కేటాయించిన విషయం తెలిసిందే. కీలకమైన హాజీపూర్ స్థానంలో చిరాగ్ పాశ్వాన్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా చిరాగ్ బంధువు అరుణ్ భార్తి జాముయి స్థానంలో బరిలోకి దిగుతున్నారు. రాష్ట్ర మంత్రి, జేడీ(యూ) సీనియర్ నేత అశోక్ చౌదరీ కుమార్తె ఈ శంభవీ చౌదరీ. ఆమె తొలిసారి పార్లమెంట్లో ఎన్నికల్లో పోటి చేసి తన అదృష్టం పరిక్షించుకోబోతున్నారు. అయితే ఆమెకు అక్కడి బ్రాహ్మణ, భూమిహార్స్ సామాజిక వర్గాల మద్దతు ఉండటం గమనార్హం. మెజార్టీ దళీతల ఒటర్లు సైతం ఆమెకు మద్దతు ఇవ్వనున్నారు. మరోవైపు... వీణా దేవీ మళ్లీ వైశాలీ సీటు దక్కించుకున్నారు. ఆమె 2019లో అభివక్త ఎల్జేపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం చీలిక వర్గంలో పశుపతి కుమార్ పరాస్ వైపు మద్దతు పలికినా.. తర్వాత రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబం మీద గౌరవంతో చిరాగ్ వైపే ఉండటం గమనార్హం. ఇక.. గత 2019 ఎన్నికలో ఎల్జేపీ మొత్తం ఆరుస్థానాల్లో విజయం సాధించింది. హాజీపూర్, వైశాలీ, సమస్తీపూర్, జాముయి. నావాదాలో ఎల్జేపీ గెలుపొందింది. సీట్ల పంపకంలో భాగంగా నావాదా సీటు బీజేపీకి దక్కింది. అయితే, రాజీనామా చేసిన ఎల్జేపీ నేతలంతా ప్రతిపక్షాల ఇండియా కూటమిలో మద్దతు ఇవ్వనున్నట్ల ఊహాగానాలు వస్తున్నాయి. -
టీటీఈని రైలు నుంచి తోసేసిన ప్రయాణికుడు!
కేరళలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ములంగున్నాతుకావు, వడక్కంచెరి రైల్వే స్టేషన్ల మధ్య వెలప్పయ్య త్రిస్సూర్‌లో ఈ ఘటన జరిగింది. ఎర్నాకుళం-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్ 11 కోచ్‌లో టీటీఈ వినోద్ ప్రయాణికుల టిక్కెట్ల తనిఖీలో భాగంగా ఒక ప్రయాణికుడిని టిక్కెట్ చూపించమని అడిగాడు. ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఆ ప్రయాణికుడు టీటీఈని వేగంగా వెళుతున్న రైలు నుండి కిందకు తోసేశాడు. దీంతో టీటీఈ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని కేరళ రైల్వే పోలీసులు మీడియాకు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణికుడు రజనీకాంత్ టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. ఇంతలో టీటీఈ వినోద్ అతనిని టిక్కెట్ అడిగాడు. ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో డోర్ దగ్గర నిలుచున్న ప్రయాణికుడు టీటీఈ వినోద్‌ను కదులుతున్న రైలులో నుంచి కిందకు తోసివేశాడు. ఇంతలో అటువైపు నుంచి వస్తున్న మరో రైలు ఆ టీటీఈని ఢీకొంది. దీంతో టీటీఈ అక్కడకక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రయాణికుడు రజనీకాంత్‌ను పాలక్కడ్‌లో అరెస్టు చేశారు. -
పాట్నా సివిల్ కోర్టు వద్ద పేలుడు..
పాట్నా: బిహార్‌లోని పాట్నా సివిల్ కోర్టు వద్ద ట్రాన్స్ఫార్మర్ పేలడంతో ఇద్దరు మరణించారు. వీరిలో ఒకరు లాయర్ కూడా ఉన్నారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ఆ ఘటన వెలుగుచూసింది. సివిల్ కోర్టు కాంప్లెక్స్ వద్ద ఇటీవల ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ క్మంలో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫర్మర్ పేలుడు సంభవించడంతో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సివిల్ కోర్టు కాంప్లెక్స్‌లోని గేట్ నంబర్ వన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఓ న్యాయవాదితో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. న్యాయవాదిని దేవేంద్ర ప్రసాద్‌గా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.ప్రమాదంపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి న్యాయవాదులను శాంతింప జేశారు. ప్రమాదంలో భారీగానే నష్టం జరిగినట్లు తెలుస్తోంది. చదవండి: ‘సోదరుడిపై సీఎం మమత ఫైర్.. అన్ని బంధాలు తెంచుకున్నా’ -
మరో ‘వందే భారత్’ ట్రయల్ రన్ విజయవంతం
ఇది రామ భక్తులకు పండుగలాంటి వార్త. అయోధ్యలోని రాములోరిని చూసేందుకు యూపీ భక్తులు ఇకపై కాషాయ రంగులో మెరిసిపోయే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాల్సి ఉంటుంది. ఈ వందే భారత్ రైలు యూపీ రాజధాని పట్నా నుండి అయోధ్య మీదుగా లక్నో వరకు నడుస్తుంది. ఈ రైలుకు సంబంధించిన తుది ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఈ ట్రయల్ రన్లో ఈ రైలు నిర్ణీత సమయానికి ముందుగానే లక్నోకు చేరుకుంది. ఈ రైలును మార్చి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. కాగా అధికారికంగా ఈ రైలు టైమ్ టేబుల్‌ను ఇంకా విడుదల చేయలేదు. పట్నా నుంచి అయోధ్య మీదుగా లక్నో వరకు నిర్వహించిన ఈ రైలు ట్రయల్ రన్లో నిర్ణీత సమయానికి 15 నిమిషాల ముందుగా వారణాసి, 12 నిమిషాల ముందుగా అయోధ్య , 20 నిమిషాల ముందుగా లక్నో చేరుకుంది. ట్రయల్ రన్లో ఈ రైలు ఉదయం 6:05 గంటలకు పట్నా నుంచి లక్నోకు బయలుదేరింది. ఈ సమయంలో రైలు వేగం 130 కి.మీ.గా ఉంది. -
లోక్‌సభ ఎన్నికల వేళ.. బిహార్‌లో ఈడీ దాడుల కలకలం
పాట్నా: లోక్‌సభ ఎన్నికల వేళ బిహార్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడుల కలకలం రేగింది. మనీ లాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్ సన్నిహితుడు, ఇసుక మైనింగ్ కింగ్ సుభాష్‌యాయాదవ్ ఇళ్లు, ఆఫీసులపై శనివారం ఉదయం ఈడీ సోదాలు ప్రారంభించింది. రాజధాని పాట్నా శివార్లతో పాటు దానాపూర్‌లోని పన్నెండు ప్రాంతాల్లో ఏక కాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 2019లో సుభాష్ యాదవ్ ఆర్జేడీ టికెట్‌పై జార్ఖండ్‌లోని ఛాత్రా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. పాట్నాలోని గాంధీమైదాన్‌లో ఈ మార్చి 3న జరిగిన మహాబంధన్ జనవిశ్వాస మహా ర్యాలీలో సుభాష్ యాదవ్ చురుగ్గా పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి భారీ స్పందన రావడం గమనార్హం. కాగా, రాష్ట్రంలో ఇటీవలే ఆర్జేడీతో సంకీర్ణాన్ని వీడిన సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ బీజేపీతో జట్టుకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో ఆర్జేడీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో ఆర్జేడీ నేతలపై ఈడీదాడులు చర్చనీయాంశమయ్యాయి. ఇదీ చదవండి.. నేడు బీజేపీలోకి కాంగ్రెస్ దిగ్గజ నేత -
Modi ka parivaar: ట్రెండింగ్‌లోకి ‘మోదీ పరివార్’
ఆదిలాబాద్/తెలంగాణ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాని మోదీకి కుటుంబమే లేదన్న లాలూ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అయితే.. లాలూ వ్యాఖ్యలపై ఇవాళ తెలంగాణ ఆదిలాబాద్ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ‘నా జీవితం తెరిచిన పుస్తకం.. నా జీవితం దేశం కోసం అంకితం. వారసత్వ రాజకీయాలను ప్రశ్నిస్తే నన్ను దూషిస్తున్నారు. దేశ ప్రజలే నా బంధువులు’ అని మోదీ అన్నారు. ఎవరూ లేనివారికి మోదీనే కుటుంబమన్న ప్రధాని మోదీ.. ‘నేనే మోదీ కుటంబం’(మై హూ మోదీ పరివార్) Modi ka parivaar అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మోదీ పిలుపుతో బీజేపీ అగ్రనేతలు సోషల్‌మీడియా ఖాతాల్లో తమ బయో మార్చుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ‘మోదీ పరివార్’ ట్రెండింగ్‌లోకి వచ్చింది. నెటిజన్లు ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం పట్నాలోని గాంధీ మైదాన్‌లో నిర్వహించిన ‘ జన్ విశ్వాస్ మహా ర్యాలీ’లో లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. మోదీ అసలు హిందువే కాదని.. ఆయన తన తల్లి మరణించిన సమయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం శిరోముండనం తెలిపారు. అలాగే.. ఎక్కువ సంతానం ఉన్నవాళ్లను సైతం మోదీ తరచూ విమర్శిస్తుంటారని లాలూ ఆరోపించారు. -
ఇండియా కూటమి ఎన్నికల భేరి
పట్నా: ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు బిహార్ రాజధాని పట్నా వేదికగా ఎన్నికల ప్రచార నగారా మోగించారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలో ఆదివారం జరిగిన ‘జన్ విశ్వాస్ మహా ర్యాలీ’లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తదిపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగిస్తూ..రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గరిష్టంగా సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలను ఉసి గొల్పుతూ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. వాటిని చూసి తాము భయపడటం లేదని చెప్పారు. దేశ సంపదను, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. కేవలం ఇద్దరు, ముగ్గురు బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలను కాపాడుతున్న మోదీ ప్రభుత్వం, దేశ జనాభాలో 73 శాతం మేర ఉన్న వెనుకబడిన వర్గాలు, దళితులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్ ప్రసంగిస్తూ.. ఇటీవల తమను వదిలేసి ఎన్డీఏ పక్షంలో చేరిన సీఎం నితీశ్‌పై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కోసం సిద్ధం కావాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేలా మీలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు నేను ఇక్కడే ఉంటాను’అని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ..యూపీ, బిహార్లలో కలిపి 120 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడిస్తే కేంద్రంలో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. వామపక్ష పార్టీల నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా, దీపాంకర్ భట్టాచార్య కూడా ర్యాలీలో ప్రసంగించారు. రైల్వేపై రాహుల్ విమర్శలు కేంద్ర ప్రభుత్వం ధనికులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రైల్వే విధానాలను రూపొందిస్తోందని రాహుల్ ఆరోపించారు. ప్రధాని మోదీని నమ్మితే నమ్మక ద్రోహం గ్యారెంటీ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘డైనమిక్ ఫేర్ పేరుతో ఏటా 10 శాతం చొప్పున రైలు చార్జీలను ప్రభుత్వం పెంచుతోంది. క్యాన్సిలేషన్ చార్జీలను, ప్లాట్‌ఫాం టిక్కెట్ల ధరలను సైతం పెంచింది’’ అని విమర్శించారు. -
జేడీ(యూ) ఎల్పీ భేటీకీ ఎమ్మెల్యేలు డుమ్మా
పాట్నా: సీఎం నితీశ్ కుమార్ సర్కారుపై అసెంబ్లీలో సోమవారం జరిగే విశ్వాస పరీక్షలో నెగ్గుతామని అధికార జేడీయూ ధీమా వ్యక్తం చేసింది. శనివారం సీఎం నితీశ్ ఇచ్చిన విందుకు కొందరు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. అలాగే, ఆదివారం మంత్రి విజయ్ కుమార్ చౌదరి అధ్యక్షతన జరిగిన పార్టీ శాసనసభా పక్షం భేటీకి సైతం కొందరు గైర్హాజరవడం కలకలం రేపింది. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పనిసరి పరిస్థితుల్లో గైర్హాజరయ్యారని చౌదరి చెప్పారు. తొలుత ఆర్జేడీకి చెందిన స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం, అనంతరం ప్రభుత్వంపై విశ్వాస పరీక్షలో వారంతా ఓటేస్తారన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ జేడీయూ ఎల్పీ భేటీలో పాల్గొనడం విశేషం. సోమవారం వామపక్ష సభ్యులతో కలిసి ఆర్జేడీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటారని తెలిసింది. వారం రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం పటా్న చేరారు. -
పట్నాలో మెట్రో పరుగులు.. ఎప్పుడంటే..
బీహార్ రాజధాని పట్నాలో ‘మెట్రో’ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2027 నాటికి ఈ పనులు పూర్తవుతాయనే అంచనాలున్నాయి. మొదటి దశలో మొత్తం 26 మెట్రో స్టేషన్లను నిర్మిస్తున్నారు. వీటిలో 13 భూగర్భ, 13 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు. ఫేజ్-1 కింద రెండు కారిడార్లను నిర్మిస్తున్నారు. మొదటి కారిడార్ దానాపూర్ నుండి ఖేమిన్‌చాక్ వరకు వెళుతుంది. దీని పొడవు 18 కిలోమీటర్లు ఉంటుంది. రెండవ కారిడార్ పట్నా జంక్షన్ నుండి పాటలీపుత్ర బస్ టెర్మినల్ వరకు ఉంటుంది. రెండో కారిడార్ పొడవు 14 కిలోమీటర్లు. మీడియాకు అందిన వివరాల ప్రకారం కారిడార్-1లో మొత్తం 14 మెట్రో స్టేషన్లు ఉంటాయి. వాటిలో 8 ఎలివేటెడ్, ఆరు భూగర్భ మెట్రో స్టేషన్లు. రెండో కారిడార్‌లో మొత్తం 12 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో ఐదు ఎలివేటెడ్, ఆరు భూగర్భంలో ఉంటాయి. డీఆర్ఎంసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కారిడార్-2 జనవరి 2027 నాటికి ప్రారంభంకానుంది. ప్రస్తుతం భూగర్భ సొరంగాలు సిద్ధమవుతున్నాయి. దాదాపు 1.2 కిలోమీటర్ల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. కాగా ఢిల్లీ-నోయిడా మధ్య కనెక్టివిటీని పెంచేందుకు నోయిడాలో కొత్త మెట్రో మార్గాలను నిర్మించాలని అధికారులు గతంలో నిర్ణయించారు. గత ఏడాది నూతన మెట్రో మార్గానికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూపొందించింది. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ దీనికి ఆమోదం తెలిపింది. -
బీజేపీ-జేడీయూ కూటమిపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
జేడీ(యూ) చీఫ్ బిహార్‌లోని మహాకూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో జట్టు కట్టడంపై ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ఏర్పడిన బీజేపీ-జేడీ(యూ) కూటమి కూడా ఎక్కువ కాలం నిలవదని అభిప్రాయపడ్డారు. నితీష్ కుమార్ మహాకూటమి సీఎం పదవీ రాజీనామా చేసి.. ఎన్డీఏ కూటమి నేతగా మళ్లీ బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న సమయంలో ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2025లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా బీజేపీ-జేడీయూ కూటమి స్థిరంగా ఉండదని జోష్యం చేప్పారు. బిహార్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక ఏడాది లేదా దాని కంటే తక్కువేనని కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఏర్పడిన బీజేపీ-జేడీయూ కూటమిలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయన కేవలం ఆరు నెలల్లోనే ఊహించినంత మార్పు సంభవిస్తుందని కూడా తెలిపారు. ఇక 2022లో నితీష్ కుమార్ ఎన్డీఏ ఉంచి బయటకు వచ్చారని.. అప్పుడు బిహార్‌లో రాజకీయ స్థిరత్వం ఉంటుందని ఆశించానన్నారు. అయితే రాజకీయ, పరిపాలన పరమైన అంచనాలు ఎప్పటికప్పుడు పెరిగిపోవటం వల్లనే ఇలాంటి కూటమి మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మహాకూటమి కూటమి కూడా 2020 వరకు మాత్రమే కొనసాగదని గతంలో తాను అంచనా వేసినట్లు గుర్తు చేశారు. గత అంచనా నిజం అయినట్టు ఇప్పుడు కూడా 2025 వరకు మాత్రమే ప్రస్తుతం ఏర్పడిన బీజేపీ-జేడీయూ కూటమి సైతం కొనసాగుతుందని అన్నారు. అనంతరం బీజేపీ- జేడీయూ కూటమి కూడా బీటలు వారుతుందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. చదవండి: ‘నితీష్, బీజేపీకి బిహార్ ప్రజలు బుద్ధి చెబుతారు’ -
‘ఇండియా కూటమిలో ఉంటే నితీష్ కుమారే ప్రధాని!’
లక్నో: ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’కి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూపంలో మరో భారీ షాక్ తగలనున్నట్టు జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఇప్పటికే కూటమి నుంచి బయటకు వచ్చి.. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, పంజాబ్‌లో ఆప్ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజు మరో కీలకమైన పార్టీ జేడీ(యూ) కూడా కూటమి నుంచి వైదొలగనుందని తెలుస్తోంది. బిహార్ సీఎం నితీష్ కుమారు దీని కోసం పావులు కదపుతున్నారని సమాచారం. దాని కోసం ఆయన ప్రస్తుత సీఎం పదవి రాజీనామా చేసి.. బీజేపీలో చేరి మళ్లీ 9వ సారి సీఎం ప్రమాణస్వీకారం చేయడానికి కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్షాల కూటమిలో ఎవరైనా ప్రధానమంత్రి పదవికి అర్హులేనని తెలిపారు. ఇక.. కూటమిలో ఎవరినైనా ప్రధాని చేయటానికి అవకాశాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. అటువంటి స్వేచ్ఛ ప్రతిపక్షాల కూటమిలో ఉంటుందని చెప్పారు. నితీష్ కుమార్ ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో ఉంటే ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ లో తాను ఎప్పుడు పాల్గొంటాననే విషయాన్ని సరైన సమయలో వెల్లడిస్తానని అన్నారు. నితీష్ కుమార్ యూ టర్న్ తీసుకొని బీజేపీతో చేతులు కలుపుతున్నారన్న వార్తలపై అఖిలేష్ యాదవ్ చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటగా నితీష్ కుమార్ చొరవ తీసుకొని మరీ ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయన కూటమి నుంచి వైదొలగకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక ఆయన కూటమిలోనే ఉంటే ప్రధాని అవుతారని అన్నారు. చదవండి: బీజేపీ-జేడీయూ నేతృత్వంలో నితీష్ మళ్లీ సీఎం? -
ఒక్క మ్యాచ్ కోసం రెండు వేర్వేరు జట్లు.. రోజర్ బిన్నీ లేదంటే జై షా?!
Ranji Trophy 2023-24 Bihar Vs Mumbai: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో ముంబై- బిహార్ మ్యాచ్ ఆరంభం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబైతో టెస్టులో తలపడేందుకు.. బిహార్ నుంచి రెండు వేర్వేరు క్రికెట్ జట్లు మైదానానికి రావడంతో గందరగోళం నెలకొంది. దీంతో శుక్రవారం నాటి తొలి రోజు ఆట కాస్త ఆలస్యంగా మొదలైంది. ఇంతకీ ఏం జరిగిందంటే...?! ప్రెసిడెంట్ వర్సెస్ సెక్రటరీ బిహార్ క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) అధ్యక్షుడు రాకేశ్ తివారి- కార్యదర్శి అమిత్ కుమార్ మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. పాట్నా వేదికగా ముంబైతో ఆడేందుకు రాకేశ్ తివారి, అమిత్ కుమార్ తమ తమ జట్లను ఎంపిక చేశారు. తాము సెలక్ట్ చేసిన జట్టే మైదానంలో దిగుతుందని ఆటగాళ్లకు చెప్పారు. మైదానంలోకి రెండు జట్లు వీరిద్దరి అత్యుత్సాహం కారణంగా ఈ జట్లలోని సభ్యులంతా మైదానానికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో.. పోలీసులు రంగంలోకి దిగి.. వివాదం సద్దుమణిగేలా చేశారు. ఈ క్రమంలో.. బీసీఏ ప్రెసిడెంట్ రాకేశ్ తివారి ఎంపిక చేసిన జట్టే ఆట మొదలుపెట్టింది. అతడి జట్టే ఆడుతోంది ఈ వివాదం గురించి రాకేశ్ తివారి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ప్రతిభ ఆధారంగా మేము సరైన జట్టును ఎంపిక చేశాం. బిహార్ నుంచి ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు రావడం మీరు చూస్తూనే ఉన్నారు. మా రాష్ట్రం నుంచి సకీబ్ హుసేన్ లాంటి వాళ్లు ఐపీఎల్‌కు సెలక్ట్ అయ్యారు. ఈ రోజు 12 ఏళ్ల చిచ్చరపిడుగును కూడా అరంగేట్రం చేయిస్తున్నాం. బీసీఏ కార్యదర్శిని ఇప్పటికే మేము సస్పెండ్ చేశాం. కాబట్టి అతడు ఎంపిక చేసిన జట్టుకు అసలు విలువే లేదు’’ అని పేర్కొన్నాడు. రోజర్ బిన్నీ లేదంటే జై షా?! ఇందుకు బదులుగా అమిత్ కుమార్.. ‘‘అందరికీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. నేను ఎన్నికల్లో గెలిచి అధికారికంగా కార్యదర్శి పదవి చేపట్టాను. నన్ను సస్పెండ్ చేసే అధికారం ఎవరికీ లేదు. అయినా.. బోర్డు ప్రెసిడెంట్ ఎప్పుడైనా జట్టు ఎంపికలో జోక్యం చేసుకుంటాడా? బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ భారత జట్టును ప్రకటించడం చూశారా? జట్టు ఎంపిక గురించిన సమాచారాన్ని అధికారికంగా కార్యదర్శి జై షానే వెల్లడిస్తారు కదా! నేను కూడా బీసీఏకు కార్యదర్శినే’’ అంటూ రాకేశ్ తివారికి కౌంటర్ ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. శుక్రవారం నాటి మొదటిరోజు ఆటలో టాస్ గెలిచిన బిహార్ ముంబైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ముంబై జట్టు 76.2 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ కాగా.. శనివారం బ్యాటింగ్‌కు దిగిన బిహార్ 26 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. 12 ఏళ్ల 284 రోజులకు... రంజీ ట్రోఫీలో పిన్న వయస్సులోనే అరంగేట్రం చేసిన నాలుగో ప్లేయర్‌గా బిహార్ జట్టుకు చెందిన వైభవ్ సూర్యవంశీ (12 ఏళ్ల 284 రోజులు) గుర్తింపు పొందాడు. పట్నాలో ముంబై జట్టుతో శుక్రవారం మొదలైన ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో వైభవ్ బరిలోకి దిగాడు. రంజీ ట్రోఫీలో పిన్న వయస్సులోనే మ్యాచ్ ఆడిన ప్లేయర్ల జాబితాలో అలీముద్దీన్ (రాజ్‌పుతానా; 12 ఏళ్ల 73 రోజులు; 1942), ఎస్కే బోస్ (బిహార్; 12 ఏళ్ల 76 రోజులు; 1959), మొహమ్మద్ రంజాన్ (నార్తర్న్ ఇండియా; 12 ఏళ్ల 247 రోజులు; 1937) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. చదవండి: T20 WC 2024: అద్భుతమైన ఫీల్డర్లు.. కోహ్లి, రోహిత్‌లను ఆడించాలి: టీమిండియా దిగ్గజం -
ఛత్ వేడుకల్లో విషాదం.. వివిధ ప్రాంతాల్లో 22 మంది మృతి
బీహార్‌లోని పలు ఛత్ ఘాట్ల వద్ద నీట మునిగి 22 మంది మృతిచెందారు. ఆది, సోమవారాల్లో ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఆరుగురు యువకులు, ఏడుగురు యువతులు, ఒక బాలిక సహా ఐదుగురు మహిళలు ఉన్నారు. షాపూర్ సమీపంలోని బ్రహ్మాపూర్ చెరువులో అర్ఘ్యం ఇస్తున్న సమయంలో ఇద్దరు కవల సోదరులతో సహా ముగ్గురు యువకులు నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటనపై ఆగ్రహించిన జనం జగన్పుర సమీపంలోని కొత్త బైపాస్ రోడ్డును దిగ్బంధించి, ట్రాఫిక్ చెక్‌పోస్టును ధ్వంసం చేసి దానిని తగులబెట్టారు. సరన్ జిల్లాలోని దిఘ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దాస్చక్ గ్రామంలో గంగా నదిలో స్నానం చేస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు, ఒక బాలుడు నీటిలో మునిగి మరణించారు. దర్భంగా జిల్లాలోని నెహ్రా అసిస్టెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగదీష్పూర్ గ్రామంలో కొందరు యువకులు ఛత్ పూజ అనంతరం జూదం ఆడుతున్నారు. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చారు. దీంతో వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో నీటితో నిండిన గోతిలో రోషన్ అనే యువకుడు పడిపోయి మృతి చెందాడు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు తొలిసారిగా వేడి కిచిడీ పంపిణీ! -
‘రైళ్లను పేల్చేస్తా’నంటూ బెదిరించి.. పోలీసు విచారణలో నిందితుని ట్విస్ట్!
పట్నా: బీహార్ రాజధాని పట్నా రైల్వే స్టేషన్లో ఆ సమయంలో కలకలం చెలరేగింది. రాజధాని, జన-శతాబ్ది, వందే భారత్ రైళ్లను పేల్చివేస్తామంటూ రైల్వే అధికారులకు బెదిరింపు లేఖ వచ్చింది. రాజేంద్ర నగర్ టెర్మినల్ స్టేషన్ మేనేజర్‌కు ఆగంతకుడు ఈ బెదిరింపు లేఖను పోస్ట్ ద్వారా పంపాడు. తాను ఈ మూడు రైళ్లను పేల్చకుండా ఉండాలంటే రైల్వే శాఖ తనకు రూ.1.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఈ విషయాన్ని స్టేషన్ మేనేజర్.. జీఆర్పీకి, స్థానిక పోలీసులకు తెలియజేశారు. ఈ కేసులో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మరొకరిని ఈ కేసులో ఇరికించాలని ఒక పథకం ప్రకారం స్టేషన్ మేనేజర్‌కు బెదిరింపు లేఖ పంపాడు. ఈ కేసులో కామత్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు కామత్ విస్తుపోయే వివరాలను వెల్లడించాడు. కపిల్ దేవ్ అనే వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని, పోలీసు కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో కామత్ ఈ బెదిరింపు లేఖ రాశాడని పోలీసుల విచారణలో తేలింది. కామత్, కపిల్ దేవ్ మధ్య చాలా కాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ నేపధ్యంలో కామత్ జైలుకు కూడా వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన అతను కపిల్దేవ్పై పగ తీర్చుకునే ఉద్దేశంతో ఈ పనిచేశాడని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: పాక్‌పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి! -
నితీష్ కుమార్‌ను రెండో గాంధీగా పోలిక.. ప్రతిపక్షాలు ఫైర్
పాట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్‌ని మహాత్మాగాంధీతో పోలుస్తూ వెలువడిన పోస్టర్లపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఇలాంటి పోలికలు మహాత్మాగాంధీని అవమానించడమేనని ఆర్జేడీ విమర్శించింది. ఇది హేయమైన చర్య అని బీజేపీ మండిపడింది. పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను దేశానికి రెండో గాంధీగా పేర్కొంటూ పోస్టర్లు వెలిశాయి. జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన ఆయన పార్టీ సభ్యులు ఈ పోస్టర్లను అంటించారు. నితీష్ కుమార్ సమానత్వ కోసం పోరాడారని పోస్టర్లో కొనియాడారు. సామాజిక సంస్కరణలు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని, మహాత్మాగాంధీ అనుసరించిన బాటలోనే ఆయన నడుస్తున్నారని జేడీ(యూ) నాయకులు పోస్టర్లలో పేర్కొన్నారు. నితీష్ కుమార్‌ను ‘రెండో గాంధీ’గా అభివర్ణిస్తూ వచ్చిన పోస్టర్‌పై ప్రతిపక్ష పార్టీలు ఫైరయ్యాయి. రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు శివానంద్ తివారీ మాట్లాడుతూ.. ఈ పోస్టర్ నితీష్ కుమార్ అభిమానులు అంటించి ఉండవచ్చు.. కానీ ఇలా మహాత్మా గాంధీని అవమానించవద్దని కోరారు. మహాత్మా గాంధీలాంటి వాళ్లు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి పుడతారని తివారీ అన్నారు. ఈ పోస్టర్లపై బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాత్మాగాంధీతో నితీశ్ కుమార్‌ను పోల్చడం హేయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుంటాల కృష్ణ అన్నారు. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఒకే రోజు భారత్‌కు చేరిన రెండు విమానాలు -
బీహార్‌లో జనాభా లెక్కింపు పూర్తి.. బీసీలు ఎంతమంది ఉన్నారంటే?
పాట్నా: బీహార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనాభా గణన ఫలితాలను గాంధీ జయంతి సందర్బంగా బయటపెట్టింది. ఈ సర్వేలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ జనాభా లెక్కలు చాలా కీలకం కానున్నాయని బీహార్‌లోని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీహార్ ప్రభుత్వం చేపట్టిన జనాభా గణన నివేదిక ప్రకారం ఆ రాష్ట్రంలో మొత్తం జనాభా 13.1 కోట్లకు పైగా ఉన్నారని అందులో వెనకబడిన వారు 27 శాతంగా ఉండగా మరింత వెనకబడిన వారు 36 శాతం ఉన్నారని తేలింది. అంటే బీహార్ రాష్ట్రంలో బీసీలే 63 శాతం ఉన్నారు. ఇక షెడ్యూల్డ్ కులాల వారు 19.7 శాతం, షెడ్యూల్డ్ తెగల వారు 1.7 శాతం, ఇక సామాన్య జనాభా మాత్రం 15.5 శాతం ఉన్నట్లు జనాభా లెక్కలు చెబుతున్నాయి. బీహార్‌లో కుల ఆధారిత సర్వేకు శ్రీకారం చుట్టగానే దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. అలాగే న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యాయి. అయినా కూడా ప్రభుత్వం మాత్రం జనగణనపై గట్టి నమ్మకంతో ముందుకెళ్లింది. ఎప్పుడైతే పాట్నా హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో బీహార్ ప్రభుత్వానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దేశంలోనే జనాభాగణన పూర్తి చేసిన తొట్టతొలి రాష్ట్రంగా బీహార్ నిలిచింది. ఇది కూడా చదవండి: ‘చంద్రబాబు నీచ చరిత్రను మరిచిపోయావా భువనేశ్వరి?’ -
అదనపు వడ్డీ కోసం దళిత మహిళను వివస్త్రను చేసి మూత్రం తాగించి..
పాట్నా: బీహార్‌లోని పాట్నా జిల్లా మొశింపుర్ గ్రామంలో ఖుర్సుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రూ.1500 అదనపు వడ్డీ చెల్లించాలంటూ తండ్రీ కొడుకులు ఒక దళిత మహిళపై దారుణానికి ఒడిగట్టారు. ఆమెను వివస్త్రను చేసి కర్రలతో చితకబాది బలవంతంగా ఆమెతో మూత్రం తాగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలి భర్త ప్రమోద్ సింగ్ వద్ద రూ.9000 అప్పుగా తీసుకున్నారని ఆ నగదు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించినా కూడా రూ.1500 అదనంగా వడ్డీ చెల్లించాలని ప్రమోద్ సింగ్ పలుమార్లు వారిని వేధించాడన్నారు. భార్యభర్తలు ఇద్దరూ అప్పటికే మొత్తం అప్పు తిరిగి చెల్లించామని చెప్పి అదననపు వడ్డీ చెల్లించడానికి తిరస్కరించడంతో శనివారం ప్రమోద్ సింగ్ తన కుమారుడు అన్షు తోపాటు మరో నలుగురు ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా బయటకు లాక్కొచ్చి అందరూ చూస్తుండగానే ఆమెను వివస్త్రను చేశారన్నారు. అనంతరం కర్రలతో చితకబాదాక ప్రమోద్ ఆదేశించగా అన్షు బలవంతంగా ఆమెతో మూత్రం తాగించాడు. అక్కడినుండి ఎలాగోలా తప్పించుకున్న ఆమె పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి తలకు తీవ్రగాయాలవ్వడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ప్రధాన నిందితుడు ప్రమోద్ సింగ్ అతని కుమారుడు అన్షు సహా మిగిలిన ఆనలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో క్షుద్రపూజలు.. నకిలీ ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్ -
ఆ రైల్వే కూలీకి ఇద్దరు బాడీగార్డులెందుకు? పాక్స్తాన్ ఎందుకు బెదిరిస్తోంది?
అతని పేరు ధర్మనాథ్ యాదవ్.. బీహార్‌లోని పట్నా రైల్వే జంక్షన్లో కూలీ. సాయుధులైన ఇద్దరు పోలీసు బాడీగార్డుల నడుమ థర్మనాథ్ కనిపిస్తుంటాడు. వారిలో ఒకరు బీహార్ పోలీస్ కాగా మరొకరు జీఆర్పీ జవాను. వీరిద్దరూ అతని పక్కన నడుస్తుండగా, అతను ప్రయాణికుల బ్యాగులను మోసే పనిచేస్తుంటాడు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పొద్దుపోయేవారకూ అతను ఈ బాడీగార్డుల మధ్యనే ఉంటూ, తన విధులు నిర్వహిస్తుంటాడు. అది అక్టోబరు 27, 2013.. ఉదయం 9.30 గంటలు. బాంబుల మోతతో పట్నా జంక్షన్ దద్దరిల్లిపోయింది. నలువైపులా పొగలు కమ్ముకున్నాయి. వీటి మధ్య ఒక ఎర్రటి టవల్ మెడలో వేసుకున్న ఒక వ్యక్తి.. టాయిలెట్ నుంచి రక్తంతో తడిసి ముద్దయిన ఒక యువకుడిని భుజాన వేసుకుని బయటకు తీసుకువచ్చాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు 1989 నుంచి ఇదే స్టేషన్లో పనిచేస్తున్న కూలీ ధర్మనాథ్. ఆయన టాయిలెట్ నుంచి బయటకు తీసుకు వచ్చిన యువకుడు ఉగ్రవాది ఇమ్తెయాజ్. ఒకవేళ ఆ రోజు ధర్మనాథ్ ఉగ్రవాది ఇమ్తెయాజ్ను బయటకు తీసుకురాకుండా ఉంటే ఆ మరుక్షణంలో గాంధీ మైదాన్, బోధ్‌గయలో జరగబోయే బాంబు పేలుళ్లు ఆగేవికాదు. గాంధీమైదాన్‌లో నరేంద్ర మోదీ ర్యాలీలో బాంబు పేలుళ్లు జరగనున్నాయని ఇమ్తియాజ్ స్వయంగా పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు గాంధీ మైదాన్, బోధ్‌గయ ప్రాంతాల్లో జరగబోయే బాంబు పేలుళ్లను నిలువరించగలిగారు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి థర్మనాథ్కు పాకిస్తాన్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ధర్మనాథ్ తనకు తగిన రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపధ్యంలో కోర్టు అతనికి రక్షణగా ఒక బాడీగార్డును ఏర్పాటు చేసింది. అయితే ఈ బాడీగార్డు అతనికి పోలీస్ స్టేషన్లో మాత్రమే రక్షణ కల్పించేందుకు అవకాశం ఉంది. దీంతో ధర్మనాథ్ తాను బయటకు వెళ్లినప్పుడు కూడా రక్షణ కల్పించాలని కోర్డును వేడుకున్నాడు. దీంతో కోర్టు 2023లో ధర్మనాథ్‌కు మరొక పోలీసు కానిస్టేబుల్ ద్వారా రక్షణ కల్పించింది. ఈ సందర్భంగా కూలీ ధర్మనాథ్ మాట్లాడుతూ తనకు ఉండేందుకు ఇల్లు కూడా లేదని, స్టేషన్‌లోని కూలీల విశ్రాంతి గదిలోనే ఉంటున్నానని తెలిపాడు. రాత్రి వేళలో ఇద్దరు బాడీగార్డులు కూడా వారి ఇళ్లకు వెళ్లిపోతారని, తనకు ఇల్లు ఉంటే వారు తనతో పాటు రాత్రి కూడా ఉంటారని చెబుతున్నాడు. అందుకే తనకు ఇల్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఇది కూడా చదవండి: భార్య ప్రేమను అర్థం చేసుకుని.. ప్రియునితో పంపించాడు! -
కులగణన సర్వేపై నాలుక కరుచుకున్న కేంద్రం
పాట్నా: బీహార్‌లో ఇటీవల జరిగిన కులగణనకు వ్యతిరేకంగా సోమవారం కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో కులగణన చేసే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుందని పేర్కొంది. కానీ అంతలోనే పొరపాటు జరిగిందని చెబుతూ అఫిడవిట్లో కేంద్రానికి తప్ప ఇతర సంస్థలకు కులగణన, సర్వే చేసే అధికారం లేదన్న మాటను తొలగించి మరోసారి అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో సవరణలపై బీహార్‌లోని రాజకీయ వర్గాల్లో అగ్గి రాజుకుంది. బీహార్ ప్రభుత్వం కులగణన చేయడం కేంద్రానికి ఇష్టం లేదని దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్న వారి కుటిలబుద్ధి మరోసారి బట్టబయలైందని చెబుతూ విమర్శలు చేశారు జేడీయు,ఆర్జేడీ నేతలు. ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ప్రజల హక్కులను హరించాలన్న బీజేపీ, సంఘ్ పరివార్ వక్రబుద్ధికి ఇది నిదర్శనమని, ఇది అనుకోకుండా జరిగింది కాదని ఉద్దేశ్యపూర్వకంగా చేసిందేనని.. ఇదే కొనసాగితే అగ్నిపర్వతం బద్దలవుతుంది జాగ్రత్తని హెచ్చరించారు. ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ బీజేపీ అసలు రంగు బయటపడింది. బీజేపీకి అసలు కులగణన చేయాలన్న ఉద్దేశ్యమే లేదని దీన్ని బట్టి అర్థమవుతోందని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జేడీయు నేత విజయ్ కుమార్ చౌదరి స్పందిస్తూ బీహార్ ప్రభుత్వం ఎప్పటినుంచో తాము చేస్తోంది కులగణన కాదని సర్వే అని చెబుతూనే ఉంది. అయినా కేంద్రం దీన్ని వివాదాస్పదం చేయడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిపై బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ తాము కులగణనకి వ్యతిరేకమని ఏనాడూ చెప్పలేదని, మేము కోరుతుంది ఒక్కటేనని.. ఒకవేళ కులగణన పూర్తయితే ఆ వివరాలను 24 గంటల్లో ప్రకటించాలని మాత్రమే కోరుతున్నామన్నారు. చివరిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందిస్తూ.. మేము మొదటి నుంచీ సర్వే మాత్రమే చేస్తున్నామని చెబుతూనే ఉన్నాము. ఆయా కులాల్లో ఎంతమంది ఉన్నారన్నది మేము లెక్కపెట్టడం లేదు. వారి ఆర్థిక స్థితిగతులను మాత్రమే లెక్కపెడుతున్నామని.. దీనివలన అర్హులైనవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే అవకాశముంటుందని అన్నారు. ఈ సర్వేపై మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన పాట్నా హైకోర్టు బీహార్ ప్రభుత్వం సర్వేలో సేకరించిన డేటా భద్రతపై హామీ ఇచ్చిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే తడవు బీహార్ ప్రభుత్వం కులగణనను పూర్తిచేసింది. ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టులో కోట్లు విలువచేసే మాదకద్రవ్యాలు పట్టివేత -
దాణా కుంభకోణం: 89 మందిని దోషులుగా తేల్చిన సీబీఐ కోర్టు
పాట్నా: దాణా కుంభకోణం కేసులో మొత్తం 89 మంది దోషులుగా తేలగా వారిలో 52 మందికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో 35 మందిని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ శ్రీవాస్తవ్ నిర్దోషులుగా ప్రకటించారు. బీహార్‌లో విభజన జరగక ముందు డోరండా ట్రెజరీ నుంచి 1990 మరియు 1995 మధ్య రూ.36.59 కోట్ల అవినీతికి సంబంధించిన ఈ కేసులో మిగిలిన 36 మందిపై విచారణ సెప్టెంబర్ 1న జరుగుతుందని నిందితుల తరపు న్యాయవాది సంజయ్ కుమార్ తెలిపారు. 1990ల్లో డోరండా, డియోఘర్, దుమ్కా, చైబాసా వంటి ట్రెజరీల నుండి కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన ఈ స్కాం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ప్రస్తుతం అనారోగ్య కారణాలతో బెయిల్‌పై బయట ఉన్నారు. ఇది కూడా చదవండి: కమ్యూనిస్టుల కంచుకోటనే కూల్చేశా.. మీరెంత? -
అడ్డుకోవాలని చూశారు.. అయినా పూర్తి చేశాం: నితీష్ కుమార్
పాట్నా: బీహార్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన పూర్తయినట్లు తెలిపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ప్రస్తుతం ఈ డేటా సంకలనం జరుగుతోందని అతి త్వరలోనే ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతూ కులగణన సమాజంలో అన్ని వర్గాలకు ప్రయోజనకరమని అన్నారు. శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన కులగణన అన్ని కులాల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని దీని వలన ఎంతోకాలంగా నష్టపోయిన వారితో పాటు సమాజంలో ఆయా వర్గాల వారికి కూడా మేలు చేస్తుందని అన్నారు. పూర్తి డేటా వచ్చిన తర్వాత ఏయే అంశాల్లో మెరుగవ్వాల్సి ఉందో స్పష్టంగా తెలుస్తుందని మిగిలిన రాష్ట్రాల్లో కూడా కులగణన జరిపితే బాగుంటుందని అన్నారు. కొంతమంది ఈ కులగణనను వ్యతిరేకిస్తున్నారు కానీ అఖిలపక్షాల అభిప్రాలు సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వ్యతిరేకించే వారి అభిప్రాయం గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఈ సర్వే ద్వారా సాంఘిక, ఆర్ధిక అసమానతలకు గురైన వారికందరికీ సంక్షేమ పథకాలు అందించి మెరుగైన సేవ చేయడానికి వీలుంటుందని తెలిపారు. మొదటి నుంచి కులాల ప్రాతిపదికన సంక్షేమం అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని అందులో భాగంగానే కులగణన చేశామని అన్నారు. కులగణన కోసం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు అనుమతి కోరడంపై స్పందిస్తూ.. సుప్రీం కోర్టు ప్రజలకు ప్రయోజనకరమైన అంశాలను నిలిపివేయమని ఎప్పుడూ చెప్పదు. ఇక పాట్నా హైకోర్టు అయితే ఇదే అంశంపై నమోదైన అనేక పిల్లను కొట్టి పారేసిందని గుర్తు చేశారు. మరి 2021లోనే పూర్తి కావాల్సిన కులగణన జాప్యం విషయమై కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కేంద్రం ఈ కులగణన కార్యక్రమంలో జోక్యానికి అనుమతి కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఇందులో ఉన్న చట్టపరమైన సమస్యలు తెలుపుతూ తదుపరి వాయిదా తేదీ ఆగస్టు 28లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది. కానీ ఈలోపే ఈ సర్వే పూర్తి కావడం విశేషం. ఇది కూడా చదవండి: మా పార్టీ చీలిపోలేదు: శరద్ పవార్ -
పార్కుకు 'వాజ్‌పేయీ' పేరు మార్పు.. బీజేపీ ఆందోళనలు..
పాట్న: బిహార్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్కు పేరును కోకోనట్ పార్క్‌గా మార్చడంపై రాజకీయంగా వివాదానికి దారితీసింది. బిహార్ అటవీ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్.. అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్క్ పేరును కోకోనట్ పార్క్‌గా సోమవారం అధికారికంగా పేరు మార్చారు. పార్క్ బయట శిలాఫలాకాన్ని కూడా ఆవిష్కరించారు. దీంతో నితీష్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. పార్క్‌ను మొదట్లో కోకోనట్ పార్కు పేరుతోనే పిలిచేవారు. 2018లో అటల్ బిహారీ వాజ్‌పేయీ మృతి చెందగా.. ఆయన జ్ఞాపకార్థం కోకోనట్ పార్క్‌కు అటల్ పేరును ఫిక్స్ చేశారు. ప్రస్తుతం నితీష్ ప్రభుత్వం ఆ పార్కు పేరును కోకోనట్‌గా మార్చడంపై బీజేపీ నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 'వాజ్‌పేయీ వర్థంతి సందర్భంగా నితీష్ కుమార్ ఇటీవల పూలమాలలు సమర్పించారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వంలోని మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ అటల్ పేరుపై ఉన్న పార్కుకు కొత్త పేరును మార్చారు. ఒకే ప్రభుత్వం వాజ్‌పేయీపై విభిన్నమైన నిర్ణయాలు తీసుకుంటోంది. పార్కుకు అటల్ పేరును యథావిధిగా ఉంచాలి' అని బీజేపీ డిమాండ్ చేసింది. రాజకీయంగా వివాదాస్పదం కావడంతో అటల్ పార్కుకు రాకపోకలను నిలిపివేశారు. ఓ వైపు పార్కు బయట కోకోనట్ పేరుతో శిలాఫలకం ఉండగా.. పార్కు బయట వాజ్‌పేయీ పేరు అలాగే ఉంది. ఇదీ చదవండి: 'ఆపరేషన్ హస్త'.. నాయకుల మధ్య పొలిటికల్ వార్.. -
బీహార్ కాల్పుల ఘటనలో కీలక మలుపు.. కాల్చింది పోలీసులు కాదు
పాట్నా: బీహార్‌లో బుధవారం మెరుగైన విద్యుత్ సరాఫరా కోసం చేస్తోన్న ఆందోళనలో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు పోలీసుల కాల్పుల వలనే చనిపోయారంటూ వచ్చిన ఆరోపణలను తిప్పికొడుతూ అసలు నేరస్తుడి వీడియోను మీడియా ముందుంచారు కతిహార్ ఎస్పీ జితేంద్ర కుమార్. కతిహార్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా కొంతమంది విద్యుత్ శాఖ అధికారులు, మరికొంతమంది పోలీసులు గాయపడ్డారు. ఈ సంఘటనకు నితీష్ కుమార్ ప్రభుత్వ వైఫల్యమే కామరణమంటూ బీజేపీ వర్గాలు జేడీయు ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో దుయ్యబట్టాయి. ఇదిలా ఉండగా సంఘటనా స్థలంలో పోలీసులు చేసిన కాల్పుల వల్లనే ఇద్దరు చనిపోయారంటూ వచ్చిన విమర్శలకు స్పందిస్తూ ఎస్పీ అసలు నేరస్తుడు ఎవరనేది వీడియో సాక్ష్యంతో సహా బయటపెట్టారు. #WATCH | Bihar: Katihar SP, Jitendra Kumar on the firing incident says, "Today, we came here (incident spot) for an inquiry. Whatever we do will be fact-based. We checked the CCTV camera...We first went where the body was recovered & found that it is impossible for the bullet… pic.twitter.com/Cl7VB1cu5N — ANI (@ANI) July 28, 2023 కతిహార్ ఎస్పీ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. చనిపోయిన ఇద్దరు వ్యక్తులకు తగిలిన బుల్లెట్లు పోలీసులు కాల్చినవి కావు. పోలీసులు కాల్పులు చేసిన చోట నుండి ఫైరింగ్ జరిగితే బులెట్ గాయాలు వేరే చోట తగలాలి. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తూ అక్కడి సీసీటీవీ ఫుటేజీని తెప్పించి చూస్తే అసలు విషయం బయటపడింది. ఓ వ్యక్తి మరో వైపు నుంచి వేగంగా వచ్చి తన వద్ద ఉన్న పిస్తోలు తీసి కాల్పుకు జరిపిన దృశ్యాలను మనం చూడవచ్చు అంటూ వీడియోను మీడియా ముందుంచారు. #WATCH | Bihar: Katihar SP, Jitendra Kumar on the firing incident says, "Today, we came here (incident spot) for an inquiry. Whatever we do will be fact-based. We checked the CCTV camera...We first went where the body was recovered & found that it is impossible for the bullet… pic.twitter.com/Cl7VB1cu5N — ANI (@ANI) July 28, 2023 ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య జరిగిందని అన్నారు. ఈ సంఘటనలో ఖుర్షిద్ అలామ్ అక్కడికక్కడే చనిపోగా సోను కుమార్ సాహు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని మరో వ్యక్తి నియాజ్ అలామ్ మాత్రం ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని అన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఇది కూడా చదవండి: మణిపూర్ మహిళల వీడియో కేసులో సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు -
విద్యార్థినిపై మాష్టారు లైంగిక వేధింపులు..బట్టలూడదీసి..
పాట్నా: పాఠాలు చెప్పాల్సిన మాష్టారు తన వయసులో సగం కంటే తక్కువ వయసున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేస్తుండగా ముగ్గురు ఆగంతకులు వారిని వివస్త్రుల్ని చేసి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే పోలీసులు స్పందించి ఆ మాష్టారిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ప్రాధమిక విచారణ జరుగుతోందని ఈ జంటను వేధించిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వీడియో బయటకు రావంతో.. బెగుసరై జిల్లా ఎస్పీ యోగేంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పత్ కౌలా గ్రామం తెగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో సంగీతం టీచరుగా పనిచేస్తున్న కిషన్ దేవ్ చౌరాసియా(45) మైనర్ బాలిక(20) తో అసభ్యంగా ప్రవర్తిస్తుండటాన్ని స్థానిక యువకులు ముగ్గురు గమనించి వారిపై దాడి చేసి ఇద్దరి బట్టలు ఊడదీశారు. ఈ సంఘటన మొత్తాన్ని వారు వీడియో కూడా తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బయటకు పొక్కడంతో తాము రంగంలోకి దిగి ప్రాధమిక విచారణ చేపట్టామని తెలిపారు. తప్పుడు రాగం.. ట్యూషన్ చెప్పడానికి వచ్చి తనను లైంగికంగా వేధించారని మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు మ్యూజిక్ టీచర్ కిషన్ సింగ్ చౌరాసియా పై పోక్సో చట్టం, ఏసీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తోపాటు మరికొన్నిసెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు ఎస్పీ. ఈ జంట పట్ల అమానుషంగా వ్యవహరించిన ఆ ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: యూపీలో దారుణం.. చెల్లెలి తల నరికి.. -
Patna: లాఠీఛార్జిలో బీజేపీ కార్యకర్త మృతి.. తీవ్ర ఉద్రిక్తత
పాట్నా: నితీశ్ సర్కారకు వ్యతిరేకంగా.. బీజేపీ చేపట్టిన ఆందోళన బీహార్ రాజధానిలో ఉద్రిక్తతకు దారి తీసింది. అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. అయినా పరిస్థితి అదుపు కాకపోవడంతో.. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లకూ పని చెప్పారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త మృతి చెందినట్లు తెలుస్తోంది. టీచర్ రిక్రూట్మెంట్ స్కాం ఆరోపణలతో పాటుగా పలు అంశాలపై నితీశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు గురువారం గాంధీ మైదాన్ వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ క్రమంలో అసెంబ్లీ ముట్టడికి బయల్దేరగా పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. ఇరువర్గాల నడుమ వాగ్వాదం చోటు చేసుకోగా.. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ఆందోళనకారులు తమతో దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులు.. పోలీసులు లాఠీఛార్జికి దిగారు. టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు వాటర్ కెనన్లు ఉపయోగించి వాళ్లను చెదరగొట్టారు. అయితే లాఠీఛార్జిలో గాయపడిన ఓ కార్యకర్త మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో.. పాట్నాలో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. నితీశ్ ప్రభుత్వంపై బీజేపీ అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతోంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాంలో జులై 3వ తేదీన సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయగా.. అందులో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేరును సైతం చేర్చింది. దీంతో తేజస్వి రాజీనామా డిమాండ్ చేస్తూ.. ఆందోళన ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. पटना में बीजेपी नेताओं के मार्च के दौरान हंगामा, पुलिस ने बीजेपी नेताओं पर किया लाठीचार्ज#teachersprotest #Patna pic.twitter.com/uipUuklcI1 — Shashank Shekhar (@Shashan48591134) July 13, 2023 ఇదీ చదవండి: ఆ మాజీ సీఎం ఇంట్లోనే ఇక రాహుల్ గాంధీ ఉండబోయేది! -
ఇసుకలో సిమెంట్ కూడా కలపాలి మహాప్రభో!.. బీహార్‌లో కూలిన రెండో వంతెన!
పాట్నా: బీహార్‌లో ఏ ముహుర్తాన వంతెనలు ప్రారంభించారు గానీ వరుసగా కూలుతున్నాయి. ఈ నెల మొదటి వారంలో ఖగారియా జిల్లాలో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం కిషన్‌గంజ్ జిల్లాలో మరో వంతెన కూలిపోయింది. కాగా రెండు వారాల్లో వంతెన కూలిన రెండో సంఘటన కావడం గమనార్హం. రాష్ట్ర రాజధాని పాట్నాకు 400 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనలో మెచ్చి నదిపై ఉన్న వంతెన పిల్లర్ కూలిపోయిందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. NH-327Eలో నిర్మాణంలో ఉన్న ఈ వంతెన పూర్తయితే కిషన్‌గంజ్, కతిహార్లను కలుపుతుందని అయన అన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. వంతెన కూలడంపై దర్యాప్తు కోసం నిపుణులతో కూడిన ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మానవ తప్పిదం వల్లనే నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్ ఒరిగిపోయినట్లు తెలుస్తోందని అన్నారు. ఇదే నెల మొదటి వారంలో అగువాని-సుల్తాన్ గంజ్ తీగల వంతెన పేకమేడలా కుప్పకూలిపోయింది. ఈ వంతెన కూడా నిర్మాణంలో ఉండగా కూలిపోవడం గమనార్హం. 2019 నవంబర్‌లో పూర్తి కావాల్సిన ఈ వంతెన నిర్మాణ పనులు మూడేళ్లకు పైగా కొనసాగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతలోనే కూలిపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉండగా ఒకే నెలలో నిర్మాణంలో ఉన్న రెండు వంతెనలు కూలిపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. ఇసుకలో సిమెంట్‌లో కలిపితే ఇలా జరగవని వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. చదవండి: బాబోయ్ ఇదేం ఆచారం! ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి.. ఆపై -
ప్రతిపక్ష నేతల సీరియస్ మీటింగ్.. అంతలో రాహుల్ పెళ్లి చేసుకోవా అనేసరికి..
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ సమావేశమయ్యాయి. కాంగ్రెస్‌తో సహా దాదాపు 15కు పైగా పార్టీలకు చెందిన కీలక నేతలు ఈ సమావేశానికి హాజరైన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీ సర్కార్‌ను గద్దె దించడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఓ వైపు ఎన్నికలు, మరోవైపు జాతీయ అంశాలపై సీరియస్‌గా చర్చ జరగుతున్న సమయంలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అడిగిన ప్రశ్నకు సమావేశంలో ఒక్క సారిగా నవ్వులు, జోకులు విరబూశాయి. పెళ్లి చేసుకో రాహుల్ ప్రతిపక్ష సమావేశంలో జాతీయ అంశాలతో పాటు మరో అంశం కూడా తెరపైకి వచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో ఒకరైన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చలోకి తీసుకువచ్చారు లాలూ ప్రసాద్ యాదవ్. సమావేశంలో ఆయన రాహుల్ పెళ్లి అంశంపై తన దైనశైలిలో రెచ్చిపోయారు. ఆయన దీనిపై మాట్లాడుతూ.. ‘రాహుల్ జీ.. పెళ్లి చేసుకో.. మేము నీ పెళ్లి ఊరేగింపుకు వస్తాం” అని సలహా ఇచ్చారు. ఈ మాటలతో రాహుల్ గాంధీ సహా అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు. అంత వరకు సీరియస్‌గా ఉన్న వాతావరణం కాస్త లాలూ వ్యాఖ్యలతో ఒక్కసారిగా మారిపోయింది. ఈ అంశంపై లాలూ కొనసాగిస్తూ.. ‘ఇంకా సమయం మించిపోలేదు, మీరు పెళ్లి చేసుకోండి. మీ అమ్మ (సోనియాగాంధీ) నాకు చెప్పేవారు.. ఈ విషయంలో నువ్వు ఆమె మాట వినడం లేదని’ ఆయన అన్నారు. వీటికి రాహుల్ గాంధీ నవ్వుతూ బదులిచ్చారు. ‘ఇప్పుడు మీరు పెళ్లి గురించి చెప్పారు కదా ఇక అది జరుగుతుందని’ రాహుల్ అన్నారు. గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహాల్ గాంధీ తన పెళ్లి ప్రస్తావన రాగా ఈ విధంగా స్పందించారు. తన తల్లి సోనియా గాంధీ, అమ్మమ్మ మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఉన్న లక్షణాలు కలిగిన అమ్మాయి తనకు భాగస్వామిగా కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. చదవండి: 'భారత్‌లో చాలా మంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారు'.. అసోం సీఎం వ్యాఖ్యలపై రాజకీయ రగడ.. -
పట్నాలో విపక్ష సమావేశంలో ముందడుగు
-
వచ్చే ఎన్నికల్లో 300 సీట్లు మావే
పట్నాలో ప్రతిపక్ష పార్టీ నాయకుల సమావేశం ఒక ఫొటో సెషన్‌కే పరిమితమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. విపక్షాల మధ్య ఐక్యత అసాధ్యమని అభిప్రాయపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. జమ్మూలో ఒక ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా పట్నా సమావేశంతో ఒరిగేదేమీ లేదని బీజేపీ 300పైగా సీట్లతో భారీ విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రపంచ దేశాల నాయకులు ప్రశంసిస్తూ ఉంటే ప్రతిపక్షాలకు అసహనంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ జైల్లో పెట్టిన నాయకులు నితీశ్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్‌లు ఆమె మనవడు రాహుల్‌తో చేతులు కలపడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల సమావేశం ఒక స్వార్థ కూటమిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అభివర్ణించారు. విపక్షాల కూటమిని తోడేళ్లతో పోల్చారు. ‘‘తోడేళ్లు మూకుమ్మడిగా వేటాడతాయని అంటారు. పట్నాలో రాజకీయ మూక కలిశాయి. వారికి ఎర మన దేశ భవిష్యత్’’ అని స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. -
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 17 పార్టీలు ఉమ్మడిగా పోటీ
పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఏకం కావడంలో అడుగు ముందుకు పడింది. బిహార్ రాజధాని పట్నాలో శుక్రవారం జరిగిన విపక్షాల మెగా సమావేశం కొంతమేరకు సత్ఫలితాలనిచ్చింది. పార్టీల మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి లోక్‌సభ ఎన్నికల్లో 17 పార్టీలు కలసికట్టుగా పోటీ చేయడానికి అంగీకరించాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని రచించడానికి వచ్చే నెల సిమ్లాలో మరోసారి సమావేశం కావాలని విపక్ష పార్టీలు నిర్ణయించాయి. జూలై 10 లేదా 12వ తేదీన సిమ్లాలో ఈ సమావేశం ఉండవచ్చని సమాచారం. దాదాపుగా 4 గంటల సేపు సమావేశమైన చర్చించిన ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ ఐక్యంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విపక్ష పార్టీల సమావేశానికి ఆతిథ్యమిచ్చిన బిహార్ సీఎం నితీశ్ మాట్లాడుతూ.. ‘‘సమావేశం బాగా జరిగింది. చాలా మంది నేతలు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఎన్నికల్లో కలిసి పని చెయ్యడానికి ఒక అంగీకారానికి వచ్చారు’’ అని చెప్పారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ఎన్నికల వ్యూహం, సీట్ల సర్దుబాటు వంటి అంశాలను త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు. మీడియా సమావేశానికి ఢిల్లీ సీఎం కేజ్రివాల్, తమిళనాడు సీఎం స్టాలిన్ గైర్హాజరయ్యారు. అయితే వారికి ఫ్లైట్ టైమ్ అయిపోవడంతోనే వెళ్లిపోయారని నితీశ్ సమర్థించుకున్నారు. కాంగ్రెస్ ఆప్ మధ్య ఆర్డినెన్స్ చిచ్చు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి లోక్‌సభ ఎన్నికల్ని ఎదుర్కొంటాయని బయటకి చెబుతున్నప్పటికీ సమావేశంలో కాంగ్రెస్, ఆప్ మధ్య మాటల యుద్ధం జరిగిందని తెలుస్తోంది. ఢిల్లీలో అధికారులపై నియంత్రణకు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తమకు కాంగ్రెస్ మద్దతుగా ఉంటేనే కలిసి ముందుకు నడుస్తామని పట్టుపట్టారు. దీనిపై సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మౌనం వహించడం కేజ్రీవాల్‌కు మింగుడు పడలేదు. విపక్షాల సమావేశానంతరం ఆప్ ఒక ప్రకటనలో కాంగ్రెస్‌తో తాము కలిసి ముందుకు వెళ్లడం కష్టమంటూ బాంబు పేల్చింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఆర్డినెన్స్ అంశం పార్లమెంటులో తేలాల్సిందే కాబట్టి తాము అక్కడే తమ వైఖరి చెబుతామని, ఇతర వేదికలపై ఎందుకు వెల్లడించాలని ఆయన ప్రశ్నించారు. ‘‘జూలైలో సిమ్లాలో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిస్తాం. ఆ సమావేశంలో ఉమ్మడి ఎజెండా రూపొందించాలని నిర్ణయించాం. కేంద్రంలో అధికార బీజేపీని గద్దె దించడానికి ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక రూపొందిస్తాం’’ – మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు ‘‘వచ్చే ఎన్నికల్లో జరిగేది సిద్ధాంతాల మధ్య యుద్ధం. పార్టీల మధ్య కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ కలసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. మా సిద్ధాంతాలను పరిరక్షించుకుంటూనే ఉమ్మడిగా పని చేస్తాం’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుడు ‘‘బీజేపీని గద్దె దింపడానికి పట్నాలో మొదలైన ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటుంది. మేమంతా ఒక్కటిగా ఉన్నాం. బీజేపీపై ఐక్యంగా పోరాడుతాం. ఈ నియంత ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే భవిష్యత్‌లో ఎన్నికలు ఉండవు. బీజేపీ చరిత్ర మార్చాలని అనుకుంటోంది. మేము చరిత్రను కాపాడతాం’’ – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ‘‘మా ఐక్య ఫ్రంట్‌కు ప్రజా దీవెనలు కచ్చితంగా లభిస్తాయి.’’ – శరద్ పవార్, ఎన్సీపీ అధినేత ‘‘పట్నా సమావేశం విస్పష్టమైన సందేశాన్నిచ్చింది. మేమంతా ఐక్యంగా పనిచేసి దేశాన్ని కాపాడతాం’’ – అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ‘‘మేమంతా కలసికట్టుగా పోరాడతాం. విపక్షాలన్నీ చేతులు కలపకపోతే ఓట్లు చీలిపోతాయన్న ఆందోళన అందరిలోనూ ఉంది. భజరంగ భళి మాతో ఉన్నారు’’ – లాలూప్రసాద్ యాదవ్, ఆర్జేడీ అధినేత -
'చరిత్రను రక్షిస్తాం..' ప్రతిపక్షాల భేటీ తర్వాత మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
పట్నా: ఐక్యంగా ఉన్నాం.. ఐక్యంగా పోరాడతామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. పట్నాలో ప్రతిపక్షాల భేటీ అనంతరం మాట్లాడిన మమతా బెనర్జీ.. ఈ సమావేశం నుంచే కొత్త చరిత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. చరిత్రను మారుస్తామని బీజేపీ చెబుతోంది.. కానీ దేశ చరిత్రను బిహార్ సమావేశం నుంచే కాపాడతామని మమత అన్నారు. జాత్యంహకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటమే తమ ప్రధాన ధ్యేయమని ఆమె చెప్పారు. 1974 తర్వాత ఇదే.. దేశంలో ఇందిరా గాంధీ విధానాలకు వ్యతిరేకంగా 1974లో పట్నాలో జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలో మొదటిసారి ప్రతిపక్షాల భేటీ జరిగింది. ఇన్నాళ్ల తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ అదే వేదికగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నితీష్ కుమార్ అధ్యక్షతన ప్రతిపక్షాలు సమావేశం ఏర్పరచడం గమనార్హం. ప్రజాస్వామ్యాన్ని చంపేశారు.. విధ్వంసం నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రతిపక్షాలు భేటీ అయ్యాయని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) లీడర్ ఒమర్ అబ్దుల్లా అన్నారు. అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ప్రధాని మోదీ వివరించిన ప్రజాస్వామ్యం కశ్మీర్లో ఎందుకు పనిచేయటం లేదని ప్రశ్నించారు. కశ్మీర్ నుంచి తాను, మెహబూబా ముఫ్తీ హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. జులైలో మరోసారి.. నేడు జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఎలాంటి ఏకాభిప్రాయానికి రానట్లు తెలుస్తోంది. దీంతో హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో మరోసారి భేటీ కానున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన అజెండాను చర్చిస్తామని చెప్పారు. ప్రతిపక్షాల భేటీ.. పట్నా వేదికగా బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో 15 ప్రతిపక్ష పార్టీల నాయకులు నేడు సమావేశమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి బీజేపీని ఓడించి అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంతో ఈ భేటీ జరిగింది. దేశంలో ప్రముఖ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, ఒమర్ అబ్ధుల్లా, హేమంత్ సొరేన్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: పట్నాలో ముగిసిన ప్రతిపక్షాల సమావేశం.. సిమ్లాలో మరోసారి భేటీకి నిర్ణయం.. -
ప్రతిపక్షాల భేటీపై ఓవైసీ విసుర్లు.. ఆ నాయకుల చరిత్రేంటో తెలియదా?
ప్రతిపక్షాల భేటీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఏఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్ధీన్ ఓవైసీ. ఈ సమావేశానికి హాజరైన నాయకుల చరిత్ర ఏంటో తెలుసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చిందనేది సత్యం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీని గద్దె దింపడానికి ఐక్యమత్యంగా పోరాడటం సరైన విధమే అయినప్పటికీ భేటీ జరిగిన ప్రదేశం, నేతృత్వం వహించిన నాయకుల తీరును ఆయన ఆక్షేపించారు. 'నితీష్ చరిత్ర ఎటువంటిది..?' ప్రతిపక్షాలకు నేతృత్వం వహించిన నితీష్ కుమార్ గత ఏడాది వరకూ బీజేపీతో కలిసి మహాఘట్ బంధన్‌గా ఏర్పడి ప్రభుత్వాన్ని పంచుకున్న వ్యక్తేనని ఓవైసీ గుర్తుచేశారు. అధికారం కోసం బీజేపీ నుంచి విడిపోయి.. మళ్లీ కలిసి.. మళ్లీ విడిపోయిన చరిత్ర ఆయనదని అన్నారు. గోద్రా అల్లర్లు జరిగినప్పుడు రైల్వే మంత్రిగా నితీష్ ఉన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. గుజరాత్లో మారణకాండ జరిగిన కాలంలో బీజేపీతో నితీష్ కలిసి ఉన్నారని ఓవైసీ అన్నారు. 'ఉద్ధవ్, కేజ్రీవాల్ ఎలాంటివారు..?' 'ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన లౌకిక పార్టీనా? బాబ్రీ మజీద్‌ను కూలదోయడం మేము గర్వంగా భావిస్తున్నామని అన్నది ఉద్ధవ్ ఠాక్రే కాదా? రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కి ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలపలేదా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు నేతృత్వం వహించేది ఎవరు?' అని ఓవైసీ ప్రశ్నించారు. ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండానే 540 సీట్లలో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయాల్సిన అవసరం ఉందని ఓవేసీ చెప్పారు. ప్రతిపక్షాల భేటీ.. పట్నా వేదికగా బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో 15 ప్రతిపక్ష పార్టీల నాయకులు నేడు సమావేశమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి బీజేపీని ఓడించి అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో ఈ భేటీ జరిగింది. దేశంలో ప్రముఖ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ ఒమర్ అబ్ధుల్లా, హేమంత్ సొరేన్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: పట్నాలో ముగిసిన ప్రతిపక్షాల సమావేశం.. సిమ్లాలో మరోసారి భేటీకి నిర్ణయం.. -
బీజేపీని ఓడించేందుకు విపక్షాల ఉమ్మడి వ్యూహం
-
పట్నాలో ముగిసిన ప్రతిపక్షాల సమావేశం.. సిమ్లాలో మరోసారి భేటీకి నిర్ణయం..
Updates. ♦ పట్నా సమావేశంలో ఎలాంటి ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీలు సిమాల్లో జులైలో మరోమారు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. తన నేతృత్వంలోనే ఆ మీటింగ్ జరగనున్నట్లు స్పష్టం చేశారు. #WATCH | "We will meet again in July in Shimla to prepare an agenda on how to move ahead together while working in our respective states to fight BJP in 2024," says Congress President Mallikarjun Kharge on the Opposition meeting in Patna. pic.twitter.com/cruKD6W8x8 — ANI (@ANI) June 23, 2023 ♦ దేశ పునాదులపై బీజేపీ దాడి చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడితేనే దేశాన్ని రక్షించుకోవచ్చని అన్నారు. ♦ ప్రతిపక్షాలన్నీ ఐక్యమయ్యాయని బిహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. 2024 ఎన్నికల్లో కలిసి పోరాడతామని పేర్కొన్నారు. "We have decided to fight elections together": Nitish Kumar after opposition meeting Read @ANI Story | https://t.co/QgN1xeuDE3#oppositionpartymeeting #NitishKumar #Patna #PatnaOppositionMeeting pic.twitter.com/z8wxq6LXZi — ANI Digital (@ani_digital) June 23, 2023 ♦పట్నా సమావేశంతో ప్రజా ఉద్యమం మొదలవుతుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కేంద్రంపై పోరుకు ఐక్యంగా పోరాడతామని చెప్పారు. నేటి సమావేశం చరిత్రకు పునాది వేస్తుందని చెప్పారు. #WATCH | Patna, Bihar: Bengal CM Mamata Banerjee during the joint opposition meeting said "We are united, we will fight unitedly...The history started from here, BJP wants that history should be changed. And we want history should be saved from Bihar. Our objective is to speak… pic.twitter.com/BB2qLgbApP — ANI (@ANI) June 23, 2023 ♦ బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో ఎన్నికలే ఉండవని మమతా బెనర్జీ ఆరోపించారు. మొదట ఐక్యమయ్యాం. పట్నాతో కలిసి పోరాడతామనే నిర్ణయానికి వచ్చాం. మిగిలినది సిమ్లాలో నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు. ♦ పట్నా మీటింగ్ ఫలవంతంగా ముగిసినట్లు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారందరికీ తాము ప్రతిపక్షమేనని పేర్కొన్నారు. ♦ పట్నాలో విపక్ష పార్టీల నేతల భేటీ ప్రారంభమైంది. Bihar | Opposition leaders' meeting to chalk out a joint strategy to take on BJP in next year's Lok Sabha elections, begins in Patna More than 15 opposition parties are attending the meeting. pic.twitter.com/absFUpmARO — ANI (@ANI) June 23, 2023 ♦ పాట్నా చేరుకున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ #WATCH | Jharkhand CM and Jharkhand Mukti Morcha (JMM) leader Hemant Soren reaches Bihar's Patna to attend the Opposition leaders' meeting More than 15 opposition parties are meeting today to chalk out a joint strategy to take on the BJP in the 2024 Lok Sabha polls. pic.twitter.com/KrwrM91ZBA — ANI (@ANI) June 23, 2023 ♦ విపక్షాల భేటీకి హాజరైన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా. #WATCH | Aam Aadmi Party (AAP) MP Raghav Chadha reaches Bihar's Patna to attend the Opposition leaders' meeting More than 15 opposition parties are meeting today to chalk out a joint strategy to take on the BJP in the 2024 Lok Sabha polls. pic.twitter.com/r1qWibztFR — ANI (@ANI) June 23, 2023 ♦ సీఎం నితీశ్ కుమార్ ఇంటికి చేరుకున్న సీఎం మమతా బెనర్జీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ. #WATCH | West Bengal CM Mamata Banerjee leaves from Patna Circuit House to attend the Opposition leaders' meeting More than 15 opposition parties are meeting today to chalk out a joint strategy to take on the BJP in the 2024 Lok Sabha polls. pic.twitter.com/wlrxWiQIul — ANI (@ANI) June 23, 2023 ♦ పాట్నా చేరుకున్న అఖిలేశ్ యాదవ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే. #WATCH | Former Maharashtra CM Uddhav Thackeray reaches Bihar's Patna to attend the Opposition leaders' meeting pic.twitter.com/nHzrUWxT2C — ANI (@ANI) June 23, 2023 #WATCH | Samajwadi Party (SP) president and former Uttar Pradesh CM Akhilesh Yadav reaches Bihar's Patna to attend the Opposition leaders' meeting More than 15 opposition parties are meeting today to chalk out a joint strategy to take on the BJP in the 2024 Lok Sabha polls. pic.twitter.com/l5YUS4LAOQ — ANI (@ANI) June 23, 2023 ♦ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ బీహార్‌లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. దేశంలోని పేదల కోసం కాంగ్రెస్ మాత్రమే పనిచేస్తుంది. బీజేపీ కొద్ది మందికి మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది. బీజేపీని ఓడించాలంటే ఐక్యత ఒక్కటే మార్గం. బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందని, విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేస్తోందని అన్నారు. ♦ పాట్నా చేరుకున్న సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి VIDEO | CPI(M) General Secretary Sitaram Yechury arrives at Patna airport to attend the opposition meeting later today.#OppositionMeet pic.twitter.com/wWWoCx1e7x — Press Trust of India (@PTI_News) June 23, 2023 ♦ పాట్నాలో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులతో సహా దేశాన్ని పీడిస్తున్న వివిధ ముఖ్యమైన అంశాలను చర్చిస్తాం- శరద్ పవార్ ♦ పాట్నా చేరుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ. #WATCH | Congress president Mallikarjun Kharge and party leader Rahul Gandhi arrive in Bihar's Patna for the Opposition leaders' meeting pic.twitter.com/O51rWBsKaw — ANI (@ANI) June 23, 2023 #WATCH | Congress leaders welcome party president Mallikarjun Kharge and party leader Rahul Gandhi as they arrive in Bihar's Patna to attend the Opposition leaders' meeting pic.twitter.com/vuSA3oj304 — ANI (@ANI) June 23, 2023 ♦ పాట్నాకు బయలుదేరిన యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ♦ ఇది దేశంలోని ప్రతిపక్షాల సమావేశం కాదు, దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ప్రాణ భద్రత కోసమే ఈ సమావేశం. బీజేపీని ఓడించగల ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే, దేశంలో కాంగ్రెస్ తప్ప ఎవరూ బీజేపీని ఓడించలేరు- పప్పు యాదవ్. #WATCH ये देश के विपक्ष की बैठक नहीं है, ये बैठक देश को 140 करोड़ लोगों की जिंदगी और उनके हिफाजत के लिए है। बैठक बिहार को हमेशा अपमान की दृष्टि से देखने के खिलाफ है और अच्छी शुरुआत के लिए है...कांग्रेस भाजपा को हराने वाली अकेली पार्टी है, देश में कांग्रेस से अलग रहकर कोई भाजपा को… pic.twitter.com/nZ2isZG0Ha — ANI_HindiNews (@AHindinews) June 23, 2023 పాట్నా:వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. 20 ప్రతిపక్ష పార్టీలతో పట్నాలో శుక్రవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరు వంటి అంశాల జోలికి పోకుండా ప్రజాసమస్యలపై పోరుబాట పట్టేలా వ్యూహరచన చేయనున్నట్టుగా తెలుస్తోంది. ♦ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రివాల్, స్టాలిన్, హేమంత్ సోరెన్‌లతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, మహారాష్ట మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వంటి అగ్ర నాయకులు హాజరుకానున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సమావేశానికి ఆతిథ్యం ఇస్తారు. -
మిషన్ 2024.. పట్నాలో నేడే విపక్షాల సమావేశం
పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. 20 ప్రతిపక్ష పార్టీలతో పట్నాలో శుక్రవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరు వంటి అంశాల జోలికి పోకుండా ప్రజాసమస్యలపై పోరుబాట పట్టేలా వ్యూహరచన చేయనున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రివాల్, స్టాలిన్, హేమంత్ సోరెన్‌లతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, మహారాష్ట మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వంటి అగ్ర నాయకులు హాజరుకానున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సమావేశానికి ఆతిథ్యం ఇస్తారు. ఈ సమావేశం మొట్టమొదటిది కావడంతో అత్యంత సంక్లిష్టమైన ప్రధాని అభ్యర్థి, సీట్ల సర్దుబాటు వంటి అంశాల జోలికి పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చి మోదీపై పోరుబాట పట్టే వ్యూహాలు రచించనున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారమే పట్నాకి చేరుకున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ని కలుసుకున్న ఆమె బీజేపీని తాము ఉమ్మడిగా ఒక కుటుంబంలా ఎదుర్కొంటామన్నారు. ఇలా విపక్ష పార్టీలన్నీ ఏకం కావడం శుభారంభమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటమ్ విపక్ష పార్టీల సమావేశానికి ఒక్క రోజు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల్నిపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై పోరాటంలో తమకు మద్దతుగా నిలవకపోతే విపక్ష పార్టీల సమావేశాన్ని బహిష్కరిస్తామని అల్టిమేటమ్ ఇచ్చింది. -
విపక్షాల భేటీకి ముందు.. కాంగ్రెస్‌కు ట్విస్ట్ ఇచ్చిన ఆప్
న్యూఢిల్లీ: 2014 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత కోసం మరికొద్ది గంటల్లో విపక్షాల మెగా భేటీ జరగనుంది. ఈ సమయంలో కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ భారీ షాక్ ఇచ్చింది. గురువారం పాట్నాలో నిర్వహించబోయే విపక్షాలు సమావేశంలో తాము పాల్గొనాలంటే కాంగ్రెస్ తమ షరతుకు ఒప్పుకోవాలని ఆప్ అల్టిమేటం జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీ విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ప్రభుత్వం జరుపుతున్న పోరుకు మద్దతు ఇవ్వాలని తెలిపింది. ‘వివాదాస్పద ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాకు(ఆప్) తప్పక మద్దతు తెలిపాలి. పార్లమెంటులో ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలి. అలా చేయకపోతే మేము గురువారం జరిగే విపక్షాల భేటీని బహిష్కరిస్తాం. అంతేగాక భవిష్యత్తులో జరగబోయే ఏ ప్రతిపక్షాల సమావేశానికి కూడా హాజరుకాము’ అని ఆప్ వర్గాలు తెలిపాయి. కాగా బిహార్ సీఎం నితీష్ కుమార్ చొరవతో పట్నాలో గురువారం తొలసారి భారీ స్థాయిలో విపక్షాలు ఐక్యత భేటీ జరగనుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీని ఓడించేందుకు అవలంభించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు దేశంలోని కాంగ్రెస్, జేడీయూ, టీఎంసీ, ఎన్సీపీ, ఆప్, ఎస్పీ సహా 120 జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ భీటీలో పాల్గొననున్నాయి. సీఎం నితీష్ అధికారిక నివాసంలోని ‘నెక్ సంవాద్ కక్షా’లో 11 గంటలకు ఈ సమావేజం జరగనుంది. ఇప్పటికే బిహార్ సర్కార్ ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సమయంలో ఆప్ తీసుకున్న నిర్ణయం 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి వచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. చదవండి: పురుషుడిగా మారనున్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కుమార్తె.. ఎందుకంటే! ఇక దేశ రాజధాని ఢిల్లీలోని పాలన యంత్రాంగంపై నియంత్రణ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వివాదస్పంగా మారిన విషయం తెలిసిందే. కేంద్రం చర్యను ఢిల్లీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఢిల్లీలోని ప్రభుత్వాధికారులపై అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అతిక్రమించి మరీ రాష్ట్ర హక్కులను కాలరాస్తుందని మండిపడుతోంది. దీనిని పార్లమెంట్లో చట్టం కాకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీయేతర పార్టీల నేతలను వరుసగా కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. అంతకుముందు.. శుక్రవారం జరగనున్న ప్రతిపక్షాల సమావేశంలో కేంద్ర ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేస్తుందని ఆశిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తెలిపారు. ఈ సమావేశంలో అన్ని ఇతర రాజకీయ పార్టీలు సైతం కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నిస్తాయని పేర్కొన్నారు. అయితే ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కుదిస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయంపై కాంగ్రెస్ ఇప్పటి వరకు తటస్థంగా ఉంది. కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతివ్వాలని కేజ్రీవాల్ ఎప్పుడో కాంగ్రెస్‌ను కోరారు. కానీ పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటానని మల్లికార్జున్ ఖర్గే దీనిని దాటవేశారు. -
కలిసి ఉంటే కలదు బలం
-
నితీశ్ కుమార్ వైపు దూసుకొచ్చిన బైక్.. అప్రమత్తమై పుట్‌పాత్ పైకి దూకడంతో..
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భద్రతలో భారీ వైఫల్యం చోటు చేసుకుంది. సీఎం ఎప్పటిలానే తన ఇంటి నుంచి వాకింగ్ కోసమని బైటకు వచ్చారు. అంతలో అటుగా వస్తున్న ఓ బైకర్ సీఎం సెక్యూరిటీ బలగాలను దాటుకుని నితీశ్ వైపుకు దూసుకొచ్చాడు. చూస్తుండగానే సీఎంకు అత్యంత సమీపానికి వచ్చేశాడు. దీంతో అప్రమత్తమైన నితీశ్ వెంటనే రోడ్డుపై నుంచి పుట్పాతవైపు దూకాల్సి వచ్చింది. సీఎం తన నివాసం నుంచి సర్క్యులర్ రోడ్డులోని వాకింగ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం బైకర్‌ను సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కమాండెంట్, పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నరు. ప్రస్తుతం అధికారులు దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: ‘నీట్’ని క్రాక్ చేసిన కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ.. -
ఈ నెల 23న పాట్నాలో విపక్షాల భేటీ
-
23న విపక్ష పార్టీల భేటీ.. కేసీఆర్‌కు అందని ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే కార్యాచరణ సిధ్దం చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఏర్పాటు చేసిన ప్రతిపక్ష అగ్రనేతల సమావేశం ఈ నెల 23న పాట్నాలో జరుగనుంది. ఈ నెల 12నే విపక్ష నేతల సమావేశం జరగాల్సి ఉన్నా, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ముఖ్య నేతలు అందుబాటులో లేకపోవడంతో ఈ భేటీని 23న నిర్వహించనున్నట్లు జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్ ప్రకటించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ–ఎంఎల్ జాతీయ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్యలు హాజరు కానున్నారు. కాగా ఈ భేటీకి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు జేడీయూ నేతలు ఆహ్వానం పంపలేదు. గత ఏడాది ఆగస్టులో బిహార్‌లో నితీశ్‌కుమార్‌తో భేటీ నిర్వహించిన కేసీఆర్, బీజేపీ ముక్త్ భారత్ౖMðకలిసి పోరాడతామని ప్రకటించారు. అయితే అనంతరం వివిధ కారణాలతో రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరుగలేదు. తాజా భేటీకి ఆహ్వానం పంపలేదు. ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ తీసుకునే అంశంపై చర్చించనున్నారు. హాజరవుతున్నా: శరద్ పవార్ బిహార్ సీఎం నితీశ్‌కుమార్ బుధవారం తనకు ఫోన్ చేసి ఆహ్వానించారని, విపక్షాల భేటీకి తాను హాజరవుతానని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ గురువారం తెలిపారు. పలు జాతీయ అంశాలపై కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, అది విపక్షాల బాధ్యతని పవార్ అన్నారు. -
12న పట్నాలో విపక్షాల కీలక భేటీ!
పట్నా/కోల్‌కతా: కేంద్రంలో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అగ్రనేత నితీశ్ కుమార్ తన కార్యాచరణను వేగవంతంగా చేశారు. తమతో కలిసివచ్చే పార్టీల ముఖ్యనాయకులతో రాజధాని పట్నాలో కీలక భేటీ నిర్వహించాలని ఆయన ఇప్పటికే నిర్ణయించారు. ప్రతిపక్షాల సమావేశం వచ్చే నెల 12న జరిగే అవకాశం ఉందని నితీశ్ కుమార్‌కు సన్నిహితుడైన బిహార్ మంత్రి విజయ్‌కుమార్ చౌదరి సోమవారం చెప్పారు. భేటీ తేదీ దాదాపు ఖరారైనట్లేనని అన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ హాజరవుతాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడం చాలా తేలిక అని అభిప్రాయపడ్డారు. విపక్ష కూటమి ఏర్పాటుకు నితీశ్ కుమార్ చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. హాజరుకానున్న మమతా బెనర్జీ ఈ భేటీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత హాజరయ్యే అవకాశం ఉందని టీఎంసీ నేత చెప్పారు. ప్రతిపక్ష కూటమి ఏర్పాటుతోపాటు బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఆమె సలహాలు సూచనలు ఇస్తారని వెల్లడించారు. పట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశం ఏర్పాటు చేయాలన్న సూచన తొలుత మమత నుంచి రావడం విశేషం. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నచోట తాము ఆ పార్టీకే మద్దతు ఇస్తామని మమత గతంలో అన్నారు. -
2024 ఎన్నికలే ధ్యేయం.. 18 ప్రతిపక్ష పార్టీల అతిపెద్ద సమావేశం..
సాక్షి, న్యూఢిల్లీ: 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించడానికి ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఇందుకు జూన్ 12ను ఖరారు చేశాయి. భావసారూప్యత కలిగిన 18 పార్టీలు ఈ సమావేశానికి హాజరు కానున్నాయి. అయితే.. ఇది సన్నాహక సమావేశమేనని, ప్రధాన సమావేశం తర్వాత జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు విపక్షాల ఐక్యతకు మధ్యవర్తిగా వ్యవహరించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఇటీవల ఆయన.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసిన అనంతరం ఈ సమావేశానికి సంబంధించిన తేదీ ఖరారైంది. సారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని ఆయన యోచిస్తున్నారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లను సమన్వయపరడంలో విజయం సాధించారు. ఇదీ చదవండి: పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. ఇది నిజంగా అప్రతిష్ట: రాహుల్ -
మార్కెట్లోకి పళ్ల రారాజు.. వామ్మో! కిలో హాపస్ మామిడి ధర రూ.2000?
వేసవికాలం ప్రారంభమైంది. అంటే మామిడి పండ్ల సీజన్ కూడా వచ్చేసినట్లే. మామిడి పండు రుచికి ఏ పండు సాటిరాదు. అందుకే ఇది పండ్ల రాజు అయింది. ఏటా ఒక్కసారి మాత్రమే అందుబాటులోకి వచ్చే ఈ పండ్లను ఎప్పుడు ఎప్పుడు రుచి చుద్దామా.. అని ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతం చెట్ల మీద పండే దశలో ఉన్నాయి.మరో నెల రోజులు ఆగితే ఎన్నో రకాల పండ్లు ప్రతి మార్కెట్లోనూ విరివిగా అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పటికే భారత్‌లోని పలుప్రాంతాల్లో మామిడి పండ్లు వచ్చేశాయి. ఇతర రాష్ట్రాల నుంచి బిహార్‌లోని పాట్నా మార్కెట్లోకి అడగుపెట్టాయి. సాధారణంగా మామిడి పండు వెరైటీని బట్టి వాటి ధర ఉంటుంది మనకు తెలిసినంత వరకు కేజీ వంద రూపాయలదాకా ఉంటుంది. కానీ ప్రస్తుతం తక్కువ సంఖ్యలో పండ్లు అందుబాటులో ఉండడంతో కిలో ధర రూ.350 నుంచి రూ.500 పలుకుతున్నాయి. మరి కొన్ని రకాల మామిడికాయలు రూ.150 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు. ముంబై, ఒరిస్సా, ఢిల్లీ నుంచి మామిడిపండ్లు వస్తున్నాయి.ప్రస్తుతం డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ.. త్వరలో విక్రయాలు పుంజుకుంటాయని పాట్నాలోని ఫ్రూట్ మార్కెట్లో పండ్లు అమ్మే ఓ వ్యక్తి తెలిపారు. ఒడిశాలోని మాల్డా, మహారాష్ట్రకు చెందిన ప్యారీతో సహా గులాబ్ఖాస్ మామిడి అందుబాటులో ఉన్నాయి. ఈ పండ్ల ధర కిలో రూ. 350 నుండి రూ. 500 వరకు ఉంది. అంతేగాక ఈ రకం పండు ఒక్క కాయ ధర ఏకంగా రూ.150-200 వరకు అమ్ముడవుతోంది! అల్ఫోన్సో లేదా హాపస్ అని కూడా పిలువబడే పండు మామిడి పండ్లలోనే అత్యుత్తమ రకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం ఈ మామిడి పండ్లను ఇన్కమ్ ట్యాక్స్ గోలంబర్ ప్రాంతంలో డజను రూ.1500 నుంచి రూ.2000 వరకు విక్రయిస్తున్నారు. అల్ఫోన్సో GI ట్యాగ్ కూడా అందుకుంది. ఈ పండ్లకున్న ప్రత్యేక రుచి, సువాసన, తీపి కారణంగా జనాలు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. అంతేగాక హాపస్ మామిడి పండిన తర్వాత వారం రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. ఇవి మహారాష్ట్రలోని రత్నగిరి, సింధుదుర్గ్ పరిసర ప్రాంతాల్లో పండిస్తారు. ఈ రకం పండ్లు అన్ని చోట్లా దొరకవు. కొన్ని ప్రత్యేక స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే ఇది రాబోయే 10, 20 రోజుల్లో అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. -
రైల్వే ప్లాట్‌ఫారమ్ టీవీల్లో యాడ్స్‌కు బదులుగా ..
నిర్లక్ష్యమో, కావాలని జరిగిన ఘటనో తెలియదుగానీ.. స్టేషన్లో ప్రయాణికులను బిత్తర పోయేలా చేసింది ఓ ఘటన. అడ్వర్టైజ్మెంట్ల ప్లేస్‌లో మూడు నిమిషాల పాటు అశ్లీల వీడియో ప్రదర్శితమైంది. ఈ పరిణామంతో అక్కడున్నవాళ్లంతా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం బీహార్ రాజధాని పాట్నా ప్రధాన రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ప్రయాణాలకు సిద్ధంగా ఉన్న కొందరు ఫ్లాట్‌ఫారమ్‌పై ఉన్న టీవీల్లో పో* వీడియో ప్లే కావడంతో ఇబ్బందిపడ్డారు. కొందరు ఆకతాయిలు అరుస్తూ.. ఆ వీడియోను తమ సెల్ఫోన్లతో బంధించారు. ఈలోపు కొందరు ప్రయాణికులు.. గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ), ఆర్పీఎఫ్ పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అడ్వర్టైజ్మెంట్లు ప్రసారం చేసే ఏజెన్సీకి ఫోన్ చేయడంతో.. వీడియో ఆగిపోయింది. ఇక ఈ ఘటనకు సదరు ఏజెన్సీ దత్తా కమ్యూనికేషన్స్ ఘటనకు కారణమని కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాదు ఆ ఏజెన్సీ కాంట్రాక్ట్‌ను రద్దు చేయడంతో పాటు మరెప్పుడూ కాంట్రాక్ట్ దక్కకుండా బ్లాక్‌లిస్ట్‌లోకి చేర్చారు. అంతేకాదు అదనంగా జరిమానా కూడా విధించారు. మరోవైపు రైల్వే విభాగం ఈ ఘటనపై విడిగా విచారణ చేపట్టింది. అయితే ప్రత్యేకించి ప్లాట్‌ఫాం నెంబర్ 10పైనే టీవీల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. రైల్వే అధికారులు పలు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్లో ఆ వీడియో వైరల్ అవుతోంది. వీడియో: ఇలాంటి షాపింగ్‌ను మీరు కచ్చితంగా ఊహించి ఉండరు! -
లాలూ కొడుకు ఇంట చోరీ!
పాట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ పర్యావరణ, అటవీశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నివాసంలో దొంగతనం జరిగింది. జానపద కళాకారులు తన నివాసంలో ఖరీదైన వస్తువులను దొంగిలించారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తేజ్ ప్రతాప్ యాదవ్ సన్నిహితుడు మిసాల్ సిన్హా మార్చి 10న సచివాలయ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనానికి చెందిన కళాకారులు దీపక్ కుమార్, మరో ఐదుగురు కలిసి ఈ దొంగతనం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పాట్నాలోని తన ప్రభుత్వ బంగ్లాలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనానికి చెందిన జానపద కళాకారులు ప్రదర్శన ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ నెల 9న వారు తిరిగి వెళ్లిన తర్వాత ఇంట్లో రూ. 5 లక్షల విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయని పేర్కొన్నారు. అయితే ఈ వస్తువుల గురించి సదరు కళాకారులను అడిగినప్పటికీ ఏమీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. అయితే తేజ్ ప్రతాప్ నివాసంలో బృందావనం జానపద కళాకారులు ఏయే వస్తువులు అపహరించారనేది ఇంకా తెలియాలేదని స్టేషన్ ఇంచార్జ్ భగీరథ్ ప్రసాద్ తెలిపారు. -
rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఇవాళ ఒక్కసారిగా అలజడి రేగింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం ఒకటి లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయిన రబ్రీ దేవి ఇంటికి వెళ్లింది. సోమవారం పాట్నాలోని ఆమె నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాంలో ఆమెను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తనయులు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.అయితే.. ఈ కుంభకోణానికి సంబంధించి కేవలం ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకే వెళ్లినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అంతేగానీ తనిఖీలు, సోదాలు నిర్వహించేందుకు కాదని స్పష్టత ఇచ్చాయి. మరోవైపు ముందు తీసుకున్న అపాయింట్మెంట్ ప్రకారమే అధికారులు ఇంటికి వచ్చారని రబ్రీ దేవి అనుచరులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. రాజకీయ ఉద్దేశ్యాలతో దర్యాప్తు సంస్థలను తప్పుడు దోవలో కేంద్రం ప్రతిపక్షాలపై ప్రయోగిస్తోందని ఆరోపిస్తూ.. ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. ఈ లేఖలో రబ్రీ దేవి తనయుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సైతం సంతకం చేశారు. అంతేకాదు.. దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకున్న నేతల్లో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారంటూ ఆ లేఖలో ప్రస్తావించారు. సీబీఐ ప్రకారం.. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం లాలూ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. 2004-09 మధ్య రైల్వే ఉద్యోగాలు కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా లాలూ కుటుంబం కారుచౌక ధరలను చెల్లించి భూముల్ని కొనుగోలు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి మే 2022లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు మీసా, హేమలతో పాటు మరికొందరి పేర్లను చేర్చింది. ఆపై ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది.మరోవైపు భూములు అప్పజెప్పి.. ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్న 12 మంది పేర్లను సైతం ఎఫ్ఐఆర్లో సీబీఐ చేర్చింది. అంతేకాదు గతంలో లాలూకు ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పని చేసిన భోళా యాదవ్‌ను సీబీఐ అరెస్ట్ కూడా చేసింది. ఇప్పటికే లాలూ కుటుంబాన్ని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి పొందింది సీబీఐ. ఇదిలా ఉంటే.. వారం కిందట ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం ఢిల్లీ కోర్టులో లాలూ, ఇతరులు హాజరయ్యారు కూడా. ఇక బీజేపీ దర్యాప్తు సంస్థల బూచీతో బయటపెట్టాలని యత్నిస్తోందని, లాలూ కుటుంబం అలాంటి వాటికి బెదరదని, గత 30 ఏళ్లుగా ఇలాంటి ఆరోపణలు తాము ఎదుర్కొంటున్నామని రబ్రీ దేవి తాజాగా ఓ ప్రకటన చేశారు కూడా. -
నాలుగు హైకోర్టులకు సీజేలను సిఫార్స్ చేసిన కొలీజియం
న్యూఢిల్లీ: పట్నా, హిమాచల్ ప్రదేశ్, గువాహటి, త్రిపుర హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను ఎంపికచేస్తూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు పంపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ సభ్యులుగా ఉన్నారు. కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ను పట్నా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా, జస్టిస్ సబీనాను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు సీజేగా, త్రిపుర హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌ను, జస్టిస్ సందీప్ మెహతాను గువాహటి హైకోర్టు సీజేగా ఎంపికచేయాలంటూ కొలీజియం.. కేంద్రప్రభుత్వానికి తాజాగా సిఫార్సుచేసింది. -
ప్రయాణికుడిని పాట్నాకు బదులు ఉదయ్‌పూర్ తీసుకెళ్లిన ఇండిగో..
న్యూఢిల్లీ: బిహార్ రాజధాని పాట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడ్ని రాజస్థాన్ ఉదయ్‌పూర్‌కు తీసుకెళ్లింది ఇండిగో విమానం. సిబ్బంది నిర్లక్ష్యంతో అతని వద్ద సరైన టికెట్, బోర్డింగ్ పాస్ ఉన్నప్పటికీ.. పాట్నా విమానానికి బదులు ఉదయ్‌పూర్ విమానంలో ఎక్కించారు. తీరా ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక పాట్నాలో ఉండాల్సిన తాను ఉదయ్‌పూర్‌లో ఉండటం చూసి ప్రయాణికుడు షాక్ అయ్యాడు. జనవరి 30న జరిగిన ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టనుంది. ఈ ప్రయాణికుడి పేరు అఫ్తార్ హుస్సేన్. జనవరి 30న పాట్నా వెళ్లేందుకు ఇండిగో విమానం 6E-214లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే పొరపాటున అతడ్ని 6E-319 ఇండిగో విమానంలో ఎక్కించారు సిబ్బంది. తీరా ఉదయ్‌పూర్‌లో దిగాక అతనికి అసలు విషయం తెలిసింది. ఈ విషయాన్ని ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు హుస్సేన్. వెంటనే ఆయన ఇండిగో సంస్థను అప్రమత్తం చేశారు. దీంతో సదరు సంస్థ హుస్సేన్‌ను మళ్లీ ఢిల్లీకి తీసుకెళ్లింది. ఆ మరునాడు అంటే జనవరి 31న అక్కడినుంచి పాట్నాకు తీసుకెళ్లింది. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎక్కడ జరిగిందని డీజీసీఏ దర్యాప్తు జరపనుంది. ప్రయాణికుడి బోర్డింగ్ పాసు స్కాన్ చేయకుండా విమానం ఎలా ఎక్కించారు? బోర్డింగ్‌కు ముందే రెండుసార్లు బోర్డింగ్ పాసులను స్కాన్ చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ అతను వేరే విమానంలో ఎలా ఎక్కాడు? అని విచారణ జరపనున్నారు. అనంతరం విమాన సంస్థపై చర్యలు తీసుకోనున్నారు. చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగికి షాక్! అటు ఉద్యోగం, ఇటు పెళ్లి చేసుకునే పిల్లా? ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు! -
వృద్ధుడని కనికరం లేకుండా రెచ్చిపోయిన మహిళా పోలీసులు
వృద్ధుడని కనికరం లేకుడా లాఠీలతో రెచ్చిపోయారు ఇద్దరు కానిస్టేబుళ్లు. ఈ ఘటన పాట్నాకి 200 కి.మీ దూరంలో ఉన్న కైమూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. 70 ఏళ్ల నోవల్ కిషోర్ పాండే అనే వృద్ధ టీచర్ కైమూర్ జిల్లాలోని భుభువా అనే రద్దీగా ఉండే రహదారిపై వెళ్తున్నాడు. అనుకోకుండా సైకిల్ పైనుంచి పడిపోతాడు. సరిగ్గా రోడ్డు మధ్యలో సైకిల్‌తో సహా పడిపోయాడు. ఐతే వృద్ధాప్యం కారణంగా సైకిల్ని పైకెత్తలేక ఇబ్బందిపడుతున్నాడు. దీంతో ఆ ప్రదేశంలో ఒక్కసారిగా ట్రాఫిక్ ఏర్పడింది. అంతే ఇంతలో ఇద్దరూ మహిళా కానిస్టేబుళ్లు వచ్చి ఆ వృద్ధుడిపై అరుస్తూ త్వరగా తప్పుకోమంటూ లాఠీలతో కొట్టడం ప్రారభించారు. త్వరితగతిన సైకిల్ తీయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుడిపై లాఠీలతో వీరంగం సృష్టించారు ఆ మహిళా పోలీసులు. పాపం ఆ వృద్ధుడు కొట్టొద్దని వేడుకుంటున్న కనికరం లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు. పోని ఆ సైకిల్ని పైకెత్తి, ఆ వృద్ధడిని పక్కకు తీసుకు రావడం వంటివి చేయడం మాని లాఠీలతో చితకబాదడం వంటివి చేశారు. వాస్తవానికి పండిట్ 40 ఏళ్లుగా టీచర్‌గా పనిచేస్తున్నాడని, పిల్లలకు పాఠాలు బోధించేందుకు అతను ప్రతి రోజు ఇదే ప్రాంతం గుండా వెళ్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఆ వృద్ధుడు ఆ రోజు ప్రైవేటు స్కూల్లోని పిల్లలకు పాఠాలు చెప్పి తిరిగి ఇంటికి పయనమవుతుండగా ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. దీంతో సదరు కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకున్నట్లు బిహార్ పోలీసులు ట్విట్టర్లో తెలిపారు. (చదవండి: కుక్కను 'కుక్క' అన్నందుకు గొడవ.. చివరికి మనిషి ప్రాణం తీసింది) -
నితీష్ రాముడిగా, మోదీ రావణుడిలా.. కలకలం రేపుతున్న పోస్టర్లు
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాబోయే 2024 ఎన్నికల్లో ఆయన గెలుస్తారని చెప్పేలా ఏర్పాటు చేసిన పోస్టర్లు తీవ్ర కలకలం రేపాయి. పైగా ఆపోస్టర్లు రబ్రీ దేవి నివాసం వద్ద, ఆర్జేడి కార్యాలయం వెలుపల ఏర్పాటు మరింత వివాదానికి దారితీసింది. ఈ మేరకు ఆ పోస్టర్లలో మహాభారత, రామాయణలలో ప్రధానాంశాలతో తమ నాయకుడు నితీష్ కుమార్ ఎలా బీజేపీని ఓడిస్తాడో చూపిస్తున్నట్లుగా తెలియజేసేలా ఏర్పాటు చేశారు. తమ మహాఘట్బంధన్ నాయకుడు నితీష్ కుమార్‌ని కృష్ణుడు, రాముడిలా చూపిస్తూ..ప్రధాని నరేంద్ర మోదీని కంసుడు, రావణుడిలా చూపిస్తూ పోస్టర్లు పెట్టారు. అంతేగాదు రావణుడిని రాముడు ఎలా ఓడించాడో, అలాగే కంసుడిని కృష్ణుడు ఎలా చిత్తుచేశాడో అలా మా నాయకుడు నితీష్ కుమార్ బీజేపీని గద్దే దింపుతాడని అని అర్ధం వచ్చేలా ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్లపై ఛప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనమ్ రాయ్ చిత్రంతో పాటు మహాగత్బంధన్ జిందాబాద్ నినాదాలు కూడా ఉన్నాయి. అయితే బీజేపీ ప్రతినిధి నవల్ కిషోర్ యాదవ్ మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వంటి ప్రతిపక్ష నాయకులందరూ నితీష్ కుమార్‌లతో కలిసి ఏకమై వచ్చినా... ప్రధాని మోదీని ఓడించలేరు. ఆయన 2034 వరకు ప్రధానిగా అధికారంలోనే ఉంటారని ధీమాగా చెప్పారు. ఈ పోస్టర్ల విషయమై స్పందించిన ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ..ఆ పోస్టర్లు ఎవరూ ఏర్పాటు చేశారో మాకు తెలియదు. మా కార్యాలయానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయినా బీజేపీని గద్దే దింపేందుకు ప్రతిపక్షాలన్ని ఏకమవుతాయని, ఆయన ఐక్య ప్రతిపక్షానికి ముఖంగా ఉంటారు. రైతులు, యువతకు వ్యతిరేకంగా ఉండే పార్టీతో మా నాయకుడు పోరాడుతారు. ప్రతి బిహారీ నితీష్ గెలవాలని కోరుకుంటాడు అని నమ్మకంగా చెప్పారు. బిహార్ విద్యా శాఖ మంత్రి రామ్‌చరిత మానస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి ఇబ్బందులో పడ్డ కొద్దిరోజుల్లో ఈ పోస్టర్ల ఘటన తెరపైకి రావడం గమనార్హం. (చదవండి: ఆ పాటతో రాత్రికి రాత్రే స్టార్ సింగర్‌గా మారిన ఖైదీ! వెల్లువలా ఆఫర్లు) -
షాకింగ్ ఘటన: విమానం గాల్లో ఉండగానే కుప్పకూలిన మహిళ ఆ తర్వాత...
మనం రైళ్లలోనూ, బస్సుల్లోనూ వెళ్లినప్పుడూ ఎవరైనా అనారోగ్యంతోనో లేక అనుకోకుండా అపస్మారక స్థతిలోకి వెళ్లితే... బస్సు అయితే గనుక సమీపంలోని ఆస్పత్రి వద్ద ఆపడం చేస్తారు. అదే రైలు అయితే వెంటనే సమీపంలోనే రైల్వే ఆస్పత్రికి ఇన్ఫాం చేసి అంబులెన్స్‌లో తీసుకువెళ్తారు. మరీ విమానంలో అదీ కూడా గాల్లో ఎగురుతూ ఉండగా అంటే ఊహించడానికే భయంగా అనిపిస్తుంది. అచ్చం అలాంటి ఘటనే ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. న్యూఢిల్లీ నుంచి పాట్నా బయలు దేరుతున్న ఇండిగో విమానంలో 59 ఏళ్ల సుమన్ అగర్వాల్ అనే మహిళ అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో తన సీటులోనే కుప్పకూలిపోయింది. దీంతో విమానాన్ని వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేయాలని పైలెట్లు నిర్ణయించుకున్నారు. కానీ ముందు ఆమెకు ప్రాథమిక చికిత్స అందిచాల్సి ఉంటుంది. దీంతో పైలెట్లు వెంటనే పాట్నా ఎయిర్ కంట్రోల్‌కి కూడా సమాచారం అందించారు. ఇంతలో నలుగురు వైద్యులు, నర్సులు సదరు మహిళను రక్షించడానికి హుటాహుటినా ఆమె వద్దకు వచ్చారు. ఆమె రక్తపోటు రికార్డు కాకపోవడం, పల్స్ కూడా కనిపించపోవడంతో ఒకింత టెన్షన్ పడ్డారు వైద్యులు. ముందుగా పేషెంట్‌కి ఆక్సిజన్ అందించారు. తదనంతరం కాన్యూలా అనే పరికరాన్ని నోటి గుండా ఆహార గొట్టంలోకి పెట్టారు. ఇది ఆస్పత్రిలోనే సాధ్యం కానీ విమానంలో ఈ పరికరాన్ని పెట్టడం అత్యంత సవాలుతో కూడిన పని అయినప్పటికీ ఆ పరికరాన్ని ఆమె శ్వాసనాళ్వ వద్దకు పెట్టి దానిగుండా డెక్సోనా, డెరిఫిలిన్ల వంటి మందులను వేయడమే గాక తక్షణమే శక్తి వచ్చే గ్లూకోజ్ వాటర్‌ను కూడా ఇచ్చారు. దీంతో ఆమె స్ప్రుహలోకి వచ్చింది. ఆ తర్వాత విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ నిమిత్తం దాదాపు 7.45కు పాట్నా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సిన విమానాన్ని సుమారు 25 నిమిషాల ముందు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. తదనంతరం ఆమెను అంబులెన్స్‌లో పరాస్ హెచ్ఎంఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళ భర్త ప్రమోద్ అగర్వాల్ ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. (చదవండి: ఈ రెస్టారెంట్ బిల్ చూస్తే....వాట్? అని నోరెళ్లబెడతారు!) -
పట్నా హైకోర్టుకు జస్టిస్ అభిషేక్‌రెడ్డి బదిలీ
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిని పట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సిఫార్సుపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. జస్టిస్ అభిషేక్‌రెడ్డి 2019, ఆగస్టు 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ అభిషేక్‌రెడ్డి బదిలీని ఆపాల్సిందే: హెచ్‌సీఏఏ జస్టిస్ అభిషేక్‌రెడ్డి బదిలీ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్(హెచ్‌సీఏఏ) ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. బదిలీ ప్రతిపాదనను విరమించుకునే వరకు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. విధి నిర్వహణలో నిజాయితీగా .. నిక్కచ్చిగా వ్యవహరించే జస్టిస్ అభిషేక్‌రెడ్డిని పట్నా కోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేయడాన్ని తప్పుబడుతూ న్యాయవాదులు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏఏ అధ్యక్షుడు వి.రఘునాథ్ మాట్లాడుతూ.. కొలీజియం నిర్ణయం అన్యామని, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉందన్నారు. ఏ మార్గదర్శకాలతో జస్టిస్ అభిషేక్‌రెడ్డి బదిలీ చేయనున్నారో పేర్కొనకపోవడాన్ని కూడా తప్పుబట్టారు. సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అప్పటివరకు న్యాయవాదులంతా విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఒక్క హైకోర్టులోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లలోని న్యాయవాదులంతా విధులు బహిష్కరించి నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు కొలీజియం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు వెనుకడుగు వేయొద్దన్నారు. అంతకు ముందు బదిలీని ఆపాలంటూ హెచ్సీఏఏలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం హైకోర్టు ఎదురుగా రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. ‘అక్రమ బదిలీలకు వ్యతిరేకంగా పోరాడుతాం.. వియ్ వాంట్ జస్టిస్’.. అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏఏ కార్యదర్శి గడిపల్లి మల్లారెడ్డి, న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, రాపోలు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
పొలిటికల్ ట్విస్ట్.. పీకేతో నితీశ్ కుమార్ భేటీ
పాట్నా: బీహార్ రాజకీయాలను వేదికగా చేసుకుని.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌లు గత కొన్నివారాలుగా మాటల తుటాలు పేల్చుకుంటున్నారు. ముఖ్యంగా పీకే.. నితీశ్ ప్రభుత్వాన్ని, పాలనను టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో.. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత వీళ్లద్దరు భేటీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో కలత చెందలేదు..’ భేటీ అనంతరం బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా వీళ్లు మళ్లీ చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయని అక్కడి మీడియా విశ్లేషిస్తోంది. అయితే భేటీ సాధారణమైందేనని, ఎలాంటి రాజకీయాల ప్రస్తావన లేదని బయటకు వచ్చాక నితీశ్ కుమార్ వ్యాఖ్యానించడం కొసమెరుపు. మేము ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. అందుకే కలుసుకున్నాము. ప్రత్యేకంగా ఏమీ మాట్లాడుకోలేదు. కేవలం సాధారణ విషయాలు.. మనం ఇది చేయాలి, అలా చేయాలి అని చర్చించాం. అయినా మేం కలవడం వల్ల నష్టం ఏమిటి?.. ఇంకేమైనా ఉంటే ఆయన్నే అడగండి అంటూ మీడియాకు వివరణ ఇచ్చారు నితీశ్. పనిలో పనిగా ఓ ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో కలత చెందలేదు అని సమాధానం ఇచ్చారు. జేడీయూ మాజీ నేత పవన్ వర్మ నితీశ్-పీకే భేటీని ఏర్పాటు చేయడం గమనార్హం. బుధవారం సాయంత్ర పాట్నాలో దాదాపు 45 నిమిషాలపాటు వీళ్లిద్దరి భేటీ జరిగింది. పవన్ వర్మ రెండేళ్ల కిందట జేడీయూకు గుడ్‌బై చెప్పారు. తాజా పరిణామంతో ఆయన మళ్లీ చేరతారా? లేదంటే పీకే వెంట ఉంటారా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక పీకేతోనూ రెండేళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు నితీశ్. ఈ క్రమంలో జన్ సురాజ్ పేరిట ఓ విభాగం ప్రారంభించిన పీకే.. బీహార్‌లో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు కూడా. ఇదీ చదవండి: పళనిస్వామికి బిగ్ షాక్ -
బూట్లు ఉతికే లాండ్రి.. కొత్త తరహా ఉపాధి
జీవితంలో ఎన్నో అనుకుంటాం. కానీ అనుకున్నవన్నీ జరగవు. కొంతమంది అనుకున్నవి జరగకపోయినా... ఇప్పటికి ఇదే ప్రాప్తం అనుకుని ఉన్నదానితో సంతృప్తి చెందుతుంటారు. మరికొందరు మాత్రం తాము చేసే పనిలో సంతృప్తి దొరకక నిత్యం మధనపడుతుంటారు. ఇలా మధనపడుతూనే తనకు నచ్చిన పనిని ఎంచుకుని షూ లాండ్రీ యజమానిగా మారి ఎంతో సంతృప్తిగా జీవిస్తోంది షాజియా కైజర్. బీహార్‌లోని భాగల్పూర్కు చెందిన షాజియా ఓ ప్రభుత్వ ఉద్యోగి కూతురు. ఇంటర్మీడియట్ అయిన వెంటనే పెళ్లి చేశారు. షాజియాకేమో పై చదువులు చదవాలని ఆశ. తన కెరీర్‌ను ఉన్నతంగా మలుచుకోవాలన్న కోరిక. ఈ క్రమంలోనే భర్త అనుమతితో ఫిజియో థెరపీలో డిగ్రీ పూర్తి చేసింది. అయితే ఫిజియోథెరపిస్టుగా పనిచేయకుండా రెండేళ్లపాటు టీచర్ ఉద్యోగం చేసింది. తనకు చాలా ఆనందంగా అనిపించింది. కానీ మనసులో ఇంకా ఏదో చేయాలన్న తపన. అదికూడా పెద్దగా చేయాలి. దీంతో టీచర్ ఉద్యోగం మానేసే యూనిసెఫ్‌లో చేరింది. ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ స్వేచ్ఛగా పనిచేసే వెసులుబాటు కనిపించకపోవడంతో ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంది. బూట్లు ఉతికే లాండ్రి ఓ రోజు మ్యాగజీన్ చదువుతోన్న షాజియాకు బూట్లు శుభ్రం చేసే లాండ్రి సర్వీస్ గురించి తెలిసింది. బూట్ల లాండ్రీ పెడితే బావుంటుందన్న ఆలోచనతో షూస్‌ని ఎలా శుభ్రం చేస్తారో తెలుసుకోవడం ప్రారంభించింది. లెదర్‌తో తయారు చేసే షూలను వివిధ రకాల రసాయనాలు ఉపయోగించి క్లీన్ చేస్తారని తెలిసింది. షూ క్లీనింగ్ గురించి మరింతగా తెలుసుకునేందుకు చెన్నైలోని ‘సెంట్రల్ ఫుట్‌వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’లో చేరి పాదరక్షలను తయారు చేసే టెక్నాలజీ, డిజైనింగ్ గురించి పూర్తిగా స్టడీ చేసింది. ఆ తరువాత నోయిడాలోని ‘ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో చేరి లెదర్‌తో తయారు చేసే చెప్పులు, బూట్లు, వివిధ రకాల బ్యాగ్‌ల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. పట్నాలో 2014లో బూట్లు శుభ్రం చేసే ‘రివైవల్ షూ లాండ్రి’ పేరుతో ఇద్దరు పనివాళ్లతో కలిసి ఒక చిన్నపాటి షాపును ప్రారంభించింది. అయితే షూ లాండ్రీ అంటే ఏమిటో తెలియక వీరి షాపుకు చాలామంది చినిగిపోయిన బూట్లు తెచ్చి ఇచ్చేవారు. వారిని ఏమాత్రం విసుక్కోకుండా వాటిని చక్కగా కుట్టి శుభ్రంగా కడిగి కొత్తవాటిలా మార్చి తిరిగి ఇవ్వడంతో లాండ్రీకి వచ్చే కస్టమర్ల సంఖ్య పెరిగింది. దాంతో చూస్తుండగానే ఈ బిజినెస్ పెరిగిపోయింది. వీరి లాండ్రీకి కస్టమర్ల నుంచి ఆదరణ లభించడంతో బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ 2016లో షాజియా షూ లాండ్రిని ‘బెస్ట్స్టార్టప్’ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు లక్షల టర్నోవర్‌తో లాండ్రీ నడుస్తోంది. సీఎం నితీష్‌కుమార్, ఇంకా సీనియర్ ఉన్నతాధికారులు సైతం షాజియా లాండ్రిలో బూట్లు సర్వీసింగ్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం పాట్న వ్యాప్తంగా ఐదు అవుట్లెట్లతో ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తోంది షాజియా లాండ్రీ. అంతేగాక షాజియా దగ్గర షూ క్లీనింగ్‌లో శిక్షణ తీసుకున్న కొంతమంది ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఢిల్లీ, ఒడిషాలలో షూ లాండ్రీలను నడుపుతున్నారు. రంగు వెలిసినా... షాజియా లాండ్రీలో రంగువెలిసిన బూట్లకు కొత్త రంగు వేయడం, ట్రాలీబ్యాగ్స్, బ్యాక్‌ప్యాక్స్, లెదర్, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లను రిపేర్ చేయడంతోపాటు షూస్‌ను ఆవిరి మెషిన్ మీద శుభ్రం చేసి ఇస్తుంది. -
కచ్చితంగా ఆ రోజు కూడా వస్తుంది: బిహార్ సీఎం
న్యూఢిల్లీ: స్వాతంత్రోద్యమాన్ని తిరగరాయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) బయలుదేరిందంటూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శల దాడి చేశారు. స్వాతంత్య్ర వేడుకల పేరుతో బీజేపీ-ఆర్ఎస్ఎస్లు ముసుగు వేసుకున్నాయని దుయ్యబట్టారు. పాట్నాలోని జనతాదళ్ యునైటెడ్ నేషనల్ సమావేశంలో నితీష్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్, బీజేపీల పాత్ర లేదని, ఇప్పుడు దాన్ని కూడా తిరగరాస్తారని ఎద్దేవా చేశారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకుల గురించి ప్రస్తావిస్తూ ....స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకుడు ఎవరు? అని ప్రశ్నించారు. జాతిపిత బాపూజీ సారథ్యంలో జరిగిన స్వాతంత్య్ర ఉద్యమానికి కొత్త అర్థాలను తెచ్చిపెట్టారంటూ బీజేపీపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆ ఉత్సవాలను బాపు మహోత్సవ్‌గా ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. అసలు బాపూజీ హత్య ఎందుకు జరిగిందో అందరికీ తెలుసన్నారు. కేవలం గాంధీజీ హిందువులను ముస్లీంలను ఏకం చేస్తున్నందుకే అనే విషయాన్ని గ్రహించండి అన్నారు. అవసరమనుకుంటే బీజేపీ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను తుడిచి పెట్టి మరీ కొత్త విషయాలు రాసేవారంటూ ఎద్దేవా చేశారు. జాతి పిత గాంధీని సైతం పక్కన పెట్టే రోజు వస్తుందని తెలుసుకోండి అని చెప్పారు. గాంధీజీని హత్య చేసినవాడి కోసం ఏం చేస్తున్నారో కూడా గమనించండి అని పిలుపునిచ్చారు. తాను బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అలాంటి విషయాల్లో దూరంగా ఉన్నానని కుమార్ స్పష్టం చేశారు. తాను ఆ సమయంలో వారితో పనిచేస్తున్నాను కాబట్టే ఏం మాట్లడలేదని, పైగా ఇలాంటి అర్థం పర్థం లేని వాటికి ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు జూన్‌లో కేంద్ర హోంమంత్రి ముఖ్యమంత్రుల సమావేశానికి పిలిచినప్పుడూ తాను దానిని దాటవేసి, అప్పటి డిప్యూటీ మంత్రి తార కిషోర్ ప్రసాద్‌ని పంపించినట్లు తెలిపారు. నితీష్ గత నెలలో ఆర్జేడియూతో జతకట్టి సంకీర్ణ ప్రుభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తదనంతరం నితీష్ పెద్ద ఎత్తున్న బీజేపీ పై విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఆయన 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని సృష్టించే లక్ష్యంతో వివిధ నేతలను కలుసుకున్నారు కూడా. ఇప్పటికే నితీష్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తోపాటు వామపక్ష నేతలను కలిశారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శరద్ పవార్ తదితరులను కూడా నితీష్ కలవనున్నారు. (చదవండి: ప్రధాని పదవిపై వ్యామోహం లేదు.. తేల్చేసిన నితీశ్ కుమార్) -
గోదావరి నుంచి గంగకు రావడం ఆనందంగా ఉంది: సీఎం కేసీఆర్
సాక్షి, పాట్నా: వెనుకబడిన రాష్ట్రాలకు సాయం చేయకపోతే దేశం అభివృద్ధి చెందదని, బీహార్ లాంటి రాష్ట్రానికి సాయం చేయాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. బుధవారం బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన చెక్ పంపిణీల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘దేశంలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ. అక్కడి గోదావరి తీరం నుంచి గంగా నది తీరానికి రావడం ఆనందంగా ఉంది. బీహార్ నుంచి లక్షల మంది కూలీలు తెలంగాణకు వలస వస్తుంటారు. కానీ, కరోనా సమయంలో వలస కార్మికుల్ని కేంద్రం ఇబ్బంది పెట్టింది. మేం మాత్రం కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశాం. అలాగే దేశం సురక్షితంగా ఉందంటే అందుకు సైనికులే కారణం. అందుకే అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం.’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అనంతరం బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. అమరుల కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచన గొప్పదని, అందుకు కేసీఆర్‌కు అభినందనలని పేర్కొన్నారు. కరోనా సమయంలో కార్మికుల కోసం తెలంగాణ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిందని సీఎం నితీశ్ గుర్తు చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదీ చదవండి: ‘ఆప్ ఎమ్మెల్యేలతో బేరమాడింది ఎవరు?’ -
వెనుకబడిన రాష్ట్రాలకు సాయం చేయకపోతే దేశం అభివృద్ధి చెందదు: సీఎం కేసీఆర్
-
CM KCR: లాలూను కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన అప్డేట్స్ ► బీహార్ పర్యటనలో భాగంగా.. ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ను పరామర్శించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. CM #KCR meets Former CM #laluprasadyadav @yadavtejashwi also present in the meeting pic.twitter.com/karFMn7igX — Sarita Avula (@SaritaTNews) August 31, 2022 ► తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్‌తోనే సాధ్యమైందన్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీ విమర్శలు పట్టించుకోకుండా ముందుకు సాగాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సూచించారు. ► బీజేపీ వ్యతిరేక పోరాటంలో.. మాతో కలిసి వచ్చేవాళ్లతో ముందుకు వెళ్తాం. కలిసి రానివాళ్లను పక్కన పెడతాం: తెలంగాణ సీఎం కేసీఆర్ ► దేశంలో గుణాత్మక మార్పు అవసరం అన్న సీఎం కేసీఆర్.. బీజేపీ ముక్త్ భారత్‌తోనే అది సాధ్యమని, ఇప్పటికే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, అయితే ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై తొందర అవసరం లేదని ఆయన అన్నారు. ► శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశాలు. సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు రాష్ట్రాల్లోకి జొరబడడం ఏంటని సీఎం కేసీఆర్.. దర్యాప్తు సంస్థల తీరును ఉద్దేశించి విమర్శించారు. ► ఇచ్చిన ఏ హామీ నెరవర్చలేదని ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ► బీజేపీ హయాంలో గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని దేశం ఎదుర్కొంటోంది. అన్ని రంగాలు ఇబ్బంది పడుతున్నాయ్. అప్పులు పెరిగిపోవడంతో పాటు రూపాయి విలువ పడిపోయింది. ► ఈ ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్ దేశానికి చేసింది ఏం లేదని.. పైగా వినాశక పరిస్థితులు సృష్టించిందని మండిపడ్డారు కేసీఆర్. ► బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో భేటీ అనంతరం.. జాతీయ మీడియాతో మాట్లాడారు తెలంగాణ సీఎం కేసీఆర్. ► బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో భేటీ కానున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జాతీయ రాజకీయాలపై ప్రధానంగా చర్చించే అవకాశం. ► పాట్నాలో ముగిసిన చెక్ పంపిణీల కార్యక్రమం ► కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో బీహార్‌కు తెలంగాణ మేలు చేసింది. ఇప్పుడు అమరుల కుటుంబాలకు అండగా నిలవాలన్న సీఎం కేసీఆర్ ప్రయత్నానికి అభినందనలు: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ► బీహార్ అమర వీరులకు, కార్మికుల కుటుంబాలకు చేయూత ఇచ్చే ఈ చెక్ పంపిణీ కార్యక్రమం.. తెలంగాణ- బీహార్ మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. అన్ని రాష్ట్రాలు ఇలా కలిసి కట్టుగా ముందుకెళ్తే.. దేశం పురోగతి సాధించడం ఖాయం.. : డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ Bihar | Today's program by CM Nitish Kumar & Telangana CM KCR is in view of honouring the soldiers who lost their lives in Galwan Valley & the people who died in a recent accident in Hyderabad... if all states cooperate like this, the country will succeed: Dy CM Tejashwi Yadav pic.twitter.com/9achheQfk9 — ANI (@ANI) August 31, 2022 ► కేంద్రం కరోనా టైంలో వలస కూలీలను, కార్మికులను ఇబ్బంది పెట్టింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రత్యేక రైళ్ల ద్వారా వాళ్లను స్వస్థలానికి తరలించింది: సీఎం కేసీఆర్ ► గాల్వాన్ వీరుల త్యాగం మరువలేనిదని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్, పాట్నాలో ఇవాళ అమర వీరుల కుటుంబాలతో పాటు సికింద్రాబాద్ ప్రమాద బాధితుల కుటుంబాలకు చెక్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. వెనుకబడిన రాష్ట్రాలకు సాయం చేయకపోతే దేశం అభివృద్ధి చెందదు. బీహార్ లాంటి రాష్ట్రానికి సాయం చేయాల్సిందే. దేశం సురక్షితంగా ఉందంటే అందుకు సైనికులే కారణం. అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ► బాధిత కుటుంబాలకు చెక్‌లను పంపిణీ చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ సీఎం నితీశ్ కుమార్.. కార్యక్రమంలో పాల్గొన్న బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు ► చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో పాటు హాజరైన డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. ► తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సాదర స్వాగతం పలికిన బీహార్ సీఎం నితీశ్ కుమార్. Telangana CM K Chandrashekar Rao meets Bihar CM Nitish Kumar at Patna airport. pic.twitter.com/LrD550wWP3 — ANI (@ANI) August 31, 2022 ► పాట్నాలో గాల్వాన్ అమర జవాన్లతో పాటు హైదరాబాద్‌లో మరణించిన వలస కూలీల కుటంబాలకు చెక్కు పంపిణీ కార్యక్రమం వేదిక వద్దకు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. Telangana CM K Chandrashekar Rao met CM Nitish Kumar and Deputy CM Tejashwi Yadav in Patna today. pic.twitter.com/lfw8DhBGnS — ANI (@ANI) August 31, 2022 పాట్నా/హైదరాబాద్: బీహార్ పర్యటనలో భాగంగా.. బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాట్నాకు చేరుకున్నారు. బీహారీలకు చెక్ పంపిణీల కోసం ఆయన ఇవాళ అక్కడికి వెళ్తున్నారన్నది తెలిసిందే. గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన భారత సైనికులు ఐదుగురు బీహార్‌కు చెందడం, జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. అమరులైన ఒక్కో సైనిక కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించనున్నారు. అలాగే.. సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్నిప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందజేయనున్నారు. మరణించిన ఒక్కో వలస కార్మిక కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును సీఎం కేసీఆర్ అందజేస్తారు. చెక్‌ల పంపిణీ అనంతరం.. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో లంచ్ కార్యక్రమం.. ఆపై జాతీయ రాజకీయాలపై ఇరువురు చర్చించనున్నారు. వీళ్ల భేటీ నేపథ్యంలో జాతీయ మీడియా ఫోకస్ ఇప్పుడు పాట్నా వద్దే ఉంది. #WATCH | Telangana CM K Chandrashekar Rao arrives in Patna, Bihar. pic.twitter.com/VMcgI9iGoE — ANI (@ANI) August 31, 2022 ఇదీ చదవండి: ఆ ముగ్గురు మినహా మంత్రులంతా జీరోలే! -
ఆ రోజు నాలుగు మంత్రి పదవులడిగా.. బీజేపీ ఇవ్వలేదు: నితీశ్
పట్నా: 2019లో కేంద్ర కేబినెట్లో తమ పార్టీకి నాలుగు బెర్తులు కేటాయించాలన్న తమ డిమాండ్‌ను బీజేపీ పట్టించుకోలేదని బిహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. అందుకే, తాము కేబినెట్లో చేరకూడదని నిర్ణయించుకున్నామని చెప్పారు. ‘మాకు 16 మంది ఎంపీలున్నారు. అందుకే కేబినెట్లో కనీసం నాలుగు మంత్రి పదవులు కావాలని అడిగా. బీజేపీ ఇవ్వలేదు. అదే బిహార్‌లోని ఐదుగురు బీజేపీ ఎంపీలను మంత్రులుగా తీసుకున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో చెడు సంకేతాలు ఇచ్చినట్లయింది. అందుకే, కేబినెట్లో చేరరాదని నిర్ణయించుకున్నాం’అని వివరించారు. గత ఏడాది తన మాజీ సన్నిహితుడు ఆర్సీపీ సింగ్‌ను తనకు చెప్పకుండానే కేబినెట్లో చేర్చుకున్నారని స్పష్టం చేశారు. అందుకే ఆరు నెలలకే రాజీనామా చేయించినట్లు వెల్లడించారు. చదవండి: (సంక్షోభాలు, విలయాలతో.. అంటురోగాలు) -
2024 సార్వత్రిక ఎన్నికలు.. ప్రధాని అభ్యర్థిపై అమిత్ షా కీలక ప్రకటన
పట్నా: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ఎవరుంటారని చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీనే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు బీజేపీ-జేడీయూ పొత్తు కొసాగుతుందని అమిత్ షా పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని వివరించారు. బిహార్ రాజధాని పట్నాలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ మోర్చాల ఉమ్మడి జాతీయ కార్యవర్గ సమావేశాలకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివారం ముగింపు కార్యక్రమంలో ప్రసంగించి ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీ రిటైర్ అవుతారని, ఆయన స్థానంలో బీజేపీ కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొస్తుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు రెండేళ్ల ముందే అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. మోదీనే తమ అభ్యర్థి అని కార్యకర్తలకు స్పష్టం చేశారు. కశ్మీరీలు తయారు చేసిన త్రివర్ణ పతాకాలను ఈ కార్యక్రమంలో అందరికీ పంచారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీరీల ఆలోచనలు మారాయని తెలిపిందుకే వారు తయారు చేసిన జెండాలు పంపిణీ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని దేశం నలుమూలలా జాతీయ జెండాలను ఎగురవేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఆగస్టు 13-15వరకు మూడు రోజులపాటు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని సూచించారు. చదవండి: బీజేపీ చర్య సిగ్గుచేటు.. -
JP Nadda: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం
JP Nadda.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురైంది. పర్యటనలో భాగంగా జేపీ నడ్డా వాపస్ జావో(వెనక్కి వెళ్లండి) అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జేపీ నడ్డా శనివారం బీహార్ పర్యటనకు వచ్చారు. రెండు రోజులపాటు జరుగనున్న బీజేపీకి చెందిన ఫ్రంట్ల సదస్సుల్లో పాల్గొనేందుకు జేపీ నడ్డా పాట్నాకు విచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) కార్యకర్తలు సదస్సు జరుగుతున్న భవనం వద్దకు వచ్చి నిరసనలు తెలిపారు. नड्डा जी, ये बिहार की धरती है यहां अपना अधिकार मांगने से नहीं मिलता तो छीन कर लेना जानता है बिहार के जागरूक युवा हैं! पटना विश्वविद्यालय को केंद्रीय विश्वविद्यालय बनाने की मांग को लेकर पटना कॉलेज के छात्रों ने @JPNadda को काला झंडा दिखाया@RJD_BiharState @yadavtejashwi#goback pic.twitter.com/I8WImDysJq — Govind Yadav (@GovindYadavRJD) July 30, 2022 ఈ క్రమంలో జేపీ నడ్డాను అడ్డుకుని.. జేపీ నడ్డా వాపస్ జావో(వెనక్కి వెళ్లండి) అంటూ నినాదాలు చేశారు. జాతీయ విద్యా విధానం-2020ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాట్నా యూనివర్శిటీకి కూడా కేంద్ర హోదా కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. దీంతో, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిరసనకారులను చెదరగొట్టారు. అనంతరం, జేపీ నడ్డా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, అంతకు ముందు జేపీ నడ్డా పాట్నాలో రోడ్ షో నిర్వహించారు. ఇక, జేడీయూ నేత నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. #Bihar: BJP chief faces students' protest in Patna, demand rollback of NEP of 2020#bjp #patna #nep #jpnadda #inflation #unemplyment #students #india #viral #protest #bjp4india #jpnaddagoback #patnauniversity pic.twitter.com/QVAmBFwaUE — Free Press Journal (@fpjindia) July 30, 2022 ఇది కూడా చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. సాయం రూ. 3వేలకు పెంపు -
జాబ్ ఫర్ ల్యాండ్ కేసు.. లాలూ సన్నిహితుడి అరెస్టు
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యేక అధికారిగా పనిచేసిన భోళా యాదవ్‌ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. జాబ్ ఫర్ ల్యాండ్ కుంభకోణం కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకుంది. ఈ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా పట్నా, దర్భంగాలోని మొత్తం నాలుగు ప్రదేశాల్లో సీబీఐ ముమ్ముర తనిఖీలు నిర్వహించింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు(2004-09) రైల్వే శాఖలో ఉద్యోగాలు పొందిన కొందరు లాలూకు, ఆయన కుటుంబసభ్యులకు భూమిని తక్కువ ధరకే విక్రయించడం లేదా గిఫ్ట్‌గా ఇచ్చారని ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ ఈ ఏడాది మేలో కొత్త కేసు నమోదు చేసింది. లాలూ, ఆయన సతీమణి రబ్రీ దేవి, కుమార్తెలు మిషా భారతి, హేమా యాదవ్‌లతో పాటు 12మందిపై అభియోగాలు మోపింది. ఈ కేసుకు సంబంధించి లాలూ నివాసం సహా బిహార్, ఢిల్లీలో మొత్తం 17 చోట్ల సీబీఐ తనిఖీలు నిర్వహించింది. 2021 నుంచి దీనిపై దర్యాప్తు చేస్తోంది. అయితే కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే లాలూపై దాడులు చేస్తున్నారని ఆర్జేడీ విమర్శిస్తోంది. ఒకప్పుడు రైల్వే శాఖకు వేల కోట్లు లాభాలు తెచ్చిపెట్టి దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న లాలూను.. ఇప్పుడు దేశాన్ని అమ్మేస్తున్న ఓ గ్రూప్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని లాలూ కుమార్తె రోహిణి యావద్ తీవ్ర ఆరోపణలు చేశారు. చదవండి: త్వరలో శివసేన నుంచి మరో సీఎం.. ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు -
Sreeja: ఈ బిడ్డ గెలుపు ఆ తండ్రికి కనువిప్పు!
ఏ తల్లిదండ్రులకైనా కన్నబిడ్డల విజయం అనేది ఒక కల.. అది అందుకున్న వేళ మధుర క్షణంగా మిగిలిపోతుంది కూడా. కానీ, ఆ తండ్రికి మాత్రం అదొక కనువిప్పు.. అలాంటి తండ్రులకు ఓ మంచి గుణపాఠం. కారణం.. పసికందుగా ఉన్నప్పుడే ఆమెను నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లిపోయాడు కాబట్టి. తాజాగా సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో 99.4 శాతం మార్కులు సంపాదించుకుంది బీహార్ పాట్నాకు చెందిన శ్రీజ. పసితనంలోనే ఆమె తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. అయితే ఆమె అలనా పాలనా చూడాల్సిన కన్నతండ్రి.. కర్కశంగా వ్యవహరించాడు. ఆ చిన్నారి ఖర్చులు భరించడం తన వల్ల కాదంటూ.. పైగా ఆడబిడ్డ అనుకుంటూ నిర్లక్ష్యంగా ఇంట్లో ఒక్కదానినే వదిలేసి వెళ్లిపోయాడు. చిన్నారి శ్రీజ ఏడ్పు విని స్థానికులు.. ఆమె అమ్మ తరపు బంధువులకు సమాచారం అందించారు. విషయం తెలిసి అమ్మమ్మ శ్రీజను అక్కున చేర్చుకుంది. తాతా అమ్మమ్మలే పెంచి.. చదివించారు. ఏళ్లు గడిచాయి.. ఇప్పుడు తన మనవరాలు సాధించిన విజయంతో ఆ అమ్మమ్మ మురిసిపోతోంది. ‘‘నా కూతురు చనిపోయాక మా అల్లుడు శ్రీజను వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతన్ని మేం చూడనే లేదు. మరో వివాహం చేసుకున్నాడని మాత్రమే తెలుసు. ఈ ఫలితం చూస్తే.. అతను కచ్చితంగా తన నిర్ణయానికి పశ్చాత్తాపం చెందుతాడని అనుకుంటున్నా’ అని ఆ అమ్మమ్మ అంటోంది. त्याग और समर्पण की अद्भुत दास्ताँ! माँ का साया हटने पर पिता ने जिस बेटी का साथ छोड़ दिया उसने नाना-नानी के घर परिश्रम की पराकाष्ठा कर इतिहास रच दिया। बिटिया का 10वी में 99.4% अंक लाना बताता है कि प्रतिभा अवसरों की मोहताज नहीं है। मैं आपके किसी भी काम आ सकूँ, मेरा सौभाग्य होगा। pic.twitter.com/ufc3Gp4At9 — Varun Gandhi (@varungandhi80) July 24, 2022 మరోవైపు ఈ సక్సెస్‌పై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ స్పందించారు. శ్రీజకు ఏ విధంగా అయినా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు ఆయన. మరోవైపు ఇంటర్నెట్ సైతం ఆ చిన్నారి విజయంపై హర్షం వ్యక్తం చేస్తోంది. మానసికంగా ధైర్యంగా ఉండి.. మంచి చదువుతో విజయం సాధించిన శ్రీజకు.. ఆమెకు అండగా నిలిచిన అమ్మ తరపు కుటుంబానికి అభినందనలు తెలియజేస్తోంది. పుస్తకాల పురుగు అయిన Sreeja శ్రీజ.. అలాగని గంటల తరబడి పుస్తకాలకే అంకితమై పోయేది కాదట. చదువుతో పాటు ఆటపాటలు, ఇతర వ్యవహారాలను చాలా సమానంగా చూసుకునేదట. పరీక్షకు ముందు.. పాత ప్రశ్నాపత్రాలను తిరగేయడం, వాటిని సాల్వ్ చేయడం చేస్తూ వెళ్లాను అని అంటోంది ఆమె. ప్రస్తుతం పదకొండవ తరగతి కోసం శ్రీజ DAV-BSEBలో అడ్మిషన్ తీసుకుంది కూడా. -
మహిళను పొలంలోకి లాక్కెళ్లి కళ్లు పొడిచి పరార్.. ఏం జరిగింది?
పాట్నా: ఇంట్లో నిద్రిస్తున్న మహిళ(45)ను సమీపంలోని జనుము పంటలోకి లాక్కెళ్లి ఆమె కళ్లు పొడిచేసిన సంఘటన బిహార్‌లోని కటిహార్ జిల్లాలో వెలుగు చూసింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ విషాద సంఘటన దక్లా ఇంగ్లీష్ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు నిందితుడుని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మహిళపై దాడి చేసి చూపు కోల్పోయేలా చేసిన దుండగుడు ఎండీ షామిమ్‌గా గుర్తించారు పోలీసులు. 'నిందితుడు ఎండీ షామిమ్‌ను అరెస్ట్ చేశాం. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది అత్యాచారమా కాదా అనేది ఇంకా తెలియరాలేదు.' అని ఎస్డీపీఓ తెలిపారు. ఏం జరిగింది? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు గ్రామంలో తన 8 ఏళ్ల కుమార్తెతో జీవిస్తోంది. మంగళవారం రాత్రి తన కూతురితో కలిసి ఇంట్లో నిద్రపోతోంది. ఆమె భర్త నాలుగు రోజుల క్రితం పని కోసం ఢిల్లీ వెళ్లాడు. దుండగుడు అక్కడికి వచ్చి డోర్ కొట్టాడు. బాధితురాలు తలుపు తీయగా.. ఆమెను సమీపంలోని జనుము తోటలోకి లాక్కెల్లాడు. చేతులు కట్టేసి తన తల్లి కంట్లో కర్ర పుల్లలను దూర్చాడని, దాంతో తీవ్రంగా రక్తస్రావం అయినట్లు బాధితురాలి కుమార్తె పోలీసులకు తెలిపింది. దాడికి పాల్పడిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు వెంటనే ఆమెను అమ్దాబాద్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారటం వల్ల కటిహార్ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు. ఆమెకు చూపు వస్తుందనే నమ్మకం లేదని అక్కడి వైద్యులు తెలిపారు. ఇదీ చూడండి: ప్రియురాలు ద్రోహం చేసిందని తట్టుకోలేక... ఆమెను చంపి... -
ఎగురుతున్న విమానం మంటల్లో చిక్కుకున్నా ధైర్యం కోల్పోక..
సమస్య ఉత్పన్నమైనప్పుడు సమర్థతను చూపలేక చిక్కుల్లో పడినవారున్నట్టే.. సమస్యల్లో ఉన్నవారిని అత్యంత సమర్థతతో కాపాడే ధీరులూ ఉన్నారు. ఈ రెండవ కేటగిరికి చెందుతారు పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా. ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంటే.. అందులోని 185 ప్రాణాలు భయం గుప్పిట్లో బితుకుబితుకుమంటుంటే.. కెప్టెన్ మోనికా ఖన్నా సమర్థత... సత్వర నిర్ణయం ప్రయాణికులతో సహా తననూ సురక్షితంగా భూమికి చేర్చింది. ఆ ధైర్యానికి, సమయస్ఫూర్తికి దేశ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే..? ఇటీవల పాట్నా నుంచి ఢిల్లీకి స్పైజ్ జెట్ లిమిటెడ్ ఫ్లైట్ ఎస్జి723 విమానం బయల్దేరింది. పైలట్–ఇన్–కమాండ్ కెప్టెన్ మోనికా ఖన్నా ఈ విమానాన్ని పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా మిడ్–ఎయిర్ ఇంజిన్‌లో మంటలు రేగాయి. ఇలాంటి హఠాత్పరిణామాలు సంభవించినప్పుడు సాహసాన్ని, సమర్థతను చూపడంలో ఆడా–మగ తేడా అనేది ఏమీ లేదు. అందరినీ కాపాడటం ఒక్కటే వారి కర్తవ్యం. ఆ దక్షతను చూపడంలో మోనికా ఏ మాత్రం జంకలేదు. తక్షణ నిర్ణయం.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె వెంటనే ఇంజిన్‌ను స్విచ్ ఆఫ్ చేసి, పాట్నా విమానాశ్రయంలోనే విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసింది. ఫస్ట్ ఆఫీసర్ బలప్రీత్ సింగ్‌భాటియా కూడా ఆమె తక్షణ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రయాణికులతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత విమానాన్ని నిపుణులు పరీక్షించి పక్షి ఢీకొట్టడంతో ఫ్యాన్ బ్లేడ్, ఇంజన్ దెబ్బతిన్నట్టు నిర్ధారించారు. ఫ్యాషన్ ట్రెండ్స్ ప్రయాణాలను అమితంగా ఇష్టపడే మోనికా ఖన్నా తాజా ఫ్యాషన్, ట్రెండ్స్‌పై అత్యంత ఆసక్తి చూపుతుందని ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ సూచిస్తుంది. అంటే, అందం, నలుగురిలో ఆనందంగా ఉండటం అనే అంశాల పట్ల వీరోచితులు దృష్టి పెట్టరు అనేవారికి మోనికా ఓ పెద్ద ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. మహిళా శక్తి అనడం కన్నా వీరోచితమైన ప్రజల జాబితాలో మోనికాఖన్నా చేరుతారని ప్రముఖులు ఆమెను కొనియాడుతున్నారు. ‘ఎగురుతున్న విమానం మంటల్లో చిక్కుకున్నప్పుడు అందులోని ప్రయాణికులు ప్రాణాలను గుప్పిట్లో పట్టుకొని భయంతో బతికిన క్షణాల నుంచి ఆమె విముక్తి కలిగించారు. మోనికా ఖన్నా ధైర్యానికి వందనాలు’ అంటూ దేశవ్యాప్తంగా సిటిజనుల నుంచి నెటిజనుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
స్పైస్ జెట్ విమానానికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
పాట్నా: పైలట్ అప్రమత్తతతో స్పైస్ జెట్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం కారణంగా బిహటా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 185 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులకు ముప్పు తప్పింది. చదవండి: అగ్నిపథ్ అల్లర్లు: 700 కోట్ల ఆస్తి నష్టం.. 718 మంది అరెస్ట్ -
Shocking Video: రోడ్డుపై ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నారా.. ఈ వీడియో చూడండి
Shocking Video: రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఫోన్ మాట్లాడటం ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువైంది. రోడ్డుపై ఫోన్లో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ తెరిచిఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. బీహార్ రాజధాని పట్నాలోని అలమ్గంజ్లో ఓ మహిళ ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. ఆమె మ్యాన్‌హోల్‌లో పడిపోవడం రోడ్డుపై ఉన్న కొందరు వ్యక్తులు గమనించి వెంటనే బయటకు తీశారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాగా, ఈ ప్రమాదంలో సదరు మహిళకు గాయలయ్యాయి. అయితే, ఈ ప్రమాదానికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. Is there anything in order in @NitishKumar 's Bihar? @jantadal govt has done anything for Janta? Hooch tragedies, crime against women r rampant. Opposition @yadavtejashwi @RJDforIndia r mute spectators? Concerned MC officials shud be terminated for this manhole travesty. pic.twitter.com/4Is5DmEOcM — TruBitter (@Pseudoidealist) April 23, 2022 ఇది చదవండి: పోయే కాలం అంటే ఇదేనేమో.. అయ్యా అదేం పని.. -
బెడ్రూమ్లో పక్కింటి వ్యక్తితో భార్య అలా చేస్తూ..
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలను బజారుకీడుస్తున్నాయి. కొన్ని సంబంధాలు హద్దులు దాటడంతో అవి చివరకు హత్యలకు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. దీంతో వారి పిల్లలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది. ఆమెకు పదేళ్ల క్రితం పెళ్లై ఇద్దరు పిల్లలుగా పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపించింది. తీరా ఆమె ప్రియుడితో బెడ్ రూమ్‌లో రాసలీలలు కొనసాగిస్తూ భర్త రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది. అనంతరం దారుణానికి ఒడిగట్టింది. వివరాల ప్రకారం.. పుర్నియ జిల్లా చకర్పద గ్రామానికి చెందిన పోషిత్ కుమార్‌కు సావిత్రిదేవితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, సావిత్రిదేవి వారి ఇంటి పక్కనే ఉండే మరోవ్యక్తి అరవింద్ మహల్దార్‌తో కొద్ది రోజులుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. కాగా, ఓరోజు కుమార్ పని నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి సావిత్రి బెడ్రూమ్లో తన ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం తమ బండారం బయటపడటంతో ప్రియుడు మహల్దార్‌తో కలిసి సావిత్రి.. కుమార్ మెడకు తాడు బిగించి దారుణంగా హత్య చేశారు. ఈ క్రమంలో కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సావిత్రి, అరవింద్ మహల్దార్ను అరెస్ట్ చేశారు. ఇది చదవండి: హైదరాబాద్‌లో కొత్తరకం సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. -
చాయ్వాలీ ప్రియాంక: రెండేళ్ల ప్రయత్నాల తర్వాత..
ఎంతసేపు.. ప్రభుత్వాలు ఉద్యోగాలు, నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని విమర్శించే బదులు.. స్వతహాగా ఏదో ఒక పనిలో దిగిపోవడం ఉత్తమమని సలహా ఇస్తోంది ప్రియాంక. రెండేళ్లపాటు ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఆమె అది ఫలించకపోవడంతో టీ దుకాణం తెరిచింది. బీహార్ పాట్నాలో ఉమెన్స్ కాలేజీ దగ్గర ఓ టీ స్టాల్ నడిపిస్తోంది ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ ప్రియాంక గుప్తా. 2019లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. కానీ, ఈ రెండేళ్లలో ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో.. ఎంబీఏ చాయ్‌వాలా ప్రఫుల్ బిలోర్(మధ్యప్రదేశ్) కథనం ఆమెకు స్ఫూర్తి ఇచ్చిందట. ఎప్పుడూ చాయ్‌వాలా కథనాలేనా? అందుకే చాయివాలీ కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈమధ్యే ఈ 24 ఏళ్ల అమ్మాయి టీ స్టాల్ ఓపెన్ చేసింది. ఇందుకు తల్లిదండ్రుల సహాకారం కూడా లభించింది. రెగ్యులర్ టీతో పాటు పాన్, మసాలా, చాక్లెట్ టీ, బిస్కెట్లు అమ్ముతోందామె. అంతేకాదు అక్కడ బ్యానర్ల మీద స్ఫూర్తినిచ్చే ఎన్నో కొటేషన్లు సైతం ఉంచింది. -
స్వగ్రామంలో సీఎంపై దాడి.. షాక్‌లో పోలీసులు..
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఆయన స్వగ్రామంలోనే చేదు అనుభవం ఎదురైంది. నితీశ్ కుమార్ భక్తియార్‌పూర్‌లో పర్యటిస్తుండగా ఓ యువకుడు దాడి చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. సీఎం నితీశ్ భక్తియార్‌పూర్‌లోని స్థానిక ఆసుపత్రి కాంప్లెక్స్‌లో రాష్ట్రానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు శిల్పాద్ర యాజీ విగ్రహానికి నివాళులు అర్పిస్తుండగా దాడి జరిగింది. నితీశ్‌ను లక్ష్యంగా చేసుకున్న యువకుడు సెక్యూరిటీని దాటుకుని వెళ్లి మరీ దాడి చేశాడు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది యువకుడిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతడు దాడికి చేయడం గమనార్హం. అనంతరం యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు. On-Camera, Nitish Kumar Attacked By Man During Function At Hometown https://t.co/X9oc6FYD3U pic.twitter.com/aX7eOz0oqn — NDTV (@ndtv) March 27, 2022 -
మాజీ సీఎం కొడుకు ఇంట్లో చొరబడిన మందుబాబులు.. చంపేస్తామంటూ వార్నింగ్
సాక్షి, పాట్నా : బిహార్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇంట్లోకి మందుబాబులు చొరబడి హల్ చల్ చేశారు. చంపేస్తానంటూ వార్నింగ్ కూడా ఇవ్వడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం గౌరవ్ యాదవ్ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి, తన స్నేహితులతో కలిసి పాట్నాలోని తేజ్ ప్రతాప్ యాదవ్ ఇంట్లోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో తేజ ప్రతాప్ యాదవ్ ఇంట్లో లేకపోవడంతో అక్కడ ఉన్న ఆయన సన్నిహితుడు, ఆర్జేడీ యూత్ వైస్ ప్రెసిడెంట్ సృజన్ స్వరాజ్‌ను వారు బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే స్వరాజ్ ను చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో వారిని అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు. ఈ విషయంపై సృజన్ పోలీసులను ఆశ్రయించారు. గౌరవ్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీసు అధికారులకు తెలిపారు. -
కొత్త జీవితం.. ఆడపిల్ల భారమా?!
ఆడపిల్లనా?! తీసేయ్... పారేయ్... వదిలేయ్.. ఈ మాటలు భారతావనిలో ఇంకా ఇంకా వినపడుతూనే ఉన్నాయి. వదిలేసినా.. పారేసినా.. ఆడపిల్ల .. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉంది. సమాజంలో తన ఉనికిని చాటుతూనే ఉంది. అచ్చం జ్యోతి లా. కన్నతల్లి పారేసిన చెత్త కుప్పలో నుంచి వచ్చిన జ్యోతి మరికొందరు ఆడపిల్లల కళ్లల్లో ఆశాకిరణాలు నింపుతోంది. బీహార్ రాజధాని పట్నాలో పంతొమ్మిదేళ్ల క్రితం ఆడపిల్ల భారమనుకొని, పుట్టిన వెంటనే ఆ పసికందును చెత్త కుప్పలో పడేసిందో తల్లి. గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డ రోదనలు విన్న భిక్షకురాలు కరీదేవి ఆ బిడ్డను తీసుకుంది. పదేళ్లు తనతో తిప్పుతూ పెంచింది. ఆమెతోపాటు భిక్షమెత్తుకుంటూ, చెత్తను సేకరిస్తూ పెద్దదయ్యింది ఆ పాప. ఇప్పుడు కెఫేలో ఉద్యోగం చేసుకుంటూ, తన కాళ్ల మీద తను జీవిస్తూ, 12వ తరగతి చదువుతోంది. చిన్నవయసు నేర్పిన పాఠాలతో కొత్త జీవితాన్ని నిర్మించుకుంటున్న ఆ అమ్మాయి పేరు జ్యోతి. ఇప్పుడు 19 ఏళ్లు. అనాథలైన పిల్లలు ఎవరైనా జంక్షన్లలో కనిపిస్తే అక్కడి పోలీసులు జ్యోతిని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, జీవితాన్ని బాగుచేసుకోమని చెబుతున్నారు. జ్యోతి తను నడిచొచ్చిన దారుల గురించి చెబుతూ, సమాజాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది.. ఒక మాంసపు ముక్కనా?! ‘‘నేను దాదాపు పదేళ్లు అడుక్కున్నాను. నా ఒంటికి చెత్త అంటుకోని క్షణం లేదు. రోడ్డు మీద ఎన్నో ఏళ్ల రాత్రులు గడిపాను. నేను ఆడపిల్లను కాబట్టి ఓ మాంసపు ముక్కలా చెత్తలో పడేశారు. అదే, అబ్బాయి అయితే ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. మా అమ్మ నన్ను ఎందుకు పారేసిందో నాకు తెలియదు. నన్ను తన పొత్తిళ్లలోకి తీసుకుంది కరీదేవి అమ్మ. భిక్షాటన చేసుకుంటూ బతికేది. మా పాట్నా జంక్షన్ లో రోడ్డుపక్కన నన్ను చూసుకోవడం మొదలుపెట్టినప్పుడే ఇదంతా నాకు తెలిసింది. పదేళ్లు అదే పాట్నా జంక్షన్ లో నేనూ భిక్షాటన చేశాను. చెత్తను సేకరించాను. ఈ మధ్యలో కరీదేవి అమ్మ చనిపోయింది. అప్పటినుంచి ఆమె కొడుకు రాజ్దేవ్ పాశ్వాన్ నన్ను పెంచాడు. ఈ ఇద్దరు లేకపోతే నేను ఈ రోజున ఇలా ఉండేదాన్నే కాదు. ఏడుపుతోనే రోజెందుకు మొదలయ్యేది?! పదేళ్లు భిక్షాటన చేస్తూ చెత్తను సేకరించాను. ఆ అనుభవాలు నానుంచి ఎప్పటికీ దూరం కావు. అది అప్పుడు నా పని. చలి, ఎండా, వాన ఏ కాలమైనా చెత్తలో తిరగాలి. దొరికిన దానితో కడుపు నింపుకోవాలి. చెత్తలో పండు ముక్క కనిపించినప్పుడల్లా దానికోసం నా తోటి పిల్లలంతా పోట్లాడుకునేవాళ్లం. రైలులో సీసాలు తీయడం. రోజంతా భిక్షాటన చేస్తూ కూడబెట్టిన డబ్బుతో జీవనం. కరీదేవి అమ్మ పోయాక ఆమె కొంగు కూడా దూరమయ్యింది. గుడి బయట పడుకుంటే తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పూజారి వచ్చి, ముఖాన నీళ్లు చల్లి లేపేసేవాడు. ఏడుస్తూ మేలుకునేదాన్ని. అప్పటినుండి ఉదయం పని మొదలయ్యేది. సమాజానికి కూడా చిన్నచూపెందుకు?! చలికాలంలో ఎముకలు కొరికేసే చలి. చెత్తకుప్పల దగ్గర ఉండే టెంట్లలాంటి ఇళ్లలో ఎలుకలు. ఎవరైనా దయతలిచి దుప్పటి ఇస్తే అవి ఎలుకలు కొరికేసేవి. చిరుగుల దుప్పటితో ఏళ్లు గడిచిపోయేవి. ఆడపిల్ల అనే శిక్ష నన్ను కన్నవాళ్లే కాదు సమాజం కూడా వేసింది. జంక్షన్ లో భిక్షాటన చేసే మనుషుల అకృత్యాలను చూసి భయపడి పారిపోయిన సంఘటనలు ఎన్నో. వయసు చిన్నదే అయినా అనుభవాలు పెద్దదాన్ని చేశాయి. సంజీవని దొరకకపోతే..! స్థానిక రాంబో హోమ్ ఫౌండేషన్ నా దుస్థితిని మార్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు క్రీడలు, ఆటలు చదవడం నేర్పించారు. అంతకుముందు చదువు అనే విషయం కూడా నాకు తెలియదు. ఆ ఇంటిని మొదటిసారి చూసి షాక్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు అంటే ఎలా ఉంటుందో తెలిసింది. అలంకరించిన గదులు, బొమ్మలు చూశాను. నాలాంటి పిల్లలను ఇంకొంతమందిని కలుసుకున్నాను. దీంతో నన్ను వదిలేసిన తల్లి తిరిగి దొరికినంత సంబరంగా అనిపించింది. కొత్త స్నేహితులు కూడా దొరికారు. రోజంతా పెన్ను, పేపర్‌తో ఉండిపోయేదాన్ని. చదువువొక్కటే నా జీవితాన్ని మార్చేస్తుందని నాకనిపించింది. చిన్నతనంలో పట్నా జంక్ష¯Œ లో చదువుకోవడానికి వెళుతున్న నా ఈడు పిల్లలను చూసి, నాకు కూడా చదువుకోవాలనే కోరిక ఉండేది. అది తీరే కలేనా అనుకున్నాను. కానీ, నా కల నెరవేరేరోజు వచ్చింది. అక్షరాలు నేర్పించి, ఆరో తరగతి లో చేర్చారు ఫౌండేషన్ నిర్వాహకులు. మూడు నెలల కోర్స్... సంస్థ ద్వారా పాఠశాలకు వెళ్లాను. అక్కడున్న టీచర్లు చెప్పినవి శ్రద్ధగా విన్నాను. అయితే, ఎక్కువ రోజులు బడిలో కూర్చోలేదు. ఓపెన్‌గానే పదవతరగతి పరీక్ష రాసి పాసయ్యాను. ఇప్పుడు 12 వ తరగతి చదువుతున్నాను. చదువుతోపాటు లెమన్ కేఫ్‌లో పనిచేస్తున్నాను. కేఫ్‌లో పనిచేసే ముందు మూడు నెలల మార్కెటింగ్ కోర్సు కూడా చేశాను. ఆ తర్వాత సేల్స్‌గర్ల్‌గా ఆరునెలలు పనిచేశాను. ‘కేఫ్’ మేనేజర్ ప్రస్తుతం నేను బీహార్‌లోని లెమన్ కేఫ్‌కి మేనేజర్‌గా పనిచేస్తున్నాను. చదువుతోపాటు, ఉద్యోగమూ చేసుకుంటున్నాను. నా జీతంలో సగం డబ్బును నన్ను చదివించిన సంస్థకు విరాళంగా ఇస్తున్నాను. ఒకప్పుడు నేను పెరిగిన పట్నా జంక్షన్ మీదుగా అప్పుడప్పుడు వెళుతుంటాను. అక్కడ పోలీసులు నన్ను గుర్తుపట్టి, ఆప్యాయంగా పలకరిస్తారు. చదువు ఎలా సాగుతోందని, ఎలా ఉన్నావంటూ అడుగుతుంటారు. అక్కడ భిక్షాటన చేసే పిల్లలు ఎవరైనా ఉంటే చాలు .. పిలిచి మరీ నన్ను చూపించి వారికి పరిచయం చేస్తారు. ‘ఒకప్పుడు మీలాగే ఈ జ్యోతి ఉండేది. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో. మీరూ ఈ జ్యోతిలా తయారవ్వాలి. ఇలా భిక్షాటన చేయొద్దు. అందుకు, ఎక్కడుండాలో మేం చెబుతాం...’ అంటూ వారికి మంచి మాటలు చెబుతారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చెత్తకుప్పలో ఓ మాంసం ముక్క అనుకొని పడేసిన ఈ ఆడపిల్ల చనిపోలేదు. కానీ, ప్రతిరోజూ చస్తూ బతికింది. ఇప్పుడున్న ఈ జీవితంలో ఆడపిల్లల కోసం మంచిపని చేసే విధంగా మలుచుకోవాలని ఉంది. ఆ విధంగానే కృషి చేస్తున్నాను’’ అంటూ వివరిస్తుంది జ్యోతి. ‘ఆడపిల్ల అంటే ఎందుకంత చిన్నచూపు?’ అని ప్రశ్నించే జ్యోతిలాంటి అమ్మాయిలందరికీ సమాజం ఏం సమాధానం చెబుతుంది?! -
లాలూ రాజీనామా వార్తలపై స్పందించిన రబ్రీదేవీ
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) జాతీయ అధ్యక్ష పదవి నుంచి లాలూప్రసాద్ యాదవ్ తప్పుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీ ఖండించారు. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని శుక్రవారం తేల్చిచెప్పారు. లాలూ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతారని ఆర్జేడీ ఎమ్మెల్యే ఒకరు వెల్లడించారు. లాలూ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆయన కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్‌ప్రతాప్ యాదవ్ పోటీపడుతున్నట్లు బిహార్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. గుండె, మూత్రపిండాల సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూప్రసాద్ యాదవ్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. (చదవండి: 'జడ్' కేటగిరి భద్రతను తిరస్కరించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ) -
రైల్వే పరీక్షా ఫలితాలపై నిరసన... ఏకంగా రైలుకే నిప్పుపెట్టారు
పట్నా: బిహార్‌లో నిరుద్యోగులు మరోసారి రెచ్చిపోయారు. ఈ క్రమంలో కొంత మంది విద్యార్థులు, ఆందోళన కారులు.. పెద్ద ఎత్తున గయా రైల్వేస్టేషన్ చేరుకున్నారు. ఆతర్వాత ఆగి ఉన్న ప్యాసింజర్ రైలుకు నిప్పుపెట్టారు. అంతటితో ఆగకుండా ప్రయాణిస్తున్న రైళ్లపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడి ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. పోలీసు అధికారుల ప్రకారం.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్‌టెక్నికల్ పాపులర్ (RRB-NTPC) సీబీటీ-1 పోస్టుల కోసం 2019లో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సదరు నోటిఫికేషన్లో ఒక దశ పరీక్ష మాత్రమే ఉందని తెలిపారు. కాగా, మొదటి దశకు సంబంధించి పరీక్ష ఫలితాలను జనవరి 15న వెల్లడించింది. అయితే, ఈ పరీక్షలలో పలు అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు నిరసనలు చేపట్టారు. కాగా, అభ్యర్థి ఉద్యోగం సాధించాలంటే.. రెండో దశ సీబీటీ కంప్యూటర్ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాలని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. రెండు దశల్లో పరీక్ష నిర్వాహణపై నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బిహర్ అంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. పట్నాలో నిరసన కారులు పెద్ద ఎత్తున రైల్వే ట్రాక్‌పై చేరుకుని నిరసనలు తెలిపారు. జెహనాబాద్‌లో రైలుపట్టాలపై మోదీ దిష్టిబొమ్మను దహనంచేసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే విధంగా, సీతామర్హి ప్రాంతంలోను ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. కాగా, నిరసన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు పలుచోట్ల గాల్లోకి కాల్పులు జరిపారు. నవాడా, ముజఫర్‌పూర్, సీతామర్హి, బక్సర్, భోజ్‌పూర్ జిల్లాలో నిరుద్యోగుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. అయితే, దీనిపై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ స్పందించింది. తాము.. నోటిఫికేషన్లోనే రెండో దశ వివరాలను కూడా తెలిపామని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరికి సబంధించి పరీక్షలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలపై అభ్యర్థుల ఆందోళలను పరిశీలించడానికి రైల్వేశాఖ ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అభ్యర్థులు తమ ఈ కమిటికి తమ ఫిర్యాదులను ఫిబ్రవరి 16 వరకు సమర్పించవచ్చని రైల్వే మంత్రిత్వశాఖ ట్విటర్ వేదికగా తెలిపింది. నిరసన కారుల ఆందోళన ప్రధానంగా ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌లోని ఆయా మార్గాల్లో ప్రభావం చూపింది. దాదాపు 25 కంటే ఎక్కువ రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పట్నాలో నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కూడా పట్నా రైల్వేస్టేషన్‌ను విద్యార్థులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. చదవండి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం తీపికబురు.. ఇక నుంచి.. -
పరీక్షా ఫలితాలపై అభ్యంతరం.. రైళ్లు అడ్డుకొని నిరసన
రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షా ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన బీహార్‌లో సోమవారం చోటుచేసుకుంది. అభ్యర్థులు పెద్దఎత్తున పట్నా రైల్వే స్టేషన్‌కు చేరుకొని పలు రైళ్లను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎగ్జామ్ 2021 ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)-2 పరీక్ష కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసేందుకు సీబీటీ-1 పరిక్షకు సంబంధించిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ రిజల్ట్స్‌ను జనవరి 15న విడుదల చేశారు. ఈ ఫలితాలపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సోమవారం ఒక్కసారిగా పట్నా రైల్వే స్టేషన్‌కు పెద్ద ఎత్తున అభ్యర్థులు చేరి నిరసన చేపట్టారు. అక్కడితో ఆగకుండా సుమారు 5 గంటలపాటు స్టేషన్ రైలు పట్టాలపై బైఠాయించి పలు రైళ్లను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
Pro Kabaddi League: దబంగ్ ఢిల్లీకి ఏడో విజయం.. అగ్రస్థానంలోకి
Pro Kabaddi League: Delhi Dabang Beat Patna Pirates: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్ ఢిల్లీ జట్టు ఏడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 32–29తో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. ఢిల్లీ తరఫున స్టార్ రెయిడర్ సందీప్ నర్వాల్ ఎనిమిది పాయింట్లతో రాణించాడు. ఈ లీగ్ చరిత్రలో సందీప్ రెయిడింగ్ పాయింట్ల సంఖ్య 250 దాటింది. గుజరాత్ జెయింట్స్, యు ముంబా జట్ల మధ్య మ్యాచ్ 24–24తో ‘టై’ అయింది. చదవండి: IPL 2022 Auction: రాహుల్‌తో పాటు ఆసీస్ ఆటగాడు, రవి బిష్ణోయిని ఎంచుకున్న లక్నో.. అతడికి 15 కోట్లు! -
డాక్టర్‌కే ఐదు డోసుల వ్యాక్సిన్! దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం
పట్నా: దేశంలో కరోనా వైరస్‌కు అడ్డుకట్టవేయడానికి ప్రభుత్వం కోవిడ్ టీకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రెండు డోసుల టీకాను ప్రజలకు అందిస్తోంది. ఇటీవల ఈ రెండు డోసులతో పాటు మూడో టీకాగా.. బూస్టర్ డోస్ కూడా వేస్తోంది. అయితే ఓ డాక్టర్ ఏకంగా ఐదు డోసుల టీకా వేయించుకున్నట్లు రికార్డులు చూపడం బీహార్‌లో కలకలం రేపింది. దీంతో బిహార్ ప్రభుత్వం ఈ విషయంపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. చదవండి: India Covid-19: కాస్త తగ్గిన రోజువారీ కేసులు.. అయినా కొత్తగా 2 లక్షలకు పైనే పట్నాలో సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ విభా కుమారి సింగ్ ఐదు కరోనా టీకాలు వేసుకున్నట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఈ విషయంపై సదరు డాక్టర్ స్పందిస్తూ.. తాను కోవిడ్ టీకా నిబంధనలకు లోబడి కేవలం మూడు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ (బ్యూస్టర్‌తో కలిపి) మాత్రమే వేయించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే తన పాన్‌కార్డును ఉపయోగించుకొని ఎవరో మరో రెండు డోసుల టీకాను వేయించుకున్నారని తెలిపారు. కోవిన్ పోర్టల్ వివరాల ప్రకారం.. డాక్టర్ విభా 28 జనవరి, 2021న మొదటి డోసు, మార్చిలో రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారు. అదేవిధంగా 13 జనవరి, 2022న ఆమె బూస్టర్ డోస్ తీసుకున్నారు. అయితే ప్రభుత్వ రికార్డులు ప్రకారంలో ఆమె బూస్టర్ డోస్‌తో కలిపి 5 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు చూపడంతో అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6 ఫిబ్రవరి 2021న మూడో డోసు, 17జూన్ 2021న నాలుగో డోసును ఆమె పాన్‌కార్డు ద్వారా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు రికార్డుల్లో వుంది. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
జాక్‌పాట్ కొట్టిన సంప్రీతి.. గూగుల్‌లో రూ. కోటికిపైగా ప్యాకేజీ
Indian Girl Sampreeti Yadav Biodata and Google Package Details: టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడంలో టెక్ దిగ్గజ కంపెనీలు ఎప్పుడూ ముందుంటాయి. ఈ తరుణంలో భారత్ నుంచి ఎక్కువ మేధోసంపత్తిని వెలికి తీస్తుంటాయి. బడా బడా కంపెనీల సీఈవోలుగా భారత మూలాలు ఉన్నవాళ్లు, భారీ ప్యాకేజీలు అందుకుంటున్న వాళ్లలో భారతీయ టెక్కీలు ఉండడమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే తాజాగా ఓ భారత యువతికి కోటి రూపాయలకు పైగా ప్యాకేజీతో బంపరాఫర్ ఇచ్చింది గూగుల్. కొవిడ్ టైంలో ఉద్యోగాల నియామకం కంపెనీలకు తలనొప్పిగా మారింది. అందునా టాలెంట్ ఉన్న ఉద్యోగులను లాగేసుకునేందుకు పోటాపోటీ పడుతున్నాయి కూడా. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో పని చేస్తున్న సంప్రీతికి.. మరో టెక్ కంపెనీ గూగుల్ భారీ ప్యాకేజీ ఆఫర్ చేసింది. మొత్తం తొమ్మిది రౌండ్ల ఇంటర్వ్యూ క్లియరెన్స్ తర్వాత గూగుల్ ఆమెకు ఒక కోటి పది లక్షల రూపాయల ఏడాది శాలరీ ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఇందుకు సంప్రీతి సైతం ఓకే చెప్పింది. నేపథ్యం.. సంప్రీతి యాదవ్ స్వస్థలం బీహార్ రాజధాని పాట్నాలోని నెహ్రూ నగర్. తండ్రి రామ్‌శంకర్ యాదవ్ బ్యాంక్ ఆఫీసర్ కాగా, తల్లి ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2014లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి.. 2016లో జేఈఈ మెయిన్స్‌ను క్లియర్ చేసింది సంప్రీతి. ఇక ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసింది. బీటెక్ పూర్తి చేసుకున్న వెంటనే(2021లో) ఏకంగా నాలుగు కంపెనీలు ఆమె కోసం ఆఫర్ ఇచ్చాయి. అందులో ఫ్లిప్‌కార్ట్, అడోబ్ కంపెనీలు కూడా ఉన్నాయి. కానీ, ఆమె మాత్రం మైక్రోసాఫ్ట్‌ను ఎంచుకుంది. మైక్రోసాఫ్ట్‌లో ఆమె శాలరీ ఏడాదికి 44 లక్షల రూపాయల ప్యాకేజీ. ఇక ఫిబ్రవరి 14, 2022 తేదీన ఆమె గూగుల్‌లో చేరాల్సి ఉంది. ఇదిలా ఉంటే కిందటి ఏడాది జూన్‌లో పాట్నాకే చెందిన ఐఐటీ స్టూడెంట్ దీక్ష బన్సాల్(ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్)కు గూగుల్ 54 లక్షల ఏడాది ప్యాకేజీతో ఉద్యోగం ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఐఐటీ బీహెచ్‌యూకి చెందిన ఐదుగురు విద్యార్థులను ‘ఉబెర్’ ఇనయమించుకోగా.. అందులో ఓ స్టూడెంట్‌కు 2.05 కోట్ల జీతం ప్రకటించింది ఉబెర్. చదవండి: టెస్లా ఆటో పైలెట్ టీమ్‌కి ఎంపికైన అశోక్ ఎల్లుస్వామి గురించి తెలుసా? -
Corona Virus: 87 మంది వైద్యులకు కోవిడ్ పాజిటివ్
పాట్నా: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. వేలల్లో రోజువారీ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బిహార్ రాజధాని పట్నాలోని నలంద వైద్య కళాశాల, ఆస్పత్రిలో 87 మంది వైద్యులు కొవిడ్ బారినపడడం కలకలం సృష్టించింది. ఎన్ఎంసీహెచ్లో మొత్తం 194 నమూనాలకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. శనివారం 12 మందికి, ఆదివారం మరో 75 మందికి వైరస్ నిర్ధారణ అయింది. వీరిలో అయిదుగురు మాత్రమే ఆస్పత్రిలో చేరగా.. మిగిలినవారంతా ఆస్పత్రి క్యాంపస్‌లోనే ఐసొలేషన్ ఉన్నట్టు అధికారులు తెలిపారు. చదవండి:ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో గుర్తుపట్టండి.. కాగా కరోనా బారినపడిన వైద్యుల్లో చాలామంది డిసెంబరు 27, 28 తేదీల్లో జరిగిన ఐఎంఏ జాతీయ వార్షిక సదస్సుకు హాజరయ్యారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 33, 750 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 123మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా వేగంగా విస్తరిస్తోంది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1700కు చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. చదవండి: సీఎం ఎదుటే కొట్టుకున్నంత పనిచేసిన డిప్యుటీ సీఎం, ఎంపీ.. వైరల్ వీడియో చదవండి: కరోనా కల్లోలం.. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం -
Rain Alert: ఈ నెల 27 నుంచి 30 వరకు చలిగాలులతో కూడిన వానలు!
Rain Alert to farmers about the crop పాట్నా: పశ్చిమ దిశగా వీస్తున్నగాలుల కారణంగా రాష్ట్రంలో చలి తీవ్రంగా పెరిగింది. పొగమంచు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ చలి మాత్రం తారా స్థాయికి చేరుకుంది. కాగా ఈ నెల చివరివారంలో 27 నుంచి 30 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని బీహార్ వాతావరణశాఖ హెచ్చరించింది. దీనివల్ల వ్యవసాయానికి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా సూచించింది. బీహార్‌లోని పలు జిల్లాల్లో ఈ వారంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేఅవకాశం ఉందని పాట్నా వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయి. కుప్పలూడ్చి, పంట ఇంటికి చేరే సమయంలో ఈ వర్షాల కారణంగా రైతులకు నష్టం వాటిల్లే ఆవకాశం ఉందని, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వాతావరణ శాఖ రైతులకు సూచించింది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో పశువుల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా వర్షాల అనంతరం రాష్ట్రంలో చలి తీవ్రత కూడా ఒక్కసారిగా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా. డిసెంబర్ 27 నుంచి 30 మధ్య ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని, వర్షం పడే అవకాశంతో పాటు పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. చదవండి: కేఎఫ్‌సీ చికెన్‌లో కోడి తల.. కస్టమర్‌కు చేదు అనుభవం! -
నన్ను బ్యూటీఫుల్ అన్నారు.. నేను హర్టయ్యా!
పట్న: బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రవర్తనతో తాను తీవ్రంగా బాధపడ్డాని బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ హెంబ్రోమ్ అన్నారు. సోమవారం జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో తనను ఉద్దేశించి ‘బ్యూటీఫుల్’ అన్నారని తప్పుపట్టారు. సీఎం ప్రవర్తనకు చాలా బాధపడ్డానని, ఆయన వాడిన అభ్యంతరకర మాటను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె శుక్రవారం మండలిలో తెలిపారు. ఈ విషయాన్ని తన పార్టీకి చెందిన సీనియర్ నాయకులకు దృష్టికి తీసుకువెళ్లానని పేర్కొన్నారు. చదవండి: UP Assembly Election 2022: యూపీలో పొత్తు పొడుపులు: దీదీకి ఆహ్వానం.. ప్రియాంకకు మొండిచేయి ఆ సమావేశంలో మాట్లాడుతూ.. కొంతమంది గిరిజనలు మద్యం తయారు చేస్తున్నారని అయితే వారి ప్రత్యామ్నంగా ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. వెంటనే సీఎం నితీష్ కుమార్ జోక్యం చేసుకొని ‘బ్యూటిఫుల్’ అని అన్నారు. ప్రభుత్వం మద్యం తయారు చేసే గిరిజన కమ్యూనిటీకి ప్రత్యమ్నయ ఉపాధిమార్గాలు చూపిందని తెలుసుకోవాలన్నట్లు సీఎం సమాధానం ఇచ్చారని అక్కడే ఉన్న కొంతమంది నేతలు తెలిపారు. అయితే శుక్రవారం శాసన మండలి సమావేశాల చివరి రోజున ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ హెంబ్రోమ్ మండలిలో ప్రస్తావించారు. ఆరోజు సీఎం అభ్యంతరకర ప్రవర్తను బీజేపీ పార్టీ అధిష్టానానికి తెలియజేశానని పేర్కొన్నారు. ఈ ఘటనపై జేడియూ మహిళా నేత స్పందిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే పొరబడింది.. సీఎం ఆమెను అవమానపరచలేదు, ఆయన మహిళలపట్ల ఎల్లప్పుడూ గౌరవంతో ఉంటారని గుర్తుచేసింది. మరోవైపు ఈ ఘటనపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య స్పందిస్తూ.. సీఎం ప్రవర్తనను తప్పుపడుతూ ఈ వయసులో కూడా అపఖ్యాతి పాలయ్యారని ఎద్దేవా చేశారు. -
మరికొద్ది నిమిషాల్లో పెళ్లి .. కారు దిగగానే వధువుకు షాక్!
పట్నా: సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించుకుంటారు. దీనికోసం బంధువులు, స్నేహితులను ఆహ్వానించి అంగరంగ వైభవంగా వివాహ వేడుకను నిర్వహిస్తారు. అయితే, ఒక్కొసారి పెళ్లివేడుకలలో అనుకోకుండా విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. బిహార్‌లో జరిగిన పెళ్లింట విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోని వచ్చింది. పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా పరిధిలోని చరద్వాలి గ్రామానికి చెందిన చందేశ్వర్ కుమారుడు మనీష్ గిరికి, యోగాపట్టిలోని అమేథియా గ్రామానికి చెందిన చందా అనే యువతికి పెళ్లి నిశ్చయమైంది. గత సోమవారం (నవంబరు29)న ఆడపెళ్లివారింటికి.. మగ పెళ్లివారు ఊరేగింపుగా వచ్చారు. వధువు తరపువారు పెళ్లి ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో.. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు కారులో ఊరేగింపుగా బ్యాండ్ మేళంతో మండపానికి చేరుకున్నారు. బంధువులు, స్నేహితులంతా పెళ్లి వేడుకను ఉల్లాసంగా చూస్తున్నారు. అందరి కళ్లు కొత్త జంటను ఆసక్తిగా చూస్తున్నారు. అందరు చూస్తుండగానే కారునుంచి దిగిన వరుడు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడివారు షాకింగ్‌కు గురయ్యారు. కళ్లు తిరిగి పడుంటారని అందరు భావించారు. వరుడి ముఖంపైన నీళ్లు చల్లారు. ఎంత సేపటికి వరుడు లేవకపోవడంతో వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వరుడిని పరిశీలించిన వైద్యులు.. అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు. కనీసం కాళ్ల పారాణి కూడా ఆరకముందే వరుడు చనిపోవడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటన తెలిసి వధువు కూడా కళ్లు తిరిగి పడిపోయింది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. -
దేవాలయాలపై పన్ను: ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదం
పట్న: రాష్ట్రంలోని దేవాలయాలపై బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఆలయాలను రిజిస్టెర్ చేయించుకుని పన్నులు చెల్లించాలన్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీహార్ స్టేట్ బోర్డ్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్ తీసుకున్న నిర్ణయంపై ధార్మిక సంస్థలు, భక్తులు భగ్గుమంటున్నారు. వ్యక్తులు తమ ఇంటి ప్రాంగణాల్లో దేవాలయాలు నిర్మించి భక్తులను అనుమతించినా కూడా ఈ ఉత్తర్వుల పరిధిలోకి వస్తాయని తెలిపింది. అదేవిధంగా ఆ ఆలయాలు 4 శాతం పన్ను చెల్లించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. చదవండి: బీజేపీలో చేరిన అకాలీదళ్ కీలక నేత.. భక్తులు దర్శించే పత్రి ఆలయాన్ని నమోదు చేయించాలని ఆపై వాటికి వచ్చే ఆదాయంలో 4 శాతం పన్ను చెల్లించాలని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్, ఏఐఎంఐఎం పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆలయాలపై పన్ను విధింపు నిర్ణయాన్ని ‘జిజియా పన్ను’ గా శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు కామేశ్వర్ చౌపాల్ అభివర్ణించారు. అయితే దీనిపై బీహార్ ప్రభుత్వం స్పందిస్తూ.. ఆలయాలపై తాము పన్ను విధించలేదని తెలిపింది. అయితే అది కేవలం వార్షిక సేవా రుసుమని వివరణ ఇచ్చింది. చదవండి: దేశంలో యూపీఏ లేదు.. మరో కూటమి ప్రయత్నం: మమతా బెనర్జీ -
లాలు ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత
పట్న: రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్‌ను శుక్రవారం ఎయిమ్స్ ఆస్పత్రిలోని అత్యవసర వార్డులో చేర్పించామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన జ్వరంతో బాధపతున్నారని అయితే ఆరోగ్యం స్థిరంగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌కు సంబంధించిన పరీక్షలు చేయగా.. అన్ని పరీక్షల ఫలితాలు పాజిటివ్ రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. -
వామ్మో!! ఆరు టన్నుల లాంతర్ ఆవిష్కరణ!!
Lalu Prasad can inaugurate 6 ton lantern: ఈ రాజకీయ నాయకులు వినూత్నంగా చేసే కొన్ని పనులు భలే ఫేమస్ అవుతాయి. పైగా తమ అభిమాన నాయకుడే ఆవిష్కరించాలన్న ఉద్దేశంతో వారి పార్టీ శ్రేణులు కొన్నింటిని భలే విన్నూతన రీతిలో వస్తువులు లేదా భవనాలను తయారుచేయడం లేదా కట్టించడం వంటి పనులు చేస్తుంటారు. అచ్చం అలానే పాట్నాలోని ఆర్జేడీ ప్రధాన కార్యాలయంలో తమ అభిమాన నాయకుడు ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఒక భారీ లాంతరు ఏర్పాటు చేశారు. (చదవండి: 2070 నాటి కల్లా భారత్ కార్బన్ న్యూటల్ దేశంగా మారాలి: నితిన్ గడ్కరీ) అసలు విషయంలోకెళ్లితే....పాట్నాలోని ఆర్జేడీ ప్రధాన కార్యాలయంలో వారి పార్టీ చిహ్నం అయిన 6 టన్నుల కంటే ఎక్కువ బరువున్న ఒక భారీ లాంతరును ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ త్వరలో లాంతరును ఆవిష్కరించే అవకాశం ఉన్నందున ఆ ప్రాంగణంలోకి ప్రవేశంపై నిషేధం కూడా విధించారు. అయితే ఈ లాంతర్ని తేజస్వి యాదవ్ అనే వ్యక్తి చొరవతోనే ఈ లాంతరును నిర్మించినట్లు ఆర్జేడీ కార్యకర్తలు చెబుతున్నారు. బంకా జిల్లా ట్రెజరీకి సంబంధించిన డబ్బు కుంభకోణం సంబంధించిన కేసు కోసం లాలు ప్రసాద్ యాదవ్ సీబీఐ అత్యున్నత న్యాయస్థానం ముందు హాజరై నిమిత్తం పాట్నా వస్తున్నారు. అందువల్ల ఆ సమయంలోనే ఈ ఆవిష్కరణ జరిగే అవకాశం ఉందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆవిష్కరణతో పాటు పార్టీ అధినేత పాట్నా పర్యటన తర్వాత కుల గణన అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. (చదవండి: ఇంట్లో వీల్‌చైర్‌లా... బయట స్కూటీలా) -
Odisha Tour: ఒడిశా ముఖ్యమంత్రితో సీఎం జగన్ భేటీ
-
మా ఊరికి రైడ్‌కు ఎందుకు వచ్చారంటూ పోలీస్‌ను పోల్‌కు కట్టేశారు!
పాట్నా: కొంతమంది దుండగులు తమ ఊరులోకి వచ్చిన ఓ పోలీసును చుట్టుముట్టి దాడి చేశారు. అంతటి ఆగకుండా ఆ పోలీసును ఓ పోల్‌కు కట్టేసి కొడుతూ దర్భాషలాడారు. ఈ ఘటన బీహార్‌లోని మోతీహరి ప్రాంతం సమీపంలోని ధర్మపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గ్రామంలో కొంతమంది మద్యం తాగి గొడవ చేస్తున్నారని సమాచారం అందటంతో ఓ పోలీసు ధర్మపూర్ గ్రామానికి వెళ్లారు. ఊరిలోకి చేరుకున్న పోలీసును ఒక్కసారిగా కొంతమంది దుండగులు చుట్టుముట్టి పోల్‌కు కట్టేసి దాడి చేశారు. అందులో ఇద్దరు వ్యక్తులు పోలీసును కొడుతూ, దుర్భాషలాడారు. ఈ ఘటనను మరోవ్యక్తి వీడియో తీశాడు. ఇక్కడ గొడవ జరిగినట్లు మీకు ఎవరు చెప్పారని అడుగుతూ పోలీసును నిలదీశాడు. అదేవిధంగా దీపావళి సందర్భంగా ఎటువంటి గొడవలు ఇక్కడ జరగవని ఎందుకు తమ ఊరికి రైడ్ చేయడానికి వచ్చారని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సీసీటీవీ వీడియో ఆధారంగా ఆ పోలీసును సుగైలి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీపీ ఫుటేజ్ ఆధారంగా అనుమానం ఉన్న పలువురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. దీనిపై అన్ని కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
2013 పట్నా పేలుళ్ల కేసు..దోషులకు శిక్ష ఖరారు
-
ప్రిన్సిపల్ పోస్ట్ కోసం పిడిగుద్దులు.. ముష్టిఘాతాలు
పాట్నా: ఏ జాబ్‌లోనైనా ప్రమోషన్ రావాలంటే అందుకు తగ్గ అర్హత ఉండాలి. మరి ఇద్దరికి అర్హత ఉండి ఒక్కడ్నే ఆ పోస్ట్‌లో కూర్చోబెట్టాలంటే అది కత్తి మీద సామే. ఇక్కడ ఎవరు బెస్ట్ అని ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేసే ఆ పదవిలో ఒకర్ని కూర్చోబెడతారు. మరి పిడిగుద్దులు కురిపించుకుంటే అనుకున్న పదవి కట్టబెడతారానుకున్నారో.. ఏమో.. తలపడిపోయారు.. కిందా పడిపోయారు.. స్కూల్ ప్రిన్సిపల్ పోస్ట్ కోసం తన్నుకుని రచ్చ చేసుకున్న ఘటన బిహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.,. పాట్నాకు 150 కి.మీ దూరంలో ఉన్న మోతిహరిలోని స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో శివశంకర్ గౌరి-రింకీ కుమారీలు ఇద్దరూ స్కూల్ ప్రిన్సిపల్ పోస్ట్ కోసం పోటీ పడ్డారు. దీనిలో భాగంగా ఉద్యోగానికి ఎవరు ఎక్కువ సీనియర్, తగిన అర్హత ఉన్నారనే విషయంపై అర్హతల పత్రాలను అందజేయాలని జిల్లా విద్యా శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి వీరి మధ్య అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ రింకీ కుమార్ భర్త కూడా ఎంటర్ అయిపోయాడు. ఇది మరింత కాక రాజేసింది. స్టేట్ డిపార్ట్మెంట్లో పత్రాలను సమర్పించే క్రమంలో శివ శంకర్‌తో తీవ్రంగా ఘర్షణ పడ్డాడె రింకీ కుమారీ భర్త.. ఈ గొడవలో శివ శంకర్ గౌరీని రింకీ కుమార్ భర్త కిందపడేశాడు. శివ శంకర్‌ను ఎటు కదలనీయకుండా చేసిన రింకీ భర్త.. చివరకు కింద పడేవరకు వదల్లేదు. అక్కడున్న వారు వారిద్దర్నీ విడదీయడానికి ఎంతగా యత్నించినా వారు మాత్రం రెచ్చిపోయి మరీ ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. , , -
ఎల్జేపీ గుర్తును ఫ్రీజ్ చేసిన ఈసీ
పట్నా: లోక్ జనశక్తి పార్టీ గుర్తును ఫ్రీజ్ చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పార్టీ గుర్తు ‘బంగ్లా’ను చిరాగ్ పాశ్వాన్ వర్గం, కేంద్ర మంత్రి పశుపతి పారస్ వర్గాలు ఎవరూ ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎల్జేపీ గుర్తు కోసం చిరాగ్ పాశ్వాన్, పశుపతి పారస్ వర్గాల మధ్య వివాదం చేలరేగిన విషయం తెలిసిందే. బీహార్‌లోని కుశేశ్వర్ ఆస్థాన్, తారాపూర్‌లో అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈసీ ‘బంగ్లా’ గుర్తును ఫ్రీజ్ చేసినట్లు పేర్కొంది. జరగబోయే ఉప ఎన్నికల్లో ఉపయోగించే గుర్తు విషయంలో ఈసీ మూడు ఆప్షన్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మూడు ఆప్షన్లను సోమవారం మధ్యాహ్నం ఈసీ ప్రకటించనున్నట్లు సమాచారం. -
నడి రోడ్డుపై ట్రాఫిక్ పోలీసును చితకబాదాడు
పట్నా: బిహర్లో ఒక వ్యక్తి నడిరోడ్డుపై రెచ్చిపోయాడు. ట్రాఫిక్ పోలీసుపైనే దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జెహనాబాద్ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే విధంగా.. రోడ్డు మధ్యలో తన ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు. దీంతో ట్రాఫిక్ పోలీసు వాహనాన్ని తీసేయాలని సూచించాడు. దీంతో సదరు వ్యక్తి పోలీసుతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా కిందపడేసి మరీ దాడి చేశాడు. ఆ తర్వాత స్థానికులు అతడిని వారించారు. ఆ తర్వాత నిందితుడు బైక్‌ను రోడ్డుపైనే వదిలేసి పారిపోయాడు. ట్రాఫిక్ పోలీసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: తెలుగు అకాడమీ స్కాం కేసు: డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు -
Lalu Prasad Yadav: కుల గణన చేయాల్సిందే
పట్నా(బిహార్): కేంద్ర ప్రభుత్వం కుల ప్రాతిపదికన జనాభా గణనను నిర్వహించాలని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. కుల గణన తర్వాత మొత్తం జనాభాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంఖ్య సగం కంటే ఎక్కువగా ఉందని తేలితే ఆ మేరకు రిజర్వేషన్లలో తగిన ప్రాధాన్యత దక్కాలని ఆయన అభిలషించారు. మొత్తం జనాభా కంటే ఈ వర్గాల జనాభా సగం కంటే ఎక్కువగా ఉంటే ఇప్పుడు అమలవుతోన్న 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం ఆర్జేడీ పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో ఆయన ప్రసంగించారు. ‘ స్వాతంత్య్రం రాక ముందు నాటి జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్ కోటాలను అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగిస్తున్నాం. వేర్వేరు సామాజిక వర్గాల తాజా జనాభాలను లెక్కించి 50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై నిర్ణయాలు తీసుకోవాలి. కుల గణన చేపట్టాలని తొలిసారిగా డిమాండ్ చేసింది నేనే. ఈ డిమాండ్‌ను పార్లమెంట్ వేదికగా గతంలోనే నాటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. ఇప్పుడున్న కోటా ప్రస్తుత అవసరాలకు సరిపోదు. రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవట్లేదు’ అని లాలూ వ్యాఖ్యానించారు. లాలూ చిన్న కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సైతం కుల గణన అంశాన్ని ప్రధాని మోదీ వద్ద ఇటీవల ప్రస్తావించారు. ఆరోగ్యం కుదుటపడ్డాక త్వరలోనే బిహార్‌లో అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని లాలూ చెప్పారు. దాణా కుంభకోణం, తదితర కేసుల్లో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తూ, మరి కొన్ని కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్న సంగతి తెల్సిందే. అనారోగ్యం, మెరుగైన చికిత్స కారణాలతో బెయిల్ లభించడంతో ఈ ఏడాది జైలు నుంచి బయటికొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో చికిత్స తీసుకుంటున్నారు. చదవండి: Farmers Protest: రైతు నిరసనలకు 300 రోజులు -
ఆమె ధైర్యం ముందు విధి సైతం చిన్నబోయింది!
చాలామంది చిన్నచిన్న కష్టాలకి కుంగిపోతారు! మరికొందరూ..ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వగానే నిరాశ నిస్ప్రుహలకి లోనై అక్కడితో ఆగిపోతారు. కొద్దిమంది మాత్రమే విధి విసిరిన సవాలును ఎదిరించి నిలబడి తనని తాను నిరూపించుకోవటానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఆదర్శంగా నిలుస్తారు. ఈ కోవకు చెందిన బాలిక బిహార్‌కు చెందిన తనూ కుమారి. ఓ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన తనూ కుమారి.. కాళ్లనే చేతులుగా మార్చుకుని తన భవిష్యత్తును చెక్కుకుంటుంది. ఆ వివరాలు.. బిహార్ పట్నాకు చెందిన తనూ కుమారి ప్రస్తుతం పదో తరగతి చదువుతుంది. ఆమెకు రెండు చేతులు లేవు. 2014లో తనూ టెర్రస్ పై ఆడుకుంటూ అనుకోకుండా ఎలక్ట్రిక్ వైరులను పట్టుకోవడంతో తన రెండూ చేతులను కోల్పోయింది. అయినా కూడా తనూ వెనకడుగు వేయలేదు. కాళ్లనే చేతులుగా మార్చుకుంది. పట్టుదలో శ్రమించి కాలి వేళ్లతో రాయడం నేర్చుకుంది. అది మాత్రమే కాక పేయింటింగ్ కూడా ప్రాక్టీస్ చేసింది తనూ. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న తనూ కుమారి.. బాగా చదువుకుని భవిష్యత్తులో టీచర్ని అవుతానని ధీమా వ్యక్తం చేస్తోంది. (చదవండి: మహిళ చేతిలో కేంద్ర మంత్రికి ఘోర అవమానం) ఆటలు ఆడటం, పేయింటింగ్ వేయడం తనకు ఎంతో ఇష్టమంటుంది తనూ కుమారి. ఇప్పటికే పలు పేయింటింగ్ కాంపిటీషన్స్‌లో పాల్గొని.. ఎన్నో అవార్డులు గెలుచుకుంది. కూతురు ఆత్మస్థైర్యం చూస్తే తనకెంతో గర్వంగా ఉంటుందంటున్నారు ఆమె తల్లి సుహా దేవి. తన కూతురు ఆత్మస్థైర్యంతో వైకల్యాన్ని అధిగమించి దూసుకుపోతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె తండ్రి అనిల కుమార్ గ్యాస్ డెలివరి మెన్‌గా పనిచేస్తున్నాడు. తాను పేదవాడినని తమను ప్రభుత్వం ఆదుకుంటే బాగుండనని ఆమె తండ్రి అనిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. (చదవండి: చెల్లితో పాములకు రాఖీ కట్టించబోయాడు.. ప్రాణాలు కోల్పోయాడు) ప్రభుత్వ సాయం చేయాలి.... ఆమెను మొదటిసారి చూసినప్పుడే ఆశ్చర్యపోయానని, ఇలాంటి ధైర్యవంతురాలికి ప్రభుత్వ అండగా నిలిస్తే ఆమె మరిన్ని విజయాలు సాధిస్తోందని తనూ సైన్య్ టీచర్ దివ్య కుమారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెకు మేము ఎల్లప్పుడు తోడుగా ఉంటాం, తనూ ఓడిపోదూ... ఆత్మస్థైర్యంతో దూసుకుపోతుందంటూ తనూ కుమారి స్నేహితులు కొనియాడారు. Bihar | Tanu Kumari, a Patna-based girl, who lost both her hands in an accident in 2014, gets promoted to class 10 "After the accident, I slowly learned how to write with my feet. I also like to participate in sports and painting activities. I want to become a teacher," she says pic.twitter.com/UcGYyqTlAm — ANI (@ANI) September 6, 2021 -
భార్యకు అబార్షన్... క్షుద్రపూజల కోసం బాలిక కళ్లు పీకి..
పట్నా: సాంకేతికత ఎంత పెరుగుతున్నా తాంత్రిక, క్షుద్ర పూజల పేరిట జరిగే హత్యలు మాత్రం ఆగడం లేదు. తాజాగా బిహార్‌లో ఓ వ్యక్తి పదేళ్ల చిన్నారిని క్షుద్ర పూజాల కోసం దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంగేర్ జిల్లాలోని ఓ గ్రామంలో దిలీప్ కుమర్ చౌదరి తన భార్యకు తరచూ అబార్షన్ అవుతుండటంతో ఆ సమస్య నుంచి ఎలాగైనా బయటపడాలనుకున్నాడు. అబార్షన్ కాకుండా శాశ్వతంగా నివారించాలకున్నాడు. దాని కోసం స్థానిక తాంత్రికుడు పర్వేజ్ ఆలమ్‌ను ఆశ్రయించాడు. అయితే పదేళ్ల ఓ బాలిక రక్తం, కళ్లతో క్షుద్రపూజ చేస్తే అబార్షన్ కాకుండా నివారించవచ్చని పర్వేజ్ చెప్పాడు. ఈ క్రమంలో ఆగస్టు 4న ఓ బాలిక తన తండ్రికి భోజనం ఇచ్చి తిరిగి వస్తుండగా.. దిలిప్ కుమార్ తన స్నేహితులతో కలిసి ఆమెపై దాడి చేసి కళ్లను పీకి, రక్తం సేకరించాడు. అయితే ఆ బాలిక తిరిగి ఇంటికి ఎంతకు రాకపోవటంతో అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మరుసటి రోజు గ్రామంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేయడానికి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా పర్వేజ్ ఆలమ్, దిలీప్ కుమర్ చౌదరి, తన్వీర్ ఆలమ్, దశరథ్ కుమార్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అయితే నరబలి కారణంగా తమ కుమర్తెను హత్య చేయలేదని, హత్యాచారం చేసి చంపారని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరారు. -
కోడలితో కోరికలకు కన్నకొడుకే అడ్డు.. తట్టుకోలేక తండ్రి
పాట్నా: కామంతో కళ్లు మూసుకుపోయి వావివరుసలు మరచిపోతున్నారు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనై సొంత కుటుంబసభ్యులనే కడతేరుస్తున్న ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ తండ్రి తన సొంత కుమారుడి భార్యపై కన్నేశాడు. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడుఅయితే. కోడలితో లైంగిక జీవితానికి అడ్డుగా ఉన్నాడని భావించి కుమారుడినే దారుణంగా హత్య చేసిన సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. చేసిదంతా చేసి మళ్లీ ఏమీ ఎరగనట్లు తన కుమారుడు అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బిహార్ రాజధాని పాట్నా సమీపంలోని కొద్రాకు చెందిన మిథిలేశ్ రవిదాస్ కుమారుడు సచిన్. ఇటీవల కొన్నేళ్ల కిందట కుమారుడికి వివాహమైంది. భర్త, మామతో కలిసి ఆమె జీవిస్తోంది. ఈ క్రమంలో మామ ఆమెపై కన్నేశాడు. మెల్లగా ఆమెకు దగ్గరై వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. అలా మామ, కోడలు కొన్నాళ్లుగా సంబంధం కొనసాగిస్తున్నారు. కొన్ని రోజులకు కుమారుడికి తన ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఒకసారి తన భార్యకు చేరువగా ఉండడాన్ని గమనించి తండ్రిని నిలదీశాడు. తన భార్యతో తండ్రి సాగిస్తున్న సంబంధం తెలుసుకుని హతాశయుడయ్యాడు. దీనిపై కుటుంబంలో గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో కోడలితో సంబంధానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించి కొడుకు హత్యకు ప్రణాళిక రచించాడు. కొడుకు సచిన్‌తో జూలై 7వ తేదీన గొడవపడిన తండ్రి మిథిలేశ్ రవిదాస్ కొద్దిసేపటికి కత్తితో గొంతుకోసి అతి దారుణంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ఓ తోటలో పడేశాడు. అయితే తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి సంఘటనను తప్పుదోవ పట్టించాడు. కొంతమందిపై అనుమానం ఉందని ఓ ఐదుగురి పేర్లు కూడా చెప్పారు. వారిని విచారణ చేస్తుండగానే తండ్రి చేసిన ఘాతుకం బహిర్గతమైంది. నిందితుడు మిథిలేశ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రాజీవ్ సింగ్ తెలిపారు. -
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ ఆటకట్టించిన పోలీసులు..
పట్నా: గత కొంత కాలంగా బిహర్ పోలీసులకు కంటిమీదకునుకు లేకుండా చేసిన గ్యాంగ్‌స్టర్ మున్న మిశ్రాను బిహర్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. యూపీకి చెందిన మిశ్రాను దేవోరియా ప్రాంతంలో యూపీ, బిహర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుడిపై ఇప్పటికే అనేక హత్యలకు సంబంధించిన కేసులు, కిడ్నాప్‌లు, లూటీ కేసులు ఉన్నాయని తెలిపారు. మున్న మిశ్రా ఆచూకీని తెలియజేస్తే యాభైవేలు ఇస్తామని గతంలోనే యూపీ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, విశ్వసనీయ సమాచారం మేరకు.. యూపీలోని దియోవరియా ప్రాంతంలోని ఒక ఇంట్లో మున్న మిశ్రా ఉన్నట్లు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత దాడిచేసి అతడిని అదుపులోని తీసుకున్నామని యూపీ పోలీసులు పేర్కొన్నారు. నిందితుని దగ్గర నుంచి ఏకే 47 రైఫిల్ గన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, యూపీలోనే మరొక గ్యాంగ్‌స్టర్ బదన్ సింగ్‌కు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగిన మరుసటి రోజే మిశ్రాను పట్టుకున్నామని అధికారులు పేర్కొన్నారు. బదన్ సింగ్‌పై కూడా ఒక లక్ష రూపాలయల రివార్డు ఉందని తెలిపారు. కాగా, పోలీసులు ఆగ్రా, రాజస్థాన్ బార్డర్లో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అనుమానస్పదంగా ఉండటాన్ని గమనించారు. వారి వద్దకు చేరుకునేలోపే.. పోలీసులుపై కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు కాల్పులలో నిందితులు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో వారిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారని అధికారులు తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యూపీ పోలీసులు తెలిపారు. -
Liquor Mafia: ఎస్‌యూవీతో తొక్కించి కానిస్టేబుల్ దారుణ హత్య
పాట్నా: బిహార్‌లోని దర్భంగాలో దారుణం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ని మద్యం మాఫియా ఎస్‌యూవీతో తొక్కించి హత్య చేసింది. ఈ ఘటన గురువారం రాత్రి కియోటి పోలీస్ స్టేషన్ వెలుపల జరిగింది. ఈ ఘటనపై పోలీసులు ఆరుగురుని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కానిస్టేబుల్ షఫీ-ఉర్ రెహమాన్ కియోటి పోలీస్ స్టేషన్ వెలుపల విధులు నిర్వహిస్తున్నారు. అయితే భారత్-నేపాల్ సరిహద్దు నుంచి వచ్చే ఓ ఎస్‌యూవీని ఆపడానికి సిగ్నల్ ఇచ్చాడు. కానీ డ్రైవర్ బ్రేకులు వేయకుండా వేగంగా పోనిచ్చాడు. దీంతో ఎస్యూవీ చక్రాలలో చిక్కుకున్న కానిస్టేబుల్‌ను వాహనం 200 మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన రెహమాన్‌ను దర్భాంగా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందతూ మరణించారు. ఈ ఘటనపై దర్భాంగా సిటీ ఎస్పీ అశోక్ ప్రసాద్ మాట్లాడుతూ.. నేపాల్ నుంచి ఎస్‌యూవీలో భారిగా మద్యం సరుకును రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మద్యం రవాణా చేస్తున్న ఎస్‌యూవీని, మరో కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా బీహార్ ప్రభుత్వం మద్యం అమ్మకం, వినియోగాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. ఇక ఫోరెన్సిక్ బృందం ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది. -
నడిరోడ్డుపైనే దారుణం.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం
పట్నా: బిహార్‌లో దారుణం చోటుచేసుకుంది. మెటార్‌సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని అడ్డుకున్న దుండగులు నడ్డిరోడ్డుపైనే అతడిని హత్య చేశారు. తుపాకీతో తూటాల వర్షం కురిపించి హతమార్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ముజఫర్‌పూర్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని షియోపూర్ జిల్లాకు చెందిన ప్రాపర్టీ డీలర్ నవాల్ కిషోర్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. వివరాలు.. నవాల్ కిషోర్ సీతామర్హి- ముజఫర్‌పూర్ జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అతడిని అడ్డుకున్నారు. అందులో ఓ వ్యక్తి.. వెంటనే తుపాకీ తీసి అతడి వెన్నులో కాల్చారు. తూటా దెబ్బకు అతడు కిందపడిపోగానే.. మరోసారి కాల్పులు జరిపారు. ఆ సమయంలో వారిని చూసి మొరుగుతున్న వీధికుక్క పట్ల కూడా అమానుషంగా వ్యవహరించాడు. దానిని తీవ్రంగా గాయపరచడంతో కొంతదూరం పరిగెత్తుకు వెళ్లి అది మృతిచెందింది. ఇక నవాల్ కిషోర్ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాతే ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు ఈ మేరకు వివరాలు అందించారు. కాగా స్థానిక దివంగత రాజకీయవేత్త సూర్యనారాయణ్ సింగ్ సోదరుడే నవాల్ కిషోర్ అని ముజఫర్‌పూర్ ఎస్ఎస్పీ జయంత్ కాంత్ తెలిపారు. ప్రాంతీయ పార్టీ అయిన జనతాదళ్ రాష్ట్రవాడి తరఫున ఎన్నికల బరిలో నిలవాలని భావించిన సూర్యనారాయణ్ సింగ్... గతేడాది అక్టోబరులో ప్రచారానికి వెళ్లిన సమయంలో హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో నవాల్ కిషోర్ హత్యకు కూడా పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేపట్టారు. -
వివాహేతర సంబంధానికి అడ్డు చెప్పినందుకు భార్యను రాడ్డుతో దారుణంగా..
పాట్నా: బీహార్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని అడ్డుకున్నందుకు భార్యను ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడో భర్త. బీహార్‌లోని నలంద జిల్లాలో లాహేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌చంద్రపురి ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. డాక్టర్ ధీరేంద్ర కుమార్‌తో సుమన్‌కు గత ఏడాది వివాహం జరిగింది. అయితే కుమార్ రూ.15 లక్షల కట్నం తీసుకురావాల్సిందిగా భార్య సుమన్‌ను బలవంతం చేశాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో కుమార్‌పై భార్య వరకట్న వేధింపుల కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుమార్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇంటికి క్రమం తప్పకుండా ఆమెను తీసుకురావడంతో భార్య అడ్డుచెప్పింది. అంతే ఇదే అదునుగా భావించిన నిందితుడు భార్యపై ఇనుప రాడ్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన సుమన్ అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: Vitamin C: తక్కువైతే తంటా.. ఎక్కువైతే మంట! ‘ఎక్స్టార్షన్’ గ్యాంగ్.. బ్లాక్మెయిల్ చేసి రూ. 89 లక్షలు -
చేతిలో పైసా లేదు..భర్త కోసం 1400 కి.మీ. ప్రయాణం
లూథియానా:భార్య మీద అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయిన భర్తను వెతుక్కుంటూ బయలుదేరింది ఓ భార్య .దీనిలో విశేషం ఏముంది అనుకుంటున్నారా? అక్కడే అసలు విషయం దాగి ఉంది, దాదాపు 1400 కిలోమీటర్లు దూరంలో ఉన్న భర్తను వెతుక్కుంటూ బయలుదేరింది.19 ఏళ్లు ఆమె చేతిలో చిల్లి గవ్వ లేకుండా పాట్నా నుంచి పంజాబ్ లోని లూథియానా వరకూ ప్రయాణించింది. ఆమెకు తెలిసిందల్లా ఒకటే..తన భర్త లూథియానాలోని సలేమ్ తబ్రీ ప్రాంతంలోని ఓ చోట పనిచేస్తున్నాడు. దీంతో తన ఇద్దరు పిల్లలను పాట్నాలో తెలిసినవారి వద్ద వదిలేసి లూథియానా వచ్చి భర్తను వెతికే పనిలో పడింది. భర్త కోసం పిచ్చిదానిలా వెతకటం ప్రారంభించింది. అలా వెతుకుతుండగా లూథియానాలో బుద్ దేవ్ అనే వ్యక్తి ఆమెకు కలిశాడు.ఈ ప్రాంతంలో కొత్తగా కనిపిస్తున్నావు,ఇలా ఎవరి కోసం వెతుతున్నావ్ అనిఅడిగాడు. దానికి ఆమె చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు.తిండి పెట్టి ఆశ్రయం ఇచ్చాడు.తరువాత ఆమెను లూథియానా నగర అదనపు డీసీపీ ప్రగ్యా జైన్ వద్దకు తీసుకెళ్లాడు. కానీ ఆమె భర్త గురించి పూర్తి వివరాలు చెప్పలేకపోయింది.తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లైందని..నా భర్త పేరు జాన్. ఇద్దరు పిల్లలు పుట్టాక చిన్న గొడవ వల్ల తనను పిల్లలను వదిలి ఇల్లు వదిలిపెట్టి వచ్చేశాడని తెలిపింది. తరువాత ఫోన్ చేసి నేను లూథియానాలో ఉన్నానని చెప్పాడని..కానీ రమ్మంటే నేను రాను అని చెప్పాడని వాపోయింది. డీసీపీ ప్రగ్యా జైన్ ఆమె ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా పలు రకాలుగా యత్నించినా ఆచూకీ లభించలేదు. అలా అతని ఫోన్ నంబర్ ఆధారంగా చివరకు ఆమె భర్త జాన్‌ను కనిపెట్టారు. మొదట ఈమె ఎవరో తెలీదని జాన్ అబద్దాలు ఆడాడు.కానీ పోలీసులు భయపెట్టటంతో ఆమె నా భార్య అని ఒప్పుకున్నాడు. పోలీసుల కౌన్సిలింగ్ తో ఆమెతో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నాడు. త్వరలోనే బీహార్ నుంచి పిల్లలను తీసుకొచ్చి లూథియానాలోనే ఉంటామని చెప్పాడు. చదవండి:పాముకు ఊపిరి ఊది ప్రాణం నిలిపిన యువకుడు, వీడియో వైరల్ -
కాసేపట్లో పెళ్లి కూతురి మెడలో తాళి.. ఆపాలంటూ పోలీసుల ఎంట్రీ
పట్నా: కాసేపట్లో పెళ్లి కూతురి మెడలో తాళి కట్టనుండగా.. ఇంతలో ఓ యువతి పెళ్లి ఆపాలంటూ పోలీసులతో ఎంట్రీ ఇచ్చింది. దీంతో పెళ్లి ఆగిపోవడంతో పాటు వరుడిని కూడా మార్చాల్సి వచ్చింది. ఈ ఘటన బీహార్‌లోని పట్నాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. పెళ్లి కొడుకు (అనిల్ కుమార్) పాలిగంజ్ సబ్ డివిజన్ లోని సియరాంపూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. అతనికి అదే ప్రాంతంలోని మురార్చక్ గ్రామంలో నివసిస్తున్న కుమారి పింకీ అనే యువతితో ఈ నెల 15న పెద్దలు పెళ్లి నిశ్చయించారు. మరికొద్దిసేపట్లో పెళ్లి జరుగుతుందనంగా ఓ యువతి పోలీసులతో మంటపంలోకి రంగప్రవేశం చేసింది. ఆ యువతి మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ( కుమార్) ఒక సంవత్సరం క్రితం తనని వివాహం చేసుకున్నాడని, వారు భార్యాభర్తలుగా రహస్యంగా కలిసి జీవిస్తున్నారని తెలిపింది. అయితే, అతను తన తల్లిదండ్రుల ఒత్తిడితో వివాహానికి అంగీకరించాడని చెప్పింది. తన భర్త మళ్లీ పెళ్లి చేసుకుంటున్నట్లు తెలియగానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తన పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలను ఫోటోలతో సహా చూపించిన్నట్లు పేర్కొంది. దీంతో పెళ్లి ఆగిపోగా.. ఇక చేసేదేమి లేక మరుసటి రోజు ఉదయం వరుడి తమ్ముడితో వివాహం జరిపించారు. చదవండి: వైరల్: వధువు నోరు, ముక్కు నుంచి పొగ! -
‘ఆ చిన్నారులపై మాత్రమే కోవాగ్జిన్ ట్రయల్స్ జరుపుతాం’
పట్నా: కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి అడ్డుకట్టకు భారత్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇక మూడో వేవ్ ప్రమాదం ఉందని అదీ పిల్లలపై అధికంగా ప్రభావం చూపనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో చిన్నారులపై పట్నా ఎయిమ్స్‌లో కోవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను ప్రారంభించారు. ఈ ట్రయల్స్‌లో భాగంగా సుమారు 70 నుంచి 80 మంది చిన్నారులను ఎంపిక చేసుకొని వాక్సిన్ ఇవ్వనున్నట్లు పట్నా ఎయిమ్స్ సూపరెంటెండెంట్ డాక్టర్ సీఎం సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్లు ఇవ్వనున్న పిల్లలకు ఆర్టీ పీసీర్, యాంటిజెన్ పరీక్షలు ముందే జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పరీక్షల్లో కరోనా నెగటివ్ వచ్చిన వారిపై మాత్రమే ట్రయల్స్ జరపనున్నట్లు పేర్కొన్నారు. అదే క్రమంలో తరచూ పిల్లల ఆరోగ్య పరిస్థితులను సమీక్షించనున్నట్లు తెలిపారు. 2 సంవత్సరాల నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్నారుల పై ట్రయల్స్ నిర్వహించేందుకు డీజీసీఐ అనుమతినిచ్చింది. పట్నాలో ఈ ట్రయల్స్ నమోదుకు కోసం జాబితాలో ఓ 13 ఏళ్ల కుర్రాడు తొలుత పేరును నమోదు చేసుకున్నట్లు డా.సింగ్ తెలిపారు. ట్రయల్స్‌లో పాల్గొనే పిల్లలకు ఆస్పత్రి రావాణా అలవెన్స్ కింద 1000 ఇవ్వనున్నట్లు తెలిపారు. పిల్లలపై ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్ సంస్థకు గత మే 11వ తేదీన డీజీసీఐ అనుమతినిచ్చింది. ఇక పట్నా ఎయిమ్స్‌తో పాటు ఢిల్లీలోని ఎయిమ్స్, నాగపూర్‌లోని మెడిట్రినా హాస్పిటళ్లలోనూ ఈ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి పొందారు. కాగా దేశంలో ప్రస్తుతం 18 ఏళ్ల వయసు దాటిన వారికి మాత్రమే టీకాలు ఇస్తున్న విషయం తెలిసిందే. చదవండి: కోవాగ్జిన్ ఉత్పత్తి పెంపు కోసం కేంద్రం కీలక నిర్ణయం -
పాడె మోసేందుకు ఒక్కడు రాలేదు, తినడానికి 150 మంది వచ్చారు
పాట్నా : సాటి మనిషికి కష్టమొస్తే.. అండగా నిలిచి మానవత్వం చూపాల్సిన వాళ్లే రాబందుల కన్నా హీనంగా వ్యవహరించారు. రాబందులన్నా.. కళేబరాలను మాత్రమే పీక్కుతింటాయి. కానీ మనిషి రూపంలో ఉన్న ఈ రాబందులు బతికున్న వాళ్లను పీక్కుతింటున్నారు. అనాథలైన పిల్లలకు తలో చేయ్యేసి మేమున్నామని భరోసా ఇవ్వాల్సిన తరుణంలో వీరు తలో చేయ్యేసి వారి సొమ్మును కాజేసి వాటాలు పంచుకున్నారు. బిహార్ అరియా జిల్లాలో బిష్ణుపుర గ్రామపంచాయితీకి చెందిన ముగ్గురు చిన్నారులు సోని(18) నితీష్ (14 ), చాందిని (12)లు నాలుగు రోజుల వ్యవధిలో తల్లితండ్రుల్ని కోల్పోయి అనాథలయ్యారు. అనారోగ్యంతో తండ్రి బిరేంద్ర సింగ్, కరోనాతో తల్లి ప్రియాంక దేవి మరణిస్తే అంత్యక్రియల్ని నిర్వహించేందుకు 18ఏళ్ల కుమార్తె గ్రామస్తుల సాయం కోరింది. ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ బాలిక తల్లి మృతదేహాన్ని తన ఇంటి సరిహద్దుల్లోనే అంత్యక్రియలు నిర్వహించింది. కానీ తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం నిర్వహించిన దశదిన కర్మకు భోజనం చేసేందుకు 150 మంది గ్రామస్తులు వచ్చారు. భోజనం చేసిన అనంతరం తల్లిదండ్రులకు ట్రీట్మెంట్ కు తాము ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అందినకాడికి అభంశుభం తెలియని అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి వాటాలు పంచుకోవడం పలువురిని కంటతడిపెట్టిస్తోంది. ఈ సందర్భంగా పెద్దకుమార్తె సోని మాట్లాడుతూ.. ‘నా తండ్రి అనారోగ్యంతో మరణించారు. తల్లి కరోనాతో మరణించింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తుల్ని సాయం కోరితే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కానీ దశదిన కర్మకు 150 మంది గ్రామస్తులు వచ్చారు. ఇంతమంది వస్తారని ఊహించలేదు. వచ్చిన వాళ్లు తండ్రి ట్రీట్మెంట్కు డబ్బులు ఇచ్చామని, ఆ డబ్బులు తిరిగి చెల్లించాలని మాపై ఒత్తిడి తెచ్చారంటూ’ ఆ బాలిక కన్నీటి పర్యంతరమైంది. చదవండి: పేరుకే గుమస్తా, ఇంట్లో ఎటు చూసినా బంగారమే -
తండ్రి రాక్షసత్వం, భార్యపై కోపంతో ఇద్దరు పిల్లలను..
పట్నా: బీహార్‌లోని పట్నాలో దారుణం చోటు చేసుకుంది. తనపై భార్య కేసు పెట్టిందన్న కోపంతో కన్న పిల్లలను దారుణంగా చంపాడు ఓ కసాయి తండ్రి. పట్నా రూరల్ జిల్లా కన్హాయ్‌పూర్ గ్రామానికి చెందిన కమల్‌దేవ్, వీణా దేవి అనే మహిళకు కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి అంకిత్ కుమార్ (6), అలీషా (3) అనే ఇద్దరు సంతానం ఉన్నారు. కాగా,వీణా దేవి పలువురితో అక్రమసంబంధం కలిగి ఉందని, ఆమెతో కమల్‌దేవ్ తరచూ గొడవపెట్టుకునేవాడు. వారిద్దరి మధ్య తరచూ గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమెపై భౌతికంగా దాడి చేశాడు. ఎలాగోలా తప్పించుకున్న ఆమె పిల్లలను ఇంట్లో వదిలేసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులతో కలిసి తన భర్తపై గృహహింస, అదనపు కట్నం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భార్యపై కోపంతో శుక్రవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న చిన్నారుల తలపై బలంగా కొట్టి చంపేశాడు. అనంతరం ఉదయం 5 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అనంతరం పోలీసులు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి చూడగా అంకిత్, అలీషా మృతదేహాలు వారు నిద్రిస్తున్న మంచం మీద రక్తపు మడుగులో పక్కపక్కనే పడి ఉన్నాయి.తన భార్య పలువురితో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆ పిల్లలు తన వల్ల కలిగిన సంతానం కాదని చెబుతూ మానసికంగా వేదించేదని ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. (చదవండి: కరోనాతో భర్త మృతి చెందాడని.. గర్భిణి ఆత్మహత్య) -
Covid 19: ఓవైపు భర్త మరణం.. మరోవైపు అటెండర్ అసభ్య ప్రవర్తన
పట్నా: ‘‘వైద్యో నారాయణో హరిః’’ అన్నారు. ఓ వైపు కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. మరో వైపు డాక్టర్లు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా..అంకితభావంతో ప్రజలకు వైద్యసేవలను అందిస్తున్నారు. అయితే కొంతమంది వైద్య సిబ్బంది మాత్రం రోగుల పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. బీహార్‌లోని భాగల్పూర్లో ఓ ఆసుపత్రి సిబ్బంది మహిళ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. గ్లోకల్ హాస్పిటల్ వైద్యులు, మరో ఇద్దరు సిబ్బంది లైంగిక వేదింపులకు పాల్పడినట్లు సదరు మహిళ పేర్కొన్నారు. నగరంలోని గ్లోకల్, మాయాగంజ్ ఆసుపత్రి సిబ్బంది తన భర్తకు చికిత్స అందించడానికి నిరాకరించారని 12 నిమిషాల వీడియోలో పేర్కొంది. ‘‘నేను, నా భర్త నోయిడాలో ఉంటాం. హోలి పండుగ జరుపుకోవడానికి బిహార్ వచ్చాం. ఏప్రిల్ 9న నా భర్త అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన జ్వరం వచ్చింది. దాంతో రెండుసార్లు కరోనా టెస్ట్ చేయిస్తే నెగెటివ్ వచ్చింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం ప్రయత్నిస్తే.. నోయిడాలోని ఓ వైద్యుడు సీటీ స్కాన్ చేయించాలని సూచించారు. స్కానింగ్‌లో ఊపిరితిత్తులు 60శాతం దెబ్బతిన్నాయని తేలింది. మరుసటి రోజు నా భర్త, నా తల్లిని భాగల్పూర్ ఆసుపత్రిలో చేర్పించాం. నా తల్లి పరిస్థితి బాగుంది. కానీ ఆ సమయంలో నా భర్త మాట్లాడలేపోయారు. ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఆక్సిజన్ అందించడానికి కూడా నిరాకరించారు. బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్ కొన్నా ఫలితం దక్కలేదు. గ్లోకల్ ఆసుపత్రిలో పనిచేసే అటెండర్ జ్యోతి కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడు. చున్నీ పట్టుకుని లాగుతూ వికృతంగా నవ్వాడు. ఆ సమయంలో నాకు భయం వేసింది. కానీ నా భర్త గురించిన ఆలోచనే ఉంది. మా అమ్మ, భర్త ఉన్నారు కదా అని ధైర్యం చెప్పుకొన్నాను. నిజానికి ఆసుపత్రి సిబ్బంది కనీసం మంచంపై బెడ్ షీట్స్ మార్చడానికి అనుమతించ లేదు. కోవిడ్-19 చికిత్స కోసం ఉపయోగించే రెమ్‌డెసివిర్ మందును వృథా చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల నా భర్త ప్రాణాలు కోల్పోయారు ’’ అని ఆమె తన ఆవేదన వెళ్లగక్కింది. కాగా.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. కరోనా వల్ల ప్రభావితమైన రాష్ట్రాల్లో బిహార్ ఒకటి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11,000 కేసులు నమోదు కాగా, 67 మంది మరణించారు. ఇప్పటి వరకు బిహార్‌లో 5.91 లక్షల కేసులు నమోదు కాగా..4.77 లక్షల మంది కోలుకోగా.. 3,282 మంది మరణించారు. ఇక దేశంలో 2.27 కోట్ల కరోనా కేసులు నమోదు కాగా..1.87 కోట్ల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోవిడ కారణంగా 2.46 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. (చదవండి: కరోనా: ఆ టీకా ఒక్క డోసుతో 80 శాతం మరణాల రేటు తగ్గుదల!)