పట్నా: దీర్ఘకాంలంగా ఉన్న బిహార్ ప్రత్యేక ఇవ్వాలనే డిమాండ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్తానని కేంద్రమంతి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో బిహార్ ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడారు.
‘ఇది ఒత్తిడి చేసే రాజకీయం కాదు. ఇది మన దీర్ఘకాల డిమాండ్. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఏ పార్టీ బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయదు. ఏ పార్టీ అయినా బిహార్‌కు ప్రత్యేక హోదా అంగీకరిస్తుందా?. కానీ, మేము బిహార్‌కు ప్రత్యేక హోదా విషయంలో అనుకూలంగా ఉన్నాం. మేము ఎన్డీయే ప్రభుత్వంలో ఉన్నాం.
..ఎన్డీయే కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీ. ప్రధాని మోదీ మా లీడర్. మేము ఆయనపై నమ్మకం పెట్టుకున్నాం. ప్రధాని మోదీ ముందు ఈ డిమాండ్‌ను మేము పెట్టకపోతే.. మరి బిహార్‌కు ప్రత్యేకహోదా ఎవరు అడుగుతారు?. బిహార్ ప్రత్యేక హోదా ఇవ్వాలి. అదే మన ఆశ. బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించే క్రమంలో మార్చాల్సిన కొన్ని నిబంధనలపై మేము చర్చిస్తాం’ అని అన్నారు.
అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా ఇవ్వటం లేని కేంద్రం గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. బీహార్, ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎన్డీయే కూటమిలో భాగంగా ఐదుస్థానాల్లో పోటీచేసీ ఐదింటిలో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment