special status for Bihar
-
బిహార్‌కు ‘ప్రత్యేక హోదా’ ఇవ్వలేం.. తేల్చిచెప్పిన కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న బిహార్ అధికార పార్టీ జేడీయూకి ఎదురుదెబ్బ తగిలింది. బిహార్‌కు ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలు లేవని కేంద్రం పార్లమెంట్ వేదికగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలని వైఎస్సార్సీపీ, బిహార్‌కు ప్రత్యేక హోదాపై ఆర్జేడీ, జేడీయూ, ఎల్జేపీ, అలాగే ఒడిశా కోసం బీజేడీ డిమాండ్ చేశాయి.The Special Category Status for plan assistance was granted in the past by the National Development Council (NDC) to some States that were characterized by a number of features necessitating special consideration. The decision was taken based on an integrated consideration of… pic.twitter.com/PbPDiJjLyz— ANI (@ANI) July 22, 2024అయితే సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం పార్లమెంట్లో స్పందించింది. ఈ సందర్భంగా బిహార్‌కు స్పెషల్ స్టేటస్‌పై కేంద్రం స్పందిస్తూ అధికారికంగా ఓ నోట్‌ను విడుదల చేసింది. అందులో లోక్‌సభలో బిహార్‌కు ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.అందులో 2012లో ఇంటర్ మినిస్ట్రీ రియల్ గ్రూప్ బిహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలించింది. అయితే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నిర్దేశించిన ప్రమాణాలలో బిహార్ అర్హత సాధించలేదని స్పష్టం చేసింది. దీంతో బిహార్‌కు ఇక ప్రత్యేక హోదా దక్కదేమోనన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.ఇక పంజక్ చౌదరి.. లిఖిత పూర్వక సమాధానంలో ప్రత్యేక హోదా సాధించాలంటే కావాల్సిన అర్హతల గురించి ప్రస్తావించారు. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రకారం స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే..👉పర్వత ప్రాంత రాష్ట్రం అయి ఉండాలి.👉తక్కువ జనాభా,ఎక్కువ గిరిజన ప్రాంతాలు ఉండాలి.👉అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండాలి 👉ఆర్థిక మౌలిక వసతుల లేమి కలిగిన రాష్ట్రమై ఉండాలి 👉అత్యల్ప ఆదాయ వనరులు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదాకు అర్హులని తెలిపింది. -
నితీష్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఆయన నాయకత్వంలోనే ఎన్నికలకు: జేడీయూ
పాట్నా: వచ్చే ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా కీలక వ్యాఖ్యలు చేశారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ నేతృత్వంలోనే జేడీయూ బరిలోకి దిగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం నితిష్ కుమార్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని తన భూజాలపై వేసుకొని నడిపించారని ప్రస్తావించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగనున్నట్లు చెప్పారు. అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పారు.నితీష్ రాజకీయాల్లో పడిపోతున్నారని అనుకున్న ప్రతీసారి అతను తన అద్భుతమైన పనితనంలో పునరాగమనం చేసి అందరిని ఆశ్యర్యపరుస్తుంటారని తెలిపారు. నితీష్‌పై ప్రజలకు ఇంకా నమ్మకం ఉందని చెప్పేందేకు లోక్‌సభ ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏకంగా 177 స్ధానాల్లో ఎన్డీయేకు స్పష్టమైన ఆధిక్యం లభించిందని గుర్తుచేశారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఇండియా కూటమి నుంచి ఎన్డీయేలోకి మారిన నితిష్ కుమార్ బీహార్ లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లు సాధించి 'కింగ్‌మేకర్'గా అవతరించారు.'బీహార్‌కు ప్రత్యేక హోదాపై సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ, 2004 నుండి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భాగస్వామిగా ఉన్న ప్రతిపక్షం బిహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని ఎప్పుడూ లేవనెత్తలేదు. ప్రత్యేక హోదా గురించి వారు కనీసం ఒక్కసారి కూడా డిమాండ్ చేయలేదు.మేము మాత్రం మొదటినుంచీ ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నాం. ఈ విషయంలో సీఎం నితీష్ కుమార్ నిబద్ధతతో కృషి చేస్తున్నారు. భవిష్యత్‌లో బిహార్‌కు కొద్దిపాటి ఊతం లభించినా తాము కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబడతాం. ప్రత్యేక హోదా విషయంలో అవరోధాలు ఏమైనా ఉంటే ప్రత్యేక ప్యాకేజ్ అయినా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై రాజకీయాలు చేయకూడదు'. ఆయన అన్నారు. -
‘బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. అదే మన ఆశ’
పట్నా: దీర్ఘకాంలంగా ఉన్న బిహార్ ప్రత్యేక ఇవ్వాలనే డిమాండ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్తానని కేంద్రమంతి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో బిహార్ ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడారు.‘ఇది ఒత్తిడి చేసే రాజకీయం కాదు. ఇది మన దీర్ఘకాల డిమాండ్. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఏ పార్టీ బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయదు. ఏ పార్టీ అయినా బిహార్‌కు ప్రత్యేక హోదా అంగీకరిస్తుందా?. కానీ, మేము బిహార్‌కు ప్రత్యేక హోదా విషయంలో అనుకూలంగా ఉన్నాం. మేము ఎన్డీయే ప్రభుత్వంలో ఉన్నాం. ..ఎన్డీయే కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీ. ప్రధాని మోదీ మా లీడర్. మేము ఆయనపై నమ్మకం పెట్టుకున్నాం. ప్రధాని మోదీ ముందు ఈ డిమాండ్‌ను మేము పెట్టకపోతే.. మరి బిహార్‌కు ప్రత్యేకహోదా ఎవరు అడుగుతారు?. బిహార్ ప్రత్యేక హోదా ఇవ్వాలి. అదే మన ఆశ. బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించే క్రమంలో మార్చాల్సిన కొన్ని నిబంధనలపై మేము చర్చిస్తాం’ అని అన్నారు.అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా ఇవ్వటం లేని కేంద్రం గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. బీహార్, ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎన్డీయే కూటమిలో భాగంగా ఐదుస్థానాల్లో పోటీచేసీ ఐదింటిలో విజయం సాధించింది. -
బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇవ్వాలి
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా ఉన్న జనతాదళ్(యునైటెడ్) ఎగ్జిక్యూటివ్ సమావేశం శనివారం జరిగింది. పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ ‡ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో ఆ పార్టీ కీలక తీర్మానాలు చేసింది. బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా స్పెషల్ ప్యాకేజీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పేపర్ లీకేజీ ఘటనల్లో బాధ్యులపై తీవ్ర చర్యలు తీసుకోవడం ద్వారా వీటిని పునరావృతం కాకుండా చేయవచ్చని పేర్కొంది. ఈ సమావేశం నితీశ్‌కి నమ్మకస్తుడిగా, బీజేపీతో మంచి సంబంధాలున్న రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంది. -
బిహార్ ప్రత్యేక హోదా.. అసెంబ్లీలో తీర్మానానికి ఆమోదం
పట్నా: బిహార్‌కు ప్రత్యేక హోదా కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. శనివారం రాష్ట్ర అసెంబ్లీలో బిహార్ ముఖ్య మంత్రి నితీష్‌కుమార్ పార్టీ జేడి(యూ) ప్రత్యేక హోదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది.కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం నితీష్‌కుమార్ దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు.హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ.. నితీష్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి వర్గం గతేడాది ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో తాము ప్రత్యేక హోదా డిమాండ్లను పరిశీలించబోమని కేంద్రం గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సైతం ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ కొన్నేళ్ల నుంచి ఉంది. అయితే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో జేడీ(యూ)తో పాటు టీడీపీ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ విషయంలో సీఎం చంద్రబాబుపై కూడా ఒత్తిడి పెరుగుతుందనటంలో సందేహం లేదు. -
సీమాంధ్రకు ప్రత్యేక హోదా... బీహార్‌లో 'ఆందోళనలు'
ఆంధ్రప్రదేశ్ విభజనతో సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించడంతో బీహార్‌లోని రాజకీయ పార్టీలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం బీజేపీ బీహార్ రైలు రాకో నిర్వహించింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అలాగే స్థానిక రైళ్లు కూడా ఎక్కడివక్కడ స్తంభించిపోయాయి. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నామని రైలురోకోకు నాయకత్వం వహించిన దినాపూర్ ఎమ్మెల్యే ఆశా సిన్హా మీడియాకు తెలిపారు. కేంద్రం తమ డిమాండ్‌ను పెడ చెవిన పెట్టిందని ఆరోపించారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినప్పుడు బీహార్‌కు ఇవ్వడానికి ఎందుకు అభ్యంతరం చెబుతున్నారంటూ ఆశా ఈ సందర్బంగా కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించే వరకు ఆందోళనలు రోజురోజుకు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తమ డిమాండ్‌పై కేంద్రం దిగివచ్చే విధంగా ఆందోళనలు ఉండాలని బీజేపీ నాయకుడు జనార్దన్ కుమార్ ఆందోళనకారులకు సూచించారు. బంద్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు తమ ఆందోళనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే బీహార్ ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తు అధికార జేడీ (ఎస్) పార్టీ అధినేత, సీఎం కిరణ్ మార్చి 2వ తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.