బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇవ్వాలి | Nitish Kumar repeats special status demand for Bihar at key JDU meet | Sakshi
Sakshi News home page

బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇవ్వాలి

Published Sun, Jun 30 2024 6:14 AM | Last Updated on Sun, Jun 30 2024 6:14 AM

Nitish Kumar repeats special status demand for Bihar at key JDU meet

నితీశ్‌ సారథ్యంలో జేడీయూ సమావేశం తీర్మానం

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సంజయ్‌ ఝా ఎన్నిక

న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా ఉన్న జనతాదళ్‌(యునైటెడ్‌) ఎగ్జిక్యూటివ్‌ సమావేశం శనివారం జరిగింది. పార్టీ చీఫ్, బిహార్‌ సీఎం నితీశ్‌ ‡ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో ఆ పార్టీ కీలక తీర్మానాలు చేసింది. 

బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా స్పెషల్‌ ప్యాకేజీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పేపర్‌ లీకేజీ ఘటనల్లో బాధ్యులపై తీవ్ర చర్యలు తీసుకోవడం ద్వారా వీటిని పునరావృతం కాకుండా చేయవచ్చని పేర్కొంది. ఈ సమావేశం నితీశ్‌కి నమ్మకస్తుడిగా, బీజేపీతో మంచి  సంబంధాలున్న రాజ్యసభ ఎంపీ సంజయ్‌ ఝాను పార్టీ వర్కింగ్‌  ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement