Janata Dal
-
బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇవ్వాలి
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా ఉన్న జనతాదళ్(యునైటెడ్) ఎగ్జిక్యూటివ్ సమావేశం శనివారం జరిగింది. పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ ‡ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో ఆ పార్టీ కీలక తీర్మానాలు చేసింది. బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా స్పెషల్ ప్యాకేజీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పేపర్ లీకేజీ ఘటనల్లో బాధ్యులపై తీవ్ర చర్యలు తీసుకోవడం ద్వారా వీటిని పునరావృతం కాకుండా చేయవచ్చని పేర్కొంది. ఈ సమావేశం నితీశ్‌కి నమ్మకస్తుడిగా, బీజేపీతో మంచి సంబంధాలున్న రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంది. -
ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్‌లపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణనకు వేగవంతం చేసింది. గురువారం ప్రజ్వల్‌పై సిట్ బృందం.. లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయన కనిపించిన వెంటనే అరెస్ట్ చేసే విధంగా సిట్ వారెంట్ జారీ చేసింది. దేశంలోని అన్ని ఇమ్మిగ్రేషన్ పాయింట్లకు లుక్ అవుట్ సర్క్యులర్ ఇచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణ విమానాశ్రయం, ఓడరేవు, సరిహద్దు చెక్‌పోస్ట్ కనిపిస్తే.. నిర్బంధించాలని తెలిపింది. కాగా హసన్ ఎంపీగా ఉన్న ప్రజ్వల్ సంబంధించినవిగా కొన్ని అసభ్యకర వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపులపై పలువురు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణపై కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ విచారిస్తోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరవ్వాలని తండ్రీ కొడుకులకు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్ రేవణ్ణ సిట్ అధికారులను కోరారు. ‘సిట్ ముందు హాజరుకావడానికి 7 రోజుల సమయం కావాలి. ఇప్పుడు నేను బెంగళూరులో లేను’ అంటూ ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేశాడు. అయితే, ప్రజ్వల్ అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. ఈ మేరకు గురువారం ఉదయం మరోసారి సమన్లు పంపింది. అనంతరం కొద్దిసేపటికే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు.. ప్రజ్వల్‌ను జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. -
చీలిక దిశగా జేడీ(ఎస్)?
బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్) చీలిక దిశగా సాగుతున్నట్టు కని్పస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆయన నిర్ణయాన్ని పార్టీ కర్ణాటక విభాగం అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి సి.ఎం.ఇబ్రహీం బాహాటంగా వ్యతిరేకించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో తాను చేరబోయేది లేదని ఆయన సోమవారం కుండబద్దలు కొట్టారు. పైగా తమ వర్గమే సిసలైన జేడీ(ఎస్) అని ఆయన చెప్పుకొచ్చారు! ‘‘దేవెగౌడ, ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామి బీజేపీతో జట్టు కట్టాలనుకుంటే అది వారిష్టం. మేం మాత్రం అందుకు మద్దతిచ్చేదే లేదు’’ అని స్పష్టం చేశారు. తద్వారా పార్టీలో చీలిక తప్పదని సంకేతాలిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుని హోదాలో కర్ణాటక విభాగం విషయమై ఏ నిర్ణయమైనా తీసుకునేందుకు తనకు సర్వాధికారాలూ ఉన్నాయని తేల్చి చెప్పారు. బీజేపీతో పొత్తులను వ్యతిరేకిస్తూ పొరుగు రాష్ట్రాల్లో ఎందరో నేతలు పార్టీని వీడారని దేవెగౌడకు ఆయన గుర్తు చేశారు. కనుక బీజేపీతో పొత్తు యోచన మానుకోవాలని సూచించారు. ‘‘జేడీ(ఎస్) ఎప్పటికీ ఎన్డీఏతో కలవరాదనేదే మా తొలి నిర్ణయం. ఇక ఈ పొత్తుకు దేవెగౌడ అస్సలు అనుమతించరాదన్నది మా రెండో నిర్ణయం’’ అని పార్టీ నేతలతో భేటీ అనంతరం ఇబ్రహీం మీడియాకు తెలిపారు. -
రాజ్యాంగ పీఠంపై న్యాయ కోవిదుడు
దేశ 14వ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్‌ఖడ్ వృత్తి రీత్యా లాయర్. రాజకీయాల్లోకి వచ్చినా సుప్రీంకోర్టు లాయర్‌గా పని చేస్తూనే వచ్చారు. ఎంపీ నుంచి గవర్నర్‌గా, అక్కడి నుంచి తాజాగా ఉపరాష్ట్రపతి దాకా జనతాదళ్, కాంగ్రెస్‌ల మీదుగా బీజేపీ దాకా ఆయనది ఆసక్తికర ప్రస్థానం. రాజస్తాన్‌లోని ఝుంఝును జిల్లాలో కిథానా అనే కుగ్రామంలో జాట్ల కుటుంబంలో 1951 మే 18న ధన్‌ఖడ్ జన్మించారు. చదువులో చురుగ్గా ఉండేవారు. చిత్తోర్‌గఢ్ సైనిక స్కూలులో మెరిట్ స్కాలర్‌షిప్‌తో ప్రాథమిక విద్య, జైపూర్ మహారాజా కాలేజీలో డిగ్రీ చేశారు. ఎల్ఎల్బీ పూర్తయ్యాక రాజస్తాన్ బార్ కౌన్సిల్లో 1979లో అడ్వకేట్‌గా నమోదు చేసుకున్నారు. 1990లో సుప్రీంకోర్టులో లాయర్‌గా ప్రాక్టీసు మొదలు పెట్టి మంచి గుర్తింపు సంపాదించారు. 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ అయ్యేదాకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. సైనిక స్కూల్ చిన్నప్పట్నుంచే క్రమశిక్షణ నేర్పింది. రాజ్యాంగం, చట్టాలు, సెక్షన్లు కొట్టిన పిండి. దేవీలాల్ అడుగు జాడల్లో యువకుడిగా ఉండగానే ధన్‌ఖడ్ జనతాదళ్‌లో చేరారు. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ వ్యవస్థాపకుడు దేవీలాల్ అడుగుజాడల్లో నడిచారు. ఆయన ఆశీస్సులతో 1989లో ఝుంఝును నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. నాటి వీపీ సింగ్ సర్కార్ నుంచి దేవీలాల్ బయటికొచ్చినప్పుడు ధన్‌ఖడ్ ఆయన వెంటే నడిచారు. చంద్రశేఖర్ కేబినెట్లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా చేశారు. పీవీ నరసింహారావు హయాంలో ఆయన విధానాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరారు. రాజస్తాన్ కాంగ్రెస్‌లో అశోక్ గెహ్లాట్ హవా పెరుగుతూండటంతో 2003లో బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీలో వసుంధర రాజెకు దగ్గరయ్యారు. కానీ రాజకీయంగా పెద్దగా ఎదగలేదు. పదేళ్ల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు లాయర్‌గా మంచి పేరు సంపాదించారు. 2019 జులైలో పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. జాట్ల నేత కావడం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఆయన్ను ఎంచుకోవడంలో కీలకంగా నిలిచింది. లాయర్‌గా లోతైన పరిజ్ఞానం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా అనుభవం అదనపు అర్హతలు మారాయి. ఎన్డీఏకు ఇంకా పూర్తి మెజారిటీ లేని రాజ్యసభలో త్వరలో కీలక బిల్లుల ఆమోదం ఉన్నందున న్యాయ, పాలనా, రాజ్యాంగపరంగా లోతుపాతులు తెలిసిన వ్యక్తి చైర్మన్‌గా ఉండనుండటం బీజేపీకి ఊరటే. ప్రయాణాలంటే ఇష్టం జగదీప్ భార్య సుదేశ్ సామాజిక కార్యకర్త. ఆర్థికశాస్త్రంలో పీజీ చేశారు. కుమార్తె కామ్నా సుప్రీంకోర్టు లాయర్ కార్తికేయ వాజపేయిని పెళ్లి చేసుకున్నారు. ధన్‌ఖడ్‌కు క్రికెట్, ప్రయాణాలు చాలా ఇష్టం. దేశ విదేశాలు విపరీతంగా తిరిగారు. కుటుంబంతో కలిసి ఎన్నో ప్రయాణాలు చేశారు. రాష్ట్రపతి ముర్ము మాదిరిగానే ఆయన కూడా ఆధ్యాత్మిక బాటలో ఉన్నారు. రూ.4 లక్షల వేతనం ఉపరాష్ట్రపతి రాజ్యాంగపరంగా దేశంలో రెండో అత్యున్నత పదవి. పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభ చైర్మన్‌గా కూడా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. నెలకు రూ.4 లక్షల అందుతుంది. ఇతర భత్యాలు, అలవెన్సులు లోక్‌సభ స్పీకర్‌తో సమానంగా ఉంటాయి. ఉచిత బంగ్లా, ఉచిత వైద్యం, విమానాలు, రైళ్లలో ఉచిత ప్రయాణాలు, ల్యాండ్, మొబైల్ ఫోన్లు, వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బంది తదితర సదుపాయాలుంటాయి. పదవీకాలం ముగిశాక వేతనంలో సగం పెన్షన్ కింద వస్తుంది. మమతతో ఢీ అంటే ఢీ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో నిత్యం ఢీ అంటే ఢీ అంటూ ధన్‌ఖడ్ ఎప్పడూ వార్తల్లో నిలిచారు. బీజేపీ ఏజెంట్ అంటూ ఆయన్ను మమతా నిందించేవారు. తన లాయర్ పరిజ్ఞానంతో మమత సర్కారుని ఇరకాటంలోకి పెట్టడానికి ప్రయత్నించేవారు. పరిస్థితి చివరికి గవర్నర్ స్థానంలో సీఎంను రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీల చాన్సలర్‌గా మారుస్తూ మమత చట్టం చేసేదాకా వెళ్లింది! ఇలా వారిద్దరూ ఉప్పూనిప్పుగా ఉన్న సమయంలోనే ధన్కడ్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ఎంపిక చేసింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే సాంబయ్య కన్నుమూత
కరీంనగర్: నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే ఉప్పరి సాంబయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం కరీంనగర్ కశ్మీర్గడ్డలో ఉన్న నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. సాంబయ్య 1985లో జనతా దళ్ నుంచి నేరెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన మృతికి మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. ఆయన కుమారుడు ఉప్పరి రవి కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా పొన్నం ఆయనతో ఉన్న జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో ఉప్పరి సాంబయ్య ఎమ్మెల్యేగా ఉన్నారని, విద్యార్థుల పలు సమస్యలను చెబితే వెంటనే స్పందించారని గుర్తుచేసుకున్నారు. సాంబయ్య విలువలతో కూడిన రాజకీయాలు చేశారని చెప్పారు. ఆయన మృతికి డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ సంతాపం తెలిపారు. -
ఇది హృదయం లేని ప్రభుత్వం: మాజీ సీఎం
సాక్షి, బెంగళూరు : గృహహింసతో బాధలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు వసతి సౌకర్యం కల్పించిన సంత్వాన కేంద్రాలను మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయం చట్టవిరుద్ధమని జనతాదళ్ సెక్యూలర్ పార్టీ (జేడీఎస్) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. దీనిపై ఆయన శనివారం ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంత్వాన కేంద్రాలను మూసివేయాలని ముఖ్యమంత్రి యాడియూరప్ప తీసుకున్న నిర్ణయం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక మరో ట్వీట్లో ‘‘లాక్డౌన్లో మహిళలపై దాడుల కేసులు పెరుగుతున్నప్పటికీ.. వారి సమస్యలకు పరిష్కారం ఇచ్చిన రక్షణ కేంద్రాలను రద్దు చేయబోతున్నారు’’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. (కుమార కాషాయ రాగం) How ironic! The government has opened take away alcohol shops but shuts down Santhwana centres. Giving the bottle to the man while shutting down the care centres for victims of domestic violence. So very thoughtful! 1/3 — H D Kumaraswamy (@hd_kumaraswamy) May 15, 2020 ఇక ‘‘రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.. కానీ గృహ హింస బాధిత మహిళలను సంరక్షించిన సంత్వాన కేంద్రాలు మూసివేయబడుతున్నాయి’’ అని వరుస ట్వీట్లో ఎద్దేవా చేశారు. ‘‘ఓ వైపు పురుషుల చేతికి మద్యం సిసాలు అందిస్తూ.. మరోవైపు బాధిత మహిళలకు రక్షణ కల్పించే కేంద్రాలను మూసివేస్తానడం విడ్డూరంగా ఉంది’’ అన్నారు. ‘‘రెండు దశాబ్ధాలుగా గృహహింసతో తీవ్ర ఒత్తిడికి గురైన రాష్ట్ర స్థాయి మహిళలకు సహాయం అందించడంమే కాకుండా.. జిల్లా స్థాయిలోని మహిళలు, పిల్లలకు సంరక్షణ ఇవ్వడంలో సంత్వాన కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి రక్షణ కేంద్రాలను ఖచ్చితంగా హృదయం లేని ప్రభుత్వమే మూసివేస్తుంది’’ అంటూ ఆయన విమర్శించారు. Government's decision to shut down Santhwana Centres across the state is unbelievably stupid. Even as the cases of atrocities increase during lock down, an important redressal system is being abolished. 2/3 — H D Kumaraswamy (@hd_kumaraswamy) May 15, 2020 -
శరద్ యాదవ్‌కు నితీశ్ ఝలక్
సాక్షి, ఢిల్లీ: జనతా దళ్(యునైటెడ్) మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత శరద్ యాదవ్‌కు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గట్టి ఝలక్ ఇచ్చారు. రాజ్యసభలో పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న శరద్ ఆ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు జేడీయూ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ స్పీకర్ అయిన వెంకయ్యనాయుడుకు పార్టీ సమాచారాన్ని తెలియజేసింది. అంతేకాదు కొత్త ప్రతినిధిగా నితీశ్ సన్నిహితుడు ఆర్సీపీ సింగ్ పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. ఇంతకు ముందు మరో రాజ్యసభ సభ్యుడు అన్వర్ అలీపై కాంగ్రెస్ నిర్వహించిన బీజేపీ వ్యతిరేక సమావేశంలో పాల్గొనటంతో వేటు వేసిన విషయం తెలిసిందే. మొత్తం జేడీయూ తరపున పార్లమెంట్లో ఇద్దరు లోక్ సభ ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన మద్ధతుదారులను సేకరించే పనిలో భాగంగా రాష్ట్రవ్యాప్త పర్యటనకు శరద్ సిద్ధమవుతున్న వేళ తాజా వేటుతో కొత్త పార్టీ ఏర్పాటు దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. -
బిహార్ రాజకీయాల్లో మరో ట్విస్ట్
పట్నా: బిహార్ రాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు మద్దతు ఇచ్చిందుకు బీజేపీ ముందుకు వచ్చింది. అసవరం అయితే బయట నుంచి మద్దతు ఇస్తామని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే మద్దతుపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర నాయకత్వమేనని అన్నారు. కాగా ఆర్జేడీ మద్దతుతోనే రాష్ట్రంలో నితీష్ ప్రభుత్వం మనుగడ సాగిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎం పదవిని వదిలేందుకు ససేమిరా అంటున్నారు. అలాగే ఆర్జేడీ నేతలు కూడా ఆయన రాజీనామా చేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. మరోవైపు జనతా అదాలత్‌ను రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తూ, ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తన ప్రభుత్వానికి మద్దతిస్తున్న కాంగ్రెస్ పార్టీని బహిరంగంగానే ఇటీవల తీవ్రంగా విమర్శించిన నితీష్, లాలూ కుటుంబం విషయంలో సమన్వయం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జేడీయూ మంగళవారం అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ కీలక భేటీలోనే తేజస్వి యాదవ్ పదవిపై నితీష్ నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. అలాగే ప్రభుత్వం మనగడకు మద్దతిచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని బీజేపీ సంకేతాలు ఇవ్వడంతో నితీష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. -
జేడీ(యూ) అధ్యక్షుడిగా నితీశ్‌కుమార్
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శరద్ యాదవ్ స్థానంలో ఆదివారం ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో నితీశ్ మరోసారి జేడీయూను అధికారంలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల కూటమి ఘనవిజయం సాధించింది. నితీశ్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా జేడీయూ అధ్యక్షుడయ్యారు. -
కుమారస్వామి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు
రాయచూరు : కుమారస్వామి గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికి లేదని జనతాదళ్(ఎస్) తాలూకా అధ్యక్షుడు ఎం.లింగప్ప ధడేసూగూరు పేర్కొన్నారు. కేపీసీసీ వెనుకబడిన వర్గాల రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు కే.కరియప్ప కుమారస్వామి గురించి చులకనగా మాట్లాడటంపై ఆయన తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వారి స్నేహితుడి నుంచి రూ.70 లక్షల విలువ చేసే వాచ్‌ని కానుకగా తీసుకోవడంపై కుమార స్వామి ప్రశ్నించడం తప్పు కాదన్నారు. కుమారస్వామి ఎన్నో కుంభకోణాలు వెలికి తీశారని ఆయన గుర్తు చేశారు. కరియప్ప మాత్రం విలేకరుల సమావేశంలో సిద్ధరామయ్య వాచ్ విషయం తప్ప కుమారస్వామికి వేరే పని లేదని, కుమారస్వామి కూడా కార్లు, సైట్లు తీసుకున్నట్లు ఆధారాలు లేని ఆరోపణలు చేయడం తగదన్నారు.తాలూకా జేడీఎస్ ఉపాధ్యక్షుడు మహిబూబ్ పాషా, జేడీఎస్ నేత ధర్మనగౌడలు విలేకరుల సమావేశంలో ఉన్నారు. -
జాతీయస్థాయిలో బీసీ పార్టీ
జనతాదళ్(యునెటైడ్) అధ్యక్షుడు శరద్‌యాదవ్ హైదరాబాద్ : ‘‘దేశ జనాభాలో 80 శాతమున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలను 20శాతమున్న అగ్రవర్ణాలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి. ఎన్నాళ్లని ఊడిగం చేద్దాం మనమే జాతీయ స్థాయిలో ఒక బీసీ పార్టీని ఏర్పాటు చేద్దాం’’ అని జనతాదళ్(యునెటైడ్) అధ్యక్షుడు శరద్‌యాదవ్ ఆదివా రం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక సవూవేశంలో వూట్లాడుతూ పిలుపునిచ్చారు. బీసీలంతా సవుష్టిగా ముందుకు సాగితే రానున్న రోజుల్లో కేం ద్రంలో బీసీలదే రాజ్యమన్నారు. టీడీపీ ఎంపీ టి. దేవేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘‘వెనుకబడిన తరగతుల సాధికారత సంస’్థ’ను శరద్‌యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభిం చారు. విదేశాల్లో కూడా అట్టడుగువర్గాలు ఉద్యమాలతోనే హక్కులు సాధించుకుంటున్నారని చెప్పారు. అరవై ఏళ్లపాటు పోరాడి తెలంగాణను సాధించుకున్నా ఇప్పటికిప్పుడు ఉన్నపళంగా ఇక్కడి బీసీలు అభివృద్ధిని సాధిస్తారని అనుకోలేమని శరద్‌యాదవ్ అభిప్రాయపడ్డారు. జస్టిస్ ఎంఎన్ రావు మాట్లాడుతూ దేశంలో 76 శాతమున్న బీసీలకు సరైన కేటాయింపులు జరగడంలేదన్నారు. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ప్రసంగిస్తూ 76 శాతంగా ఉన్న బీసీలకు ఎందుకు పూర్తి స్థాయిలో రాజ్యాధికారం అందడంలేదో బీసీలంతా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముందన్నారు. తమ సంస్థ ము ఖ్యోద్ధేశ్యాలను వివరించిన ఎంపీ దేవేందర్‌గౌడ్, బీసీ వర్గానికి దీనిని అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎంపీ హనుమంతరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు క్రిష్ణయ్య, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. -
అత్తారింటికి దారిదే అంటున్న వివేక్ ఒబెరాయ్
కుటుంబ సంబంధం రాజకీయ బంధం కంటే గొప్పది. ఈ విషయం నటుడు వివేక్ ఒబెరాయ్ కి బాగా తెలుసు. అందుకే గతంలో ఎన్నో సార్లు నరేంద్ర మోడీపై పొగడ్తల వర్షం కురిపించినా, ఎన్నికలు వచ్చే సరికి బంధువుల కే నా సపోర్టు అని ప్రకటించేశారు. అందునా సదరు బంధువు పిల్లనిచ్చిన అత్తగారైతే ఇంక చెప్పేదేముంది? రక్త చరిత్ర హీరో వివేక్ ఒబెరాయ్ అత్తగారు నందినీ అల్వా బెంగుళూరు సెంట్రల్ నుంచి జనతాదళ్ సెక్యులర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. దాంతో వివేక్ ఒబెరాయ్ ముంబాయి నుంచి బెంగుళూరు వెళ్లి, అక్కడే మకాం వేశారు. ఆయన ఉత్తరాది ఓటర్లను కలుసుకుని 'మా అత్తగారు మామంచి వారు. మీ ఓట్లు ఆమెకే వేయండి' అని అభ్యర్థిస్తున్నారు. బెంగుళూరు లోని గురుద్వారాలకు వెళ్లి అక్కడి సిక్కు ఓటర్లను కూడా కలుసుకుంటున్నారు. అయితే ఆయన మద్దతు అత్తగారికే తప్ప జనతాదళ్ సెక్యులర్ పార్టీకి కాదట. -
హస్తానికి తెలిసొచ్చిన ప్రతిపక్షాల సత్తా
సాక్షి, న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ మరణానంతరం భారీ మెజారిటీతో గద్దెనెక్కిన ప్రభుత్వం కుంభ కోణాల్లో, రకరకాల ఆరోపణల్లో కూరుకుపోయి ప్రజల ఆశలను వమ్ము చేసింది. గాంధీ కుటుంబానికి అంతవరకు విశ్వసనీయుడుగా ఉంటూ వచ్చిన విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీకి ప్రధాన శత్రువుగా మారారు. వి.పి. సింగ్ కేంద్ర బిందువుగా ఏర్పాటైన నేషనల్ ఫ్రంట్, బీజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో చేతులు కలిపి 1989 లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినప్పటికీ అధికారం మాత్రం దక్కించుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లోనే ఓటింగ్ వయసు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. యువ ఓటర్లు ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకున్నప్పటికీ ఢిల్లీ ఓటర్లు మాత్రం ఓటు హక్కును వినియోగించుకోవడంపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. 57 లక్షల ఓటర్లలో దాదాపు 31 లక్షల మంది మాత్రమే ఓటువేశారు. ఈ ఎన్నికల్లో ఏడు స్థానాలకు 237 మంది పోటీపడ్డారు. ఢిల్లీ రాజకీయాలలో కాంగ్రెస్ ఆధిపత్యానికి బీజేపీ నుంచి సవాలు ఈ ఎన్నికలతో ప్రారంభమైంది. ప్రతిపక్షం ఒక్కటైతే తాను చిత్తు కాకతప్పదన్న విషయం కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలతో తెలిసివచ్చింది. 1989 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాలను, జనతా దళ్ ఒక్క స్థానాన్ని, కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. ఈ రెండు స్థానాలు కూడా ప్రతిపక్షంలో అనైక్యత కారణంగానే కాంగ్రెస్‌కు దక్కాయి. న్యూఢిల్లీ సీటు నుంచి బీజేపీ అధ్యక్షడిగా ఉన్న ఎల్ కే అద్వానీ గెలుపు ఢిల్లీ ఫలితాలలో ప్రధాన ఆకర్షణగా మారింది. ఆయన కాంగ్రెస్‌కు చెందిన మోహినీ గిరీని ఓడించారు. సౌత్ ఢిల్లీ, సదర్, కరోల్‌బాగ్ స్థానాలను కూడా బీజేపీ గెలుచుకుంది. ఈస్ట్ ఢిల్లీ, చాందినీ చౌక్‌లో ఓట్ల చీలిక కాంగ్రెసకు కలిసిరావడంతో హెచ్‌కేఎల్ భగత్, జైప్రకాశ్ అగర్వాల్ గెలుపొందారు. ఈస్ట్ ఢిల్లీలో కేంద్ర మంత్రి హెచ్‌కేఎల్ భగత్ ఓటమి ఖాయంగా కనిపించినప్పటికీ తనకు సన్నిహితుడైన చాంద్రామ్కు టికెట్ ఇవ్వాలని దేవీలాల్ పట్టిన పంతం ఓట్ల చీలికకు దారితీసింది. దాంతో జనతాదళ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిషోరీలాల్ నాలుగవ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇండిపెండెంట్‌గా పోటీచేసిన రామ్‌కు రెండవ స్థానం దక్కగా బీఎస్పీ నేత కాన్షీరామ్ మూడవ స్థానంలో నిలిచారు. ఔటర్ ఢిల్లీలో మాత్రం జనతాదళ్ అభ్యర్థి తారిఫ్ సింగ్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ భరత్ సింగ్‌ను ఓడించారు. సౌత్ ఢిల్లీలో సుభాష్ చోప్రాపై మదన్‌లాల్ ఖురానా గెలిచారు. ఢిల్లీ అధ్యక్షుడు ఖురానాను అభ్యర్థిగా నిలపడం ద్వారా పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులను పైకి తీసుకురావడానికి నడుం బిగించింది. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన మదన్‌లాల్ ఖురానా ఆ తరువాత ఢిల్లీలో బీజేపీని బలమైన శక్తిగా తీర్చిదిద్దారు. ఢిల్లీకి రాష్ట్రహోదా డిమాండ్‌ను ఆయన గట్టిగా వినిపించారు. సదర్‌లో విజయ్‌కుమార్ మల్హోత్రా కేంద్ర మంత్రి జగదీశ్ టైట్లర్‌ను భారీ తేడాతో ఓడించారు. కరోల్‌బాగ్ నుంచి కల్కాదాస్ కాంగ్రెస్ అభ్యర్థి ధరమ్దాస్పై నెగ్గారు. ఢిల్లీ కాంగ్రెస్‌లో దిగ్గజంగా వెలుగుతోన్న హెచ్‌కేఎల్ భగత్ తన అభ్యర్థులుగా బరిలోకి దింపిన మోహినీ గిరీ, ధరమ్‌దాస్, సుభాష్ చోప్రా ఓడిపోవడంతో క్రమంగా ఢిల్లీ కాంగ్రెస్‌లో ఆయన ప్రాభవం తగ్గుముఖం పట్టింది. -
ఆప్‌లోకి షోయబ్?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో జనతాదళ్ యునెటైడ్‌కు ప్రాతి నిధ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ ఆ పార్టీని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. మాతియా మహల్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన షోయబ్ ఇక్బాల్ విశ్వాస పరీక్ష సమయంలో ఆప్ ప్రభుత్వానికి మద్దతు పలికిన విష యం తెలిసిందే. షోయబ్ ఇక్బాల్ తమ పార్టీలో చేరడం గురించి ఆప్ ఇప్పటిదాకా ఏమీ ప్రకటించనప్పటికీ ఆయన ఆప్‌లో చేరితే అసెం బ్లీలో ఆ పార్టీ సంఖ్యాబలం 29కి చేరుతుంది. తాను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలనుకుంటున్నానని, ఆ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలని, ఒకటి రెండు రోజులలో ఓ స్పష్టత వచ్చే అవకాశముందని షోయబ్ ఇక్బాల్ శుక్ర వారం విలేకరులతో చెప్పారు. దేశంలో మతతత్వశ క్తులను బలహీనపర్చాల్సిన అవసరముం దని ఆయన అభిప్రాయపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ బాగా పనిచేస్తున్నారని, తాను కూడా ఆ పార్టీలో చేరితే మరింత బాగా పనిచేస్తానన్నారు. పార్టీలో చేరే విషయమై కేజ్రీవాల్‌ను కలిసినట్లు చెప్పారు. -
దాణా స్కాం దోషి లాలూ!
పదిహేడేళ్ల సుదీర్ఘ కాలం విచారణ తర్వాత బీహార్ దాణా కుంభకోణంలో ఎట్టకేలకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. ఆయన, ఆ రాష్ట్రానికి చెందిన మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌మిశ్రా, జేడీ(యూ)కి చెందిన ఎంపీ జగదీష్‌శర్మ, ఆయన కుమారుడు ఎమ్మెల్యే రాహుల్‌సహా 45 మందికి ఈ కేసులో ఎన్నేళ్లు శిక్ష విధించబోతున్నదీ కోర్టు గురువారం తీర్పు చెబుతుంది. దోషులుగా నిర్ధారణ కావడంతో లాలూతోసహా వీరంతా జైలుకు పోవాల్సివచ్చింది. ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్న అంశంతో నిమిత్తంలేకుండా దాదాపు 20 ఏళ్లపాటు కొనసాగిన ఈ కుంభకోణంలో... చివరకు బడా రాజకీయ నాయకులు దోషులని తేలడానికి కూడా ఇంచుమించు అంతే సమయం పట్టింది. ఈ స్కాంలో దాఖలైన ఇతర కేసుల్లో కొందరు అధికారులకూ, మరికొందరు రాజకీయనాయకులకూ ఇంతకుముందే శిక్షలు పడ్డాయి. ఎన్నడో 1985లో అప్పటి కాగ్ టీఎన్ చతుర్వేది పశు సంవర్ధక శాఖలో నిధులు స్వాహా అవుతున్నాయని గుర్తించి అప్పటి సీఎం చంద్రశేఖర్సింగ్ను తొలిసారి అప్రమత్తం చేశారు. దాదాపు 1975 ప్రాంతంలో మొదలైన ఈ స్కాంలో భారీయెత్తున నిధులు దుర్వినియోగమవుతున్నాయని ఆయన గమనించారు. కానీ, చతుర్వేది సలహాను పట్టించుకోక పోవడంవల్ల అటు తర్వాతకూడా ఇది కొనసాగింది. చివరకు పశుసంవర్ధక శాఖ అధికారి అమిత్ ఖరే రూ. 37.70 కోట్ల నిధుల స్వాహాపై 1996లో ఇచ్చిన ఫిర్యాదుతో తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఆ కేసులోనే లాలూ, జగన్నాథ్ మిశ్రాలు దోషులుగా నిర్ధారణ అయ్యారు. ఇదే స్కాంకు సంబంధించిన మరో కేసులో లాలూ లోగడ నిర్దోషిగా బయటపడ్డారు. 2000 సంవత్సరంలో బీహార్నుంచి విడివడి ఏర్పడిన జార్ఖండ్‌లో కూడా దాణా స్కాం కేసులు నడుస్తున్నాయి. అక్కడ లాలూ, మిశ్రాలపై మరో నాలుగు కేసులు విచారణలో ఉన్నాయి. ఆయన వచ్చిన గ్రామీణ నేపథ్యంవల్ల కావొచ్చు...ఆయన స్వభావంవల్ల కావొచ్చు లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు ఆయనను జోకర్‌గా చిత్రించే ప్రయత్నాలు జరిగాయి. కానీ, లాలూ ఎంతో పేదరికంలో పుట్టి, కష్టపడి ఎదిగారు. ప్రభుత్వాల అవినీతి విధానాలకు వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ప్రారంభమైన విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న యువ విద్యార్థి నాయకుడాయన. అయితే, అలాంటి వ్యక్తి రాజకీయ రంగ ప్రవేశం చేసి, ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి, అప్పటికే పుట్టి కొనసాగుతున్న అవినీతిలో భాగస్వామిగా మారి, చివరకు ఆ కేసులోనే దోషిగా నిర్ధారణకావడం ఒక వైచిత్రి. ఆదర్శవంతమైన సమాజాన్ని కాంక్షించి ఉవ్వెత్తున లేచిన ఉద్యమంనుంచి ఎదిగిన నాయకుడొకరు చివరకు కుంభకోణంలో చిక్కుకుంటారన్నది అప్పట్లో ఊహకైనా అందని విషయం. తన నేపథ్యంరీత్యా ఈ స్కాంను తానే బయట పెట్టివుంటే లాలూ చరిత్రలో నిలిచిపోయేవారు. కానీ, ఆయన భిన్నమైన దోవను ఎంచుకున్నారు. ఇదే కేసులో కనీసం కొన్నేళ్లక్రితం తీర్పువచ్చి వున్నా పరిస్థితి వేరుగా ఉండేది. ఆయన శిక్షకు గురైనా అప్పీల్ చేసుకుని పార్లమెంటు సభ్యుడిగా కొనసాగేవారు. మరికొన్నాళ్లలో జరగబోయే ఎన్నికల్లో పాల్గొనేవారు. కానీ, మొన్న జూలై 10న నేర చరితులైన చట్టసభల సభ్యులపై కొరడా ఝళిపిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పువల్ల అది అసాధ్యంగా మారింది. ఈ తీర్పును వమ్ముచేస్తూ కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స కాస్తా వివాదంలో చిక్కుకోవడంవల్ల లాలూకు వెసులుబాటు దొరకలేదు. ఇప్పుడు ఆయనకు రెండేళ్లకుమించి శిక్షపడినట్టయితే, వెనువెంటనే పార్లమెంటు సభ్యత్వం రద్దుకావడంతోపాటు ఆరేళ్లవరకూ ఎన్నికల్లో పోటీచేసేందుకు కూడా అవకాశం ఉండదు. అప్పీల్లో నిర్దోషిగా నిర్ధారణ అయితే అది వేరే సంగతి. ఈ స్కాం విస్తృతిరీత్యా చాలా పెద్దది. దాదాపు 20 ఏళ్లపాటు సాగిన కుంభకోణంలో రూ.950 కోట్లమేర ఖజానాను కొల్లగొట్టారన్నది నిందితులపై అభియోగం. ఈ స్కాంకు సంబంధించి నమోదైన 55 కేసుల్లో జార్ఖండ్‌లోనే 53 కేసులున్నాయి. మొత్తం 46 కేసుల్లో 550 మందికి శిక్షలుపడగా 9 కేసుల్లో మరో 50 మంది విచారణను ఎదుర్కొంటున్నారు. అధికారపక్షంతోపాటు విపక్ష నాయకులు కూడా ఇందులో నిందితులు కావడం ఈ స్కాం విలక్షణత. దాణా స్కాం పర్యవసానంగా లాలూపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కూడా నమోదుచేయగా 2006లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆ కేసును కొట్టేసింది. దానిపై సీబీఐ అప్పీల్‌కు వెళ్లకపోవడంతో బీహార్ ప్రభుత్వమే 2007లో పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. దాంతో కేసు కొనసాగించమని హైకోర్టు ఆదేశించింది. అయితే, లాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఈ కేసులో అప్పీల్‌కి వెళ్లే అధికారం సీబీఐకి మాత్రమే ఉన్నదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెబుతూ కేసు కొట్టేసింది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వానికి లాలూ మద్దతు అవసరం కావడంవల్లే ఆ కేసులో సీబీఐ అప్పీల్‌కు వెళ్లలేదన్నది బహిరంగ రహస్యం. బీహార్‌లో కొన్నాళ్లక్రితం అధికార జేడీ(యూ)-బీజేపీలమధ్య విభేదాలు తలెత్తి నూతన రాజకీయ పరిణామాలు సంభవించాక తన భవిష్యత్తుపై లాలూ ప్రసాద్ యాదవ్ బాగా ఆశలు పెట్టుకున్నారు. తాను చాస్తున్న స్నేహ హస్తాన్ని తిరస్కరించి, ముఖ్యమంత్రి నితీష్కుమార్వైపే కాంగ్రెస్ చూస్తున్నా తాజా పరిణామాలు తనకు అనుకూలంగా మారబోతున్నాయని ఆయన విశ్వసించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో స్థానాలు సంపాదించి, కేంద్రంలో చక్రం తిప్పవచ్చునని అంచనా వేశారు. కానీ, ఈ తీర్పు పర్యవసానంగా అంతా తారుమారైంది. ఇన్నాళ్లూ ఆయన పార్టీని వెన్నంటి ఉన్న భిన్న వర్గాలు వేరే దారి చూసుకుంటాయా లేక ఆయనకు అండగా నిలబడతాయా అన్నది రాగల ఎన్నికల్లో తేలిపోతుంది.