ఢిల్లీ అసెంబ్లీలో జనతాదళ్ యునెటైడ్‌కు ప్రాతి నిధ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ ఆ పార్టీని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో జనతాదళ్ యునెటైడ్‌కు ప్రాతి నిధ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ ఆ పార్టీని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. మాతియా మహల్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన షోయబ్ ఇక్బాల్ విశ్వాస పరీక్ష సమయంలో ఆప్ ప్రభుత్వానికి మద్దతు పలికిన విష యం తెలిసిందే.
షోయబ్ ఇక్బాల్ తమ పార్టీలో చేరడం గురించి ఆప్ ఇప్పటిదాకా ఏమీ ప్రకటించనప్పటికీ ఆయన ఆప్‌లో చేరితే అసెం బ్లీలో ఆ పార్టీ సంఖ్యాబలం 29కి చేరుతుంది. తాను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలనుకుంటున్నానని, ఆ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలని, ఒకటి రెండు రోజులలో ఓ స్పష్టత వచ్చే అవకాశముందని షోయబ్ ఇక్బాల్ శుక్ర వారం విలేకరులతో చెప్పారు. దేశంలో మతతత్వశ క్తులను బలహీనపర్చాల్సిన అవసరముం దని ఆయన అభిప్రాయపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ బాగా పనిచేస్తున్నారని, తాను కూడా ఆ పార్టీలో చేరితే మరింత బాగా పనిచేస్తానన్నారు. పార్టీలో చేరే విషయమై కేజ్రీవాల్‌ను కలిసినట్లు చెప్పారు.