Aam Admi Party
-
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: వారికే ‘ఆప్’ టిక్కెట్లు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశంలోని మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో నేడు (బుధవారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇదే తరుణంలో ఢిల్లీలోనూ అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలయ్యింది. 2025 ఫిబ్రవరిలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీతో సహా వివిధ పార్టీలు ఇప్పటికే తమ సన్నాహాలు మొదలుపెట్టాయి.తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని నేతల పనితీరు, విజయావకాశాలను పరిగణలోకి తీసుకుని వారికి టిక్కెట్లు కేటాయించనున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. బంధువులు, పరిచయస్తులు, స్నేహితులు అనే భావనతో ఎవరికీ టిక్కెట్లు కేటాయించేది లేదని ఆయన స్పష్టం చేశారు.అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని కేజ్రీవాల్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. తమ పార్టీ సత్య మార్గాన్ని అనుసరించిందని, పార్టీకి దేవునితో పాటు ప్రజల ఆశీస్సులు ఉన్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: UP By Election 2024: సెమీ ఫైనల్లో యూపీ ఓటర్లు ఎటువైపు? -
‘ఆప్’ నేతపై కాల్పులు..బుల్లెట్ గాయం
చండీగఢ్:పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత మన్దీప్ సింగ్ బ్రార్ కాల్పుల్లో గాయపడ్డారు.ప్రతిపక్ష శిరోమణి అకాళీదళ్‌నేత మన్‌దీప్‌సింగ్‌పై కాల్పులు జరిపినట్లు ఆరోపనలున్నాయి. ఆదివారం(అక్టోబర్6) అకాలీదళ్ నాయకుడు వర్దేవ్ సింగ్ మాన్ ఓ స్కూల్‌కు సంబంధించిన ఫైల్ గురించి బీడీపీఓ కార్యాలయానికి వెళ్లారు.ఆ ఫైల్ చూపించేందుకు అధికారులు నిరాకరించడంతో సింగ్ అక్కడినుంచి వెనుదిరిగారు. వెళుతు వెళుతూ బయట ఉన్న ఆప్ నేత మన్దీప్ సింగ్ బ్రార్‌తో సింగ్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఆప్‌నేత మన్‌దీప్‌కు బుల్లెట్ గాయమైంది. వెంటనే ఆయనను జలాలాబాద్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అకాలీ పార్టీ నాయకులే కాల్పులకు ఆప్ నేతలు ఆరోపించారు. పంచాయితీ ఎన్నికల సమయంలో అకాళీదళ్ పార్టీ దాడులకు పాల్పడుతోందన్నారు. ఈ నెల 15న పంజాబ్‌లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి.ఇదీ చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం -
ఢిల్లీ సీఎం అడ్డగింత.. ఆప్ ఆగ్రహం
ఢిల్లీ: పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, ఆయన మద్దతుదారులను సోమవారం సింగు సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సోనమ్ వాంగ్చుక్కు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామంపై ఆప్ వర్గాలు భగ్గుమన్నాయి. ‘‘ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు సోనమ్ వాంగ్చుక్ను అదుపులోకి తీసుకున్న బవానా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ సీఎంను పోలీసు అధికారులు అడ్డుకున్నారు’’ అని ఆప్ ఓ ప్రకటనలో పేర్కొంది.దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో పోలీసులు ఢిల్లీ-హర్యానా సరిహద్దులో ఉన్న బవానా పోలీస్ స్టేషన్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదుపులోకి తీసుకున్న వాంచుక్ మద్దతుదారులను ఢిల్లీ సరిహద్దుల్లోని ఇతర పోలీస్ స్టేషన్లలో ఉంచారు.#WATCH | Delhi CM Atishi reached Bawana police station to meet activist Sonam WangchukShe says, "People of Ladakh want statehood. Sonam Wangchuk and the people of Ladakh, who were going to visit Bapu's Samadhi, were arrested. They did not let me meet Sonam Wangchuk. This is the… pic.twitter.com/j5rmK3KCBa— ANI (@ANI) October 1, 2024 సోనమ్ వాంగ్‌చుక్ లడఖ్ నుంచి దాదాపు 120 మంది మద్దతుదారులతో లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీకి మార్చ్ చేపట్టారు. దీంతో పోలీసులు.. సోనమ్ వాంగత్చుక్, ఆయన మద్దతుదారులను సోమవారం అర్థరాత్రి సింగు సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా సింగు సరిహద్దుల్లో సెక్షన్ 163 విధించినట్లు ప్రకటించారు. నెల క్రితం లేహ్ నుంచి ప్రారంభమైన ‘‘ ఢిల్లీ చలో పాదయాత్ర’’కు వాంగ్‌చుక్ నాయకత్వం వహిస్తున్నారు.ఇక.. ఇప్పటికే సోనమ్ వాంగ్చుక్ను అదుపులోకి తీసుకోవటాన్ని లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన్ను నిర్భందించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.చదవండి: గుడి, మసీదు, దర్గా.. రోడ్లపై ఉన్న నిర్మాణాలు తొలగించాల్సిందే: సుప్రీంకోర్టు -
ఆతిశి డమ్మీ సీఎంగా ఉంటారు!
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా ఆప్ నేత అతిశిని ఎంపిక చేయడంపై రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్ స్పందించారు. ముఖ్యమంత్రిగా ఆమె డమ్మీగా మిగిలిపోతారనే విషయం అందరికీ తెలిసిందే అంటూ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. అతిశి కుటుంబం ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరి శిక్ష నుంచి కాపాడేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ‘అఫ్జల్ గురు అమాయకుడు. అతడు రాజకీయ కుట్రకు బలయ్యాడు. అతడిని ఉరి తీయకండి, క్షమాభిక్ష పెట్టండంటూ ఈమె తల్లిదండ్రులు రాష్ట్రపతికి పలుమార్లు వినతులు పంపారు’అని మలివాల్ ఆరోపించారు. ‘దేశ భద్రతపై ఆందోళన కలిగించే పరిణామమిది. ఇది ఎంతో విచారకరమైన రోజు. ఢిల్లీని ఆ దేవుడే కాపాడాలి’అని ఆమె పేర్కొన్నారు. అతిశి తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తా వాహి సంతకాలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపిన క్షమాభిక్ష పిటిషన్ కాపీని కూడా మలివాల్ షేర్ చేశారు. వీటిపై ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే స్పందిస్తూ..‘ఆప్ టిక్కెట్‌పై రాజ్యసభకు వెళ్లిన స్వాతి మలివాల్..ఇప్పుడు బీజేపీ గొంతు వినిపిస్తున్నారు. ఏమాత్రం సిగ్గున్నా వెంటనే ఆమెకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి’అని డిమాండ్ చేశారు. రాజ్యసభలోనే కొనసాగాలనుకుంటే బీజేపీ టిక్కెట్‌పై ఆమె మళ్లీ ఎన్నికవ్వొచ్చని పాండే పేర్కొన్నారు. పార్లమెంట్‌పై 2001లో జరిగిన దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురును 2013లో ఉరితీయడం తెలిసిందే. తన తల్లిదండ్రులు అఫ్జల్ గురుకు అనుకూలంగా రాష్ట్రపతికి పంపిన క్షమాభిక్ష పిటిషన్‌పై 2019లో ఓ ఇంటర్వ్యూలో అతిశి..‘ఆ అంశంతో నాకెలాంటి సంబంధమూ లేదు. అది నా తల్లిదండ్రులు వారి ఆశయాలకు అనుగుణంగా స్పందించారు. అది వారిష్టం. ఈ విషయంలో వారికి నేను ఎలాంటి మద్దతివ్వలేదు కూడా’అని స్పష్టం చేయడం గమనార్హం. -
రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా: కేజ్రీవాల్
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని బాంబు పేల్చారు. లిక్కర్ స్కామ్ కేసులో నిర్దోషిగా నిరూణ అయ్యేవరకు సీఎం పదవి చేపట్టనని స్పష్టం చేశారు. ఆదివారం(సెప్టెంబర్15) ఢిల్లీలో జరిగిన ఆమ్ఆద్మీపార్టీ సమావేశంలో కేజ్రీవాల్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించండి. నేను అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నా. నా భవిష్యత్తును ఓటర్లే నిర్ణయిస్తారు. నేను నిజాయితీగా ఉన్నానని భావిస్తేనే నాకు ఓట్లు వేయండి.’అని కేజ్రీవాల్ కోరారు.‘రాజ్యాంగాన్ని రక్షించేందుకే ఇన్ని రోజులు సీఎం పదవికి రాజీనామా చేయలేదు. కొత్త సీఎం పేరును త్వరలో ప్రకటిస్తాం. నేను, సిసోడియా సీఎం పదవిలో ఉండం. ఆమ్‌ఆద్మీపార్టీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఇందులో భాగంగానే నన్ను జైలుకు పంపించింది’అని కేజ్రీవాల్ అన్నారు. కాగా, లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ రెండు రోజుల క్రితమే సుప్రీంకోర్టు బెయిలివ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే బెయిల్ షరతుల ప్రకారం కేజ్రీవాల్ సీఎం ఆఫీసుకు వెళ్లడానికి వీళ్లేదని కోర్టు ఆదేశించింది. మరోపక్క బీజేపీ కేజ్రీవాల్ రాజీనామాకు డిమాండ్ చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇదీ చదవండి.. తమిళనాడులో రాముడంటే తెలియదు: గవర్నర్ రవి -
హర్యానా: ఆప్ మరో జాబితా.. వినేశ్‌పై కవితా దళాల్ పోటీ
చంఢీఘడ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మరో అభ్యర్థులు జాబితా విడుదల చేసింది. 21 మందితో నాలుగో జాబితా బుధవారం విడుదల చేసింది. కీలకమైన జులానా అసెంబ్లీ స్థానం నుంచి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై కవితా దళాల్‌ను ఆప్ బరిలోకి దింపింది. ఇక.. ఇప్పటికే 20 మందితో తొలి జాబితాను ఆప్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజా జాబితాతో కలిపి ఇప్పటివరకు ఆప్ మొత్తం ఆప్ 61 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. హర్యానాలో ఉన్న 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబరు 5న పోలింగ్ జరగనుంది. 8న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడికానున్నాయి.కవితా దళాల్ కూడా ప్రొఫెషనల్ రెజ్లర్, గతంలో ఈమె WWE లాంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రొఫెషనల్ పోటీల్లో పాల్గొన్నారు. 2021లో కవితా దళాల్ WWE నుంచి వైదొలిగినట్లు ప్రకటించారు. Aam Aadmi Party (AAP) released the fourth list of 21 candidates for Haryana Assembly electionsSo far, AAP has announced the names of 61 candidates pic.twitter.com/9YmkzmLMKe— ANI (@ANI) September 11, 2024చదవండి: హర్యానా బీజేపీ రెండో జాబితా: వినేశ్‌పై పోటీ ఎవరంటే.. -
Haryana Election: తొమ్మిది మంది అభ్యర్థులతో ఆప్ రెండో జాబితా విడుదల
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థుల రెండో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. బీజేపీని వీడి ఆప్‌లో చేరిన ప్రొఫెసర్ ఛత్రపాల్‌ను బర్వాలా అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు 29 మంది అభ్యర్థులను ప్రకటించింది.తాజాగా ప్రకటించిన జాబితాలో సధైరా నుంచి రీటా బమ్నేయకు టిక్కెట్టు ఇచ్చారు. థానేసర్ నుంచి కృష్ణ బజాజ్, ఇంద్రి నుంచి హవా సింగ్‌లను అభ్యర్థులుగా ప్రకటించారు. ముక్త్యార్ సింగ్ బాజిగర్కు రాటియా నుంచి, అడ్వకేట్ భూపేంద్ర బెనివాల్‌కు అడంపూర్ నుంచి, జవహర్‌లాల్‌కు బవాల్ టిక్కెట్ ఇచ్చారు. ఫరీదాబాద్ నుంచి ప్రవేశ్ మెహతా, తిగావ్ నుంచి అబాష్ చండేలాలను అభ్యర్థులుగా ప్రకటించారు.మరోవైపు గత ఐదు రోజులుగా కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు విషయమై చర్చలు జరిగినప్పటికీ అవి ఫలవంతం కాలేదు. పొత్తులో భాగంగా ఆప్ 10 సీట్లకు పైగా డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ఆ పార్టీకి మూడు సీట్లకు మించి ఇవ్వడానికి సిద్ధంగా లేదని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆప్ కాంగ్రెస్ మధ్య పొత్తు లేనట్లేనని తేలింది. ఈ పరిణామాల అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సోమవారం విడుదల చేసింది. -
హర్యానా ఎన్నికలు.. ఆప్ తొలి జాబితా
చంఢిఘడ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ షాక్ ఇచ్చింది. ఓవైపు.. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో 20 మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా విడుదల చేసింది. కలయత్ నుంచి అనురాగ్ ధండా, మెహమ్ నుంచి వికాస్ నెహ్రా, రోహ్ తక్ నుంచి బిజేందర్ హుడాను ఆప్ బరిలోకి దించించింది. కాంగ్రెస్‌తో చర్చలవేళ ఆప్ తీసుకున్న ఈ నిర్ణయం తాజాగా చర్చనీయాంశంగా మారింది. 📢Announcement 📢 The Party hereby announces the following candidates for the state elections for Haryana Assembly.Congratulations to all 💐 pic.twitter.com/Ulca3eVppu— AAP (@AamAadmiParty) September 9, 2024పొత్తుపై కాంగ్రెస్, ఆప్ నేతలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆప్ చీఫ్ సుశీల్ గుప్తా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.నేటి సాయంత్రంలోగా కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాకుంటే మొత్తం 90 స్ధానాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తుపై తమకు పార్టీ అధిష్టానం నుంచి తమకు ఇప్పటివరకూ ఎలాంటి సందేశం రాలేదన్న ఆయన.. సోమవారం 90 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు హర్యానా ఆప్ యూనిట్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.చదవండి: 90 స్థానాల్లో పోటీ చేస్తాం.. కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం! -
స్వాతి మలివాల్‌పై దాడి కేసు: బిభవ్ కుమార్‌కు బెయిల్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్) ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎంపీపై దాడి కేసులో బెయిల్, అరెస్ట్‌ను సవాల్ చేస్తూ బిభవ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీలో 100 రోజులు ఉన్నారని, ఛార్జ్‌షీట్ నమోదైనట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ‘స్వాతి మలివాల్‌కు గాయాలు అయ్యాయి. కానీ ఈ కేసులో బెయిల్ ఇవ్వడాన్ని అడ్డుకోలేం. బెయిల్ నిరాకరిస్తూ జైలులోనే ఉంచేలా చేయలేం’ అని న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. ఢిల్లీ పోలీసుల తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఈ కేసులో కొందరు ముఖ్యమైన సాక్షులపై నిందితుడు బిభవ్ కుమార్ ప్రభావం ఉంది. వారిని విచారించడానికి అనుమతి ఇవ్వండి. అప్పుడు తాము బెయిల్‌ను వ్యతిరేకించమని కోర్టుకు తెలిపారు. అలా అయితే.. సొలిసిటర్ జనరల్ చెప్పిన విధంగా తాము ఎవరికీ బెయిల్ మంజూరు చేయలేమని జస్టిస్ భుయాన్ అన్నారు. బెయిల్ మంజూరు చేయకుండా ఉంచటం ఆందోళన కలిగించే విషయమని సుప్రీకోర్టు పేర్కొంది. ఈ దాడి కేసులో సాక్షులందరినీ విచారించే వరకు నిందితుడు బిభవ్ కుమార్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోకి ప్రవేశించవద్దని సుప్రీం కోర్టు షరుతు విధించింది.మే 13న స్వాతి మలివాల్‌పై బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. స్వాతి మలివాల్ ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్‌పై పోలీసులు మే 18న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటున్నారు
న్యూఢిల్లీ: తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే తక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటున్నారని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపించారు. వైద్యులు సూచించిన మందులను కూడా ఆయన వాడకపోవచ్చని పేర్కొన్నారు. తీహార్ జైలు సూపరింటెండెంట్ నివేదికను ప్రస్తావిస్తూ ఎల్జీ ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌కు లేఖ రాసినట్లు రాజ్‌భవన్ వర్గాలు శనివారం తెలిపాయి. కేజ్రీవాల్‌కు ఇంటి వద్ద నుంచి వచ్చిన ఆహారాన్ని సరిపోను అందజేస్తున్నా కూడా ఆయన కావాలనే తక్కువ కేలరీలున్న ఆహారం తింటున్నట్లుగా ఆధారాలున్నాయన్నారు. గ్లూకో మీటర్ టెస్ట్ రీడింగ్‌కు, కంటిన్యువస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టం రీడింగ్‌కు మధ్య కనిపిస్తున్న భారీ వ్యత్యాసంపై అధికారులు పరిశీలన జరపాలని సూచించారు.ఎల్జీ వైద్యుడనే విషయం తెలియదుఎల్జీ వీకే సక్సేనా రాసిన లేఖపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ.. నాకు తెలిసినంత మటుకు ఆయన గతంలో సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వారు. వీకే సక్సేనా డాక్టర్ అని, ఆరోగ్య అంశాల్లో మంచి నిపుణుడనే విషయం నాకు తెలియదు. ఎప్పుడైనా ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌ను చదివి ఉండేవాళ్లం’ అంటూ ఎద్దేవా చేశారు. తమ నేతను చంపేందుకు బీజేపీ దుర్మార్గపు పథకం పన్నిందని ఆరోపించారు. -
మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్.. విచారణ బెంచ్ నుంచి తప్పుకున్న జడ్జి
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగాల్సి ఉండగా.. ఈ కేసు విచారణ బెంచ్ నుంచి న్యాయమూర్తి సంజయ్ కుమార్ తప్పుకోవడంతో వాయిదా పడింది. దీంతో తదుపరి విచారణ జూలై 15వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.ఈ బెయిల్ పిటిషన్లను మరోబెంచ్ విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 26వ తేదీన మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం మార్చి 9వ తేదీన ఈడీ కస్టడీలోకి తీసుకుందిన. దీంతో ఆయన ఢిల్లీ కేబినెట్‌కు ఫిబ్రవరి 28న రాజీనామా చేశారు. అదేవిధంగా జూన్ 4వ తేదీన సీబీఐ, ఈడీ దాఖలు చేసిన కేసుల్లో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. -
ముగిసిన ఆతిశి నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ ఈనెల 21వ తేదీ నుంచి మంత్రి ఆతిశి కొనసాగిస్తున్న నిరాహార దీక్ష అర్ధంతరంగా ముగిసింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను లోక్‌నాయక్ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మంత్రి ఆతిశి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు.అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మంత్రి ఆతిశి దాదాపు ఐదు రోజులుగా సాగిస్తున్న నిరాహార దీక్షను విరమించారని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. ఢిల్లీకి న్యాయబద్ధంగా అందాల్సిన నీటిని హరియాణా నుంచి విడుదల చేయించాలంటూ ప్రధానికి ఆప్ ఎంపీలు లేఖ రాస్తారన్నారు. -
క్షీణించిన మంత్రి అతిశీ ఆరోగ్యం.. నిరసన దీక్ష విరమణ
ఢిల్లీ: ఢిల్లీ నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షను ఆప్ జలవనరుల శాఖ మంత్రి అతిశీ విరమించారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణించటంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అదే విధంగా హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను అందించాలని ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు తెలిపారు.‘‘మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణించింది. ఆమె బీపీ లెవల్స్ పడిపోయాయి. ఎల్ఎన్జేపీ ఆస్పత్రి వైద్యులు వెంటనే ఆమెను ఆస్పత్రితలో చేరి చికిత్స తీసుకోవాలన్నారు. హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన న్యాయమైన నీటి వాటాను కేటాయించాలని ఆమె గత ఐదు రోజులుగా నిరవధిక నిరాహారదీక్షలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఎల్ఎన్జేపీ ఆస్పత్రి ఐసీయూలో జాయిన్ అయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని ఆయన ‘ఎక్స్’లో తెలిపారు.తీవ్ర నీటీ సంక్షోభ సమయంలో హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటా విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మంత్రి అతిశీ జూన్ 21 నుంచి నిరవధిక నిరాహారాదీక్ష చేపట్టారు. మంగళవారం ఆమె ఆరోగ్యం క్షీణించటంతో దీక్ష విరమించి హాస్పిటల్లో చేరారు. -
‘కేజ్రీవాల్ బరువు 8 కేజీల తగ్గి.. ఆరోగ్యం క్షీణిస్తోంది’
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలులో ఉన్నారు. అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన మార్చి 21 నుంచి సుమారు 8 కేజీల బరువు తగ్గినట్లు ఆప్ చెబుతోంది. అరెస్ట్‌కు ముందు ఆయన బరువు 70 కేజీలు ఉండగా.. అనంతరం ఆయన బరువు జూన్ 22 వరకు 8 కేజీలు తగ్గి 62 కేజీలకు పడిపోయిందని ఆప్ నేతలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల్లో అరవింద్ కేజ్రీవాల్ 8 కేజీల బరువు తగ్గారని తెలిపారు. ఇలా బరువు తగ్గటంపై అసలైన కారణం తెలుసుకోవటం కోసం వెంటనే ఆయన డాక్టర్లను సంప్రదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరోవైపు.. అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గటంపై ఎయిమ్స్ వైద్యులు ఆయనకు ఇచ్చే ఆహారంలో పూరీలు, పరాటాలు చేర్చాలని సూచింనట్లు ఆప్ పేర్కొంది.ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌కు వారం రోజులు పాటు మధ్యంత బెయిల్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మాక్స్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు పలు పరీక్షలు చేసీ.. బరువు తగ్గడానికి గల కారణాలను తెలుసుకోవాలన్నారని ఆప్ తెలిపింది. ఇటీవల సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌజ్ అవెన్యూ ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ట్రయిల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే విధించింది. -
ఢిల్లీ నీటి సంక్షోభం: ‘అప్పటివరకు నిరాహార దీక్ష విరమించను’
ఢిల్లీ: ఢిల్లీలో నెలకొన్న నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని ఆప్ జలవనరుల శాఖ మంత్రి అతిశీ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండోరోజు కొనసాగుతోంది. హర్యానా ప్రభుత్వం ఢిల్లీకి వచ్చే వాటాను విడుదల చేసేవరకు తన నిరహార దీక్ష కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు.‘హర్యానా ప్రభుత్వం ఢిల్లీలోని 28 లక్షల మందికి అవసరమయ్యే నీటిని విడుదల చేసేవరకు నేను చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను విరమించను. హర్యానా ప్రభుత్వం.. ఢిల్లీకి 613 ఎంజీడీ వాటర్ ఇవ్వాల్సి ఉంది. కానీ, కొన్ని వారాల నుంచి కేవలం 513 ఎంజీడీ నీటిని మాత్రమే హర్యానా రాష్ట్రం సరాఫరా చేస్తోంది. అన్ని ప్రయత్నాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకే నా నిరాహార దీక్ష కూడా విరమించను’అని అతిశీ అన్నారు.గత కొన్ని రోజులు ఢిల్లీ తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటోంది. యమునా నది వాటర్‌లో హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలను ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను ఇవ్వటం లేదని ఆరోపణలు చేస్తోంది. ఇక.. బుధవారం అతిశీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఢిల్లీ నీటి సంక్షోభం విషయంలో జోక్యం చేసుకొని సమస్క పరిష్కరించాలని కోరింది. లేదంటే తాను 21 తేదీ నుంచి నిరాహార దీక్ష చేపడతానని పేర్కొన్నారు. అందులో భాగంగా అతిశీ రెండోరోజు నిరవధిక దీక్ష కొనసాగుతోంది. -
స్వాతి మలివాల్ కేసు: బిభవ్‌పై 201 సెక్షన్ నమోదు
ఢిలీ: తనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్ దాడి చేశారని గత నెలలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో బిభవ్ కుమార్‌పై కేసు నమోదు కాగా.. పోలీసులు మే 18 అరెస్ట్ చేశారు. అయితే తాజాగా బిభవ్‌కుమార్ నమోదైన కేసులో 201 సెక్షన్‌ను చేర్చారు. 201 సెక్షన్ అంటే.. ఆధారాలు మాయం చేసి.. తప్పుడు సమాచారం ఇవ్వటం. బిభవ్ కుమార్ ఈ కేసుకు సంబంధించి ఆధారాలు మాయం చేసి.. తప్పుడు సమాచారం అందించిస్తున్నట్లు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.బిభవ్ కుమార్‌ను దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆయన తన ఫోన్‌ను ఫార్మాట్ చేసినట్లు గుర్తించారు. ఆయన ముంబైలో ఫోన్ ఫార్మాట్ చేసినట్లు అనుమానం రావటంతో ఇప్పటికే పోలీసులు రెండుసార్లు ముంబైకి తీసుకువెళ్లి దర్యాప్తు చేశారు. ముంబైలో ఏ ప్రాంతంలో ఫార్మాట్ చేశారు?. ఫోన్లోని డేటాను ఎవరికి షేర్ చేశారు? అన్న విషయాలు మాత్రం బిభవ్ వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. ఇక.. కస్టడీలో ఉన్న ఆయన దర్యాప్తు సమయంలో అస్సలు సహకరించలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు.సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుంచి మూడు సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బిభవ్ సీసీటీవీ కెమెరాలను ట్యాంపర్ చేశారని పోలీసుల అనుమానం వ్యకం చేశారు. దీంతో డీవీఆర్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వీటికి సంబంధించిన రిపోర్టులు ఇంకా వెల్లడికాలేదని తెలిపారు. మే 18 అరెస్ట్ అయిన బిభవ్ కుమార్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు.మే 13న ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లితే.. అక్కడ కేజ్రీవాల్ సహాయకుడు తనపై దారుణంగా దాడి చేశారని బయటపెట్టారు. అయితే వాటిని ఆప్.. బీజేపీ కుట్రలో భాగంగానే స్వాతి మలివాల్ బిభవ్‌పై దాడి ఆరోపణలను చేస్తోందని విమర్శలు చేసింది. -
ఆప్ పార్టీకి సుప్రీం కోర్టులో ఊరట
ఢిల్లీ: ఆప్ పార్టీ ఆఫీసు ఖాళీ చేసే గడువును సుప్రీం కోర్టు పొడిగించింది. సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఖాళీ చేసే గడువును అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 10 వరకు పొడగిస్తున్నట్లు తెలిపింది. అయితే ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ పార్టీ ఆఫీసు జూన్ 15 లోగా ఖాళీ చేయాల్సి ఉండగా.. ఆప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కాగా.. ఆప్ కార్యాలయం ఉన్న భూమిని ఢిల్లీ హైకోర్టుకు కేటాయించినట్లు మార్చిలో సుప్రీం కోర్టు పేర్కొంది. మరోవైపు అన్ని రాజకీయ పార్టీ మాదిరిగా దేశ రాజధాని ఢిల్లీలో ఆప్‌కు పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆశించింది. ఈ విషయంపై ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా కేంద్రానికి హైకోర్టు సూచించింది. జూన్ 15న ఆప్ ప్రస్తుత ఆఫీసును ఖాళీ చేయాల్సి ఉండగా వీలైనంత త్వరగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్క్లోని మంత్రిత్వ శాఖల వద్ద కొంత భాగాన్ని తాత్కాలిక ఆఫీసు కోసం కేటాయించాలని ఆప్ హైకోర్టును కోరింది. -
మోదీ మూడోసారి ప్రధాని కాలేడు : సోమనాథ్ భారతీ
ఢిల్లీ: పలు పర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ, ఎన్డీయే కూటిమి సుమారు 350 స్థానాలు గెలుస్తాయని అంచనా వేశాయి. బీజేపీ, ఎన్డీయే కూటమికి అధిక సీట్లు వస్తాయిని పేర్కొన్న సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతీ తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం కౌంటింగ్ రోజున అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పని తేలిపోతాయని అన్నారు. బీజేపీ అధిక సీట్లు గెలుచుకొని మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు (శిరోముండనం) చేయించుకుంటానని ఛాలెంజ్ చేశారు.‘‘నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు (శిరోముండనం) చేసుకుంటా. నా మాటలు రాసిపెట్టుకోండి. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు అని జూన్ 4న తెలిసిసోతుంది. నరేంద్రమోదీ మూడోసారి పీఎం కాలేడు. ఢిల్లీ మొత్తం ఏడు స్థానాల్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి గెలుస్తుంది. మోదీపై ఉన్న భయంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆయన ఓడిపోతారని వెల్లడించవు. మేము జూన్ 4న విడుదల అయ్యే నిజమైన ఫలితాల కోసం ఎదురు చుస్తున్నాం. ప్రజలు ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ భారీగా ఓట్లు వేశారు’’ అని సోమనాథ్ భారతీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.I will shave off my head if Mr Modi becomes PM for the third time.Mark my word!All exit polls will be proven wrong on 4th June and Modi ji will not become prime minister for the third time.In Delhi, all seven seats will go to India ALLIANCE.Fear of Mr Modi does not allow…— Adv. Somnath Bharti: इंसानियत से बड़ा कुछ नहीं! (@attorneybharti) June 1, 2024 ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన బీజేపీ.. తాము సులభంగా అధిక సీట్లు గెలుస్తామని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలిపాయి. దేశ ప్రజలు మోదీ మూడుసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. కానీ, సోమనాథ్ భారతీలానే చాలా మంది ప్రతిపక్ష నేతలు ఎగ్జిట్ పోల్స్‌ను తప్పని అంటున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది.2019లో దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ మొత్తం ఏడు సీట్లకు 6 సీట్లు కౌవసం చేసుకుంటుందని పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తే.. ఏకంగా ఏడు సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈసారి ప్రతిపక్షాల ఇండియా కూటమిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేసింది. ఈసారి ఏడు సీట్లలోను తామే గెలుస్తామని ఆ రెండు ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
స్వాతి మలివాల్ ‘ఆప్’ను వీడతారా..?
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)కి రాజీనామా చేసే విషయమై ఆ పార్టీ ఎంపీ స్వాతిమలివాల్ స్పందించారు. తాను ఆప్‌ను వీడటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలివాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.మే13న సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఆయన అనుచరుడు బిభవ్‌కుమార్ చేతిలో మలివాల్ దాడికి గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెను బీజేపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించారని, ఆమె త్వరలో పార్టీ మారనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని ఆమె తాజాగా ఖండించారు. బీజేపీ నేతలు తనతో టచ్‌లోకి రాలేదని చెప్పారు.తాను ఆప్‌లోనే కొనసాగుతానని, ఆ పార్టీ ఏ ఒకరిదో ఇద్దరిదో కాదన్నారు. పార్టీ కోసం తన చెమట, రక్తాన్ని ధారపోశానన్నారు. నిజానికి తనపై దాడి తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మాత్రమే తనతో మాట్లాడారని, ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తని మలివాల్ చెప్పుకొచ్చారు. -
Delhi CM Arvind Kejriwal: ప్రధాని కావాలని లేదు
న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధాని కావాలన్న ఆశ తనకు అస్సలు లేదని ఆప్ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే ఇండియా కూటమి గెలిస్తే న్యాయ వ్యవస్థను ఒత్తిళ్ల నుంచి విముక్తం చేస్తామన్నారు. తన భార్య సునీతకు రాజకీయాలు నచ్చవని వెల్లడించారు. బెయిల్‌పై విడుదలయ్యాక బుధవారం ఆయన తొలిసారి పీటీఐ వీడియోస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సొంత రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్‌పై తన ఇంట్లోనే పీఏ బిభవ్ కుమార్ దాడి చేసిన ఉదంతంపై కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే... నియంతృత్వాన్ని నిలువరిస్తాం ‘‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే విపక్ష నేతలందర్నీ కట్టగట్టి జైలుకు పంపుతుంది. ఎన్నికలను హైజాక్ చేస్తుంది. రష్యా మాదిరే ఏకపక్ష ఎన్నికలుంటాయి. అక్కడ పుతిన్ విపక్ష నేతల్ని జైలుకు, కొందర్ని పైకి పంపారు. అందుకే తాజా ఎన్నికల్లో 87 శాతం ఓట్లు సాధించారు. పాకిస్థాన్‌లోనూ అంతే. ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకు పంపారు. సొంత పార్టీ గుర్తును కూడా ఎన్నికల్లో వాడుకోనివ్వలేదు. బీజేపీ మళ్లీ గెలిస్తే ఎవ్వరినీ వదలదు. కానీ మోదీ నియంతృత్వ పాలనను నిలువరిస్తాం. ఇండియా కూటమి 300 మార్కు దాటుతుంది. చక్కటి, సుస్థిర ప్రజాపాలన సాగిస్తాం. నాకు ప్రధాని కావాలనే ఆలోచనే లేదు. మాది (ఆప్) చాలా చిన్న పార్టీ. కేవలం 22 చోట్ల పోటీ చేస్తున్నాం. ప్రధానిగా రాహుల్‌ను నేను అంగీకరిస్తానా అన్నది ఊహాజనిత ప్రశ్న. అలాంటి అంశాలు చర్చకే గెలిచాక అందరం కలిసి కూర్చొని దీనిపై చర్చిస్తాం. సానుకూల పవనాలు ఊహించిందే ఆప్ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు, 2020లో 62 సీట్లు సాధించింది. ఈసారి ఆప్–ఇండియా కూటమికి సానుకూల పవనాలు వీయడంలో ఆశ్చర్యమేమీ లేదు. నన్ను అరెస్టు చేయడంతో ఢిల్లీ ఓటర్లు భావోద్వేగానికి గురయ్యారు. ఆ ప్రజాగ్రహం బీజేపీ ఓటమికి కారణం కాబోతోంది. నాకు బెయిల్ దొరకడం నిజంగా దేవుడి మాయ. నన్ను జైలుకు పంపితే ఆప్ ముక్కలుచెక్కలవుతుందన్న బీజేపీ కల కలగానే మిగిలిపోయింది. మలివాల్ ఉదంతంలో బాధితులకు న్యాయం జరగాలి మలివాల్‌పై దాడి కేసు విచారణ నిష్పాక్షికంగా జరగాలి. రెండు వైపుల వాదనలను ఆలకించి పోలీసులు సరైన మార్గంలో దర్యాప్తు జరపాలి. నిజమైన బాధితులకు న్యాయం జరగా>లి. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి మాట్లాడలేను. న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లుండవ్ఇండియా కూటమి అధికార పగ్గాలు చేపడితే న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేస్తాం. ఆ వ్యవస్థ స్వతంత్రంగా పని చేస్తుంది. అప్పుడు నాపై మోపిన కేసులన్నీ బోగస్ అని తేలుతాయి. అందుకే జూన్ 4 ఫలితాల తర్వాత విపక్షాల కూటమి గెలిచాక కేసుల నుంచి విముక్తుడినవుతా. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి బీజేపీ, ఈడీ ఆరోపించినట్లు నగదు అక్రమ బదిలీ జరగలేదు. ఈ కేసులో వాళ్లింతవరకు ఒక్క పైసా కూడా కనుక్కోలేకపోయారు. అవినీతి జరిగి ఉంటే ఆ నగదు అంతా ఎటు పోయినట్లు?సునీతది ధర్మాగ్రహం 2000 దశకంలో ఢిల్లీ మురికివాడల పరిధిలో ఐటీ కమిషనర్‌గా పని చేశా. పదవీ విరమణ చేసి ప్రజా జీవితంలోకి వచ్చా. సొంతంగా పార్టీ పెడతానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఏకంగా సీఎం అవుతానని అస్సలు ఊహించలేదు. నా భార్య సునీతకు రాజకీయాలపై ఆసక్తి లేదు. భవిష్యత్తులోనూ క్రియాశీల రాజకీయాల్లోకి రాదు. నన్ను అక్రమంగా అరెస్టు చేసినందుకే తను ఇల్లు దాటి బయటికొచ్చి ధర్మాగ్రహం చూపింది. సునీత భార్య కావడం నా అదృష్టం. జీవితంలో ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచింది. నేను జైల్లో ఉండగా నాకు, ఢిల్లీ ప్రజలకు వారధిగా నిలిచింది. కస్టడీ ముగిసి నేను జైలుకెళ్తే సీఎంగా బాధ్యతల నిర్వహణకు తగిన వసతులు కలి్పంచాలని కోర్టును కోరతా. -
Lok Sabha Election 2024: దేశ రాజధానిలో... బీజేపీకి సవాలే
దేశ రాజధానివాసులు గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి జైకొట్టారు. ఈసారి మాత్రం కాంగ్రెస్–ఆప్ గట్టి పోటీ ఇస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో మూడు పారీ్టలూ విడిగా పోటీ చేయడం బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్ 3, ఆప్ 4 చోట్ల బీజేపీకి సవాలు విసురుతున్నాయి. దాంతో అధికార వ్యతిరేకతను అధిగమించేందుకు ఏకంగా ఆరుగురు సిట్టింగులను కాషాయ పార్టీ మార్చేసింది! ఆప్ సర్కారుపై అవినీతి ఆరోపణలనే ప్రచారాస్త్రంగా చేసుకుంది. అదంతా తమ పార్టీని అంతం చేసే కుట్రలో భాగమంటూ ఆప్ తిప్పికొడుతోంది. జైలు నుంచి తిరిగొచ్చిన అధినేత కేజ్రీవాల్ ప్రచార భారాన్ని భుజాలపై మోశారు. శనివారం జరిగే పోలింగ్‌లో ఓటర్లు ఎవరిని దీవిస్తారన్నది ఉత్కంఠగా మారింది... న్యూఢిల్లీకేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్థానంలో దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె, యువ న్యాయవాది, బాసురీ స్వరాజ్‌కు బీజేపీ టికెటిచ్చింది. 40 ఏళ్ల బాసురీ రాజకీయాలకు కొత్త కాదు. 2013, 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాలవీయనగర్ నుంచి విజయం సాధించారు. ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి కూడా లాయరే. ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేశారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల నివాసాలు ఈ వీఐపీ స్థానం పరిధిలోనే ఉన్నాయి. ట్రాఫిక్ జామ్, మురుగునీటి సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. చాందినీ చౌక్ విస్తీర్ణంలో దేశంలోనే అతి చిన్న లోక్‌సభ స్థానమిది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ బదులు వ్యాపారి ప్రవీణ్ ఖండేల్వాల్ (64)కు బీజేపీ టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్ అగర్వాల్ పోటీలో ఉన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే వర్తకుల కోసం తాము చేసిన పనులను గుర్తు చేస్తూ అగర్వాల్, ఖండేల్వాల్ ఓట్లడిగారు. ఆప్ మద్దతు అగర్వాల్‌కు అదనపు బలం.నార్త్ ఈస్ట్ ఢిల్లీ విస్తీర్ణంలో దేశంలోనే అతి చిన్న లోక్‌సభ స్థానమిది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ బదులు వ్యాపారి ప్రవీణ్ ఖండేల్వాల్ (64)కు బీజేపీ టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్ అగర్వాల్ పోటీలో ఉన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే వర్తకుల కోసం తాము చేసిన పనులను గుర్తు చేస్తూ అగర్వాల్, ఖండేల్వాల్ ఓట్లడిగారు. ఆప్ మద్దతు అగర్వాల్‌కు అదనపు బలం.నార్త్ ఈస్ట్ ఢిల్లీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కాంగ్రెస్ అభ్యరి్థగా సవాల్ విసురుతున్నారు. బిహార్, యూపీ, జార్ఖండ్ నుంచి వలస వచ్చిన ఓటర్లు ఇక్కడ ఏకంగా 30 శాతం పైగా ఉంటారు. అందుకే బిహార్‌కు చెందిన కన్హయ్యకు కాంగ్రెస్ చాన్సిచి్చంది. అయితే ఆయన పోటీ తమకే కలిసొస్తుందని బీజేపీ అంటోంది. ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకునిగా కన్హయ్య ఎదుర్కొన్న ఆరోపణలను ప్రచారంలో పదేపదే ప్రస్తావించింది.ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బదులు హర్షా మల్హోత్రాకు బీజేపీ టికెటిచ్చింది. ఆప్ నుంచి కులదీప్ కుమార్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తొలిసారి లోక్‌సభ బరిలో దిగారు. అయితే ఈస్ట్ ఢిల్లీ మేయర్‌గా చేసిన అనుభవం మల్హోత్రా సొంతం. ఈస్ట్ ఢిల్లీ బీజేపీ కంచుకోట అనే చెప్పాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన పీసీసీ మాజీ చీఫ్ రవిందర్ సింగ్ లవ్లీ ఇటీవలే బీజేపీలో చేరడం ఆ పారీ్టకి మరింత కలిసి రానుంది.నార్త్‌వెస్ట్ ఢిల్లీ ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ హన్స్‌రాజ్ హన్స్ బదులు కౌన్సిలర్ యోగేంద్ర చందోలియాకు బీజేపీ చాన్సిచి్చంది. ఆయన గతంలో నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై ఎంపీగా గెలిచిన ఉదిత్‌రాజ్ ఈసారి కాంగ్రెస్ అభ్యరి్థగా బరిలో దిగడం ఆసక్తికరం. ఆయన ఎంపీగా నియోజకవర్గానికి ముఖం కూడా చూపించలేదని ప్రచారంలో చందోలియా పదేపదే చెప్పారు.వెస్ట్ ఢిల్లీ ఆప్ నేత మహాబల్ మిశ్రా, బీజేపీ అభ్యర్థి కమలీత్ షెరావత్ మధ్య గట్టి పోటీ నెలకొంది. 70 ఏళ్ల మహాబల్ మిశ్రాది బిహార్‌లోని మధుబని. ఇక్కడ బిహారీ ఓటర్లు భారీగా ఉండటం ఆయనకు అనుకూలించే అంశం. షెరావత్ బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఎక్కువ మంది ఇంటి నుంచి ఓటేసిన లోక్‌సభ స్థానంగా ఈసారి వెస్ట్ ఢిల్లీ వార్తల్లోకెక్కింది. 85 ఏళ్లు పై బడిన 969 మంది, 179 మంది దివ్యాంగులు ఇంటి నుంచి ఓటేశారు.సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ, వివాదాస్పద నేత రమేశ్ బిదురి బదులు బదార్పూర్ ఎమ్మెల్యే రామ్‌వీర్ సింగ్ బిదురికి బీజేపీ టికెటిచి్చంది. ఆప్ నుంచి సాహిరాం పహిల్వాన్ బరిలో ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 10 అసెంబ్లీ సీట్లలో బీజేపీ చేతిలో ఉన్నది బదార్పూర్ ఒక్కటే! అభ్యర్థులిద్దరూ గుర్జర్ సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: దేశ రాజధానిలో... బీజేపీకి సవాలే
దేశ రాజధానివాసులు గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి జైకొట్టారు. ఈసారి మాత్రం కాంగ్రెస్–ఆప్ గట్టి పోటీ ఇస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో మూడు పారీ్టలూ విడిగా పోటీ చేయడం బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్ 3, ఆప్ 4 చోట్ల బీజేపీకి సవాలు విసురుతున్నాయి. దాంతో అధికార వ్యతిరేకతను అధిగమించేందుకు ఏకంగా ఆరుగురు సిట్టింగులను కాషాయ పార్టీ మార్చేసింది! ఆప్ సర్కారుపై అవినీతి ఆరోపణలనే ప్రచారాస్త్రంగా చేసుకుంది. అదంతా తమ పార్టీని అంతం చేసే కుట్రలో భాగమంటూ ఆప్ తిప్పికొడుతోంది. జైలు నుంచి తిరిగొచ్చిన అధినేత కేజ్రీవాల్ ప్రచార భారాన్ని భుజాలపై మోశారు. శనివారం జరిగే పోలింగ్‌లో ఓటర్లు ఎవరిని దీవిస్తారన్నది ఉత్కంఠగా మారింది... న్యూఢిల్లీకేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్థానంలో దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె, యువ న్యాయవాది, బాసురీ స్వరాజ్‌కు బీజేపీ టికెటిచ్చింది. 40 ఏళ్ల బాసురీ రాజకీయాలకు కొత్త కాదు. 2013, 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాలవీయనగర్ నుంచి విజయం సాధించారు. ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి కూడా లాయరే. ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేశారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల నివాసాలు ఈ వీఐపీ స్థానం పరిధిలోనే ఉన్నాయి. ట్రాఫిక్ జామ్, మురుగునీటి సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. చాందినీ చౌక్ విస్తీర్ణంలో దేశంలోనే అతి చిన్న లోక్‌సభ స్థానమిది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ బదులు వ్యాపారి ప్రవీణ్ ఖండేల్వాల్ (64)కు బీజేపీ టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్ అగర్వాల్ పోటీలో ఉన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే వర్తకుల కోసం తాము చేసిన పనులను గుర్తు చేస్తూ అగర్వాల్, ఖండేల్వాల్ ఓట్లడిగారు. ఆప్ మద్దతు అగర్వాల్‌కు అదనపు బలం.నార్త్ ఈస్ట్ ఢిల్లీ విస్తీర్ణంలో దేశంలోనే అతి చిన్న లోక్‌సభ స్థానమిది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ బదులు వ్యాపారి ప్రవీణ్ ఖండేల్వాల్ (64)కు బీజేపీ టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్ అగర్వాల్ పోటీలో ఉన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే వర్తకుల కోసం తాము చేసిన పనులను గుర్తు చేస్తూ అగర్వాల్, ఖండేల్వాల్ ఓట్లడిగారు. ఆప్ మద్దతు అగర్వాల్‌కు అదనపు బలం.నార్త్ ఈస్ట్ ఢిల్లీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కాంగ్రెస్ అభ్యరి్థగా సవాల్ విసురుతున్నారు. బిహార్, యూపీ, జార్ఖండ్ నుంచి వలస వచ్చిన ఓటర్లు ఇక్కడ ఏకంగా 30 శాతం పైగా ఉంటారు. అందుకే బిహార్‌కు చెందిన కన్హయ్యకు కాంగ్రెస్ చాన్సిచి్చంది. అయితే ఆయన పోటీ తమకే కలిసొస్తుందని బీజేపీ అంటోంది. ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకునిగా కన్హయ్య ఎదుర్కొన్న ఆరోపణలను ప్రచారంలో పదేపదే ప్రస్తావించింది.ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బదులు హర్షా మల్హోత్రాకు బీజేపీ టికెటిచ్చింది. ఆప్ నుంచి కులదీప్ కుమార్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తొలిసారి లోక్‌సభ బరిలో దిగారు. అయితే ఈస్ట్ ఢిల్లీ మేయర్‌గా చేసిన అనుభవం మల్హోత్రా సొంతం. ఈస్ట్ ఢిల్లీ బీజేపీ కంచుకోట అనే చెప్పాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన పీసీసీ మాజీ చీఫ్ రవిందర్ సింగ్ లవ్లీ ఇటీవలే బీజేపీలో చేరడం ఆ పారీ్టకి మరింత కలిసి రానుంది.నార్త్‌వెస్ట్ ఢిల్లీ ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ హన్స్‌రాజ్ హన్స్ బదులు కౌన్సిలర్ యోగేంద్ర చందోలియాకు బీజేపీ చాన్సిచి్చంది. ఆయన గతంలో నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై ఎంపీగా గెలిచిన ఉదిత్‌రాజ్ ఈసారి కాంగ్రెస్ అభ్యరి్థగా బరిలో దిగడం ఆసక్తికరం. ఆయన ఎంపీగా నియోజకవర్గానికి ముఖం కూడా చూపించలేదని ప్రచారంలో చందోలియా పదేపదే చెప్పారు.వెస్ట్ ఢిల్లీ ఆప్ నేత మహాబల్ మిశ్రా, బీజేపీ అభ్యర్థి కమలీత్ షెరావత్ మధ్య గట్టి పోటీ నెలకొంది. 70 ఏళ్ల మహాబల్ మిశ్రాది బిహార్‌లోని మధుబని. ఇక్కడ బిహారీ ఓటర్లు భారీగా ఉండటం ఆయనకు అనుకూలించే అంశం. షెరావత్ బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఎక్కువ మంది ఇంటి నుంచి ఓటేసిన లోక్‌సభ స్థానంగా ఈసారి వెస్ట్ ఢిల్లీ వార్తల్లోకెక్కింది. 85 ఏళ్లు పై బడిన 969 మంది, 179 మంది దివ్యాంగులు ఇంటి నుంచి ఓటేశారు.సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ, వివాదాస్పద నేత రమేశ్ బిదురి బదులు బదార్పూర్ ఎమ్మెల్యే రామ్‌వీర్ సింగ్ బిదురికి బీజేపీ టికెటిచి్చంది. ఆప్ నుంచి సాహిరాం పహిల్వాన్ బరిలో ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 10 అసెంబ్లీ సీట్లలో బీజేపీ చేతిలో ఉన్నది బదార్పూర్ ఒక్కటే! అభ్యర్థులిద్దరూ గుర్జర్ సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్‌క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ నేతలను అందరినీ ఒకేసారి అరెస్ట్ చేసి జైలుకు పంపాలని సవాల్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం పార్టీ నేతలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి నిరసన మార్చ్ చేపట్టనున్నారు సీఎం కేజ్రీవాల్. దీంతో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. తమ పార్టీ నేతలను అరెస్ట్‌లతో బీజేపీ టార్గెట్ చేయడాన్ని తప్పుపట్టిన కేజ్రీవాల్ ఆదివారం తన పార్టీ నేతలతో బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తామని కావాలనుకుంటే అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయాలని ఛాలెంజ్ చేశారు. ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో తన పీఏ బిభవ్ కుమార్ అరెస్టయిన నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ వీడియోలో సందేశం ద్వారా పార్టీ నేతలకు నిరసన, మార్చ్‌కు పిలుపు నిచ్చారు.प्रधानमंत्री जी, ये एक-एक करके क्या आप हम लोगों को गिरफ़्तार कर रहे हैं? एक साथ सभी को गिरफ़्तार कर लीजिए - CM @ArvindKejriwal l LIVE https://t.co/0LIUQdK9PZ— AAP (@AamAadmiParty) May 18, 2024‘‘మా నేతలను ఒకరి తర్వాత ఒకరిని జైలులో పెడుతున్నారు. ప్రధాని మోదీకి నేను ఒకటి చెప్పదల్చుకున్నా. అరెస్ట్‌లను ఒక క్రీడా భావిస్తున్నారు. మా నేతలనంతా ఒకేసారి అరెస్ట్ చేయండి. అందుకే నేను, మా పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను తీసుకొని ఆదివారం బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తాం. అప్పుడు మమల్ని ఒకేసారి జైలులో వేయండి’’ అని కేజ్రీవాల్ శనివారం ఓ వీడియో విడుదల చేశారు.తమ పార్టీలో కీలకమైన నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. వారిలో రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతిశీ ఉన్నారని కేజ్రీవాల్ తెలిపారు.లోక్‌సభ ఎన్నికల వేళ ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఎ బిభవ్ కుమార్ తనపై ముఖ్యమంత్రి నివాసంలో దాడి చేశారని ఆరోపణలు చేయటం ఢిల్లీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. బిభవ్‌కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. శనివారం బిభవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఐదు రోజుల పోలీసు కస్టడీలో ఉన్నారు. సీఎం కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్ తనతో అమర్యాదగా ప్రవర్తించారని బిభవ్ కుమార్ సైతం ఆమెపై కేసు నమోదు చేశారు.స్వాతి మలివాల్‌పై అవినీతి అరోపణ కేసు ఉండటంలో బీజేపీ కుట్రతోనే తనపై దాడి జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆప్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.మరోవైపు.. స్వాతి మలివాల్ ఘటన విషయంలో బీజేపీ నేతలు సీఎం కేజ్రీవాల్‌పై విమర్శలు చేస్తున్నారు. దాడి జరిగి రోజులు గడుస్తున్నా.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనంగా ఉంటున్నారని మండిపడుతున్నారు. సీఎం కేజ్రీవాల్ పెదవి విప్పకపోవటంపై ఈ దాడి వెనక ఆయన హస్తం ఉందంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. -
స్వాతి మలివాల్‌పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడిపై ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు చేస్తోంది. స్వాతి మలివాల్ ఆరోపణల్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి అతిషి కొట్టి పారేశారు. ఆమె చేస్తోన్న ఆరోపణలు బీజేపీ కుట్రలో భాగమేనని ఆరోపించారు. మే 13న ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ అపాయింట్మెంట్ లేకుండా సీఎం కేజ్రీవాల్ నివాసంలోకి ప్రవేశించారు. కేజ్రీవాల్ అందుబాటులో లేరు. అపాయింట్ లేకపోవడంపై సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ ఆమెను అడ్డుకున్నారు. డ్రాయింగ్ రూమ్‌లో వాదించడం ప్రారంభించింది’ అని అతిషి విలేకరుల సమావేశంలో తెలిపారు.‘అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ రావడం బీజేపీని ఉలిక్కిపడేలా చేసింది. కాబట్టే బీజేపీ ఓ కుట్ర పన్నింది. అందులో భాగంగా స్వాతి మలివాల్‌ను పావుగా వినియోగించుకుంది. మే 13 ఉదయం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి పంపింది. అక్కడే ఆమె కథంతా నెరిపింది. తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఈరోజు వెలుగులోకి వచ్చిన వీడియోలో ఆమె డ్రాయింగ్ రూమ్‌లో కూర్చొని పోలీసు అధికారులను బెదిరించడం కనిపించింది. తనపై క్రూరంగా దాడి చేశారిన స్వాతి ఆరోపణలకు.. వీడియోలో కస్తున్న కనిపిస్తున్న దృశ్యాలు పూర్తి విభిన్నంగా ఉన్నాయిఆ వీడియోలో స్వాతి మలివాల్ కనిపించారు. కొట్టినట్లు వీడియో తీస్తున్నదెవరు..ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తేనే అందరికీ నిజం తెలుస్తుంది. ఆ దేవుడు అంతా చూస్తున్నాడు. ఏదో ఒకరోజు ఆ నిజం ప్రపంచానికి తెలుస్తోంది’ అని అతిషి అన్నారు.కాగా, స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అతిషి తెలిపారు.