
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పరిపాలనా సర్వీసులపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ జూన్ 11న మహార్యాలీ నిర్వహించనున్నట్లు ఆప్ సోమవారం ప్రకటించింది. అందులో ఢిల్లీ ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఢిల్లీలో అధికారుల బదిలీలు, వారిపై ఆరోపణలు వస్తే చర్యల కోసం కొత్తగా ‘నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ’ని ఏర్పాటు చేస్తూ కేంద్రం ఈ నెల 19న ఆర్డినెన్స్ తేవడం తెలిసిందే. దీనిపై ఆప్ పోరాటానికి కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించింది.
విపక్షాలకు ఇదొక అగ్ని పరీక్ష: సంజయ్
కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను బీజేపీయేతర పార్టీలన్నీ వ్యతిరేకించాలని ఆప్ రాజ్యసభ సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయని విమర్శించారు. కేంద్ర ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ రాజ్యసభలో తాము ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు ఇవ్వాలని విపక్షాలను సంజయ్ సింగ్ కోరారు. ప్రతిపక్షాలకు ఇదొక అగ్ని పరీక్ష అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment