maha rally
-
Delhi liquor scam: 31న విపక్షాల మహా ర్యాలీ
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా విపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు చేతులు కలుపుతున్నారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ, ఆయనకు సంఘీభావంగా ఈ నెల 31న తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో మహా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. కూటమి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దేశ ప్రయోజనాలతోపాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో మహా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించామని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. దేశంలో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యం పెను ముప్పును ఎదుర్కొంటోందని అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించేవారంతా కేజ్రీవాల్ ఆరెస్టు పట్ల ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ‘‘ఇది కేవలం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన సమస్య కాదు. ప్రతిపక్షాలన్నీ బెదిరింపులను ఎదుర్కొంటున్నాయి. అధికారంలో ఉన్న వ్యక్తులు మొదట విపక్షాలను డబ్బుతో కొనేయాలని చూస్తున్నారు. మాట వినకపోతే ఈడీ, ఐటీ, సీబీఐని ప్రయోగిస్తున్నారు. అయినా లొంగకపోతే తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేస్తున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఇలాగే అరెస్టు చేశారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పైనా గురిపెట్టారు’’ అని గోపాల్ రాయ్ ఆరోపించారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను గృహ నిర్బంధంలో ఉంచారని, ఆప్ కార్యాలయాన్ని సీజ్ చేశారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయని చెప్పారు. కేవలం రాజకీయ సభ కాదు ఢిల్లీలో ఈనెల 31న జరిగే మహా ర్యాలీ కేవలం రాజకీయ సభ కాదని, కేంద్రంలోని నిరంకుశ బీజేపీకి వ్యతిరేకంగా వినిపించే గొంతుక అని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరి్వందర్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఖాతాలను స్తంభింపజేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. ఇండియా కూటమి పక్షాలకు అండగా నిలుస్తామని తెలిపారు. మోదీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ పోరాడుతాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంపై దాడులను సహించబోమని సీపీఎం నేత రాజీవ్ కున్వార్ స్పష్టం చేశారు. -
జూన్ 11న ఆప్ మహా ర్యాలీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పరిపాలనా సర్వీసులపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ జూన్ 11న మహార్యాలీ నిర్వహించనున్నట్లు ఆప్ సోమవారం ప్రకటించింది. అందులో ఢిల్లీ ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఢిల్లీలో అధికారుల బదిలీలు, వారిపై ఆరోపణలు వస్తే చర్యల కోసం కొత్తగా ‘నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ’ని ఏర్పాటు చేస్తూ కేంద్రం ఈ నెల 19న ఆర్డినెన్స్ తేవడం తెలిసిందే. దీనిపై ఆప్ పోరాటానికి కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించింది. విపక్షాలకు ఇదొక అగ్ని పరీక్ష: సంజయ్ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను బీజేపీయేతర పార్టీలన్నీ వ్యతిరేకించాలని ఆప్ రాజ్యసభ సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయని విమర్శించారు. కేంద్ర ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ రాజ్యసభలో తాము ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు ఇవ్వాలని విపక్షాలను సంజయ్ సింగ్ కోరారు. ప్రతిపక్షాలకు ఇదొక అగ్ని పరీక్ష అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని విన్నవించారు. -
దేశ్కా చౌకీదార్’ మాత్రమే దొంగ
రాంచీ: ‘కాపలాదార్లంతా దొంగలు కారు.. దేశానికి కాపలాదారు (దేశ్కా చౌకీదార్) మాత్రమే దొంగ’అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాంచీలో శనివారం జరిగిన బహిరంగ సభ ‘పరివర్తన్ ఉల్గులన్ మహా ర్యాలీ’లో రాహుల్ మాట్లాడుతూ.. ‘కొందరు కాపలాదార్లు ఆ (చౌకీదార్ చోర్ హై)నినాదంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తామంతా నిజాయతీ పరులమనీ, ఆ నినాదాన్ని మార్చుకోవాలని సూచించారు. అయితే, ఆందోళన చెందవద్దని వారికి చెప్పా. కాపలాదారే దొంగ నినాదం ప్రధాని మోదీని ఉద్దేశించిందేనన్న విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. దేశానికి కాపలాదారు మాత్రమే దొంగ. ఈ ఒక్క కాపలాదారు కారణంగా అందరికీ అప్రతిష్ట వచ్చిపడింది’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రధాని మోదీ రూ.30 వేల కోట్ల మేర తన సన్నిహితుడైన అనిల్ అంబానీకి అక్రమంగా లాభం కలిగేలా చేశారంటూ రాహుల్ ఆరోపిం చారు. ‘వాయుసేన దేశాన్ని రక్షిస్తుండగా మన ప్రధాని మాత్రం సైన్యం నుంచి డబ్బు దోచుకుంటున్నారు’ అని రాహుల్ ఆరోపించారు. రైతులు, విద్యార్థులు, చిన్న దుకాణదారులను పట్టించుకోని ప్రధానమంత్రి పారిశ్రామికవేత్తలకు బ్యాంకు లిచ్చిన రూ.3.5 లక్షల కోట్ల రుణాలను మాత్రం రద్దు చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకాన్ని అమలు చేసి, పేదల బ్యాంకు అకౌంట్లలోకి నేరుగా డబ్బును జమ చేస్తామని హామీ ఇచ్చారు. తప్పుడు వాగ్దానాలు, తప్పుడు గిమ్మిక్కులు చేసే కాపలాదారు(ప్రధాని) మళ్లీ విఫల మయ్యారని రాహుల్ మండిపడ్డారు. -
రగులుతున్న మరాఠాల ఎద
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ ముంబై నగరానికి మూడున్నర లక్షల మందితో మహా ర్యాలీని మరాఠాలు నిర్వహించి ఏడాది గడిచింది. 2019, ఆగస్టు 9వ తేదీన మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి ప్రారంభమైన 58 మౌన, అహింసా ర్యాలీలు ముంబై నగరంలో మిళితమై అది మెఘా ర్యాలీగా మారింది. నాడు ఒక్క రిజర్వేషన్ల అంశంపైనే కాకుండా రైతులకు పలు రాయితీలు కల్పించాలని, 2016లో 15 ఏళ్ల మరాఠా బాలికపై జరిగిన మూకుమ్మడి అత్యాచార ఘటనలో సత్వర న్యాయం జరగాలని నాడు మరాఠాలు డిమాండ్ చేశారు. అత్యాచారం కేసును విచారించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 2017, నవంబర్‌లో ముగ్గురు దోషులకు మరణ శిక్ష విధించింది. లక్షలాది మంది మరాఠాలు రోడ్డెక్కడానికి ప్రధాన కారణం ఈ రేప్ సంఘటన. ఈ సంఘటనలో దోషులు దళితులవడం వల్ల రిజర్వేషన్లతో వారు విర్రవీగుతున్నారన్న ఆక్రోశంతో మరాఠాలు కూడా రిజర్వేషన్ల కోసం పోరుబాట పట్టారు. అదే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వివిధ పంటలకు కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల రుణాల మాఫీకి చర్యలు చేపట్టింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని సుప్రీం కోర్టు నిర్దేశించిన నేపథ్యంలో అప్పటికే రాష్ట్రంలో రిజర్వేషన్లు యాభై శాతం దాటడంలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. అయినప్పటికీ రిజర్వేషన్ల అంశం పరిష్కారానికి న్యాయపరంగా ఉన్న అన్ని మార్గాలను అన్వేషించి సత్వర చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంతో మరాఠాలు తమ పోరాటానికి విరామం కల్పించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశం ముంబై హైకోర్టుకు వెళ్లింది. సుప్రీం కోర్డు మార్గదర్శకాల మేరకు హైకోర్టు కూడా రిజర్వేషన్ల విషయమై ఏం చేయక పోవచ్చు. అయినప్పటికీ కోర్టు తీర్పు కోసం నిరీక్షిద్దామని, నవంబర్ నెల వరకు నిరీక్షించాల్సిందిగా మరాఠాలకు ఫడ్నవీస్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎందుకోగానీ గత జూలై నెలలో మరాఠాలు రిజర్వేషన్లంటూ రెండో పర్యాయం రోడ్డుమీదకు వచ్చారు. గతంలోలాగా కాకుండా వారు ఈసారి విధ్వంసకాండకు పాల్పడ్డారు. ఇప్పుడు కూడా పాల్పడుతున్నారు. తాజాపోరులో భాగంగా 500 మంది మరాఠాలు గురువారం నాడు ముంబైలోని బంద్రా–కుర్లా కాంప్లెక్స్‌లోని సబర్బన్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయింపు ప్రారంభించారు. విషయం కోర్టులో ఉన్నప్పుడు మీరు ఆందోళన చేసి ఏం లాభం అంటూ మీడియా కొందరిని ప్రశ్నించగా, తామేమి 50 శాతం మించి రిజర్వేషన్లు ఇమ్మని డిమాండ్ చేయడం లేమని, 50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఇమ్మని కోరుతున్నామని వారు అన్నారు. కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు తగ్గిస్తే తమకు రిజర్వేషన్లు కల్పించవచ్చని వారు సూచిస్తున్నారు. మీడియా మాట్లాడించిన వారిలో 57 దత్తాత్రేయ్ థామ్‌కర్ ఒకరు. తన ఇద్దరి కూతుళ్లు ఇంజనీరింగ్ చదవుతున్నారని, వారి చదవుల కోసం రెండేళ్ల క్రితం 9 లక్షల రూపాయలు అప్పుచేశానని చెప్పారు. వారి పెళ్లికి అయ్యే ఖర్చు గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుందని అన్నారు. ఆ అప్పును ఎలా తీర్చాలో కూడా ప్రస్తుతానికి తనకు తెలియదని అన్నారు. చదువు పూర్తయినా ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదని అన్నారు. ఇదివరకు జౌళి మిల్లులో పనిచేసిన థామ్‌కర్ అది మూత పడడంతో రోజు కూలీగా మారారు. మరాఠాల సంప్రదాయం ప్రకారం మరాఠా మహిళలు భైఠాయింపునకు ముందు వరుసలో ప్రత్యేకంగా కూర్చున్నారు. వారిలో 45 ఏళ్ల ప్రేర్నా రాణె మీడియాతో మాట్లాడుతూ ‘నా పిల్లల చదువు పూర్తయింది. వచ్చేతరం పిల్లల రిజర్వేషన్ల కోసం పోరాటంలో పాల్గొంటున్నాను. మా సమాన హక్కుల కోసం మేం పోరాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ రోజు కాకున్నా రేపైనా ప్రభుత్వం దిగొచ్చి తమకు న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకుందని అక్కడ బైఠాయించిన మరాఠాలందరూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. చదవండి: మరాఠాలకు రిజర్వేషన్లు ఎందుకు ? -
నారీ గర్జన
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : అనంతపురం నగరంలో మహిళా ఉద్యోగుల ‘నారీ గర్జన ’కు వేలాది మంది కదలివచ్చారు. స్థానిక తెలుగు తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి.. సప్తగిరి సర్కిల్ మీదుగా పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు మహా ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మహిళా జేఏసీ నేతలు... సోనియా, సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ర్ట మంత్రులు, ఎంపీలే లక్ష్యంగా దుమ్మెత్తిపోశారు. తెలుగు జాతిని విచ్ఛిన్నం చేస్తున్న వీరి రాజకీయ భవిష్యత్తును సమాధి చేస్తామని హెచ్చరించారు. కాగా... ఈ నెల 29 వరకు మూకుమ్మడిగా కోర్టు విధులు బహిష్కరించాలని సీమాంధ్ర జిల్లాల న్యాయవాదులు తీర్మానించారు. స్థానిక కమ్మభవన్‌లో నిర్వహించిన న్యాయవాదుల సదస్సులో 13 జిల్లాలకు చెందిన జేఏసీ నేతలు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులకు ఉచిత న్యాయ సహాయం చేస్తామని ప్రకటించారు. ఈ నెల 28న హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదుల బహిరంగసభ, అక్టోబర్ 5,6 తేదీల్లో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని తీర్మానించారు. జాక్టో, పంచాయతీరాజ్, ఎన్జీవో, హంద్రీ-నీవా, వాణిజ్యపన్నులశాఖ, కార్పొరేషన్ ఉద్యోగులు, ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ నేతలు రిలే దీక్షలు కొనసాగిస్తూనే... మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. విభజిస్తే ఉరే శరణ్యమంటూ పలువురు సమైక్యవాదులు.. ఉరితాళ్లు మెడకు తగిలించుకుని నిరసన వ్యక్తం చేశారు. ధర్మవరంలో మహిళా గర్జనకు జనం పోటెత్తారు. ఉద్యోగ జేఏసీ నేతల రిలే దీక్షలు కొనసాగాయి. పట్టణంలో ప్రధాన రహదారులను దిగ్బంధించారు. ఓ సమైక్యవాది ఒంటికి పేపర్లు చుట్టుకుని నిరసన తెలిపారు. ముదిగుబ్బలో మహిళా గర్జనలో సమైక్య నినాదాలు మార్మోగాయి. గుంతకల్లులో వివిధ జేఏసీలు, వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు రిలే దీక్షలను కొనసాగించారు. ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. పామిడిలో మహిళలు, గుత్తిలో ఆర్ఎంపీ డాక్టర్లు ర్యాలీ చేపట్టారు. గుత్తిలో సమైక్యవాదులు కేంద్ర కార్యాలయాలను బంద్ చేయించారు. హిందూపురంలో మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ సంఘాల రిలే దీక్షలు కొనసాగాయి. చిలమత్తూరులో ఐసీడీఎస్ ఉద్యోగులు, జేఏసీ నేతల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కదిరిలో హిందీ పండిట్లు రిలే దీక్షకు దిగారు. హిందీ దివస్ సందర్భంగా రోడ్డుపైనే పిల్లలకు ‘సమైక్యాంధ్ర’ అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. మహిళలు ర్యాలీ చేశారు. కళ్యాణదుర్గంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రిలే దీక్షలు కొనసాగాయి. ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో విద్యుత్ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేయగా.. మహిళలు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అమరాపురంలో బంద్ పాటించారు. మడకశిరలో ఈ నెల 19న నిర్వహించే లక్షగళ గర్జనపై గుడిబండలో ఎంఆర్పీఎస్ నాయకులు విస్తృత ప్రచారం చేశారు. ఓడీసీ, పామిడి, పరిగిలో ఉద్యోగ జేఏసీ నేతలు, అమడగూరులో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. అమడగూరులో సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. పుట్టపర్తిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒంటికాలిపై నిలబడి రిలే దీక్షలు చేశారు. వారికి పుడా ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. పెనుకొండలో చేపట్టిన రిలే దీక్షల్లో మైనార్టీ మహిళలు, అంగన్వాడీలు, వైద్య ఉద్యోగులు పాల్గొన్నారు. గోరంట్లలో మహిళలు, రొద్దంలో విద్యార్థులు, సోమందేపల్లిలో గుడిపల్లి మహిళలు ర్యాలీలు చేపట్టారు. రాయదుర్గంలో మహిళా గర్జనకు వేలాది మంది హాజరయ్యారు. విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, వివిధ వర్గాల సమైక్య శిబిరాల్లో ఆర్ఎంపీ వైద్యులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. సమైక్యవాదులకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతి సంఘీభావం ప్రకటించారు. కణేకల్లులో బంద్ నిర్వహించగా.. లింగాయత్‌లు ర్యాలీ చేపట్టారు. రాప్తాడులో ఉపాధ్యాయులు జలదీక్ష చేశారు. గార్లదిన్నె మండలం కల్లూరులో సమైక్యవాదుల ఆమరణ దీక్ష మూడవ రోజూ కొనసాగింది. మహిళా గర్జనతో తాడిపత్రి హోరెత్తింది. వేలాది మంది మహిళలు ర్యాలీ చేపట్టి, మానహారంగా ఏర్పడ్డారు. ఎల్ఐసీ ఉద్యోగులు రిలే దీక్షలు చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. యాడికిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పెద్దవడుగూరులో విద్యార్థులు సైకిల్ ర్యాలీ, ఉరవకొండలో ఐకేపీ మహిళలు ర్యాలీ నిర్వహించారు.