national capital
-
దేశ రాజధానిగా ఢిల్లీ ఇంకా కొనసాగాలా?: శశి థరూర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన వాయుకాలుష్యం, పొగమంచుతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది ఏకంగా 500 మార్క్‌ను దాటిపోయింది. ఆరేళ్లలో కాలుష్యం ఈస్థాయికి చేరడం ఇది రెండోసారి మాత్రమే. దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు ఇలాంటి పరిస్థితుల్లో దేశ రాజధానిగా ఢిల్లీ ఇంకా కొనసాగాల్సి ఉందా అని సందేహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన స్పందిస్తూ.. ‘ప్రపంచంలో రెండవ అత్యంత కలుషితమైన నగరమైన ఢాకా కంటే ఢిల్లీలో పరిస్థితి దాదాపు ఐదు రెట్లు అధ్వాన్నంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ పరిస్థితిని ఏళ్ల తరబడి చూస్తున్నా. కేంద్ర ప్రభుత్వం మాత్రం సమస్యను పరిష్కరించడంలో విఫలమవ్వడం విడ్డూరం. దేశ రాజధానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. నవంబరు నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండట్లేదు. మిగతా సమయాల్లోనూ అంతంతమాత్రంగానే జీవనం సాగించగలం. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా?’ అని పేర్కొన్నారు.Delhi is officially the most polluted city in the world, 4x Hazardous levels and nearly five times as bad as the second most polluted city, Dhaka. It is unconscionable that our government has been witnessing this nightmare for years and does nothing about it. I have run an Air… pic.twitter.com/sLZhfeo722— Shashi Tharoor (@ShashiTharoor) November 18, 2024తీవ్రమైన వాయుకాలుష్యంతో కళ్లలో మంటలు, గొంతులో గరగర, శ్వాస ఆడకపోవడం తదితర సమస్యలతో ఢిల్లీ వాసులు అవస్థలు పన్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించని పరిస్థితి నెలకొంది. తీవ్ర వాయు కాలుష్యంతో ఢిల్లీ ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వాయు కాలుష్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడింది. రోజురోజుకు వాయు నాణ్యత క్షీణిస్తున్నా అధికారులు అలసత్వం ప్రదర్శించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తంచేసింది. పరిస్థితి విషమించినా గ్రాప్–4 నిబంధనల అమలులో అధికారులు జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వెలిబుచ్చింది. ఏక్యూఐ 450 దిగువకు వచ్చినా గ్రాప్–4 నిబంధనలనే కొనసాగించాలని ఆదేశించింది. వాయు కాలుష్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని 10, 12వ తరగతులకు కూడా ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నుంచి 10, 12 తరగతులకు కూడా ఆన్లైన్ కాస్టులనే నిర్వహిస్తామని ఢిల్లీ సీఎం ఆతిశి ‘ఎక్స్’లో వెల్లడించారు. వీరితో పాటు మిగతా కాస్లులకు ఇదివరకే అమలవుతున్నట్లుగా ఆన్లైన్ క్లాసులు ఉంటాయని తెలిపారు. -
వాయు కాలుష్యంపై మొద్దునిద్ర
దేశ రాజధానిలో 60 శాతం అధికంగా కుంభవృష్టి కురిపించి, వారంరోజులు ఆలస్యంగా నైరుతీ రుతుపవనాలు నిష్క్రమించాయో లేదో అక్కడి వాయు కాలుష్యంపై యథాప్రకారం చర్చ మొదలైంది. వాయు నాణ్యత మెరుగుదలకు తీసుకున్న చర్యలేమిటని గురువారం సర్వోన్నత న్యాయస్థానం హరియాణా, పంజాబ్ ప్రభుత్వాలను నిలదీసింది. వాయు కాలుష్యం ఉగ్రరూపం దాలుస్తోందని, రైతులు పంట వ్యర్థాలు తగులబెట్టకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. గోధుమ పంట చేతికొచ్చాక వ్యర్థాలను తొలగించటం ఖర్చుతో కూడుకున్నదన్న కారణంతో రైతులు అక్కడే తగలబెడతారు. ఆ మంటలకు పంటభూమిలోని పోషకాలు, పంటలు ఏపుగా పెరగడానికి తోడ్పడే సూక్ష్మజీవులు నశిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ వ్యర్థాలను సేకరించి ఇతరేతర పదార్థాలతో మిశ్రమం చేసి సేంద్రియ ఎరువుగా మార్చవచ్చని సూచిస్తున్నారు. కానీ దీన్ని రైతులకు చేరేయ టంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రైతులకయ్యే వ్యయాన్ని భరిస్తే ఈ సమస్య చాలావరకూ తగ్గుతుందని గతంలో సుప్రీంకోర్టు ఢిల్లీ, పంజాబ్, హరియాణాలకు సలహా ఇచ్చింది. కానీ పట్టించుకున్నవారేరి? దానిసంగతలావుంచి సుప్రీం సూచనతో ఏర్పాటైన కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) సమావేశాలే సక్రమంగా జరగటం లేదు. ఆగస్టు నెలాఖరున జరిగిన కమిషన్ సమావేశానికి 11 మంది సభ్యుల్లో అయిదుగురే హాజరయ్యారంటే...అందులో పంట వ్యర్థాల విషయంపై చర్చించనేలేదంటే కమిషన్ తీరుతెన్నులెలా వున్నాయో అర్థం చేసుకోవచ్చు.ఢిల్లీలో సాధారణంగా అక్టోబర్ మధ్యనుంచి వాయు కాలుష్యం పెరగటం మొదలై నవంబర్ నాటికి ఉగ్రరూపం దాలుస్తుంది. పర్యవసానంగా నగర జీవితం అస్తవ్యస్తమవుతుంది. పాఠశాలల పనివేళలు మార్చటం, ప్రభాతవేళ ఆరుబయట వ్యాయామాలు చేయొద్దని పౌరులకు సూచించటం వంటివి మొదలవుతాయి. వాయు కాలుష్యానికి మూలం ఎక్కడుందో గుర్తించటానికే దీర్ఘకాలం పట్టగా, అనంతర చర్యలైనా చురుగ్గా ముందుకు కదలటం లేదు. కాలుష్యంలో 70 శాతం వాటా వాహనాలదేనని ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తేల్చి కూడా చాన్నాళ్లయింది. ఆ తర్వాతి స్థానం పరిశ్రమలదేనని కూడా ఆ నివేదిక చెప్పింది. కానీ ఆ దిశగా పెద్దగా అడుగులు పడలేదు. మన దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ శక్తిమంతమైనది. దాదాపు అయిదు లక్షల కోట్ల టర్నోవర్ గల ఆ పరిశ్రమ రెండున్నర కోట్లమందికి ఉపాధి కల్పిస్తోంది.అందువల్ల వాటి జోలికి పోయేందుకు ప్రభుత్వాలు సిద్ధపడవు సరికదా... వాహనాల అమ్మకాలు పెరగటానికి, ఆ పరిశ్రమల లాభార్జనకూ భిన్నరూపాల్లో తోడ్పాటునందిస్తాయి. మార్కెట్లోకొచ్చే వాహనాలు కాలుష్య కారకాలుగా ఉంటున్నాయని తేలినా నిర్లిప్తంగా ఉండిపోయిన సందర్భాలు గతంలో కోకొల్లలు. 2005 నుంచి అందుబాటులోకొచ్చిన బీఎస్ 3 (భారత్ స్టేజ్ 3) ప్రమాణాలున్న వాహనాలు అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఆరోపణలొచ్చినా చర్య తీసుకునేందుకు ఏ వ్యవస్థా సిద్ధపడలేదు. ఆ ప్రమాణాలతో విడుదలైన ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు కార్లు, భారీ కమర్షియల్ వాహనాలపై చర్యలు తీసుకోలేదు. చివరకు సుప్రీంకోర్టే బీఎస్ 3 ప్రమాణాలున్న వాహనాల విక్రయాన్ని 2017లో నిషేధించింది. వీటి సంగతలావుంచి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచటానికి అవసరమైన పథకాల రూపకల్పన సక్రమంగా ఉండదు. త్వరితగతిన పనులు పూర్తిచేసుకోవాలంటే సొంత వాహనాలే దిక్కన్న అభిప్రాయం పౌరుల్లో స్థిరపడిపోయింది. దీనికి తోడు ప్రజా రవాణా కోసం ఇప్పటికీ చాలా రాష్ట్రాలు డీజిల్ బస్సులే వాడుతున్నాయి. విద్యుత్, సీఎన్జీ వాహనాల వినియోగం మొదలైనా వాటి సంఖ్య స్వల్పం. ఢిల్లీ మెట్రో నిడివి ప్రస్తుతం దాదాపు 400 కిలోమీటర్ల మేర ఉంది. దాన్నింకా పెంచటానికి కృషిచేస్తున్నారు. ఈ సర్వీసును బస్సులతో అనుసంధానించి మారుమూల ప్రాంతాలకు కూడా సులభంగా వెళ్లగలిగే సదుపాయం కల్పిస్తే సొంత వాహనాల వినియోగం తగ్గుతుంది. ఇక ఏదైనా అనుకోనిది జరిగితే తప్ప పరిశ్రమలపై సాధారణంగా ప్రభుత్వాలు చర్యలకు సిద్ధపడవు. నిర్దిష్ట కాల వ్యవధిలో నిర్వహించే తనిఖీలు చాలా సందర్భాల్లో లాంఛనప్రాయమవుతాయి. జరిమానాల వంటివి విధించినా అవి నామ మాత్రంగానే ఉంటున్నాయి. ఉపాధి కల్పనకూ, సంపద వృద్ధి కావటానికీ పరిశ్రమలు అవసరమే. కానీ ప్రజారోగ్యంతో ఆటలాడుకునేవారినీ, చట్టాలను ఉల్లంఘించేవారినీ దండించాల్సిందే. వాయు కాలుష్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. రుతుపవనాలు నిష్క్రమించి శీతాకాలం ఇంకా ప్రవేశించని అక్టోబర్ నెల ఒకప్పుడు ఢిల్లీలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదని న్యాయమూర్తులు అన్న మాటల్లో వాస్తవం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ఉండే ఆ వాతావరణం ఇప్పుడు ఎందుకు మాయమైంది? కారకులెవరు? చిత్తశుద్ధితో ఆలోచించాలి. కాలుష్యంలో తమ బాధ్యత లేదని, పొరుగు రాష్ట్రమే ఈ సమస్యకు కారణమని పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌లు పరస్పరారోపణలు చేసుకోవటం రివాజుగా మారింది. అటు కేంద్రం సైతం మొత్తం భారాన్ని రాష్ట్రాలపై వేసి తప్పుకుంటోంది. ఏతావాతా సమస్య యథాత థంగా మిగిలిపోతున్నది. ఈ వైఖరి సరికాదు. ఇటీవల వెలువడిన లాన్సెట్ నివేదిక వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో ఏటా 12,000మంది మరణిస్తున్నారని తేల్చింది. అందుకే అందరూ మేల్కొ నాల్సిన సమయమిది. ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా కార్యాచరణకు దిగి తమవంతు బాధ్యత నెరవేర్చటంతోపాటు కాలుష్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి. -
Delhi Rains: నీట మునిగిన ఢిల్లీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని నీట మునిగింది. రికార్డు స్థాయి భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో వరుసగా శుక్రవారం రెండో రోజూ భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో ఎడతెగని వర్షం పడింది. దాంతో భరించలేని ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఢిల్లీ వాసులకు ఉపశమనం కలిగినా నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు ఎన్సీఆర్ రోడ్లను వరదలు ముంచెత్తాయి. వరద నీటి ధాటికి చాలాచోట్ల డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోవడంతో సమస్య మరింత విషమించింది. సమీప ప్రాంతాలన్నింటినీ వరద ముంచెత్తింది. ఢిల్లీ జల మంత్రి ఆతిశితో పాటు శశి థరూర్ తదితర ఎంపీల నివాసాలు కూడా నీట మునిగాయి. వారి ఇళ్లలోని ఫరి్నచర్ తదితరాలు వరద నీటిలో తేలియాడుతూ కని్పంచాయి. వర్షాలు, సంబంధిత ఉదంతాల్లో ఐదుగురు మరణించారు. నీటితో నిండిపోయిన అండర్‌పాస్‌ల్లో వాహనాలు తేలియాడాయి. పలుచోట్ల వాటిలో ప్రయాణికులు గంటలపాటు చిక్కుకున్నారు. గుర్గావ్లోని పలు నివాస ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ట్రాఫిక్ గందరగోళం ఏర్పడింది. తూర్పు ఢిల్లీలోని అక్షరధామ్ నుంచి గాజీపూర్ దాకా, అక్షరధామ్–సరాయ్ కాలే ఖాన్ రహదారిపైనా... ఇలా ఎక్కడ చూసినా ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయి జనాలకు చుక్కలు చూపింది. ఎక్కడ చూసినా మోకాలి లోతు, అంతకు మించి వరద కని్పంచింది. పలు చోట్ల మెట్రో స్టేషన్లు కూడా నీట మునిగాయి. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రంలో ఏకంగా 153.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. జూలై 3 దాకా వానలే ఢిల్లీ–ఎన్సీఆర్లో గురువారం నుంచి శుక్రవారం ఉదయం దాకా 24 గంటల్లో 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ గత 88 ఏళ్లలో అత్యధిక వర్షపాతంగా రికార్డుకెక్కింది. జూన్‌లో ఢిల్లీలో సగటున 80.6 మి.మీ వర్షం కురుస్తుంది. ఢిల్లీలో ఏడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగవచ్చని భారత వాతావరణ శాఖ పేర్కొంది. జూలై 3 దాకా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ‘‘ఈదురుగాలులతో భారీ వర్షాలు పడొచ్చు. జూలై 1, 2 తేదీల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుంది’’ అని పేర్కొంది. -
Lok Sabha Election 2024: దేశ రాజధానిలో... బీజేపీకి సవాలే
దేశ రాజధానివాసులు గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి జైకొట్టారు. ఈసారి మాత్రం కాంగ్రెస్–ఆప్ గట్టి పోటీ ఇస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో మూడు పారీ్టలూ విడిగా పోటీ చేయడం బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్ 3, ఆప్ 4 చోట్ల బీజేపీకి సవాలు విసురుతున్నాయి. దాంతో అధికార వ్యతిరేకతను అధిగమించేందుకు ఏకంగా ఆరుగురు సిట్టింగులను కాషాయ పార్టీ మార్చేసింది! ఆప్ సర్కారుపై అవినీతి ఆరోపణలనే ప్రచారాస్త్రంగా చేసుకుంది. అదంతా తమ పార్టీని అంతం చేసే కుట్రలో భాగమంటూ ఆప్ తిప్పికొడుతోంది. జైలు నుంచి తిరిగొచ్చిన అధినేత కేజ్రీవాల్ ప్రచార భారాన్ని భుజాలపై మోశారు. శనివారం జరిగే పోలింగ్‌లో ఓటర్లు ఎవరిని దీవిస్తారన్నది ఉత్కంఠగా మారింది... న్యూఢిల్లీకేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్థానంలో దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె, యువ న్యాయవాది, బాసురీ స్వరాజ్‌కు బీజేపీ టికెటిచ్చింది. 40 ఏళ్ల బాసురీ రాజకీయాలకు కొత్త కాదు. 2013, 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాలవీయనగర్ నుంచి విజయం సాధించారు. ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి కూడా లాయరే. ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేశారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల నివాసాలు ఈ వీఐపీ స్థానం పరిధిలోనే ఉన్నాయి. ట్రాఫిక్ జామ్, మురుగునీటి సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. చాందినీ చౌక్ విస్తీర్ణంలో దేశంలోనే అతి చిన్న లోక్‌సభ స్థానమిది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ బదులు వ్యాపారి ప్రవీణ్ ఖండేల్వాల్ (64)కు బీజేపీ టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్ అగర్వాల్ పోటీలో ఉన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే వర్తకుల కోసం తాము చేసిన పనులను గుర్తు చేస్తూ అగర్వాల్, ఖండేల్వాల్ ఓట్లడిగారు. ఆప్ మద్దతు అగర్వాల్‌కు అదనపు బలం.నార్త్ ఈస్ట్ ఢిల్లీ విస్తీర్ణంలో దేశంలోనే అతి చిన్న లోక్‌సభ స్థానమిది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ బదులు వ్యాపారి ప్రవీణ్ ఖండేల్వాల్ (64)కు బీజేపీ టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్ అగర్వాల్ పోటీలో ఉన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే వర్తకుల కోసం తాము చేసిన పనులను గుర్తు చేస్తూ అగర్వాల్, ఖండేల్వాల్ ఓట్లడిగారు. ఆప్ మద్దతు అగర్వాల్‌కు అదనపు బలం.నార్త్ ఈస్ట్ ఢిల్లీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కాంగ్రెస్ అభ్యరి్థగా సవాల్ విసురుతున్నారు. బిహార్, యూపీ, జార్ఖండ్ నుంచి వలస వచ్చిన ఓటర్లు ఇక్కడ ఏకంగా 30 శాతం పైగా ఉంటారు. అందుకే బిహార్‌కు చెందిన కన్హయ్యకు కాంగ్రెస్ చాన్సిచి్చంది. అయితే ఆయన పోటీ తమకే కలిసొస్తుందని బీజేపీ అంటోంది. ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకునిగా కన్హయ్య ఎదుర్కొన్న ఆరోపణలను ప్రచారంలో పదేపదే ప్రస్తావించింది.ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బదులు హర్షా మల్హోత్రాకు బీజేపీ టికెటిచ్చింది. ఆప్ నుంచి కులదీప్ కుమార్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తొలిసారి లోక్‌సభ బరిలో దిగారు. అయితే ఈస్ట్ ఢిల్లీ మేయర్‌గా చేసిన అనుభవం మల్హోత్రా సొంతం. ఈస్ట్ ఢిల్లీ బీజేపీ కంచుకోట అనే చెప్పాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన పీసీసీ మాజీ చీఫ్ రవిందర్ సింగ్ లవ్లీ ఇటీవలే బీజేపీలో చేరడం ఆ పారీ్టకి మరింత కలిసి రానుంది.నార్త్‌వెస్ట్ ఢిల్లీ ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ హన్స్‌రాజ్ హన్స్ బదులు కౌన్సిలర్ యోగేంద్ర చందోలియాకు బీజేపీ చాన్సిచి్చంది. ఆయన గతంలో నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై ఎంపీగా గెలిచిన ఉదిత్‌రాజ్ ఈసారి కాంగ్రెస్ అభ్యరి్థగా బరిలో దిగడం ఆసక్తికరం. ఆయన ఎంపీగా నియోజకవర్గానికి ముఖం కూడా చూపించలేదని ప్రచారంలో చందోలియా పదేపదే చెప్పారు.వెస్ట్ ఢిల్లీ ఆప్ నేత మహాబల్ మిశ్రా, బీజేపీ అభ్యర్థి కమలీత్ షెరావత్ మధ్య గట్టి పోటీ నెలకొంది. 70 ఏళ్ల మహాబల్ మిశ్రాది బిహార్‌లోని మధుబని. ఇక్కడ బిహారీ ఓటర్లు భారీగా ఉండటం ఆయనకు అనుకూలించే అంశం. షెరావత్ బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఎక్కువ మంది ఇంటి నుంచి ఓటేసిన లోక్‌సభ స్థానంగా ఈసారి వెస్ట్ ఢిల్లీ వార్తల్లోకెక్కింది. 85 ఏళ్లు పై బడిన 969 మంది, 179 మంది దివ్యాంగులు ఇంటి నుంచి ఓటేశారు.సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ, వివాదాస్పద నేత రమేశ్ బిదురి బదులు బదార్పూర్ ఎమ్మెల్యే రామ్‌వీర్ సింగ్ బిదురికి బీజేపీ టికెటిచి్చంది. ఆప్ నుంచి సాహిరాం పహిల్వాన్ బరిలో ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 10 అసెంబ్లీ సీట్లలో బీజేపీ చేతిలో ఉన్నది బదార్పూర్ ఒక్కటే! అభ్యర్థులిద్దరూ గుర్జర్ సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: దేశ రాజధానిలో... బీజేపీకి సవాలే
దేశ రాజధానివాసులు గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి జైకొట్టారు. ఈసారి మాత్రం కాంగ్రెస్–ఆప్ గట్టి పోటీ ఇస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో మూడు పారీ్టలూ విడిగా పోటీ చేయడం బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్ 3, ఆప్ 4 చోట్ల బీజేపీకి సవాలు విసురుతున్నాయి. దాంతో అధికార వ్యతిరేకతను అధిగమించేందుకు ఏకంగా ఆరుగురు సిట్టింగులను కాషాయ పార్టీ మార్చేసింది! ఆప్ సర్కారుపై అవినీతి ఆరోపణలనే ప్రచారాస్త్రంగా చేసుకుంది. అదంతా తమ పార్టీని అంతం చేసే కుట్రలో భాగమంటూ ఆప్ తిప్పికొడుతోంది. జైలు నుంచి తిరిగొచ్చిన అధినేత కేజ్రీవాల్ ప్రచార భారాన్ని భుజాలపై మోశారు. శనివారం జరిగే పోలింగ్‌లో ఓటర్లు ఎవరిని దీవిస్తారన్నది ఉత్కంఠగా మారింది... న్యూఢిల్లీకేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్థానంలో దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె, యువ న్యాయవాది, బాసురీ స్వరాజ్‌కు బీజేపీ టికెటిచ్చింది. 40 ఏళ్ల బాసురీ రాజకీయాలకు కొత్త కాదు. 2013, 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాలవీయనగర్ నుంచి విజయం సాధించారు. ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి కూడా లాయరే. ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేశారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల నివాసాలు ఈ వీఐపీ స్థానం పరిధిలోనే ఉన్నాయి. ట్రాఫిక్ జామ్, మురుగునీటి సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. చాందినీ చౌక్ విస్తీర్ణంలో దేశంలోనే అతి చిన్న లోక్‌సభ స్థానమిది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ బదులు వ్యాపారి ప్రవీణ్ ఖండేల్వాల్ (64)కు బీజేపీ టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్ అగర్వాల్ పోటీలో ఉన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే వర్తకుల కోసం తాము చేసిన పనులను గుర్తు చేస్తూ అగర్వాల్, ఖండేల్వాల్ ఓట్లడిగారు. ఆప్ మద్దతు అగర్వాల్‌కు అదనపు బలం.నార్త్ ఈస్ట్ ఢిల్లీ విస్తీర్ణంలో దేశంలోనే అతి చిన్న లోక్‌సభ స్థానమిది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ బదులు వ్యాపారి ప్రవీణ్ ఖండేల్వాల్ (64)కు బీజేపీ టికెటిచ్చింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్ అగర్వాల్ పోటీలో ఉన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే వర్తకుల కోసం తాము చేసిన పనులను గుర్తు చేస్తూ అగర్వాల్, ఖండేల్వాల్ ఓట్లడిగారు. ఆప్ మద్దతు అగర్వాల్‌కు అదనపు బలం.నార్త్ ఈస్ట్ ఢిల్లీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కాంగ్రెస్ అభ్యరి్థగా సవాల్ విసురుతున్నారు. బిహార్, యూపీ, జార్ఖండ్ నుంచి వలస వచ్చిన ఓటర్లు ఇక్కడ ఏకంగా 30 శాతం పైగా ఉంటారు. అందుకే బిహార్‌కు చెందిన కన్హయ్యకు కాంగ్రెస్ చాన్సిచి్చంది. అయితే ఆయన పోటీ తమకే కలిసొస్తుందని బీజేపీ అంటోంది. ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకునిగా కన్హయ్య ఎదుర్కొన్న ఆరోపణలను ప్రచారంలో పదేపదే ప్రస్తావించింది.ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బదులు హర్షా మల్హోత్రాకు బీజేపీ టికెటిచ్చింది. ఆప్ నుంచి కులదీప్ కుమార్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తొలిసారి లోక్‌సభ బరిలో దిగారు. అయితే ఈస్ట్ ఢిల్లీ మేయర్‌గా చేసిన అనుభవం మల్హోత్రా సొంతం. ఈస్ట్ ఢిల్లీ బీజేపీ కంచుకోట అనే చెప్పాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన పీసీసీ మాజీ చీఫ్ రవిందర్ సింగ్ లవ్లీ ఇటీవలే బీజేపీలో చేరడం ఆ పారీ్టకి మరింత కలిసి రానుంది.నార్త్‌వెస్ట్ ఢిల్లీ ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ హన్స్‌రాజ్ హన్స్ బదులు కౌన్సిలర్ యోగేంద్ర చందోలియాకు బీజేపీ చాన్సిచి్చంది. ఆయన గతంలో నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై ఎంపీగా గెలిచిన ఉదిత్‌రాజ్ ఈసారి కాంగ్రెస్ అభ్యరి్థగా బరిలో దిగడం ఆసక్తికరం. ఆయన ఎంపీగా నియోజకవర్గానికి ముఖం కూడా చూపించలేదని ప్రచారంలో చందోలియా పదేపదే చెప్పారు.వెస్ట్ ఢిల్లీ ఆప్ నేత మహాబల్ మిశ్రా, బీజేపీ అభ్యర్థి కమలీత్ షెరావత్ మధ్య గట్టి పోటీ నెలకొంది. 70 ఏళ్ల మహాబల్ మిశ్రాది బిహార్‌లోని మధుబని. ఇక్కడ బిహారీ ఓటర్లు భారీగా ఉండటం ఆయనకు అనుకూలించే అంశం. షెరావత్ బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఎక్కువ మంది ఇంటి నుంచి ఓటేసిన లోక్‌సభ స్థానంగా ఈసారి వెస్ట్ ఢిల్లీ వార్తల్లోకెక్కింది. 85 ఏళ్లు పై బడిన 969 మంది, 179 మంది దివ్యాంగులు ఇంటి నుంచి ఓటేశారు.సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ, వివాదాస్పద నేత రమేశ్ బిదురి బదులు బదార్పూర్ ఎమ్మెల్యే రామ్‌వీర్ సింగ్ బిదురికి బీజేపీ టికెటిచి్చంది. ఆప్ నుంచి సాహిరాం పహిల్వాన్ బరిలో ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 10 అసెంబ్లీ సీట్లలో బీజేపీ చేతిలో ఉన్నది బదార్పూర్ ఒక్కటే! అభ్యర్థులిద్దరూ గుర్జర్ సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ బిల్లు నెగ్గింది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ సీనియర్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నియంత్రణ కోసం ఉద్దేశించిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’ సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ అనంతరం సభాపతి ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 131 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 102 మంది ఎంపీలు ఓటువేశారు. ఢిల్లీ బిల్లు గత వారమే లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎగువ సభ సైతం ఆమోద ముద్ర వేయడంతో ఇక రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 238. అధికార ఎన్డీయేతోపాటు ఈ బిల్లు విషయంలో ఆ కూటమికి అనుకూలంగా ఉన్న సభ్యుల సంఖ్య 131. వారంతా బిల్లుకు మద్దతు పలికారు. ఇక విపక్ష ‘ఇండియా’ కూటమితోపాటు ఇతర విపక్ష సభ్యుల సంఖ్య 104 ఉండగా, బిల్లుకు వ్యతిరకంగా 102 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో ముగ్గురు సభ్యులు ఎటూ తేల్చుకోలేదు. ఓటింగ్‌లో పాల్గొనలేదు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తారా?: విపక్షాలు ఢిల్లీ బిల్లును రాజ్యసభలో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై తొలుత సభలో చర్చను కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ ప్రారంభించారు. బిల్లు రాజ్యాంగవిరుద్ధమని, ప్రజాస్వామ్య వ్యతిరేకమని చెప్పారు. మనమంతా కచి్చతంగా వ్యతిరేకించాలని విపక్షాలకు పిలుపునిచ్చారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్న ఈ చర్య ఏదో ఒక రోజు మీ దాకా వస్తుంది అంటూ హెచ్చరించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగం ధర్మాసనం ఇచి్చన రెండు తీర్పులకు వ్యతిరేకంగా బిల్లును తీసుకొచ్చారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ.. ఢిల్లీ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. అలాగే బిల్లుపై చర్చలో ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎండీకే, సమాజ్‌వాదీ పార్టీ, భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), ఆర్జేడీ, సీపీఎం, జేడీ(యూ), కేరళ కాంగ్రెస్(ఎం), సీపీఐ తదితర పారీ్టల సభ్యులు మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను బలవంతంగా లాక్కోవడానికే బిల్లును తీసుకొచ్చారని దుయ్యబట్టారు. అధికారాలు లాక్కోవడానికి కాదు: అమిత్ షా బిల్లును తీసుకొచ్చింది కేవలం ఢిల్లీ ప్రజల హక్కులను కాపాడడం కోసమేనని, అంతేతప్ప ఆప్ ప్రభుత్వ అధికారాలను లాక్కోవడానికి కాదని అమిత్ షా తేలి్చచెప్పారు. ఢిల్లీ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చారు. ఇది పూర్తిగా చట్టబద్ధమేనని, సుప్రీంకోర్టు తీర్పును ఏ కోణంలోనూ ఉల్లంఘించడం లేదని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల కంటే ఢిల్లీ చాలా భిన్నమని తెలియజేశారు. పార్లమెంట్, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, సుప్రీంకోర్టు ఇక్కడే ఉన్నాయని, వివిధ దేశాల అధినేతలు ఢిల్లీని తరచుగా సందర్శిస్తుంటారని, అందుకే ఈ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసినట్లు పేర్కొన్నారు. పరిమిత అధికారాలున్న అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ అని అన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి దినం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో ఆప్‌నకు తోడుగా నిలిచిన రాజకీయ పార్టీలకు నా కృతజ్ఞతలు. ఢిల్లీలో నాలుగు పర్యాయాలు ఆప్ చేతిలో ఘోరంగా ఓటమిపాలైన బీజేపీ, దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకే ఈ బిల్లును తీసుకువచ్చింది. ఆప్ చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో బీజేపీ పోటీ పడలేకపోతోంది. నన్ను ముందుకు వెళ్లకుండా చేయడమే వారి ఏకైక లక్ష్యం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్క సీటును కూడా ప్రజలు బీజేపీకి దక్కనివ్వరు. ఢిల్లీ వ్యవహారాల్లో ప్రధాని మోదీ జోక్యం ఎందుకు చేసుకుంటున్నారు? ’అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒక వీడియో విడుదల చేశారు. -
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ
న్యూఢిల్లీ: తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. సోమవారం సభ్యులంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని సూచించింది. వాయిదాపడేదాకా సభలోనే ఉండాలని పేర్కొంది. కీలకమైన ఢిల్లీ బిల్లుపై సోమవారం రాజ్యసభలో చర్చ, ఓటింగ్ జరిగే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ తన సభ్యులకు విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. -
విపక్షాల లొల్లి నడుమే... ‘ఢిల్లీ’ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’పై గురువారం లోక్‌సభలో ఆమోద ముద్రపడింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్యే మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనగా విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు ఈ బిల్లుపై లోక్‌సభలో దాదాపు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు?: కాంగ్రెస్ సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ బిల్లును ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ప్రభుత్వ పాలనా సరీ్వసులపై ఢిల్లీ ప్రభుత్వానికే అధికారాలు ఉన్నాయంటూ న్యాయస్థానం చెప్పిందని గుర్తుచేశారు. ఒకవేళ ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే, రాష్ట్రాల్లో ప్రజల చేత ఎన్నికైన శాసనసభలపై కేంద్ర ప్రభుత్వానిదే పైచేయి అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రం అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అధికారులే నడిపిస్తే ఇక ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం ఎందుకని నిలదీశారు. ‘చెక్స్ అండ్ బ్యాలెన్సెస్’ వ్యవస్థను విచి్ఛన్నం చేయొద్దని కోరారు. డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ మాట్లాడుతూ.. ‘ఇండియా’ కూటమి బలంగా ఉందని, మీ గురించి ఆలోచించుకోండి అని బీజేపీకి హితవు పలికారు. 2024లో తమ కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. ప్రజలను బానిసలుగా మారుస్తారా?: కేజ్రివాల్ ఢిల్లీ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ గురువారం ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రజలను బానిసలుగా మార్చడానికే ఈ బిల్లు తీసుకొచ్చారని ఆక్షేపించారు. ప్రజల హక్కులను లాక్కొనే బిల్లు ఎందుకని నిలదీశారు. బిల్లుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వద్ద సరైన వాదన ఒక్కటి కూడా లేదన్నారు. బిల్లు విషయంలో తప్పు చేస్తున్నట్లు కేంద్రానికి కూడా తెలుసని పేర్కొన్నాను. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే..: అమిత్ షా ఢిల్లీకి సంబంధించిన చట్టాలు చేసే అధికారం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 239ఏఏ కింద పార్లమెంట్‌కు ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఢిల్లీ బిల్లుపై లోక్‌సభలో తొలుత ఆయన చర్చను ప్రారంభించారు. కేవలం అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఢిల్లీలోని అధికార ఆప్ ఈ బిల్లును వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. ఢ్రిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కలి్పంచాలన్న సూచనను జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సర్దార్ వల్లభ్‌బాయి పటేల్, సి.రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్ సైతం తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఢిల్లీ బిల్లు విషయంలో అసలు సమస్య అధికారుల బదిలీలు, పోస్టింగులపై నియంత్రణ గురించి కాదని, ఇప్పటిదాకా జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బిల్లును వ్యతిరేకిస్తున్నారని కేజ్రివాల్ పారీ్టపై అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బిల్లులు, చట్టాలు కేవలం ప్రజల సంక్షేమం కోసమేనని తేలి్చచెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, అందుకే మీరు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారని కాంగ్రెస్ సహా ఇతర పారీ్టలను ఉద్దేశించి అన్నారు. బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాక ‘ఇండియా’ కూటమిలో ‘ఆప్’ భాగస్వామిగా ఉండబోదన్నారు. -
జూన్ 11న ఆప్ మహా ర్యాలీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పరిపాలనా సర్వీసులపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ జూన్ 11న మహార్యాలీ నిర్వహించనున్నట్లు ఆప్ సోమవారం ప్రకటించింది. అందులో ఢిల్లీ ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఢిల్లీలో అధికారుల బదిలీలు, వారిపై ఆరోపణలు వస్తే చర్యల కోసం కొత్తగా ‘నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ’ని ఏర్పాటు చేస్తూ కేంద్రం ఈ నెల 19న ఆర్డినెన్స్ తేవడం తెలిసిందే. దీనిపై ఆప్ పోరాటానికి కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించింది. విపక్షాలకు ఇదొక అగ్ని పరీక్ష: సంజయ్ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను బీజేపీయేతర పార్టీలన్నీ వ్యతిరేకించాలని ఆప్ రాజ్యసభ సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయని విమర్శించారు. కేంద్ర ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ రాజ్యసభలో తాము ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు ఇవ్వాలని విపక్షాలను సంజయ్ సింగ్ కోరారు. ప్రతిపక్షాలకు ఇదొక అగ్ని పరీక్ష అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని విన్నవించారు. -
రాజధాని నిండా రాకాసి గాలి
రాజకీయాలు కలుషితమయ్యాయనే ఆవేదన వింటుంటాం. కానీ, కాలుష్యం మీదా రాజకీయాలు సాగుతున్న పరిస్థితి దేశ రాజధానిలో చూస్తున్నాం. ఢిల్లీలోని వాయు కాలుష్యం ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితికి వచ్చింది. రాగల మూడు రోజులు దారుణంగా ఉంటాయని వార్త. అదే సమ యంలో ఈ అంశంపై కేంద్రంలోని బీజేపీ, ఢిల్లీని ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ల మధ్య రాజకీయ మాటల యుద్ధం ఏవగింపు కలిగిస్తోంది. పాలన గాలికొదిలేసి, పీల్చేగాలి కూడా సవ్యంగా లేకుండా చేస్తున్న ప్రబుద్ధులు ఆరోపణల పర్వంలో మాత్రం పైచేయి కోసం ప్రయత్నించడం విచారకరం. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో కాలుష్యానికి వాహనాలు, పంట వ్యర్థాల దహనం, దీపావళి టపాసులు, పరిశ్రమలు, గాలి వేగం లాంటి భౌగోళిక పరిస్థితులు – ఇలా ఎన్నో కారణాలు. ప్రతి ఏటా శీతకాలం మొదలయ్యేసరికి హాయిగా శ్వాస పీల్చుకోలేని పరిస్థితి ఏళ్ళ తరబడిగా వేధిస్తున్నా తగు చర్యలు తీసుకోకపోవడం స్థానిక, కేంద్ర ప్రభుత్వాల సమష్టి వైఫల్యం. ఇవాళ ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో ఢిల్లీ ఒకటి. కళ్ళెదుట ఉన్నది కనిపించనివ్వని దట్టమైన పొగమంచు, దుమ్మూధూళి, పొగ, మసి. ప్రతి శీతకాలంలో లానే ఈసారీ నగరం ఓ విషవాయు గృహంగా మారింది. ఉత్తరాదిలో రోజూ వేలల్లో సాగుతున్న పంట వ్యర్థాల దహనం, ఇతర కాలుష్యాలు మహానగర వాయునాణ్యతను గురువారం సైతం ‘అత్యంత ప్రమాదకర స్థాయి’లో నిలిపాయి. ఒంట్లోని రక్తంలోకీ ప్రవేశించేటంత సూక్ష్మమైన, ప్రమాదభరిత ధూళికణాలు పిఎం2.5 సగటున ప్రతి ఘనపు మీటర్లో 588 ఉన్నాయని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన దానికన్నా ఇది 40 రెట్లు ఎక్కువ. ఢిల్లీలోనే కాదు, దేశంలో అనేక నగరాల్లో పీల్చేగాలి విషతుల్యమైందన్న కాలుష్య నివారణ మండలి మాట దిగ్భ్రాంతికరం. పొరుగున పంజాబ్‌లోని పొలాల్లో వరి పంట వగైరా కోయగా మిగిలిన దుబ్బులను తగలబెట్టడంతో ఢిల్లీ విషవాయు నగరిగా మారుతోందంటూ, ఢిల్లీ, పంజాబ్‌లను రెంటినీ పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని కేంద్ర పర్యావరణ మంత్రి దుమ్మెత్తిపోశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు కాలుష్య నియంత్రణకు స్మోక్ టవర్ల ఏర్పాటు, చెట్ల పెంపకం, నీటి జల్లులు సహా చేయగలిగినదంతా చేస్తున్నామంటున్నారు. రాజకీయాలు అటుంచితే, ఢిల్లీలో ఏటా ఈ సమస్య తలెత్తుతుండడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఎవరు కాదన్నా మహానగరిలోని ఈ కాలుష్యానికి వరి మోళ్ళ దహనం దోహదం చేస్తోంది. పంజాబ్‌లో అధికారంలోకి రాక ముందు అంతా అక్కడి రైతుల పాపమే అన్న ఆప్ ఇప్పుడక్కడ అధికారంలో ఉండీ, నివారించలేకపోతోంది. పంజాబ్ తదితర రాష్ట్రాల్లోని రైతులు ఇతర మార్గాలను అనుసరించేలా చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. గత నెల రోజుల్లో ఈ దుబ్బులు కాల్చడం ఎక్కువైంది. దీనికి కారణాలు చాలానే. నీటి అవసరం ఎక్కువైన వరిసాగు వల్ల భూగర్భ జలాలు క్షీణిస్తా యంటూ పంజాబ్ లాంటి చోట్ల మేలో పంట వేయడంపై నిషేధం పెట్టారు. వర్షాలొచ్చాక జూన్ మధ్యలో ఆలస్యంగా నాట్లు వేయడంతో, అక్టోబర్ ఆఖరులో కానీ పంట చేతికి రాదు. ఆ వెంటనే రబీ సీజన్‌కు వారమే వ్యవధి. దాంతో, త్వరితగతిన పొలాల్ని సిద్ధం చేసేందుకు మోళ్ళను కాల్చడమే రైతుకు మార్గమవుతోంది. అప్పుడే ఉత్తరాదిలో చలికాలం. ఉష్ణోగ్రతలు పడిపోతాయి. వాయువేగం తగ్గుతుంది. వెరసి, కాలుష్యం పెరుగుతోంది. అదే గనక మేలోనే పంట వేయనిస్తే, సెప్టెంబర్‌కే చేతికొస్తుంది. అప్పటికి ఉష్ణోగ్రతలు, గాలి ఎక్కువగానే ఉంటాయి కాబట్టి సమస్య తీవ్రంగా ఉండక పోవచ్చు. అలాగే, పంజాబ్‌లో అధిక శాతం రైతులు నిరుపేదలు కావడంతో కాల్చడానికి బదులు కొయ్యకాళ్ళను తొలగించే యంత్రాలను వాడే స్థోమత లేదు. పైపెచ్చు, ఇతర ప్రత్యామ్నాయాలన్నీ శ్రమతో కూడినవి. అందుకే వ్యర్థాలను కాల్చడాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇది గ్రహించి, ఈ పద్ధతిని మార్చడంపై అత్యవసరంగా పాలకులు, వ్యవసాయ నిపుణులు దృష్టి పెట్టాలి. ఒక్క శీతకాలంలోనే కాదు... ఏడాది పొడుగూతా ఎన్సీఆర్లో సగటున పిఎం2.5 గరిష్ఠ పరిమితి కన్నా 20 రెట్లు ఎక్కువ ఉంటోంది. ఇది ఆందోళనకరం. ఇటీవల ఢిల్లీలో వాయు నాణ్యత సూచి (ఏక్యూఐ) 400 మార్కును దాటేయడంతో ఆరోగ్యవంతులకూ ప్రమాద ఘంటిక. 2021 నుంచి ఎన్సీఆర్లో కొన్ని చర్యలు చేపట్టకపోలేదు. వాయునాణ్యత నిర్వహణకు కమిషన్ పెట్టారు. రోజూ ఏక్యూఐ నమోదు, ఎప్పటికప్పుడు వచ్చే కాలుష్యప్రమాదంపై గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్‌ప్లాన్ (గ్రాప్) లాంటివి చేపట్టారు. వీటిని కట్టుదిట్టంగా అమలు చేస్తూ, సంస్థలు సమన్వయంతో సాగితేనే ఫలితం. అలాగే, గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిని పెంచుతున్న వాహన కాలుష్యానికి పరిష్కారం – వీలైనంతగా ప్రజారవాణా వ్యవస్థను ఆశ్రయించడమే. ప్రభుత్వాలు స్థానికంగా బస్ సర్వీసులు పెంచాలి. మెట్రో స్టేషన్లు సహా ఇతర రవాణా వసతులకు బస్ సర్వీసులను అనుసంధానించాలి. నడక– సైకిల్ వినియోగానికి ప్రాథమిక వసతులను పెంచాలి. పౌరులు సైతం ఢిల్లీ సర్కార్ అభ్యర్థిం చినట్టు పదుగురు కలసి ఒకే కారులో (కార్ పూలింగ్)లో పనికి వెళ్ళడం, వాహన రద్దీని నివారించేలా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఆశ్రయించడం, అనధికారిక నిర్మాణాలు – వ్యర్థాల దహనాన్ని నిరోధించడం లాంటివి అనుసరించాలి. స్థానిక సర్కార్లపైనే నెట్టేయడం కాక కేంద్ర ప్రభుత్వమూ తన బాధ్యత నిర్వర్తించాలి. సమష్టిగా చర్యలు చేపడితేనే ఫలితం. ఆ దిశగా ప్రతి అడుగూ అమూల్యమైనదే! -
కేంద్రం–ఢిల్లీ రగడపై సుప్రీం ధర్మాసనం
న్యూఢిల్లీ: దేశ రాజధానికి సంబంధించిన పలు శాఖలపై శాసన, పాలనాపరమైన పెత్తనం విషయమై కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ఇందుకోసం జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సోమవారం లేవనెత్తారు. ఈ అంశంపై 2019 ఫిబ్రవరి 14న ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పు వెలువరించారు. విచారణకు స్వీకరిస్తాం మనీ లాండరింగ్ చట్టంపై తీర్పును పునఃపరిశీలించాలంటూ దాఖలైన పిల్ విచారణ స్వీకరణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దాన్ని విచారణ కేసుల జాబితాలో చేరుస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం తెలిపింది. -
హైదరాబాద్ టూ వరంగల్.. రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్..
నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉన్న రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలి దశలో హైదరాబాద్ - వరంగల్, మలి దశలో హైదరాబాద్ - విజయవాడల మధ్య ఈ ట్రాన్సిట్ కనెక్టివిటీ అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీ- ఘజియాబాద్ - మీరట్ మార్గంలో రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (ఆర్ఆర్టీఎస్) నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఆర్ఆర్టీఎస్ విధానం రెగ్యులర్ రైల్వే నెట్వర్క్, సబర్బన్ మెట్రో రైల్లకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రెండు నగరాల మధ్య వేగంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రత్యేక ట్రాక్‌లను, నియంత్రణ వ్యవస్థలను నిర్మిస్తారు. ఈ మార్గంలో రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది ప్రస్తుతం నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఢిల్లీ నుంచి హర్యాణా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లలో పలు నగరాలను కలుపుతూ మూడు కారిడార్లలో ఆర్ఆర్టీఎస్ పనులు సాగుతున్నాయి. ఈ మేరకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్సిట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు ఈ ప్రాజెక్టుకి నిధులు సమకూరుస్తున్నాయి. ఇదే పద్దతిలో తెలంగాణలోనూ ఆర్‌ఆర్‌టీఎస్‌ను చేపట్టాలని ఇక్కడి సర్కార్ నిర్ణయించింది. ఆర్ఆర్టీఎస్ నెట్‌వర్క్‌పై చర్చించేందుకు తెలంగాణకు చెందిన వివిధ విభాగాల అధికారులు ఆర్‌ఆర్‌టీఎస్‌కి సంబంధించి అంచనా వ్యయం, వనరుల లభ్యత తదితర అంశాలపై పూర్తి వివరాలను అధ్యయనం చేయనున్నారు. ఈ మేరకు త్వరలో అధికారుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం. వీరు సమర్పించే నివేదిక ఆధారంగా ఈ ప్రాజెక్టు చేపట్టాలా వద్దా అనేది తేలనుంది దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్స్ పార్క్‌ని వరంగల్‌లో ప్రారంభించారు. వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడ తమ యూనిట్లను నిర్మిస్తున్నాయి. అయితే వరంగల్‌లో ఎయిర్పోర్ట్ లేకపోవడం లోటుగా మారింది. ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు తెలంగాణ సర్కార్ ఓ వైపు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరోవైపు ఆర్ఆర్టీఎస్ వంటి నెట్వర్క్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ - వరంగల్ల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. పారిశ్రామికంగా వరంగల్‌కు ఇది ఎంతో ఉపయోగకరం. -
గ్రీన్ రెవల్యూషన్తోనే కాలుష్యం!?
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట దుబ్బులను తగుల బెట్టడం వల్ల ఢిల్లీ నగరాన్ని కాలుష్య భూతం కమ్ముకుంది. ఈసారి గాలులు మందగమనాన్ని మించకపోవడం, టెంపరేచర్ తక్కువగా ఉండడం వల్ల కాలుష్య కణాలు దిగువ వాతావరణంలోనే స్థిరపడిపోయి ఇటు ఢిల్లీ వాసులనే కాకుండా అటు ఉత్తరాది ప్రాంతంవైపు కూడా ప్రయాణిస్తూ అక్కడి ప్రజలనూ భయకంపితుల్ని చేస్తున్నాయి. అసలు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు ఎందుకు పంట దుబ్బులను తగులబెడుతున్నారు. అందుకు కారణాలేమిటీ? ఒకప్పుడులేని ఈ పద్ధతి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? గ్రీన్ రెవల్యూషన్ నుంచే వచ్చిందా? అసలు గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? దాని వల్ల ప్రజలకు కలిగిన లాభాలేమిటీ, నష్టాలేమిటీ? పంట దుబ్బులను తగులబెట్టకుండా ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? ఉంటే అవేమిటీ? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలన్నింటికీ సరైన, స్పష్టమైన సమాధానాలు ఉన్నాయి. 1960 ప్రాంతంలో భారత్‌కు తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. అమెరికా సరఫరా చేసే ఆహార పదార్థాలపై ఎక్కువ ఆధారపడాల్సి వచ్చింది. దేశంలో ఆహారోత్పత్తిని బాగా పెంచాలని అప్పటి భారత ప్రభుత్వం భావించింది. అందుకు వ్యవసాయ సంస్కరణలు అవసరమని రెండు కమిటీలు అభిప్రాయపడ్డాయి. ఒక కమిటీ వ్యవసాయ రంగంలో తీసుకరావాల్సిన సాంకేతిక మార్పులను సూచించగా, సామాజిక మార్పులు అవసరమని మరో కమిటీ అభిప్రాయపడింది. ఎరువులు, క్రిమిసంహారక మందులతో పాటు హైబ్రీడ్ విత్తనాలను ప్రవేశపెట్టాలని సాంకేతిక కమిటీ సూచించింది. ఎక్కువ దిగుబడి నిచ్చే వంగడాలను ప్రవేశపెట్టాలని 1961లో అప్పటికి భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ సూచించారు. ఖరీదైన విత్తనాలను, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని, వీటి విషయంలో రైతులను ప్రోత్సహించాలంటే సబ్సిడీపై విత్తనాలు ఇవ్వడమే కాకుండా రైతుల పెట్టుబడులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాలని సూచించారు. చర్చోపచర్చల అనంతరం దీన్ని అమలు చేయాలని 1964లో అప్పటి వ్యవసాయ మంత్రి సీ. సుబ్రమణియం నిర్ణయించారు. ఈ విధానం వల్ల పెద్ద రైతులు బాగు పడతారని, వినియోగదారులు నష్టపోతారని ప్రతిపక్షాలు గొడవ చేశాయి. దాంతో ప్రతిపాదన అటకెక్కింది. ఆహార సహాయంపై అమెరికా ఆంక్షలు భారత ప్రజలకు తేరగా ఆహారాన్ని సాయం చేయడానికి తాము సిద్ధంగా లేమని 1965లో అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బీ జాన్సన్ ప్రకటించి ఆంక్షలు విధించారు. 1966 నుంచి తాము నిల్వ ఉండే ఆహార పదార్థాలకు బదులుగా రెడీమేడ్ ఆహార పదార్థాలను పంపిస్తామంటూ ‘షిప్ టూ మౌత్’ పాలసీని ప్రకటించారు. అదే సంవత్సరం అధికారంలోకి వచ్చిన ప్రధాని ఇందిరాగాంధీ ప్రతిపక్షాల అభ్యంతరాలను లెక్క చేయకుండా గ్రీన్ రెవెల్యూషన్‌ను అమలు చేశారు. ఏడాది కాలంలోనే గోధుమ పంట 40 శాతం పెరిగింది. అంటే 120 లక్షల టన్నుల నుంచి 170 లక్షల టన్నులకు పెరిగింది. ఆ తర్వాత వరి ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. గ్రీన్ రెవల్యూషన్ కాలాన్ని 1965 నుంచి 1980 వరకని పేర్కొనవచ్చు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనే అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను వాడేందుకు పలు రాష్ట్రాల్లోని రైతులు నిరాకరించారు. సంప్రదాయ వంగడాలకే వారు మొగ్గు చూపారు. అప్పటి వరకు గోధుమ పంటలకే అలవాటు పడిన పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఈ వరి వంగడాలను వాడేందుకు ముందుకు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతం రైతులు కూడా సరేనన్నారు. జాతీయంగా వరి ఉత్పత్తిలో 1960లో పంజాబ్ వాటా 0.7 శాతం ఉండగా, 1979 వరకల్లా దాని వాటా ఏడు శాతానికి చేరుకుంది. ఓ పంట వరి, మరో పంట గోధుమ (ఆర్డబ్లూసీఎస్) వేసే విధానాన్ని అమలు చేయడంతో అమోఘ ఫలితాలు వచ్చాయి. హర్యానా కూడా పంజాబ్‌తో పోటీ పడుతూ వచ్చింది. జూన్ నుంచి అక్టోబర్ వరకు వరి సంప్రదాయ వరి వంగడాలకు భిన్నంగా అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను జూన్‌లో వేస్తే అక్టోబర్‌లో పంట చేతికి వస్తోంది. మళ్లీ అక్టోబర్ లేదా నవంబర్ మొదటి వారంలోనే గోధుమలను వేయాల్సి ఉంటుంది. ఇరు పంటల మధ్య వ్యవధి ఉండేది 15 రోజులే. ఈ రోజుల్లో వరి పంట నూర్పుడు అయిపోవాలి. వరి దుబ్బును తొలగించాలి. రెండో పంట గోధుమకు పొలాన్ని సిద్ధం చేయాలి. దుబ్బును తగులబెట్టడానికి సవాలక్ష కారణాలు వరి దుబ్బును తొలగించడానికి కూలీలు దొరకరు. దొరికినా చాలా ఖర్చు. ఎకరాకు ఆరేడు వేల రూపాయలు అవుతుంది. మన మసూరు బియ్యం లాగా పంజాబ్, హర్యానాలో పండించే విదేశీ వంగడం ఉండదు. ఏపుగా పెరుగుతుంది. భూమిలో బలంగా పాతుకు పోతుంది. లాగితే ఓ మానాన రాదు. వాటి పొలుసు చాకులా ఉండడం వల్ల లాగేటప్పుడు గీసుకుపోయి రక్తం కారుతుంది. మిగతా వరిదుబ్బును ఇష్ట పడినట్లు ఈ రకం దుబ్బును పశువులు అంతగా ఇష్టపడవు. పశు గ్రాస మార్కెట్లో దీన్ని ఎవరూ కొనరు. రైతుకు రవాణా ఖర్చులు కూడా రావు. ఈ దుబ్బును ఇంటి పశువులకు వేయాలంటే కొన్ని తరాలుగా ఇక్కడి రైతులు పశువులకు బదులుగా యంత్రాలనే వాడుతున్నారు. ఇప్పుడు దుబ్బును కోసే ధ్వంసంచేసే యంత్రాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అవి ఖరీదైనవి. అద్దెకు ఇంకా అందుబాటులోకి రాలేదు. భారీ ఎత్తున వ్యవసాయం చేసే రైతులు, ఉమ్మడిగా వ్యవసాయం చేసే రైతులు ఈ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. స్వతంత్ర రైతులు ఉపయోగించడం లేదు. అలాంటి వారు ఒక్క పంజాబ్ రాష్ట్ర రైతుల్లో 25 శాతం మంది ఉన్నారు. వారు పొలంలో కిరోసిన్ పోసి తగుల బెడితే తెల్లారే సరికి మొత్తం వరి దుబ్బు మాయం అవుతుంది. వారే కాలుష్యానికి కారణం అవుతున్నారు. 1980 తర్వాతే ఈ పద్ధతి అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. (గమనిక: సిద్ధార్థ్ సింగ్ రాసిన ‘ది గ్రేట్ స్మాగ్ ఆఫ్ ఇండియా’లోని అంశాల ఆధారంగా ఈ వార్తా కథనం) -
గరిష్టస్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు
-
రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు ధరలను సవరించడంతో ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత గరిష్టస్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ 80.76 దాటడం గమనార్హం. డీజిల్ లీటర్‌కు రూ 73.45కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ రూ 76.24కు చేరగా, డీజిల్ ధర రూ 67.57కు ఎగబాకింది. జూన్ 2017లో పెట్రో ధరల రోజువారీ సవరణ అమలులోకి వచ్చిన అనంతరం దేశ రాజధానిలో తొలిసారిగా పెట్రోల్ లీటర్‌కు అత్యధికంగా 33 పైసలు పెరగ్గా, డీజిల్ 26 పైసల మేర పెరగినట్టు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. పెట్రో ధరలు స్థానిక పన్నులకు అనుగుణంగా ఉండే క్రమంలో పలు మెట్రో నగరాలు, రాష్ట్ర రాజధానులతో పోలిస్తే ఢిల్లీలో అందుబాటులో ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు పెట్రో ధరలను యథాతథంగా ఉంచిన ఆయిల్ కంపెనీలు మే 14 నుంచి తిరిగి ధరల సవరణను చేపట్టినప్పటి నుంచి పెట్రో ధరలు వరుసగా ఏడవ రోజూ పెరిగాయి. గత వారం రోజులుగా పెట్రోల్ ధర లీటర్‌కు రూ 1.61, డీజిల్ ధర లీటర్‌కు రూ 1.64 మేర పెరిగాయి. -
ఇక ఉచిత వైఫై సేవలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని పౌరులకు త్వరలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రకటించిన ఉచిత వైఫై సేవల హామీ యువతను ఆకర్షించింది. ఢిల్లీలో ఆప్ పాలనాపగ్గాలు చేపట్టి బుధవారం నాటికి మూడేళ్లు పూర్తయ్యాయి. త్వరలోనే తాము ఉచిత వైఫై సేవలు ప్రారంభమయ్యే తేదీని వెల్లడిస్తామని..దీనికోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తా’మని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఉచిత వైఫై అమలుపై ఆప్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని విపక్షాలు తరచూ విమర్శల దాడికి దిగుతున్న క్రమంలో కేజ్రీవాల్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఆప్ ప్రభుత్వం 2016, డిసెంబర్ నాటికి తూర్పు ఢిల్లీలోని 500 ప్రదేశాల్లో వైఫై హాట్‌స్పాట్స్ అందుబాటులోకి వస్తాయని ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు. మరోవైపు మహిళల భద్రత కోసం ఢిల్లీ అంతటా సీసీటీవీ కెమెరాలను అమర్చే ప్రక్రియ ప్రారంభమైందని కేజ్రీవాల్ వెల్లడించారు. -
రాజధాని వానరాలకు ఐడీలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వానరాలకు ఇక విశిష్ట గుర్తింపు కార్డులు రానున్నాయి. కోతుల జనాభా విచ్చలవిడిగా పెరగడాన్ని నియంత్రించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఢిల్లీ హైకోర్టు అధికారులను ఆదేశించింది. కోతుల స్టెరిలైజేషన్ ఎలా చేపట్టాలనే దానిపై కసరత్తు చేయాలని ఎన్జీవో వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్, మున్సిపల్ కార్పొరేషన్, అటవీ శాఖలను కోరింది. కోతుల సంఖ్యను నిరోధించేందుకు వాక్సినేషన్, స్టెరిలైజేషన్‌లో భాగంగా వాటికి శాశ్వత, విశిష్ట గుర్తింపు సంఖ్యలను (ఐడీ) ఇవ్వాలని ఎన్జీవో వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ సూచించింది. ఈ సంస్థ గతంలో ఆగ్రా డెవలప్మెంట్ అథారిటీతో కలిసి ఈ తరహా ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టింది. దీంతో ఈ ప్రాజెక్టును ఢిల్లీలో అమలు చేసేలా అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను నవంబర్ 7కు వాయిదా వేసింది. -
దేశ రాజధాని కంటే ఐదింతలు!
♦ 217 చదరపు కిలోమీటర్లలో అమరావతి నిర్మాణం ♦ దేశ పరిపాలన నగర విస్తీర్ణం 42.7 చ.కి.మీ. మాత్రమే ♦ అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదనలు సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం దేశ రాజధాని న్యూఢిల్లీ కంటే ఐదింతలు ఎక్కువ. దేశ పరిపాలన నగరమైన కొత్తఢిల్లీ 42.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటే అమరావతిని 217 చ.కి.మీ, విస్తీర్ణంలో నిర్మించాలని అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఢిల్లీకి సమీపంలోని ప్రాంతాలను అభివృద్ధి చేసి దేశ రాజధానిపై ఒత్తిడి తగ్గించినట్లే ఏపీ రాజధానిలోనూ సమాంతరంగా కొన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచాలని మాస్టర్‌ప్లాన్‌లో సూచించారు. దీంతోపాటు అమరావతిని ఎకనమిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కావాల్సిన అన్ని వనరులూ ఉన్నాయని ముసాయిదాలో ప్రస్తావించారు. ప్రపంచ దేశాలతోపాటు భారత్‌లోని ప్రముఖ పరిశ్రమలు, వాటి అనుబంధ పరిశ్రమలను అమరావతిలో స్థాపించేందుకు అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. భవిష్యత్తులో అమరావతికి ముంపు వాటిల్లకుండా ముంపు ప్రాంతాలను గుర్తించి వాటిని ఎత్తుగా నిర్మించాలని మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాలను వాడుకోవడానికి వీలుగా రాజధాని ప్రాంతానికి సమీపంలో జలాశయాలు నిర్మిం చాలని ముసాయిదాలో ప్రతిపాదించారు. సమాంతర ప్రాంతాల అభివృద్ధి.. ఢిల్లీకి చేరువలోని నోయిడా, గుర్గావ్ల తరహాలోనే అమరావతి నగరానికి చేరువలో మంగళగిరి, విజయవాడ, గన్నవరం ప్రాంతాలను రాజధానికి సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించారు. అమరావతితోపాటు విజయవాడ 62.17 చ.కి.మీ, మంగళగిరి 4.29 చ.కి.మీ, గన్నవరం విమానాశ్రయం కలిపి 4.29 చ.కి.మీ., అభివృద్ధి చేయాల్సిందిగా మాస్టర్‌ప్లాన్‌లో ప్రస్తావించారు. అమరావతిలో నిర్మించనున్న నవ నగరాలకు వివిధ దేశాల్లో స్ఫూర్తిగా తీసుకున్న నగరాలను మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్నారు. సింగపూర్ తరహా పారిశ్రామికీకరణ అమరావతిలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని, వాటి ద్వారా ఉద్యోగాలు, కంపెనీలు వస్తాయని ప్లాన్‌లో వివరించారు. ఇందుకోసం రాజధాని నగరంలో నివాస, వాణిజ్య సముదాయాలతోపాటు మౌళిక వసతులు, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహాలు అందించనున్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎస్ఎంఈ)ను స్థాపించేలా మల్టీ నేషనల్ కంపెనీలను అమరావతికి తీసుకు రావాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో ప్రత్యేకంగా పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేసి సింగపూర్ తరహా పారిశ్రామిక విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎకనమిక్ డెవలెప్మెంట్ బోర్డు(ఈడీబీ) ద్వారా పారిశ్రామిక విధానాన్ని అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. బిజినెస్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, లాజిస్టిక్ జోన్లుగా విభజించి అభివృద్ది చేయాలని సూచించారు. రెసిడెన్షియల్ జోన్లకు సమీపంలో గాలి, నీరు కాలుష్య రహిత పచ్చదనంతో నిండిన పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పిస్తారు. సింగపూర్‌లో ఏ విధంగా పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందిందీ మాస్టర్‌ప్లాన్‌లో ప్రస్తావించారు. రాజధానిలో విశాలమైన ఇంటర్నల్రోడ్డు నిర్మాణం జరుగుతుందని మాస్టర్‌ప్లాన్‌లో వివరించారు. కృష్ణా నదికి కొత్త కరకట్ట అమరావతి ప్రాంతానికి ముంపు ముప్పు రాకుండా మాస్టర్‌ప్లాన్‌లో ముందస్తు జాగ్రత్తలు సూచించారు. చెన్నై వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కృష్ణా నది, కొండవీటివాగు వల్ల అమరావతికి వచ్చే వరద ముప్పును ముందుగానే తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇక్కడ తరచూ ముంపు బారిన పడే ప్రాంతాలను గుర్తించి అవి ఎత్తుగా ఉండేలా చూడాలని ప్లాన్‌లో పేర్కొన్నారు. కృష్ణా నది వెంబడి ప్రస్తుతం 3 నుంచి 5 మీటర్ల ఎత్తులో ప్రస్తుతం ఒక కరకట్ట ఉంది. దీనికి బదులు నదికి దగ్గర్లో కొత్తగా మరో కరకట్ట నిర్మించాలని మాస్టర్‌ప్లాన్‌లో ప్రస్తావించారు. -
పీయూసీ పత్రాలుంటేనే ఇంధనం
ఒకటో తేదీనుంచి జాతీయ రాజధానిలో అమల్లోకి రానున్న నిబంధన సాక్షి, న్యూఢిల్లీ: పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ ఉన్న వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలనే నిబంధన త్వరలో అమల్లోకి రానుంది. ఇందుకు ఢిల్లీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వాహనంలో ఇంధనం నింపించుకోవడం కోసం పీయూసీ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసే నిబంధనను వచ్చే నెల ఒకటో తేదీనుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇందుకు జరుగుతున్న ఏర్పాట్లను ముఖ్యకార్యదర్శి డి.ఎం .స్పోలియా బుధవారం పరిశీలించారు. రవాణా, పర్యావరణం, ఆహారం, పౌరసరఫరాల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసు అధికారులతో సమావేశమైన ఆయన ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలంటూ ఆదేశించారు. ఈ నిబంధన అమలయ్యేవిధంగా చూడడం కోసం ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని సంబధిత అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావడానికి ఇంకా 17-18 రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్థానికులకు అవగాహన కల్పించాలని ఆయన సంబంధిత విభాగాలను కోరారు. పీయూసీ సర్టిఫికెట్లేకుంటే ఫిల్లింగ్ స్టేషన్లు ఇంధనం నింపబోవనే విషయాన్ని వాహనచోదకులకు తెలియజెప్పడంతో పాటు, ఇంధనం నింపడానికి నిరాకరించాలని ఆయా ఫిల్లింగ్ స్టేషన్లలో పనిచేసేవారికి తెలియజెప్పడం కోసం చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. పీయూసీ సర్టిఫికెట్ల ఆవశ్యకతను ప్రజలకు తెలియచెప్పడం కోసం ఫిల్లింగ్ స్టేషన్లలో నోటీసులు అతికించడంతో పాటు వాణిజ్య ప్రకటనల ద్వారా ప్రచారం చేయాలని ముఖ్యకార్యదర్శి ఈ సందర్భంగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈయూ-4 వాహనాలకు ఏడాది పాటు చెల్లుబాటయ్యే పీయూసీ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుండగా ఇతర వాహనాలు ప్రతి మూడు నెలలకోసారి వీటిని పొందాల్సి ఉంటుంది.వచ్చే నెల ఒకటో తేదీ తరువాత పీయూసీ సర్టిఫికెట్ల కోసం వచ్చే వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుందని అధికారులు అంచ నా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఈ ఒత్తిడిని తట్టుకోవడం కోసం పీయూసీ పత్రాల జారీ కేంద్రాల సంఖ్యను పెంచడంతోపాటు వాటి పనిగంటలను పొడిగించేలా చూడాలని నిర్ణయించారు. నగరంలోని అనేక ఫిల్లింగ్ స్టేషన్లలో పీయూసీ పత్రాల జారీచేసే కేంద్రాలు ఉన్నాయి. ఇలాంటివి లేనిచోట కొత్త వాటిని ఏర్పాటుకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించనుంది. -
వారం తర్వాత ఇంటికి
న్యూఢిల్లీ: అటు పోలీసు శాఖ అధికారులతోపాటు కుటుంబసభ్యులను తీవ్ర గందరగోళానికి గురిచేసిన చిన్నారి జాహ్నవి ఆహుజా ఆదివారం రోజుల తర్వాత ఇంటికి చేరుకుంది. దీంతో జాహ్నవి కుటుంబసభ్యుల ఆనందానికి అంతేలేకుండాపోయింది. ఈ విషయమై జాహ్నవి తండ్రి రాజేశ్ ఆహుజా సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘ఇంటికొచ్చిన వెంటనే అందరినీ గమనించిన జాహ్నవి నాన్నా అంటూ నన్ను పిలిచింది. ఏడవడం ప్రారంభించింది. ఆ తరువాత ఓ అడుగు ముందుకేసి నా ఒడిలో వాలిపోయింది. మాకు ఒకటే అమ్మాయి. దానికి ఫ్రూటీ అంటే ఎంతో ఇష్టం. ఇంటిలోకి రాగానే తింటానికి ఏదో ఒకటి ఇచ్చా’ అని అన్నాడు. ప్రస్తుతం తిండి బాగానే తింటోందని, బాగానే ఆడుకుంటోందని, రాత్రి బాగా నిద్రపోయిందన్నాడు. కాగా జాతీయ రాజధాని నడిబొడ్డునగల ఇండియా గేట్ వద్ద జాహ్నవి వారం క్రితం తప్పిపోయిన సంగతి విదితమే. జాహ్నవిని వెంటబెట్టుకుని ఆదివారం సాయంత్రం సరదాగా కుటుంబసభ్యులంతా ఇండియాగేట్ వద్దకు వచ్చారు. అయితే రాత్రి తొమ్మిది గంటల సమయంలో జాహ్నవి కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులు తిలక్‌మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అనంతరం నగర పోలీసు విభాగం సిబ్బందితోపాటు క్రైంబ్రాంచ్, స్పెషల్ సెల్‌కుచెందిన బృందాలు జాహ్నవి ఆచూకీ కోసం గాలింపు చర్యలను చేపట్టిన సంగతి విదితమే. ఇండియాగేట్ వద్ద తప్పిపోయిన మూడేళ్ల పసిపాప జాహ్నవి ఆచూకీ కనుగొన్నవారికి రూ. 50 వేల నగదు బహుమతిని అందజేస్తామంటూ నగర పోలీస్ కమిషనర్ భీంసేన్ బసి ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. కాగా ఆదివారం సాయంత్రం జాహ్నవి నగరంలోని మాయాపురి పోలీస్‌స్టేషన్ సమీపంలో ధీరేందర్ అనే ఓ కళాశాల విద్యార్థి కంటపడింది. ఆ సమయంలో పాప మెడలో ఆమె పేరుతోపాటు ఓ ఫోన్ నంబర్ ఉండడాన్ని గమనించిన ఆ విద్యార్థి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు జాహ్నవిని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితులింకా పరారీలోనే... జాహ్నవిని అపహరించిన వ్యక్తులు ఇప్పటి కీ పరారీలోనే ఉన్నారు. అపహరణ అనంతర పరిణామాల క్రమాన్ని గుర్తించేందుకు యత్నిస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. ఇంటికొచ్చే సమయానికి జాహ్నవి ఒంటిపై గల్లంతైన సమయంలో ధరించిన దుస్తులే ఉన్నాయి. నిందితులు జాహ్నవిని మురికిప్రదేశంలో ఉంచలేదని, కొట్టడం వంటివి చేయలేదని, పాపశరీరంపై ఎటువంటి గాయాలూ కనిపించలేదని ఆయన వివరించారు. -
పెరిగిన ఫ్యాక్టరీల సంఖ్య
న్యూఢిల్లీ: ఫ్యాక్టరీల చట్టం 1948 ప్రకారం ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో వెలుస్తున్న పరిశ్రమల సంఖ్య భారీగా పెరిగినట్టు తేలింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో 2,878గా ఉన్న ఫ్యాక్టరీల సంఖ్య 2011-12 నాటికి 2,976కు చేరుకుందని పరిశ్రమల వార్షిక సర్వే (ఏఎస్ఐ) వెల్లడించింది. వీటిలో 2001 తరువాత 788 ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి. ఇక 950 ఫ్యాక్టరీలను (32 శాతం) ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలుగా, 852 ఫ్యాక్టరీలను భాగస్వామ్య సంస్థలుగా, 1,030 ఫ్యాక్టరీలను వ్యక్తిగత యాజమాన్యం ఉన్న సంస్థలుగా వర్గీకరించారు. వీటిలో అత్యధిక పరిశ్రమలు అంటే 486 ఫ్యాక్టరీలు వస్త్ర ఉత్పత్తి రంగంలో ఉన్నాయి. 270 సంస్థలు ఎలక్ట్రికల్ ఉపకరణాలను తయారు చేస్తున్నాయి. 257 కంపెనీలు లోహ ఉత్పత్తులను అందిస్తున్నాయని ఆర్థిక, గణాంకాలశాఖ డెరైక్టరేట్ తెలిపింది. ఈ మొత్తం ఫ్యాక్టరీలు 1.19 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 1,251 ఫ్యాక్టరీల్లో (42 శాతం) 100 కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. 566 ఫ్యాక్టరీల్లో 50 నుంచి 99 మంది వరకు, 902 ఫ్యాక్టరీల్లో 10 నుంచి 49 మంది వరకు కార్మికులు ఉన్నారు. 2010-11 ఆర్థిక సంవత్సరంలో వీటిన్నింటి వార్షికాదాయం రూ.48,687 కోట్లు కాగా, 2011-12లో ఇది రూ.50,900 కోట్లకు (4.5 శాతం) పెరిగింది. స్థూల విలువ రూ.6,328 కోట్ల నుంచి రూ.6,951 కోట్లకు పెరిగింది. ఇక నికర ఆదాయం రూ.4,698 కోట్ల నుంచి రూ.5,143 కోట్లకు చేరింది. జిల్లావారీ గణాంకాలను పరిశీలిస్తే వాయవ్యఢిల్లీలో అత్యధికంగా 925, దక్షిణ ఢిల్లీలో 789, పశ్చిమ ఢిల్లీలో 225, తూర్పుఢిల్లీలో 106, మధ్యజిల్లాలో 54, ఈశాన్య జిల్లాలో 53, నైరుతి ఢిల్లీలో 45, న్యూఢిల్లీలో 36 ఫ్యాక్టరీలు ఉన్నాయని పరిశ్రమల వార్షిక సర్వే (ఏఎస్ఐ) నివేదిక వెల్లడించింది. -
అప్పుడు నిడో తానియా....ఇప్పుడు షాలోని
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. మణిపూర్‌కు చెందిన ఓ వ్యక్తిని ఐదారుగురు దుండగులు తీవ్రంగా కొట్టడంతో మరణించాడు. ఈ ఘటన కోట్లా ముబారక్పూర్ ప్రాంతంలోజరిగింది. 30ఏళ్ల షాలోని అనే వ్యక్తి తన స్నేహితుడి నివాసం నుంచి తిరిగి వెళుతుండగా కారులో వచ్చిన దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడిచేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే ఎయిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈఘటనపై డీసీపీ బీఎస్ జైశ్వాల్ మాట్లాడుతూ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. షాలోనిపై అయిదారుగురు దాడి చేసినట్లు చెప్పారు. దాడి చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తునట్లు తెలిపారు. కాగా షాలోని ప్రస్తుతం నిరుద్యోగి. అతడు మునిర్కా నివాసం ఉంటున్నాడు. కాగా ఈ తరహా ఘటన జరగడం ఇది రెండోసారి. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన నిడో తానియా అనే విద్యార్థి సైతం ఇదే తరహాలో దుండగుల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడి మరణించాడు. -
నిర్భయ కేసులో ఇద్దరి ఉరి నిలిపివేత
సుప్రీంకోర్టు ఉత్తర్వులు న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన నిర్భయపై గ్యాంగ్ రేప్, హత్య కేసులో నిందితులు వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్లకు విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు ముఖేష్, పవన్‌గుప్తాలకు విధించిన ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ మార్చి 15వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులే వీరికీ వర్తిస్తాయని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. ఉరిశిక్షలపై అప్పీళ్లను త్రిసభ్య ధర్మాసనం విచారించాలన్న సవరణకు రాష్ట్రపతి ఆమోదం లభించినట్లు వార్తలు వెలువడ్డ నేపథ్యంలో తమ కేసును కూడా త్రిసభ్య ధర్మాసనానికి నివేదిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్న వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్ల వినతిని కోర్టు నిరాకరించింది. సవరణ నిబంధనలను ఇంకా నోటిఫై చేయలేదని పేర్కొంది. ఈ కేసులో నలుగురు నిందితులకు విచారణ కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వటం తెలిసిందే. దీన్ని నిలిపివేస్తూ సుప్రీం స్టే ఇచ్చింది. ఈ కేసురికార్డులను తమకివ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా, అత్యాచారం లాంటి హేయమైన ఘటనలకు పాల్పడే నిందితులు బాల నేరస్తులైనా వారిని పెద్దలుగానే పరిగణించాలన్న కేంద్ర మంత్రి మేనకాగాంధీ వ్యాఖ్యలను నిర్భయ తల్లిదండ్రులు స్వాగతించారు. గ్యాంగ్ రేప్ కేసుల్లో బాల నేరస్తులను సాకుగా చూపి వారి తరఫు న్యాయవాదులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని నిర్భయ తండ్రి పేర్కొన్నారు. -
ఢిల్లీలో జాతివివక్ష దాడి
దెబ్బలు తాళలేక ఎమ్మెల్యే కొడుకు మృతి సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారాల రాజధానిగా ఇప్పటికే అపఖ్యాతిని మూటగట్టుకున్న దేశ రాజధానిపై మరో అపకీర్తి మరక పడింది. ఢిల్లీలోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో బీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన నిడో తానియా (18) అనే యువకుడిపై జాతివివక్ష దాడి జరిగింది. దక్షిణ ఢిల్లీలోని లజ్‌పత్‌నగర్‌లో ఉన్న స్నేహితుడి ఇంటి చిరునామా తెలుసుకోవడానికి తానియా బుధవారం ఇద్దరు దుకాణదారులను సంప్రదించగా వారు అతని జుట్టును చూసి గేలి చేశారు. కోపం ఆపుకోలేక తానియా...ఓ దుకాణ అద్దాన్ని పగలగొట్టడంతో దుకాణదారులు, మరికొందరు కలసి అతన్ని చితకబాదారు. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో వారు రాజీ కుదిర్చి పంపారు. రాత్రి తన గదికి వెళ్లి పడుకున్న తానియా నిద్రలోనే కన్నుమూశాడు. దెబ్బలు తాళలేకే అతను మరణించినట్లు మృతుడి స్నేహితులు, బంధువులు ఆరోపించడంతో ప్రభుత్వం ఇద్దరు దుకాణదారులను అరెస్టు చేసింది. ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. మృతుడు అరుణాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిడో పవిత్ర కుమారుడు. అతని మరణానికి గల అసలు కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని పోలీసులు తెలిపారు. -
పట్టపగలే రూ.7 కోట్ల దోపిడీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నేరగాళ్లు పట్టపగలే స్వేచ్ఛగా విహారం చేస్తూ తమ పనులు చేసుకుపోతున్నారు. ఇప్పటికే లెక్కకు మిక్కిలి అత్యాచార కేసులతో ప్రతిష్ట మసకబారిన ఢిల్లీ నగరంలో మంగళవారం భారీ దోపిడీ ఒకటి జరిగింది. ఆయుధాలతో వచ్చిన సుమారు ఆరుగురు దుండగులు స్థిరాస్తి వ్యాపారి కారును అడ్డగించి, ఆయన సిబ్బంది నుంచి ఏడున్నర కోట్లు దోచుకుని పరారయ్యారు. పక్కా పథకం ప్రకారం.. సినీఫక్కీలో నేరగాళ్లు తమ పనిచేసుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాలు.. - మంగళవారం ఉదయం.. కల్జాజీ ప్రాంతవాసి అయిన స్థిరాస్తి వ్యాపారి రాహుల్ అహుజా వద్ద మేనేజర్‌గా పనిచేస్తున్న రాకేశ్కల్రా తన ఆఫీసు నుంచి 7.69 కోట్ల నగదును తీసుకుని కరోల్‌బాగ్‌లోని ఒక బ్యాంకు శాఖలో డిపాజిట్ చేయడానికి కారులో వెళుతున్నారు. ఆయన వెంట డ్రైవర్, ముగ్గురు ఉద్యోగులు ఉన్నారు. - ఉదయం 9 గంటలు. హోండాసిటీ కారు కరోల్‌బాగ్ వైపు వెళుతూ లజ్‌పత్‌నగర్ మెట్రోస్టేషన్ సమీపానికి వచ్చింది. - ఇంతలో వెండిరంగులో ఉన్న వ్యాగన్-ఆర్ కారు(యూపీ రిజిస్ట్రేషన్ నంబర్).. హోండా సిటీ కారును దాటుకుని ఒక్కసారిగా అడ్డంగా ఆగిపోయింది. హోండా సిటీ కారు డ్రైవర్ బ్రేక్ వేసేలోపే ముందున్న వ్యాగన్ ఆర్‌ను ఢీకొట్టింది. దాంతో వ్యాగన్ ఆర్ డ్రైవర్, అందులోని మరొకరు కిందికి దిగి.. కల్రా, అతడి సహచరులతో వాదనకు దిగారు. వారి మధ్య ఘర్షణ కొనసాగుతోంది. - తెల్ల రంగు హోండా వెర్నా కారు(హర్యానా రిజస్ట్రేషన్ నంబర్) వచ్చి కల్రా కారు వెనుకనే ఆగింది. అందులోంచి ముగ్గురు లేదా నలుగురు దుండగులు కిందికి దిగారు. కల్రా కారు వద్దకు వచ్చి కిందికి రావాలని తుపాకులతో బెదిరించారు. వారు బయటకు వచ్చిన వెంటనే.. అందులో ఉన్న రూ. 7.69 కోట్ల నగదు బ్యాగులతో అదే కారులో దుండగులు ఉడాయించారు. మిగతా దుండగులు వెర్నా కారులో పారిపోయారు. - ఉదయం రద్దీ సమయంలో 20 నిమిషాలకుపైగా ఈ దోపిడీ తతంగం సాగింది. - 9.30 గంటలకు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. - దుండగులు వదిలేసిన వ్యాగన్ ఆర్ కారు ఈ నెల 24న ముకర్బా చౌక్ నుంచి చోరీ అయినట్లు తేలింది. అలాగే, సంఘటనా ప్రదేశానికి కిలోమీటరు దూరంలో జుంగ్పురా వద్ద వెర్నా కారును దుండగులు వదిలేసి వెళ్లారు. - హోండా సిటీ కారును బారాపులా ఫ్లైఓవర్ వద్ద గుర్తించారు. అందులో రెండు ఖాళీ సంచులు మాత్రమే లభించాయి. భారీ దోపిడీ కావడంతో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. - పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా నిందితుల ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే, నగదు తీసుకెళుతున్న విషయం ఎవరికి తెలిసి ఉంటుంది? అన్న కోణంలోనూ వ్యాపారి కల్రాను విచారిస్తున్నారు. - ఫోరెన్సిక్ నిపుణులు దుండగులు ఉపయోగించిన కార్ల నుంచి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. దొంగిలించిన కార్లను వినియోగించినట్లు నిర్ధారణకు వచ్చారు. - లజ్‌పతి నగర్ స్టేషన్లో కేసు నమోదైంది.