సాక్షి, కృష్ణా: తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. పొగమంచు కారణంగా విమానాలు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా గన్నవరం(Gannavaram) విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా విమాన ల్యాండింగ్‌కు అంతరాయం తగిలింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని రాజమండ్రికి తరలించారు.
గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కి అంతరాయం ఏర్పడింది. దీంతో, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. అయినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో అధికారులు విమానాన్ని దారి మళ్లించారు. ఈ క్రమంలో విమానాన్ని రాజమండ్రికి మళ్లించారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో సైతం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్(Hyderabad), ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ వద్ద జాతీయ రహదారిని పొగ మంచు కమ్మేసింది. లైట్ల వెలుతురుతో నెమ్మదిగా వాహనాలు ముందుకు సాగుతున్నాయి. ఇక, యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట ఆలయం వద్ద కూడా దట్టంగా పొగమంచు అలుముకుంది. ప్రధాన ఆలయంతో పాటు ఘాట్‌రోడ్ ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. పొగ మంచులో ఆలయ పరిసరాలు మరింత శోభను సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment