foggy weather
-
ఉత్తరాదిని కమ్మేసిన దట్టమైన పొగమంచు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. రహదారులపై వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ప్రయాణాలు నిలిచిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు పొగమంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నాలుగు రాష్ట్రాలలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొగమంచు కారణంగా శుక్రవారం దేశవ్యాప్తంగా 274 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 80కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
పొగమంచుతో పెరిగిన వాహన ప్రమాదాలు
చలికాలంలో పొగమంచు రోడ్డు ప్రమాదాలకు కారణంగా మారుతోంది. విజిబులిటీ తగ్గిన కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పొగమంచు కారణంగా యూపీలోని ఆగ్రాలో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బహ్రైచ్-బలరాంపూర్ హైవేపై డబుల్ డెక్కర్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రైవేట్ బస్సు గుజరాత్ నుంచి బలరాంపూర్ జిల్లా వైపు వెళ్తోంది. ఈ క్రమంలో బహ్రైచ్-బలరాంపూర్ హైవేలోని ధరస్వాన్ గ్రామం సమీపంలో బియ్యం లోడుతో వస్తున్న ట్రక్కును డబుల్ డెక్కర్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. హాపూర్‌లో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి-9పై సుమారు 15 వాహనాలు ఒక్కొక్కటిగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై చాలాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ఆగ్రాలోనూ పొగమంచు కారణంగా రోడ్డుపై డ్రైవింగ్ ఇబ్బందికరంగా మారింది. పొగమంచు కారణంగా పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన జాతీయ రహదారిలోని ఎత్మాద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సిద్ధార్థనగర్లోనూ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బన్సీ కొత్వాలి పరిధిలోని బెల్బన్వా గ్రామంలో ఒక పికప్ వాహనం, బైక్ ఢీకొన్నాయి. పశువులను తప్పించబోయిన పికప్ వాహనం బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. కాగా పికప్ వాహనంలో అక్రమంగా పశువులను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించి, వాటిని గోశాలకు తరలించారు. ఈ ఉదంతంలో ఇద్దరి అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. పికప్ వాహనాన్ని సీజ్ చేశారు. ఇది కూడా చదవండి: హిమాచల్‌కు టూరిస్టుల తాకిడి! -
కమ్మేసిన పొగమంచు
కోదాడ, మునగాల: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం పరిసర ప్రాంతాలు, మునగాల మండల కేంద్రాన్ని గురువారం పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలైనా మంచు తెరలు వీడకపోవడంతో వాహనచోదకులు ఇబ్బందిపడ్డారు. 65వ నంబర్ (హైదరాబాద్ –విజయవాడ) జాతీయ రహదారిపై దీపాలు వెలిగించి వాహనాలను నడపాల్సి వచ్చింది. -
పొగమంచుతో ఘోర ప్రమాదం.. 17 మంది మృతి
బీజింగ్: చలితీవ్రత పెరగడంతో పొగమంచు కమ్మేస్తోంది. ముందు ఉన్న వారిని సైతం గుర్తుపట్టలేనంతగా దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. పొగమంచు కారణంగా చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌లో ఆదివారం తెల్లవారుజామును ఘోర ప్రమాదం జరిగింది. పలు వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొట్టడంతో మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాంచాంగ్ కౌంటీలో జరిగిన ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఘటన జరిగిన ఒక గంట తర్వాత వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని నాంచాంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు చేశారు. భారీగా పొగమంచు కమ్మేసిన క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. రోడ్లపై అప్రమత్తతో ఉంటూ డ్రైవర్లు ముందుకు సాగాలని సూచించారు. ఇదీ చదవండి: రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామ రక్షణ కమిటీల పునరుద్ధరణ -
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 20 రైళ్లు ఆలస్యం
న్యూఢిల్లీ/శ్రీనగర్: ఢిల్లీని గురువారం ఉదయం పొగమంచు కప్పేసింది. మంచు కారణంగా 20 వరకు రైళ్లు 1.30 గంటల నుంచి 4.30 గంటల పాటు ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీలోని పాలం, సఫ్దర్‌జంగ్ విమానాశ్రయాల్లో 200 మీటర్ల దూరం పైబడి ఉన్న వస్తువులు కనిపించలేదని పేర్కొంది. జమ్మూకశ్మీర్‌లో 40 రోజులపాటు కొనసాగే తీవ్రమైన శీతాకాల సీజన్ ‘చిల్లా–ఇ–కలాన్’ప్రభావం గురువారం కనిపించింది. లోయలోని చాలా ప్రాంతాల్లో మంచి నీటి పైపులు, దాల్ సరస్సు ఉపరితలం గడ్డకట్టుకుపోయాయి. బుధవారం రాత్రి శ్రీనగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత –5.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఈ సీజన్లో ఇదే అత్యల్పమని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి –4.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపుల్లో ఒకటైన పహల్గాంలో అత్యల్పంగా –6.8 డిగ్రీలు, గుల్మార్గ్లో –5.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం లేదా తేలిక పాటి మంచు కురియవచ్చని ఐఎండీ అంచనా వేసింది. డిసెంబర్ 21న మొదలైన ఈ చిల్లా–ఇ–కలాన్ సీజన్ జనవరి 30వ తేదీ వరకు ఉంటుంది. -
శంషాబాద్‌లో స్పైస్‌జెట్ అత్యవసర ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: స్పైస్ జెట్ విమానం తిరిగి శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శుక్రవారం ఉదయం తిరుపతి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం తిరుపతి విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్‌కు తిరుపతి ఎయిర్‌పోర్టు ఏటీసీ అధికారులు అనుమతించలేదు. ఉదయం 7.45 నిమిషాలకు తిరుపతి బయలుదేరిన విమానం తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. -
హైదరాబాద్‌ను కప్పేసిన దట్టమైన పొగమంచు.. తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌ను పొగమంచు కప్పేసింది. ఆదివారం తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగమంచు కప్పేసింది. మరోవైపుసాయంత్రం అయిదు గంటలకే కారుచీకట్లు అలుముకునేలా సర్పిలాకారంలో (స్పైరల్) కమ్మేసిన కారుమబ్బులు.. మరోవైపు వాహనాల నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ.. వెరసీ.. సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు ఊపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. భూ వాతావరణానికి తక్కువ ఎత్తులో.. కేవలం 0.9 కి. మీ ఎత్తులోనే దట్టమైన క్యుములో నింబస్మేఘాలు ఏర్పడడం వీటి నుంచి నింబోస్ట్రేటస్, అల్టోస్ట్రేటస్ అనే వాయువులు వెలువడడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. అస్తమా, సైనస్, బ్రాంకైటిస్ సమస్యలున్నవారు ఊపి రాడక విలవిల్లాడుతున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్య మార్పులు చోటుచేసుకున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. చదవండి: ‘గుడ్’మార్నింగ్.. పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు కాలుష్యం.. కారుమబ్బులు.. ► నగరంలో పీల్చే గాలిలో వాయు కాలుష్యం తీవ్రమవడంతో ఆయా కారకాలు దట్టమైన మేఘాల కారణంగా భూ ఉపరితల వాతావరణంలో పైకి వెళ్లలేక భూవాతావరణాన్ని ఆవహిస్తున్నాయి. మరోవైపు అనూహ్యంగా పడిపోతున్న కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా.. సిటీజన్లు న్యుమోనియా, అస్తమా, ఓమిక్రాన్ తదితర తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో విలవిల్లాడుతున్నారు. ► క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి సీఓపీ (శ్వాస ఆడక బాగా ఇబ్బంది పడడం)తో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడం గమనార్హం.ì గత మూడు రోజులుగా ఇదే దుస్థితి నెలకొంది. కాలుష్యం విషయానికి వస్తే..సిటీలో పలు కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. చదవండి: HYD: మందుతాగి పోలీసులకు దొరికితే.. ఇక ఆఫీస్‌లో మీ పని అంతే! ►గ్రేటర్ పరిధిలో సుమారు 55 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్ రద్దీలో రహదారులపై రేగుతున్న దుమ్ముతో సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఘనపు మీటరు గాలిలో ధూళికణాలు (పీఎం10) మోతాదు 60 మైక్రోగ్రాములకు మించరాదు. పలు కూడళ్లలో సుమారు 90–100 మైక్రోగ్రాముల ధూళి కాలుష్యం వెలువడుతోందని కాలుష్య నియంత్రణ మండలి తాజా అధ్యయనంలో తేలింది. ► ప్రధానంగా బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజాగుట్ట, కూకట్పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వాయుకాలుష్యం శ్రుతిమించుతున్నట్లు తేలింది. అంతేకాదు ఆయా కూడళ్లలో ఏడాదికి సగం రోజులు అంటే 183 రోజులపాటు కాలుష్య మేఘాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తస్మాత్ జాగ్రత్త... ఉష్ణోగ్రతలు పడిపోతుండడం, పొగమంచు కారణంగా వృద్ధులు, రోగులు, చిన్నారులు, శ్వాసకోశ సమస్యలున్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున బయటకు రావద్దని స్పష్టం చేస్తున్నారు. చలినుంచి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం, మాస్క్ ధరించడం తప్పనిసరని సూచిస్తున్నారు. -
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందా.. లేక మరేదైనా కారణామా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు వాయుసేన అధికారులు. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. హెలికాప్టర్ కూలడానికి కొన్ని సెకన్ల ముందు చోటు చేసుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ప్రమాదం చోటు చేసుకోవడానికి కొన్ని సెకన్ల ముందటి ఈ వీడియోలో హెలికాప్టర్ పొగ మంచులో చిక్కుకున్న దృశ్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అంతవరకు బాగానే ప్రయాణించిన హెలికాప్టర్ ఉన్నట్లుండి పొగ మంచులో చిక్కుకోవడంతో.. ఈ ప్రమాదం సంభవించింది. (చదవండి: Helicopter Crash: ఆయనొక్కరే బతికిబయటపడ్డారు) హెలికాప్టర్ పొగ మంచులో చిక్కుకున్న సమయంలో కింద కొందరు జనాలు ఉన్నారు. వారికి హెలికాప్టర్ కూలిన చప్పుడు వినిపించింది. ప్రమాదం గురించి వారు తమిళ్లో మాట్లాడుకోవడం దీనిలో రికార్డయ్యింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో.. ప్రమాదంపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి. అలానే హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ కూడా లభ్యం అయినట్లు అధికారులు ప్రకటించారు. (చదవండి: ప్రముఖులను కబళించిన హెలికాప్టర్ ప్రమాదాలు) మంగళవారం చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్యతో మొత్తం 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తెలుగు జవాను కూడా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాకు చెందిన సాయి తేజ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్‌కు వెళ్లాడా’’ -
Photo Feature: మంచుకురిసే వేళలో..
సాక్షి, ఆదిలాబాద్: ప్రకృతి సోయగాలను చూస్తే పరవశించిపోవాల్సిందే. అందులో అప్పుడప్పుడు మాత్రమే కనిపించే అందాలు మరింత కనువిందు చేస్తుంటాయి. అక్టోబర్ ప్రారంభంలోనే నిర్మల్ జిల్లా కేంద్రాన్ని ఆదివారం తెల్లవారుజామున మంచు దుప్పటి ఇలా కప్పేసింది.. పొగమంచు కమ్మేసింది. ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కన్పించలేనంతగా మంచు ఆవరించింది. దీంతో వాహనదారులు కొంత ఇబ్బంది పడినా.. ప్రజలు మాత్రం అహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్. -
గాల్లో చక్కర్లకు ఇక చెక్!
సాక్షి, అమరావతి బ్యూరో: మేఘాలు ఆవరించినా, పొగమంచు కమ్ముకున్నా విమానాల ల్యాండింగ్‌కు సమస్య తలెత్తుతుంది. రన్‌వే పైకి దిగాలంటే రిస్క్‌తో కూడుకున్న పని. అందుకే అలాంటి వాతావరణ పరిస్థితులేర్పడినప్పుడు పైలెట్లు విమానాలను రన్‌వే పైకి దించకుండా కాసేపు గాల్లోనే చక్కర్లు కొడుతుంటారు. ఆ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికుల్లో అలజడి, ఆందోళన నెలకొంటుంది. కొంతసేపటికి మేఘాలు/పొగమంచు క్లియర్ అయ్యాక రన్‌వేపై ల్యాండ్ అవడానికి విమానాశ్రయ అధికారులు అనుమతులిస్తారు. లేదంటే ఆ విమానాన్ని వెనక్కి పంపిస్తారు. శీతాకాలం, వానాకాలాల్లో ఇలాంటి పరిస్థితులు సహజంగా ఏర్పడుతుంటాయి. మన విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రంలోనూ తరచూ పొగమంచు కమ్ముకోవడం, మబ్బులు ఆవరించడం సర్వసాధారణంగా మారింది. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో సింపుల్ అప్రోచ్ సిస్టం మాత్రమే ఉంది. దీనివల్ల రన్‌వేపై ల్యాండ్ అయ్యే విమానాల పైలట్లకు రన్‌వేపై పరిస్థితి కనిపించక (విజిబిలిటీ లేక) సతమతమవుతున్నారు. రూ. 2 కోట్లతో.. ఈ నేపథ్యంలో ఈ విమానాశ్రయంలో కొత్తగా కేటగిరి–1 (కేట్–1) అప్రోచ్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు దాదాపు రూ.2 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇటీవలే ఇందుకు అవసరమైన పనులను ప్రారంభించారు. ఈ విద్యుత్ లైట్లను రన్‌వేకి ఇరువైపులా రన్‌వే దాటాక దాదాపు 900 మీటర్ల వరకు (బుద్ధవరం–దావాజీగూడెం వైపు) ఏర్పాటు చేస్తారు. కేట్–1 అప్రోచ్ లైటింగ్ సిస్టం మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వస్తే 300–400 మీటర్ల వరకు విజిబిలిటీని పెంచుతుంది. లైటింగ్ బ్రైట్‌గా కనిపిస్తుంది. దీంతో పైలెట్ దూరం నుంచే రన్‌వేను అంచనా వేయడానికి వీలవుతుంది. వెయ్యి మీటర్ల లోపు విజిబిలిటీ పడిపోతే పైలట్లు ల్యాండింగ్‌కు సాహసం చేయరు. ఇకపై ఇలా వెయ్యి మీటర్లలోపు విజిబిలిటీ తగ్గినా అప్రోచ్ లైటింగ్ సిస్టం వల్ల రన్‌వే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పూర్ విజిబిలిటీలోనూ విమానాలు ల్యాండ్ అవుతాయన్న మాట! రాష్ట్రంలోనే మొదటిది.. భారత నావికాదళం ఆధీనంలో ఉన్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో మినహా రాష్ట్రంలో మరే ఎయిర్పోర్టుల్లోనూ ఇప్పటివరకు కేట్–1 అప్రోచ్ లైటింగ్ సిస్టం ఏర్పాటు కాలేదు. దీంతో రాష్ట్రంలో ఈ సిస్టం అందుబాటులోకి రానున్న తొలి ఎయిర్‌పోర్టు ఇదే కావడం విశేషం!! విజిబిలిటీ సమస్య ఉండదు వర్షాకాలంలో మేఘాలు ఆవరించినప్పుడు, శీతాకాలంలో పొగమంచు ఏర్పడినప్పుడు విజిబిలిటీ సరిగా లేక ఈ విమానాశ్రయంలో విమానాలు ల్యాండ్ అవడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో సింపుల్ అప్రోచ్ లైటింగ్ సిస్టం ఉంది. విజిబిలిటీ సమస్యను అధిగమించడానికి కొత్తగా కేట్–1 అప్రోచ్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నాం. ఇది అందుబాటులోకి వస్తే విజిబిలిటీ సమస్యకు చాలా వరకు పరిష్కారం లభించినట్టవుతుంది. మరో మూడు నెలల్లో ఈ సిస్టం అందుబాటులోకి వస్తుంది. – గిరి మధుసూదనరావు, డైరెక్టర్, విజయవాడ విమానాశ్రయం -
కుప్పకూలిన విమానం, విషాదం
మధ్యప్రదేశ్‌లో విమాన ప్రమాదం విషాదాన్ని నింపింది. సాగర్ జిల్లాలో శుక్రవారం రాత్రి ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ట్రైనర్ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు మృతి చెందినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారనీ సీఎంఓ ట్వీట్ చేసింది. `చిమ్స్ అకాడమీ 'విమానం (సెస్నా172) ధానా ఎయిర్‌స్ట్రిప్ వద్ద ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుండగా, అదుపు తప్పి పక్కనే ఉన్న మైదానంలో కూలిపోయిందని సాగర్ పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ సంఘి తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్రైనర్ అశోక్ మక్వానా (58), ట్రైనీ పియూష్ సింగ్ (28) మృతి చెందారని తెలిపారు. పొగమంచు కప్పేయడంతో రన్‌వే సరిగా కనిపించక ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నామన్నారు. అటు ఈ సంఘటనను చిమ్స్ అకాడమీ స్థానిక నిర్వాహకుడు రాహుల్ శర్మ ధృవీకరించారు. సెస్నా 172లో గ్లాస్ కాక్‌పిట్‌తో పాటు రాత్రిపూట ప్రయాణానికి అవసరమైన అన్ని సౌకర్యాలున్నాయని అకాడమీ వర్గాలు తెలిపాయి. అకాడమీ వెబ్సైట్ ప్రకారం, ఇది కమర్షియల్ పైలట్ లైసెన్స్, ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కోర్సులను నడుపుతుంది. प्रदेश के सागर की ढाना हवाई पट्टी पर एक विमान हादसे में दो प्रशिक्षु पायलेट की मौत का दुःखद समाचार प्राप्त हुआ। परिवार के प्रति मेरी शोक संवेदनाएँ। ईश्वर उन्हें अपने श्रीचरणो में स्थान व पीछे परिजनो को यह दुःख सहने की शक्ति प्रदान करे। — Office Of Kamal Nath (@OfficeOfKNath) January 3, 2020 -
కోస్తాకు మంచు దుప్పటి!
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్రలో మంచు దుప్పటి పరచుకోనుంది. ఇప్పటికే కొద్దిరోజుల నుంచి ఇది కొనసాగుతోంది. రానున్న కొద్దిరోజులు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంది. ఆకాశం నిర్మలంగా ఉండి, గాలులు వేగంగా వీయకపోవడం వల్ల ఉపరితలంలో నిశ్చల పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో నీటి ఆవిరి పైకి వెళ్లకుండా ధూళి కణాలు అడ్డుకోవడం వల్ల పొగమంచు ఏర్పడడానికి కారణమవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఈ పొగమంచు బారిన పడకుండా దూరంగా ఉండడం మంచిదని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ సాక్షికి చెప్పారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి కొన్నాళ్లు మంచు ప్రభావం కొనసాగుతుందని తెలిపారు. తెల్లారాక కూడా మంచు తెరలు తొలగకపోవడం వల్ల రోడ్డుపై ముందు వెళ్లే వాహనాల కనిపించకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఇది రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో క్రమేపీ పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణంకంటే పగటి ఉష్ణోగ్రతలు 3-4, రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా చలి ప్రభావం తగ్గుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు అనంతపురంలో 35 (+4), కడప 35 (+3), జంగమహేశ్వరపురంలో 34 (+3) డిగ్రీలు రికార్డయ్యాయి. రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా ఆరోగ్యవరంలో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
కమ్మేసిన పొగమంచు, భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 9 గంటలైనా వాహనాలు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి. ఫలితంగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. -
ఢిల్లీని కప్పేసిన మంచు దుప్పటి
న్యూఢిల్లీ: దేశ రాజధానిని దట్టమైన మంచు దుప్పటి కప్పేసింది. చీకట్లు కమ్మిన ఉదయంతో ఢిల్లీ నగర ప్రజలు మేల్కొన్నారు. పొగమంచు కారణంగా 21 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేయగా 59 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రత 7.4 డిగ్రీలు కొనసాగుతోంది. ఉదయం 5.30 గంటలకు 500 మీటర్ల దూరంలో మాత్రమే కనిపిస్తుండగా 8.30 గంటలకు 800 మీటర్ల వరకు కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటోంది. మంగళవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 8.4 కాగా గరిష్ఠ ఉష్ణోగ్రత 17.7గా ఉంది. -
రాజధానిని కమ్మేసిన పొగమంచు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు దట్టంగా అలుముకుంది. రైలు, రోడ్డు మార్గం పూర్తిగా పొగమంచుతో కప్పి ఉన్నాయి. ఈ కారణంగా రైళ్ల రాకపోకల్లో అంతరాయం కలుగుతోంది. పొగమంచు కారణంగా 34 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే అధికారులు 13 రైళ్లను రద్దు చేశారు. 2 రైలు వేళ్లల్లో మార్పులు చేశారు. -
ఎయిర్‌పోర్టును కమ్మేసిన పొగమంచు..
సాక్షి, దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో మంగళవారంనాడు దట్టమైన పొగమంచు కమ్మేసిన కారణంగా సుమారు 90 పైగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజాము 6 గంటల నుండి 9 గంటల వరకూ ఏర్పోర్ట్ చుట్టుపక్కల పొగమంచు కమ్మేసింది. దీంతో అటు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లాల్సిన విమానాలు నిలిచిపోయాయి. కేఐఏఎల్కు రావాల్సిన విమానాలను దారిమళ్లించారు. ముఖ్యంగా లండన్ వెళ్లాల్సిన బీఏ-118 బ్రిటీష్ ఏర్వేస్,అమెరికన్ ఏర్వేస్ ఐబీ-47652 ఇబ్రియా ఎయిర్వేస్ ,దుబాయ్ వెళ్లాల్సిన ఇండిగో తదితర అంతర్ రాష్ట్రీయ విమానాలు ఆలస్యంగా ఎగిరాయి.బ్రెజిల్ ,సింగపూర్, అబుదాబి తదితర దేశాల నుండి రావాల్సిన విమానాలు ఆలస్యంగా వచ్చాయి. మరికొన్ని విమానాలకు ఇతర ఏర్పోర్ట్లకు దారిమళ్లించారు. 9 గంటల తరువాత పొగమంచు తగ్గాక విమానాలు రాకపోకలు ప్రారంభించాయి. -
ఢిల్లీలో దట్టంగా అలుముకున్న పొగమంచు
సాక్షి: ఢిల్లీలో దట్టంగా పొగమంచు అలుముకున్నది. పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్నిటి వేళల్లో మార్పులు చేశారు. 17 రైళ్లను రద్దు చేయగా 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 6 రైళ్ల వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
విజయవాడను కమ్మేసిన పొగమంచు
సాక్షి, విజయవాడ: విజయవాడ నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. కనకదుర్గమ్మ ఆలయ పరిసరాలతో పాటు, కృష్ణా నది, ప్రకాశం బ్యారేజి తదితర ప్రాంతాల్లో పొగమంచు ఆవరించింది. ఉదయం 8 గంటలకు కూడా వాహనాలు మంచు కారణంగా హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు రోజులుగా ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలు కూడా తక్కువ వేగంతో వెళుతున్నాయి. మరో వైపు పొగమంచు కారణంగా ఉదయం వేళల్లో ఏర్పడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నగర వాసులు ఎంజాయ్ చేస్తున్నారు. -
ల్యాండ్ కాని మోదీ హెలికాప్టర్; ఫోన్లో ప్రసంగం
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం వల్ల ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో ల్యాండ్ కాలేకపోయింది. పొగమంచు, వెలుతురులేమి కారణంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడానికి అనుకూలించకపోవడంతో ఫైలట్ లక్నోకు దారి మళ్లించారు. లక్నోలో సురక్షితంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం బహ్రెయిచ్‌లో పరివర్తన్ ర్యాలీలో మోదీ పాల్గొనాల్సివుంది. కాగా ప్రతికూలవాతావరణం కారణంగా ఆయన పర్యటన రద్దయ్యింది. దీంతో మోదీ లక్నో నుంచే ఫోన్ ద్వారా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య తన మొబైల్ ఫోన్‌ను మైకు దగ్గర ఉంచి మోదీ ప్రసంగాన్ని సభికులకు వినిపించారు.