Last visual of General Bipin rawat chopper crash in tamilnadu- Sakshi
Sakshi News home page

Last Visual Of General Bipin: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్‌

Published Thu, Dec 9 2021 10:39 AM | Last Updated on Thu, Dec 9 2021 12:59 PM

Last visual of General Bipin rawat chopper crash in tamilnadu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్‌ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్‌(చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) జనరల్‌ బిపిన్‌ రావత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందా.. లేక మరేదైనా కారణామా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు వాయుసేన అధికారులు. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. హెలికాప్టర్‌ కూలడానికి కొన్ని సెకన్ల ముందు చోటు చేసుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. 

ప్రమాదం చోటు చేసుకోవడానికి కొన్ని సెకన్ల ముందటి ఈ వీడియోలో హెలికాప్టర్‌ పొగ మంచులో చిక్కుకున్న దృశ్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అంతవరకు బాగానే ప్రయాణించిన హెలికాప్టర్‌ ఉన్నట్లుండి పొగ మంచులో చిక్కుకోవడంతో.. ఈ ప్రమాదం సంభవించింది. 
(చదవండి: Helicopter Crash: ఆయనొక్కరే బతికిబయటపడ్డారు)

హెలికాప్టర్‌ పొగ మంచులో చిక్కుకున్న సమయంలో కింద కొందరు జనాలు ఉన్నారు. వారికి హెలికాప్టర్‌ కూలిన చప్పుడు వినిపించింది. ప్రమాదం గురించి వారు తమిళ్‌లో మాట్లాడుకోవడం దీనిలో రికార్డయ్యింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో.. ప్రమాదంపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి. అలానే హెలికాప్టర్‌ బ్లాక్‌ బాక్స్‌ కూడా లభ్యం అయినట్లు అధికారులు ప్రకటించారు. 
(చదవండి: ప్రముఖులను కబళించిన హెలికాప్టర్‌ ప్రమాదాలు)

మంగళవారం చోటు చేసుకున్న హెలికాప్టర్‌ ప్రమాదంలో బిపిన్‌ రావత్‌, ఆయన భార్యతో మొత్తం 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తెలుగు జవాను కూడా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాకు చెందిన సాయి తేజ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు.

చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్‌కు వెళ్లాడా’’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement