IAF Helicopter
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందా.. లేక మరేదైనా కారణామా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు వాయుసేన అధికారులు. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. హెలికాప్టర్ కూలడానికి కొన్ని సెకన్ల ముందు చోటు చేసుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ప్రమాదం చోటు చేసుకోవడానికి కొన్ని సెకన్ల ముందటి ఈ వీడియోలో హెలికాప్టర్ పొగ మంచులో చిక్కుకున్న దృశ్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అంతవరకు బాగానే ప్రయాణించిన హెలికాప్టర్ ఉన్నట్లుండి పొగ మంచులో చిక్కుకోవడంతో.. ఈ ప్రమాదం సంభవించింది. (చదవండి: Helicopter Crash: ఆయనొక్కరే బతికిబయటపడ్డారు) హెలికాప్టర్ పొగ మంచులో చిక్కుకున్న సమయంలో కింద కొందరు జనాలు ఉన్నారు. వారికి హెలికాప్టర్ కూలిన చప్పుడు వినిపించింది. ప్రమాదం గురించి వారు తమిళ్లో మాట్లాడుకోవడం దీనిలో రికార్డయ్యింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో.. ప్రమాదంపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి. అలానే హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ కూడా లభ్యం అయినట్లు అధికారులు ప్రకటించారు. (చదవండి: ప్రముఖులను కబళించిన హెలికాప్టర్ ప్రమాదాలు) మంగళవారం చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్యతో మొత్తం 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తెలుగు జవాను కూడా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాకు చెందిన సాయి తేజ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్‌కు వెళ్లాడా’’ -
వరదల్లో చిక్కుకున్న హోం మంత్రి.. తాడు కట్టి పైకి లాగారు
భోపాల్: మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తం మిశ్రాకు చేదు అనుభవం ఎదురయ్యింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వెళ్లిన నరోత్తం.. చివరకు తానే వరదలో చిక్కుకుపోయాడు. విషయం తెలిసిన వెంటనే అధికారులు హెలికాప్టర్ని రంగంలోకి దించి.. తాడు సాయంతో ఆయనను పైకి లాగి రక్షించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కుండపోత వర్షాల కారణంగా మధ్యప్రదేశ్ దాతియా జిల్లాలో భారీగా వరదలు సంభవించాయి. ఈ క్రమంలో జిల్లాలోని కోట్రా గ్రామంలో ప్రజలు వరదలో చిక్కుకుని ఇబ్బందులు పడసాగారు. ఈ క్రమంలో వరద తీవ్రత పెరగడంతో కొందరు గ్రామస్తులు ఇంటి మీదకు చేరి సాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిసింది. వారికి సాయం చేసేందుకు హోం మినిస్టర్ నరోత్తం మిశ్రా.. కొందరు సహాయక సిబ్బందితో కలిసి పడవలో కోట్రా గ్రామానికి బయల్దేరారు. ఇంతలో ఉన్నటుండి ఓ చెట్టు పడవ మీద పడటంతో అది అక్కడే చిక్కుకుపోయింది.. ముందుకు కదలేదు. పరిస్థితి గురించి నరోత్తాం మిశ్రా ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ని రంగంలోకి దింపారు. తాళ్ల సాయంతో ఆయనను పైకి లాగారు. అనంతరం వరదల్లో చిక్కుకున్న మరో తొమ్మిది మంది గ్రామస్తులను కూడా కాపాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
వరదల్లో చిక్కుకున్న హోం మంత్రి.. తాడు కట్టి పైకి లాగారు
-
ఐఏఎఫ్ హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
చండీగఢ్ : భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాఫ్టర్ శుక్రవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండయింది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన ఐఏఎఫ్ హెలికాఫ్టర్ సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందని అధికారులు వెల్లడించారు. హెలికాఫ్టర్ కంట్రోల్ ప్యానెల్స్‌లో హెచ్చరిక సంకేతాలు రావడంతో ముందుజాగ్రత్త చర్యగా హోషియార్పూర్ గ్రామంలో ల్యాండయిందని భారత వైమానిక దళం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనలో పైలట్లు, ఇతర సిబ్బంది క్షేమంగా బయటపడ్డారని ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఎయిర్‌ఫోర్స్ వర్గాలు పేర్కొన్నాయి. హెలికాఫ్టర్‌ను పరిశీలించిన అనంతరం దాన్ని తిరిగి ఎయిర్‌బేస్‌కు తరలిస్తామని ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. కాగా వైమానిక దళానికి చెందిన చీతా హెలికాఫ్టర్ సైతం గురువారం ఘజియాబాద్ ఎయిర్‌బేస్ నుంచి చండీగఢ్ వెళుతూ సాంకేతిక సమస్యలతో ఇదే ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. చదవండి : కూలిన విమానం; రెండు ఐఏఎఫ్ హెలికాప్టర్లతో...