చండీగఢ్ : భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాఫ్టర్ శుక్రవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని హోషియార్పూర్‌లో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండయింది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన ఐఏఎఫ్ హెలికాఫ్టర్ సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందని అధికారులు వెల్లడించారు. హెలికాఫ్టర్ కంట్రోల్ ప్యానెల్స్‌లో హెచ్చరిక సంకేతాలు రావడంతో ముందుజాగ్రత్త చర్యగా హోషియార్పూర్ గ్రామంలో ల్యాండయిందని భారత వైమానిక దళం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ ఘటనలో పైలట్లు, ఇతర సిబ్బంది క్షేమంగా బయటపడ్డారని ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఎయిర్‌ఫోర్స్ వర్గాలు పేర్కొన్నాయి. హెలికాఫ్టర్‌ను పరిశీలించిన అనంతరం దాన్ని తిరిగి ఎయిర్‌బేస్‌కు తరలిస్తామని ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. కాగా వైమానిక దళానికి చెందిన చీతా హెలికాఫ్టర్ సైతం గురువారం ఘజియాబాద్ ఎయిర్‌బేస్ నుంచి చండీగఢ్ వెళుతూ సాంకేతిక సమస్యలతో ఇదే ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment