
లండన్ నుంచి ముంబై వెళ్తున్న ‘వర్జిన్ అట్లాంటిక్’ విమానం తుర్కియేలోని దియార్‌బాకిర్ ఎయిర్‌పోర్ట్ (డీఐవై)లో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ల్యాండ్ అయ్యే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
తుర్కియేలో ఒక మారుమూల విమానాశ్రయంలో బుధవారం రాత్రి నుంచి 200 మందికి పైగా భారత ప్రయాణికులు 16 గంటలకుపైగా చిక్కుకుపోయినట్లు సమాచారం. ప్రయాణికులు తిరిగి వారు ఎప్పుడు గమ్యస్థానం చేరతారనే దానిపై విమానయాన సంస్థ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు గురవుతున్నారు. వీలైనంత త్వరగా రవాణా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ప్రయాణికులు కోరారు.