Airplane
-
ప్రయాణించకుండానే విమానంలో నిద్రపోవచ్చు..!
భూమి నుంచి దూరంగా వెళ్లకుండా విమానంలో స్పెండ్ చేయడం గురించి విన్నారా..?. ఆ ఆలోచనే వెరైటీగా ఉంది కదూ..!. అలాంటి కోరిక ఉంటే వెంటనే ఉత్తర అమెరికాలో అలాస్కాకి వచ్చేయండి. శీతాకాలపు మంచు అందాల తోపాటు విమానంలో గడిపే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి అదేంటో తెలుసుకుందామా..!ఆ వీడియోలో 1950ల నాటి విమానం(Airplane) వింటేజ్ డీసీ-6 విమానం విలక్షణమైన విమానహౌస్(Airplane House)గా రూపాంతరం చెందింది. ఇది ఒకప్పుడూ మారుమూల అలాస్కా(Alaska) గ్రామాలకు ఇంధనం, సామాగ్రిని సరఫరా చేసేది. ఇందులో రెండు బెడ్ రూమ్‌లు, ఒక బాత్రూమ్తో కూడిన వెకేషనల్ రెంటల్ హౌస్‌గా మార్చారు. చుట్టూ మంచుతో కప్పబడి ఉండే ప్రకృతి దృశ్యం మధ్యలో ప్రత్యేకమైన విమాన ఇల్లులో అందమైన అనుభూతి.ఇలా సర్వీస్ అయిపోయిన విమానాలను అందమైన టూరిస్ట్ రెంటల్ హౌస్‌లుగా తీర్చిదిద్ది పర్యాటకాన్ని ప్రోత్సహించొచ్చు అనే ఐడియా బాగుంది కదూ..!. చూడటానికి ఇది ప్రయాణించకుండానే విమానంలో గడిపే ఓ గొప్ప అనుభూతిని పర్యాటకులకు అందిస్తోంది. చెప్పాలంటే భూమి నుంచి దూరంగా వెళ్లకుండానే విమానంలో గడిపే ఫీలింగ్ ఇది. అయితే ఈ వీడియోని వీక్షించిన నెటిజన్లు వావ్ చాలా బాగుందని ఒకరూ, లోపల ఎలా ఉంటుందో చూడాలని యాంగ్జైటీగా ఉందని మరొకరూ పోస్టులు పెట్టారు. కాగా, ఈ ప్రత్యేకమైన విమాన ఇంటిలో బస చేయాలంటే ఒక్క రాత్రికి సుమారు రూ. 30 వేలు పైనే ఖర్చువుతుందట. View this post on Instagram A post shared by DEBORAH + TYLER | Alaska Adventures (@raarupadventures) (చదవండి: భారతదేశపు తొలి స్టంట్ విమెన్..ధైర్యానికి కేరాఫ్ అడ్రస్..!) -
ఫుడ్ ప్యాక్‌లో ఎలుక
అవున్నిజమే! విమానంలో ఎలుక కనిపించింది. అంది కూడా ఓ ప్రయాణికురాలికి అందించిన ఫుడ్ పార్సిల్లో. ఆమె పార్సిల్ తెరవగానే ఎలుక అమాంతం బయటికి దూకి సీట్ల కింద దూరింది! దాంతో విమానంలో కలకలం రేగింది. నార్వే రాజధాని ఓస్లో నుంచి స్పెయిన్‌లోని మలగాకు వెళ్తున్న స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో జరిగిందీ ఘటన. ఆ దెబ్బకు విమానాన్ని అత్యవసరంగా కోపెన్‌హాగన్‌లో దించారు. ప్రయాణికులను వేరే విమానంలో మలగాకు పంపించారు. విమానాల్లోని ఎలకి్ట్రకల్ వైరింగ్ తదితరాలను ఎలుకలు కొరికాయంటే అంతే సంగతులు. అందుకే అవి విమానంలోకి రాకుండా ఎయిర్‌లైన్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి! అలాంటిది ఏకంగా ఫుడ్ పార్సల్లోనే బతికున్న ఎలుక రావడాన్ని ఎయిర్‌లైన్స్ సంస్థ సీరియస్‌గా తీసుకుంది. ఆహార పంపిణీ సంస్థను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టింది. ప్రయాణికులను క్షమాపణ కోరింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పుకొచ్చింది. ఇటీవల దక్షిణ ఇంగ్లాండ్‌లో రెండు ఉడతలు రైలెక్కడంతో చివరకు ఆ సరీ్వసును రద్దు చేయాల్సి వచి్చంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
విమానం బాత్రూంలో చిన్నారి..
విమానంలో నాన్‌స్టాప్‌గా ఏడుస్తూ డిస్టర్బ్ చేస్తోందని ఇద్దరు ప్రబుద్ధులు ఓ చిన్నారిని ఏకంగా తమతో పాటుగా బాత్రూంలోకి తీసుకెళ్లి తాళం పెట్టేశారు. ఏడుపు మానాక గానీ బయటికి తీసుకురాలేదు. చైనాలో గుయాంగ్ నుంచి షాంఘై వెళ్తున్న విమానంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. తాతయ్య, నానమ్మలతో పాటు ప్రయాణిస్తున్న ఏడాది వయసున్న పాప విమానం బయల్దేరినప్పటి నుంచీ ఆపకుండా ఏడుపందుకుంది. దాంతో చిర్రెత్తుకొచ్చిన తోటి ప్రయాణికులైన ఇద్దరు మహిళలు తాము ఏడుపు ఆపుతామంటూ పాపను తీసుకుని ఏకంగా బాత్రూంలో దూరి గొళ్లెం పెట్టుకున్నారు. ఒకరు టాయ్‌లెట్ సీటుపై కూచుని ఏడుపు ఆపుతావా లేదా అంటూ గద్దిస్తుంటే ఇంకొకరు తీరిగ్గా వీడియో తీశారు. ఏడుపాపితే గానీ తాత, నానమ్మ దగ్గరికి తీసుకెళ్లేది లేదంటూ పాపను బెదిరించారు. చివరికి తను ఊరుకున్నాక కూడా, ఏడిస్తే మళ్లీ బాత్రూంలోకి తెచ్చి పడేస్తామంటూ బెదిరించారు. పైగా తమ ఘనకార్యాన్నంతటినీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహిళల బెదిరింపులు, పాప భయపడిపోయి తలుపు కేసి చేయి చాచడం వంటివి చూసి వాళ్ల తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడటంతో వీడియోను డిలీట్ చేశారు. ఈ ఘటన ఆగస్టు 24న జరిగినట్టు సంబంధిత ఎయిర్‌లైన్స్ వివరించింది. గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారికి ‘పాఠం చెప్పడానికి’ వృద్ధుల అనుమతితో వాళ్లిద్దరూ ఇలా చేసినట్టు ఒక ప్రకటనలో చెప్పుకొచి్చంది. దీనిపై విమర్శలు చెలరేగడంతో క్షమాపణలు చెప్పింది. సదరు ప్రయాణికులను తమ సిబ్బంది కూడా మందలించారని వెల్లడించింది. బహిరంగ ప్రదేశాల్లో పిల్లలను ఎలా చూసుకోవాలన్న దానిపై ఆన్లైన్లో పెద్ద చర్చకు ఈ ఉదంతం దారితీసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విమానంలో స్టాండింగ్
ముంబై: బస్సు, రైల్లో ప్రయాణికులు నిలబడి ప్రయాణించడం చూస్తుంటాం. కానీ విచిత్రంలో విమానంలో ఓ వ్యక్తి నిలబడి వెళ్లేందుకు సిద్దపడ్డాడు. ఈ ఘటన ముంబై నుంచి వారణాసి వెళ్లే ఫ్లైట్‌లో మంగళవారం జరిగింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో ప్లైట్ టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నపుడు ఓ ప్రయాణికుడు నిలబడి ఉండటం చూసిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని దింపేశారు. ఆ ప్రయాణికుడు ఇండిగో ఉద్యోగి. సిబ్బంది ఎయిర్‌లైన్ టికెట్లను తగ్గించడంలో భాగంగా కలిగించే ప్రయోజనం స్టాఫ్ లీజర్ ట్రావెల్లో భాగంగా ప్రయాణిస్తున్నాడు. (సిబ్బందికి ఇలా ప్రయాణించే అవకాశం ఉంటుంది) టేకాఫ్‌కు ముందు తనిఖీ చేయగా.. ఇండిగో ఫ్లైట్‌లో రావాల్సిన ఓ ప్రయాణికుడు రాలేదనే సమాచారం వచ్చింది. ఆ సీటును స్టాండ్‌బైగా ఇండిగో ఉద్యోగికిచ్చారు. తీరా ఫ్లైట్‌లోకి వెళ్లాక చూస్తే ప్రయాణికుడు ఉన్నాడు. దీంతో ఉద్యోగి నిలబడ్డాడు. అది సిబ్బంది గుర్తించి, నిలిపివేయడంతో టేకాఫ్ ఆలస్యమైంది. అది బోర్డింగ్ ప్రాసెస్ తప్పిదంగా గుర్తించారు. -
కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 65 మంది మృతి
మాస్కో: రష్యా యుద్ధ విమానం కుప్పకూలింది. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం చెందారు. ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని రక్షణ మంత్రిత్వ శాఖను వెల్లడించింది. ప్రమాదానికి కారణాలు ఇంకా సమాచారం లేదు. Video | Russian Military Plane Carrying 65 Ukrainian Prisoners Of War Crashes Read More: https://t.co/87kc55f1PP pic.twitter.com/8gFgajhX5C — NDTV (@ndtv) January 24, 2024 రష్యాకు చెందిన ఇల్యుషిన్ Il-76 సైనిక రవాణా విమానంగా అధికారులు గుర్తించారు. బెల్గోరోడ్ నగరానికి ఈశాన్య ప్రాంతంలో ఈ ఘటన సంభవించిందని స్థానిక గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ మాట్లాడారు. తాను ఆ స్థలాన్ని పరిశీలించబోతున్నానని చెప్పారు. అత్యవసర సహాయ సిబ్బంది ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: 21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి -
హైదరాబాద్‌లో విమానాల ప్రదర్శన.. టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే..
గడిచిన రెండేళ్లలో విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య 26 కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా 2024’ వైమానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. 2047 నాటికి విమానయాన రంగం 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ముంబయి, దిల్లీలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గుర్తిచేశారు. ఉడాన్ పథకం కింద జమ్మూకశ్మీర్‌లో హెలికాప్టర్ ప్రయాణాలు అమలు చేస్తున్నామని చెప్పారు. డ్రోన్లకు డిమాండ్ పెరగడంతో.. మహిళా పైలట్లను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉడాన్ 5.3ను మంత్రి ప్రారంభించారు. సమావేశంలో పలు విమానయాన సంస్థల మధ్య ఒప్పందాలు జరిగాయి. తెలంగాణలో ఎన్నో అవకాశాలు -మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో ఏవియేషన్ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. సులభతర వాణిజ్య విధానం ఇక్కడ అమలవుతోందని చెప్పారు. ఏరో స్పేస్ పెట్టుబడులకు హైదరాబాద్ ఎంతో అనుకూలం. డ్రోన్ పైలట్లకు ఎక్కువగా శిక్షణ ఇచ్చి.. వ్యవసాయం, అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల్లో డ్రోన్లు వినియోగిస్తున్నట్లు వివరించారు. ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఇదే.. వింగ్స్ ఇండియా 2024 సందర్శకులకు 20, 21వ తేదీల్లో అనుమతిస్తారు. భారత వాయుసేనకు చెందిన సారంగ్ బృందం ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు విన్యాసాలు నిర్వహించనుంది. 18న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు, సాయంత్రం 4.15 నుంచి 5 వరకు విన్యాసాలుంటాయి. 19న ఉదయం 11 నుంచి 12 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు, సాయంత్రం 4.15-5 వరకు విన్యాసాలు ఉంటాయి. 20, 21వ తేదీల్లో సందర్శకులను అనుమతించనున్నారు. టికెట్ రూ.750గా నిర్ణయించారు. ‘బుక్‌మైషో’ యాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. మూడేళ్లలోపు పిల్లలకు ఉచితం. 30 అడుగుల దూరంలో బారికేడ్ల నుంచి మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. -
ఫ్లైట్‌లో ఇండియన్ చెస్ స్టార్.. క్యాబిన్ క్రూ వినూత్న అభినందనలు!
భారత చెస్ యువ సంచలనం, ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు అంతటా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ప్రపంచ కప్ ఫైనల్లో ఆడి భారత్‌కు పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చిన ప్రజ్ఞానందకు ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ వినూత్నంగా అభినందనలు తెలిపారు. ఇటీవల ఇండిగో విమానంలో తల్లితో కలిసి ప్రయాణించిన ప్రజ్ఞానందకు విమానంలో ఉన్న క్యాబిన్ సిబ్బంది ఒక నోట్ అందించారు. చెస్ స్టార్ ప్రజ్ఞానంద, అతని తల్లితో కలిసి క్యాబిన్ క్రూ మెంబర్ దిగిన ఫొటోతో పాటు సిబ్బంది స్వయంగా రాసిన అభినందన నోట్ చిత్రాన్ని ఇండిగో సంస్థ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేసింది. భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ మాస్టర్ ప్రజ్ఞానంద తమ ఫ్లైట్‌లో ప్రయాణించడం గౌరవంగా ఉందని, మొట్టమొదటి ప్రపంచ కప్ ఫైనలిస్ట్‌గా నిలిచిన యువ ఛాంపియన్‌కు అభినందనలు అంటూ ప్రశంసించింది. ప్రజ్ఞానందను విమానంలో ఆన్‌బోర్డ్ చేయడం తమకు నిజంగా గౌరవం, సంతోషాన్ని కలిగిస్తోందని, దేశానికి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన అందరికీ స్ఫూర్తి అంటూ క్యాబిన్ క్రూ స్వయంగా రాసి సంతకాలు చేసి ప్రజ్ఞానందకు అందించారు. అజర్బైజాన్లో జరిగిన ఫిడే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన ప్రజ్ఞానంద.. ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌తో తలపడి రన్నరప్‌గా నిలిచారు. దీంతో ప్రజ్ఞానందకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా అభినందించారు. అలాగే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రత్యేకంగా ప్రశంసించి మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని బహుమతిగా అందించారు. ✈️ Taking chess to new heights! 🏆 We were honored to have Indian chess grandmaster Master R Praggnanandhaa on board. Congratulations to the young champion on becoming the first-ever World Cup finalist!#goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/RmwcMjmy3H — IndiGo (@IndiGo6E) August 31, 2023 -
విమానంలో వచ్చి.. చీరల చోరీ
బనశంకరి: విమానంలో వచ్చి బెంగళూరులో దిగుతారు. వస్త్ర దుకాణాల్లో షాపింగ్ పేరుతో ఖరీదైన చీరలను చోరీ చేసి వచ్చిన దారినే వెళతారు. ఇటువంటి ఖతర్నాక్ కిలేడీ ముఠాను ఆదివారం అశోక్‌నగర పోలీసులు అరెస్ట్‌చేశారు. నిందితులు గుంటూరు జిల్లాకు చెందిన రమణి, రత్నాలు, చుక్కమ్మ. వీరు ఏపీ నుంచి విమానంలో బెంగళూరుకు వచ్చి స్కార్పియో కారులో బెంగళూరులో సంచరించేవారు. ఇలా చీరల తస్కరణ చీరల దుకాణాల్లో కొనుగోలు చేసే నెపంతో సిబ్బంది కళ్లుగప్పి విలువైన చీరలను మాయం చేయడంలో ఆరితేరినవారని పోలీసులు తెలిపారు. శ్రీమంతుల తరహాలో ఒంటినిండా బంగారు నగలు ధరించి షాపులకు వెళ్లి లక్షల విలువైన చీరలను చూపించాలని సిబ్బందిని అడిగేవారు. మరిన్ని చీరలను చూపించాలని కోరేవారు, చీరలను తేవడానికి సిబ్బంది షాపు లోపల స్టోర్‌రూమ్‌లోకి వెళ్లిన సమయంలో కిలేడీలు చీరలు బండిల్స్‌ను దాచుకుని అక్కడ నుంచి వెళ్లిపోయేవారు. ఇలా వెళ్తున్న ఓ మహిళ కాలి వద్ద చీర ఉన్నట్లు షాపు సెక్యూరిటీ గమనించి యజమానికి తెలిపాడు, తరువాత సీసీ కెమెరాలు పరిశీలించగా మహిళల లాఘవం వెలుగులోకి వచ్చింది. ఫుటేజీలతో సహా అశోకనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని ఆదివారం లేడీ గ్యాంగ్ ను అరెస్ట్‌చేసిన అశోకనగర పోలీసులు వీరి వద్ద నుంచి రూ.14 లక్షల విలువ చేసే చీరలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. -
వారెవ్వా.. శంషాబాద్ రన్‌వేపై బెలుగా ఎయిర్‌బస్.. అదిరిపోయిందిగా! (ఫొటోలు)
-
అమెరికా అధ్యక్షుడికి అతి పెద్ద కష్టం
కొంతకాలం క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ఎయిర్ ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డారు. ఈ విధంగా మూడుసార్లు పడిపోయారు. తరువాత రెయిలింగ్‌ను పట్టుకుని లేచి విమానంలోకి ఎలాగోలా ఎక్కేశారు. గత నెలలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలోనూ ఇలానే జరిగింది. అయితే బైడెన్ ఇలా పడిపోవడం ఆయకు పలు సమస్యలు తెచ్చిపెడుతోంది. దీనిని నివారించేందుకు ఆయన షార్టర్ స్టెయిర్‌కేస్ వినియోగించడం రెండితలయ్యిందని ఒక నివేదిక వెల్లడించింది. బైడెన్‌కు వైట్ హౌస్ రాయితీలు? దీనిని చూస్తుంటే 80 ఏళ్ల బైడెన్‌కు వైట్ హౌస్ రాయితీలు కల్పిస్తున్నట్లున్నదనే విమర్శలు వస్తున్నాయి. బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో రెండవసారి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటువంటి తడబాటు మరోమారు జరగకుండా వైట్‌హౌస్ అధికారులు జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం. కొలరాడోలోని వైమానిక దళ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు బైడెన్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ప్రవేశించడానికి షార్టర్ స్టెయిర్‌కేస్ మరోమారు ఉపయోగించారు. గత ఏడు వారాల్లో బైడెన్ 84 శాతం మేరకు షార్టర్ స్టెయిర్‌కేస్ వినియోగించారు. బైడెన్ విమానం ఎక్కినప్పుడు, దిగినప్పుడు 37 సార్లు షార్టర్ స్టెయిర్‌కేస్ ఉపయోగించారని నివేదిక పేర్కొంది. ఒక విశ్లేషణ ప్రకారం అధ్యక్షుడు బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్‌లో మరొకసారి స్లిప్ కాకుండా ఉండేందుకు తరచుగా షార్టర్ స్టెయిర్‌కేస్ ఉపయోగిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా.. గత జూన్‌లో జరిగిన వైమానిక దళ అకాడమీ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న బైడెన్ బిడెన్ వేదికపై పడిపోయిన అనంతరం ఆయన షార్టర్ స్టెయిర్‌కేస్ వినియోగించడం మరింత పెరిగింది. గత ఏడు వారాల్లో బైడెన్ 84 శాతం మేరకు షార్టర్ స్టెయిర్‌కేస్‌ను ఉపయోగించారు. కాగా దీనిపై వ్యాఖ్యానించేందుకు వైట్ హౌస్ అధికారులు నిరాకరించారు. అయితే బైడెన్ సహాయకుడొకరు మాట్లాడుతూ ఈ నిర్ణయం పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నదన్నారు. హిల్లరీ క్లింటన్ మద్దతు మాజీ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కూడా 2024లో బైడెన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు అతని వయస్సు ఒక సమస్య అని పేర్కొన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమేనని అన్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకీ అతనే సరైనవాడని భావిస్తున్నానని తెలిపారు. బైడెన్‌కు వ్యతిరేకంగా కానీ ప్రత్యామ్నాయంగా గానీ ముందుకు వెళ్లాలనుకోవడంలేదని, తాను బైడెన్ శిబిరానికి చెందిన వ్యక్తినని హిల్లరీ క్లింటన్ అన్నారు. ఇది కూడా చదవండి: ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగతో ప్రేమలో పడింది -
రష్యాలో ఎయిరిండియా ప్రయాణికుల అగచాట్లు!
ఎయిర్ ఇండియా విమానం రష్యాలోని మగడాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ప్రయాణికులు భాషా సమస్య, విబిన్న ఆహారం, అరకొర వసతి వంటి వాటితో నానా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఢిల్లీకి నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 777లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు. చాలా మంది పిల్లలు, వృద్ధులు ఉన్నారు. వారిని బస్సుల్లో వివిధ ప్రాంతాలకు పంపించారని ప్రయాణికులు చెబుతున్నారు. కొంతమందికి పాఠశాలల్లో వసతి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అక్కడ లభించే విభిన్న ఆహారం తినలేక ఇబ్బంది పడుతుంటే..దీనికి తోడు అక్కడ భాష అస్సలు అర్థం గాక మరింత గందగోళంగా ఉన్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. పిల్లలతో ఉన్న ప్రయాణికులు అరకొర వసతులతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు ఎయిర్ ఇండియా ప్రయాణికుడు మాట్లాడుతూ..తమకు ఓ కళాశాల హాస్టల్లో వసతి కలప్పించారని, లక్కీగా తమకు ఇక్కడ వైఫై అందుబాటులో ఉండటంతో తమ కుటుంబాలతో టచ్‌లో ఉండగలిగామని చెప్పుకొచ్చారు. మరికొంతమంది ఇతర ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఒకే గదిలో 20 మంది నిద్రించాల్సిన దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చిక్కుకుపోయిన ప్రయాణికులను మగడాన్ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు తరలించడానికి ముంబై నుంచి ప్రత్యామ్నాయ విమానాన్ని పంపనున్నట్లు ఎయిర్ ఇండియా బుధవారం ప్రకటించింది. విమానాయన సంస్థ ప్రయాణికులకు కావాల్సిన అన్ని రకాల సహాయసహకారాలను అందిస్తున్నామని, వారందరికీ హాస్టళ్లు, హోటళ్లలో వసతి కల్పించామని పేర్కొంది. కాగా, ఎయిర్ ఇండియా మగడాన్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆ విమానంలో తలెత్తిన సాంకేతిక పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు రష్యా ఏవియేషన్ అథారిటీ ధృవీకరించింది. (చదవండి: ఎయిరిండియా విమానం రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండ్) -
రన్‌వేపై విమానాన్ని ఢీకొన్న పక్షి
యశవంతపుర: ప్రయాణికులందరూ దుబాయ్‌కి వెళ్లడానికి ఉత్సాహంగా సీట్లలో కూర్చుని ఉన్నారు. విమానం రన్‌వేపై వేగంగా ముందుకు సాగుతోంది. ఇంతలో ఏదో తగిలినట్లు పెద్ద శబ్ధం. అందరూ హడలిపోయారు. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానాన్ని పక్షి ఢీకొనడంతో టేకాఫ్ వాయిదా పడింది. మంగళూరు విమానశ్రయం నుంచి దుబాయ్‌కి వెళ్లడానికి గురువారం ఉదయం 8:30 కి విమానం సిద్ధంగా ఉంది. ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధమై రన్ వే మీదకు వచ్చింది. ముందుకు వెళ్తుండగా ఒక పక్షి విమానం రెక్కను ఢీకొని మృత్యువాత పడింది. పెద్ద చప్పుడు రావడంతో పైలట్ టేకాఫ్‌ను నిలిపివేశారు. ప్రయాణికులను కిందకు దించివేసి, విమానానికి ఏమైనా అయ్యిందా అని మెకానిక్‌లు పరిశీలించారు. చివరకు ఆ విమానాన్ని పక్కనపెట్టి బెంగళూరు నుంచి మరో విమానాన్ని రప్పించి అందులో ప్రయాణికులను దుబాయ్‌కి పంపించారు. ఈ సంఘటనతో మంగళూరు విమానశ్రయంలో కొన్ని గంటలపాటు ఆందోళన నెలకొంది. -
ఇళ్లల్లో నివాసం, అబ్బే కిక్కు లేదని.. అందులో ఉంటున్నాడు!
ఇళ్లల్లో నివాసం ఉండటంలో విశేషం ఏముంది? విమానాన్నే నివాసంగా మార్చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాడు ఓ బ్రిటిష్ పెద్దాయన. వెతికి వెతికి ఒక కాలంచెల్లిన బోయింగ్ విమానాన్ని కారుచౌకగా– కేవలం 82 వేల పౌండ్లకు (రూ.81.82 లక్షలు) కొనుగోలు చేసి, దానినే తన నివాసంగా మార్చుకుని ఇటీవల వార్తలకెక్కాడు. బ్రూస్ కాంప్‌బెల్ (73) ఎలక్ట్రికల్ ఇంజినీరుగా పనిచేసేవాడు. ‘విమానాలంటే నాకు చిన్నప్పటి నుంచి తగని పిచ్చి. కాలంచెల్లిన విమానాలు ప్లేన్ బోన్యార్డుల్లో (విమానాల షెడ్లు) పడి ఉండటంపై అడపా దడపా వార్తలు చూసేవాణ్ణి. అలాంటి వాటిలో ఒక విమానాన్ని సొంతం చేసుకోవాలని అనుకునేవాణ్ణి. ఇన్నాళ్లకు ఒక విమానాన్ని సొంతం చేసుకున్నాను. ఇప్పుడు దీనినే నా ఇల్లుగా మార్చుకున్నాను. నివాసం ఉండటానికి ఇది నాకెంతో బాగుంది’ అని కాంప్‌బెల్ మీడియాకు చెప్పాడు. ‘అమెరికా మాజీ అధ్యక్షుడు జె.ఎఫ్.కెన్నెడీ భార్య జాకీ కెన్నెడీని పెళ్లాడిన అరిస్టాటిల్ ఒనాసిస్ ఒకప్పుడు ఉపయోగించిన ‘బోయింగ్–727’ విమానం 1999 నుంచి గ్రీస్‌లో పడి ఉన్నట్లు తెలుసుకుని, దీనిని కొనుగోలు చేశాను’ అని కాంప్‌బెల్ వివరించాడు. విమానం ధర 82 వేల పౌండ్లు అయినా, గ్రీస్ నుంచి తాను నివాసం ఉంటున్న ఓరెగాన్‌కు దీనిని తరలించడానికి 99 వేల పౌండ్లు (రూ.98.83 లక్షలు) ఖర్చు కావడం విశేషం. చదవండి: స్టార్టప్‌లో పెట్టుబడులు.. వ్యాపారంలోనూ దూసుకుపోతున్న బాలీవుడ్ స్టార్లు! -
244 మందితో వెళ్తున్న గోవా విమానంలో బాంబు కలకలం!
అహ్మదాబాద్: మాస్కో నుంచి గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. విమానంలో బాంబు ఉన్నట్లు ఫోన్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోవాకు వెళ్లాల్సిన విమానాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో మొత్తం 244 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదని, బాంబు లేదని తేల్చడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. జామ్‌నగర్ నుంచి గోవాకి 11 గంటలకు విమానం బయలుదేరి వెళ్లనుంది ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపులతో నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) సిబ్బంది విమానం, లగేజ్‌ని తనిఖీలు చేశారు.‘ ఎన్ఎస్జీకి ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. విమానం చాలా పెద్దతి, తనిఖీ చేసేందుకు ఎక్కువ సమయం పట్టింది. అన్ని రకాల అధికారిక కార్యక్రమాలు పూర్తయ్యాక ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్యలో జామ్‌నగర్ నుంచి గోవాకు విమానం బయలుదేరే అవకాశం ఉంది. క్యాబిన్‌లోని మొత్తం లగేజ్‌ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.’ అని జామ్‌నగర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. #WATCH | Visuals from Jamnagar Aiport where Moscow-Goa chartered flight passengers were deboarded after Goa ATC received a bomb threat. As per airport director, Nothing suspicious found. The flight is expected to leave for Goa probably b/w 10:30 am-11 am today.#Gujarat pic.twitter.com/dRBAEucYjy — ANI (@ANI) January 10, 2023 ఇదీ చదవండి: బ్రెజిల్ అల్లర్లు: మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక -
షాకింగ్ ఘటన: విమాన చక్రంలో మనిషి మృతదేహం
గాంబియా నుంచి బ్రిటన్‌కు వెళ్లిన జెట్ విమానంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం వీల్ బేలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. టీయూఐ ఎయిర్వేస్ నడుపుతున్న జెట్ విమానంలో గుర్తు తెలియని ఒక నల్లజాతీయుడు మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. డిసెంబర్5, 2022న గాంబియా రాజధాని బంజుల్ నుంచి లండన్‌లోని గాట్విక్ మిమానాశ్రయానికి విమానం బయలుదేరింది. సరిగ్గా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయినప్పుడే ఈ దిగ్బ్రాంతికర ఘటనను గుర్తించారు అధికారులు. ఈ మేరకు బ్రిటన్ మెట్రో పోలీసులు గాంబియా ప్రభుత్వానికి ఈ సమాచారం అందించారు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా ఒక అపరిచిత వ్యక్తి విమానం వీల్ బేలో మృతి చెంది ఉన్నట్లు తెలిపారు. ఈ మృతదేహాన్ని విమానం నుంచి తొలగించి వర్థింగ్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. గాంబియన్ అధికారులు బ్రిటన్ పోలీసులకు సహకరించడమే కాకుండా మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు యూకే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు మొదటిసారి కాదు. 2019లో ఆమ్స్టర్డామ్లోని పోలీసులు కెన్యా నుండి వచ్చిన కార్గో విమానం ముక్కు చక్రంలో ఒక వ్యక్తి అక్రమంగా ప్రవేశించి మరణించాడు. (చదవండి: కారుతో ఢీకొట్టి చంపినందుకు.. రూ 90 లక్షలు జరిమానా) -
విమానానికి భారీ కుదుపులు..
హొనొలులు: సెలవుల్లో సరదాగా గడపాలని బయలుదేరిన వారికి చేదు అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానం భారీ కుదుపులకు లోనై 36 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అమెరికాలో ఆదివారం చోటుచేసుకుంది. అరిజోనా రాష్ట్రం ఫోనిక్స్ నుంచి హవాయిలోని హొనొలులుకు బయల్దేరిన హవాయి ఎయిర్‌లైన్స్ విమానం అరగంటలో ల్యాండవుతుందనగా భారీ కుదుపులకు లోనైంది. ఆ తాకిడికి ప్రయాణికులు గాల్లోకి ఎగిరిపడ్డారు. పైనున్న లగేజీ క్యాబిన్‌కు గుద్దుకున్నారు. వాటర్ బాటిళ్లు, సెల్ఫోన్లు చెల్లా చెదురుగా పడిపోయాయి. -
ఆర్టీసీ బస్సుకు తగిలిన ‘విమానం’ రెక్క.. పలువురికి గాయాలు
తిరువనంతపురం: రోడ్డుపై వెళ్తున్న బస్సుకు విమానం రెక్క తగిలి ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆకాశంలో వెళ్లే విమానం.. రోడ్డుపై వెళ్తున్న బస్సుకు ఎలా తగిలిందని అనుకుంటున్నారా? అయితే, ఇక్కడ విమానం లేదు. ట్రక్కులో తరలిస్తున్న ఓ పాత విమానం రెక్క.. రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుకు తగిలింది. ఈ సంఘటన కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని బలరామపురంలో బుధవారం రాత్రి జరిగింది. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. విమానం రెక్క తరలిస్తున్న ట్రెయిలర్ ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని రోడ్డుపైనే వదిలేసి పరారయ్యాడు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడంది. దీంతో రహదారిని కొన్ని గంటల పాటు మూసివేశారు అధికారులు. ఇదీ చదవండి: ‘ఈ విచారణలేందుకు.. వీలైతే నేరుగా అరెస్ట్ చేయండి’.. జార్ఖండ్ సీఎం సవాల్ -
ఘోర అగ్ని ప్రమాదం...భవనంపైకి దూసుకెళ్లిన మిలటరీ విమానం
రష్యా మిలటరీ విమానం తొమ్మిది అంతస్తుల భవనంపైకి దూసుకురావడంతో ఒక్కసారిగా అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఈ ఘటన ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న రష్యాలోని యెయిస్క్ ప్రాంతంలో సంభవించింది. ఈ సుఖోయ్-34 విమానం మిలటరీ ఎయిర్‌ఫీల్డ్ నుంచి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది ఒక మీడియం రేంజ్ సూపర్సోనిక్ జెట్ ఫైర్‌బాల్‌గా పేలినట్లు ఆ ప్రాంతీయ గవర్నర్ వెనియామిన్ కొండ్రాటీవ్ తెలిపారు. సుమారు ఐదు అంతస్తుల్లో దాదాపు 2 వేల చదరపు మీటర్లు మంటలు వ్యాపించినట్లు వెల్లడించారు. టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు పైలెట్లు నివేదించినట్లు పేర్కొన్నారు. అందులోని విమాన సిబ్బంది విమానం అపార్టమెంట్ కాంప్లెక్స్ వైపుకి దూసుకొచ్చేలోపు బయటకొచ్చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా 13 మంది మృతి చెందగా, 19 మంది తీవ్రంగా గాయపడ్డారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సమాచారం రష్యా అధ్యక్షుడి పుతిన్‌కి తెలియజేసినట్లు పేర్కొంది. అలాగే మిలటరీ విమానంలో గాయపడ్డవారికి తక్షణ సాయం అందించాలని క్రెమ్లిన్ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. Watch the moment of military #plane #crash at a residential building in #Yeysk , #Russia. pic.twitter.com/TEunPX3KQl — Gaurav Kumar Singh (@GKSinghJourno) October 17, 2022 In the Krasnodar Territory of Russia, a military plane crashed on a residential building in Yeysk. According to preliminary data, the pilot managed to eject. Eyewitnesses report that after the plane crash, a residential building is on fire from the first to the ninth floor. pic.twitter.com/NytFaAB8Up — Ey Villan (@NeutralNews111) October 17, 2022 (చదవండి: ఉక్రెయిన్‌పై ఇరాన్ డ్రోన్ బాంబులు.. 8 మంది మృతి) -
మనోబలం: బామ్మలందరూ కలిసి బాల్యంలోకి వెళ్లొచ్చారు!
‘అదిగదిగో విమానం’ అంటూ ఆకాశాన్ని చూస్తూ పరుగులు తీశారు చిన్నప్పుడు. వృద్ధాప్యంలోకి వచ్చాక పరుగులు తీసే శక్తి లేదు. అయినా ఆ ఉత్సాహం ఎక్కడికీ పోలేదు. ‘ఒక్కసారైనా విమానం ఎక్కలేకపోయామే’ అని నిట్టూర్చేవారు. అయితే అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరకకుండానే వారి చిరకాల కల నెరవేరింది... చిన్నప్పుడు ఆకాశంలో వినిపించీ, వినిపించని శబ్దం చేస్తూ కనిపించే చిట్టి విమానాన్ని చూసి మౌనిక ఎంత ముచ్చటపడేదో! పెద్దయ్యాక ఎలాగైనా విమానం ఎక్కాలని చిన్నారి మౌనిక ఎంతో బలంగా అనుకుంది. అయితే వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ ఆమె కోరిక నెరవేరలేదు. ఆరుబయటకు వచ్చినప్పుడు ఆకాశంలో కనిపించే విమానాన్ని చూస్తూ ‘చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాం’ అని తనలో తాను నవ్వుకునేది మౌనిక. నిజానికి మౌనికలాంటి ‘విమాన కల’ బామ్మలు ఎందరో ఉన్నారు. కోచి(కేరళ)లోని ‘హెల్ప్‌ఏజ్ ఇండియా’ అనే స్వచ్ఛందసంస్థ, కోచి మున్సిపల్ కార్పోరేషన్‌తో కలిసి 27 మంది బామ్మల సుదీర్ఘకాల విమానప్రయాణ కలను నెరవేర్చింది. ఎంతసేపు ప్రయాణించాం, ఎంత దూరం వెళ్లాం అనేది ముఖ్యం కాదు... ఆ అనుభూతి ముఖ్యం! బామ్మలు కోచి నుంచి కన్నూర్‌కు విమానంలో ప్రయాణించి కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. ‘ఇంకో వారంలో రోజుల్లో విమానం ఎక్కబోతున్నాం’ అనే ఆనందం రోజీమేరీ, మారియాలను ఒక దగ్గర ఉండనివ్వలేదు. ఎందరికో ఎన్నోసార్లు చెప్పుకొని మురిసిపోయారు. ‘విమానం ఎక్కడం కాదు... అసలు నేను విమానాశ్రయం అనేది చూడడం ఇదే మొదటిసారి’ నవ్వుతూ అంటుంది 67 సంవత్సరాల రోజీమేరి. ‘చిన్నప్పటి కోరిక నెరవేరిందనే సంతోషంతో నా మనోబలం రెట్టింపు అయింది’ అంటుంది 61 సంవత్సరాల మారియా. ఇక విమానంలో బామ్మల సందడి చూస్తే... వారు విమానం ఎక్కినట్లుగా లేదు. టైమ్‌మిషన్‌లో బాల్యంలోకి వెళ్లినట్లుగా ఉంది. ఏ బామ్మను కదిలించినా.... వారి కళ్లలో... మాటల్లో సంతోషమే సంతోషం! వీరి విషయంలో మాత్రం ‘సంతోషం సగం బలం’ కానే కాదు. సంపూర్ణబలం! కోరిక గట్టిదైతే, ఎప్పుడో ఒకప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది... అనే మాటను విన్నాను. అది నా విషయంలో నిజమైంది. వినేవాళ్లు ఉండాలేగానీ నా విమానప్రయాణం గురించి కొన్ని రోజుల వరకు చెప్పగలను. – మౌనిక (88) -
విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి.. విమానం రెక్కపై నడిచాడు
పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి.. ఎందుకు ఆ పని చేశాడో తెలియదు. కానీ, ఆ నేరానికి అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. ఏకంగా విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి.. విమానం రెక్కపై నడిచాడు. అమెరికాలోని చికాగో విమానాశ్రయంలోకి ఈ ఘటన జరిగింది. రన్‌వే మీద దిగుతున్న విమానం ఎమర్జెన్సీ ద్వారాన్ని తెరిచి రెక్కమీదకు వెళ్లాడు ఆ వ్యక్తి. అతన్ని శాన్ డియాగోకు చెందిన రాండీ ఫ్రాంక్ (57)గా గుర్తించారు.‘‘విమానం రన్‌వేపై దిగి గేటు వద్దకు వస్తుండగా అతను హఠాత్తుగా ఎమర్జెన్సీ డోర్ తెరిచి రెక్కమీదకు వెళ్లాడు. కిందకు జారి ఎయిర్‌ఫీల్డ్ మీదకు దిగాడు’’ అని చికాగో పోలీసులు తెలిపారు. సర్కస్ ఫీట్‌తో రిస్క్ చేఏసిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారణం ఏంటన్నది మాత్రం చెప్పట్లేదు అతను. ఇదిలా ఉంటే.. 2020లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఓ విమానం ల్యాండ్ అయ్యే టైంలో ఓ మహిళ ప్యాసింజర్.. ఉక్కపోస్తోందంటూ ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచి రెక్కల మీదకు వెళ్లి గాలిని పీల్చుకుంది. అయితే ఆమె మద్యం, డ్రగ్స్ మత్తులో అలా చేసిందనుకున్న పోలీసులు పరీక్షలు నిర్వహించగా.. అలాంటిదేం లేదని తేలింది. @fly2ohare guy jumps out of my plane before we get to the gate. @united UA2478 pic.twitter.com/xgxRszkBfH — MaryEllen Eagelston (@MEEagelston) May 5, 2022 -
లగ్జరీ కార్లే టార్గెట్! విమానంలో వస్తాడు... దొంగిలించిన కారులో జారుకుంటాడు
బంజారాహిల్స్: ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో 61 లగ్జరీ కార్లు చోరీ చేశాడు.... నాలుగు సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు... అయినా ప్రవర్తన మార్చుకోకుండా ఈ సారి హైదరాబాద్‌పై కన్నేసిన అతను రెండు నెలల్లో అయిదు లగ్జరీ కార్లు తస్కరించి నగర పోలీసులకు సవాల్‌గా మారాడు. ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు ఇటీవల ఈ సింగిల్ హ్యాండ్ కార్ల దొంగను పట్టుకోవడంతో గుట్టురట్టయింది. అంతర్రాష్ట్ర కార్ల దొంగ సత్యేంద్రసింగ్ షెకావత్‌ను బంజారాహిల్స్ పోలీసులు ఇక్కడ జరిగిన ఓ కారు దొంగతనం కేసులో కస్టడీకి తీసుకున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది జనవరి 26న షెకావత్ బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని పార్క్‌హయాత్ హోటల్లో కన్నడ నిర్మాత మేఘనాథ్ ఫార్చునర్ కారును దొంగిలించి పరారయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే దుండిగల్పోలీ స్ స్టేషన్ పరిధిలో ఒకటి, నాచా రం పీఎస్ పరిధిలో ఒక కారు, పేట్‌బషీరాబాద్ పరిధిలో రెండు కార్లు చోరీ చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరు గుతున్నాడు. ఏడాది వ్యవధిలోనే బెంగళూరు, చెన్నై, గుజరాత్, హైదరాబాద్, తదితర ప్రధాన నగరాల్లో 21 లగ్జరీ కార్లను చోరీ చేశాడు. అతడిని అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు 21 కార్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో హైదరాబాద్‌లో దొంగిలించిన అయిదు కార్లు కూడా ఉన్నాయి. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన డివైస్‌ను ఉపయోగించి కారు డోర్లు తెరుస్తూ కేబుల్ కనెక్ట్ చేసి ఎంచక్కా వాటిలో దూసుకెళ్లేవాడు. దొంగిలించిన కార్లను తక్కువ ధరకు అమ్మేస్తూ జల్సా చేసేవాడు. పార్క్‌హయత్‌లో కారు దొంగతనం చేసేందుకు అతను విమానంలో వచ్చాడు. అలాగే పేట్బషీరాబాద్లో కార్ల చోరీ సమయంలోనూ విమానంలోనే వచ్చిన షెకావత్ లగ్జరీ కార్ కొట్టేసి అందులోనే పరారయ్యాడు. కార్లు దొంగిలించేందుకు కేవలం జేబులో ఓ డివైస్ పెట్టుకొని ఫ్లైట్ ఎక్కి రయ్‌మంటూ వస్తాడు. కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 1, తమిళనాడులో 1, హైదరాబాద్‌లో అయిదు దొంగతనాలు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇప్పటి వరకు మొత్తం 61 కార్లు దొంగిలించి విక్రయించినట్లు తెలిపాడు. (చదవండి: రూ.1,700 కోట్ల హెరాయిన్ పట్టివేత) -
ఏంటీ... విమానంలో ప్రయాణించేటప్పుడు తినడానికి అది తీసుకువెళ్తావా!
-
‘లాక్డౌన్’ ఆ విద్యార్థికి ఒకింత మేలే చేసింది!
చెన్నై : బ్యాటరీతో పనిచేసే విమానాన్ని ప్లస్‌టూ విద్యార్థి రూపొందించి పలువురిని ఆశ్చర్యపరిచాడు. విరుదునగర్ జిల్లా, అమ్మన్‌పట్టికి చెందిన నారాయణస్వామి, సెల్వి దంపతుల కుమారుడు ముత్తుకుమార్ (17) ప్లస్‌టూ విద్యార్థి. తండ్రి నారాయణస్వామి మృతిచెందడంతో సెల్వి కూలి పనులు చేస్తూ ముత్తుకుమార్‌ను కముది హయ్యర్ సెకండరీ పాఠశాలలో చదివిస్తోంది. ముత్తుకుమార్‌కు చిన్ననాటి నుంచే వైజ్ఞానిక ఆవిష్కరణలపై ఆసక్తి ఏర్పడింది. ఒకవైపు పేదరికంతో బాధపడుతున్నా మరోవైపు అన్వేషణలపై ఆసక్తి అతన్ని నిద్రలేకుండా చేసింది. గత ఏడాది మినీ విమానాన్ని తయారుచేయాలనే కోరిక కలిగింది. ఇందుకు కరోనా లాక్డౌన్ దోహదపడింది. ఆన్లైన్ క్లాసులు పూర్తికాగానే తర్వాత మిగిలిన సమయంలో ఇంట్లోని వస్తువులతో ఆరు అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పున మినీ విమానాన్ని రాత్రింబవళ్లు తయారుచేశాడు. ముత్తుకుమార్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే విమానంలో ప్రయాణించాలని ఆశపడ్డానని, పేదరికంతో ఆ కోరిక తీరలేదన్నాడు. మేకలు మేపుతున్న సమయంలో విమానాన్ని తయారు చేయాలనే ఆలోచన కల్గిందని, పది నెలలకు పైగా విమానం రూపొందించినట్లు తెలిపాడు. కొన్ని వస్తువులు ఆన్లైన్లో ఆర్డర్ చేశానని, త్వరలో అవి రాగానే విమానాన్ని నడుపుతానన్నాడు. ప్రభుత్వం సహకరిస్తే భవిష్యత్‌లో పెద్ద విమానాలు తయారుచేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. -
గర్భవతని తెలియదు.. విమానంలో గాల్లో ఉండగానే డెలివరీ
హవాయి(అమెరికా): కొన్ని సంఘటనల గురించి చదివినప్పుడు, విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇలా ఎలా జరుగుతుంది అనే అనుమానం కలుగుతుంది. వైద్యులు కూడా చాలా అరుదైన సంఘటన అంటారే తప్ప ఎలా సాధ్యమయ్యిందో వారు కూడా వివరించలేరు. ఇలాంటి అరుదైన సంఘటనకు సంబంధించిన వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చదివిన వారందరి మదిలే మెదిలే ప్రశ్న ఒక్కటే.. ఇదేలా సాధ్యం. ఇంతకు అదేంటో తెలియాలంటే.. ఇది చదవాల్సిందే.. లావినియా మౌంగా అనే వివాహిత గత వారం తన కుటుంబంతో కలిసి హవాయికి వెళుతుండగా అకస్మాత్తుగా ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. బాధతో మెలికలు తిరిగింది. అంతసేపు బాగానే ఉన్న లావినియా ఇంత అకస్మాత్తుగా అస్వస్థతకు ఎలా గురయ్యిందో తెలియక కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఆమె అదృష్టం కొద్ది అదే విమానంలో ముగ్గురు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నర్సులు, అలాగే వైద్యుడి సహాయకుడు, ఫ్యామిలీ మెడిసిన్ డాక్టర్ ఉన్నారు. లావినాయ బాధ గమనించిన వారంతా ఆమె గర్భవతి అని.. పురిటి నొప్పులతో బాధపడుతుందని గ్రహించారు. వెంటనే ఆమెను విమానంలోని బాత్రూంకి తీసుకెళ్లి డెలివరీ చేశారు. అలా విమానం గాల్లో ఉండగానే లావినియా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక డెలివరీ తర్వాత అందరిలో ఒకటే అనుమానం. సాధారణంగా గర్భవతులను విమానయానం చేయడానికి అనుమతించరు. అలాంటిది లావినియా ఆరు గంటల పాటు విమనంలో ప్రయాణించడానికి అధికారులు ఎలా అంగీకరించారు అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇక లావినియా తల్లిదండ్రులు చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు తమ బిడ్డ గర్భవతి అని తమకే కాదు.. లావినియాకు కూడా తెలియదన్నారు. అసలు ఆమెలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని.. నెలలు నిండుతున్న కొద్ది ఉదర భాగం పెద్దదవ్వడం కూడా జరగలేదన్నారు. వారి సమాధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక విమనాంలోని కొందరు ప్రయాణికులు తల్లి ముఖం కనిపించకుండా.. బిడ్డ ఏడుస్తున్న వీడియో తీశారు. కొద్ది క్షణాల క్రితం విమానంలో బిడ్డ జన్మించింది అని తెలిపారు. ఆ వెంటనే కొందరు శుభాకాంక్షలు తెలపడం.. చప్పట్లు కొడుతున్న శబ్దం వీడియోలో వినిపించింది. ఇక క్యాబిన్ క్రూ మానేజర్ కొద్ది క్షణాల క్రితమే విమానంలో ఓ బిడ్డ జన్మించింది. ఆ తల్లికి శుభాకాంక్షలు అని అరవడం కూడా వీడియోలో వినిపిస్తుంది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత లావినియా శనివారం తన ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసింది. ‘‘అత్యుత్తమంగా ఆశీర్వదించబడ్డాను’’ అంటూ ట్వీట్ చేసింది. విమానంలో సురక్షితంగా డెలివరీ జరిగిన తరువాత ఆమె తన బిడ్డకు రేమండ్ కైమనా వాడే కోబ్ లవాకి మౌంగా అని పేరు పెట్టింది. విమానం దిగిని వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న లావినియా తండ్రి దీన్నోక అద్భుతంగా వర్ణించాడు. ‘‘ఈ బిడ్డ జననం మమ్మల్నిద్దరిని షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం మేం పిల్లలు వద్దునుకున్నాం. అందువల్ల నా భార్య గర్భవతి అని నాకే కాదు తనకు కూడా తెలియదు’’ అన్నాడు లావినియా భర్త. చదవండి: వైరల్: గాలి ద్వారా గర్భం.. గంటలోనే ప్రసవం! -
వైరల్: కారు, బైక్ కాదు.. ఇంటింటికీ విమానాలే!
వాషింగ్టన్: మీకు ఎప్పుడైనా అనిపించిందా..! ఒక సొంత విమానం ఉంటే బాగుంటుంది అని. అలా ఎప్పుడైనా ఆలోచించారా. ఊరుకోండి మాస్టారు.. విమానంలో ప్రయాణించడమే గొప్ప ఇంకా సొంత విమానమే! అని మనసులో తిట్టుకుంటున్నారా. చాలా మందికి సొంత వాహనం ఉండటమే ఒక కల. కొంత మందికి ఆ కల కలగానే ఉండిపోతుంది. మరికొంత మంది అప్పో సోప్పో చేసైనా ఆ కలను నిజం చేసుకుంటారు. ఇంకొంత మంది సొంత వాహనం కొనుగోలు చేసే శక్తి ఉన్నప్పటికీ పార్కింగ్ స్థలం లేక ఉన్న దాంట్లోనే సర్దుకుపోతారు. ఇక సొంత వాహనం లేనివారు సింపుల్‌గా బస్సుల్లోనో, ఆటోల్లోనో ప్రయాణాలు సాగిస్తారు. కానీ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన సియెర్రా ప్రాంతంలో నివసించేవారు అలా కాదు.. వారి ఇళ్ల ముందు విమానాలు పార్క్ చేసి దర్శనమిస్తాయి. ప్రతి ఇంటికి ఒక విమానం ఉండటం విశేషం. ఇక్కడ నివసించేవారందరూ విమాన పైలట్లే. ఇలా సొంతంగా విమానాలు, రన్‌వే కలిగిన ప్రాంతాలను ఎయిర్ పార్క్‌లని అంటారు. అసలు ఇంటింటీకీ విమానాల గోల ఏంటండీ మొదటి ప్రపంచం యుద్ధంతో పోల్చితే రెండో ప్రపంచయుద్ధం ఎంతగానో ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. దీనికి ముఖ్యకారణం యుద్ధరంగంలోనికి విమానాలు ప్రవేశించడం. యుద్ధంలో పాల్గొన్న దేశాలకు ప్రాణ నష్టంతో పాటు, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. విమానాల రాకతో వాటిని సురక్షితంగా భద్రపర్చడానికి తగిన స్థలం అవసరమయ్యేది. ఈ ప్రాంతాలే కాలక్రమేణా ఎయిర్ పార్క్‌లుగా, ఫ్లైయింగ్ కమ్యూనిటీలుగా మారాయి. 1939-1946 మధ్యకాలంలో పైలట్ల సంఖ్య 34,000 నుంచి 4,00,000 కు గణనీయంగా పెరిగింది. మొదటి ఎయిర్‌పార్క్ కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలోని సియెర్రా స్కై పార్క్. ఇది 1946 లో స్థాపించబడింది. ఇక్కడ నివసించే ప్రజలు విమానాలను సాధారణ ప్రయాణానికి ఉపయోగిస్తారు. ఇది ఇక్కడ సర్వసాధారణం. ప్రపంచంలో 630 కి పైగా రెసిడెన్షియల్ ఎయిర్‌పార్క్‌లు ఉన్నాయి. వాటిలో 610 కంటే ఎక్కువ యుఎస్‌లో ఉన్నాయి. కొన్ని ఎయిర్‌పార్క్‌లు, పెద్ద ఫ్లై-ఇన్ కమ్యూనిటీలు.. రెస్టారెంట్లు, షాపులు, క్రీడా సౌకర్యాలు, కంట్రీ క్లబ్‌లను కూడా కలిగి ఉన్నాయి. సియెర్రాలోని ఎయిర్పార్క్లకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. కొసమెరుపు.. మీరు సియెర్రాకు వెళ్లాలంటే కష్టమే. ఎందుకంటే అక్కడ నివసించే పైలట్లకు మీరు బంధువులైన కావాలి, లేదా స్వయంగా పైలట్ అయి ఉండాలి. (చదవండి: అదిరిపోయిన కియా ఎలక్ట్రిక్ కార్ టీజర్) View this post on Instagram A post shared by theCAVUpilot (@thecavupilot)