
ప్రపంచంలోనే అతి పెద్ద విమానం రన్‌వే ఎక్కనుంది. స్ట్రాటోలాంచ్ అని పిలిచే ఈ విమానం ఇటీవలే టెస్ట్ డ్రైవ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అన్ని పరీక్షల్లో విజయవంతమైతే 2019 నుంచి అందుబాటులోకి రానుంది. దీన్ని భూమికి తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి కృత్రిమ ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు ఉపయోగించనున్నారు.
అంతేకాదు వ్యోమగాములను భూమిపైకి తీసుకురావడం, వారికి కావాల్సిన ఆహార పదార్థాలు అందించడం వంటి పనులు కూడా చేసి పెడుతుంది. దీని బరువెంతో తెలుసా.. దాదాపు 2.5 లక్షల కిలోల బరువుంటుంది. ఉన్న ఒక్కో ఇంజిన్ బరువే 4వేల కిలోలు ఉంటుందట. దీని ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఒక్కో రెక్క పొడవు దాదాపు 3.8 మీటర్లు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment