ప్రయాణించకుండానే విమానంలో నిద్రపోవచ్చు..! | A 1950s Airplane You Can Sleep In Goes Viral In Social media | Sakshi
Sakshi News home page

మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!

Published Thu, Jan 9 2025 2:08 PM | Last Updated on Thu, Jan 9 2025 2:24 PM

A 1950s Airplane You Can Sleep In Goes Viral In Social media

భూమి నుంచి దూరంగా వెళ్లకుండా విమానంలో స్పెండ్‌ చేయడం గురించి విన్నారా..?. ఆ ఆలోచనే వెరైటీగా ఉంది కదూ..!. అలాంటి కోరిక ఉంటే వెంటనే ఉత్తర అమెరికాలో అలాస్కాకి వచ్చేయండి. శీతాకాలపు మంచు అందాల తోపాటు విమానంలో గడిపే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మరి అదేంటో తెలుసుకుందామా..!

ఆ వీడియోలో 1950ల నాటి విమానం(Airplane) వింటేజ్‌ డీసీ-6 విమానం విలక్షణమైన విమానహౌస్‌(Airplane House)గా రూపాంతరం చెందింది. ఇది ఒకప్పుడూ మారుమూల అలాస్కా(Alaska) గ్రామాలకు ఇంధనం, సామాగ్రిని సరఫరా చేసేది. ఇందులో రెండు బెడ్‌ రూమ్‌లు, ఒక బాత్రూమ్‌తో కూడిన వెకేషనల్‌ రెంటల్‌ హౌస్‌గా మార్చారు. చుట్టూ మంచుతో కప్పబడి ఉండే ప్రకృతి దృశ్యం మధ్యలో ప్రత్యేకమైన విమాన ఇల్లులో అందమైన అనుభూతి.

ఇలా సర్వీస్‌ అయిపోయిన విమానాలను అందమైన టూరిస్ట్‌ రెంటల్‌ హౌస్‌లుగా తీర్చిదిద్ది పర్యాటకాన్ని ప్రోత్సహించొచ్చు అనే ఐడియా బాగుంది కదూ..!. చూడటానికి ఇది ప్రయాణించకుండానే విమానంలో గడిపే ఓ గొప్ప అనుభూతిని పర్యాటకులకు అందిస్తోంది. చెప్పాలంటే భూమి నుంచి దూరంగా వెళ్లకుండానే విమానంలో గడిపే ఫీలింగ్‌ ఇది. 

అయితే ఈ వీడియోని వీక్షించిన నెటిజన్లు వావ్‌ చాలా బాగుందని ఒకరూ, లోపల ఎలా ఉంటుందో చూడాలని యాంగ్జైటీగా ఉందని మరొకరూ పోస్టులు పెట్టారు. కాగా, ఈ ప్రత్యేకమైన విమాన ఇంటిలో బస చేయాలంటే ఒక్క రాత్రికి సుమారు రూ. 30 వేలు పైనే ఖర్చువుతుందట.

 

(చదవండి: భారతదేశపు తొలి స్టంట్‌ విమెన్‌..ధైర్యానికి కేరాఫ్‌ అడ్రస్‌..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement