Alaska
-
అలాస్కాలో అమెరికా చివరి ఓటరు
ఎటు చూసినా మంచు. గడ్డి తప్పించి నిలబడటానికి ఒక్క చెట్టు కూడా పెరగడానికి అనుకూలంగాకాని మైదాన ప్రాంతాలు. ఎవరికీ పట్టని అమెరికా చిట్టచివరి ప్రాంతంగా మిగిలిపోయిన అలాస్కా గురించి మళ్లీ వార్తలు మొదలయ్యాయి. గత 12 సంవత్సరాల ప్రజాస్వామ్య సంప్రదాయానికి మళ్లీ అక్కడి ఓటర్లు సిద్ధమవడమే ఇందుకు కారణం. అమెరికా పశి్చమ దిశలో చిట్టచివరి పోలింగ్ కేంద్రం ఈ టండ్రా ద్వీపంలోనే ఉంది. అడాక్ ద్వీప ప్రజలు గతంలో మెయిల్ ద్వారా ఓటు పంపించే వారు. 2012 అమెరికా ఎన్నికలప్పుడు మేం కూడా అందరిలా స్వయంగా పోలింగ్‌కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటామని ఉత్సాహం చూపారు. దాంతో అమెరికా ప్రభుత్వం ఇక్కడ తొలిసారిగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి ప్రధాన ఓటర్ల జాబితాలో ఇక్కడి వాళ్లంతా చేరిపోయారు. ‘‘మా నగర వాసులం చిట్టచివర్లో ఓటేస్తాం. ఓటింగ్ సరళిని బట్టి ఆలోపే దాదాపు విజేత ఎవరో తెల్సేవీలుంది. అయినాసరే చివర్లో ఓటేస్తున్నామన్న ఉత్సాహం మాలో రెట్టిస్తుంది. ఆ రోజు మాకందరికీ ప్రత్యేకమైన రోజు. మేం ఓటేసేటప్పటికి అర్ధరాత్రి దాటి సమయం ఒంటిగంట అవుతుంది’’అని సిటీ మేనేజర్ లేటన్ లాకెట్ చెప్పారు. అమెరికా చిట్టచివరి భూభాగం అలాస్కా ప్రాంతం అగ్రరాజ్యానికి ప్రత్యేకమైనది. గతంలో రష్యా అ«దీనంలో ఉండేది. ఎందుకు పనికిరాని భూభాగంగా భావించి చాన్నాళ్ల క్రితం అమెరికాకు అమ్మేసింది. ఇటీవలికాలంలో ఇక్కడ చమురు నిక్షేపాలు బయటపడటంతో ఈ ప్రాంతమంతా ఇప్పుడు బంగారంతో సమానం. అత్యంత విలువైన సహజవనరులతో అలరారుతోంది. చిట్టచివరి పోలింగ్ కేంద్రాలున్న అడాక్ ద్వీపం నిజానికి అలేటియన్ ద్వీపాల సముదాయంలో ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలో భాగమైన బేరింగ్ నది ఈ ద్వీపసముదాయాలకు ఉత్తరదిశలో ఉంటుంది. దక్షిణ దిశలో పసిఫిక్ మహాసముద్ర ఉత్తరప్రాంతం ఉంటుంది. అమెరికా ఈ ద్వీపాన్ని రెండో ప్రపంచ యుద్ధంలో స్థావరంలా ఉపయోగించుకుంది. తర్వాత నేవీ స్థావరంగా అభివృద్ధిచేసింది. ‘‘ఇక్కడ చివరిగా ఓటేసింది నేనే. 2012లో మిట్ రోమ్మీపై బరాక్ ఒబామా బరిలోకి దిగి గెలిచిన విషయం మాకు మరుసటి రోజు ఉదయంగానీ తెలీలేదు’అని 73 ఏళ్ల మేరీ నెల్సన్ చెప్పారు. గతంలో అక్కడ పోలింగ్ సిబ్బందిగా పనిచేసిన ఆమె ప్రస్తుతం వాషింగ్టన్ రాష్ట్రానికి మారారు. అలాస్కా ఆవల ఉన్న గ్వామ్, మేరియానా ద్వీపాలు, అమెరికన్ సమోవా వంటి ద్వీపాల్లో ప్రజలు ఉన్నా వారిని ఓటర్లుగా గుర్తించట్లేరు. దీంతో చివరి ఓటర్లుగా అలాస్కా ఓటర్లు చరిత్రలో నిలిచిపోయారు. రెండో ప్రపంచయుద్ధ స్థావరం ఎక్కువ రోజులు మంచును చవిచూసే అలాస్కా గతంలో యుద్ధాన్ని చవిచూసింది. రెండో ప్రపంచయుద్దకాలంలో జపాన్ అ«దీనంలోని అటూ ద్వీపాన్ని ఆక్రమించేందుకు అమెరికా తన సేనలను ఇక్కడికి పంపింది. 1942 ఆగస్ట్‌లో సేనలు ఇక్కడికొచ్చి సైనిక శిబిరాల నిర్మాణం మొదలెట్టాయి. దీంతో శత్రుదేశ విమానాలు ఇక్కడ 9 భారీ బాంబులను జారవిడిచాయి. 1943 మేలో 27,000 మంది అమెరికా సైనికులు ఇక్కడికి చేరుకున్నారు. మెషీన్ గన్లమోతలతో ఈ ప్రాంతం దద్దరిల్లింది. ఈ ప్రాంతంపై మక్కువతో రచయితలు డాషిల్ హామెట్, గోరే విడల్ కొన్నాళ్లు ఇక్కడే ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్డ్, బాక్సింగ్ ఛాంపియన్ జో లెవీస్, పలువురు హాలీవుడ్ తారలు తరచూ ఇక్కడికి వచి్చపోతుంటారు. 33 వృక్షాల జాతీయవనం ! అలాస్కాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు భారీ వృక్షాల ఎదుగుదలకు సరిపడవు. దీంతో ఇక్కడ గడ్డి, చిన్న మొక్కలు తప్పితే వృక్షాలు ఎదగవు. ఇక్కడ చెట్లు పెంచి అడవిని సృష్టించాలని అమెరికా ప్రభుత్వం 1943–45కాలంలో ఒక ప్రయత్నంచేసింది. చివరికి చేసేదిలేక చేతులెత్తేసింది. అప్పటి ప్రయత్నానికి గుర్తుగా 1960లలో అక్కడి 33 చెట్ల ముందు ఒక బోర్డ్ తగిలించింది. ‘‘మీరిప్పుడు అడాక్ జాతీయ వనంలోకి వచ్చి వెళ్తున్నారు’అని దానిపై రాసింది. నేవీ బేస్ ఉన్నంతకాలం 6,000 మందిదాకా జనం ఉండేవారు. తర్వాత ఇక్కడ ఉండలేక చాలా మంది వలసవెళ్లారు. 2020 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ కేవలం 171 మంది ఉంటున్నారు. 2024 అనధికార గణాంకాల ప్రకారం ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్నది కేవలం 50 మంది మాత్రమే. కనీసం పది మంది విద్యార్థులయినా వస్తే స్కూలు నడుపుదామని నిర్ణయించుకున్నారు. ఎలాగోలా గత ఏడాది ఆరుగురు విద్యార్థులతో స్కూలు మొదలుపెట్టారు. తీరా గత ఏడాది నవంబర్‌కు వచ్చేసరికి ఐదుగురు మానేశారు. ఇప్పుడు అక్కడ ఒకే విద్యార్థి ఉన్నారని అలేటియన్ రీజియన్ స్కూల్ డిస్ట్రిక్ సూపరింటెండెంట్ మైక్ హన్లీ చెప్పారు. ‘‘జనం వెళ్లిపోతున్నారు. చివరికి ఎవరు మిగులుతారో. ఈసారి చివరి ఓటు ఎవరేస్తారో చూడాలి’అని అడాక్ సిటీ క్లర్క్ జేన్ లికనాఫ్ చెప్పారు. – యాంకరేజ్(అమెరికా) -
ప్రపంచాన్ని వణికించిన 10 భూకంపాలు
భూకంపం.. నివారించడం సాధ్యం కాని పెనువిపత్తు. దీనికి జాగ్రత్త, అప్రమత్తత ఒక్కటే పరిష్కారం. ముందస్తుగా సన్నద్ధం కావడం వల్ల భూకంపాలు వంటి విపత్తుల వల్ల కలిగే వినాశనం నుంచి కొంత వరకు కాపాడుకోవచ్చు. ఆఫ్రికాలోని మొరాకోలో సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి సంభవించిన విధ్వంసకర భూకంపం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ భూకంపం కారణంగా రెండు వేల మందికి పైగా ప్రజలు మరణించినట్లు నిర్ధారించారు. మొరాకో కంటే ముందుగా ప్రపంచంలోని అనేక దేశాలలో భూకంపాలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఇప్పుడు మనం ప్రపంచంలో సంభవించిన పది భారీ భూకంపాల గురించి తెలుసుకుందాం. 1. ప్రిన్స్ విలియం సౌండ్, అలాస్కా 1964, మార్చి 28న అమెరికాలోని అలాస్కాలో సంభవించిన భూకంప తీవ్రత 9.2గా అంచనా వేశారు. ఆ సమయంలో కెనడా సహా పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో భూమి సుమారు మూడు నిమిషాల పాటు కంపించింది. 250 మందికిపైగా ప్రజలు మరణించగా, వేల మంది గల్లతయ్యారు. 2. వాల్డివియా, చిలీ 1960, మే 22న చిలీలో సంభవించిన భూకంపం 1655 మందిని సమాధి చేసింది. సుమారు మూడు వేల మంది క్షతగాత్రులయ్యారు. భూకంపం కారణంగా దాదాపు రెండు లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. విపత్తు కారణంగా చిలీ సుమారు 550 అమెరికా మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. భూకంప తీవ్రత 9.5గా నమోదైంది. 3. గుజరాత్, భుజ్ 2001లో భారతదేశంలోని గుజరాత్‌లోని భుజ్‌లో సంభవించిన భూకంప తీవ్రత 7.7గా అంచనా వేశారు. ఈ భూకంపం కారణంగా నగరం మొత్తం శిథిలాల కుప్పగా మారిపోయింది. కచ్, భుజ్లలో ముప్పై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భూకంపం కారణంగా 1.5 లక్షల మందికి పైగా ప్రజలు నష్టపోయారు. 4. పాకిస్తాన్, క్వెట్టా 2005, అక్టోబర్ 8న పాకిస్తాన్‌లోని క్వెట్టాలో సంభవించిన భూకంపంలొ 75 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 80 వేల మంది గాయపడ్డారు. ఈ భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. 5. ఇండోనేషియా, సుమత్రా 2012 ఏప్రిల్ 11న ఇండోనేషియాలోని సుమత్రాలో సంభవించిన భూకంప తీవ్రత 8.6గా నమోదైంది. ఈ భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ భూకంపంలో 2,27,898 మంది మరణించారు. 6. జపాన్, ఫుకుషిమా 2011 మార్చి 11న జపాన్‌లోని ఫుకుషిమాలో సంభవించిన భూకంపంలొ 18 వేల మందికి పైగా మరణించారు. ఆ సమయంలో జపాన్ విపత్తులను ఎదుర్కొంటోంది. భూకంపం వచ్చిన వెంటనే జపాన్‌లో సునామీ సంభవించింది, ఇది కొన్ని మిలియన్ల ప్రజలను ప్రభావితం చేసింది. 7. ఫ్రాన్స్, హైతీ 2019 జనవరి 13న ఫ్రాన్స్‌లోని హైతీలో సంభవించిన భూకంప తీవ్రత 7.0గా నమోదయ్యింది. ఈ భూకంపంలో దాదాపు 3 లక్షల 16 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో భూకంపం కారణంగా 80 వేల భవనాలు ధ్వంసమయ్యాయి. 8. నేపాల్ 2015, ఏప్రిల్ 25న సంభవించిన భూకంపం ఎనిమిది వేల మంది ప్రాణాలను బలిగొంది. భూకంప తీవ్రత 8.1గా నమోదయ్యింది. ఈ భూకంప ప్రకంపనలు భారతదేశం, దాని పొరుగు దేశాలలో కూడా కనిపించాయి. 9. దక్షిణ అమెరికా, చిలీ 1060 మే 22న చిలీలో బలమైన భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత 9.5గా నమోదైంది. ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన భూకంపంగా పరిగణిస్తారు. ఈ ఘటనలో సుమారు ఎనిమిది లక్షల మంది మరణించారు. 10. దక్షిణ ఆఫ్రికా, మొరాకో 2023, సెప్టెంబరు 8న ఆఫ్రికాలోని మొరాకోలో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని సమాచారం. అయితే ఈ గణాంకాలు ఇంకా పూర్తిగా స్పష్టం కాలేదు. ఇది కూడా చదవండి: తొలినాళ్లలో మనిషి ఏనుగులను తినేవాడా? -
అలస్కాలో పగిలిన హిమానీనదం.. కేదార్నాథ్ విపత్తును తలపించేలా..
అమెరికాలోని అలస్కాలో ఒక నది ప్రవహిస్తుంటుంది. దాని పేరు మెండెన్‌హాల్. ఇదే పేరుతో హిమానీనదం(అతి పెద్ద మంచు దిబ్బ) ఉంది. ఇది జనెవు నగరానికి సమీపంలో కొండల నడుమ ఉంది. ఇక్కడ ఈ హిమానీనదం కారణంగా ఒక సరస్సు ఏర్పడింది. ఈ సరస్సు గుండా నది ప్రవహిస్తుంటుంది. సరస్సుకు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అడ్డుకట్టు తెగిపోవడంతో నదికి హఠాత్తుగా వరద పోటెత్తింది. ఫలితంగా ఉపద్రవం ముంచుకొచ్చింది. ఇది 2013లో మనదేశంలోని కేదార్‌నాథ్‌లో సంభవించిన విపత్తును తలపించేలా ఉంది. జనెవు నగర డిప్యూటీ సిటీ మేనేజర్ రాబ్ బర్న్ ఈ విపత్తుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. మెండెన్‌హాల్ నదికి అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా పలు రోడ్లు నీట మునిగాయి. రెండు భవనాలు ధ్వంసం అయ్యాయి. పలువురు నిరాశ్రయులయ్యారు. కొందరు వరదల్లో కొట్టుకుపోయారు. పలు భవనాలు ప్రమాదం అంచున ఉన్నాయి. నదీ తీరప్రాంతమంతా కోతకు గురయ్యింది. దీంతో అక్కడ ముప్పు మరింతగా పెరిగింది. నది నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వృక్షాలతో పాటు మట్టికూడా కొట్టుకువస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో ఎమర్జెన్సీ ప్రకటించామని రాబ్ బర్న్ తెలిపారు. కాగా శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఈ హిమానీనదం గురించి పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఈ హిమానీనదం పగిలిపోయే అవకాశాలు ఒక శాతం మాత్రమే ఉన్నాయని చెబుతూవస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఈ విపత్తు సంభవించడం ఆశ్చర్యం కలిగిస్తున్నదన్నారు. ఇది గ్లోబల్ వార్మింగ్ పరిణామాలను సూచిస్తున్నదన్నారు. జనెవుకు చెందిన శామ్ నోలన్ ఈ నది ఒడ్డున ఒక భవనం పడిపోతున్న దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. నదిలోని నీరు ఉధృతంగా రావడానికి తోడు, నదిలోని మట్టి కోతకు గురి కావడంతో భవనం అమాంతం కూలిపోయిందన్నారు. ప్రకృతి ప్రకోపాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన తెలిపారు. ఈ వరదల కారణంగా పలు రోడ్లు తెగిపోయాయి. వంతెనలు కూలిపోయాయి. రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇది కూడా చదవండి: డాక్టర్ vs పేషెంట్.. ఏది న్యాయం? ఏది అన్యాయం? -
గజాలు,ఎకరాల్లో కాదు..కిలోమీటర్లలో భూ కొనుగోళ్లు!
వివిధ దేశాలు, దీవులను కొన్న దేశాలు సాధారణంగా ఎక్కడైనా భూమిని చదరపు అడుగులు, చదరపు గజాలు లేదా ఎకరాల్లో కొంటారని అందరికీ తెలుసు. కానీ కొన్ని దేశాలు ద్వీపాలు లేదా వేరే దేశాలను కొనుగోలు చేశాయని తెలుసా? దాదాపు 20 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌ల్యాండ్‌ను కొనేందుకు అమెరికా పలుమార్లు విఫలయత్నం చేసిందని తెలుసా? అలా దేశాలను లేదా ద్వీపాలను ఇతర దేశాలు కొనాల్సిన అవసరం.. దాని వెనకున్న ఉద్దేశమేంటి? అందుకు ఎంత వెచ్చించాయి. ఇలాంటి వెరైటీ భూకొనుగోళ్లలో కొన్నింటి గురించి క్లుప్తంగా... అలాస్కా ఉత్తర అమెరికా ఖండం ఎగువ భాగాన 17 లక్షల చ.కి.మీ.పైగా విస్తీర్ణం మేర విస్తరించిన ఈ ప్రాంతాన్ని అమెరికా 1867లో రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అప్పటి రష్యన్ చక్రవర్తి కేవలం 72 లక్షల డాలర్లకు ఈ ప్రాంతాన్ని అమ్మేశాడు. అమెరికా కొనుగోలు చేసిన అతిస్వల్పకాలంలోనే అలాస్కాలో అత్యంత విలువైన బంగారు గనులు బయటపడ్డాయి. అంతేకాదు.. ఆపై చమురు నిక్షేపాలతోపాటు అనేక ఖనిజాలు లభించాయి. ఇప్పుడు అలస్కాలో ఏటా 8 కోట్ల టన్నుల చమురును అమెరికా వెలికితీస్తోంది. సింగపూర్ బ్రిటన్ 1819లో సింగపూర్‌ను కొన్నది. ఈస్టిండియా కంపెనీ వాణిజ్య అవసరాల కోసం మలేసియాలోని జోహర్ రాజ్యం నుంచి సింగపూర్‌ను కొనుగోలు చేసింది. దీనికోసం జోహర్ సుల్తాన్ హుస్సైన్షాకు ఏడాదికి 5,000 స్పెయిన్ డాలర్లు అదే రాజ్యానికి సైన్యాధికారి అయిన అబ్దుల్ రహమాన్‌కు 3,000 డాలర్లు ఇచ్చేట్లు బ్రిటన్ ఒప్పందం చేసుకుంది. అయితే రెండో ప్రపంచ యుద్ధం ఫలితంగా బ్రిటన్ సింగపూర్‌ను వదుకోవాల్సి వచ్చింది. తిరిగి మలేసియాలో భాగమైన సింగపూర్ 1965లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఫ్లోరిడా బ్రిటన్ సింగపూర్‌ను కొనుగోలు చేసిన 1819లోనే అక్కడ అమెరికా ఫ్లోరిడాను స్పెయిన్ నుంచి కొన్నది. దీనికోసం అమెరికా కేవలం 50 లక్షల డాలర్లను వెచ్చించింది. 1845లో ఫ్లోరిడా అమెరికా 27వ రాష్ట్రంగా అవతరించింది. ఫిలిప్పైన్స్ సుదీర్ఘ పోరాటం తరువాత స్వాతంత్య్రం సాధించిన ఫిలిప్పైన్స్‌ను ఒకప్పుడు స్పెయిన్ నుంచి అమెరికా కొనుగోలు చేసింది. 1898లో ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా 2 కోట్ల డాలర్లు వెచ్చించి అమెరికా ఫిలిప్పైన్స్‌ను సొంతం చేసుకుంది. గ్వదర్ బలూచిస్తాన్ రాష్ట్రంలో భాగమైన ఈ తీరప్రాంత పట్టణాన్ని పాకిస్తాన్ 1958లో ఒమన్ నుంచి కొనుగోలు చేసింది. దీనికోసం 550 కోట్ల పాకిస్తాన్ రూపాయలను వెచ్చించింది. చైనా బెల్ట్ అండ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా గ్వదర్ పోర్టును పాకిస్తాన్ 2013లో చైనాకు అప్పగించింది. అప్పట్లో ఈ పోర్టు విలువను 4,600 కోట్ల డాలర్లుగా విలువ కట్టారు. వర్జిన్ ఐలాండ్స్ అమెరికా 1917లో డెన్మార్క్ నుంచి వర్జిన్ ఐల్యాండ్స్‌ను కొనుగోలు చేసింది. దీనికోసం 2.5 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని అమెరికా డెన్మార్క్‌కు అప్పగించింది. అప్పట్లోనే 10 కోట్ల డాలర్లతో గ్రీన్‌ల్యాండ్‌ను కూడా కొంటామని అమెరికా ప్రతిపాదించినా డెన్మార్క్ అంగీకరించలేదు. 1867 నుంచి 2019 వరకు అమెరికా పలుమార్లు గ్రీన్‌ల్యాండ్‌ను కొనే ప్రయత్నాలు చేసింది. కానీ గ్రీన్‌ల్యాండ్‌పై సార్వభౌమాధికారంగల డెన్మార్క్ మాత్రం ఈ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వస్తోంది. ఆఖరి కొనుగోలు ప్రపంచంలో ఇతర దేశాలను లేదా ప్రాంతాలను కొనుగోలు చేసే ప్రక్రియ చివరగా సౌదీ అరేబియా ఈజిప్టు మధ్య జరిగింది. 2017లో ఎర్ర సముద్రంలోని రెండు చిన్నదీవులైన టీరన్, సనఫిర్లను సౌదీకి అప్పగించేందుకు ఈజిప్టు అంగీకరించింది. దీనికోసం 2 కోట్ల అమెరికన్ డాలర్లను సాయంగా ఇచ్చేందుకు సౌదీ ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పటికీ ఈజిప్టు పౌరులు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కట్నంగా నాటి బొంబాయి ప్రస్తుత ముంబై ఒకప్పటి బొంబాయిని బ్రిటన్ రాజు చార్లెస్–2 కట్నంగా పొందారు. ప్రస్తుత ముంబైలో ఉన్న అనేక ప్రాంతాలు, ద్వీపాలు అప్పట్లో పోర్చుగీసు రాజ్యం అదీనంలో ఉండేవి. చార్లెస్–2 పోర్చుగీసు యువరాణి కేథరీన్ను పెళ్లి చేసుకున్నందుకు కట్నంగా కింగ్ జాన్–4 బొంబాయిని కట్నంగా రాసిచ్చారు. అప్పట్లో పోర్చుగీసు వాళ్లు బొంబాయిని బోమ్బెహియాగా పిలిచేవారు. తరువాత ఆంగ్లేయులు బాంబేగా మార్చారు. కట్నంగా పొందిన బొంబాయిని చార్లెస్... బ్రిటన్‌కు చెందిన ఈస్టిండియా కంపెనీకి అప్పగించారు. నటోవతు ద్వీపం 2014లో ఫిజికి చెందిన నటోవతు అనే దీవిలో 5,000 ఎకరాలను కిరిబటి రిపబ్లిక్ 87 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. రానున్న రోజుల్లో సముద్ర మట్టాలు పెరిగితే తమ దేశం మునిగిపోతుందని ముందుజాగ్రత్త చర్యగా కిరిబటి తన జనాభా సంరక్షణ కోసం ఈ భూమిని కొనుగోలు చేసింది. అమ్మకానికి మరెన్నో దీవులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మానవరహిత దీవులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మాదిరిగానే దీవుల అమ్మకం, కొనుగోళ్ల కోసం ఏజెంట్లు, ఆన్లైన్ వెబ్సైట్లు కూడా సేవలు అందిస్తున్నాయి. ధనవంతులు వెకేషన్ల కోసం ఇలాంటి దీవుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రదేశాన్ని బట్టి వాటి రేట్లు ఉంటాయి. మధ్య అమెరికాలో కొంత తక్కువగా... యూరప్ కొంత ఎక్కువగా ఈ దీవుల రేట్లు ఉన్నాయి. ప్రైవేట్ ఐలాండ్స్ వంటి ఆన్లైన్ వెబ్సైట్ల ప్రకారం దక్షిణ అమెరికాలో అతితక్కువగా మన కరెన్సీలో రూ. 5 కోట్లుగా ఓ దీవి విలువ ఉంటే యూరప్‌లో రూ. 7 కోట్లకు ఎంచక్కా దీవిని సొంతం చేసుకోవచ్చు. ఎందరో హాలీవుడ్ స్టార్లతోపాటు బాలీవుడ్ స్టార్లు ఇలాంటి దీవులను కొనుగోలు చేశారు. షారుక్‌ఖాన్ దుబాయ్ సమీపంలో 70 కోట్ల డాలర్లకు ఓ దీవిని సొంతం చేసుకోగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పాప్‌సింగర్ మీకా కూడా దీవులు కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు. 30 భద్రత, ఆర్థిక లేదా వాణిజ్య అవసరాల కోసం ఓ దేశం మరో దేశాన్ని మొత్తంగా లేదా కొంత భాగాన్ని కొన్న ఉదంతాలు -
7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
అలస్కాను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. దీంతో యూఎస్‌లోని పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. భూకంప తీవ్రత భూమిలోపల 9.3 కిలోమీటర్ల మేర సంభవించినట్లు పేర్కొన్నారు. అలస్కా ద్వీపకల్పంతో సహా అలూటియన్ దీవులు, కుక్ ఇన్లెట్ ప్రాంతాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. కాగా.. ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం ఇప్పుడే అంచనా వేయలేమని వెల్లడించారు. అలస్కా ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో భాగంగా ఉంది. తరచూ భూకంపాలకు నిలయంగా మారుతోంది. Notable quake, preliminary info: M 7.4 - 106 km S of Sand Point, Alaska https://t.co/ftepDWDKb7 — USGS Earthquakes (@USGS_Quakes) July 16, 2023 అలస్కాలో చివరిసారిగా అత్యధికంగా 1964లో 9.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. అలస్కా ద్వీపకల్పం, యూఎస్ పశ్చిమ తీరం, హవాలీని సునామీ అతలాకుతలం చేసింది. 250 మందికి పైగా ప్రాణనష్టం జరిగింది. ఇదీ చదవండి: America PPP Fraud: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా!
ఏ దేశంలోని రోడ్లయినా వివిధ ప్రాంతాలను కలుపుతాయనే విషయం మనకు తెలిసిందే. వివిధ రోడ్లపై ప్రయాణించడం ద్వారా మనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవచ్చు. అయితే కొన్ని రోడ్లు చిన్నవిగా, మరికొన్ని రోడ్లు పెద్దవిగా ఉండటాన్ని మనం గమనించేవుంటాం. మనదేశంలోని అతిపెద్ద రోడ్డు విషయానికివస్తే అది నేషనల్ హైవే-44. ఇది 3,745 కిలోమీటర్ల దూరం కలిగివుంది. ఇది కన్యాకుమారితో మొదలై శ్రీనర్ వరకూ ఉంటుంది. అయితే ప్రపంచంలో దీనికి మించిన అతిపెద్ద హైవే ఉందని, దానిపై ప్రయాణిస్తే ఏకంగా 14 దేశాలు చుట్టేయచ్చనే సంగతి మీకు తెలుసా? ఉత్తర అమెరికా- దక్షిణ అమెరికాలను కలిపే పాన్ అమెరికా హైవే ప్రపంచంలోనే అతి పెద్ద రహదారి. అలస్కాలో మొదలై అర్జెంటీనా వరకూ ఈ రహదారి కొనసాగుతుంది. రెండు మహా ద్వీపాలను అనుసంధానించే ఈ సింగిల్ రూట్ నిర్మాణానికి 1923లో తొలి అడుగు పడింది. ఈ హైవేను మొత్తం 14 దేశాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ రహదారిలోని 110 కిలోమీటర్ల ఒక భాగం నిర్మాణం ఇప్పటివరకూ పూర్తి కాలేదు. ఈ భాగాన్ని డారియన్ గ్యాప్ అని అంటారు. ఇది పనామా కొలంబియాల మధ్య ఉంది. కాగా ఈ డారియన్ గ్యాప్ ప్రాంతం కిడ్నాప్‌లు, డ్రగ్ ట్రాఫికింగ్, స్మగ్లింగ్ తదితర అక్రమ కార్యకలాపాలకు నిలయంగా మారింది. దీంతో జనం ఈ మార్గాన్ని దాటేందుకు బోటు లేదా ప్లెయిన్ మాధ్యమంలో బైపాస్ చేస్తారు. చదవండి: ఖండాంతరాలు దాటిన ప్రేమ.. భార్య కోసం ఇండియా నుంచి యూరప్‌కు సైకిల్‌పై ఆ 14 దేశాలు ఇవే.. 1. యునైటెడ్ స్టేట్స్ 2.కెనడా 3. మెక్సికో 4. గ్వాటెమాల 5. ఎల్ సల్వడార్ 6.హోండురాస్ 7. నికరాగ్వా 8. కోస్టా రికా 9.పనామా 10.కొలంబియా 11. ఈక్వెడార్ 12. పెరూ 13.చిలీ 14. అర్జెంటీనా ప్రయాణానికి ఎంత సమయం పడుతుందంటే... ఎవరైనా ప్రతీరోజూ సుమారు 500 కిలోమీటర్ల మేరకు ప్రయాణించగలిగితే వారు 60 రోజుల్లో ఈ రహదారి ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. కార్లెస్ సాంటామారియా అనే సైకిలిస్టు ఈ రహదారిని 177 రోజుల్లో చుట్టివచ్చాడు. ఈ నేపధ్యంలో అతని పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. ఈ రహదారి మొత్తం పొడవు 48 వేల కిలోమీటర్లు. The Pan-American highway is the longest highway in the world. This road is about 19.000 miles/30.000km long #nowyouknow #FridayThoughts pic.twitter.com/oRdBTMhFRD — 🇺🇦Evan Kirstel #B2B #TechFluencer (@EvanKirstel) November 6, 2020 -
గడ్డకట్టిన సముద్రం మీదుగా 150 మైళ్ల ప్రయాణం..నెల తర్వాత ఇంటికి..
అలాస్కా: ఏడాది వయస్సు ఆ్రస్టేలియన్ షెపర్డ్ కుక్క పిల్ల పేరు ననుక్. దీని సాహసం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. యజమాని కుటుంబంతోపాటు టూర్‌కెళ్లి తప్పిపోయింది. గడ్డకట్టిన బేరింగ్ సముద్రం మీదుగా 150 మైళ్లు ప్రయాణించింది. మధ్యలో సీల్స్, మంచు ఎలుగుబంట్ల దాడిలో గాయపడింది. చివరికి నెల తర్వాత అలాస్కాలోని గాంబెల్లో యజమాని మాండీ ఇవోర్రిగన్ ఇంటికి చేరుకుంది. మాండీ కుటుంబం గత నెలలో బేరింగ్ జలసంధిలోని సెంట్ లారెన్స్ దీవిలో సవూంగా ప్రాంతానికి వెళ్లింది. అక్కడే మాండీ కుటుంబానికి చెందిన ననుక్, స్టార్‌లైట్ అనే కుక్కలు తప్పిపోయాయి. కొద్ది రోజులకు స్టార్‌లైట్ ఇంటికి చేరుకుంది. కానీ, ననుక్కు దారి దొరకలేదు. సోషల్ మీడియాలో ననుక్ గురించి మాండీ కుటుంబం పోస్టులు పెట్టింది. చివరికి అక్కడికి 150 మైళ్ల దూరంలోని వేల్స్లో ఉన్నట్లు తెలిసింది. విమానయాన సంస్థల సహకారంతో ననుక్ను సొంతూరికి రప్పించారు. శరీరంపై కొద్దిపాటి గాయాలే తప్ప మొత్తమ్మీద ఆరోగ్యంగా ఉన్న ననుక్ను చూసి మాండీ కుటుంబంలోని చిన్నారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అయితే, ననుక్ అంతదూరం ప్రయాణించడం మాత్రం మిస్టరీయేనని కుటుంబీకులు చెబుతున్నారు. చదవండి: ఈకల్లో విషం.. తాకితే మరణం.. రెండు రకాల విషపూరిత పక్షులను గుర్తించిన సైంటిస్టులు -
అమెరికా గగనతలంలో మరో బెలూన్ కలకలం
వాషింగ్టన్: చైనా భారీ నిఘా బెలూన్ను అమెరికా కూల్చేసిన ఘటన మరువకముందే అగ్రరాజ్యంలో మరో గగనతల ఉల్లంఘన ఉదంతం చోటుచేసు కుంది. అలాస్కాలో కారు పరిమాణంలో అత్యంత ఎత్తులో ఎగురుతున్న ఒక వస్తువును కూల్చేశామని వైట్‌హౌస్ తెలిపింది. ‘పౌర విమానాల రాకపోకలకు కాస్తంత విఘాతం కల్గించేదిగా ఉన్న వస్తువును కూల్చేశాం. శిథిలాలను వెతికే పనిలో ఉన్నాం’ అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ ప్యాట్ రైడర్ చెప్పారు. ‘ 40వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న వస్తువును 24 గంటలపాటు నిశితంగా పరిశీలించాక అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలమేరకు యుద్ధవిమానం కూల్చేసింది. అది గడ్డ కట్టిన అమెరికా సముద్రజలాల్లో పడింది’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి కోఆర్డినేటర్ (వ్యూహాత్మక కమ్యూనికేషన్స్) జాన్ కిర్బీ మీడియాతో చెప్పారు. ‘‘ఇటీవల కూల్చేసిన చైనా నిఘా బెలూన్‌కు స్వయం నియంత్రణ, గమన వ్యవస్థ ఉన్నాయి. సున్నిత సైనిక స్థావరాలపై నిఘా పెట్టింది. కానీ ఈ వస్తువు ఏం చేసిందనేది ఇంకా తెలియదు’’ అని ఆయన అన్నారు. -
అలుపెరుగని బాటసారి.. 11 రోజులు నాన్–స్టాప్ జర్నీ.. ప్రపంచ రికార్డు
సిడ్నీ: పొడవైన ముక్కు, పొడవైన కాళ్లతో చూడగానే ఆకట్టుకొనే గాడ్విట్ పక్షి ఒకటి (శాస్త్రీయ నామం లిమోసా ల్యాపోనికా) అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించింది. అమెరికాలోని అలాస్కా నుంచి ఆస్ట్రేలియాకు చెందిన ఈశాన్య టాస్మానియా ద్వీపంలోని అన్సాన్స్ బే వరకూ 11 రోజుల్లో 8,425 మైళ్లు (13,558.72 కిలోమీటర్లు) ప్రయాణించింది. ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా ప్రయాణం సాగించడం గమనార్హం. కేవలం ఐదు నెలల వయసున్న ఈ మగ పక్షి (234684) ఈ నెల 13వ తేదీన అలాస్కా నుంచి బయలుదేరింది. ఓషియానియా, వనౌతు, న్యూ కాలెడోనియా తదితర ద్వీపాల గగనతలం నుంచి ప్రయాణం సాగించింది. ఈ నెల 24వ తేదీన అన్సాన్స్ బే ప్రాంతంలో కాలుమోపింది. సరిగ్గా చెప్పాలంటే 11 రోజుల ఒక గంట సమయంలో అలుపెరుగని తన ప్రయాణాన్ని పూర్తిచేసింది. ఈ పక్షికి సైంటిస్టులు 234684 అనే ఒక నంబర్ ఇచ్చారు. అలాస్కాలో పలు గాడ్విట్ పక్షులకు 5జీ శాటిలైట్ ట్యాగ్లు అమర్చి గాల్లోకి వదిలారు. వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించారు. మిగతా పక్షులకంటే 234684 నంబర్ పక్షి సుదీర్ఘంగా ప్రయాణించినట్లు తేల్చారు. నాన్–స్టాప్‌గా గాల్లో దూసుకెళ్తూ 11 రోజుల ఒక గంటలో టాస్మానియాకు చేరుకుందని న్యూజిలాండ్‌లోని పుకొరోకొరో మిరండా షోర్బర్డ్ సెంటర్ ప్రకటించింది. నీటిపై వాలితే మృత్యువాతే గాడ్విట్ పక్షులు వలసలకు పెట్టింది పేరు. ప్రతిఏటా వేసవిలో టాస్మానియాకు చేరుకుంటాయి. అక్కడ సంతతిని వృద్ధి చేసుకొని యూరప్ దేశాలకు తిరిగి వస్తుంటాయి. 2021లో 4బీబీఆర్‌డబ్ల్యూ అనే గాడ్విట్ మగ పక్షి 8,108 మైళ్లు(13,050 కిలోమీటర్లు) నాన్–స్టాప్‌గా ప్రయాణించింది. ఇప్పటిదాకా ఇదే రికార్డు. ఈ రికార్డును 234684 పక్షి బద్దలుకొట్టింది. ఇది 11 రోజుల ప్రయాణంలో సగంబరువును కోల్పోయి ఉంటుందని టాస్మానియాలోని పక్షి శాస్త్రవేత్త ఎరిక్ వోహ్లర్ చెప్పారు. ఈ రకం పక్షులు నీటిపై వాలలేవని, ఒకవేళ వాలితే చనిపోతాయని తెలిపారు. ఎందుకంటే వాటి కాలి వేళ్లను కలుపుతూ చర్మం ఉండదని వెల్లడించారు. గాట్‌విట్ జాతి పిట్టల్లో ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయి. అవి బార్–టెయిల్డ్ గాడ్విట్, బ్లాక్–టెయిల్డ్ గాడ్విట్, హడ్సోనియన్ గాడ్విట్, మార్బ్ల్డ్ గాడ్విట్. పొడవైన ముక్కును సముద్ర తీరాల్లోని ఇసుకలోకి దూర్చి అక్కడున్న పురుగులు, కీటకాలను తింటాయి. -
అమెరికాలోని ప్రాంతాన్ని ఆక్రమిస్తాం.. రష్యా షాకింగ్ కామెంట్స్!
ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో రష్యా బలగాలు.. ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. కాగా, ఉక్రెయిన్‌లో దాడుల కారణంగా రష్యా, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా.. తాజాగా రష్యా భారీ షాకిచ్చింది. తమపై ఆర్థిక ఆంక్షలను విధిస్తే.. అమెరికాలోని అలాస్కాను తిరిగి స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ ఆక్రమణను కారణంగా చూపించి రష్యాకు చెందిన ఆస్తులను స్తంభింపచేసినా, జప్తు చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా దిగువ సభ స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోదిన్ హెచ్చరించారు. ఇక, రష్యా సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్నప్పుడు 1861 జార్ అలెగ్జాండర్ తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా రష్యాలోని కొంత భూభాగాన్ని అమ్మేశాడు. 1867అక్టోబరు 18లో చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభంలో భాగంగా సోవియట్ యూనియన్‌లోని అలస్కా, అలూటియన్ దీవులను జార్ అలెగ్జాండర్.. 7.2 మిలియన్ డాలర్లకు అమెరికాకు అమ్మేశాడు. ఆ తర్వాత కొద్ది కాలంలో అలస్కాలో రష్యా కాలనీలు సైతం ఉన్నాయి. ఇక, 1881లో జార్ అలెగ్జాండర్ దారుణ హత్యకు గురయ్యాడు. కాగా, అక్టోబరు 18న అమెరికాలో అలాస్కా విలీనమైన కారణంగా ఆ తేదీన అలాస్కా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతుండగా పాశ్చాత్య దేశాలు రష్యపై విధించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పలు దేశాలు రష్యా, అలాగే రష్యన్ బిలియనీర్లకు చెందిన ఆస్తులను జప్తు చేశాయి. దీంతో రష్యా సైతం అమెరికా, ఇతర దేశాలకు చెందిన ప్రముఖులు రష్యాలో అడుగుపెట్టకుండా ఆంక్షలు విధించింది. Kremlin official suggests Russia could one day try to reclaim Alaska from the US https://t.co/TahOMTXDz1 via @Yahoo — Kazimierz (@Dm047Kazimierz) July 8, 2022 ఇది కూడా చదవండి: యుద్ధం ముగించండి.. ససేమిరా అంటున్న రష్యా! -
చంద్రుడిపై నీటికి భూమే ఆధారం
అలాస్కా: చంద్రుడిపై నీటిజాడలను భారతీయ చంద్రయాన్ మిషన్ నిర్ధారించి 14ఏళ్లవుతోంది. చంద్రుడిపై నీటికి భూమే ఆధారమని తాజాగా అలాస్కా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. భూమి ఉపరితల వాతావరణ పొరల నుంచి తప్పించుకున్న హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్లు చంద్రుడిపై చేరి ఉంటాయని, అక్కడ వీటి సంయోగం ద్వారా నీటి అణువులు ఉద్భవించాయని తెలిపారు. చంద్రుడి ఉపరితలం లోపల పల్చని మంచురూపంలో దాదాపు 3,500 క్యూబిక్ కిలోమీటర్ల మేర నీరు వ్యాపించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వివరాలను జర్నల్సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. భూమి మాగ్నటోస్పియర్ పరిధిలోకి చంద్రుడు ప్రతినెలా ఐదురోజులు వస్తాడు. ఆ సమయంలో భూమిపైనుంచి ఆక్సిజన్, హైడ్రోజన్ అయాన్లు భూఆకర్షణను తప్పించుకొని చంద్రుడిపైకి చేరి ఉంటాయని, ఇది లక్షల ఏళ్ల పాటు జరిగిన ప్రక్రియని వివరించారు. తాజా వివరాలు భవిష్యత్ అంతరిక్షయానాలకు ఉపయోగపడతాయని తెలిపారు. -
చుక్కలు చూడాలా? అయితే ఆ హోటల్‌కి వెళ్లాల్సిందే..!
చుక్కలు చూస్తూ విహారయాత్రను ఆనందించాలని అనుకుంటూన్నారా! అయితే, తప్పకుండా ఈ హోటల్‌కు వెళ్లాల్సిందే! సుమారు సముద్ర మట్టానికి సుమారు ఆరువేల అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ హోటల్ రాత్రి వేళల్లోనే కాదు, బస కోసం అయ్యే బిల్లులోనూ పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. అలస్కాలోని డాన్ షెల్డన్ యాంఫిథియేటర్ శిఖరంపై ఉన్న ‘షెల్డన్ షాలెట్’ హోటల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైంది. ఒక జంట మూడురోజులు బస చేయాలంటే రూ. 26 లక్షలు ఖర్చు చేయాలి. కేవలం పదిమందికి మాత్రమే వసతి కల్పిస్తారు. ఇక్కడకు చేరుకోవాలంటే వాయుమార్గం ఒక్కటే దిక్కు. ఇందుకోసం హోటల్ యాజమాన్యం కొన్ని ప్రైవేటు హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. వీటితోపాటు రుచికరమైన ఆహారం, అతిథుల ఆనందం కోసం పర్వతారోహణ, చేపలవేట వంటి పలు వినోద కార్యక్రమాలనూ అందిస్తోంది. (చదవండి: ఇంటికి కాళ్లుంటే.. అది ఎంచక్కా నడుచుకుంటూ వెళుతుంటే..! ) ఓ కల.. నిజానికి.. ఈ నిర్మాణం వెనుక ఓ చిన్న కథ ఉంది. హోటల్ యజమానులైన రాబర్ట్, కేన్ల తల్లిదండ్రులు ప్రశాంతమైన, అద్భుతమైన ఓ యాత్రను కోరుకున్నారు. ఈ విషయం ఆ అన్నదమ్ములకు వారు మరణించిన తర్వాత తెలిసింది. సుమారు దశాబ్దం పాటు శ్రమించి, హోటల్ నిర్మాణానికి అనుమతి పొందారు. చుట్టూ పర్వతాలు, చక్కటి వాతావరణం, ఎటు చూసినా ప్రశాంతత ప్రతిబింబించేలా చేశారు. అలా వారి తల్లిదండ్రులు కోరుకున్న ఆనందాన్ని కొంతమందికైనా పంచే ప్రయత్నమే ఈ ‘షెల్డన్ షాలెట్’. బాగుంది కదూ! మీరు కూడా మీ జోడీతో జాలీగా ఎంజాయ్ చేయాలనుకుంటే రెడీ అయిపోండి..కాకపోతే, కాస్త ఖర్చు అవుతుంది మరి! -
మీరొస్తే కూత.. మేమొస్తే కోత: కబడ్డీ ఆడిన భారత్-అమెరికా సైనికులు
వాషింగ్టన్: భారత్-అమెరికా సైన్యాల మధ్య యుద్ధ్ అభ్యాస్ సంయుక్త విన్యాసాలు అమెరికాలోని అలాస్కాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 15 నుంచి 29వరకు దాదాపు 14 రోజుల పాటు జరగనున్న ఈ సంయుక్త విన్యాసాల్లో మన దేశం ఆర్మీ తరపున 350 మంది జవాన్లు పాల్గొంటుండగా.. అమెరికా నుంచి 300 మంది సైనికులు హాజరవుతున్నారు. అమెరికా బలగాలతో కలిసిపోయేందుకు... భారత సైన్యం వివిధ క్రీడాంశాల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలో శనివారం ఇరు దేశాల సైనికులు కలిసిపోయి.. రెండు జట్లుగా ఏర్పడి కబడ్డీ, ఫుట్‌బాల్, వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నాయి. అమెరికన్ సైన్యం మన కబడ్డీ కూత మోత మోగించగా.. భారత జవాన్లు ఫుట్‌బాల్ పోటీలో గోల్స్ మీద గోల్స్ చేశారు.. ఈ స్నేహపూర్వక క్రీడల్లో రెండు దేశాల సైన్యాలు... నాలుగు మిశ్రమ జట్లుగా ఏర్పడి పోటీ పడి.. క్రీడా స్ఫూర్తిని చాటారు. (చదవండి: మేరా భారత్ మహాన్: భగవద్గీత స్ఫూర్తి.. ఆకాశాన్ని అంటిన కీర్తి) మంచులో సందడి ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు మంచును విసురుకుంటూ ఎంజాయ్ చేశారు.. భారత్-అమెరికా సైన్యాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించారు. ఇరుదేశాల సైన్యం ఒకరినినొకరు అర్థం చేసుకునేందుకు ఈ క్రీడలు బాగా ఉపయోగపడినట్లు సైనికాధికారులు తెలిపారు. భారత్- అమెరికా సైన్యాల మధ్య అతిపెద్ద సైనిక సంయుక్త విన్యాసాలను 17వ సారి నిర్వహిస్తున్నారు. రెండు సైన్యాల మధ్య అవగాహన, పరస్పర సహకారం పెంచడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరగనున్నాయి. భారత్-అమెరికా సైన్యాల 16వ యుద్ధ్ అభ్యాస్ విన్యాసాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని బికానేర్లో జరిగాయి. చదవండి: ఒక మెట్టు కాదు... వంద మెట్లు పైకెదిగాం #WATCH | As part of 'Ice-breaking activities', Indian Army contingent and American contingent participated in friendly matches of Kabaddi, American Football and Volleyball at Joint Base Elmendorf Richardson, Anchorage, Alaska (US) (Video Source: Indian Army) pic.twitter.com/Xe6uM0NigT — ANI (@ANI) October 17, 2021 -
అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
న్యూయార్క్ : అమెరికాలోని అలాస్కాలో బుధవారం భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.2గా నమోదైంది. ఈ నేపథ్యంలో నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్(ఎన్టీడబ్ల్యూసీ) దక్షిణ పెనిసులా, పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేసింది. హవాయ్ రాష్ట్రంలో సునామీ వాచ్ హెచ్చరికలు ఇచ్చింది. గురువారం మధ్యాహ్నం 1.27 గంటల ప్రాంతంలో హవాయ్ గవర్నర్ డేవిడ్ ఐగే ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ఫైనల్ అప్డేట్ : అలాస్కాలో భూకంపం కారణంగా హవాయ్‌కి సునామీ వాచ్ హెచ్చరిక రద్దు చేయడమైంది’’ అని పేర్కొన్నారు. FINAL UPDATE: Tsunami Watch canceled for Hawaii following a magnitude 8.1 earthquake off Alaska earlier tonight. — Governor David Ige (@GovHawaii) July 29, 2021 -
అమెరికా–చైనా మాటల యుద్ధం
వాషింగ్టన్: అమెరికా–చైనాల మధ్య విభేదాలు మరోసారి ప్రస్ఫుటమయ్యాయి. అధ్యక్షుడిగా జో బైడెన్ పగ్గాలు చేపట్టాక అమెరికాలోని అలాస్కాలో రెండు దేశాల మధ్య జరిగిన మొట్టమొదటి భేటీ ఇందుకు వేదికగా మారింది. చైనా చర్యలు నిబంధనల ఆధారంగా కొనసాగుతున్న ప్రపంచ స్థిరతకు భంగకరంగా మారాయని అమెరికా ఆరోపించగా, తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని గట్టిగా ఎదుర్కొంటామని చైనా బదులిచ్చింది. అమెరికా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్, చైనా నుంచి విదేశాంగ శాఖ ఉన్నతాధికారి యాంగ్ జీయిచి, విదేశాంగ మంత్రి వాంగ్ యీ చర్చల్లో పాల్గొన్నారు. చర్చలకు ముందు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ చర్చల్లో తాము ప్రస్తావించబోయే అంశాలు రెండు దేశాలతోపాటు, ప్రపంచానికే కీలకమైనవని అన్నారు. ‘జిన్జియాంగ్, తైవాన్, హాంకాంగ్‌లలో చైనా ప్రభుత్వ చర్యలపై మా ఆందోళనను ఈ చర్చల్లో ప్రస్తావిస్తాం. అలాగే, అమెరికాపై సైబర్ దాడులపైనా చర్చిస్తాం’ అని చెప్పారు. చైనా చర్యలు నిబంధనల ఆధారంగా కొనసాగుతున్న ప్రపంచ స్థిరతకు భంగకరంగా మారాయి. ఇవి అంతర్గత వ్యవహారాలు అనుకునేందుకు వీలు లేదు కాబట్టే, మేం వీటిని చర్చల్లో లేవనెత్తాలని భావిస్తున్నాం’ అని బ్లింకెన్ చెప్పారు. దీనిపై చైనా విదేశీవ్యవహారాల శాఖ ఉన్నతాధికారి యాంగ్ జీయిచి స్పందించారు. ఐక్యరాజ్యసమితి ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను, అంతర్జాతీయ చట్టాలను మాత్రమే అనుసరిస్తామే తప్ప, కేవలం కొన్ని దేశాలు మాత్రమే వాదించే నిబంధనల ఆధారిత అంతర్జాతీయ క్రమతను అనుసరించబోమని తెలిపారు. తమ అంతరంగిక వ్యవహారాల్లో అమెరికా తలదూర్చడాన్ని గతంలో మాదిరిగానే ఇకపైనా గట్టిగా వ్యతిరేకిస్తామన్నారు. -
విమానాలు కుప్పకూలి ఏడుగురు మృతి
అలస్కా: అమెరికాలోని అలస్కాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు విమానాలు ఢీకొని కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. అలాస్కాకు సమీపంగా కెనాయ్ ద్వీపకల్పంలోని సోల్డోట్నా నగరంలో ఉన్న విమానాశ్రయం వద్ద రెండు విమానాలు ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు. వివరాలు.. అలస్కా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేట్ రిపబ్లిక్ సభ్యుడు గ్యారీ నాప్ ఒక విమానంలో ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. మరో విమానంలో దక్షిణ కెరొలిన నుంచి నలుగురు పర్యాటకులు, కాన్సాస్ నుంచి ఒక పర్యాటక గైడ్, సోల్డోట్నా నుంచి ఒక పైలప్ ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. రెండు విమానాలు సోల్డోట్నా నగరంలోని విమానాశ్రయం వద్ద ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ప్రమాదానికి గురైన విమానాల్లో ఒకటి హవిలాండ్ డీహెచ్సీ-2గా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిష్ట్రేషన్(ఎఫ్ఏఏ) గుర్తించింది. అదే విధంగా ఈ ప్రమాదంపై ఎఫ్ఏఏ, జాతీయా రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఘటనలో మృతి చెందిన గ్యారీ నాప్(67) రిపబ్లికన్, స్టేట్ హౌజ్‌లో సభ్యుడుగా కొనసాగుతున్నారు. -
అలస్కాలో తీవ్ర భూకంపం
అలస్కా: అమెరికాలోని అలస్కా దక్షిణతీరంలో సంభవించిన శక్తివంతమైన తీవ్ర భూకంపం తీరప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. దీన్ని ముందు సునామీగా భావించిన జనం భయంతో ఎత్తైన కొండ ప్రాంతాలకు పరుగులు పెట్టారు. అతి తక్కువ జనాభా కలిగిన అలస్కా ద్వీపకల్పంలో ఏర్పడిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.8గా నమోదు అయ్యింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం పెర్రివిల్లేకు ఆగ్నేయ దిశలో తీరం నుంచి సముద్రంలోకి 105 కిలోమీటర్ల దూరంలో 17 మైళ్ళ లోతులో ఈ భూకంపం వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటల 12 నిముషాలకు ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌ఫై ఇంత భారీస్థాయిలో భూకంప తీవ్రత నమోదైనప్పటికీ, భూమి పెద్దగా కంపించినట్టు స్థానిక ప్రజలకు అనిపించలేదని అలస్కా రాష్ట్ర భూకంప పరిశోధకులు మైకేల్ వెస్ట్ చెప్పారు. ఇదిలా ఉండగా, అలస్కాకి 160 కిలోమీటర్ల పరిధిలోని చిన్న పట్టణాల్లో ఉన్న ప్రజలు భూమి తీవ్రంగా కంపించినట్లు భావించారని వెస్ట్ తెలిపారు. ఇంకా 805 కిలోమీటర్ల దూరంగా ఉన్నవాళ్ళు సైతం భూమి స్వల్పంగా కంపించిన విషయాన్ని గ్రహించారని వెస్ట్ చెప్పారు. ఎటువంటి నష్టం వాటిల్లినట్లు వార్తలు రాలేదని కోడియాక్ పోలీసు అధికారులు చెప్పారు. -
అలస్కాలో భూకంపం: సునామీ వార్నింగ్
వాషింగ్టన్: అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 6.12కు సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. దీంతో సునామీ వచ్చే అవకాశం ఉందని అమెరికా జియాలాజికల్ సర్వే హెచ్చరికలు జారీ చేసింది. ఆంకరేజ్కు నైరుతి దిశగా 500 మైళ్లు, పెర్రివిల్లేకు దక్షిణ, ఆగ్నేయ దిశగా 60 మైళ్ల దూరంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. దీంతో ఆ ప్రాంతం నుంచి చుట్టుపక్కల 300 కిలోమీటర్ల మేర సునామీ ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. భూకంపంలో సంభవించిన ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది (మెక్సికోలో భారీ భూకంపం) చదవండి: 7.3 తీవత్రతో భూకంపం, సునామీ హెచ్చరిక -
హెలీకాప్టర్‌తో ‘మ్యాజిక్ బస్సు’ తరలింపు
అలస్కా : అమెరికాలోని దట్టమైన అడవుల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న ‘బస్సు 142’ను హెలీకాప్టర్ సహాయంతో తరలించారు. రియల్ స్టోరీతో తెరకెక్కిన ‘ఇన్ టు ది వైల్డ్’ చిత్రం అంటే సాహసికులు అమితంగా ఇష్టపడతారు. డబ్బుతో పనిలేకుండా కేవలం ప్రకృతితో కలిసి జీవించాలనుకునే వ్యక్తి క్రిస్ మెక్కాండ్లెస్(24). ఆయన సాహస యాత్రకు వెళ్లి 1992లో మరణిస్తాడు. ఇతనికి సంబంధించిన కథే ‘ఇన్ టు ది వైల్డ్’. మెక్కాండ్లెస్ ఆశ్రయం పొందిన బస్సునే మ్యాజిక్ బస్‌గా పిలుస్తారు. అయితే అలస్కా ఆర్మీ నెషనల్ గార్డ్, అలస్కాలోని సహజ వనరుల విభాగం కలిసి జాయింట్ ఆపరేషన్ చేసి, ఈ బస్సును హెలీకాప్టర్ సహాయంతో అక్కడి నుంచి తరలించారు.(గాల్వన్ లోయ మాదే : చైనా) 1940 దశకానికి చెందిన ఫెయిర్‌బ్యాంక్స్ సిటీకి చెందిన ఈ బస్సును సందర్శించడానికి ఎన్నో ప్రమాదకరమైన ప్రాంతాలను దాటుకుని వెళ్లాలి. స్టాంపెడ్ ట్రయల్ మార్గం గుండా హీలీ సమీపంలోని మారుమూల ప్రాంతాల మీదుగా టెక్లానికా నది దాటుకుని ఈ బస్సు ఉన్న చోటుకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమై యాత్ర. 1961లో రోడ్డు నిర్మాణ పనులు చేసే సమయంలో కార్మికులు షెల్టర్ కోసం ఈ బస్సును వాడి అనంతరం అక్కడే వదిలేసివెళ్లారు. అయితే ఒంటరిగా ప్రపంచానికి దూరంగా సొంతంగా బతకాలనుకున్న క్రిస్ మెక్కాండ్లెస్కి ఈ బస్ కనిపిస్తుంది. కొద్దికాలం బస్సులో జీవించి తర్వాత తిరిగి వెళ్లాలనుకుంటాడు. కానీ, ఆ సమయానికి టెక్లానికా నది ఉదృతంగా ప్రవహించడంతో దాటడం కష్టం అవుతుంది. దీంతో తిరిగి బస్సులోకి వస్తాడు. ఇక ఆ బస్సులోనే దాదాపు 113 రోజులు గడిపి అనంతరం చనిపోతాడు. అయితే అతని సాహాస యాత్రలోని ప్రతీ విషయాన్ని తన పుస్తకంలో రాసుకుని, ఫోటోలు తీసి పెట్టేవాడు. అనంతరం అతని అనుభవాల ఆధారంగా జాన్ క్రాకోర్ 1996లో ‘ఇన్ టు ది వైల్డ్’ పుస్తకాన్ని రాశాడు. ఈ కథనే తర్వాత 2007లో చిత్రంగా తెరకెక్కి ప్రపంచం వ్యాప్తంగా మంచి హిట్ అయింది. ఇక కథను తెలుసుకున్న ఎందరో సాహసికులు ఆ బస్సును చూడాలని, ఎంతో ప్రమాదకరమైన యాత్రను చేయాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే కొందరు మృతిచెందగా, మరెందరో గాయాలపాలవుతున్నారు. (కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది) ‘అలస్కా ప్రకృతి అందాలను చూడటానికి వచ్చే వారి భద్రత మాకు ముఖ్యం. బస్సును చూడాలని కొందరు యాత్రికులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వీరిని కాపాడటానికి చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా కొందు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు’ అందుకే బస్సును తరలిస్తున్నామని అలస్కాలోని సహజ వనరుల విభాగం అధికారి ఒకరు తెలిపారు. -
‘భూమిపై గ్రహాంతర జీవి; అదేం కాదు’
అలాస్కా: సముద్రంలో మనుషులకు తెలియని ఎన్నో వింతజీవులు, జలచరాలు తరుచూ కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తాయి. అటువంటి ఓ సముద్ర వింత జీవి అలాస్కాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ద్వీపం దగ్గర ఉన్న సముద్ర తీరంలో దర్శనమిచ్చింది. ఈ వింత సముద్ర జీవికి సంబంధించిన వీడియోను సారా వాసర్ అల్ఫోర్డ్ అనే మహిళ ‘ గ్రహంతర జీవిగా కనిపిస్తున్న కొత్త సముద్రపు జీవి’ అనే ట్యాగ్‌తో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన శరీరాన్ని సాగదీస్తూ, మెలికలు తిప్పుతూ వింతగా కదులుతున్న ఈ అరుదైన సముద్రజీవిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కదులుతున్న సమయంలో జీవి శరీరంలోని రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో.. ‘ఇప్పుడు భూమిపై ఉన్న వింతైన గ్రహాంతర జీవి’ అని కొంతమంది...‘ఇది సముద్రంలోని పగడపు జీవి.. మెలికలు తిరిగే స్టార్ ఫిష్ .. దాన్ని మళ్లీ సముద్రంలో వదిలేయండి’ అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీటిపై స్పందించిన సారా వాసర్.. ‘ఈ సముద్ర జీవి.. స్టార్ ఫిష్ జాతికి చెందిన ‘బాస్కెట్ స్టార్’ అని.. దాన్ని తిరిగి సముద్రంలోకి వదిలేస్తున్నా’ అని సోషల్ మీడియాలో పేర్కొంది. -
మేం బతుకుతామనుకోలేదు..!
అలస్కా: హిమానీ నదుల్లో బోటింగ్ చేస్తే భలే మజాగా ఉంటుంది కదా! మరి ఆ సమయంలో అక్కడే ఉన్న మంచు శిఖరాలు కుప్పకూలిపోయి భయానక వాతావరణం సృష్టిస్తే.. ఏమైనా ఉంటుందా? ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. సరిగ్గా ఇదే సంఘటనను ప్రత్యక్షంగా చూశారు ఇద్దరు వ్యక్తులు. అమెరికాలోని అలస్కాలో యూట్యూబ్ ఛానల్‌ను నడిపే ఇద్దరు వ్యక్తులు శనివారం స్పెన్సర్ హిమానీ నది సమీపంలో సాహసయాత్రకు దిగారు. అయితే అక్కడి మంచు కొండలు ఒక్కసారిగా కుప్పకూలడంతో నదిలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో వారు ప్రయాణిస్తున్న పడవ అతలాకుతలమైంది. అయినప్పటికీ మంచు విస్ఫోటన దృశ్యాల్ని కెమెరాలో బంధిస్తూ దానికి చేరువగా వెళ్లాలని చూశారు. కానీ ప్రకృతి ప్రతాపం చూపించడంతో వారు వెనుదిరగక తప్పలేదు. ఈ వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మేం ఇంకా బతికే ఉండటం మా అదృష్టమంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ సాహస యాత్రలో ఎలాంటి గాయాలు తగలకుండా బయటపడ్డామని వారి అనుభూతిని పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘చావు తప్పి కన్ను లొట్టపోయింది’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. -
గ్రీన్‌ల్యాండ్‌లో మంచు కనుమరుగు కానుందా?
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమ వుతున్న కర్బనవాయువులు ఇదే వేగంతో పెరుగుతుంటే ఈ శతాబ్దం ముగిసేలోపే గ్రీన్‌ల్యాండ్‌లోని 4.5 శాతం మంచుకొండలు కరిగిపోయే ప్రమాదం ఉందని తాజా పరిశోధన వెల్లడించింది. దానితోపాటు సముద్ర మట్టాలు 13 అంగుళాల మేర పెరిగే అవకాశం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. ఉద్గారాలను తగ్గించకపోతే 3000 సంవత్సరం కల్లా గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు పూర్తిగా కరిగే అవకాశం ఉందని అమెరికాలోని అలస్కా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఆండీ ఆష్వాండెన్ తెలిపారు. గ్రీన్‌ల్యాండ్‌లో 6,60,000 చదరపు కిలోమీటర్ల మేర మంచు పరచుకొని ఉంది. ఈ మంచుకొండల కింద ఉన్న ప్రాంతాల పరిస్థితులపై ఆయన అధ్యయనం చేశారు. దాదాపు 500 రకాల విభిన్న పరిస్థితులను అంచనా వేశారు. వీటిని అంచనా వేసే క్రమంలో పెద్ద మంచు పర్వతాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. వాటి నుంచి కరుగుతున్న హిమ శాతాన్ని కలిపి ఈ మేరకు అంచనాలు వేశారు. 1991, 2015 మధ్య సంవత్సరానికి 0.02 శాతం చొప్పున సముద్రమట్టం పెరిగిందని అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు పర్వతాలను కూడా పరిగణలోకి తీసుకొని పరిశోధన చేసిన మొదటి నివేదిక ఇదే కావడం గమనార్హం. నగరాలకు ముంపు తప్పదు... ఇప్పుడు ఉన్న కర్బన ఉద్గార శాతం ఇలాగే కొనసాగితే 3000 సంవత్సరం కల్లా సముద్రమట్టం 24 అడుగులు పెరుగుతుందని హెచ్చరించారు. దీనివల్ల సముద్రపు ఒడ్డున ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలస్, న్యూ ఓర్లాన్స్ వంటి నగరాలు సముద్రంలో మునగడం ఖాయమన్నారు. కర్బన వాయువులు పెరగకుండా జగ్రత్తలు తీసుకుంటే సముద్ర మట్టం కేవలం 6.5 అడుగులు మాత్రమే పెరిగే అవకాశం ఉందన్నారు. -
‘నీ బెస్ట్‌ఫ్రెండ్‌ని చంపు.. 9 మిలియన్ డాలర్లిస్తాను’
వాషింగ్టన్ : డబ్బుకు ఆశపడి స్నేహితురాలిని హత్య చేసిన యువకుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలు.. అలస్కాకు చెందిన డానియెల్ బ్రహ్మెర్(18)కు ఇండియానాకు చెందిన స్కిమిల్లర్(21)తో ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. అయితే స్కిమిల్లర్ తనను తాను టైలర్ అనే ఓ బిలయనీర్‌గా పరిచయం చేసుకున్నాడు. తనకు బాగా డబ్బుందని బ్రహ్మెర్ను నమ్మించాడు. ఈ క్రమంలో వీరిద్దరు తరచుగా ఆన్లైన్ వేదికగా మాట్లాడుకునే వారు. కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ అత్యాచారం, హత్య చేయడం వంటి అంశాల గురించి చర్చించుకున్నారు. దీనిలో భాగంగా స్కిమిల్లర్.. ‘నీ బెస్ట్‌ఫ్రెండ్ ఎవరినైనా చంపి.. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నాకు పంపించు. అలా చేస్తే.. నీకు 9 మిలియన్ డాలర్ల సొమ్ము(రూ. 62,69,89,500 ) చెల్లిస్తాను’ అని చెప్పాడు. డబ్బుకు ఆశపడిన బ్రహ్మెర్ మరో నలుగురు స్నేహితులతో కలిసి ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. తరువాత తన మిత్రబృందంలో మనోవైకల్యంతో బాధపడుతున్న 19 ఏళ్ల సింథియా హాఫ్‌మన్‌ను చంపేందుకు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఈ నెల 2న హాఫ్‌మన్‌ను వాకింగ్ వెళ్దామని చెప్పి బయటకు తీసుకెళ్లారు బ్రహ్మెర్ బృందం. ఆ తర్వాత హాఫ్మన్ నోటికి టేప్ వేసి ఓ నది వద్దకు తీసుకెళ్లి ఆమె తల మీద కాల్చి.. నదిలో తోసేశారు. రెండు రోజుల తర్వాత నదిలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతురాలిని హాఫ్మన్గా గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం దర్యాప్తులో భాగంగా హాఫ్మన్ మృతదేహం దొరికిన ప్రాంతంలో సీసీటీవీ కెమరాలను పరిశీలించగా.. హాఫ్‌మాన్‌తో పాటు బ్రహ్మెర్ మిత్రబృందం కూడా ఉండటం పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో అతన్ని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బ్రహ్మెర్ మొబైల్‌ని పరిశీలించగా దానిలో అతను తుపాకీతో హాఫ్‌మన్‌ను కాల్చడం.. నదిలో తోయడం.. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్కిమిల్లర్కు పంపడం వంటి విషయాలు వెలుగు చూశాయి. దాంతో పోలీసుల బ్రహ్మెర్, స్కిమిల్లర్తో పాటు.. అతని నలుగురు స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోర్టు బ్రహ్మెర్, స్కిమిల్లర్లకు జీవిత ఖైదు విధించింది. -
అలస్కాలో అలజడి
-
విశోక గీతం
విద్యార్థిగా ఇక్కడే చదువుకున్నారు.. న్యాయవాదిగా హైకోర్టుకు వెళ్లినా.. కొన్నాళ్లకే తిరిగొచ్చారు. స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అయినా.. విశాఖనే సొంతూరుగా మార్చుకున్నారు.. తన భవిష్యత్తుకు పునాదులు వేసుకున్నారు. వ్యాపార రంగంపై మక్కువతో అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గోల్డ్‌స్పాట్ శీతలపానీయాల డిస్ట్రిబ్యూటర్‌గా ఆ రంగంలో అడుగుపెట్టి గోల్డ్‌స్పాట్ మూర్తిగా విశాఖ ప్రజలకు చిరపరిచితుడిగా మారిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలోని అలస్కా ప్రాంతంలో దుర్మరణం పాలవ్వడం విశాఖను విషాదంలో నింపింది. 80లలో గీతం కళాశాల స్థాపించి దాన్ని డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లిన ఆయన దానికి అనుబంధం గీతం వైద్య, దంత వైద్య కళాశాలలను కూడా స్థాపించి విద్యాసంస్థల అధినేతగా.. గీతం మూర్తిగా సుప్రసిద్ధులయ్యారు. 1984లో రాజకీయాల్లో ప్రవేశించి రెండుసార్లు విశాఖ ఎంపీగా ఎన్నిక కావడంతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. విశాఖ నగరంతోపాటు ఎదుగుతూ తన సంస్థల ద్వారా కొన్నివేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన మూర్తిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించిందని.. ఆయన ఇక లేరని తెలుసుకొని వేలా ది మంది ఆయన సిబ్బంది, ఆప్తులు, సన్నిహితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన మృతికి సంతాప సూచకంగా గీతం విద్యాసంస్థలను మూసివేసి నివాళులర్పించారు. సాగర్‌నగర్(విశాఖతూర్పు): ఎమ్మెల్సీ ఎంవీ వీఎస్ మూర్తి విశాఖ వాసులకు గీతం మూర్తిగా సుపరిచితులు. ఈనెల 6న కాలిఫోర్ని యాలో గీతం విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు వెళ్లిన మూర్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పొందారు. తాను అభిమానించే గాంధీ జయంతి రోజే అనంత లోకా లకు వెళ్లడం యాదృశ్చికంగా జరిగినా విశేషమని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. మూర్తి ప్రస్థానం ఇలా.. మూర్తి 1938లో తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం ఎస్.మూలపాలెంలో మతుకుమిల్లి పట్టాభిరామయ్య, మాణిక్యాంబ దంపతులకు జన్మించారు. ఆయనకు సోదరి వీరరాఘవమ్మ. భార్య సావిత్రిదేవి, వీరికి కుమారులు రామారావు, లక్ష్మణరావు, కుమార్తె భారతి ఉన్నారు. వీరు ప్రారిశ్రామిక రంగంలో పనిచేస్తున్నారు. సావిత్రిదేవి 2009లో కాలం చేశారు. మూర్తి మనవుడు భరత్‌కు సినీనటుడు బాలకృష్ణ చిన కుమార్తె తేజస్వితో వివాహం చేశారు. మూర్తికి దివంగత లోకసభ స్పీకర్ బాలయోగి, మాజీ ముఖ్య మంత్రులు ఎన్టీఆర్, నాదేండ్ల భాస్కరరావు, ప్రస్తుత ముఖ్య మంత్రి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. విద్యాభ్యాసం సాగిందిలా.. అయినవిల్లి మండలం ఎస్.మూలపాలెంలో మూడో తరగతి వరకు మూర్తి చదివారు. కపిలేశ్వరపురంలో ఎస్ఎస్ఎల్సీ, కాకినాడ పీఆర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో లా చదివారు.డిగ్రీలో ఏయూ నుంచి బంగారు పతకం సాధించారు. ఆర్ధికశాస్త్రంలో పీహెచ్డీ డిగ్రీ పొందారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, అల్లాడి భాస్కరరావు, నల్లా సత్యనారాయణ, పిల్లా సూర్యనారాయణలతో కలిసి లా ప్రాక్టీస్ చేశారు. 1965లో లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ పేరిట వ్యాపారం ప్రారంభించి జిల్లాలోని కాకినాడ, మండపేట, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. 1968లో వైజాగ్ బాట్లింగ్ కంపెనీ స్థాపించారు. (గోల్డ్‌స్పాట్ కంపెనీ) అప్పటి నుంచి గోల్డ్ స్పాట్ మూర్తి గా పేరొచ్చింది. 1971 టెక్నో సంచుల ఫ్యాక్టరీ ప్రా రంభించారు. 1978లో టూత్ఫెస్టు ట్రస్టులో చురు కైన పాత్ర పోషించారు. 1980లో గీతమ్ ఇంజినీరింగ్ కళాశాల స్థాపించారు. 2013లో గీతమ్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. గీతంను ప్రగతి పథాన నడిపించి గోల్డ్‌స్పాట్ నుంచి గీతం మూర్తిగా మారిపోయారు. రాజకీయ వేత్తగా.. 1991, 1999లో వైజాగ్ ఎంపీగా చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఆయన అవార్డు అందుకున్నారు.ఎన్టీఆర్ సమయంలో వుడా చైర్మన్‌గా పనిచేశారు. విస్తరించిన విద్యాసంస్థలు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గీతం వర్సిటీ క్యాంప్‌లను అభివృద్ధి చేసి నైపుణ్యంతో కూడిన అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు అభివృద్ధి పరిచారు. పుస్తక పఠనం, పుస్తకాలంటే మూర్తికి ఎంతో ఇష్టం. ఇది మూర్తిలోని పట్టుదలకు నిదర్శనమని మూర్తి బంధువులు చెబుతున్నారు. మూర్తికి ఇష్టులైన మహాత్మ గాంధీ, మదర్ థెరిస్సా వంటి మహోన్నుతులు అంటే చాలా ఇష్టం. మహాత్మ గాంధీ పేరుతో గీతంలో ఒక స్టడీ సెంటర్ నెలకొల్పి ఆయనపై పరిశోధన అంశాలను నెలక్పొడం విశేషం. మూర్తి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మహాత్మగాంధీ అంటే ఎంతో ఇష్టం డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తికి మహాత్మగాంధీ అంటే ఎంతో అభిమానం. ఆయన తన విద్యా సంస్థలకు జాతిపిత పేరు పెట్టుకున్నారు. గీతం విద్యాసంస్థలను గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ పేరుతో ఆయన 1980లో నగర శివారు రుషికొండలో ప్రారంభించారు. నాలుగు దశాబ్దాలుగా గీతం విశ్వవిద్యాలయం, తర్వాత డీమ్డ్ విశ్వవిద్యాలయం వరకు ఎదిగింది. మృత్యువులోనూ వీడని బంధం సాగర్‌నగర్ (విశాఖ తూర్పు): అమెరికాలోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గీతం అధ్యక్షుడు డాక్టర్ మూర్తితోపాటు ఆయన చిరకాల మిత్రుడు వెలువోలు బసవపున్నయ్య కూడా కన్నుమూశారు. పున్నయ్య జర్నలిస్టు, సామాజిక సేవారంగంలో ఉన్నారు. వెలువోలు ట్రస్టు పేరుతో ఆయన అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తికి ఎంతో సన్నిహింగా ఉంటూనే రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డితోనూ ఉండటం విశేషం. బసవపున్నయ్య మృతి పట్ల విశాఖలోని జర్నలిస్టు సంఘాలు తమ సంతాపాన్ని ప్రకటించాయి.