అలాస్కా: ఏడాది వయస్సు ఆ్రస్టేలియన్ షెపర్డ్ కుక్క పిల్ల పేరు ననుక్. దీని సాహసం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. యజమాని కుటుంబంతోపాటు టూర్‌కెళ్లి తప్పిపోయింది. గడ్డకట్టిన బేరింగ్ సముద్రం మీదుగా 150 మైళ్లు ప్రయాణించింది. మధ్యలో సీల్స్, మంచు ఎలుగుబంట్ల దాడిలో గాయపడింది. చివరికి నెల తర్వాత అలాస్కాలోని గాంబెల్‌లో యజమాని మాండీ ఇవోర్రిగన్ ఇంటికి చేరుకుంది.
మాండీ కుటుంబం గత నెలలో బేరింగ్ జలసంధిలోని సెంట్ లారెన్స్ దీవిలో సవూంగా ప్రాంతానికి వెళ్లింది. అక్కడే మాండీ కుటుంబానికి చెందిన ననుక్, స్టార్‌లైట్ అనే కుక్కలు తప్పిపోయాయి. కొద్ది రోజులకు స్టార్‌లైట్ ఇంటికి చేరుకుంది. కానీ, ననుక్‌కు దారి దొరకలేదు. సోషల్ మీడియాలో ననుక్ గురించి మాండీ కుటుంబం పోస్టులు పెట్టింది.
చివరికి అక్కడికి 150 మైళ్ల దూరంలోని వేల్స్‌లో ఉన్నట్లు తెలిసింది. విమానయాన సంస్థల సహకారంతో ననుక్‌ను సొంతూరికి రప్పించారు. శరీరంపై కొద్దిపాటి గాయాలే తప్ప మొత్తమ్మీద ఆరోగ్యంగా ఉన్న ననుక్‌ను చూసి మాండీ కుటుంబంలోని చిన్నారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అయితే, ననుక్ అంతదూరం ప్రయాణించడం మాత్రం మిస్టరీయేనని కుటుంబీకులు చెబుతున్నారు.
చదవండి: ఈకల్లో విషం.. తాకితే మరణం.. రెండు రకాల విషపూరిత పక్షులను గుర్తించిన సైంటిస్టులు
Comments
Please login to add a commentAdd a comment