missing
-
Mahakumbh 2025: కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయంతో..
అందరినీ ఆకట్టుకునే సోషల్ మీడియా ఇప్పుడు కుంభమేళా ఫొటోలు, వీడియోలతో నిండిపోతోంది. వీటిలోని కొన్ని వీడియోలు అమితంగా అలరిస్తుండగా, మరికొన్ని ఆశ్చర్యపరిచేవిగా, తెగ నవ్వు తెప్పించేవిగా ఉంటున్నాయి. ఇదేకోవలోని ఒక వీడియో ఇప్పుడు తెగవైరల్ అవుతోంది. కుంభమేళాకు వచ్చి, కుటుంబ సభ్యులు తప్పిపోతారేమోనని భయపడేవారికి మంచి సలహా ఇస్తున్నట్లుంది ఈ వీడియో..మహా కుంభమేళాలో జనసమూహం అధికంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయం పర్యాటకుల్లో ఉంటుంది. అయితే దీనికి ఒక వ్యక్తి చక్కని పరిష్కారం కనుగొన్నాడు. దీనిని చూడగానే నవ్వు వచ్చినప్పటికీ, ఓమారు ఆలోచింపజేస్తుంది.भारत एक जुगाड़ प्रधान देश है, पूरे परिवार को रस्सी से बांध लिया ताकि महाकुंभ में खो ना जाये 🤣🤣 #MahaKumbh pic.twitter.com/WJXU4EYCwO— Raja Babu (@GaurangBhardwa1) January 15, 2025సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ముందుకు నడుస్తుండగా, అతని వెనుక అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఉండటాన్ని గమనించవచ్చు. అయితే వాళ్లెవరూ దారితప్పికోకుండా ఉండేందుకు వారందరి చుట్టూ ఒక తాడుతో కట్టినట్లు చూడవచ్చు. వారంతా ఆ తాడులోపలే ఉంటూ ముందుకు కదులుతుండటాన్ని కూడా చూడవచ్చు. ఈ వీడియోను @GaurangBhardwa1 అనే ఖాతా ద్వారా ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. ‘మహా కుంభమేళాలో తప్పిపోకుండా ఉండటానికి కుటుంబాన్నంతటినీ తాడుతో కట్టేశారు' అని ఆ వీడియో కింద క్యాప్షన్ ఉంది. ఈ వీడియోను ఇప్పటివరకూ ఒక లక్షా 42 వేలకు పైగా జనం వీక్షించారు. ఈ వీడియో చూసిన ఒక యూజర్ ‘ఆడవాళ్లు ఇక్కడకు అక్కడకు వెళ్లిపోతారు. అలా వెళ్లిపోకుండా ఉండేందుకు సరైన పని చేశారు’ అని రాశారు. మరొక యూజర్ ‘ఈ టెక్నిక్ భారతదేశం నుండి బయటకు వెళ్లకూడదు’అని రాశారు. ఇది కూడా చదవండి: Mahakumbh 2025: చూపుతిప్పుకోనివ్వని దృశ్యాలు -
HYD: ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం
ఖరతాబాద్: ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కనిపించకుండా పోయిన సంఘటన ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎఎస్ఐ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం.... ఖైరతాబాద్ డివిజన్ మహాభారత్నగర్లో నివాసముండే తలారి ఎల్లయ్య, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం కాగా వీరి కుమార్తె తలారి రేణుకాదేవి (22) ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం ఉదయం షాపునకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన తిరిగి రాలేదు. దీంతో రేణుకాదేవి తల్లి విజయలక్ష్మి ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తితో వెళ్లి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కొండపొచమ్మ సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు మృతి
సాక్షి, సిద్ధిపేట జిల్లా: సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ సరదా యువకుల ప్రాణాలు తీసింది. మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యామ్‌లో యువకులు గల్లంతయ్యారు. ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడ్డారు.మృతులను హైదరాబాద్ ముషీరాబాద్ వాసులు ధనుష్(20), లోహిత్(17), దినేశ్వర్(17), సాహిల్(19), జతిన్(17)గా గుర్తించారు. యువకులంతా 20 ఏళ్ల లోపు వారే. మృగాంక్(17), ఇబ్రహీం(20) ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన ధనుష్, లోహిత్ ఇద్దరూ సొంత అన్నదమ్ములు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతిఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు విద్యార్థుల గల్లంతుపై సీఎం ఆరా తీశారు. ఘటనా స్థలానికి వెళ్లాలని అధికారులను ఆదేశించారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించాలన్నారు.మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి: హరీష్రావుకొండపోచమ్మ సాగర్ ఘటనపై మాజీ మంత్రి హరీష్‌రావు దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇదీ చదవండి: సంక్రాంతికి వస్తానని.. తిరిగిరాని లోకాలకు -
కుర్రాడిగా అదృశ్యమై.. 23 ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో ప్రత్యక్షమై.. వింత ఘటన
సరిగ్గా 23 ఏళ్ల క్రితం మాయమైన కుర్రాడు ఇప్పుడు వివాహితునిగా భార్య, ఇద్దరు పిల్లలతో పాటు ఇంటికి తిరిగివస్తే, ఆ కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంటుంది? అది ఊహకు అందదు. ఇటువంటి ఘటన గురించి విన్నవారు తెగ ఆశ్చర్యపోతారు. సరిగ్గా ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.యూపీలోని సీతాపూర్(Sitapur)లో 23 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఒక కుర్రాడిని అతని జ్ఞాపకాలు ఇంటికి తిరిగివచ్చేలా చేశాయి. ఆ కుర్రాడు వివాహితునిగా మారి భార్య, ఇద్దరు పిల్లలలో పాటు గ్రామానికి తిరిగిరావడంతో అందరూ ఆశ్యర్యపోయారు. అతనిని చూసిన తల్లి షాక్‌నకు గురయ్యింది. అతనిని చూసేందుకు గ్రామస్తులు క్యూ కడుతున్నారు. బాల్యంలో అతని తలకు తగిలిన గాయం ఆధారంగా ఆ తల్లి అతను తన కుమారుడేనని గుర్తించింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యువకుడిని గుర్తించారు. 23 ఏళ్ల క్రితం ఆ బాలుని తల్లి తన కుమారుడు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇన్నాళ్లకు కుమారుడిని కలుసుకున్న ఆ తల్లి భావోద్వేగానికి గురయ్యింది. ఈ ఉదంతం రెయుసా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం రేవాన్ గ్రామానికి చెందిన అరవింద్ మౌర్య(Arvind Maurya) 2002లో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. అప్పుడు అరవింద్ వయసు దాదాపు 18 ఏళ్లు. ఆ సమయంలో అరవింద్.. సోంపు విక్రయించేవాడు. కొడుకు అదృశ్యం కావడంతో తల్లి చంపకళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు తెలిసిన అన్నిచోట్లా వెదికింది. పలుదేవాలయాల చుట్టూ తిరుగుతూ, తన కుమారుడు క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ పూజలు చేసింది.ఇప్పుడు ఇంటికి తిరిగివచ్చిన అరవింద్.. పోలీసులకు తాను ఇన్నాళ్లూ ఎక్కడున్నదీ, ఏం చేసినదీ తెలిపాడు. తాను ఇంటి నుంచి వెళ్లిపోయిన తరువాత పంజాబ్, హర్యానా తదితర ప్రాంతాలలో ఉంటూ, ఏవో పనులు చేసుకుంటూ కాలం గడిపానని తెలిపాడు. అదేసమయంలో తనకు వివాహం జరిగిందని, ఇద్దరు పిల్లలు కూడా పుట్టారని తెలిపాడు. ఇప్పుడు తన భార్య, పిల్లల కోరిక మేరకు పంజాబ్ నుంచి తన ఇంటికి తిరిగివచ్చానని తెలిపాడు. అరవింద్‌ను, అతని కుటుంబ సభ్యులను విచారించిన తర్వాత పోలీసులు ఈ మిస్సింగ్ కేసు(Missing case)ను ముగించారు. అరవింద్ భార్య పూనమ్ మాట్లాడుతూ తన అత్తమామలను కలుసుకున్నానని, ఇప్పుడు చాలా ఆనందంగా ఉందని అన్నారు. తనకంటూ ఒక ఉమ్మడి కుటుంబం ఉన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. కాగా అరవింద్, పూనమ్‌లు 2014లో పంజాబ్‌లో వివాహం చేసుకున్నారు. ఇది కూడా చదవండి: ఆరేళ్ల బుడతడు.. వెయ్యి కిలోమీటర్లు పరిగెడుతూ అయోధ్యకు.. -
ముగ్గురు బీటెక్ విద్యార్థుల అదృశ్యం
ఇబ్రహీంపట్నం: వారం రోజుల్లో ముగ్గురు బీటెక్ విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు సోమవారం ఆలస్యంగా వెలుగుచూశాయి. మిస్సింగ్ అయిన వారిలో ఇద్దరూ మైనర్లు కావడం గమనార్హం. స్థానిక ఎస్ఐ రామకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా, మోమిన్‌పేట మండలం రాంనాథ్గుడపల్లికి చెందిన కొత్తగాడి బాల్‌రాజ్ కుమారుడు (17) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ విద్యాసంస్థల్లో బీటెక్ (సీఎస్సీ) ప్రథమ సంవత్సరం చదువుతూ కాలేజ్ హాస్టల్లో ఉంటున్నాడు.14న హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. తండ్రి బాల్‌రాజ్ విష్ణుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మరుసటి రోజు నేరుగా కాలేజ్‌కి వచ్చి ఆరా తీయగా.. సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు. ఇదిలా ఉండగా యాదాద్రి జిల్లా ఆత్మకూర్ మండలం, కాప్రాయిపల్లికి చెందిన మరో విద్యార్థిని(17) గురునానక్ కాలేజ్‌లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ ఇదే కళాశాల హాస్టల్లో ఉంటోంది. ఈ నెల 17న సాయంత్రం 6 గంటల నుంచి కనిపించకుండా పోయింది. అలాగే వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన 19 సంవత్సరాల విద్యారి్థని ఈనెల 20న అదృశ్యమైంది. ఈమె కూడా కాలేజ్ హాస్టల్లో ఉంటూ బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. వారం రోజుల్లో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. కాలేజీ నిర్వాహకులు, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ్ కుమార్ ను బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు
-
అశ్వాపురం మండలం మొండికుంటలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
-
తిరుపతిలో మిస్సింగ్ కలకలం
-
తిరుపతిలో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్
-
కొట్టేస్తే కొట్టేశారు గానీ.. పేదలకు పంచండి
లండన్: బ్రిటన్‌లోని యార్క్ నగరంలో క్రిస్మస్ మార్కెట్లో అమ్మడానికి రుచికరమైన పలు రకాల తాజా తినుబండారాలతో వ్యాన్ సిద్ధంగా ఉంది. వ్యాన్‌ను వాణిజ్యసముదాయానికి తరలించేలోపు దానిని ఎవరో దొంగలించారు. విషయం తెల్సుకున్న దాని యజమాని, పాకశాస్త్ర ప్రవీణుడు టామీ బ్యాంక్స్ ఒకింత బాధపడ్డారు. ప్రేమానురాగాలను కలిపి వంటచేసే చెఫ్‌లకు తాము వండిన ఆహార పదార్ధాలను ఇతరులకు వడ్డించడంలోనే ఆనందం, తృప్తి ఉంటాయి. టామీకి సైతం ఆ ఆనందమే ఎక్కువ. అందుకే తాను తయారుచేసిన పదార్థాలను దొంగలు ఎక్కడ పడేస్తారోననే బాధ ఎక్కువైంది. అందుకే వాటిని నేలపాలు చేయకుండా క్షుద్భాదతో తల్లడిల్లే పేదలకు పంచాలని బహిరంగ ప్రకటన చేశారు. బ్యాంక్స్‌కు యార్క్‌షైర్ కౌంటీలో ఒక పబ్‌తోపాటు రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. స్వతహాగా వంటవాడైన బ్యాంక్స్ తన రెస్టారెంట్లలో కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలను స్వయంగా తయారుచేస్తారు. తమ వ్యాన్ దొంగతనంపై తాజాగా ఆయన ఒక వీడియోను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ‘‘ చిన్న వ్యాన్‌లో ఖరీదైన తినుబండారాలున్నాయి. స్టీక్, ఏల్, బీర్లు, టర్కీ, బట్టర్‌నట్ స్క్వాష్ పై, కేక్‌లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ ఏకంగా రూ. 27,00,000 పైమాటే. వ్యాను అప్పనంగా దొరికిందన్న ఆనందంలో ఇంత ఖరీదైన ఆహారపదార్ధాలను పోతూపోతూ దారిలో పడేయకండి. పేదలకు పంచి వారి ఆకలి మంటలు తీర్చండి’’ అని వేడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘ఆహారం విలువ తెలిసిన నిజమైన చెఫ్’ అంటూ బ్యాంక్స్‌ను కొందరు నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు. బ్రిటన్‌లో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆహారపదార్ధాల చోరీలో ఇది తాజా ఘటనగా పేరొందింది. రెండు నెలల క్రితం లండన్‌లోని నీల్స్ యార్డ్ పాల ఉత్పత్తుల కేంద్రం వద్ద ఇలాంటి భారీ చోరీ జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ఒక భారీ రిటైర్ సంస్థకు హోల్‌సేల్ పంపిణీదారుగా ప్రకటించుకుంటూ ఒక దొంగ ఈ డైరీకి వచ్చి ఏకంగా 48,488 పౌండ్ల బరువైన చీజ్‌ను దర్జాగా పట్టుకెళ్లిపోయాడు. దీని మార్కెట్ విలువ ఏకంగా రూ.3.30 కోట్లు. బ్రిటిష్, అంతర్జాతీయ పోలీసులు వేట మొదలెట్టి ఆ 63 ఏళ్ల పెద్దాయనను పట్టుకున్నాసరే చీజ్ జాడను మాత్రం కనిపెట్టలేకపోయారు. -
Nigeria: పడవ ప్రమాదం.. 100 మంది గల్లంతు
అబుజా: ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 100 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. పడవ ఎందుకు మునిగిపోయిందనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.పడవలో వ్యాపారులు నేషనల్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ (ఎన్‌ఐడబ్ల్యూఏ)ప్రతినిధి మకామా సులేమాన్ మీడియాతో మాట్లాడుతూ పడవలో ప్రధానంగా మధ్య కోగి రాష్ట్రంలోని మిసా కమ్యూనిటీకి చెందిన వ్యాపారులు ఉన్నారన్నారు. వీరు పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రంలోని వీక్లీ మార్కెట్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, అయితే మృతుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదని సులేమాన్ తెలిపారు. ప్రయాణికులెవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం కారణంగానే ప్రాణనష్టం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.తరచూ ప్రమాదాలుఘటనా స్థలంలో ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. బోటులో ఎక్కువగా మహిళలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. బోటులో 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశంలో పడవ బోల్తా ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. ఓవర్లోడింగ్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కార్యాచరణ లోపాలు తదితర అంశాలు ఇటువంటి ఘటనలకు కారణంగా నిలుస్తున్నాయి. ఇది కూడా చదవండి: చైనాలో జర్నలిస్ట్‌పై గూఢచర్యం ఆరోపణలు.. ఏడేళ్ల జైలు -
సైనిక శిబిరంలో పనిచేస్తున్న కార్మికుడు అదృశ్యం
ఇంఫాల్: మణిపూర్‌లోని ఆర్మీ క్యాంప్‌లో పనిచేస్తున్న మెయిటీ కమ్యూనిటీకి చెందిన 55 ఏళ్ల వ్యక్తి అదృశ్యమయ్యాడు. లోయిటాంగ్ ఖునౌ గ్రామానికి చెందిన లైష్రామ్ కమల్‌బాబు సింగ్.. లిమాఖోంగ్ ఆర్మీ క్యాంపులో పని కోసం ఇంటి నుండి వెళ్లి, ఆ తరువాత నుంచి కనిపించకుండా పోయాడని అధికారులు తెలిపారు. అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసివుందన్నారు. పోలీసులు, సైన్యం సంయుక్తంగా లైష్రామ్ కమల్‌బాబు సింగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.లైష్రామ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అతను లిమాఖోంగ్ సైనిక శిబిరంలో కూలి పనులు చేసేవాడు. రాజధాని మణిపూర్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న 57 మౌంటైన్ డివిజన్లోని సైనిక శిబిరంలోని ఈ ప్రాంతంలో కుకీ జనాభా అధికంగా ఉంటుంది. జాతి హింస ప్రారంభమైనప్పటి నుండి లిమాఖోంగ్ సమీపంలో నివసిస్తున్న మెయిటీ కమ్యూనిటీ ప్రజలు ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయారు. గత ఏడాది మే నుంచి ఇప్పటి వరకు జరిగిన హింసలో 250 మందికి పైగా జనం మృతిచెందారు.జిరిబామ్ జిల్లాలో ఇటీవల జరిగిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల హత్యకేసులో ప్రమేయం ఉన్న నేరస్తులను పట్టుకునేందుకు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సీఎం బీరెన్‌సింగ్ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయనప్పటికీ, పలువురిని గుర్తించామన్నారు. గత నవంబర్ 11న భద్రతా బలగాలు- అనుమానిత కుకీ-జో తీవ్రవాదుల మధ్య కాల్పులు జరిగిన తర్వాత జిరిబామ్ జిల్లాలోని సహాయ శిబిరం నుండి మెయిటీ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ ఎన్కౌంటర్లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఇది కూడా చదవండి: ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి.. -
ఎర్ర సముద్రంలో బోటు ప్రమాదం..16 మంది గల్లంతు
కైరో:ఎర్ర సముద్రంలో టూరిస్టు బోటు ప్రమాదశాత్తు మునిగిపోయింది. ఈజిప్టు తీరానికి దగ్గరలో జరిగిన ఈ ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. మునిగిపోయినపుడు బోటులో మొత్తం 44 మంది ఉన్నారు. వీరిలో 31 మంది టూరిస్టులు కాగా 13 మంది సిబ్బంది.ప్రమాదం నుంచి 28 మందిని కాపాడినట్లు రెడ్సీ గవర్నరేట్ వెల్లడించింది.వీరంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపింది.సముద్రంలో బోటును ఒక్కసారిగా అల వచ్చి బలంగా ఢీకొట్టడంతో బోటు మునిగినపోయినట్లు అధికారులు వెల్లడించారు.అల బలంగా తాకినపుడు కొంత మంది ప్యాసింజర్లు వారి క్యాబిన్లలో ఉండడం వల్ల తప్పించుకోలేకపోయారని తెలిపారు. గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు జరుగుతోందని చెప్పారు. -
మనసున్న కుక్క దొంగలు
-
పిఠాపురం నియోజకవర్గంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
-
పిఠాపురం: ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గంలో ఇంటర్ విద్యార్ధిని అదృశ్యమైంది. 15 రోజుల క్రితం కళాశాలకు వెళ్లిన కొడవలి గ్రామానికి చెందిన వరలక్ష్మీ(16) మిస్సింగ్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడులో విద్యార్థిని ఇంటర్ ఫస్ట్‌యర్ చదువుతోంది.తొలుత గొల్లప్రోలు పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన యువతి తల్లిదండ్రులతో పోలీసులు హేళనగా మాట్లాడారు. దీంతో గత నెల 22న ప్రత్తిపాడు పీఎస్ లో వరలక్ష్మీ అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. వరలక్ష్మీ ఆచూకీ తెలియక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. తమ కుమార్తె జాడ కోసం సాయం చేయాలని వరలక్ష్మీ తల్లిదండ్రులు పవన్‌కు లేఖ రాశారు. -
ప్రాణహిత నదిలో ముగ్గురు యువకులు గల్లంతు
సాక్షి,కొమురంభీంఆసిఫాబాద్ జిల్లా: బెజ్జూర్ మండలం సోమిని సమీపంలో ప్రాణహిత నదిలో శనివారం(అక్టోబర్ 26) ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మొత్తం ఐదుగురు స్నేహితులు కలిసి నదిలో స్నానానికి వెళ్లగా ముగ్గురు గల్లంతు కాగా ఇద్దరు ఒడ్డుకు చేరుకున్నారు.గల్లంతైన వారిని బెజ్జూరుకు చెందిన జహార్ హుస్సేన్(24), ఇర్షద్ (20), మోయిసిధ్(22)గా గుర్తించారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గోదావరిలో ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతు
తాళ్లరేవు: ఇంజినీరింగ్ విద్యార్థుల విహారయాత్ర విషాదాంతమైంది. యానాం సందర్శనకు వచ్చిన విద్యార్థుల్లో ఒక యువకుడు గోదావరిలో గల్లంతయ్యాడు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. శశి వేలివెన్ను ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఎల్లిన శివరామ్, మల్లిపూడి నిఖిల్ లక్ష్మణ్, మండా వంశీ, వెంపటి సంతోష్, కుతాని సాయిచంద్ర, కార్తిక్, మిజోన్స్ అనే యువకులు కారులో బుధవారం విహారయాత్రకు బయలుదేరారు. ఉదయమే రాజమహేంద్రవరం వచ్చి అక్కడ అన్నీ ప్రదేశాలను చూశారు. మధ్యాహ్నం కేంద్రపాలిత ప్రాంతమైన యానానికి వచ్చారు. యానాంలోని పలు ప్రదేశాలు సందర్శించిన అనంతరం తిరిగి వెళుతూ గౌతమి గోదావరి చెంతన గల గోపులంక పుష్కరఘాట్ వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఆగారు. వీరిలో కుతాని సాయిచంద్ర ఫొటోలు తీసుకుంటూ అదుపు తప్పి గోదావరిలో పడిపోయాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నించిన శివరామ్ కూడా గోదావరిలో కొట్టుకుపోసాగాడు. మిగిలిన విద్యార్థులు వెంటనే స్పందించి వారిని రక్షించడానికి ప్రయత్నించారు. శివరామ్‌ను కాపాడారు గానీ గోదావరి ప్రవాహానికి సాయిచంద్ర (21) కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న కోరంగి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి కారణంగా గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. రాజమహేంద్రవరానికి చెందిన సాయిచంద్ర శశి వేలివెన్ను కళాశాలలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. శివరామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.గతేడాది ఇదే నెలలో..ఇదే ప్రదేశంలో గతేడాది అక్టోబరు 21న ఇలాంటి ఘటనే జరిగింది. తణుకు పట్టణంలోని సజ్జాపురానికి చెందిన ఏడుగురు యువకులు పుట్టినరోజు వేడుకల కోసం యానాం వచ్చి తిరిగి వెళుతూ గోపులంక వద్ద స్నానానికి దిగారు. వారిలో నలుగురు యువకులు గల్లంతై మృతి చెందారు. -
వ్యాపారి అదృశ్యం కలకలం.. బిడ్జ్ వద్ద ప్రమాదానికి గురైన కారు
బెంగళూరు: కర్నాటకలో ఓ వ్యాపారవేత్త అదృశ్యం కలకలం రేపుతోంది. ఆ వ్యాపారికి సంబంధించి ప్రమాదానికి గురైన బీఎండబ్ల్యూ కారును మంగళూరులోని ఓ బిడ్జ్ వద్ద ఆదివారం పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మొహియుద్దీన్ బావా సోదరుడు వ్యాపారవేత్త ముంతాజ్ అలీ ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. ఆయన కుమార్తె పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆయన కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వ్యాపారవేత్త ముంతాజ్ అలీ తన ఇంటి నుంచి బయలుదేరి కారులో మంగళూరు నగరం చుట్టూ తిరిగారు. 5 గంటల సమయంలో మంగళూరులోని కులూరు వంతెన దగ్గర ఆయన కారు ఆపారు. కారులో ప్రమాదానికి సంబంధించిన కొన్ని గుర్తులు ఉన్నాయని తెలిపారు. తన తండ్రి అదృశ్యానికి సంబంధించి ముంతాజ్ అలీ కుమార్తె స్థానిక పోలీసులకు సమాచారం అందించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ వెల్లడించారు.ముంతాజ్ అలీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. ఆయన వంతెనపై నుంచి దూకి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నదిలో గాలించడానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, కోస్ట్ గార్డ్లను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.చదవండి: రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత -
12 ఏళ్లయినా వీడని ఆశ.. నవరాత్రుల్లో కొడుకు దొరుకుతాడని..
వారణాసి: ఆశ అనేని మనిషిని ముందుకు నడిపిస్తుందని అంటారు. మహారాష్ట్రకు చెందిన ఒక జంట 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన తమ కుమారుని కోసం ఏళ్ల తరబడి ఆశగా అన్నిచోట్లా వెదుకుతోంది.వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని జల్గావ్కు చెందిన విక్రమ్ మేఘ్వానీ 12 ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. ఇప్పటికీ విక్రమ్ తల్లిదండ్రులు నాడు తప్పిపోయిన కొడుకు కోసం కాశీలోని దేవాలయాలలో వెదుకులాట సాగిస్తున్నారు. నవరాత్రులలో అమ్మవారు తప్పకుండా తమ వినతి వింటుందని, అందుకే కాశీలోని అమ్మవారి ఆలయాలలో తిరుగున్నామని వారు చెబుతున్నారు.తప్పిపోయిన కొడుకు ఫోటోను పట్టుకుని తిరుగుతున్న రణోమల్ సమనోమల్ మేఘ్వానీ, ఆయన భార్య లక్ష్మీబాయి రణోమల్ మేఘ్వానీలను చూసిన వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వృద్ధ దంపతులు కాశీలోని వివిధ ఆలయాల వెలుపల తమ కుమారుని ఫొటోను, వివరాలతో కూడిన పోస్టర్‌ను అతికిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన తమ కుమారుని ఆచూకీ లభిస్తుందని విక్రమ్ తల్లి లక్ష్మీబాయి ఆశాభావం వ్యక్తం చేశారు.2012, ఆగస్టు 29న తన కుమారుడు దుకాణం నుంచి ఇంటికి వస్తూ అదృశ్యమయ్యాడని లక్ష్మీబాయి తెలిపారు. దీనిపై మహారాష్ట్ర పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఇప్పటి వరకు తమ కుమారుని ఆచూకీ లభించలేదన్నారు. ఈ వృద్ధ దంపతులు నవరాత్రులలో కాశీలో ఉంటూ, తప్పిపోయిన తమ కుమారుని కోసం వెదుకుతున్నారు.ఇది కూడా చదవండి: 16 ఏళ్లుగా మహిళ బందీ.. ఎముకల గూడు చూసి పోలీసులు షాక్ -
మారేడుమిల్లి జలపాతంలో ముగ్గురు గల్లంతు
మారేడుమిల్లి: విహారయాత్ర కోసం ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాల నుంచి 14 మంది మెడికోలు అల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని జల తరంగిణి జలపాతం వద్దకు రాగా.. విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో స్నానాలు చేస్తుండగా భారీవర్షం కురిసి ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరు విద్యార్థినుల్ని 6 కిలోమీటర్ల దూరంలో స్థానికులు రక్షించగా.. ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది.మరో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఏలూరులోని ఆశ్రం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న 14 మంది విద్యార్థులు వ్యాన్‌లో ఆదివారం విహారయాత్రకు మారేడుమిల్లి వచ్చారు. అక్కడి నుంచి జలతరంగిణి జలపాతంలో దిగి స్నానాలు చేస్తుండగా భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా జలపాతం పొంగింది. దీనిని గమనించిన 9 మంది విద్యార్థులు వెంటనే బయటకు వచ్చేశారు. జలపాతం మధ్యలో చిక్కుకుపోయి.. జలపాతం మధ్యలో ఉండిపోయిన సీహెచ్.హరిదీప్, కె.సౌమ్య, బి.అమృత, గాయత్రీ పుష్ప, హరిణిప్రియ కొట్టుకుపోయారు. వీరిలో గాయత్రీపుష్ప, హరిణిప్రియ 6 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం ప్రధాన రహదారి కల్వర్టు వద్ద చెట్టుకొమ్మను పట్టుకుని వేలాడుతుండగా స్థానికులు ఒడ్డుకు చేర్చారు. మిగతా ముగ్గురు ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో మార్కాపురానికి చెందిన సీహెచ్ హరిదీప్, విజయనగరానికి చెందిన కె.సౌమ్య, బి.అమృత ఉన్నట్టు ఎస్ఐ రాము తెలిపారు. -
ముగ్గురు గురుకుల విద్యార్థుల అదృశ్యం
దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లి మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి0ది. గుమ్మడవెళ్లికి చెందిన అబ్దుల్ రహమాన్, హుజూర్‌నగర్‌కు చెందిన ముజీబ్, జాన్ పహాడ్‌కు చెందిన తౌఫిక్ ఈనెల 17న పాఠశాలలో అల్పాహారం తిన్న అనంతరం సమాచారం ఇవ్వకుండా గోడ దూకి వెళ్లిపోయారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఇన్చార్జ్ ప్రిన్సిప ల్ పరిసర ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోయింది. పాఠశాలలోని సీసీ కెమెరాలను పరిశీలించగా గోడదూకి వెళ్లినట్లు గుర్తించారు.వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు, గురుకుల రీజనల్ కోఆర్డినేటర్ విష్ణుమూర్తికి సమాచారం అందించారు. అధికారుల సూచనల మేరకు దేవరకొండ పోలీసుల కు ఫిర్యాదు చేసినట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపల్ తెలిపారు. ఈ ము గ్గురు విద్యార్థులు ఈ నెల 16న పాఠశాల ప్రహరీ గోడవైపు నుంచి ఓ ప్యాకెట్ తీసుకుంటుండగా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు గమనించి అడిగారు. అందులో కల్లు ప్యాకె ట్లు ఉండటంతో విద్యార్థులను మందలించారు. అయితే సద రు విద్యార్థులు తమకెలాంటి సంబంధం లేదని తెలిపారు. అందులో ఓ విద్యార్థి తమకు ఆ ప్యాకెట్లకు ఎలాంటి సంబంధం లేదని, తాము ఏ తప్పూ చేయలేదని లేఖ రాసిపెట్టాడు. తమను ఎవరూ వెతకవద్దని లేఖలో పేర్కొని ఉంది. ఈ నెల 17న వారు అదృశ్యమయ్యారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీని వాస్ పాఠశాలకు చేరుకొని ఆరాతీశారు. విద్యార్థుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే, రెండు రోజు లు గడుస్తున్నా పిల్లల ఆచూకీ తెలియక పోవడంతో విద్యార్థు ల తల్లిదండ్రులు పాఠశాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. -
ఆ పిల్లల ఆచూకీ కోసం 500 కెమెరాల్ని జల్లెడ పట్టిన పోలీసులు
పరీక్షల్లో తక్కువ మార్కులు.. తల్లిదండ్రులు తిడతారనే భయం. ఫలితం ఇద్దరు విద్యార్థులు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. చివరికిఢిల్లీ నోయిడా సెక్టార్-56లోని ఆర్యన్ చౌరాశ్యా, నితిన్ ద్యాన్‌లు ఉత్తరాఖండ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. అయితే గత వారం స్కూల్లో జరిగిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులకు మార్క్‌లు తక్కువ వచ్చాయి.‘ఇటీవల జరిగిన పరీక్షల్లో మీ ఇద్దరికి తక్కువ మార్కులు వచ్చాయి. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద మీ తల్లిదండ్రులతో సైన్ చేయించి.. రేపు ఉదయం స్కూల్‌కు రండి. మీ పేరెంట్స్‌ని వెంట తీసుకుని రండి. వారితో మాట్లాడాలి ’ అంటూ క్లాస్ టీచర్ ఆదేశాలతో ఇద్దరు విద్యార్ధులు బయపడిపోయారు. అదే రోజు సాయంత్రం తల్లిదండ్రులు తమని తిడతారేమోనని అటు స్కూల్.. దూరంగా పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. అదే రోజు సాయంత్రం స్కూల్ ముగిసిన వెంటనే పారిపోయారు.ఇదీ చదవండి : రంగంలోకి ఇండియన్ జేమ్స్ బాండ్స్కూల్ వెళ్లిన పిల్లలు సమయం మించిపోతున్నా.. ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు. ఏడు బృందాలుగా విడిపోయిన పోలీసులు పిల్లల కోసం గాలించారు. 500 సీసీ కెమెరాలను తనిఖీలు చేయగా.. వారి ఇంటి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో ఆచూకీ లభించింది. పిల్లల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతమైంది. -
రష్యాలో హెలికాప్టర్ గల్లంతు
మాస్కో: తూర్పు రష్యాలోని కమ్చత్కాలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతయింది. హెలికాప్టర్లో ఉన్నవారిలో 19 మంది ప్రయాణికులు కాగా ముగ్గురు సిబ్బంది. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్ రవాణా ఏజెన్సీ తెలిపింది. ఎంఐ-8టి శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్ శనివారం(ఆగస్టు31) కమ్చత్కాలోని వచ్కజెట్స్ అగ్నిపర్వతం వద్ద నుంచి బయలుదేరింది. కానీ గమ్యస్థానం చేరలేదని సమాచారం. హెలికాప్టర్ షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానం చేరిన తర్వాత పైలట్ల వద్ద నుంచి రావాల్సిన సమాచారం రాలేదు. హెలికాప్టర్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన హెలికాప్టర్ 1960లో తయారైన డబుల్ ఇంజిన్ హెలికాప్టర్. ఈ మోడల్ హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ వీటిని రష్యాతో పాటు ఇతర దేశాల్లో ఎక్కువగా వాడుతుండడం గమనార్హం. -
మలేషియా కౌలాలంపూర్ లో తెలుగు మహిళ గల్లంతు