
బీహార్ రాజధాని పట్నాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగా నదిలో ప్రయాణీకులతో నిండిన పడవ బోల్తా పడింది. ఉమానాథ్ ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు పడవలో 17 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
పడవ బోల్తా పడిన వెంటనే 11 మంది ఈదుకుంటూ బయటికి రాగా, ఆరుగురు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
గంగా దసరా సందర్భంగా ఒకే కుటుంబానికి చెందిన 17 మంది స్నానం చేయడానికి డయారా వైపు పడవలో వెళుతుండగా, గంగా నది మధ్యలో పడవ బోల్తా పడింది. సమాచారం అందుకున్న ఎస్‌డీఎం శుభం కుమార్ తన బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు.