70 మంది జలసమాధి | Arround 70 migrants reported missing in Mediterranean | Sakshi
Sakshi News home page

70 మంది జలసమాధి

Published Sat, Apr 30 2016 6:44 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

70 మంది జలసమాధి

70 మంది జలసమాధి

రోమ్: ఇటలీలో పడవ ప్రమాదం చోటుచేసుకొని 70 మంది జలసమాధి అయినట్లు తెలుస్తోంది. మెడిటెర్రానియన్ సముద్రంలో ఈ రోజు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇటలీ తీర ప్రాంత అధికారులు తెలిపిన ప్రకారం 100 మందికి పైగా వలసదారులతో వస్తున్న ఓ నౌక లిబియా సముద్ర జలాల్లో ప్రమాదానికి గురైంది.

ఆ సమయంలో ఓ శాటిలైట్ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఆధారంగా ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి వెళ్లిన సహాయక సిబ్బంది 26మందిని మాత్రం రక్షించగలిగారు. రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. 70మంది గల్లంతయ్యారు. సాధారణంగా ఇలాంటి పడవ 100మందికంటే తక్కువమందితో అస్సలు ప్రయాణించదని.. ఓ 30మంది కనిపించినందున మిగితా వారంతా జలసమాధి అయినట్లు భావిస్తున్నామని ఇటలీ తీర ప్రాంత అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement