migrants
-
అమెరికా కీలక ఒప్పందం.. భారత వలసదారులు ఇక కోస్టారికాకు!
శాన్‌జోస్: భారత అక్రమ వలసదారులను కోస్టారికాకు తరలించాలని అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అగ్రరాజ్యం తమతో ఒప్పందం చేసుకున్నట్టు కోస్టారికా వెల్లడించింది. అందులో భాగంగా వలసదారుల తొలి విమానం బుధవారం తమ దేశానికి రానున్నట్టు కోస్టారికా అధ్యక్షుడు రొడిగ్రో చావెస్ రోబెల్ కార్యాలయం ప్రకటించింది.ఈ సందర్బంగా రొడిగ్రో మాట్లాడుతూ..‘భారత్‌తో పాటు మధ్య ఆసియా దేశాలకు చెందిన 200 మంది ఆ విమానంలో వస్తున్నారు. అనంతరం వారిని మాతృదేశాలకు పంపేస్తాం. ఈ విషయంలో అమెరికాతో సమన్వయం చేసుకుని పని చేస్తాం. ఇరు దేశాల మధ్య సంధానకర్త పాత్ర పోషిస్తాం’ అని తెలిపారు. అయితే 200 మందిలో భారతీయులు ఎందరన్నది మాత్రం వెల్లడించలేదు.అమెరికా తన సొంత నిధులతో చేపడుతున్న వలసదారుల తరలింపు ప్రక్రియను అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) పర్యవేక్షిస్తోంది. కోస్టారికాలో ఉన్నంతకాలం వలసదారుల సంరక్షణ తదితర బాధ్యతలను ఆ సంస్థే చూసుకోనుంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారతీయులను స్వదేశానికి పంపించింది. ఇదిలా ఉండగా.. పనామా హోటల్లో భారతీయులతో సహా పలు దేశాల అక్రమ వలసదారులు ఉన్నారు. యూఎస్ ఆదేశాల మేరకు పనామా ప్రభుత్వం వారికి అక్కడ బస ఏర్పాటు చేసింది. వలసదారుల్లో ఇరాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గాన్, చైనా ఇతర దేశాల వలసదారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయా దేశాల అధికారులు వారిని తీసుకెళ్లే ఏర్పాట్లు చేసే వరకు హోటల్లోనే ఉంటారని ఈ మేరకు పనామా వెల్లడించింది. పట్టుబడిన వారిలో 40 శాతం మంది సొంతంగా తమ దేశానికి తిరిగి వెళ్లడానికి సిద్ధంగా లేరని పనామా అధికారులు పేర్కొన్నారు. Costa Rica Will Take Central Asian and Indian Migrants Deported by U.S.Costa Rica is the second Central American nation to accept migrants from distant countries as the Trump administration ramps up deportation flights. pic.twitter.com/AhCqKhiOIt— Deportation Counter (@DeportedNumber) February 18, 2025 -
సంకెళ్లు.. కాళ్లకు గొలుసులు
హోషియార్పూర్/పటియాలా/చండీగఢ్: అమెరికా తిప్పి పంపిన రెండో విమానంలోనూ భారతీయ వలసదారుల పట్ల అమానవీయంగా ప్రవర్తించింది. చేతులకు సంకెళ్లు.. కాళ్లను గొలుసులతో కట్టేశారు. 116 మందిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు మినహా అందరిదీ ఇదే పరిస్థితి. మరోవైపు వలసదారుల్లోని సిక్కులు తలపాగా ధరించడానికి అమెరికా అనుమతించకపోవడాన్ని ఎస్జీపీసీ ఖండించింది. అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన వలసదారులలో ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు. హత్య కేసుతో సంబంధం ఉన్న పటియాలా జిల్లా రాజ్‌పురాకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు శనివారం రాత్రే అరెస్టు చేశారు. సందీప్ సింగ్ అలియాస్ సన్నీ, ప్రదీప్ సింగ్‌లు 2023లో నమోదైన ఒక హత్య కేసులో నిందితులని పోలీసులు ధ్రువీకరించారు. వలసదారుల్లో సిక్కులను తలపాగా ధరించడానికి కూడా అనుమతించకపోవడంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రేవాల్ ఖండించారు. విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్లాలని విదేశాంగ శాఖను కోరారు. రెండేళ్ల నరకం... శనివారం వచ్చిన వలసదారుల్లో పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లా కురాలా కలాన్ గ్రామానికి చెందిన దల్జీత్ది విషాద గాధ. కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలనే ఆశతో అమెరికాకు వెళ్లాలనుకున్న దల్జీత్ ఏజెంట్ రెండేండ్ల పాటు నరకం చూపారు. గ్రామంలోని ఓ వ్యక్తి దల్జీత్‌కు 2022లో ట్రావెల్ ఏజెంట్‌ను పరిచయం చేయగా.. ఆయనకు రూ.65 లక్షలు చెల్లించారు. అవి తీసుకున్న ఏజెంట్ 2022లో దల్జీత్‌ను మొదట దుబాయ్‌కు పంపారు. 18 నెలలు అక్కడున్న తరువాత.. ఆయన ఇండియాకు తిరిగొచ్చారు. ఆ తరువాత అతన్ని అమెరికా పంపుతానని చెప్పి.. దక్షిణాఫ్రికాకు పంపించారు. అక్కడ నాలుగున్నర నెలలున్నారు. ఎట్టకేలకు గత ఏడాది ఆగస్టు 26న డంకీ మార్గం ద్వారా అమెరికా వెళ్లేందుకు ముంబై నుంచి బ్రెజిల్‌కు పంపించారు. బ్రెజిల్లో దాదాపు నెల రోజుల పాటు గడిపిన తర్వాత మూడు రోజులపాటు కాలినడక, ట్యాక్సీ, వివిధ మార్గాల ద్వారా పనామా దాటించారు. చివరకు మెక్సికోకు చేరుకున్న దల్జీత్ అక్కడా నెలరోజులపాటు ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో ట్రావెల్ ఏజెంట్ దల్జీత్‌ను ఇబ్బందులకు గురి చేశారు. అమెరికాకు పంపాలంటే.. వారి కుటుంబానికున్న నాలుగున్నర ఎకరాల భూమి యాజమాన్యాన్ని తనకు బదలాయించాలని ఒత్తిడి తెచ్చారు. బదిలీ చేసిన తరువాత జనవరి 27న దల్జీత్‌ను యూఎస్‌లోకి పంపించేశారు. అక్కడ అధికారులు అరెస్టు చేసి, డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. బయటకు కూడా రానివ్వకుండా గదిలో బంధించారు. ఆహారంగా నీళ్లబాటిల్, చిప్స్ ప్యాకెట్, ఆపిల్ ఇచ్చారు. రెండో విమానంలో తిరిగి భారత్‌కు పంపించారు. -
దటీజ్ ‘C-17A గ్లోబ్ మాస్టర్’!
అక్రమ వలసదారులైన 104 మంది భారతీయులను స్వదేశానికి తిప్పిపంపేందుకు అమెరికా పెట్టిన ఖర్చు రూ.8.74 కోట్లు. ఒక్కొక్కరికి అయిన వ్యయం రూ.8.40,670. అంటే దాదాపు ఎనిమిదన్నర లక్షలు. ఇందుకోసం అమెరికా వినియోగించిన భారీ మిలిటరీ విమానం... C-17A గ్లోబ్ మాస్టర్ III. సైనికులు, వాహనాలు, సరకులను తరలించేందుకు వీలుగా ఈ విమానాన్ని డిజైన్ చేశారు. అమెరికా వాయుసేనకు ఈ విమానాలు పెద్ద బలం, బలగం.ఇవి 1995 నుంచి సేవలందిస్తున్నాయి. పౌర విమానయానంతో పోలిస్తే సైనిక విమానాల ప్రయాణ వ్యయం అధికంగా ఉంటుంది. C-17A గ్లోబ్ మాస్టర్ గాల్లోకి లేచిందంటే గంటకు రూ.25 లక్షలు ఖర్చు అవుతుంది. అదే చార్టర్ ఫ్లైట్ విషయంలో గంటకు అయ్యే వ్యయం రూ.7.5 లక్షలే. గగనతలానికి సంబంధించి ఒక్కో దేశానికి ఒక్కోలా భద్రతా ఏర్పాట్లు, వైమానిక విధానాలు ఉంటుంటాయి. అందుకే వాణిజ్య విమానాలు సాధారణంగా ప్రయాణించే గగనతల దారుల్లో కాకుండా మిలిటరీ విమానాలు వేరే మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి.సాధారణ విమానాశ్రయాల్లో కాకుండా సైనిక స్థావరాల్లోనే మిలిటరీ విమానాలు ఇంధనం నింపుకుంటాయి. 104 మంది భారతీయులతో కాలిఫోర్నియాలో బయల్దేరిన C-17A గ్లోబ్ మాస్టర్... అటుతిరిగి, ఇటుతిరిగి మధ్యమధ్యలో ఆగుతూ సుమారు 43 గంటలు ప్రయాణించి చివరికి పంజాబ్ చేరింది. ఈ మిషన్ ఖర్చు మిలియన్ డాలర్లను మించిందని మరో అంచనా. అలా చూస్తే ఒక్కో భారతీయుడి తిరుగుటపాకు అమెరికాకు అయిన వ్యయం 10 వేల డాలర్లు. సాధారణ టికెట్ రేట్లను పరిశీలిస్తే... శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూఢిల్లీకి వన్ వే కమర్షియల్ ఫ్లైట్ ఎకానమీ తరగతిలో రూ. 43,734, బిజినెస్ క్లాస్ అయితే రూ.3.5 లక్షలు ఖర్చు అవుతుంది. అదీ సంగతి!::జమ్ముల శ్రీకాంత్(Credit: Hindustan Times) -
పాక్ హోటల్‌కు రూ.1,860 కోట్ల చెల్లింపు.. అమెరికా ప్రభుత్వంపై వివేక్ ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికాలో పాకిస్థాన్ ప్రభుత్వ ఆధీనంలో ఓ 19 అంతస్తుల హోటల్ ఉంది. ఆ హోటల్‌కు అమెరికా ప్రభుత్వం అద్దె రూపంలో ఏకంగా 220 మిలియన్ డాలర్లు చెల్లిస్తుంది. ఈ చెల్లింపులపై రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వలస దారులు మన దేశంలో విడిది చేసేందుకు.. మనమే వాళ్లకి వసతి కల్పిస్తున్నాం. అందుకు డబ్బులు కూడా మనమే చెల్లిస్తున్నాం. ఇది ఆమోద యోగ్యం కాదని అన్నారు.ప్రస్తుతం, న్యూయార్క్ నగరం మాన్హాటన్లో పాక్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రూజ్వెల్ట్ హోటల్ గురించి రచయిత జాన్ లెఫెవ్రే ఎక్స్ వేదికగా ప్రస్తావించారు.A taxpayer-funded hotel for illegal migrants is owned by the Pakistani government which means NYC taxpayers are effectively paying a foreign government to house illegals in our own country. This is nuts. https://t.co/Oy4Z9qoX45— Vivek Ramaswamy (@VivekGRamaswamy) December 1, 2024 ఆ పోస్ట్‌లో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఆధీనంలో ఉన్న రూజ్వెల్ట్ హోటల్‌కు న్యూయార్క్ నగర పాలక సంస్థ అద్దె రూపంలో పాకిస్థాన్ ప్రభుత్వానికి 220 మిలియన్లు (రూ.1860.40 కోట్లు) చెల్లిస్తోంది. ఉదాహరణకు.. న్యూయార్క్‌కు వలసదారుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పాకిస్థాన్ పౌరులు న్యూయార్క్‌కు వస్తుంటారు. వచ్చిన వాళ్లు వీసా,జాబ్ రకరకలా సమస్యల వల్ల అక్కడే ఉండాల్సి ఉంది..ఇమ్మిగ్రేషన్ సమస్య ఉంటే అమెరికా వదిలి వారి సొంత దేశం పాకిస్థాన్‌కు వెళ్లేందుకు వీలు లేదు.మరి అలాంటి వారు ఎక్కడ ఉంటారు.ఈ సమస్యకు పరిష్కార మార్గంగా మాన్హాటన్లో పాకిస్థాన్ ప్రభుత్వ ఎయిలైన్స్‌కు చెందిన రూజ్వెల్ట్ హోటల్‌ను అమెరికా ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. ఇమ్మిగ్రేషన్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్ పౌరులకు ఆ హోటల్లో వసతి కల్పిస్తుంది. హోటల్‌ను అద్దెకు తీసుకున్నందుకు రూ.1860.40 కోట్లు చెల్లిస్తుంది.ఈ అంశంపై వివేక్ రామస్వామి స్పందిస్తూ.. ‘మన దేశ ట్యాక్స్ పేయర్లు అక్రమ వలస దారులు బస చేసేందుకు హోటల్‌ను ఏర్పాటు చేశారు. ఆ హోటల్‌కూ అద్దె చెల్లించడం విడ్డూరంగా ఉంది’ అని పేర్కొన్నారు.అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడర్ రూస్వెల్ట్ పేరుతో ఉన్న ఈ 19 అంతస్తుల భవనంలో మొత్తం 1200 గదులున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారానికి కేంద్రంగా మారుతోందని రచయిత జాన్ లెఫెవ్రే ఆందోళన వ్యక్తం చేశారు. -
ట్రంప్ టెన్షన్.. 1500 మంది అక్రమ వలసదారుల కొత్త వ్యూహం!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయాన్ని అందుకున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ట్రంప్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కుర్చీ ఎక్కేలోగా వలసదారులు అమెరికా చేరుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. దాదాపు 1500 మంది అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం.డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టే నాటికి అక్రమ వలసదారులు అమెరికాలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మెక్సికన్ సిటీ తపచులా నుంచి దాదాపు 1500 మంది వలసదారులు అమెరికాకు బయలుదేరినట్టు కథనాలు వెలువడ్డాయి. సరిహద్దుల వెంట 2600 కిలోమీటర్లు నడక మార్గంలో ప్రయాణించి అమెరికా చేరుకోవాలని వారు ప్రణాళిక చేసుకున్నారు. అయితే, ఎలాగైనా అమెరికా చేరుకుని ట్రంప్ అధికారంలోకి రాక ముందే అక్కడ ఆశ్రయం పొందాలనేది తమ ప్రణాళిక సదరు వలస బృందంలోని ఓ వ్యక్తి చెప్పినట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.ఇదిలా ఉండగా.. తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను దేశంలోకి రాకుండా అరికడతానని, అమెరికాలో ఉన్నవారిని పంపించి వేస్తానని ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే లోపే అమెరికాలో అడుగుపెట్టాలని శరణార్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత పలువురు అక్రమ వలసదారులు ఇప్పటికే అమెరికాను విడిచివెళ్లినట్టు సమాచారం. Tapachula: This morning, Nov. 20th, another caravan departed southern Mexico. This is the sixth caravan to leave Chiapas since Claudia Sheinbaum's presidency; five have left from Tapachula and one from Tuxtla Gutiérrez with the intention of reaching central Mexico. “Fear,… pic.twitter.com/Y9W98aIQIY— Auden B. Cabello (@CabelloAuden) November 20, 2024 -
యూఎస్ పౌరులను చంపిన వలసదారులకు మరణ శిక్ష: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో.. అభ్యర్థులైన అటు కమలా హారిస్, ఇటు డొనాల్డ్ ట్రంప్ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడంతోపాటు దేశ పౌరులకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేందుకు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని అక్రమ వలసదారులపై విరుచుకుపడ్డారు. వలసదారులను ప్రమాదకరమైన నేరస్థులుగా అభివర్ణించారు. అమెరికా పౌరులను చంపిన వలసదారులకు మరణశిక్ష విధించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కొలరాడోలోని ఆరోరాలో నిర్వహించిన ప్రచార సభలో ట్రంప్ వలసదారులపై ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే వెనిజులా గ్యాంగ్ ట్రెన్ డీ అరాగ్వాకు చెందిన ముఠా సభ్యులను లక్ష్యంగా చేసుకొని ‘ఆపరేషన్ అరోరా’ ప్రారంభిస్తానని చెప్పారు.. ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక పాలసీని ప్రస్తావిస్తూ.. చట్టవిరుద్దమైన వలసదారుల చొరబాటు పౌరులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనిని త్వరలోనే పరిష్కరిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు.‘మన దేశాన్ని ప్రమాదకరమైన నేరస్థులు ఆక్రమించుకున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అమెరికాను ఆక్రమిత అమెరికా అని పిలుస్తున్నారు. నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే వలసదారులే లక్ష్యంగా నేషనల్ ఆపరేషన్ అరోరాను ప్రారంభిస్తా. దీంతో నవంబరు 5న అమెరికా విముక్తి దినోత్సవంగా మారుతుంది. అమెరికన్ పౌరుడిని, చట్టబద్ధంగా ఉన్న అధికారులను చంపిన వలసదారులకు మరణశిక్ష విధించే బిల్లును తెస్తాం. వెనెజువెలా గ్యాంగ్‌ను ఏరిపారేయడానికి ఆరోరాపై దృష్టిసారిస్తా. అరోరాను, దాడి చేసి స్వాధీనం చేసుకున్న ప్రతీ పట్టణాన్ని నేను రక్షిస్తా. ఈ క్రూరమైన నేరస్థులను జైలులో పెడతాం. వారిని దేశం నుంచి తరిమేస్తాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక, యూఎస్ ప్రభుత్వం దక్షిణ సరిహద్దు నియంత్రణకు మెక్సికోతో పలు సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈనేపథ్యంలో ఆ ప్రాంతంలో వలసదారుల చొరబాటు పెరిగిపోతుందని ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు.అంతేగాక మహిళలు, పిల్లల అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులతో సహా ఇతర నేరస్థులకు మరణశిక్షను పొడిగించాలని ట్రంప్ ఇప్పటికే ప్రతిపాదించారు. ఇక వచ్చే నెల 5వ తేదీని అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలాహారిస్‌లు బరిలో ఉన్నారు. -
బోటులో అగ్నిప్రమాదం.. 40 మంది హైతీ పౌరులు మృతి
పోర్ట్ ఓ ప్రిన్స్ : హైతీ నుంచి 80 మంది శరణార్థులతో వెళుతున్న బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సమారు 40 మంది మృతి చెందారు. మరో 40 మందిని హైతీ రక్షక దళం కాపాడింది.హైతీలోని సెయింట్ మైఖేల్ నార్త్ నుంచి బయలుదేరిన ఈ పడవ కాయ్‌కోస్, టర్క్స్ ఐలాండ్‌కు వెళుతోంది. పడవలో ఉన్నవారు క్యాండిల్స్ వెలిగించారు.దీంతో ఈ మంటలు బోటులో ఉన్న పెట్రోల్ డ్రమ్ములకు అంటుకోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. హైతీ గత కొంత కాలంగా సామాజిక, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో పౌరులు దేశం విడిచి వలస వెళుతున్నారు. -
వలసదారులకు భారీ ఆఫర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అమెరికా పౌరులను ఆకట్టుకునేందుకు బైడెన్ సర్కార్ అక్కడి చట్టబద్దతలేని వలసదారులకు భారీ ఉపశమనం కలి్పంచనుంది. అమెరికా పౌరులను పెళ్లాడిన వారికి దేశ పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించినట్లు బైడెన్ మంగళవారం ప్రకటించారు. అయితే ఈ వలసదారు ఇప్పటికే అమెరికాలోనే కనీసం పదేళ్లుగా నివసిస్తూ ఉండాలనే షరతు విధించారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న దాదాపు ఐదు లక్షల మంది వలసదారులకు ఈ నిర్ణయంతో లబ్దిచేకూరనుంది.అమెరికా పౌరుల భాగస్వాములు చట్టబద్ధత కోసం త్వరలో దరఖాస్తుచేసుకోవచ్చని తర్వాతి దశలో వాళ్లకు పౌరసత్వం ఇస్తామని బైడెన్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 17నాటికి అమెరికాలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని పదేళ్లు పూర్తయితే లీగల్ స్టేటస్(చట్టబద్ధత) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారి దరఖాస్తు ఆమోదం పొందితే మూడేళ్ల తర్వాత గ్రీన్‌కార్డ్ కోసం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారికి తాత్కాలిక వర్క్ పరి్మట్ ఇస్తారు.ఈ వర్క్ పరి్మట్ సాధిస్తే వారు దేశ బహిష్కరణ వేటు నుంచి తప్పించుకుని అమెరికాలోనే ఉద్యోగాలు/పనులు చేసుకోవచ్చు. ‘‘ పౌరసత్వంలేని భాగస్వామి, చిన్నారులతో కలసి అమెరికా పౌరులు కుటుంబసమేతంగా సంతోషంగా గడిపేందుకు అవకాశం కల్పిస్తున్నాం. కుటుంబాల ఐక్యత దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది’ అని ఈ సందర్భంగా బైడెన్ వ్యాఖ్యానించారు. పిల్లలూ దరఖాస్తు చేసుకోవచ్చు అమెరికా పౌరులను పెళ్లాడిన అక్రమ వలసదారుల పిల్లలూ చట్టబద్ధత కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి పిల్లలు దేశవ్యాప్తంగా 50,000 మంది ఉంటారని అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. జీవితభాగస్వామి చట్టబద్ధత కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అమెరికా పౌరులను పెళ్లాడి పదేళ్లు పూర్తికావాల్సిన పనిలేదు. అంటే పెళ్లికి ముందే అమెరికాలో పదేళ్లుగా ఉంటూ జూన్ 17వ తేదీలోపు పెళ్లాడినా సరే వాళ్లు దరఖాస్తుచేసుకునేందుకు అర్హులే.17వ తేదీ(సోమవారం) తర్వాత పదేళ్లు పూర్తయితే వారిని అనర్హులుగా పరిగణిస్తారు. అమెరికాలో సమ్మర్ సీజన్దాకా ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు వివరాలను ఇంకా నిర్ణయించలేదు. అమెరికా పౌరులను పెళ్లాడిన దాదాపు 11 లక్షల మంది వలసదారుల్లో చాలా మంది ఈ తాజా నిర్ణయంతో లబి్ధపొందనున్నారు. డ్రీమర్లకూ తాయిలాలు! అమెరికాలో నివసిస్తున్న చట్టబద్ధ వలసదారుల పిల్లల(డ్రీమర్లు)కు బైడెన్ సర్కార్ అదనపు సౌకర్యాలు కలి్పంచనుంది. ‘‘ అమెరికా ఉన్నత విద్యా సంస్థలో డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగ ఆఫర్ పొందిన డ్రీమర్లు నిరభ్యంతరంగా ఉద్యోగాలు చేసుకోవచ్చు’ అని బైడెన్ అన్నారు. అమెరికాలో హెచ్–1బీ, ఇతర దీర్ఘకాలిక నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాదారుల పిల్లలను ‘డ్రీమర్’లుగా పిలుస్తారు. ఈ చట్టబద్ధ వలసదారుల పిల్లల వయసు 21 ఏళ్లు నిండితే వారు అమెరికాలో ఉండటానికి అనర్హులు. అప్పుడు వారివారి స్వదేశాలకు అమెరికా సాగనంపుతుంది. ఈ ప్రమాదం నుంచి వీరందరినీ బయటపడేసేందుకు గతంలో ఒబామా సర్కార్ ‘డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ ప్రోగ్రామ్’ పేరిట రక్షణ కలి్పంచిన విషయం తెల్సిందే. -
అక్రమ వలసలకు చెక్.. సంచలన బిల్లు తెచ్చిన బ్రిటన్
లండన్: అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటున్న బ్రిటన్ వాటిని ఆపేందుకు సంచలన బిల్లు తీసుకువచ్చింది. మంగళవారం(ఏప్రిల్23) ‘సేఫ్టీ ఆఫ్ రువాండా’ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుతో అక్రమ వలసదారులకు అడ్డకట్టపడనుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారందరినీ ఆఫ్రికా దేశం రువాండాకు తరలిస్తారు. బ్రిటన్ రాజు చార్లెస్ 3 ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారుతుంది. బ్రిటన్‌కు వచ్చే అక్రమ వలసదారులను ఆపడానికి రువాండా బిల్లు తీసుకువచ్చినట్లు ప్రధాని రిషి సునాక్ తెలిపారు. దేశంలోకి చట్టవిరుద్ధంగా వచ్చేవారు నివసించడానికి ఇక నుంచి వీలులేదని చెప్పారు. అక్రమ వలసదారులను విమానాల్లో తీసుకువెళ్లి దేశం బయట వదిలేస్తామన్నారు. -
Lok sabha elections 2024: నాన్‌లోకల్ నాయిక
దిగ్గజాల వంటి లోకల్ నేతలు ఎందరో ఉండొచ్చు. మేం మాత్రం పక్కా నాన్ ‘లోకల్’! పుట్టి పెరిగింది ఎక్కడన్నది మాకనవసరం. మేమెక్కడ ల్యాండైతే అదే మాకు ‘లోకల్’! ‘తగ్గేదే లే...’ అంటున్నారు మహిళా రాజకీయ వలస పక్షులు. వీరిలో చాలామంది ఉత్తరప్రదేశ్‌ను తమ రాజకీయ కర్మభూమిగా మార్చుకోవడం విశేషం. అతి పెద్ద రాష్ట్రమైన యూపీకి అత్యధిక సంఖ్యలో నాన్ లోకల్ నాయికలకు రాజకీయ భిక్ష పెట్టిన రికార్డు కూడా ఉంది. అలా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ రాజకీయ అరంగేట్రం చేసినవారిలో ఏకంగా రాష్ట్రాన్నే ఏలిన వారొకరు. కేంద్రంలో చక్రం తిప్పినవారు ఇంకొకరు. ఈ వలస పక్షుల్లో సినీ తారలూ ఉన్నారు... డింపుల్ ‘భాభీ’... డింపుల్ యాదవ్ స్వస్థలం ఉత్తరాఖండ్. సమాజ్‌వాదీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్యగా యూపీలో అడుగుపెట్టారు. 2009 ఫిరోజాబాద్ ఉప ఎన్నికలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కానీ కాంగ్రెస్ నేత రాజ్‌బబ్బర్ చేతిలో ఓటమి చవిచూశారు. 2012లో కనౌజ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2019లో మళ్లీ ఓడినా 2022లో ములాయం సింగ్ యాదవ్ మరణం తర్వాత మెయిన్‌పురి ఉప ఎన్నికలో గెలుపొందారు. ‘వికాస్ కీ చాబీ.. డింపుల్ భాభీ..’ అంటూ సమాజ్‌వాదీ కార్యకర్తల నినాదాల నడుమ రెట్టించిన ఉత్సాహంతో ఈసారీ మళ్లీ మెయిన్‌పురిలో బీజేపీతో తలపడుతున్నారు. మీరా.. షీలా.. సుచేతా... బిహార్‌కు చెందిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ కూడా యూపీ నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. 1985లో బిజ్నోర్ ఉప ఎన్నికలో విజయంతో ఆమె ప్రస్థానం ఆరంభమైంది. కానీ తర్వాత ఆమె యూపీ నుంచి మళ్లీ పోటీ చేయలేదు. 2017లో యూపీఏ రాష్ట్రపతి అభ్యరి్థగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవిద్ చేతిలో ఓడారు. ఢిల్లీ సీఎంగా సుదీర్ఘకాలం చక్రం తిప్పిన పంజాబ్ పుత్రి షీలా దీక్షిత్ కూడా కాంగ్రెస్ తరఫున 1994లో తొలిసారి యూపీలోని కనౌజ్ నుంచే గెలిచారు. యూపీ తొలి మహిళా సీఎంగా చరిత్రకెక్కిన ప్రముఖ స్వాతంత్య్ర యోధురాలు సుచేతా కృపలానీ స్వస్థలం పంజాబ్! రాజకీయాల్లోనూ జయప్రదం రాజమండ్రిలో పుట్టిన తెలుగుతేజం జయప్రద. అసలు పేరు లలితారాణి. తెలుగు సినిమాల్లో వెలుగు వెలగడమే గాక బాలీవుడ్‌లోనూ రాణించారు. ఏడెనిమిది భాషల్లో నటించి ఎనలేని స్టార్డం సొంతం చేసుకున్నారు. ఎనీ్టఆర్ ప్రోద్బలంతో 1994లో టీడీపీలో చేరడం ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. పారీ్టతో విభేదించి సమాజ్‌వాదీ పారీ్టలో చేరడం ద్వారా యూపీలో అడుగు పెట్టారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి విజయం సాధించారు. అనంతరం సమాజ్‌వాదీతోనూ పొసగక రా్రïÙ్టయ లోక్‌మంచ్ పేరిట సొంత పార్టీ పెట్టి విఫలమయ్యారు. చివరికి 2019లో బీజేపీ గూటికి చేరారు. మాయావతి.. యూపీ క్వీన్ ఈ ‘బెహన్ జీ’ పుట్టింది, చదివింది ఢిల్లీలో అయినా దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది మాత్రం యూపీ నుంచే. 1984లో కాన్షీరాం స్థాపించిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో వ్యవస్థాపక సభ్యురాలిగా చేరిన మాయావతి 1989లో తొలిసారి యూపీ నుంచే ఎంపీగా గెలిచారు. తర్వాత ఆమె రాజకీయ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. రాష్ట్రంలోనే గాక దేశ రాజకీయాల్లోనూ తిరుగులేని దళిత నేతగా ఎదిగారు. 1995లో కాన్షీరాం ఆశీస్సులతో అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. దేశంలో తొలి దళిత మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. నాలుగుసార్లు యూపీ సీఎంగా చేశారు. ఆమె రాజకీయ ప్రస్థానాన్ని ప్రజాస్వామ్య సంచలనంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అభివరి్ణంచారు. స్మృతీ ఇరానీ.. జెయింట్ కిల్లర్ ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ సీరియల్ ‘క్వీన్’ బుల్లితెర నటిగా దేశవ్యాప్తంగా అభిమానుల మనసు దోచారు. 2003లో బీజేపీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో పోటీ చేసిన ఓడినా వెనకడుగు వేయలేదు. రాజ్యసభకు నామినేటయ్యారు. 2014లో అమేథీలో రాహుల్‌తో పోటీ పడటం ద్వారా యూపీ గడ్డపై కాలుమోపారు. తొలి ప్రయత్నంలో ఓడినా 2019లో రాహుల్‌ను ఓడించడంతో జెయింట్ కిల్లర్‌గా ఆమె పేరు దేశమంతటా మారుమోగింది. తనను ‘అమేథీ కీ బిటియా (అమేథీ బిడ్డ)’గా అభివరి్ణంచుకుంటూ అక్కడే స్థిరపడిపోయారు. ఈసారీ అమేథీ బరిలో నిలచి, దమ్ముంటే తనతో తలపడాలంటూ రాహుల్‌కు సవాలు విసురుతున్నారు. హేమమాలిని... మథుర ‘గోపిక’ అందం, నటనతో దేశాన్ని ఉర్రూతలూపిన బాలీవుడ్ డ్రీమ్‌గాళ్ హేమమాలిని స్వస్థలం తమిళనాడు. తమిళ సినిమాల నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టి బంపర్హిట్లతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ముంబైలో స్థిరపడిన హేమ 2011లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. తర్వాత బీజేపీలో చేరి యూపీ బాట పట్టారు. 2014లో మథుర నుంచి 3 లక్షల పై చిలుకు మెజారిటీతో గెలుపొందారు. 2019లోనూ అక్కడి నుంచే గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తన స్థానికతపై విపక్షాల విమర్శలను, ‘‘కృష్టుడిని ఆరాధించే గోపికగా మథురను నా స్వస్థలంగా మార్చుకున్నాను. పదేళ్లుగా ఇక్కడి ప్రజలకు సేవలందిస్తూ వారి మనసు గెలిచా. మళ్లీ గెలుపు నాదే’ అంటూ దీటుగా తిప్పికొడుతున్నారీ ‘బసంతి’! ధీశాలి... మేనక ఇందిర చిన్న కొడుకు సంజయ్ భార్యగా గాం«దీల కుటుంబంలో అడుగుపెట్టిన మేనక భర్త మరణాంతరం ఆ కుటుంబానికి పూర్తిగా దూరమయ్యారు. ఆమె స్వస్థలం ఢిల్లీ. 26 ఏళ్ల వయసులో రా్రïÙ్టయ సంజయ్ మంచ్ పేరుతో పార్టీ స్థాపించి 1984లో యూపీలోని అమేథీ నుంచి ఏకంగా రాజీవ్‌నే ఢీకొట్టి ఓడారు. 1989లో పిలిభిత్ నుంచి లోక్‌సభకు వెళ్లారు. 2004లో బీజేపీలో చేరారు. పిలిభిత్ నుంచి ఆరుసార్లు గెలిచారు. కేంద్ర మంత్రిగా రాణించారు. గత ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి గెలిచిన ఈ జంతు ప్రేమికురాలు ఈసారీ అక్కడి నుంచే బరిలో ఉన్నారు. ఇటలీ టు ఢిల్లీ.. వయా యూపీ యూపీకి రాజకీయంగా వలస వచ్చి దేశంలోనే పవర్ఫుల్ పొలిటీషియన్‌గా ఎదిగిన మహిళల్లో అగ్రతాంబూలం సోనియా గాం«దీదే. ఇటలీలో పుట్టి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని పెళ్లాడి, భారత్‌ను మెట్టినింటిగా చేసుకున్న సోనియా రాజకీయ రంగప్రవేశం చేసింది యూపీ నుంచే. గాం«దీల కంచుకోటైన అమేథీ నుంచే 1999 లోక్‌సభ ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. 2004లో రాయ్ బరేలీ నుంచి గెలిచి దేశ రాజకీయాల్లో సూపర్‌స్టార్‌గా మారారు. యూపీఏ చైర్‌పర్సన్‌గా పదేళ్లు సంకీర్ణ ప్రభుత్వంలో చక్రం తిప్పారు. 2019 దాకా రాయ్‌బరేలీ నుంచే లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు. తాజాగా సోనియా రాజ్యసభకు వెళ్లడంతో ఈసారి కూతురు ప్రియాంక బరిలో దిగొచ్చని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మణిపూర్ సీఎం సంచలన వ్యాఖ్యలు
ఇంఫాల్: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత రాష్ట్రంలోకి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్న వారందరినీ గుర్తించి పంపించి వేస్తామని ప్రకటించారు. ఇంఫాల్‌లో ఓ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కులం, మతంతో సంబంధం లేకుండా అలాంటి వారందరినీ రాష్ట్రం నుంచి వెళ్లగొడతామని చెప్పారు. మణిపూర్‌కు చెందిన తెగల ఉనికిని కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన హింస, అల్లర్లకు అక్రమ వలసదారులు, డ్రగ్స్, ముఖ్యంగా మయన్మార్ నుంచి వచ్చిన శరణార్థులు కారణమన్నారు. ‘ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నాం. ఇక్కడ ఉనికి కోసం పోరాటం జరుగుతోంది. ప్రస్తుత తరం అభద్రతాభావంతో ఉంది. భారత్ మయన్మార్ మధ్య ఫ్రీ మూమెంట్ రిజైమ్(ఎఫ్ఎమ్ఆర్)ఇక ఉండదు. రెండు దేశాల మధ్య కంచె నిర్మిస్తాం. ఈ తరం ఎదుర్కొంటున్న అభద్రతాభావం ముందు తరాలకు ఉండకూడదు’ అని బీరెన్‌సింగ్ అన్నారు. ఇదీ చదవండి.. ఎన్సీపీ నాదే.. సుప్రీంకోర్టుకు శరద్‌పవార్ -
సింగపూర్‌లో అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
సింగపూర్‌లో అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 17న ప్రపంచ వలసదారుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది వలసదారుల మధ్య ఉండే సహకార సంబంధానికి ప్రతీకగా, వారి హక్కులు, శ్రేయస్సు కోసం నిలబడే రోజుగా పరిగణిస్తారు. సురక్షిత వలసలను ప్రోత్సహించడం అనే థీమ్‌తో ఈ ఏడాది వలసదారుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. దీని ప్రకారం.. వలసదారులు, స్థానభ్రంశం చెందిన వ్యక్తులకు ఎదురయ్యే సవాళ్లను, మినహాయింపులను నొక్కి చెబుతుంది. శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్, తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ సంస్థలు సంయుక్తంగా వలస దారుల దినోత్సవం 2023లో భాగమయ్యారు. ఈ కార్యక్రమంలో వందలాది కార్మిక సోదరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా చిత్రలేఖనం పోటీ నిర్వహించి 25మంది విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తెలంగాణ స్పెషల్ సకినాలను అందరికి అందించారు. కార్యక్రమంలో ఉత్సాహంగా భాగస్వాములు అయిన శ్రీ సాంస్కృతిక కళాసారథి,తెలంగాణ కల్చరల్ సొసైటీ సంస్థలను సింగపూర్ ప్రభుత్వ మానవ వనరుల శాఖ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. -
‘మధ్యధరా’లో పడవ మునిగి 60 మంది మృతి
కైరో: మధ్యధరా సముద్రంలో పడవ మునిగి 60 మందికి పైగా వలసదారులు దుర్మరణం పాలయ్యారు. యూరప్‌కు బయల్దేరిన ఈ పడవ లిబియా తీర ప్రాంతంలో బోల్తాపడింది. మృతుల్లో చిన్నారులు, మహిళలే ఎక్కువని ఐరాస వలసల విభాగం ఆదివారం వెల్లడించింది. ఈ మార్గంలో కిక్కిరిసిన అక్రమ పడవల్లో ప్రయాణిస్తూ వేలాది మంది నిర్భాగ్యులు పడవ ప్రమాదాలకు బలయ్యారు. ఈ ఏడాదే 2,250 మంది మరణించారని ఐరాస తెలిపింది. -
వలసదారుల ట్రక్కు బోల్తా.. 10 మంది దుర్మరణం
దక్షిణ మెక్సికోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 25 మందికి పైగా గాయపడ్డారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ మెక్సికో రాష్ట్రమైన చియాపాస్‌లో అక్రమ వలసదారులను తీసుకెళ్తున్న ట్రక్కు హైవేపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది వలసదారులు మరణించారు 25 మందికి పైగా వలసదారులు గాయాలపాలయ్యారు. మృతులంతా మహిళలేనని అధికారులు తెలిపారు. వారిలో ఒకరు 18 ఏళ్లలోపు వయస్సు గలవారున్నారన్నారు. గ్వాటెమాల సరిహద్దులో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. వారం రోజుల వ్యవధిలో వలసదారులకు సంబంధించి ఇది రెండవ ప్రమాదం అని తెలుస్తోంది. ప్రమాద బాధితులంతా క్యూబన్లు అని ఒక అధికారి వార్తాసంస్థకు వెల్లడించారు. దక్షిణ రాష్ట్రమైన చియాపాస్‌లోని పిజ్జియాపాన్-టోన్లా హైవేపై ట్రక్కు 27 మంది క్యూబా వలసదారులను తీసుకువెళుతున్నారు. పిజిజియాపాన్-టోన్లా హైవేపై ట్రక్కు ప్రమాదానికి గురైంది. ట్రక్కు డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడిపినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని అధికారులు తెలిపారు. లారీ బోల్తా పడిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. ప్రస్తుతం క్షతగాత్రులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ట్రక్కు తునాతునకలయ్యింది. వలసదారులు తరచూ రష్యా నుండి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటారు. కాగా వలసదారులతో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురికావడం ఇది మొదటిసారి కాదు. గత గురువారం తెల్లవారుజామున చియాపాస్ రాష్ట్రంలోని మెజ్కలాపా మున్సిపాలిటీ పరిధిలో ఒక ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వలసదారులు మరణించారు. అమెరికా వెళ్లేందుకు వివిధ దేశాల నుంచి వేలాది మంది వలసదారులు మెక్సికో నుంచి బస్సులు, ట్రక్కులు, గూడ్స్ రైళ్లలో సైతం ప్రయాణిస్తుంటారు. 2021లో జరిగిన ఇటువంటి ప్రమాదంలో 55 మంది వలసదారులు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఇది కూడా చదవండి: జపనీస్ కుర్రాళ్లు గడ్డం ఎందుకు పెంచుకోరు? -
దక్షిణాఫ్రికాలో పెను విషాదం
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద నగరం జొహన్నెస్‌బర్గ్‌లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 73 మంది చనిపోయారు. మరో 52 మంది గాయపడ్డారు. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన ఈ ఘటనలో బాధితులంతా బతుకుదెరువు కోసం వచ్చిన వలసదారులేనని అధికారులు తెలిపారు. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో భవనంలో చెలరేగిన మంటలకు కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ప్రమాదం విషయం తెలియగానే తమ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పారని నగర అత్యవసర సేవల విభాగం ప్రతినిధి రాబర్ట్ ములౌడ్జి అన్నారు. భవనంలోని అయిదంతస్తుల్లోనూ మంటలు వ్యాపించాయన్నారు. అందులో చిక్కుకున్న వారిని సాధ్యమైనంత వరకు రక్షించామన్నారు. మొత్తం 73 మృతదేహాలను వెలికితీశామని చెప్పారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన, ఊపిరాడక స్పృహతప్పిన మరో 52 మందిని ఆస్పత్రులకు తరలించామన్నారు. ‘భవనంలోని ప్రతి అంతస్తులోనూ అనధికారికంగా పలు నిర్మాణాలు ఉండటంతో చాలా మంది లోపలే చిక్కుకుపోయారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. నేరగాళ్ల ముఠాలు తిష్ట వేయడంతో భవనానికి కరెంటు, నీరు, శానిటేషన్ వసతులను మున్సిపల్ అధికారులు కట్ చేశారు. ఇవి లేకున్నా వలసదారుల కుటుంబాలు ఉంటున్నాయి. కొందరికి పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి భవనాలు ఇక్కడ చాలానే ఉన్నాయి’అని రాబర్ట్ చెప్పారు. -
సౌదీ సైన్యం కాల్పుల్లో వందలాది మంది మృతి !
దుబాయ్: సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించేందుకు యతి్నంచిన ఇథియోపియా వలసదారులపై సౌదీ బలగాలు జరిపిన కాల్పుల్లో వందలాదిమంది మృతి చెందినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ మంగళవారం తెలిపింది. సైన్యం మెషిన్స్ గన్లు, మోర్టార్లతో జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. యెమెన్ వైపు ఉన్న సరిహద్దు నుంచి వస్తున్న వలసదారులపైకి సౌదీ బలగాలు కాల్పులు జరపడంపై ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. హ్యూమన్ రైట్స్ వాచ్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తోందని సౌదీ అధికారి ఒకరు ఖండించారు. సౌదీలో ప్రస్తుతముంటున్న 7.50 లక్షల మంది ఇథియోపియన్ శరణార్థుల్లో 4.50 లక్షల మంది అనధికారికంగా ఉంటున్నవారే. ఇప్పటికే నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్న సౌదీ ప్రభుత్వం వీరిని వెనక్కి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
గ్రీస్ పడవ విషాదం.. 500 మందికి పైగా గల్లంతు!
ఏథెన్స్: గ్రీస్ సమీపంలోని మెస్సేనియా పైలోస్ తీరంలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో 78 మంది మృతి చెందగా సుమారు 500 మంది గల్లంతై ఉంటారని అదే ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్న ఇద్దరు యువకులు సిరియాకు చెందిన హసన్(23) పాకిస్తాన్ కు చెందిన రాణా(24) తెలిపారు. ఈ పడవలో 15 మంది సిబ్బంది, మొత్తంగా 700 మంది శరణార్థులు ప్రయాణిస్తున్నారని వారన్నారు. లిబియా నుండి అనేక మంది అక్రమ రవాణాదారులు చాలా ఏళ్లుగా శరణార్థులను ఇలా తరలిస్తూ ఉన్నారని, అక్కడ తనకు చాలా తక్కువ వేతనం లభిస్తుండటంతో జర్మనీ వెళ్లాలన్న ఆలోచనతో ప్రయాణమయ్యానని హసన్ అన్నాడు. మరో శరణార్థి రాణా తానూ ఇటలీ వెళ్లడం కోసం లిబియా అక్రమార్కులకు చాలా పెద్ద మొత్తంలో చెల్లించానని, కానీ వారు మాకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా చాలీచాలని నీళ్లు, ఆహారం ఇచ్చి నాలుగు రోజులు ప్రయాణంలో సర్దుకోమని చెప్పారన్నాడు. పడవలో ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. మూడో రోజు పడవలోకి ఒక పక్క నుండి నీళ్లు రావడంతో జనమంతా కంగారుగా రెండో పక్కకు కదిలారు. అంతే క్షణాల్లో పడవ నీటమునిగింది. గ్రీస్ కోస్ట్ గార్డ్ బృందం వచ్చి కాపాడేంతవరకు మాకైతే ఏమీ తెలియలేదని వాళ్లిద్దరూ తెలిపారు. బోటులో సుమారుగా 500 మంది ప్రయాణిస్తున్నారని వారిలో 79 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించామని 104 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారని మిగిలిన వారు గల్లంతై ఉంటారని వారు ప్రాణాలతో దొరికే అవకాశాలున్నాయని గ్రీస్ కోస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇతర బోట్లతో పాటు డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. ఇది కూడా చదవండి: 3 వేల ఏళ్లయినా ‘కత్తి’లా ఉంది! -
కన్నడనాట తెలుగువాడి వేడి.. వలస ఏ పార్టీకో! ఆరు రాష్ట్రాలతో సరిహద్దులు
సాక్షి బెంగళూరు : కర్ణాటక ఎన్నికల్లో ఒక పార్టీ విజయం సాధించాలంటే కన్నడిగుల ఓట్లు మాత్రం పడితే చాలనుకుంటే పొరపాటు పడ్డట్లే..! దశాబ్దాలుగా కన్నడ నాట ఇరుగు పొరుగు రాష్ట్రాల ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరే ఇతర రాష్ట్రానికి లేని విదంగా దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక ఏకంగా ఆరు రాష్ట్రాలతో సరిహద్దుల్ని పంచుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలతో సరిహద్దులున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వలసలు ఎక్కువే. బెంగుళూరు వంటి మహానగరంలో వ్యాపారాలు, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారెందరో ఉన్నారు. రాష్ట్రంలో 65.45 లక్షల మందివరకు వలసదారులు ఉన్నారు. వీరి ఓట్ల కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక ఈ సారి ఎన్నికల బరిలో కూడా ఎందరో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలుగు మూలాలున్న వారు 100 మంది, మరాఠా మూలాలున్న వారు 50 మందికి పైగా, తమిళులు 10 మంది వరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బెంగళూరులో ఎవరి జనాభా ఎంత? ► రాజధానిలో 44 శాతం కన్నడిగులు ఉంటే 56 శాతం ఇతర భాషా ప్రజలు ఉన్నారు. తెలుగు వారు అత్యధికంగా 25–30 లక్షల మంది ఉన్నారు. ► తమిళులు 16–17 లక్షల మంది ఉంటే మళయాలీలు 4–5 లక్షలు ఉన్నారు ► ఇక ఉత్తరాది రాష్ట్రాల జనాభా 11–12% ఉన్నారు.రాజస్తాన్, బిహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇటీవల కాలంలో జార్ఖండ్, త్రిపుర నుంచి కూడా వలసలు పెరిగాయి. ► రాజస్తాన్‌కు చెందిన జైన సామాజికవర్గం ప్రజలు బెంగళూరులో చాలా చోట్ల నివసిస్తూ ఎన్నికల్లో నిర్ణయాకత్మకమైన పాత్రను పోషిస్తున్నారు. తెలుగు వాడి వేడి కర్ణాటకలో దాదాపుగా 40–50 అసెంబ్లీ స్థానాల్లో తెలుగువారి ప్రభావం అధికంగా ఉంది. రాష్ట్రంలో సుమారు కోటి మంది వరకు తెలుగు ప్రజలు కర్ణాటకలో నివసిస్తున్నట్లు అనధికారిక సమాచారం. పలు దశాబ్దాలుగా వివిధ కారణాలతో కర్ణాటకకు వచ్చి ఇక్కడి కన్నడిగులతో మిళితమై తెలుగు వారు జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడిపోయారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని నిర్వహిస్తున్న వారిలో అధిక భాగం తెలుగు ప్రాంత ప్రజలే కావడం గమనార్హం. ఒక్క బెంగళూరులోనే సుమారు 25 లక్షలకు పైగా తెలుగు వారు ఉన్నారు. కర్ణాటకలో కన్నడ, ఉర్దూ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉంది. బెంగళూరులోని కేఆర్ పురం, రామ్మూర్తినగర, హెబ్బాళ, మారతహళ్లి, మహదేవపుర, యలహంకా, దేవనహళ్లితో పాటు ఏపీ, తెలంగాణ సరిహద్దు కలిగిన బళ్లారి జిల్లా, బీదర్, కలబురిగి, రాయచూరు, యాదగిరి, బసవకల్యాణ, కోలార, తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర జిల్లాల్లో తెలుగు వారు అధికంగా ఉన్నారు. 1947లో ఏర్పడిన మైసూరు రాష్ట్రానికి తెలుగు వ్యక్తి క్యాసంబల్లి చెంగరాయరెడ్డి ఎన్నికయ్యారు. 1956లో కర్ణాటక రాష్ట్రం ఏర్పడ్డాక ఎందరో తెలుగువారు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఓట్ల కోసం వ్యూహాలు కర్ణాటకకు పొట్ట చేతపట్టుకొని వచ్చిన వలసదారులు గుర్తింపు సమస్యని అధికంగా ఎదుర్కొంటున్నారు. 65 లక్షల మంది వలసదారుల్లో ఎంత మందికి కర్ణాటకలో ఓటు హక్కు ఉందో అన్న దానిపై స్పష్టమైన గణాంకాలేవీ లేవు. కార్మికులుగా పని చేస్తున్న వారికి తాగు నీరు, ఉండడానికి ఇల్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటివన్నీ సమస్యలుగానే ఉన్నాయి. టీ, కాఫీ తోటల్లో పని చేస్తున్న కూలీలు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. అధికార బీజేపీ వీరిని సంప్రదిస్తూ రేషన్ కార్డులు ఇప్పించడం, ప్రభుత్వం పథకాలు వారికి అందేలా చూస్తామని హామీలు ఇస్తోంది. వలసదారుల ఓట్లను రాబట్టేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన యువ ఎమ్మెల్యేలు, ఎంపీలను రంగంలోకి దింపింది. గుజరాత్‌కు చెందిన హార్దిక్ పటేల్ సహా వివిధ రాష్ట్రాల యువ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా వివిధ భాషలకు చెందిన వారి ఓట్లను రాబట్టేందుకు ఆయా రాష్ట్రాల నాయకుల్ని ప్రచార పర్వంలోకి తీసుకువచ్చింది. -
ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది శరణార్థులు మృతి.. 29 మందికి గాయాలు..
మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాద ఘటనలో 39 మంది దుర్మరణం చెందారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ శరణార్థి కేంద్రంలో పరుపులకు నిప్పంటించడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అమెరికా-మెక్సికో సరిహద్దులోని చిహువాహువా రాష్ట్రం సియుడాడ్ జువారెజ్‌లో ఈ శరణార్థి కేంద్రం ఉంది. ఇతర దేశాల నుంచి మెక్సికోకు వచ్చే వలసదారులు అమెరికాలోకి ప్రవేశించేందుకు ఈ ప్రాంతం ముఖ్యమైంది. అమెరికా ఆశ్రయం కోరేవారు అధికారిక ప్రక్రియ పూర్తయ్యేవరకు ఇక్కడే ఉంటారు. అయితే వలసదారులందరినీ వెనక్కి పంపిస్తున్నారని ఎవరో ప్రచారం చేయడంతో శరణార్థి కేంద్రంలో ఉన్నవారంతా సోమవారం రాత్రి నిరసనలకు దిగారు. ఇందులో భాగంగానే కొందరు పరుపులకు నిప్పు అంటించడంతో ఆ మంటలు క్షణాల్లోనే వ్యాపించి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలకు 39 మంది బలయ్యారు. చదవండి: వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. చూస్తే గుండె గుభేల్..! -
మా సోదరులను రక్షిస్తాం!ఎవరైనా బెదిరిస్తే కాల్ చేయండి: స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులను రక్షస్తామని హామి ఇచ్చారు. వలస కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరైనా మిమ్మల్ని బెదరిస్తే హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి అని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం, ప్రజలు, మా వలస సోదరులకు రక్షణా నిలుస్తారని అని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తమిళనాడు, బిహార్ అధికారులు వలస కార్మికులపై దాడుల గురించి అనవసరమైన పుకార్లు సృష్టించకుండా హెచ్చరికలు జారీ చేశారు. ఈ పుకార్లే కార్మికులలో భయాందోళనలకు దారితీసిందని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయమే బిహార్ అసెంబ్లీలో వాడివేడి చర్చలకు దారితీసింది. వలస కార్మికులను కలుసుకోవడం తోపాటు స్థానిక అధికారులను కూడా సంప్రదిస్తామని స్టాలిన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. బిహార్ నుంచి వలస వచ్చిన కార్మికులపై దాడులకు సంబంధించిన పుకార్లను తనిఖీ చేయడానికి ఇరు రాష్ట్రాల పోలీసులు సోషల్ మీడియాపై నిఘా పెట్టినట్లు తెలిపారు. అలాగే వలస కార్మికులను భయపడవద్దని తమిళనాడు జిల్లా కలెక్టర్లు హిందీలో విజ్ఞప్తి చేశారు.కాగా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ విషయమై అన్ని ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పైగా వారికి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: డ్రైవర్ లేకుండానే దానికదే హఠాత్తుగా స్టార్ట్ అయిన ట్రాక్టర్!ఆ తర్వాత..) -
ఇటలీ సముద్ర జలాల్లో పడవ మునక
రోమ్: ఇటలీ సముద్ర జలాల్లో వలసదారులు ప్రయాణిస్తున్న ఒక చెక్క పడవ రెండు ముక్కలై నీళ్లల్లో మునిగిపోయింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఎందరో మరణించారు. ఇప్పటివరకు సహాయ సిబ్బంది 58 మృతదేహాలను వెలికి తీశారు. మరో 60 మంది ప్రాణాలు కాపాడారని స్టేట్ టీవీ వెల్లడించింది. ప్రమాదం జరిగినప్పుడు పడవలో 180 మందికి పైగా శరణార్థులున్నట్టుగా తీర ప్రాంత పట్టణమైన క్రోటోన్‌లో ఓడరేవు అధికారులు చెబుతున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికుల్ని ఎక్కించడం వల్లే అయోనియాన్ సముద్రంలో ప్రయాణిస్తున్న పడవ ధ్వంసమై ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. -
ఘోర ప్రమాదం.. 39 మంది వలసదారులు మృతి
దక్షిణ అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పనామాలో అమెరికాకు వలస వెళ్లే వారిని తీసుకెళ్తున్న బస్సు.. మరో మినీ బస్సును ఢీకొట్టింది. చిరికీలోని గ్వాలకాలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 39 మంది మృత్యువాతపడినట్లు పనామా జాతీయ వలసదారుల డైరెక్టర్ సమీరా గోజైన్ బుధవారం తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, అతని సహాయకుడితోసహా మొత్తం 66 మంది ఉన్నారు. రాజధాని పనామా నగరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చిరీకి ప్రావిన్స్ రాజధాని నగరం డేవిడ్‌లోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తోంది. క్షతగాత్రుల సంఖ్యను, మృతుల వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. తొలుత 15 మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా మృతుల సంఖ్య 39కు పెరిగింది. కొలంబియా సరిహద్దులోని అడవి ప్రాంతం అయిన డేరియన్ నుంచి వలసదారులతో బస్సు బయల్దేరింది. వీరంతా పనామా, కోస్టా రికా, సెంట్రల్ అమెరికా, మెక్సికో గుండా చివరికి యునైటెడ్ స్టేట్స్కు ప్రయాణిస్తున్నారు. -
కువైట్ వెళ్లేవారికి కొత్త నిబంధన.. వలస కార్మికులు ఆవేదన
మోర్తాడ్(బాల్కొండ): మనదేశం నుంచి వెళ్లే వారికిగాను కువైట్ వీసా నిబంధనలను సవరించింది. కువైట్ నుంచి వీసాలు జారీ అయిన తరువాత అవి అసలువో నకిలీవో తేల్చడానికి ఆ దేశ కాన్సులేట్ల పరిశీలన కోసం పంపాల్సి ఉంది. ఈ కొత్త నిబంధన పదిహేను రోజుల కింద అమలులోకి వచ్చింది. వీసాలను కాన్సులేట్ పరిశీలన కోసం పంపడం వల్ల కాలయాపనతో పాటు ఆర్థికంగా భారం పడుతుందని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కువైట్‌లో ఉపాధి పొందాలనుకునే వారు లైసెన్స్డ్ ఏజెన్సీలు, లేదా తమకు తెలిసిన వారి ద్వారా వీసాలను పొందిన తరువాత పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) తీసుకోవాల్సి ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో ఒక్క కువైట్‌కు మాత్రమే పీసీసీ తప్పనిసరి అనే నిబంధన ఉంది. వీసా కాపీల పరిశీలనను ఇప్పుడు అదనంగా చేర్చారు. కువైట్ నుంచి వీసాలను ఆన్లైన్లోనే జారీ చేస్తున్నారు. ఈ వీసాలు అన్ని కువైట్ విదేశాంగ శాఖ ద్వారానే జారీ అవుతున్నాయి. విదేశాంగ శాఖ ఆమోదంతోనే వీసాలు జారీ కాగా, వాటిని మరోసారి తమ కాన్సులేట్‌ల్లో పరిశీలనకు పంపాలని కువైట్ ప్రభుత్వం సూచించడం అర్థరహితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీ, ముంబైలోనే కాన్సులేట్లు కువైట్ విదేశాంగ శాఖకు సంబంధించిన కాన్సు లేట్లు ఢిల్లీ, ముంబైలలోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కువైట్‌కు భారీగానే వలసలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కాన్సులేట్ ఏర్పాటు చేయాలని కొన్ని సంవత్సరాల నుంచి వలస కార్మికులు కోరుతున్నారు. కువైట్ ప్రభుత్వం గతంలో సానుకూలంగా స్పందించినా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. కువైట్ ప్రభుత్వం కొత్త నిబంధన అమల్లో తీసుకురావడంతో కాన్సులేట్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. (క్లిక్ చేయండి: లే ఆఫ్స్ దెబ్బకి భారత ఐటీ ఉద్యోగుల విలవిల) -
వలస బతుకుల మెతుకు వేట..!
సొంతూరులో ఉపాధి కరువు.. ప్రతి పూటా బతుకు పోరాటం.. జీవనయానం కోసం వేల కి.మీ. పయనం. రోడ్డు పక్కన గుడారాలు వేసుకుని ఆ చెంతనే నిప్పుల కొలుములు పెట్టుకుని వ్యవసాయ పరికరాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ సీజన్లోనే వీరికి ఆదరువు. ఒక వైపు యాంత్రీకరణ పెరిగిపోతున్నా.. బుక్కెడు మెతుకుల కోసం వలస జీవులు ఊరూరా తిరుగుతూ తమకు తెలిసిన నైపుణ్యంతోపనిముట్లు తయారు చేసి విక్రయిస్తూ పొట్ట నింపుకుంటున్నారు. వలస జీవుల జీవన ఆరాటంపై స్పెషల్ ఫోకస్... దర్శి టౌన్(ప్రకాశం జిల్లా): మధ్యప్రదేశ్..ఉత్తరప్రదేశ్..ఛత్తీస్‌ఘడ్.. ఇవన్నీ జిల్లాకు సుదూర ప్రాంతాలే. ఎన్నో వేల కిలోమీటర్లు దాటి వచ్చి ఎన్నో ఆశల మధ్య జీవనం సాగిస్తున్నారు వలస జీవులు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. పనిచేస్తేకానీ నోటికందని మెతుకుని రెక్కల కష్టం చేద్దామన్నా స్థానికంగా అండ లేక, పూటగడవడమే కష్టమైన వేళ.. వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తూ ముందుకు సాగుతున్నారు. నిప్పుల కొలిమిలో ఇనుమును కరిగించి.. రెక్కలు ముక్కలు చేసుకుంటూ వ్యవసాయ పనిముట్లు తయారు చేసి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ కుటుంబాల్లో పిల్లా పెద్దా,.. ఆడ, మగ.. ఇలా అందరికీ ఇనుముతోనే బతుకు అంతా ముడిపడి ఉంటుంది. ఒకరో ఇద్దరో కాదు ఐదు వేల మందికి పైగా నిరుపేదలకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి జిల్లాకు పొట్టచేత పట్టుకుని వస్తున్నారంటే ఆశ్చర్యం కలిగించక మానదు. ఏటా వ్యవసాయ సీజన్లో ఒక్కడే ఉండి ఊరూరా తిరుగుతూ వ్యవసాయ పనిముట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇలా సీజన్లో నాలుగు డబ్బులు సంపాదించుకుని తిరిగి సొంత ఊళ్లకు వెళ్తుంటారు. డొక్కాడాలంటే రెక్కాడాల్సిందే.. యాంత్రీకరణ గణనీయంగా పెరిగిన ఈ రోజుల్లోనూ వారు చేతి వృత్తి పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఉదయం ఆరున్నర గంటలకు మొదలై పని రాత్రి ఏడు గంటల వరకు కొనసాగుతుంది. ఆడ, మగ తేడా లేకుండా పనిముట్లు తయారు చేస్తారు. పనిముట్లు తయారు చేసుకునేందుకు అవసరమైన పరికరాలు తమ వెంట తెచ్చుకుంటారు. వీటి తయారీకి లారీల పాత కమాన్ ప్లేట్లు కేజీ రూ.80కి కొంటారు. వాటిని కొలిమిలో కాల్చి ఇనుమును కరిగించి, సమ్మెటల సాయంతో గునపాలు, కొడవళ్లు, పారలు, వంట పనిముట్లు తయారు చేస్తారు. రోడ్డు పక్కన నిప్పుల పొయ్యి రాజేసుకుని చపాతీలు, రోటీలు తయారు చేసుకుని తింటారు. రాత్రయితే రోడ్ల పక్కన గుడారాలు వేసుకుని గుడి మెట్ల పక్కనో..షాపుల ఆవరణలో నిద్రిస్తారు. సైజును బట్టి కొడవలి రూ.20 నుంచి రూ.200 వరకు విక్రయిస్తారు. గొడ్డలి రూ.150 నుంచి రూ.300, మాంసం కత్తి రూ.100 నుంచి రూ.250 వరకు విక్రయిస్తారు. రోజుకు వెయ్యి నుంచి రూ.1500 వరకు విక్రయాలు ఉంటాయి. ఊరూరా తిరుగుతూ వాటిని విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో పిల్లలను సాకుతున్నారు. సంచార జీవితం సాగిస్తూ బతుకులు వెళ్లదీస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో 5 వేల మందికి పైగా పనిముట్ల తయారీలో జీవనోపాధి పొందుతున్నారు. ముఖ్యంగా జన సంచార ప్రాంతాల్లో కొంత స్థలంలో తాత్కాలికంగా కొలిమి ఏర్పాటు చేసుకుని పనిముట్లు తయారు చేస్తుంటారు. జిల్లాలో ఎక్కువగా దర్శి బస్టాండ్ ప్రాంతం, తాళ్లూరు వీకే కళాశాల వద్ద, వినుకొండలో కురిచేడు రోడ్లో గొర్రెల బడ్డి వద్ద వ్యవసాయ పరికరాలు తయారు చేసుకుని విక్రయిస్తున్నారు. దొనకొండ నాలుగు కూడళ్ల ప్రాంతంలో, చీమకుర్తిలో జవహర్ హాస్పిటల్ వద్ద, బీవీఎస్ కళాశాల ప్రాంతం, గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో, మోటు వద్ద, మార్కాపురంలో తర్లుపాడు మండల కేంద్రం, కొండపి బస్టాండ్ ప్రాంతంలో, కట్టంవారిపాలెం వద్ద, యర్రగొండపాలెం బస్టాండ్ ప్రాంతంలో అర్ధవీడు మండలం కుంట వద్ద స్థావరాలు ఏర్పాటు చేసుకుని డిమాండ్ ఉన్న రోజుల వరకు అక్కడే ఉంచి పనిముట్లు తయారు చేసి అమ్ముకుని జీవనం సాగిస్తారు. అక్కడ ఆదరణ లేదు మధ్యప్రదేశ్‌లో పనిముట్లు తయారు చేసినా సరైన ఆదరణ లేదు. అమ్ముకోవాలంటే గిరాకీ లేదు. అందుకే వ్యవసాయ సీజన్లో ఏడు నెలల పాటు ఇక్కడే ఉంటూ పలు గ్రామాలు తిరుగుతూ పనిముట్లు అమ్ముకుంటాం. రోజుకు గ్రామాన్ని బట్టి రూ.1500 నుంచి రూ.2 వేలు వరకు వస్తాయి. ఖర్చులు పోను జీవనానికి ఇబ్బందులు ఉండవు. ఉపాధి కల్పిస్తున్న ఏపీకి ప్రత్యేక కృతజ్ఞతలు. – జగదీష్, భోపాల్, మధ్యప్రదేశ్ -
వేధించాడని ఇంటికి పిలిచి హత్య
సాక్షి, బొమ్మనహళ్లి: ఓ యువకుడి హత్య కేసులో పోలీసులు దంపతులతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎలక్ట్రానిక్ సిటీ డీసీపీ చంద్రశేఖర్ వివరాల మేరకు...ఎలక్ట్రానిక్ సిటీలో రీనా, గంగేశ్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు యూపీకి చెందిన వారు. రీనాకు నిబాశిశ్ పాల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఈ క్రమంలో గంగేశ్ యూపీకి వెళ్లిన సమయంలో రీనా ఇంటికి నిబాశిష్ వచ్చి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆమె లేదని తిరస్కరించడంతో ఎలాగైనా ఇవ్వాలని, లేదంటే అన్ని విషయాలు భర్తకు చెబుతానని బెదిరించాడు. దీంతో రీనా భర్తకు ఈ విషయం చెప్పింది. వెంటనే అతను బెంగళూరు వచ్చాడు. అదే రోజు పథకం ప్రకారం నిబాశిశ్‌ను ఇంటికి పిలిపించి పీకల దాకా మద్యం తాపించి గంజాయి కూడా ఇచ్చారు. అనంతరం చీరతో గొంతు పిసికి చంపేశారు. మృతదేహాన్ని అక్కడికి నుంచి తరలించడానికి మరో స్నేహితుడు బిజోయ్‌ను పిలిపించారు. రాత్రి వేళ శవాన్ని బైక్‌లో పెట్టుకుని ఓ గుర్తు తెలియని చోట పడేసి వెళ్లిపోయారు. మరుసటి రోజే టాటాఏస్ వాహనం పిలుచుకుని వచ్చి ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. నిబాశిష్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి టాటాఏఎస్ వాహనం డ్రైవర్‌ను పట్టుకున్నారు. అతని ద్వారా నిందితులు శివమొగ్గ జిల్లా శికారిపురలో ఉన్నట్లు తెలుసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. (చదవండి: ప్రేమించమని వేధింపులు.. భయాందోళనతో..) -
వెలుగుల మాటున నలిగిన బతుకులు
సాక్షి, నిజామాబాద్/జగిత్యాల: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్‌వాసి కల్లెడ రమేశ్(50) ఖతర్‌లోని బూమ్ ఇంటర్నేషనల్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తూ 2016లో తీవ్ర అనారోగ్యానికి గురై మరణించాడు. ఫుట్‌బాల్ కప్(ఫిఫా) టోర్నీకి సంబంధించిన విధుల్లో పనిగంటలను విపరీతంగా పెంచడంతో తీవ్ర ఒత్తిడికి గురికావడమే కారణం. రమేశ్ కుటుంబానికి ఖతర్ ప్రభుత్వం, కంపెనీ పరిహారం చెల్లించలేదు. ఇతని మృతితో కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా పోయింది. జగిత్యాల్ జిల్లా మల్లాపూర్ మండలం ఫ్యాక్టరీ చిట్టాపూర్‌కు చెందిన సురకంటి జగన్(32) 2021 నవంబర్ 11లో ఖతర్‌లో ఫుట్‌బాల్ స్టేడియంలో పైప్‌లైన్ పనులు చేస్తుండగా మట్టిపెళ్లలు కూలి సమాధి అయ్యాడు. అతని భార్య, కూతురు, కొడుకులు పెద్ద దిక్కును కోల్పోయారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకూ ఆధారం లేకుండా పోయింది. జగిత్యాల్ జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లికి చెందిన నరుకుల్ల శ్రీనివాస్(30) 2020 జనవరి 4న ఖతర్ ఫుట్‌బాల్ స్టేడియంలో టవర్ క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తుండగా మరణించాడు. అతని మరణంతో భార్య అనిత, ఇతర కుటుంబసభ్యులు కుంగిపోతున్నారు. ఫిఫా పోటీల కోసం ఖతర్ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్టులో పని కోసం వెళ్లి ప్రమాదాలు, పని ఒత్తిడితో తీవ్ర అనారోగ్యానికి గురికావడం, అనుమానాస్పద స్థితిలో మరణించిన మన దేశ వలస కార్మికుల సంఖ్య 2,800 వరకు ఉంటుందని అంచనా. నరుకుల్ల శ్రీనివాస్ అంతిమయాత్రలో ప్లకార్డులతో పాల్గొన్న గల్ఫ్ జేఏసీ నాయకులు ఆసియా దేశాలకు సంబంధించిన వలస కార్మికులు ఖతర్‌లో గడచిన పదేళ్లలో 6,500 మంది మరణించారని వలస కార్మికుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ ఫుట్‌బాల్ కప్(ఫిఫా) పోటీల కోసం ఖతర్ ప్రభుత్వం దాదాపు రూ.16 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. స్టేడియంలు, క్రీడాకారులు, క్రీడాభిమానుల సౌకర్యాల కోసం ఎన్నో నిర్మాణాలను చేపట్టింది. పోటీల కోసం ఖతర్ ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసినా వలస కార్మికుల కుటుంబాలకు మాత్రం పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలు వస్తున్నాయి. వాటిని సహజ మరణాలుగానే ధ్రువీకరించడం గమనార్హం. ఫిఫా పనుల కోసం ఖతర్ ప్రభుత్వం వివిధ కంపెనీలకు పదేళ్ల కిందనే కాంట్రాక్టులు ఇచ్చింది. ఖతర్ అమరుల కుటుంబాలను ఆదుకోవాలి ఖతర్‌లో ఫిఫా పనుల కోసం ఉపాధి పొందుతూ ఏ కారణంతో మరణించినా అలాంటి వలస కార్మికుల కుటుంబాలను అక్కడి ప్రభుత్వం ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ఖతర్ మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. – గుగ్గిల్ల రవిగౌడ్, గల్ఫ్ జేఏసీ చైర్మన్ -
ఎడారి గోసకు.. ఏదీ భరోసా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ఎడారి దేశాలకు వలసవెళ్లే కార్మికులకు భరోసా కరువైంది. గల్ఫ్ దేశాలకు వెళ్లి జేబు నిండా డబ్బులతో తిరిగి వద్దామనుకున్న వారిని అనుకోని అవాంతరాలు చుట్టుముడుతున్నాయి. తెలంగాణ నుంచి ఇప్పటికే దాదాపు పదిహేను లక్షల మంది గల్ఫ్ దేశాల (సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రేయిన్, ఒమన్)కు వెళ్లగా, తాజాగా కొత్తతరం కూడా ఎడారి దేశాల బాటపడుతోంది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వారే ఆయా దేశాలకు వెళుతుండటంతో వారంతా భవన నిర్మాణం, వ్యవసాయం వంటి కఠినమైన పనుల్లో కుదురుతున్నారు. అక్కడి వాతావరణం, ఆహారం, తదితర పరిస్థితుల కారణంగా మానసిక ఒత్తిడితో అనారోగ్యం, ఆపై మృత్యువాత పడుతున్నవారు కొందరైతే.. క్షణికావేశాలతో చేసే నేరాలతో జైళ్ల పాలవుతున్న వారు మరికొందరు. దీంతో వారి కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. ఇలా గడిచిన ఎనిమిదిన్నరేళ్లలో 1,612 మంది గల్ఫ్ దేశాల్లో మృతి చెందారు. ఇంకా కూలీలుగానే తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా గల్ఫ్‌కు వెళ్లే వారి కోసం ప్రత్యేక సాంకేతిక శిక్షణ లేకపోవడంతో అక్కడకు వెళుతున్న వారిలో 90 శాతం కూలీలుగానే పనిచేస్తున్నారు. నిరక్షరాస్యత, ఎడారి దేశాల్లో వ్యవహరించే తీరుపై ముందస్తు అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే పని ప్రదేశంలో ప్రమాదాలు – వివాదాలు, రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దుబాయ్ బాధలుండవని నాయకులు హామీ ఇచ్చినా పేద కార్మికులకు భరోసా విషయంలో కార్యాచరణ ఇంకా కార్యరూపం దాల్చలేదు. 2016లో ఎన్నారై పాలసీపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, 2018 –19 బడ్జెట్లో ఎన్నారైల కోసం రూ.100 కోట్లను కేటాయించినా.. పూర్తిస్థాయి విధి విధానాలు ప్రకటించకపోవడంతో వాటి వల్ల ఎవరికీ లబ్ధి చేకూరలేదు. రెండు రోజులకో మృతదేహం.. గల్ఫ్ దేశాల నుంచి రెండు రోజులకొక మృతదేహం తెలంగాణకు చేరుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు 1,612 మృతదేహాలు వచ్చాయి. ఇందులో 25 నుంచి 50 ఏళ్ల లోపు వారే అత్యధికం. అక్కడి వాతావరణం, ఆహారం కారణంగా మానసిక ఒత్తిడితో గుండె, మెదడు సంబంధిత వ్యాధుల భారిన పడి మరణిస్తున్నట్లు భారత దౌత్య కార్యాలయం ఇటీవల వెల్లడించింది. కేరళ రాష్ట్రంలో భేష్ గల్ఫ్ దేశాల్లో అత్యధిక ప్రవాసీలున్న రాష్ట్రం కేరళ. ఆ రాష్ట్రం వలస కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. గల్ఫ్‌కు వెళ్లే వారికి ముందస్తుగా నైపుణ్య శిక్షణ ఇస్తుండటంతో వాళ్లు వైట్ కాలర్ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. అలాగే స్వదేశానికి తిరిగి వచ్చిన వారికోసం విస్తృత స్థాయిలో పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నారు. రిక్రూటింగ్ ఏజెన్సీల నియంత్రణ, కేసుల్లో ఉన్న వారికి న్యాయ సహాయం, వైద్య సహాయం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎన్నార్టీఎస్ ఆధ్వర్యంలో ఎన్నారైల కోసం 24 గంటల హెల్ప్‌లైన్‌తోపాటు ప్రవాసాంధ్ర భరోసా పేరుతో రూ.10 లక్షల బీమా (18–60 ఏళ్లు)తో పాటు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నారు. ఇవీ కార్మికుల డిమాండ్లు.. ►గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, వార్షిక బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాలి. ►గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, జీవిత, ప్రమాదబీమా, పెన్షన్లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత పథకం అమలు చేయాలి. ►గల్ఫ్ జైళ్లలో చిక్కుకున్న వారికి మెరుగైన న్యాయ సహాయం అందించాలి. ►శిక్షపడ్డ ఖైదీలకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్న దేశాల నుంచి ఖైదీల మార్పిడి వెంటనే చేయాలి. ►కేంద్రం తరఫున వెంటనే హైదరాబాద్‌లో సౌదీ, యూఏఈ, కువైట్ కాన్సులేట్లను ఏర్పాటు చేయాలి. ►ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన తరహాలో గల్ఫ్‌లో మృతి చెందిన వారి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ►ప్రవాసి భారతీయ బీమా యోజన కింద రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని కూడా చేర్చాలి. రూ.325 చెల్లిస్తే రెండేళ్ల కాలపరిమితితో ఇన్సూరెన్స్ అమలు చేయాలి. తక్షణ కార్యాచరణ చేపట్టాలి తెలంగాణ వస్తే దుబాయ్ బాధలు తప్పుతాయనుకున్నం. కొత్త వలసలు మళ్లీ మొదలయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కార్మికుల సంక్షేమానికి తక్షణ కార్యాచరణను అమలు చేయాలి. –మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకుడు కాన్సులేట్లు ఏర్పాటు చేయాలి దేశంలో కేరళ తర్వాత తెలంగాణ నుంచే అత్యధిక కార్మికులు గల్ఫ్‌లో పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లినవారు మరణాలు, జైలు పాలవుతున్న తీరు ఆందోళనకరంగా ఉంతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపి, హైదరాబాద్‌లో సౌదీ, ఇతర ముఖ్య దేశాల కాన్సులేట్లను ఏర్పాటు చేస్తే పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. – పి.బసంత్‌రెడ్డి, గల్ఫ్ సోషల్ వర్కర్ కన్న బిడ్డల కోసం.. కన్నులు కాయలు కాచేలా సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం, రవి అనే అన్నదమ్ములిద్దరూ 2004లో దుబాయ్ వెళ్లారు. పని ప్రదేశంలో నేపాల్‌కు చెందిన దిల్ బహుదూర్ అనే గార్డు హత్యకు కారమణంటూ వీరితో పాటు మరో పదిమందిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అక్కడి చట్టాల మేరకు బాధితుని కుటుంబ సభ్యులు పరిహారం తీసుకుని క్షమాభిక్ష పత్రాన్ని సమర్పిస్తే శిక్షను తగ్గించటం లేదా రద్దు చేయటం సులువు. ఈ మేరకు మల్లేశం, రవి తల్లి గంగవ్వ 2012లో పరిహారం సొమ్ము కోసం తన కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వాల్సిందిగా హెచ్ఆర్సీని కోరిన అంశం అప్పటి ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టి వచ్చింది. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి రూ.15 లక్షలను నేపాల్ వెళ్లి బాధిత కుటుంబానికి అందించి క్షమాభిక్షపత్రాన్ని తీసుకొచ్చారు. నేర తీవ్రత, చేసిన తీరు ఘోరంగా ఉందంటూ అక్కడి హైకోర్టు యావజ్జీవ శిక్ష(25ఏళ్లు)గా మార్చింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం చొరవ తీసుకుంటే కానీ వారు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మీరైనా.. జాడ చెప్పండి ‘గల్ఫ్‌కు పోయివస్తే కష్టాలన్నీ తీరుతయన్న డు. పోయినోడు మళ్లీ రాక.. మేము దినదిన నరకం అనుభవిస్తున్నం. మా కొడుకు ఎక్కడున్నడో..ఏం చేస్తున్నడో ఎవరూ చెప్పడం లేదు’ అంటూ జగిత్యాల జిల్లా మన్నెగూడేనికి చెందిన శ్రీరాముల రాజేశ్వరి, రాజేశం తమకు ఎదురైన వారందరినీ అడుగుతున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. శ్రీరాముల ప్రసాద్ (42) రెండేళ్ల క్రితం గల్ఫ్ లోని క్యాంప్‌కు చేరినట్లు ఫోన్ చేశాడు. ‘వారానికి ఒకసారైనా ఫోన్ చేసేవాడు. ఏడాదిగా అది కూడా లేదు. మీరై నా నా కొడుకు జాడ చెప్పాలె’ అంటూ రాజేశం వేడుకుంటున్నారు. -
ఖతార్‌లో ‘సాకర్’.. తెలంగాణ మీద ఎఫెక్ట్!
ఊళ్లో ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలెన్నో. అయినవారికి దూరంగా ఎడారి దేశాల్లో అవస్థలు పడుతున్న బాధితులెందరో. ఇన్నేళ్లు మనం చూసిన వారి గోసపై ఇప్పుడు ప్రపంచం దృష్టి పెట్టింది. గల్ఫ్ సమస్యలు, బాధితుల పరిస్థితులను యూరప్ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఫ్రాన్స్, పోలండ్, స్విట్జర్లాండ్ తదితర దేశాల మీడియా సంస్థలు కొన్ని వారాలుగా రాష్ట్రంపై ఫోకస్ పెట్టాయి. ఆయా సంస్థల జర్నలిస్టులు తెలంగాణ పల్లెల్లో పర్యటిస్తున్నారు. గల్ఫ్ కుటుంబాల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి, బాధిత కుటుంబాల వ్యథను నేరుగా తెలుసుకుంటున్నారు.. దుబాయ్, ఖతార్, సౌదీ, కువైట్ తదితర గల్ఫ్ దేశాలకు నిత్యం తెలంగాణ జిల్లాల నుంచి వెళ్తూనే ఉన్నారు. కార్మికులుగా వెళ్లి.. బాధితులుగా మారినవారూ మన రాష్ట్రం నుంచే ఎక్కువ. గ్రామీణ నేపథ్యం, నిరక్షరాస్యత, గల్ఫ్ చట్టాలపై అవగాహన లోపం, చేసే పనులకు సంబంధించి ముందస్తు శిక్షణ లేకపోవడం తదితర కారణాలతోపాటు ఏజెంట్ల చేతిలో మోసపోయి చాలామంది బాధితులుగా మారుతున్నారు. కొందరు ప్రాణాలనూ కోల్పోతున్నారు. జగిత్యాల జిల్లా చిట్టాపూర్‌లో ఫ్రాన్స్ టీవీకి చెందిన జర్నలిస్టు జెర్మైన్బేస్లే.. ‘ఫుట్‌బాల్’ ఆడుకుంటున్నారు ఈనెల 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఖతార్‌లో ఫిఫా వరల్డ్‌కప్–2022 జరగనుంది. ఈ ఆట ఆ దేశంలో ఉంటున్న మన కార్మికుల జీవితాలతో ఆడుకుంటోంది. సాకర్ వరల్డ్‌కప్ నేపథ్యంలో కొన్ని నెలల ముందు నుంచే ఖతార్‌లో నిర్మాణరంగ పనులను నిలిపివేశారు. పలు రంగాలకు ఆంక్షలు విధించారు. రాష్ట్రం నుంచి వెళ్లినవారిలో చాలామంది నిర్మాణ రంగంలోనే ఉన్నారు. ప్రపంచకప్ నేపథ్యంలో ప్రాజెక్టులు లేకపోవడంతో చాలామందిని తిప్పి పంపిస్తున్నారు. మరికొందరికి పనివేళలు, పనిగంటలు, ప్రదేశాలనూ మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందులు, గల్ఫ్ బాధితుల కుటుంబాల పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రపంచ మీడియా ఆసక్తి చూపిస్తోంది. ఇటీవల ఓ జాతీయ ఇంగ్లిష్ దిన పత్రిక రాసిన కథనం కూడా ఇందుకు కారణమైంది. బాధిత కుటుంబంతో వీడియోకాల్ ద్వారా మాట్లాడుతున్న పోలాండ్ స్పోర్ట్స్ జర్నలిస్టు తెలంగాణ బాట... ప్రధానంగా యూరప్ దేశాల మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు తెలంగాణ బాట పట్టారు. ఫ్రాన్స్ 24 మీడియా సంస్థకు చెందిన ఇండియా, దక్షిణాసియా కరస్పాండెంట్ లీ డెల్ఫోలీ రెండురోజులపాటు నిర్మల్, ఆర్మూర్ ప్రాంతాల్లో పర్యటించారు. వెల్మల్, ఢీకంపల్లి, గగ్గుపల్లి గ్రామాల్లో బాధితులతో మాట్లాడారు. ఆర్మూర్లోనూ పలువురి నుంచి సమాచారం సేకరించారు. ఫ్రాన్స్ టీవీకి చెందిన జర్నలిస్టు జెర్మైన్ బేస్లే జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్‌లో బాధిత కుటుంబాలను కలిశారు. స్విట్జర్లాండ్‌కు చెందిన వీడియో జర్నలిస్టు జోసెఫ్ జగిత్యాల జిల్లా సుద్దపల్లిలో పలు కుటుంబాలతో మాట్లాడారు. పోలండ్‌కు చెందిన డారియస్ ఫరోన్ అనే స్పోర్ట్స్ జర్నలిస్టు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన బాధిత కుటుంబాలతో వీడియోకాల్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విదేశాల నుంచి వస్తున్న జర్నలిస్టులకు, గల్ఫ్ కుటుంబాలకు ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలూ గుర్తించాలి ఖతర్‌లో ఫిఫా కప్ నేపథ్యంలో కార్మికులను ఇంటికి పంపిస్తున్నారు. కొన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలువులు ఇస్తున్నాయి. కొన్ని ఇవ్వడం లేదు. విదేశీ మీడియా ప్రతినిధులు బాధిత కుటుంబాల పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కార్మికులకు అండగా నిలవాలి. – స్వదేశ్ పరికిపండ్ల, అధ్యక్షుడు, ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్ . -
ఘోర ప్రమాదం.. 77 మంది వలసదారులు మృతి
బతుకుదెరువు కోసం వలసవెళ్లిన 77 మంది బోటు ప్రమాదంలో దుర్మరణం చెందారు. లెబనాన్ నుంచి యూరప్ వెళ్లే క్రమంలో సిరియా తీరంలో పడవ మునిగి ఈ ఘోర ప్రమాదం సంభవించింది. బోటులో మొత్తం 150 ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. సిరియా సహాయక బృందాలు రంగంలోకి దిగి సముద్రంలో మునిగిన వారిని కాపాడారు. ప్రస్తుతం 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది లెబనీస్ పౌరులే ఉన్నారు. సిరియా పోర్టు నగరం టార్టస్ సమీపంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఇంతటి విషాద ఘటన ఇటీవలి కాలంలో చోటుచేసుకోలేదని సిరియా అధికారులు పేర్కొన్నారు. అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చాలా మంది ప్రాణాలు కాపాడినట్లు చెప్పారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న లెబనాన్‌లో ప్రజలు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చేతిలో డబ్బులేక, పనిచేయడానికి ఉపాధి దొరకక అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే పడవల్లో సముద్ర మార్గం ద్వారా ఐరోపా దేశాలకు వలస వెళ్తున్నారు. చిన్నసైజు బోట్లలో సామర్థ్యానికి మించి ఎక్కువ మంది ప్రయాణించడం వల్ల అవి మునిగిపోయి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. చదవండి: చావుతో చెలగాటం.. అయినా ఈ సాహసాన్ని చూసేయండి -
‘గల్ఫ్ కార్మికుల చెమట చుక్కల ద్వారా సంపాదించిన సొమ్మే అధికం’
ఎర్రటి ఎండలో.. తమ రక్తాన్ని మరిగించి చెమటను చిందిస్తున్న గల్ఫ్ కార్మికులు ఒక్కొక్క చెమట చుక్క ఒక్క రూపాయి లాగా సంపాదించి పంపిన విదేశీ మారక ద్రవ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పవృక్షం, కామధేనువు లాగా లాభం చేకూరుస్తుంది. అయితే కార్మికులు మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలకు నోచుకోకుండా వారి బతుకులు ఎండమావులు అవుతున్నాయని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలోని వోక్సెన్ యూనివర్సిటీ గురువారం తెలంగాణ గల్ఫ్ వలసలపై జాతీయ వర్చువల్ సింపోజియం (ఆన్ లైన్ చర్చ) నిర్వహించింది. పబ్లిక్ పాలసీ రీసెర్చ్, స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగం ఈ చర్చను నిర్వహించింది. ఈ చర్చలో ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి మాట్లాడారు. గత సంవత్సరం (2021-22) లో ప్రవాస భారతీయులు నుంచి 89 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) భారతదేశం పొందింది. ఇది దేశ జిడిపి (స్థూల దేశీయ ఉత్పత్తి) లో 3 శాతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైల జనాభా 2 కోట్ల యాభై లక్షలు. ఇందులో ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో నివసించే 88 లక్షల మంది భారతీయ కార్మికుల చెమట చుక్కల ద్వారా సంపాదించిన సొమ్మే అధికం. ఎన్నారైలు పంపే విదేశీ మారక ద్రవ్యంతో దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఉపయోగపడుతుంది. భారత ప్రభుత్వం వద్ద విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగ్గుతున్నట్లు ఇటీవలి నివేదికలు తెలుపుతున్నాయి. ఫారెక్స్ నిల్వలు 2 సంవత్సరాల కనిష్ట స్థాయి 564 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. రూపాయి విలువ అధఃపాతాళానికి జారిపోయింది. భారత ప్రభుత్వం పేద కార్మికులను విదేశాలకు పంపుతూ ఎగుమతి, దిగుమతి వ్యాపారం చేస్తున్నది. ఎలాంటి ఖర్చు లేకుండా మానవ వనరులను విదేశాలకు ఎగుమతి చేస్తున్న భారత ప్రభుత్వం ప్రవాసులు పంపే సొమ్ముతో భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నది. ప్రభుత్వాలకు ఎన్నారైల పెట్టుబడులు, వారు ఇచ్చే విరాళాలపై ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల లేదు. ప్రవాస కార్మికుల బతుకులు మారడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ బడ్జెట్ ను కేటాయించడం లేదు. ఒంటరి వలసలు, తక్కువ చదువు, తక్కువ నైపుణ్యం, తక్కువ ఆదాయం కలిగిన కార్మికులు అన్యాయానికి గురవుతున్నారు. ఆన్ లైన్ మీటింగ్ లో పాల్గొన్న మంద భీంరెడ్డి వారు పొట్టచేత పట్టుకొని సప్త సముద్రాలు, భారత సరిహద్దులు దాటి.. ఎడారి దేశాలలో పనిచేసే తెలంగాణ వలస కార్మికులు. తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సొమ్మును స్వదేశానికి విదేశీ మారక ద్రవ్యం రూపంలో పంపిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక జవాన్లుగా, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బలోపేతంలో భాగస్వాములుగా తమ వంతు సేవ చేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికుల లాగా వీరు కూడా కుటుంబాలను వదిలి దూర తీరాలకు వెళ్లి మాతృభూమి రుణం తీర్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 15 లక్షల మంది వలసదారులు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారని ఒక అంచనా. ఒక కార్మికుడు, ఉద్యోగి సరాసరి నెలకు 700 యుఎఇ దిర్హామ్స్ / సౌదీ రియాల్స్ (లేదా సమానమైన గల్ఫ్ కరెన్సీలు) పంపితే అది రూ . 14,000 కు సమానం. 15 లక్షల మంది గల్ఫ్ ప్రవాసులు నెలకు రూ. 14 వేలు పంపిస్తే రూ. 2,100 కోట్లు అవుతుంది. సంవత్సరానికి రూ. 25,200 కోట్లు అవుతుంది. తెలంగాణ గల్ఫ్ ప్రవాసులు పంపే రూ. 25,200 కోట్లు విదేశీ మారక ద్రవ్యం వారి కుటుంబ సభ్యుల ద్వారా దేశీయంగా వినియోగంలోకి వచ్చినప్పుడు కనీసం 10 శాతం జీఎస్టీ సంవత్సరానికి రూ.2,520 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన సగం వాటా కింద సంవత్సరానికి రూ. 1,260 కోట్లు లాభపడుతున్నది. ఎక్స్ పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్స్ స్కీం (ఎగుమతి ఆధారిత యూనిట్ల పథకం) 1981లో ప్రవేశపెట్టబడింది. ఎగుమతులను పెంచడం, దేశంలో విదేశీ మారక ద్రవ్య ఆదాయాన్ని పెంచడం మరియు భారతదేశంలో అదనపు ఉపాధిని సృష్టించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం భూమి, నీరు, విద్యుత్, బ్యాంకు రుణాలు, పారిశ్రామిక రాయితీలు, పన్ను మినహాయింపులు అందిస్తుంది. గల్ఫ్ రిక్రూట్మెంట్ వ్యవస్థకు ఇండస్ట్రీ స్టేటస్ (పరిశ్రమల హోదా) ఇవ్వాలి. ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి. మెడికల్ టెస్ట్ ఫ్లయిట్ టికెట్, నైపుణ్య శిక్షణ లాంటి వాటికి ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వాలి. గల్ఫ్ దేశాలకు కార్మికులను భర్తీ చేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేలు లేదా 45 రోజుల జీతాన్ని ఫీజుగా తీసుకోవడానికి రిక్రూటింగ్ ఏజెన్సీలకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రిక్రూట్మెంట్ ఫీజు లేకుండా ఉచితంగా ఉద్యోగ భర్తీ చేపట్టాలనే సంకల్పానికి ప్రభుత్వాల మద్దతు అవసరం. కార్మికులను విదేశాలకు పంపే అతిపెద్ద దేశమైన భారత్‌కు ఒక మైగ్రేషన్ పాలసీ (వలస విధానం) లేకపోవడం విచారకరం అని మంద భీంరెడ్డి అన్నారు. డా. జునుగురు శ్రీనివాస్, డా. రౌల్ వి. రోడ్రిగ్జ్, డా. జె. సంతోష్, డా. నరేష్ సుదవేని, డా. పి. వి. సత్య ప్రసాద్, వలస కార్మికుల ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షకుడు బి. ఎల్. సురేంద్రనాథ్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. -
శరణార్థుల గోడు పట్టదా?
రోహింగ్యా శరణార్థుల అంశం మళ్ళీ పతాక శీర్షికలకెక్కింది. అధికారంలో ఉన్నవారికి ఈ కాందిశీ కుల పట్ల అనుసరించాల్సిన వైఖరిలో స్పష్టత లేదని మరోసారి రుజువైంది. మురికివాడల్లోని 1100 మంది రోహింగ్యాలను ఢిల్లీ శివార్లలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు ఉద్దేశించిన నివాసాల్లోకి తరలించి, ప్రాథమిక వసతులు కల్పించి, పోలీసు భద్రత కల్పిస్తామంటూ కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఆగస్ట్ 17న ట్వీట్ చేశారు. కానీ, అమిత్ షా సారథ్యం లోని హోమ్ శాఖ తక్షణమే రంగంలోకి దిగి, ‘‘చట్టవిరుద్ధమైన రోహింగ్యా విదేశీయులకు’’ ఆ నివాసాలివ్వాలంటూ ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదని వివరణనిచ్చింది. కొద్ది గంటల తేడాలో ఒకే అంశంపై రెండు మంత్రిత్వశాఖలు రెండు రకాలుగా స్పందించడం విడ్డూరం. కాందిశీకుల అంశంపై దేశంలో జాతీయ స్థాయిలో ఓ చట్టం అవసరమని తాజా వివాదం మరోసారి గుర్తుచేస్తోంది. గతంలో యూపీ నీటిపారుదల శాఖ స్థలంలో ఉంటున్న నివాసాలు ప్రభుత్వం నోటీసిచ్చిన మరునాడే అనూహ్యంగా అగ్నికి ఆహుతయ్యాక, ఢిల్లీ శివారులోని ఓ ఇస్లామిక్ ఛారిటీకి చెందిన స్థలంలో తాత్కాలిక నివాసాల్లో, దగ్గరలో మరుగుదొడ్లు కూడా లేని దుర్భరస్థితిలో రోహింగ్యాలు బతుకులు వెళ్ళదీస్తున్నారు. వారికి కనీస వసతులు కల్పిస్తామని సర్కార్ 2021లోనే అంది. ఆ పరిణామ క్రమంలోనే దౌత్యవేత్త, సీనియర్ మంత్రి పూరీ తాజా ట్వీట్ వచ్చింది. తీరా విశ్వహిందూ పరిషత్ సహా అధిక సంఖ్యాక హిందూ సమర్థకుల విమర్శలకు వెరచి, ప్రభుత్వం ప్లేటు ఫిరాయిం చడం శోచనీయం. రోహింగ్యా అనేది పశ్చిమ మయన్మార్ (బర్మా)లోని రఖైన్ ప్రావిన్స్‌కు చెందిన సమూహం. ముస్లిమ్లైన వీరు బెంగాలీలోని ఓ మాండలికంలో మాట్లాడతారు. మయన్మార్ వీరిని ‘నివాసిత విదేశీయులు’ అనీ, ‘సహచర పౌరుల’నీ పేర్కొంటోంది. 2012 నుంచి వరుస హింసా కాండలతో వీరు మయన్మార్‌ను వదిలిపోవాల్సి వచ్చింది. 5 లక్షల మంది సౌదీ అరేబియాకు పారి పోయారు. 2017లో మళ్ళీ మయన్మార్ సైన్యం దాడులతో, లక్షలాది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌లో తలదాచుకున్నారు. 2012లో 1200 మంది తొలి బృందం శరణార్థులుగా ఢిల్లీకి వచ్చింది. అయితే, 2018 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు భారత్ మొత్తం 12 మంది శరణార్థుల్ని మయన్మార్‌కు తిప్పి పంపింది. ఇది రోహింగ్యాల అంశంపై గళం విప్పుతున్న ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ బృందం లెక్క. వారందరూ స్వచ్ఛందంగా తిరిగి వెళ్ళారని సర్కారు వారి మాట. కానీ, ఐరాస శరణార్థి సంస్థ స్వతంత్రంగా ఆ సంగతి నిర్ధారించుకొనేందుకు పదే పదే అభ్యర్థించినా, అనుమతి నిరాకరించడం గమనార్హం. మన దేశంలో మొత్తంగా 40 వేల మంది రోహింగ్యా కాందిశీకులు ఉన్నారు. వారిలో 5700 మంది జమ్మూలో, మిగిలినవారు తెలంగాణ, పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్‌లలో తలదాచుకున్నారు. అయితే వీరిలో 16 వేల మందే ఐరాస శరణార్థి సంస్థ వద్ద నమోదు చేసుకున్నారు. రోహింగ్యాలు దేశభద్రతకు ముప్పు అని చిత్రీకరిస్తూ మెజారిటీ వర్గీయులు పోనుపోనూ స్వరం పెంచుతున్నారు. రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఎంత గట్టిగా మాట్లాడితే, అంత ఎక్కువగా జాతీయతావాదులనే కీర్తి దక్కుతుందని భావిస్తున్నారు. నిజానికి, 1951 నాటి ఐరాస అంతర్జాతీయ శరణార్థుల ఒప్పందంపై కానీ, కాందిశీకుల హోదాకు సంబంధించిన 1967 నాటి ప్రోటోకాల్‌పై కానీ భారత్ సంతకం చేయలేదు. కాబట్టి, అవతలి దేశంలో పీడనకు గురవుతారని తెలిసీ రోహింగ్యాలను మయన్మార్‌కు బలవంతాన పంపేయడం చట్టప్రకారం సరైనదేనని వాదించవచ్చు. అందుకు మునుపటి సుప్రీమ్ కోర్ట్ తీర్పుల్నీ ఉదాహరణగా చూపవచ్చు. కానీ, తెలిసి తెలిసీ అలా పంపరాదన్నదే సంతకాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ చట్టంలో అందరూ అనుసరించే సంప్రదాయం, ధర్మం. న్యాయస్థానం సైతం ఈ నిస్సహాయులకు అండగా నిలవకపోవడం విషాదం. హోమ్‌శాఖ 2011లో జారీ చేసిన ‘ప్రత్యేక వ్యవహార సూత్రాలు’ మినహా ఇప్పటికీ మన దేశంలో అంతర్జాతీయ ఆదర్శాలకు తగ్గట్టు శరణార్థులకు ఓ జాతీయ చట్టమంటూ లేకపోవడమే దీనికి కారణం. శశిధరూర్ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టినా రాజకీయ ఏకాభిప్రాయం లేక, లాభం లేకపోయింది. ఇప్పటికీ పాకిస్తానీ హిందువులు, శ్రీలంక తమిళులు, టిబెటన్లు దేశంలోని శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఏ ప్రాంతానికీ చెందని ఇలాంటివారు దేశంలో 2.89 లక్షల మంది ఉన్నారు మరి, ఐరాస గుర్తింపుకార్డులిచ్చిన రోహింగ్యాల పట్ల పాలకులు అదే తరహా వైఖరి చూపడానికి ఇబ్బందేమిటి? పదేళ్ళుగా ఈ గడ్డపైనే ఉంటున్న సాటి మనుషులుగా రోహింగ్యాలు మెరుగైన జీవితం గడిపేలా చూడడం మానవత్వం. ఆ మేరకు గతంలో చేసిన బాసలకు భారత్ కట్టుబడాలి. వేదికలపై ‘వసుధైక కుటుంబం’ లాంటి కబుర్లు చెప్పే పాలకులు తీరా చేతల్లో తద్భిన్నంగా వ్యవహరిస్తే ఎలా? శరణార్థులపై విదేశాంగ విధానాల్లో ఒక మాట, దేశంలో రాజకీయ లబ్ధి కోసం వారినే ‘చెదలు’ అని ఈసడిస్తూ మరోమాట మాట్లాడడం ఏ రకంగా సమర్థనీయం? రోహింగ్యాలంటే తీవ్రవాదులే అన్న భావన ఎవరు, ఎందుకు కల్పిస్తున్నారు? ‘అంతర్జాతీయ శరణార్థుల ఒప్పందా’న్ని భారతదేశం గౌరవిస్తుంది. జాతి, మతం, ధార్మిక విశ్వాసాల సంబంధం లేకుండా అందరికీ ఆశ్రయమిస్తుంది’ అనే మంత్రి గారి మాట ఉత్తుత్తిదేనా? శరణు కోరినవారిని కాపాడమనే శ్రీరాముడే ఆదర్శం అనే పాలకులు ఆలోచించాలి. -
తమిళ ముల్లె.. అరవ పల్లె.. ‘నందలూరు.. రొంబవూరు’
రాజంపేట: దేశంలోనే అతిపెద్ద రవాణా సంస్థ భారతీయరైల్వే. అటువంటి రైల్వేతో అనేక ప్రాంతాలకు గుర్తింపు వచ్చింది. అలాంటివాటిలో అన్నమయ్య జిల్లా నందలూరు ఒకటి. అందునా.. ఇక్కడ ఉన్న అరవపల్లె.. ప్రత్యేక గుర్తింపు పొందింది. దశాబ్దాల క్రితం తమిళనాడు నుంచి వచ్చిన అనేకమందికి ఈ ప్రాంతం నిలయమైంది. ఆవాసాల ఏర్పాటుతో మొదలై క్రమంగా పెద్దగ్రామంగా రూపుదిద్దుకుంది. కాలానుగుణంగా మారిన పరిస్థితుల్లో కూడా తన ఉనికిని నిలుపుకుంది. ఇది ద్రవిడ జీవన సంస్కృతికి పట్టం కడుతోంది. అమ్మ తల్లి ఆరాధన ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఆధునికతను, అభివృద్ధిని సాధించినప్పటికీ ఆత్మను మాత్రం వదులుకోనంటోంది. రైల్వే కేంద్రం ఏర్పాటుతో.. నందలూరు రైల్వే కేంద్రం ఒకప్పుడు సదరన్ రైల్వేలో ఉండేది. ఇక్కడ స్టీమ్ ఇంజన్ రైల్వే లోకో షెడ్ కూడా ఉండేది. ముంబాయి–చెన్నై రైలుమార్గం ఏర్పాటులో భాగంగా స్టీమ్ రైలింజన్లను నడిపేందుకు నందలూరును కేంద్రంగా బ్రిటిషు రైల్వేపాలకులు ఎంచుకున్నారు. చెయ్యేరు నది నీటి నాణ్యత స్టీమ్ ఇంజన్ల నిర్వహణకు ఉపయోగపడుతుందనేది ప్రధాన కారణం. గుంతకల్ రైల్వే జంక్షన్ నుంచి తమిళనాడులోని చెన్నై వరకు నడిచే రైళ్లన్నింటికీ నందలూరులో ఇంజన్ మార్పిడి జరిగేది. సిబ్బంది కూడా అటూ, ఇటూ మారేవారు. ఈ నేపథ్యంలోనే రైల్వేపరంగా నందలూరుకు గుంతకల్ రైల్వేడివిజన్‌లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక్కడి నుంచి నేరుగా మద్రాసుకు ప్యాసింజర్ రైలు కూడా నడిచేది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి నందలూరుకు ఉద్యోగ, ఉపాధి పనుల నిమిత్తం అనేకమంది వచ్చారు. అయితే వీరిలో అగ్రభాగం తమిళులదే. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, అరకోణం, పెరంబూరు, తిరుత్తిణి తదితర ప్రాంతాలకు చెందిన వారు వివిధ రకాలలో అధికారులు, ఉద్యోగులు, కార్మికులుగా పనిచేసేందుకు నందలూరు రైల్వే కేంద్రానికి తరలివచ్చారు. వీరిని స్థానికులు అరవోళ్లు అని పిలిచేవారు. ఈ క్రమంలో నందలూరు రైల్వేస్టేషన్‌కు సమీపంలో వారు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. క్రమేణా అది అరవపల్లె పేరిట గ్రామంగా మారింది. ప్రస్తుతం నాగిరెడ్డిపల్లె అర్బన్ పరిధిలో ఈ పల్లె ఉంది. తొమ్మిది వార్డులకు విస్తరించింది. నందలూరు రైల్వేస్టేషన్ జోన్ మారడంతో.. 1977లో సదరన్ రైల్వే నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి నందలూరు మారింది. ఫలితంగా వందలాది మంది తమిళనాడుకు చెందిన వారు చెన్నై సెంట్రల్తో పాటు ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకొని వెళ్లిపోయారు. కొందరు నందలూరు నీళ్లు, వాతావరణం, స్థానికుల మంచితనంతో ఇక్కడే ఉండిపోయారు. చెన్నై, కంచి, సేలం, అరక్కోణం, మధురై తదితర ప్రాంతాలకు చెందినవారు పెద్దసంఖ్యలో అరవపల్లెలోనే నివాసముండేవారు. కాలక్రమేణా 1000 తమిళ కుటుంబాలున్న గ్రామంలో ఆ సంఖ్య ఇపుడు 30కి చేరింది. ఈ పల్లెలో తమిళులతో పాటు ఇపుడు ఇతరులు కూడా ఉంటున్నారు. కాగా, బదిలీలపై ఇక్కడి నుంచి తమ రాష్ట్రాలకు వెళుతూ వెళుతూ తమిళనాడువాసులు ‘నందలూరు.. రొంబవూరు’ అని సర్టిఫికెట్ ఇచ్చారు. ఆరాధ్యదైవం..ముత్తుమారెమ్మ తమిళనాడు ప్రాంతంలో ముత్తుమారెమ్మను ఆరాధ్యదైవంగా కొలుచుకుంటారు. తమ సంప్రదాయంలో భాగంగా అరవపల్లెలో కూడా వారు ముత్తుమారెమ్మ గుడి నిర్మించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారి ఆలయంగా కొలవబడుతోంది. ఈ గుడి మొదలియార్ కుటుంబీకుల ఆధ్వర్యంలో నడుస్తోంది. యేటా జాతర కూడా నిర్వహిస్తుంటారు. రైల్వేకార్మికులతో ఒకప్పుడు కళకళ రైల్వేస్టీమ్ ఇంజన్ లోకోషెడ్ ఏర్పడినప్పటి నుంచి రైల్వేకార్మికులతో అరవపల్లె ఒకప్పుడు కళకళలాడేది. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. పాల్ఘాట్ నుంచి వచ్చిన మా పూర్వీకులు 1955లో ఏర్పాటుచేసిన శ్రీ లక్ష్మీవిలాస్ హోటల్ ఎంతో ఆదరణ పొందింది. అప్పట్లో రైల్వే స్టాఫ్‌లో తమిళులు అధికంగా ఉండేవారు. ముత్తుమారెమ్మ ఆలయం అభివృద్ధికి నా తండ్రి నారాయణస్వామి అయ్యర్ తన వంతు కృషిచేశారు. –బాలసుబ్రమణ్యంస్వామి, శ్రీలక్ష్మీవిలాస్, అరవపల్లె నందలూరుతో విడదీయరాని అనుబంధం సదరన్ రైల్వే జోన్ వల్ల తమిళులతో నందలూరు రైల్వేకేంద్రానికి విడదీయ రాని అనుబంధం ఏర్పడింది. తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ విధులు నిర్వహించే వందలాది కార్మికుల కుటుంబాలు ఉండేవి. 1976లో నందలూరు కార్యాలయంలో పనిచేసేటప్పుడు విధుల నిర్వహణకు సంబంధించి సదరన్ రైల్వే జోనల్ కేంద్రమైన మద్రాసు(చెన్నై)కు వెళ్లేవారం. రైల్వే జోన్ మార్పిడిలో చెన్నైకు వెళ్లకుండా చాలా మంది మంది తమిళ కుటుంబీకులు నందలూరులో కొనసాగుతున్నారు. –ఆనంద్‌కుమార్, రిటైర్డ్ ఎస్ఎంఆర్, న్యాయవాది, నాగిరెడ్డిపల్లె పూర్వీకుల నుంచి ముత్తుమారెమ్మ కోవెల మా పూర్వీకుల నుంచి ముత్తుమారెమ్మ కోవెల ఏర్పాటైంది. అప్పటి నుంచి గుడి నిర్వహణ చేపడుతూ వస్తున్నాం. నందలూరు రైల్వేస్టేషన్ సమీప ప్రాంతంలోనే మా పల్లె ఉంది. రైల్వేతోనే జనజీవనం ముడిపడింది. అది అలాగే కొనసాగింది. –వెంకటరమణ మొదలియార్, ధర్మకర్త, ముత్తుమారెమ్మకోవెల, అరవపల్లె -
వలస కూలీల హీరో.. లాయర్ గాంధీ
వలస ఒప్పంద కూలీలైన ‘గిరిమిటియా’లను ఆ చెర నుంచి విడిపించడం కోసం దక్షిణాఫ్రికాలోనే ఉండిపోయిన లాయర్ గాంధీ.. ఆ పని సాధించాకే తిరిగి ఇండియా వచ్చారు. గాంధీజీ భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎంతటి పోరాటం చేశారో అంతటి పోరాటం దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల పరిరక్షణ కోసం చేశారు. 1893 మే నెలలో న్యాయవాదిగా వృత్తి ధర్మంతో దక్షిణాఫ్రికాలో ప్రవేశించారు గాంధీ. ఆ పని సంవత్సరంలో అయిపోయింది. 1894లో స్వదేశానికి తిరిగి రావలసి వుంది కానీ ఆ దేశంలో వారు ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లు వలన కలిగే నష్టాలేమిటో అక్కడి మన భారతీయులకు వివరించడానికి గాంధీజీ ఆగిపోయారు. అలా గాంధీజీ బిల్లు గురించి చెప్పేసరికి వారంతా గాంధీజీని అక్కడే (దక్షిణాఫ్రికాలో) ఉండిపోయి తమ కష్టాలను నివారించమని కోరారు. దాంతో గాంధీజీ అక్కడే 21 సంవత్సరాలు.. అంటే 1914 వరకూ ఉండిపోవలసి వచ్చింది. ఆ సమయంలో ఆయన ప్రధానంగా గిరిమిటియాల సమస్యను పరిష్కరించాడు. ‘గిరిమిటియా’ అంటే ‘ఒప్పంద వలస కూలీ’ అని బ్రిటిష్ అర్థం. పద్ధతి రద్దు కాలేదు ఐదేళ్లు పని చేస్తామని అంగీకరించి ఒప్పందం పత్రంపై సంతకం చేసి భారతదేశాన్ని వదిలి దక్షిణాఫ్రికాకు ఉపాధి కోసం వెళ్లిన వారిని గిరిమిటియాలు అంటారు. అటువంటి గిరిమిటియాలకు 1914లో విధించిన 3 పౌండ్ల పన్ను రద్దు అయినప్పటికీ, ఆ విధానం మాత్రం పూర్తిగా రద్దు కాలేదు. (1916లో మదన్ మోహన్ మాలవ్య పెద్దల కౌన్సిల్లో ఈ విషయాన్ని లేవనెత్తారు. దీనికి సమాధానంగా లార్డ్ హార్డింగ్ తగిన సమయం వచ్చినప్పుడు ఆపుతామని అన్నారు.) గాంధీజీ 1893లో దక్షిణాఫ్రికా వెళ్లే నాటికి ఆ దేశం నాలుగు కాలనీల సమూహం. నేటాల్, కేఫ్, ట్రాన్స్ వాల్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్. డచ్చి వారు (బోయర్స్) ట్రాన్స్ వాల్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్‌లోనూ, బ్రిటిష్ వారు నేటాల్, కేఫ్ ప్రాంతాల్లోనూ ఉండేవారు. వీరు నిరంతరం సంఘర్షించుకుంటూనే ఉండేవారు. చివరకు బోయర్స్ వార్తో దక్షిణాఫ్రికా యావత్తూ బ్రిటిష్ వారి వశమయ్యింది. అయితే భారతీయుల న్యాయపరమైన హక్కుల రక్షణకే ఈ యుద్ధం చేశామని బ్రిటిష్ వారు చెబుతూ వచ్చారు. ఇష్టమైతే మరో ఐదేళ్లు దక్షిణాఫ్రికాలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి, ఖనిజ సంపద, వజ్రాలు పైకి తీయడానికి శ్వేత జాతీయులకు భారతీయ కూలీల సహాయం విధిగా కావాలి. కనుక భారతీయ కూలీలను కాంట్రాక్టు పద్ధతిమీద దక్షిణాఫ్రికా పంపడానికి ఇండియాలోని బ్రిటిష్ పాలకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అటువంటి కాంట్రాక్టు కూలీల జట్టు ఒకటి 1860లో దక్షిణాఫ్రికా చేరింది. కాంట్రాక్టు కాల పరిమితి ముగియడంతోనే వారికి ఇష్టమయితే మరో అయిదు సంవత్సరాల పాటు తిరిగి కూలీలుగా కాంట్రాక్టు లో చేరవచ్చు. లేదంటే తిరుగు ప్రయాణానికయ్యే ఖర్చుకు ఎంత భూమి లభిస్తుందో అంత భూమిని వారికే కేటాయిస్తారు. ఆ భూమిలో స్థిరపడి వారు అక్కడే సేద్యం చేసుకోవచ్చు. అలా స్థిరపడిన వారి అవసరాలు తీర్చడానికి అచిరకాలంలోనే భారతీయ వర్తకులు కూడా అక్కడ ప్రవేశించారు. ఆ విధంగా దక్షిణాఫ్రికాలో భారతీయ జనాభా పెరిగింది. అవసరం కోసం ఆసరా! 1969లో ఇంకా కూలీలను ఎగుమతి చేయాల్సి వచ్చినప్పుడు ‘కూలీ కాంట్రాక్టు కాల పరిమితి అయిపోవడంతోనే వారు ఆ దేశంలోని సాధారణ చట్టాలను అనుసరించి జీవించడానికి వీలుండాలనీ, ఏ విధమైన నిర్బంధాలు ఉండకూడదని’ బ్రిటన్ స్పష్టం చేసింది. 1858లో విక్టోరియా రాణి ప్రకటనలో కూడా ‘‘మన ఇతర దేశాల ప్రజల వలనే భారతీయులకు కూడా సమాన హక్కులుంటాయి’’అని హామీ ఇచ్చారు. భారతీయ వర్తకులు చౌకగా జీవించగలిగేవారు. అందువల్ల బ్రిటిష్ డచ్ వర్తకులకన్నా తక్కువ ధరకు సరుకులు అమ్మగలిగేవారు. దాంతో భారతీయ వర్తకులు యూరోపియన్ వర్తకులకు బాగా పోటీగా వున్నారని వారు గ్రహించారు. భారతీయ వ్యవసాయదారులు కొత్త రకాలైన కాయలను, పండ్లనూ, చౌకగానూ, విస్తారంగానూ పండించడం మొదలుపెట్టారు. అలా భారతీయుల్ని స్వేచ్ఛగా తమ దేశంలోనికి రానిచ్చినట్లయితే వారు వ్యవసాయంలోనూ, వ్యాపారం లోనూ తెల్లవారిని తుడిచి పెట్టేస్తారేమోనని వారు భయపడ్డారు. అందువల్ల భారతీయులపై అనేక ఆంక్షలను విధించడం ప్రారంభించారు. 1885 లో 3 వ నెంబరు చట్టాన్ని ట్రాన్స్ వాల్ లో ప్రవేశపెట్టారు. ఆసియా వాసులు.. ముఖ్యంగా భారతీయులు పారిశుధ్య కారణాల వల్ల వారికి ప్రత్యేకించబడిన ప్రాంతాలలోనే నివసించాలనీ, కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో తప్ప స్థిరాస్తులను సంపాదించుకోకూడదని, వ్యాపారనిమిత్తం వచ్చేవారు లైసెన్సు పొంది రిజిస్టర్ చేయించుకుని రావాలని శాసించింది ప్రభుత్వం. ఆ తరువాత దక్షిణాఫ్రికా అంతటా భారతీయుల మీద జాతి విద్వేషం, రైళ్లలోనూ, బస్సుల్లోనూ, స్కూళ్లలోనూ, హోటళ్లలోనూ అపారంగా పెరిగిపోయింది. పర్మిట్ లేకుండా భారతీయులను ఒక కాలనీ నుంచి మరో కాలనీకి పోనివ్వలేదు. భారతీయుల సంఖ్య హెచ్చుగా వున్న ‘నేతాల్‘ లో భారతీయుల ఓటు హక్కును రద్దు చేశారు. ఆ క్రమంలో గాంధీజీ ఓడలో దక్షిణాఫ్రికాలోని టయోటా రేవుకు చేరారు. ఓడ దిగక ముందే.. ‘మీరు తిరిగి వెళ్లిపోండి లేకపోతే సముద్రంలో ముంచేస్తాం, తిరిగి వెళ్లిపోతే మీకు అయిన ఖర్చులన్నీ ఇచ్చివేస్తాం‘ అని ఓడ ప్రయాణికులను అక్కడివారు హెచ్చరించారు. చివరకు పోలీసు వారి సహాయంతో ఓడ దిగగానే గాంధీజీ పై రాళ్ల దాడి జరిగింది. ఎలానో గాంధీజీ ని పోలీసులు ఇంటికి చేర్చారు. స్థానికులు గాంధీజీ ఇంటి ముందు చేరి ‘గాంధీ ని మాకు అప్పగించండి’ అని గొడవ చేశారు. ప్రిటోరియా లో గాంధీజీకి క్షవరం చేయడానికి క్షురకుడు కూడా నిరాకరించాడు. ఆ విధంగా న్యాయవాదిగా దక్షిణాఫ్రికాలో భారతీయుల కష్టాలను నివారించడానికి గాంధీజీ 21 సంవత్సరాలు పోరాటం చేయాల్సివచ్చింది. ఆ పోరాటం వల్లనే గిరిమిటియా సమస్య కూడా పరిష్కారమయ్యింది. 1914 లో గాంధీజీ భారత్‌కు తిరిగి వచ్చి అకుంఠిత దీక్షతో దక్షిణాఫ్రికా పోరాట అనుభవంతో భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని 1947 లో భారత్ కు స్వాతంత్య్రాన్ని తీసుకురాగలిగారు. – డా. కాశింశెట్టి సత్యనారాయణ,విశ్రాంత ఆచార్యులు (చదవండి: సమర యోధుడు: అనుగ్రహ నారాయణ్ సిన్హా) -
ఇక అరెస్టులు ఉండవు.. తిప్పి పంపుడే: కమిషనర్ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమంగా నివసిస్తున్న ఆఫ్రికన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. వీరు చిక్కినప్పుడు అరెస్టు చేస్తే వస్తున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పి పంపడం) విధానానికి శ్రీకారం చుట్టారు. ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) సాయంతో తొలిసారిగా ఐదుగురిపై ఈ ప్రక్రియను అనుమతి పొందారు. వీరిని బుధవారం నగర పోలీసు కార్యాలయం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పంపారు. ఈ నేపథ్యంలో హెచ్–న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ ఆనంద్ వివరాలు వెల్లడించారు. అరెస్టు చేస్తే నేరాలకు ఊతమే... నైజీరియా, సోమాలియా, టాంజానియా, ఐవరీ కోర్టు వంటి ఆఫ్రికన్ దేశాల నుంచి అనేకమంది వివిధ రకాలైన వీసాలపై హైదరాబాద్ వస్తున్నారు. వీరిలో అనేక మంది వీసా, పాస్‌పోర్టుల గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్నారు. గతంలో ఇలా ఉంటూ చిక్కిన వారిపై ఫారెనర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసేవాళ్లు. కోర్టులో దీని విచారణ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్ చేయడానికి ఆస్కారం లేదు. ఈ మధ్య కాలంలో బెయిల్‌పై బయటకు వచ్చే ఆ ఆఫ్రికన్లు సైబర్ నేరాలు, డ్రగ్స్ విక్రయం చేపట్టడంతో కొత్త తల నొప్పులు వచ్చేవి. ఇలాంటి వారిలో కొందరు నగరంతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో ఉన్న ఈశాన్య రాష్ట్రాల యువతులతో సహజీవనం చేస్తూ వారి ఇళ్లల్లోనే నివసిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, గుర్తింపుకార్డులు, వీసాలు తయారు చేసుకుని వీటి ఆధారంగా బ్యాంక్ ఖాతాలు తెరవడం, ఆధార్ కార్డులు పొందడం చేస్తున్నారు. అత్యంత సమస్యాత్మక వ్యక్తులైన వీరి ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటోంది. ఎఫ్ఆర్ఆర్ఓ సాయంతో డిపోర్టేషన్... ఈ పరిణామాలను గమనించిన సీవీ ఆనంద్ డిపోర్టేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఇటీవల హెచ్–న్యూ అధికారులు డ్రగ్స్ కోసం ఆíఫ్రికన్ల ఉంటున్న ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. ఇన్స్పెక్టర్లు పి.రాజేష్, పి.రమేష్ రెడ్డిలు తమ బృందాలతో రెండు నెలల క్రితం బంజారాహిల్స్‌లోని పారామౌంట్‌కాలనీలో సోదాలు చేశారు. అక్రమంగా నివసిస్తున్న ఆంటోనీ సన్డే (నైజీరియా), కోనే మౌసా (ఐవరీ కోస్టు), ఆసూయ్ విలియం డెకోస్టేరియా (ఐవరీ కోస్టు), ఒబేరా పీటర్ (నైజీరియా), ఒమెజోరియా కింగ్స్లే (నైజీరియా) చిక్కారు. వీరి వివరాలు ఎఫ్ఆర్ఆర్ఓకు పంపి మూవ్మెంట్ రిస్ట్రెక్షన్ ఆర్డర్ పొంది సీసీఎస్‌లోని డిపోర్టేషన్ సెంటర్లో ఉంచారు. ఆయా ఎంబసీలకు సమాచారం ఇచ్చి వీరి గుర్తింపులు, ఢిల్లీ కార్యాలయం నుంచి టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్లు పొందారు. ఈ ఐదుగురికీ విమాన టిక్కెట్లు ఖరీదు చేసిన సిటీ పోలీసులు ఖతర్ ఎయిర్వేస్ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్, ఎఫ్ఆర్ఆర్ఓ నుంచి ఎగ్జిట్ పర్మిట్ తీసుకున్నారు. వీటి ఆధారంగా బుధవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి డిపోర్ట్ చేశారు. దీంతో వీళ్లు మరోసారి భారత్‌లో అడుగుపెట్టడానికి ఆస్కారం ఉండదు. 750 మంది అక్రమంగా ఉంటున్నారు హైదారాబాద్ ఎఫ్ఆర్ఆర్ఓ ద్వారా 2900 మంది ఆఫ్రికన్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 750 మంది వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉండిపోయారు. వీళ్లు నగరంలో ఉన్నారా? ఇతర ప్రాంతాలకు వెళ్లారా? అనేది ఆరా తీస్తున్నాం. ఇలాంటి వారిని గుర్తించడానికి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు ప్రారంభిస్తాం. ఇకపై చిక్కిన వాళ్లంతా డిపోర్టేషన్ కావాల్సిందే. ఇళ్ల యజమానులు సైతం వీసా, పాస్‌పోర్టు చూడకుండా అద్దెకు ఇవ్వద్దు. అనుమానం ఉంటే పోలీసుల సహాయం తీసుకోండి. – సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ చదవండి: బీజేపీ జాతీయ సభ.. షెఫ్‌లకు యాదమ్మ ‘వంటల’ పాఠాలు! -
అమెరికాలో విషాదం.. 42 మంది మృతి
అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శాన్ ఆంటోనియోలో ట్రక్కులో వెళ్తున్న దాదాపు 42 మంది మృతిచెందారు. ఈ మేరకు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి తెలిపారు. వివరాల ప్రకారం.. శాన్ ఆంటోనియో దక్షిణ శివారులో రైలు పట్టాల పక్కనే ఓ ట్రక్కు నిలిపివేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న ట్రక్కు డోర్‌ను తెరిచిచూడగా.. అందులో దాదాపు 42 మంది చనిపోయి ఉన్నారు. 16 మంది ప్రాణాలతో బయట పడ్డారని.. వారిలో నలుగురు చిన్నారుల ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. At least 42 people were found dead Monday in a big-rig truck in San Antonio, Texas Gov. Greg Abbott said. More people have been transported to area hospitals. Updates: https://t.co/lfTU70A9B7 pic.twitter.com/L6oULaE7sB — NBC DFW (@NBCDFW) June 28, 2022 అయితే, మెక్సికన్ సరిహద్దు నుండి 160 మైళ్ళు (250 కిమీ) దూరంలో ఉన్న శాన్ ఆంటోనియోలో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక తేమతో 103 డిగ్రీల ఫారెన్‌హీట్ (39.4 డిగ్రీల సెల్సియస్) వరకు టెంపరేచర్ పెరిగింది. దీంతో, వలసదారులు ట్రక్కులో మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు ఎక్కువ సంఖ్యలో ట్రక్కుల్లో వెళ్తుంటారు. అంతకు ముందు కూడా వలసదారులతో వెళ్తున్న మెక్సికోకు చెందిన ట్రక్కులు ప్రమాదానికి గురి కావడంతో పదుల సంఖ్యలో మెక్సికన్లు మృతిచెందారు. More than 40 bodies have been found in a truck in San Antonio, Texas. The number of casualties is yet to be officially confirmed, but up to 16 occupants required medical treatment. The people found inside the truck are reportedly undocumented migrants. pic.twitter.com/IfEKth86qT — 10 News First (@10NewsFirst) June 28, 2022 ఇది కూడా చదవండి: అంతరిక్షంలో చైనా సౌర విద్యుత్ కేంద్రం! -
అల వీరాపురంలో అతిథులు.. చూసొద్దాం రండి!
సాక్షి,హిందూపురం(అనంతపురం): ఐదు నుంచి ఆరు అంగుళాల గోధుమ వర్ణంతో వంపు తిరిగిన పొడవాటి ముక్కు.. తెలుపు రంగులో మెడ, తల, వీపు.. ఎరుపు, గుళాబీ మిళితమైన రెక్కల కొనలు.. రెక్కల మధ్య, మెడ కింద ముదురు ఆకుపచ్చ రంగు, కాళ్లు తొడల వరకు తెలుపు రంగుతో కూడిన పక్షులు చిలమత్తూరు మండలం వీరాపురంలో సందడి చేస్తున్నాయి. ఇవి రష్యా దేశంలోని సైబీరియన్ ప్రాంతానికి చెందిన స్టార్క్ పెయింటెడ్ పక్షులు. సమ శీతోష్ణస్థితి కలిగిన ప్రాంతాల్లో జీవించే ఈ పక్షులు సంతానోత్పత్తి కోసం వేల మైళ్ల దూరం నుంచి ఏటా వీరాపురం వస్తుంటాయి. ముందుగా జనవరిలోనే కొన్ని పక్షులు వచ్చి ఇక్కడి వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తాయి. అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత తమ దేశానికి వెళ్లి మిగతా పక్షులతో తిరిగి వస్తాయి. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసిన నేపథ్యంలో వీరాపురంతో పాటు వెంకటాపురం, పరిసర ప్రాంతాల చెరువుల్లో నీరు చేరింది. అటవీ శాఖ అధికారులు చెరువుల్లోకి చేప పిల్లలను సైతం వదిలారు. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి నెలలోపు ఇక్కడకు పక్షులు వలస వచ్చి చెట్లపై నివాసాలు ఏర్పాటు చేసుకుని సందడి చేస్తున్నాయి. నెలరోజుల తర్వాత ఆడ పక్షి మూడు లేదా నాలుగు గుడ్లు పెడుతుంది. గుడ్ల వద్ద ఒక పక్షి కాపలా ఉంటే.. మరో పక్షి ఆహారం సేకరించుకుని వస్తుంది. ఆరు నుంచి ఎనిమిది వారాల వ్యవధిలో గుడ్లు పొదుగుతాయి. రెండు నెలలు పాటు పిల్లలకు ఆహారం అందజేస్తాయి. పిల్ల పక్షులు ఎగిరే దశకు చేరుకున్నాక అవే ఆహారం కోసం వెళ్లి వస్తాయి. సంతానం ఎదిగిన తర్వాత అన్నీ కలిసి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లోపు తిరిగి స్వస్థలానికి వెళ్లిపోతాయి. -
ఇప్పటివరకు 25 వేల పక్షులు.. వావ్ వాట్ ఏ సీన్!
బరంపురం: నగర శివారులోని బహుదా నదీ తీరాన విదేశీ అతిథి పక్షులు సందడి చేస్తున్నాయి. తొలిసారిగా ఇక్కడికి విచ్చేస్తున్న విహంగాలను చూసి నగరవాసులు ఆనందం వ్యక్త చేస్తున్నారు. ఏటా శీతాకాలంలో గంజాం జిల్లా, బరంపురం దగ్గరలోని చిలికా సరస్సులో ఉన్న 24 దీవులకు విదేశాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో వలస పక్షులు వచ్చి, విడిది చేస్తుంటాయి. ఎప్పటిలాగే కాకుండా ఈ ఏడాది రికార్డు స్థాయిలో 185 జాతులకు చెందిన దాదాపు 10 లక్షల పక్షులు చిలికాకు చేరుకోవడంతో, వాటిలో కొన్నింటి నివాసం ఏర్పాటుకు కాస్త అడ్డంకి ఏర్పడింది. దీంతో విడిది కోసం సరస్సుకు సమీపంలోని బహుదా నదికి కొన్ని పక్షులు చేరుకుంటున్నట్లు సమాచారం. ఇదంతా చూస్తున్న అక్కడి వారు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే మరింత బాగుంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు 25 వేల పక్షులు నదీ తీరానికి చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల నదీ తీరంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును అక్కడి అడవిలోకి తరలించేందుకు వెళ్లిన బరంపురం అటవీ శాఖ అధికారుల ద్వారా అతిథి పక్షుల ఆచూకీ వెలుగులోకి రావడం విశేషం. ప్రస్తుతం నది పరిసర ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకుని 25 వేల వరకు పక్షులు ఉన్నట్లు గుర్తించినట్లు డీఎఫ్ఓ అముల్యకుమార్ ప్రధాన్ తెలిపారు. చదవండి: కొన్ని రోజులు కాపురం చేసి ముఖం చాటేశాడు.. 44 రోజుల పాటు పగలు, రాత్రి.. చివరికి -
వలసదారుల పడవ బోల్తా: 11 మంది దుర్మరణం
Ship Carrying Migrants Sinks Off Greece Coast: వలసదారులతో వెళుతున్న పడవ గ్రీకు ద్వీపం ఆంటికిథెరాకు ఉత్తరాన ఉన్న ద్వీపంలో మునిగిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో సుమారు 11 మంది దుర్మరణం చెందారని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ ప్రమాదంలో చిక్కుకున్న దాదాపు 90 మందిని రక్షించినట్లు వెల్లడించారు. (చదవండి: చేతులతో నడిచే అరుదైన గులాబీ చేప!!) అయితే అక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోందని చెప్పారు. ఈ మేరకు పడవ మునిగిపోయినప్పుడు ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా స్పష్టం కాలేదని అధికారులు తెలిపారు. అయితే ప్రజలు తమ మనుగడను వెతుక్కుంటూ ప్రమాదకరమైన ప్రయాణాలను కొనసాగిస్తున్నారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ (యూఎస్హెచ్సీఆర్) ప్రతినిధి అసిస్టెంట్ అడ్రియానో సిల్వెస్ట్రీ ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: పూజారి వేషంలో మాదక ద్రవ్యాల వ్యాపారం... 7 కిలోల గంజాయి పట్టివేత!!) -
ఆ 5 రాష్ట్రాల్లో ఎన్నికలైతే, ఢిల్లీలో పార్టీల ప్రచారమెందుకు? కారణం ఇదే..
More than half of Delhi’s assembly seats are dominated by migrants from other states న్యూఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఐతే ఈ ఎన్నికల జాబితాలో ఢిల్లీ లేనప్పటికీ అక్కడ ఎన్నికల జాతర జరుగుతోంది. ఢిల్లీ నలుమూలలా పోస్టర్లు వెలిశాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పోస్టర్లు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. ఢిల్లీలో ఎన్నికల జాతర.. ఆ మూడు రాష్ట్రాల వలసదారుల ఓట్లే కీలకం కాగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్లలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు 2022 జరగనున్నవిషయం తెలిసిందే. ఐతే వీటిలో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన పోస్టర్లు రాజధాని ఢిల్లీలో ఎక్కపడితే అక్కడ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వాలు చేస్తున్న పనులు ఏకరువు పెడుతున్న పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఐతే ఢిల్లీలో మొత్తం 70 విధానసభలు ఉన్నాయి. ఇక్కడ అధిక శాతం ప్రజలు యుపీ, బీహార్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాకు చెందిన వలసదారులు ఉంటున్నారు. అందువల్ల ఈ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఢిల్లీలోని వలసవాసుల దృష్టిని ఏదో ఒక విధంగా ఆకర్షించేందుకు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 27 స్థానాల్లో మెజార్టీ ప్రజలు పూర్వాంచలికి చెందిన వారే ఉన్నారని సమాచారం. అందుకేనేమో యోగి ప్రభుత్వం ఢిల్లీలో పోస్టర్లు వేసి అక్కడి వలసదారుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రజలవద్దకే పోస్టర్లు అలాగే ఢిల్లీ, వికాస్పురి, రాజౌరీ గార్డెన్, హరి నగర్, తిలక్ నగర్, జనక్‌పురి, మోతీ నగర్, రాజేంద్ర నగర్, గ్రేటర్ కైలాష్, జంగ్‌పురా, గాంధీ నగర్, మోడల్ టౌన్, లక్ష్మీ నగర్, రోహిణిలోని 13 స్థానాల్లో పంజాబీ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల చన్నీ ప్రభుత్వం ఇక్కడ పోస్టర్లు వేసి పంజాబీలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఢిల్లీలో కొండ ప్రాంత వలసదారుల సంఖ్య దాదాపు 30 లక్షలు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సీఎం ధామి పోస్టర్ల ద్వారా బీజేపీ ప్రచారం సాగిస్తోంది. కాగా ఢిల్లీ అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారులే ఆధికం. ఈ కారణంగానే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పోస్టర్లు ద్వారా ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నాయి. చదవండి: మోదీ Vs దీదీ: ప్రధానిపై మమత అసహనం.. మళ్లీ రాజుకున్న రాజకీయ రగడ! -
ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వద్దు!.... దెబ్బకు రూటు మార్చిన కంపెనీ!!
నిజానికి టెక్నాలజీ మానవాభివృద్ధికి తోడ్పడాలి గానీ అతని మనుగడే ప్రశ్నర్థకమయ్యేలా హింసాత్మక ధోరణికి దారితీసే విధంగా ఉండకూడదు. మానవుడు తాను సృష్టించిన టెక్నాలజీతో రకరకాల సమస్యలను సృష్టించుకుంటున్నాడు లేదా కొని తెచ్చకుంటున్నాడు అని నిపుణుల హెచ్చరిస్తున్న సందర్భాలను అనేకం చూశాం. ప్రస్తుతం అలాంటి టెక్నాలజీని యూఎస్‌లోని ఒక కంపెనీ ఆవిష్కరించడంతో నెటిజన్లు ఆగ్రహానికి గురైంది. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) అసలు విషయంలోకెళ్లితే....యూఎస్‌లో ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన బ్లేక్ రెస్నిక్ లాస్ వెగాస్‌లో 2017లో జరిగిన భారీ కాల్పుల నేపథ్యంలో అహింసాయుత రోబోల వినియోగంతో చట్టాలను అమలు చేసే సంస్థలకు సహాయం చేసే ఉద్దేశంతో బ్రింక్ అనే టెక్సంస్థను స్థాపించాడు. ఏ మంచి ఉద్దేశంతో ఆ కంపెనీని ప్రారంభించాడో అది ఇప్పుడు విభిన్నమైన మలుపు తీసుకుని సరిహద్దుల వద్ద వలసదారులను పట్టుకోవడానికి అత్యధునిక టెక్నాలజీతో కూడిన డ్రోన్లను రూపొదించింది. అయితే వీటిని వాల్ ఆఫ్ డ్రోన్స్ అని పిలుస్తారు. పైగా ఇది యుఎస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల కదలికలనే కాక వారిని ట్రాక్ చేయగలదని కంపెనీ పేర్కొంది. అంతేకాదు డ్రోన్లు ముందుగా ప్రోగ్రామ్ చేసిన విమాన మార్గాన్ని అనుసరిస్తాయని చొరబాటుదారుల కోసం వెతకడానికి హై-డెఫినిషన్ కెమెరాల తోపాటు థర్మల్ ఇమేజర్లను ఉపయోగిస్తాయని రెస్నిక్ తెలిపారు. పైగా డ్రోన్ చొరబాటుదారుని గుర్తించినప్పుడల్లా సమీపంలోని నియంత్రణ కార్యాలయంలోని ఆపరేటర్లకు విషయాన్ని బదిలీ చేస్తుందన్నారు. ఈ మేరకు జోస్' అనే ఒక వలసదారుని పట్టుకున్నట్లు రెస్నిక్ వెల్లడించారు. అంతేకాదు ఈ టెక్నాలజీ సంబంధించిన వీడియోని ప్రమోషన్ నిమిత్తం 2018లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు మనిషి స్వేచ్ఛయుత జీవనానికి ప్రతిబంధకం ఈ టెక్నాలజీ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. అయితే కంపెనీ కూడా తన ఈ డ్రోన్ టెక్నాలజీ వినియోగం పై పునారాలోచించడమే కాక ప్రస్తుతం తమ ధోరణిని మార్చుకున్నాం అని కూడా ప్రకటించడం కొసమెరుపు. (చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..) -
విదేశాల నుంచి వస్తున్నాం.. కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతాం.. ప్లీజ్!
సాక్షి,బరంపురం: చిలికా సరస్సుకు ప్రతీ ఏడాది మాదిరిగానే విదేశీ పక్షులు వచ్చి చేరుతున్నాయి.తమ జాతి పక్షులతో జతకట్టేందుకు చిలికా దీవుల్లో విడిదిని ఏర్పరచుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు, వాయుగుండాల కారణంగా చలి ఎక్కువై లక్షలాది విదేశీ విహంగాలు చిలికా సరస్సుకు చేరుతున్నాయి. విదేశీ పక్షులు వేటగాళ్ల బారిన పడకుండా చిలికా వన్యప్రాణి అభివృధ్ధి సంస్థ అధికారులు గట్టి నిఘాను ఏర్పాటుచేశారు. ( చదవండి: మత్తు చల్లుతున్నారు.. అందుకే చూశారా? ) మూడు వారాలుగా సుమారు 8.94 లక్షల విదేశీ పక్షులు సరస్సుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సంతానానికి శ్రీకారం రకరకాల విదేశీ పక్షులు చిలికా సరస్సు మధ్యన ఉన్న బరుకుల్, నల్లబాల, కాళీజై, సత్తపరా, బ్రేక్పాస్టు, శరణ్, చోడైహోగా, మంగళాజోడి, పరికుద్ దీవులకు లక్షల సంఖ్యలో చేరుకొని విడిదిని ఏర్పర్చుకున్నాయి. ప్రకృతిలో వచ్చే మార్పును మనుషులతో పాటు పక్షులు కూడా తెలుసుకుంటాయనడానికి.. చలికాలంలో చిలికా సరస్సుకి లక్షలాది పక్షులు రావడమే నిదర్శనం. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ గూడు కట్టుకొని తమ జాతి పక్షులతో జతకలిసి సంతాన అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నాయి. చదవండి: లావైపోయారు.. ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారు.. -
ప్రవాసి దుర్గా మాతలు
పశ్చిమబెంగాల్: ఈ ఏడాది దసరా పండుగా సందర్భంగా దక్షిణ కోల్‌కతా బరిషా క్లబ్ వలసదారుల కష్టాలను ఇంతి వృత్తంగా తీసుకుని అమ్మ విభజన (భగెర్ మాత)పేరుతో దుర్గామాత విగ్రహన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలవడమే కాక ప్రతి ఒక్కర్ని ఆలోచింపజేసే విధంగా ఉంది. ఎడమవైపు బంగ్లాదేశ్‌ని కుడివైపు కుడి వైపు భారత సరిహద్దును సూచిస్తుంది. ఆమె ఏ మాతృభూమికి చెందనదిగా దీనంగా సరిహద్దులో దుర్గామాతను ఎత్తుకుని నలుగురు బిడ్డలతో కలిసి నిర్బంధ శిబిరాలలో శరణార్థ కుటుంబాలతో ఉన్నట్టుగా ఉంటుంది. (చదవండి: ఆ గాయని వస్తువులు మిలియన్ డాలర్లు!) ఈ విగ్రహం శరణార్థులకు ఎటువంటి పౌరసత్వం లేక భయం భయంగా కాలాన్ని వెళ్లదీస్తున్న ఘటనను వివరిస్తోంది. వలసలతో పిల్లలను తీసుకుని వచ్చే ప్రతి తల్లి ఒక దుర్గామాతతో సమానం. తన పిల్లల ప్రాణాల కోసం ఎంత దూరమైన వ్యయప్రయాసలు పడైన వలసవెళ్లే తల్లులు దుర్గామాత లాంటి దేవతేనని స్పష్టం చేసేలా ఉంది. వారి పట్ట మన వైఖరి ఎలా ఉండాలో అందరికీ అవగతమయ్యేలా ఆ విగ్రహన్ని ఆవిష్కరించారు. ఎండను వాననూ లెక్కచేయక ఆకలి చేతబట్టి పిల్లలతో వలసల వచ్చే ప్రతి తల్లి మూర్తిభవించిన దుర్గామాతతో సమానం. తన కుటుంబ రక్షణకై ప్రాణాలను అరచేత బట్టి వలస వచ్చే ప్రతితల్లిలోని అచంచలమైన ఆత్మివిశ్వాసానికి అందరూ తలవంచి నమస్కరించాల్సిందే అన్నట్లుగా ఆ విగ్రహన్ని రూపొందించారు. వారి పట్ల ప్రతి ఒక్కరి బాధ్యతలేమిటో గుర్తు చేసే విధంగా ఉంది (చదవండి: భారత స్పేస్ అసోసియేషన్‌ని ప్రారంభించనున్న మోదీ) -
రికార్డుల పట్టుగొమ్మ.. అదిరిందమ్మా!
ఎన్ని చెర్రీ టమాటాలో.. లెక్కేస్తే.. 839 తేలాయి.. అయితే.. ఇక్కడ కళ్లు తేలేసే విషయమొకటి ఉంది.. ఇవన్నీ కేవలం ఒకే కొమ్మకు కాసినవి.. ఈ విషయం వినగానే.. గిన్నిస్ వాళ్లు కూడా మొదట కళ్లు తేలేసి.. తర్వాత తేరుకుని.. లెక్కలేయడానికి బయలుదేరి వస్తున్నారట. ఇంతకీ ఈ భారీ కాతకు కారణమైన వ్యక్తి పేరు చెప్పలేదు కదూ.. డగ్లస్ స్మిత్.. బ్రిటన్‌లోని స్టాన్స్టెడ్ అబట్స్ గ్రామంలో ఉంటాడు. వీటిని తెంపడానికి గంట సమయం పట్టిందట. గత రికార్డు 488 టమాటాలట. వలసదారులపై కొరడా మెక్సికో మీదుగా టెక్సాస్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సుమారు 12వేల హైతీ వలసదారులను అమెరికా అధికారులు విమానాల ద్వారా వెనక్కి పంపించి వేస్తున్నారు. సరిహద్దులు దాటి వస్తున్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మెక్సికో–అమెరికా సరిహద్దుల్లోని రియో గ్రాండే నది వద్ద వలసదారులను అడ్డుకుంటున్న అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు. అందాల జాబిలి నీలి వర్ణం పూసుకున్న ఆకాశంలో స్పష్టమైన కాంతులీనుతున్న పున్నమి చంద్రుడు. ఈ ఫొటోను జర్మనీలోని తౌనుస్ ప్రాంతంలో తీశారు. (చదవండి: రియల్ ‘బాహుబలి’.. కటౌట్ చూసి నమ్మేయాల్సిందే!) -
వలసదారుల ఇక్కట్లు.. బైడెన్ ప్రభుత్వ కీలక ప్రకటన
Migrants Stranded At Texas Bridge: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టెక్సాస్ సరిహద్దు ప్రాంతంలోని డెల్రియోలో వరదల్లో చిక్కుకున్న వేలాది మంది వలసదారులను తరలించడానికీ విమానాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వలసలు, కరోనా పరిస్థితుల దృష్ట్యా అమెరికా ప్రభుత్వం హైతీ, మెక్సికో, ఈక్వెడార్ మరియు మధ్య అమెరికాలోని విమానాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) నియంత్రణలోని ప్రాంతమైన డెల్ రియో బ్రిడ్జ్ కింద ఉన్న గ్రాండ్ నదిని దాటి మెక్సికో నగరానికీ వలసదారులు పెద్ద ఎత్తున సముహాలుగా పయనమవుతున్నారు. (చదవండి: అఫ్గనిస్తాన్‌కి తక్షణ సాయం కావాలి) ఈ సందర్బంగా డెల్ రియో మేయర్ బ్రూనో లోజానో మాట్లాడుతూ..." 14 వేల మంది వలసదారులు నిర్భంధంలోకి వెళ్లడానికి సుముఖంగా ఉన్నారు. అంతేకాదు వలసదారులను తరలించే ఆపరేషన్‌లో భాగంగా స్థానిక , ఫెడరేషన్ అధికారులు బస్సులు, విమానాల పంపించారు. డెల్ రియో ప్రవేశ ద్వారాన్ని తాత్కాలికంగా మూసివేసి రియో బ్రిడ్జి పై రద్దీ దృష్ట్య వేరే మార్గం గుండా తరలించే ఏర్పాటు చేశాం" అని పేర్కొన్నారు. హోంల్యాండ్ సెక్యూరిటీ హైతి, సంబంధిత ప్రాంతాల్లో నిషేధించిన విమానాలను పునరుద్ధరించి త్వరితగతిన వలసదారులను తరలించేందుకు మరిన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. యూఎస్ నేలపై వలసల ఉధృతిని తగ్గించి, పరిస్థితిని తిరిగి మెరుగుపరిచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని బైడెన్ పరిపాలనా యంత్రాంగం పేర్కొంది. హైతి అధ్యక్షుడి మరణం, తాలిబన్లు అఫ్గనిస్తాన్ ఆక్రమించుకోవడం.. తదనంతర పరిణామాల నేపథ్యంలో అమెరికాలోని మెక్సికో సరిహద్దు ప్రాంతంలోకి అధిక సంఖ్యలో వసలదారులు తాకిడి ఎక్కువైంది. దీంతో యూఎస్ ప్రభుత్వం 2 లక్షలకు మించి వలసదారులకు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు వలసలను మొదటగా బహిష్కరించినప్పటికీ రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో వారికీ ఆశ్రయం కల్పించి, తరలించే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. (చదవండి: పది కోట్ల ప్రైజ్‌మనీ రేసులో మన బిడ్డ) -
లిబియాలో ఘోర పడవ ప్రమాదం; 57 మంది మృతి!
ట్రిపోలీ: లిబియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో 57 మంది మృతి చెందినట్లు భావిస్తున్నామని యూఎన్ మైగ్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. పడవ పశ్చిమ తీర పట్టణం ఖుమ్స్ నుంచి ఆదివారం బయలుదేరిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రతినిధి సఫా మెహ్లీ పేర్కొన్నారు. మృతుల్లో నైజీరియా, ఘనా, గాంబియాకు చెందిన వారున్నారు. దుర్ఘటన జరిగిన సమయంలో పడవలో 75 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా సముద్రంలోనే పడవ ఆగిపోయిందని, ఆ తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బోల్తాపడిందని తేలింది. ఐరోపాలో మెరుగైన జీవితం కోసం వలసదారులు, శరణార్థులు మధ్యధరా సముద్రం మీదుగా పడవల్లో వలస వెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. మరో 500 వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అధికారులు అడ్డుకొని లిబియాకు తరలించారు.. 18 మందిని ఈదుకుంటూ వచ్చి సోమవారం ఒడ్డుకు చేరుకున్నట్లు మెహ్లీ తెలిపారు. -
ఆరుగురు పాక్ వలసదారులకు భారత పౌరసత్వం
భోపాల్: పాకిస్తాన్ నుంచి మధ్యప్రదేశ్‌కి వచ్చిన ఆరుగురు పాక్ శరణార్థులకు రాష్ట్ర ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని అందించింది. వీరు మధ్యప్రదేశ్‌లో దశాబ్దాల కాలంగా జీవిస్తున్న నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కింద భారత్ పౌరసత్వం కల్పించినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి నరోత్తం మిశ్ర మాట్లాడుతూ.. ఈ ఆరుగురు వలస బాధితులు మతపరమైన హింసకు గురై భారత్‌లో బతకడానికి వచ్చారని తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం వారి భారత పౌరసత్వ పత్రాలను అధికారికంగా అందించినట్లు మంత్రి నరోత్తం మిశ్ర తెలిపారు. పౌరసత్వం పొందిన ఆరుగురిలో నందలాల్, అమిత్ కుమార్ భోపాల్ నివాసితులు కాగా, అర్జున్‌దాస్ మంచందాని, జైరామ్ దాస్, నారాయణ్ దాస్, సౌశల్య బాయి మాండ్‌సౌర్‌కు చెందినవారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు భారత దేశ పౌరసత్వం కల్పించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. 31 ఏళ్లుగా తాను అటు పాకిస్తాన్, ఇటు భారత్‌కు చెందిన వాడని కాదనే భావన ఉండేది. కానీ, ప్రస్తుతం తాను భారతీయుడనని గర్వంగా ఉన్నట్లు అర్జున్‌దాస్ మంచందాని మీడియాతో తెలిపాడు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ నుంచి వీరు 1988-2005 సమయంలో భారత్‌లోని మధ్యప్రదేశ్‌కు వచ్చారని, ఈ నేపథ్యంలోనే వారికి పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం అందిచామని అధికారులు తెలిపారు. ఇక పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం కింద పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో మతపరమైన హింసకు గురయ్యే హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్షీ, క్రైస్తవ వలసదారులకు భారత్ పౌరసత్వం కల్పించనుంది. అయితే 2014 సంవత్సరం కంటే ముందే భారత్‌కు వచ్చివారికి మాత్రమే దేశ పౌరసత్వం కల్పించనుంది. -
లాక్డౌన్.. వలస కూలీల కడుపు నింపుతున్న సన్నీలియోన్
ఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్‌తో దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అనేక మంది కార్మికులు రోడ్డున పడ్డారు. తినడానికి తిండి లేక దుర్భర పరిస్థితిన ఎదుర్కొంటున్నారు. వారికి చేయూత అందించడానికి బాలీవుడ్ నటి సన్నీలియోన్ ముందుకు వచ్చారు. ఢిల్లీలోని పదివేల మంది వలస కూలీల కడుపు నింపేందుకు పెటా (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్)ఇండియాతో చేతులు కలిపింది. ఉదయ్ ఫౌండేషన్ ద్వారా పూర్తిస్థాయిలో పౌష్టికాహాన్ని ఢిల్లీలోని వలస కార్మికులకు అందించనుంది. ఇక ఇదే విషయంపై సన్నీలియోన్ మాట్లాడుతూ..ప్రస్తుతం మనమందరం సంక్షబాన్ని ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయంలో దయ, కరుణతో అందరి ముందుకు వచ్చి పేదలకు సహాయం అందించాలి. పెటా ఇండియాలో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ప్రస్తుతం పేదవాళ్లు ఎదుర్కొంటున్న అతి ముఖ్య సమస్య ఇది. వేలాది మంది కార్మికులకు మంచి పౌషికాహారాన్ని అందించబోతున్నాం. ఈ సమయంలో వారికి ఇది ఎంతో అవసరం అని పేర్కొంది. గతంలోనూ భర్తతో కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేసిన సన్నీ ఉదారతను మరోసారి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రియల్ స్టార్ అంటూ పొడగ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం సన్నీలియోన్ ‘షెరో’, ‘రంగీలా’ అనే చిత్రాల్లో నటిస్తోంది. దీంతో పాటు తెలుగు, హిందీల్లో రూపొందుతున్న ‘హెలెన్’, ‘కోకాకోలా’ సినిమాలు చేస్తోంది. చదవండి: ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న సన్నీలియోన్.. ధర ఎంతంటే? -
గల్ఫ్‌లో కార్మికుల గోస.. ఆదుకోవాలని వేడుకోలు
సాక్షి, జగిత్యాల: స్వగ్రామంలో ఉపాధి కరువై దుబాయ్ వెళ్లిన గల్ఫ్ కార్మికులకు వేతన కష్టాలు మొదలయ్యాయి. మూడు నెలలుగా వేతనాలు లేక, తిండికి కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో రాష్ట్రానికి చెందిన 17 మంది కార్మికులు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుబాయ్‌లోని ఇన్వెస్టర్ టెక్నికల్ కంపెనీలో పనిచేసేందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏడుగురు, నిర్మల్‌కు చెందిన ఆరుగురు, జగిత్యాలకు చెందిన ఒకరు, రాజన్న సిరిసిల్లకు చెందిన ఒకరు, కామారెడ్డికి చెందిన ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒకరు ఆరేళ్ల క్రితం వెళ్లారు. మూడు నెలలుగా కంపెనీలో పని లేకపోవడంతో వేతనాలు ఇవ్వడం నిలిపివేశారు. దీంతో కార్మికులు తిండికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కంపెనీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇక్కడ చదవండి: తెలంగాణలో లాక్డౌన్ ఆలోచన లేదు: మంత్రి ఈటల Vemulawada: కక్కుర్తిపడ్డ ఉద్యోగి.. భోళా శంకరునికే బురిడీ.. -
ముంబై నుంచి తెలంగాణ: ఈ జర్నీ చాలా కాస్ట్లీ గురూ!
సాక్షి, హైదరాబాద్: కరోనా భయంతో సొంతూళ్లకు బయలుదేరిన వలసజీవికి ఎంత కష్టం.. ఎంత నష్టం! పట్నంలో ఉండలేమని పల్లెబాట పట్టినవారికి ఎంత కష్టం.. ఎంత నష్టం! వారిని ప్రైవేట్ బస్ ఆపరేటర్లు నిలువుదోపిడీ చేస్తున్నారు. టికెట్ల ధరలు విపరీతంగా పెంచి ఇక్కట్ల పాలు చేస్తున్నారు. లాక్డౌన్ పరిస్థితుల్లో ఉన్న ముంబై నగరం నుంచి తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చేరాల్సిన తమకు ఈ బస్సుల్లో ప్రయాణించే పరిస్థితిలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంబై నుంచి రోజుకు వేలాది మంది తెలంగాణకు వస్తున్నారు. ఇందులో చాలామంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రైళ్లలో సీట్లు దొరకనివారు, అత్యవసరంగా వెళ్లాలనుకున్నవారు మాత్రం బస్సులను ఆశ్రయిస్తున్నారు. వలసజీవుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు ఆపరేటర్లు ముంబై నుంచి నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల వరకు అమాంతం టికెట్ ధరలు పెంచేశారు. రూ.700 ఉన్న టికెట్ ధరను రూ.1200లకు, రూ.900 ఉన్న టికెట్‌ను రూ.1,800–2,000 వరకు పెంచారని వలసకారి్మకులు వాపోతున్నారు. ముంబై నుంచి రైల్లో నిజామాబాద్ వరకు స్లీపర్‌లో వెళితేనే రూ.400 టికెట్ ఉందని, కానీ ఈ బస్సుల్లో సిట్టింగ్‌కే విపరీతంగా వసూలు చేయడంతో బస్సులు ఎక్కాలంటే భయమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా విపరీతంగా వసూలు చేయడమే కాకుండా ముంబై దాటిన తర్వాత చంబూరు, మాన్కూరు వద్ద పుణె వెళ్లే ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారని, మధ్యలో సీట్లు వేసి కూర్చోబెడుతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. బస్సు కిటకిటలాడే విధంగా ప్రయాణికులను ఎక్కించడమే కాకుండా కనీసం శానిటైజర్లు కూడా బస్సుల్లో ఉంచడం లేదని చెబుతున్నారు. దీనికితోడు బస్సుల్లో విపరీతమైన దుర్గంధం వస్తోందని అంటున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే దిగి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని, ఏం చేయలేని పరిస్థితుల్లో సొంత గ్రామాలకు వెళ్లేందుకు వేరే అవకాశం లేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నామని వాపోతున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి ‘ముంబై నుంచి తెలంగాణలోని సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్న వలసజీవులను ప్రైవేటు బస్ ఆపరేటర్లు దోపిడీ చేస్తున్నారు. అమాంతం టికెట్ ధరలు పెంచి ఇష్టమైతే బస్ ఎక్కాలని, లేదంటే వెళ్లిపోవాలని హుకూం జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఐదు ప్రైవేటు ట్రావెల్స్ అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నాయి. రెండింతల ధర పెంచి ముక్కు పిండి వసూలు చేస్తున్న ఆపరేటర్లు బస్సుల్లో కనీసం కరోనా నిబంధనలు పాటించడం లేదు. ప్రయాణించినంత సేపు దుర్గంధం మధ్య ఉండాల్సి వస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఈ దోపిడీని అరికట్టాలి’ – మూల్నివాసి మాల, తెలంగాణ జేఏసీ చైర్మన్, ముంబై చదవండి: కరోనా విలయం: ఢిల్లీలో లాక్డౌన్ -
ఒమన్ నుంచి ముగ్గురు మహిళలు రాక
గన్నవరం: ఏజెంట్ల మాయమాటలు నమ్మి ఒమన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు మహిళలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) గురువారం స్వరాష్ట్రానికి తీసుకొచ్చింది. ఒమన్ రాజధాని మస్కట్ నుంచి ఎయిరిండియా విమానంలో ఈ ముగ్గురు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిలో ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లావారు కాగా, మరొకరు కడపకు చెందినవారు. వీరి విమాన టిక్కెట్ ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరించింది. అంతేకాకుండా వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరికి, కడపకు చెందిన ఒకరికి ప్రయాణం, భోజనం ఖర్చులను కూడా అందించింది. గన్నవరం విమానాశ్రయంలో వీరికి ఏపీఎన్ఆర్టీఎస్ సిబ్బంది స్వాగతం పలికారు. ఒమన్ వెళ్లి చిక్కుకుపోయిన వలస కార్మికులకు ఆ దేశం క్షమాభిక్ష ప్రకటించడంతో తొలి విడత ఈ నెల 14న ఎనిమిది మందిని రాష్ట్రానికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: పనిమనిషిపై పైశాచికం.. శరీరంపై 31 గాయాలు ఆస్ట్రేలియా నుంచి రప్పించి మరీ ఎన్నారై అరెస్టు -
కరోనా: శూన్య సంవత్సరంగా 2020
ఈ శతాబ్దపు మహావిపత్తు అంటూ భయపెట్టడం కాదుకాని నిజంగానే ప్రపంచానికి చుక్కలు చూపించింది కరోనా. సాంఘిక జంతువును కాస్త ఒంటరి జీవిని చేసింది. ముక్కుకు, మూతికి అడ్డు పెట్టించి.. ప్రకృతి వనరుల మీద అదుపు నేర్పింది.. పొదుపు విలువ చెప్పింది.. ఊహించనివాటిని అనుభవంలోకి తెచ్చింది.. అనుభవంలో ఉన్నవాటిని ఊహలుగా మార్చింది.. గిర్రున తిరుగుతున్న కాలాన్ని నిలిపేసింది.. ఉత్పత్తులను ఆపేసింది. కరోనా కేర్ తప్ప తతిమా సేవలన్నిటికీ సెలవు ప్రకటించింది.. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఏడాదిని శూన్య సంవత్సరంగా చరిత్రలో చేర్చింది. 2019, నవంబర్ 17న చైనాలో తొలి కరోనా కేసు బయటపడింది. అయితే ఈ ఏడాది జనవరి 1న డబ్ల్యూహెచ్ఓ వుహాన్కి తన ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సపోర్ట్ టీమ్‌ను పంపించడంతో మొదటిసారిగా కరోనా విషయం ప్రపంచానికి తెలిసింది. కరోనా పేషంట్ల కోసం ఫిబ్రవరిలో వుహాన్‌లోని అథ్లెట్స్ విలేజ్ పార్కింగ్ లాట్లో ఆగమేఘాల మీద ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది చైనా. ► మనదేశంలో మార్చి 25వ తేదీన తొలి విడత లాక్‌డౌన్‌ను ప్రకటించింది ప్రభుత్వం. 31 వరకు సాగిందది. ఈ ప్రభావంలోంచి ఆర్థిక వ్యవస్థను తప్పించడానికి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్రోత్సాహక పథకాలను ప్రకటించింది. ► కరోనా దెబ్బతో మొత్తం జగత్తే స్తంభించి పోయిన నెల అది. దాదాపు అన్ని దేశాలూ లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. వీధులు, వీధి చివర దుకాణాల నుంచి బడులు (కళాశాలలు సహా), గుడులు, కూడళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, బస్టాండులు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల దాకా అన్నీ బంద్. రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. గత నలభై ఏళ్లలో మొదటిసారిగా ‘తాజ్‌మహల్’ సందర్శననూ నిలిపేశారు. ► కర్ఫ్యూ వాతావరణాన్ని కొంచెం కొంచెంగా సడలిస్తూ లాక్డౌన్ ఉనికిలోనే ఉన్న నెల ‘మే’. ఆ నెల 9న దేశాన్ని దిగ్భ్రాంతిలోకి నెట్టిన దుర్ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దగ్గర జరిగింది. తెల్లవారు జామున రైలు పట్టాల మీద సేద తీరుతున్న పదహారు మంది వలస కార్మికుల మీద నుంచి గూడ్స్‌రైలు దూసుకెళ్లింది. ► దైనందిన జీవితం హోల్డ్‌లో ఉన్నా వైజ్ఞానిక ప్రయోగాలు ఆగలేదు... కరోనా టీకా నుంచి అంతరిక్ష ప్రయోగాల దాకా. నాసా ‘ది స్పేస్ ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్’ను ప్రయోగించింది. ► కరోనా వరల్డ్ స్టాక్ మార్కెట్‌ను కుప్పకూల్చింది. 40 వేల పాయింట్లతో దూసుకెళ్లిన మన సెన్సెక్స్ కరోనా ఎఫెక్ట్‌తో 10వేల పాయింట్లకు పడిపోయింది. బిలియన్ డాలర్ల పెట్టుబడి తుడిచిపెట్టుకుపోయింది. ► మన దేశంలో కరోనా తొలి కేసు జనవరి 30న నమోదైంది. చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుకుంటున్న కేరళ విద్యార్థి స్వస్థలానికి ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో చేసిన వైద్యపరీక్షల్లోనే ఆ విద్యార్థికి కరోనా పాజిటివ్ అని తేలింది. (చదవండి: కుటుంబ రక్షణకే కరోనా వ్యాక్సిన్) కరోనా మిగిల్చిన శోకం సినీ గాయక ప్రముఖుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కూచిపూడి నర్తకి శోభానాయుడు కరోనాతో మరణించారు. ♦ మన దేశంలో వలస కార్మికులు వందల కిలోమీటర్లు కాలినడక మొదలుపెట్టారు స్వస్థలాలు చేరుకోవడానికి. వాళ్లకు మంచినీళ్ల నుంచి ఆహారం, చెప్పులు, రవాణా సదుపాయాల ఏర్పాటు వరకు సహాయం అందించడానికి వ్యక్తుల నుంచి సంస్థల వరకు ముందుకొచ్చారు.. వచ్చాయి. వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా వలస కార్మికుల కోసం తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ వరకు జాతీయ రహదారి పొడుగునా సహాయక శిబిరాలను నెలకొల్పారు. ♦ ప్రముఖ నటుడు సోనూ సూద్ వలస కార్మికులకు అందించిన సేవలను యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తన ‘స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డ్ (సెప్టెంబర్‌లో)’తో గుర్తించి అతణ్ణి గౌరవించింది. ♦ ప్రపంచ లాక్‌డౌన్‌కు కొనసాగింపు నెల. చరిత్రలో చాలా మొదటిసార్ల (ఫస్ట్‌టైమ్)కు సాక్ష్యమైంది. వాటికన్లో పోప్ ఫ్రాన్సిస్ ప్రత్యక్ష ప్రసారానికి జనసందోహం లేకపోవడం ఇదే మొదలు. ♦ ఇస్లాం పుణ్యక్షేత్రం మక్కా కూడా ఖాళీగానే దర్శనమిచ్చింది. ♦ జూలై నెలలో ప్రారంభం కావాల్సిన టోక్యో ఒలిపింక్స్‌ను కరోనా ఆపేసింది. ♦ వందే భారత్ మిషన్ కింద దుబాయ్‌లో ఉన్న భారతీయులను ఆగస్టు 7న స్వదేశానికి తీసుకొస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 1344 విమానం కాలికట్ అంతర్జాతీయ విమానశ్రయంలో ల్యాండ్ అవుతూ భారీ వర్షం కారణంగా రన్ వే మీద జారింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా పందొమ్మిది మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 169 మంది సురక్షితంగా బయటపడ్డారు. (చదవండి: చైనా గుట్టు రట్టు చేసిన ‘వుహాన్ ఫైల్స్’) కరోనాపై పది కత్తులు డాక్టర్ పూజా భాటియా మూత్రపిండాల చికిత్సా నిపుణురాలు. యు.ఎస్.లో స్థిరపడిన కుటుంబం ఆమెది. పేషెంట్లను చూస్తున్న క్రమంలో డాక్టర్ పూజాకు కరోనా సంక్రమించింది. కోలుకున్న వెంటనే మళ్లీ విధుల్లోకి వచ్చారు. కరోనా యోధులపై తయారవుతున్న డాక్యుమెంటరీ చిత్రం ‘ఎ ప్యాండమిక్: అవే ఫ్రమ్ ద మదర్ల్యాండ్’లో డాక్టర్‌గా, మానవత్వం గల మనిషిగా పూజా ఏమిటో మనం చూడొచ్చు. శ్వేతారాయ్ హాలీవుడ్లో ఉంటున్న భారతీయ చలన చిత్ర దర్శకురాలు. డాక్టర్ పూజా భాటియా, మరో ఐదుగురు భారతీయ వైద్యులపై ‘ఎ ప్యాండమిక్: అవే ఫ్రమ్ ది మదర్ల్యాండ్’ అనే డాక్యుమెంటరీని తీస్తున్నది శ్వేతనే! జన్మభూమికి దూరంగా పరదేశంలో కరోనా కొమ్ములు వంచుతున్న డాక్టర్ అంకిత్ భారత్, డాక్టర్ ఉమా మధుసూదన్, డాక్టర్ శ్రీధర్ కులకర్ణి, డాక్టర్ శంతను సింగ్‌లపై 70 నిముషాల నిడివిలో ఈ డాక్యుమెంటరీ ఉండబోతోంది. డాక్టర్ అమృతా గాడ్గే యు.కె.లో పనిచేస్తున్న భారతీయ భౌతిక శాస్త్రవేత్త. బోస్–ఐన్‌స్టీన్ కండెన్సేట్ (బి.ఇ.సి.) ను విజయవంతంగా ఆవిష్కరించారు అమృత. బి.ఇ.సి. అనేది పదార్థం నాల్గవ స్థితి. మొదటి నాలుగు స్థితులు ఘనం, ద్రవం, వాయువు, ప్లాస్మా. కరోనా స్థితిగతులపై అమృతా పరిశోధన చేస్తున్నప్పుడు అంతరిక్షంలో వ్యోమగాములకు ఉపయోగకరమైన ఈ ఫలితం వెలువడింది. మహితా నాగరాజ్ డిజిటల్ మార్కెటింగ్ వృత్తి నిపుణురాలు. సింగిల్ మదర్. ‘కేర్ మాంగర్స్’ ఇండియా ఆలోచన మహితదే. కరోనా నుంచి తమకై తాము జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నవారిని ఈ సంస్థ తన సంరక్షణలోకి తీసుకుంటుంది. 46 వేల మంది సభ్యులతో 14 దేశాలకు విస్తరించింది. ఒక్క భారతదేశంలోనే ‘కేర్‌మాంగర్స్’కి 22 వేల మంది వాలంటీర్లు ఉన్నారు. ప్రధానంగా వృద్ధులకు ఆహార, వైద్య, ఆరోగ్య సేవల్ని ఈ గ్రూపు అందిస్తుంటుంది. చంద్రబాలీ దత్తా భారత సంతతికి చెందిన బ్రిటిష్ శాస్త్రవేత్త. కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టే పనిలో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందంలో సభ్యురాలు. వ్యాక్సిన్ తయారయ్యే ప్రతి దశలోనూ అన్నీ సరిచూసుకోవలసిన కీలకమైన బాధ్యత ఆమెదే. షిఫా మొహమ్మద్ హౌస్ సర్జన్. కరోనా పేషెంట్లకు తను అందించవలసిన చికిత్సలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆమె తన పెళ్లినే వాయిదా వేసుకున్నారు. షిఫా కన్నూర్ (కేరళ)లోని పరియారమ్ మెడికల్ కాజేజ్ హాస్పిటల్లో పని చేస్తున్నారు. కెప్టెన్ స్వాతి రావల్ భర్త కెప్టెన్ రాజా చౌహన్తో కలిసి బోయింగ్ 777లో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను త్వరత్వరగా సొంతగడ్డకు చేర్చే విధులలో నిర్దేశిత పని గంటలకు మించి స్వచ్ఛందంగా పనిచేశారు. ఆమె స్వదేశానికి తీసుకొచ్చిన 263 మంది భారతీయులలో ఎక్కువమంది విద్యార్థులే. ప్రధాని నరేంద్ర మోదీ ఆమె చొరవను అభినందించారు. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ జెనీవాలోని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’లో చీఫ్ సైంటిస్ట్. కరోనాకు వ్యాక్సిన్‌ను, డ్రగ్ థెరపీలను కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న శాస్త్ర పరిశోధనల కార్యాచరణలకు ఆమె నేతృత్వం వహిస్తున్నారు. మినాల్ దఖావే భోసాల్ పుణెలోని ‘మైల్యాబ్ డిస్కవరీ’ ప్రయోగశాలలో పరిశోధన, అభివృద్ధి విభాగాల అధిపతి. ఆమె నేతృత్వంలోనే మైల్యాబ్ ‘ప్యాథో డిటెక్ట్’ అని కి ట్‌కు రూపకల్పన చేసింది. కాన్పుకు ముందు రోజు వరకు ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’లో ఆమె తన పరిశోధనల్లో నిమగ్నమై ఉండటం వార్తల్లోని విశేషం అయింది. డాక్టర్ ఉమా మధుసూదన్ యు.ఎస్.లోని కనెక్టికట్‌లో ఉన్న హార్ట్ఫోర్డ్ హెల్త్ కేర్‌లో ఫిజీషియన్. సౌత్ విండ్సర్ హాస్పిట్లో కరోనా బాధితులకు ఆమె అందించిన సేవల్ని ప్రపంచమంతా గుర్తించింది. అక్కడి స్థానికులు ఆమెకు గౌరవ సూచకంగా ఆమె నివాసం ముందు నుంచి కార్ల పరేడ్‌తో ధన్యవాదాలు సమర్పించారు. అమెరికా, కెనడా, బ్రిటన్, రష్యా, మెక్సికో, బహెరైన్ .. ఈ ఆరు దేశాలు కరోనా టీకాను అధికారికంగా ఆమోదించాయి. -
ఒమన్‌లో వలస కార్మికులకు క్షమాభిక్ష
సాక్షి, జగిత్యాల: ఉపాధి కోసం వచ్చి సరైన పత్రాలు లేక చట్టవిరుద్ధంగా తమ దేశంలో ఉంటున్న వలస కార్మికులకు ఒమన్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాదిమంది కార్మికులకు ఊరట లభించనుంది. వీసా గడువు ముగిసిన కార్మికులు తమ స్వదేశానికి వెళ్లేందుకు డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. వీసా గడువు ముగిసి, చట్టవిరుద్ధంగా ఉంటున్న వారంతా అక్కడి ప్రభుత్వం విధించిన జరిమానా చెల్లించి, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కానీ లక్షల సంఖ్యలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారితో తమ ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఒమన్ ప్రభు త్వం భావిస్తోంది. దీంతో అలాంటి వారందరికి క్షమాభిక్ష ద్వారా తమ స్వదేశాలకు వెళ్లేలా వెసులుబాటు కల్పించింది. 25 లక్షల మంది వలసదారులు ఒమన్ దేశంలో భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, శ్రీలంకతోపాటు పలు ఇతర దేశాలకు చెందిన సుమారు 25 లక్షల మంది వలస కార్మికులు ఉపాధి పొందుతున్నారు. క్షమాభిక్ష ద్వారా చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిని స్వదేశాలకు పంపిస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, స్వస్థలాలకు తిరిగి వచ్చే వలస కార్మికులకు సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నోడల్ ఆఫీసర్‌ను ప్రత్యేకంగా నియమించాలని, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు అందించి అవుట్ పాస్‌పోర్టు జారీ చేయాలని భారత కార్మికులు కోరుతున్నారు. ఉచిత విమాన సదుపాయం కల్పించి కార్మికులను ఆదుకోవాలని ఒమన్–తెలంగాణ ఫ్రెండ్స్ సంస్థ సభ్యుడు నరేంద్ర పన్నీర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
వలసలు నేర్పుతున్న పాఠాలు
కరోనా వైరస్ ప్రేరేపించిన రివర్స్ మైగ్రేషన్ కారణంగా గ్రామీణ భారతం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మన ఆర్థిక, పాలనావిధాన ప్రక్రియలు, ఆచరణలు, విధానాలు పూర్తిగా పరివర్తన చెందాల్సి ఉంది. పైగా, కార్మికులకు జీవించే హక్కు, ఆహార హక్కు, భద్రత హక్కు, వీటన్నింటికంటే శ్రమను గౌరవించే హక్కుకు హామీ ఇచ్చే కార్మిక జనాభా హక్కుల చార్టర్ మనకిప్పుడు ఎంతైనా అవసరం. భారత రాజకీయ నాయకత్వం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంతవరకు కరోనా వైరస్ అనంతర దశలో అలాంటి చార్టరే మార్గదర్శక సూత్రంగా ఉండాలి. దీన్ని గుర్తించడంలో విఫలమైతే సమాజంలో ఉపద్రవం తప్పదు. కోవిడ్–19 ప్రాణాంతక వ్యాధి తొలి దశలో జాతి మొత్తంగా చూసిన అత్యంత విషాదకరమైన ఘటన ఏదంటే, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు భారీ స్థాయిలో వలసపోతున్న భయానకమైన దృశ్యాలే. వీరు నగర భారత అసంఘటిత ఆర్థికవ్యవస్థకు చెందిన అదృశ్య చోదకులు. ఈ వ్యాసం పనిస్థలాల నుంచి వలస కూలీల నిష్క్రమణకు సంబంధించినది. ముందుగా వలసలు అంటే ఎవరు అనేది అర్థం చేసుకుందాం. సాధారణంగా తమ జన్మస్థలం నుంచి లేక తమ నివాస స్థలం నుంచి బయటకు వెళ్లేవారు అనే ప్రాతిపదికన వలస ప్రజలను నిర్వచిస్తుంటాం. గత దశాబ్దం పొడవునా రాష్ట్రాలు దాటి కొత్త అభివృద్ధి కేంద్రాలకు ప్రత్యేకించి చిన్న, మధ్యస్థాయి పట్టణాలకు మనుషులు పయనమై పోవడం వల్ల వలస అనే చట్రం అర్థం మార్చుకుంది. ఇలా భారీస్థాయిలో జనాభా వలస పోవడం ఎక్కడ జరుగుతోంది, వలస ప్రజలు ఎక్కువగా ఎక్కడ మొదలై ఎక్కడికి వెళుతున్నారు. వారి నివాస స్థానం, వారి గమ్య స్థానం ఏది అనేది చర్చనీయాంశంగా ఉంటోంది. వలస కార్మికులు ప్రధానంగా మహానగరాల్లో భవన నిర్మాణ స్థలాల్లో పనిచేస్తుంటారు. పట్టణాల శివారు ప్రాంతాల్లో ఇటుకబట్టీల్లో పనిచేస్తుంటారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తుంటారు. పైగా చెరకు పండించే ప్రాంతాలు, ముక్కారు పంటలు పండించే ప్రాంతాల్లో కూడా వీరు కనిపిస్తారు. ఇవి కాకుండా చిన్న చిన్న రోడ్డు పక్క వ్యాపారం చేసేచోట, సేవలు అందించే చోట కూడా వీరు పనిచేస్తుంటారు. దేశం మొత్తంమీద ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుంచి భారీగా వలసలు జరుగుతుంటాయని, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్, పశ్చిమ బెంగాల్ తర్వాత స్థానాల్లో ఉంటాయని క్షేత్రస్థాయి అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక వలసప్రజలను భారీ ఎత్తున స్వాగతిస్తున్న రాష్ట్రాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజ రాత్, ఏపీ, కేరళ తొలి స్థానాల్లో ఉంటున్నాయి. భారత్‌లో వలస ప్రజల గురించి అందుబాటులో ఉన్న డేటా పూర్తి వైవిధ్యభరితమైన వాస్తవికతను ప్రదర్శిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోపల వివిధ ప్రాతాలకు 45 కోట్లమంది వలసపోతున్నారని, ఇది 2001 జనాభా లెక్కల కంటే 30 శాతం ఎక్కువగా ఉంటోందని తెలుస్తోంది. దేశం లోపల భారీఎత్తున సాగుతున్న ఈ వలసకు కారణాలు ఏంటి? అమితమైన బాధ, కడగండ్ల బారినపడటం లేక అవకాశాలు వెదుక్కుంటూ పోవడం వల్ల వలస వెళుతున్నారా? లభ్యమవుతున్న సహజ కారణాలు, పంచుకున్న అనుభవాలను పరిశీలించినట్లయితే వలసలు ప్రారంభమవుతున్న రాష్ట్రాలు తక్కువ సామాజిక, ఆర్థికాభివృద్ధిని నమోదు చేస్తున్నాయని, చాలావరకు దేశంలో వలసలనేవి జీవనం గడపడంకోసం, మనుగడకోసం పోరాటంలో భాగంగా జరుగుతుంటాయని తెలుస్తుంది. జీవితంలో బాధలనుంచి బయటపడటానికే మన దేశంలో ఎక్కువగా వలసలు జరుగుతుంటాయి. వలసలు ప్రారంభమయ్యే, చేరుకునే ప్రాంతాల్లోని పని అవకాశాలు, మనుగడ పరిస్థితుల ప్రాతిపదికనే వలసల వ్యూహాలు ఆధారపడి ఉంటాయి. వలసపోయిన వారు తిరిగి తమ నివాస ప్రాంతాలకు చేరుకోవడం ఏ స్థాయిలో జరుగుతోందో పరిశీలిద్దాం. లేబర్ ఫోర్స్ సర్వే (2017–18) కాలానికి గాను 23 కోట్ల 80 లక్షలమంది కార్మికులు స్వయం ఉపాధి విభాగంలో పనిచేస్తున్నారని, మరో 11 కోట్ల 20 లక్షల మంది తాత్కాలిక కార్మికుల విభాగంలో పనిచేస్తున్నారని తెలిసింది. శాశ్వత వర్కర్లుగా ఉంటున్న లేదా మూడేళ్లకు మించి ఒప్పందంలో భాగంగా పనిచేస్తున్న వారు కోటీ 90 లక్షలమంది మాత్రమే. వీరిని మాత్రమే శాశ్వత ఉద్యోగులు అని పిలుస్తున్నారు. ఇకపోతే క్రమబద్ధమైన ఉపాధి రంగంలో ఉంటూనే తాత్కాలిక ఉపాధిరంగంలో పనిచేస్తున్న 4 కోట్ల 90 లక్షలమంది కార్మికులను ఈ విభాగం నుంచి తప్పించారు. ఆరో ఆర్థిక జనగణన 2015–16 ప్రకారం (కేంద్ర పాలితప్రాంతాలు మినహా), దేశంలో 2 కోట్ల 40 లక్షల పైబడిన వ్యాపార సంస్థలు 21 కోట్ల 16 లక్షలమంది కార్మికులను నియమించాయి. ఇక కార్మికుల సంఖ్య రీత్యా చూస్తే, 17.2 కోట్లమంది కార్మికులు (79.85 శాతం) తొమ్మిది మంది కంటే తక్కువ సంఖ్యలో కార్మికులను కలిగి ఉన్న సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇకపోతే 10 మందికి మించి 49 మందికి మించని కార్మికులు ఉన్న వ్యాపార సంస్థల్లో 2 కోట్ల మంది పనిచేస్తున్నారు. వందమందికంటే ఎక్కువ కార్మికులను కలిగి ఉన్న వ్యాపార సంస్థల్లో కోటీ 70 లక్షల మంది (8 శాతం) మాత్రమే పనిచేస్తున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. భారీ సంస్థలను మినహాయిస్తే, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న వారు స్థూల దేశీయ ఉత్పత్తిలో 6.11 శాతానికి దోహదం చేస్తున్నారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా మంత్రిత్వ శాఖ 2010 మార్చి 20న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, కాంట్రాక్టు, తాత్కాలిక కార్మికులతో సహా ఏ విభాగానికి సంబంధించిన ఉద్యోగులను, కార్మికులను తొలగించరాదని, వారి వేతనాల్లో కోత విధించరాదని ఆదేశించింది. ఈ సర్క్యులర్ ప్రకారం లే ఆఫ్‌లు ప్రకటించకుండా తమ వద్ద పనిచేస్తున్న కార్మికులకు సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు వేతనాలు చెల్లించవలసి వస్తే అది పలు ఆర్థిక అవరోధాలకు సాక్షీభూతమై నిలుస్తుంది. అదనపు వేతన ఖర్చులను భరించాల్సి వస్తున్న కారణంగా ఈ విభాగంలోని అనేక యూనిట్లు దివాలా తీయక తప్పదు. ఈ భారీ ఖర్చును భరించే శక్తి చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు ఉండదు. అందుచేతనే దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్.. కోట్లాది మంది వలస కార్మికుల జీవితాలను బాగు చేయలేనంతగా దెబ్బ తీయడమే కాకుండా, ఉత్పత్తి నుంచి పంపిణీ, వినియోగం వరకు అన్ని విభాగాల్లో, రంగాల్లో కార్యకలాపాలను స్తంభింపజేసింది. నగరాల నుంచి భారీస్థాయిలో వలసకార్మికులు తిరుగుముఖం పట్టడం అనేది స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో అతిపెద్ద మానవ విషాదాల్లో ఒకటిగా నిలిచింది. గత వందేళ్లకాలంలో కోవిడ్–19 ప్రాణాంతక వైరస్ కలిగిస్తున్న ఉత్పాతాన్ని ఇటీవలి మానవచరిత్రలో ఎవరూ చూసి ఉండలేదు. 1918లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఫ్లూ వ్యాధిని మాత్రమే దీనికి సరిసమానంగా భావించవచ్చు కానీ ఆనాడు ఆ వ్యాధికి గురైన బాధితులు దాదాపుగా ఇప్పుడు బతికి ఉండలేదు. కోవిడ్–19 నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణ క్రమం అనేది సుదీర్ఘ ప్రక్రియను అనుసరిస్తుంది. తమ నివాస ప్రాంతాల్లో పనులు దొరకని, పట్టణ ప్రాంతాల్లో అవకాశాల కోసం చూస్తున్న వలస కార్మికులకు ఇది బాధాకరమైన ప్రక్రియగానే ఉండబోతుంది. భారత నగరీకరణకు చెందిన చెల్లాచెదురు స్వభావం కానీ, లాక్ డౌన్‌ని పాక్షికంగా దశలవారీగా ఎత్తివేసిన పరిస్థితులు కానీ కాంట్రాక్టర్ కీలకంగా ఉండే కార్మికుల సప్లయ్ చైన్స్‌ని తిరిగి కొలిక్కి తీసుకురావడానికి కాస్త ఎక్కువ సమయాన్నే తీసుకునేలా ఉన్నాయి. కార్మికులు తిరిగి వస్తున్నందున అనియత రంగ కార్మిక మార్కెట్ కూడా మార్పు చెందనుంది. పైగా వలస కార్మికులను భారీగా ఇముడ్చుకునే నిర్మాణం రంగం వంటి కొన్ని రంగాలు త్వరలో పుంజుకోవడం సాధ్యపడదు. రాష్ట్రాలు దాటిపోయే వలస కార్మికులపై ఇప్పుడు తమ నివాస ప్రాంతాలకు సమీపంలో ఉండే పట్టణాలు, నగరాలనుంచి ఒత్తిడి పెరుగుతోంది కానీ ఇవి వారికి పెద్దగా అవకాశాలు కల్పించలేవు. అధిక జనాభా ఖాళీగా ఉండటం, కారుచౌకగా శ్రామికులు అందుబాటులో ఉండటం అనేవి కార్మికుల సామూహిక బేరసారాలు, భద్రత, పని హక్కువంటి అంశాలపై విధ్వంసకర ఫర్యవసానాలకు దారి తీస్తాయి. ఇప్పటికే తమ నివాస ప్రాంతాలకు వెళ్లిపోయిన వలస కార్మికులు పని దొరకబుచ్చుకునే సామర్థ్యం తీవ్రంగా దెబ్బతినిపోయి ఉన్న పరిస్థితుల్లో, వీరి చుట్టూ అల్లుకున్న సామాజిక బాంధవ్యాలు మానవ మనుగడను సంక్షోభంలోకి నెట్టివేస్తాయి. ఇలా రివర్స్ మైగ్రేషన్ కలిగిస్తున్న ప్రభావం ఇప్పటికే వ్యవసాయ క్షేత్రాలపై వాటి అనుబంధ కార్యకలాపాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తోంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? కరోనా వైరస్ ప్రేరేపించిన రివర్స్ మైగ్రేషన్ కారణంగా గ్రామీణ భారతం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మన ఆర్థిక, పాలనావిధాన ప్రక్రియలు, ఆచరణలు, విధానాలు పూర్తిగా పరివర్తన చెందాల్సి ఉంది. పైగా, కార్మికులకు జీవించే హక్కు, ఆహార హక్కు, భద్రత హక్కు, వీట న్నింటికంటే శ్రమను గౌరవించే హక్కుకు హామీ ఇచ్చే కార్మిక జనాభా హక్కుల చార్టర్ అవసరం మనకిప్పుడు ఎంతైనా అవసరం. భారత రాజకీయ నాయకత్వం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంతవరకు కరోనా వైరస్ అనంతర దశలో అలాంటి చార్టరే మార్గదర్శక సూత్రంగా ఉండాలి. దీన్ని గుర్తించడంలో విఫలమైతే సమాజంలో ఉపద్రవం తప్పదు. -దిలీప్ దత్తా, డైరెక్టర్, సీఈఓ, సాయంతన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కోల్‌కతా -
సోనూ సూద్‌కు అరుదైన గౌరవం
కోల్‌కతా: నటుడు సోనూ సూద్‌కు అరుదైన గౌరవం దక్కింది. లాక్డౌన్లో వలస కార్మికుల కోసం ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు చేర్చిన విషయం తెలసిందే. దీంతో ఆయన రియల్ హీరో అయ్యారు. కరోనా కాలంలో ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి చేయూతనిచ్చిన ఆయనను కోల్‌కతాలోని కేష్టోపూర్ ప్రఫుల్ల కననదుర్గా పూజ కమిటీ వారు ప్రత్యేకంగా సత్కరించారు. ప్రస్తుతం కోల్‌కతాలో జరుగుతున్న దుర్గపూజ పండల్లో సోనూ సూద్ విగ్రహాన్ని ప్రదర్శించి ఇలా ఆయనపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అది చూసిన సోనూ సూద్ స్పందిస్తూ... ఇది తనకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం అంటూ అనందం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం ట్వీట్ చేస్తూ.. ‘ఎప్పటికైన ఇదే నాకు అతిపెద్ద ఆవార్డు’ అంటూ ట్వీట్ చేశారు. అదే విధంగా కెష్టోపర్ ప్రఫుల్ల దుర్గా కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: వలస దుర్గమ్మ..) అయితే ఈ పండల్లో లాక్డౌన్లో వలస కార్మికులను బస్సులో తరలిస్తున్నప్పటి సోనూసూద్ విగ్రహాంతో పాటు ఎదురుగా వలస కార్మికులు చేతులు జోడిస్తున్న విగ్రహాలను ఉంచారు. అదే విధంగా సంక్షోభ కాలంలో వలసదారులకు సంబంధించిన హృదయ విదాకర దృశ్యాలను కూడా పండల్లో ప్రదర్శించారు. హర్యానాలోని గురుగ్రామ్ నుంచి బీహార్ వరకు 1200 వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ తన కూమరుడిని సూట్‌కేసుపై లాక్కెళుతున్న మహిళా, బాబును ఓడిలో పెట్టుకుని గాయపడిన తన తండ్రిని దొపుడు బండిపై కుర్చోపెట్టి లాక్కెడం, సైకిల్ తోక్కుతున్న మహిళ విగ్రహాలను కూడా ప్రదర్శించారు. అయితే లాక్డౌన్లో సోనూ సూద్ వలస కార్మికులను సొంత ఖర్చులతో వారి గ్రామాలకు చేర్చడంతో పాటు విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సైతం స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. (చదవండి: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్) My biggest award ever 🙏 https://t.co/4hOUeVh2wN — sonu sood (@SonuSood) October 21, 2020 -
వలస కార్మికులు: మోదీ సర్కార్‌పై రాహుల్ మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి నరేంద్రమోదీ సర్కార్‌పై మండిపడ్డారు. లాక్డౌన్ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారు, ఎంత మంది ఉపాధి కోల్పోయారు అనే విషయాన్ని పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ప్రశ్నించింది. అయితే దీనికి లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరగా ఆ సమయంలో ప్రభుత్వం ఎలాంటి రికార్డులు మెంటయిన్ చేయలేదని, ఆ లెక్కలు తమ వద్ద లేవని లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ చెప్పారు. ఇక ఈ విషయంలో మోదీ సర్కార్ తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. मोदी सरकार नहीं जानती कि लॉकडाउन में कितने प्रवासी मज़दूर मरे और कितनी नौकरियाँ गयीं। तुमने ना गिना तो क्या मौत ना हुई? हाँ मगर दुख है सरकार पे असर ना हुई, उनका मरना देखा ज़माने ने, एक मोदी सरकार है जिसे ख़बर ना हुई। — Rahul Gandhi (@RahulGandhi) September 15, 2020 ఎంత మంది వలస కార్మికులు ఉద్యోగాలు కోల్పోగా, ఎంత మందికి నష్టపరిహారం చెల్లించారు అని మరో ప్రశ్న సంధించింది. ఎంత మంది ఉపాధి పోగొట్టుకున్నారో తమ వద్ద లెక్కలు లేవని, ఇక నష్టపరిహారం అనే ప్రశ్నే ఇంత వరకు తమకు రాలేదని పేర్కొన్నారు. ఇక దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, ‘మోదీ గవర్నమెంట్‌కు ఎంత మంది ఉద్యోగం కోల్పోయారో, ఎంత మంది చనిపోయారో తెలియదు. మీకు లెక్క తెలియదు అంటే ఎవరు చనిపోలేదని అర్థమా? ఎవరు ఉద్యోగం కోల్పోలేదని అనుకోవాలా? అని రాహుల్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. కరోనా సమయంలో 63,07,000 మందికి పైగా వలసదారులను 4,611 శ్రామిక్ స్పెషల్ రైళ్ల ద్వారా వివిధ గమ్యస్థానాలకు చేర్చారు. ఒక సర్వే ప్రకారం 122 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో 75 శాతం మంది చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు ఉన్నారు. చదవండి: ‘కరోనా చాలా నేర్పింది.. వ్యవసాయం చేస్తా’ -
సోనూ సూద్ దాతృత్వం: మరో విమానం
ముంబై: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కరోనా కాలంలో వలస కూలీలను ప్రత్యేక విమానంలో వారి సొంత రాష్ట్రాలకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సమస్యల్లో ఉన్న పేదవారికి తోచిన సాయం చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా కరోనా నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లో చిక్కుకున్న మన భారతీయులను దేశానికి తీసుకువచ్చేందుకు మరోసారి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఈ విమానం ఆగస్టు 14న మనీలా నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనున్నట్లు సోనూ సూద్ స్వయంగా ట్విటర్లో ప్రకటించారు. (చదవండి: నువ్వు చాలా అదృష్టవంతుడివి.. బుక్స్ ఇస్తాను) Phase -2 india ➡️ Phillipines. I hope you are ready to be with your families❣️ I have lined up the flight from Manila to Delhi on 14 Aug at 7:10 pm SG9286. Can’t wait you to board and get you home. Have sent you the link❣️🙏 — sonu sood (@SonuSood) August 12, 2020 ఇది ఫేజ్-2 అంటూ సోనూ సూద్ ట్వీట్ చేస్తూ.. ‘‘భారత్-పిలిప్పీన్స్.. మీ కుటుంబాలను కలుసుకునేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మనీలా నుంచి ఢిల్లీకి ఆగస్టు 14న సాయంత్రం 7.10 గంటలకు ఎస్జీ9286 అనే విమానం బయల్దేరబోతోంది. మిమ్మల్ని ఆ విమానంలో ఎక్కించుకుని సొంతగడ్డకు చేర్చాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే సోనూ సూద్ ఫిలిప్పీన్స్‌కు విమానాన్ని పంపించడం ఇది రెండవ సారి. కొన్నిరోజుల కిందట మనీలా నుంచి తొలి విమానం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. అంతేగాక కజకస్థాన్లో చిక్కుకున్న మన తెలుగు వారి కోసం కూడా మరోక ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు సోనూ సూద్ మరో ట్వీట్లో తెలిపారు. ఇది ఆగస్టు 14న కజకస్థాన్ బయల్దేరడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సోనూ సూద్ వెల్లడించారు. (చదవండి: కొత్త ఇల్లు: సోనూ సూద్ రాఖీ గిఫ్ట్) Kazakhstan to India is happening. Let's get you home. Almaty Friends.. Pack your bags. SG 9520 Almaty to Delhi, 14th August at 2:15pm is set. The wait to meet your families is finally over. @flyspicejet Start packing. Jai hind🇮🇳 — sonu sood (@SonuSood) August 12, 2020 -
సోనూ సూద్ గొప్ప ప్రయత్నం
సాక్షి, విశాఖపట్నం: విలక్షణ నటుడు సోనూ సూద్ మరోసారి తనగొప్ప మనసు చాటుకున్నారు. కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన వలస కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చా రు. సౌదీ అరేబియా, కిర్గిజిస్తాన్ దేశాల నుంచి ప్రత్యేక విమానంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ సహకారంతో స్పైస్ జెట్ విమానంలో విమానంలో ప్రయాణికులు చేరుకున్నారు. స్వదేశానికి విద్యార్థులు, వలస కూలీలు, ఉద్యోగులు విశాఖ చేరుకున్నారు. విశాఖ చేరుకున్న ప్రయాణికులకు విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం వారి సొంత జిల్లాలోని క్వారంటైన్ సెంటర్లకు ప్రత్యేక బస్సుల్లో అధికారులు పంపించారు. సౌదీ నుంచి వచ్చిన విమానంలో 170 మంది, కిర్గిజిస్తాన్ నుంచి వచ్చిన విమానంలో 179 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా లాక్డౌన్ కాలంలో అనేక మంది వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు చేరేందుకు సోనూ సూద్ చూపిన చొరవ, కృషి పలువురి ప్రశంలందుకుంది. -
సోనూ సూద్ మరోసారి ఉదారత
సాక్షి, ముంబై : విలక్షణ నటుడు సోనూ సూద్ (46) మరోసారి తనగొప్ప మనసు చాటుకున్నారు. కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన వలస కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. మరణించిన లేదా గాయపడిన కార్మికుల కుటుంబాలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాననీ వారికి మద్దతు ఇవ్వడం బాధ్యతగా భావిస్తునని సూద్ ఒక ప్రకటనలో తెలిపారు.దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే సేకరించారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులతో సంప్రదించి ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, సంబంధిత సమాచారం చిరునామాలు, బ్యాంక్ వివరాలను తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అమలైన వివిధ దశల లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన కార్మికులు ఇంటి బాట పట్టారు. ఈ సందర్భంగా వివిధ ప్రమాదాల్లో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అలాంటి వలస కార్మికుల కుటుంబాలకు సోను సూద్అండగా నిలవనున్నారు. సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని సోమవారం తాజాగా ప్రకటించారు. కాగా లాక్డౌన్ కాలంలో అనేక మంది వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు చేరేందుకు సోనూ సూద్ చూపిన చొరవ, కృషి పలువురి ప్రశంలందుకుంది. వారికోసం చార్టర్డ్ విమానాలను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చదవండి : ఫోటోగ్రఫీ ‘పిచ్చి’ : చివరికి కొడుకులకు గుడ్‌న్యూస్: కరోనా డ్రగ్ ధర తగ్గింది -
‘కరోనా చాలా నేర్పింది.. వ్యవసాయం చేస్తా’
సాక్షి, ముంబై: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందకు దేశంలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్లో వలస కూలీల కష్టాలు వర్ణనాతీతం. ఎంతో మంది దయార్ద్రహృదయులు వలస కూలీల కష్టాలను చూసి చలించిపోయి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా వలస కూలీలకు తనవంతు సాయాన్ని అందించాడు. అతడి స్నేహితులు, సన్నిహితులతో కలిసి పేదలకు నిత్యావసర వస్తువులు అందజేయడంతో పాటు వలస కూలీలు తమ గమ్యస్థానాలు చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. అయితే తాజాగా ఇండియా టుడే సలాం క్రికెట్ 2020 కార్యక్రమంలో పాల్గొన్న భజ్జీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (వాటే ప్లాన్ చైనా: భజ్జీ) ‘కరోనా లాక్డౌన్ సమయంలో పేదలు, వలసకూలీల బాధలు, కష్టాలు చూసి చలించిపోయాను. కరోనా ఎన్నో విషయాలను నేర్పింది. నాలోని మానవత్వాన్ని తట్టిలేపింది. దేవుడి దయతో నేను మంచి స్థితిలో ఉన్నా. ఇప్పటివరకు నాకు చేతనైనంత సహాయం చేశాను. ఇక సొంతూరిలో కొంత పొలం కొని పేదల కోసం పంటలు పండించాలని అనుకుంటున్నాను. పండించిన పంటలను పేదలకు ఉచితంగా పంచిపెడతా. కేవలం మనం డబ్బు సంపాదించడానికి బతకడం లేదు. కష్టకాలంలో ఇతరులకు సాయం చేయడం మన కనీస బాధ్యత’ అని భజ్జీ ఉద్వేగంగా మాట్లాడాడు. (ఇంట్లో వాళ్లు మొబైల్ బిల్ కట్టలేదు) ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సురేశ్ రైనా మాట్లాడాడు. ‘పీఎం కేర్స్ ఫండ్‌కు నేను విరాళం ప్రకటించగానే మా కుటుంబసభ్యులు ఎంతో గర్వంగా ఫీలయ్యారు. కరోనా కష్టకాలంలో సహాయం చేసు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు. క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు భారత్ గెలవాలని వారు ప్రార్థనలు చేసేవారు.. ఇప్పుడు వారు కష్ట కాలంలో ఉన్నప్పుడు చేతనైనంతా సాయం చేయాలని అనుకున్నా’ అని రైనా పేర్కొన్నాడు. -
పూర్తి ‘వేతనం’తో స్వదేశానికి వచ్చే హక్కు
మాతృదేశానికి తిరిగి వచ్చిన వలస కార్మికులకు ‘పరివర్తన న్యాయవ్యవస్థ’ (ట్రాన్సిషనల్ జస్టిస్ మెకానిజం)ను అత్యవసరంగా ఏర్పాటు చేయాలని మూలస్థాన దేశాలు, గమ్యస్థాన దేశాలకు పిలుపునిస్తూ అంత ర్జాతీయ పౌరసమాజ సంస్థలు, ప్రపంచ కార్మిక సంఘాల మహా కూటమి ఇటీవల ప్రకటన విడుదల చేశాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుండి భారత్‌కు వాపస్ వచ్చినవారు, రావాలనుకునే వారికి ఇందులోని విషయాలు వర్తిస్తాయి. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా 19.5 కోట్ల ఉద్యోగాలు తుడిచిపెట్టుకు పోతాయని అంతర్జా్జతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) అంచనా వేసింది. గల్ఫ్ మధ్యప్రాచ్య ప్రాంతంలో 50 లక్షల మంది వలస కార్మికులు ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. కరోనా ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి 3 లక్షల మందికి పైగా వలస కార్మికులను ఆసియా దేశాలకు తిరిగి పంపించారు. రాబోయే నెలల్లో ఈ సంఖ్య విపరీతంగా పెరగనుంది. విదేశాల్లోని తమ కార్మికులు అధిక సంఖ్యలో తిరిగి వస్తారని భారత్, నేపాల్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ఊహిస్తున్నాయి. కార్మికులు వలస వెళ్లిన దేశాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరికి వేతనాలు తగ్గించడం, అసలు చెల్లించకపోవడం, వేతనం చెల్లించని సెలవు (అన్ పెయిడ్ లీవ్)పై వెళ్లాలని ఆదేశించడం జరిగింది. కార్మికులు తక్కువ పని, అసలే పనిలేక పోవడం లాంటి స్థితిలో ఉన్నారు. చాలామంది ఈ పరిస్థితుల్లో ‘వాపస్ వచ్చే హక్కు’ (రైట్ టు రిటన్)ను ఉపయోగించుకునే సందిగ్ధతలో ఉన్నారు. మరికొందరు ఎలాంటి సేవలు, మద్దతు లభించకుండా ‘క్వారంటైన్’ లలో చిక్కుకుపోయి ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్నారు. ప్రవాసీ కార్మికుల దుస్థితి గురించి ఆలోచించకుండా, వాపస్ వెళ్లడం అనివార్యం అనేలాగా వ్యవహరిస్తూ గమ్యస్థాన (కార్మికులను స్వీకరించే), మూలస్థాన (కార్మికులను పంపే) దేశాలు కార్మికులను స్వదేశానికి పంపే ప్రక్రియలను ప్రారంభించాయి. వాళ్లు ఖాళీ చేతులతో వాపస్ వచ్చి, రిక్రూట్మెంట్ ఖర్చుల కోసం చేసిన పాత అప్పులు తీర్చలేక రుణ బానిసత్వంలో మగ్గే అవకాశమున్నది. సరైన నియంత్రణ లేనందువల్ల కార్మికులను సామూహికంగా స్వదేశాలకు తిరిగిపంపే కార్యక్రమాలను యజమానులు తమకు అనుకూలంగా ఉపయోగించుకొనే అవకాశముంది. ఇదే అదనుగా కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం, ఇవ్వాల్సిన పరిహారం, వేతనాలు, ప్రయోజనాలు చెల్లించకపోవడం జరగవచ్చు. స్వదేశాలకు వాపస్ వస్తున్న కార్మికుల మానవ హక్కులు, కార్మిక హక్కులను కాపాడటానికి కంపెనీ యాజమాన్యాలు తగిన శ్రద్ధ వహిస్తున్నాయా అని నిర్ధారించుకోవాలి. ‘వేతన దొంగతనం’ (వేజ్ థెఫ్ట్) లక్షలాది డాలర్ల మేర కార్మికులకు నష్టం కలుగజేస్తుంది. కార్మికులు సాధారణ స్థితికి చేరుకోవడానికి ప్రభుత్వాలు, బ్యాంకులు సహాయ కేంద్రం (హెల్ప్ లైన్) ఏర్పాటు చేసినప్పటికీ వ్యాపార సంస్థలు, యాజమాన్యాలు జవాబుదారీతనం నుంచి మినహాయించబడి ప్రయోజనం పొందుతున్నాయి. లాక్డౌన్ సమయంలో న్యాయస్థానాలు, ఇతర కార్మిక వివాద పరిష్కార యంత్రాంగాలు కూడా మూసి వేయబడ్డాయి. సరైన పరిష్కార విధానం లేకుండా గమ్యస్థాన దేశాలు, మూల స్థాన దేశాలు కార్మికులను స్వదేశానికి వాపస్ పంపే ప్రక్రియలను ఆదరా బాదరాగా చేపట్టాయి. అందువల్ల పేరుకు పోయిన సమస్యలను ప్రస్తుతమున్న వివాద పరిష్కార యంత్రాంగాలు పట్టించుకోకపోవడం జరుగుతున్నది. ఈ విషయంలో మైగ్రెంట్ ఫోరం ఇన్ ఏషియా, లాయర్స్ బియాండ్ బార్డర్స్ నెట్వర్క్, క్రాస్ రీజినల్ సెంటర్ ఫర్ మైగ్రెంట్స్ అండ్ రెఫ్యూజీస్, సౌత్ ఏషియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్, సాలిడారిటీ సెంటర్ అనే సంస్థలు ఈ కింది లక్ష్యాలతో పరివర్తన న్యాయవ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చాయి. 1. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి స్వదేశానికి తిరిగివచ్చిన కార్మికుల మనోవేదన, వాదనలు, కార్మిక వివాదాలను పరివర్తన న్యాయవ్యవస్థ పరిష్కరిస్తుంది. యంత్రాంగాన్ని సమర్థవంతంగా సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది. 2. స్వదేశానికి వాపస్ వచ్చిన కార్మికులందరూ చట్టబద్ధమైన పరిహారం పొందడం కోసం ‘న్యాయం పొందే సౌలభ్యం’(యాక్సెస్ టు జస్టిస్) కల్పించడానికి ప్రాధాన్యమివ్వాలి. 3. కార్మిక వివాదాలకు సంబంధించిన కేసులు వీలైనంత త్వరగా పరిష్కరించాలి. వలసదారులు వాపస్ వచ్చిన తర్వాత తమ కేసులను కొనసాగించడానికి భద్రతా విధానాలు ఉండాలి. న్యాయసలహా పొందే సౌలభ్యం, మద్దతు, ‘పవర్ ఆఫ్ అటార్నీ’ విధానాలు సులభతరం చేయడం, వ్యక్తి సాక్ష్యం, ట్రిబ్యునల్ లేదా ఫిర్యాదు వ్యవస్థ ముందు హాజరు కావడం వంటి అవసరాలను తగ్గించడం చాలా ముఖ్యమైనవి. 4. యాజమాన్యాలు, వ్యాపార సంస్థలు ‘పేరోల్’ (జీతాలు తీసుకొను ఉద్యోగుల జాబితా), ఉద్యోగుల రికార్డులను కలిగివుండేలా ప్రభుత్వాలు చూడాలి. పని గంటలతో సహా అన్ని ఉపాధి రికార్డుల ప్రతులను కార్మికులు తమతో తీసుకెళ్లడానికి అనుమతించాలి. కోవిడ్–19 కారణంగా స్వదేశానికి తిరిగివచ్చిన కార్మికుల విషయంలో మనం ‘బిల్డ్ బ్యాక్ బెటర్’ (తిరిగి బాగా నిర్మాణం) చేయాలంటే వలస కారిడార్లలో సంవత్స రాలుగా కొనసాగుతున్న ‘వేతన దొంగతనం’ సమస్యపై చూసీచూడనట్టు ఉండలేము. కరోనా మహమ్మారికి ముందు నెలలు, సంవత్సరాలుగా బకాయి ఉన్న వేతనాలను యాజమాన్యాలు ఎగవేతకు పాల్పడుతున్న పరిస్థితికి కార్మికులు రాజీపడాల్సి వస్తున్నది. తమ వీసా, నివాస హోదాను సరిగా నమోదు చేయక ఎలాంటి పత్రాలూ లేని స్థితి (అన్ డాక్యుమెంటెడ్)లోకి నెట్టివేస్తారనే భయంతో ఫిర్యాదు చేయకుండా ఉంటున్నారు. కార్మికులను పంపేందుకు ‘మూలస్థాన’ దేశాలు కొత్త మార్కెట్లను అన్వేషిస్తూనే ఉన్నప్పటికీ, కార్మికులను స్వీకరించే ‘గమ్యస్థాన’ దేశాలు చౌకగా దోపిడీకి గురయ్యే కార్మికుల కోసం చూస్తున్నాయి. ప్రభుత్వాలు తగిన శ్రద్ధ లేకుండా వలస కార్మికులను స్వదేశానికి రప్పించడం జరుగుతున్నది. దీనివల్ల వలస దారులపై హింసకు పాల్పడే యజమానులను, నేరస్తులను బహిష్కరించడానికి, చట్టబద్ధమైన పరిహారాలు, ఫిర్యా దులకు సంబంధించిన అన్ని రికార్డులను తుడిచిపెట్టడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రతి కార్మికుడు కూడా రాబోయే తరాల మంచి భవిష్యత్తుకు మూలం అవుతాడు. కోవిడ్–19 మహమ్మారి కాలం నడుస్తున్నందున వలసదారుడి ప్రయాణ పట్టుదల, కల అణచివేయబడవద్దు. ఈ సమయంలో పరిష్కరించకపోతే, వలస నుంచి అభివృద్ధికి అనుసంధానించే నమూనాలను ఎప్పటికైనా విడదీసే ప్రమాదమున్నది. వలస కార్మికుల జీవితాల కథలు రాబోయే సంవత్సరాల్లో ఈ సామూహిక అన్యాయానికి సాక్ష్యమిస్తాయి. మంద భీంరెడ్డి వ్యాసకర్త గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు, ఫోన్: 98494 22622 -
'వదిలేయండి.. ఎవరి అభిప్రాయం వారిది'
ఢిల్లీ : లాక్డౌన్ వేళ అష్టకష్టాలు పడుతున్న వలస కార్మికుల పట్ల నటుడు సోనూసుద్ తన ఉదారభావాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. వేలాది మంది వలస కార్మికులను వారి స్వగ్రామాలకు పంపిన సోనూ.. వారి పట్ల రియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే సోనూసుద్ చేస్తున్న ఈ సాయంపై శివసేన నేత సంజయ్ రౌత్ ఆ పార్టీ అధికార పత్రిక సామ్నాలో వ్యంగ్యంగా రాసుకొచ్చారు. బీజేపీ చేతిలో సోనూ ఓ కీలుబొమ్మ అంటూ ఆరోపించారు. లాక్డౌన్ వేళ కొత్త మహాత్ముడు పుట్టుకొచ్చారంటూ సోనూపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై సోనూసుద్ స్పందించారు. (విమర్శలకు చెక్: సీఎంతో భేటీ) 'ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి.. అది అతని అభిప్రాయం. వయసులో ఆయన పెద్ద మనిషి.. అందులోనూ ఎవరి నిర్ణయం వారికి ఉంటుంది. రౌత్ వ్యాఖ్యల పట్ల కాలమే సమాధానం చెబుతుందని భావిస్తున్నా. త్వరలోనే ఈ విషయన్ని సంజయ్ రౌత్ గ్రహిస్తారు. రౌత్ చేసిన వ్యాఖ్యలను మాత్రం సమర్థించను. ఎందుకంటే ఇప్పుడు నేను సినిమాల్లో ఉన్నాను. ఒక యాక్టర్‌గా బిజీ లైఫ్‌ను గడుపుతున్నాను. నా జీవితంలో సినిమా కెరీర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎవరో ఏదో అన్నంత మాత్రానా పని గట్టుకొని విమర్శలు చేయడం నాకు ఇష్టం లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం.. ఎవరు ఏదైనా మాట్లాడే హక్కు ఉంటుంది.. సమాజంలో మంచి చేసే పనులపై విమర్శించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. నా ఊపిరి ఉన్నంతవరకు సినిమాల్లోనే కొనసాగుతా. రాజకీయాలంటే నాకు ఆసక్తి లేదు. ఈ సందర్భంగా శివసేన నేతలు ఉద్ధవ్, ఆదిత్య ఠాక్రేలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. వాళ్లను నా స్నేహితులుగా భావిస్తున్నా.. ఎందుకంటే కష్ట సమయంలో వారు నాకు సహాయం చేశారు. అయితే నా దృష్టిలో వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే లాక్డౌన్ వల్ల చిక్కుకుపోయిన వారు సురక్షితంగా ఇంటికి చేరుకోవడం.. అదే నా ఆశ' అని చెప్పుకొచ్చారు. (సోనూసుద్‌కు రాజకీయ రంగు) కాగా ఆదివారం సోనూసుద్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలిశారు. ఈ సమావేశంలో ఉద్ధవ్ థాకరే తనయుడు, పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై మాట్లాడుకోగా.. సోనూపై ఉద్ధవ్ థాకరే ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశంపై సోనూసుద్ మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే థాకరేను కలిశానని తెలిపారు. -
ఎంపీ చొరవతో విమానం ఎక్కనున్న 33 మంది
న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సాయమందించారు. ఢిల్లీలో చిక్కుకుపోయిన 33 మంది బిహార్ వాసులను విమానంలో తీసుకెళ్లేందుకు టికెట్లు బుక్ చేశారు. ఎంపీ కోటాలో తనకు కేటాయించే 34 బిజినెస్ క్లాస్ టికెట్లకు ఎంపీ బుక్ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం తెలిపింది. వలస కార్మికులతో పాటు ఎంపీ సంజయ్ కూడా గురువారం సాయంత్రం బిహార్ వెళ్తారని వెల్లడించింది. ఎంపీ చొరవను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించారు. ‘దేవుడు ఇతరుల సేవకై పనిచేసే అవకాశాలు ఇచ్చినప్పుడు. వాటిని బాధ్యతగా నెరవేర్చాలి. ఎంపీ సంజయ్ అభినందనీయుడు’అని సీఎం పేర్కొన్నారు. ప్రజా సేవకై రాజకీయాల్లోకి వచ్చానని, సీఎం కేజ్రీవాల్ సారథ్యంలో ఎప్పుడూ ప్రజా సేవకు అంకితమవుతానని ఎంపీ ట్విటర్లో రిప్లై ఇచ్చారు. కాగా, ప్రతియేడు ఎంపీలకు 34 బిజినెస్ క్లాస్ టికెట్లను విమానయాన శాఖ కేటాయిస్తుంది. (చదవండి: ముంబైని తాకిన నిసర్గ తుఫాను) -
వలస కూలీలకు ఉచితంగా కండోమ్‌ల పంపిణీ
పట్నా: సొంత రాష్ట్రం చేరుకున్న వలస కూలీలకు బిహార్ ప్రభుత్వం ఉచితంగా కండోమ్‌లను పంపిణీ చేస్తోంది. బిహార్‌కు చెందిన 30 లక్షల మంది వలస కార్మికులు వివిధ దశల్లో రాష్ట్రానికి చేరుకున్నారు. వారిలో కొందరు ఇప్పటికే 14 రోజుల క్వారంటైన్ ముగిసి ఇళ్లకు చేరగా.. మరికొంతమంది హోం క్వారంటైన్లో ఉన్నారు. ఈక్రమంలో అవాంఛిత గర్భధారణను నిరోధించేందుకు రాష్ట్ర కుటుంబ ఆరోగ్య శాఖ కండోమ్‌ల పంపిణీ నిర్ణయం తీసుకుంది. క్వారంటైన్ సెంటర్లలో ఉన్నవారికి, ఇళ్లకు చేరుకున్న వలస కూలీలకు కండోమ్‌లు పంపిణీ చేస్తున్నామని బిహార్ ఆరోగ్యశాఖకు చెందిన డాక్టర్ ఉత్పల్ దాస్ వెల్లడించారు. కేర్ ఇండియా సంస్థ సహకారంతో ఈ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8.77 లక్షల మంది క్వారంటైన్ ముగించుకుని ఇళ్లకు వెళ్లారని, మరో 13 లక్షల మంది క్వారైంటైన్ సెంటర్లలో ఉన్నారని చెప్పారు. బ్లాక్‌లు, జిల్లా కేంద్రాల్లో ఇంకా 5.30 లక్షల మంది క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. అవాంఛిత గర్భధారణ విషయంలో ఇంటికి వెళ్లే ముందు వలస కూలీలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇది పూర్తిగా కుటుంబ నియంత్రణ కోసం చేపట్టిన కార్యక్రమం అని కోవిడ్-19తో ఎటువంటి సంబంధం లేదని ఉత్పల్ దాస్ స్పష్టం చేశారు. ఆరోగ్యశాఖ అధికారిగా జనాభాను అదుపులో ఉంచడం తమ బాధ్యత అన్నారు. కాగా, బిహార్‌లో ఈ నెల 15తో క్వారంటైన్ సెంటర్ల సేవలు ముగియనున్నాయి. బిహార్ జనాభా 11.5 కోట్లు కావడం గమనార్హం. -
షమీ చేసిన పనికి నెటిజన్లు ఫిదా
లక్నో: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నాడు. కాలినడకన స్వస్థలాలకు వెళుతున్న వలసకార్మికులకు మాస్క్‌లు, ఆహారాన్ని అందించాడు. ఉత్తరప్రదేశ్‌లోని సాహస్‌పూర్‌కు చెందని షమీ తన ఇంటి దగ్గర వలసదారుల కోసం సహాయక శిబిరాన్ని ప్రారంభించి తన వంతు సాయాన్ని అందిస్తున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ట్విటర్లో పేర్కొంది. అంతేకాకుండా వలసదారులకు షమీ సహాయం అందిస్తున్న వీడియోను కూడా బీసీసీఐ షేర్ చేసింది. ప్రసుత్తం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. అంతేకాకుండా షమీ గొప్ప మనసుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. (‘అతడంటే భయం కాదు గౌరవం’) కరోనా లాక్డౌన్ కారణంగా క్రికెట్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆటగాళ్లు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ ఆపత్కాలంలో భారత ఆటగాళ్లు తమవంతు సాయాన్ని అందిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు ఇస్తున్న వేళ త్వరలోనే ఆటగాళ్లు మైదానంలోకి దిగే అవకాశం ఉంది. తొలుత ఆటగాళ్ల ఫిట్నెస్, ట్రైయినింగ్ సెషన్స్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్ వాయిదా పడే అవకాశం ఉండటంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)పై అభిమానుల్లో ఆటు ఆటగాళ్లలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (ఈ కర్కశంపై మాట్లాడరేంటి?) As #IndiaFightsCorona, @MdShami11 comes forward to help people trying to reach home by distributing food packets & masks on National Highway No. 24 in Uttar Pradesh. He has also set up food distribution centres near his house in Sahaspur. We are in this together🙌🏾 pic.twitter.com/gpti1pqtHH— BCCI (@BCCI) June 2, 2020 -
పాదాలు చెప్పే కథలు
‘నీ పాదాల మీద నువ్వు నిలబడు’ అంటారు పెద్దలు. ఇవాళ దేశంలో తమ పాదాల మీద తాము నిలబడ్డవాళ్లెవరో అందరికీ కనిపిస్తూ ఉంది. పాదాలు మీద మాత్రమే ఉన్నవారు, పాదాలను మాత్రమే నమ్ముకున్నవారు దేశంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారా అని కూడా తెలుస్తూ ఉంది. భారతదేశంలోని రోడ్లు గత నెల రోజులుగా చూసినన్ని పాదాలు మళ్లీ బహుశా ఎప్పటికీ చూడవు. చూడాల్సిన అగత్యం రాకూడదనే కోరిక. ఏమి పాదాలు అవి. గర్భంలో ఉన్న పాపను మోస్తూ నడిచిన పాదాలు, బిడ్డను బయటకు తెచ్చిన మరుక్షణం నుంచి నడిచిన పాదాలు, భుజాన ఒక బిడ్డను, చంకలో ఒక బిడ్డను మోస్తూ నడిచిన పాదాలు, శరీరాన్ని వాహనంగా చేసి మొత్తం సంసారాన్ని మోస్తూ అడుగులు వేసిన పాదాలు, ముసలి తల్లిని ఉప్పుమూట గట్టి మోసిన పాదాలు, కదల్లేని తండ్రిని డొక్కు సైకిల్ మీద వేయి కిలోమీటర్లు తొక్కగలిగిన పాదాలు, దారిలో భర్త కన్ను మూయగా అక్కడే ఖననం చేసి కన్నీటిని దిగమింగుతూ నడచిన పాదాలు, అయినవారు సొమ్మసిల్లగా వారిని లేవదీసి నడిపించిన పాదాలు, చుక్క మంచినీరు దక్కక పోయినా గుప్పెడు మెతుకులు అందకపోయినా నడుస్తూ నడుస్తూనే ఉండిపోయిన పాదాలు... నడిచిన పాదాలు... ఆ పాదాలు నిజంగా ఎంత బరువును మోశాయి. ఎంత చెరుపును చూశాయి. పైన మండుటెండ. కింద కాలే నేల. యాభై రూపాయలకు స్లిప్పర్స్ వస్తాయిగానీ అంత డబ్బును ‘సౌఖ్యాని’కి ఉపయోగించేంత సంపాదన ఇవ్వకుండా ఈ దేశం ఎప్పుడూ జాగ్రత్త పడుతూనే వచ్చింది. పుట్టి బుద్దెరిగినప్పటి నుంచి కాళ్లకు చెప్పులే ఎరక్కుండా పెరిగిన పాదాలు, బొబ్బలను దూది పింజలను చేసుకోవడం తెలిసిన పాదాలు, ఆశను మొప్పలుగా చేసుకుని అనంతమైన మట్టి సముద్రాన్ని ఈదుకుంటూ నడిచిన పాదాలు... మన దగ్గర ఈ పాదాల గోడు విన్నవారు ఎందరు? ఈ పాదాలున్న మనుషుల ఏడుపు తుడిచేవారు ఎవ్వరు? కాని అమెరికాలో అలా కాదు. అక్కడ ప్రతి కాలికి, ప్రతి వేలికీ విలువుంటుంది. గోటికి గొడ్డలిదాకా వెళ్లే హంగామా ఉంటుంది. కావాలంటే చూడండి. అమెరికాలో కరోనా వల్ల లక్ష మంది చనిపోయారు. కాని బతికున్న వారి ప్రాణంతో పాటు దేహం కూడా ముఖ్యమేనని అక్కడ ఇప్పుడు లాక్డౌన్లలో సడలింపులిస్తున్నారు. ఆ సడలింపులో ముఖ్యమైనది ‘నెయిల్ సెలూన్స్’ (గోళ్ల సౌందర్య శాలలు) తెరవడం. హెయిర్ సెలూన్స్ అవసరాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫ్లోరిడాలోని మయామిలో నెయిల్ సెలూన్స్ తెరవడంతో గోళ్ల సంరక్షణలో మునిగి ఉన్న స్త్రీలు. కాని వాటితో సమానంగా ‘నెయిల్ సెలూన్స్’ ఎందుకు తెరుస్తున్నట్టు? ఆర్థిక కార్యకలాపాలు పెంచడానికి కాదు. అమెరికాలో తొంభై శాతం మంది స్త్రీలు సొంత గోళ్ల కంటే పెట్టుడుగోళ్లను కలిగి ఉంటారు. తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు అనే తేడా లేకుండా సౌందర్యం విషయంలో స్త్రీలు ఈ పెట్టుడుగోళ్లకే ప్రాధాన్యం ఇస్తారు. ఇవి అక్రిలిక్తో తయారవుతాయి. రకరకాల ఆకారాల్లో రకరకాల రంగుల్లో దొరుకుతాయి. ఈ నకిలీగోళ్లను నెయిల్ సెలూన్స్‌లో జాగ్రత్తగా పాలిష్ చేసి సొంత గోళ్లకు అతికిస్తారు. అయితే ఈ అతికింపు శాశ్వతం కాదు. వీటిని జాగ్రత్తగా చూసుకున్నన్ని రోజులు ఉంటాయి. బలమైన వస్తువు తగిలినా, వొత్తిడి పడినా విరిగి పోతాయి. అందుకని అమెరికాలో స్త్రీలు తమ కాళ్ల, చేతి గోళ్లను నిర్వహించుకోవడానికి నెయిల్ సెలూన్స్‌ను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇవి లేకపోతే వారికి చాలా అసౌకర్యం. అది తెలుసు కనుకనే రాబోయే ఎన్నికలలో వారి ఆగ్రహానికి గురి కావడం కంటే నెయిల్ సెలూన్స్ తెరిచి నాలుగు ఓట్లన్నా సంపాదించుకోవచ్చని అక్కడి పాలకులు భావిస్తున్నారు. ఇక మన దగ్గర వలస కార్మికుల సంగతి. వారికి కచ్చితంగా ఓటు హక్కు ఉన్నదని చెప్పలేము. ఇప్పుడు ఎన్నికలూ లేవు. నిజానికి ఇది ఎన్నికల సీజన్ అయి ఉంటే వారిని రోడ్డున నడిపించి ఉండేవారా? నెత్తిన పెట్టుకుని తీసుకెళ్లి ఉండేవారు గానీ. -
శ్రామిక్ రైలులో మరో రెండు మరణాలు
లక్నో : వలస కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సహజంగానే అనేక బరువులు నెత్తినేసుకొని బతికే బతుకు జీవుల పాలిట కరోనా మహమ్మారి దించనంత బరువులు మూటగట్టింది. స్వస్థలాలకు చేరేందుకు వారు పడతున్న పాట్లు వర్ణనాతీతం. తినడానికి తిండిలేక అవస్థలు పడుతున్న దృశ్యాలు అనేకం. తాజాగా శ్రామిక్ రైలులో స్వస్థలానికి పయనమైన కుటుంబంలో చిన్నారి మరణం విషాదాన్ని నింపింది. వివరాల ప్రకారం..బీహార్‌కు చెందిన ప్రియాంక దేవి కొన్ని నెలల క్రితమే ఉత్తరప్రదేశ్ నోయిడాలోని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లింది. తీరా లాక్డౌన్ ప్రకటించేసరికి ఏం అక్కడే ఉండిపోయింది. ప్రస్తుతం కేంద్రం వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు శ్రామిక్‌రైలును ఏర్పాటు చేసినందున తండ్రి దేవ్‌లాల్ , తన 10 నెలల చిన్నారితో కలిసి స్వస్థలానికి బయలుదేరాడు. అప్పటికే చిన్నారికి జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పరిస్థితిపై రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేయగా..తుండ్లా రైల్వేస్టేషన్లో వైద్యుడు ఉన్నారని, అక్కడికి చేరుకున్నాక చూద్దాం అని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని దేవ్‌లాల్ ఆరోపించారు. తుండ్లా చేరుకునే వారకు చిన్నారి ఆరోగ్యం మరింత క్షీణించిందని, హాస్పిటల్‌కి తరలించే లోపే కన్నుమూసినట్లు పేర్కొన్నాడు. సరైన సమయానికి వైద్యం అందించే ఉంటే చిన్నారి బతికేదని, రైల్వే అధికారుల నిర్లక్షమే బాలుడి ప్రాణం తీసిందని ఆరోపించాడు. (తొలి రోజు అనుభవాలు వెల్లడించిన విమానాయన సిబ్బంది ) మరో ఘటనలో శ్రామిక్ రైలులో ప్రయాణిస్తున్న 46 ఏళ్ల వలస కార్మికుడు ఆకలితో అలమటించి మరణించాడు. వివరాల ప్రకారం..మే 20న ముంబైలోని శ్రామిక్ రైలులో బయలుదేరి మే 23న వారణాసికి నేను, మామయ్య చేరుకున్నాం. అంత దూర ప్రయాణంలోనూ రైల్వే అధికారులు కనీసం తిండి, నీరు ఎలాంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. రైలు ఎక్కేముందు నుంచే ఆకలితో ఉన్నాం. కానీ కొనడానికి చేతిలో డబ్బులు కూడా లేవు. దీంతో ఆకలితో అలాగే ఉండాల్సి వచ్చింది. స్వస్థలానికి అరగంటలోపు చేరుకుంటాం అనగా, తీవ్రమైన నొప్పితో మామయ్య మార్ఛపోయాడు. దాదాపు 60 గంటల నుంచి ఆహారం కనీసం నీళ్లు కూడా అందక పోవడంతో మరణించాడు అని రవీష్ యాదవ్ తెలిపాడు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి వలసకూలీలకు కనీస సౌకర్యాలైనా కల్పించాలని కోరాడు. (ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం ) -
సోనూ సూద్‌కు కానుక: ‘మోగా’వంటకం
‘వాళ్లు మన ఇళ్లు కట్టడానికి వాళ్ల ఇళ్లను వదిలిపెట్టి వచ్చారు’ అంటాడు నటుడు సోనూ సోద్ నేడు దేశ వ్యాప్తంగా కాలినడకన ఇళ్లకు మరలిన లక్షలాది వలస కార్మికుల అవస్థను చూసి. ‘వారి బాధను చూస్తుంటే మనందరం మనుషులుగా ఫెయిల్ అయ్యామని చెప్పక తప్పదు’ అని కూడా అన్నాడు అతను. ‘నాకు నిద్ర పట్టలేదు. వారే కళ్లల్లో మెదల సాగారు. వారి బాధ చూస్తూ ఏసి రూముల్లో కూచుని ట్వీట్ చేస్తే సరిపోదు. మనం కూడా రోడ్లమీద పడి ఏదైనా చేయాలి అనుకున్నాను’ అన్నాడు. అందుకే సోనూ సూద్ ఇవాళ దేశ వ్యాప్తంగా రియల్ హీరో అయ్యాడు. అతడు ముంబైలో చిక్కుకున్న కర్ణాటక వలస కూలీలను పది బస్సుల్లో వారి ఇళ్లకు పంపించాడు. అంతే కాదు, దానికి ముందే పంజాబ్‌లోని వైద్యులకు పిపిఇ కిట్లు బహూకరించాడు. ముంబైలోని తన హోటల్‌ను కోవిడ్ చికిత్సలో పని చేస్తున్న వైద్య సిబ్బంది బసకు ఇచ్చాడు. సోనూ సూద్ వలస కార్మికుల కోసం చేసిన పని చూసి అనేక మంది తమకు సహాయం చేయమని అతనికి విన్నపాలు చేయడం మొదలుపెట్టారు. ముంబైలోనే కాకుండా జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్లలో చిక్కుకుపోయిన అనేక మందిని వారి స్వస్థలాలకు పంపించే పనిలో సోనూ సూద్ ఉన్నాడు. ‘చివరి వలస కార్మికుడు ఇల్లు చేరేవరకు నా చేతనైన పని చేస్తాను’ అని అతను చెప్పాడు. ఇదంతా చూసి చాలామంది మెచ్చుకున్నారు. అయితే అమెరికాలో ఉంటున్న ప్రఖ్యాత చెఫ్ వికాస్ ఖన్నా తన కృతజ్ఞతను చాటుకోవడానికి ఒక కొత్త వంటకం చేసి దానికి సోనూ సూద్ సొంత ఊరి పేరు ‘మోగా’ అని పెట్టాడు. వికాస్ ఖన్నా చూపిన ఈ స్పందనకు సోనూ చాలా సంతోషపడ్డాడు. ‘మీరు చేసిన పనికి నా సొంత ఊరు గర్వపడుతుంది’ అని బదులు ఇచ్చాడు. చదవండి: దుస్తులు వేలం వేసిన నిత్యామీనన్ కరోనానీ, క్రిముల్నీ కడిగి పారేద్దాం! -
లక్ష దాటిన వలస ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: వలస కార్మికుల ప్రయాణం కొనసాగుతోంది. దక్షిణమధ్య రైల్వే నడుపుతున్న ప్రత్యేక శ్రామిక్ రైళ్ల ద్వారా బుధవారం సాయంత్రానికి తెలంగాణ నుంచి 74 రైళ్ల ద్వారా 1,00,324 మంది స్వస్థలాలకు వెళ్లారు. ఇందులో ఎక్కువ మంది ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల వారున్నారు. ఇక్కడికి దాదాపు 2,600 కి.మీ. దూరంలో ఉన్న మణిపూర్‌కు కూడా 3 రైళ్ల ద్వారా 4,800 మంది తరలివెళ్లారు. ఈనెల ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి లిం గంపల్లి నుంచి 27, చెర్లపల్లి నుంచి 4, ఘట్కేసర్ నుంచి 17, బీబీనగర్ నుంచి 8, నాగులపల్లి నుంచి 9, బొల్లారం నుంచి 8, మేడ్చల్ నుంచి ఒకటి నడిచాయి. ఎండలు తీవ్రంగా ఉం డటంతో నడుస్తూ, సైకిళ్ల ద్వారా వెళ్లటం ప్రమాదమని భా వించి క్రమంగా శ్రామిక్ రైళ్ల కోసం పేర్లు నమోదు చేసుకుం టున్న కార్మికుల సంఖ్య పెరుగుతోంది. (నేటి నుంచి ప్రగతి రథం పరుగులు) ఇక దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి పది స్టేషన్ల ద్వారా 44 రైళ్లలో 50,227 మంది, మహారాష్ట్ర నుంచి 12 రైళ్ల ద్వారా 15,915 మంది తరలారు. వెరసి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటి వరకు 1,66,466 మంది వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తరలివెళ్లారు. ఎన్ని రైళ్లయినా నడిపేందుకు సిద్ధం: దక్షిణ మధ్య రైల్వే ఇప్పటివరకు బిహార్‌కు 40, జార్ఖండ్‌కు 13, రాజస్తాన్‌కు 9, ఉత్తరప్రదేశ్‌కు 30, మణిపూర్‌కు 3, ఛత్తీస్‌గఢ్‌కు 4, మధ్యప్రదేశ్‌కు 12, ఒడిశాకు 9, మహారాష్ట్రకు 3, పశ్చిమబెంగాల్‌కు 1, ఉత్తరాఖండ్‌కు 1 చొప్పున రైళ్లు నడిపింది. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా మాట్లాడుతూ ఇంకా ఎన్ని శ్రామిక్ రైళ్లు నడిపేందుకైనా సిద్ధమని చెప్పారు. (ఔటర్‌పై ఇక రైట్..రైట్..) రూ.8.5 కోట్లు చెల్లించాం: సీఎస్ సోమేశ్‌కుమార్ రాష్ట్రం నుండి లక్ష మంది వలస కార్మికులను 74 ప్రత్యేక రైళ్లలో వివిధ రాష్టాలకు పంపించినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను అభినందించారు. బుధవారం బీఆర్కేఆర్ భవన్లో నిర్వహించిన సమీక్షా స మావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆదేశాల తో నోడల్ బృందం, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు, హై దరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, రై ల్వే తదితర శాఖలు కృషి చేశాయన్నారు. వలస కార్మికుల తరలింపుకు రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకు 8.5 కోట్లు చెల్లించిందన్నారు. సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి తొలి రైలు.. ప్రయాణికుల తరలింపునకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు మొట్టమొదటిసారి సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరింది. సికింద్రాబాద్–న్యూఢిల్లీ (02437) స్పెషల్ ట్రైన్ బుధవారం మధ్యాహ్నం 1.15కి సికింద్రాబాద్ స్టేషన్ 10వ ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరింది. గురువారం ఉదయం 10.40కి ఇది న్యూఢిల్లీకి చేరుకోనుంది. ఈ ట్రైన్లో మొత్తం 1,003 మంది ప్రయాణికులు బయలుదేరారు.దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా పర్యవేక్షణలో అధికారులు కరోనా నిబంధనల మేరకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు, శానిటైజేషన్ తరువాత రైల్లోకి అనుమతించారు. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఆర్పీఎఫ్తో పాటు అన్ని విభాగాలు జాగ్రత్తలు తీసుకున్నాయి. -
తెలంగాణలో కొత్తగా 27 కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం 27 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు చనిపోయారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సం ఖ్య 1661కి చేరగా.. మరణాలు 40కి చేరాయి. హైదరాబాద్ మోతీనగర్‌కు చెందిన 61 ఏళ్ల వ్య క్తి, చాంద్రాయణగుట్టకు చెందిన 81 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 15 మంది ఉండగా.. వలసదారులు 12 మంది ఉన్నారు. (సేఫ్ సర్వీస్!) వలసదారులంతా జగి త్యాల, జనగాం జిల్లాలకు చెందినవారని ప్ర జారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. మొత్తం కేసుల్లో 89 మంది వలసదారులు ఉన్నారు. ఇక బుధవారం ఇద్దరు డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినవారి సంఖ్య 1013కి చేరుకుంది. ఆసుపత్రిలో 608 మంది చికిత్స పొందుతున్నారు. ఒకే ఇంట్లో 8 మందికి పాజిటివ్ అబిడ్స్: గోషామహల్ జీహెచ్ఎంసీ 14వ జోన్ పరిధిలో బుధవారం ఒకే ఇంట్లో 8 మందికి కరోనా నిర్ధారణ అయింది. స్థానిక నట్రాజ్‌నగర్‌లో ఉంటున్న ఓ వ్యాపారికి (34) ఐదురోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా.. వ్యాపారి తండ్రి(55), తల్లి(48), భార్య(30), కుమారుడు(4), తమ్ముడు(28) తమ్ముడి భార్య(22), ఇద్దరు చెల్లెళ్లకు (22), (23) కరోనా సోకినట్టు తేలింది. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనోజ్
సాక్షి, హైదరాబాద్: కరోనా ఆపత్కాలంలో హీరో మంచు మనోజ్ తన పెద్ద మనసును చాటుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం తన పుట్టిన రోజు (మే20)న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీలకు తన వంతుగా కొంత తోడ్పాటును అందించారు. నానా అవస్థలు పడుతూ కాలి నడకన సొంత ఊళ్లకు పయనమైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలస కూలీల కోసం రెండు బస్సులను ఏర్పాటు చేశారు. వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసి అనంతరం వారిని వారివారి గమ్యస్థానాలకు పంపించే విధంగా మంచు మనోజ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తమ హీరో చేస్తున్న గొప్ప పనికి మంచు అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ సమయంలో పుట్టినరోజు జరుపుకున్నానంటే నాకంటే మూర్ఖుడు ఎవ్వరూ ఉండరు. లాక్ డౌన్ లో కష్టంగా ఉందని చాలామంది అంటున్న సంగతి తెలిసిందే. నాకు ఏం కష్టం ఉంది. ఉండటానికి ఇల్లుంది. హాయిగా తింటున్నా. కానీ మనకు ఇల్లు కట్టిన మేస్త్రి అన్న, నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలు, వాళ్ల కష్టాలు, వాళ్ల పిల్లల కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. సరే కావాల్సిన వాళ్లకు భోజనం పంచుతున్నాం, శానిటైజర్లు పంచుతున్నాం, మనకు తెలిసిన స్నేహితులు, ఫ్యాన్స్ అందరూ ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. ఇంకేం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి కొన్ని సంస్థలతో కలసి మన వలస కూలీలను సొంత ఊరు పంపేందుకు బస్సులు ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. దేశ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లాలో అవన్నీ ప్లాన్ చేసి, అందరి పర్మిషన్లు తీసుకొని వాళ్లకు భోజనం సమకూర్చి, వాళ్లు వాళ్ల సొంత ప్రాంతానికి చేర్చే బాధ్యత నాది’ అంటూ మంచు మనోజ్ ఇదివరకే పేర్కొన్న విషయం తెలిసిందే. Thoti bharateeyulu badha padutunte prasanthamga muddha kuda thinalanipinchatledu. Inka puttina roju ela jarupukonu? Anduke.., ee yedaadhi alaa ibbandullo unna variki chese sahayame na puttina roju vedukalu kavalani korukutunnanu. pic.twitter.com/14TWAM166V — MM*🙏🏻❤️ (@HeroManoj1) May 19, 2020 -
‘రాష్ట్రేతరులను కూడా జగన్ ఆదరించారు’
సాక్షి, గుంటూరు: విశ్రాంతి శిబిరాల్లో ఏర్పాట్లు బాగున్నాయని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి కొనియాడారు. గుంటూరు ఆర్వీఆర్ జేసీ కాలేజీలో ఉంటున్న వలస కార్మికులకు ఆయన బుధవారం మామిడి పండ్లు, భోజనం పంపిణీ చేశారు. అభ్యుదయ ఆదర్శ రైతు నారాయణరెడ్డి తన పదెకరాల తోటలో పండించిన ఆర్గానిక్ మామిడి పండ్లను అందించారు.అదేవిధంగా వైఎస్ఆర్ సీపీ సేవాదళ్ జిల్లా చైర్మన్ మెట్టు వెంకటప్పారెడ్డి ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు సమకూర్చారు.కార్మికులకు అన్నిరకాల వసతులతో విశ్రాంతి శిబిరాలను ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రభుత్వ పనితీరు భేష్ అని కొనియాడారు. (విజయవాడ చేరుకున్న 156 మంది ప్రవాసాంధ్రులు) బుధవారం స్థానికి చౌడవరం ఆర్వీఆర్ జేసీ కాలేజీలో ఆయన మాట్లాడుతూ... వేల కిలోమీటర్ల మేర కాలినడకన, సైకిళ్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ మీదుగా పోయే వలస కార్మికులను చేరదీసి ప్రభుత్వం విశ్రాంతి శిబిరాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రవాణా ఏర్పాట్లు సమకూర్చే వరకు శిబిరాల్లో వారిని ఉంచి ఉచిత భోజనం తదితర వసతులు కల్పించడం మంచి నిర్ణయమన్నారు. రాష్ట్రేతర వ్యక్తులను సైతం ఆపదలో ఆదుకొంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానవత్వం ఆదర్శనీయమన్నారు. ఒరిస్సా, కలకత్తా, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ గుంటూరు సీఐ వి.రేఖ, గుంటూరు రూరల్ ఆర్ఐ రాజా, వీఆర్వోలు పాల్గొన్నారు. (త్రీస్టార్.. తిరుపతి వన్) -
వంటిల్లుగా మారిన పోలీస్ స్టేషన్
వడోదర: రూల్స్ బ్రేక్ చేస్తే లాఠీ ఎత్తడమే కాదు, ఆకలి అని పిలిస్తే అన్నం పెట్టేందుకు రెడీ అంటున్నారు పోలీసులు. ఇందుకోసం పోలీస్ స్టేషన్‌ను వంటశాలగా మార్చేసిన అద్భుత దృశ్యం గుజరాత్‌లోని వడోదరలో చోటు చేసుకుంది. లాక్డౌన్ వల్ల వలస కూలీలతోపాటు నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు. వారి ఘోసలు చూసిన పోలీసుల మనసు చలించిపోయింది. కానీ నిస్సహాయులుగా మిగిలిపోయారు. మరోవైపు ఓ వ్యక్తి, ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్న కూతురు క్యాన్సర్ కారణంగా మరణించింది. దీంతో అతను ఎంతగానో కుమిలిపోయాడు. తన గారాల పట్టి జ్ఞాపకార్థంగా ఏదైనా చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అన్నదానానికి సిద్ధమయ్యాడు. (ప్రతాప్.. మళ్లీ పోలీస్) ఇందుకోసం వడోదరా పోలీసులను కలిసి తన ఆలోచన వివరించాడు. అప్పటికే కళ్ల ముందు కనిపిస్తున్న హృదయ విదారక దృశ్యాలు చూసి చలించిపోయిన పోలీసులు అతని ఆలోచనను ఆచరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం డీసీపీ సరోజ్ కుమారి ఎనిమిది మంది సభ్యులతో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరంతా తమ డ్యూటీలు పూర్తైన తర్వాత కిచెన్‌లో చెమటోడ్చుతారు. స్వహస్తాలతో వంట చేసి నిరుపేదలకు భోజనం పెడతారు. ఈ విషయం తెలిసిన చాలామంది పుట్టిన రోజులు, పెళ్లి రోజులకు పెట్టే ఖర్చును డబ్బు లేదా సరుకు రూపేణా పోలీస్ స్టేషన్‌కు విరాళంగా ఇస్తున్నారు. వీటి సహాయంతో పోలీసులు వంట చేసి ప్రతి రోజు 600 మందికి కడుపు నింపుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. (అనాథ ఆకలి తీర్చిన పోలీస్) -
మన (కరోనా) మహాభారతంలో నెత్తురోడిన పాదాలు
నేటి భారతంలో వందల ౖమైళ్ళ దూరం సైతం వలస కూలీలు కాలి నడకన పోతున్నారు. ఈ దయనీయ స్థితిని నేటి కవులు చాలా మంది వచన కవితలలో రాశారు. ఒకరిద్దరు పద్యాలు కూడా రాశారు. కింద ఒక ఉత్పలమాల పద్యం చూడండి. ఉ. డప్పి జనించె వ్రేళులపుటంబులు పొక్క దొడంగె గోళ్ళలో జిప్పిల జొచ్చె నెత్తురులు చిత్తము నాకు గడున్ వశంబు గా దప్పుర మిచ్చ టచ్చటను నాసల వచ్చితి నెంత దవ్వొకో యిప్పటి భంగి నొక్కడుగు నేగెడు దానికి నోర్వ నెమ్మెయిన్ (బాగా దప్పిక పుట్టింది; వేళ్ళకొసలు పొక్కులు పొక్కాయి; గోళ్ళనుండి నెత్తురులు చిప్పిలుతున్నాయి; నామనసు నాకు వశం కావడం లేదు; ఆ (నా) ఊరు ఇక్కడెక్కడో అనుకొని వచ్చాను, ఎంత దూరం ఉందో కదా; ఇప్పుడున్న పరిస్థితిలో ఒక్క అడుగు కూడా వేసే ఓపిక లేదు.) వలస కూలీలు భగభగమండే రోడ్ల మీద నడవలేని స్థితిని నేటి పద్య కవి ఎవరో చక్కగా వర్ణించినట్లుగా ఉంది కదా! కానీ ఇది మహాభారత విరాటపర్వం ప్రథమాశ్వాసంలోని 148వ పద్యం. పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం పూర్తి చేసుకుంటారు. ధౌమ్యుని అశ్రమంలో ఉన్నారు చివరిగా. అక్కడనుండి విరాట రాజు పాలించే మత్స్య దేశపు రాజధాని విరాట నగరానికి పోయి, అక్కడ ఒక సంవత్సరం అజ్ఞాతవాసం గడపాలని అనుకుంటారు. ధౌమ్యుని ఆశీస్సులు, రాజకొలువులో ఎలా మెలగాలి అని చెప్పిన హితోక్తులు విని ద్రౌపదితో సహా బయలుదేరారు. కనీసం ఐదువందల మైళ్ళు నడవాలి. మధ్యలో ఏ నగరం తగలకుండా అడవి మార్గంలోనే నడవాలనుకుంటారు. రెండుమూడు రోజులు నడిచే సరికే కుసుమ కోమలి ద్రౌపది ఒక్క అడుగు కూడా వేయలేనంతగా అలసిపోయి కూలబడింది. అలాంటి స్థితిలో ఉన్న ద్రౌపదిని మహాకవి తిక్కన వర్ణించిన పద్యం ఇది. కాని 900 సంవత్సరాల తర్వాత ఈనాటి వలస కూలీల దుస్థితిని వర్ణించడానికి నూరు శాతం ప్రతి అక్షరం పనికి వచ్చిన పద్ధతిలో ఉంది కదా. ఏమి చిత్రము. ఏమి మన కవుల శక్తి. అలాంటి ద్రౌపదిని చూచి ధర్మరాజు నకుల సహదేవులకు చెబుదామనుకుని, వారు కూడా అలసి ఉండటంతో అర్జునుడిని పిలిచి ద్రౌపది ఇక నడవలేదు, కానీ ఇక్కడ విడిది చేద్దామన్నా కుదరదు, కాబట్టి ఆమెను నీవే ఎత్తుకో అని చెప్తాడు. అలా ద్రౌపదిని మోసుకొని పోయారు వారు. కాని నేటి మన వలస కూలీలను మోయడానికి ఏలినవారే వాహనాలు ఏర్పాటు చేయాలి. -ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి -
వలస కార్మికులు దొంగలు, బందిపోట్లు: మంత్రి
లక్నో: లాక్డౌన్ వల్ల జీవితాలు రోడ్డున పడ్డ వలస కార్మికులపై ఉత్తర ప్రదేశ్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిని దొంగలుగా అభిర్ణిస్తూ కించపరిచడం వివాదాస్పదంగా మారింది. శనివారం యూపీ మంత్రి ఉదయ్ భాన్ సింగ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లక్షలాది వలస కార్మికులు ఇంటి బాట పట్టారన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆ ఆలోచన విరమించుకోవాలని ప్రభుత్వాలు ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ, ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా కొందరు దొంగలు, బందిపోట్లులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మార్చి 25న నరేంద్రమోదీ దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వం వలస కూలీల సమస్యలపై దృష్టి సారించిందని తెలిపారు. (నీరింకిన కళ్లు..!) ఈ మేరకు ఉత్తర ప్రదేశ్‌లో పలు చోట ఆహార స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఆహార సదుపాయంతో పాటు అత్యవసర సరుకులను కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. వీరికోసం ఇంత చేస్తున్నప్పటికీ కొందరు ఏమాత్రం లెక్క చేయకుండా దొంగల్లా పొలాల వెంబడి కాలినడకన పయనిస్తూనే ఉన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా శనివారం ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కార్మికులు మరణించిన కొన్నిగంటలకే మంత్రి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. (యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 24 మంది మృతి) (చితికిన బతుకులు) -
మనమే మాయం చేశాం..సిగ్గుతో తలదించుకోవాలి!
సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభ సమయంలో చోటు చేసుకున్న యూపీ విషాద ఘటన, వలస కార్మికుల దుర్మరణంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర తీవ్ర దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాజంలో మనందరం సిగ్గుతో తలదించుకోవాలంటూ విచారాన్ని వ్యక్తం చేశారు. (యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 24 మంది మృతి) మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన వలస కార్మికులను మనమే మాయం చేశాం. దీనికి సమాజంలోని మనం అందరమూ బాధ్యులమే. ముఖ్యంగా చిన్నా పెద్దా వ్యాపారస్థులందరమూ సిగ్గు పడాలి అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. అంతేకాదు వలస కార్మికుల సమస్యల స్వల్ప, దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించాలని మహీంద్రా గ్రూపును కోరారు. వారికి ఎలా సహాయపడగలమో సూచించాలన్నారు. తద్వారా బాధిత కుటంబాలను ఆదుకోవడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు. కోవిడ్-19 కట్టడి నేపథ్యంలో దాదాపు రెండు నెలల సుదీర్ఘ లాక్డౌన్ కారణంగా దేశంలోని ప్రధాన పట్టణ పారిశ్రామిక కేంద్రాల నుండి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తమ కుటుంబాలతో కలిసి తమ సొంత రాష్ట్రాలకు పయనమవుతున్నారు. ఈక్రమంలో అనేకమంది అసువులు బాస్తున్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్మికుల మరణానికి సంతాపం తెలిపారు. కాగా ఉత్తరప్రదేశ్ ఔరయా జిల్లాలో శనివారం తెల్లవారుజామున వలస కార్మికులు ప్రయాణిస్తున్న ట్రక్కును, మరో వ్యాను ఢీకొట్టిన ఘోర ప్రమాదంలో 24 మంది కార్మికులు చనిపోయారు. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. చదవండి: భారీ డీల్ : ఫేస్బుక్ చేతికి ‘జిఫీ’ -
ఆ పదహారు కూలీల పదహారణాల ఆత్మనిర్భరత
హరిశ్చంద్రుడికి కరోనా రోగం సోకింది. వరుణుడిని ప్రార్థిస్తాడు. నీ కొడుకును బలి ఇస్తానంటే నీ రోగం కుదురుస్తానంటాడు వరుణుడు. సరేనంటాడు రాజు. రాజభవనం నుంచి కరోనా పోయింది. రాజు పుత్రవ్యామోహంలో పడి బలిమాట వాయిదా వేస్తుంటాడు. బలి ఇవ్వక తప్పని దశ వస్తుంది. రాజుగారి సలహాదారుడు మీరు పుత్రుడిని దత్తత తీసుకుని లేదా కొనుక్కుని కూడా బలి ఇవ్వవచ్చునని ఉపాయం చెబుతాడు. రాజు దండోరా వేస్తాడు. బలిచేసే వాడికి ఎవరైనా కొడుకిని దత్తత ఇస్తారా, అమ్ముతారా? కానీ, అజిగర్తుడనే పేదవాడు నాకు నూరు ఆవులిస్తే కొడుకునిస్తానంటాడు. అయితే పెద్దవాడంటే నాకు ప్రేమ అని తండ్రి, చిన్నవాడిని నేనివ్వను అని తల్లి అంటారు. మధ్య వాడు సునఃశ్యేపుడు. తల్లిదండ్రులకు అక్కరలేకపోయిన తరువాత బతకడమెందుకని బలిపశువైపోతాడు. అయితే యజ్ఞంచేసే ముని, బలిని నిర్వహించే ఉద్యోగి మనిషిని నరకలేమంటారు. మళ్లీ అజిగర్తుడు ముందుకొచ్చి ఇంకో వంద ఆవులిస్తే నేనే బలి ఇస్తానంటాడు. నాకెవరూ లేరు, నేనెవరిమీదా ఆధారపడలేను, ప్రేమించే తల్లిదండ్రులే వద్దనుకున్నారు, కాపాడే రాజే బలి కోరుతున్నాడు అని కుములుతున్న సమయంలో అప్పుడే అద్భుతమైన ఉపదేశం ఆకాశవాణిలో విన్నాడు సునఃశ్యేపుడు. ఎవ్వరిమీద ఆధారపడనప్పుడే కావలసింది ఆత్మనిర్భరత అన్న మాట మనసులో నాటుకుపోయింది. వలసకూలీల వలె పట్టాల మీద బలిపశువు కాకూడదనుకున్నాడు. కనీస బాధ్యత లేని తల్లిదండ్రులనుంచి, నియంతృత్వపు రాజు నుంచి, మాయమాటలు నమ్మి చప్పట్లు కొట్టే ప్రజల అజ్ఞానపు చీకట్ల నుంచి కాపాడే చైతన్య ఉషోదయాన్ని ప్రార్థిస్తూ గురువు విశ్వామిత్రుడు చెప్పినట్టు తానే వరుణుడిని ప్రార్థించాడు. వెంటనే వెలుగు విస్తరించింది. వరుణుడు రాజుతో నీవంటి వారి బలి నాకక్కరలేదన్నాడు. సునఃశ్యేపుడు తండ్రిని ఒక చూపు చూసి విశ్వామిత్రుడి వెంట ఎంతో ఆత్మనిర్భరతతో వెళ్లిపోతాడు. దిక్కులేకుండా సునఃశ్యేపుడి వంటి దుర్దశలో ఉన్నపుడు ఆత్మనిర్భరత అవసరం అన్నది ఈనాటి పాఠం. కరోనాను పట్టించుకోకుండా ముందుగా ట్రంప్ జిందాబాద్ అన్నాం, తరువాత పారాసిటమాల్ చాలదా అనుకున్నాం. తరువాత భయపడ్డాం, తాళాలు వేశాం. తాళాలు తప్రాలు వాయిస్తూ భజ నలు చేశాం. భౌతిక దూరం అంటూ కవితలు రాశాం. పై కథ చెప్పిన ఒక పురాణ నిపుణ రచయిత కవితాత్మకంగా ఇంకో మాట చెప్పాడు. 500 కరోనా కేసులున్నపుడు లాక్డౌన్, 5 వేల కేసులున్నపుడు చప్పట్లు, 10 వేల కేసుల సంబరానికి కరెంటు దీపాలు మలిపి, ఆ చీకటిలో కొవ్వొత్తులు వెలిగించడం, 40 వేల కేసుల సందర్భంలో ఆకాశం నుంచి పూలు కురిపించడం. 50 వేల కేసులుం డగా మద్యం దుకాణాలు బార్లా తెరిపించడం. 60 వేల కేసులకు చేరుకుంటుంటే రైళ్లు నడవడం చేసుకుంటున్నాం. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ఆత్మనిర్భరత ప్రబోధించారు. కనిపించని కరోనా, కనిపించినా కదలలేని సామాన్యులు గందరగోళంలో పడిపోయారు. కేవలం నాలుగ్గంటల నోటీసిచ్చి అంతా 21 రోజుల దాకా బంద్ అంటే నలభై కోట్ల వలస కూలీలు తప్ప అంతా సంతోషించారు. రకరకాల వలస కూలీలకు ఇప్పుడు పని లేదు. పనిలేక తిండి లేదు. పోదామంటే రైలు లేదు, కోట్లాదిమంది నడక మొదలుపెట్టారు. ఎంత దూరం అని పట్టించుకోలేదు. ఒక తల్లి దారిలో ప్రసవించింది, వెంటనే నడకకు సిద్ధమైంది. ఒక తండ్రి పాపను భుజాన మోసుకుని బయలుదేరాడు. ఓ భర్త, చిన్న చక్రాల చట్రం మీద భార్యను, పసిపాపను ఓ మూటను పెట్టుకుని లాక్కుపోవడం మొదలుపెట్టాడు. చక్రాల సూట్‌కేస్ మీద సతిని కూచోబెట్టి మరో పతిదేవుడు తోసుకుపోతున్నాడు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఊరికి 30 కి.మీ. దూరంలో అలసిపోయి చనిపోయాడొకాయన. రైలు ఎక్కనీయకపోతే పట్టాల వెంట నడక ప్రారంభించి నడిచీ నడిచీ అలసిపోయి తెల్లవారుఝామున మూడు గంటల ప్రాంతంలో అక్కడికక్కడే పట్టాల మీద పడి నిద్రపోయారు. ప్యాసింజర్ రైళ్లు లేకపోయినా రైల్వే అధికారులు ఎంతో దేశభక్తితో గూడ్సు రైళ్లు నడుపుతారని వారు ఊహించలేకపోయారు. ఇంజిన్ డ్రైవర్ కర్తవ్య నిర్వహణ పరాయణుడై రైలు నడిపే డ్యూటీ చేశాడు. తీరా లక్షలాది కూలీలు ఊళ్లు చేరిన తరువాత, అన్ని పనుల లాక్ తెరిచారు. రెక్కాడించడానికి మళ్లీ వెళ్లాలా? ఎవ్వరిమీదా ఆధార పడకుండా సొంతంగా బతుకో చావో అనుకునే ఆ పదహారుమంది పదహార ణాల ఆత్మనిర్భరత అలవర్చుకోవాలా? నెత్తురుతో తడిసిన ఆ పట్టాలమీద ప్రగతి రైళ్లు పరుగెత్తి మన దేశాన్ని విశ్వాగ్రరాజ్యంగా మార్చేస్తాయా? స్క్రూలనుంచి ఇంజిన్ దాకా అంతా జపాన్ వారే చేసి మనకు అమ్మే బుల్లెట్ రైళ్లు ఈ పట్టాలమీదే నడుస్తాయా? నడిస్తే లోకల్ అనకండి, అది గ్లోకల్ అని తెలుసుకోండి. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్లో కొన్ని సడలింపుల కారణంగా గ్రామాల్లోకి వలస కార్మికులు, ఇతర వ్యక్తులు వస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లాల్లోని వైద్య సిబ్బందితో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వైద్యాధికారు లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడు తూ.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి జ్వరం వంటి పరీక్షలు చేయాలని ఆదేశిం చారు. కరోనాతోపాటు ఇతర వైద్య సదుపాయాలపై కూడా దృష్టి పెట్టాలని కోరారు. సాధ్యమైనన్ని ఎక్కువ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేలా చూడాలని సూచిం చారు. వంద శాతం ఇమ్యునైజేషన్ చేయాలన్నారు. సిబ్బంది పనితనానికి నిదర్శనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ పెరగటమేనని చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, మలేరియా ఇతరత్రా జ్వరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతీ ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువున్న ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల్లో కేవలం రెండు శాతం మంది మాత్రమే చనిపోతున్నారని తెలిపారు. 98 శాతం మంది ఆరోగ్యంగా ఇంటికి వెళ్తున్నారని.. ఇది దేశంలోనే మంచి పరిణామమని మంత్రి పేర్కొన్నారు. సిబ్బంది రక్షణ ముఖ్యం.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, హెచ్‌సీక్యూ ట్యాబ్లెట్లు వేసుకోవాలని మంత్రి ఈటల వైద్య సిబ్బందిని కోరారు. రవాణా సదుపాయాలు లేనిచోట్ల మెడికల్ ఆఫీసర్లకు వాహనాలు ఏర్పాట్లు చేయాలని అ ధికారులను ఆదేశించారు. కరోనాపై యుద్ధం లో మొదటి వరుసలో పనిచేస్తున్న 9 వేల మంది ఆరోగ్య కార్యకర్తల భద్రత మొదటి ప్రాధాన్యమని మంత్రి చెప్పారు. సిబ్బంది రక్షణ ముఖ్యమని, వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కరోనాకు అడ్డుకట్ట వేయడానికి పని చేసిన వైద్య సిబ్బందికి సమాజంలో ఎప్పుడూ లేనంత గొప్ప గౌరవం దక్కిందని చెప్పారు. శానిటైజేషన్ వర్కర్ నుంచి మంత్రి వరకు అందరూ కలసి పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా పలువురు ఆశ కార్యకర్తలు, ఏఎ న్‌ఎంలతో మంత్రి మాట్లాడారు. వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలానికి చెందిన విజయలక్ష్మి అనే ఆశ కార్యకర్తతో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు, సౌకర్యాల పట్ల సిబ్బంది సంతృప్తి వ్యక్తం చేశారు. -
వారందరికీ సామూహిక పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వలసదారులకు సామూహిక కరోనా నిర్ధా రణ పరీక్షలు (పూల్డ్ శాంపిలింగ్) చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ గురువారం రాష్ట్రా లను ఆదేశిస్తూ, మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి వేలాది మంది ఇక్కడకు వస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొందరు వైరస్ అనుమానిత లక్ష ణాలతో ప్రభుత్వ క్వారంటైన్లో ఉన్నారు. అలాగే, విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పర్య వేక్షణలో తమ సొంత ఖర్చులతో హోటళ్లు, లాడ్జిల్లో క్వారంటైన్లో ఉన్నారు. వీరందరికీ సామూహిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కేంద్రం పేర్కొంది. వాస్తవంగా విదే శాల నుంచి వచ్చే వారు, సంబం ధిత దేశంలో ప్రయాణానికి ముందే కరోనా నిర్ధా రణ పరీక్షలు చేయించుకొని వచ్చారు. నెగెటివ్ వచ్చి న వారినే ప్రయాణానికి అనుమతించారు. అయినా తాజా మార్గదర్శకాల ప్రకారం వారందరికీ ఈ పద్ధతిలో నిర్ధారణ పరీక్షలు చేస్తారు. మరోవైపు 21 రోజులుగా ఒక్క కేసూ నమోదుకాని గ్రీన్‌జోన్ జిల్లాలకు చెందిన వారికీ నిర్ణీత సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తారు. దీనివల్ల ఆయా జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రతను తెలుసుకోవడానికి వీలవుతుంది. 25 మందికి ఒకేసారి.. రివర్స్ ట్రాన్స్‌స్క్రిప్షన్ పాలిమరెస్ చైన్ రియాక్షన్ (ఆర్టీ–పీసీఆర్)గా పిలిచే ఈ సామూహిక కరోనా నిర్ధా రణ పరీక్షల వల్ల ఒకేసారి ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ విధానంలో 25 మంది శాంపి ళ్లను కలిపి ఒకేసారి పరీక్షిస్తారు. ఇం దులో పాజిటివ్ వస్తే, వారిలో ఎంత మందికి వైరస్ సోకిందో గుర్తించేం దుకు మరోసారి ఆ 25 మందికి విడివిడిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తారు. ఒకవేళ నెగెటివ్ వస్తే వారందరికీ కరోనా లేనట్టు గుర్తించి ఇంటికి పంపిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సామూహిక కరోనా పరీక్షలను సీసీఎంబీలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానం వల్ల వంద మందిలో కరోనా ఉందో లేదో అంచనా వేయాలంటే, నాలుగు పరీక్షలు చేస్తే సరిపోతుంది. దీంతో టెస్టింగ్ కిట్లు సరిపోతాయని, సమయం, డబ్బు ఆదా అవుతాయని అంటున్నారు. ఒక్కో పరీక్షకు సగటున రూ.4,500 ఖర్చవుతుందని అంచనా. ప్రతి ఒక్కరినీ విడివిడిగా పరీక్షించే కన్నా ఈ పద్ధతిలో టెస్టులు జరిపితే తక్కువ టెస్టింగ్ కిట్లను సమర్థంగా వినియోగించుకున్నట్టవుతుంది. ప్రస్తుతం అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సామూహిక పరీక్షలకు ప్రాధాన్యం ఏర్పడనుంది. అదీగాక సర్కారు క్వారంటైన్లలో ఉండే వలసదారులకు, విదేశాల నుంచి వచ్చే వారికి, గ్రీన్జోన్లలో ఉన్నవారికి సామూహిక పరీక్షలు చేయడమే మేలని అంటున్నారు. సిబ్బంది కోసం ఇదీ ప్రొటోకాల్ సామూహిక కరోనా నిర్ధారణ పరీక్షలకు కేంద్రం ప్రొటోకాల్ రూపొందించింది. దీని ప్రకారం.. శిక్షణ పొందిన లేబరేటరీ సిబ్బంది ఆప్రాన్, హ్యాండ్‌గ్లోవ్స్, గాగుల్స్, ఎన్–95 మాస్క్‌లు ధరించాలి. ప్రొటోకాల్ ప్రకారం ఆయా వ్యక్తుల గొంతు నుంచి స్వాబ్ శాంపిళ్లను సేకరించాలి. శాంపిళ్లు ఎవరివనే వివరాలను లేబులింగ్‌పై రాయాలి. ఇలా ఒక ధపాలో సేకరించిన 25 శాంపిళ్లను ట్రిపుల్ లేయర్లో ప్యాకేజ్ చేస్తారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కోల్డ్–చైన్‌లో లేబరేటరీలకు తరలించి వాటిని ఒకేసారి పరీక్షిస్తారు. -
జూన్ నుంచి సడలింపులు
సింగపూర్: పెరుగుతున్న కేసులను చూసి ప్రజలు ఏమాత్రం భయాందోళనకు గురి కావద్దని సింగపూర్ ప్రభుత్వం ప్రజలను అభ్యర్థించింది. తాజాగా గురువారం మధ్యాహ్నం నాటికి తాజాగా 752 కేసులు నమోదవగా మొత్తం బాధితుల సంఖ్య 26,098కు చేరింది. అయితే నానాటికీ కేసులు పెరిగిపోతున్నప్పటికీ సింగపూర్ ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులపై దృష్టి సారించింది. ఇప్పటికే సెలూన్లు, కేక్, డిజర్ట్ షాపులు, లాండ్రీ సర్వీసులు, సంప్రదాయ చైనీస్ మెడిసిన్ హాళ్లు, గృహ ఆధారిత ఆహార వ్యాపారాలు తదితర కార్యకలాపాలు, వ్యాపారాలకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. (మరణాల రేటును నియంత్రించిన చిన్న దేశాలు) తాజాగా కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణంగా భావిస్తున్న విదేశీ కార్మికులు(వలస కార్మికులు)కు విధించిన ఆంక్షలపై సడలింపులు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం, ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడైన తర్వాతే పనిలోకి చేరేందుకు అనుమతిస్తామంది. కాగా విదేశీ కార్మికుల వల్లే అక్కడ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా పేర్కొన్న విషయం తెలిసిందే. సింగపూర్ మంత్రి జోసఫిన్ టియో మాట్లాడుతూ.. తమ దేశంలో విదేశీ కార్మికులందరికీ విస్తృతంగా కరోనా పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇలా వలస కార్మికులకు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నదేశాల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. ఈ క్రమంలో వారిపై విధించిన ఆంక్షలను జూన్ నుంచి క్రమంగా ఎత్తివేస్తామని వెల్లడించారు. (అప్పటివరకు లాక్డౌన్ నీడలో సింగపూర్) -
కొద్దిసేపట్లో ఇళ్లు చేరేవారు కానీ అంతలోనే...
రాయ్‌బరేలి: కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ వలస కార్మికుల జీవితాలతో ఆటాడుకుంటోంది. తినడానికి తిండి లేక, ఉండటానికి దిక్కు లేక సొంత గూటికి చేరలేక వలస కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ కారణంగా రవాణా సౌకర్యాలన్ని రద్దు కావడంతో కాలినడకనే సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. ఈ ప్రయాణంలో ప్రాణాలకు తెగించి ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. చాలా మంది ఎంతో ఆశగా ఇంటికి బయలు దేరినా ఇంటిని చేరకుండానే, అయిన వారిని చూడకుండానే తిరిగి రాని లోకానికి తరలిపోతున్నారు. ఎంతో మంది వలస కార్మికులు అనేక కారణాల వల్ల ప్రాణాలు కోల్పొతున్నారు. (వలసజీవుల బలిదానం) తాజాగా ఇద్దరు కార్మికులు వేల కిలో మీటర్లు నడిచి ఇంకా కొద్ది రోజుల్లో ఇంట్లో వారిని కలుసుకోబోతున్నారు అనుకున్న తరుణంలో వేగంగా వస్తున్న ఒక కారు వారిని ఢీకొట్టింది. ఈ ఘటన హరియాణలో చోటు చేసుకుంది. ఇద్దరు వలస కార్మికులు నడుచుకుంటూ వెళుతుండగా వేగంగా వస్తోన్న యస్‌యూవీ కారు వారిని ఢీ కొట్టింది. దీంతో ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో కార్మికుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. మంగళవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. మరోవైపు సోమవారం రాత్రి సైకిల్ తొక్కుకుంటూ సొంత గ్రామానికి వెళుతున్న 25 ఏళ్ల వలస కార్మికుడు శివకుమార్ దాస్ రాయ్‌బరేలీలో కారు ఢీకొని చనిపోయాడు. కారు చాలా స్పీడ్‌గా వస్తోండటంతో బ్రేకులు ఫెయిల్ అయ్యి ప్రమాదం జరిగినట్లు కార్ డ్రైవర్ తెలిపాడు. అతడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. (‘లాక్డౌన్లో కూడా ప్రమాదాల రేటు మారలేదు’) ఇప్పటి వరకు వలస కార్మికులు అనేక మంది ప్రమాదాలకు గురయ్యి మరణించారు. వారి కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికి వాటికి అధిక చార్జీలు వసూలు చేస్తుండటం, వాటి టికెట్ కొనుగోలు విధానంలో కూడా చాలా ప్రాసెస్ ఉండటంతో ఎక్కువ మంది కార్మికులు రైలు మార్గం ద్వారా ప్రయాణించలేకపోతున్నారు. గత వారాంతంలో ఒక ట్రక్ బోల్తా పడటంతో ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఆరు మంది వలసకార్మికులు మధ్యప్రదేశ్‌లో చనిపోయారు. ఔరాంగాబాద్ సమీపంలో రైళ్ల పట్టాలపై నిద్రపోతున్న 16 మంది మీద నుంచి గూడ్స్‌ట్రైన్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే వారు మరణించారు. ఇలాంటి ఘటనలు జరుగుతుండటం దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. (రైలు ప్రమాదంలో 16 మంది వలస కూలీల మృతి)