సాక్షి, గుంటూరు: విశ్రాంతి శిబిరాల్లో ఏర్పాట్లు బాగున్నాయని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి కొనియాడారు. గుంటూరు ఆర్‌వీఆర్ జేసీ కాలేజీలో ఉంటున్న వలస కార్మికులకు ఆయన బుధవారం మామిడి పండ్లు, భోజనం పంపిణీ చేశారు. అభ్యుదయ ఆదర్శ రైతు నారాయణరెడ్డి తన పదెకరాల తోటలో పండించిన ఆర్గానిక్ మామిడి పండ్లను అందించారు.అదేవిధంగా వైఎస్ఆర్ సీపీ సేవాదళ్ జిల్లా చైర్మన్ మెట్టు వెంకటప్పారెడ్డి ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు సమకూర్చారు.కార్మికులకు అన్నిరకాల వసతులతో విశ్రాంతి శిబిరాలను ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రభుత్వ పనితీరు భేష్ అని కొనియాడారు. (విజయవాడ చేరుకున్న 156 మంది ప్రవాసాంధ్రులు)
బుధవారం స్థానికి చౌడవరం ఆర్‌వీఆర్ జేసీ కాలేజీలో ఆయన మాట్లాడుతూ... వేల కిలోమీటర్ల మేర కాలినడకన, సైకిళ్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ మీదుగా పోయే వలస కార్మికులను చేరదీసి ప్రభుత్వం విశ్రాంతి శిబిరాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రవాణా ఏర్పాట్లు సమకూర్చే వరకు శిబిరాల్లో వారిని ఉంచి ఉచిత భోజనం తదితర వసతులు కల్పించడం మంచి నిర్ణయమన్నారు. రాష్ట్రేతర వ్యక్తులను సైతం ఆపదలో ఆదుకొంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానవత్వం ఆదర్శనీయమన్నారు. ఒరిస్సా, కలకత్తా, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ గుంటూరు సీఐ వి.రేఖ, గుంటూరు రూరల్ ఆర్ఐ రాజా, వీఆర్వోలు పాల్గొన్నారు. (త్రీస్టార్.. తిరుపతి వన్)
Comments
Please login to add a commentAdd a comment