food
-
నేహా ధూపియా అనుసరించే గ్లూటెన్-ఫ్రీ డైట్ అంటే..!
బాలీవుడ్ నటి నేహా ధూపియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె మోడల్, ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ కూడా. అలాగే 2002లో మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్య వహించింది. బాలీవుడ్లో అనేక బ్లాక్బాస్టర్ మూవీలతో మంచి సక్సెస్‌ని అందుకోవడమే గాక అనేక రియాలిటీ షోల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ..విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఆమె అంగద్ బేడీని 2018లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు పిల్లకు జన్మనివ్వడంతో లావుగా అయిపోయారు. అయితే అనుకోకుండా ఒక రోజు మీడియా కంట పడటంతో..ఒక్కసారిగా ఆమె అధిక బరువు గురించి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఏకంగా 23 కిలోలు బరువు తగ్గి ఇదివరకటి నేహాలా నాజుగ్గా కనిపించి.. అందర్నీ ఆశ్చర్యపరిచింది.పైగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడమే గాక..పలు ఆఫర్లను కూడా అందుకున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేగాదు తన అభిమానుతో తన వెయిట్ లాస్ జర్నీ గురించి, అందుకు సంబంధించిన చిట్కాలను కూడా షేర్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆరోగ్య స్ప్రుహ కలిగించే నేహా తాజాగా డైట్‌కి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం షేర్ చేసుకుంది. అదేంటంటే..డైట్ పాటించేటప్పుడూ కేవలం బరువు తగ్గేందుకే ప్రాధాన్యత ఇవ్వడమే గాక ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలని నొక్కి చెబుతోంది. ముఖ్యంగా గ్లూటెన్ ఫ్రీ డైట్‌ని అనుసరించమని చెబుతోంది. మంచి శరీరాకృతి తోపాటు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడమని ధీమాగా చెబుతోంది నేహా. దీన్ని అత్యంత రుచికరమైన రీతిలో తయారు చేసుకుంటే గ్లూటెన్ ఫ్రీ ఫుడ్‌ని ఇష్టంగా తినగలుగుతారని అంటోంది. తాను అరటిపండ్లతో చేసిన పాన్కేక్, తాజా బెర్రీలు, లావెండర్ జామ్ వంటివి తీసుకుంటానని చెబతుతోంది. గ్లూటెన్ ఫ్రీ ఆహారపదార్థాలను ఎంపిక చేసుకుని మరీ డైట్‌ని ప్రారంభిస్తే మంచి ఫలితం ఉండటమే గాక బరువు కూడా అదుపులో ఉంటుందని తెలిపింది. గ్లూటెన్ డైట్ అంటే..గ్లూటెన్ రహిత ఆహారంమే తీసుకోవడం. అందుకోసం గ్లూటెన్ లేని పండ్లు, కూరగాయలు, మాంసం, గుడ్లు వంటిఆహారాలనే తీసుకుంటారు. అలాగే గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ లేదా పాస్తా వంటివి కూడా తీసుకుంటారు. ఎవరికి మంచిదంటే..గ్లూటెన్ ఉన్న ఆహార పదార్థాలు పడని వాళ్లకు, గోధుమ పిండితో చేసిన వంటకాలు తింటే ఎలెర్జీ లేదా జీర్ణశయాంతర సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ డైట్ మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణుల. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచిదే. ఇక్కడ గ్లూటెన్ ఫ్రీకి ప్రత్యామ్నాయంగా మంచి ఆరోగ్యకరమైనవి తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత ఆరోగ్య నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి పాటించటం ఉత్తమం.(చదవండి: కాకర : చక్కెరకు చెక్ పెడుతుందా?) -
ఫుడ్ డెలివరీకి కొత్త రూల్..
ఆహారోత్పత్తులు విక్రయించే ఈ–కామర్స్ కంపెనీలకు ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కొత్త నిబంధన విధించింది. ఏదైనా ఆహారోత్పత్తి గడువు ముగిసే తేదీకి కనీసం 30 శాతం లేదా 45 రోజులు ముందుగా కస్టమర్‌కు చేరాలని స్పష్టం చేసింది. అంటే షెల్ఫ్ లైఫ్ కనీసం 45 రోజులు ఉన్న ఉత్పత్తులను డెలివరీ చేయాల్సి ఉంటుంది.కాలం చెల్లిన, గడువు తేదీ సమీపిస్తున్న ఉత్పత్తుల డెలివరీలను కట్టడి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ & సర్టిఫికేషన్‌కి మద్దతుగా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని కూడా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ సూచించినట్లు తెలుస్తోంది. కల్తీని నివారించడానికి ఆహారం, ఆహారేతర వస్తువులను వేర్వేరుగా డెలివరీ చేయాలని స్పష్టం చేసింది.గడువు ముగిసే ఆహార ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించిన సమస్యలు ఇటీవల అధికమయ్యాయి. ముఖ్యంగా డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డెలివరీ అయ్యే వస్తువులపై గడువు తేదీలు ఉండటం లేదంటూ అనేక ఫిర్యాదు వచ్చాయి. డెలివరీ చేస్తున్న వస్తువులపై ఎంఆర్పీ, "బెస్ట్ బిఫోర్" తేదీలు లేకపోవడంపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) గత నెలలో క్విక్-కామర్స్, ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. -
డల్లాస్‌లో నాట్స్ ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన
భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తన నినాదానికి తగ్గట్టుగా అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో ప్రతి ఏటా డల్లాస్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫుడ్ డ్రైవ్‌ను ఈ సారి కూడా చేపట్టింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు వివిధ రకాల ఆహార పదార్ధాలు, వెయ్యికి పైగా ఫుడ్ క్యాన్స్‌ను నాట్స్ డల్లాస్ సభ్యులు సేకరించారు.అలా సేకరించిన ఆహారాన్ని తాజాగా టెక్సాస్ ఫుడ్ బ్యాంక్‌కు నాట్స్ సభ్యులు అందించారు. నాట్స్ 918 పౌండ్లు బరువు ఉన్న ఆహారపు పదార్ధాలను ఫుడ్ బ్యాంక్‌కు ఇవ్వడం ద్వారా దాదాపు 765 మందికి ఒక పూట భోజన సదుపాయం కల్పించవచ్చని నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంకు తెలిపింది.. గత పద్నాలుగు ఏళ్లుగా ప్రతి సంవత్సరం నాట్స్ చేస్తున్న ఈ ఫుడ్ డ్రైవ్‌ని నిర్వహిస్తున్న నాట్స్‌ని నార్త్ టెక్సాస్ ఫుడ్ డ్రైవ్ ప్రతినిధులు ప్రశంసించారు.నాట్స్ ఫుడ్ డ్రైవ్‌లో పాల్గొన్న యువ వాలంటీర్లను, సభ్యులను వారిని ప్రోత్సహించి, సహకారం అందించిన తెలుగువారందరిని నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి అభినందించారు. ఆహార పదార్ధాలను అందించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సేకరణ కార్యక్రమంలో అత్యంత చురుగ్గా పాల్గొన్న వేద శ్రీచరణ్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఫుడ్ డ్రైవ్ నిర్వహణలో డల్లాస్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రవణ్ నిడిగంటి, అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల, డల్లాస్ చాప్టర్ సభ్యులు శ్రీధర్ న్యాలమడుగుల, బద్రి బియ్యపు, ఉదయ్ పాకలపాటి, నాట్స్ యువ సభ్యులు వేద శ్రీచరణ్, అద్వైత్, అర్ణవ్, అరిహంత్, అథర్వ్లతో పాటు నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల, ఎస్సీ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నాట్స్ జాయింట్ కోశాధికారి రవి తాండ్ర, మీడియా రిలేషన్స్ కోఆర్డినేటర్ కిషోర్ నారె లు పాల్గొన్నారు.ఈ ఫుడ్ డ్రైవ్‌కు సహకరించిన దాతలు స్వాగత్ బిర్యానీస్, వేల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమి, హింద్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, ఫార్మ్2కుక్ లకు డల్లాస్ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ శ్రావణ్ నిడిగంటి ధన్యవాదాలు తెలిపారు.. గత 14 సంవత్సరాలుగా ఫుడ్ డ్రైవ్‌ని విజయవంతంగా నిర్వహిస్తున్న డల్లాస్ టీం ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటిలు ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: టాంపలో నాట్స్ బోర్డ్ సమావేశం సంబరాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ) -
ఆహా ఆవకాయ! ఒక ముద్ద పడిందంటే.. ఈ రుచులను ఎప్పుడైనా ట్రై చేశారా? (ఫొటోలు)
-
నాలుగు లైన్ల పోస్ట్‌కు స్పందించి జాబ్ ఆఫర్!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ‘ఫుడ్ రెస్క్యూ’కు సంబంధించి ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌పై కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ స్పందించారు. ఆ నెటిజన్‌కు జాబ్ కూడా ఆఫర్ చేశారు. అసలు ఆ నెటిజన్ పోస్టేంటి.. సీఈఓ ఎందుకు జాబ్ ఆఫర్ చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం.ఆహార వృథాను అరికట్టడానికి జొమాటో కొత్తగా ‘ఫుడ్ రెస్క్యూ’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆర్డర్ క్యాన్సిల్ కారణంగా ఉత్పన్నమయ్యే ఆహార వృథా సమస్యను పరిష్కరించడానికి ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు జొమాటో సీఈఓ గోయల్ ఇటీవల ప్రకటించారు. కొత్త ఫీచర్ ద్వారా కస్టమర్లు ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన తర్వాత నిమిషాల వ్యవధిలో ఫుడ్‌ను తగ్గింపు ధరతో ఇతర కస్టమర్లు పొందవచ్చు. జొమాటోలో నెలకు సగటున దాదాపు నాలుగు లక్షల ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయి.We don't encourage order cancellation at Zomato, because it leads to a tremendous amount of food wastage.Inspite of stringent policies, and and a no-refund policy for cancellations, more than 4 lakh perfectly good orders get canceled on Zomato, for various reasons by customers.… pic.twitter.com/fGFQQNgzGJ— Deepinder Goyal (@deepigoyal) November 10, 2024కొత్త ఫీచర్‌కు సంబంధించిన ప్రకటనపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. క్యాన్సిల్ చేసిన ఆర్డర్లను కొనుగోలు చేయడంలో భద్రత ప్రశ్నార్థకంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది వినియోగదారులు ఆహారం వృథా అవ్వకుండా రాయితీపై భోజన సదుపాయాన్ని కల్పించే విధానాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే బెంగళూరుకు చెందిన ప్రోడక్ట్ మేనేజర్ భాను అనే నెటిజన్ ఈ ఫీచర్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి మరిన్ని నిబంధనలు అమలు చేయాలని కంపెనీకి సూచిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.validations1.should not be applicable to COD2.Cancellation should not be allowed if the delivery reaches 500 m to the delivery point 3.Chances of 2 idiots sharing meals ordering and cancelling at the same time getting a discount place 4.< two cancellations are allowed/ month.— Bhanu (@BhanuTasp) November 10, 2024ఇదీ చదవండి: ఏఐని ఎక్కువగా వాడుతున్నది మనమే..‘ఫుడ్ రెస్క్యూ ఫీచర్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లను మినహాయించాలి. డెలివరీ పార్ట్నర్ వినియోగదారుల లోకేషన్‌కు 500 మీటర్ల పరిధిలో ఉంటే కస్టమర్లు ఆర్డర్లను రద్దు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఓకే స్థానంలో ఉన్న ఇద్దరు వినియోగదారుల్లో ఒకరు ఫుడ్ బుక్ చేసి క్యాన్సిల్ చేసిన వెంటనే పక్కనే ఉన్న మరో కస్టమర్ దాన్ని రాయితీతో తిరిగి బుక్ చేసి ఇద్దరూ షేర్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరిన్ని నిబంధనలు తీసుకురావాలి. ఈ ఫీచర్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కంపెనీ ప్రతి కస్టమర్‌కు క్యాన్సిల్ చేసే ఆర్డర్లలో పరిమితులు విధించాలి. రోజుకు గరిష్ఠంగా రెండు ఆర్డర్లు మాత్రమే రద్దు చేసేందుకు వీలు కల్పించాలి’ అని నెటిజన్ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన జొమాటో సీఈఓ ఈ సూచనలు ఇప్పటికే కొత్త ఫీచర్లో చేర్చబడినట్లు చెప్పారు. నెటిజన్ సలహాలు, ఆలోచనలను మెచ్చుకుంటూ తన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ‘ఎవరు మీరు ఏమి చేస్తారు? మీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మనం కలిసి పని చేద్దాం’ అని పోస్ట్ చేశారు. -
తక్కువ ధరకు ఫుడ్.. జొమాటో కొత్త ఫీచర్
ఆహార వృధాను పూర్తిగా అరికట్టడానికి ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో పూనుకుంది. ఆర్డర్ క్యాన్సిల్ కారణంగా ఉత్పన్నమయ్యే ఆహార వృధా సమస్య పరిష్కారానికి ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు జొమాటో కోఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ ప్రకటించారు.కొత్త ఫీచర్ ద్వారా కస్టమర్లు ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన తర్వాత నిమిషాల వ్యవధిలో ఆ ఫుడ్‌ను తగ్గింపు ధరతో ఇతర కస్టమర్లు పొందవచ్చు. జొమాటోలో నెలకు సగటున దాదాపు 4 లక్షల ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయి. ఈ ఫుడ్ వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే ఈ కొత్త చొరవను ప్రారంభించేలా ప్రేరేపించింది."జొమాటోలో ఆర్డర్ క్యాన్సిల్‌ను ప్రోత్సహించము. ఎందుకంటే ఇది విపరీతమైన ఆహార వృధాకి దారి తీస్తుంది. కఠినమైన విధానాలు, క్యాన్సిల్ కోసం నో-రీఫండ్ పాలసీ ఉన్నప్పటికీ, పలు కారణాలతో కస్టమర్లు 4 లక్షలకు పైగా ఆర్డర్లు క్యాన్సిల్ చేస్తున్నారు" అని గోయల్ ఎక్స్‌లో (ట్విట్టర్) పోస్ట్ చేశారు.కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..ఒక కస్టమర్ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేసిన తర్వాత, ఆ ఆర్డర్‌ను తీసుకెళ్తున్న డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కస్టమర్లకు అది యాప్‌లో పాప్ అప్ అవుతుంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఈ ఫుడ్‌ను తక్కువ ధరకు తీసుకోవచ్చు. కొత్త కస్టమర్ చెల్లించిన మొత్తాన్ని ఆర్డర్ క్యాన్సిల్ చేసిన కస్టమర్‌కు, రెస్టారెంట్ పార్టనర్‌కు షేర్ చేస్తారు. ఇందులో జొమాటో ఎలాంటి ఆదాయాన్ని తీసుకోదు. అయితే, ఐస్‌క్రీమ్‌లు, షేక్‌లు, స్మూతీస్ వంటి కొన్ని పదార్థాలకు మాత్రం కొత్త ఫీచర్ వర్తించదు. ఆహార వృధా సమస్య పరిష్కారానికి చొరవ చూపిన జొమాటోకు, దీపిందర్ గోయల్‌కు నెటిజన్ల నుంచి ప్రశంసలు కురిశాయి. ఫుడ్ రెస్క్యూ అనేది గొప్ప చొరవ, వినూత్న ఆలోచన అంటూ పలువురు మెచ్చుకున్నారు.We don't encourage order cancellation at Zomato, because it leads to a tremendous amount of food wastage.Inspite of stringent policies, and and a no-refund policy for cancellations, more than 4 lakh perfectly good orders get canceled on Zomato, for various reasons by customers.… pic.twitter.com/fGFQQNgzGJ— Deepinder Goyal (@deepigoyal) November 10, 2024 -
పసితనంలో చక్కెరకు చెక్ పెడితే.. చక్కని ఆరోగ్యంq
మధుమేహం, రక్తపోటు రెండు జంట జబ్బులు ప్రస్తుతం మానవాళిని పట్టి పీడిస్తున్నాయి. వీటి బారినపడకుండా ఉండాలంటే చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార అలవాట్లు అలవరుచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిరుప్రాయం నుంచి తినే ఆహారం పట్ల నియంత్రణ ఉంటే పెద్దయ్యాక వ్యాధుల ముప్పు తగ్గుతుందని పలు అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో తొలి వెయ్యి రోజులు చిన్నారులకు అందించే ఆహారంలో చక్కెరను నియంత్రిస్తే పెద్దయ్యాక 35 శాతం టైప్–2 డయాబెటిస్, 25 శాతం రక్తపోటు ముప్పు తగ్గుతుందని అమెరికాలోని సౌత్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి జన్మనిచ్చాక, ఆ శిశువుకు రెండేళ్లు వచ్చే వరకు... అంటే వెయ్యి రోజుల పాటు చక్కెర తీసుకోవడాన్ని తగ్గిస్తే పెద్దయ్యాక రక్తపోటు, మధుమేహం ముప్పు గణనీయంగా తగ్గించవచ్చని నిర్ధారించారు. యూకే బయో బ్యాంక్‌లోని 1951 నుంచి 1956 మధ్య జన్మించిన 60 వేల మంది చిన్నారుల ఆరోగ్య వివరాలపై జరిపిన అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. రేషన్‌లో చక్కెర తీసుకున్న వారు, తీసుకోని వారు ఇలా రెండు వర్గాలుగా చిన్నారులను విభజించి అధ్యయనం నిర్వహించారు. ఈ నేపథ్యంలో చక్కెర తీసుకున్న వారితో పోలిస్తే తీసుకోని వారు యుక్త వయస్సులో దీర్ఘకాలిక జబ్బుల బారినపడే ప్రమాదం తక్కువగా ఉన్నట్టు తేలింది. – సాక్షి, అమరావతి -
'తుప్పా దోస విత్ చమ్మంతి పొడి' గురించి విన్నారా?
ఆహారప్రియులకు దోస అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దోసల్లో ఎన్నో రకాల వెరైటీలు చూసుంటారు. ఇటీవల పాకశాస్త్ర నిపుణులు కూడా తమ నైపుణ్యం అంతా వెలికి తీసి మరీ డిఫరెంట్ రుచులతో ఈ దోసలను అందిస్తున్నారు. అయితే ఇలాంటి దోస గురించి తెలిసే ఛాన్సే లేదు ఎందుకంటే..ఇది కర్ణాటకలోనే ఫేమస్. అంతేగాదు ఈ దోసకు ఎంతో చారిత్రక నేపథ్యం కూడా ఉంది. అదెంటో చూద్దామా..!.ఈ దోసను కూడా మనం తినే సాధారణ దోస మాదిరిగానే తయారు చేస్తారు కాకపోతే అందులో వేసే దినుసుల్లోనే కొంచెం మార్పులు ఉంటాయి. దీన్ని తగినంత అటుకులు, మొంతులు తప్పనిసరిగా జోడించి తయారు చేస్తారు. అయితే మరి ఏంటి 'తుప్పా' అంటే..కర్ణాటకలో 'తుప్పా' అంటే నెయ్యి అందుకని దీన్ని తుప్పా దోస అని పిలుస్తారు. మనం Ghee Dosa దోస ఇమ్మని ఆర్డర్ చేస్తాం కదా అలాంటిదే కాకపోతే కొద్ది తేడా ఉంటుందంతే.చారిత్రక నేపథ్యం..కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం..ఈ తుప్పా దోస కర్ణాటకలోని ఉడిపి పట్టణంలో ఉద్భవించిందని చెబుతుంటారు. చాళుక్య రాజు సోమేశ్వరుడు- III తన మానసోల్లాస పుస్తకంలో తుప్పా దోస వంటకాన్ని దోసక అని పిలుస్తారని రాశారు. క్రీస్తు శకం నుంచి తమిళనాడు ఆహార సంస్కృతిలో ఈ దోస భాగమని ఆ పుస్తకం పేర్కొంది. ఆఖరికి తమిళనాడు సంగం సాహిత్యంలో కూడా దీని ప్రస్తావన ఉండటం విశేషం. ఎలా చేస్తారంటే..తయారీ విధానం..ఇడ్లీ బియ్యం 2 కప్పులుపోహా(అటుకులు): 1 కప్పుఉరద్ పప్పు: ½ కప్పు ఉప్పు: 2 స్పూన్మెంతులు: ½ స్పూన్ పైన చెప్పిన పదార్థాలన్నీ సుమారు 5 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత మొత్తగా గ్రైండ్ చేసుకుని రాత్రంతా పులియబెట్టాలినివ్వాలి. ఆ తర్వాత దోసలుగా పెనం మీద వేసి.. బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. అంతే తుప్పా దోస రెడీ..!. అయితే దీన్ని నెయ్యితో దోరగా కాలుస్తారు. ఇక 'చమ్మంతి పొడి' అంటే తమిళంలో కొబ్బరి పొడి అని అర్థం. మనం కొబ్బరి చట్నీతో తింటే వాళ్లు దీన్ని కొబ్బరి పొడితో ఇష్టంగా తింటారట.(చదవండి: మనసుంటే మార్గం ఉంటుందంటే ఇదే..! వారానికి 90 గంటలు పనిచేస్తూ కూడా..) -
సెలబ్రిటీలు మెచ్చిన స్టార్
అమెరికాలో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి స్వదేశానికి తిరిగి వచ్చిన రేవంత్ హిమంత్సింగ్కా ఫుడ్ లేబుల్స్ చదవడం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి, ఆరోగ్య అక్షరాస్యతను మెరుగుపరచడానికి నడుం కట్టాడు. సర్టిఫైడ్ హెల్త్‌కోచ్ అయిన రేవంత్ జంక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాల గురించి ప్రచారం చేయాలనే లక్ష్యంతో అమెరికా నుంచి ఇండియాకు తిరిగివచ్చాడు. ఒకప్పుడు ఫైనాన్స్, హెల్త్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్...మొదలైన వాటికి సంబంధించి సెల్ఫ్–హెల్ఫ్ బుక్ ప్రచురించాడు. ఇందులో ప్యాకేజ్డ్ గూడ్స్ లేబుల్స్‌పై కూడా ఒక చాప్టర్ ఉంది. సోషల్ మీడియాలో రేవంత్ ఎలా పాపులర్ అయ్యాడు అనే విషయానికి వస్తే...పిల్లల హెల్త్–డ్రింక్ బోర్న్‌విటాపై ఒక వీడియో విడుదల చేశాడు. డ్రింక్‌లో చక్కెర మొత్తాన్ని ఈ వీడియో హైలైట్ చేస్తుంది ఇది సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పుణ్యమా అని రేవంత్ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయ్యాడు. ఆ తరువాత ‘ఫుడ్‌ఫార్మర్’ ట్యాగ్‌లైన్‌తో మ్యాగీ, మ్యాంగో జ్యూసెస్లాంటి ప్యాకేజ్డ్ కంటెంట్‌పై అవగాహన కలిగించడానికి మరిన్ని వీడియోలు చేశాడు. సెలబ్రిటీలు కూడా ఈ వీడియోలను షేర్ చేసేవారు.వివిధ వేదికలపై మాట్లాడే ఆహ్వానాలు రావడం, తరచూ పర్యటనలు చేయడం ఇబ్బందిగా మారడంతో కోల్కత్తా నుంచి ముంబైకి మకాం మార్చాడు హిమంత్సింగ్కా. పాఠశాలలో హెల్త్‌పై సబ్జెక్ట్ లేదు. వైద్యులతో కలిసి డయాబెటిస్, పీసీఓఎస్లాంటి సబ్జెక్ట్లపై కోర్సులు రూపొందించాలనుకుంటున్నాను. కోర్సుల ఫీజులను స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగించాలనుకుంటున్నాను. ప్రజలను ఆరోగ్య అక్షరాస్యులుగా మార్చాల్సిన అవసరం ఉంది’ అంటున్నాడు. ‘ఫుడ్‌ఫార్మర్’గా పాపులర్ అయిన రేవంత్ తాజాగా ‘ఫోర్బ్స్ ఇండియా టాప్ డిజిటల్ స్టార్స్–2024’ జాబితాలో చోటు సంపాదించాడు. View this post on Instagram A post shared by Revant Himatsingka (@foodpharmer)(చదవండి: -
నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!
ఈజీగా బరువు తగ్గడం అనేది లేటెస్ట్ హాట్ టాపిక్. అందుకే ఇన్‌ప్లూయెన్సర్లు, సెలబ్రిటీలు తమ వెయిట్ లాస్ జర్నీలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూఉంటారు. తాజాగా ఫిట్నెస్ ఇన్‌ప్లూయెన్సర్ రిధిశర్మ ఎలాంటి కఠినమైన డైట్ పాటించకుండానే విజయ వంతంగా 20 కిలోల బరువును తగ్గించుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.రిధి శర్మ అందించిన వివరాల ప్రకారం పీసీఓఏస్ సమస్యతో బాధపడుతున్నప్పటికీ, జిమ్‌కు వెళ్లకుండా, ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ తనబరువును గణనీయంగా తగ్గించుకుంది. రిధి శర్మ పాటించిన నిబంధనల్లో మరో ముఖ్యమైన అంశం ఇంట్లో తయారు చేసుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం. నో ఫాస్ట్‌ఫుడ్, ఇంటి ఫుడ్డే ముద్దుచక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంది. రోజూ నడవడం, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటి చక్కటి జీవనశైలి మార్పులపై దృష్టి పెట్టడం ద్వారా ఆమె దీనిని సాధించింది. అనవసరమైన క్యాలరీలు తీసుకోకుండా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారమే తీసుకుంది. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే టోఫు, పన్నీర్, సోయా, చిక్కుళ్ళు , గింజధాన్యాలు, తింటే శక్తిని పెంచుకోవడంతో కడుపు నిండిన భావన కలుగు తుందని రిధి శర్మ వివరించారు. View this post on Instagram A post shared by Ridhi Sharma | Fitness & Lifestyle (@getfitwithrid)>ఇంట్లోనే వ్యాయామంజిమ్ మెంబర్షిప్ కోసం ఖర్చు చేయడం మానేసిన శర్మ, వారాంతంలో మినహా ప్రతి రోజూ 30-40 నిమిషాల ఇంట్లోనే వ్యాయామాలు చేసింది. యోగా మ్యాట్, రెండు డంబెల్స్, రెసిస్టెన్స్ బ్యాండ్‌తో దీన్ని సాధించానని చెప్పారు. తన వ్యాయామంలో పైలేట్స్ (కండరాలకుబలంచేకూర్చే ఆసనాలు) స్ట్రెంత్ ట్రైనింగ్, పైలేట్స్ కూడా ఉండేవని తెలిపారు.కంటినిడా నిద్రప్రతీ రోజు 7 నుంచి 8 గంటలు చక్కటి నిద్ర ఉండేలా జాగ్రత్త పడిందట. ఇదే బరువు తగ్గే తన ప్రయాణంలో, రికవరీలో ఇది కీలకమైన పాత్ర పోషించిందని తెలిపింది. వాకింగ్ తన జర్నీలో పెద్ద గేమ్ ఛేంజర్ అని, రోజుకు 7 వేల నుంచి 10 వేల అడుగులు నడిచానని రిధి తెలిపింది. కేవలం కడుపు మాడ్చుకోవడం కాకుండా, శ్రద్ధగా వ్యాయామం చేసి ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటూ 20 కేజీల బరువు తగ్గినట్టు చెప్పింది రిధి.నోట్: బరువు తగ్గడం అనేది శరీర పరిస్థితులు, ఆరోగ్యం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఉపవాసం ఉండటం ఒఒక్కటే పరిష్కారం కాదు. కచ్చితంగా ఏదో ఒక వ్యాయామం చేయాలి. అందుకే బరువు తగ్గాలనుకుంటే, ఎందుకు బరువు పెరుగుతోందనే కారణాలను విశ్లేషించుకొని, నిపుణుల సలహా తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా బరువు తగ్గే ప్లాన్ చేసుకోవాలి. -
ట్రంప్ ఇష్టపడే భారతీయ వంటకాలివే..!
అగ్రరాజ్యాధిపతిగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు డొనాల్డ్ ట్రంప్. తన ప్రత్యర్థి, డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఓడించి ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ గెలుపుతో యావత్ ప్రపంచదృష్టిని ఆకర్షించారు ట్రంప్. ఈ నేపథ్యంలో ఆయన గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న హయాంలో భారత్‌లోని కొన్ని ప్రముఖ నగరాల్లో పర్యటించారు. ఎక్కువగా మాంసాహారమే ఇష్టపడే ట్రంప్ మన దేశంలోని ప్రధాన నగరాల్లోని శాకాహార రెసిపీలను చాలా ఇష్టంగా ఆస్వాదించారు. ఆయన ఇష్టంగా తిన్న వంటకాలేంటో చూద్దామా..!.ట్రంప్ తన భారత పర్యటనలో గుజరాత్, ఢిల్లీ, ఆగ్రాతో సహా మూడు ముఖ్యమైన నగరాలను సందర్శించారు. కూరగాయలంటేనే ఇష్టపడని ట్రంప్ కాశ్మీరీ కెహ్వా, నారింజతో చేసే పన్నాకోటా, బ్రోకలి, మొక్కజొన్న సమోసా, ఖామన్, నిమ్మ కొత్తిమీరతో చేసిన షోర్బా, పాలక్ చాట్, సాల్మన్ టిక్కా, ఆలూ టిక్కీ, అంజీర్ మలై కోఫ్తా, మష్రూమ్ కర్రీ తదితరాలను ఆస్వాదించారు. అలాగే మేతి కుల్చా, నాన్, తందూరీ రోటీలను ట్రై చేశారు. ఇక నాన్‌వెజ్‌లో మటన్ బిర్యానీ అంటే మహా ఇష్టంగా ఆరగించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అలాగే మన భారతీయ ఆతిథ్య సంప్రదాయానికి అనుగుణంగా భోజనం చివర్లో అందించే కాజు బర్ఫీ, హాజెల్‌నట్ యాపిల్, రబ్దీతో కూడిన మాల్పువా, ఫ్రూట్ సలాడ్స్‌ని కూడా ఇష్టంగా తిన్నారు ట్రంప్. ముఖ్యంగా మన దేశంలో యూఎస్ ప్రతినిధులకు తప్పనిసరిగా అందించే డార్జిలింగ్ టీ, ఇంగ్లీష్ టీ, లెమన్ టీ అస్సాం టీ వంటి వాటిని కూడా ఆస్వాదించినట్లు అధికారులు వెల్లడించారు. ఎలాగైన మనదేశంలోని వంటకాలు ఎప్పుడు కూరగాయల వైపు చూడని వాళ్లని కూడా ఓ సారి తిని చూద్దాం అనేలా నోరూరిస్తాయి కదూ..!(చదవండి: కమలా హారిస్ పాటించే ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..!) -
రెండోసారి అధ్యక్ష పీఠంపై డొనాల్డ్ ట్రంప్ : ఇష్టమైన డ్రింక్ ఇదే, క్యాన్ల కొద్దీ!
హోరా హోరీగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక గెలుపు సాధించారు. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించు కోవాలనుకున్న తన కలను సాకారం చేసుకున్నారు. 47వ అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక లాంఛనమే. దీంతో భారత్ సహా ప్రపంచదేశాలు ట్రంప్‌ను అభినందిస్తున్నాయి. మరోవైపు 78ఏళ్ల వయసులో అమెరికా అద్యక్షుడు కాబోతున్న ట్రంప్కిష్టమైన పదార్థాలేంటి, మద్యం తాగతాడా? టీ కాఫీలుతాగుతాడా అనేది నెట్టించ చర్చ మొదలంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు ఇష్టమైన ఫుడ్, వంటకాలేంటో ఒకసారి చూద్దాం.ఫాస్ట్ ఫుడ్ అంటే ప్రాణం ట్రంప్‌కు ఫాస్ట్ ఫుడ్ అభిమాని. అలాగే మీట్ లోఫ్ చాలా ఇష్టం. డైట్ కోక్, మెక్ డొనాల్డ్స్ ఫుడ్ అంటే మరీ ఇష్టం. ఇంకా బర్గర్ కింగ్, కెఎఫ్సీ సహా తో సహా ఫాస్ట్ ఫుడ్‌కి విపరీతమైన అభిమాని. ఈ విషయాన్ని దేశ విదేశాల పర్యటనల్లో ఆయన ఫాస్ట్‌ఫుడ్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే పంది మాంసాన్ని గుడ్లతో కలిపి తినడానికి ఇష్టపడతాడు. అంతేకాదు ఆయన రోజువారీ ఆహారంలోసాధారణంగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కంటే కూడా డిన్నర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.బ్రేక్‌ఫాస్ట్, లంచ్ , డిన్నర్ బేకన్ , గుడ్లు, తృణధాన్యాలు లేదా మెక్‌డొనాల్డ్స్ మెక్మఫిన్ తింటాడు. కాఫీ లేదా టీ అస్సలు తాగడు. గతంలో మాజీ ప్రచార నిర్వాహకుడు కోరీ లెవాండోస్కీ రాసిన లెట్ ట్రంప్ బి ట్రంప్ అనే పుస్తకం ప్రకారం ట్రంప్ పగటిపూట ఎక్కువగా తినడానికి ఇష్టపడడు. సాధారణంగా 14 నుండి 16 గంటలు తినకుండానే ఉంటాడు. ఎగ్ మెఫిన్స్ ఫిష్ శాండ్విచ్ చాక్లెట్ షాక్ అన్నా కూడా ఇష్టం.వ నిల్లా-ఫ్లేవర్ ఉన్న కీబ్లర్ వియన్నా ఫింగర్స్‌ను తింటారు.డైట్ కోక్ అంటే పిచ్చిమద్యానికి దూరంగాఉండే ట్రంప్ కి అత్యంత ఇష్టమైన పానీయం ఏదన్నా ఉందంటే అది డైట్ కోక్. రోజుకు సుమారు 12 క్యాన్ల డైట్ కోక్ తాగుతాడని చెబుతారు.. ఇక వెజ్ విషయానికి వస్తే ఆటూ చిప స్, లేస్ పొటాటో చిప్స్ ని ఆయన అధికంగా తింటారు. చెర్రీ తో పాటుగా వెనిల్లా ఐస్ క్రీం , చాక్లెట్ కేక్ ఆయనకు నచ్చిన ఆహారాల్లో భాగమే. -
కమలా హారిస్ పాటించే ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..!
యూఎస్ అధ్యక్ష రేసులో నిలిచిన.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆహార నియామాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఆమె అనుసరించే డైట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించేది. ఆమె పాక్షిక శాకాహారి లేదా రోజులో కొద్దిసేపు శాకాహారిగా ఉంటారు అని చెప్పొచ్చు. ఇదేం విచిత్రం అనుకోకండి. ఈ ప్రక్రియను 'ఫ్లెక్సిటేరియన్ డైట్' అని అంటారట. అసలేంటి ఈ డైట్..? ఇది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో సవివరంగా చూద్దామా..!.కమలా హారిస్ ఫ్లెక్సిటేరియన్ డైట్‌ను అనుసరిస్తారు. ఈ డైట్ శాకాహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాల తోపాటు మితంగా నాన్‌వెజ్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను అందించడంలో సహాయపడుతుంది. అందువల్లే ఈ డైట్‌ని "ఫ్లెక్సిబుల్" "వెజిటేరియన్" అనే పదాల కలయికతో ఫ్లెక్సిటేరియన్ డైట్‌గా పిలుస్తున్నారు.ఈ డైట్ విధానం..కమలా హారిస్ తరుచుగా శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెబుతుంటారు. అయితే కమలా సాయంత్రం ఆరుగంటలోపు మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఆ తర్వాత నాన్‌వెజ్ సంబంధిత పదార్థాలను తీసుకుంటారు. ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..?డైటీషియన్ డాన్ జాక్సన్ బ్లాట్నర్ ఈ ఫ్లెక్సిటేరియన్ డైట్‌ని రూపొందించారు. దీనిలో స్పష్టమైన నియమాలు లేదా సిఫార్సు చేసిన కేలరీలు, స్థూల పోషకాల సంఖ్యను కలిగి ఉండదు. ఇది కేవలం ఆహారం కంటే ఎక్కువ మన జీవనశైలినే ప్రతిబింబిస్తుంది. అంటే ఈ డైట్లో ఏం తీసుకుంటారంటే..నిపుణల అభిప్రాయం ప్రకారం..పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు తీసుకోవడంనాన్వెజ్ కంటే మితమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను చేర్చడంసౌకర్యవంతమైన పద్ధతిలో మితంగా నాన్‌వెజ్ తీసుకోవడంప్రాసెస్ చేసిన మాంసాలకు దూరంగా ఉండటంస్వీట్లను పరిమితం చేయడం తదితరాలు ఉంటాయి.ఆమె ఈ డైట్లో ఏం తీసుకుంటారంటే..ఉదయం టీలో తేనెను తీసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌గా బాదం పాలు, ఎండు ద్రాక్ష మాత్రమే తీసుకుంటారు. అంతేగాదు పలు ఇంటర్వ్యూలో బ్రేక్‌ఫాస్ట్ అస్సలు తీసుకోనని కేవలం బాదంపాల తోపాటు ఏదో ఒక డ్రైఫ్రూట్ తీసుకుంటానని చెప్పారు కూడా. అలా సాయంత్రంలోపు మొక్కల ఆధారిత ఆహారమే తీసుకోగా, రాత్రిపూట మితంగా నాన్‌వెజ్‌కి ప్రాధాన్యత ఇస్తారు.ఈ డైట్లో ఉండే ఆహారాలు..ప్రోటీన్లు - సోయాబీన్స్, టోఫు, టెంపే, కాయధాన్యాలుకార్బోహైడ్రేట్స్ లేని కూరగాయలు - బెల్ పెప్పర్స్, బ్రస్సెల్స్ మొలకలు, ఆకుపచ్చ బీన్స్, క్యారెట్లు, కాలీఫ్లవర్కార్బోహైడ్రేట్స్ ఉండే కూరగాయలు - వింటర్ స్క్వాష్, బఠానీలు, మొక్కజొన్న, చిలగడదుంపపండ్లు - యాపిల్స్, నారింజ, బెర్రీలు, ద్రాక్ష, చెర్రీస్తృణధాన్యాలు - క్వినోవా, టెఫ్, బుక్వీట్, ఫార్రోనట్స్: బాదం, అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్లు, జీడిపప్పు, పిస్తాపప్పులు, వేరుశెనగ వెన్న, అవకాడోలు, ఆలివ్‌లు, కొబ్బరిమొక్కల ఆధారిత పాలు - తియ్యని బాదం, కొబ్బరి, జనపనార, సోయా పాలుపానీయాలు - తగినన్ని నీళ్లు, టీ, కాఫీప్రయోజనాలు:ఫైబర్ తోపాటు ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయిగుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందిమధుమేహం నియంత్రణలో ఉంటుంది.కేన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గమనికి: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చిన కథనం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి అనుసరించడం మంచిది.(చదవండి: ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి ఫ్యాషన్ ఉపకరిస్తుందా?) -
నేటి నుంచి స్విగ్గీ ఐపీవో
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్‌కామర్స్ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ నేడు(6న) ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకి రూ. 371–390 ఆఫర్ ధరలో వస్తున్న ఇష్యూ శుక్రవారం(8న) ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ. 4,499 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 6,828 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. తద్వారా రూ. 11,327 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. వెరసి 11.3 బిలియన్ డాలర్ల(రూ. 95,000 కోట్లు) విలువను ఆశిస్తోంది. ఇప్పటికే (2021 జూలై) లిస్టయిన ప్రత్యర్ధి కంపెనీ జొమాటో విలువ ప్రస్తుతం రూ. 2.13 లక్షల కోట్లకు చేరింది.నిధుల వినియోగమిలా...2014లో ఏర్పాటైన స్విగ్గీ 2024 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 611 కోట్ల నష్టం ప్రకటించింది. ఈక్విటీ జారీ నిధులను టెక్నాలజీ, క్లౌడ్ ఇన్ఫ్రా, బ్రాండ్ మార్కెటింగ్, రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వినియోగించనుంది.ఆఫర్ ధర: రూ. 371–390 సమీకరణ: రూ. 11,327 కోట్లురిటైలర్లకు కనీస లాట్: 38 షేర్లు ఆఫర్ ముగింపు: శుక్రవారం (8న)షేర్ల అలాట్మెంట్: 11న లిస్టింగ్: 13న -
ఒంటికి మంచిదే..మరి పంటికి?
ఇటీవల ఆరోగ్య స్పృహ పెరగడంతో ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తూ అందులో భాగంగా పండ్లూ, పళ్లరసాలు తీసుకోవడం పెరిగింది. అయితే ఇది ఆరోగ్యానికి మంచేదేమోగానీ పంటికి హానికరంగా పరిణమించవచ్చు. అలా ఒంటికి మంచిదైనా, పంటికి హాని చేసేవేమిటో, ఆ హానిని ఎలా అధిగమించవచ్చో తెలుసుకుందాం. పండ్లు / పండ్ల రసాలతో... తాజా పండ్లు, పళ్ల రసాలూ ఆరోగ్యానికి మంచివే. కానీ అవే ఫ్రూట్జ్యూసుల వల్ల పంటికి హాని జరగవచ్చు. ఉదాహరణకు పళ్లరసాల్లోని ఎక్కువగా ఉండే చక్కెర మోతాదులు పళ్లను దెబ్బతీవయచ్చు. అలాగే ఒకింత పుల్లగా ఉండే పండ్లలోని యాసిడ్స్ వల్ల కూడా పళ్లు దెబ్బతింటాయి.ఈ సమస్య అధిగమించడానికి...పండ్లను జ్యూస్ రూపంలో తాగడం కంటే కొరికి తినడం మేలు. ఉదాహరణకు నారింజ/బత్తాయి పండ్లు కొరికి తిన్నప్పటికి కంటే చక్కెర కలిపి ఆరెంజ్‌జ్యూస్ రూపంలో తీసుకున్నప్పుడు పళ్లు పాడయ్యే అవకాశం ఎక్కువ. పళ్లు బలహీనంగా ఉన్నవారు జ్యూస్ తీసుకోవాలనుకున్నప్పుడు అందులో ఎట్టిపరిస్థితుల్లోనూ చక్కెర కలుపుకోవద్దు. జ్యూస్ తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి.దగ్గు మందులతో... దగ్గు మందు ఔషధమే అయినా అది కూడా ఫ్రూట్ జ్యూస్‌లాంటి ముప్పునే తెచ్చిపెడుతుంది. దగ్గు మందుల్లోని గాఢత చిక్కదనం), అందులో ఉండే చక్కెర మోతాదులు... అచ్చం జ్యూస్‌లాంటి ప్రభావాన్నే చూపుతాయి. దాంతో పళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమస్య అధిగమించడానికి...దగ్గు మందు తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. వేలితో నోరు శుభ్రమయ్యేలా కడుక్కోవాలి. దగ్గుమందు తాగిన ప్రతిసారీ ఇలా నోరు కడుక్కోవాలి. గుండెకు మేలు చేసే డార్క్ చాక్లెట్లతో... పరిమితంగా తీసుకునే డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయి. సాధారణంగా చాక్లెట్లు పళ్లకు చుట్టుకు΄ోయేలా కాస్త జిగురుగా / జారుడుగా ఉంటాయి. అలా చుట్టుకు΄ోవడం వల్ల అవి తమలోని చక్కెరను చాలాసేపు పంటిపైనే అంటిపెట్టుకునే ఉంటాయి. దాంతో పళ్ల ఎనామిల్ ΄పొర దెబ్బతినే అవకాశాల తోపాటు, పళ్లలో రంధ్రాలు (క్యావిటీలు) వచ్చే అవకాశాలెక్కువ. ఫలితంగా పిప్పిపళ్లు వస్తాయి. అలా దంతాలు దెబ్బతింటాయి.ఈ సమస్య అధిగమించడానికి...చాక్లెట్లు తిన్న తర్వాత ఆ జిగురంతా పోయేలా వేలితో లేదా టూత్ బ్రష్‌తో తేలిగ్గా బ్రష్ చేసుకోవాలి. నోరు పూర్తిగా శుభ్రమయ్యేలా పలుమార్లు నీళ్లతో పుక్కిలించాలి. (చదవండి: భారతీయలు-అమెరికన్లు: ఆహారపు అలవాట్లలో ఇంత వ్యత్యాసమా..?) -
ప్రీమియం రైళ్లలో ప్రత్యేకత ఇదే
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అందుకే వీటిని దేశానికి లైఫ్ లైన్ అని అంటారు. భారతీయ రైల్వేలు పేద తరగతికి అతి తక్కువ ఛార్జీలతో జనసాధారణ్ ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతుండగా, ధనికుల కోసం వందే భారత్ వంటి ప్రీమియం సెమీ-హై స్పీడ్ రైళ్లను కూడా నడుపుతున్నాయి. వీటిలోని కొన్ని రైళ్లలో ప్రయాణీకులు ఆహారం కోసం ప్రత్యేకంగా నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు.సాధారణంగా సుదూర రైళ్లలో మాత్రమే ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ సౌకర్యం ఉంటుంది. తక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ సౌకర్యం అందుబాటులో ఉండదు. అయితే దేశంలోని కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణికులకు ఉచిత ఆహారం అందిస్తారు. దీని కోసం విడిగా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ తదితర ప్రీమియం రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందిస్తారు. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల నుంచి వారు టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో ఆహారం కోసం ఛార్జీలు వసూలు చేస్తారు. అంటే ఈ రైళ్ల టిక్కెట్లలో ఆహారం ఖర్చు కూడా జతచేరి ఉంటుంది. ఇతర రైళ్లలో మాదిరిగా కాకుండా ఈ రైళ్లలో విడిగా ఆహారానికి డబ్బులు చెల్లించి కొనుగోలు చేయవలసిన అవసరం ఉండదు.ఇతర సాధారణ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణికుల నుంచి టిక్కెట్లతో పాటు ఆహారం కోసం ఎటువంటి ఛార్జీ విధించరు. అటువంటి పరిస్థితిలో ఈ సాధారణ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఆహారం కోసం విడిగా నగదు చెల్లించాల్సి ఉంటుంది. వందే భారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ది తదితర ప్రీమియం రైళ్లలో ఆహారం కోసం ప్రత్యేకంగా నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్ -
భారతీయలు-అమెరికన్లు: ఆహారపు అలవాట్లలో ఇంత వ్యత్యాసమా..?
భారతీయలు, అమెరికన్ల ఆహారపు అలవాట్లలో చాలా తేడాలు ఉంటాయని అందరికి తెలుసు. కానీ స్పష్టంగా ఇలా ఉంటాయని మాత్రం తెలియదు. అయితే ఇక్కడొక అమెరికా మహిళ ఆ విషయంలో ఇరు దేశాల ప్రజలకు ఎంత వ్యత్యాసం ఉందనేది చేసి చూపించింది. అది చూస్తే వామ్మో ఇంత తేడానా అని ఆశ్యర్యపోతారు. భారతదేశాన్ని సందర్శించే అమెరికన్లకు ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు వాళ్లకు వినోధభరితంగానూ, ఆశ్యర్యానికి గురి చేసే విధంగానూ ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయతను బట్టి భాష, సంప్రదాయాల్లో చాలా వైరుధ్యాలు అడగడుగున కనిపిస్తుంటాయి. ఇక భారతీయులు, అమెరికన్ల ఆహారపు అలవాట్లు, ఫ్లోర్‌ని తుడిచే విధానంతో సహా ఉండే వ్యత్యాసాల గురించి సవివరంగా తెలిపేలా వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ మహిళ పేరు క్రిస్టెన్ ఫిషర్. అమెరికా పౌరురాలు. 2017లో భారత్‌కు వచ్చి న్యూఢిల్లీ నివసిస్తున్నప్పుడు తనకెదురైనా అనుభవాన్ని ఇలా వీడియో రూపంలో చిత్రీకరించారు. ఆ వీడియోలో ముందుగా వంటకాల దగ్గర నుంచి మొదలుపెట్టింది. యూఎస్‌లో ఉప్పు మిరియాలను మసాలాగా ఉపయోగిస్తే..భారత్‌లో ఎండు మిర్చి కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాల, జీరా పొడి, నల్లమిరియాలు వంటివి ఉపయోగిస్తారు. ఇక భోజనం చేసే సమయాల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. యూఎస్‌లో డిన్నర్ టైం సాయంత్రం 5 గంటలకే ప్రారంభం కాగా, అదే భారత్‌లో రాత్రి పదిగంటల సమయంలో మొదలవ్వుతుంది. ఇక కాఫీ, టీలు తాగే విషయంలో కూడా చాలా వ్యత్యాసం ఉంది. అమెరికన్లు పెద్ద కప్పులలో కాఫీ తాగేందుకు ఇష్టపడగా, భారతీయులు చిన్న కప్పులలో చాయ్‌ని సిప్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఇక తినే విషయంలో కూడా తీరు వేరుగా ఉంటుంది ఇరు దేశాల ప్రజలకు. అమెరికన్లు ఫోర్క్‌ని ఉపయోగించగా, భారతీయులు చేతితో తినేందుకు ఇష్టపడతారని. అలాగే పిల్లలను అమెరికన్లు ఉయ్యాలలోనూ లేదా సెపరేట్ బెడ్‌పై పడుకోపెట్టగా..భారతీయుల మాత్రం తమ పక్కనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే ఇల్లుని తుడిచే విధానంలో భారతీయులు కాళ్లపై కూర్చొని క్లీన్ చేయగా వాళ్లు క్లీనింగ్ స్టిక్‌తో శుభ్రపరుస్తారంటూ.. చాలా అందంగా వివరించింది క్రిస్టెన్ వీడియోలో. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: దీపికా పదుకొణె బ్యూటీ రహస్యం..! ఇలా చేస్తే జస్ట్ మూడు నెలల్లో..) -
మయోన్నీస్తో ముప్పే..హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఇవిగో!
కలుషితమైన మయోన్నీస్ తెలంగాణాలో విషాదాన్ని నింపింది. ఒకరు మరణం, 15మంది అస్వస్థతకు దారి తీసిన ఉదంతంలో మయోన్నీస్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై తక్షణమే ఒక సంవత్సరం (2025 అక్టోబర్ వరకు) నిషేధం విధించింది. మయోన్నీస్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కంటే హాని జరిగే అవకాశాలే ఎక్కువ అంటున్నారు ఆహార నిపుణులు. ఈ నేపథ్యంలో మయోన్నీస్ లేదా ‘మాయో’కి ప్రత్యామ్నాయాలు ఏమిటో చూద్దాం రండి!క్రీమీ పాస్తా , ఫ్రెంచ్ ఫ్రైస్, సలాడ్లు, మోమోస్, సాండ్విచ్లు, బ్రెడ్ ఇలా జంక్‌ఫుడ్‌లలో ఈ క్రిమ్ను వేసుకొని రెడీమేడ్‌గా తినేస్తారు. అయితే రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్య పరంగా చాలా నష్టాలను తీసుకొస్తుంది. మరీ ముఖ్యంగా శుభ్రత, ఆహార ప్రమాణాలను సరిగ్గా పాటించకపోతే ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు తెస్తుంది.మయోన్నీస్ ఎలా తయారు చేస్తారు?మయోన్నీస్ లేదా మాయో క్రీమ్ లా ఉండే సాస్. గుడ్డులోని పచ్చసొనను నూనెతో ఎమల్సిఫై చేయడం ద్వారా తయారు చేస్తారు. దీంట్లో వెనిగర్, నిమ్మరసంకూడా కలుపుతారు.మాయోతో నష్టాలుమయోన్నీస్రోజు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇందులో క్యాలరీలు, కొవ్వు ఎక్కువ. దీన్ని అధికంగా తింటే ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ ఖాయం. మయోన్నీస్లో ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయి కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులొచ్చే ప్రమాదం కూడా ఉంది. తలనొప్పి, శరీరం బలహీనంగా అనిపించడం, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టేస్టీ అండ్ హెల్దీ ఆల్టర్నేటివ్స్ఆరోగ్యకరమైన, రుచికరమైన కొన్ని ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రోబయోటిక్స్‌లో పుష్కలంగా ఉండే చిక్కటి పెరుగుతో దీన్న తయారు చేసుకోవచ్చు. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవచ్చు. ఇది కడుపు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. ప్రోటీన్ , కాల్షియం, గొప్ప మూలం పెరుగు.క్రీమీ టేస్ట్ వచ్చేలా పెరుగుతో పాటు దోసకాయ, పుదీనా, నిమ్మ, వెల్లుల్లి, జీలకర్ర కలుపుకొని వాడుకోవచ్చు. పెరుగు, పుదీనాలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్నాయి. దోసకాయ, పుదీనాతో అజీర్తికి గుడ్ బై చెప్పవచ్చు. కమ్మటి చిక్కటి పెరుగులోవెల్లుల్లి, నిమ్మ కలుపుకోవచ్చు. వెల్లుల్లి గట్-ఫ్రెండ్లీ ప్రోబయోటిక్స్, రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే పెరుగులో వేయించిన జీలకర్ర పొడిని కలుపుకొని కూడా వాడవచ్చు. -
మోకాళ్లు నొప్పులా? ఎముక పుష్టికోసం ఇలా చేయండి!
వయసు నలభై దాటిందో లేదో చాలామందిలో కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనపడటం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. జీవన శైలి, ఆధునిక అలవాట్లతో పాటు, ఎండ ఎరగని ఉద్యోగాలు, యుక్తవయసు నుంచీ డైటింగ్ పేరుతో పోషకాహారం తీసుకోకపోవడంతో ఎముకలు బలహీన పడుతున్నాయి. ఫలితగా మోకాళ్ల నొప్పులు రికెట్స్ ,బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఇది పెద్ద వయసులో తూలి పడిపోవడం, కాళ్లు చేతులు, ప్రధానంగా తుంటి ఎముక విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. మరి ఎముకల గట్టిదనం కోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి.మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. అందుకే ఆరోగ్య కరమైన సమతుల్య ఆహారం చిన్న వయస్సు నుండే అలవాటు చేయాలి. ఇది జీవితాంతం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తు పెట్టుకోవాలి. పెద్దలకు రోజుకు 700మిల్లీగ్రాముల కాల్షియం అవసరం.మెనోపాజ్ఆడవారిలో మెనోపాజ్ తరువాత ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి ఈ విషయాన్ని మరింత అప్రమత్తంగా ఉండాలి. బహిష్టులు ఆగిపోయిన తరువాత ఈస్ట్రోజెన్ ఉత్పత్తి ఆగిపోవడంతో ఇది ఎముకలపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే కాల్షియం ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. శరీరం కాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డీ చాలా అవసరం. నిరంతరం వ్యాయామం చేయాలి. ముఖ్యంగా 40 దాటిన తరువాత కాళ్లు, చేతులు, కండరాలు, ఎముకలను పటిష్టం చేసే వ్యాయామాలను చేయాలి. మోకాళ్లు నొప్పులొచ్చిన తరువాత కచ్చితంగా నడక, యోగా తదితర తేలికపాటి వ్యాయామాలు చేయాల్సిందే. ఏదైనా ఎముకలకి సంబంధించి ఏదైనా సమస్యను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్స పొందాలి. నిపుణుల సలహా మేరకు సంబంధిత వ్యాయామాలను రెగ్యులర్‌గా చేయాలి. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు తీసుకోవాలి.చేపలు, గుడ్లు, పాలు, బాదం, మొలకెత్తిన ధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి. బలవర్థకమైన సోయా,నువ్వులతోపాటు విటమిన్ సి లభించే సిట్రస్‌పండ్లను తీసుకుంటే మంచిది. అలాగే విటమిన్ డి కోసం ఉదయం ఎండలో కొద్దిసేపు కూర్చోవాలి. తగినంత నిద్రపోవాలి. -
విదేశాల నుంచి కూడా స్విగ్గీలో ఆర్డర్లు
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసిస్తున్న వారు భారత్‌లో తమ వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు వీలుగా స్విగ్గీ కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ’ఇంటర్నేషనల్ లాగిన్’ను ప్రవేశపెట్టింది. అమెరికా, కెనడా, జర్మనీ, బ్రిటన్, కెనడా తదితర దేశాల్లో నివసిస్తునవారికి ఇది అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ యూజర్లు ఇక్కడి వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు, స్విగ్గీలో భాగమైన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టామార్ట్‌లో షాపింగ్ చేసేందుకు, డైన్అవుట్ ద్వారా హోటల్స్‌లో టేబుల్స్‌ను బుక్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్‌లు లేదా అందుబాటులో ఉన్న యూపీఐ ఆప్షన్ల ద్వారా చెల్లించవచ్చని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ తెలిపారు. -
ప్రపంచం చూపు.. పాకశాస్త్రం వైపు..
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) సహా యావత్ ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు పాకశాస్త్ర ప్రావీణ్యుల కోసం వెతుకుతోంది. వివిధ దేశాల ఆహార అలవాట్లు, వారికి ఆతిథ్యం ఇచ్చే విధానంపై నెటిజన్లు ఇంటర్నెట్ను జల్లెడ పడుతున్నారు. ప్రపంచ పర్యాటకం శరవేగంగా విస్తరిస్తుండటం, విభిన్నమైన ఫుడ్‌ను రుచి చూసేందుకు వారు ఇష్టపడుతుండటమే దీనికి కారణం. భారత్ సహా ప్రపంచ దేశాల పర్యాటకుల్లో 75 శాతం మంది తమ టూర్లలో ఆహారాన్ని కూడా ముఖ్యమైన అంశంగా భావిస్తున్నారు. ఏ దేశం వెళ్తున్నాం? అక్కడ దొరికే ఫుడ్ ఏమిటి? ఏయే వెరైటీలు దొరుకుతాయి? అనే అంశాలను ఇంటర్నెట్లో వెతుకుతున్నారు.దీనితో పాకశాస్త్రంలో చేయితిరిగిన వంటగాళ్లకు డిమాండ్ పెరిగింది. వరల్డ్ టూరిజంలో ఫుడ్ టెక్నాలజీ నిపుణుల అవసరం వచ్చే నాలుగేళ్లలో కనీసం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. 2023లో భారత్ పర్యాటక మార్కెట్ విలువ 23 బిలియన్ డాలర్లు ఉంది. ఇది 2033 నాటికి 182.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఫ్యూచర్ మార్కెట్ సంస్థ అంచనా వేసింది. ప్రపంచ పర్యాటక వెబ్సైట్ అగోడా, మరికొన్ని ట్రావెల్ సంస్థలు చేసిన పలు అధ్యయనాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అధ్యయనంలో భాగంగా.. భారత్, థాయిలాండ్, లావోస్, టర్కీతోపాటు మరికొన్ని దేశాల ప్రయాణికులను ఆహారం విషయమై ప్రశ్నించారు.నిపుణులకు భలే గిరాకీ..ఒక అంచనా ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో ఫుడ్ టెక్నాలజీ నిపుణులు 5 లక్షల వరకూ ఉంటారు. వారిలో చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు. నైపుణ్యాన్ని, మార్కెట్‌ను బట్టి వారికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ వేతనాలు అందుతున్నాయి. 2033 నాటికి ఈ వేతనాలు కనీసం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని అగోడా అధ్యయనం చెబుతోంది. పర్యాటకులు అనేక అంశాలతో కూడిన ఆహారాన్ని అడుగుతున్నారని.. రకరకాల న్యూట్రిషన్లు, ఆయిల్ లేకపోవడం, కొన్నిరకాల పదార్థాలు లేకుండా ఉండటం వంటి కోరుతున్నారని పేర్కొంటోంది.అందుకు అనుగుణంగా ఆహారాన్ని సిద్ధం చేస్తూనే.. రుచిలో, ఇతర అంశాల్లో తేడా రాకుండా చూసుకునే నిపుణులైన వంటగాళ్లకు డిమాండ్ పెరుగుతోందని తెలిపింది. అదే సమయంలో వివిధ దేశాలకు చెందిన వంటలను సిద్ధం చేయగలిగినవారికి ప్రాధాన్యం ఉంటోందని వెల్లడించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల సిలబస్ మారుతోందని తెలిపింది. అంతేకాదు.. మన దేశం నుంచి ఫుడ్ టెక్నాలజీ నిపుణులను వివిధ దేశాలకు పంపి అక్కడి ప్రత్యేకతలపై ఇంటర్న్‌షిప్ అందించాలనేది భారత టూరిజం, ఫుడ్ టెక్నాలజీల విభాగం ఆలోచన. తెలంగాణలో ఇప్పటికే 50కిపైగా ఫుడ్ టెక్నాలజీ కాలేజీలు ఉన్నాయి. అవన్నీ తగిన విధంగా సిలబస్ మార్పులకు సిద్ధమవుతున్నాయి.తెలంగాణ వారసత్వ వంటలపై ఆసక్తివారసత్వ వంటలకు గిరాకీ పెరిగింది. ఏఐ టెక్నాలజీ విస్తృతమయ్యాక ఈ తరహా అవగాహన పెరుగుతోంది. తెలంగాణ వంటల గురించి చాలా మంది వాకబు చేస్తున్నారు. – రాజీవ్ కాలే, హాలిడేస్ సంస్థ ప్రెసిడెంట్హైదరాబాదీ బిర్యానీకి యమ గిరాకీ..వరల్డ్ టూరిస్టులు ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే బాగా ఇష్టపడుతున్నారు. మారుతున్న అలవాట్లకు అనుగుణంగా దీని తయారీలోనూ మార్పులు కోరుతున్నారు. చాలా మంది బిర్యానీ కోసమే హైదరాబాద్‌ను ప్రయాణ జాబితాలో చేరుస్తున్నారు. – నందకుమార్, కార్పొరేట్ టూర్స్ సంస్థ ప్రెసిడెంట్ఏ అధ్యయనం ఏం చెబుతోంది?మారుతున్న ఆహార అలవాట్లు, పర్యాట కుల ప్రాధాన్యతలపై పలు సంస్థలు విభిన్న కోణాల్లో అధ్యయనాలు చేశాయి. ఆయా దేశాల్లో ఆర్థిక బలోపేతానికి ఫుడ్ టూరిజం దోహదపడుతోందని.. సంస్కృతి, సంప్రదాయాల మేళవింపు పెరుగు తోందని గుర్తించాయి. పలు ప్రధాన అధ్యయనాలను పరిశీలిస్తే..ప్రపంచవ్యాప్తంగా 95శాతం మంది ప్రయాణికులు సెలవుల్లో ప్రయాణించేందుకు, ఈ క్రమంలో తమను ఫుడ్ టూరిస్టులుగా చెప్పుకొనేందుకు ఇష్టపడుతున్నారు. మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుందని తెలుసుకునేందుకు కన్సల్టెన్సీలను కూడా సంప్రదిస్తున్నారు. – యూఎస్ ఆధారిత హాలిడే పోర్టల్ జెర్సీ ఐలాండ్ హాలిడేస్ప్రయా ణికుల్లో 53% మంది విదేశీ ప్రయా ణాలు, పర్యటనల్లో సరికొత్త ఆహారాన్ని కోరుకుంటున్నారు. కొత్త ప్రదేశాలను చూసి ఏవిధంగా ఎంజాయ్ చేస్తున్నారో.. తమ దేశంలో లేని కొత్త ఫుడ్‌ను తీసుకుని అదే తరహాలో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు. – ఫుడ్ ట్రావెల్ అసోసియేషన్ నివేదిక86శాతం మంది భారత్, శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేషియా ప్రయాణికులు స్థానిక వంటకాలను ఇష్టపడుతున్నారు. 78శాతం మంది ప్రజలు ఐకానిక్ వంటకాల వెనుక ఉన్న చరిత్ర, వారసత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. – బుకింగ్ డాట్ కామ్ నివేదిక -
మెక్ డొనాల్డ్స్ బర్గర్ లో బ్యాక్టీరియా
-
మరమరాల చాట్ అమ్ముతూ బ్రిటిష్ వ్యక్తి..!
మరమరాలతో చేసే చాట్ అంటే అబ్బా..! ఆ రుచి తలుచుకుంటేనే నోటిలో నీళ్లూరిపోతుంటాయి. ఆ టేస్ట్ వేరేలెవెల్. మన ఊర్లలోనే కాదు పట్టణాలో చిన్న బండిలపై ఈ మరమరాల చాట్‌ను అమ్ముతుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో తింటుంటే ఓ పక్క పుల్లగా.. కారంగా భలే రుచిగా ఉంటుంది. ఇదంతా ఎందుకంటే ఇలా మరమరాల చాట్‌ని మనవాళ్లు అమ్ముతుంటే పెద్ద ఫీల్ ఉండదె. అదే తెల్ల దొరలు అమ్మితే..కచ్చితంగా అవాక్కవుతాం కదా..!. నిజం అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక బ్రిటిష్ వ్యక్తి అచ్చం మన వాళ్లలా మరమరాల చాట్ అమ్ముతూ కనిపిస్తాడు. అచ్చం మనలానే ఓ గిన్నేలో మరమరాలు వేసుకుని ఉల్లిపాయలు, కొత్తిమీర, కీర దోస, కాస్త మసాలా చాట్ వేసి కలిపి..పేపర్ పొట్లంలో చుట్టి ఇవ్వడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది దగ్గర దగ్గరగా కోల్‌కతా స్టీట్ విక్రేతల మాదిరిగా అమ్ముతున్నాడు. అయితే ఈ ఘటన లండన్‌లో చోటు చేసుకుంది. అతడు అలా మన వాళ్లలా "ఝల్మురి ఎక్స్‌ప్రెస్" పేరుతో చిన్న బండిపై మరమరాల చాట్ అమ్ముతున్న విధానం చూస్తే భారత్‌లోనే ఉన్నామా..! అని షాక్ అవ్వుతాం. అందుకు సంబంధించిన వీడియోని ఒక ఫుడ్ వ్లాగర్ నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని 200 ఏళ్లు పాలించి చివరికి ఇలా అయిపోయారని చమత్కరిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ansh Rehan | London📍 (@explorewithrehans) (చదవండి: సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్: ఆ హెయిర్ ట్రీట్మెంట్లు వద్దు..!) -
పిరమిడ్‌పై పక్షుల వేట
వీధి శునకాలు ఆహారం కోసం ఊరంతా తిరుగుతాయి. కానీ ఒక వీధికుక్క ఏకంగా ఈజిప్ట్ పిరమిడ్నే ఎక్కేసింది. మార్షల్ మోషెర్ అనే అమెరికా పారా గ్లైడర్ ఈ ఉదంతాన్ని తన మొబైల్ కెమెరాలో బంధించాడు. ఆయన ఇటీవల తోటి పారాగ్లైడర్లతో కలిసి ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్ల మీదుగా సూర్యోదయ అందాలను చూసేందుకు బయల్దేరాడు. వినీలాకాశంలో చక్కర్లు కొడుతుండగా ఖఫ్రే పిరమిడ్ శిఖరంపై ఒక జీవి కనిపించింది. తొలుత దాన్ని పర్వత ప్రాంతాల్లో తిరిగే బుల్లి సింహంగా భావించారు. కానీ మొబైల్ కెమెరాను జూమ్ చేసి చూస్తే సాధారణ వీధి కుక్క అని అర్థమైంది. ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తయిన పిరమిడ్‌పై అదేం చేస్తోందబ్బా అని పరిశీలిసతఏ, పిరమిడ్ శిఖరాగ్రంపై వాలే పిట్టలను పట్టుకునేందుకు పరుగులు పెడుతూ కని్పంచింది. వీధి కుక్కులు ఇలా 130 మీటర్లకు పై చిలుకు ఎత్తుకు ఎక్కిరావడం అరుదు. దారి తప్పి వచి్చందేమో, కిందకు ఎలా వెళ్లాలో తెలీక పైనే తచ్చాడుతోందేమో అని వారు భావించారు. మర్నాడు దాన్ని కిందకు దించాలని నిర్ణయించుకున్నారు. అది పిరమిడ్‌పై తిరుగుతున్న వీడియోను మోషెర్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తే రాత్రికి రాత్రే కోట్ల మంది చూశారు. తీరా మర్నాడు వెళ్లి చూస్తే కుక్క పిరమిడ్‌పై లేదు! ఒక శునకం పిరమిడ్ పై నుంచి తాపీగా కిందకు దిగొస్తున్న వీడియోను మరో సాహస యాత్రికుడు తర్వాతి రోజే నెట్లో షేర్చేశాడు. దాంతో అదే ఇదని నిర్ధారణకు వచ్చారు. ఈ వీడియో చూసిన కొందరు ఈజిప్షియన్లు మాత్రం శునకాన్ని ఏదో అతీంద్రీయ శక్తి పైకి తీసుకెళ్లిందని కామెంట్లు చేశారు. ఈజిప్ట్ పురాణాల ప్రకారం ఆ ప్రాంతంలో అనూబిస్ అనే దైవం ఉండేది. మనిషి శరీరం, నక్క ముఖంతో ఉండే ఆ దేవున్ని శుభాలకు ప్రతిరూపంగా భావిస్తారు. – కైరో -
లేబుల్.. డేంజర్ బెల్ చదివితే ఉన్న మతి పోతుంది!
ప్యాకెట్ మీద సగం కోసిన ఆరెంజ్ పెద్ద అక్షరాలతో ‘సి విటమిన్స్ సమృద్ధితో’ అని ఉంటుంది. ‘మీరు ప్యాకెట్ వెనుక ఉన్న లేబుల్ చదవండి’ అంటాడు రేవంత్ హిమత్సింగ్కా. లేబుల్ మీద 0.9 పర్సెంట్ ఆరెంజ్ ఫ్రూట్ ΄పౌడర్ అని ఉంటుంది. అంటే ఒక శాతం ఆరెంజ్, మిగిలిన 99 శాతం కెమికల్. ‘లేబుల్ చదివితే మీరు ఆ విషాన్ని ఇంటికి తేరు’ అంటాడు ఈ హెల్త్ చాంపియన్స్ . ప్రపంచ ఆహార దినోత్సవం సురక్షితమైన ఆహారాన్ని కల్పించుకోమంటోంది. ‘దేశమా... లేబుల్ చదువు’ ఉద్యమం ఒక అవసరమైన చైతన్యం.‘గుర్తు పెట్టుకోండి. ఏది ఎక్కువ రోజులు ప్యాకెట్లో నిల్వ ఉంటుందో అది మనకు ఎక్కువ అపాయం కలిగిస్తుంది’ అంటాడు రేవంత్ హిమత్ సింగ్కా. అమెరికాలో చదువుకుని, మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తూ అవన్నీ వదులుకొని ఇండియాలో ఫుడ్ రెవల్యూషన్ తేవాలని వచ్చేసిన ఈ కోల్‌కతా కుర్రాడు బడాబడా కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. రావడం రావడమే ముందు బోర్నవిటా హెల్త్‌డ్రింక్ కాదని చేసిన వీడియో సంచలనం సృష్టించింది. కేంద్రప్రభుత్వం బోర్నవిటా యజమాని అయిన క్యాడ్‌బరీకి నోటీసు ఇచ్చి ఇకమీదట లేబుల్ మీద హెల్త్ డ్రింక్ అని వేయకూడదని చెప్పింది. ఆ మాట చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు... లేబుల్ చదివి ఉంటే మనకే తెలిసేది అంటాడు హిమత్ సింగ్కా. ఎందుకంటే 400 గ్రాముల బోర్నవిటాలో 50 గ్రాముల చక్కెర ఉంది. లిక్విడ్ గ్లూకోజ్ ఉంది. కృత్రిమ రంగులు ఉన్నాయి. నిల్వకారకాలైన రసాయనాలు ఉన్నాయి. ఇవన్నీ చూపి అతడు సంధించిన ప్రశ్నలకు గొప్ప స్పందన వచ్చింది. ప్రస్తుతం అతడు ప్యాకేజ్డ్ ఫుడ్ మీద చేస్తున్న వీడియోలు అతణ్ణి ఫుడ్ క్రూసేడర్ అని పిలిచేలా చేస్తున్నాయి.పదార్థం గుట్టు ప్యాకెట్ వెనుకకాలం చాలా మారింది. మన తాత, తండ్రులు అంగడికి వెళ్లి సరుకులు తెచ్చుకునేవారు. అవి కొన్నాళ్లకు పాడైపోయేవి. కాబట్టి అవసరమైనంత వరకే తెచ్చుకునేవారు. ఇప్పుడు మాల్, మార్ట్ల కల్చర్ వచ్చింది. ప్యాకేజ్డ్ ఫుడ్ అందుబాటులోకి వచ్చింది. వెళ్లి కొనుక్కొస్తే రెండు మూడు నెలలకు కూడా పాడుకావు. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్‌ను ‘ఎఫ్ఎంసిజి’ (ఫాస్ట్ మూవింగ్ కన్సూ్యమర్ గూడ్స్) అంటారు. వీటిలో కొన్ని ‘ఆరోగ్యకరమైనవి’గా, ‘ఆరోగ్యానికి మేలు చేసేవిగా’ చెప్పుకుని అమ్మకాలు పెంచుకోవాలని చూస్తాయి.‘లేబుల్ మీద చూస్తే అవి మీకు హాని చేసేవిగా తెలుస్తుంది’ అంటాడు హిమత్ సింగ్కా. ఇవాళ దేశానికి ‘కాన్షియస్ కాపిటలిజమ్’ కావాలనేది హిమత్ నినాదం. అంటే బాధ్యతాయుతమైన పెట్టుబడిదారీ వ్యవస్థ. ముఖ్యంగా ఆహార రంగంలో ఈ బాధ్యత మరింత ఎక్కువ ఉండాలంటాడు అతను. ఇవాళ మన దేశం ఏటా 50 వేల కోట్ల రూపాయల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. దీన్ని ప్యాకేజ్డ్ ఫుడ్‌లో విస్తారంగా ఉపయోగిస్తారు. ‘హార్డ్ ఎటాక్‌లకు పామాయిల్ కూడా ఒక కారణం’ అంటాడు హిమత్.ఇంగ్లిష్‌లో చిన్న అక్షరాల్లోమ్యాంగో జ్యూస్‌ల పేరుతో ఇవాళ ఫేమస్ అయిన రెండు మూడు బ్రాండ్ల లేబుల్స్ చదివితే వాటిలో 20 శాతానికి మించిన మ్యాంగో పల్ప్ లేదని ఆ కంపెనీలే చెప్పడం కనిపిస్తుంది. వైట్ బ్రెడ్ కాదని బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నవాళ్లు లేబుల్ మీద చూస్తే కలర్ వల్ల మాత్రమే అది బ్రౌన్ కాని, వాస్తవానికి అది మైదాపిండి అని తెలుసుకుంటారు. కంపెనీ ఆ మాట చెప్తుందికానీ చిన్న అక్షరాల్లో, ఇంగ్లిష్‌లో చెబుతుంది. పీనట్ బటర్లోప్రోటీన్ సమృద్ధిగా ఉంటుందని యాడ్స్ చెబుతాయి. కాని పీనట్ బటర్లో క్యాలరీలు తప్ప ప్రోటీన్ 3 శాతానికి మించి ఉండదు.మన దేశంలో ఒకలా విదేశాల్లో ఒకలాఒకే వ్యాపార సంస్థ మన దేశంలో చిప్స్‌కు నాసిరకం నూనె, యూరప్‌లో నాణ్యతగల నూనె వాడుతుంది. ఎందుకంటే యూరప్‌లో నియమాలు కఠినంగా ఉంటాయి. అలాగే రెండేళ్ల లోపు పిల్లలకు అమ్మే సెరియల్స్‌లో మనదేశంలో యాడెడ్ సుగర్స్ ఉంటాయి. యూరప్‌లో ఉండవు. రెండేళ్లలోపు పిల్లలకు యాడెడ్ సుగర్స్ ఉన్న ఆహారం అంత మంచిది కాదు. తీపికి అడిక్ట్ అయిన పిల్లలు ఇంట్లో ఆరోగ్యకరమైనది పెట్టినా తినరు. అదీ కంపెనీల ఎత్తుగడ. డబ్బా ఆహారం తినే పసికందులు తర్వాతి కాలంలో స్థూలకాయం, డయబెటిస్‌తో బాధ పడే అవకాశం ఉంటుంది. ‘మా డ్రింక్ రోజూ తాగితే ΄÷డవు పెరుగుతారు’, ‘మా నూనె వాడితే గుండెకు మంచిది’... ఇలాంటివి ఏవీ నమ్మొద్దు అంటాడు హిమత్.దేశమా.. లేబుల్ చదువు...‘మీరు ఏ వస్తువు కొన్నా దాని వెనుక ఉన్న లేబుల్ చదవండి. చెడ్డ పదార్థాలు ఉంటే నాణ్యంగా తయారు చేయమని గొంతు విప్పండి. మనం ఏకమైతే సంస్థలు మారి మంచి ఉత్పత్తులు అందిస్తాయి. మన ఆరోగ్యాలు మెరుగు పడతాయి. అలాగే ప్రకటనలతో సంబంధం లేకుండా కొన్ని కంపెనీలు నాణ్యమైన పదార్థాలు అందిస్తున్నాయి. వాటిని గుర్తించి కొనడం కూడా మన పనే’ అంటాడతను. ఇవాళ ‘వరల్డ్ ఫుడ్ డే’. ‘బలవర్థకమైన, సురక్షితమైన ఆహారం ప్రతి ఒక్కరి హక్కు’. కాని మోసాన్ని గుర్తించడంలో మనమే వెనుక ఉంటే నష్టం మనకే కదా. ‘లేబుల్ పఢేగా ఇండియా’. ఇండియా.. లేబుల్ చదువు.కోర్టు కేసులు ఎదుర్కొంటూప్యాకేజ్డ్ ఫుడ్లోని మోసాలను బయట పెడుతున్నందుకు పెద్ద పెద్ద సంస్థలు హిమత్ మీద కత్తి కట్టాయి. కోర్టుకు ఈడ్చాయి. మొదట్లో భయపడినా ఇప్పుడు లెక్క చేయడం లేదు. ‘నన్ను కోర్టుకు లాగితే మిమ్మల్ని బజారుకు లాగుతా’ అంటున్నాడు హిమత్. కొన్ని కంపెనీలు రకరకాల చోట్ల కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నాయి. అంటే తన ఊరి నుంచి కాకుండా వేరే ఊళ్లకు అతడు వాయిదాకు హాజరు కావాలి.