More than half of Delhi’s assembly seats are dominated by migrants from other states న్యూఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఐతే ఈ ఎన్నికల జాబితాలో ఢిల్లీ లేనప్పటికీ అక్కడ ఎన్నికల జాతర జరుగుతోంది. ఢిల్లీ నలుమూలలా పోస్టర్లు వెలిశాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పోస్టర్లు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి.
ఢిల్లీలో ఎన్నికల జాతర.. ఆ మూడు రాష్ట్రాల వలసదారుల ఓట్లే కీలకం
కాగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు 2022 జరగనున్నవిషయం తెలిసిందే. ఐతే వీటిలో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన పోస్టర్లు రాజధాని ఢిల్లీలో ఎక్కపడితే అక్కడ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వాలు చేస్తున్న పనులు ఏకరువు పెడుతున్న పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఐతే ఢిల్లీలో మొత్తం 70 విధానసభలు ఉన్నాయి. ఇక్కడ అధిక శాతం ప్రజలు యుపీ, బీహార్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాకు చెందిన వలసదారులు ఉంటున్నారు. అందువల్ల ఈ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఢిల్లీలోని వలసవాసుల దృష్టిని ఏదో ఒక విధంగా ఆకర్షించేందుకు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 27 స్థానాల్లో మెజార్టీ ప్రజలు పూర్వాంచలికి చెందిన వారే ఉన్నారని సమాచారం. అందుకేనేమో యోగి ప్రభుత్వం ఢిల్లీలో పోస్టర్లు వేసి అక్కడి వలసదారుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది.
ప్రజలవద్దకే పోస్టర్లు
అలాగే ఢిల్లీ, వికాస్పురి, రాజౌరీ గార్డెన్, హరి నగర్, తిలక్ నగర్, జనక్‌పురి, మోతీ నగర్, రాజేంద్ర నగర్, గ్రేటర్ కైలాష్, జంగ్‌పురా, గాంధీ నగర్, మోడల్ టౌన్, లక్ష్మీ నగర్, రోహిణిలోని 13 స్థానాల్లో పంజాబీ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల చన్నీ ప్రభుత్వం ఇక్కడ పోస్టర్లు వేసి పంజాబీలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఢిల్లీలో కొండ ప్రాంత వలసదారుల సంఖ్య దాదాపు 30 లక్షలు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సీఎం ధామి పోస్టర్ల ద్వారా బీజేపీ ప్రచారం సాగిస్తోంది.
కాగా ఢిల్లీ అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారులే ఆధికం. ఈ కారణంగానే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పోస్టర్లు ద్వారా ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నాయి.
చదవండి: మోదీ Vs దీదీ: ప్రధానిపై మమత అసహనం.. మళ్లీ రాజుకున్న రాజకీయ రగడ!
Comments
Please login to add a commentAdd a comment