CM Yogi Adityanath
-
Mahakumbh: ప్రధాని బాటలో సీఎం.. పారిశుద్ధ్య కార్యికుల కాళ్లు కడిగి..
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా(Kumbh Mela)కు భక్తులు విపరీతంగా తరలివస్తున్నారు. జనవరి 13 నుంచి ఇప్పటివరకూ అంటే ఫిబ్రవరి 23 వరకూ మొత్తం 62 కోట్లకుపైగా జనం త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇన్ని కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజల మౌలిక సదుపాయాలు, పరిశుభ్రతపై దృష్టి సారించారు. ఈ నేపధ్యంలోనే గత నెలన్నర రోజులుగా కుంభమేళా ప్రాంతంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్న సిబ్బందిని సీఎం సత్కరించనున్నారు.కుంభమేళా ప్రాంతంలో పరిశుభ్రతా కార్యక్రమాలు(Sanitation) నిర్వహిస్తున్న సిబ్బంది సేవలను సీఎం కొనియాడారు. అలానే వారిని సన్మానించనున్నామని తెలిపారు. ఆయన త్రివేణీ సంగమ ప్రాంతంలో తిరుగాడుతూ స్వయంగా అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మహాకుంభమేళా ముగిసేందుకు ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలివుంది. మహాశిరాత్రి రోజున భక్తులు కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు చేయనున్నారు. గడచిన నాలుగు రోజులుగా కుంభమేళా ప్రాంతానికి వస్తున్న సీఎం అక్కడి సాధువులను, అధికారులను కలుసుకుంటున్నారు. కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు పూర్తియిన మర్నాడు అంటే ఫిబ్రవరి 27న సీఎం యోగి మరోమారు ప్రయాగ్‌రాజ్ రానున్నారు. ఆరోజున ఆయన కుంభమేళాకు తరలివచ్చిన భక్తులకు సేవలు అందించిన వారిని సన్మానించనున్నారు. ముఖ్యంగా పారిశుధ్య కార్మికులను, పడవలు నడిపినవారిని సీఎం సత్కరించనున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు(sanitation workers) సమాజంలో తగిన గౌరవ కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గతంలో ప్రధాని మోదీ వారణాసిలో పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగి, సమాజంలో వారి స్థానాన్ని గుర్తుచేశారు.ఇది కూడా చదవండి: విద్యార్థులకు పరీక్షలున్నాయని.. ప్రధాని మోదీ ఏం చేశారంటే.. -
Mahakumbh: ముఖ్యమంత్రి యోగి మరో రికార్డు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా(Mahakumbh) అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఫిబ్రవరి 26(శివరాత్రి)తో కుంభమేళా ముగియనుంది. ఈ నేపధ్యంలో భక్తులు త్రివేణీ సంగమానికి భారీగా తరలివస్తున్నారు. దీంతో ఎటువంటి తొక్కిసలాట ఘటనలు లాంటివి చోటుచేసుకుండా ఉండేందుకు యూపీ సీఎం స్వయంగా కుంభమేళాను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన అరుదైన రికార్డును కూడా నెలకొల్పారు.జనవరిలో కుంభమేళా ప్రారంభం కావడానికి ముందు నుంచి ఫిబ్రవరి 22 వరకు గడచిన 45 రోజుల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Chief Minister Yogi Adityanath) 12 సార్లు కుంభమేళాను సందర్శించారు. దీంతో అత్యధికంగా కుంభమేళాను సందర్శించిన సీఎంగా చరిత్ర సృష్టించారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి మహా కుంభమేళా 1954లో జనవరి 14 నుండి మార్చి 3 వరకు జరిగింది. ఆ సమయంలో నాటి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ రెండుమూడు సార్లు సంగమ స్థలికి వచ్చి పరిస్థితులను పర్యవేక్షించారు. ఆ తరువాత మరే ముఖ్యమంత్రీ కుంభమేళాను పదేపదే సందర్శించలేదు.సీఎం యోగి కుంభమేళా సందర్శనలుజనవరి 09: 13 అఖాడాలు, దండిబారా, ఖాక్ చౌక్ మహాసభల శిబిరాలను సీఎం యోగి సందర్శించారు. డిజిటల్ మీడియా సెంటర్‌ను ప్రారంభించారు.జనవరి 10: ప్రసార భారతి ఛానల్ కుంభవాణిని ప్రారంభించి, రవాణా సంస్థ బస్సులకు పచ్చజెండా ఊపారు.జనవరి 19: పూజ్య శంకరాచార్య తదితర సాధువులతో సమావేశమయ్యారు. పోలీసు గ్యాలరీ, రాజ్యాంగ గ్యాలరీ, పర్యాటక గ్యాలరీలను ప్రారంభించారు.జనవరి 22: మంత్రివర్గంతో పవిత్ర సంగమ స్నానం చేశారు.జనవరి 25: గురు గోరక్షనాథ్ అఖారాలో, విశ్వ హిందూ పరిషత్(Vishwa Hindu Parishad) సమావేశంలో పన్నెండు శాఖల యోగి మహాసభలో అవధూత వేషధారణలో కనిపించారు.జనవరి 27: హోంమంత్రి అమిత్ షాను స్వాగతించారు. త్రివేణి సంగమంలో పూజలు చేశారు.ఫిబ్రవరి 01: భారత్ సేవాశ్రమ శిబిరాన్ని సందర్శించారు. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. ప్రపంచంలోని 73 దేశాల దౌత్యవేత్తలతో సంభాషించారు.ఫిబ్రవరి 04: బౌద్ధ మహా కుంభ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూటాన్ రాజుకు స్వాగతం పలికారు.ఫిబ్రవరి 05: ప్రధాని మోదీకి స్వాగతం పలికి, త్రివేణి సంగమంలో పూజలు చేశారు.ఫిబ్రవరి 10: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు.ఫిబ్రవరి 16: ప్రదీప్ మిశ్రా కథాశ్రవణం, ప్రభు ప్రేమి సంఘ్ శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఫిబ్రవరి 22: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు స్వాగతం పలికారు. మహాశివరాత్రి సన్నాహాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు (ఆదివారం) మరోమారు మహాకుంభ్ నగర్ కు రానున్నారు. గత అక్టోబర్‌లో మహా కుంభ్ లోగో విడుదలైన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్ రావడం ఇది 18వ సారి అవుతుంది.ఇది కూడా చదవండి: బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ.. -
‘మహాకుంభ్’ ఖర్చెంత? లాభమెంత?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని సంగమ తీరంలో నిర్వహిస్తున్న కుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వానికి పలు సవాళ్లు సంధిస్తున్నారు. వీటికి సీఎం యోగి ఆదిత్యనాథ్ సమాధానమిచ్చారు. మహాకుంభమేళా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని, కోట్లాదిమంది తరలివస్తున్నారని, ఈ నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్, కాశీ, అయోధ్యలను కూడా దర్శిస్తున్నారని సీఎం పేర్కొన్నారు.‘యువ పారిశ్రామికవేత్తలతో సంభాషణ’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ మహాకుంభమేళాపై విమర్శలు గుప్పిస్తున్నవారు.. ఈ భారీ కార్యక్రమం కారణంగా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతున్నదని గ్రహించాలన్నారు. మహాకుంభమేళా నిర్వహణకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా రూ. 7,500 కోట్లు ఖర్చు చేస్తున్నాయని, ఫలితంగా రాష్ట్రానికి మూడు లక్షల కోట్లకుపైగా ఆదాయం రానున్నదనే అంచనాలున్నాయన్నారు.కుంభమేళా సందర్భంగా అయోధ్య, ప్రయాగ్‌రాజ్, కాశీ, చిత్రకూట్, గోరఖ్‌పూర్, నైమిశారణ్యంలో పలు వసతులు కల్పించామని సీఎం అన్నారు. ఒక్క ఏడాదిలో అయోధ్యకు కానుకలు, విరాళాల రూపంలో రూ. 700 కోట్లు సమకూరాయన్నారు. మహాకుంభమేళాలో ఫిబ్రవరి 17 నాటికి మొత్తం రూ.54 కోట్ల 31 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారన్నారు. మహాకుంభమేళా ఫిబ్రవరి 26(శివరాత్రి) వరకూ కొనసాగనుంది. ఇది కూడా చదవండి: Railway Station Stampede: రద్దీ నియంత్రణకు మూడు విధానాలు -
మహా కుంభ్‌కి 2 కోట్ల మంది
ప్రయాగ్‌రాజ్: మహా కుంభ మేళాలో మాఘి పూర్ణిమను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి సుమారు 2 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. జనవరి 29వ తేదీన పుణ్య స్నానాల సమయంలో చోటుచేసుకున్న విషాదం నేపథ్యంలో ఈసారి ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేశామని తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉదయం 4 గంటల నుంచే లక్నోలోని తన నివాసంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారని వివరించింది. త్రివేణీ సంగమంతోపాటు ఇతర ఘాట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని తెలిపింది. హెలికాప్టర్ ద్వారా భక్తులపై పూలవాన కురిపించామంది. మాఘి పూర్ణిమ స్నానంతో నెలపాటు కఠోర దీక్షలు చేసిన కల్పవాసీలు సుమారు 10 లక్షల మంది మహాకుంభ్‌ను వీడి వెళ్లనున్నారు. ట్రాఫిక్ నిబంధనలను అనుసరిస్తూ, నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాలను ఉపయోగించుకోవాలని వీరికి సూచించింది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు కుంభ్ ఎస్ఎస్పీ రాజేశ్ ద్వివేదీ చెప్పారు. ఆపరేషన్ చతుర్భుజ్లో భాగంగా 2,750 హైటెక్ కెమెరాలు, డ్రోన్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఉపయోగించుకుని 24 గంటలూ నిఘా కొనసాగించినట్లు వివరించారు. మహాకుంభ్ ప్రాంతాన్ని మంగళవారం 4 గంటల నుంచే నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్‌రాజ్ నగరాన్ని సైతం నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. ఇందులో అత్యవసర, ఎమెర్జెన్సీ సేవలకు మాత్రం మినహాయింపు కల్పించారు. పబ్లిక్, ప్రైవేట్ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించారు. అన్ని టోల్‌ప్లాజాల వద్ద రాకపోకలను క్రమబద్ధీకరించారు. భక్తుల కోసం ప్రతి 10 నిమిషాలకొకటి చొప్పున అదనంగా 1,200 బస్సులను అందుబాటులోకి తెచ్చారు. 26వ తేదీ వరకు కొనసాగే మహాకుంభ్‌లో చిట్టచివరి అమృత్ స్నాన ఘట్టం మహాశివరాత్రి రోజున ఉంటుంది.పలువురు ప్రముఖుల రాకమాఘి పూర్ణిమ సందర్భంగా బుధవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, తల్లి కోకిలా బెన్, కుమారులు, కోడళ్లు, మనవడు, మనవరాలు తదితరులతో కలిసి త్రివేణీ సంగమంలో స్నానాలు చేశారు. అదేవిధంగా, దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే, ఆయన భార్య పుణ్యస్నానాలు చేశారు. వీఐపీ ప్రొటోకాల్స్‌ను బుధవారం నిలిపివేయడంతో కుంబ్లే దంపతులు మిగతా భక్తుల మాదిరిగానే పడవలో త్రివేణీ సంగమానికి పడవలో చేరుకుని, పూజలు చేశారు. -
Mahakumbh: మాఘ పూర్ణిమకు సన్నాహాలు.. క్రౌడ్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి
మహాకుంభమేళాకు నేడు (మంగళవారం) 30వ రోజు. ఈ రోజు ఉదయం 8 గంటల సమయానికి మొత్తం 49.68 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. ప్రస్తుతం త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు భక్తుల బారులు తీరారు. ఫిబ్రవరి 12న వచ్చే మాఘపౌర్ణమి పుణ్య స్నానాలకు అధికారులు పకడందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రయాగ్‌రాజ్‌లో నూతన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నారు. #WATCH प्रयागराज: त्रिवेणी संगम पर पवित्र डुबकी लगाने के लिए महाकुंभ मेला क्षेत्र में श्रद्धालुओं की भारी भीड़ पहुंची।#MahaKumbh2025 pic.twitter.com/Qp7OYkvCVA— ANI_HindiNews (@AHindinews) February 11, 2025ఫిబ్రవరి 10 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఈ నిబంధనలను అమలులోకి తీసుకువచ్చారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 13 రాత్రి 8 గంటల వరకూ కుంభమేళాకు ఎటువంటి వాహనాలనూ అనుమతించరు. కేవలం కుంభమేళాలో విధులు నిర్వహించే అధికారులు, వైద్య సిబ్బందికి సంబంధించిన వాహనాలను మాత్రమే ప్రయాగ్‌రాజ్‌లోకి అనుమతించనున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మహాకుంభమేళాపై అధికారులతో సమీక్ష జరిపారు. మాఘపౌర్ణిమ నాడు ట్రాఫిక్ నియంత్రణ, క్రౌడ్ మేనేజిమెంట్‌ను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.సంగమానికి ఎలా వెళ్లాలి?సంగమం చేరుకోవడానికి నడక మార్గం: భక్తులు జీటీ జవహర్ మార్గ్ నుండి త్రివేణీ సంగమానికి చేరుకోవచ్చు. ఈ నడకమార్గంలో భక్తులు కాళీ రాంప్, సంగమం అప్పర్ రోడ్ ద్వారా త్రివేణీ సంగమానికి రావాల్సివుంటుంది.తిరుగు నడక మార్గం: సంగమం ప్రాంతం నుండి అక్షయవత్ మార్గ్ మీదుగా తిరుగు మార్గంలో నడచివెళ్లాల్సివుంటుంది.#WATCH प्रयागराज, उत्तर प्रदेश: #MahaKumbh2025 के दौरान श्रद्धालु त्रिवेणी संगम घाट पर पावन स्नान के लिए पहुंच रहे हैं।वीडियो ड्रोन से ली गई है। pic.twitter.com/mXgJqnT7lg— ANI_HindiNews (@AHindinews) February 11, 2025అధికారులకు సీఎం ఆదిత్యనాథ్ సూచనలుమహా కుంభమేళాకు సంబంధించి అధికారులతో సీఎం యోగి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు.1.మహా కుంభ్ మార్గ్‌లో ట్రాఫిక్ ఎక్కడా ఆగకూడదు. పార్కింగ్ స్థలాలను సక్రమంగా నిర్వహించాలి.2 ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు అన్ని దిశల నుండి వస్తున్నందున రోడ్లపై వాహనాల క్యూలు ఉండకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలి.3. మాఘ పూర్ణిమ నాడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వసంత పంచమి నాడు అమలు చేసిన వ్యవస్థలను తిరిగి అమలు చేయాలి.4. పిల్లలు, వృద్ధులు, మహిళల భద్రత విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పార్కింగ్ ప్రాంతం నుండి జాతర ప్రాంగణానికి షటిల్ బస్సుల సంఖ్యను పెంచాలి.5. అనుమతి లేకుండా ఏ వాహనాన్ని కూడా కుంభమేళా జరిగే ప్రాంగణంలోకి అనుమతించకూడదు.6. ప్రతి భక్తుడిని వారి ఇంటికి సురక్షితంగా చేర్చడమనేది అధికారుల బాధ్యత.7. మహాకుంభ్ ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలి. ఉత్సవం జరుగుతున్న ప్రాంతాలన్నింటినీ క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలి.8 ప్రయాగ్‌రాజ్‌కు ఆనుకుని ఉన్న జిల్లాల అధికారులు ప్రయాగ్‌రాజ్ అధికారులతో నిరంతరం టచ్‌లో ఉండాలి. వాహనాల కదలికలను పరస్పర సమన్వయంతో పర్యవేక్షిస్తుండాలి.9. ప్రయాగ్‌రాజ్‌లోని ఏ రైల్వే స్టేషన్లోనూ అధిక జనసమూహం గుమిగూడకుండా చూసుకోవాలి. స్పెషల్ రైళ్లు, అదనపు బస్సులను నడపాలని సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. ఇది కూడా చదవండి: ‘అద్భుత స్వాగతం’.. పారిస్ నుంచి ప్రధాని మోదీ వీడియో -
Mahakumbh: అఖాడాల అమృతస్నానం.. హెలికాప్టర్ నుంచి పూల వర్షం.. వార్ రూమ్‌లో సీఎం యోగి
యూపీలో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు(సోమవారం) వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు సాయంత్రం నాటికి ఐదు కోట్లకు పైగా భక్తులు స్నానాలు ఆచరిస్తారని కుంభమేళా నిర్వాహకులు అంచనా వేశారు. జనసమూహాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. వసంత పంచమి అమృత స్నానాల సందర్బంగా భక్తులపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘వార్ రూమ్’లో కూర్చుని, కుంభమేళా పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తున్నారు. #WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP: A woman devotee blows the conch shell at Sangam Ghat as saints and devotees gather for Amrit Snan on the occasion of Basant Panchami. pic.twitter.com/vXlIqmiVun— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్‌రాజ్‌లో వసంత పంచమి సందర్భంగా అమృత స్నానానికి సిద్ధమైన సాధువులు, భక్తుల మధ్య సంగమ్ ఘాట్ వద్ద శంఖం పూరిస్తున్న ఒక మహిళా భక్తురాలు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP: Foreign devotees sing 'Hanuman Chalisa' as they head to Triveni Sangam for the 'Amrit Snan' on the occasion of Basant Panchami. pic.twitter.com/Fnmw9AhYP8— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్‌రాజ్‌లో వసంత పంచమి సందర్భంగా 'అమృత స్నానం' కోసం త్రివేణి సంగమం వైపు వెళుతున్న విదేశీ భక్తులు 'హనుమాన్ చాలీసా' పఠిస్తూ కనిపించారు.స్వామి కైలాసానంద గిరి మాట్లాడుతూ ‘13 అఖాడాలు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తున్నారు. మేము గంగా మాతను, శివుడిని పూజించాం. నాగ సాధువులంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇది మా మూడవ 'అమృత స్నానం', నేను ఉత్తరప్రదేశ్ నుండి వచ్చాను. 13 అఖాడాలకు అవసరమైన ఏర్పాట్లు చేసినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అభినందనలు’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | Spiritual leader Swami Kailashanand Giri says, "All the 13 Akhadas took a holy dip at Triveni Sangam...We offered prayers to Ganga Maa, Lord Shiva...All the Nagas are very excited...This was our third 'Amrit Snan'...I congratulate UP… pic.twitter.com/po5OtrAArf— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్‌రాజ్‌లోని ఒక నాగ సాధువు మాట్లాడుతూ ‘గత రెండు అమృత స్నానాల కంటే ఈరోజు ఏర్పాట్లు మెరుగ్గా ఉన్నాయి. ఈరోజు స్నానం మాకెంతో ముఖ్యమైనది’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | A Naga sadhu says, "Arrangements today were better than the previous two Amrit Snans... Today's snan was the biggest for us saints..." pic.twitter.com/n1OPYfYw34— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్‌రాజ్‌లోని ఒక సాధువు మీడియాతో మాట్లాడుతూ ‘ఈరోజు అమృత స్నానం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అఖాడాలు, సాధువులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | A saint says, "... The Amrit Snan was very good today... All akharas and saints took a holy dip. The arrangements were very nice." pic.twitter.com/Ebqvcv8oTG— ANI (@ANI) February 3, 2025ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానం చేసిన తర్వాత ఒక విదేశీ భక్తుడు మాట్లాడుతూ ‘ఇది మాటల్లో చెప్పలేని మధుర అనుభవం. నేను చాలా ధన్యుడినయ్యానని భావిస్తున్నాను’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj: After taking a holy dip, a foreign devotee says, "It is an experience beyond words and I feel very blessed..." pic.twitter.com/8N3o8DUjsl— ANI (@ANI) February 3, 2025ఆచార్య లక్ష్మీనారాయణ్ త్రిపాఠి మాట్లాడుతూ ‘ఈ పవిత్రమైన రోజున అందరం చాలా సంతోషంగా ఉన్నాం. అఖాడాలు ఎల్లప్పుడూ ఐక్యంగానే ఉంటారు’ అని అన్నారు.#WATCH | #MahaKumbhMela2025 | Prayagraj: After taking a holy dip, a foreign devotee says, "It is an experience beyond words and I feel very blessed..." pic.twitter.com/8N3o8DUjsl— ANI (@ANI) February 3, 2025జునా అఖారా స్నానం పూర్తయింది. మొదట మహానిర్వాణి, తరువాత శ్రీ నిరంజని, అనంతరం జునా అఖారా స్నానం చేశారు. జూనా అఖారాకు చెందిన నాగ సాధువులు వసంత పంచమి సందర్భంగా అమృత స్నానం చేశారు. #WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP | Acharya Laxminarayan Tripathi of Kinnar Akhara says, "... We are all very happy on this auspicious day. The Kinnar Akhara was, is, and will always be united." pic.twitter.com/z867gPFecp— ANI (@ANI) February 3, 2025ఇది కూడా చదవండి: Mahakumbh: వసంత పంచమి అమృత స్నానాలు ప్రారంభం #WATCH | #MahaKumbhMela2025 | Prayagraj, UP: Naga sadhus of the Juna Akhara take a holy dip as part of the Amrit Snan on the occassion of Basant Panchami. pic.twitter.com/1WsR4Elltj— ANI (@ANI) February 3, 2025 -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులకు సీఎం యోగి సంతాపం
లక్నో : ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఇంటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. బాధితులు ప్రయాణిస్తున్న వ్యాన్‌పై టయోటా ఇన్నోవో దూసుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 11మంది తీవ్రంగా గాయపడ్డారు.గురువారం అర్ధరాత్రి ఉత్తర ప్రదేశ్ లక్నోలోని దేవా రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. బాధితురాలు కిరణ్, ఆమె కుమారుడు కుందన్ యాదవ్, ఇతర కుటుంబసభ్యులు బంటీ యాదద్,శోబిత్ యాదవ్‌లు ఆస్పత్రి నుంచి ఇంటికి వ్యాన్‌లో బయలు దేరారు. దేవా రోడ్డులో ప్రయాణిస్తున్న వ్యాన్‌ను టయోటా మెరుపు వేగంతో ఢీకొట్టింది. ఎదురుగా ఉన్న భారీ ట్రక్‌ను వ్యాన్ డీకొట్టడంతో అందులోని ప్రయాణికులు ప్రాణాలొదిలారు.రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో 11మందికి తీవ్రగాయాలయ్యాయని, నలుగురు మరణించినట్లు పోలీస్ అధికారి పంకజ్ సింగ్ వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వివరాల్ని ఈస్ట్ డీసీపీ శశాంక్ సింగ్ మీడియాతో మాట్లాడారు. బాధిత మహిళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఓ వ్యాన్‌లో ఇంటికి బయలు దేరారు. ఆ వ్యాన్‌లో మొత్తం తొమ్మిదిమంది కుటుంబ సభ్యులు ప్రమాణిస్తున్నారు. అయితే ఆ వ్యాన్‌పైకి వెనుక నుంచి టయోటా ఇన్నోవా దూసుకొచ్చింది. ప్రమాదం తీవ్రతకు ఎదురుగా ఉన్న ట్రక్‌ను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు’ అని తెలిపారు. సీఎం యోగి సంతాపంఘోర రోడ్డు ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ప్రమాదంపై జిల్లా అధికార యంత్రాంగానికి సీఎం యోగి ఆదేశాలకు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
ఎయిరిండియా పైలెట్ సృష్టి తులి కేసులో ట్విస్ట్!
ముంబై : ఎయిరిండియా పైలెట్ 25ఏళ్ల సృష్టి తులి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి తులిపై ఆమె స్నేహితుడు ఆదిత్య పండిట్ పెంచుకున్న అసూయే ఆమె మరణానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఆమె మరణంలో మరో యువతి ప్రమేయం ఉన్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆశ్రయించనున్నారు. కమర్షియల్ పైలెట్ సృష్టి తులి సోమవారం ముంబైలోని మరోల్ ప్రాంతంలో తన స్నేహితుడు ఆదిత్య పండిట్ రూంలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి ఆదిత్య పండిట్ వేధింపులే కారణమని తెలుస్తోంది. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఆదిత్య పండిట్ పోలీసుల అదుపులో ఉన్నాడు.సృష్టి తులి మరణానికి ముందు ఏం జరిగిందో ఆమె మేనమామ వివేక్ తులి మీడియాతో మాట్లాడారు. ‘‘ఆమె చనిపోవడానికి 15 నిమిషాల ముందు తన తల్లి, అత్తతో ఉల్లాసంగా మాట్లాడింది. అలాంటి నా కోడలు ఆత్మహత్య చేసుకుంది అంటే నేను నమ్మను. ఇది కచ్చితంగా హత్యే. సృష్టి ఎంతో ధైర్యవంతురాలు. చిన్నప్పటి నుంచి పైలెట్ అవ్వాలనేది ఆమె కల. కమర్షియల్ పైలెట్ ట్రైనింగ్ తీసుకుంది. గతేడాది లైసెన్స్ కూడా వచ్చింది. ప్రస్తుతం ఎయిరిండియాలో పైలెట్‌గా విధులు నిర్వహిస్తుంది. ఆదిత్య పండింట్ ఆమె బ్యాచ్మెట్. కమర్షియల్ ట్రైనింగ్‌లో ఫెయిలయ్యాడు. ఈ విషయంలో సృష్టి మీద అసూయ పెంచుకున్నాడు. తీవ్రంగా వేధించాడు. ఈ విషయం ఆమె స్నేహితులే చెప్పారు.మా అమ్మాయి మరణం గురించి తెలిసిన వెంటనే ఏం జరిగిందో ఆమె స్నేహితులతో మాట్లాడాను. నా మేనకోడలు సృష్టిని ఆదిత్య.. ఎంతగా వేధించాడో చెప్పారు. నాన్‌వెజ్ తినొద్దని తిట్టేవాడు. కొట్టేవాడు. బహిరంగంగా అరిచేవాడు. సమయం, సందర్భం లేకుండా కార్లో ప్రయాణించే సమయంలో నడిరోడ్డులో వదిలేసి వెళ్లేవాడు. ఏడుస్తూ తన రూమ్‌కి వచ్చేది. సృష్టి బ్యాంక్ అకౌంట్లను చెక్ చేశాం. ఆమె ఒక నెల స్టేట్మెంట్లో రూ.65 వేలు ఆదిత్య అకౌంట్‌కు పంపింది. డబ్బులు కావాలని ఆదిత్య బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోయి ఉండొచ్చని’’ వివేక్ తులి అన్నారు.ఆ అమ్మాయి ఎవరు?సృష్టి మరణంలో మరో మహిళా పైలెట్ ప్రమేయం ఉందని వివేక్ తులి అనుమానం వ్యక్తం చేశారు. ‘‘సృష్టి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఉన్న ఓ యువతి కీమేకర్ సాయంతో తలుపు తెరిచింది. సృష్టిని ఆసుపత్రికి తీసుకువెళ్లింది. పైలెట్ శిక్షణ తీసుకున్న వాళ్లు.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ప్లాట్‌లోకి వెళ్లకూడదనే విషయం తెలియదా? కీ మేకర్ ప్లాట్ బయటి నుంచి తలుపు ఎందుకు తెరుస్తాడ?’ని ప్రశ్నించారు.సృష్టికి న్యాయం జరిగేలా సృష్టి మరణంలో న్యాయం జరిగేలా ఆమె కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆశ్రయించనున్నారు. "సృష్టిది ఆత్మహత్య కాదు హత్యే.. న్యాయం కోసం సీఎం యోగీని కలవనున్నాం" అని వివేక్ తులి మీడియాకు వివరించారు. సృష్టి తులి ఎవరు?ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌కు చెందిన సృష్టి తులికి పైలెట్ అవ్వాలనేది ఆమె కల. ఆ కల నెరవేర్చుకునేందుకు రెండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ నుంచి ముంబైకి వచ్చింది. అప్పటి నుంచి కమర్షియల్ పైలెట్ శిక్షణ తీసుకుంది. ఆ శిక్షణ సమయంలో సహచరుడు ఆదిత్య పండిట్ పరిచయమయ్యాడు. ఆ స్నేహం కాస్త ప్రేమకు దారి తీసింది.అయితే, చిన్నప్పటి నుంచి పైలెట్ అవ్వాలనే లక్ష్యంతో ఉన్న సృష్టి తులి ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. కమర్షియల్ పైలెట్ అయ్యింది. కానీ ఆదిత్య పండిట్ కమర్షియల్ పైలెట్ ట్రైనింగ్‌లో ఫెయిల్ అయ్యాడు. ప్రేమ ముసుగులో ఆమెను చిత్రవధ చేశాడు. చికెన్ తినొద్దని, డబ్బులు కావాలని వేధించాడు. అందరిముందు తిట్టే వాడు. ప్రయాణంలో ఎక్కడ ఉండే అక్కడ ఒంటరిగా వదిలేసేవాడు. ఓ విషయంలో సృష్టి తులి.. ఆదిత్య పండిట్‌తో గొడవ పడింది. చివరికి అతని ఫోన్ కేబుల్ వైర్‌తో ప్రాణాలు తీసుకుంది. -
ఒకే షిఫ్టులో పీసీఎస్ ప్రిలిమినరీ పరీక్ష
ప్రయాగ్‌రాజ్: ప్రావిన్షియల్ సివిల్ సర్వీసెస్(పీసీఎస్) ప్రిలిమినరీ పరీక్ష–2024 వ్యవహారం తీవ్ర అలజడి సృష్టించింది. ఈ పరీక్షను ఒకే రోజు కాకుండా వేర్వేరు రోజుల్లో వేర్వేరు షిఫ్టుల్లో నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీపీఎస్సీ) నిర్ణయించడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరీక్షను పాత విధానంలోనే ఒకే రోజు ఒకే షిఫ్టులో నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీనిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. పాత విధానంలోనే పరీక్షలు నిర్వహించాలంటూ యూపీపీఎస్సీ అధికారులను ఆదేశించారు. దీంతో యూపీపీఎస్సీ వెనక్కి తగ్గింది. పీసీఎస్ ప్రిలిమినరీ పరీక్షను ఒకే రోజు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అలాగే రివ్యూ ఆఫీసర్(ఆర్ఓ), అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్(ఏఆర్ఓ) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలియజేసింది. -
యూపీ సీఎం ఆదిత్యనాథ్ కు బెదిరింపు కాల్
-
‘మీ పేర్లు తప్పనిసరి’.. ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్
ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటల్ యజమానులు వారి పేర్లతో పాటు సిబ్బంది పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ అయ్యాయని, జనవరి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గుర్తింపు కార్డులను సిద్ధం చేసుకునేందుకు తగినంత సమయం ఇచ్చినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ మాదిరిగానే పరిశుభ్రమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించే ఉద్దేశ్యంతో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని మేము నిర్ణయించుకున్నాము’ అని పట్టణాభివృద్ధి మంత్రి విక్రమాదిత్య సింగ్ అన్నారు. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.BIG NEWS 🚨 Himachal Congress Minister Vikramaditya Singh announces that all restaurants, food outlets will have to display owner’s identification. SHOCKING part is he referenced recent directive from CM Yogi Adityanath in his postYOGI MAGIC ACROSS INDIA 🔥🔥Yesterday CM… pic.twitter.com/J8YltyFvF4— Times Algebra (@TimesAlgebraIND) September 25, 2024పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహించిన సమావేశంలో ఆహార లభ్యతపై ప్రజల్లో నెలకొన్న భయాలు, ఆందోళనలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఈ కొత్త నిబంధనల్ని అమలు చేయాలని భావించినట్లు విక్రమాదిత్య సింగ్ చెప్పారు. 👉 చదవండి : రాష్ట్రంలో సీఎం యోగి సర్కార్ కొత్త రూల్స్యూపీ యోగి సర్కార్ సైతంకాగా,మంగళవారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రంలో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహారం అందించేలా కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హోటల్స్, రెస్టారెంట్లతో పాటు తినుబండరాలు అమ్మే ప్రదేశాల్లో యజమానులు, సిబ్బంది, చెఫ్‌లు తప్పని సరిగా మాస్క్‌లు, గ్లౌజ్స్ ధరించాలి. హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు సిబ్బంది, ఇతర మేనేజర్లు ఇతర ఉద్యోగులు తప్పని సరిగా వారి వివరాల్ని మెనూ కార్డ్‌లో ప్రదర్శించాలని సీఎం యోగి ఆధిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం యోగి ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలోనే మధ్యప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి సర్కార్ కొత్త రూల్స్
లక్నో: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రంలో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. యూపీ సర్కార్ కొత్త నిబంధనల మేరకు.. విధి నిర్వహణలో చెఫ్‌లు, వెయిటర్లు మాస్క్‌లు, గ్లౌజులు ధరించాలి. హోటళ్లు, రెస్టారెంట్లలో సీసీ టీవీ కెమెరాలు తప్పని సరిగా ఇన్ స్టాల్ చేయాలి. నిర్వాహకులు, మెనూ బోర్డ్‌లపై నిర్వాహకుల పేర్లు, అడ్రస్ వివరాలు తప్పని సరిగా ఉండాలని సీఎం యోగి ఆధిత్యనాథ్ స్పష్టం చేశారు. ఫ్రూట్‌జ్యూస్‌లో మూత్రంకొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో ఖుషీ జ్యూస్ కార్నర్ షాపు యజమాని పండ్ల రసాల్లో మూత్రం కలిపి అమ్ముతూ పట్టుబడ్డాడు. జ్యూస్‌లో మూత్రం కలుపుతుండగా..అక్కడే ఉన్న వినియోగదారుడు నిలదీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.Uttar Pradesh : In Loni of Ghaziabad, locals caught Mohd. Aamir and Md Kaif mixing Human URINE in juice at their juice shop and selling it to people. Police even recovered a plastic can filled with Urine at the shop named Khushi Juice Corner. Case has been registered and both… pic.twitter.com/jkC8poGuVn— Amitabh Chaudhary (@MithilaWaala) September 14, 2024 రాష్ట్రంలో కొత్త నిబంధనలుఈ నేపథ్యంలో సీఎం యోగి ఆధిత్యనాథ్ ఆద్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోటల్స్‌లో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు.సమావేశం అనంతరం ఆధిత్యనాథ్ మాట్లాడుతూ.. తినే ఆహార పదార్థాలు కల్తీ అవుతున్న ఘటనల నేపథ్యంలో ఆహార పదార్థాలలో మానవ వ్యర్థాలను కలపడం అసహ్యకరమైంది. ఆమోదయోగ్యం కాదు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా ఉండేందుకు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త నిబంధనల్ని అమలు చేస్తున్నారా? లేదా అని పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు, స్థానిక అధికారులు తనిఖీ చేస్తారని అన్నారు.ప్రజారోగ్యం విషయంలో రాజీ పడేది లేదని తెలిపారు. ఆహారం కలుషితం లేదా అపరిశుభ్రమైన పద్ధతుల్ని అవలంభించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. చదవండి : రేసుగుర్రం నటుడు రవి కిషన్‌పై సీఎం యోగి ఆసక్తికర వ్యాఖ్యలు -
అందుకే అలాంటి నిర్ణయం.. కన్వర్ యాత్ర ఆదేశాలపై యూపీ ప్రభుత్వ వివరణ
న్యూఢిల్లీ: కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా హోటల్స్ నేమ్ ప్లేట్లపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సమర్థించుకుంది. తీర్థయాత్ర శాంతియుతంగా, క్రమబద్ధంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని సుప్రీం కోర్టు కోరగా.. ఈమేరకు కోర్టుకు తాజాగా యూపీ ప్రభుత్వం తమ వివరణను తెలియజేసింది. ‘‘హోటల్స్, తినుబండారాల పేర్ల విషయంలో అనుమానాలు ఉన్నాయని యాత్రికులు ఫిర్యాదు చేశారు. వారి ఆందోళనలను పరిష్కరించేందుకే ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. అందుకు అనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు’’ అని వివరించింది. ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ (యూపీ) శివభక్తుల కన్వర్ యాత్ర నేమ్ ప్లేట్ల వివాదం పిటిషన్లపై ఇవాళ (జులై 26) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. -
యమునా తీరే.. ఎవరికి వారే
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో పేలవ ఫలితాల దెబ్బకు రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా తెరపైకి వస్తున్నాయి. 2019తో పోలిస్తే యూపీలో బీజేపీ అనూహ్యంగా సగానికి సగం స్థానాలు కోల్పోవడం తెలిసిందే. పార్టీ కేంద్రంలో వరుసగా మూడోసారి సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమవడానికి ఇదే ప్రధాన కారణంగా నిలిచింది. దీన్ని కమలనాథులు సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్ర పారీ్టలోనూ, యోగి కేబినెట్లోనూ త్వరలో భారీ మార్పుచేర్పులకు రంగం సిద్ధమవుతోంది. దీంతోపాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ దూకుడుకు పగ్గాలు వేసేందుకు అధిష్టానమే ప్రయతి్నస్తున్నట్టు చెబుతున్నారు. యోగి ప్రభుత్వంపై సాక్షాత్తూ సొంత పారీ్టకే చెందిన ఉప ముఖ్యమంత్రి మౌర్య బాహాటంగా విమర్శలు... రాష్ట్ర పార్టీ చీఫ్‌తో కలిసి ఆయన హస్తిన యాత్రలు... మోదీ, నడ్డా తదితర పెద్దలతో భేటీ... ఇవన్నీ అందులో భాగమేనని రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతోంది...!ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ భూపేంద్రసింగ్ చౌదరి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్యతో కలిసి ఆయన మంగళవారమే హస్తిన చేరుకున్నారు. అదే రాత్రి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మౌర్య గంటకు పైగా సమావేశమయ్యారు. అనంతరం చౌదరి కూడా నడ్డాతో విడిగా భేటీ అయ్యారు. నిజానికి యోగి, మౌర్య మధ్య మొదటినుంచీ సత్సంబంధాలు లేవు. యోగి అభీష్టానికి వ్యతిరేకంగా మౌర్యకు అధిష్టానం డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ హస్తిన యాత్ర రాష్ట్రంలో రాజకీయ కలకలం రేపుతోంది. మౌర్య నెల రోజులుగా కేబినెట్ సమావేశాలకు వరుసగా డుమ్మా కొడుతూ వస్తున్నారు. యూపీలో త్వరలో 10 అసెంబ్లీ స్థానాలకు కీలక ఉప ఎన్నికలు జరగనున్నాయి. వాటి సన్నద్ధత కోసం మంత్రులతో యోగి ఏర్పాటు చేసిన భేటీకి కూడా మౌర్య వెళ్లలేదు. పైగా నెల రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి సీనియర్ కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలను వరుస పెట్టి కలుస్తూ వస్తున్నారు. జూలై 14న కూడా నడ్డాతో చాలాసేపు మంతనాలు జరిపారు. ఆ భేటీతో... ఆదివారం లఖ్‌నవూలో జరిగిన బీజేపీ రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశం యూపీలో రాజకీయ వేడిని ఒక్కసారిగా పెంచేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, బీజేపీ నేతలు, ప్రతినిధులు కలిపి 3,500 మందికి పైగా పాల్గొన్న ఆ భేటీలో వేదిక మీదే యోగి, మౌర్య మధ్య పరోక్షంగా మాటల యుద్ధం సాగింది. మౌర్య ప్రసంగిస్తూ, ‘ప్రభుత్వం కంటే పారీ్టయే మిన్న. కనుక పారీ్టదే పై చేయిగా వ్యవహారాలు సాగాలి’’ అంటూ బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. దాంతో అంతా విస్తుపోయారు. ప్రభుత్వ వ్యవహారాల్లో బీజేపీ నేతల మాట పెద్దగా చెల్లడం లేదని పారీ్టలో యోగి వ్యతిరేకులు చాలాకాలంగా వాపోతున్నారు. అధికారులకు యోగి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు దూకుడుగా పని చేయలేదని, రాష్ట్రంలో దారుణ ఫలితాలకు ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటన్నది వారి వాదన. ఎస్పీ, బీఎస్పీ సానుభూతిపరులైన అధికారులకు కీలక పదవులు కట్టబెట్టారంటూ వారంతా యోగిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సీఎం సమక్షంలోనే మౌర్య మాటల తూటాలు పేల్చారు. ‘‘కార్యకర్తలే కీలకం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ వారిని గౌరవించాల్సిందే. నేనైనా ముందు బీజేపీ కార్యకర్తను. తర్వాతే డిప్యూటీ సీఎంను’’ అన్నారు. ‘‘కార్యకర్తల బాధే నా బాధ. ప్రతి కార్యకర్తకూ నా ఇంటి తలుపులు నిత్యం తెరిచే ఉంటాయి’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలూ చేశారు. యోగి సమక్షంలోనే ప్రభుత్వ పనితీరును తప్పుబట్టేలా మౌర్య ఇలా మాట్లాడటం వెనక అధిష్టానం ఆశీస్సులున్నట్టు చెబుతున్నారు. అయితే మౌర్య అనంతరం మాట్లాడిన యోగి కూడా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ప్రభుత్వ పనితీరు ఏమాత్రం మారబోదని అదే వేదిక నుంచి కుండబద్దలు కొట్టారు. ఆ వెంటనే మౌర్య, చౌదరి హస్తిన వెళ్లడం, మోదీ, నడ్డా తదితరులతో భేటీ కావడం చకచకా జరిగిపోయాయి. అనంతరం తాజాగా బుధవారం ఎక్స్ పోస్టులో కూడా ‘ప్రభుత్వం కంటే పారీ్టయే పెద్ద’దన్న వ్యాఖ్యలను మౌర్య పునరుద్ఘాటించారు. వీటన్నింటినీ బేరీజు వేసి చూస్తే యూపీకి సంబంధించి బీజేపీ అధిష్టానం త్వరలో ‘పెద్ద’ నిర్ణయం తీసుకోవచ్చంటూ యోగి వ్యతిరేక వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత యోగిని సీఎం పదవి నుంచి తప్పించడం ఖాయమని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం పదేపదే చెబుతూ వస్తుండటం తెలిసిందే.యోగి సంచలన వ్యాఖ్యలు అధిష్టానం మనోగతాన్ని పసిగట్టిన యోగి ముందుగానే వ్యూహాత్మకంగా పై ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. అతి విశ్వాసమే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కొంప ముంచిందని మూడు రోజుల క్రితం ఆయన ఏకంగా బహిరంగ సభలోనే వ్యాఖ్యలు చేయడం ఉద్దేశపూర్వకమేనని భావిస్తున్నారు. ఇవి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. బీజేపీ అధిష్టానం ఇప్పటికిప్పుడు యోగిని మార్చడం వంటి భారీ నిర్ణయాలకు వెళ్లకపోయినా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సత్ఫలితాలు రాబట్టలేకపోతే ఆయనకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు బీజేపీ ఇంటి పోరుపై విపక్షాలన్నీ చెణుకులు విసురుతున్నాయి. యూపీకి ముగ్గురు సీఎంలున్నారంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ సహా ఎద్దేవా చేస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటల్లో మునిగి తేలుతూ పాలనను గాలికొదిలారంటూ దుయ్యబడుతున్నాయి. మౌర్య, మరో డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్ కూడా సీఎంలుగానే వ్యవహరిస్తున్నారన్నది వాటి విమర్శల ఆంతర్యం. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను నెగ్గడం యోగికి అత్యవసరం. రాష్ట్ర పార్టీ కీలక నేతల సహాయ నిరాకరణ నేపథ్యంలో ఈ కఠిన పరీక్షలో ఆయన ఏ మేరకు నెగ్గుకొస్తారన్నది ఆసక్తికరం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: యూపీలో ఆఖరి పోరాటం!
ఉత్తరప్రదేశ్‌లో సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ఆఖరి అంకానికి చేరుకుంది. 6 విడతల్లో 67 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మిగతా 13 సీట్లలో జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. 2019లో వీటిలో 11 స్థానాలు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కైవసం కాగా బీఎస్పీకి 2 దక్కాయి. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, సీఎం యోగి కంచుకోట గోరఖ్‌పూర్ సహా కీలక నియోజవర్గాలపై ఫోకస్... గోరఖ్‌పూర్... భోజ్‌పురీ వార్ సుప్రసిద్ధ గోరఖ్‌నాథ్ ఆలయానికి నెలవు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంచుకోట. ఆయన గురువు మహంత్ అవైద్యనాథ్ 1989 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. తర్వాత యోగి 1998 నుంచి 2014 దాకా ఐదుసార్లు నెగ్గారు. ఆయన సీఎం కావడంతో జరిగిన ఉప ఎన్నికలో అనూహ్యంగా ఎస్పీ గెలిచినా 2019లో బీజేపీ ప్రముఖ భోజ్‌పురి నటుడు రవికిషన్ను బరిలోకి దించి 3 లక్షల మెజారిటీతో కాషాయ జెండా ఎగరేసింది. ఈసారీ ఆయనే పోటీలో ఉన్నారు. ఎస్పీ నుంచి భోజ్‌పురి నటి కాజల్ నిషాద్, బీఎస్పీ నుంచి జావెద్ సిమ్నాని బరిలో ఉన్నారు. కాంగ్రెస్ దన్నుతో బీజేపీకి ఎస్పీ గట్టి పోటీ ఇస్తోంది.గాజీపూర్.. త్రిముఖ పోరు ఇక్కడ 2014లో బీజేపీ, 2019లో ఎస్పీ గెలిచాయి. ఎస్సీ నుంచి అఫ్జల్ అన్సారీ, బీఎస్పీ నుంచి ఉమేశ్ సింగ్, బీజేపీ నుంచి పరాస్ నాథ్ రాయ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ 20 శాతం ఎస్సీలు, 11 శాతం ముస్లింలు ఉంటారు. ఓటర్లు ఒక్కోసారి ఒక్కో పారీ్టకి పట్టం కడుతున్న నేపథ్యంలో త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది. గాజీపూర్ పరిధిలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 ఎస్పీ చేతిలోనే ఉన్నాయి!వారణాసి... మోదీ హ్యాట్రిక్ గురికాశీ విశ్వేశ్వరుడు కొలువుదీరిన ఈ లోక్‌సభ స్థానంలో 1991 నుంచి కమలనాథులు పాతుకుపోయారు. 2004లో కాంగ్రెస్ నెగ్గినా 2009లో బీజేపీ దిగ్గజం మురళీ మనోహర్ జోషి గెలుపొందారు. 2014లో ప్రధాని అభ్యరి్థగా నరేంద్ర మోదీ ఇక్కడ తొలిసారి బరిలో దిగారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై 3.7 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచారు. 2019లో మెజారిటీని 4.8 లక్షలకు పెంచుకున్నారు. ఈసారి హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ అజయ్ రాయ్, బీఎస్పీ నుంచి అథర్ జమాల్ లారీ రేసులో ఉన్నారు. ఈసారి మోదీ మెజారిటీ పెరుగుతుందా, లేదా అన్నదే ప్రశ్నగా కనిపిస్తోంది.చందౌలీ... టఫ్ ఫైట్ దేశంలోనే అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువ. 2014, 2019ల్లో మోదీ వేవ్‌లో బీజేపీ ఖాతాలో పడింది. సిట్టింగ్ ఎంపీ మహేంద్రనాథ్ పాండే ఈసారి హ్యాట్రిక్‌పై గురి పెట్టారు. ఎస్పీ నుంచి వీరేంద్ర సింగ్, బీఎస్పీ నుంచి సత్యేంద్రకుమార్ మౌర్య పోటీలో ఉన్నారు. బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది.మీర్జాపూర్... ప్రాంతీయ పారీ్టల హవాఒకప్పుడు బందిపోటు రాణి పూలన్ దేవి అడ్డా. 1996, 1999లో ఆమె ఎస్పీ తరఫున విజయం సాధించారు! 2001లో ఆమె హత్యానంతరం బీఎస్పీ రెండుసార్లు గెలిచింది. 2014లో అప్నాదళ్ నుంచి అనుప్రియా పటేల్ ఘనవిజయం సాధించారు. 2016లో పార్టీ బహిష్కరణతో అప్నాదళ్(ఎస్) పేరుతో కొత్త పార్టీ పెట్టి ఎన్డీఏ దన్నుతో 2019లో మళ్లీ నెగ్గారు. ఈసారి కూడా ఎన్డీఏ నుంచి బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి రమేశ్ చంద్ర బిండ్, ఎస్పీ తరఫున మనీశ్ తివారీ రేసులో ఉన్నారు. మీర్జాపూర్లో వెనకబడిన వర్గాలు 49 శాతం, ఎస్సీ, ఎస్టీలు 25 శాతం ఉంటారు.కుషీనగర్... హోరాహోరీగౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం (శరీర త్యాగం) చేసిన చోటు కావడంతో ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు, పర్యాటకులు ఏటా భారీగా వస్తుంటారు. 2008లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్ బోణీ కొట్టగా 2014, 2019ల్లో బీజేపీ పాగా వేసింది. సిట్టింగ్ ఎంపీ విజయ్ కుమర్ దూబే ఈసారీ బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి అజయ్ ప్రతాప్ సింగ్ (పింటూ). బీఎస్పీ నుంచి శుభ్ నారాయణ్ చౌహాన్ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ చీల్చే ఓట్లు కీలకం కానున్నాయి.పోలింగ్ జరిగే మొత్తం స్థానాలు...మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, కుషీనగర్, దేవరియా, బన్స్‌గావ్ (ఎస్సీ), ఘోసి, సలేంపూర్, బలియా, ఘాజిపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, రాబర్ట్స్‌గంజ్ (ఎస్సీ)– సాక్షి, నేషనల్ డెస్క్ -
అంబేద్కర్‌కు యూపీ సీఎం నివాళులు!
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పించారు. సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి, అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సందేశంలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన కృషికి దేశప్రజలు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటారన్నారు. షెడ్యూల్డ్ కులాల విభాగంతో సహా నిర్లక్ష్యానికి గురైన అన్ని వర్గాల హక్కుల కోసం జీవితాంతం అంబేద్కర్ పోరాడారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. సమాజంలోని అట్టడుగుస్థాయి వారి సాధికారత కోసం అంబేద్కర్ చేసిన కృషి మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. వివక్ష లేని, సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని సీఎం యోగి పేర్కొన్నారు. అంబేద్కర్ 1891, ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మోవ్ నగరంలో జన్మించారు. ఆయన రాజ్యాంగ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. -
ఇక సీఎం యోగి సారథ్యంలో.. తొలి ర్యాలీ అక్కడి నుంచే..
లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ త్వరలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పర్యటనలతో ఇప్పటికే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. రాష్ట్రంలో ఇక పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యం వహించనున్నారు. మధుర నుంచి కాషాయ పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. హోలీ వేడుకలు ముగిసిన వెంటనే ప్రారంభం కానున్న ఈ ప్రచారంలో యోగి ఆదిత్యనాథ్ పార్టీ ఓటర్లకు చేరువ కావడంలో చురుకైన పాత్ర పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. మార్చి 27 నుండి ప్రారంభమయ్యే ప్రబుద్ధ వర్గ సమ్మేళనానికి సీఎం యోగి నాయకత్వం వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ ఎన్నికల వ్యూహాన్ని ఆయన శ్రేణులకు వివరిస్తారు. వివిధ ప్రాంతాలలో ప్రతిరోజూ మూడు సమ్మేళనాలు జరగనున్నాయి. మార్చి 27న మీరట్, ఘజియాబాద్ల సందర్శనల తర్వాత, మార్చి 28న బిజ్నోర్, మొరాదాబాద్, అమ్రోహాలో సమావేశాలను ప్రతిపాదించారు. మార్చి 29న షామ్లీ, ముజఫర్‌నగర్, సహరాన్పూర్, మార్చి 30న బాగ్పత్, బులంద్‌షహర్, గౌతమ్ బుద్ధ నగర్, మార్చి 31 బరేలీ, రాంపూర్, పిలిభిత్‌లలో పార్టీ సమావేశాలు జరగనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవల పర్యటించారు. అజంగఢ్ నుండి దేశవ్యాప్తంగా రూ. 42,000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. -
‘ఎంపీ రవి కిషన్ భూమిని కబ్జా చేశారు’ : సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ నవ్వులు పూయించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో యూపీ పార్లమెంట్ స్థానం గోరఖ్‌పూర్‌లోని రామ్‌ఘర్ తాల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం యోగి శంకుస్థాపన చేశారు. అనంతరం యోగి తన ప్రసంగంతో సభికులతో పాటు ప్రజల్ని నవ్వులు పూయించారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగితో పాటు సభపై ప్రముఖ నటుడు, బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్ ఎంపీ రవికిషన్ ఉన్నారు. రవికిషన్ను ఉద్దేశిస్తూ సీఎం మాట్లాడారు. బంగ్లా కబ్జా చేశారంటూ.. భళ్లున నవ్విన ‘ఇంతకుముందు ఓ వీఐపీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు భోజ్‌పురి స్టార్ రవికిషన్ ఆ ప్రాంతానికి సమీపంలోని ఓ బంగ్లాను కబ్జా చేశార'ని భళ్లున నవ్వారు. వెంటనే లేదు.. లేదు.. రవికిషన్ ఆ ఇంటి లాక్కోలేదు. డబ్బుతో కొన్నారు’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. అభివృద్దికి కేరాఫ్ అడ్రస్ ఏడేళ్ల క్రితం రామ్‌గఢ్ తాల్ దగ్గరకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడేవారు. కానీ ఇప్పుడు వాతావరణం మారిపోయింది. ఇప్పుడు అక్కడ సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. సెల్ఫీలు దిగుతున్నారు. రవికిషన్ (ఎంపీ సీటును) మళ్లీ తన స్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు నగరం మొత్తం కెమెరా నిఘాలో ఉంది. రవికిషన్ సినిమా షూటింగ్ కోసం హడావుడిగా వెళ్లి సిగ్నల్ బ్రేక్ చేస్తే వెంటనే అతని మొబైల్‌కి చలాన్ వెళ్తుందని, అంతలా అభివృద్ది జరిగిందని స్పష్టం చేశారు. #WATCH | Gorakhpur: BJP leader Ravi Kishan says, "I want to thank the top leadership wholeheartedly... The organization gave me a second chance from the hottest seat after Kashi. I would like to express my heartfelt gratitude to the entire organization and Prime Minister Modi. I… https://t.co/SFXrQnf6Zi pic.twitter.com/ewqZS5olQN — ANI (@ANI) March 2, 2024 గోరఖ్‌పూర్ సీటు గెలుస్తా.. చరిత్ర సృష్టిస్తా ఈ నెల ప్రారంభంలో బీజేపీ రికార్డ్ స్థాయిలో 195 మందితో తొలి విడత పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కమలం ప్రకటించిన జాబితాలో గోరఖ్‌పూర్ ఎంపీ రవికిషన్ రెండోసారి పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ‘కాశీ తర్వాత అత్యంత హాటెస్ట్ సీటు గోరఖ్‌పూర్. ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు బీజేపీ పెద్దలు నాకు రెండోసారి అవకాశం కల్పించారు. పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి నా కృతజ్ఞతలు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుంది. గోరఖ్‌పూర్ సీటు చరిత్ర సృష్టిస్తుంది’ అని బీజేపీ ఎంపీ రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
జ్ఞానవాపిని దర్శించుకున్న సీఎం యోగి!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారణాసిలోని జ్ఞానవాపిని సందర్శించుకున్నారు. అక్కడి నేలమాళిగలోని విగ్రహాలను వీక్షించారు. దేశానికి, రాష్ట్రానికి మంచి జరగాలని అక్కడ కొలువైన దేవతలను వేడుకున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం వారణాసికి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్య వారణాసిలో పర్యటించనున్నారు. పూర్వాంచల్ అభివృద్ధికి దోహదపడే అమూల్ ప్లాంట్‌కు ప్రధాని మోదీ గతంలో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు దీనిని ఫిబ్రవరి 23న ఆయన ప్రారంభించనున్నారు. వారణాసిలోని కార్ఖియాగావ్లో జరిగే భారీ బహిరంగ సభతో ప్రధాని మోదీ ఎన్నికల సైరన్ మోగించనున్నారు. ఈ సభకు లక్ష మందికి పైగా జనం తరలివస్తారని అంచనా. ఈ సభ ఏర్పాట్లకు సంబంధించిన సన్నాహాలను పరిశీలించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ వారణాసి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విశ్వనాథ ఆలయంలో బాబా భోలేనాథ్‌ను దర్శించుకున్నారు. అలాగే జ్ఞానవాపి నేలమాళిగలో విగ్రహాలను వీక్షించారు. ఈ సమయంలో ఆయన వెంట ఉన్నతాధికారులు ఉన్నారు. కాగా ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని నేలమాళిగను పూజల కోసం తెరిచారు. అప్పటి నుంచి సామాన్య భక్తుల దర్శనాలు కూడా ప్రారంభమయ్యాయి. -
Ayodhya Ram Mandir: అయోధ్యలో యూపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
అయోధ్య/లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి సుమారు 325 మంది అయోధ్యలో రామ్‌లల్లా దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం లక్నో నుంచి 10 బస్సుల్లో, కొందరు తమ కార్లలో బయలుదేరి అయోధ్యకు చేరుకున్నారు. నగరంలో వారికి ఘన స్వాగతం లభించింది. పుణేలో ఉన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు చేరుకుని వారితో కలిశారు. కొందరు శాసనసభ్యులు తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. అంతా కలిపి సుమారు 400 మంది విడతల వారీగా సుమారు రెండున్నర గంటల సమయంలో బాల రాముడి దర్శనం చేసుకున్నారు. దర్శనం తర్వాత గ్రూప్ ఫొటోలు తీసుకున్నారు. రాముడిని దర్శించుకున్న వారిలో బీజేపీ మిత్ర పక్షాల శాసనసభ్యులతోపాటు కాంగ్రెస్, బీఎస్పీకి చెందిన వారు కూడా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలె వరూ ఈ కార్యక్రమానికి రాలేదు. ప్రస్తుతం యూపీ శాసనసభలోని 399 మందిలో బీజేపీకి 252 మంది, మిత్రపక్షాలకు 19 మంది సభ్యుల బలముంది. ప్రతిపక్షంలో ఎస్పీకి 108 మంది, ఇతరులకు 20 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సైతం ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హాజరుకాలేదు. -
ప్రాణప్రతిష్ఠకు ముందు ఇంటిలో సీఎం యోగి పూజలు!
అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన గురువులను స్మరించుకుని, పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియా సైట్లో షేర్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలా రాశారు.. 'అయోధ్యధామ్‌లోని శ్రీరాముడి జన్మస్థలంలో నేడు జరుగుతున్న రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం శతాబ్ధాల పోరాట ఫలితం. ఈ సందర్భంగా దిగ్విజయ్నాథ్ మహరాజ్, మహంత్ అవేద్యనాథ్ మహారాజ్‌లకు ఉద్వేగభరితమైన నివాళులు అర్పిస్తున్నాను.. జై జై శ్రీ రామ్!’ అని రాశారు. श्री अयोध्या धाम में श्रीराम जन्मभूमि पर आज हो रही प्रभु श्री रामलला के नूतन विग्रह की प्राण-प्रतिष्ठा से पीढ़ियों का संघर्ष एवं सदियों का संकल्प पूर्ण हुआ है। इस अवसर पर युगपुरुष ब्रह्मलीन महंत दिग्विजयनाथ जी महाराज और राष्ट्रसंत ब्रह्मलीन महंत अवेद्यनाथ जी महाराज के प्रति… pic.twitter.com/slW5UjNUoC — Yogi Adityanath (@myogiadityanath) January 22, 2024 సీఎం యోగి మరో ట్వీట్లో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు... ‘ఇది అద్భుతమైన, మరపురాని, అతీంద్రియ క్షణం.. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో శ్రీరాముని పవిత్ర జన్మస్థలమైన అయోధ్యధామ్‌లో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. నేడు ప్రధాని నేతృత్వంలో అసంఖ్యాక రామభక్తుల నిరీక్షణకు తెరపడనుంది. భక్తి సాగరంలో మునిగిన దేశమంతా రామనామం స్మరిస్తోంది’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు లండన్ సాధ్విల బృందం! -
22 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య
లక్నో/అయోధ్య: అయోధ్యలోని సరయూ నదీ తీరం వెలుగులతో నిండిపోయింది. శనివారం అత్యంత వైభవంగా 22 లక్షల దీపాలతో జరిగిన దీపోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే చోట ఒకేసారి అత్యధిక సంఖ్యలో దీపాలను వెలిగించిన ఘటనగా స్వీయ గిన్నిస్ రికార్డునే బద్దలు కొట్టింది. సరయూ నది ఒడ్డున 51 ఘాట్లలో 25 వేల మంది వలంటీర్లు 22.23 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు డ్రోన్ల సాయంతో దీపాలను లెక్కించి, ప్రపంచ రికార్డుగా ధ్రువీకరించడంతో నగరం ‘జై శ్రీరామ్’ నినాదాలతో మారుమోగింది. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ మేరకు సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సర్టిఫికెట్‌ను అందజేశారు. గతేడాది ఈ వేడుకలో 15.76 లక్షల ప్రమిదలు వెలిగించడం తొలిసారి గిన్నిస్ రికార్డులకెక్కింది. 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్యలో ఏటా దీపోత్సవం జరుగుతోంది. శనివారం సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కేబినెట్ మంత్రులు కూడా దీపాలు వెలిగించి, సరయూ నది ఒడ్డున పూజలు చేశారు. దీపోత్సవం 100 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. -
దైవ దర్శనానికి వెళ్తుండగా.. పల్టీలు కొడుతూ నీట పడ్డ ట్రాక్టర్
లక్నో: కిక్కిరిసిన జనంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా కొట్టి నీటి కొలనులో పడిపోగా.. పది మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తర ప్రదేశ్ లక్నో శివారులోని ఇటావుంజా దగ్గర సోమవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్కువ మందిని తీసుకెళ్తున్న సమయంలో.. ఓవర్‌లోడ్ కారణం ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొడుతూ మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న నీటి కొలనులో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. స్థానికుల సాయంతో అధికారులు 37 మందిని రక్షించింది. మరో పది మంది మృతి చెందినట్లు ఐజీ లక్ష్మిసింగ్ వెల్లడించారు. మృతులంతా సీతాపూర్ అట్టారియాకు చెందిన వాళ్లుగా నిర్ధారణ అయ్యింది. నవరాత్రి సందర్భంగా ఇటావుంజాలోని ఉన్నాయ్ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలకు వెళ్తూ వీళ్లంతా ప్రమాదంలో మరణించారు. ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం రాష్ట్ర ప్రభుత్వం తరపున చెల్లించనున్నట్లు ప్రకటించారు. मुख्यमंत्री जी ने दिवंगत के परिजनों को ₹4 लाख की राहत राशि प्रदान करने के निर्देश दिए हैं। उन्होंने शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है और घायलों के शीघ्र स्वस्थ होने की कामना करते हुए उनके उपचार की समुचित व्यवस्था करने के निर्देश दिए हैं। — CM Office, GoUP (@CMOfficeUP) September 26, 2022 -
బుల్డోజర్ యాక్షన్.. బీజేపీ నేత కట్టడాల కూల్చివేత
నొయిడా: బుల్డోజర్ చర్యలు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటిదాకా కమ్యూనల్‌కు సంబంధించిన కోణంలోనే ఇంతదాకా ఈ తరహా ప్రతిచర్యలు చూశాం. అయితే తాజాగా నోయిడాలో బుల్డోజర్తో అక్రమ కట్టడాలను కూల్చేయడం, అందునా ఆ కట్టడాలు బీజేపీ నేతవి కావడం, ఆదేశాలకు సీఎం యోగి స్వయంగా ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. యూపీ, నొయిడా అధికారులు బీజేపీ యువనేత శ్రీకాంత్ త్యాగికి వ్యతిరేకంగా రంగంలోకి దిగారు. ఓ మహిళను దుర్బాషలాడి, దాడి చేసిన ఘటన, ఆపై అనుచరులతో బెదిరింపులకు దిగినందుకు ఆదివారం అతనిపై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద నేరారోపణలు నమోదు చేశారు. ఇవాళ నొయిడా సెక్టార్-93లోని గ్రాండ్ ఒమాక్సే హౌజింగ్ సొసైటీ వద్ద అతని ఇంటి ఆవరణలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు సంబంధిత అధికారులు. Residents of Grand Omaxe in Noida's Sec 93 celebrate after the demolition of illegal construction by #ShrikantTyagi.#ITVideo #Noida | @arvindojha @Akshita_N pic.twitter.com/E1JWw2GfvG — IndiaToday (@IndiaToday) August 8, 2022 ఈ కట్టడాలకు సంబంధించే స్థానిక ఇంటి ఓనర్లకు, శ్రీకాంత్ మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ మహిళతో శ్రీకాంత్ దారుణంగా వ్యవహరించాడు. ఆమెను దుర్భాషలాడడంతో పాటు దాడి యత్నానికి దిగాడు. ఆ వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఈ లోపు శ్రీకాంత్ అనుచరులు మరోసారి హౌజింగ్ సొసైటీ దగ్గరకు చేరి.. ఆమె అడ్రస్ కావాలంటూ వీరంగం సృష్టించారు. దీంతో వాళ్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం యోగి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఉత్తర ప్రదేశ్ అధికారులు, నోయిడా పోలీసులు సంబంధిత స్థలానికి చేరుకుని త్యాగికి చెందిన అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని కట్టడాలను కూల్చేశారు. ఆ సమయంలో స్థానికుల కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. సొసైటీకి సంబంధించిన స్థలంలో త్యాగి నిర్మాణాలు చేపట్టడమే ఇందుకు కారణం. బుల్డోజర్ డ్రైవర్‌ను కీర్తిస్తూ నినాదాలు చేశారు వాళ్లంతా. Shrikant Tyagi- the National Executive Member Kisan Morcha & National Co-Coordinator - Yuva Kisan Samiti allegedly caught on camera for threatening a woman resident of Grand Omaxe sector 93B #Noida. pic.twitter.com/QTwAgK94dd — Utkarsh Singh (@utkarshs88) August 5, 2022 త్యాగికి దెబ్బలు ఇక్కడితోనే ఆగిపోలేదు. నోయిడాలోని భంగెల్ మార్కెట్లో ఉన్న అతని కార్యాలయాల్లో ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీలు జరిగాయి.అక్కడ అతనికి 15 షాపులు ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని దుర్వినియోగం చేసినందుకు సైతం కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం గాలింపు కొనసాగుతోంది. ఉత్తరాఖండ్ వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. పదిహేను బృందాలు అతని కోసం గాలింపు చేపట్టాయి. చివరిసారిగా హరిద్వారా్-రిషికేష్ మధ్య అతని సిగ్నల్‌ను పోలీసులు ట్రేస్ చేయగలిగారు. అతని ఆచూకీ తెలిపిన వాళ్లకు 25వేల రూపాయల రివార్డు ప్రకటించారు పోలీసులు. బీజేపీ కిసాన్ మోర్చా నేతగా చెప్పుకుంటున్న శ్రీకాంత్ త్యాగి.. గతంలో బీజేపీ పెద్దలతో కలిసి వ్యక్తిగతంగా ఫొటోలు కూడా దిగాడు. అంతేకాదు ఆ ట్యాగ్‌తోనే దందాలు సైతం నడిపిస్తున్నాడు. ఆగష్టు 5వ తేదీన అతను గ్రాండ్ ఓమాక్సే సొసైటీలో ఓ మహిళతో వాగ్వాదానికి దిగి.. దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు. గతంలోనూ నోయిడా అథారిటీ అతనికి అక్రమ కట్టడాలపై స్థానికుల ఫిర్యాదు మేరకు నోటీసులు పంపింది. అయితే.. బీజేపీ నేత కావడంతో అధికారులు చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో ప్రస్తుత వివాద నేపథ్యంలో అతను తమ పార్టీ సభ్యుడు కాదంటూ బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. -
వ్యాట్ పెంచం.. కొత్త పన్నులు ఉండవు: సీఎం యోగి
లక్నో: అధిక ధరలు, పన్నుపోటు పరిస్థితులు ప్రస్తుతం దేశం మొత్తం కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఉత్తర ప్రదేశ్ ప్రజలకు యోగి సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రజా ప్రయోజనాల దృష్ట్యా.. రాబోయే రోజుల్లో వ్యాట్VATను పెంచడం, కొత్త పన్నుల విధింపు లాంటి కఠిన నిర్ణయాలు ఉండవని స్వయంగా సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు. ప్రభుత్వ ఆదాయ సేకరణ మీద శుక్రవారం సాయంత్రం తన నివాసంలో ట్యాక్స్ విభాగంతో సుదీర్ఘ మంతనాలు జరిపిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్‌ను సమీప భవిష్యత్తులో పెంచే ప్రసక్తే ఉండదని, అలాగే కొత్తగా ప్రజలపై ఎలాంటి పన్నులు విధించబోమని ఆయన స్పష్టం చేశారు. పేద, మధ్య తరగతి వర్గాలను ఇబ్బంది పెట్టకుండా ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని ఆయన అధికారులను కోరారు. అలాగే.. జీఎస్టీ రిజిస్టర్డ్ పరిధిలోకి బడా వ్యాపారులెవరినీ వదలకుండా తీసుకురావాలని, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ఆయన అధికారులకు సూచించాడు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ లక్షా యాభై వేల కోట్ల ఆదాయాన్ని జీఎస్టీ, వ్యాట్ రూపంలో వసూలు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది యోగి సర్కార్. చదవండి: 'మహా' కేబినెట్ విస్తరణ ఆలస్యం అందుకేనా? -
యోగి సర్కార్ తీరు సరికాదు: ఒవైసీ
లక్నో: ఉత్తర ప్రదేశ్ సర్కార్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వెల్లగక్కారు. కన్వర్ యాత్ర సందర్భంగా.. కన్వరియాల మీద పూలు జల్లడం కోసం ప్రభుత్వ నిధుల్ని వెచ్చించడాన్ని, భక్తులకు పోలీసుల కాళ్లు నొక్కి, పూలతో స్వాగతం పలుకుతూ సేవలు చేయడానికి అధికారుల్ని సర్కార్ నియమించడాన్ని ఒవైసీ తప్పుబట్టారు. ఒకవైపు యూపీ ప్రభుత్వం కన్వర్ యాత్ర కోసం పూలు జల్లేందుకు అధికారుల్ని నియమిస్తోంది. ఎక్కడ చూసిన అవే కథనాలు కనిపిస్తున్నాయి. సంతోషం. అదే సమయంలో ముస్లింల ఇళ్లను కూల్చడానికి బుల్డోజర్లను అదే అధికారులతో పంపిస్తోంది. ముస్లింలు తమ మీద పూలు చల్లమని కోరుకోవడం లేదు.. కనీసం బుల్డోజర్లను తమవైపు పంపించొద్దని కోరుకుంటున్నారు. कांवड़ियों के जज़्बात इतने मुतज़लज़ल हैं कि वे किसी मुसलमान पुलिस अहलकार का नाम भी बर्दाश्त नहीं कर सकते। यह भेद-भाव क्यों? यकसानियत नहीं होनी चाहिए? एक से नफ़रत और दूसरों से मोहब्बत क्यों? एक मज़हब के लिए ट्रैफिक डाइवर्ट और दूसरे के लिए बुलडोज़र क्यों? 3/n pic.twitter.com/DPZwC02iNF — Asaduddin Owaisi (@asadowaisi) July 26, 2022 బహిరంగ ప్రాంతాల్లో కొన్ని నిమిషాలపాటు ముస్లింలు నమాజ్ చేస్తే.. నానా రభస చేస్తున్నారు. అదొక రచ్చ అవుతోంది. పోలీస్ కేసులు, బుల్లెట్లు, ఘర్షణలకు కారణం అవుతోంది. ఎన్ఎస్ఏ, యూఏపీఏ, మూకదాడులు-హత్యలు ఇవన్నీ ముస్లింలకేనా? అని ప్రశ్నించారు ఒవైసీ. లూలూ మాల్ వ్యవహారం తర్వాత యూపీలో చాలా చోట్ల బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌లు చేసేవాళ్లను అరెస్ట్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలోనే ఎంపీ ఒవైసీ ఇలా అసహనం వ్యక్తం చేశారు. కన్వరియాల మనోభావాలు చాలా బలంగా ఉంటాయి. వారు ముస్లిం పోలీసు అధికారి పేరును కూడా సహించలేరు. ఎందుకు ఈ భేదం? ఒకరిని ద్వేషించి మరొకరిని ఎందుకు ప్రేమించాలి? ఒక మతం కోసం ట్రాఫిక్‌ను మళ్లించి, మరో మతానికి బుల్డోజర్లను ఎందుకు మళ్లించారు అంటూ ట్విటర్లో పోస్టులు చేశారు ఒవైసీ. ఇదీ చదవండి: కేసీఆర్‌ను ఓడించకపోతే నా జీవితానికి సార్థకత లేదు -
యోగి సర్కార్‌పై కోర్టు ధిక్కరణ దావా!
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ యోగి సర్కార్‌పై కోర్టు ధిక్కరణ దావాకి సిద్ధమయ్యారు సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజాం ఖాన్. రామ్పూర్లోని తన యూనివర్సిటీని సీల్ చేసిన విషయంలో యోగి ప్రభుత్వంపై కోర్టుకెక్కనున్నట్లు ప్రకటించారు ఆజాం ఖాన్. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. తనకు చెందిన మొహమ్మద్ అలీ జవుహార్ యూనివర్సిటీ చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించకపోవడంపై కోర్టు ధిక్కరణ కింద సుప్రీంను ఆశ్రయించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సుప్రీం కోర్టు సైతం ఈ వ్యవహారంపై గురువారం యూపీ ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. ఫెన్సింగ్ తొలగించకపోవడం వల్ల.. యూనివర్సిటీ కార్యకలాపాలు నిలిచిపోయానని కోర్టుకు తెలిపారు ఆజాంఖాన్. ఈ మేరకు జస్టిస్ ఏఎం ఖాన్‌వలీకర్, జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసం.. జులై 19లోపు వివరణ ఇవ్వాలని యూపీ సర్కార్‌ను కోరుతూ.. జులై 22వ తేదీకి విచారణను వాయిదా వేసింది. మే 27వ తేదీన జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బెలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన యూనివర్సిటీ స్థలాల జప్తు ఆదేశాలపై స్టే విధించింది. ఈ క్రమంలో యూనివర్సిటీ ఫెన్సింగ్‌ను తొలగించకపోవడం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆక్రమించారు ఆయన. ఇదిలా ఉంటే.. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరున్న ఆజాం ఖాన్.. వివాదాస్పద వ్యాఖ్యలు, వైఖరితో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు కూడా. భూ కబ్జాతో పాటు చాలా కేసులు ఆయనపై నమోదు అయ్యాయి. ఒకానొక తరుణంలో ఆయన జైలు శిక్షపై న్యాయస్థానాల్లోనూ ఆసక్తికరమైన చర్చ కూడా నడిచింది. మరోవైపు రాజకీయ వైరంతోనే జైలుకు పంపారంటూ ఆజాం ఖాన్ అనుచరులు ఆరోపిస్తున్నారు. మొన్న యూపీ ఎన్నికల్లో జైలు నుంచే ఆయన ఘన విజయం సాధించడం విశేషం. 27 నెలలు జైల్లో గడిపిన ఈయన.. మే నెలలో జైలు నుంచి విడుదల అయ్యారు. -
సీఎం యోగి ఆదేశాలు.. వీడిన మర్డర్ కేసు మిస్టరీ
లక్నో: అవును.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆదేశాలతోనే ఆ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. అయోధ్య పర్యటనలో ఉండగా స్థానికంగా ఓ గర్భిణి హత్య గురించి విని ఆయన ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించగా.. విమర్శల నడుమే ఎట్టకేలకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఆ కేసు చిక్కుముడి విప్పారు. అయోధ్య కోట్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాంపురం కాలనీలో జూన్ 1వ తేదీన ప్రభుత్వ ఉపాధ్యాయిని సుప్రియా వర్మ(35) దారుణ హత్యకు గురైంది. పదునైన ఆయుధంతో ఎవరో ఆమె వీపుభాగంలో పొడిచి చంపి.. దొపిడీకి పాల్పడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారు. పైగా ఆమె ఐదు నెలల గర్భవతి. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించగా.. ఆదేరోజు అయోధ్య పర్యటనలో ఉన్న సీఎం యోగికి విషయం తెలిసింది. వెంటనే ఆయన ఉత్తర ప్రదేశ్ డీజీపీకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆధారాలేవీ దొరక్కపోవడంతో ఈకేసులో విచారణ కష్టతరంగా మారింది. ఈ తరుణంలో.. రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. స్వయంగా సీఎం యోగి ఆదేశించినా ఫలితం లేకుండా పోయిందంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలో టీషర్టు ధరించిన ఓ యువకుడిని గుర్తించారు. ఆ కంపెనీ టీషర్టుల ఆన్లైన్ డెలివరీల మీద ఆరా తీసి.. చివరికి నిందితుడిని పట్టేశారు. శారీరక సంబంధమే! అంబేద్కర్‌నగర్ జిల్లా పథాన్పూర్ ఎట్రావులికి చెందిన సుప్రియా వర్మ.. పోస్టింగ్ రిత్యా అయోధ్యలో ఉంటోంది. ఆమె భర్త ఉమేష్ వర్మ కూడా ప్రభుత్వ టీచరే. ఈ క్రమంలో స్థానికంగా ఉంటున్న ఓ మైనర్‌తో ఆమె సంబంధం నడిపించింది. అయితే ఆమె గర్భం దాల్చడంతో భయపడ్డ మైనర్.. ఎలాగైనా ఆ సంబంధం తెంచుకోవాలనుకున్నాడు. కానీ, ఆమె మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో.. కుటుంబం పరువు పోతుందని భయపడ్డ ఆ కుర్రాడు దారుణానికి తెగబడ్డాడు. హత్యను దోపిడీగా చిత్రీకరించేందుకు.. ఇంట్లో నుంచి యాభై వేల రూపాయల నగదును, ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సీఎంవో కార్యాలయానికి అందజేసినట్లు అయోధ్య డీఐజీ ఏకే సింగ్ వెల్లడించారు. -
ప్రయాగ్‌రాజ్ అల్లర్లు: బుల్డోజర్లను దించేసిన యోగి
ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి బుల్డోజర్లు రంకెలేశాయి. తాజా ప్రయాగ్‌రాజ్ అల్లర్లకు పాల్పడిన నిందితుల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు అక్కడి అధికారులు. నూపుర్ కామెంట్లకు వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు కాస్త హింసకు దారి తీశాయి. ప్రయాగ్‌రాజ్ అల్లర్లకు సంబంధించిన కేసులో మాస్టర్ మైండ్‌గా జావేద్ అహ్మద్ ఇంటిని కూడా ప్రభుత్వం కూల్చేవేతకు దిగింది. లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ సర్కార్ మళ్లీ యాక్షన్ లోకి దిగింది. తాజా సహ్రాన్‌పూర్ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరి ఇళ్లను ప్రభుత్వ ఆదేశాలతో బుల్డోజర్లతో కూల్చివేశారు స్థానిక అధికారులు. ఇవాళ ప్రయాగ్ రాజ్ లో అల్లర్లకు బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టారు. శుక్రవారం ప్రయాగ్ రాజ్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా జావెద్ అహ్మద్ ఉన్నాడు. తాజాగా అతని ఇంటిని కూల్చేశారు ప్రయాగ్ రాజ్ అధికారులు. కరెయిలి పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసుల పహారాలో జావేద్ ఇంటిని నేలమట్టం అయ్యింది. ఆ సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అంతకు ముందు పోలీసులు బుల్డోజర్లతో రావడంతో జావేద్ ఇంటి వద్ద హైడ్రామా జరిగింది. అయినా భారీ బందోబస్తు మధ్య నిమిషాల్లోనే ఇంటిని కూల్చేశారు స్థానిక అధికారులు. ఇదిలా ఉంటే.. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఉద్యమకారుడైన జావేద్ అహ్మద్.. అక్రమంగా ఆ ఇంటిని నిర్మించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ప్రయాగ్‌రాజ్ డెవలప్మెంట్ అథారిటీ గత నెలలోనే నోటీసు కూడా జారీ చేసింది. దాన్నొక అక్రమ భవనంగా ప్రకటిస్తూ.. మే 25న పీడీఏ జావేద్ అహ్మద్‌కు ఓ కాపీ కూడా పంపింది. తాజాగా రెండోసారి నోటీసులు పంపించారు. శనివారం ఉదయం 11 గంటలలోగా ఇల్లు ఖాళీ చేయాలని.. లేకుంటే కూల్చివేత తప్పదని నోటీసులో పేర్కొన్నారు. అయినా జావేద్ భార్య, పిల్లలు ఇల్లు ఖాళీ చేయలేదు. దీంతో జావేద్ ఇంటికి వచ్చిన అధికారులు.. మొదట సామాగ్రిని బయటకు తెచ్చారు. తర్వాత బుల్డోజర్ తో ఇంటిని నేలమట్టం చేశారు. తమ తండ్రిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారని, ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని, ఇప్పుడు ఇంటిని కూల్చేశారని జావేద్ కూతురు అఫ్రీన్ ఫాతిమా ప్రభుత్వ తీరుపై మండిపడుతోంది. యూపీలో అల్లర్లకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని గతంలోనే సీఎం యోగీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం జరిగిన అల్లర్ల కేసులో మాస్టర్ మైండ్ గా ఉండటంతో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ కు దిగింది. నిందితుల ఇళ్లను కూల్చివేయాలని ఆదేశించింది. ప్రయాగ్ రాజ్ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 306 మందిని పోలీసులు గుర్తించారు. ప్రయాగ్‌రాజ్‌లో 91 మంది, అంబేద్కర్‌నగర్‌లో 34, సహ్రాన్‌పూర్‌లో 71 మంది, హాథ్రస్లో 51 మంది, మురాదాబాద్‌లో 31 మందిని అరెస్ట్ చేశారు. #WATCH | Uttar Pradesh: Demolition drive at the "illegally constructed" residence of Prayagraj violence accused Javed Ahmed continues in Prayagraj. pic.twitter.com/s4etc8Vz25 — ANI UP/Uttarakhand (@ANINewsUP) June 12, 2022 Lucknow, UP | 306 people arrested related to incidents of June 10. 13 injured cops are getting treatment. The situation is normal across the state. Social media is being monitored as well: Prashant Kumar, ADG, Law&Order, UP Police pic.twitter.com/oc4ZThhLjz — ANI UP/Uttarakhand (@ANINewsUP) June 12, 2022 -
CM Yogi Adityanath: యోగి ఔర్ ఏక్.. మదర్సాలకు షాక్
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు మరో కీలకమైన నిర్ణయంతో సంచలనం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మదర్సాలకు ఎటువంటి నిధులు ఇవ్వకూడదన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఆయన కేబినెట్. దీంతో యూపీలోని చాలావరకు మదర్సాలకు ప్రభుత్వం నుంచి ఇకపై రూపాయి అందదు. మదర్సాలు అన్నీ కూడా జాతీయ గీతం ఆలపించడాన్ని ఇటీవలే యోగి సర్కారు తప్పనిసరి చేసింది. మదర్సాల్లో తరగతులు ఆరంభానికి ముందు విద్యార్థులు, టీచర్లు అందరూ జాతీయగీతం ఆలపించాలంటూ మైనారిటీ శాఖ ఈ నెల 12న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఇచ్చిన వారం వ్యవధిలోనే.. కొత్త మదర్సాలను ప్రభుత్వ నిధుల సాయం నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం నిధుల సాయం నుంచి కొత్త సంస్థలనే మినహాయించారు. యూపీ సర్కారు మదర్సాల ఆధునికీకరణ పథకానికి గత బడ్జెట్ లో రూ.479 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నిధులతో మదర్సాలను ఆధునికీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 వేలకుపైగానే మదర్సాలు ఉన్నాయి. కానీ, వాటిలో 558 మదర్సాలకు మాత్రమే ప్రభుత్వం నిధులను అందించనుంది. దీంతో మిగిలిన వేలాది మదర్సాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధుల సాయం అందదు. చదవండి: కశ్మీరీ ఫైల్స్.. రక్తపు కూడు సీన్లు ఏంటసలు? -
అనూహ్యం: డీజీపీని తప్పించిన సీఎం యోగి
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర డీజీపీ ముకుల్ గోయల్‌ను అర్ధాంతరంగా తప్పిస్తున్నట్లు బుధవారం సాయంత్రం ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన నేపథ్యంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పనులను పట్టించుకోకపోవడం, శాఖాపరమైన పనులపై ఆసక్తి చూపడం లేదంటూ డీజీపీ పదవి నుంచి ఆయన్ని తప్పిస్తున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది జూన్‌లోనే యూపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు ముకుల్ రాయ్. ప్రస్తుతం డీజీపీ పోస్ట్ నుంచి ముకుల్ గోయల్‌ను సివిల్ డిఫెన్స్ డీజీ పోస్టుకు పంపించారు. ఇంటెలిజెన్స్ డీజీ డీఎస్ చౌహాన్ యూపీకి తర్వాతి డీజీపీ అయ్యే అవకాశం ఉంది. 1987 ఉత్తర ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ముకుల్ గోయల్.. గతంలో పలు కీలక పదవులు చేపట్టారు. గతంలో బీఎస్ఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్‌గానూ ఆయన బాధ్యతలు నిర్వహించారు. పోలీసు రిక్రూట్మెంట్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 2007లో మాయావతి సర్కార్ ముకుల్‌పై సస్పెన్షన్ వేటు వేసింది కూడా. చదవండి👉🏼: మాజీ ఐపీఎస్‌పై ట్రోలింగ్! కారణం ఏంటంటే.. -
సీఎం యోగి ఆదిత్యానాథ్.. ఎన్నేళ్లకెన్నేళ్లకు!
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.. తన వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పటివరకైతే చూసింది లేదు. అలాంటి వ్యక్తి.. సుమారు 28 ఏళ్ల తర్వాత సొంతూర్లో అడుగుపెట్టారు. అంతేకాదు తల్లి ఆశీర్వాదంతో భావోద్వేగానికి లోనయ్యారు. యోగి ఆదిత్యానాథ్ సొంతూరు ఉత్తరాఖండ్‌లోని పౌరీ. సుమారు 28 ఏళ్ల తర్వాత ఆయన ఆ ఊరిలో అడుగుపెట్టారు. అంతేకాదు యూపీకి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తన తల్లిని కలవడం ఇదే తొలిసారి!. అందుకే ఆమె ఆశీర్వాదం తీసుకుని ఆప్యాయంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయనే ట్విటర్లో షేర్ చేశారు. माँ pic.twitter.com/3YA7VBksMA — Yogi Adityanath (@myogiadityanath) May 3, 2022 బుధవారం యోగి మేనల్లుడి పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమం ఉంది. అందుకోసమే ఆయన సొంతూరికి వెళ్లారు. సీఎంగా ఒక అధికారిక కార్యక్రమం బదులు.. సొంత పని మీద వెళ్లడం ఆయనకు ఇదే తొలిసారి కావడం విశేషం. కరోనా టైంలో(ఏప్రిల్ 2020) హరిద్వార్‌లో ఆయన తండ్రి చనిపోగా.. అంత్యక్రియలకు ఆయన హజరు కాలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తగా.. కరోనా టైంలో 23 కోట్ల మందికి తండ్రిగా బాధ్యతలు తనపై ఉన్నాయని, అలాంటిది తానే కొవిడ్ నిబంధనలు పాటించకపోతే ఎలా అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకు ముందు పౌరీ జిల్లా కేంద్రంలోని మహాయోగి గురు గోరఖ్‌నాథ్ ప్రభుత్వ కళాశాలలో తన ఆధ్యాత్మిక గురువైన మహంత్ అవైద్యనాథ్ విగ్రహాన్ని ఆవిష్కరించారాయన. చదవండి: విభజన రాజకీయాలు దేశానికి మంచివికావు -
ఆ 5 రాష్ట్రాల్లో ఎన్నికలైతే, ఢిల్లీలో పార్టీల ప్రచారమెందుకు? కారణం ఇదే..
More than half of Delhi’s assembly seats are dominated by migrants from other states న్యూఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఐతే ఈ ఎన్నికల జాబితాలో ఢిల్లీ లేనప్పటికీ అక్కడ ఎన్నికల జాతర జరుగుతోంది. ఢిల్లీ నలుమూలలా పోస్టర్లు వెలిశాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పోస్టర్లు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. ఢిల్లీలో ఎన్నికల జాతర.. ఆ మూడు రాష్ట్రాల వలసదారుల ఓట్లే కీలకం కాగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్లలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు 2022 జరగనున్నవిషయం తెలిసిందే. ఐతే వీటిలో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన పోస్టర్లు రాజధాని ఢిల్లీలో ఎక్కపడితే అక్కడ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వాలు చేస్తున్న పనులు ఏకరువు పెడుతున్న పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఐతే ఢిల్లీలో మొత్తం 70 విధానసభలు ఉన్నాయి. ఇక్కడ అధిక శాతం ప్రజలు యుపీ, బీహార్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాకు చెందిన వలసదారులు ఉంటున్నారు. అందువల్ల ఈ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఢిల్లీలోని వలసవాసుల దృష్టిని ఏదో ఒక విధంగా ఆకర్షించేందుకు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 27 స్థానాల్లో మెజార్టీ ప్రజలు పూర్వాంచలికి చెందిన వారే ఉన్నారని సమాచారం. అందుకేనేమో యోగి ప్రభుత్వం ఢిల్లీలో పోస్టర్లు వేసి అక్కడి వలసదారుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రజలవద్దకే పోస్టర్లు అలాగే ఢిల్లీ, వికాస్పురి, రాజౌరీ గార్డెన్, హరి నగర్, తిలక్ నగర్, జనక్‌పురి, మోతీ నగర్, రాజేంద్ర నగర్, గ్రేటర్ కైలాష్, జంగ్‌పురా, గాంధీ నగర్, మోడల్ టౌన్, లక్ష్మీ నగర్, రోహిణిలోని 13 స్థానాల్లో పంజాబీ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల చన్నీ ప్రభుత్వం ఇక్కడ పోస్టర్లు వేసి పంజాబీలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఢిల్లీలో కొండ ప్రాంత వలసదారుల సంఖ్య దాదాపు 30 లక్షలు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సీఎం ధామి పోస్టర్ల ద్వారా బీజేపీ ప్రచారం సాగిస్తోంది. కాగా ఢిల్లీ అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారులే ఆధికం. ఈ కారణంగానే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పోస్టర్లు ద్వారా ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నాయి. చదవండి: మోదీ Vs దీదీ: ప్రధానిపై మమత అసహనం.. మళ్లీ రాజుకున్న రాజకీయ రగడ! -
కంగనాకు రామ మందిర భూమి పూజలో వాడిన నాణెం బహూకరణ
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ ప్రస్తుతం నటిస్తున్న మూవీ ‘తేజస్’ మొరాదాబాద్‌లో శుక్రవారం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అనంతరం ఈ ‘క్వీన్’ స్టార్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్నోలో సీఎం అధికారిక నివాసంలో గౌరవ పూర్వకంగా కలిసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫైర్ బ్రాండ్ ఆయనకు థ్యాంక్స్ చెప్పింది. సీఎం యోగిని కలిసిన కంగనా వారిద్దరి సమావేశానికి సంబంధించిన వరుస ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా రాబోయే యూపీ ఎన్నికల్లో ఆయనే గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆ సమయంలో ఆయన రామ మందిర భూమి పూజలో ఉపయోగించిన రామ దర్బార్ నాణెం బహుమతిగా ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పింది. ఇదిలాఉండగా.. యూపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 75 జిల్లాల్లో స్పెసిఫిక్ సంప్రదాయ పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటు కోసం ఉద్దేశించిన ‘వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ)’కి కంగనాని అంబాసిడర్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నటికి ఓడీఓపీ ప్రోడక్ట్‌ని సీఎం అందజేశారు. ప్రస్తుతం కంగనా, సర్వేష్ మేవారా దర్శకత్వం వహిస్తున్న ‘తేజస్’లో ఐఏఎఫ్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. 'ఢాకాడ్', 'మణికర్ణిక రిటర్న్స్' మరియు 'సీత: ది ఇన్కార్నేషన్' సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. చదవండి: థియేటర్లను పూర్తిగా మూసేయ్యాలి అనుకుంటున్నారా..? View this post on Instagram A post shared by Kangana Thalaivii (@kanganaranaut) View this post on Instagram A post shared by Kangana Thalaivii (@kanganaranaut) -
కొత్త బిల్లు.. సీఎం యోగి మెడకే చుట్టుకుంటుందా ?
UP Population Control Bill లఖ్నౌ: జనాభా నియంత్రణకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ తీసుకువచ్చిన జనాభా నియంత్రణ బిల్లు అధికార పార్టీ మెడకు చుట్టుకుంటుందా ? పైకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ ప్రముఖులు ఈ బిల్లు సూపర్ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నా.. అంతర్గత సమావేశాల్లో దీనిపై గుర్రుగా ఉన్నటు సమాచారం. జనాభా నియంత్రణే లక్క్ష్యం జనాభా నియంత్రణ లక్క్ష్యంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం బర్త్ కంట్రోల్, స్టెబిలైజేషన్, వెల్ఫేర్ బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు అనర్హులుగా ప్రకటించారు. ఈ నిబంధనే ఇప్పుడు అధికార పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. బీజేపీ మెడకే ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో అధికార బీజేపీకి 304 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ బిల్లు కనున అసెంబ్లీ ఆమోదం పొంది చట్టంగా మారి.. అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈ చట్టం వర్తిస్తే... ప్రస్తుత ఎమ్మెల్యేల్లో సగానికి పైగా పోటీకి అనర్హులు అవుతారు. ఎందుకంటే వీరందరికీ ముగ్గురు లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. అసెంబ్లీలో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 387 సీట్లు ఉండగా ఇందులో అధికార పార్టీ బంపర్ మెజార్టీ సాధించింది. కమలం గుర్తు తరఫున మొత్తం 304 మంది అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అయితే ఇందులో 152 మంది ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండటం గమనార్హం. ఇక్కరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 137 మాత్రమే. మరో 15ను మందికి సంబంధించిన డేటా అందుబాటులో లేదు. ఈ సమాచారం ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ అధికారిక వెబ్సైట్లో ఉంది. పార్లమెంటులో ఇదే చట్టాన్ని పార్లమెంటుకు అన్వయిస్తే ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సభ్యుల్లో 168 మంది అనర్హులు అవుతారు. ఇక్కడ కూడా బీజేపీదే సింహభాగం. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన ఎంపీలు బీజేపీ తరఫున 105 మంది పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మరీ విచిత్రం ఏటంటే జనాభా నియంత్రణ బిల్లు -2019ను ప్రైవేటు బిల్లుగా పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు బీజేపీ ఎంపిక చేసిన జాబితాలో ఉన్న బీజేపీ ఎంపీ, భోజ్‌పూరి నటుడు రవిశంకర్‌కి ఏకంగా నలుగురు పిల్లలు ఉన్నారు. భిన్న స్వరాలు యోగి సర్కార్ జనాభా నియంత్రణ విధానాన్ని అధికార పార్టీలో పైకి ఎవరు విమర్శలు చేయకున్నా ‘ఆఫ్ ది రికార్డు’ సంభాషనల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారను. ఈ రోజు స్థానిక సంస్థలు రేపు అసెంబ్లీ ఎన్నికలు అంటే తమ పరిస్థితి ఏంటని మథనపడుతున్నారు. పైగా క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే నాయకులు అనర్హులైతే, ఆ... అసంతృప్తి అంతా తమకు చేటు తెస్తుందేమో అని మల్లగుల్లాలు పడుతున్నారు. 8 మంది పిల్లలు యూపీ అసెంబ్లీ వెబ్సైట్ వివరాల ప్రకారమే ఒక ఎమ్మెల్యేకు 8 మంది పిల్లలు ఉండగా మరో ఎమ్మెల్యేకు 7 గురు పిల్లలు ఉన్నారు. ఇక ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు 6 గురు పిల్లలు ఉన్నారు. 15 మందికి 5గురు సంతానం, 44 మందికి నలుగురు సంతానం ఉన్నారు. ముగ్గురు సంతానం కలిగిన ఎమ్మెల్యేలు 83 మంది ఉన్నారు. అధిక సంతానం కలిగిన పిల్లలు బీజేపీఎమ్మెల్యేల సంఖ్య సంఖ్య 1 8 1 7 8 6 15 5 44 4 83 3 103 2 34 1 -
‘తాజ్‌మహల్.. రామ్‌మహల్‌గా మారనుంది’
లక్నో: ఆగ్రాలోని తాజ్‌మహల్ పేరు రామ్‌మహల్ లేదా కృష్ణమహల్‌గా మారనుందని, యోగి ఆదిత్యనాథ్ రాజ్యంలో ఇది జరిగితీరుతుందని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీలోని బైరియా నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సురేంద్ర సింగ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తాజ్‌మహల్ ఒకప్పుడు శివాలయం అని, సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజ్‌మహల్ పేరును త్వరలో రామ్‌మహల్‌గా లేదా కృష్ణమహల్‌గా మార్చుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతటితో ఆగకుండా ఆయన సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను శివాజీ వారసుడితో పోల్చుతూ.. సమర్ గురువు రామ్‌దాస్ శివాజీని భారతదేశానికి ఇచ్చినట్లుగానే, గోరఖ్ నాథ్ బాబా యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తరప్రదేశ్‌కు ఇచ్చారని వ్యాఖ్యానించారు. -
యూపీలో వారాంతాల్లో లాక్డౌన్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్–19 కేసుల సంఖ్య 35 వేలు దాటిపోవడంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. వారాంతపు రోజుల్లో లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. వచ్చే శని, ఆదివారాల నుంచి అమలయ్యే ఈ నిబంధనలు ఈ నెలాఖరు వరకు అమల్లో ఉంటాయని రాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ(హోం, సమాచార) అవనీశ్ అవస్థి పేర్కొన్నారు. ముఖ్యంగా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జనసమ్మర్థం ఉండే మార్కెట్లు, కార్యాలయాలను ఈ రెండు రోజుల్లో మూసివేసి ఉంచుతామన్నారు. బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని మార్కెట్లు పనిచేస్తాయన్నారు. వచ్చే శని, ఆదివారాల్లో అన్ని రకాల దుకాణాల వద్ద ప్రత్యేక పారిశుధ్య, శానిటైజేషన్ కార్యక్రమాలను చేపట్టాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. దీంతోపాటు, ప్రభుత్వం ప్రకటించిన విధంగా శుక్రవారం రాత్రి నుంచి సోమవారం వరకు 55 గంటలపాటు ఆంక్షలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. -
సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు : గాయని బుక్
యూకేకు చెందిన గాయని తరన్ కౌర్ ధిల్లాన్ (హర్ద్ కౌర్) వ్యాఖ్యలు దుమారాన్నే రాజేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై వారణాసిలో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలీవుడ్ గాయని హర్ద్ కౌర్‌పై సెక్షన్ 124 ఏ, 153 ఏ, 500 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఏకంగా రేప్‌మేన్ అని పిలవాలంటూ సోషల్ మీడియాలో కమెంట్ చేశారు. అంతేకాదు మోహన్ భగవత్ ఉగ్రవాదిగా పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్బుక్లో తన అభిప్రాయాలను పోస్ట్ చేశారు. దీంతో వివాదం రాజుకుంది. పలువురు నెటిజర్లు ఆమెకు మద్దతిస్తుండగా, మరికొందరు ఆమె వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ప్రధానంగా వారణాసికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, న్యాయవాది శశాంక్ శేఖర్ ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారి అమర్ ఉజాలా తెలిపారు. FIR registered under sections 124A (Sedition), 153A, 500 ,505 of the Indian Penal Code and 66 IT Act against singer Hard Kaur for her comments against Uttar Pradesh CM Yogi Adityanath and RSS Chief Mohan Bhagwat. https://t.co/3XABzwKOJ6 — ANI (@ANI) June 20, 2019 -
యూనిఫాంతో మోకరిల్లిన సీఐ.. ట్రోలింగ్
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఓ సీనియర్ అధికారి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ముందు యూనిఫాంలో మోకరిల్లిన సదరు అధికారి.. పైగా ఆ ఫోటోలను తన ఫేస్బుక్లో పోస్టు చేశారు. దీంతో పలువురు ఆన్లైన్లో సీఐను ట్రోల్ చేయటం ప్రారంభించారు. గురుపూర్ణిమ సందర్భంగా గోరఖ్‌నాథ్ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆలయ పెద్ద ఆదిత్యానాథ్ హాజరయ్యారు. దీంతో భద్రత కోసం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ సింగ్ అక్కడికొచ్చారు. ఈ సందర్భంగా యోగి నుంచి ఆశీర్వాదం తీసుకున్న ప్రవీణ్.. ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచి ‘ఫీలింగ్ బ్లెస్స్డ్’ అంటూ పోస్ట్ చేశారు. వెంటనే విమర్శలు రావటంతో ప్రవీణ్ స్పందించలేదు. ‘నేను సీఎం హోదాలో ఆయనకా గౌరవం ఇవ్వలేదు. కేవలం ఆలయానికి పెద్దగా మాత్రమే పూజ చేశా’ అంటూ బదులిచ్చారు. అయితే చాలా మంది మట్టుకు మాత్రం ప్రవీణ్ చేసిన పనిని తప్పుబడుతున్నారు. యూనిఫాంలో ఆ పని చేయాల్సిన అవసరం ఏంటి? సిగ్గుందా? పోలీసుల పరువు తీసేశావ్.. ప్రభుత్వ ఉద్యోగివేనా? ఇలా పలువురు విరుచుకుపడుతున్నారు. మరోవైపు ట్రోలింగ్ కూడా ఓ రేంజ్‌లోనే జరుగుతోంది. -
మరోసారి వివాదంలో సీఎం యోగి ఆధిత్యనాథ్
-
ఇక దీన్ దయాల్ చికెన్....!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని ముఘల్సరాయ్ రైల్వే స్టేషన్‌ను మంగళవారం నాడు అధికారికంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ రైల్వే స్టేషన్‌గా మార్చారు. ఈ పేరు మార్చే ప్రక్రియను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితమే చేపట్టింది. ఈ స్టేషన్‌కు ఆయన పేరు పెట్టడానికి కారణం ఈ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని పట్టాలపైనే 1968, ఫిబ్రవరి 11వ తేదీన దీన్‌దయాల్ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. ఆయన ఆరెస్సెస్ సభ్యుడే కాకుండా భారతీయ జన్ సంఘ్ సహ వ్యవస్థాపకులు. ఇలా పేర్లు మార్చడం పట్ల పలువురు ట్వీట్లు పేలుస్తున్నారు. చికిన్ ముఘ్లాయిని ఇక చికెన్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ అని, బెంగాల్ ముఘ్లాయి పరోటాను, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పరోటా అని పిలవాలని సూచిస్తున్నారు. దీన్ దయాల్ బిర్యానీ, దీన్ దయాల్ టిక్నా, దీన్ దయాల్ కుర్మా, దీన్ దయాల్ చికెన్ టిక్కా... అంటూ పేర్లు పెడుతున్నారు. మెఘల్ ఏ ఆజమ్ సినిమా పేరును కూడా మార్చాలని కోరుతున్నారు. ఇంతకు ఈ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఎవరని, ఆయన దేశానికి చేసిన సేవలేమిటో చెప్పండంటూ కొందరు నిలదీస్తున్నారు. లాల్ బహదూర్ శాస్త్రీ ముఘల్‌సరాయ్‌లో పుట్టారని, ఆయన స్వాతంత్య్ర యోధుడని, ఆయన దేశానికి రెండో ప్రధాన మంత్రి అని, రైలు ప్రమాదం జరిగినందుకు ఆయన తన రైల్వే శాఖకు రాజీనామా చేశారని, పెడితే అలాంటి గొప్పవ్యక్తి పేరు పెట్టాలని, ఆయన దీన్ దయాల్ లాగా రైలు పట్టాలపై చనిపోకపోవడమే ఆయన తప్పా? ట్విటర్లో పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు పేరు మార్చడం వల్ల ఒరిగేది ఏముందని, మౌలిక సౌకర్యాలను మెరగుపర్చాలని కొందరు సూచిస్తున్నారు. రైళ్లు సక్రమంగా వచ్చేలా, సవ్యంగా నడిచేలా చూడాలని, స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు. యోగి ఆధిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్రంలో ఆయన పలు పేర్లను మారుస్తున్నారు. ఆయన గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్నప్పటి నుంచే గోరఖ్‌పూర్‌లోని ఉర్దూ బజార్‌ను హిందీ బజార్‌గా, అలీ నగర్‌ను ఆర్య నగర్‌గా, మియా బజార్‌ను మాయా బజార్‌గా, ఇస్లామ్పూర్ను ఈశ్వర్పూర్గా, హుమాయున్ నగర్‌ను హనుమాన్ నగర్‌గా మార్చారు. తాజ్ మహల్‌ను తాను రామ్ మహల్ అని పేరు మార్చడానికి కూడా తాను వెనకాడనని యోగి ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇండియాను హిందుస్థాన్‌గా మారుస్తూ కూడా రాజ్యాంగాన్ని సవరించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం ఔరంగాజేబ్ రోడ్డును అబ్దుల్ కలామ్ రోడ్డని, అక్బర్ ఫోర్ట్‌ను అజ్మీర్ ఫోర్ట్‌ని కూడా మార్చింది. పేర్లు మార్చినప్పటికీ ప్రజలు మాత్రం పాతపేర్లనే ఇప్పటికీ ఉచ్ఛరిస్తున్నారు. -
మోదీ జాలీ రైడ్.. కేజ్రీకి అవమానం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో కొత్త మెట్రో రైల్ లైన్ ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి నోయిడాను కలిపే మాజెంటాలైన్‌ను క్రిస్టమస్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. నోయిడాకు తొలి మెట్రో రైల్ కూడా ఇదే. దాదాపు 12.6కిలోమీటర్ల పొడవునా నిర్మించిన ఈ మార్గం ఢిల్లీలోని కాల్కాజీ నుంచి నోయిడా వరకు ఉంది. ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇతర ప్రభుత్వ అధికారులు తొలిసారి ఈ రైలులో నోయిడా నుంచి ఓక్లా బర్డ్ శాంక్చూరి స్టేషన్ వరకు ప్రయాణించారు. అయితే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తీవ్ర అవమానం జరిగింది. ఆయనను మరోసారి మెట్రో రైల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. ఢిల్లీలో మెట్రో కొత్త లైన్ ప్రారంభంకావడం ఆ కార్యక్రమానికి కేజ్రీవాల్‌ను ఆహ్వానించకపోవడం ఇది మూడోసారి. అయితే, ఈ మూడుసార్లు కూడా ప్రధాని మోదీ మాత్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ పట్ల బీజేపీ ప్రభుత్వ వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కిందిస్థాయి మనస్తత్వంతో వ్యవహరిస్తోందని మండిపడింది. కేజ్రీవాల్ అంటే బీజేపీకి ఏహ్యభావం ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించారు. క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన రాజకీయాలపై ప్రస్తుతం చర్చ అవసరం లేదని అన్నారు. -
దటీజ్ యోగి అంటే.. ఇప్పుడు నమ్ముతారా?
సాక్షి, నోయిడా : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. యోగి ఆధునికవాది కాదు అని మాట్లాడుకునే వారందరికి నేటి ఆయన అడుగు కనువిప్పు అన్నారు. యోగి అంటే ఏమిటో ఇప్పటికే అందరికీ అర్ధమైందనుకుంటున్నాను అని చెప్పారు. క్రిస్టమస్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ నోయిడాకు కొత్త మెట్రో రైల్ ప్రారంభించారు. అయితే, నోయిడాకు శాపగ్రస్త నగరం అనే పేరున్న కారణంగా గతంలో ముఖ్యమంత్రులు అయిన వారెవ్వరూ కూడా ఆ నగరంలో అడుగుపెట్టే సాహసం చేయలేదు. కానీ, తొలిసారి సీఎం యోగి మాత్రం నోయిడాలో మెట్రో ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ యోగి ముందడుగును ప్రశంసించారు. ‘యోగి వేసుకున్న బట్టల ఆధారంగా ఆయన ఆధునికవాది కాదని అందరూ అనుకుంటారు. కానీ, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం యోగి చేశారు. నోయిడాకు శాపం ఉందనే విషయాన్ని పక్కకు పెట్టి ఆయన నగరంలో అడుగుపెట్టారు. నమ్మకం అనేది ముఖ్యం.. గుడ్డి నమ్మకం ఆహ్వానించదగినది కాదు’ అని మోదీ అన్నారు. ’నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లోకి అడుగుపెట్టవద్దని చాలా మంది చెప్పారు. కానీ, నేను మాత్రం ఆ మాటలు పట్టించుకోలేదు. వారు వద్దు అని చెప్పిన ప్రతి చోటులో అడుగుపెట్టి చూశాను. ఎన్నో ఏళ్లుగా క్షుద్రపూజలపై, మంత్ర శక్తులపై, శాపాలపై నమ్మకంతో పలువురు నాయకలు కొన్ని ప్రాంతాల్లో అడుగే పెట్టలేదు. ఇది ఎంతటి దురదృష్టం. అసలు అలాంటివి నమ్మి ఆ ప్రాంతాలకు దూరంగా ఉండేవాళ్లు ముఖ్యమంత్రిగా ఉండేందుకు అనర్హులు’ అని మోదీ అన్నారు. -
గాంధీ ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం యోగి
-
మరో రుణమాఫీ మోసం
సాక్షి, లక్నో: రుణమాఫీ ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ఉపయోగపడుతుందే తప్ప రైతులకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలు కూడా రైతు రుణమాఫీకి హామీలు ఇచ్చాయి. తీరా అమలు చేయమని అడిగితే మాత్రం ప్రభుత్వాలు మొహం చాటేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఉత్తర ప్రదేశ్ కూడా చేరింది. గత ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 'కృషి రిన్ మోచన్ యోజనా' పేరుతోఆ రాష్ట్ర రైతులందరికి రూ.లక్ష వరకు రుణ మాఫీ చేసే నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సుమారు 2.5కోట్లమంది చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందుతారని ప్రకటించింది. కానీ అమలులో మాత్రం రైతుకు అన్యాయమే జరిగింది. ఒక్కక్కరికి రూ.10, రూ.215 లు రుణమాఫీ అయినట్లు సాక్షాత్తు కార్మిక సంక్షేమ శాఖా మంత్రి మన్ను కొరి సర్టిఫికేట్లు ఇచ్చారు. దీంతో రైతులు తమకు మాఫీ అయిన మొత్తాన్ని చూసుకొని అవాక్కయ్యారు. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్రి గ్రామానికి చెందిన శాంతి దేవకి రూ.1.55 లక్షలు ఉండగా కేవలం రూ.10.37 మాత్రమే రుణమాఫీ జరిగింది. మౌదాహా గ్రామానికి చెందిన మున్నిలాల్కు రూ.40 వేలు ఉండగా కేవలం రూ.215 రుణమాఫీ అయింది. ఇలాంటి సన్నివేశాలు డజన్లకొద్ది వెలుగులోకి వచ్చాయి. అయితే వీటిపై మంత్రి స్పందించారు. నియమావళి ప్రకారం రైతులకు రుణమాఫీ జరిగిందన్నారు. దీంతో ప్రతిపక్షాలు యోగీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. రుణమాఫీ పేరుతో ప్రజలకు వంచించాయిని దుయ్యబట్టాయి. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ మాట్లాడుతూ ఇది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం అని, రైతులను అవమానించినట్లేనని విమర్శించారు. -
రేపు నామినేషన్ వేయనున్న ముఖ్యమంత్రి
- యూపీలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు - బరిలో యోగి సహా పలువురు మంత్రులు సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు డిప్యూటీ సీఎంలు మంగళవారం శాసనమండలి సభ్యత్వం కోసం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం, గోరఖ్‌పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్.. యూపీ సీఎంగా ప్రమాణం చేయడం తెలిసిందే. ప్రమాణం చేసేనాటికి యోగితోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు, ఇద్దరు మంత్రులు రాష్ట్ర చట్టసభలో సభ్యులు కారు. వీరంతా ఆరు నెలల లోపు.. అంటే ఈనెల 19వ తేదీ కల్లా శాసనసభ్యులు కాకుంటే చట్టసభల్లో అడుగుపెట్టే అర్హత కోల్పోతారు. దీంతో వారికి అవకాశం కల్పించడం కోసం నలుగురు బీజేపీ ఎమ్మెల్సీలు(బుక్కల్ నవాబ్, యశ్వంత్, సరోజిని అగర్వాల్, అశోక్ బాజ్‌పాయ్) రాజీనామా చేశారు. అలా ఖాళీ అయిన స్థానాల్లో ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈనెల 5వ తేదీలోగా నామినేషన్ పత్రాల దాఖలు, ఆరో తేదీన పరిశీలన, ఉప సంహరణకు ఈనెల 8వరకు గడువు ఇచ్చిన ఈసీ 15న పోలింగ్ నిర్వహించనుంది. అదేరోజు లెక్కింపు కూడా పూర్తవుతుంది. రేపు నామినేషన్ దాఖలు చేయనున్నవారిలో సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ్‌ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ, మంత్రులు స్వతంత్రదేవ్ సింగ్, మోహ్సిన్ రజాలు ఉన్నారు. -
అసెంబ్లీ పేల్చివేత కుట్ర.. ఊహించని మలుపు
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పేల్చివేత కుట్ర కేసు ఊహించని మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సభలో వెల్లడించినట్లు.. ఎమ్మెల్యే సీటు కింద దొరికింది అసలు పేలుడు పదార్థం కానేకాదని తేలింది. దీంతో మామూలు పౌడర్‌ను శక్తిమంతమైన బాంబుగా పేర్కొంటూ తప్పుడు నివేదిక ఇచ్చిన ఫోరెన్సిక్ అధికారిపై వేటు పడింది. జులై 13న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఓ ఎమ్మెల్యే సీటు కింద అనుమానాస్పద ప్యాకెట్ లభించడం, అధికారులు చెప్పినదాన్ని బట్టి అది బాంబేనని సీఎం ప్రకటించడంతో కలకలం చెలరేగిన సంగతి తెలిసిందే. నాటి ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. 50 రోజులపాటు పలు కోణాల్లో దర్యాప్తు చేసి చివరికి నిజాన్ని నిగ్గుతేల్చారు. ‘‘ఆ ప్యాకెట్లో ఉన్నది కేవలం పౌడర్ మాత్రమే. కానీ ఫోరెన్సిక్ అధికారి దానిని శక్తిమంతమైన పెంటాఎరిత్రిటాల్ టెట్రానైట్రేట్ (పీఈటీఎన్)గా చెప్పారు. తప్పుడు ధృవీకరణ ఇచ్చి భయభ్రాంతికి కారణమైన అతనని సోమవారం అరెస్ట్ చేశాం’’ అని యూపీ పోలీస్ ఉన్నతాధికారి మీడియాకు చెప్పారు. ఆ అధికారి ఎందుకలా చెప్పారు? అసలు ఆ ప్యాకెట్ ఎమ్మెల్యే సీటు కిందికి ఎలా వచ్చింది? అనే విషయాలు త్వరలోనే తేలతాయని పేర్కొన్నారు. -
యోగి రాష్ట్రంలో మరో అమానుషం!
-
యోగి రాష్ట్రంలో మరో అమానుషం!
అత్యాచార బాధితురాలిపై మరోసారి యాసిడ్ దాడి లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సామూహిక అత్యాచార బాధితురాలిపై యాసిడ్ దాడి జరిగింది. లక్నోలో బాధితురాలు నివసస్తున్న హాస్టల్ వద్దే ఈ ఘటన జరిగింది. హ్యాండ్‌పంప్ వద్ద నీళ్లు పట్టుకునేందుకు వచ్చిన ఆమెపై.. దుండగులు యాసిడ్ పోశారు. ఘటనలో బాధితురాలి మెడ కుడిభాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. హాస్టిల్ వద్ద పోలీసు భద్రత ఉన్నప్పటికీ ఫలితం లేకపోయింది. బాధితురాలిపై తొమ్మిదేళ్ల క్రితం అత్యాచారం జరగ్గా.. ఆమెపై యాసిడ్ దాడి జరగడం ఇది నాలుగోసారి. రాయ్‌బరేలికి చెందిన మహిళపై 2008లో సామూహిక అత్యాచారం జరిగింది. దీనికి సంబంధించిన కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ నేపథ్యంలోనే 2011, 2013లో ఆమెపై యాసిడ్ దాడులు జరిగాయి. దీంతో ఆమె నివసిస్తున్న హాస్టల్ వద్ద పోలీసు పహారా ఏర్పాటుచేశారు. అయినప్పటికీ ఈ ఏడాది మార్చిలో మళ్లీ బాధితురాలిపై యాసిడ్ దాడి జరిగింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆమెను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరామర్శించి.. నష్టపరిహారం అందించారు. తాజాగా మరోసారి బాధితురాలిపై దుండగులు యాసిడ్ పోసారు. సామూహిక అత్యాచారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల వర్గీయులే వరుస దాడులకు పాల్పడుతున్నారని బాధితురాలు ఆరోపించింది. -
'బార్' వివాదంపై స్పందించిన స్వాతి సింగ్
లక్నో: తాను చేసిన ఒకే ఒక్క పనితో ఉత్తరప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్వాతి సింగ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు. 'బీ ద బీర్' అనే పేరుగల లగ్జరీ బార్‌ను ప్రారంభించడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తి సీఎంగా ఉన్న యూపీలో సాక్షాత్తు మంత్రులే మద్యానికి ప్రచారం కల్పించడంతో దేశ వ్యాప్తంగా మంత్రి స్వాతి పేరు మార్మోగిపోయింది. ఈ వివాదంపై మహిళా మంత్రి స్పందించారు. 'బార్ ఓపెనింగ్ వివాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ నన్ను వివరణ అడిగిన మాట వాస్తవమే. అయితే వివరణ ఇచ్చుకునేందుకు నా వద్ద ఏ సమాచారం లేదు. ఇంతకంటే నేను మీకు ఏం చెప్పలేనని' పేర్కొన్నారు. ఓ వైపు బీఫ్ నిషేధమంటూ.. మరోవైపు బీర్‌ను పొంగిస్తూ ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారని యూపీ బీజేపీపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తాను సీఎం అయ్యాక యూపీలో అల్లరిమూకల ఆట కట్టించేందుకు యాంటీ రోమియో బృందాలను ఏర్పాటు చేయడం, రౌడీలు, గూండాలు రాష్ట్రాన్ని వదిలిపెట్టడం మీకే మంచిదంటూ హెచ్చరిస్తూ పాలన కొనసాగిస్తున్న ఆదిత్యనాథ్ మహిళా మంత్రి స్వాతి సింగ్ విషయంలో సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం యోగి వద్ద ఆమె ఏం సమాధానం ఇచ్చారో తెలియదు.. కానీ ఆమె ఇచ్చిన వివరణపై యోగి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు బీఎస్పీ చీఫ్ మాయావతిని అభ్యంతరకంగా దూషించి, బీజేపీ నుంచి ఆరేళ్లపాటు సస్సెండ్ అయిన దయాశంకర్ సింగ్ సతీమణే ఈ స్వాతి సింగ్. యోగి కేబినెట్లోని మహిళా మంత్రుల్లో ఒకరిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఆమె ప్రస్తుత తీరుపై కాషాయదళాలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. -
గోరఖ్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న యోగీ
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ శనివారం ఉదయం గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఉన్న గోశాలను సందర్శించారు. గోవులకు ముఖ్యమంత్రి దాణా తినిపించారు. ఈ గోశాలలో సుమారు 500 ఆవులు ఉన్నాయి. ఈ సందర్భంగా గోశాల సంరక్షకుడు శివ్ పార్సెన్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి గోశాలను సందర్శించారని, బెల్లం, బిస్కెట్లు, పండ్లు, దాణాను గోవులకు తినిపించినట్లు తెలిపారు. అలాగే పలు గోవులకు ఆయన పేర్లు పెట్టారు. గతంలోనూ సీఎం యోగీ గోశాలను దర్శించిన విషయం తెలిసిందే. -
సీఎం యోగి స్పీడ్.. పాలనలో కొత్త ఒరవడి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన, కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకెళ్తున్నారు. ఇక నుంచి ప్రతీవారం ఎమ్మెల్యేలతో పాటు యూపీకి చెందిన ఎంపీలతో సమావేశం కావాలని యోగి నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాల సమస్యలను ఆయన తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తారు. ప్రతీ శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సచివాలయంలో యోగి ఎంపీలతో సమావేశమవుతారని ఓ అధికారిక ప్రకటనలో తెలియజేశారు. అలాగే ప్రతి సోమ, గురువారాల్లో ఇదే సమయంలో ఎమ్మెల్యేలు ఆయనతో సమావేశం కావచ్చు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి సీఎంతో మాట్లాడవచ్చు. కాగా ప్రజాప్రతినిధులు సమావేశానికి ఇతరులను తీసుకురాకూడదని యోగి సూచించారు. -
‘మాంసం’ గొడవ వరుడినే మార్చేసింది..!
ముజాఫర్‌నగర్: పెళ్లి విందులో మాంసాహారం లేదని గొడవకు దిగిన వరుడితో తెగతెంపులు చేసుకుందో వధువు. అయితే అంతలోనే అనూహ్యంగా పెళ్లికి వచ్చిన అతిథి వధువును పెళ్లాడతానని ముందుకొచ్చాడు. ఆమె కూడా సరేననడంతో ఘనంగా పెళ్లి జరిగింది. సినీ తరహాలో జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కుల్హేదీ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. విందులో మాంసాహారం పెట్టలేదని వరుడు కుటుంబం వధువు కుటుంబంతో వాదనకు దిగింది. మార్కెట్లో మాంసం కొరత ఉందని అందుకే వండలేకపోయామని చెప్పినా వినలేదు. సముదాయించాలని యత్నించినా ఫలితం లేదు. దీంతో విసుగెత్తిన వధువు అసలు పెళ్లే వద్దని తేల్చి చెప్పింది. చివరకు ఆమెను పెళ్లాడతానని ముందుకొచ్చిన వ్యక్తితో ఏడడుగులు నడిచింది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అక్రమ కబేళాలను నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ మాంసం కొరత పెరిగింది. ఫలితంగా చికెన్ ధరలను అమాంతం పెంచేశారు. -
మోదీ, యోగిలకు ఉగ్ర ముప్పు!
-
మోదీ, యోగిలకు ఉగ్ర ముప్పు!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న కశ్మీరీ ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరిం చాయి. కశ్మీర్ లోయలోకి చొరబడిన ఈ ఉగ్రవాదులు చిన్న చిన్న బృందాలుగా రైల్లో ఉత్తరప్రదేశ్ చేరుకోవడానికి యత్నించే అవకాశముందన్నాయి. ఈ వివరాలను ప్రధాని భద్రత బాధ్యతలు చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)కు, యోగి భద్రతా అధికారులకు అందించారు. కాగా, మోదీ, యోగి భద్రతకు తీవ్ర ముప్పు ఉందని ముంబై స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా తెలిపింది. వీరిద్దరిపై దాడుల గురించి మాట్లాడుకుంటుండగా రాయ్‌గఢ్‌లో కొందరు విన్నారని, దాడుల కుట్రదారులను గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారంది. మోదీపై దాడి చేయడానికి తాను, మరో మిలిటెంట్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు ఉకాషా అనే లష్కరే ఉగ్రవాది ఓ వ్యక్తితో జరిపిన సంభాషణలో చెప్పినట్లు గతేడాది నిఘా అధికారులు గుర్తించారు. పంచాయతీలది కీలక పాత్ర భారత గ్రామీణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి పంచాయతీలు శక్తిమంత మైన మార్గాలని, దేశ పరివర్తనలో అవి కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని మోదీ జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా ట్వీట్ చేశారు. పంచాయతీ రాజ్ సంస్థల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న వారందరికీ సెల్యూట్ చేస్తున్నానన్నారు. -
యోగి బాటలో ఇద్దరు మంత్రులు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో దూసుకుపోతున్నారు. రోజుకు 18 గంటలు పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని, లేకపోతే వెళ్లిపోవచ్చని అధికారులకు యోగి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. యోగిని స్ఫూర్తిగా తీసుకుని, ఆయన ఆదేశాలతో ఇద్దరు మంత్రులు తమ శాఖల కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం పది గంటలకు చాలామంది ఉద్యోగులు ఆఫీసులకు రాకపోవడంతో వార్నింగ్ ఇచ్చారు. యూపీ వ్యవసాయ శాఖ మంత్రి సూర్య ప్రతాప్ షాహి సోమవారం ఉదయం పది గంటలకు తన శాఖ పరిధిలోని కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆఫీసుల్లో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఆ సమయానికి చాలా మంది ఉద్యోగులు ఆఫీసుకు రాలేదు. నిర్ణీత సమయానికి ఉద్యోగులు హాజరు కాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యంగా వచ్చే ఉద్యోగులకు ఓ రోజు జీతం కోత విధించాలని మంత్రి ఆదేశించినట్టు అధికారులు చెప్పారు. యూపీ మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి మోహ్సిన్ రాజా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిర్ణీత సమయానికి చాలామంది ఉద్యోగులు హాజరు కాని విషయాన్ని గుర్తించారు. ఉద్యోగుల గైర్హాజరీకి సంబంధించి నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులకు రాకున్నా ఏసీలు, ఫ్యాన్లు పనిచేస్తున్న విషయాన్ని గమనించిన మంత్రి.. విద్యుత్‌ను వృథా చేయవద్దని అధికారులను మందలించారు. -
సీఎం యోగికి ఉత్తరం రాసిన మహిళ
కాన్పూర్: ఇదివరకే పెళ్లి అయిన విషయం దాచిపెట్టి తనను పెళ్లి చేసుకున్న భర్తను నిలదీసినందుకు విడాకులు కోరుతూ ట్రిపుల్ తలాక్ చెప్పాడని, ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ఓ ముస్లిం మహిళ ఉత్తరం రాసింది. ఈ విషయంపై గవర్నర్ రాంనాయక్‌కు, తన భర్త పనిచేసే కార్మిక శాఖకు సంబంధించిన అధికారులకు కూడా ఉత్తరం రాసింది. కొంతకాలంగా ఆమె ఇక్కడ ఓ కంప్యూటర్ కేంద్రాన్ని నడుపుతోంది. గత ఏడాది నవంబర్ 23న తనకు వివాహమైందని, ఆ సమయంలో రూ.25 లక్షల విలువ చేసే కారు, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులను కట్నకానుకలుగా ఇచ్చినట్లు చెప్పింది. తన భర్తకు ఇదివరకే పెళ్లి అయిన విషయం తెలుసుకొని ఆయనను నిలదీయడంతో తనపై అత్తింటివారు దాడి చేశారని తెలిపింది. -
‘సీఎం యోగికి భయపడను’
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంటే తనకు భయం లేదని, ఆయనపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కశ్మీర్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ నిజామీ అన్నారు. సీఎం యోగిపై ట్విటర్ లో అభ్యంతకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనకు సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ అభిషేక్ ఆత్రే పరువునష్టం దావా నోటీసు పంపారు. దీనిపై సల్మాన్ నిజామీ స్పందిస్తూ... ‘నేను భయపడను. సీఎం యోగిపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. మా లాయర్ ద్వారా నోటీసుకు సమాధానం ఇస్తాను. ఎవరో చెప్పినదాన్ని నేను చెప్పను. నేను నమ్మిన విషయాన్ని నిర్భయంగా ప్రకటిస్తాను. ముఖ్యమంత్రి పదవికి యోగి తగరని బలంగా విశ్వసిస్తున్నాను. యూపీలో ఆయన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదని, కమలం పార్టీ ఆయనను బలవంతంగా ప్రజలపై రద్దుతోంద’ని పేర్కొన్నారు. మతోన్మాదులు, విద్వేషాలు రెచ్చగొట్టే వారిని వ్యతిరేకించే హక్కు రాజ్యాంగం అందరికీ ఇచ్చిందని అన్నారు. ఇస్లాం మత ప్రచారకుడు జకీర్ నాయక్ పై సాక్ష్యాలు లేనప్పటికీ ఆయనను వేటాడుతున్నారని.. హత్య, దాడుల కేసులు ఎదుర్కొంటున్న యోగి ఆదిత్యనాథ్ ను యూపీ సీఎం చేశారని ట్విటర్ లో సల్మాన్ నిజామీ పోస్ట్ చేయడంతో వివాదం రేగింది. -
యూపీ రాజకీయాల్లో ఇంట్రస్టింగ్ సీన్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ అధినేత చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్, ఆయన భార్య అపర్ణా యాదవ్ శుక్రవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో భేటీ అయ్యారు. ఈ ఉదయం వీవీఐపీ అతిథి గృహానికి వచ్చిన ప్రతీక్, అపర్ణ దంపతులు సీఎం యోగితో మంతనాలు జరిపారు. వీరు ఏం చర్చించారన్నది వెల్లడి కాలేదు. తాజాగా ముగిసిన యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం పాలైంది. బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అపర్ణా యాదవ్.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో 33,796 ఓట్లతో ఓడిపోయారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని మోదీతో ములాయం, అఖిలేశ్ మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో సీఎం యోగితో ప్రతీక్, అపర్ణ దంపతుల భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. -
కబేళాల మూతతో ఎన్ని కష్టాలో!
⇔ యూపీలో యోగి సర్కారు నిర్ణయంతో ఆందోళన ⇔ దేశంలో పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తిలో యూపీయే టాప్ ⇔ ప్రభుత్వ ఆదేశాలతో 80% కబేళాలు, దుకాణాల మూసివేత ⇔ మాంసం ఎగుమతులు, చర్మ పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం ⇔ రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులుగా మారుతున్న వైనం ⇔ పాల ఉత్పత్తీ తగ్గిపోవచ్చు.. గోవుల సంఖ్య ఇంకా తరిగిపోవచ్చు! ⇔ రాష్ట్రమంతటా మాంసానికి కటకట.. మూతపడుతున్న రెస్టారెంట్లు (సాక్షి నాలెడ్జ్ సెంటర్) ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు కేబాళాల మూసివేత నిర్ణయంతో ఆ రాష్ట్రంలో బీఫ్ కొరత ఏర్పడింది. మాంసాహారులు తీవ్ర కటకట ఎదుర్కొంటున్నారు. అయితే.. కబేళాల మూసివేత నిర్ణయం రాష్ట్రంపై పలు ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందని పరిశీలకులు చెప్తున్నారు. ముఖ్యంగా.. పాల ఉత్పత్తిలో, మాంసం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న యూపీ.. ఈ నిర్ణయం వల్ల ఆ ఉత్పత్తుల్లో వెనుకబడిపోతుందని, అది ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే.. ‘అనధికారిక కబేళాలను, యంత్రాలతో నడిచే కబేళాలను మూసివేసేందుకు కఠిన చర్యలు చేపడతా’మని ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. యోగి ఆదిత్యనాథ్ ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినవెంటనే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఆ ఎన్నికల హామీ అమలు దిశగా చర్యలు ప్రారంభించింది. మంగళవారం లక్నోలోని కమాల్గదాహా ప్రాంతంలో అనధికారికంగా నిర్వహిస్తున్న ఒక కబేళాను అధికారులు సీల్ చేశారు. బుధవారం మీరట్‌లో బీఎస్పీ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన మూడు బీఫ్ ప్రాసెసింగ్ ప్లాంట్లను సీల్ చేశారు. వారణాసిలో కూడా ఒక కబేళాపై అధికారులు దాడి చేసి సీల్ చేశారు. ఘజియాబాద్‌లో మరో 10 మాంసం దుకాణాలను మూసివేశారు. ఇంకోవైపు మంగళవారం నాడు హాత్రాస్‌లో మూడు మాంసం దుకాణాలను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఈ పరిణామాలతో బుధ, గురు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం మాంసం దుకాణాలు మూతపడ్డాయి. మాంసాహార ప్రియులకు మాంసం కరువైంది. ముఖ్యంగా బీఫ్ ధర తక్కువగా ఉండడం వల్ల ఆ మాంసం వినియోగించే వారు రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. వారిలో చాలా మంది మాంసం లేనిదే ముద్ద తనని వారు ఉన్నారు. ఇప్పుడు బీఫ్ కొరతతో ఏం చేయాలన్నది అటువంటి వారికి పాలుపోవడం లేదు. పాల ఉత్పత్తి తగ్గుతుందా..? దేశంలో పాల ఉత్పత్తిలో ప్రస్తుతం యూపీదే అగ్రస్థానం. 2015-16 సంవత్సరంలో రాష్ట్రంలో 26,387 వేల టన్నుల పాలు ఉత్పత్తి అయ్యాయి. ఒకవైపు అక్రమ కబేళాల నిషేధం, మరోవైపు గోవధకు వ్యతిరేకంగా ఉధృత చర్యలు రాష్ట్రంలో పాల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని పలువురు నిపుణులు చెప్తున్నారు. ముసలివైపోయిన పశువుల ధర తగ్గిపోవడం, వాటిని కబేళాలకు పంపించడం కష్టమవడం వంటి పరిస్థితుల్లో రైతులు పశువుల పెంపకం మీద, పాడి పరిశ్రమ మీద ఆసక్తి తగ్గే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మాంసం ఎగుమతి పడిపోతుంది..! దేశపు మొత్తం మాంసం ఎగుమతుల విలువ రూ. 26,682 కోట్లు కాగా.. అందులో సింహ భాగం వాటా యూపీదే. 2015-16 ఆర్థిక సంవత్సరంలో యూపీ మాంసం ఎగుమతులు రూ. 11,351 కోట్ల మేర ఉన్నాయి. దేశవ్యాప్తంగా 62 కబేళాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా అందులో 38 ఒక్క యూపీలోనే ఉన్నాయి. వాటిలోనూ 37 కబేళాలు విదేశాలకు ఎగుమతి చేసే బీఫ్ (పశు మాంసం) ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ కబేళాలు నిబంధనలు పాటించడం లేదని, లైసెన్సులు లేవని మూతవేయడం వల్ల మాంసం ఎగుమతులు అకస్మాత్తుగా పడిపోయి రాష్ట్రంలో భారీగా ఆదాయం నష్టపోతుందని నిపుణులు చెప్తున్నారు. వేలాది మంది ఉపాధికి గండి.. కబేళాల నిషేధం, మూసివేత కారణంగా వాటిలో పనిచేసే వేలాది మంది నిరుద్యోగులుగా మారతారు. మాంసం దుకాణాలు మూతపడుతుండటంతో వాటిపై ఆధారపడ్డ వారికి ఉపాధి కరువవుతుంది. ఇక కబేళాల నుంచి వచ్చే పశు చర్మాలపై ఆధారపడి ఉన్న రాష్ట్రంలోని చర్మ పరిశ్రమ సైతం తీవ్రంగా దెబ్బతింటుంది. అందులోనూ వేలాది మంది ఉపాధికోల్పోవటమే కాదు.. చర్మ ఉత్పత్తుల ఎగుమతులూ పడిపోతాయని పరిశీలకులు చెప్తున్నారు. యూపీలో గోవులు అంతరిస్తాయా..? ప్రభుత్వ నిర్ణయాల వల్ల యూపీలో గోవులు త్వరలోనే ‘అంతరించిపోయే’ ప్రమాదం ముంచుకురావచ్చుననీ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఆవుల యాజమాన్యాన్ని వదులుకుంటున్నారని, నిజానికి గోప్రాంతం (కౌ బెల్ట్)గా పేరుపడ్డ యూపీలో ఇప్పటికే ప్రతి వంద గేదెలకూ 0.64 అవులు మాత్రమే ఉన్నాయని వారు లెక్క చెప్తున్నారు. అదే పశ్చిమబెంగాల్లో వంద గేదెలకు 27 ఆవులు, అస్సాంలో 16, కేరళలో 13 అవుల చొప్పున ఉన్నాయని.. ఆ రాష్ట్రాల్లో గోవధ మీద నిషేధం లేదు కనుక వాటి సంఖ్య పెరుగుతోందని, యూపీలో గోవధను నిషేధిస్తే ఆవుల సంఖ్య ఇంకా పడిపోవచ్చునని విశ్లేషిస్తున్నారు. అక్రమ కబేళాలను నిషేధించడం కాకుండా వాటిని క్రమబద్ధీకరించడం, నిబంధనలు పాటించేలా చూడటం వంటి చర్యలతో ఇటువంటి నష్టాలు రాకుండూ చూడవచ్చునని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వందేళ్ల ఘన చరిత్ర.. ఒక్క రోజులో మూత! టుండే కబాబీ... యూపీలో ఈ పేరు తెలియని వారు ఉండరు. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈ రెస్టారెంట్ ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ దాదాపు వంద రకాల సుగంధద్రవ్యాలతో తయారు చేసే కబాబ్‌లు, మాంసపు వంటకాల అభిమానులు ప్రపంచమంతటా విస్తరించివున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర గల ఈ టుండే కబాబీ కేంద్రం కూడా బుధవారం ఒక్క రోజులో మూతపడింది. బీఫ్ వంటకాలకు ప్రఖ్యాతి గాంచిన టుండే కబాబి అక్బరి గేట్ కేంద్రాన్ని మూసివేశారు. మటన్, చికెన్ వంటకాలను విక్రయించే అమీనాబాద్ కేంద్రాన్ని మాత్రం గురువారం తెరిచారు. 1905 సంవత్సరంలో లక్నో నగరంలో టుండే కబాబి కేంద్రాన్ని హాజీ మురాద్ అలీ స్థాపించారు. ఈ సంస్థకు చెందిన నాలుగు కబేళాలను 2013-15 సంవత్సరాల మధ్య అధికారులు మూసివేశారు. తాజాగా లక్నోలో కబేళాల మూసివేతతో బీఫ్ కొరత ఏర్పడటంతో టుండే కబాబీ కేంద్రాన్ని మూసివేశారు. ‘మాంసం దొరకకపోతే ఎలా నడుపుతాం. బీఫ్ కబాబీ దుకాణాన్ని రెండు రోజులుగా పూర్తిగా మూసివేశాం’ అని యజమాని మొహమ్మద్ ఉస్మాన్ తెలిపారు. -
మంత్రులకు కొత్త సీఎం 15 రోజుల గడువు
లక్నో: కాన్షీరాం స్మృతి ఉప్వన్లో ఆదివారం యూపీ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ మంత్రులకు కొన్ని విషయాలను ఉపదేశించారు. ఆ విషయాలను యూపీ రాష్ట్ర మంత్రి శ్రీకాంత్ శర్మ లక్నోలో మీడియా సమావేశంలో వెల్లడించారు. యూపీ రాష్ట్ర మంత్రులందరూ తమకు సంబంధించిన స్థిర, చర ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఆదేశించినట్లు చెప్పారు. కేవలం 15 రోజులు గడువులోగా సీఎం కార్యదర్శి, సంబంధిత ఉన్నతాధికారులలో ఎవరికైనా మంత్రులు తమ ఆస్తుల పూర్తి సమాచారాన్ని అందించాలని సీఎం సూచించినట్లు శ్రీకాంత్ శర్మ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించిన వెంటనే వేడుకలు, ఆర్భాటాలు చేస్తూ ఎవరికీ ఇబ్బంది కలిగించ వద్దని తన మద్దతుదారులను హెచ్చరించిన యోగి.. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత.. అనవసర వ్యాఖ్యలు, వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటే మంచిదని కేబినెట్ మంత్రులకు సూచించారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా నడుచుకోవద్దని, అది ఎవరికీ మంచిది కాదని సీఎం అభిప్రాయపడ్డారని యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ వివరించారు. కొత్త సీఎం యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర కేంద్ర ప్రముఖులు హాజరయిన విషయం తెలిసిందే. -
సీఎం, డిప్యూటీ సీఎం.. ఇద్దరూ ఎంపీలే
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ఎంపికలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. 403 సీట్లున్న యూపీలో బీజేపీ ఏకంగా 312 సీట్లు గెలిచినా వీరిలో ఒక్కరికీ సీఎం, డిప్యూటీ సీఎం పదవులు దక్కలేదు. యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యోగి ఆదిత్యనాథ్.. గోరఖ్‌పూర్ ఎంపీ కాగా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య.. పూల్పూర్ ఎంపీ. మరో డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ.. లక్నో మేయర్. దీంతో వీరు ముగ్గురూ ఆరు నెలల్లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావాల్సివుంది. యూపీ సీఎం రేసులో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మనోజ్ సిన్హా, యూపీ బీజేపీ చీఫ్ కేశవ ప్రసాద్ మౌర్య పేర్లు ప్రముఖంగా వినిపించినా చివర్లో హిందుత్వ ఐకాన్ యోగి ఆదిత్యనాథ్‌ను ఎన్నుకున్నారు. సీఎంగా యోగి, డిప్యూటీ సీఎంలుగా కేశవ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మతో పాటు మరో 43 మంది మంత్రులు ప్రమాణం చేశారు.