ముంబై : ఎయిరిండియా పైలెట్ 25ఏళ్ల సృష్టి తులి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి తులిపై ఆమె స్నేహితుడు ఆదిత్య పండిట్ పెంచుకున్న అసూయే ఆమె మరణానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఆమె మరణంలో మరో యువతి ప్రమేయం ఉన్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆశ్రయించనున్నారు.
కమర్షియల్ పైలెట్ సృష్టి తులి సోమవారం ముంబైలోని మరోల్ ప్రాంతంలో తన స్నేహితుడు ఆదిత్య పండిట్ రూంలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి ఆదిత్య పండిట్ వేధింపులే కారణమని తెలుస్తోంది. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఆదిత్య పండిట్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
సృష్టి తులి మరణానికి ముందు ఏం జరిగిందో ఆమె మేనమామ వివేక్ తులి మీడియాతో మాట్లాడారు. ‘‘ఆమె చనిపోవడానికి 15 నిమిషాల ముందు తన తల్లి, అత్తతో ఉల్లాసంగా మాట్లాడింది. అలాంటి నా కోడలు ఆత్మహత్య చేసుకుంది అంటే నేను నమ్మను. ఇది కచ్చితంగా హత్యే. సృష్టి ఎంతో ధైర్యవంతురాలు. చిన్నప్పటి నుంచి పైలెట్ అవ్వాలనేది ఆమె కల. కమర్షియల్ పైలెట్ ట్రైనింగ్ తీసుకుంది. గతేడాది లైసెన్స్ కూడా వచ్చింది. ప్రస్తుతం ఎయిరిండియాలో పైలెట్‌గా విధులు నిర్వహిస్తుంది. ఆదిత్య పండింట్ ఆమె బ్యాచ్‌మెట్. కమర్షియల్ ట్రైనింగ్‌లో ఫెయిలయ్యాడు. ఈ విషయంలో సృష్టి మీద అసూయ పెంచుకున్నాడు. తీవ్రంగా వేధించాడు. ఈ విషయం ఆమె స్నేహితులే చెప్పారు.
మా అమ్మాయి మరణం గురించి తెలిసిన వెంటనే ఏం జరిగిందో ఆమె స్నేహితులతో మాట్లాడాను. నా మేనకోడలు సృష్టిని ఆదిత్య.. ఎంతగా వేధించాడో చెప్పారు. నాన్‌వెజ్ తినొద్దని తిట్టేవాడు. కొట్టేవాడు. బహిరంగంగా అరిచేవాడు. సమయం, సందర్భం లేకుండా కార్లో ప్రయాణించే సమయంలో నడిరోడ్డులో వదిలేసి వెళ్లేవాడు. ఏడుస్తూ తన రూమ్‌కి వచ్చేది. సృష్టి బ్యాంక్ అకౌంట్‌లను చెక్ చేశాం. ఆమె ఒక నెల స్టేట్‌మెంట్‌లో రూ.65 వేలు ఆదిత్య అకౌంట్‌కు పంపింది. డబ్బులు కావాలని ఆదిత్య బ్లాక్‌మెయిల్ చేసి ఉంటాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోయి ఉండొచ్చని’’ వివేక్ తులి అన్నారు.
ఆ అమ్మాయి ఎవరు?
సృష్టి మరణంలో మరో మహిళా పైలెట్ ప్రమేయం ఉందని వివేక్ తులి అనుమానం వ్యక్తం చేశారు. ‘‘సృష్టి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఉన్న ఓ యువతి కీమేకర్ సాయంతో తలుపు తెరిచింది. సృష్టిని ఆసుపత్రికి తీసుకువెళ్లింది. పైలెట్ శిక్షణ తీసుకున్న వాళ్లు.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ప్లాట్‌లోకి వెళ్లకూడదనే విషయం తెలియదా? కీ మేకర్ ప్లాట్ బయటి నుంచి తలుపు ఎందుకు తెరుస్తాడ?’ని ప్రశ్నించారు.
సృష్టికి న్యాయం జరిగేలా
సృష్టి మరణంలో న్యాయం జరిగేలా ఆమె కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆశ్రయించనున్నారు. "సృష్టిది ఆత్మహత్య కాదు హత్యే.. న్యాయం కోసం సీఎం యోగీని కలవనున్నాం" అని వివేక్ తులి మీడియాకు వివరించారు.
సృష్టి తులి ఎవరు?
ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌కు చెందిన సృష్టి తులికి పైలెట్ అవ్వాలనేది ఆమె కల. ఆ కల నెరవేర్చుకునేందుకు రెండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ నుంచి ముంబైకి వచ్చింది. అప్పటి నుంచి కమర్షియల్ పైలెట్ శిక్షణ తీసుకుంది. ఆ శిక్షణ సమయంలో సహచరుడు ఆదిత్య పండిట్ పరిచయమయ్యాడు. ఆ స్నేహం కాస్త ప్రేమకు దారి తీసింది.
అయితే, చిన్నప్పటి నుంచి పైలెట్ అవ్వాలనే లక్ష్యంతో ఉన్న సృష్టి తులి ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. కమర్షియల్ పైలెట్ అయ్యింది. కానీ ఆదిత్య పండిట్ కమర్షియల్ పైలెట్ ట్రైనింగ్‌లో ఫెయిల్ అయ్యాడు. ప్రేమ ముసుగులో ఆమెను చిత్రవధ చేశాడు. చికెన్ తినొద్దని, డబ్బులు కావాలని వేధించాడు. అందరిముందు తిట్టే వాడు. ప్రయాణంలో ఎక్కడ ఉండే అక్కడ ఒంటరిగా వదిలేసేవాడు. ఓ విషయంలో సృష్టి తులి.. ఆదిత్య పండిట్‌తో గొడవ పడింది. చివరికి అతని ఫోన్ కేబుల్ వైర్‌తో ప్రాణాలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment