Airindia
-
నటి మెడికల్ వేవర్ అభ్యర్థన తిరస్కరణ
మెడికల్ వేవర్ అభ్యర్థనను తిరస్కరించిన తర్వాత ఎయిరిండియా కనీస సానుభూతి చూపడం లేదని నటి లీసా రే సోషల్ మీడియాలో ఆరోపించారు. డాక్టర్ లేఖను సమర్పించినప్పటికీ, సరైన వివరణ ఇవ్వకుండా మెడికల్ వేవర్‌ను తిరస్కరించారని పేర్కొంటూ ఆమె తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా అసహనం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి(92) అత్యవసర పరిస్థితుల్లో విమాన ప్రయాణాన్ని రద్దు చేశాక ఈ పరిణామం చోటు చేసుకుందని లీసా తెలిపారు.‘మా నాన్నకు 92 ఏళ్లు. తన అనారోగ్యం కారణంగా అత్యవసరంగా ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. తండ్రి అనారోగ్యానికి సంబంధించి డాక్టర్ల రిపోర్ట్‌ను కూడా సమర్పించాను. అయినా మెడికల్ వేవర్‌ను నిరాకరిస్తారా? అది ఎలా సాధ్యం? ప్రయాణికుల గురించి పట్టించుకుంటామని చెప్పుకునే విమానయాన సంస్థ నుంచి కనీస సానుభూతి ఎక్కడుంది?’ అని రే ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఎయిరిండియా అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా సానుభూతి వ్యక్తం చేస్తూ మెడికల్ వేవర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను డైరెక్ట్ మెసేజ్ ద్వారా తెలియజేయాలని కోరింది.Here we go again @airindia My father is 92, unwell and I have to cancel travel due to his ailing condition. Submitted doctors letter and the waiver was denied? How is that possible? Where is the empathy from an airline that is claiming to care about passengers???— Lisa Ray (@Lisaraniray) March 19, 2025‘డియర్ మిసెస్ రే, మీ పరిస్థితికి మేము సానుభూతి తెలియజేస్తున్నాం. మీ తండ్రి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. దయచేసి మీరు మాకు రాసిన ఈమెయిల్ చిరునామా లేదా డీఎం ద్వారా కేస్ ఐడీ (ఏవైనా ఉంటే)ను షేర్ చేయండి. మేము దాన్ని పరిశీలిస్తాం’ అని ఎయిరిండియా బదులిచ్చింది. బుకింగ్ ట్రావెల్ ఏజెన్సీతో ఆమె జరిపిన సంభాషణ స్క్రీన్ షాట్‌ను కూడా రే పోస్ట్ చేశారు. ఆమె తండ్రి ఆసుపత్రిలో చేరినప్పటికీ, ఆమె విషయంలో వైద్య మాఫీకి అవకాశం లేదని ఏజెన్సీ నుంచి స్పందన వచ్చినట్లు తెలిపారు.ఆమె పోస్ట్‌పై ఆన్లైన్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది ఆమె దుస్థితిపై సానుభూతి వ్యక్తం చేశారు. మరికొందరు నాన్ ఫ్లెక్సిబుల్ టికెట్లకు వైద్య మినహాయింపులు వర్తించవని సూచించారు. ‘మీ టికెట్‌పై ఫ్లెక్సిబుల్ ఆప్షన్ లేకపోతే ఏ విమానయాన సంస్థ కూడా మీకు ఏ కారణం చేతా మినహాయింపు ఇవ్వదు’ అని ఒక యూజర్ తెలిపారు. భవిష్యత్తు పరిస్థితుల కోసం సౌకర్యవంతమైన టికెట్లు లేదా ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలని ఇంకొందరు సూచించారు.ఇదీ చదవండి: ‘ఇండస్‌ఇండ్‌లో వాటా పెంపునకు అనుకూల సమయం’మెడికల్ వేవర్ప్రయాణీకులు తరచుగా వైద్యుడి నుంచి ‘ఫిట్-టు-ఫ్లై’ సర్టిఫికేట్‌ను అందించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ప్రయాణికుడు విమాన ప్రయాణానికి వైద్యపరంగా స్థిరంగా ఉన్నాడని, సాధారణంగా విమానానికి ముందు ఒక నిర్దిష్ట కాలవ్యవధి (ఉదా. 72 గంటలు) అవసరమని ధ్రువీకరించాలి.ఎయిరిండియా, ఇండిగో వంటి విమానయాన సంస్థల నిబంధనల ప్రకారం ప్రత్యేక వైద్య పరిస్థితులు ఉన్న ప్రయాణికులు ముందుగానే మెడికల్ ఇన్ఫర్మేషన్ ఫారం (ఎంఈడీఐఎఫ్) నింపాల్సి ఉంటుంది. ఆక్సిజన్ సపోర్ట్ లేదా మొబిలిటీ ఎయిడ్స్ వంటి ప్యాసింజర్ అవసరాలను అంచనా వేయడానికి ఈ ఫారం విమానయాన సంస్థకు సహాయపడుతుంది.మాఫీకు షరతులు: తీవ్రమైన లేదా అత్యవసర వైద్య పరిస్థితుల నేపథ్యంలో ఫీజుల రద్దు లేదా రీషెడ్యూల్ కోసం వైద్య మినహాయింపులు మంజూరు చేస్తారు. అయితే కొన్ని విమానయాన సంస్థలు నాన్-ఫ్లెక్సిబుల్ టికెట్లకు మినహాయింపులు ఇవ్వకపోవచ్చు. విమానయాన వైద్య మినహాయింపు పరిస్థితులు విమానయాన సంస్థను బట్టి మారవచ్చు. -
విమానంలో సీటు వివాదం.. డీఎంకే ఎంపీVsఅన్నామలై
చెన్నై:తమిళనాడులో ఎయిర్ఇండియా విమానంలో సీటుపై రాజకీయం వేడెక్కింది. విమాన సీటు విషయంలో డీఎంకే,బీజేపీ మధ్య విమర్శల బాణాలు దూసుకెళ్లాయి. డీఎంకే ఎంపీ తంగపాండియన్ ఢిల్లీ నుంచి ఎయిర్ఇండియా విమానంలో చెన్నై రావాల్సి ఉంది. అయితే ఎయిర్ ఇండియా వారు ఆమె బిజినెస్ క్లాసు సీటును రద్దు చేసి ఎకానమి సీటు కేటాయించారు. ఈ వ్యవహారంపై ఎంపీ తంగపాండియన్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. ఒక ఎంపీకే విమానంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. తన విమాన టికెట్ తరగతిని ఎలా తగ్గిస్తారని ట్వీట్లో నిలదీశారు. దీనికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై స్పందించారు. ఎంపీ తంగపాండియన్‌కు అలా జరగాల్సింది కాదని అంటూనే ఆమెపై విమర్శలు గుప్పించారు.Absolutely unacceptable from @airindia! I had booked a Business Class seat on an Air India flight from Delhi to Chennai (A1540- 9.20pm) this evening (13.02.2025). Without any prior notice or explanation, the seat was downgraded. This is not just about me—if a MP can be treated… pic.twitter.com/wAqNkwwBBp— தமிழச்சி (@ThamizhachiTh) February 13, 2025 కేవలం విమానంలో టికెట్ తరగతిని తగ్గిస్తేనే ఇంత బాధపడుతున్నారు..డీఎంకే పాలనలో ప్రజల స్థాయి తగ్గిపోయిందని గుర్తుచేశారు. ఒక ఎంపీని నా పరిస్థితే ఇలా ఉంటే అని మాట్లాడడం మీ అధికార దర్పాన్ని, సంపన్న వర్గాల మనస్తత్వాన్ని సూచిస్తోందని మరో ‘ఎక్స్’ పోస్టులో ఘాటు వ్యాఖ్యలు చేశారు.Though this shouldn’t have happened, it comes at the right time to tell people in power in TN what it means to be downgraded. The entitlement that makes one say “if an MP can be treated this way” shows the loftiness of a person who is a product of dynasty politics. With the… https://t.co/o4Y9UlIyY4— K.Annamalai (@annamalai_k) February 14, 2025 -
ఎయిరిండియాపై రూ.30 లక్షల జరిమానా
ప్రభుత్వ నియంత్రణ నిబంధనలు పాటించనందుకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియాపై రూ.30 లక్షల జరిమానా విధించారు. నియమాలకు విరుద్ధంగా విమానాన్ని నడపడానికి పైలట్‌ను అనుమతించినందుకు ఎయిరిండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పదేపదే రోస్టరింగ్ సమస్యలు, పైలట్లకు తప్పనిసరి రికెన్సీ(విమానాలను నడపడంలో నైపుణ్యం కలిగి ఉండేలా చేయడం) ఉల్లంఘనలకు సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. అయితే అందుకు సరైన విధంగా స్పందించకపోవడం వల్ల ఈ జరిమానా విధిస్తున్నట్లు డీజీసీఏ స్పష్టం చేసింది.ప్రతి పైలట్ నిత్యం మూడు టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు చేయాల్సిన అవసరం లేనప్పటికీ జులై 7, 2024న విమానాన్ని నడపడానికి ఎయిరిండియా ఒక పైలట్‌ను అనుమతించిందని డీజీసీఏ గుర్తించింది. పైలట్ విమానం నడపడానికి ముందు ఎయిరిండియా రోస్టింగ్ కంట్రోలర్లు సీఏఈ విండోలో ప్రతిబింబించే అనేక హెచ్చరికలను పట్టించుకోలేదని డీజీసీఏ ఎత్తిచూపింది. కంపెనీ చర్యలను హైలైట్ చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ సంస్థ ఇచ్చిన ప్రతిస్పందనతో డీజీసీఏ సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఇదీ చదవండి: చౌకగా ప్రీమియం మోటార్ సైకిళ్లుజనవరి 29, 2025న రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు ఇటీవల పేర్కొంది. 30 రోజుల్లోగా జరిమానా మొత్తాన్ని జమ చేయాలని ఎయిరిండియాను ఆదేశించింది. ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి నియంత్రణ ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ నొక్కి చెప్పింది. -
విద్యార్థులకు ఎయిరిండియా టికెట్ ధరలో ఆఫర్
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఉన్నత చదువుల కోసం దేశంలో ఇతర ప్రాంతాలతోపాటు, ఇతర దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులకు విమాన ధరలో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అదనంగా 10 కిలోల వరకు బ్యాగేజ్‌ను కూడా అనుమతిస్తున్నట్లు పేర్కొంది.అర్హతలు ఇవే..దేశీయ ప్రయాణాలు చేయాలనుకునే విద్యార్థుల వయసు 12 ఏళ్ల వరకు ఉండాలి. అదే అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు 12-30 ఏళ్ల వయసు వరకు ఉండొచ్చు. అడ్మిషన్ పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ ప్రభుత్వ గుర్తింపు పొందిందై ఉండాలి. విద్యార్థులు కనీసం ఒక విద్యాసంవత్సరం ఫుల్ టైమ్ కోర్సులో చేరి ఉండాలి.ఇదీ చదవండి: యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై సెబీ కొరడాఎక్కడ బుక్ చేసుకోవాలి..?ఈ ఆఫర్ వినియోగించుకోవాలనుకునే విద్యార్థులు ఎయిరిండియా అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, కస్టమర్ కాంటాక్ట్ సెంటర్, ఎయిర్పోర్ట్ టికెటింగ్ కార్యాలయాల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఎయిరిండియా బ్యాంకు పార్టనర్లు జారీ చేసిన క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే అందనంగా ప్రయోజనాలు పొందవచ్చని కంపెనీ తెలిపింది. అధికారిక వెబ్సైట్ నుంచి బుక్ చేసుకునే విద్యార్థులకు కన్వినియెన్స్ ఛార్జీల రూపంలో ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయబోమని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపుణ్ అగర్వాల్ తెలిపారు. దానివల్ల దేశీయ విమానాల్లో ప్రయాణించే విద్యార్థులు రూ.399, అంతర్జాతీయ విమానాల్లో వెళ్లేవారు రూ.999 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చని స్పష్టం చేశారు. -
ఎయిరిండియా చెక్-ఇన్ సమయంలో మార్పులు
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా తన చెక్-ఇన్ సమయాలను సవరించింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, విమానాశ్రయ విధానాలను క్రమబద్ధీకరించడానికి ఈ మార్పులు చేసినట్లు సంస్థ తెలిపింది. ఢిల్లీతోపాటు లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఈమేరకు మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది.లండన్ హీత్రూ విమానాశ్రయంలో చెక్-ఇన్ సమయాల్లో మార్పులు ఇలా..చెక్-ఇన్ కౌంటర్లు షెడ్యూల్ ప్రకారం విమానాలు బయలు దేరడానికంటే 75 నిమిషాల ముందే మూసివేస్తారు.గతంలో ఇది 60 నిమిషాలుగా ఉండేది.కొత్త నియమం ద్వారా ప్రయాణికుల రద్దీ సమయాల్లో చెక్-ఇన్, సెక్యూరిటీ క్లియరెన్స్‌ల కోసం తగిన సమయం ఉంటుంది.ఢిల్లీ విమానాశ్రయంలో ఇలా..ఢిల్లీ నుంచి బయలుదేరే అన్ని అంతర్జాతీయ విమానాలకు ఈ నియమాలు అమలుల్లో ఉంటాయి.చెక్-ఇన్ కౌంటర్లు షెడ్యూల్ ప్రకారం విమానాలు బయలు దేరడానికంటే 75 నిమిషాల ముందే మూసివేస్తారు.ఇదీ చదవండి: రైల్లో మంటలు! క్షణాల్లో తప్పించుకునేలా..సవరించిన చెక్-ఇన్ సమయానికి అనుగుణంగా ప్రయాణికులు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించాలనుకునేవారు షెడ్యుల్ సమయం కంటే దాదాపు 3 గంటల ముందుగానే ఉండడం మంచిదని పేర్కొంది. -
ఎయిరిండియా పైలెట్ సృష్టి తులి కేసులో ట్విస్ట్!
ముంబై : ఎయిరిండియా పైలెట్ 25ఏళ్ల సృష్టి తులి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి తులిపై ఆమె స్నేహితుడు ఆదిత్య పండిట్ పెంచుకున్న అసూయే ఆమె మరణానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఆమె మరణంలో మరో యువతి ప్రమేయం ఉన్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆశ్రయించనున్నారు. కమర్షియల్ పైలెట్ సృష్టి తులి సోమవారం ముంబైలోని మరోల్ ప్రాంతంలో తన స్నేహితుడు ఆదిత్య పండిట్ రూంలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి ఆదిత్య పండిట్ వేధింపులే కారణమని తెలుస్తోంది. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఆదిత్య పండిట్ పోలీసుల అదుపులో ఉన్నాడు.సృష్టి తులి మరణానికి ముందు ఏం జరిగిందో ఆమె మేనమామ వివేక్ తులి మీడియాతో మాట్లాడారు. ‘‘ఆమె చనిపోవడానికి 15 నిమిషాల ముందు తన తల్లి, అత్తతో ఉల్లాసంగా మాట్లాడింది. అలాంటి నా కోడలు ఆత్మహత్య చేసుకుంది అంటే నేను నమ్మను. ఇది కచ్చితంగా హత్యే. సృష్టి ఎంతో ధైర్యవంతురాలు. చిన్నప్పటి నుంచి పైలెట్ అవ్వాలనేది ఆమె కల. కమర్షియల్ పైలెట్ ట్రైనింగ్ తీసుకుంది. గతేడాది లైసెన్స్ కూడా వచ్చింది. ప్రస్తుతం ఎయిరిండియాలో పైలెట్‌గా విధులు నిర్వహిస్తుంది. ఆదిత్య పండింట్ ఆమె బ్యాచ్మెట్. కమర్షియల్ ట్రైనింగ్‌లో ఫెయిలయ్యాడు. ఈ విషయంలో సృష్టి మీద అసూయ పెంచుకున్నాడు. తీవ్రంగా వేధించాడు. ఈ విషయం ఆమె స్నేహితులే చెప్పారు.మా అమ్మాయి మరణం గురించి తెలిసిన వెంటనే ఏం జరిగిందో ఆమె స్నేహితులతో మాట్లాడాను. నా మేనకోడలు సృష్టిని ఆదిత్య.. ఎంతగా వేధించాడో చెప్పారు. నాన్‌వెజ్ తినొద్దని తిట్టేవాడు. కొట్టేవాడు. బహిరంగంగా అరిచేవాడు. సమయం, సందర్భం లేకుండా కార్లో ప్రయాణించే సమయంలో నడిరోడ్డులో వదిలేసి వెళ్లేవాడు. ఏడుస్తూ తన రూమ్‌కి వచ్చేది. సృష్టి బ్యాంక్ అకౌంట్లను చెక్ చేశాం. ఆమె ఒక నెల స్టేట్మెంట్లో రూ.65 వేలు ఆదిత్య అకౌంట్‌కు పంపింది. డబ్బులు కావాలని ఆదిత్య బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోయి ఉండొచ్చని’’ వివేక్ తులి అన్నారు.ఆ అమ్మాయి ఎవరు?సృష్టి మరణంలో మరో మహిళా పైలెట్ ప్రమేయం ఉందని వివేక్ తులి అనుమానం వ్యక్తం చేశారు. ‘‘సృష్టి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఉన్న ఓ యువతి కీమేకర్ సాయంతో తలుపు తెరిచింది. సృష్టిని ఆసుపత్రికి తీసుకువెళ్లింది. పైలెట్ శిక్షణ తీసుకున్న వాళ్లు.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ప్లాట్‌లోకి వెళ్లకూడదనే విషయం తెలియదా? కీ మేకర్ ప్లాట్ బయటి నుంచి తలుపు ఎందుకు తెరుస్తాడ?’ని ప్రశ్నించారు.సృష్టికి న్యాయం జరిగేలా సృష్టి మరణంలో న్యాయం జరిగేలా ఆమె కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆశ్రయించనున్నారు. "సృష్టిది ఆత్మహత్య కాదు హత్యే.. న్యాయం కోసం సీఎం యోగీని కలవనున్నాం" అని వివేక్ తులి మీడియాకు వివరించారు. సృష్టి తులి ఎవరు?ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌కు చెందిన సృష్టి తులికి పైలెట్ అవ్వాలనేది ఆమె కల. ఆ కల నెరవేర్చుకునేందుకు రెండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ నుంచి ముంబైకి వచ్చింది. అప్పటి నుంచి కమర్షియల్ పైలెట్ శిక్షణ తీసుకుంది. ఆ శిక్షణ సమయంలో సహచరుడు ఆదిత్య పండిట్ పరిచయమయ్యాడు. ఆ స్నేహం కాస్త ప్రేమకు దారి తీసింది.అయితే, చిన్నప్పటి నుంచి పైలెట్ అవ్వాలనే లక్ష్యంతో ఉన్న సృష్టి తులి ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. కమర్షియల్ పైలెట్ అయ్యింది. కానీ ఆదిత్య పండిట్ కమర్షియల్ పైలెట్ ట్రైనింగ్‌లో ఫెయిల్ అయ్యాడు. ప్రేమ ముసుగులో ఆమెను చిత్రవధ చేశాడు. చికెన్ తినొద్దని, డబ్బులు కావాలని వేధించాడు. అందరిముందు తిట్టే వాడు. ప్రయాణంలో ఎక్కడ ఉండే అక్కడ ఒంటరిగా వదిలేసేవాడు. ఓ విషయంలో సృష్టి తులి.. ఆదిత్య పండిట్‌తో గొడవ పడింది. చివరికి అతని ఫోన్ కేబుల్ వైర్‌తో ప్రాణాలు తీసుకుంది. -
నాన్‌వెజ్ తినొద్దని వేధించి..
ఎయిరిండియా పైలట్ అనుమానాస్పద కలకలం రేపింది. దీనికి ఆమె బాయ్ ఫ్రెండే కారణమని బంధువులు ఆరోపించారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు..ఎయిరిండియాలో పైలట్‌గా పనిచేస్తున్న 25ఏళ్ల సృష్టి తులి ఈనెల 25న ముంబైలోని అంధేరీ ఈస్ట్‌లోని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆదిత్య పండిట్ తరచూ ఆమెను వేధించేవాడని, ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడని సృష్టి కుటుంబం ఆరోపించింది. నాన్ వెజ్ తినవద్దు అంటూ కట్టడి చేసేవాడని తెలిపింది. అతనే హత్య చేసి ఉంటాడని ఫిర్యాదు చేశారు. దీంతో నవంబర్ 26న కేసు నమోదు చేసిన పోలీసులు పండిట్‌ను అరెస్టు చేశారు. కోర్టు అతడిని నవంబర్ 29 వరకు పోలీసు కస్టడీకి పంపింది. పోలీసుల సమాచారం ప్రకారం ఆమె మృతదేహానికి సమీపంలో లేదా ఆమె ఫ్లాట్‌లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. సృష్టి కమర్షియల్ పైలట్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమె గత ఏడాది జూన్ నుంచి ఉద్యోగ నిమిత్తం ముంబైలో నివసిస్తోంది. రెండేళ్ల క్రితం కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోసం శిక్షణ పొందుతున్న సమయంలో సృష్టి, పండిట్లు ఢిల్లీలో కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే ఈ ట్రైనింగ్‌లో ఆదిత్య పండిట్ పైలట్‌గా ఎంపిక కాలేదు.ఘటనకు ముందు దాదాపు ఐదు నుంచి ఆరు రోజుల పాటు పండిట్ సృష్టితో కలిసి అంధేరి ఫ్లాట్‌లో ఉన్నాడు. సోమవారం (నవంబర్ 25) అర్ధరాత్రి దాటిన తర్వాత అతను కారులో ఢిల్లీకి బయలుదేరాడు. ఈ సమయంలో సృష్టి అతనికి ఫోన్ చేసి, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అతడు ముంబైకి తిరిగి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉంది. ఎంత పిలిచినా తీయకపోవడంతో ఆమె స్నేహితురాలు ఉర్వి పంచల్‌ను సంప్రదించి, కీమేకర్ సాయంతో తలుపు తెరిచారు. కానీ అప్పటికే కేబుల్ వైర్‌తో ఉరి వేసుకుంది. అంధేరీ ఈస్ట్‌లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించగా, ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.సృష్టి మామ ఆరోపణలు'పండిట్‌ను సృష్టి చాలా గాఢంగా ప్రేమించింది. కానీ అతడు ఆమెను బాగా వేధించేవాడు. బహిరంగంగా దుర్భాషలాడేవాడు. మాంసాహారం తినడం మానేయాలని కూడా ఒత్తిడి చేశాడు. ఆమె పట్ల పండిట్ అసభ్యంగా ప్రవర్తించడం ఇతర బంధువులు కూడా చూశారు. అలాగే ఒక పార్టీలో మాంసాహారం తిన్నందుకు అందరిముందూ అరిచాడు. ఆమె కారును పాడు చేసి, రోడ్డుపై ఒంటరిగా వదిలేసివెళ్లిపోయాడు. ఇటీవల పండిట్ సోదరి నిశ్చితార్థం ఫంక్షన్‌కు సృష్టి వెళ్లలేకపోవడంతో దాదాపు 10 రోజుల పాటు మాట్లాడలేదు. దీంతో సృష్టి మానసికంగా కృంగి పోయింద'ని సృష్టి మామ ఆరోపించారు. -
రెండు సంస్థలదే ఆధిపత్యం!
దేశంలో మరిన్ని విమానయాన సంస్థలు కార్యకలాపాలు సాగించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం రెండు ప్రముఖ కంపెనీలే అధిక వ్యాపార వాటాను కలిగి ఉన్నాయని చెప్పారు. విమానయాన రంగంలో రెండు సంస్థలే ఆధిపత్యం కొనసాగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈటీ ఇండియా అసెండ్స్ ఈవెంట్లో నాయుడు పాల్గొని మాట్లాడారు.‘ఏ పరిశ్రమలోనైనా పోటీ ఉండాలి. దాంతో వినియోగదారులకు తక్కువ ధరలకే సేవలందుతాయి. కానీ విమానయాన పరిశ్రమలో కేవలం రెండు సంస్థలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ రంగం ఈ సంస్థలకే పరిమితం కావడం సరైందికాదు. మరిన్ని కంపెనీలు ఈ విభాగంలో సేవలందించాలి. దాంతో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందుతాయి. విమాన ప్రయాణం అందుబాటు ధరలో ఉండేలా ప్రభుత్వం టిక్కెట్ ధరలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో ప్రైవేట్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నా ప్రభుత్వం విభిన్న పాలసీలను తయారుచేస్తోంది. ఈ రంగాన్ని మరింత ఉత్తమంగా ఎలా చేయగలమో ఆయా సంస్థలతో చర్చిస్తోంది. ఏదైనా విమానయాన సంస్థ దివాలా తీయడం లేదా పరిశ్రమను వదిలివేయడం మాకు ఇష్టం లేదు. ఈ పరిశ్రమలోకి కొత్త విమానయాన సంస్థలు ప్రవేశించేలా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రైవేట్ మూలధనం ద్వారా కార్యకలాపాలు సాగించే కొత్త కంపెనీలు దివాలా దిశగా వెళితే ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధంఎయిరిండియా గ్రూపులో ఇటీవల విస్తారా విలీనం అయింది. దాంతో దేశీయ విమానయాన మార్కెట్ వాటాలో 80 శాతం ఇండిగో, ఎయిరిండియాలే సొంతం చేసుకుంటున్నాయి. రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 2023లో మరో పదేళ్ల కాలంపాటు అంటే 2033 వరకు ఈ పథకాన్ని పొడిగించారు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్(ఉడాన్) పథకంలో భాగంగా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడం, విమానయానాన్ని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
గుడ్‌బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటన
ఎయిరిండియాలో విలీనానికి ముందు నడిచిన చివరి విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో విమాన సిబ్బంది ‘గుడ్‌బై విస్తారా’ అంటూ భావోద్వేగ ప్రకటన చేశారు. ఇటీవల నడిచిన చివరి విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ కెప్టెన్ చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.కెప్టెన్ సుధాన్షు రైక్వార్, నేహల్ చేసిన ప్రకటనకు సంబంధించిన షార్ట్ క్లిప్‌ను ఎక్స్ వేదికలో పంచుకున్నారు. ‘చివరి విస్తారా సర్వీస్ బ్రాండ్‌గా మీకు అత్యుత్తమ భద్రత, సేవలను అందించే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నాం. కొన్నేళ్లుగా విస్తారా వివిధ ఖండాల్లో విస్తరించి, విభిన్న సంస్కృతులు కలిగిన ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసింది. ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. అంకితభావం, భద్రత, విశ్వసనీయతతో మీకు సేవ చేయడం మా లక్ష్యం. విస్తారా చివరి సర్వీస్ ఈ రోజు మేము అదే ఉన్నత ప్రమాణానికి కట్టుబడి ఉన్నాం. గుడ్‌బై విస్తారా. మేము ఎంతో మిస్ అవుతాం’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.Captain Capt Sudhanshu Raikwar and First Officer @Nehal_404 made an emotional yet confident announcement yesterday, marking their final flight as cockpit crew with @airvistara . #Aviation #Avgeek #Pilot #vistaraflight #Vistara https://t.co/G3rvMkTSRE pic.twitter.com/OvmZSmA2JT— Aman Gulati 🇮🇳 (@iam_amangulati) November 12, 2024ఇదీ చదవండి: ఇంటర్లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓపదేళ్లుగా కార్యకలాపాలు సాగించిన విమానయాన సంస్థ విస్తారా నవంబర్ 11 నుంచి తన సేవలు నిలిపేసింది. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని గతంలో కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. విలీన డీల్‌లో భాగంగా ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్‌లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైంది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 25.1 శాతం వాటా లభిస్తుంది. -
ఒకే సంస్థ.. ఒకే హోదా.. రిటైర్మెంట్ వయసులో తేడా!
టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త యాజమాన్యంలోని విస్తారా నవంబర్ 11 నుంచి ఎయిరిండియా ఎయిర్‌లైన్స్‌లో విలీనం అవుతుంది. ఈ విలీనం వల్ల ఇప్పటివరకు ఎయిరిండియా సర్వీసులో ఉన్న పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విస్తారా, ఎయిరిండియాలో పనిచేస్తున్న పైలట్ల రిటైర్మెంట్ వయసే అందుకు కారణమని తెలియజేశారు.నవంబర్ 11 నుంచి విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిరిండియాలో విలీనం అవుతుంది. ఈమేరకు గతంలోనే ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఎయిరిండియా పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఎయిరిండియా పైలట్ల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగా ఉంది. ఇప్పటివరకు విస్తారాలో పని చేసిన పైలట్లు రిటైర్మెంట్ వయసు మాత్రం 60 ఏళ్లుగా ఉంది. ఒకే సంస్థలో, ఒకే స్థానంలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసులో తేడా ఉండడంపై ఎయిరిండియా పైలట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎయిరిండియా యాజమాన్యం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలట్లు తమకు 65 ఏళ్లు వచ్చేవరకు సేవ చేయవచ్చు. ఈ ఏడాది ఆగస్టులో ఎయిరిండియా ఎంపిక చేసిన పైలట్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన పదవీ విరమణ తర్వాత 65 ఏళ్ల వరకు సర్వీసు పొడిగించే పాలసీని ప్రకటించింది.ఇదీ చదవండి: పెళ్లిరోజున భార్యను బాధపెట్టిన నారాయణమూర్తి!రూ.2,058.50 కోట్ల డీల్పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఈరోజు నుంచి కనుమరుగు కానుంది. నవంబర్ 11 నుంచి విస్తారా సేవలు నిలిపేయనుంది. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని గతంలో కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. విలీన డీల్‌లో భాగంగా ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్‌లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైంది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 25.1 శాతం వాటా లభిస్తుంది. -
భారత హాకీ స్టార్‌కు చేదు అనుభవం!
భారత హాకీ స్టార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత రాణి రాంపాల్‌కు ఇటీవల విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. అదికాస్తా వైరల్‌గా మారింది. ఎయిరిండియా విమానంలో కెనడా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చేపుడు ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు ఆమె తెలిపింది.వివరాల్లోకి వెళితే..రాణి రాంపాల్ ఇటీవల ఎయిరిండియా విమానంలో కెనడా నుంచి ఇండియా తిరిగి వచ్చారు. ఢిల్లీలో ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యాక తన లగేజీ తీసుకుందామని వెళ్లేసరికి ఆమెకు వింత అనుభవం ఎదురైంది. తన లగేజీ బ్యాగ్ పగిలి ఉండడం గమనించారు. దాంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎయిరిండియా పట్ల నిరాశ వ్యక్తం చేశారు. ఆమె ఎయిర్‌లైన్‌కు వ్యతిరేకంగా తన ఆందోళనను తెలియజేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ పంచుకున్నారు.Thank you Air India for this wonderful surprise. This is how your staff treat our bags. On my way back from Canada to India this afternoon after landing in Delhi I found my bag broken.@airindia pic.twitter.com/xoBHBs0xBG— Rani Rampal (@imranirampal) October 5, 2024‘ఎయిర్ ఇండియా, మీరిచ్చిన అద్భుతమైన సర్వీసుకు ధన్యవాదాలు. మీ సిబ్బంది మా లగేజీని ఇలా భద్రపరుస్తున్నారు. ఇటీవల కెనడా నుంచి భారతదేశానికి తిరిగి వస్తుండగా, ఢిల్లీలో దిగిన తర్వాత నా బ్యాగ్ ఈ స్థితిలో కనిపించింది’ అని పోస్ట్ చేశారు. అదికాస్తా ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎయిరిండియా వెంటనే స్పందించింది. ‘ప్రియమైన రాంపాల్, మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. దయచేసి మీ టిక్కెట్ వివరాలు, బ్యాగ్ ట్యాగ్ నంబర్, ఫిర్యాదు నంబర్/డీబీఆర్ కాపీని పంపించండి. వెంటనే దీనిపై చర్యలు తీసుకుంటాం’ అని ఎయిరిండియా తెలిపింది.ఇదీ చదవండి: పేరుకు స్మాల్ క్యాప్.. ఆ సంస్థల్లో పెట్టుబడెందుకు?ఎయిర్‌లైన్ కంపెనీలు టికెట్ ధరలు పెంచడం, తక్కువ ధరలకే సర్వీసులు అందిస్తున్నామని ప్రకటనలు చేయడంపై ఉన్న శ్రద్ధ ఆ సర్వీసులు అందించడంలో లేదని పలువులు అభిప్రాయపడుతున్నారు. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా విమానయాన సంస్థలు స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు. -
రెండేళ్లలో 9000 మంది నియామకం
ఎయిరిండియా కార్యకలాపాలు విస్తరిస్తున్న క్రమంలో భారీగా ఉద్యోగులను చేర్చుకుంటున్నట్లు సంస్థ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. గడిచిన రెండేళ్లలో మొత్తం 9000 మందిని నియమించుకున్నామని చెప్పారు. అందులో క్రూ సిబ్బంది 5000 మంది ఉన్నారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా విల్సన్ మాట్లాడుతూ..‘2023 ఆర్థిక సంవత్సరంలో 24 శాతంగా ఉన్న సంస్థ దేశీయ మార్కెట్ వాటా 2024లో 27 శాతానికి పెరిగింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ వాటా 21 శాతం నుంచి 24 శాతానికి చేరుకుంది. భవిష్యత్తులో ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ కార్యకలాపాలు పెరగనున్నాయి. గడిచిన రెండేళ్లలో 9000 మందిని నియమించకున్నాం. అందులో 5000 వేలమంది క్రూ సిబ్బంది ఉన్నారు. సిబ్బంది సగటు వయసు 54 సంవత్సరాల నుంచి 35 ఏళ్లకు తగ్గింది. సంస్థ ఐదేళ్ల ప్రణాళిక కోసం ప్రారంభించిన ‘విహాన్.ఏఐ’ రెండేళ్లు పూర్తి చేసుకుంది. దీనివల్ల గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయం 25 శాతం మెరుగుపడింది. నష్టం 50 శాతానికి పైగా తగ్గింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: యాపిల్ బ్యాటరీ బుల్లెట్‌ప్రూఫ్!‘67 నేరోబాడీ కలిగిన ఎయిర్‌క్రాఫ్ట్‌ల క్యాబిన్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నాం. 2025 మధ్యకాలం నాటికి సంస్థకు చెందిన ఇరుకైన బాడీ కలిగిన విమానాలను విశాలంగా మారుస్తాం. అందుకోసం ప్రతినెల మూడు నుంచి నాలుగు ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎంచుకోబుతున్నాం’ అని పేర్కొన్నారు. వినియోగదార్లలో విశ్వాసం పెంచేందుకు, కచ్చితమైన సమయపాలనపైనా దృష్టి సారించేందుకు 2022లో ఎయిరిండియా ‘విహాన్.ఏఐ’ను ఆవిష్కరించింది. చట్టపరమైన చిక్కులను తొలగించడంపై ఇది దృష్టి సారించింది. టేకాఫ్ దశలో భాగంగా పలు చర్యలను తీసుకుంటోంది. దీనిసాయంతో టాటా గ్రూప్ ఎయిర్ఫ్లీట్ నెట్‌వర్క్‌లో మార్పులు చేపడుతోంది. -
ఎయిరిండియా మహిళా సిబ్బందిపై దాడి
ఢిల్లీ:లండన్‌లోని ఓ హోటల్లో ఎయిరిండియాకు చెందిన మహిళా సిబ్బందిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. ఈ విషయాన్ని ఆదివారం ఎయిరిండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘లండన్‌లో ఎయిరిండియా క్యాబిన్ క్రూ మెంబర్ బస చేసిన హోటల్ రూమ్‌లో గుర్తు తెలియని దుండగుడు అక్రమంగా చొరబడి దాడికి తెగబడ్డాడు. ఆమెపై దాడి చేశాడు. సమాచారం అందిన వెంటనే స్పందించాం. ఆమెకు, ఆమె సహోద్యోగులకు తక్షణ సహాయం అందించడమే కాకుండా ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ కూడా అందిస్తున్నాం’ అని ఎయిరిండియా పేర్కొంది.Air India registers anguish over "unlawful incident of intrusion" after attack on air hostess in London, police begin probeRead @ANI Story lhttps://t.co/6IzBBBBSL0#AirIndia #London #Airhostess pic.twitter.com/MaOXaqh5YD— ANI Digital (@ani_digital) August 18, 2024గురవారం రాత్రి లండన్‌లోని రాడిసన్ రెడ్ హోటల్ రూంలో చొరబడి దాడికి తెగబడిన నిందితుడి అరెస్ట్ చేసినట్లు.. అతను నైజీరియా దేశానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటన ప్రస్తుతం లండన్ పోలీసుల విచారణలో ఉందని, సిబ్బంది గోప్యతను గౌరవించాలని అక్కడి అధికారులకు ఎయిర్ ఇండియా విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిగేలా స్థానిక అధికారులు సహకారం అందిచాలని ఎయిరిండియా కోరింది. -
ఎయిరిండియాలో కొత్తగా నారోబాడీ ఎయిర్‌క్రాఫ్ట్
ప్రీమియం ఎకానమీ సీట్లు కలిగిన ‘ఏ320 నియో’ నారోబాడీ(వెడల్పు తక్కువగా ఉండే) విమానం ఎయిరిండియా ఎయిర్క్రాఫ్ట్ల్లోకి చేరింది. ఫ్రాన్స్‌లోని ఎయిర్‌బస్ సంస్థ దీన్ని రూపొందించినట్లు ఎయిరిండియా తెలిపింది. ఇటీవలే ఇది దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి.ఎయిరిండియా తెలిపిన వివరాల ప్రకారం..ఈ విమానంలో 8 విలాసవంత బిజినెస్ తరగతి సీట్లు, అదనపు లెగ్‌రూం ఉండే 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, సౌకర్యవంతమైన 132 ఎకానమీ తరగతి సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత విమానాల డిజైన్‌కు భిన్నంగా, సరికొత్త లివరీ(ఇంటెరియర్ డిజైన్)తో ఈ విమానాన్ని తయారుచేశారు.ఇదీ చదవండి: ‘అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ఎయిరిండియా సంస్థ తిరిగి టాటా గ్రూప్ అధీనంలోకి వచ్చాక కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. విమానాల ఆధునికీకరణ ప్రారంభమైంది. కొత్త విమానాలను కొనుగోలు చేస్తామని, ఉన్నవాటిలో సదుపాయాలను మెరుగుపరుస్తామని సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దేశీయంగా టైర్ 2, టైర్ 3 నగరాలకు విమాన సర్వీసులు అందించాలని ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుంది. దాంతో విమానయాన కంపెనీలు అందుకు అవసరమయ్యే ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటున్నాయి. దేశీయ మార్గాల్లో ఎయిరిండియా కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఏ320 నియో’ నారోబాడీ విమానాన్ని వచ్చే నెల నుంచి నడపనుంది. -
పైలట్ల కొరత తీర్చేందుకు ప్రత్యేక శిక్షణ
ఎయిరిండియా పైలట్లుగా స్థిరపడాలనుకునే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. అందుకోసం మహారాష్ట్రలోని అమరావతిలో ఏడాదికి 180 మందికి శిక్షణ ఇచ్చేందుకు అకాడమీను ఏర్పాటు చేస్తోంది. అందులో ట్రెయినింగ్ పూర్తిచేసినవారిని నిబంధనల ప్రకారం నేరుగా సంస్థలో పైలట్లుగా నియమించుకోనున్నారు.ఏటా విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. దానికితోడు విమానయాన సంస్థలు ఎయిర్‌క్రాఫ్ట్‌లను పెంచుతున్నాయి. దాంతోపాటు దేశీయంగా టైర్2, 3 నగరాలకు కూడా విమాన సేవలను విస్తరించాలని కంపెనీలు యోచిస్తున్నాయి. అందుకు అనుగుణంగా విమానాలను కొనుగోలు చేస్తున్నాయి. అయితే కంపెనీలు భావించినట్లు ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్యను పెంచితే వాటిని నడిపేందుకు పైలట్ల అవసరం ఏర్పడనుంది. ఈ సమస్యను ముందే ఊహించిన టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా పైలట్లుగా స్థిరపడాలనుకునేవారికి ట్రెయినింగ్ ఇవ్వనుంది. శిక్షణ పూర్తిచేసుకున్నాక నేరుగా సంస్థలో ఉద్యోగం కల్పించాలని యోచిస్తోంది.ఇండిగో, స్పైస్‌జెట్ వంటి భారత విమానయాన సంస్థలు విదేశాల్లోని స్వతంత్ర పైలట్ ట్రయినింగ్ అకాడమీలతో అనుబంధంగా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇండిగో సంస్థ విదేశాల్లోని ఏడు ఫ్టైట్ స్కూళ్లతో అనుబంధం కలిగి ఉంది. ఇప్పటికే ఈ సంస్థ అమెరికన్ కంపెనీ పైపర్, యూరోపియన్ సంస్థ డైమండ్ నుంచి దాదాపు 30 సింగిల్ ఇంజిన్, నాలుగు మల్టీ ఇంజిన్ విమానాల డెలివరీకి ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో విదేశీ అకాడమీలతో అనుబంధంగా ఏర్పడి పైలట్లును నియమించుకోనుంది.ఎయిరిండియా మాత్రం పైలట్ల కొరత తీర్చుకునేందుకు ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. దేశీయంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పైలట్ శిక్షణ తీసుకుంటున్న 40శాతంపైగా అభ్యర్థులు విదేశాలకు వెళ్తున్నారు. దాంతో స్థానికంగా పైలట్ల కొరత పెరుగుతోందని కంపెనీ వర్గాలు చెప్పాయి. ఎయిరిండియా శిక్షణలో భాగంగా పైలట్లకు టైప్-రేటెడ్ ట్రైనింగ్ అందించేందుకు ఆరు సిమ్యులేటర్లను కలిగి ఉన్న ఎయిర్‌బస్, ఎల్3 హారిస్(యూఎస్ ఆధారిత కంపెనీ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందుకోసం గుర్గావ్లోని తన సొంత శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎయిర్‌బస్ A320 లేదా బోయింగ్ 737 వంటి నిర్దిష్ట విమానాలను నడిపేందుకు టైప్-రేటెడ్ శిక్షణ అవసరం అవుతుంది.ఇదీ చదవండి: విమాన ప్రయాణం నాలుగు గంటలు ఆలస్యం..కారణం..టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఈ సంస్థ ఇప్పటికే 470 కొత్త విమానాలను ఆర్డర్ చేసింది. 2024లో ప్రతి ఆరు రోజులకు ఒక కొత్త విమానాన్ని ప్రవేశపెడతామని గతంలో కంపెనీ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్స్ తెలిపారు. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాసా కంపెనీలు రానున్న రోజుల్లో డెలివరీ ఇచ్చేందుకు వీలుగా దాదాపు 1,250 విమానాలను ఆర్డర్ చేశాయి. ఎయిర్ఏషియా ఇండియా మాజీ సీఈఓ సునీల్ భాస్కరన్ ప్రస్తుతం ఎయిరిండియా ఏవియేషన్ అకాడమీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. -
ఒకే రన్‌వేపై రెండు విమానాలకు అనుమతి ఉందా?
ఎయిర్పోర్ట్ రన్‌వేపై దాదాపు నిమిషంలోపు రెండు విమానాలు ప్రయాణించడం సాధ్యమవుతుందా అంటే అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాతావరణంలో ఎలాంటి విజిబిలిటీ సమస్యలు లేవని నిర్ధారించుకుని షరతులకు లోబడి ఇది సాధ్యపడుతుందని నిబంధనలు చెబుతున్నాయి.ఒకే రన్‌వేపై రెండు విమానాలు ప్రయాణించేలా అనుమతులివ్వాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. ‘ఏటీసీ నియమాల ప్రకారం..వాతావరణంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేవని నిర్ధారించుకోవాలి. విజిబిలిటీ సమస్యలు ఉండకూడదు. ప్రత్యేక షరతులకు లోబడి, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి మూడు నిమిషాలలోపు రెండు విమాన టేకాఫ్‌లు, రెండు ల్యాండింగ్లకు అనుమతించవచ్చు’అని పీటీఐ తెలిపింది.ముంబై ఎయిర్‌పోర్ట్‌లో..జూన్ 8న 6ఈ 6053 అనే ఇండిగో విమానం ఇందోర్ నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సి ఉంది. దాంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ను ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం అనుమతించాలని కోరారు. ఏటీసీ సూచనలను అనుసరించి ఇండిగో విమానం ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ఇదిలాఉండగా, ఎయిర్ఇండియాకు చెందిన ఏఐ657 అనే విమానం అదే సమయంలో ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ఏటీసీ టేకాఫ్‌కోసం అనుమతించారు. దాంతో రెండు విమానాలు నిమిషం తేడాతో రన్‌వేపై ప్రయాణించాయి. ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన క్షణాల్లో ఇండిగో విమానం అదే రన్‌వేపై ల్యాండ్ అయింది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే రెండు విమానాల ప్రయాణికులకు తీవ్ర నష్టం జరిగేదని తోటి ప్యాసింజర్లు తెలిపారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ని విధుల్లో నుంచి తొలగించి విచారణ జరుపుతోంది.ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్‌జాబ్స్..!ఇదిలాఉండగా, విమానాశ్రయాల్లో అధిక జనసాంద్రత ఉన్నపుడు ఏటీసీలపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని కొందరు అధికారులు తెలిపారు. ఏటీసీ, సంబంధిత పైలట్లు ఘటనకు సంబంధించి సరైన నిబంధనలు అనుసరించారా లేదా అనే అంశంపై డీజీసీఏ విచారణ జరుగుతుందని చెప్పారు. అధిక జనసాంద్రత కలిగిన విమానాశ్రయాల్లో ముంబై ఎయిర్పోర్ట్ ఒకటి. అక్కడ విమానాలరాకపోకలు ఎక్కువగా ఉంటాయి. విమానాశ్రయంలోని ఆర్డబ్ల్యూ27 అనే రన్‌వేపై గంటకు 46 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయని తెలిసింది.Serious security concern at @CSMIA_Official Mumbai Airport yesterday putting 100s of life at riskWhile @airindia ✈️ was in the process of take off, another 🛬 from @IndiGo6E was allowed to land on same runway@DGCAIndia takes action against #Mumbai ATC official responsible pic.twitter.com/nsJvHZrWTZ— Nikhil Lakhwani (@nikhil_lakhwani) June 9, 2024 -
ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
ఎయిరిండియా విమానంలో సౌకర్యాలపై ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. అకల్ ధింగ్రా న్యూయార్క్ నుండి ఢిల్లీకి ఎయిర్ ఇండియాలో విమానంలో ప్రయాణించారు. ప్రయాణంలో తాను ఆహారం, చైర్లు ఇతర సదుపాయాలపై అసౌకర్యానికి గురయ్యాడు. మరో నెలలో ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు వెళుతున్నానని, పొరపాటున కూడా ఎయిరిండియా విమానం ఎక్కబోనంటూ ఆ వీడియోలో తెలిపాడు.అకల్ ధింగ్రా వీడియోలో స్లైడింగ్ టేబుల్ సరిగా పనిచేయకపోవడం, దెబ్బతిన్న హెడ్‌ఫోన్ జాక్ వంటి అనేక సమస్యల్ని ఎత్తి చూపాడు. విమానంలో అందించిన ఆహారం కూడా నాణ్యతగా లేదని కూడా చెప్పాడు. చివరగా.. ‘న్యూయార్క్ నుండి ఢిల్లీకి నా ఎయిర్ ఇండియా విమానం విపత్తు!’ అని వీడియో క్యాప్షన్‌లో జతచేశాడు. ఆ వీడియోపై నెటిజన్లు ఎయిరిండియా విమాన ప్రయాణంలో తమకు చేదు అనుభవాలున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Akul Dhingra (@akuldhingra) -
ట్రక్‌ట్యాక్సీను ఢీకొట్టిన 180 మంది ప్రయాణిస్తున్న విమానం!
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్ టగ్ట్రక్ ట్యాక్సీను ఢీకొన్న సంఘటన బుధవారం పుణె ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు చెప్పాయి.గ్రౌండ్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..పుణె నుంచి దిల్లీకి బయలుదేరిన విమానం టగ్ట్రక్ ట్యాక్సీను ఢీకొట్టింది. విమానం ముందు భాగంతోపాటు ట్రక్ దిబ్బతింది. ఫ్లైట్ కిందిభాగం ట్రక్కు తగలడంతో ల్యాండింగ్ గేర్ వద్ద టైర్ పాడయ్యింది. ఘటన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. అయితే వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్పోర్ట్ వర్గాలు చెప్పాయి. భూమిపై విమానాన్ని నడిపేందుకు టగ్ ట్రక్ టాక్సీని ఉపయోగిస్తారు.ఇదీ చదవండి: ఆకాశవీధిలో 41.8 కోట్లమంది.. ఇక్రా నివేదికఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ ప్రారంభించినట్లు సమాచారం. పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికులను ప్రమాదం జరిగిన విమానంలో నుంచి దింపేసి వారి గమ్యస్థానాలు చేరేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు చెప్పాయి. -
కేంద్రం అలర్ట్.. ఎయిరిండియా కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎయిరిండియా విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ గగనతలం మీదుగా విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. తాజా సమాచారం ప్రకారం.. యూరప్‌కు వెళ్లే విమానాలు ఇరాన్ గగనతలం నుంచి కాకుండా మరో మార్గంలో వెళ్లనున్నాయి. దీంతో ప్రయాణ సమయం మరింత పెరగనుంది. ఇదిలా ఉంటే.. ఇండియా, ఫ్రాన్స్, రష్యా దేశాలు ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు మానుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశాయి. అలాగే వీలైనంత వరకు ప్రయాణాల్ని తగ్గించుకోవాలని ఆయా దేశాల్లో ఉన్న భారతీయులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో భారతీయ రాయబార కార్యాలయం సాయం తీసుకోవాలని సూచించింది. Travel advisory for Iran and Israel:https://t.co/OuHPVQfyVp pic.twitter.com/eDMRM771dC — Randhir Jaiswal (@MEAIndia) April 12, 2024 గాజాపై ఇజ్రాయెల్ దాడుల జరిగిన ఏడు నెలల తర్వాత.. పశ్చిమాసియా ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా మారింది. టెల్‌అవీవ్‌పై క్షిపణులతో విరుచుకుపడేందుకు టెహ్రాన్ సమాయత్తమైందన్న అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రపంచవ్యాప్తంగా అలజడిని రేపింది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయొచ్చన్న సంకేతాలతో పలు దేశాలు తమ తమ పౌరుల్ని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. మరోవైపు యూఎస్ వార్‌షిప్‌లు ఇజ్రాయెల్‌కు చేరుకుంటుండడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
180 ఉద్యోగాలను తొలగించిన ప్రముఖ విమానయాన సంస్థ
టెక్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట ఉద్యోగాల తొలగొంపునకు పూనుకుంటున్నాయి. విమానయాన కంపెనీలు సైతం అదేబాటలో పయనమయ్యాయ. ఇటీవల ఎయిరిండియా కంపెనీ సంస్థలో 180 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. గత కొన్ని వారాల్లో 180 మందికి పైగా నాన్-ఫ్లయింగ్ సిబ్బందికి ఎయిరిండియా లేఆఫ్ ఇచ్చింది. ఈ ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాలు, పునర్నైపుణ్య అవకాశాలను వినియోగించుకోలేరని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 జనవరిలో ఎయిరిండియా పగ్గాలు చేపట్టిన తర్వాత.. వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకు టాటా గ్రూప్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కొంతమంది సిబ్బందికి లేఆఫ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: గతేడాదితో పోలిస్తే అధికంగా విమానయానం.. ఎందరో తెలుసా.. -
ఐకానిక్ భవనాన్ని కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎందుకంటే..
ఎయిరిండియాకు చెందిన ముంబయిలోని ప్రతిష్ఠాత్మక ఐకానిక్ భవనం యాజమాన్య హక్కులను మహారాష్ట్ర ప్రభుత్వం చేజిక్కించుకుంది. ఈ భవనాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,601 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో దక్షిణ ముంబయిలోని నారిమన్ పాయింట్ వద్ద ఉన్న ఎయిరిండియా భవనం యాజమాన్య హక్కులను కేంద్రం.. మహారాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఆస్తుల బదిలీకి తాజాగా ఆమోదం తెలిపింది. 1970ల్లో కేవలం ఈ భవనంలోని ఎలివేటర్‌ను ఎక్కడం కోసమే ప్రజలు క్యూ కట్టేవారట. జేఆర్డీ టాటా ఆలోచనలకు తగ్గట్లుగా న్యూయార్క్ ఆర్కిటెక్ట్ జాన్ బర్గీ డిజైన్ చేసిన ఈ 23 అంతస్తుల భవనాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సొంతం చేసుకుంది. దీన్ని సచివాలయంలోని కొన్ని విభాగాల కోసం ఉపయోగించుకోనున్నట్లు తెలిపింది. కంపెనీ బకాయిపడిన రూ.298.42 కోట్లను మాఫీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు. ఇదీ చదవండి: ‘రాజకీయంగా దాడి చేశారు.. వారు దెబ్బతినడం బాధించింది’ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఎయిరిండియాను టాటాలకు విక్రయించినప్పుడు ఎయిర్‌లైన్స్‌కు చెందిన నాన్-కోర్ ఆస్తుల్ని అందులో చేర్చలేదు. దీంతో సంస్థకు చెందిన భూమి, భవనాలు వంటి రూ.14,718 కోట్ల విలువైన వాటిని ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ కంపెనీ(ఏఐఏహెచ్ఎల్)కు బదిలీ చేసింది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియాను టాటా గ్రూపు 2021 అక్టోబరులో రూ.18,000 కోట్లకు బిడ్డింగ్‌లో దక్కించుకుంది. -
కంపెనీ ఛైర్పర్సన్ను విమానం నుంచి దించేసిన ఎయిరిండియా..?
క్రూ మెంబర్లతో దురుసుగా ప్రవర్తించినందుకు ఓ ప్రముఖ కంపెనీ ఛైర్పర్సన్ను సైతం విమానంలో నుంచి దించేసిన ఘటన ఇటీవల దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చేటుచేసుకుంది. రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ ఛైర్పర్సన్ రష్మీ సలుజా దిల్లీ నుంచి లండన్ వెళ్లాలని నిర్ణయించుకుని ఇటీవల ఎయిరిండియా విమానం ఎక్కారు. అయితే విమానంలోని క్రూ మెంబర్లతో ఆమె దరుసుగా వాదించడంతో తనను దిల్లీ ఎయిర్‌పోర్టులోనే దించేసినట్లు సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లండన్ వెళ్లాల్సిన ఏఐ 161 ఫ్లైట్ నుంచి ఓ మహిళా ప్యాసింజర్‌ను దించేశామని ఎయిర్ ఇండియా స్పోక్స్ పర్సన్ పేర్కొన్నారు. కానీ, విమాన సిబ్బంది ప్యాసింజర్ పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటనపై రష్మీ సలుజా కూడా స్పందించలేదు. ఇదీ చదవండి: అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం అయితే తోటి ప్రయాణికులు ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు తెలిసింది. కాగా, ఈ ఏడాది జనవరిలో ఏకంగా 894 మంది ప్యాసింజర్లను ఎయిర్ ఇండియా దించేసింది. వివిధ కారణాల వల్ల రూ.98 లక్షలను కాంపెన్సేషన్ కింద ఖర్చు చేసింది. -
ముంబై ఘటన.. ఎయిరిండియాకు జరిమానా
ఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) భారీ జరిమానా విధించింది. వీల్‌చైర్ సౌకర్యం కల్పించకపోవటంతో 80 ఏళ్ల ప్రయాణికుడు మృతి చెందిన ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఫిబ్రవరి 16న ముంబైలో చోటు చేసుకుంది. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం నుంచి టెర్మినల్ వరకు ఆ ప్రయాణికుడికి వీల్ ఛైర్ సౌకర్యం కల్పించపోవటంపై డీజీసీఏ సీరియస్ అయింది. ఈ ఘటనపై ఎయిరిండియాకు డీజీసీఏ షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఏడు రోజుల్లో ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పూర్తి వివరణ ఇవ్వాలంది. అదే విధంగా ఎయిర్ ఇండియా రూ. 30 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ‘ ఇద్దరు ప్రయాణికులు ఫిబ్రవరి 12న న్యూయార్క్ నుంచి ముంబైకి వచ్చారు. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడు, ఆయన భార్య ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. అయితే వీల్ చైర్లకు అధిక డిమాండ్ ఉండటంతో ఆయన భార్యకు వీల్ చైర్ సౌకర్యం కల్పిచాం. ఆయనకు సైతం కల్పిస్తామని సిబ్బంది విజ్ఞప్తి చేసింది. కానీ ఆయన వినకుండా తన భార్యతో పాటు నడుచుకుంటూ వెళ్లారు’ అని ఎయిరిండియా తెలిపింది. అయితే డీజీసీఏ చేపట్టిన విచారణలో ఎయిరిండియా దివ్యాంగులు, వృద్ధులకు కల్పించాల్సిన వీల్ చైర్ సౌకర్య నిబంధనలు సరిగ్గా పాటించటం లేదని తేలింది. ఈ ఘటన నేపథ్యంలో.. ప్రయాణికులకు అవసరమైన వీల్ చైర్లను అందుబాటులో ఉంచాల్సిందేనని విమాన సంస్థలకు డీజీసీఏ నొక్కి చెప్పింది. చదవండి: 1993 రైలు బాంబు పేలుళ్ల కేసులో ‘డాక్టర్ బాంబ్’ తుండాకు ఊరట! -
ఎయిరిండియా ఇన్‌ఫ్లైట్ సేఫ్టీ వీడియో : విభిన్న నృత్య రీతులతో
టాటా గ్రూపు యాజమాన్యంలో ఎయిరిండియా ఇటీవల సరికొత్తగా ముస్తాబైంది. విమానాల్ని కలర్ఫుల్గా, ముఖ్యంగా ఎయర్హెస్టెస్ తదితర సిబ్బంది డ్రెస్ కోడ్‌ను అందంగా తీర్చిదిద్దింది. తాజాగా మరో కొత్త అప్డేట్ను కూడా ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజనులను బాగా ఆకట్టుకుంది. దేశ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కొత్త ఇన్‌ఫ్లైట్ సేఫ్టీ వీడియోను తీసుకొచ్చింది. ఎయిరిండియా విమానం బయలు దేరడానికి ముందు వినిపించే ప్రయాణీకుల కోసం 'సేఫ్టీ ముద్ర' అనే కొత్త ఇన్‌ఫ్లైట్ సేఫ్టీ వీడియోను పరిచయం చేసింది. వివిధ కళారూపాల నుండి ప్రేరణ పొందినట్టు తెలిపింది. "శతాబ్దాలుగా, భారతీయ శాస్త్రీయ నృత్యం , జానపద-కళా రూపాలు కథలు, సూచిక మాధ్యమంగా పనిచేశాయి. నేడు, అవి విమాన భద్రత గురించి మరొక కథను చెబుతున్నాయి." అని ట్వీట్ చేసింది. సుసంపన్నమైన, విభిన్నమైన నృత్య రీతుల ప్రేరణతో కొత్త సేఫ్టీ ఫిల్మ్అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. మెకాన్ వరల్డ్గ్రూప్కు చెందిన ప్రసూన్ జోషి, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ , డైరెక్టర్ భరతబాల సంయుక్తగా 'సేఫ్టీ ముద్రాస్'ను దీన్ని తీసుకొచ్చారు. భరతనాట్యం, బిహు, కథక్, కథాకళి, మోహినియాట్టం, ఒడిస్సీ, ఘూమర్ .గిద్దా, ఎనిమిది విభిన్న నృత్య రూపాల్లో ముద్రలు లేదా నృత్యవ్యక్తీకరణలు ఇందులో చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణీకులకు భారతదేశ గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, అవసరమైన భద్రతా సూచనలను అందించేలా దీన్ని తీర్చిదిద్దడం సంతోషదాయమన్నారు ఎయిరిండియా సీఎండీ కాంప్‌బెల్ విల్సన్ For centuries, Indian classical dance and folk-art forms have served as medium of storytelling and instruction. Today, they tell another story, that of inflight safety. Presenting Air India’s new Safety Film, inspired by the rich and diverse dance traditions of India.#FlyAI… pic.twitter.com/b7ULTRuX1Z — Air India (@airindia) February 23, 2024 -
విమాన ప్రయాణికులకు ఆధునిక వినోద వ్యవస్థ
రోడ్లపై ప్రయాణాల్లో అలసటగా అనిపించినా, బోర్ కొట్టినా కాసేపు వాహనాన్ని ఆపి సేదతీరుతారు. కానీ విమాన ప్రయాణాల్లో ఆ వెసులుబాటు ఉండదు. ఒకసారి గాల్లోకి ఎగిరాక తిరిగి దిగేవరకు ప్రయాణం ఎలా ఉన్నా భరించాల్సిందే. పైగా విమాన ప్రయాణాలంటేనే గంటల తరబడి ఉంటాయి. గాల్లో ప్రయాణించేవారికి కాసింత వినోదాన్ని పంచేందుకు థేల్స్ సంస్థ సిద్ధమయింది. ఇప్పటికే ఫ్లైట్ సీట్ ముందు డివైజ్‌ను అమర్చి ప్రయాణికులను కాస్త ఎంటర్టైన్మెంట్ చేస్తున్న సంస్థ ఆ వ్యవస్థను ఆధునికీకరించనుంది. ఎయిరిండియా తమ వద్ద ఉన్న 40 బోయింగ్ 777, 787 విమానాలను, థేల్స్‌కు చెందిన ఇన్‌ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ వ్యవస్థను మరింత ఆకర్షణీయంగా మార్చనుంది. థేల్స్ ‘అవాంట్ అప్’ వ్యవస్థను ఎయిరిండియా విమానాల లోపల అమర్చే పనులు వచ్చే ఏడాది వరకు కొనసాగుతాయని కంపెనీ పేర్కొంది. 2025లో ఎయిరిండియాకు కొత్తగా డెలివరీ అయ్యే 11 కొత్త ఎయిర్‌బస్, బోయింగ్ విమానాల్లోనూ థేల్స్ తన కొత్త వ్యవస్థలను పొందుపరచనుంది. ఇదీ చదవండి: యాప్‌ల కొనుగోళ్లకు కంపెనీల పన్నాగం.. ఎలా మోసం చేస్తున్నారంటే.. థేల్స్ 3డీ మ్యాప్, ఇమ్మర్సివ్ రూట్-బేస్డ్ ప్రోగ్రామింగ్, 4K QLED HDR డిస్ప్లేలను ఇన్స్టాల్ చేయనుంది. ఇందులో హై-స్పీడ్ ఛార్జింగ్ పోర్ట్‌లు, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏరోనాటిక్స్-స్పేస్, డిజిటల్ ఐడెంటిటీ-సెక్యూరిటీ, డిఫెన్స్-సెక్యూరిటీ విభాగాల్లో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్న కంపెనీగా థేల్స్ పేరొందింది. -
మానవత్వం.. మంటగలిసిన వేళ, ఎయిరిండియాపై తీవ్ర విమర్శలు
మానవత్వం మంటగలిసింది. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా పరోక్షంగా ఓ ప్రయాణికుడు ప్రాణం పోయేందుకు కారణమైనట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. అమెరికా న్యూయార్క్ నుంచి ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ 80 ఏళ్ల ప్రయాణికుడు కుప్పకూలాడు. ఆపై ప్రాణాలొదిలాడు. అయితే ఈ విషాదానికి ముందు ఎయిరిండియా విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ ప్రదేశం నుంచి టెర్మినల్ వరకు సుమారు.1.5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చాడు సదరు ప్రయాణికుడు. వయో భారం దృష్ట్యా ల్యాండింగ్ తర్వాత ఎయిరిండియా సిబ్బందిని తనకు వీల్ చైర్ ఇవ్వాలని కోరాడు. కానీ వీల్ చైర్ కొరత ఉండడంతో తాము ఇవ్వలేమని తిరస్కరించారు. చేసేది లేక కిలోమీటర్ దూరం నడుచుకుంటూ టెర్మినల్‌కు చేరుకున్న ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదంతో ప్రయాణికుల పట్ల ఎయిరిండియా సిబ్బంది వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఎయిరిండియా యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అప్పటికే తాము బాధితుడి భార్యకు వీల్ ఛైర్ కేటాయించామని, తనకూ మరో వీల్ ఛైర్ కావాలని కోరడంతో.. ప్రయాణికుల రద్ది కారణంగా వీల్ ఛైర్ ఇచ్చేందుకు కొద్ది సమయం పడుతుందని, అప్పటి వరకు వేచి చూడాలని కోరినట్లు తెలిపింది. కానీ ప్రయాణికుడు మాత్రం తన భార్యతో కలిసి నడుచుకుంటూ టెర్మినల్‌లోకి వచ్చినట్లు వెల్లడించింది. ప్రయాణికుడు టెర్మినల్‌లో స్పృహ కోల్పోయిన వెంటనే ఎయిర్‌పోర్ట్‌కి చెందిన మెడికల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని, నిమిషాల వ్యవధిలో స్థానిక ఆస్పత్రికి తరలిచారు. అప్పటికే ప్రయాణికుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని ఎయిరిండియా యాజమాన్యం వివరణ ఇచ్చింది. చదవండి👉 : ఎయిరిండియాకు ఏమైంది? ‘వెజ్ మీల్స్‌లో చికెన్ ముక్కలు’! -
ఎయిరిండియా మాజీ సీఎండీ, ఐబీఎం, ఎస్ఏపీ కంపెనీలపై సీబీఐ కొరడా.. కారణం..
సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన విషయంలో ఎయిరిండియా మాజీ సీఎండీ, ఎస్ఏపీ ఇండియా, ఐబీఎమ్‌లపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. 2011లో రూ.225 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ను ఎయిరిండియా కొనుగోలు చేసిన విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈ ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా కనుగొన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) సీబీఐకు సిఫారసు చేసింది. దాంతో సీబీఐ దాదాపు ఆరేళ్ల దర్యాప్తు చేసింది. ఎయిరిండియా మాజీ సీఎండీ అరవింద్ జాధవ్, ఐబీఎమ్ ఇండియా, ఎస్ఏపీ ఇండియా, మరో ఆరుగురిపై ఐపీసీ సెక్షన్ 120-బీ(క్రిమినల్ కాన్స్పిరసీ), అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం ఛార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐకి సీవీసీ ఇచ్చిన నోట్లో..సరైన టెండర్ ప్రక్రియను అనుసరించకుండా ఎస్ఏపీ ఏజీ నుంచి ఈఆర్పీ సాఫ్ట్వేర్ వ్యవస్థను ఎయిరిండియా ఎంపిక చేసిందని పేర్కొంది. ఈ విషయం ఎయిరిండియా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెప్పింది. ఈ కాంట్రాక్టుకు పౌర విమానయాన శాఖ నుంచి అనుమతులు లేవనే ఆరోపణలున్నాయి. అయితే 2009, 2010ల్లో కార్యదర్శుల బృందం, మంత్రుల బృందానికి ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు ఎయిరిండియా చెబుతోంది. ఇదీ చదవండి: రూ.32 లక్షల సైకిల్ - ఎందుకింత రేటు? ఇదిలా ఉండగా, అప్పటికే ఒరాకిల్ నుంచి అదే మాదిరి ఈఆర్పీ సాఫ్ట్వేర్ ఉంది. మళ్లీ ఎందుకు సాఫ్ట్వేర్ తీసుకున్నారనేదానిపై సరైన వివరణ లేదు. ఒరాకిల్ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలున్నాయని అంటున్నా సరిచేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు కనిపించలేదని తెలిస్తుంది. ఓపెన్ టెండర్ ప్రక్రియను నిర్వహించకుండానే ఎస్ఏపీ, ఐబీఎమ్లకు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టును అప్పగించారనే వాదనలున్నాయి. -
బంపరాఫర్.. రూ. 1799కే ఫ్లైట్ జర్నీ!
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. వన్‌వే టికెట్ డొమెస్టిక్ రూట్లలో రూ. 1,799, అంతర్జాతీయ రూట్లలో రూ. 3,899 నుంచి ప్రారంభమయ్యే నెట్వర్క్-వైడ్ సేల్‌ను ప్రారంభించింది . ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ పేరిట పరిమిత-కాల నెట్వర్క్-వ్యాప్త ఆఫర్‌ను ఫిబ్రవరి 2న ప్రారంభించింది. ఇది ఫిబ్రవరి 5 వరకు చెల్లుబాటులో ఉంటుంది. దీంతోపాటు ఎయిర్ ఇండియా వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా చేసే బుకింగ్ చేస్తే ఈ ఆఫర్‌పై కన్వీనియన్స్ ఫీజు కూడా మినహాయించనున్నట్లు ఎయిర్ఇండియా ఒక విడుదలలో తెలిపింది. షరతులు ఇవే.. ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ కింద బుకింగ్‌లు కేవలం నలుగురికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 2 నుంచి సెప్టెంబర్ 30 మధ్య చేసే ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫిబ్రవరి 5వ తేదీ లోపు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశీయ మార్గాల్లో అన్నీ కలుపుకొని వన్-వే ఎకానమీ క్లాస్ ఛార్జీలు రూ.1,799 నుంచి ప్రారంభమవుతాయి. అయితే వన్-వే బిజినెస్ క్లాస్‌లో ఇది రూ. 10,899. ఇక అంతర్జాతీయ మార్గాల్లో వన్-వే ఎకానమీ క్లాస్ ఛార్జీలు రూ. 3,899 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సేల్ అందుబాటులో ఉన్న సీట్లు పరిమితంగా ఉంటాయి. ముందుగా బుక్ చేసుకున్నవారికి సీట్లు లభిస్తాయని ఎయిర్ లైన్స్ తెలిపింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన టిక్కెట్లపై కన్వీనియన్స్ ఫీజు ఆదా చేసుకోవచ్చు. దేశంలోని పలు నగరాలతో పాటు యూఎస్, కెనడా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, గల్ఫ్ & మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్, దక్షిణ ఆసియాలో ఎయిర్‌లైన్ నిర్వహించే గమ్యస్థానాలకు తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయి. -
ఎయిరిండియాకు ఏమైంది? ‘వెజ్ మీల్స్‌లో చికెన్ ముక్కలు’!
టాటా సన్స్ గ్రూప్ ఆధీనంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందా? ఫలితంగా ప్రయాణికులకు ఎయిరిండియా సంస్థపై నమ్మకం సన్నగిల్లుతుందా? అంటే అవుననే అంటున్నాయి ఎయిరిండియా సంస్థలోని వరుస సంఘటనలు. టాటా సన్స్ ఎయిరిండియాను కొనుగోలు చేసిన ఆరంభం నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఇప్పటికే ప్రయాణికులపై మూత్ర విసర్జన,దుబాయ్- ఢిల్లీ ఎయిరిండియా విమానం కాక్‌పిట్‌లోకి ప్రియురాలు, మహిళ భోజనంలో రాయి వంటి వరుస వివాదాలతో ఆ సంస్థ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. తాజాగా, మరో మహిళ వెజ్‌మీల్స్‌లో చికెన్ ముక్కలు కనిపించడంతో కంగుతినడం ఆమె వంతైంది. వీర్‌జైన్ అనే మహిళ ప్రయాణికురాలు కాలికట్ టూ ముంబై ఏఐ582 ఎయిరిండియా విమానం ఎక్కింది. సాయంత్రం 6.40 బయలుదేరాల్సిన విమానం 7.40కి ప్రారంభమైంది. కొన్ని సార్లు రాకపోకల కారణంగా ఫ్లైట్ జర్నీ కొంచెం ఆలస్యం అవుతుందిలే అని సర్ది చెప్పుకుంది. వీర్‌జైన్‌కు జర్నీ ప్రారంభమైంది. కొద్దిసేపటికి బాగా ఆకలివేసిన వీర్‌జైన్ వెజ్మీల్స్ ఆర్డర్ చేసింది. సిబ్బంది వెజ్మీల్స్ తెచ్చారు. అసలే ఆకలి..పైగా ప్లేట్లో మీల్స్ వేడివేడిగా ఉండడంతో ఆతృతగా ఆరగించే ప్రయత్నం చేసింది. క్రూ సిబ్బంది సర్వ్ చేసిన ఆహార ప్యాకెట్‌పై ‘వెజ్ మెయిన్ మీల్’ అని స్పష్టంగా రాసిఉన్నా.. అందులో చికెన్ పీసెస్ రావడం పట్ల ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇలా ఎందుకు జరిగిందని ఎయిరిండియా కేబిన్ సూపర్వైజర్ సోనాని ప్రశ్నించింది. వీర్‌జైన్‌తో పాటు తన స్నేహితురాలు సైతం తన వెజ్ ప్లేట్లో చికెన్ ముక్కలు వచ్చాయంటూ ఫిర్యాదు చేసింది. పట్టించుకోని ఎయిరిండియా సిబ్బంది? అయితే జరిగిన తప్పిందంపై ఎయిరిండియా సిబ్బంది సరిగ్గా స్పందించ లేదని.. సంబంధిత సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ఎయిరిండియా విమానంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దిగొచ్చిన ఎయిరిండియా.. ఆపై క్షమాపణలు ప్రస్తుతం ఆఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా..ఇలాగే పునరావృతమైతే ఎయిరిండియాపై ప్రయాణికులకు నమ్మకాన్ని పోగొట్టుకుంటుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎయిరిండియాకు ఏమైందని, ఆ సంస్థ సీఈఓ కాంప్‌బెల్ విల్సన్, మాతృ సంస్థ టాటా గ్రూప్ చర్యలు తీసుకుంటే బాగుంటుదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోనాజైన్ ఫోటోలపై ఎయిరిండియా స్పందిస్తూ క్షమాణలు చెప్పింది. చదవండి👉 అంబానీతో పోటీపడి.. ఆపై అడ్డంగా దొరికిపోయిన గౌతమ్ సింఘానియా! -
ఎయిర్ఇండియా బాహుబలి!
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వాకిట్లోకి మరో కొత్త విమానం వచ్చి చేరింది. అతిపెద్ద బాడీ కలిగిన ఏ350-900 సర్వీస్ శనివారం ఎయిర్ ఇండియాతో జతైంది. యూరప్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ రూపొందించిన ఈ సర్వీసు దిల్లీలోని ఇందీరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి వైడ్‌బాడీ విమాన సర్వీసును నిర్వహిస్తున్న సంస్థల్లో ఎయిర్ ఇండియానే మొదటిది కావడం విశేషం. దీంతోపాటు వచ్చే మార్చిలోగా మరో 5 విమానాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. మొత్తం 20 ఏ350-900 సర్వీసులను ఆర్డర్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఎయిర్ ఇండియా 40 ఏ350ఎస్ విమానాలు, 40 ఏ350-900, ఏ350-1000 ఎయిర్క్రాఫ్ట్లతోపాటు 140 చిన్న సైజు ఏ321, 70 ఏ320 నియో విమానాలకు ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా A350-900 విమానం కాన్ఫిగరేషన్లు.. క్యాబిన్లో మెరుగైన సౌలభ్యం కోసం ఫ్లాట్ బెడ్లతో 28 ప్రైవేట్ బిజినెస్ క్లాస్ సూట్లు ఉన్నాయి. అదనంగా 24 ప్రీమియం ఎకానమీ సీట్లు ఉన్నాయి. క్యాబిన్లో 264 ఎకానమీ క్లాస్ సీట్లున్నాయి. అన్ని తరగతుల్లో హైడెఫినిషన్ స్క్రీన్లు అందుబాటులో ఉంచారు. సుమారు ఇందులో 320 మంది ప్రయాణించవచ్చు. క్రూ సిబ్బంది ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇటీవల రూపొందించిన కొత్త యూనిఫామ్‌లో కనిపించనున్నారు. ఎయిర్ ఇండియా A350 జనవరి 2024లో వాణిజ్య సేవలను ప్రారంభించనుంది. ప్రాథమికంగా ఈ సర్వీస్ కొన్నిరోజులు దేశీయంగా సేవలందిస్తుందని సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత విదేశాల్లోని ఇతర ప్రాంతాలకు దీని సేవలను విస్తరించనున్నారు. ఏటా వెయ్యి కోట్లు ఆదా భారతీయ వైమానిక దళం అధీనంలో ఉన్న గగనతలాన్ని వినియోగించుకోవడం వల్ల విమానయాన సంస్థలకు ఏటా వెయ్యి కోట్ల రూపాయల వరకు ఆదా కానున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయంగా వినియోగిస్తున్న గగనతలంలో 30 శాతం వైమానిక దళం అధీనంలో ఉంది. ఈ గగనతలాన్ని వినియోగించుకోవడం వల్ల విమానం నడిచే సమయం తగ్గనుందని, చమురు వినిమయం, ఉద్గారాలు మరింత తగ్గుతాయని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నెల 18 నాటికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) 1,562 మంది కమర్షియల్ పైలెట్లకు లైసెన్స్‌లు జారీ చేసింది. వైమానిక దళం వినియోగిస్తున్న ఏరోస్పేస్లో 40 శాతం వృథాగా ఉందని పేర్కొంది. ఇదీ చదవండి: వారాంతపు సెలవులపై అభిప్రాయం మార్చుకున్న బిల్‌గేట్స్ -
ఎయిరిండియా షాకింగ్ నిర్ణయం!
టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియా రెండు డేటా సెంటర్లను షట్‌డౌన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో ఎయిరిండియా ఏడాదికి వన్ మిలియన్ డాలర్లను ఆదా చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎయిరిండియా తన కష్టమర్లకు సేవలంచేలా అప్లికేషన్లు, ఇతర సర్వీసులు కోసం ముంబై, న్యూఢిల్లీలలో రెండు డేటా సెంటర్లను ఉపయోగిస్తుంది. అయితే, తాజాగా వాటిని షట్‌డౌన్ చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఈ నిర్ణయంతో వన్ బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేయొచ్చని ఎయిరిండియా చెబుతుంది. ఎయిరిండియా కార్యకలాపాలు కొనసాగించేందుకు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించనుంది. ఈ క్లౌడ్ సేవల్ని అమెరికాలోని సిలీకాన్ వ్యాలీతో పాటు పాటు భారత్‌లోని గురుగ్రామ్, కొచ్చి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా "మేం ఎయిరిండియా ప్రయాణంలో సాఫ్ట్వేర్-ఎ-సర్వీస్, ప్లాట్‌ఫారమ్-యాజ్-ఎ-సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్-ఎ-సర్వీస్ మెథడాలజీ సేవల్ని వినియోగిస్తున్నాం " అని ఎయిర్ ఇండియా చీఫ్ డిజిటల్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ సత్య రామస్వామి చెప్పారు. గతేడాది జనవరిలో టాటా గ్రూప్ టేకోవర్ చేసిన ఎయిరిండియా రానున్న ఐదేళ్ల భవిష్యాత్ ఎలా ఉండాలనే అంశంపై ప్రణాళికల్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు రామస్వామి వెల్లడించారు. -
ఎయిరిండియా ఎక్కొద్దు: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌కు ఎన్ఐఏ షాక్
టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా కార్యకలాపాలను నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) షాకిచ్చింది. అతడిపై పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు సోమవారం పేర్కొంది. భారతీయ శిక్షాస్మృతి, కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద కేసు పెట్టినట్టు వెల్లడించింది. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నవంబర్ 4 న ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. సిక్కులు ఎవరూ నవంబరు 19న ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని, ఒకవేళ అలా ఎవరైనా ప్రయాణిస్తే ప్రాణాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించాడు. మొత్తం 37 సెకెన్ల వీడియోలో అదే రోజు నవంబర్ 19న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందంటూ బెదిరించడం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కలకలం రేపాయి. దీంతో హై అలర్ట్ జారీ చేసిన ఇండియా, కెనడాతోపాటు ఎయిరిండియా పయనిచంఏ ప్రయాణించే కొన్ని ఇతర దేశాలలో భద్రతా దళాలు దర్యాప్తు ప్రారంభించాయి. 2019లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ అతనిపై తొలి కేసు నమోదైంది. అప్పటికీ అతడు ఎన్ఐఏ దృష్టిలో కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ ,చండీగఢ్‌లోని అమృత్‌సర్‌లో ఇల్లు , కొంతభూమిని జప్తు చేసింది. 2021 ఫిబ్రవరిలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పన్నన్‌పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 29న అతన్ని "ప్రకటిత నేరస్థుడిగా" ప్రకటించింది. భారత్-కెనడా సంబంధాలు దెబ్బతిన్నప్పటి నుంచి గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పేరు ప్రతిచోటా మారుమోగుతున్న సంగతి తెలిసిందే. -
విమానాల లీజింగ్ వ్యాపారంలోకి అదానీ పోర్ట్స్
ముంబై: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీ సెజ్) తాజాగా విమానాల లీజింగ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇందుకోసం సొంతంగా ఉడాన్‌వత్ లీజింగ్ ఐఎఫ్ఎస్సీ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసింది. రూ. 2.5 కోట్లు అదీకృత మూలధనంతో దీన్ని ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిరిండియా కూడా ఇటీవలే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) గిఫ్ట్ సిటీలో సొంత ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. మరో విమానయాన సంస్థ ఇండిగో కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నట్లు సమాచారం. -
ఎయిరిండియా ఆఫర్: రూ. 1471లకే విమానం ఎక్కేయొచ్చు!
AirIndia Sale: గతవారం ఎయిర్‌క్రాఫ్ట్ లివరీ, కొత్త బ్రాండింగ్ తరువాత టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా తన ప్యాసింజర్ల కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో 96 గంటల ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో ప్రయాణిలకు ఆకర్షణీయమైన ఛార్జీలతో విమాన టికెట్లను అందిస్తోంది. తాజా ప్రకటన ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎకానమీ విమాన టికెట్ల ఛార్జీలు రూ. 1470, బిజినెస్ క్లాస్ ఛార్జీలు రూ.10.130 లనుంచి ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాలకు ఆకర్షణీయమైన ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. దేశీయంగా ఎంపిక చేసిన ప్రాంతాల ఎకానమీ క్లాస్ టికెట్లు (అన్నీ ఛార్జీలు కలిపి) రూ.1470, బిజినెస్ క్లాస్‌కు రూ.10,130 నుండి ప్రారంభమవుతాయి. ఆగస్టు 20వరకు అందుబాటులో ఉండే నాలుగు రోజుల సేల్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ప్రయాణించవచ్చు. ఎయిరిండియా వెబ్సైట్, మొబైల్ యాప్‌తో పాటు, అధీకృత ట్రావెల్ ఏజెంట్లు , ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల (OTAలు) ద్వారా కూడా విక్రయం కింద బుకింగ్‌లు చేయవచ్చు. పరిమిత సీట్లు, పరిమిత కాలఆఫర్గా అందిస్తున్న ఈసేల్‌లో టికెట్లు ఫస్ట్ కమ్ ఫస్ట్‌సర్వ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయని ఎయిరిండియా తెలిపింది. దీని ప్రకారం హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు సంబంధించి ఎయిరిండియా విమాన టికెట్ చార్జ్ కేవలం రూ.1931గా ఉంటుంది.ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా సర్వీస్ ఛార్జ్ లేకుండా బుకింగ్ చేసుకోవచ్చు. వెబ్సైట్,మొబైల్ యాప్‌తో పాటు నేరుగా అధీకృత ట్రావెల్ ఏజెంట్లు,ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల (OTAలు) ద్వారా కూడా విక్రయం కింద బుకింగ్‌లు చేసుకోవచ్చు. కాగా ఎయిరిండియా తొలి ఎయిర్‌బస్ A350 కొత్త లైవరీలో విమానాల్లోకి ప్రవేశించినఅనంతరం డిసెంబర్ 2023 నుండి ప్రయాణికులు తమ ప్రయాణంలో కొత్త లోగోను చూడొచ్చని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. రెడ్, గోల్డెన్, పర్పుల్ రంగులతో కూడిన కొత్త లోగో ఎయిర్‌లైన్ భవిష్యత్తు దృక్పథాన్ని సూచిస్తుందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
ఎయిరిండియా లుక్ మారింది.. అదరగొడుతుంది
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ చేతికి చేరిన విమానయాన సంస్థ ఎయిరిండియా సరికొత్త రూపు సంతరించుకుంటోంది. ఇందుకు సంబంధించి కొత్త బ్రాండ్ గుర్తింపుని, విమానాల లుక్, లోగోను గురువారం ఆవిష్కరించింది. ది విస్టా పేరిట తీర్చిదిద్దిన కొత్త లోగో.. అపరిమిత అవకాశాలు, పురోగతి, భవిష్యత్‌పై సాహసోపేత అంచనాలను ప్రతిబింబిస్తుందని కంపెనీ పేర్కొంది. బ్రాండ్స్‌కి ప్రత్యేక రూపునిచ్చే ఫ్యూచర్‌బ్రాండ్ కంపెనీతో కలిసి దీన్ని రూపొందించినట్లు వివరించింది. ఈ ఏడాది డిసెంబర్లో వినూత్న హంగులతో ఏ350 విమానం అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి ప్రయాణికులు కొత్త లోగోను చూడవచ్చని ఎయిరిడియా వివరించింది. మరోవైపు, ఎయిరిండియా అనేది తమకు మరో సాధారణ వ్యాపారంలాంటిది కాదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. మానవ వనరులతో పాటు ఎయిర్‌లైన్‌ని అన్ని విధాలుగా అప్‌గ్రేడ్ చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. -
వరల్డ్ టాప్ 100 ఎయిర్‌లైన్స్: మళ్లీ అదరగొట్టిన సంస్థ ఇదే!
ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 ఎయిర్‌లైన్స్ జాబితాలో రెండు భారతీయ విమానయాన సంస్థలు చోటు సంపాదించు కున్నాయి. విమానయాన సంస్థలు విస్తారా, ఇండిగో మాత్రమే ఈ లిస్ట్‌లో ఉండటం విశేషం. టాప్ 100లో 49వ ర్యాంకు సాధించిన ఇండిగో మూడవ ఉత్తమ తక్కువ-ధర విమానయాన సంస్థగా ఎంపికైంది. టాటా గ్రూపు నేతృత్వంలోని ఎయిరిండియా 10 అత్యంత మెరుగైన విమానయాన సంస్థల జాబితాలో 9వ స్థానంలో ఉంది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డుల ప్రకారం 2022లోని 20వ ప్లేస్నుంచి నాలుగు స్థానాలు ఎగబాకి మరీ విస్తారా 16వ స్థానానికి చేరింది.అటు ఇండిగో గత సంవత్సరం 45వ స్థానం నుండి రెండు స్థానాలు పెరిగి 43వ ర్యాంక్‌కు చేరుకుంది. టాప్ 100 ఎయిర్‌లైన్స్‌కు స్కైట్రాక్స్ ఈ అవార్డులను ఇచ్చింది. అలాగే 20 ‘ప్రపంచపు అత్యుత్తమ ఎయిర్‌లైన్ క్యాబిన్ క్రూ 2023’ జాబితాలో కూడా విస్తారా 19వ ప్లేస్ కొట్టేసింది. అంతేనా ఆసియాలోని టాప్ 10 ఎయిర్‌లైన్స్ జాబితాలో విస్తారా 8వ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. (రెండుసార్లు ఫెయిల్...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్ స్టోరీ) ఎయిర్‌లైన్ స్కైట్రాక్స్ టాప్ 20 ఎయిర్‌లైన్స్ జాబితాలో వరుసగా రెండవ సారి స్థానం పొందింది విస్తారా.అలాగే వరుసగా మూడో ఏడాది కూడా 'బెస్ట్ ఎయిర్‌లైన్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఆసియా' అవార్డును, ఇండియా దక్షిణాసియాలో ఉత్తమ క్యాబిన్ క్రూ' గా వరుసగా ఐదవసారి, 'భారతదేశం, దక్షిణాసియాలో ఉత్తమ క్యాబిన్ క్రూ' మూడవసారి గెలుచుకుంది. దీంతోపాటు 'వరల్డ్స్ బెస్ట్ ఇన్‌ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ 2023' విభాగంలో 20వ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 100 దేశీల నుంచి వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్స్‌లో ఓటు వేయగా, మొత్తం 20.23 మిలియన్ల ప్రయాణికుల నుండి ఓట్లు వచ్చాయి.విస్తారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ కణ్ణన్ మాట్లాడుతూ ఈ అవార్డులు తమ సేవలు, కస్టమర్ల నమ్మకంతో పాటు వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో తమని మరింత ఉత్తేజితం చేస్తామన్నారు. తమ ఉద్యోగులు, ముఖ్యంగా ఫ్రంట్‌లైన్ టీమ్‌లు, ఎనిమిదేళ్ల ప్రస్థానంలో విశేష కృషికి గుర్తింపుగా నిలిచాయని పేర్కొన్నారు. ఇండియా సౌత్ఏసియాలో ఉత్తమ విమానయాన సిబ్బంది అవార్డును ఐదోసారి గెలుచుకోవడం గొప్ప విషయమని స్కైట్రాక్స్ సీఈవో ఎడ్వర్డ్ ప్లాస్టెడ్ అన్నారు. (రిలయన్స్ గ్రూప్‌లో కీలక పరిణామం: ప్రెసిడెంట్‌గా పారుల్ శర్మ) విస్తారా విస్తారా టాటా సన్స్ , సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ జాయింట్ వెంచర్. ప్రస్తుతం ఇది 61 విమానాల సముదాయాన్ని కలిగి ఉంది, ఇందులో 46 ఎయిర్‌బస్ A320neo, 10 ఎయిర్‌బస్ A321, ఒక బోయింగ్ 737-800NG, నాలుగు బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ ఉన్నాయి. -
ఏవియేషన్ చరిత్రలో అదిపెద్ద డీల్.. 500 విమానాలకు ఇండిగో ఆర్డర్
ఏవియేషన్ చరిత్రలో అతి పెద్ద డీల్ జరిగింది. దేశీయ ఏయిర్‌లైన్స్ దిగ్గజం ఇండిగో ఫ్రాన్స్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి 500 విమానాల్ని కొనుగోలు చేసేలా ఒప్పందం కుదర్చుకుంది. ఇప్పటికే టాటాలకు చెందిన ఎయిరిండియా ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి 470 విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టింది. ఆ ఒప్పందం కంటే ఇండిగో - ఎయిర్ బస్‌ల మధ్య జరిగిన డీల్ దేశీయ విమాన చరిత్రలో ఇదే పెద్దదని పరిశ్రమ వర్గాల విశ్లేషకులు చెబుతున్నారు. జూన్ 19న ప్యారిస్ ఎయిర్ షోలో ఇండిగో - ఎయిర్‌బస్‌ల మధ్య కొనుగోలు చర్చలు జరిగాయి. ఈచర్చల్లో సందర్భంగా ఇండిగో బోర్డ్ఆఫ్ చైర్మన్ వి.సుమత్రాన్, ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, ఎయిర్‌బస్ సీఈవో గుయిలౌమ్ ఫౌరీ, అంతర్జాతీయ చీఫ్ కమర్షియల్ అధికారి క్రిస్టియన్ షెరర్లు పాల్గొన్నారు. అనంతరం, దేశ ఏవియేషన్ హిస్టరీలోనే భారీ కొనుగోలు ఒప్పందం జరిగింది. 500 ఏ320 ఎయిర్ క్రాఫ్ట్‌ల కొనుగోలుకు ఆర్డర్ పెట్టినట్లు ఇండిగో తెలిపింది. తాజా ఇండిగో చేసిన ఆర్డర్‌తో ఎయిర్‌బస్ డెలివరీ చేయాల్సిన విమానాల సంఖ్య 1,330కి చేరింది. కాగా, ప్రస్తుతం ఇండిగో 300 విమానాలను నడుపుతోంది. ఇది వరకే 480 విమానాలకు ఆర్డర్ పెట్టింది. ఇవి డెలివరీ అవ్వాల్సి ఉంది. -
ఎయిర్ఇండియా నిర్లక్ష్యం.. ఆఖరి నిమిషంలో విమానం రద్దు
సాక్షి, విశాఖ: ఎయిర్ఇండియా నిర్లక్ష్య వైఖరి మరోసారి వెలుగుచూసింది. గతంలో పలుమార్లు అప్పటికప్పుడు విమాన సర్వీసులను రద్దు చేసి ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఎయిర్ఇండియా.. తాజాగా మరోసారి ఉన్నపళంగా విమాన సర్వీస్‌ను రద్దు చేసింది. శనివారం విశాఖ నుండి ఢిల్లీ వెళ్లవలసిన సర్వీసును ఆకస్మికంగా రద్దు చేసింది ఎయిర్ఇండియా విమానాయాన సంస్థ. దాంతో ప్రయాణికుల్లో ఒక్కసారిగా ఆందోళన రేకెత్తింది. సుమారు 20 మంది ప్యాసింజర్లు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి 9 గంటలకు బయల్దేరాల్సిన ఫ్లైట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో సదరు ప్రయాణికులు మెయిల్‌కు సమాచారం ఇవ్వడంలో కూడా జాప్యం చేసింది.ఆఖరి నిమిషంలో సమాచారం ఇవ్వడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కాక్‌పిట్‌లోకి గర్ల్‌ఫ్రెండ్.. వరుస వివాదాల్లో ఎయిరిండియా!
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా (airindia) వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. మధ్యం మత్తులో ప్రయాణంలో తోటి ప్రయాణికులపై తప్పతాగి మూత్రం పోయడం, ఒకరినొకరు కొట్టుకోవడం,కాక్‌పిట్‌లో స్నేహితురాలిని ఆహ్వానించడం వంటి ఘటనలతో తరచు వార్తల్లో కెక్కుతుంది. తాజాగా, గత వారం ఎయిరిండియా విమానానికి చెందిన ఇద్దరు పైలెట్లు తన స్నేహితురాలని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఎయిరిండియాకు చెందిన ఏఐ-445 విమానం ఢిల్లీ నుంచి లేహ్‌కు (లద్దాఖ్) వెళ్లిన విమానంలో పైలెట్, కో-పైలెట్ తన స్నేహితురాల్ని కాక్‌పిట్(cockpit)లో కూర్చోబెట్టుకున్నారు. అయితే, ఎంత సేపు కాక్‌పిట్‌లో ఉన్నారనే అంశంపై స్పష్టత రాలేదు. ఈ ఘటనపై క్యాబిన్ క్రూ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ఎయిరిండియా యాజమాన్యం ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మరోవైపు, దీనిపై డీజీసీఏ స్పందించింది. నియమ నింబంధనల్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎయిరిండియా విచారణ నిమిత్తం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై ఎయిరిండియా అధికారిక ప్రకటన చేయలేదు. దేశంలో అత్యంత సున్నిత ప్రాంతమైన లేహ్ వైమానిక మార్గం అత్యంత సున్నితమైంది. క్లిష్టమైనది. ఈ మార్గంలో ప్రయాణించే విమానంలో పైలట్లు నిబంధనలను ఉల్లంఘించడంపై వైమానిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీ మార్గంలో ఎయిర్ ఇండియా విమానం ఏ1-915 కాక్‌పిట్‌లోకి తన మహిళా స్నేహితురాలిని స్వాగతించిన ఎయిర్ ఇండియా పైలట్ లైసెన్స్‌ను డీజీసీఏ సస్పెండ్ చేసింది. కాక్‌పిట్ ఉల్లంఘన ఘటనలో సత్వర, సమర్థవంతమైన చర్య తీసుకోలేదని ఆరోపించినందుకు డీజీసీఏ ఎయిరిండియాకు రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఇదీ చదవండి : వాట్సాప్ చాట్ విడుదల, మూత్ర విసర్జన ఘటనలో శంకర్ మిశ్రాను ఇరికించారా? -
రష్యా నుంచి.. మరో ఎయిరిండియా విమానంలో తరలింపు
రష్యా: సాంకేతిక లోపం కారణంగా అత్యవసర పరిస్థితుల్లో రష్యా మగడాన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లోని ప్యాసింజర్లు మరియు సిబ్బందిని శాన్ ఫ్రాన్సిస్కో చేరవేసేందుకు ప్రత్యామ్నాయంగా మరో ఫ్లైట్ ను ఏర్పాటు చేసింది ఎయిర్ ఇండియా. ఈ ఫ్లైట్ రష్యా మగడాన్ ఎయిర్ పోర్టు నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణమైనట్లుగా ఎయిర్ ఇండియా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ప్రయాణికుల అవస్థలు.. ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణమైన ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 777 కు గగనతలంలో ఏర్పడిన చిన్న సాంకేతిక లోపం కారణంగా రష్యాలోని మగడాన్ ఎయిర్ పోర్టులో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న 216 ప్రయాణికులతో పాటు 16 మంది సిబ్బందిని అప్పటికప్పుడు సమీప పట్టణంలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసింది ఎయిర్ ఇండియా. అయితే.. అక్కడ వారికి సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. మరో గత్యంతరం లేక నేల మీదే నిద్రకు ఉపక్రమించారు. దీనికి సంబంధించిన కథనాలు సోషల్ మీడియా, మీడియాలోనూ వైరల్ అయ్యాయి. దీంతో ఎయిరిండియా నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేయడంతో ప్రయాణికులందరికీ ఊరట కలిగింది. ఫ్లైట్ బయలుదేరింది.. ఈ నేపథ్యంలో రష్యా మగడాన్ ఎయిర్ పోర్టు నుండి బయలుదేరిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసిన ఎయిర్ ఇండియా సాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో ఈ ఫ్లైట్ లోని పాసింజర్లకు మరోసారి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రిసీవ్ చేసుకునేందుకు అక్కడి ఎయిర్ పోర్టులో సహాయక సిబ్బంది సంఖ్యను పెంచి వారిని అప్రమత్తం చేసినట్లు కూడా వెల్లడించింది. UPDATE: AIR INDIA FLIGHT AI173D TAKES OFF FOR SAN FRANCISCO FROM MAGADAN Flight AI173D from Magadan, Russia (GDX) is now airborne for San Francisco (SFO), carrying all passengers and crew. The flight departed GDX at 1027 Hours on 08 June 2023 (local time) and is expected to… — Air India (@airindia) June 7, 2023 -
ఉపాధిలో ఎయిరిండియా జోరు..
న్యూఢిల్లీ: వృద్ధి అవకాశాలపై అత్యంత ఆశావహంగా ఉన్న విమానయాన సంస్థ ఎయిరిండియా అయిదేళ్ల వ్యాపార పరివర్తన ప్రణాళిక అమలుపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతోంది. ప్రతి నెలా 550 మంది క్యాబిన్ సిబ్బంది, 50 పైలట్లను నియమించుకుంటోంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఆరు ఏ350 పెద్ద విమానాలను అందుకోనుంది. ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ ఈ వివరాలను వెల్లడించారు. ఎయిర్‌లైన్ హైరింగ్ ప్రణాళికలను ప్రస్తావిస్తూ నిర్దిష్ట టార్గెట్ అంటూ ఏదీ లేదన్న విల్సన్ .. ‘ప్రతి నెలా కొత్తగా సుమారు 550 మంది క్యాబిన్ సిబ్బంది, 50 మంది పైలట్లను తీసుకుంటున్నాం, శిక్షణనిస్తున్నాం. ఎయిర్‌లైన్ ప్రైవేటీకరణ ముందు నాటి పరిస్థితితో పోలిస్తే వార్షికంగా క్యాబిన్ సిబ్బంది నియామకాల రేటు పది రెట్లు, పైలట్లది అయిదు రెట్లు పెరిగింది‘ అని వివరించారు. ఈ ఏడాదంతా కూడా ఇదే తీరులో హైరింగ్ కొనసాగుతుందని, ఏడాది ఆఖరులో నెమ్మదించి, 2024 ఆఖర్లో మళ్లీ పెరగవచ్చని ఆయన పేర్కొన్నారు. కొత్త విమానాలు వచ్చే కొద్దీ రిక్రూట్మెంట్ పెరుగుతుందన్నారు. నాలుగు సంస్థల్లో 20 వేల సిబ్బంది.. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిరేషియా ఇండియా (ప్రస్తుతం ఏఐఎక్స్ కనెక్ట్), విస్తారాలను ఎయిరిండియాలో విలీనం చేసే విషయంపై స్పందిస్తూ నియంత్రణ సంస్థల అనుమతుల మేరకు ఎయిర్‌లైన్స్ వ్యాపారాన్ని క్రమబద్ధీకరించుకోనున్నట్లు విల్సన్ చెప్పారు. వృద్ధి వ్యూహంలో భాగంగా కొత్తగా తీసుకుంటున్న వారు కాకుండా నాలుగు ఎయిర్‌లైన్స్‌లో కలిపి సుమారు 20,000 సిబ్బంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 3,900 మంది పైచిలుకు సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నట్లు గత నెలలో ఉద్యోగులకు విల్సన్ తెలిపారు. వీరిలో 500 మంది పైలట్లు, 2,400 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారని వివరించారు. 122 విమానాలు .. ప్రస్తుతం ఎయిరిండియాకు 122 విమానాలు ఉన్నాయి. వీటి సంఖ్యను మరింతగా పెంచుకుంటోంది. ఇందులో భాగంగా 470 విమానాల కోసం ఆర్డరు ఇచ్చింది. వీటిలో 250 విమానాలను యూరప్ దిగ్గజం ఎయిర్‌బస్ నుంచి, 220 ఎయిర్‌క్రాఫ్ట్‌లను అమెరికన్ దిగ్గజం బోయింగ్ దగ్గర్నుంచి కొనుగోలు చేస్తోంది. వీటిలో 40 ఎయిర్‌బస్ ఏ350లు, 20 బోయింగ్ 787లు, 10 బోయింగ్ 777–9 రకం పెద్ద విమానాలు, 210 ఎయిర్‌బస్ ఏ320/321 నియో ఎయిర్‌క్రాఫ్ట్, 190 బోయింగ్ 737 మ్యాక్స్ చిన్న విమానాలు ఉన్నాయి. వీటికి సంబంధించి తొలి చిన్న విమానం (నారో–బాడీ) జూలై లేదా ఆగస్టు నాటికి అందుకోవచ్చని విల్సన్ చెప్పా రు. అలాగే ఈ ఏడాది ఆఖరు నాటికి ఆరు ఏ350, ఎనిమిది బీ777 ఎయిర్‌క్రాఫ్ట్‌లు రాగలవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా తొమ్మిది బీ777 విమానాలను లీజుకు తీసుకుని నడుపుతోంది. సవాళ్లు.. కొన్నాళ్లుగా పెట్టుబడులు లేక సతమతమవుతున్న ఎయిరిండియా వంటి పెద్ద సంస్థను వేగంగా గాడిన పెట్టాల్సి రావడమనేది సవాలు వంటిదని విల్సన్ తెలిపారు. ఎయిర్‌లైన్‌ను గణనీయంగా మార్చాల్సిన పరిస్థితి ఉందన్నారు. మిగతా ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేయడం, శిక్షణా సామరŠాధ్యలను పెంపొందించుకోవడం, ప్రారంభం నుంచి గతంలో ఎన్నడూ లేనంత వృద్ధి సాధించేలా మద్దతు కల్పించడం వంటి వాటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు, ఎకానమీ, ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్, సిబ్బందిలాంటి భాగస్వాములందరికీ మేలు చేసేలా దేశీ విమానయాన వ్యవస్థ ఆరోగ్యకరంగా, స్థిరంగా వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని విల్సన్ చెప్పారు. -
ఎయిరిండియా పైలెట్ ఘనకార్యం..కాక్‌పిట్‌లో స్నేహితురాలితో ముచ్చట్లు!
పౌర విమానయాన సంస్థ (డీజీసీఏ) ఎయిరిండియా (ఏఐ)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానంలో భద్రతా లోపాలపై ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్, విమానం రక్షణ విభాగాధిపతికి ఏప్రిల్ 21న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఎయిరిండియాకు చెందిన ఓపైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి తన స్నేహితురాల్ని కాక్‌పిట్‌లో కూర్చోబెట్టుకున్నాడు. దీనిపై ఎయిరిండియా సకాలంలో స్పందిచకపోవడంపై డీజీసీఏ మండిపడింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఎయిరిండియా విమానంలో అసలేం జరిగింది ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా 915 విమానానికి చెందిన పైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు. ప్రయాణం ముగిసే వరకు అక్కడే కూర్చోపెట్టుకున్నాడు. అయితే ఈ ఘటనపై మార్చి 3న కేబిన్ సూపర్వైజర్ ఎయిరిండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పట్టించుకోకపోవడంతో డీజీసీఏని ఆశ్రయించారు. దీంతో డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించిన ఎయిరిండియా 915 విమానం పైలెట్ కమాండ్ కెప్టెన్ హర్ష్ సూరీ, కేబిన్ క్రూ, కాక్‌పిట్‌లో కూర్చున్న ఎకానమీ క్లాస్ ప్రయాణికురాలికి సమన్లు అందించింది. కాగా, సకాలంలో జోక్యం, చర్యలు తీసుకోకపోవడం విజిల్ బ్లోయర్ ఈ విషయాన్ని డీజీసీఏకి చెప్పాల్సి వచ్చినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. మహిళా సిబ్బందిపై వేధింపులు సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్, విమానం రక్షణ విభాగాధిపతి హెన్రీ డోనోహోకు పంపిన నోటీసులో ఫిర్యాదు దారుడు మాట్లాడుతూ.. కమాండర్‌ని బెదిరించడం, అవమానించడం, తిట్టడం, అసభ్యంగా ప్రవర్తించడంపై చింతిస్తున్నాను. షాక్‌కు గురయ్యాను. మహిళా ప్రయాణీకురాలిని కాక్‌పిట్‌లోకి అనుమతించడాన్ని పైలట్ ఉల్లంఘించడమే కాకుండా, తాను చెప్పినట్లు చేయలేదనే అకారణంగా మహిళా సిబ్బందిని వేదించినట్లు మైలెట్ చేసింది. కాగా, విజిల్ బ్లోయర్ ఫిర్యాదుతో డీజీసీఏ విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి👉 జీతాలు తక్కువే ఇస్తామంటున్నా.. ఉద్యోగులు ఎగబడుతున్నారు.. కారణం ఇదే! -
‘మమ్మల్ని ఆదుకోండి సార్’.. రతన్ టాటాకు చేరిన పైలెట్ల పంచాయితీ!
మానవ వనరుల విభాగం (hr) ఏకపక్షనిర్ణయాలతో తమకు అన్యాయం జరుగుతోందని, వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఎయిరిండియా పైలెట్లు, క్యాబిన్ క్రూ సిబ్బంది 1500 సంతకాలతో కూడిన పిటిషన్‌ను ఎయిరిండియా మాతృసంస్థ, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాకు పంపారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న పైలెట్లు, క్యాబిన్ క్రూ సిబ్బందికి చెల్లించే జీతాలు, కాంట్రాక్ట్‌లను ఎయిండియా సవరించింది. ఈ నిర్ణయాన్ని పైలెట్ల యూనియన్లు ఇండియన్ కమర్షియల్ పైలెట్ అసోషియేషన్ (icpa), ఇండియన్ పైలెట్స్ గిల్డ్ (ipg) లు వ్యతిరేకించాయి. తమని సంప్రదించకుండా హెచ్ఆర్ విభాగం కాంట్రాక్ట్ సవరణ, జీతభత్యాలపై నిర్ణయం తీసుకుందని ఆరోపించాయి.ఎట్టి పరిస్థితుల్లో ఈ కొత్త చెల్లింపుల్ని అంగీకరించబోమని స్పష్టం చేశాయి. రతన్ టాటాకు పంపిన పిటిషన్లో ఎయిరిండియా హెచ్ఆర్ విభాగం తీరుపై పైలెట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థలో తమకు విలువ లేదని, శ్రమకు తగ్గ గౌరవం లేదని వాపోయారు. ఆ కారణంతోనే విధులు నిర్వహించే సమయంలో శక్తి, సామర్ధ్యాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పిటిషన్లో వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విమానయాన సంస్థగా తీర్చిదిద్దుతున్న ఎయిరిండియా విజయంలో తాము భాగస్వాములమేనని, ప్రయాణికులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేలా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విమానయాన రంగం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్ని తాము అర్ధం చేసుకున్నామని చెప్పారు. సమస్యల్ని పరిష్కరించుకుంటూ సంస్థతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ‘కానీ మా సమస్యలను హెచ్ఆర్ విభాగం పట్టించుకోవడం లేదు. పరిష్కారం చూపించడం లేదని భావిస్తున్నాం. ఉత్పన్నమవుతున్న సమస్యల్ని పరిష్కరించాలని మిమ్మల్ని (రతన్ టాటాను) కోరుతున్నామని’ పైలెట్లు రతన్ టాటాకు ఇచ్చిన పిటిషన్లో తెలిపారని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
చాట్‌జీపీటీపై ఎయిరిండియా కీలక నిర్ణయం!
కృత్రిమ మేధ(ఏఐ) సంచలనం.. చాట్‌జీపీటీ సేవల విస్తృతి రోజు రోజుకి మరింత పెరుగుతోంది. తాజాగా ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా మాతృ సంస్థ టాటా సన్స్ చాట్‌జీపీటీ సేవల్ని వినియోగించుకునేందుకు సిద్ధమైంది. ప్రభుత్వరంగ విమానయాన సంస్థగా ఉన్న ఎయిరిండియా ప్రస్థానం టాటాల గ్రూపు నుంచే మొదలు కాగా.. 68 ఏళ్ల తర్వాత చివరకు టాటాల గూటికే చేరింది. అయితే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సమయంలో ఎయిరిండియా విమాన ఛార్జీల వివరాల్ని పేపర్ ద్వారా వెల్లడించేది. కానీ టాటాల ఆధ్వర్యంలో ప్రతి విమానం నుండి ఎక్కువ ఆదాయాన్ని గడించేందుకు ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ చాట్‌జీపీని వినియోగించేందుకు సిద్ధమైంది. గత వారం జరిగిన ఎయిరిండియా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో చాట్‌జీపీటీ వినియోగంపై ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ ప్రకటించారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న చాట్‌జీటీపీ త్వరలో పూర్తి స్థాయిలో వినియోగంలోకి రానుంది. చదవండి: గుడ్‌న్యూస్.. రైల్వే ప్రయాణికులకు పండగే.. ఇకపై క్షణాల్లోనే -
విమానంలో స్మోకింగ్.. పట్టుబడ్డాక యాక్టింగ్‌తో పిచ్చెక్కించిన ప్రయాణికుడు?
విమానంలో అభ్యంతరకరంగా ప్రవర్తించడం, ఇతర ప్రయాణికులపై మూత్రవిసర్జన చేయడం, అడ్డుకున్న సిబ్బందిపై దాడికి పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికాలో నివసించే రమాకాంత్ అనే ప్రయాణికుడు ఎయిరిండియా విమానంలో వీరంగం సృష్టించాడు. ఎయిరిండియాకు చెందిన ఓ విమానం లండన్ నుంచి ముంబైకి బయల్దేరింది. విమానం గాల్లో ఉండగా రమాకాంత్ బాత్రూంలో స్మోక్ చేశాడు. వద్దని వారించినా క్రూ సిబ్బంది, ఇతర ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల మేరకు..విమానంలో స్మోకింగ్ చేయడం చట్టరిత్యా నేరం. అయినా నిబంధనల్ని ఉల్లంఘించిన రమాకాంత్.. ఎయిరిండియా విమానం టాయిలెట్లో ధూమపానం చేశాడు. అలారం మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది సదరు ప్రయాణికుడి చేతిలో సిగరెట్ ఉండటాన్ని గమనించారు. విమానంలో స్మాకింగ్ చేయకూడదని వారించడంతో చేతిలో ఉన్న సిగరెట్‌ను పక్కకు విసిరేశాడు. విమానంలో జిమ్మిక్కులు అనంతరం క్రూ సిబ్బందిపై గట్టిగా కేకలు వేస్తూ నానా హంగామా చేశాడు. అతన్ని నచ్చజెప్పిన సిబ్బంది తన సీట్లో కూర్చోబెట్టారు. కొద్ది సేపటికి విమానం గాల్లో ఉండగా అత్యవసర ద్వారాన్ని (emergency door) తెరిచేందుకు యత్నించాడు. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో కేకలు వేయడంతో.. జిమ్మిక్కులతో వింతగా ప్రవర్తించాడు. మళ్లీ అరవడం మొదలు పెట్టాడు. తలను అటూ ఇటూ ఊపుతూ విమాన సిబ్బందిని, ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేశారు. ప్రయాణికుల్లో ఉన్న ఓ డాక్టర్ అతని ఆరోగ్యంపై ఆరా తీశాడు. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా’ అని పరీక్షించాడు. అతని వద్ద ఎలాంటి మెడిసిన్ లభ్యం కాలేదు. ఈ - సిగరెట్ మాత్రమే ఉన్నట్లు ఎయిరిండియా క్రూ సిబ్బంది సహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదుతో 37ఏళ్ల రమాకాంత్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 336 (ఇతరుల వ్యక్తిగత భద్రతకు హాని కలిగించేలా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం), ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1937,22 (పైలట్-ఇన్-కమాండ్ ఇచ్చిన చట్టబద్ధమైన సూచనలను నిరాకరిండం), 23 (దాడి, ఇతరుల భద్రతకు హాని,విధులకు భంగం కలిగించడం), 25 (ధూమపానం చేయడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనారోగ్య సమస్యలపై ఆరా నిందితుడు భారతీయ సంతతికి చెందినవాడని, అయితే అమెరికా పౌరుడని గుర్తించేలా అమెరికా పాస్ పోర్ట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడా? లేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అని నిర్ధారించేందుకు వైద్య పరీక్షల కోసం నిందితుడి బ్లడ్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. -
ఒకేసారి అన్ని విమానాలు కొంటుందా? ఇండిగో భారీ డీల్..
దేశీయ దిగ్గజ ఏవియేషన్ సంస్థలు భారీ ఎత్తున విమానాల కొనుగోళ్లకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఎయిరిండియా కోసం టాటా సన్స్ 500 విమానాల్ని కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. తాజాగా ఇండిగో సైతం బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల 500 అంతకంటే ఎక్కువ విమానాల కోసం ఆర్డర్ ఇవ్వనున్నట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ప్రస్తుతం విమానాల కొనుగోళ్ల నేపథ్యంలో విమానాల తయారీ సంస్థలతో ఇండిగో చర్చలు జరుపుతుందని, ఆ చర్చలు సఫలమైతే ఎయిరిండియా తర్వాత మరో అతిపెద్ద ఒప్పొందం అవుతుందని రాయిటర్స్ తెలిపింది. బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో గత నెలలో న్యారో బాడీ ప్లైట్ల కోసం ఎయిర్ బస్, ఫ్రెంచ్ ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయని, ఆ చర్చలు కొలిక్కి రావడంతో వందల విమానాల కొనుగోలుకు సిద్ధపడినట్లు రాయిటర్స్ రిపోర్ట్ హైలెట్ చేసింది. ఇక మరో పదేళ్లలో ఇండిగో సంస్థ మిడ్ సైజ్ వైడ్ బాడీ జెట్స్ విమానాల సంఖ్యను పెంచే ప్రణాళికల్లో ఉండగా అందుకు అనుగుణంగా విమానాల ఆర్డర్ ఉండనుంది ఇప్పటికే ఎయిరిండియా ఎయిరిండియా బ్రాండ్‌కు కొత్త గుర్తింపును తీసుకొచ్చేందుకు మాతృ సంస్థ టాటా సన్స్ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల్ని అందుకునేలా 100 బిలియన్ డాలర్లతో 500 విమానాల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఒప్పందంలో భాగంగా విమాన తయారీ సంస్థలు ఈ 500 ఎయిర్ క్రాప్ట్‌లను 8 ఏళ్లలో డెలివరీ చేయనున్నట్లు రాయిటర్స్ కథనం వెలువరించింది. -
AirIndia Deal: యూకే పీఎం రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచంలోని అగ్ర దేశాలకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ సంస్థలతో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా కుదుర్చుకున్న ఒప్పందాలపై ఆయా దేశాల అధినేతలు స్పందించారు. బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిస్, ఎయిరిండియా మధ్య జరిగిన డీల్ ఓ మైలురాయిలా నిలిచిపోతుందని యూకే ప్రధాని రిషి సుకాక్ అభివర్ణించారు. టాటా నేతృత్వంలోని ఎయిరిండియా అమెరికాకు చెందిన బోయింగ్, ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ బస్ సంస్థలతో అతిపెద్ద డీల్ కుదుర్చుకుంది. వాటి నుంచి మొత్తం 470 ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిస్ నుంచి కూడా ఎక్స్‌డబ్ల్యూబీ ఇంజిన్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు లింక్డ్ఇన్లో చేసిన పోస్టులో రిషి సునాక్.. ఎయిరిండియా, ఎయిర్‌బస్, రోల్స్‌రాయిస్‌ల మధ్య జరిగిన డీల్స్ యూకే ఏరోస్పేస్ రంగానికి హద్దులు లేకుండా చేశాయన్నారు. ఎయిర్‌బస్ విమానాల రెక్కలను యూకేలోనే తయారు చేస్తుందని, అలాగే ఏ350 ఎయిర్ క్రాఫ్ట్స్‌కు రోల్స్ రాయిస్ ఎక్స్‌డబ్ల్యూబీ ఇంజిన్లను సమకూర్చుతుందన్నారు. ఎయిరిండియా డీల్‌తో యూకే ఏరోస్పేస్ రంగంలో మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు. అలాగే 2050 కల్లా భారత్ ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు. (ఇదీ చదవండి: బోయింగ్‌కు హైదరాబాద్ నుంచి తొలి ‘ఫిన్’ డెలివరీ) మరోవైపు ఎయిరిండియా డీల్‌పై యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మైక్రాన్ కూడా స్పందన తెలియజేశారు. ఎయిరిండియాతో ఒప్పందం అమెరికాలో లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని, అదే సమయంలో ఎయిరిండియాకు ట్రాన్స్‌పోర్టేషన్ డిమాండ్లు తీరుతాయని వైట్‌హౌస్ తెలియజేసింది. ఎయిరిండియా-ఎయిర్‌బస్ ఒప్పందం ఇండియా-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయమని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మైక్రాన్ ట్విటర్ ద్వారా అభిప్రాయపడ్డారు. -
ఎయిరిండియా బిగ్ డీల్..500 విమానాల కొనుగోలుకు ఒప్పందం!
ప్రపంచ చరిత్రలోనే తొలిసారి అరుదైన కొనుగోలు ఒప్పందం జరిగింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఎయిర్ షోలో టాటా గ్రూప్ తన విమానయాన సంస్థ ఎయిరిండియా కోసం ఫ్రాన్స్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ నుంచి 250 విమానాల కొనుగోలుకు డీల్ కుదుర్చుకుంది. ఇదే విషయాన్ని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అధికారికంగా ప్రకటించారు. విమానాల కొనుగోలు ఒప్పందం సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో భారత్ నుంచి ఎయిరిండియా చైర్మన్ రతన్ టాటా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియాలు పాల్గొనగా.. ఫ్రాన్స్ నుంచి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ , ఎయిర్‌బస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గుయిలౌమ్ ఫౌరీలు పాల్గొన్నారు. ఈ డీల్‌లో 40 ఏ350 వైడ్ బాడీ లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, 210 న్యారో బాడీ ఎయిర్ క్రాఫ్ట్‌ల కొనుగోలుకు రతన్ టాటా ఆర్డర్ ఇచ్చారు. అనంతరం మోదీ మాట్లాడుతూ..ఫ్రాన్స్‌తో ఒప్పందం చారిత్రాత్మకమని అన్నారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా విమానా కొనుగోళ్లు.. ఏవియేషన్ రంగంలో భారత్ మూడో అతిపెద్ద దేశంగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 15 ఏళ్లలో భారత్‌కు 2,500 విమానాలు అవసరం అవుతాయని గుర్తు చేశారు. ఇక ఈ ఒప్పందం భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలలో ఒక మైలురాయిగా నిలుస్తుందని మాక్రాన్ కొనియాడారు. ‘టాటా - ఎయిర్ బస్ సంస్థల ఒప్పందం హిస్టారిక్ మూమెంట్. ఈ కొనుగోలు ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు దోహహదపడుతుందని’ ఎయిర్‌బస్ సీఈవో గుయిలౌమ్ ఫౌరీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, మరో ఏవియేషన్ సంస్థ బోయింగ్ నుంచి 250 విమానాల కొనుగోలుపై టాటా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. -
ఎయిరిండియా చరిత్రలో ఎన్నడూ లేని భారీ డీల్.. లక్షల కోట్లతో..
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా మకుటంలో మరో కలికితురాయి చేరుకోనుంది. ఎయిరిండియా బ్రాండ్‌కు కొత్త గుర్తింపును తీసుకొచ్చేందుకు మాతృ సంస్థ టాటా సన్స్ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల్ని అందుకునేలా 100 బిలియన్ డాలర్లతో 500 విమానాల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఒప్పందంలో భాగంగా విమాన తయారీ సంస్థలు ఈ 500 ఎయిర్ క్రాప్ట్‌లను 8 ఏళ్లలో డెలివరీ చేయనున్నట్లు రాయిటర్స్ కథనం వెలువరించింది. ఇప్పటికే గత డిసెంబర్ నెలలో ఎయిరిండియా భారీ ఎత్తున విమానాల్ని కొనుగోలు చేస్తున్నట్లు అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ కథనాలకు కొనసాగింపుగా వచ్చే వారంలో విమానాల కొనుగోలుపై ఎయిరిండియా ప్రకటన చేయనున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. పలు నివేదికల ప్రకారం.. 500 ఎయిర్ క్రాఫ్ట్‌లలో ఫ్రాన్స్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి 210 సింగిల్ ఐస్లె (asile) ఏ320నియోస్, 40 వైడ్ బాడీ ఏ 350ఎస్‌లను, అమెరికా ఎయిర్క్ట్రాఫ్ట్ తయారీ సంస్థ బోయింగ్ నుంచి 220 ఫ్లైట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. వాటిలో 190 737 మ్యాక్స్ న్యారో బాడీ జెట్స్ 20 787 వైడ్ బాడీ, 10 777ఎక్స్‌లను కొనుగులుకు ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్‌బస్- ఎయిరిండియా విమానాల కొనుగోళ్లపై నిన్ననే ( ఫిబ్రవరి 10న) ఒప్పందంపై సంతకం చేయగా..బోయింగ్ జనవరి 27న ఎయిర్‌లైన్‌తో తన ఒప్పందాన్ని అంగీకరించింది. జనవరి 27న ఉద్యోగులకు రాసిన నోట్లో ఎయిర్‌లైన్ కొత్త విమానాల కొనుగోళ్ల కోసం చారిత్రాత్మకమైన ఆర్డర్ ఖరారు చేస్తున్నట్లు తెలిపింది. -
అదే తరహాలో రెండో ఘటన: ఎయిర్ ఇండియాకి మరోసారి షాక్
ఎయిర్ ఇండియా ఇటీవలే న్యూఢిల్లీ నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలోని మూత్ర విసర్జన ఘటనలో భారీ జరిమానాను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మళ్లీ మరోసారి భారీ మొత్తంలో పెనాల్టీని ఎదుర్కొని వార్తల్లో నిలిచింది. ఈ మేరకు డీజీసీఏ మరోసారి ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమాన విధించి షాక్ ఇచ్చింది. ఆ మూత్ర విసర్జన ఘటన తదనంతరం ఇదే తరహాలో మరో ఘటన జరిగింది ఈ మేరకు గత నెల డిసెంగర్ 6న ప్యారిస్ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఇలాంటి మాత్ర విసర్జన ఘటనే చోటు చేసుకుంది. కాకపోతే అక్కడ ప్రయాణికుడు మహిళ కూర్చోవాల్సిన ఖాళీ సీటులో మూత్ర విసర్జన చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి డీజీసీఏ ఆరా తీసేంతవరకు నివేదించలేదని అంతర్గత కమిటీ పేర్కొంది. దీంతో డీజీసీఏ ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా విధించింది. తాను ఈ ఘటన గురించి వివరణ అడిగేంత వరకు చెప్పకుండా జాప్యం చేసినందుకు గానూ పెనాల్టీ విధించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. అంతేగాదు ఎయిర్ ఇండియా ప్రయాణకుల వికృత చర్యలకు సంబంధించిన నిబంధనలను తాము పాటించలేకపోయామని డీజీసీఏకు తెలపడం గమనార్హం. (చదవండి: విమానంలో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ షాక్.. భారీ పెనాల్టీ) -
Air India Urination Case: వెలుగులోకి కీలక ఈమెయిల్స్
ఎయిర్ ఇండియా మూత్ర విసర్జన ఘటన కేసులో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. ఎయిర్‌లైన్ ఆ ఘటన జరిగిన రోజే అధికారులకు ఈమెయిల్స్ పంపినట్లు తేలింది. వాస్తవానికి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, త్వరితగతిన స్పందించకపోవడం, నిందితుడిపై సత్వరమే చర్యలు తీసుకోకపోవడం తదితర విషయాల్లో జాప్యం గురించి సర్వత్ర పలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ విషయమై డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రశ్నించగా ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే తమకు సమాచారం ఇవ్వలేదని ఎయిర్ ఇండియాలోని టాప్ మేనేజ్మెంట్ గతంలో సమర్థించుకుంది. ఐతే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తోసహా ఎయిర్‌లైన్స్ ఉన్నతాధికారులకు ఈమెయిల్స్ వెళ్లాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా క్యాబిన్ సూపర్వైజర్ నవంబర్ 27న మధ్యాహ్నం 1 గంట సమయంలో బేస్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్(ఐఎఫ్‌సీడీ), హెచ్ఆర్ హెడ్‌కి ఈమెయిల్ పంపినట్లు నివేదికలో వెల్లడైంది. అలాగే కస్టమర్ కేర్ ఫిర్యాదులు గురించి ఉన్నతాధికారులు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ మెయిల్‌కి ప్రత్యుత్తరాలు కూడా అదే రోజు 3.47 గంటలకు జరిగినట్లు నివేదిక తెలిపింది. ఆరోజు టెలిఫోన్ చర్చల అనంతరం ఈమెయిల్స్ పంపించినట్లు కూడా పేర్కొంది. అంతేగాదు అదే రోజు రాత్రి 7.46 గంటలకు ఈమెయిల్ కస్టమర్స్ విభాగం ఇన్‌ఫ్లైట్ సర్వీస్ హెడ్లకు ఈమెయిల్స్ పంపించినట్లు తేలింది. పైగా అదేరోజు సాయంత్రం బాధితురాలి అల్లుడు నుంచి ఈ మెయిల్ అందుకున్న విల్సన్ కస్టమర్ కేర్ ఆ మెయిల్స్ ఫార్వర్డ్ చేసి తనకు వచ్చిన మెయిల్స్‌పై దృష్టిపెట్టినట్లు కమ్యూనికేషన్లు చూపిస్తున్నాయి. అయితే ఎయిర్ ఇండియా మేనేజింగ్ డ్రైరెక్టర్(సీఎండీ) క్యాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ..ఎయిర్‌లైన్ తన సిబ్బందిలోని లోపాలను విచారించడానికి, ఎందుకు ఆల్యసంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చిందో విచారించడానికి అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈ ఘటన గురించి విమానంలో ల్యాండింగ్ అయిన వెంటనే ఉన్నతాధికారులకు నివేదించినట్లు తేలింది. ఐతే పైలట్ నిందితుడు శంకర్ మిశ్రా స్ప్రుహ లేనప్పుడూ చేసిన ఘటనగానే భావించాడు. బాధితురాలి పట్ల జరిగిన వికృత ఘటనగా సీరియస్ భావించకపోవటం, పైగా ఇరువురు మధ్య రాజీ కుదిర్చి సర్థి చెప్పేందుకు యత్నించాడమే గాక గొడవ రాజీ అయినట్లుగా ఉన్నతాధికారులకు తెలియజేశాడు. దీంతో ఆరోజు ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే శంకర్ విశ్రాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా మిశ్రా కూడా కామ్‌గా ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి నిష్క్రమించినట్లు తేలింది. ఎప్పుడైతే బాధితురాటు ఎయిర్ ఇండియా చైర్మన్‌కి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు వెల్లడైంది. ఆ తర్వాత ఎయిర్‌లైన్స్ అధికారులకు ఇరువురు మధ్య ఆర్థిక రాజీ కుదరిందని అందుకే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే డీజీసీఏకి ఫిర్యాదు చేయడం జాప్యం అయ్యిందని తదుపరి విచారణలో తేలింది. దీంతో డీజీసీఏ విమానయాన సంస్థ మరియు దాని చీఫ్‌లకు మాత్రమే కాకుండా మొత్తం విమాన సిబ్బందికి కూడా షోకాజ్ నోటీసులు పంపింది. ఇదిలా ఉండగా ఇప్పటికే డీజీసీఏ ఈ ఘటనపై ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా, పైలెట్ ఇన్ కమాండ్ లైసెన్స్ మూడు నెలలపాటు సస్పెన్షన్ తోపాటు ఎయిర్ ఇండియా డైరెక్టరేట్ ఇన్‌ఫ్లైట్ సర్వీస్‌కు కూడా సుమారు రూ. 3 లక్షల జరిమాన విధించి భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: విమానంలో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ షాక్.. భారీ పెనాల్టీ) -
‘ఎయిరిండియా’ ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనలో సిబ్బంది సరిగా స్పందించలేదని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఆ ఘటన వ్యక్తిగతంగా నాకు, ఎయిరిండియా సిబ్బందికి మనస్తాపం కలిగించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించాల్సిన, స్పందించాల్సిన తీరును సమీక్షించి, సరిచేస్తాం’’ అన్నారు. నిందితుడి అరెస్ట్.. ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనలో నిందితుడు శంకర్ మిశ్రాకు ఢిల్లీ న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో నవంబర్ 26వ తేదీన ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే పోలీసు విచారణకు సహకరించడం లేదని తెలుస్తోందని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అనామిక పేర్కొన్నారు. ఇదీ చదవండి: Shocking: విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టాటా చైర్మన్‌కు లేఖ -
ఆ ఘటన పట్ల చింతిస్తున్నా! క్షమించండి: ఎయిర్ ఇండియా సీఈఓ
తీవ్ర కలకలం రేపిన తోటీ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటనపై ఎయిర్ ఇండియా సీఈఓ స్పందించారు. సీఈవో క్యాప్‌బెల్ విల్సన్ శనివారం ఆ ఘటన పట్ల క్షమాపణలు చెప్పారు. ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి నలుగురు క్యాబిన్ సిబ్బంది, పైలెట్‌ని తొలగించినట్లు తెలిపారు. అలాగే విమానంలో మద్యం అందించే విషయంలో ఎయిర్‌లైన్ విధానాన్ని కూడా సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటన వేదన కలిగించిందన్నారు. ఎయిర్ ఇండియా గాల్లో ఉన్నప్పుడూ భూమ్మీ మీద సమర్థవంతంగా తన బాధ్యతలను నిర్వహిస్తుందని, ఇలాంటి విషయాల్లో కఠిన చర్యలు తీసుకోవడానికే కట్టుబడి ఉందని అన్నారు. ఆయన ఈ విషయంలో సెటిల్మెంట్తో సంబంధం లేకుండా అన్ని సంఘటనలను కూలంకషంగా వివరించాలని సదరు విమాన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బాధ్యతయుతమైన ఎయిర్‌లైన్ బ్రాండ్‌గా ఎయిర్ ఇండియా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా మెరుగుపరిచే కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. అంతేగాక విమానంలో ఆల్కహాల్ సర్వీస్ పాలసీని కూడా సమీక్షిస్తున్నట్లు పరోక్షంగా వివరించారు. ఇలాంటి సంఘటనలు మాన్యువల్‌గా ఉన్న పేపర్ ఆధారిత రిపోర్టింగ్‌ని మరింత మెరుగుపరిచేలా సంఘటనను కళ్లకు కట్టినట్లు చూపించే సాఫ్ట్వేర్ కోరుసన్ లైసన్స్ పొందడం కోసం మార్కెట్ లీడింగ్ ప్రోవైడర్‌లో సంతకం చేసినట్లు తెలిపారు. ఈ అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌తోపాటు పైలట్లు, సీనియర్ సిబ్బంది క్యాబిన్లకు ఐప్యాడ్లను కూడా అమర్చనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇలాంటి ఘటనలను ఎలక్ట్రానిక్ పరికరాలతో రికార్డు చేయడమే గాక సంబంధింత అధికారులకు వేగవంతంగా సమాచారాన్ని నివేదించగలుగుతారని చెప్పారు. అందువల్ల ఎయిర్ ఇండియా కూడా బాధిత ప్రయాణికులకు తక్షణమే సాయం అందించడమే కాకుండా వారిని రక్షించగలుగుతుందన్నారు. ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నప్పుడు ఎయిర్ ఇండియా, దాని సిబ్బంది నియంత్రణాధికారులకు, చట్టాన్ని అమలు చేసే అధికారులకు సహకరించడమే గాక బాధిత ప్రయాణికులకు పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. అలాగే ఎయిర్ ఇండియా, కస్టమర్లకు, విమాన సిబ్బందికి సురక్షిత వాతావరణాన్ని అందించేందుకు కట్టుబడి ఉందని ఎయిర్ ఇండియా సీఈవోవిల్సన్ చెప్పుకొచ్చారు. -
విస్తారాపై టాటా గ్రూపు కన్ను, విలీన చర్చలు
న్యూఢిల్లీ: విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేయడంపై టాటా గ్రూపుతో రహస్య చర్చలు నిర్వహిస్తున్నట్టు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. విస్తారాలో టాటాలకు 51 శాతం వాటా ఉంటే, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటా ఉంది. టాటాలతో చర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా కచ్చితమైన నిబంధనలపై అంగీకారానికి రాలేదని సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్కుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ సమాచారం ఇచ్చింది. టాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య ప్రస్తుత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ చర్చలు నడుస్తున్నట్టు తెలిపింది. ఎయిర్ ఇండియాను టాటాలు కొనుగోలు చేసిన తర్వాత.. అప్పటికే తమ నిర్వహణలోని విస్తారా, ఎయిరేషియా ఇండియా కార్యకలాపాలను ఒకే గొడుగు కింద కు తీసుకురావాలన్న ప్రణాళికలతో ఉన్న విషయం తెలిసిందే. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్ర శేఖరన్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఎయిర్ ఇండియా-విస్తారా విలీనంపై చర్చలు నడుస్తున్నట్టు అధికారికంగా ప్రకటన రావడం ఇదే మొదటిసారి. ఎయిరేషియా ఇండియాలో టాటాలకు 83.67 శాతం వాటా ఉంది. -
ఇంటర్వ్యూలకు ఉద్యోగులు..ఫ్లైట్లు నడపలేక చేతులెత్తేసిన విమానయాన సంస్థలు!
దేశ వ్యాప్తంగా విమానాల రాక పోకల్లో అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి ఎదురు చూస్తున్నా టికెట్లు బుక్ చేసుకున్న సమయానికి విమానాలు రాకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆయా విమానయాన సంస్థల్ని వివరణ కోరింది. అయితే పైలెట్లు, కేబిన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో సిక్ లీవ్‌లు పెట్టి..ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నట్లు తేలింది. దేశంలోని ప్రధాన నగరాల్లో టాటాకు చెందిన ఎయిరిండియా, ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా నేతృత్వంలోని ఆకాశ ఎయిర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇందుకోసం ఇతర ఏవియేషన్ సంస్థలకు చెందిన పైలెట్లు, కేబిన్ సిబ్బంది సిక్ లీవ్‌లు పెడుతున్నారు. ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు. దీంతో విమాన రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఎయిర్ ఇండియా..ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్ కతా వంటి నగరాల్లో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుంది. దీంతో షెడ్యూల్ టైంకు విమానాల రాకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆయా ఏవియేషన్ సంస్థలపై కామెంట్ల రూపంలో మండిపడ్డారు. ఇడిగో ఆలస్యం ఇండిగో విమానాల రాకపోకల్లో ఆలస్యం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. షెడ్యూల్ టైంకు కేవలం 45శాతమే విమానాల్ని నడిపించాయి. 850 కంటే ఎక్కువ విమానాలు వారి షెడ్యూల్ సమయం తర్వాత 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకున్నాయి. విమానయాన సంస్థ శుక్రవారం దాదాపు 1600 విమానాలను నడపగా..దాదాపు 50 విమానాల్ని రద్దు చేసింది. మా ఉద్యోగుల్ని సెలక్ట్ చేసుకోవద్దు.. కానీ ఇండిగో యాజమాన్యం తమ సమస్యను ఎయిర్ ఇండియా దృష్టికి తీసుకెళ్లింది. తమ నుండి 'నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్' లేదా రిలీవింగ్ లెటర్ లేకుండా సిబ్బందిని రిక్రూట్ చేయవద్దని ఎయిర్‌లైన్‌ని కోరినట్లు సమాచారం. కాగా, ఇదే అంశంపై ఎయిరిండియా అధికార ప్రతినిధి స్పందించలేదు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ అరుణ్ కుమార్‌ను సంప్రదిస్తే ఉద్యోగుల కొరతపై 'మేం పరిశీలిస్తున్నాం' అని చెప్పారు. -
టాటా కీలక నిర్ణయం, ఇబ్బందుల్లో ఎయిరిండియా ఉద్యోగులు!
కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఎయిరిండియాను టాటా సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కొనుగోలు ఒప్పంద సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎయిరిండియా ఉద్యోగులకు శాపంగా మారింది. ఎయిరిండియాను కొనుగోలుతో ఆ సంస్థ రూపు రేఖల్ని మార్చేందుకు మాతృ సంస్థ టాటా గ్రూప్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 55 సంవత్సరాల వయస్సున్న(గతంలో 40 ఏళ్లు) క్యాబిన్ క్రూ సిబ్బంది, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకునేలా ప్రోత్సహకాల్ని అందింస్తుంది. అదే సమయంలో ఖర్చు తగ్గించి ఉన్నత స్థాయిలో విమానాల సర్వీసుల్ని ప్రయాణికులకు అందించాలని టాటా గ్రూప్ భావిస్తోంది. ఇందులో భాగంగా ముంబై ఎయిరిండియా కార్యకలాపాల్ని ఢిల్లీకి తరలించేలా భావిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్ ఫర్ విషయంపై ముంబైలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సమాచారం అందించింది. ఇప్పుడీ ఈ నిర్ణయంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఎయిరిండియాకు చెందిన వైడ్ బారీ ఎయిర్ క్రాఫ్ట్‌లు(పెద్ద విమానాలు) సర్వీసులన్నీ ముంబై నుంచే జరుగుతుంటాయి. ఒక దశాబ్దం క్రితం, ముంబై విమానాశ్రయంలో జెట్ ఎయిర్వేస్ ప్రముఖ పాత్ర పోషించడంతో వ్యాపార అభివృద్ది కోసం ఎయిర్ ఇండియా తన స్థావరాన్ని ఢిల్లీకి మార్చింది. ప్రస్తుతం, ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాలలో ఎక్కువ భాగం ఢిల్లీ నుండి సర్వీసుల్ని అందిస్తున్నాయి. కానీ ఎయిరిండియాకు చెందిన భారీ ఎయిర్ క్ట్రాఫ్ట్ సిబ్బంది ముంబైలో విధులు నిర్వహించడం, వారిని ఢిల్లీకి ట్రాన్స్ ఫర్ చేస్తూ టాటా గ్రూప్ నిర్ణయంతో ఉద్యోగులకు సమస్యగా మారింది. -
టాటా సంచలన నిర్ణయం! ఎయిరిండియా ఉద్యోగులు ఇక ఇంటికే!
దేశీయ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. పర్మినెంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్ (స్వచ్ఛంద విరమణ) ఆఫర్ ఇచ్చింది. వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులకు ప్రత్యేకంగా ప్రోత్సహకాల్ని అందిస్తున్నట్లు తెలిపింది. వారి స్థానంలో కొత్తగా ఉద్యోగుల్ని నియమించుకోనుంది. సుమారు 70 ఏళ్ల తర్వాత ఎయిరిండియాను టాటా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏవియేషన్ సెక్టార్లో ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఎయిరిండియాను తీర్చిదిద్దనుంది. ఈనేపథ్యంలో టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిరిండియాలో 55 సంవత్సరాల వయస్సున్న(గతంలో 40 ఏళ్లు) క్యాబిన్ క్రూ సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులకు వీఆర్ఎస్ తీసుకోవచ్చని తీసుకోవచ్చని ప్రకటించారు. ఎవరైతే జూన్1 నుంచి జులై 31వరకు స్వచ్ఛంద రాజీనామా చేస్తారో ఆ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఒకేసారి టాటా గ్రూప్ ఎక్స్ గ్రేషియా, బోనస్‌లు ఇవ్వనున్నట్లు ఎయిరిండియా చీఫ్ హెచ్ ఆర్ విభాగం అధికారి సురేష్ దత్ త్రిపాటీ చెప్పారు. గతేడాది ప్రకటన గతేడాది బిడ్ జరిగిన అక్టోబర్ నెలలో ఉద్యోగుల వీఆర్ఎస్, తొలగింపుపై ఎయిరిండియా ముందస్తుగానే తెలిపింది. నాటి లెక్కల ప్రకారం.. ఎయిరిండియాలో మొత్తం 12,085 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 8,084మంది పర్మినెంట్ ఉద్యోగులు, 4,001 కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్‌లో 1,534 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు ఎయిరిండియా సీఎండీ రాజీవ్ బన్సాల్ ఓ నివేదికను విడుదల చేశారు. కేంద్రం నిర్వహణలో ఉన్న ఎయిరిండియాను తాము దక్కించుకుంటే సంవత్సరం పాటు ఉద్యోగులు విధుల్లో కొనసాగుతారని అన్నారు. రెండో ఏడాదిలో ఉద్యోగులు తొలగించడం, వీఆర్ఎస్కు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఆ ఉద్యోగులకు నష్టమే పలు నివేదికల ప్రకారం..ఎయిరిండియాలో వచ్చే 5 ఏళ్లలో సంవత్సరానికి వెయ్యి మంది చొప్పున మొత్తం 5వేల మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు. ఇక వీఆర్ఎస్ తీసుకోవాల్సిన వారిలో పర్మినెంట్ ఉద్యోగులతో పాటు, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్‌లో పైలెట్లను మినహాయించి మిగిలిన విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు వర్తించనుంది. ఈ వీఆర్ఎస్ నిర్ణయమే ఉద్యోగులకు నష్టమేనన్న భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎయిర్ఏషియా ఇండియాపై ఎయిరిండియా కన్ను
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియాను కొనుగోలు చేయాలని ఎయిరిండియా యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన డీల్‌కు అనుమతులు ఇవ్వాలంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)కు దరఖాస్తు చేసుకుంది. ఎయిర్ఏషియా ఇండియాలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 83.67 శాతం, మలేషియాకు చెందిన ఎయిర్ఏషియా గ్రూప్‌లో భాగమైన ఎయిర్ఏషియా ఇన్వెస్ట్‌మెంట్‌కు మిగతా వాటాలు ఉన్నాయి. ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను టాటా సన్స్‌లో భాగమైన టాలేస్ ఇటీవలే కొనుగోలు చేసింది. వీటితో పాటు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్ విస్తారాను కూడా టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. విమానయాన సేవలను కన్సాలిడేట్ చేసుకునే క్రమంలో ఎయిర్ఏషియా ఇండియాను పూర్తిగా కొనుగోలు చేయాలని టాటా గ్రూప్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో గుత్తాధిపత్య సమస్య తలెత్తకుండా నిర్దిష్ట డీల్స్‌కు సీసీఐ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత కొనుగోలుతో దేశీయంగా పోటీపై, మార్కెట్ వాటాపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని సీసీఐకి చేసుకున్న దరఖాస్తులో ఎయిరిండియా పేర్కొన్నట్లు సమాచారం. -
'టాటా న్యూ' యాప్ లాంచ్, రతన్ టాటా మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!
ప్రముఖ టాటా గ్రూప్ దిగ్గజం ఐటీ, ఆటోమొబైల్, ఎవియేషన్ ఇలా అన్నీ రంగాల్లో సత్తా చాటుతోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రత్యర్ధులకు చెక్ పెడుతోంది. తాజాగా అమెజాన్, టెలికాం దిగ్గజం జియోలకు పోటీగా గురువారం 'టాటా న్యూ'పేరుతో యాప్‌ను విడుదల చేసింది. అయితే ఈ యాప్ విడుదలలో టాటా గ్రూప్ అధినేత 'రతన్ టాటా' మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల 69ఏళ్ల సుధీర్ఘ విరామం తర్వాత నష్టాల ఊబిలో ఉన్న ఎయిరిండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్ 8న టాటా గ్రూప్ అనుబంధ సంస్థ ట్యాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ బిడ్డింగ్ వేసి రూ.18వేలకోట్లకు బిడ్డింగ్ ఎయిరిండియాను దక్కించుకుంది. ఇప్పుడీ సంస్థ మళ్లీ లాభాల పట్టేలా రతన్ టాటా మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అదే 'టాటా న్యూ' యాప్. టాటా సన్స్ ఛైర్మన్ ఆసక్తిర వ్యాఖ్యలు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఎయిరిండియాను ఆర్ధికంగా, టెక్నాలజీ పరంగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని అన్నారు. అదే సమయంలో టాటా న్యూ యాప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ప్రతీ ఒక్క ప్రాంతానికి ఎయిరిండియా సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఎయిరిండియా సేవల్ని డిజిటల్ మార్గాల ద్వారా వినియోగదారులకు అందించేందుకు టాటా న్యూ'ను విడుదల చేస్తున్నట్లు, ఈ యాప్‌తో పాటు సోషల్ మీడియా, వెబ్సైట్లను రూపొందిస్తున్నట్లు చెప్పారు. చెప్పినట్లుగానే టాటా గ్రూప్ ఈ యాప్‌ను ఇవాళ ప్రజలకు పరిచయం చేసింది. ఈ యాప్ ద్వారా త్వరలో ఎయిరిండియా సేవలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ యాప్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ యాప్ టాటా గ్రూప్ ఉద్యోగుల కోసం మాత్రమే అందుబాటులో ఉండగా నేటి నుంచి అందరికీ అందుబాటులో తెచ్చింది. విమానయాన సంస్థలు, హోటళ్లు, మెడిసిన్, కిరాణా సామాగ్రిని ఇలా అన్నీ సర్వీసులు ఒకే వేదికపై వినియోగించుకోవచ్చు. ►అప్లికేషన్ వినియోగదారులకు అనేక రకాల టాటా సేవలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. తాజ్‌తో హోటల్లను బుకింగ్, విమానాల కోసం ఎయిర్ ఏసియా, ఎలక్ట్రానిక్స్ కొనుగోలు కోసం క్రోమా, బ్యూటీ, లగ్జరీ ఉత్పత్తుల కోసం, శాటిలైట్ టీవీని వీక్షించేందుకు టాటా స్కైను ఈ యాప్‌లో పేమెంట్స్ చేయోచ్చు. ►నీయూ యాప్‌లో బిగ్ బాస్కెట్, 1ఎంజీ (మెడిసిన్ ) వంటి సేవలు ఉన్నాయి. ►యాప్ వినియోగదారులను వారి బిల్లులను చెల్లించడానికి అనుమతిస్తుంది. వ్యక్తిగత రుణాలు, ఇన్స్యూరెన్స్ పాలసీలను కూడా అందిస్తుంది. ►అమెజాన్,స్విగ్గీ,నైకా వంటి యాప్‌లతో పోలిస్తే డిజైన్ అద్భుతంగా ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ►యాప్ వినియోగదారులు ఎంపిక చేసిన బ్రాండ్ల నుండి రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. చదవండి: మొత్తం మీరే చేశారు! టాటా చేతికి ఎయిర్ ఇండియా, లోక్ సభలో ఆసక్తికర చర్చ! -
మొత్తం మీరే చేశారు! టాటా చేతికి ఎయిర్ ఇండియా, లోక్ సభలో ఆసక్తికర చర్చ!
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్‌నకు విక్రయించడంపై ప్రతిపక్షాల విమర్శలను పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తిప్పికొట్టారు. లాభాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోవడానికి యూపీఏ పాలనా విధానాలే కారణమని అన్నారు. ప్రజా ధనం సంరక్షణే లక్ష్యంగా కేంద్రం ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. లోక్‌సభలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్‌పై ఎనిమిది గంటల పాటు జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇస్తూ... ఎయిర్ ఇండియా–ఇండియన్ ఎయిర్‌లైన్స్ విలీనం, 111 కొత్త విమానాల కొనుగోలు, ద్వైపాక్షిక హక్కుల సరళీకరణ, ఎయిర్ నష్టాలకు కారణాల వంటి అశాలను ప్రస్తావించారు. తప్పని పరిస్థితిలోనే... మంత్రి ప్రకటన ప్రకారం, 2005కి ముందు ఎయిర్ ఇండియా ఏడాదికి రూ.15 కోట్లు, ఇండియన్ ఎయిర్‌లైన్స్ రూ.50 కోట్ల లాభా లను ఆర్జించేవి. ఈ విమానయాన సంస్థలు దాదాపు రూ. 55,000 కోట్లతో 111 విమానాలను కొనుగోలు చేయడం సంస్థలను తీవ్ర నష్టాల్లోకి నెట్టాయి. 14 సంవత్సరాల్లో రూ.85,000 కోట్ల నష్టాలు, రూ.54,000 కోట్ల ప్రభుత్వ ఈక్విటీ ఇన్ఫ్యూషన్, రూ.50,000 గ్రాంట్లు, రూ.66,000 కోట్ల నికర అప్పులు వెరసి ఎయిరిండియాను దాదాపు రూ.2.5 లక్షల కోట్ల సంక్షోభంలోకి నెట్టాయి. ఈ పరిస్థితుల్లోనే ప్రధానమంత్రి ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్కు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఉద్యోగుల తొలగింపు ఉండదు మొదటి సంవత్సరంలో ఉద్యోగుల తొలగింపులు ఉండవని టాటాలతో షేర్‌హోల్డర్ ఒప్పందం స్పష్టంగా పేర్కొన్నదని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. మొదటి సంవత్సరం తర్వాత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని అందజేయడం జరుగుతుందని, అలాగే పదవీ విరమణ పొందిన పొందిన ఉద్యోగులకు జీజీహెచ్ఎస్ కింద వైద్య ప్రయోజనాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. -
టాటా చేతికి ఎయిరిండియా..! భారీ డీల్‌కు సిద్ధమైన యూరప్ కంపెనీ..!
సుమారు డెబ్భై ఏళ్ల తర్వాత ఎయిరిండియాను టాటా సొంతం చేసుకుంది . ప్రస్తుతం ఏవియేషన్ సెక్టార్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆధునీకరణ పనులకు సిద్దమైంది టాటా గ్రూప్స్. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్స్‌తో యూరప్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ సంస్థ ఎయిర్‌బస్ భారీ డీల్‌ను కుదుర్చుకునేందుకు ఊవిళ్లురుతుంది. టాటాతో పాటుగా..! ఎయిర్‌బస్ తయారుచేస్తోన్న A350XWB విమానాల సేకరణకు సంబంధించిన డీల్ కోసం టాటా గ్రూప్స్‌తో పాటుగా పలు భారతీయ విమానయాన సంస్థలతో చర్చలను కంపెనీ జరుపుతోందని ఎయిర్‌బస్ ఇండియా & సౌత్ ఏషియా అధ్యక్షుడు రెమి మైలార్డ్ సోమవారం పేర్కొన్నారు. టాటా గ్రూప్స్‌తో దీర్ఘకాలిక, విశ్వసనీయమైన సంబంధాలను ఇరు కంపెనీల మధ్య నెలకొల్పేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఈ డీల్‌తో భారత విమాన రంగంలో కొత్త రికార్డులు నమోదుచేసే అవకాశం ఉందని రెమి మైలార్డ్ అభిప్రాయపడ్డారు. భారత డొమెస్టిక్ విమాన ప్రయాణాల్లో ఎయిర్ ట్రాఫిక్ వార్షిక సగటు వృద్ధి 6.2 శాతంగా, ప్రపంచ ఎయిర్ ట్రాఫిక్ సగటు వృద్ధి 3.9 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. ఇక టాటా గ్రూప్స్ ఇటీవలే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా స్పెసిఫిక్, విస్తారా , ఎయిర్ ఏషియా ఇండియా అనే నాలుగు ఇండియన్ క్యారియర్లను నడుపుతోంది. A350XWB భారీ సైజులో..! ఏవియేషన్ ఇండస్ట్రీలో ఎయిర్‌బస్ రూపొందించిన A350XWB ఎయిర్‌క్రాఫ్ట్ అత్యంత ఆదరణను పొందాయి. ఇవి అధిక ఫ్యుయల్ ట్యాంక్‌లను కల్గి ఉన్నాయి. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ A320NEO ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పోల్చితే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఈ విమానాలు ఏకధాటిగా 18 గంటలపాటు ప్రయాణిస్తాయి. చదవండి: అంబానీ మనవడా మజాకా.. 15 నెలలకే బడి బాట పట్టిన పృథ్వీ అంబానీ! -
బోయింగ్, ఎయిర్‌బస్‌లతో టాటా కీలక చర్చలు.. కారణం ఇదే
సుమారు డెబ్భై ఏళ్ల తర్వాత ఎయిరిండియాను సొంతం చేసుకుంది టాటా. ప్రస్తుతం ఏవియేషన్ సెక్టార్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆధునీకరణ పనులు చేపడుతోంది.ఈ మేరకు ఈ రంగంలో దిగ్గజ కంపెనీలైన ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలతో టాటా గ్రూపు చర్చలు జరుపుతోంది. ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను టాటా ఇటీవల దక్కించుకుంది. ఈ క్రమంలో చిన్నా పెద్దా అంతా కలిసి 150 విమానాలు ఎయిరిండియాకు ఉన్నాయి. అయితే ఇందులో చాలా వరకు విమానాలు పాతవై పోయాయి. వీటి మెయింటనెన్స్ అండ్ మోడిఫికేషన్‌కి రూ. 7,500 వరకు ఖర్చు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ పనిని పరిమితంగా చేపట్టి.. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా కొత్త విమానాల కొనుగోలకు టాటా ఆసక్తి చూపుతుందంటూ బ్లూబెర్గ్ కథనం ప్రచురించింది. ప్రపంచ వ్యాప్తంగా విమానాల తయారీలో బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలు ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా బోయింగ్ సంస్థ భారీ విమానాలకు పర్యాయపదంగా ఉంది. దీంతో కొత్త విమానల తయారీ, తమ అవసరాలు తదితర అంశాలపై టాటా ప్రతినిధులు ఈ రెండు కంపెనీలతో చర్చలు చేపడుతున్నారు. ఇవి సఫలమైతే టాటా నుంచి అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది. -
ఎయిర్ ఇండియాలో టాటా ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇదే
దాదాపు ఏడు దశాబ్ధాల తర్వాత ఎయిరిండియా విమానయాన సంస్థ తిరిగి టాటాల సొంతమైంది. జంషెడ్జీ టాటా స్థాపించిన ఎయిర్ ఇండియాను భారత ప్రభుత్వం జాతీయం చేసింది. కొంత కాలం బాగానే నడిచినా చివరకు రాజకీయ జోక్యం పెరిగిపోవడం, నిర్వాహన లోపాల కారణంగా నష్టాల పాలైంది. అప్పుల కుప్పగా మారిన ఎయిరిండియాను కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాని సమయంలో మరోసారి ధైర్యం చేశారు రతన్‌టాటా. తన తండ్రి కలల ప్రాజెక్టయిన ఎయిర్ ఇండియాను తిరిగి టాటా గూటికి చేర్చాడు. ప్రభుత్వం నుంచి టాటాపరమైన తర్వాత తొలి ఫ్లైట్ ఈ రోజు టాటాల ఆధ్వర్యంలో నడిచింది. ఈ సందర్భంగా తమ విమానంలో ప్రయాణిస్తున్న వారికి మొదటి సారిగా వినిపించిన అనౌన్స్‌మెంట్‌ని టాటా మీడియాకు రిలీజ్ చేసింది. ఈ అనౌన్స్మెంట్ ‘ డియర్ గెస్ట్, నేను మీ కెప్టెన్‌ను మాట్లాడుతున్నాను.. సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్న విమానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.. అంటూ మొదలు పెట్టి వెల్కమ్ టూ ది ఫ్యూచర్ ఆఫ్ ఎయిర్ ఇండియా! వి హోప్ యూ ఎంజాయ్ ది జర్నీ అంటూ ముగిసింది. Air India's new circular for cockpit crew welcome announcements: "Dear guests, welcome aboard this historic flight, which marks a special event. Today, Air India officially becomes a part of Tata Group again, after seven decades. Welcome to the future of Air India." pic.twitter.com/GsiXy07I1V — ANI (@ANI) January 27, 2022 -
కరోనా భయం తగ్గింది.. దేశీయంగా పెరుగుతున్న విమాన ప్రయాణాలు
ముంబై: దేశీయంగా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అక్టోబర్‌లో ఇది సుమారు 90 లక్షలుగా నమోదైంది. గతేడాది అక్టోబర్‌లో నమోదైన 53 లక్షలతో పోలిస్తే ఇది దాదాపు 70 శాతం అధికం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గురువారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డీజీసీఏ తెలిపిన వివరాల ప్రకారం ఇండిగో 48 లక్షలు, ఎయిరిండియా 11 లక్షలు, విస్తార 7 లక్షలు, ఎయిర్ఏషియా ఇండియా 6 లక్షలు, స్పైస్‌జెట్ 8.10 లక్షలు, గో ఫస్ట్ 8.84 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి. కీలకమైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో సమయపాలనకు సంబంధించి ఇండిగో (88.8 శాతం) అగ్రస్థానంలో నిల్చింది. ఇండిగో మార్కెట్ వాటా అత్యధికంగా 53.5 శాతంగా ఉంది. ఎయిరిండియా 11.8 శాతం, గో ఫస్ట్ 9.8 శాతం, స్పైస్‌జెట్ 9 శాతం, విస్తారా 7.8 శాతం వాటా దక్కించుకున్నాయి. చదవండి: ఆగేదేలే! అమెరికా టూ ఇండియా.. నాన్‌స్టాప్ ఫ్లైట్ సర్వీసులు.. -
ఎయిరిండియాలో మరో వివాదం.. చిక్కుల్లో టాటా గ్రూపు
ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకున్నామన్న సంతోషం ఆస్వాదించకముందే టాటా గ్రూపుకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మరోసారి మహారాజా స్టేటస్‌ని తెచ్చి పెట్టాలంటే చెమటోడ్చక తప్పని పరిస్థితిలు కళ్లేదుటే కనిపిస్తున్నాయి. ఆస్తులపై పేచీ ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణలో భాగంగా వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవల టాటా సన్స్ రూ. 18,000 కోట్లు చెల్లించేందుకు అంగీకరించి ఎయిరిండియాను దక్కించుకుంది. దీంతో ఎయిరిండియా స్థిర, చర ఆస్తులన్నీ టాటా సన్స్ స్వంతం అవుతాయి. ఇందులో బోయింగ్ విమానాలతో పాటు సిబ్బంది క్వార్టర్స్, కార్గో స్టేషన్లు ఇతర విలువైన భూములు కూడా ఉన్నాయి. క్వార్టర్లు ఖాళీ చేయండి నిబంధనల ప్రకారం ప్రైవేటీకర ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆరు నెలలలోపు ప్రస్తుతం ఎయిరిండియా క్వార్టర్లలో ఉంటున్న సిబ్బంది వాటిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే ఎయిరిండియా కాలనీల్లో ఉంటున్న ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఎయిరిండియా ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఉన్న పళంగా మమ్మల్ని క్వార్టర్లు ఖాళీ చేయమనడం దారుణమంటూ మండి పడుతున్నారు. సమ్మెకు రెడీ ఎయిరిండియాలో ప్రస్తుతం 12,085 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో పర్మినెంట్ ఉద్యోగులు 8084, కాంట్రాక్టు ఉద్యోగులు 4001 మంది ఉన్నారు. ఇందులో చాలా మందికి ముంబై, ఢిల్లీ, కోల్‌కతా తదితర ఏరియాల్లో క్వార్టర్లు కేటాయించారు. ఇప్పుడు వాటిని ఖాళీ చేస్తే తమ కుటుంబాలు రోడ్డు మీద పడతాయంటూ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు ఖాళీ చేయాలంటూ జారీ చేసిన నోటీసులు వెనక్కి తీసుకోకుంటే నవంబరు 2 నుంచి నిరవధిక సమ్మె చేస్తామంటూ తేల్చి చెబుతున్నారు. కనీసం మాట్లాడరా ? ఎయిరిండియాను ప్రైవేటీకరించిన తర్వాత సెటిల్మెంట్, తమ భవిష్యత్తుకు భరోసా అందించేందుకు కేంద్రం నుంచి ఎటువంటి చర్యలు లేవని, కానీ ఇప్పటికిప్పుడు ఇళ్లు వదిలేసి వెళ్లాలంటూ ఆదేశాలు ఇవ్వడం అమానవీయమని ఉద్యోగులు అంటున్నారు. కనీసం తమతో చర్చలు జరిపేందుకు కూడా ఎవరూ సిద్ధంగా లేరంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిక్కుముళ్లు ఏవియేషన్ రంగంలో తమదైన ముద్ర వేయాలని టాటాగ్రూపు ఎప్పటి నుంచో ఆశిస్తోంది. విస్తారాలో పెట్టుబడులు పెట్టినా పూర్తి స్థాయిలో టాటాల ఆశయం నెరవేరలేదు. ఈ సమయంలో ఎయిర్ ఇండియా ద్వారా ఏవియేషన్ రంగంలో దూసుకుపోవాలని టాటా యోచిస్తోంది. అయితే అంతకు ముందు ఉద్యోగుల సెటిల్మెంట్, క్వార్టర్లు తదితర చిక్కుముళ్లు వీడాల్సి ఉంది. చదవండి : ఎయిర్ఇండియా తర్వాత ప్రైవేటీకరించేది వీటినే ! -
చైనాలో ఆంక్షలు..! వారికి ఆశాదీపంలా ఎయిరిండియా-టాటా డీల్..!
ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాను టాటా గ్రూప్ సన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిరిండియాను బిడ్డింగ్‌లో టాటా గ్రూప్ రూ. 18,000 కోట్లకు దక్కించుకుంది. డిసెంబర్ చివరి నాటికి ఎయిరిండియా-టాటా మధ్య డీల్ పూర్తి అవుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిరిండియా డీల్ భారత మార్కెట్లకు సరికొత్త వేగాన్ని అందించింది. చైనాలో ఉక్కుపాదం...! గత కొద్ది రోజులుగా పలు ప్రైవేట్ కంపెనీలపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. ప్రపంచంలో అతి పెద్ద రెండో ఆర్థిక వ్యవస్థను కల్గిన చైనా తమ సొంత కంపెనీలపై జిన్‌పింగ్ ప్రభుత్వం భారీగా ఆంక్షలను పెడుతుంది. ఇతర దేశాల్లో పెట్టుబడులను నిలిపివేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఎవర్‌గ్రాండ్ సంక్షోభంతో..పలు ప్రైవేట్ కంపెనీలపై చైనా ప్రభుత్వం దృష్టిసారించింది. ఎవర్‌గ్రాండే గ్రూప్, రైడ్, హైలింగ్ దిగ్గజం దీదీ గ్లోబల్ ఇంక్ సంస్థలపై అక్కడి ప్రభుత్వం తనిఖీలను నిర్వహిస్తోంది. బ్యాంకులు, పెట్టుబడి నిధులు, ఫైనాన్షియల్ రెగ్యులేటర్లపై చైనా ఓ కన్నేసింది. ఎయిరిండియా-టాటా డీల్ సానుకూల పవనాలు..! ఎయిరిండియా-టాటా డీల్ భారత మార్కెట్లకు సానుకూల పవనాలు వీచేలా కన్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణను వేగంగా చేస్తోంది. దీంతో ప్రైవేటు సంస్థలు ఆయా పీఎస్యూలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ ప్రైవేటు పెట్టుబడిదారులను గణనీయంగా ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఈక్విటీ మార్కెట్లలో స్థిరమైన వృద్ధి కన్పించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ ఈక్విటీ ల్యాండ్‌స్కేప్ ప్రైవేటికరణతో మరిన్ని పెట్టుబడి ప్రవాహాలు, స్టాక్స్ భారీ లాభాలను గడిచే అవకాశాలు ఉన్నాయని స్మార్ట్సన్ క్యాపిటల్ ఫండ్ మేనేజర్ సుమీత్ రోహ్రా పేర్కొన్నారు. చైనాలో కొనసాగుతున్న రెగ్యులేటరీ క్లాంప్‌డౌన్‌తో భారత స్టాక్‌మార్కెట్లు, ఇతర ఐపీవో గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. రికార్డ్-తక్కువ వడ్డీ రేట్లు, రిటైల్-ఇన్వెస్టింగ్ బూమ్, టెక్ లిస్టింగ్‌ల కారణంగా, భారతదేశ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ ఏడాది 37శాతం పెరిగి 3.46 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిరిండియా-టాటా ఒప్పందం దేశంలోని ప్రైవేట్ ఎంటర్ప్రైజ్లకు నియంత్రణ వాతావరణాన్ని మెరుగుపరచడానికి ఒక సంకేతం మాత్రమే కాదు, ప్రైవేట్ యజమానులను త్వరగా పొందాలనే అంచనాలపై ప్రభుత్వరంగ సంస్థల స్టాక్స్ విలువలను పెంచుతుందని రోహ్రా చెప్పారు. చదవండి: వారెట్‌బఫెట్ ఆఫ్ ఇండియా లక్కు.. టాటా మోటార్స్‌తో భారీ సంపాదన -
భారత్ ప్రభుత్వంపై దావా... వెనక్కి తగ్గిన కెయిర్న్ ఎనర్జీ
న్యూఢిల్లీ: భారత్ ప్రభుత్వంపై దావాల కొనసాగింపు విషయంలో కెయిర్న్ ఎనర్జీ వెనక్కు తగ్గుతుంది. ఇందుకు సంబంధించి న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఎయిర్ ఇండియాపై తాను వేసిన ఒక దావాపై స్టేను కోరుతూ స్వయంగా ముందుకు వచ్చింది. ఎయిర్ ఇండియాతో కలిసి ఈ మేరకు న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేసింది. రెట్రాస్పెక్టివ్ పన్ను రద్దుపై భారత్ నిర్ణయం, ఈ నిర్ణయం అమలుకు విధివిధానాల అమలు తత్సంబంధ అంశాలకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున దావాపై విచారణపై స్టే ఇవ్వాలని రెండు సంస్థలూ న్యాయస్థానాన్ని అభ్యర్థించాయి. వివరాలు ఇవీ... కెయిర్న్ ఎనర్జీ 1994లో భారత్‌లో చమురు, గ్యాస్ రంగంలో ఇన్వెస్ట్ చేసింది. 2006లో తన భారత విభాగాన్ని బీఎస్ఈలో లిస్ట్ చేసింది. ఈ క్రమంలో కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్ ఎనర్జీ లబ్ధి పొందిందని, దానికి సంబంధించి రూ. 10,247 కోట్ల మేర పన్ను పెనాల్టీ, వడ్డీ కట్టాలని కెయిర్న్‌కు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. గత డీల్స్‌కు కూడా వర్తించేలా సవరించిన పన్ను చట్టాలకు (రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్) అనుగుణంగా వీటిని జారీ చేసింది. భారత విభాగంలో కెయిర్న్‌కు ఉన్న షేర్లను, దానికి రావాల్సిన డివిడెండ్లు మొదలైన వాటిని జప్తు చేసింది. వీటి విలువ దాదాపు రూ.7,900 కోట్లు. దీన్ని కెయిర్న్ ఎనర్జీ పలు న్యాయస్థానాలతో పాటు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో సవాలు చేయగా.. కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కెయిర్న్‌కు 1.2 బిలియన్ డాలర్లు పరిహారం ఇవ్వాలంటూ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ భారత్‌కు సూచించింది. కానీ కేంద్రం ఇందుకు సుముఖంగా లేకపోవడంతో విదేశాల్లో భారత్‌కి ఉన్న ఆస్తులను జప్తు చేయడం ద్వారా పరిహారాన్ని రాబట్టుకోవాలని కెయిర్న్ నిర్ణయించింది. అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఆదేశాల అమలు కోరుతూ పిటీషన్లు కూడా దాఖలు చేసింది. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియాపై సైతం ఒక దావాను మేలో న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్యారిస్‌లో భారత్‌కి ఉన్న 20 ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసుకునేందుకు కెయిర్న్ ఎనర్జీకి అనుకూలంగా జూలైలో ఫ్రాన్స్ న్యాయస్థానం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే రెట్రాస్పెక్టివ్ పన్ను విధానాన్ని రద్దు చేయాలని కేంద్రం గత నెల్లో నిర్ణయం తీసుకుంది. రెట్రో పన్ను రద్దు పరిణామంతో ఈ పన్ను కింద వసూలయిన రూ.8,100 కోట్లను ప్రభుత్వం రిఫండ్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇందులో ఒక్క కెయిర్న్ ఎనర్జీకి చెల్లించాల్సిందే రూ.7,900 కోట్లు కావడం గమనార్హం. దీనితోపాటు మొత్తం రూ.1.10 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్ పన్ను డిమాండ్లను దాదాపు 17 కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. దీనికి వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించాయి. వివాద పరిష్కారాలకు, రిఫండ్స్‌కు తొలుత ఆయా కంపెనీలు కేసులను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పలు కంపెనీలు ప్రారంభించాయి. రెట్రాస్పెక్టివ్ పన్ను అంటే.. గత 50 సంవత్సరాల్లో జరిగిన లావాదేవీలకు కూడా పన్నులు వసూలు చేసే విధానాన్ని రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్‌గా వ్యవహరిస్తారు. భారతదేశంలోని ఆస్తుల అమ్మకం, షేర్ల బదలాయింపు వంటి లావాదేవీలు గతంలో విదేశాల్లో జరిగినా వాటికి సంబంధించి ఇక్కడ పన్ను కట్టాల్సిందేనన్న ఉద్దేశంతో 2012 మే 28న అప్పటి యూపీఏ ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. స్థిరమైన పన్ను విధానాలపై ఇన్వెస్టర్లలో భరోసా కల్పించేందుకు, కార్పొరేట్ సంస్థలతో నెలకొన్న రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ వివాదాలకు ముగింపు పలికేందుకు రెట్రో ట్యాక్స్‌ను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. చదవండి: సరైన సమయంలో... సరైన నిర్ణయాలు తీసుకోకపోతే -
కష్టాల కడలి, రూ.70,820 కోట్లకు ఎయిరిండియా నష్టాలు
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా నష్టాలు 2020 మార్చి 31 నాటికి రూ. 70,820 కోట్లకు చేరినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ రాజ్యసభకు తెలిపారు. 2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌తో విలీనం చేసినప్పట్నుంచీ సంస్థ నష్టాల్లోనే ఉన్నట్లు వివరించారు. ఎయిరిండియా విక్రయా నికి సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్ 15లోగా ఆసక్తి గల బిడ్డర్ల నుంచి ఆర్థిక బిడ్లు రాగలవని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సంస్థను విక్రయించేందుకు గతేడాది జనవరి 27న కేంద్రం బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తికరణ పత్రాలను ఆహ్వానించింది. కోవిడ్–19 పరిస్థితుల నేపథ్యంలో బిడ్ల దాఖలుకు డెడ్‌లైన్‌ను పొడిగిస్తూ వచ్చింది. విమానాశ్రయాల చట్ట సవరణల బిల్లుకు ఆమోదం ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (సవరణ) బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. వివిధ అంశాలపై విపక్షాల నిరసనల మధ్య స్వల్ప చర్చ అనంతరం రాజ్యసభ దీనికి ఆమోదముద్ర వేసింది. మారుమూల ప్రాంతాల్లోనూ విమాన సేవలు అందుబాటులోకి తెచ్చే దిశగా చిన్న విమానాశ్రయాల కార్యకలాపాల విస్తరణను ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని ప్రతిపాదించారు. షిప్పింగ్ పోర్టులపై పార్లమెంటరీ కమిటీ నివేదిక.. దేశీయంగా కొత్త పోర్టుల ఏర్పాటు అవకాశాలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేసేందుకు తగు ప్రతిపాదనలతో ప్రభుత్వాన్ని సంప్రదించే స్వేచ్ఛ షిప్పింగ్ రంగంలోని ప్రైవేట్ సంస్థలకు ఉండాలని పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంది. కంటైనర్లను వేగవంతంగా ఖాళీ చేసేందుకు జవహర్లాల్ నెహ్రూ పోర్టు (జేఎన్పీటీ)లో రైల్ యార్డును అభివృద్ధి చేసే అంశం పరిశీలించాలని ఒక నివేదికలో సూచించింది. -
ఎయిరిండియాకు... త్వరలోనే ఫైనాన్షియల్ బిడ్లు!
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాల ఉపసంహరణకు సంబంధించిన నూతన కాల వ్యవధిని పరిశీలిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి తెలిపారు. రానున్న రోజుల్లో ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాల విక్రయానికి ఆర్థిక బిడ్లకు ఆహ్వానం పలకనున్నట్టు చెప్పారు. బిడ్డర్లు పరిశీలించేందుకు వీలుగా డేటా రూమ్‌ను అందుబాటులో ఉంచామని.. ఆర్థిక బిడ్లకు 64 రోజల వ్యవధి ఉందని చెప్పారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుని ఎయిరిండియాను ప్రైవేటు సంస్థకు అప్పగించడమేనన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పురి ఈ అంశంపై మాట్లాడారు. కాగా, తీవ్ర నష్టాల్లో ఉన్న ఎయిరిండియాలో నూరు శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎయిర్ఇండియాను ప్రైవేటీకరించడం లేదంటే మూసివేయడం మినహా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపే అవకాశం లేదన్నారు. అజయ్‌సింగ్ దూకుడు... స్పైస్‌జెట్ ప్రమోటర్ అయిన అజయ్‌సింగ్ ఎలాగైనా ఎయిరిండియాను సొంతం చేసుకోవాలన్న సంకల్పంతో ఉన్నట్టున్నారు. ఎయిరిండియా లో నూరు శాతం వాటాను సొంతం చేసుకునేందుకు రస్‌అల్‌ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీతోపాటు ఢిల్లీకి చెందిన బర్డ్ గ్రూపు ప్రమోటర్ అంకుర్ భాటియాతో జతకట్టారు. సింగ్, భాటియా ఇరువురూ తమ వ్యక్తిగత హోదాలో ఎయిరిండియా కోసం బిడ్లు దాఖలు చేశారని సంబంధిత ఉన్న వర్గాలు వెల్లడించాయి. మరోవైపు టాటా గ్రూపు సైతం ఎయిరిండియా కోసం పోటీపడుతోంది. చదవండి: రూ.999 కే విమాన టికెట్: ఏయే రూట్లలో? -
ఎయిరిండియా విమానాలపై దుబాయ్ నిషేధం
న్యూఢిల్లీ: కోవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్ కలిగి ఉన్న వ్యక్తులను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాల ద్వారా దుబాయ్‌కి పంపినందుకుగానూ ఆ దేశం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలపై అక్టోబర్ 2 వరకూ నిషేధం విధిం చింది. యూఏఈ నిబంధనల ప్రకారం ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్న సర్టిఫికెట్లను 96 గంటల ముందుగా తీసుకొని అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే సెప్టెంబర్ 2న పాజిటివ్ ఉన్న ఓ వ్యక్తి సెప్టెంబర్ 4న జైపూర్ నుంచి దుబాయ్ వెళ్లాడని, గతంలోనూ ఇలాగే జరిగినందున నిషేధం విధించామని అధికారులు చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోవిడ్ రోగి పక్కన కూర్చొన్న వ్యక్తులను క్వారంటైన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. -
ఎరిండియా విమానంలో కరోనా కలకలం
-
ముఖానికి మాస్కులు.. షీల్డులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిపరమైన ఆంక్షలతో దేశీయంగా నిల్చిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన తర్వాత సిబ్బంది డ్రెస్ కోడ్‌లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. వారు కూడా ముఖానికి మాస్కులు, ఫేస్ షీల్డులు, గౌన్లు వంటి వ్యక్తిగత భద్రత సాధనాలను (పీపీఈ) ఉపయోగించనున్నారు. విధుల నిర్వహణలో ప్రయాణికులకు దగ్గరగా తిరిగే సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఆహార్యాన్ని అమలు చేయాలని ఇండిగో, ఎయిరిండియా, విస్తార, ఎయిర్ఏషియా ఇండియా తదితర సంస్థలు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 27న ఫిలిప్పీన్స్ ఎయిర్ఏషియా ఆవిష్కరించిన డ్రెస్ కోడ్ తరహాలోనే ఇది కూడా ఉండవచ్చని వివరించాయి. ఫేస్ షీల్డు, ఫేస్ మాస్కుతో పాటు శరీరాన్ని పూర్తిగా కప్పేసే ఎరుపు రంగు ఫుల్ బాడీ సూట్‌ను ఫిలిప్పీన్స్ ఎయిర్ఏషియా రూపొందించింది. ఎయిర్ఏషియా తమ సిబ్బంది.. పీపీఈ కిట్ కింద ఫేస్ షీల్డులు, మాస్కులు, గౌన్లు, ఆప్రాన్స్, గ్లౌజులు ధరించవచ్చని తెలుస్తోంది. విస్తార సంస్థ సిబ్బంది కొత్త డ్రెస్ కోడ్‌లో ల్యాప్ గౌన్, ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డులు ఉండవచ్చని సమాచారం. అటు ఇండిగో సిబ్బంది గౌను లేదా బాడీ సూట్‌తో పాటు సర్జికల్ మాస్కు, గ్లౌజులు, ఫేస్ షీల్డు ధరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. ఎయిరిండియా ఉద్యోగులు కూడా బాడీ సూట్, గ్లౌజులు, ఫేస్ షీల్డు, ఫేస్ మాస్క్ ఉపయోగించనున్నారని తెలిపాయి. -
ఎయిరిండియా ప్రైవేటీకరణ తప్పదు
ముంబై: దాదాపు రూ. 80,000 కోట్ల పైగా రుణభారం పేరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రైవేటీకరించడం తప్ప మరో మార్గం లేదని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ ప్రక్రియకు ఉద్యోగులంతా సహకరించాలని పేర్కొన్నారు. ఎయిరిండియాకు చెందిన కొన్ని యూనియన్ల నేతలతో గురువారం జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాలు స్పష్టం చేశారు. అయితే, ప్రైవేటీకరణ ప్రణాళికలపై యూనియన్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం కొంత మద్దతునిస్తే కంపెనీని నిర్వహించుకోగలిగే సామర్థ్యం ఉద్యోగులకు ఉందని పేర్కొన్నాయి. ప్రైవేటీకరించినా.. ఉద్యోగ భద్రత వంటి విషయాల్లో ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి చెప్పినట్లు దాదాపు గంటపైగా సాగిన సమావేశం అనంతరం యూనియన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘ఎయిరిండియా రుణభారం రూ. 80,000 కోట్ల పైగా ఉందని, ఏ నిపుణుడి దగ్గరా దీనికి పరిష్కార మార్గాలు లేవని మంత్రి చెప్పారు. ఈ పరిస్థితుల్లో కంపెనీని ప్రైవేటీకరించడం ఒక్కటే ప్రభుత్వం ముందున్న మార్గమని తెలిపారు‘ అని ప్రతినిధి వివరించారు. మరోవైపు, ప్రైవేటీకరణపై యూనియన్ల ప్రతినిధులతో సుదీర్ఘంగా, ఉపయోగకరమైన విధంగా చర్చలు జరిగాయని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్లో మంత్రి పోస్ట్ చేశారు. మరో 10 రోజుల్లో మళ్లీ సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. -
ఎయిరిండియా వాటా విక్రయం మార్చిలోగా లేనట్టే..!
ముంబై: ఎయిరిండియాలో వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చు. ఎయిర్ ఇండియాతో పాటు బీపీసీఎల్, కంటైనర్ కార్పొరేషన్ల్లో కూడా వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కాకపోవచ్చని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం వెనకబడి ద్రవ్యలోటుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని అంచనా. వాటా విక్రయ ప్రయత్నాల్లో జాప్యం.... ఎయిరిండియా, బీపీసీఎల్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీల్లో వ్యూహాత్మక వాటా విక్రయ ప్రయత్నాలు జరుగుతున్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల జాప్యం జరుగుతోందని తెలిపారు. ఈ కంపెనీల వాటా విక్రయానికి సంబంధించి ఆర్థిక వివరాలను సిద్ధం చేస్తున్నామని, దీనికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. పలు కంపెనీల నుంచి మంచి స్పందన లభిస్తోందని, అదనపు వివరాలను అడుగుతున్నాయని వివరించారు. మరోవైపు భారత్ బాండ్ ఈటీఎఫ్ స్వల్ప నష్టంతో ఎన్ఎస్ఈలో లిస్టయింది. సగం కూడా సాకారం కాని లక్ష్యం..... ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకూ దీంట్లో సగం కూడా సమీకరించలేకపోయింది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి రూ.12,359 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. మరోవైపు ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాలను మించింది. మరో 4 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నప్పటికి, ఇప్పటికే ద్రవ్యలోటు 115%కి ఎగబాకింది. బీపీసీఎల్ వాటా రూ.60,000 కోట్లు. బీపీసీఎల్(భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్)లో కేంద్రానికి 53 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం కారణంగా ఖజానాకి రూ.60,000 కోట్లు లభిస్తాయి. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వాటా విక్రయం ద్వారా రూ.2,000 కోట్లు లభించనున్నాయి. ఇక కంటైనర్ కార్పొ డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.13,000 కోట్లు లభించే అవకాశాలున్నాయి. -
బీపీసీఎల్, ఎయిరిండియా విక్రయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు రిఫైనరీ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), విమానయాన సంస్థ ఎయిరిండియాల విక్రయం సాధ్యమైనంత వరకూ ఈ ఆర్థిక సంవత్సరంలోనే ముగించాలని కేంద్రం యోచిస్తోంది. మార్చి నాటికల్లా అమ్మకం పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎయిరిండియాపై చాలా మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నట్లు ఆమె వివరించారు. ఎయిరిండియా విక్రయానికి ప్రభుత్వం ప్రయత్నించడం ఇది రెండోసారి. 76%వాటాలను అమ్మేందుకు గతేడాది ప్రయత్నించినప్పటికీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవడంతో విరమించుకోవాల్సి వచ్చింది. మరోవైపు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా కేంద్రం గత ఐదేళ్లలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టిందని, ఇవి 2024–25 నాటికి భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనకు తోడ్పడతాయని సోమవారం లోక్‌సభలో నిర్మలా సీతారామన్ చెప్పారు. వ్యాపారానికి మరింత వెసులుబాటు దేశంలో వ్యాపార నిర్వహనకు మరింత సులభతరమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి బృందం– కంపెనీ లా కమిటీ సూచించింది. ఈ మేరకు కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఇంజెటి శ్రీనివాస్ నేతృత్వంలోని కమిటీ నివేదికను కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమరి్పంచింది. -
సీట్లు లేవు : ఢిల్లీ విమానాశ్రయంలో గందరగోళం
సాక్షి,న్యూఢిల్లీ :ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లను నిరాకరించడంతో టెర్మినల్ 3వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానంలో సీట్లు లేవు.. ఖాళీ లేదు అంటూ ముందుగా టికెట్లను బుక్ చేసుకున్నవారికి చుక్కలు చూపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ-గౌహతి ఎయిరిండియా విమానంలో ప్రయాణిచేందుకు 20 మంది టికెట్లను బుక్ చేసుకున్నారు. అయితే వీరికి ప్రయాణానికి అవసరమైన బోర్డింగ్ పాస్‌లను ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరించడంతో వివాదం మొదలైంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. #Delhi: Over 20 passengers travelling on Air India Delhi-Guwahati flight today were denied boarding passes as the flight was overbooked, claims passengers. pic.twitter.com/dAvlZMZ2B7 — ANI (@ANI) June 5, 2019 -
ప్రధాని ఫొటోలున్న బోర్డింగ్ పాస్‌లు రద్దు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఫొటోలున్న బోర్డింగ్ పాస్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వరంగ ఎయిరిండియా ప్రకటించింది. ఎన్నికల వేళ ప్రధానితోపాటు గుజరాత్ సీఎం ఫొటోలుండటంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నేతల ఫొటోలున్న బోర్డింగ్ పాస్‌లపై పంజాబ్ మాజీ డీజీపీ శశికాంత్ ట్విట్టర్లో అభ్యంతరం తెలిపారు. ‘ఈ రోజూ న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఎయిరిండియా జారీ చేసిన బోర్డింగ్ పాస్‌పై వైబ్రంట్ గుజరాత్ నినాదంతోపాటు ప్రధాని, గుజరాత్ సీఎం ఫొటోలున్నాయి. ఎన్నికల సమయంలో ఇటువంటి వాటిని చూడలేని, వినలేని, మాట్లాడలేని ఎన్నికల సంఘంపై ప్రజాధనం వృథాగా ఖర్చు చేయడం ఎందుకు?’ అని ప్రశ్నిస్తూ బోర్డింగ్ పాస్ ఫొటోను జత చేశారు. దీనిపై ఎయిరిండియా అధికార ప్రతినిధి ధనంజయ్ కుమార్ స్పందిస్తూ ‘ప్రధాని మోదీ, గుజరాత్ సీఎంల ఫొటోలతో ఉన్న బోర్డింగ్ పాస్‌లను వెనక్కి తీసుకోవాలని మా సంస్థ నిర్ణయించింది. ఆ పాస్‌లను జనవరిలో వైబ్రంట్ గుజరాత్ సమిట్ సందర్భంగా జారీ చేయగా మిగిలిపోయినవి అని భావిస్తున్నాం. వేరే సంస్థ వ్యాపార ప్రకటనలో భాగంగా వాటిని ఆవిధంగా ముద్రించి గుజరాత్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో ఉపయోగిస్తున్నాం. వాటి జారీని కొనసాగించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని తేలితే వెనక్కి తీసుకుంటాం’ అని వివరించారు. ఈ మేరకు అన్ని విమానాశ్రయాల అధికారులకు ఆదేశాలిచ్చి నట్లు తెలిపారు. -
వారి కోసం లాంగ్రేంజ్ విమానం
న్యూఢిల్లీ: దేశంలో వేల కోట్ల మేర ఆర్థిక నేరాలకు పాల్పడి వెస్టిండీస్ దీవుల్లో ఆశ్రయం పొందుతున్న మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీయే లక్ష్యంగా ఈడీ/ సీబీఐ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు కదులుతున్నారు. వేల కోట్లు మోసాలకు పాల్పడిన ఆ ఘరానా నేరగాళ్లను పట్టుకు వచ్చేందుకు ఎయిరిండియాకు చెందిన ఎక్కడా ఆగకుండా ప్రయాణించే లాంగ్రేంజ్ బోయింగ్ విమానంలో తమ అధికారులను అక్కడికి పంపించనున్నారు. వజ్రాల వ్యాపారులు మెహుల్ చోక్సీ, జతిన్ మెహతా తదితరులు.. డబ్బులిస్తే చాలు పౌరసత్వం చౌకగా దొరికే కరీబియన్ దీవుల్లోనే ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నారు. జతిన్ మెహతా సెయింట్ కిట్స్, నెవిస్ దీవుల పౌరసత్వం, మెహుల్ చోక్సీ అంటిగ్వా బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. అయితే, నీరవ్ మోదీ యూరప్‌లో రహస్య ప్రాంతంలో ఉండి ఉంటాడని ఈడీ వర్గాలంటున్నాయి. చోక్సీతోపాటు యూరప్‌లో ఉన్న మోదీని తీసుకువస్తామని అధికారవర్గాలు చెబుతున్నాయి. గౌతమ్ ఖేతాన్ అరెస్ట్ నల్లధనం కలిగి ఉండటం, మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసు’ నిందితుడు, న్యాయవాది గౌతమ్ ఖేతాన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శనివారం అరెస్టు చేశారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం∙కేసులో అరెస్టయిన మరో దళారీ క్రిష్టియన్ మిషెల్‌ను విచారించగా, అతను వెల్లడించిన వివరాల మేరకే ఖేతాన్‌ను ఎన్‌ఫోన్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్‌చేసినట్లు తెలుస్తోంది. -
ఫెస్టివ్ బొనాంజా : ఎయిరిండియా కొత్త స్ట్రాటజీ
సాక్షి, న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకుని ప్రయివేటీకరణ ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా వినూత్న ప్రణాళికలను ప్రకటించింది. నవంబరు 30 నుంచి సాధారణ చార్జీల కంటే తక్కవ రేట్లలో దేశీయ సర్వీసులను ప్రకటించింది. గోవా, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాలకు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నామని శనివారం (అక్టోబర్ 27) ఎయిరిండియా వెల్లడించింది. వచ్చే నెల చివరి నాటికి ఈ సర్వీసులను లాంచ్ చేస్తామని తెలిపింది.భారీ ట్రాఫిక్‌ను ఛేదించండి...హోటల్ ఖర్చుల భారం నుంచి బయటపడండి.. నమ్మనలేని తక్కువ ధరల్లో విమాన టికెట్లను ఆస్వాదించండి అంటూ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఢిల్లీ-గోవా-ఢిల్లీ, ఢిల్లీ-కోయంబత్తూర్-ఢిల్లీ, బెంగుళూరు-అహ్మదాబాద్-బెంగుళూరులాంటి మార్గాల్లో సాధారణ విమాన ఛార్జీల కంటే తక్కువ రేట్లకే అందిస్తామని ప్రవేశపెడతామని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా లేట్‌నైట్ బయలుదేరిన విమానాలు తెల్లవారేసరికి ఆయా గమ్యస్థానాలకు చేరేలా ఈ సర్వీసులను పరిచయం చేస్తున్నట్టు తెలిపింది. రెడ్‌ఐ విమానాలు విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, యూరప్‌లో బాగా ప్రాచుర్యం పొందాయని, ఈ నేపథ్యంలో ఈ సర్వీసులను దేశీయంగా కూడా పరిచయం చేస్తున్నట్టు పేర్కొంది. #FlyAI : #airindia #redeyeflights #festivalbonanza Beat peak traffic, avoid hotel cost, enjoy cheapest fares on these latenight flights. Log on to https://t.co/T1SVjRD6o5 to grab fares you just can't believe. pic.twitter.com/VIO6sBj2xQ — Air India (@airindiain) October 27, 2018 -
డబుల్ డెక్కర్ విమానం వచ్చేస్తోంది!
ముంబై : ఇన్ని రోజులు డబుల్ డెక్కర్ బస్సు.. డబుల్ డెక్కర్ రైలు మాత్రమే చూసుంటాం. ఇక నుంచి డబుల్ డెక్కర్ విమానం కూడా అందుబాటులోకి వస్తోంది. పండగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా డబుల్ డెక్కర్ విమానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ డబుల్ డెక్కర్ విమానం రెండు కీలకమైన మార్గాల్లో ప్రయాణించనుంది. అవి ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ముంబై, కోల్‌కతా ప్రాంతాలకు. ఈ రెండు ప్రాంతాలకు 423 సీట్ల సామర్థ్యం కలిగిన డబుల్ డెక్కర్ బోయింగ్ 747 ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపనున్నట్లు ఎయిరిండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్ 16 నుంచి డబుల్ డెక్కర్ విమానం ‘జంబో’ తన సేవలను అందించనుంది. ఇందులో 12 సీట్లు ఫస్ట్ క్లాస్‌వి, 26 బిజినెస్ క్లాస్‌వి, 385 ఎకానమీ క్లాస్‌వి ఉండనున్నాయి. అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 21 మధ్యలో న్యూఢిల్లీ నుంచి కోల్‌కతా, ముంబైలకు రోజుకు ఒక విమానం చొప్పున ‘జంబో’ విమానాన్ని నడుపనున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. మొదటి దశలో భాగంగా కోల్‌కతాకు ఈ డబుల్ డెక్కర్ విమానాన్ని నడపనుండగా, రెండో దశ(నవంబరు)లో ముంబైకి ఈ విమానం సేవలు అందించనున్నారు. సాధారణంగా నాలుగు ఇంజిన్ విమానాలను అంతర్జాతీయ మార్గాలలో, అదేవిధంగా వీవీఐపీల కోసం వినియోగిస్తుంటారు. న్యూఢిల్లీ-ముంబై-న్యూఢిల్లీ సెక్టార్లో నవంబరు 1 నుంచి 11వ తేదీ వరకు రోజుకు రెండు జంబో ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడుపనున్నట్టు ఎయిరిండియా తెలిపింది. అక్టోబరులో దసరా, నవంబరులో దీపావళి పండగలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది ఎయిరిండియా. కాకతాళీయంగా ఈ ఏడాదే బోయింగ్ 747 ఆపరేషన్స్ ప్రారంభించి 50 ఏళ్లను పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బోయింగ్ 747 ఎయిర్‌క్రాఫ్ట్‌కు మరింత ఖ్యాతి అందించేందుకు డబుల్ డెక్కర్‌లో కూడా అందుబాటులోకి తెస్తోంది ఎయిరిండియా. -
అలవెన్సులు ఇవ్వకుంటే విమానాలు నడపం
ముంబై: ఫ్లయింగ్ అలవెన్స్ బాకీలు తక్షణమే చెల్లించని పక్షంలో విమానాలు నడిపే ప్రసక్తే లేదని ప్రభుత్వ రంగ ఎయిరిండియా యాజమాన్యాన్ని పైలట్లు హెచ్చరించారు. మిగతా ఉద్యోగులందరికీ ఎలాంటి జాప్యం చేయకుండా సకాలంలో జీతభత్యాలు చెల్లిస్తున్నప్పటికీ, తమనూ.. క్యాబిన్ సిబ్బందినీ పక్కన పెడుతున్నారని వారు ఆందోళ వ్యక్తం చేశారు. పైలట్ల జీతాల్లో ఎక్కువ భాగం వాటా ఫ్లయింగ్ అలవెన్సులదే ఉంటుందని తెలిసీ ఇలా చేయడం భావ్యం కాదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫ్లయింగ్ అలవెన్సులను తక్షణం చెల్లించని పక్షంలో ఫ్లయింగ్ విధులకు హాజరు కాలేమని ఎయిరిండియా డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్‌కి పంపిన లేఖలో ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఏ) పేర్కొంది. జీతం మాత్రమే చెల్లిస్తున్నందున ఆఫీసుకు వస్తామని, ఫ్లయింగ్ విధులు తప్ప మిగతావన్నీ నిర్వర్తిస్తామని తెలిపింది. పైలట్ల జీతభత్యాల్లో 30 శాతమే జీతం కాగా మిగతాది అలవెన్సుల రూపంలోనే ఉంటుంది. సాధారణంగా ఫ్లయింగ్ అలవెన్సులు రెండు నెలల తర్వాత చెల్లిస్తారు. దీని ప్రకారం జూన్ నెలవి ఆగస్టు 1న చెల్లించాల్సి ఉన్నా.. ఇప్పటిదాకా చెల్లించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఎయిరిండియా ‘ఇండిపెండెన్స్ డే’ సేల్
ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా ‘ఇండిపెండెన్స్ డే’ సేల్‌ను ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లలో విమాన టిక్కెట్లను విక్రయించనున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని ఎయిరిండియా తన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఎయిరిండియా ఈ కొత్త ఆఫర్ కేవలం ఆన్లైన్ బుకింగ్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఎవరైతే క్యారియర్ బుకింగ్ వెబ్సైట్ ఎయిరిండియా.ఇన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకుంటారో వారికి లభ్యం కానుంది. 2018 ఆగస్టు 15 వరకు ఈ సేల్ వాలిడ్‌లో ఉంటుంది. భారత్ పరిధిలో ప్రయాణం చేసేందుకే ఈ ఆఫర్ వర్తించనుందని ఎయిరిండియా తెలిపింది. ఈ డిస్కౌంట్‌ను పొందడానికి కస్టమర్లు ప్రోమో కోడ్ బాక్స్‌లో 18ఐఎన్‌డీఏఐ ప్రోమోకోడ్‌ను నమోదు చేయాల్సి ఉంది. ఎయిరిండియా డిస్కౌంట్ ఆఫర్ వివరాలు.. ఈ ఆఫర్లో ఎలాంటి నోటీసులు లేకుండా విమాన టిక్కెట్ ధరలు మారనున్నాయి. ఈ స్కీమ్‌కు ఫేర్ కండీషన్స్‌ను అప్లయ్ అవుతాయి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు, అలియెన్స్ ఎయిర్ ఫ్లైట్స్, కోడ్ షేర్ ఫ్లైట్స్‌కు ఈ డిస్కౌంట్ వర్తించదు. పరిమిత వ్యవధిలోనే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఎయిరిండియా ప్రత్యర్థి జెట్ ఎయిర్వేస్ కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ, జాతీయ విమాన టిక్కెట్లపై ‘ఫ్రీడం ఫేర్స’ అనే సేల్‌ను ప్రకటించింది. గోఎయిర్ కూడా 10 లక్షల వరకు సీట్లను రూ.1099కే విక్రయిస్తోంది. #FlyAI : Celebrate #IndependenceDay with #AirIndia and avail attractive discounts across our network. For details, pl visit https://t.co/FVMhfFHund pic.twitter.com/wijZQaD84p — Air India (@airindiain) August 9, 2018 -
క్రీడాకారులకు ఎయిరిండియా క్షమాపణ
న్యూఢిల్లీ : నేషనల్ క్యారియర్ ఎయిరిండియా.. టెన్నిస్ ప్లేయర్లను వదిలేసి గాలిలోకి ఎగిరిపోయింది. టెన్నిస్ ప్లేయర్లను ఇలా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలోనే వదిలిపోయిన ఘటనకు ఎయిరిండియా క్షమాపణ చెప్పింది. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని, తాము ఆటగాళ్లకు క్షమాపణ చెబుతున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి అన్నారు. తదుపరి అందుబాటులో ఉన్న విమానాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించడంలో ఎయిరిండియా గొప్ప వారసత్వం కలిగి ఉందని, ఆటగాళ్లకు తాము ఎక్కువ గౌరవం కూడా ఇస్తామన్నారు. పలు పీఎన్ఆర్లలో మెల్బోర్న్ విమానాన్ని దేశీయ టేబుల్ టెన్నిస్ టీమ్ బుక్ చేసుకున్నారని, పొరపాటున వీరిలో కొంతమంది ప్రయాణం ఆగిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తర్వాత విమానాలను ఏర్పాటు చేసేంతవరకు క్రీడాకారులకు ఎయిరిండియా హోటల్ సదుపాయం కూడా కల్పించినట్టు ఈ విమానయాన సంస్థ మరో ట్వీట్లో చెప్పింది. అసలేం జరిగిందంటే... ఎయిరిండియా విమానం నెంబర్. ఏఐ0308లో టిక్కెట్లను దేశీయ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ల టీమ్ బుక్ చేసుకుంది. కామన్ వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ మనీకా బాత్రాతో పాటు ఏడుగురు ప్లేయర్లను ఎయిరిండియా విమానంలోకి అనుమతించలేదు. సీట్లన్నీ బుక్ అయి ఉండటం మాత్రమే కాక, వారి పి.ఎన్.ఆర్. (ప్యాసింజర్ నేమ్ రికార్డ్) నంబర్లు సరిపోలేదని ఎయిర్ ఎండియా విమానం నిరాకరించింది. ఈ విషయంపై మనీకా బాత్రా ట్విటర్ ద్వారా తన బాధను షేర్చేసుకున్నారు. క్రీడా మంత్రి రాజ్యవర్థన్ రాథోర్, ప్రధానమంత్రి కార్యాలయానికి ఈ ట్వీట్ షేర్ చేశారు. దేశీయ టేబుల్ టెన్నిస్ టీమ్‌కు చెందిన మొత్తం 17 మంది క్రీడాకారులు, అధికారులు ఏఐ 0308 విమానంలో మెల్బోర్న్కు వెళ్లాల్సి ఉంది. మెల్బోర్న్లో మొదలౌతున్న ఐ.టి.టి.ఎఫ్. (ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్) వరల్డ్ టూర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ తాము ఎయిరిండియా కౌంటర్ వద్దకు వచ్చిన తర్వాత విమానమంతా ఓవర్‌బుక్ అయినట్టు తెలిసింది. కేవలం 10 మంది మాత్రమే ప్రయాణించడానికి వీలుందని కౌంటర్ వద్ద చెప్పారు. మిగతా ఏడుగురు క్రీడాకారులు ప్రయాణించడానికి వీలులేదు అనే సరికి, క్రీడాకారులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం అని చెప్పింది. సమాచారం వెలుగులోకి వచ్చిన తర్వాత స్పోర్ట్ డైరెక్టర్ జనరల్ నీలం కపూర్ వెంటనే స్పందించారు. కొన్ని గంటల తర్వాత మరో విమానంలో వారిని మెల్బోర్న్కు పంపించేలా కృషిచేశారు. మిగతా క్రీడాకారులకు కూడా మెల్బోర్న్ వెళ్లేందుకు బోర్డింగ్ పాస్ దొరకడంతో, మనీకా క్రీడా మంత్రికి, పీఎం ఆఫీసుకు, స్పోర్ట్స్ అథారిటీకి, నీలం కపూర్ మేడమ్‌కి కృతజ్ఞతలు చెబుతున్నట్టు మరో ట్వీట్ చేశారు. -
ఎయిరిండియా ఉద్యోగులకు గుడ్‌న్యూస్
-
ఎయిరిండియా ఉద్యోగులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, తన ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీ సీలింగ్ మొత్తాన్ని రెండింతలు చేసింది. దీంతో ఈ మొత్తం 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు పెరిగింది. జూన్ 26న ఈ మేరకు ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘2018 మే 21న జరిగిన ఎయిరిండియా లిమిటెడ్ బోర్డు మీటింగ్‌లో ఉద్యోగులకు అందించే ప్రస్తుతమున్న సీలింగ్ పరిమితిని గ్రాట్యుటీ చెల్లింపుల సవరణ చట్టం 2018 కింద 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచాలని నిర్ణయించాం. 2018 మార్చి 29 నుంచి ఇది అమల్లోకి వస్తుంది అని పేర్కొంది. ఈ ప్రకటన సుమారు 6500 మంది ఎయిరిండియా ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. అంతకముందు ఒకవేళ ఎవరికైనా గ్రాట్యుటీ 10 లక్షల కంటే ఎక్కువగా అందాల్సి ఉంటే, కేవలం 10 లక్షల రూపాయలను మాత్రమే అందించేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు గ్రాట్యుటీ మొత్తాన్ని పొందవచ్చు. ఎయిరిండియా డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం మరో మూడు లేదా నాలుగు నెలల పాటు ‘వెయిట్ అండ్ వాచ్’ పాలసీని చేపట్టాలని నిర్ణయించినట్టు ఓ సీనియర్ అధికారి చెప్పారు. మే 31తో ముగిసిన బిడ్డింగ్‌లో ఏ బిడ్డర్‌ను కూడా ఎయిరిండియా ఆకట్టుకోలేకపోయింది. అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థను ఏ ఒక్క బిడ్డర్ కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ఇంధన ధరలు పెరుగుతుండటంతో, ప్రస్తుతం డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ క్లిష్టతరమవుతుందని ఎయిరిండియా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎయిరిండియాలో 76 శాతం వాటాను విక్రయించాలనుకుంటోంది. -
ఎయిరిండియా విక్రయం రద్దైందా?
న్యూఢిల్లీ : అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనేవారే కరువయ్యారు. ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు గతంలో ఆసక్తి చూపించిన కంపెనీలు కూడా ఒక్కొక్కటిగా పక్కకి తప్పుకున్నాయి. టాటా గ్రూప్ సైతం దీన్ని కొనేందుకు విముఖత వ్యక్తం చేసింది. ఒక్క బిడ్డర్ కూడా రావడం లేదు. దీంతో ఎన్నికలకు ముందు ఎయిరిండియా అమ్మకానికి వెళ్లకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థ నిర్వహణ కోసం నిధులను సమకూర్చాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ సీనియర్ అధికారి చెప్పారు. ఎయిరిండియాలో 76 శాతం వాటా విక్రయించడంలో ప్రభుత్వం విఫలం చెందిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ రోజువారీ నిర్వహణ కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రభుత్వం త్వరలోనే నిధులను సమకూర్చబోతుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్నారు. ఈ సమావేశానికి పీయూష్ గోయల్, సురేష్ ప్రభు, నితిన్ గడ్కారీ, ఆర్థిక, ఏవియేషన్ శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. ఈ ఎయిర్‌లైన్ లాభాలను పోస్ట్ చేస్తుందని, ఏ విమానం కూడా ఖాళీగా లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తామన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా డిజ్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ చేయడానికి ఎలాంటి తొందరలేదని పేర్కొన్నాయి. అయితే త్వరలోనే ఎయిరిండియా మార్కెట్లో లిస్టింగ్‌కు రావాలని చూస్తోంది. ఈ లిస్టింగ్‌కు వచ్చే ముందే కంపెనీ లాబాలను ఆర్జించాల్సి ఉంది. ఏదైనా కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ కావాలంటే, దాని కంటే ముందు మూడు ఆర్థిక సంవత్సరాలు లాభాలను పోస్టు చేయాల్సి ఉన్న క్రమంలో ఎన్నికలకు ముందు డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌కు వెళ్లకుండా.. ప్రభుత్వం నుంచే నిధులు సమకూర్చాలని చూస్తోంది. -
ఎయిరిండియా ఉద్యోగులకు అష్టకష్టాలు
న్యూఢిల్లీ : ఎయిరిండియా సంస్థ ఉద్యోగులు అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వరుసగా మూడో నెల కూడా ఈ విమానయాన సంస్థ వేతనాల చెల్లింపుల్లో జాప్యం చేస్తోంది. ఎయిరిండియాను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవుతుండటంతో, ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంలో జాప్యం చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు మే నెల వేతన చెల్లింపు విషయంలో ఎయిరిండియా మేనేజ్మెంట్ తన స్టాఫ్‌కు ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదని తెలిసింది. ‘మే నెల వేతనాలు ఇంకా మేము పొందలేదు. వేతనాలు రాకపోగా.. ఈ విషయంపై ఇప్పటి వరకు మేనేజ్మెంట్ స్పందించలేదు. వేతన చెల్లింపులు సరియైన సమయంలో ఇవ్వకుండా ఆలస్యం చేయడం ఇది వరుసగా మూడో నెల’ అని ఓ ఉద్యోగి తన గోడును వెల్లబుచ్చుకున్నాడు. మార్చి, ఏప్రిల్ నెల వేతనాల విషయంలోనూ మేనేజ్మెంట్ ఈ విధంగానే వ్యవహరించిందని మరో ఉద్యోగి పేర్కొన్నాడు. బ్యాంకు ఆఫ్ బరోడా నుంచి తమకు మూలధన రుణాలు వచ్చిన తర్వాతనే ఏప్రిల్ నెల వేతనాలను చెల్లించారని చెప్పాడు. వేతనాలు అందక తాము పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్యోగులంటున్నారు. సాధారణంగా ఎయిరిండియా ఉద్యోగులకు వేతనాలు ప్రతి నెలా 30 లేదా 31వ తేదీల్లో చెల్లిస్తారు. కానీ గత మూడు నెలల నుంచి మేనేజ్మెంట్ ఉద్యోగులకు సరిగ్గా వేతనాలు చెల్లించడం లేదు. మే నెల వేతనాలు వచ్చే వారంలో ఉద్యోగులకు ఇచ్చే అవకాశముంటుందని ఎయిరిండియా అధికార ప్రతినిధి చెప్పినట్టు తెలిసింది. ఎయిరిండియాలో 11వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులున్నారు. కాగ, తీవ్ర రుణభారంతో ఉన్న ఎయిరిండియాను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికోసం బిడ్స్‌ను కూడా ఆహ్వానించింది. అయితే ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క బిడ్డర్ ముందుకు రావడం లేదు. ముందుగా ఇండిగో వంటి సంస్థలు కొంత ఆసక్తి చూపినప్పటికీ.. చివరికి ఏ సంస్థా కూడా బిడ్డింగ్‌లో పాల్గొనకపోవడం గమనార్హం. ఇలా ఎయిరిండియా వాటా విక్రయం విఫలం కావడం ఇది రెండోసారి. గతేడాది మార్చి ఆఖరు నాటికి ఎయిరిండియా మొత్తం రుణభారం రూ. 48,000 కోట్లుగా ఉంది. -
సరైన రేటు వస్తేనే ఎయిరిండియా విక్రయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాను సరైన ధర వస్తేనే విక్రయిస్తామని లేనిపక్షంలో విక్రయించేది లేదని కేంద్ర పౌరవిమానయాన శాఖ కార్యదర్శి ఆర్ఎన్ చౌబే స్పష్టం చేశారు. అయితే, కచ్చితంగా మంచి ధరే రాగలదని ఆశిస్తున్నట్లు వివరించారు. ఎయిరిండియా కొనుగోలు కోసం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను సమర్పించడానికి మే 31 ఆఖరు తేదీ కాగా, జూన్ 15 తర్వాత రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్‌ను జారీ చేయనున్నట్లు చౌబే చెప్పారు. ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చౌబే తెలిపారు. అత్యధికంగా బిడ్ చేసిన సంస్థ పేరు ఆగస్టు ఆఖరు కల్లా తెలుస్తుందన్నారు. భారీగా రుణాలు, నష్టాలు పేరుకుపోయిన ఎయిరిండియాలో ప్రభుత్వం 76 శాతం దాకా వాటాలు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. -
అలా అయితే ఎయిరిండియాను అమ్మం..
న్యూఢిల్లీ : తీవ్ర అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని కోసం వాటాల కొనుగోలుకు బిడ్లను సైతం కేంద్రం ఆహ్వానించింది. అయితే మంచి ధర వస్తేనే వాటాలను విక్రయిస్తామని, లేదంటే అమ్మబోమని కేంద్రం తాజాగా స్పష్టంచేసింది. బిడ్ ధర ఆమోదయోగ్యంగా.. అంచనావేసిన ఫ్లోర్ ప్రైస్‌ను చేరుకునే విధంగా ఉంటేనే అమ్ముతామని, లేకపోతే ఎయిరిండియాను విక్రయించబోమని విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్ చౌబే అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే డిజ్ఇన్వెస్ట్మెంట్ నిబంధనల కింద ఎయిరిండియా నికర విలువను లేదా మినిమమ్ ఫ్లోర్ ప్రైస్‌ను లెక్కించడానికి ఎంటర్ప్రైజ్ వాల్యుర్స్ను నియమించుకుందని తెలిపారు. ప్రతి బిడ్డింగ్ ప్రక్రియ మాదిరిగానే ఫ్లోర్ ప్రైస్ కంటే ఎక్కువగా వచ్చిన బిడ్లనే ఆమోదిస్తామని చెప్పారు. ఆమోదయోగ్యంగా బిడ్లు లేకపోతే, ఎయిరిండియాను తాము విక్రయించమని తేల్చి చెప్పారు. దశాబ్దాలుగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్న ఎయిరిండియాకు వేల కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నాయి. దీంతో ఆ భారం నుంచి బయటపడేందుకు ఎయిరిండియాను ప్ర్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎయిరిండియాలో 76శాతం వాటాను విక్రయించేందుకు బిడ్లను కూడా ఆహ్వానించింది. అయితే వాటా కొనుగోలుకు ఎవరూ ముందుకు రావట్లేదు. ఎయిరిండియాను కొనుగోలు చేయాలనే రేసు నుంచి ఇండిగో, జెట్ ఎయిర్వేస్, టాటాగ్రూప్లు వెనక్కి తగ్గాయి. కేంద్ర విధించిన నిబంధనలతో ఈ సంస్థలు తాము కొనుగోలు చేయలేమని ప్రకటించాయి. ఎయిరిండియాలో వాటా కొన్న వారు తమ సొంత వ్యాపారాలతో దీన్ని విలీనం చేయరాదని ప్రభుత్వం పేర్కొంది. దీంతో పాటు ఉద్యోగులను తగ్గించకూడదని ఇలా ఇతరత్రా నిబంధనలు విధించింది. -
విమాన ఆలస్యం.. వామ్మో అంత జరిమానా!
న్యూఢిల్లీ : దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాకు కష్టాలు వెన్నంటే ఉన్నట్టు ఉన్నాయి. విమాన ఆలస్యమైనందున ఈ విమానయాన సంస్థ భారీ మొత్తంలో నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వస్తోంది. మే 9న ఢిల్లీ నుంచి చికాగో బయలుదేరిన విమానం ఆలస్యమైనందుకు 323 మంది ప్రయాణికులకు 8.8మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.59కోట్లు చెల్లించాల్సి వస్తోంది. విమాన సిబ్బందికి సంబంధించిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ వల్ల ఈ ఆలస్యం ఏర్పడింది. మే 9న ఢిల్లీ నుంచి చికాగో బయలుదేరిన ఏఐ 127 విమానం 16 గంటల్లో చికాగో చేరుకోవాల్సి ఉంది. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల విమానాన్ని చికాగోకు సమీపంలోని మిల్వాకీ ప్రాంతానికి తరలించారు. మిల్వాకీ నుంచి చికాగోకు విమానంలో వెళ్లడానికి 19 నిమిషాలే సమయం పడుతుంది. ఆ సమయానికే ఆ విమానం 16 గంటలు ప్రయాణించింది. డీజీసీఏ నిబంధలన ప్రకారం విమానంలోని సిబ్బంది డ్యూటీ గంటల కంటే ఎక్కువ పనిచేయకూడదు. దీంతో విమానంలోని సిబ్బంది డ్యూటీ గంటలు అయిపోయాయి. మరోవైపు నిబంధనలనుసరించి వారికి ఆ రోజుకు ఒక్కసారి మాత్రమే ల్యాండింగ్‌కు అనుమతి ఉంది. ఈ కారణాలతో మరో మార్గం లేక ఎయిరిండియా ఆ విమానం కోసం కొత్త సిబ్బందిని రోడ్డుమార్గంలో మిల్వాకీకి తరలించింది. ఈ మొత్తం ప్రక్రియ వల్ల ఆ విమానం చికాగో చేరుకోవడానికి దాదాపు ఆరు గంటలు ఆలస్యమైంది. ఇన్ని గంటల పాటు కూడా ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారు. ఆరు గంటల ఆలస్యంగా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చింది. అంతటితో సమస్య ముగిసిపోయిందనుకున్న ఎయిరిండియా మరో పెద్ద సమస్యే ఎదురైంది. అమెరికా నిబంధనల ప్రకారం ప్రయాణికులు విమానంలో ఉండగా నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం నిలిపి ఉంచితే విమాన ఆలస్యంపై ఆ విమానయాన సంస్థ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఒక్కో ప్రయాణికుడికి 27,500డాలర్ల పరిహారం చెల్లించాలి. అంటే ఆ విమానంలో 323 మంది ప్రయాణికులు ఉన్నందున మొత్తం కలిపి 8.8మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారీ మొత్తంలో పెనాల్టీ చెల్లించాల్సి వస్తున్నందున డీజీసీఏ నిబంధనల్లో కొన్ని మార్పులు కోరుతూ ఎయిరిండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ ఫిర్యాదు మే 15న ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణలో తాము వాతావరణ ప్రతికూలతతోనే విమానాన్ని దారి మరలించాల్సి వచ్చిందని ఎయిరిండియా తెలిపింది. -
ఎయిరిండియాలో ఆ సీట్లు ఇక కాస్ట్లీనే!
మీ కుటుంబమంతా కలిసి ఒకే దగ్గర కూర్చుని ఎయిరిండియా విమానంలో ప్రయాణించాలనుకుంటున్నారా...? అయితే ఇక ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సిందేనట. సదూర విమానాల్లో ముందు వరుస సీట్లకు ఇప్పటివరకు ఛార్జీలు విధిస్తున్న ఎయిరిండియా.. తాజాగా మధ్య సీట్లకు, విండో సీట్లకు, ఎక్కువ వరుస సీట్లకు ఛార్జీలు విధించాలని నిర్ణయించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలన్నింటికీ ఈ ఛార్జీలు వర్తిస్తాయని ఎయిరిండియా పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం పలు రూట్లలో సీటు సెలక్షన్ ఫీజును లిస్ట్ చేస్తూ ట్రావెల్ ఏజెంట్లకు ఓ సర్క్యూలర్ జారీచేసింది. దేశీయ విమానాల్లో మధ్య సీట్లకు ఫీజు రూ.100గా ఎయిరిండియా నిర్ణయించింది. విండో సీటు కోరుకుంటే రూ.200 చెల్లించాల్సి ఉందని తెలిపింది. అయితే ఖాఠ్మాండు ప్రయాణాలకు విండో సీట్లకు రూ.100నే ఛార్జీగా విధించనున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వరుసకు ఈ ఫీజు మరింత అధికంగా ఉండనుందని ఎయిరిండియా పేర్కొంది. అయితే ఇది మార్గాలను బట్టి ఉంటుందని తెలిపింది. సీట్ల ఎంపికకు అదనపు ఛార్జీలు విధించడాన్ని కుటుంబ ఫీజుగా ఎయిరిండియా పరిగణిస్తున్నట్టు చెప్పింది. ఈ ఛార్జీలు ఎయిర్‌లైన్స్ రెవెన్యూలు పెంచడానికి దోహదం చేయనున్నాయని తెలిపింది. మధ్య, ఇతర సీట్ల ఎంపికపై ఛార్జీల విధింపును ప్రయాణికులు ఆన్లైన్లో టిక్కెట్ చేసుకునేటప్పుడు లేదా వెబ్ చెక్-ఇన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. -
ప్రభుత్వానికి మరో దెబ్బ : జెట్ ఎయిర్వేస్ కూడా..
ముంబై : కేంద్ర ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. అప్పుల కుప్పలో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియాను కొనుగోలు చేసే రేసు నుంచి ఇండిగో తప్పుకున్న అనంతరం, తాజాగా జెట్ ఎయిర్వేస్ కూడా తాము ఈ కొనుగోలు ప్రతిపాదన నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. ఎయిరిండియా కొనుగోలు కోసం తాము బిడ్ దాఖలు చేయడం లేదని జెట్ ఎయిర్వేస్ మంగళవారం స్పష్టం చేసింది. దీంతో ఎయిరిండియాను ప్రైవేటీకరణ చేయాలనే ప్రభుత్వ ఆలోచనకు కాస్త ప్రతికూలతలే ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. ‘ఎయిరిండియాను ప్రైవేటీకరణ చేయాలనే ప్రభుత్వ ఆలోచనను మేము స్వాగతిస్తున్నాం. ఇది చాలా కీలక నిర్ణయం’ అని జెట్ ఎయిర్వేస్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమిత్ అగర్వాల్ అన్నారు. ఇన్ఫర్మేషన్ మెమోరాండంలో ఆఫర్ చేసే నిబంధలను పరిశీలించిన తాము, ఈ ప్రక్రియలో పాల్గొనకూడదని నిర్ణయించామని చెప్పారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఎయిర్‌లైన్ మార్కెట్లో ఎయిరిండియా మెల్లమెల్లగా తన మార్కెట్ షేరును కోల్పోయిన సంగతి తెలిసిందే. తక్కువ ధర గల ప్రైవేట్ ప్లేయర్స్‌కు ఎయిరిండియా తన మార్కెట్ షేరును వదులుకుంది. దీంతో ఎయిరిండియా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం ఈ ఎయిర్‌లైన్‌కు రూ.52వేల కోట్ల మేర అప్పులున్నాయి. ప్రభుత్వం ఇటీవలే ఈ క్యారియర్‌లో ఉన్న 76 శాతం వాటాలను విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఎయిరిండియాను కొనుగోలు చేయాలని ప్లాన్ నుంచి తప్పుకున్న ఇండిగో దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ. కానీ ఈ సంస్థ ఎయిరిండియా అంతర్జాతీయ రూట్లపై ఆసక్తి చూపించినప్పటికీ, దేశీయ కార్యకలాపాలపై తమకెలాంటి ఆసక్తి లేదని ప్రకటించేసింది. దీంతో తాము ఎయిరిండియా కొనుగోలు రేసు నుంచి తప్పుకుంటున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ కూడా ఇదే మాదిరి తాము ఎయిరిండియా కొనుగోలు చేసేందుకు బిడ్ దాఖలు చేయబోమని ప్రకటించింది. -
ఎయిరిండియా అమ్మకంపై స్వామి సంచలన వ్యాఖ్యలు
ఎయిరిండియా అమ్మకంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తన సొంత ప్రభుత్వంపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిరిండియా ప్రతిపాదిత సేల్కు వ్యతిరేకంగా తను ప్రైవేట్ క్రిమినల్ లా కంప్లైంట్ దాఖలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ఎయిరిండియా సేల్‌లో మరో కుంభకోణం చోటు చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఎయిరిండియాలో 76 శాతం వాటాలను అమ్మాలని కేంద్రం సిద్ధమవుతున్న క్రమంలో ఆయన ఈ ఫిర్యాదు నమోదుచేయడం సంచలనానికి తెరతీసింది. అంతేకాక ఈ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియతో ప్రైవేట్ ప్లేయర్ల చేతిలోకి ఎయిరిండియా యాజమాన్య హక్కులు వెళ్లనున్నాయి. ప్రస్తుతం ప్రతిపాదించిన ఎయిరిండియా సేల్ మరో కుంభకోణం చోటు చేసుకుంటుందని, ఎవరి ఈ ప్రక్రియ చేస్తున్నారో, ఏం చేస్తున్నారో తాను గమనిస్తున్నానని, ఒకవేళ ఏదైనా నేరం కంటపడితే ప్రైవేట్ క్రిమినల్ లా కంప్లైంట్ దాఖలు చేయనున్నట్టు స్వామి హెచ్చరించారు. ఎయిరిండియా విక్రయంపై మొదటి నుంచి స్వామి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. రూ.52వేల కోట్లకు పైగా రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియాకు 2012లో యూపీఏ ప్రభుత్వం రూ.30వేల కోట్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ కల్పించింది. ఈ నిధులతో సంస్థ నెట్టుకొస్తూ ఉంది. రెండు రోజుల క్రితమే కంపెనీలో వ్యూహాత్మక వాటా విక్రయానికి సంబంధించిన ప్రాథమిక సమాచార పత్రాన్ని కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం 76 శాతం వాటాలు విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. అలాగే, లాభాల్లో ఉన్న చౌక విమాన సేవల విభాగం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, సింగపూర్‌కి చెందిన ఎస్‌ఏటీఎస్‌తో కలిపి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ ఏఐఏటీఎస్ఎల్లో కూడా డిజిన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. -
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి కోల్కత్తా వెళ్లే ఎయిరిండియా విమానానికి బాంబు ముప్పు ఉందంటూ విమానయాన సంస్థ కాల్ సెంటర్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా విమానయాన సంస్థ అప్రమత్తమైంది. ఆకాశంలో ఎగురుతున్న ఆ విమానాన్ని వెంటనే వెనక్కి రప్పించి, దించేశారు. ఆ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం ప్రారంభించారు. ఢిల్లీ నుంచి కోల్కత్తా వెళ్లే ఏ1-020 విమానానికి ఈ బాంబు ముప్పు ఉందంటూ కాల్ వచ్చిందని తెలిసింది. ముంబైలోని ఎయిరిండియా సదర్‌ల్యాండ్ గ్లోబల్ సర్వీసెస్‌కు ఈ కాల్ ఇచ్చింది. వెంటనే ఆ విమానాన్ని ఐజీఐకి తరలించారు. ఆ విమానంలో 248 ప్రయాణికులు, 11 క్రూ సిబ్బంది ఉన్నాట్టు తెలిసింది. విమానంలో ప్రయాణికులను తన హ్యాండ్ లగేజీతోనే డీబోర్డు చేశారు. సంబంధిత అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనిపై ఫిర్యాదును ముంబై పోలీసులకు కూడా ఫార్వర్డ్ చేశారు. -
విమానంలో కొలీగ్ చెంప చెళ్లుమనిపించాడు
ముంబై : వరుస వివాదాలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. ఎయిరిండియా క్యాబిన్‌కు చెందిన ఓ క్రూ సభ్యుడు, తన జూనియర్ కొలిగ్ చెంప చెల్లుమనిపించాడు. దీనికి గల కారణం ఆన్‌బోర్డులో ఉన్న శాకాహార ప్రయాణికుడికి, మాంసాహార భోజనం అందజేయడమే. ఈ సంఘటన న్యూడిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళే విమానంలో చోటు చేసుకుంది. మార్చి 17న ఈ సంఘటన చోటు చేసుకుందని, దీనిపై అంతర్గత విచారణ ప్రారంభించినట్టు ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. కేబిన్ అటెండెంట్ అయిన అమ్మాయి పొరపాటున న్యూఢిల్లీ-ఫ్రాంక్ఫర్ట్ విమానంలోని బిజినెస్ క్లాస్ ప్రయాణికుడికి శాకాహార భోజనం బదులు మాంసాహార భోజనం అందించింది. ఈ పొరపాటును గుర్తించిన ప్రయాణికుడు, క్యాబిన్ సూపర్వైజర్కు సమాచారం అందించాడు. కానీ ఎలాంటి ఫిర్యాదును దాఖలు చేయలేదు. తర్వాత ఆ అమ్మాయి, ప్రయాణికుడి వద్దకు వెళ్లి క్షమాపణలు కూడా కోరింది. ఆ భోజనాన్ని మార్చి వేరే భోజనాన్ని అందించింది. కానీ మరోసారి క్రూ సూపర్వైజర్ ఈ పొరపాటును రచ్చరచ్చ చేసి, ఆ అమ్మాయి చెంప చెల్లుమనిపించాడు. కానీ దీనిపై ఏ మాత్రం ప్రతీకారం తీర్చుకోకుండా.. ఆ అమ్మాయి మొత్తం ఘటనపై ఎయిరిండియా ఇన్‌ఫ్లైట్ సర్వీసు డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేసింది. తమకు న్యూఢిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వెళ్లే విమానం ఏఐ 121 కేబిన్ క్రూ నుంచి ఫిర్యాదు అందిందని, దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. -
ఎయిరిండియా అకౌంట్ హ్యాక్, విమానాలన్నీ రద్దు
ముంబై : ఎయిరిండియా అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఉదయం చాలా గంటల పాటు ఎయిరిండియా ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ బారిన పడినట్టు ఈ విమానయాన సంస్థ తెలిపింది. హ్యాక్ అయిన తమ ట్విటర్ అకౌంట్ @airindiain లో టర్కిష్ భాషలో మెసేజ్‌లు పోస్టు అవుతున్నాయని ఎయిరిండియా అధికార ప్రతినిధి చెప్పారు. తమ అకౌంట్లో పోస్టు అయిన హానికరమైన కంటెంట్ అంతటిన్నీ తాము తొలగించనట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్విటర్ అకౌంట్ రిస్టోర్ అయిందని వెల్లడించారు. హ్యాకింగ్‌కు గురైన ఎయిరిండియా అకౌంట్లో పోస్టు అయిన ఒక మెసేజ్ ఈ విధంగా ఉంది. ''చివరి నిమిషంలో ఎంతో ముఖ్యమైన ప్రకటన. మా అన్ని విమానాలను రద్దు చేశాం. ఇప్పటి నుంచి, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో మేము ఎగరాలనుకుంటున్నాం'' అని పోస్టు అయింది. ఈ మెసేజ్ చూసిన ఎయిరిండియా ట్విటర్ ఫాలోవర్స్ అందరూ ఒక్కసారిగా షాకింగ్‌కు గురయ్యారు. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను ఇటీవల ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిరిండియా అధికారిక అకౌంట్లో ఈ మెసేజ్ కనిపించడం తీవ్ర గందరగోళానికి తెరతీసింది. ప్రస్తుతం ఎయిరిండియా ట్విటర్ అకౌంట్‌కు 1,46,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. -
ఈ విమానంలో అంతా మహిళా సిబ్బందే
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేషనల్ క్యారియర్ ఎయిరిండియా ఓ ప్రత్యేక విమానాన్ని నడుపుతోంది. అందరూ మహిళా సిబ్బందితోనే కోల్కత్తా-డిమాపూర్-కోల్కత్తా సెక్టార్లో ఈ విమానాన్ని ఆపరేట్ చేస్తోంది. ఎయిర్‌లైన్స్ విడుదల చేసిన ప్రకటనలో విమానం ఏఐ709, ఎయిర్‌బస్ 319కు కాక్‌పిట్ సిబ్బందిగా కెప్టెన్ ఆకాంక్ష వర్మ, కెప్టెన్ సతోవిసా బెనర్జీ వ్యవహరిస్తున్నారని, క్యాబిన్ సిబ్బందిగా డి భుటియా, ఎంజీ మోహన్‌రాజ్, టీ ఘోస్, యతటిలి కత్‌లు ఉన్నారని తెలిపింది. ఎయిరిండియా జనరల్ మేనేజర్, పర్సనల్ నవ్‌నీత్ సిధు, ఇతర సీనియర్ సిబ్బంది కలిసి ఈ విమానానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వీకంతా పలు ఈవెంట్లను ఈ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే తొలిసారి అంతా మహిళా సిబ్బందితో కూడా విమానాన్ని 1985లో ఎయిరిండియా నడిపింది. అత్యంత పొడవైన మార్గం ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో-ఢిల్లీ రూట్లో కూడా అంతా మహిళా సిబ్బందితో ఎయిరిండియా ఓ ప్రత్యేక విమానాన్ని నడిపి, ప్రపంచ రికార్డును సాధించింది. -
షట్‌డౌన్‌తో మనకేం ఇబ్బంది లేదు
న్యూఢిల్లీ : అమెరికాలో తాజాగా ఏర్పడ్డ షట్‌డౌన్ పరిస్థితుల వల్ల భారత వియానయాన రంగానికి కొత్తగా వచ్చే ఇబ్బందులు ఏమీ లేవని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకూ భారత్ నుంచి అమెరికా వెళ్లే ఒక్క విమాన సర్వీసు కూడా రద్దు కాలేదని విమానయాన రంగానికి చెందిన అధికారులు చెబుతున్నారు. షట్‌డౌన్ ప్రభావం ప్రయాణికులు మీద ఇప్పటికిప్పుడు పడదని కాక్స్ అండ్ కిక్స్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే ఈ పరిస్థితి సుధీర్ఘకాలం కొనసాగితే మాత్రం ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు. అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రకటించిన తరువాత కూడా విమానయాన రంగం మీద ఎటువంటి ప్రభావం పడలేదని చెప్పారు. విమానాలన్నీ షెడ్యూల్ టైమ్‌కు బయలుదేరుతున్నాయని, ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు తమ సేవలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇదిలావుంటే.. సమీప భవిష్యత్తులో మాత్రం అమెరికాలో పర్యటించాలనుకునేవారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని యాత్రాడాట్‌కామ్ సీఓఓ శరత్ దాల్ తెలిపారు. భారత ప్రభుత్వ వియానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాత్రం అమెరికాకు వియానయాన సేవలు కొనసాగిస్తామని ప్రకటించింది. అమెరికాలోని ప్రధాన పట్టణాలైన శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో, వాషింగ్టన్, న్యూయార్క్‌లకు విమానాలను నడుపుతోంది. -
నాలుగు కంపెనీలుగా ఎయిరిండియా
న్యూఢిల్లీ : నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియాను అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ అమ్మకానికి ముందే ఎయిరిండియాను నాలుగు కంపెనీలుగా విడదీయాలని కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇలా విడదీసిన ప్రతి కంపెనీలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కింద కనీసం 51 శాతం ఆఫర్ చేయాలని చూస్తుందని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. కోర్ ఎయిర్‌లైన్ బిజినెస్, రీజనల్ ఆర్మ్, గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఇంజనీరింగ్ ఆపరేషన్లుగా విడదీయాలని ప్రభుత్వం చూస్తుందని రిపోర్టు పేర్కొంది. కోర్ ఎయిర్‌లైన్ బిజినెస్‌ల్లో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, లో-కాస్ట్ ఓవర్సీస్ ఆర్మ్ ఉండనుంది. 2018 చివరి వరకు ఈ ప్రక్రియ ముగియనుందని జూనియర్ ఏవియేషన్ మంత్రి జయంత్ సిన్హా చెప్పినట్టు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఇటీవలే ఎయిరిండియాలో విదేశీ కంపెనీలు 49శాతం పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఎయిరిండియాలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతిపాదించిన వాటాల విక్రయ ప్రక్రియకు తుది విధివిధాలను మంత్రుల గ్రూప్ నిర్ణయిస్తోంది. త్వరలోనే బిడ్డర్లను కూడా ఆహ్వనించనున్నట్టు తెలుస్తోంది. కాగ, 55 వేల కోట్లతో ఎయిరిండియా అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇప్పటికే రూ.23 వేల కోట్లను భరించింది. -
'వాళ్ల ఉద్యోగాలు పోనివ్వం'
న్యూఢిల్లీ : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాదిరి ఎయిరిండియాను అవ్వాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని సివిల్ ఏవియేషన్ మంత్రి అశోక్ గణపతిరాజు చెప్పారు. ఎయిరిండియా ఎప్పటికీ దేశానికి సేవ చేసేలా ఉండేలా చేయాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఎయిరిండియాలో పనిచేసే ఎవరూ కూడా ఉద్యోగం కోల్పోవడానికి వీలులేదని అశోక్ గణపతిరాజు లోక్‌సభలో చెప్పారు. ఈ నేషనల్ క్యారియల్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.'' ఎయిరిండియాలో పనిచేసే ఏ ఒక్కరూ నిరుద్యోగులుగా మారాలని కోరుకోవడం లేదు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాదిరి ఎయిరిండియా కావాలనుకోవడం లేదు. ఎయిరిండియా దేశానికి, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. అతి పైపై ఎత్తులకు ఇంకా ఎగరాలి'' అని ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన చెప్పారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటుచేశామని, ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ఈ కమిటీ చూస్తుందని తెలిపారు. ఈ ప్యానల్‌కు ఎంపీలతో సహా సలహాలు ఇవ్వొచ్చని చెప్పారు. జూన్ 28న ఎయిరిండియాలోని పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ తుది పద్ధతులను ఆర్థికమంత్రి నేతృత్వంలోని మంత్రులే నిర్ణయిస్తారని అశోక్ గణపతి రాజు పేర్కొన్నారు. ఇప్పటికే ఎయిరిండియా రుణభారం రూ.52వేల కోట్లకు చేరుకుంది. రుణాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థను ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. -
ఎయిరిండియా ఆహారంలో బొద్దింక
న్యూఢిల్లీ : ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా మరో ఇరకాటంలో పడింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రీమియం ప్యాసెంజర్ల ఎయిరిండియా లాంజ్ ఆహార ప్లేటులో బొద్దింక దర్శనమిచ్చింది. ఈ విషయాన్ని ప్యాసెజంర్ తన ట్విట్టర్ అకౌంట్లో ఫిర్యాదు చేశారు. ''డియర్ ఎయిరిండియా.. ఫస్ట్ క్లాస్ ప్యాసెంజర్లు, బిజినెస్‌ల కోసం వాడే మీ ఢిల్లీ వీఐపీ లాంజ్‌కు సర్వ్ చేసిన ఫుడ్‌లో బొద్దింక వచ్చింది. ఇది చాలా అసహ్యకరం'' అంటూ హరీందర్ బవేజ ట్వీట్ చేశారు. బొద్దింక వచ్చిన తన ప్లేటును కూడా ఈ ట్వీట్‌కు పోస్టు చేశారు. ఈ సంఘటనపై వెంటనే స్పందించిన ఎయిరిండియా తన మైక్రోబ్లాగింగ్ సైట్లో క్షమాపణ చెప్పింది. సరియైన చర్యలు తీసుకోవాలని వెంటనే కేటరింగ్ సర్వీసెస్ ప్రొవైడర్‌ను ఆదేశించింది. ''ఇది విన్నందుకు చాలా బాధగా ఉంది. మిస్ హరీందర్... టర్మినల్ 3 వద్ద ఉన్న ఏజెన్సీ మేనేజింగ్ లాంజ్‌ను మేము అలర్ట్ చేశాం. వెంటనే తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ సంఘటనపై మేము చాలా చింతిస్తున్నాం. క్షమించండి'' అంటూ పలు ట్వీట్లను చేసింది. ఈ లాంజ్‌లో కేటరింగ్ సర్వీసులు అందించే సంస్థ ఎయిరిండియా సబ్సిడరీ హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. Dear @airindiain cockroaches on food plates at your Delhi Lounge for biz and first class passengers. Disgusting pic.twitter.com/LEy9GtrgTY — Harinder Baweja (@shammybaweja) December 20, 2017 -
ఎయిర్ ఇండియా కొత్త సీఎండీ ఈయనే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయానసంస్థ ఎయిర్ ఇండియాకు కొత్త సీఎండీగా రాజీవ్ బన్సల్ ఎంపికయ్యారు. ఎయిర్ ఇండియా ఛైర్మన్ అశ్వని లోహానీ రైల్వే బోర్డ్ ఛైర్మన్ గా నియమితులుకావడంతో ఆయన స్థానంలోరాజీవ్ నియమితులయ్యారు. పెట్రోలియం మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న బన్సల్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత బాధ్యతలకు అదనంగా ఈ బాధ్యతలను ఆయన చేపట్టనున్నారు. గతంలో విమానయాన మంత్రిత్వశాఖ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం కూడా బన్సల్ కు ఉంది. పెట్రోలియం మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి, ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉన్న రాజీవ్ బన్సల్‌ను తాత్కాలిక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్టు కేబినెట్ నియామకాల కమిటీ తెలిపింది. తదుపరి ఆదేశాలవరకు 3 నెలలు పాటు ఆయన ఈ బాధ్యతల్లోవుంటారని పేర్కొంది. కాగా రైల్వేలో వరుస ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వే బోర్డు ఛైర్మన్ అశోక్ మిట్టల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయనస్థానంలో ఎయిరిండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అశ్వని లోహానిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా విక్రయానికి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. -
టీడీపీ ఎంపీ జేసీపై నిషేధం
ముంబై/విశాఖపట్నం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. గురువారం తమ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి నందుకు జేసీని తమ విమానాల్లో ప్రయాణానికి అనుమతించబోమని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఆ వెంటనే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, స్పైస్‌జెట్, జెట్‌ఎయిర్‌వేస్‌లు కూడా జేసీపై నిషేధం విధించాయి. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గతంలో ఎయిరిండియా సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించి నిషేధానికి గురైన విషయం తెలిసిందే. కొన్ని రోజుల తర్వాత ఎయిరిండియా ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసింది. -
సాక్షికి ఎయిర్ ఇండియా నజరానా
రియో 2016 ఒలింపిక్స్ లో కోట్లాది భారతీయుల కలను సాకారం చేసిన భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కు ఎయిర్ ఇండియా మరో అరుదైన బహుమతిని ప్రకటించింది. మహిళల ఫ్రీ స్టైల్ 58 కిలోల రెజ్లింగ్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నహరియాణా క్రీడాకారిణి సాక్షి మాలిక్ (23 ) విజయానికి గుర్తుగా నజరానాను అందించనుంది. ఒక సంవత్సరంపాటు వర్తించేలా ఏదైనా రెండు ప్రదేశాలకు, రెండు బిజినెస్ క్లాస్ రిటన్ టికెట్స్ ను (సాక్షి, ఆమెతోపాటు మరొకరికి) ఉచితంగా అందిస్తున్నట్టు శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. విమానంలో ప్రయాణించే క్రీడాకారిణి కావాలని కలలు కన్న సాక్షిని తాము ఇలా సన్మానించనున్నట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇది తమకు గర్వకారణమని ఎయిర్ ఇండియా సీఎండీ అశ్విన్ లోహాని రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్ లో తొలి పతకం సాధించిన సాక్షి మాలిక్ పై ఇప్పటికే ఒకవైపు అభినందనల వెల్లువ, మరోవైపు భారీ నజరానాలు అందుతున్నాయి. హర్యానా ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదుతో పాటు ప్రభుత్వం ఉద్యోగం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రూ.20 లక్షల ప్రత్యేక అవార్డు, రైల్వేశాఖ రూ.60 లక్షలు ఇవ్వనుంది. అటు భారత ఒలింపిక్ సమాఖ్య తొలిసారిగా కాంస్య పతక విజేతకు రూ.20 లక్షలు బహుమతిని ప్రకటించింది. వీటితో పాటు రియో ఒలింపిక్స్ కు సౌహార్ద్ర రాయబారిగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రూ. లక్ష అందజేయనున్నారు. 2014 లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా సాక్షి రజత పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. #AI is happy to offer two Business class return tickets to the pride of Nation,#SakshiMalik.You made us proud.#Rio2016. — Air India (@airindiain) August 19, 2016 -
బ్యాంక్ ఆఫ్ బరోడాలో పీవో పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడా 400 పీవో పోస్టులు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా.. బరోడా మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌తో కలిసి 9 నెలల పోస్టుగ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసినవారిని జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్/ స్కేల్–1 ప్రొబేషనరీ ఆఫీసర్‌గా నియమిస్తారు. ఉద్యోగంలో చేరిన వెంటనే మూడు నెలల వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ (డబ్ల్యూఐఎల్) పేరుతో శిక్షణ ఇస్తారు. దీన్ని పూర్తిచేసుకున్నవారికి మణిపాల్ యూనివర్సిటీ.. పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తుంది. అర్హత: ఆగస్టు 31, 2016 నాటికి 60 శాతం (ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు 55 శాతం) మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్/బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. వయోపరిమితి: ఆగస్టు 1, 2016 నాటికి కనీసం 20 ఏళ్లు ఉండాలి. 28 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. దివ్యాంగులు (ఎస్సీ, ఎస్టీ), (ఓబీసీ), (జనరల్)కు వరుసగా 15 ఏళ్లు, 13 ఏళ్లు, 10 ఏళ్లు సడలింపు ఇస్తారు. ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్), సైకోమెట్రిక్ అసెస్మెంట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వూ్య ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ (బ్యాంకింగ్ ఇండస్ట్రీ సంబంధిత), ఇంగ్లిష్‌ల నుంచి ఒక్కో విభాగంలో 50 ప్రశ్నల చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా ఒక్కో విభాగానికి 50 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులు కేటాయిస్తారు. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. డిస్క్రిప్టివ్ టెస్ట్: ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో నిర్దేశిత మార్కులు సాధించినవారికి 30 నిమిషాల వ్యవధిలో ఆన్లైన్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇది డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో రెండు ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 50. అభ్యర్థులు ప్రతి టెస్ట్‌లోనూ నిర్దేశిత మార్కులు, మొత్తం మార్కులు సాధించాల్సి ఉంటుంది. మార్కులు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వూ్య నిర్వహిస్తారు. సైకోమెట్రిక్ టెస్ట్ అర్హత పరీక్ష మాత్రమే. ఆన్లైన్ ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్; గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. కోర్సు ఫీజు: అన్నీ కలుపుకుని రూ.3.45 లక్షలు. కోర్సుకు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి 8 శాతం వడ్డీకి బ్యాంక్ ఆఫ్ బరోడా విద్యా రుణం మంజూరు చేస్తుంది. దీన్ని అభ్యర్థులు ఏడేళ్లలో (84 నెలల్లో) నెలవారీ వాయిదాల్లో చెల్లించాలి. దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.100, ఇతరులు రూ.600 క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/ఆన్లైన్ ద్వారా దరఖాస్తు రుసుం చెల్లించాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 2, 2016 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు రుసుం చెల్లింపు తేదీలు: ఆగస్టు 2 – 21 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 21, 2016 కాల్ లెటర్స్ డౌన్లోడ్: సెప్టెంబర్ 2016 పరీక్ష తేది: సెప్టెంబర్ 25, 2016 వెబ్సైట్: www.bankofbaroda.co.in, http://ibps.sifyitest.com/bmsbpojaug16/ మిలటరీ నర్సింగ్ సర్వీసులోకి..మహిళలకు ఆహ్వానం సైన్యంలోని వైద్య విభాగంలో పనిచేయాలనే ఆసక్తి గల మహిళా అభ్యర్థులకు అద్భుత అవకాశం అందుబాటులోకి వచ్చింది. షార్ట్ సర్వీస్ కమిషన్డ్ (ఎస్సెస్సీ) ఆఫీసర్ల నియామకానికి మిలటరీ నర్సింగ్ సర్వీస్(ఎంఎన్ఎస్)–2016 నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు.. విద్యార్హత, రిజిస్ట్రేషన్: ఎంఎస్సీ(నర్సింగ్)/పోస్ట్ బేసిక్ (పీబీ) బీఎస్సీ(నర్సింగ్)/బీఎస్సీ(నర్సింగ్)తోపాటు స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నర్స్మిడ్వైఫ్గా నమోదు కావాలి. గమనిక: ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ కాపీలను ఇంటర్వ్యూ కి తీసుకురావాలి. వయసు: 1981 ఆగస్టు 2 నుంచి 1995 ఆగస్టు 3 వరకు (ఈ మధ్య కాలంలో) జన్మించినవారు అర్హులు. ఫిజికల్ ఫిట్నెస్: వైద్య పరీక్షలు జరిగే తేదీ నాటికి గర్భిణిగా ఉన్నవారిని ‘టెంపరర్లీ మెడికల్లీ అన్‌ఫిట్’గా పరిగణిస్తారు. అంటే వారిని సర్వీసులోకి తీసుకోరు. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ కి, మెడికల్ టెస్ట్ రాత పరీక్ష: సెప్టెంబర్ మొదటి/రెండో వారంలో ఉంటుంది. పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం వివరాలను ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో వెల్లడిస్తారు. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. వీటిని నర్సింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటలిజెన్స్‌పై రూపొందిస్తారు. నెగెటివ్ మార్కులు ఉండవు. ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్: అక్టోబర్‌లో నిర్వహిస్తారు. ఢిల్లీలో జరిగే ఈ ఇంటర్వ్యూలకి ‘ఒక్కో పోస్టుకు ముగ్గురికి మించకుండా’ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వూ్య, వైద్య పరీక్షలకు 2 నుంచి 5 రోజులు పడుతుంది. ఈ సమయంలో వసతి బాధ్యత అభ్యర్థులదే. ఇంటర్వూ్యలో కనబరిచిన ప్రతిభ, వైద్య పరీక్షల ఫలితాల ఆధారంగా అభ్యర్థుల తుది జాబితాను రూపొందిస్తారు. వైవాహిక స్థితి: అవివాహిత/వివాహిత/విడాకులు తీసుకున్న లేదా చట్టబద్ధంగా విడిపోయిన/వితంతువు ఉద్యోగ కాల వ్యవధి: ఎస్సెస్సీ ఆఫీసర్‌గా ఎంపికైతే తొలుత ఐదేళ్లు సేవలందించాలి. ఈ వ్యవధిని పూర్తి కాలానికి (5+5+4=14 ఏళ్లకు) పొడిగించే అవకాశం ఉంది. వీళ్లు రెగ్యులర్ ఆఫీసర్ల మాదిరిగా దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. ఫలానా ప్రాంతంలో పోస్టింగ్ కావాలని కోరే అవకాశం (ఆప్షన్) తొలి ఐదేళ్లలో ఇవ్వరు. జీతభత్యాలు: ప్రి కమిషనింగ్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక లెఫ్టినెంట్ ర్యాంక్ ఇస్తారు. ఆ సమయంలో నెలకు బేసిక్ రూ.15,600; గ్రేడ్ పే రూ.5,400; మిలటరీ సర్వీస్ పే రూ.4,200; డీఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. పదోన్నతులు: ఎస్సెస్సీ ఆఫీసర్లు తొలుత ‘లెఫ్టినెంట్’గా; 3 ఏళ్ల తర్వాత ‘కెప్టెన్’గా; 8 ఏళ్ల తర్వాత ‘మేజర్’గా ప్రమోషన్ పొందుతారు. పర్మనెంట్ కమిషన్ నర్సింగ్ ఆఫీసర్లు లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడ్, మేజర్ జనరల్ తదితర హోదాలు పొందొచ్చు. పర్మనెంట్ కమిషన్: ఎస్సెస్సీ ఆఫీసర్లను ఖాళీలు, నిబంధనలకు అనుగుణంగా పర్మనెంట్ నర్సింగ్ ఆఫీసర్లుగా నియమించే అవకాశం ఉంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి. అప్లికేషన్ ఫాంను నింపే విధానం, పేమెంట్, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ తదితర వివరాల కోసం ఆర్మీ అధికారిక వెబ్సైట్ www.joinindianarmy.nic.inను సందర్శించొచ్చు. చివరి తేది: ఆగస్టు 3. దరఖాస్తు రుసుం: రూ.200 చెల్లించాలి. హెచ్‌పీసీఎల్ బయోఫ్యూయల్స్ లిమిటెడ్ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) అధీనంలోని బయో ఫ్యూయల్స్ లిమిటెడ్ (బీఎఫ్ఎల్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటనను జారీ చేసింది. ఇకపై హెచ్బీఎల్గా కార్యకలాపాలను కొనసాగించనున్న ఈ సంస్థ.. మొత్తం 60 రకాల పోస్టుల భర్తీకి ఇంటర్వూ్యలను నిర్వహించనుంది. ఈ ఖాళీలన్నింటినీ ముఖ్యంగా మూడు కేటగిరీలుగా విభజించారు. ఒకటి.. మేనేజ్మెంట్. ఈ కేటగిరీలో 29 ఖాళీలు ఉన్నాయి. రెండు.. నాన్ మేనేజ్మెంట్. ఈ కేటగిరీలో 43 పోస్టులు ఉన్నాయి.. మూడు.. సీజనల్. ఈ కేటగిరీలో 66 వేకెన్సీలు ఉన్నాయి. మొదటి రెండు కేటగిరీల్లోని ఉద్యోగాల కాంట్రాక్ట్ కాల వ్యవధి రెండేళ్లు. హెచ్‌బీఎల్ నిర్వహణ ఆవశ్యకత, అభ్యర్థి పనితీరును బట్టి కాంట్రాక్ట్ పీరియడ్‌ను అవసరమైతే మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంది. మూడో కేటగిరీ (సీజనల్) పోస్టుల కాంట్రాక్ట్ కాల పరిమితి ఒక క్రషింగ్ సీజన్. సంస్థ అవసరాలు, అభ్యర్థి పనితీరును బట్టి ఈ గడువును కూడా మరో క్రషింగ్ సీజన్ వరకు పొడిగించే వీలుంది. ఇంటర్వ్యూ కి తేదీలు: మేనేజ్మెంట్ పోస్టులకు ఆగస్టు 8, 9, 10. నాన్ మేనేజ్మెంట్ పోస్టులకు ఆగస్టు 22, 23. సీజనల్ పోస్టులకు ఆగస్టు 25, 26. ఇంటర్వ్యూ వేదిక: హెచ్‌పీసీఎల్ బయోఫ్యూయల్స్ లిమిటెడ్ హౌజ్ నంబర్ 271, రోడ్ నంబర్ 3ఇ, న్యూ పాటలీపుత్ర కాలనీ, పాట్నా, 800013. విద్యార్హత, అనుభవం: ఒక్కో పోస్టుకు ఒక్కో విద్యార్హతను, నిర్దేశిత అనుభవాన్ని పేర్కొన్నారు. వివరాలకు www.hpclbiofuels.co.in/ home.phpలో చూడొచ్చు. వేతనం: వేతనాలు; అలవెన్సులు; ప్రత్యక్ష, పరోక్ష ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ కలిపి సంస్థ.. ఉద్యోగిపై వెచ్చించే ఖర్చు (సీటీసీ–కాస్ట్ టు కంపెనీ)ని వార్షిక ప్రాతిపదిక పేర్కొన్నారు. వాటిని కేటగిరీల వారీగా పరిశీలిస్తే.. వయసు: వయోపరిమితి నిర్థారణకు 2016 ఆగస్టు 1ని కటాఫ్ డేట్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. మూడు కేటగిరీల పోస్టులకూ కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయసు మేనేజ్మెంట్ పోస్టులకు 57 ఏళ్లు; నాన్ మేనేజ్మెంట్, సీజనల్ ఉద్యోగాలకు 55 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును పూర్తిచేసి; విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ కాపీలతో ఇంటర్వూ్యకి హాజరుకావాలి. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే ఇంటర్వూ్యకి రావాలి. ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు ఇంటర్వూ్యకి వస్తే అతడి/ఆమె అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైనవారిని వేతన చర్చ (నెగోషియేషన్ ఆఫ్ సీటీసీ)కి ఎంపిక చేస్తారు. అందులోనూ సక్సెస్ అయినవారికి మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ మూడు పరీక్షలతోపాటు విద్యార్హత, వయసు, రిజర్వేషన్ కేటగిరీ, ఎన్ఓసీ, రిలీవింగ్ లెటర్ తదితర పత్రాలన్నింటినీ పరిశీలించిన తర్వాత తుది ఎంపిక చేస్తారు. కేటగిరీ గరిష్టం(రూ.లక్షల్లో) కనిష్టం(రూ.లక్షల్లో) మేనేజ్మెంట్ 8–10 1.80–2.50 నాన్ మేనేజ్మెంట్ 1.80–2.40 1.44–1.80 సీజనల్ 1.80–2.40 1.20–1.80 ఎయిరిండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ విమానాల నిర్వహణ, మరమ్మతుల బాధ్యతలను నిర్వర్తించే ఎయిరిండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్).. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్యానెల్ ఏర్పాటుకు ‘గేట్’ స్కోర్ కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 382 ఉండగా ఇందులో రెండు రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి.. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీర్. రెండు.. ఇంజనీరింగ్ సపోర్ట్ సర్వీసెస్. వేకెన్సీ వివరాలు కేటగిరీల వారీగా.. 1. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీర్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓసీ మొత్తం ఖాళీలు 41 21 75 143 280 2. ఇంజనీరింగ్ సపోర్ట్ సర్వీసెస్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓసీ మొత్తం ఖాళీలు 15 7 27 53 102 ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీర్ పోస్టులకు: 2016 జూలై 1 నాటికి బీఈ/ బీటెక్‌లో మెకానికల్/ఏరోనాటికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్స్/ఇన్స్ట్రుమెంటేషన్ /ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(లేదా) తత్సమాన విద్యార్హతతోపాటు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (‘గేట్’)లో 80 శాతం అంతకన్నా ఎక్కువ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 75 శాతం, అంతకన్నా ఎక్కువ) స్కోర్ ఉండాలి. ఇంజనీరింగ్ సపోర్ట్ సర్వీసెస్ పోస్టులకు: 2016 జూలై 1 నాటికి బీఈ/బీటెక్‌లో మెకానికల్/ఏరోనాటికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రా నిక్స్/టెలీకమ్యూనికేషన్స్/ఇన్స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఇండస్ట్రియల్/ప్రొడక్షన్/కెమికల్ ఇంజనీరింగ్ (లేదా) తత్సమాన విద్యార్హతతోపాటు ‘గేట్’లో 80 శాతం అంతకన్నా ఎక్కువ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 70 శాతం అంతకన్నా ఎక్కువ) స్కోర్ ఉండాలి. వయసు: 2016 జూలై 1 నాటికి ఓసీలు 28 ఏళ్ల లోపు, ఓబీసీలు 31 ఏళ్ల లోపు, ఎస్సీ/ ఎస్టీలు 33 ఏళ్ల లోపు, ఎక్స్సర్వీస్మెన్లు 28 ఏళ్ల లోపు ఉండాలి. ఎక్స్సర్వీస్మెన్లకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. వేతనం ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీర్ పోస్టులకు: మొదటి ఏడాది శిక్షణలో రూ.25,000 సై్టపెండ్ చెల్లిస్తారు. రెండో ఏడాది శిక్షణలో ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీర్ గ్రేడ్ ఇస్తారు. ఈ సమయంలో నెలకు రూ. 30,000 వేతనం ఉంటుంది. లైసెన్స్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీర్‌గా క్వాలిఫై అయ్యే వరకు ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ అనంతరం పదోన్నతుల్లోని స్థాయిలను, క్వాలిఫికేషన్లను బట్టి నెలకు రూ. లక్షకుపైగా వేతనం, ఇంక్రిమెంట్లు ఉంటాయి. సపోర్ట్ సర్వీసెస్ పోస్టులకు: మొదటి ఏడాది శిక్షణలో రూ.25,000 సై్టపెండ్ చెల్లిస్తారు. శిక్షణ అనంతరం పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్/లెవల్ ఎగ్జామినేషన్‌ను బట్టి అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్ ఇస్తారు. ఈ సమయంలో సర్వీస్ వ్యవధి/అనుభవం ఆధారంగా ఐదేళ్లపాటు నెలకు రూ.40,000–55,000 వేతనం ఉంటుంది. సర్వీస్ బాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీర్(ఏఎంఈ) పోస్టులకు: శిక్షణను విజయవంతగా పూర్తిచేస్తానని, ఏఎంఈ లైసెన్స్ పొందిన తర్వాత కనీసం 5 ఏళ్లపాటు సంస్థలో పనిచేస్తానని ఒప్పంద పత్రం సమర్పించాలి. ఇంజనీరింగ్ సపోర్ట్ సర్వీసెస్ పోస్టులకు: శిక్షణను విజయవంతగా పూర్తిచేస్తానని, అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్ ఇచ్చిన తర్వాత కనీసం 5 ఏళ్లపాటు సంస్థలో పనిచేస్తానని ఒప్పంద పత్రం సమర్పించాలి. ఎంపిక విధానం: ఇంటర్వూ్య ద్వారా తుది ఎంపిక చేస్తారు. ఇంటర్వూ్యకి సెలెక్ట్ అయిన అభ్యర్థుల పేర్లను సంస్థ వెబ్‌సైట్‌లోని కెరీర్ పేజీలో అందుబాటులో ఉంచుతారు. దరఖాస్తు విధానం: రెండు రకాల పోస్టులకూ ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఆ దరఖాస్తు ప్రింటౌట్‌కు విద్యార్హతలు, వయసు, వ్యక్తిగత గుర్తింపు, గుర్తింపు, కేటగిరీ (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్), గేట్ స్కోర్ తదితర ధృవీకరణ పత్రాల జిరాక్స్‌లను, ఒరిజినల్ బ్యాంక్ చలాన్‌ను జతచేసి కింది అడ్రస్‌కు పంపాలి. చిరునామా: పోస్ట్ బాక్స్ నంబర్ 12006, కాస్సిపోర్ పోస్టాఫీస్, కోల్‌కతా, 700002. దరఖాస్తు రుసుం: రూ.2000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్సర్వీస్మెన్లకు మినహాయింపు ఉంది. ముఖ్య తేదీలు: ఆన్లైన్ అప్లికేషన్ లింక్ 2016 ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. అప్లికేషన్ల హార్డ్ కాపీలను 2016 సెప్టెంబర్ 30 లోపు పంపాలి. ఇంటర్వూ్యకి ఎంపికైన అభ్యర్థుల పేర్లను 2016 నవంబర్ 15న (లేదా) ఆ తర్వాత వెల్లడిస్తారు. వెబ్సైట్: www.airindia.in ‘ఎయిర్‌లైన్స్’69 కో పైలట్ పోస్టులు ఎయిర్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఎయిర్‌లైన్ అలైడ్ సర్వీస్ లిమిటెడ్ (ఏఏఎస్ఎల్) కాంట్రాక్ట్ విధానంలో 69 కో పైలట్ (పీ2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హతలు: ఆగస్టు 22, 2016 నాటికి అభ్యర్థులకు కనీసం 18 ఏళ్లు ఉండాలి. 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు నిబంధనలకు అనుగుణంగా సడలింపు ఉంటుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్/వర్సిటీ నుంచి ఇంటర్/+2 ఉత్తీర్ణులై ఉండాలి. డీజీసీఏ జారీ చేసిన, ప్రస్తుతం చెల్లుబాటయ్యే కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) కలిగి ఉండాలి. అభ్యర్థులకు వీటితోపాటు నిర్దేశిత అర్హతలుండాలి. ఎంపిక విధానం: ఎంపిక చేసిన అభ్యర్థులకు సైకోమెట్రిక్ టెస్ట్ (అర్హత టెస్ట్), సిములేటర్ ప్రొఫిషియెన్సీ అసెస్మెంట్ చెక్ (ఎస్పీఏసీ) నిర్వహిస్తారు. సిములేటర్ రుసుమును అభ్యర్థులే చెల్లించాలి. ఎస్పీఏసీలో అర్హత సాధించిన వారిని, అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 5 ఏళ్ల కాలానికి ఉద్యోగం కల్పిస్తారు. ప్రతిభ ఆధారంగా మరో 5 ఏళ్ల పాటు పొడిగించే అవకాశం ఉంటుంది. ఢిల్లీ/కోల్‌కతా/బెంగళూరు/హైదరాబాద్/ముంబై/ భోపాల్‌లో పోస్టింగ్ ఉంటుంది. దరఖాస్తు విధానం: www.airindia.in వెబ్సైట్ నుంచి దరఖాస్తును ప్రింట్ తీసుకుని, నిర్దేశిత నమూనాలో పూర్తిచేసి, సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి ‘ద ఆఫీస్ ఆఫ్ ఈడీ (ఎన్ఆర్), ఎయిర్ ఇండియా లిమిటెడ్, టెర్మినల్–1బీ, ఐజీఐ ఎయిర్పోర్ట్, న్యూఢిల్లీ–110037 అడ్రస్‌కు పంపాలి. ఎయిర్‌లైన్ అలైడ్ సర్వీస్ పేరుతో రూ.3,000 డీడీని కూడా దరఖాస్తుతోపాటు పంపించాలి. ఎస్సీ, ఎస్టీలకు డీడీ అవసరం లేదు. దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 22, 2016 సై్టపెండ్, వేతనం: శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలకు రూ.25,000 సై్టపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్వీస్ సమయంలో నెలకు రూ. 2,11,000 వేతనం లభిస్తుంది. పూర్తి వివరాలకు వెబ్సైట్:www.airindia.in డీఆర్డీఓ, ఏడీఏ 182 పోస్టులు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ)లో సైంటిస్ట్ ‘బి’, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏడీఏ)లో సైంటిస్ట్/ఇంజనీర్ ‘బీ’ ఉద్యోగాల భర్తీకి సవరణ ప్రకటన వెలువడింది. ‘ఎంప్లాయ్మెంట్ న్యూస్ 2016 మార్చి 5–11 సంచిక’లో ప్రచురించిన (రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్–ఆర్ఏసీ వెబ్‌సైట్‌తోపాటు డీఆర్డీఓ వెబ్సైట్లోనూ పొందుపర్చిన) ప్రకటన నంబర్–120 ప్రకారం ఈ రెండు సంస్థల్లో మొత్తం 17 ఐటమ్స్(సబ్జెక్టులు/డిసిప్లైన్ల)లో 163 ఖాళీలు ఉన్నాయి. అయితే వాటిలో ఐదు ఐటమ్లకు సంబంధించిన ఖాళీల సంఖ్య 112 మాత్రమే. ఇప్పుడు ఆ ఐదు ఐటమ్స్‌లోని ఖాళీలను పెంచుతూ సవరణ ప్రకటన ఇచ్చారు. పాత నోటిఫికేషన్‌లోని ఐటం నంబర్ 1, 2, 3, 6, 7లలో మొత్తం పోస్టులు 112 ఉండగా వాటికి మరో 70 పోస్టులు కలవడంతో ఖాళీల సంఖ్య 182కు పెరిగింది. (17 ఐటమ్స్‌లోని ఖాళీల సంఖ్య 163 నుంచి 233కు చేరుతుంది). కాగా ఈ ఐదు ఐటమ్స్‌లోని ఖాళీలకు గతంలో అప్లై చేసినవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదు. కొత్తవారు మాత్రమే ఈ ఐదు ఐటమ్స్‌లోని ఖాళీలకే అప్లై చేయాల్సి ఉంటుంది. గతంలో పేర్కొన్న ఖాళీల సంఖ్య, ప్రస్తుత వేకెన్సీ వివరాలు సబ్జెక్టు, కేటగిరీల వారీగా.. ఎంపిక ప్రక్రియ: ఈ పోస్టులకు గేట్–2015/2016 స్కోర్ ఆధారంగా స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ‘ఒక పోస్టుకు ఐదుగురు అభ్యర్థులు’ చొప్పున(1:5 నిష్పత్తిలో) తదుపరి ఎంపిక ప్రక్రియ (పర్సనల్ ఇంటర్వ్యూ)కి సెలెక్ట్ చేస్తారు. గేట్ స్కోర్‌కు 80 శాతం వెయిటేజీ, పర్సనల్ ఇంటర్వూ్యకి 20 శాతం వెయిటేజీ ఇస్తారు. మొత్తం 100 మార్కులకు అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. పర్సనల్ ఇంటర్వూ్యలో జనరల్ అభ్యర్థులు కనీసం 70 శాతం; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాలి. విద్యార్హత: కనీస విద్యార్హత, సంబంధిత గేట్ పేపర్ కోడ్, క్వాలిఫైయింగ్ డిగ్రీలోని తత్సమాన సబ్జెక్టుల జాబితా కోసం వెబ్సైట్లో చూడొచ్చు. వయసు: వయో పరిమితి నిర్థారణకు 2016 ఏప్రిల్ 10ని కటాఫ్ తేదీగా పరిగణనలోకి తీసుకుంటారు. గరిష్ట వయో పరిమితి 28 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆర్ఏసీ వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు రుసుం: జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు. చివరి తేదీ: ఆన్లైన్ అప్లికేషన్లను 2016 ఆగస్టు 10లోపు దాఖలు చేయాలి. వెబ్సైట్: http://rac.gov.in -
సైబర్ హబ్‌ల మధ్య నాన్‌స్టాప్ విమానం!
ఢిల్లీ: సైబర్ హబ్‌లుగా ప్రఖ్యాతి చెందిన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, భారత్‌లోని బెంగళూరు నగరాల మధ్య నాన్ స్టాప్ విమాన సర్వీసులు నడపాలని ఎయిర్ ఇండియా నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రతిపాదనను పంపించినట్లు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు శనివారం నాడిక్కడ తెలియజేశారు. బెంగళూరుకు దాదాపు 14 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోకు నేరుగా విమానంలో వెళ్లాలంటే 17 గంటల నుంచి 18 గంటల వరకు సమయం పడుతుందని అంచనా. ఈ నగరాల మధ్య విమాన సర్వీసు అమల్లోకి వస్తే ఇదే ప్రపంచంలోకెల్లా లాంగెస్ట్ రూట్ అవుతుంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి అమెరికాలోని సిలికాన్ వ్యాలీని సందర్శించి ప్రసంగించిన అనంతరం ఈ కొత్త విమాన సర్వీసు గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మోదీ భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రికి సిలికాన్ వ్యాలీకి చేరుకొని, రెండు రోజుల పాటు అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా లాంగెస్ట్ నాన్ స్టాఫ్ విమాన సర్వీసును ఖాంటాస్ విమానయాన సంస్థ నిర్వహిస్తోంది. అమెరికాలోని డల్లాస్ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ మధ్య (13,730 కిమీ) ఈ విమాన సర్వీసు నడుస్తోంది. దీన్ని ఎమిరేట్స్ విమాన సర్వీసు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బ్రేక్ చేయనుంది. దుబాయ్, పనామా నగరాల మధ్య (13,730) నాన్ స్టాప్ విమానాలను నడపాలని ఎమిరేట్స్ ఎయిర్ వేస్ నిర్ణయించింది. బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కో నగరాల మధ్య నాన్ స్టాప్ విమాన సర్వీసును ప్రారంభించాలనే ఎయిర్ ఇండియా ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రపంచంలో అదే లాంగెస్ట్ రూట్ విమాన సర్వీసు అవుతుంది. -
రన్‌వేపై త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం
ఒక ఇండిగో విమానం గాల్లోకి లేస్తోంది.. అప్పుడే మరో ఎయిరిండియా విమానం రన్‌వే మీదకు దిగుతోంది. సరిగ్గా ఆ రెండూ ఒకదాన్ని ఒకటి దాదాపు ఢీకొట్టుకోబోయాయి. అంతే.. రెండింటిలో ఉన్న దాదాపు 250 మంది ప్రయాణికులు గుండెలు అరచేతిలో పట్టుకుని ప్రాణాలు ఉగ్గబట్టుకున్నారు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్లోని బగ్డోరాలో జరిగింది. రెండు విమానాలకూ ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎయిరిండియా విమానంలో 120 మంది ప్రయాణికులున్నారు. అది రన్‌వే మీదకు దిగుతోంది. ఇండిగో విమానం బగ్డోరా నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకోబోతోంది అందులో 130 మందిప్రయాణికులున్నారు. రెండు విమానాల మధ్య కనీసం కిలోమీటరు దూరం ఉండాలన్న నిబంధనకు విరుద్ధంగా ఈ రెండూ చాలా సమీపానికి వచ్చేశాయి. అయితే, రెండు విమానాల పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ముందుగా ఇండిగో విమాన కెప్టెన్‌కు ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ నుంచి హెచ్చరిక వచ్చింది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం కెప్టెన్ వెంటనే విమానాన్ని కిందకు దించేశాడు. ఎయిరిండియా విమానం కూడా అలాగే కుడివైపు తిరిగిపోయింది. ఇద్దరు కెప్టెన్లకు 'క్లియర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్' సందేశం రాగానే వాళ్లు మళ్లీ విమానాలను మామూలు స్థితికి తీసుకొచ్చారు. ఈ సంఘటనపై డీజీసీఏ విచారణ చేపట్టింది. -
జెడ్డాలో భారతీయుల పడిగాపులు
న్యూఢిల్లీ: సాంకేతికలోపం కారణంగా ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 747 విమానం బుధవారం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో నిలిచిపోయింది. పైలట్ హైడ్రాలిక్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్యను గుర్తించడంతో విమానాన్ని జెడ్డా విమానాశ్రయంలోనే నిలిపేశారు. జెడ్డా నుంచి కోజికోడ్ రావాల్సిన ఏఐ-962 విమానంలో 350 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. వీరంతా స్వదేశం తిరిగి వచ్చేందుకు జెడ్డాలో పడిగాపులు కాస్తున్నారు. కొద్ది గంటల పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే గడిపిన ప్రయాణికులకు ఆ తర్వాత సమీపంలోని హోటల్లో ఎయిరిండియా అధికారులు బస ఏర్పాటు చేశారు. ప్రయాణికులను స్వదేశం తీసుకువచ్చేందుకు ముంబై, ఢిల్లీ నుంచి రెండు ప్రత్యేక విమానాలు జెడ్డా బయలు దేరాయని తెలిపారు. ఈ విమానాల్లో ఒకటి గురువారం అర్థారాత్రి తర్వాత, మరో విమానం శుక్రవారం ఉదయం ప్రయాణికులతో స్వదేశానికి బయలుదేరతాయని వెల్లడించారు.