కృత్రిమ మేధ(ఏఐ) సంచలనం.. చాట్‌జీపీటీ సేవల విస్తృతి రోజు రోజుకి మరింత పెరుగుతోంది. తాజాగా ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా మాతృ సంస్థ టాటా సన్స్ చాట్‌జీపీటీ సేవల్ని వినియోగించుకునేందుకు సిద్ధమైంది.
ప్రభుత్వరంగ విమానయాన సంస్థగా ఉన్న ఎయిరిండియా ప్రస్థానం టాటాల గ్రూపు నుంచే మొదలు కాగా.. 68 ఏళ్ల తర్వాత చివరకు టాటాల గూటికే చేరింది. అయితే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సమయంలో ఎయిరిండియా విమాన ఛార్జీల వివరాల్ని పేపర్ ద్వారా వెల్లడించేది.
కానీ టాటాల ఆధ్వర్యంలో ప్రతి విమానం నుండి ఎక్కువ ఆదాయాన్ని గడించేందుకు ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ చాట్‌జీపీని వినియోగించేందుకు సిద్ధమైంది. గత వారం జరిగిన ఎయిరిండియా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో చాట్‌జీపీటీ వినియోగంపై ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ ప్రకటించారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న చాట్‌జీటీపీ త్వరలో పూర్తి స్థాయిలో వినియోగంలోకి రానుంది.
చదవండి: గుడ్‌న్యూస్.. రైల్వే ప్రయాణికులకు పండగే.. ఇకపై క్షణాల్లోనే
Comments
Please login to add a commentAdd a comment