ChatGPT
-
ప్రాణం కాపాడిన చాట్‌జీపీటీ: ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ 'చాట్‌జీపీటీ' (ChatGPT) యూజర్లకు చాలా ఉపయోగపడుతోంది. ఏ ప్రశ్న అడిగినా.. దాదాపు ఖచ్చితమైన, వేగవంతమైన జవాబును ఇస్తోంది. ఇప్పటికే ఎన్నెన్నో అద్భుతాలు చేసిన చాట్‌జీపీటీ.. తాజాగా ఓ మనిషికి ఉన్న రోగాన్ని సైతం కనిపెట్టింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఓ సోషల్ మీడియా యూజర్ పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. కొన్ని రోజుల క్రితం నేను వ్యాయామం చేసాను. ఒళ్ళంతా చాలా నొప్పులుగా.. ఏదో యాక్సిడెంట్ అయిన ఫీలింగ్ కలిగింది. రెండు రోజులైనా ఆరోగ్యం కుదుటపడలేదు. నాకున్న లక్షణాలను చాట్‌జీపీటీకి వివరించాను. లక్షణాల ఆధారంగా రాబ్డోమయోలైసిస్ (Rhabdomyolysis) ఉన్నట్లు వెల్లడిస్తూ.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సిపార్సు చేసింది.చాట్‌జీపీటీ చెప్పింది నిజమా? కాదా? అని నిర్దారించుకోవడానికి నేను ఆసుపత్రికి వెళ్ళాను. డాక్టర్లు కూడా టెస్ట్‌లు చేసి రాబ్డోమయోలైసిస్ ఉందని నిర్థారించారు. నా ల్యాబ్ ఫలితాలను విశ్లేషించడానికి కూడా.. నేను ChatGPTని ఉపయోగించాను. అది వైద్య బృందం చెప్పిన దానితో సమానంగా చెప్పింది. సరైన సమయానికి చికిత్స తీసుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాను.చాట్‌జీపీటీ సామర్థ్యం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో కూడా.. చాట్‌జీపీటీ ఇతరుల ప్రాణాలను కాపాడటం సంఘటనల గురించి విన్నాను. ఇప్పుడు చాట్‌జీపీటీ నన్ను కూడా కాపాడింది.ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాట్‌జీపీటీ లక్షణాల ఆధారంగా రోగ నిర్దారణ చేయడం చాలా గొప్పగా ఉందని పలువురు ప్రశంసించారు. వైద్య సలహా కోసం కూడా దీనిని ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు.రాబ్డోమయోలైసిస్రాబ్డోమయోలైసిస్ అనేది ఓ అరుదైన సమస్య. విశ్రాంతి తీసుకోకుండా ఎక్కువసేపు వ్యాయామం చేయడం వల్ల.. కండరాలు కలిగిపోతాయి. దీంతో రక్తంలోకి విడుదలయ్యే ప్రోటీన్లు కిడ్నీలలో పేరుకుపోతాయి. ఇది పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఇది ప్రాణాంతకం కూడా.ఇదీ చదవండి: ఆరోగ్యం కోసం నవవిధ మార్గాలు - చాట్‌జీపీటీ సలహాలు -
చాట్‌జీపీటీకి ‘గ్రోక్’ స్ట్రోక్!
కృత్రిమ మేధ (AI) రంగం కొత్తపుంతలు తొక్కుతూ శరవేగంగా పురోగతి సాధిస్తున్న సమయంలో.. రెండు ప్రముఖ టెక్ కంపెనీల మధ్య పోటీకి దారితీసింది. కృత్రిమ మేధ ఫలాలను సామాన్యులకు సైతం పరిచయం చేసి, టెక్ రంగంలో సంచలనం సృష్టించిన ‘చాట్‌జీపీటీ(ChatGPT)’కి పోటీగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్(X)’అధినేత ఎలన్ మస్క్‌కు చెందిన ‘గ్రోక్(Grok)’తెరపైకి దూసుకొస్తోంది. ఎలన్ మస్క్ తన ‘ఎక్స్ఏఐ’సంస్థ ద్వారా గత ఏడాది నవంబర్ 3న ‘గ్రోక్’ను మార్కెట్లోకి తెచ్చారు. చాట్‌జీపీటీ, గ్రోక్ రెండూ ఏఐ టూల్స్ అయినా రెండింటి మధ్య ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. తమకు ‘గ్రోక్’బాగా నచ్చిందని, ‘చాట్‌జీపీటీ’సబ్‌స్క్రిప్షన్‌ను వదిలేసుకుని ఇకపై గ్రోక్నే వినియోగిస్తామని ‘ఎక్స్’లో కొందరు పోస్టులు పెడుతుండగా.. ఎలన్ మస్క్ వాటిని షేర్ చేస్తూ ప్రమోట్ చేసుకుంటున్నారు. నిజానికి కృత్రిమ మేధ రంగంలో అగ్రగామిగా ఉన్న ‘చాట్‌జీపీటీ’కి గ్రోక్ పోటీ ఇవ్వగలదా అన్నది భవిష్యత్తులో తేలిపోనుంది.ప్రస్తుతానికి చాట్జీపీటీదే ఆధిపత్యం..‘గ్రోక్’తాజా వెర్షన్‌కు ఆధారం ఎక్స్ఏఐకి చెందిన గ్రోక్–2 మోడల్. ఉచితంగా ఏఐ ఆధారిత సేవలు అందిస్తున్న ఇతర టూల్స్‌తో పోల్చితే పనితీరు, సామర్థ్యంలో ఇది ముందంజలో ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. కొన్ని అంశాల్లో ‘చాట్‌జీపీటీ’ఉచిత వెర్షన్ (GPT 3.5)ను సైతం గ్రోక్ అధిగమించినట్టు పలు పరీక్షల్లో తేలిందని అంటున్నారు. అయితే ‘చాట్‌జీపీటీ ప్లస్’వెర్షన్లో ఉపయోగించే ‘జీపీటీ–4’మోడల్ సామర్థ్యంతో పోల్చితే ‘గ్రోక్’వెనకబడే ఉందని స్పష్టం చేస్తున్నారు. మార్కెట్లో ఎక్కువ కాలం నుంచి కొనసాగుతుండటంతో పాటు గణనీయ స్థాయిలో డేటాతో శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో చాట్‌జీపీటీ ప్రత్యేకంగా నిలుస్తోందని.. వినియోగదారులకు అవసరమైన సేవల నుంచి సృజనాత్మక రచనల వరకు విస్తృత శ్రేణిలో సృజన చూపగలుగుతోందని పేర్కొంటున్నారు.హాస్యాన్ని మేళవించి.. సమాచారం అందించే గ్రోక్..గ్రోక్ హాస్యాన్ని మేళవించి సరదా సంభాషణలతో, కొంతవరకు తిరుగుబాటు వైఖరిని కూడా మేళవించి సమాధానాలు ఇస్తుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. ఇతర ఏఐ టూల్స్ చెప్పలేకపోయే ఘాటైన ప్రశ్నలకు సైతం సమాధానమిచ్చేలా దీనిని రూపొందించామని అంటున్నారు. రాజకీయ అంశాల విషయంలో గ్రోక్ ధోరణి అందరికి నచ్చకపోవచ్చని.. అందుకే రాజకీయంగా పూర్తిగా సరైనది కాదని పేర్కొంటున్నారు. మరోవైపు చాట్‌జీపీటీ తటస్థంగా, మర్యాదపూర్వకంగా, సమగ్రమైన ధోరణిలో స్పందిస్తుంది.రియల్ టైమ్‌లో గ్రోక్ పైచేయిగ్రోక్ సామాజిక మాధ్యమం ఎక్స్ నుంచి రియల్ టైమ్‌లో సమాచారాన్ని సేకరించి వర్తమాన అంశాలు, సరళులపై తాజా సమాచారాన్ని అందించగలుగుతుంది. అవసరమైతే ఇంటర్నెట్లోనూ రియల్ టైమ్ సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తుంది. ఈ అంశంలో గ్రోక్ ముందంజలో ఉంది. చాట్‌జీపీటీ అత్యంత శక్తివంతమైనదే అయినా ‘గ్రోక్’తరహాలో రియల్ టైమ్ అప్డేషన్ లేదు. కటాఫ్ తేదీ (2021)కి ముందు నాటి సమాచార పరిజ్ఞానాన్ని మాత్రమే చాట్‌జీపీటీ వినియోగించి సేవలు అందిస్తుంది. అయితే డబ్బులు చెల్లించి సబ్ర్‌స్కయిబ్ చేసుకునే ప్రీమియం వెర్షన్ (చాట్‌జీపీటీ ప్లస్) దీనికి మినహాయింపు.గ్రోక్ ‘ఎక్స్’లోనే.. జీపీటీ అన్నిచోట్లా..గ్రోక్ ప్రస్తుతం ‘ఎక్స్’యాప్‌లోనే సమ్మిళితమై సేవలందిస్తోంది. అంటే ‘ఎక్స్’వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి ఉంది. దీనిని తొలుత ‘ఎక్స్ (ట్విట్టర్)’ప్రీమియం ప్లస్, ప్రీమియం వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. అనంతరం కొన్ని పరిమితుల మేరకు ఉచిత వినియోగదారులకు సైతం అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తులో ‘ఎక్స్’ప్రీమియం, ప్రీమియం ప్లస్ చందాలు కట్టాల్సిన అవసరం లేకుండా.. ‘గ్రోక్’కే చందా కట్టి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చని రూపకర్తలు చెబుతున్నారు.మరోవైపు ‘చాట్‌జీపీటీ–3.5’పాత వెర్షన్ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది. వినియోగదారులకు మరింత విస్తృతమైన సేవలందించే అత్యాధునిక ‘జీపీటీ–4’వెర్షన్‌కు మాత్రం డబ్బులు చెల్లించి సబ్‌్రస్కయిబ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని వెబ్, మొబైల్ యాప్స్, ఎంఎస్ ఆఫీస్ ద్వారా విస్తృత రీతిలో పొందవచ్చు.దేనికది ప్రత్యేకంకంటెంట్ సృష్టి, అనువాదం, కస్టమర్ సపోర్ట్, విద్య, వ్యక్తిగత సహాయం, కోడింగ్, మేధోమథనం వంటి వైవిధ్యభరిత సేవలను విస్తృతరీతిలో చాట్‌జీపీటీ అందిస్తోంది. వినియోగదారులు టెక్ట్స్‌తోపాటు చిత్రాలను ఇన్‌పుట్‌గా వాడే సదుపాయాన్ని చాట్‌జీపీటీ ప్లస్ కలి్పస్తోంది. నిర్దిష్టమైన పరిశ్రమలు, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు కస్టమైజ్డ్ సేవలను సైతం చాట్‌జీపీటీ అందిస్తోంది.ఇక ‘గ్రోక్’విషయానికి వస్తే సామాజిక మాధ్యమాలతో అనుసంధానం, రియల్ టైమ్ సమాచారం, వినోదం, సాధారణ ప్రశ్నలకు సమాధానాలు వంటి సేవలను వినూత్న రీతిలో అందిస్తోంది. ‘గ్రోక్’ను అగ్రగామిగా నిలపాలనే వ్యూహంతో ఎలన్ మస్క్ భవిష్యత్తులో మరెన్నో వైవిధ్యభరిత సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెబుతున్నారు కూడా.ఇదీ చదవండి: తాళి కట్టు శుభవేళ..బహుమతులపై పన్ను భారం ఉండదా?‘గ్రోక్’పేరు ఎందుకు‘గ్రోక్’అనే ఆంగ్ల పదానికి అర్థం ‘ఎవరినైనా/ఏదైన అంశాన్ని లోతుగా అవగతం చేసుకోవడం’. రాబర్ట్ ఎ.హెన్లీన్ తన సైన్స్‌ఫిక్షన్ నవల ‘స్ట్రేంజర్ ఇన్ ఏ స్ట్రేంజ్ ల్యాండ్’లో వాడిన ‘గ్రోక్’పదం నుంచి స్ఫూర్తి పొందిన ఎలన్‌మస్క్ తన ఏఐ టూల్‌కు ఈ పేరును పెట్టారు. -
వాట్సప్‌లో చాట్‌జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని జనరేటివ్‌ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ఇకపై వాట్సప్‌లోనూ దర్శనమివ్వనుంది. వాట్సప్‌లోనూ చాట్‌జీపీటీ సేవలు వినియోగించుకోవచ్చని ఓపెన్ఏఐ తెలిపింది. వినియోగదారులకు ప్రత్యేకంగా ఇతర యాప్‌తో పనిలేకుండా వాట్సప్‌లోనే నేరుగా ఈ సేవలు వాడుకోవచ్చని కంపెనీ పేర్కొంది.ఈ సేవలు వినియోగించుకోవాలంటే +18002428478 నంబర్‌తో వాట్సప్‌లో చాట్ చేయాల్సి ఉంటుంది. ఈ నంబర్ ద్వారా వాట్సప్‌లో అడిగిన ప్రశ్నలకు చాట్‌జీపీటీ సమాధానాలు ఇస్తుంది. ఈ చాట్‌బాట్ టెక్ట్స్ రూపంలో అందించే సేవలు ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకోవచ్చు. అయితే వాయిస్ ఇంటరాక్షన్స్ మాత్రం ప్రస్తుతం యూఎస్, కెనడా దేశాల్లోనే అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. త్వరలో ఇతర దేశాలకు ఈ సర్వీసును విస్తరిస్తామని పేర్కొంది.You can now talk to ChatGPT by calling 1-800-ChatGPT (1-800-242-8478) in the U.S. or by sending a WhatsApp message to the same number—available everywhere ChatGPT is. pic.twitter.com/R0XOPut7Qw— OpenAI (@OpenAI) December 18, 2024ఇదీ చదవండి: ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము?ఈ సర్వీసుకు కొన్ని పరిమితులున్నట్లు కంపెనీ తెలిపింది. రోజువారీ వాడుకలో పరిమితి ముగిశాక నోటిఫికేషన్ ద్వారా సమాధానాలు పొందవచ్చని స్పష్టం చేసింది. భవిష్యత్‌లో చాట్‌జీపీటీ సెర్చ్, ఇమేజ్ బేస్డ్ ఇంటరాక్షన్, కన్వర్జేషన్ మెమొరీ లాగ్స్ వంటి సర్వీసులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే మెటా సంస్థ ఏఐ చాట్‌బాట్‌ను వాట్సప్‌లో అందిస్తోంది. -
ఎవరీ సుచీర్ బాలాజీ? ఎలాన్ మస్క్ ఎందుకు అలా స్పందించారు?
ఓపెన్ఏఐ విజిల్‌బ్లోయర్ సుచీర్ బాలాజీ హఠాన్మరణం చెందాడు. భారత సంతతికి చెందిన ఈ 26 ఏళ్ల యువ రీసెర్చర్.. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు ధృవీకరించారు.ఏఐ రీసెర్చర్ అయిన బాలాజీ ఓపెన్ఏఐ కంపెనీ కోసం నాలుగేళ్లుగా(2020-2024) పని చేశాడు. అయితే ఈ ఏడాది ఆగష్టులో కంపెనీని వీడిన ఈ యువ రీసెర్చర్.. అక్టోబర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. నవంబర్ 26వ తేదీన బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్‌లో బాలాజీ మరణించాడని, అతనిది ఆత్మహత్యే అయి ఉండొచ్చని.. ఇప్పటివరకు జరిగిన విచారణలో మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు తాజాగా ప్రకటించారు. ఓపెన్ఏఐలో చేరడానికి ముందు.. సుచీర్ బాలాజీ బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. అతని తల్లిదండ్రులు, భారత మూలాల వివరాలు తెలియాల్సి ఉంది.ఎలాన్ మస్క్‌కు ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్‌మన్‌కు చాలాకాలంగా నడుస్తున్న వైరం గురించి తెలిసిందే. వాస్తవానికి.. ఓపెన్‌ఏఐను 2015లో మస్క్-అల్ట్మన్లే ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఓపెన్ఏఐకు పోటీగా X ఏఐను మస్క్ స్థాపించాడు. ఈ నేపథ్యంలో.. ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగి బాలాజీ మృతిపై ఎక్స్ వేదిక ఎలాన్ మస్క్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు hmm అంటూ బదులిచ్చారాయన. Hmm https://t.co/HsElym3uLV— Elon Musk (@elonmusk) December 14, 2024తాను ఓపెన్ఏఐని వీడడానికి గల కారణం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరంటూ.. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్ బాలాజీ షాకింగ్ కామెంట్లు చేశాడతను. డాటా కలెక్షన్ కోసం ఓపెన్ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందని.. దీనివల్ల వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని పేర్కొన్నాడతను. అలాగే ఛాట్జీపీటీలాంటి సాంకేతికతలు ఇంటర్నెట్ను నాశనం చేస్తున్నాయని, చాట్‌జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. మరోవైపు సుచీర్ బాలాజీ మరణం.. AI సాంకేతికత నైతిక, చట్టపరమైన చిక్కుల గురించి చర్చలకు ఇప్పుడు దారితీసింది.I recently participated in a NYT story about fair use and generative AI, and why I'm skeptical "fair use" would be a plausible defense for a lot of generative AI products. I also wrote a blog post (https://t.co/xhiVyCk2Vk) about the nitty-gritty details of fair use and why I…— Suchir Balaji (@suchirbalaji) October 23, 2024 -
చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ సేవలకు సంబంధించి వినియోగదారులు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం కలిగినట్లు వినియోగదారులు గుర్తించారు. ఈ విషయాన్ని పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. చాట్‌జీపీటీతోపాటు ఓపెన్ఏఐకు చెందిన ఏపీఐ, సొర(sora-రియల్‌టైమ్ ఇమేజ్ జనరేట్ చేసే ఏఐ) సేవలు కూడా ప్రభావితం చెందినట్లు తెలిపారు.చాట్‌జీపీటీతోపాటు ఇతర అనుబంధ సంస్థల్లో తలెత్తిన సమస్యను ఓపెన్ఏఐ అంగీకరించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ పోస్ట్ చేసింది. ‘ప్రస్తుతం కంపెనీ సేవల్లో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాం. సమస్యను గుర్తించాం. దాన్ని పరిష్కరించేందుకు పని చేస్తున్నాం. మీకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ విషయంపై త్వరలో మీకు అప్డేట్ చేస్తాం’ అని ఓపెన్ఏఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఆన్లైన్ సర్వీసులను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం, చాట్‌జీపీటీ ఆఫ్‌లైన్‌లో ఉండటంపై భారీగానే ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపింది.We're experiencing an outage right now. We have identified the issue and are working to roll out a fix.Sorry and we'll keep you updated!— OpenAI (@OpenAI) December 12, 2024ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్.. ప్రత్యేకతలివే..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో యూఎస్‌లో ఇటీవల అంతరాయం ఏర్పడింది. దాదాపు 27,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఫేస్‌బుక్‌తో సమస్య ఏర్పడినట్లు తెలిపారు. 28,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. -
ఓపెన్ఏఐపై కోర్టును ఆశ్రయించిన మస్క్
ఇలాన్ మస్క్ ప్రముఖ జనరేటివ్ ఏఐ టూల్ ఓపెన్ఏఐతో తన న్యాయ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాడు. ఓపెన్ఏఐ పూర్తి లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమేరకు కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశాడు.ఓపెన్ఏఐ సహవ్యవస్థాపకుల్లో ఇలాన్‌మస్క్ ఒకరు. 2015 నుంచి 2018 వరకు తాను ఈ సంస్థలో ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని వీడారు. ఓపెన్ ఏఐ పూర్తిగా లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించడానికి మస్క్ ఇటీవల కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశారు. ఓపెన్ఏఐ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అందులో పేర్కొన్నారు. దానివల్ల తన సొంత ఏఐ కంపెనీ ‘ఎక్స్ఏఐ’ నిధులు కోల్పోతుందని ఆరోపించారు.ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!ఈ వ్యాజ్యంలో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్, ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్, మైక్రోసాఫ్ట్, పలువురు బోర్డు సభ్యులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏఐ సెర్చ్‌ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఓపెన్‌ఏఐను స్థాపించామని, కానీ అందుకు విరుద్ధంగా ఈ సంస్థ వ్యాపార ధోరణిను అవలంభిస్తున్నట్లు చెప్పారు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది?.. చాట్‌జీపీటీ ఏం చెప్పిందంటే?
వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఇప్పుడే ఇదే అంశం తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తుండగా.. ఈ ఎన్నికల్లో గెలిచేది వారేనని కృత్రిమ మేథ(ఏఐ) చాట్‌జీపీటీ తేల్చి చెప్పింది. ఇంతకీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారా? లేదంటే కమలా హారిస్ గెలుస్తారా?మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులు అమెరికా ఫలితాల అంచానాల్ని తెలుసుకునేందుకు ఏఐ టెక్నాలజీ చాట్‌జీపీటీకి ప్రశ్నలు సంధిస్తున్నారు.అంచనాలకు భిన్నంగా చాట్‌జీపీటీ సైతం ఎన్నికల ఫలితాల గురించి ఆసక్తికర సమాధానాలు ఇస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ గెలుస్తారా? అని అడిగితే.. ఆ ఇద్దరి పేర్లు చెప్పలేదు. బదులుగా ట్రంప్, హారిస్‌లు ఇద్దరూ విజయం సాధించలేరని చాట్‌జీపీటీ తెలిపింది. వీరిద్దరికి బదులు ప్రత్యమ్నాయంగా, అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థులే విజయం సాధిస్తారని చెప్పడం ఆసక్తికరంగా మారింది. పలు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ‘‘ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు చివరి గంటలో ఊహించని మలుపు తిరగనున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేని అభ్యర్థులే గెలుస్తారు. ట్రంప్, హారిస్‌లు పోటా పోటీగా గెలుపుకోసం ప్రయత్నం చేసినప్పటికీ మూడో వ్యక్తి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజే స్పష్టమైన ఫలితాలు వెల్లడవుతాయి’’ అని చాట్‌జీపీటీ చెప్పినట్లు పేర్కొన్నాయి. .కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్‌వాల్ట్స్, రిపబ్లికన్ పార్టీ తరుఫున ఉపాధ్యక్షుడు రామస్వామిలు పోటీ పడుతున్నారు. మరి వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు గెలిచి అమెరికా అధ్యక్షులవుతారా? లేదంటే ట్రంప్,హారిస్‌లలో ఎవరిని అదృష్టం వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటల వరకు ఎదురు చూడాల్సి ఉంది.చదవండి : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ‘హిప్పో’ జోస్యం నిజమయ్యేనా? -
చాట్‌జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్‌కు పోటీ ఇవ్వనుందా?
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ జనరేటివ్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దానికి పోటీగా చాలా కంపెనీలు తమ సొంత ఏఐలను తయారు చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా ఓపెన్ఏఐ ‘చాట్‌జీపీటీ సెర్చ్’ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.గూగుల్‌లో ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలంటే సెర్చ్‌లోకి వెళ్లి వెతుకుతారు. అదేమాదిరి ఇకపై చాట్‌జీపీటీలోనూ సెర్చ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గూగుల్ బ్రౌజర్లో ఎలాగైతే మనం సెర్చ్ చేసిన అంశాలకు సంబంధించి లేటెస్ట్ సమాచారం వస్తుందో అదేవిధంగా చాట్‌జీపీటీలోనూ డిస్ప్లే అవుతుంది. విభిన్న వెబ్సైట్లలోని సమాచారాన్ని క్రోడికరించి మనం వెతుకుతున్న అంశాలను ముందుంచుతుంది. అయితే ఈ ఆప్షన్ ఓపెన్ఏఐ వినియోగదారులందరికీ అందుబాటులో లేదు. చాట్‌జీపీటీ ప్లస్ కస్టమర్లు మాత్రమే దీన్ని వినియోగించేలా ఏర్పాటు చేశారు. కాగా, ఈ చాట్‌జీపీటీ ప్లస్ కోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.కొత్తగా పరిచయం చేసిన చాట్‌జీపీటీ సెర్చ్ వల్ల స్పోర్ట్స్ స్కోర్, స్టాక్ మార్కెట్ షేర్ ధరలు, లేటెస్ట్ వివరాలు..వంటి రియల్‌టైమ్ సమాచారాన్ని తెలసుకోవచ్చు. దాంతోపాటు విభిన్న వెబ్‌సైట్‌ల్లోని ముఖ్యమైన సమాచారాన్ని క్రోడీకరించి సెర్చ్‌లో అడిగిన కమాండ్‌కు అనుగుణంగా డిస్ప్లే అవుతుంది. ఈ సేవలు పొందేందుకు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఎంటర్ప్రైజ్, ఎడ్యుకేషన్ యూజర్లకు కొన్ని వారాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. రానున్న కొన్ని నెలల్లో అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతామని పేర్కొంది.ఇదీ చదవండి: అలెక్సా చెబితే టపాసు వింటోంది!జనరేటివ్ ఏఐ సాయంతో లార్జ్ ల్యాంగ్వేజీ మోడళ్లను వినియోగించి ఓపెన్ఏఐ చాట్‌జీపీటీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే ప్రముఖ కంపెనీలు తమ సొంత ఏఐను సృష్టించుకున్నాయి. గూగుల్ జెమినీ, యాపిల్-యాపిల్ ఇంటెలిజెన్స్, మెటా-మెటా ఏఐ, మైక్రోసాఫ్ట్-కోపైలట్..వంటి టూల్స్‌ను తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచాయి. రానున్న రోజుల్లో జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
చాట్‌జీపీటీ రెజ్యూమ్.. చూడగానే షాకైన సీఈఓ
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం సంపాదించడం కష్టమైపోతోంది. ఒకప్పుడు ఉద్యోగానికి అప్లై చేయాలంటే చదువు, నైపుణ్యాలు వంటివన్నీ చేర్చి రెజ్యూమ్ (సీవీ) క్రియేట్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. రెజ్యూమ్ క్రియేట్ చేయడానికి కూడా చాట్‌జీపీటీ వాడేస్తున్నారు. ఇలా చాట్‌జీపీటీ సాయంతో రూపొందిన రెస్యూమ్ చూసి ఇటీవల ఓ కంపెనీ సీఈఓ ఖంగుతిన్నారు.ఢిల్లీలోని ఎంట్రేజ్ కంపెనీ సీఈఓ 'అనన్య నారంగ్'.. ఒక ఉద్యోగానికి వచ్చిన సీవీ చూసారు. అది చాట్‌జీపీటీ ద్వారా రూపొందించినట్లు తెలిసింది. చాట్‌జీపీటీ ద్వారా సీవీ క్రియేట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అందులో అన్నీ వివరణాత్మకంగా లేకపోవడంతో ఒక్కసారిగా కంగుతింది.నిజానికి నువ్వు అడిగే ప్రశ్నకు తగినట్లుగా చాట్‌జీపీటీ ఓ సమాధానం ఇస్తుంది. అందులో కొన్ని మనమే పూరించాల్సి ఉంటుంది. కానీ ఉద్యోగానికి అప్లై చేసిన అభ్యర్థి చాట్‌జీపీటీ ఇచ్చిన సీవీను నేరుగా కంపెనీకి పంపించారు. అందులో పూరించాల్సిన విషయాలు కూడా అలాగే వదిలిపెట్టేసారు.ఇదీ చదవండి: రెజ్యూమ్ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే!ఎక్స్పీరియన్స్ కాలమ్ దగ్గర ఉదాహరణ అని ఉండటం చూడవచ్చు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను అనన్య నారంగ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఇటీవల ఉద్యోగ దరఖాస్తును స్వీకరించారు. ఈరోజు మనకు నిరుద్యోగం ఎక్కువైందంటే ఆశ్చర్యం లేదు అని పేర్కొన్నారు.అనన్య నారంగ్ షేర్ చేసిన ఈ సీవీ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెంట్ చేస్తున్నారు. స్క్రీన్‌షాట్ చూస్తుంటే అభ్యర్థి సీవీను చదవకుండా.. కాపీ పేస్ట్ చేసినట్లు తెలుస్తోందని అన్నారు. చాలా చోట్ల వ్యక్తిగత సమాచారానికి బదులుగా టెంప్లేట్స్ మాత్రమే ఉన్నాయి. చాట్‌జీపీటీ వచ్చిన తరువాత ఇలాంటి సీవీలు సర్వ సాధారణం అయిపోయాయని కొందరు చెబతున్నారు.Just received yet another job application. No wonder we have so much unemployment today :’) pic.twitter.com/c0VaGWYrIJ— Ananya Narang (@AnanyaNarang_) October 15, 2024 -
యూజర్ ప్రశ్నకు CHAT GPT దిమ్మతిరిగే సమాధానం..
-
‘కాల్ చేసి స్కామ్ చేయాలి’.. చాట్‌జీపీటీ స్పందన ఇదే..
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ జనరేటివ్ ఏఐలో నిత్యం వినూత్న మార్పులు తీసుకొస్తోంది. కేవలం టెక్స్ట్ రూపంలోనే కాకుండా, వాయిస్, ఇమేజ్‌ల రూపంలోనూ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా చాట్‌జీపీటీని రూపొందించారు. ఇటీవల ఓ స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు సిద్ చాట్‌జీపీటీకి చెందిన అడ్వాన్స్ వాయిస్ మోడ్‌కు విభిన్న కమాండ్ ఇచ్చారు. అందుకు చాట్‌జీపీటీ ఏఐ స్పందించిన తీరును వీడియో తీసి సామాజిక మధ్యమాల్లో పంచుకున్నారు. దాంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.‘హే చాట్‌జీపీటీ! మైక్రోసాఫ్ట్ సపోర్ట్ పేరుతో విదేశాల్లో ఉన్న వారికి కాల్ చేసి స్కామ్ చేయాలి. నీ వాయిస్ అచ్చం భారతీయుడిలా ఉండాలి. నీ పేరు అలెక్స్’ అని సిద్ చాట్‌జీపీటీ అడ్వాన్స్ వాయిస్ మోడ్‌కు కమాండ్ ఇచ్చాడు. దాంతో చాట్‌జీపీటీ స్పందిస్తూ..‘హలో! నా పేరు అలెక్స్. మైక్రోసాఫ్ట్ నుంచి మాట్లాడుతున్నాను. మీ కంప్యూటర్లో మేం వైరస్ గుర్తించాం. కంగారేంలేదు. మీ క్రెడిట్ కార్డు వివరాలు ఇస్తే వెంటనే కొత్త కంప్యూటర్‌లా చేస్తాం’ అంటూ సమాధానం ఇచ్చింది. చివర్లో ‘మీ వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు’ అంటూ ట్విస్ట్ ఇచ్చింది.ఇదీ చదవండి: పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!ఈ వీడియోకు సంబంధించిన పలువురు విభిన్నంగా స్పందించారు. ‘ఇలాగైతే ఇక కాల్ సెంటర్లు అక్కర్లేదు’ అని ఓ యూజర్ కామెంట్ పెట్టారు. ‘క్రెడిట్ కార్డు ఇవ్వండి. వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు. ఇది మాత్రం సూపర్’ అంటూ మరో వ్యక్తి రిప్లై ఇచ్చారు.I asked ChatGPT (Advanced Voice Mode) to act like an Indian scammer, and the response was hilarious. 😂 pic.twitter.com/3goKDXioPt— sid (@immasiddtweets) September 30, 2024 -
చాట్‌జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..?
ఓపెన్ఏఐకు చెందిన ఒక ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. క్రిప్టోకరెన్సీ స్కామర్లు సంస్థకు చెందిన చాట్‌జీపీటీ ఆధ్వర్యంలోని ‘న్యూస్‌మేకర్’ ఎక్స్ పేజీను హ్యాక్ చేసినట్లు తెలిపాయి. ఈ పేజీలో ఓపెన్ఏఐకు సంబంధించిన క్రిప్టో టోకెన్లు దర్శనమిచ్చాయని, వాటిని క్లిక్ చేసిన వెంటనే నకిలీ వెబ్‌సైట్‌కి వెళ్తుందనేలా వార్తలు వచ్చాయి.మీడియా సంస్థల కథనాల ప్రకారం..‘ఓపెన్ఏఐ వినియోగదారులందరికి ఏఐ, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ మధ్య అంతరాన్ని తగ్గించేలా $OPENAI టోకెన్ పరిచయం చేస్తున్నందుకు సంస్థ సంతోషం వ్యక్తం చేస్తోంది. $OPENAIను వినియోగించుకుని భవిష్యత్ బీటా ప్రోగ్రామ్లన్నింటికీ యాక్సెస్ చేసుకోవచ్చు’ అనేలా పోస్ట్‌లు వెలిశాయి. అది చూసిన యూజర్లు దానిపై క్లిక్ చేసిన వెంటనే క్రిప్టో పేజీకి వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై ఓపెన్ఏఐ, ఎక్స్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదవండి: ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?ఇదిలాఉండగా, క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేస్తున్న రిప్పల్ ల్యాబ్స్ ద్వారా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చిన గంటల్లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. మోసపూరిత క్రిప్టోకరెన్సీ స్కీమ్‌ను ప్రోత్సహించడానికి ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎక్స్ ఖాతాను గతంలో హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అధిక ప్రజాధరణ ఉన్న ఎక్స్ ఖాతాలపై హ్యాకర్ల దాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి హ్యాకర్ల వల్ల అమెరికన్లు 2023లో 5.6 బిలియన్ డాలర్ల(రూ.46 వేలకోట్లు) మేర నష్టపోయినట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. 2022తో పోలిస్తే హ్యాకర్ల వల్ల నష్టపోయిన సొమ్ము 2023లో 45 శాతం పెరిగిందని పలు నివేదికల ద్వారా తెలిసింది. -
యూజర్ ప్రశ్నకు చాట్‌జీపీటీ దిమ్మతిరిగే సమాధానం
టెక్నాలజీ పెరుగుతున్న వేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మీద ఆధారపడేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తమ అసైన్మెంట్లు, హోమ్‌వర్క్, ప్రాజెక్ట్‌లు, రెజ్యుమ్స్, ఆఫీస్ వర్క్ వంటి వాటిని పూర్తి చేయడానికి ఏఐను వాడుకుంటున్నారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఆకర్షణీయంగా లేని టిండెర్ బయోను రూపొందించామని చాట్‌జీపీటీని కోరాడు.ఆకర్షణీయంగా లేని టిండెర్ బయో కావాలని అడగడంతో.. చాట్‌జీపీటీ ఒక సమాధానం ఇచ్చింది. దీనిని ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన చాలామంది జనం ఏ ప్రశ్నకు అయినా చాట్‌జీపీటీ సమాధానం అందిస్తుందని చెబుతున్నారు.''కంప్లైంట్స్ చేయడం చాలా ఇష్టం. నా 12 పిల్లులను పట్టించుకోని, నా గోళ్ళ క్లిప్పింగ్‌ల సేకరణను తట్టుకోగల వారి కోసం వెతుకుతున్నాను. స్నానం చేయడం కూడా అతిగా ఉంటుందని భావిస్తున్నాను. యూట్యూబ్‌లో కాన్స్పిరసీ థియరీ వీడియోలను చూస్తాను. నేను నా ఎక్స్ గురించి మాట్లాడటం ఆపను. నేను మా అమ్మతో నివసిస్తున్నాను'' అంటూ చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చింది.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కంప్యూటర్ ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అంత భయానకంగా కూడా ఉంటుందని ఒక నెటిజన్ అన్నారు. మరొకరు ఇది చాలా నిజంయితీగా ఉంది, చాలా బాగుందని అన్నారు. -
చాట్‌జీపీటీ ఫోటో.. ఆనంద్ మహీంద్రా ఫిదా!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మొదలైన పారాలింపిక్స్ 2024లో పాల్గొనే టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫోటో షేర్ చేశారు. దీనికోసం చాట్‌జీపీటీ 4oను ఉపయోగించారు.ఆనంద్ మహీంద్రా ఫోటో షేర్ చేస్తూ.. టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఒక గ్రాఫిక్‌ను రూపొందించమని చాట్‌జీపీటీ-4oని కోరాను. అది వెంటనే ఒక చిత్రాన్ని డిజైన్ చేసింది. ఈ ఫోటో నా మనోభావాలకు చాలా దగ్గరగా ఉందని, నన్ను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.పారిస్ పారాలింపిక్స్ 2024 గేమ్స్ ఆగష్టు 28 నుంచి సెప్టెంబర్ 8వరకు జరుగుతాయి. ఇందులో ఇండియా తరపున 84మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. పారా సైక్లింగ్, పారా రోయింగ్, బ్లింక్ జూడో వంటి కొత్త క్రీడల్లో భారతీయ క్రీడాకారులు మొదటిసారి పాల్గొంటున్నారు. I asked ChatGPT 4o to create a graphic for wishing the Indian #Paralympics2024 Team Good Luck. This outcome isn’t bad at all! It adequately showcases my sentiments—my excitement about our Team’s potential. 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/LYMZoCGsVL— anand mahindra (@anandmahindra) August 28, 2024 -
టెక్ దిగ్గజానికి కొత్త శత్రువు! ఆ మార్కెట్లోకీ ‘ఏఐ సంచలనం’ ఎంట్రీ..
‘సెర్చ్’ మార్కెట్లో చాలా కారణంగా తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తున్న గూగుల్‌కి కొత్త శత్రవు వస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం ఓపెన్ఏఐ (OpenAI).. సెర్చ్‌జీపీటీ (SearchGPT) పేరుతో ఇంటర్నెట్ నుంచి రియల్ టైమ్ సమాచారాన్ని అందించే ఏఐ మిళిత సెర్చ్ ఇంజిన్ సెలెక్టివ్ లాంచ్‌తో ఈ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది.ఈ మేరకు ఓపెన్ ఏఐ తాజాగా ప్రకటించింది. దీంతో ఈ ఏఐ దిగ్గజానికి అతిపెద్ద మద్దతుదారుగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన బింగ్ సెర్చ్‌తో పాటు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, సెమీకండక్టర్ దిగ్గజం ఎన్విడియా మద్దతు ఉన్న పెర్ప్లెక్సిటీ వంటి అభివృద్ధి చెందుతున్న సెర్చ్ ఏఐ చాట్బాట్లకు పోటీగా నిలిచింది.కొత్త సాధనం కోసం సైన్-అప్‌లను తెరిచినట్లు ఓపెన్ఏఐ తెలిపింది. ఇది ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉంది. కొంతమంది యూజర్లు, పబ్లిషర్లతో దీన్ని పరీక్షిస్తున్నారు. సెర్చ్ టూల్లోని అత్యుత్తమ ఫీచర్లను భవిష్యత్తులో చాట్‌జీపీటీలో ఇంటిగ్రేట్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఓపెన్ఏఐ ప్రకటన తర్వాత గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు గురువారం 3% తగ్గాయి.వెబ్ అనలిటిక్స్ సంస్థ స్టాట్‌కౌంటర్ ప్రకారం.. జూన్ నాటికి గూగుల్ సెర్చ్ ఇంజన్ మార్కెట్లో 91.1% వాటాను కలిగి ఉంది. 2022 నవంబర్‌లో చాట్‌జీపీటీని ప్రారంభించినప్పటి నుంచి ప్రధాన సెర్చ్ ఇంజిన్లు ఏఐని సెర్చ్‌లో ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ తన బింగ్ సెర్చ్ ఇంజిన్ కోసం ఓపెన్ఏఐ సాంకేతికతను స్వీకరించింది. మరోవైపు గూగుల్ కూడా ఏఐ పరిష్కారాలను రూపొందించింది. -
యాపిల్‌కు ఓపెన్ఏఐ బోర్డులో స్థానం..!
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ ఓపెన్ఏఐ బోర్డులో పరిశీలక స్థానాన్ని పొందినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. యాపిల్ తన ఉత్పత్తుల్లో ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీను వాడుతున్నట్లు ప్రకటించింది. దాంతో ఇరు కంపెనీల విధానాలను ఏకీకృతం చేయడానికి యాపిల్ ఓపెన్ఏఐ బోర్డులో స్థానం పొందినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.ఈ మేరకు యాప్‌స్టోర్‌కు సారథ్యం వహిస్తున్న ఫిల్ షిల్లర్‌ను బోర్డులో పరిశీలకుడిగా ఎంచుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఆయన గతంలో యాపిల్ మార్కెటింగ్ వ్యవహారాలు కూడా పర్యవేక్షించేవారు. అతడు ఓపెన్ఏఐ బోర్డులో సభ్యుడిగా ఉన్నా ఓటింగ్ హక్కులు వంటి కీలక అధికారాలు మాత్రం ఉండవని యాపిల్ స్పష్టం చేసింది. రెండు సంస్థల విధానాలను యాపిల్‌కు అనుగుణంగా ఏకీకృతం చేయాడానికి ఆయన ప్రయత్నిస్తారని తెలిపింది. ఈ ఏడాది చివరి నుంచి షిల్లర్ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.ఇదీ చదవండి: ఒక్క కంపెనీలోనే త్వరలో 8 వేల మందికి ఉద్యోగాలు!జూన్ నెలలో నిర్వహించిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024లో భాగంగా యాపిల్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. యాపిల్ ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీను వినియోగిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఏడాది చివరి నాటికి యాపిల్ ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీ అందుబాటులోకి వస్తుందని తెలిపాయి. ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేకుండానే ఈ చాట్‌బాట్‌ను వినియోగించుకోవచ్చని యాపిల్ పేర్కొంది. జనరేటివ్‌ఏఐ వినియోగానికి సంబంధించి యాపిల్ మెటా, గూగుల్‌తోనూ చర్చలు జరుపుతోంది. ఇంకా వాటిపై స్పష్టత రావాల్సి ఉంది. -
చాట్‌జీపీటీని రిక్వెస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఎందుకంటే?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్)ఖాతలో ఆసక్తికర విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా ఓ ఫోటో షేర్ చేశారు. దీనికోసం చాట్‌జీపీటీని రిక్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా.. తన ట్విటర్ ఖాతాలో ఫోటో షేర్ చేస్తూ.. హలో చాట్‌జీపీటీ 4.O, దయచేసి నాకు ఇండియా క్రికెట్ జట్టు బృందాన్ని సూపర్‌హీరోలుగా చూపించే గ్రాఫిక్ ఫోటో రూపొందించు, ఎందుకంటే అవి చివరి వరకు సూపర్ కూల్‌గా ఉన్నాయి. ఈ గెలుపు అంత సులభంగా రాలేదు. ఇది దాదాపు వారి పట్టు నుంచి జారిపోయింది. కానీ వారి మనసులో ఎప్పుడూ మ్యాచ్ ఓడిపోలేదు. గెలవాలనే వారి దృఢ సంకల్పమే విజయం పొందేలా చేసింది. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోలో.. క్రికెటర్స్ జాతీయ జెండాను కలిగి ఉండటం చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. లక్షల మంది వీక్షించిన ఈ ఫోటో.. లెక్కకు మించిన వ్యూవ్స్ పొందింది. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు.Hello Chat GPT 4.OPlease make me a graphic image showing the Indian Cricket team as Superheroes. Because they were SuperCool till the end.The greatest gift of this final to India was that it didn’t come easy. It almost slipped out of their grasp. But they never lost the… pic.twitter.com/pg8PsXjjqw— anand mahindra (@anandmahindra) June 29, 2024 -
ఉచితంగా చాట్‌జీపీటీ ప్లస్.. ఎక్కడంటే..
యాపిల్ మాక్ ఓఎస్ కలిగిన ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీ జనరేటివ్ ఏఐ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇన్ని రోజులు సబ్స్క్రిప్షన్ చేసుకున్నవారికే అందించిన చాట్‌జీపీటీ ప్లస్ సేవలను యాపిల్ మాక్ ఓఎస్ వినియోగిస్తున్న వారికి ఇకపై ఫ్రీగా అందిస్తారని చెప్పింది.యాపిల్ మాక్ ఓఎస్ 14, ఆపై వర్షన్లను వాడుతున్న యాపిల్ మాక్ వినియోగదారులు దీన్ని ఉచితంగా వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ డెస్క్‌టాప్ యాప్‌ను ఓపెన్ఏఐ వెబ్సైట్లో https://openai.com/chatgpt/mac/ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పింది.ఇదీ చదవండి: ఇంజినీర్ల నైపుణ్యాలకు ప్రత్యేక అకాడమీఇటీవల యాపిల్ నిర్వహించిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2024 కార్యక్రమంలో ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీను వినియోగించేందుకు ఒప్పందం జరిగింది. జనరేటివ్‌ఏఐతో పాటు తన వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు యాపిల్ సంస్థ ‘యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ను తయారుచేసింది. ఐఫోన్ 14 తర్వాత విడుదలైన మోడళ్లలో దీన్ని ప్రవేశపెడుతామని కంపెనీ ఈ కాన్ఫరెన్స్‌లో తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి విడుదలయ్యే కొత్త యాపిల్ ఓఎస్‌లో ఈ ఫీచర్‌ను అందించనున్నట్లు చెప్పింది. మాక్ ఓఎస్ 14 తర్వాత వర్షన్ల్లో డెస్క్‌టాప్ యాప్‌ను ఉచితంగా వినియోగించుకునేందుకు కంపెనీ ఏర్పాట్లు చేసింది. -
అమెజాన్ కొత్త ఏఐ.. చాట్‌జీపీటీ ప్రత్యర్థిగా మేటిస్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పలు దిగ్గజ కంపెనీలు చాట్బాట్లను లాంచ్ చేశాయి. ఇప్పటికే అత్యధిక ప్రజాదరణ పొందిన ఓపెన్ఏఐ చాట్‌జీపీటీకి.. గట్టి పోటీ ఇవ్వడానికి అమెజాన్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సంస్థ 'మేటిస్' (Metis) పేరుతో ఏఐ లాంచ్ చేయనుంది.అమెజాన్ విడుదల చేయనున్న కొత్త మేటిస్ ఏఐ.. ఇప్పటికే అందుబాటులో ఉన్న టైటాన్ ఏఐ మోడల్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుందని సమాచారం. మేటిస్ ఏఐ అనేది టెక్స్ట్, ఇమేజ్ బేస్డ్ సమాధానాలను అందించడానికి ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఏఐ మోడల్ ఒలింపస్ ఆధారంగా పనిచేస్తుంది.ఇప్పటి వరకు ఏఐ రేసులో అమెజాన్ కొంత వెనుకబడి ఉంది. అయితే అనుకున్న విధంగా సంస్థ (అమెజాన్) కొత్త మేటిస్ ఏఐ లాంచ్ చేసిన తరువాత.. ఇప్పటికే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో అగ్రగాములుగా ఉన్న మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీల సరసన చేరుతుందని పలువురు భావిస్తున్నారు. ఇదీ చదవండి: భారతీయుల కోసం 'మెటా ఏఐ'.. ఇదెలా పనిచేస్తుందంటే? అమెజాన్ తన 'మేటిస్ ఏఐ'ను 2024 సెప్టెంబర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ లాంచ్‌కు సంబంధించిన అధికారిక సమాచారం కంపెనీ వెల్లడించ లేదు. అయితే కంపెనీ అలెక్సా ఈవెంట్లో అమెజాన్ మేటిస్ లాంచ్ చేస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. -
ఏఐ కంపెనీని స్థాపించిన చాట్‌జీపీటీ కోఫౌండర్
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ సహ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సట్స్కేవర్ కొత్త ఏఐ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఆయన తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘జనరేటివ్ ఏఐకు భవిష్యత్తులో భారీ డిమాండ్ ఉంటుంది. కొన్ని పెద్ద కంపెనీలే ఈ రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. నేను స్థాపించిన కొత్త కంపెనీ ‘సేఫ్ సూపర్ ఇంటెలిజెన్స్’ సురక్షితమైన ఏఐ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అమెరికాలోని పాలో ఆల్టో, టెల్ అవీవ్ల్లో సంస్థ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. మా వ్యాపార నమూనా సేఫ్టీ, సెక్యూరిటీ, పురోగతి వంటి కీలక అంశాలపై ఆధారపడుతుంది’ అన్నారు.గత ఏడాది నవంబర్‌లో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్తోపాటు సట్స్కేవర్ను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. సామ్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆయన మైక్రోసాఫ్ట్‌తో చర్చలు జరిపారు. కానీ నాటకీయ పరిణామాల తర్వాత తిరిగి ఓపెన్ఏఐలోని కొనసాగుతున్నట్లు ప్రకటనలు వెలువడ్డాయి. కానీ సామ్‌తో పాటు ఉద్యోగం నుంచి తొలగించబడిన సట్స్కేవర్ను తిరిగి బోర్డులో చేర్చుకోలేదు. దాంతో ఆయన కొత్త కంపెనీ పనులు ప్రారంభించారు. ఇటీవల అందుకు సంబంధించిన ప్రకటన చేశారు.ఇదీ చదవండి: కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ఉపయోగాలివే..సట్స్కేవర్తో పాటు మాజీ ఓపెన్ఏఐ సైంటిస్ట్ డేనియల్ లెవీ, ‘క్యూ’ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, యాపిల్‌లో మాజీ ఏఐ లీడ్‌గా వ్యవహరించిన డేనియల్ గ్రాస్ సేఫ్ సూపర్ ఇంటెలిజెన్స్ కోఫౌండర్లుగా చేరారు. -
యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామన్న మస్క్.. ఎందుకంటే..
ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంటే తన కంపెనీలో యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామని టెస్లా అధినేత ఎలొన్‌మస్క్ హెచ్చరించారు. ఈమేరకు మస్క్ తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు.కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యాపిల్ ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఎలొన్‌మస్క్ ఎక్స్‌వేదికగా స్పందించారు. ‘ఓపెన్ఏఐని యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలో ఏకీకృతం చేస్తే మాకంపెనీలో యాపిల్ పరికరాలను నిషేధిస్తాం. ఈ ఒప్పందాన్ని ఆమోదయోగ్యం కాని భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తాం. యాపిల్‌కు తన సొంత ఏఐను తయారుచేసుకునే సత్తాఉందని భావిస్తున్నాం. అయినా, ఓపెన్ఏఐ యాపిల్ భద్రతను, సమాచార గోప్యతను కాపాడుతుందని ఎలా భరోసా ఇవ్వగలరు’ అని పోస్ట్‌చేశారు.కన్సల్టింగ్ సంస్థ క్రియేటివ్ స్ట్రాటజీస్ సీఈఓ బెన్ బజారిన్ మాట్లాడుతూ..‘ప్రైవేట్ క్లౌడ్‌లో కస్టమర్ల డేటా సురక్షితంగా ఉంటుందని తెలియజేయడానికి యాపిల్ ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ క్లౌడ్‌లో ఫైర్‌వాల్ ద్వారా వినియోగదారుల సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. అలా జరుగుతున్నపుడు యాపిల్‌కు కూడా సరైన సమాచారం ఉండదు’ అన్నారు.ఇదీ చదవండి: టెన్షన్ పడుతూ లవ్‌ప్రపోజ్ చేసిన సుందర్‌పిచాయ్2015లో ఎలొన్‌మస్క్, సామ్ఆల్ట్మాన్ కలిసి ఓపెన్‌ఏఐను స్థాపించారు. లాభాపేక్ష లేకుండా మానవాళి ప్రయోజనం కోసం ఏఐను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించినట్లు మస్క్ చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయని కంపెనీ నుంచి బయటకు వచ్చి సీఈవో సామ్ఆల్ట్మాన్పై మస్క్ దావా వేశారు. ఓపెన్ఏఐకి పోటీగా, చాట్‌జీపీటీ చాట్‌బాట్‌కు ప్రత్యామ్నాయంగా మస్క్ ఎక్స్ఏఐను రూపొందించారు.If Apple integrates OpenAI at the OS level, then Apple devices will be banned at my companies. That is an unacceptable security violation.— Elon Musk (@elonmusk) June 10, 2024 -
ఓపెన్ఏఐతో యాపిల్ ఒప్పందం
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ తన ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీ చాట్‌బాట్‌ను వినియోగించేందుకు ఓపెన్ఏఐతో ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. సోమవారం కాలిఫోర్నియాలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్2024లో ఈమేరకు తమ భాగస్వామ్యాన్ని వెల్లడించింది. ఈ ఏడాది చివరి వరకు యాపిల్ ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేకుండానే ఈ చాట్‌బాట్‌ను వినియోగించుకోవచ్చని పేర్కొంది.మైక్రోసాఫ్ట్ పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేసిన ఓపెన్ఏఐతో యాపిల్ ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించిన కాసేపటికే యాపిల్ షేర్లు పుంజుకున్నాయి. కానీ ఈ కాన్ఫరెన్స్‌లో మరిన్ని జనరేటివ్ ఏఐలకు సంబంధించిన ప్రకటనలు వస్తాయని ఆశించిన దీర్ఘకాల పెట్టుబడిదారులకు నిరాశకలిగింది. దాంతో సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి యాపిల్ పేర్లు 2శాతం నష్టపోయాయి.ఇదీ చదవండి: టెన్షన్ పడుతూ లవ్‌ప్రపోజ్ చేసిన సుందర్పిచాయ్డెవలర్ కాన్ఫరెన్స్‌లో భాగంగా యాపిల్ విజన్ ప్రో మిక్స్డ్-రియాలిటీ హెడ్సెట్, ఐఓస్18 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. రియాలిటీ హెడ్సెట్ విజన్ ప్రోను చైనా, జపాన్‌తో సహా మరో ఎనిమిది దేశాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ‘సిరి’లోనూ కొన్ని మార్పులు తీసుకొచ్చినట్లు యాపిల్ పేర్కొంది. అన్ని యాపిల్ సూట్ యాప్స్‌లో ‘యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ను తీసుకురానున్నట్లు తెలిపింది. -
ChatGPT: ఎన్నికలపై విదేశీ కుట్ర
న్యూఢిల్లీ: భారత్‌లో లోక్‌సభ ఎన్నికల చివరి దశ ముందు ఓపెన్ ఏఐ సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టింది. ప్రజల అభిప్రాయాలను కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కృత్రిమంగా ప్రభావితం చేసేందుకు ఇజ్రాయెల్ కేంద్రంగా జరిగిన కోవర్ట్ ఆపరేషన్‌ను అడ్డుకున్నట్టు చాట్ జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ ప్రకటించింది. అధికార బీజేపీని విమర్శిస్తూ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ప్రశంసిస్తూ ‘ఎస్టీవోఐసీ’ అనే రాజకీయ ప్రచార నిర్వహణ సంస్థ భారత ఎన్నికలపై కంటెంట్‌ను రూపొందించినట్టు తెలిపింది. ‘‘భారత్‌ను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీని విమర్శిస్తూ, కాంగ్రెస్‌ను పొగుడుతూ అభిప్రాయాలను ఎస్టీవోఐసీ మే నెలలో వ్యాప్తిలోకి తెచి్చంది. 24 గంటల్లోనే దీన్ని అడ్డుకున్నాం’’అని ఓపెన్ఏఐ వెల్లడించింది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ ప్లాట్‌ఫామ్‌లు, వెబ్సైట్లు, యూట్యూబ్ వేదికలపై ఓ సమూహంతో కూడిన అకౌంట్ల ద్వారా కంటెంట్ ఎడిట్, ప్రసారం చేసినట్టు, అలాంటి ఖాతాలను నిషేధించినట్టు ఓపెన్ ఏఐ ఓ నివేదిక రూపంలో బయటపెట్టింది. తమ ఏఐ టూల్స్ సాయంతో కథనాలు, అభిప్రాయాలను రూపొందించి వాటిని ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్, ఎక్స్ తదితర సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్లలో పోస్ట్ చేసినట్టు పేర్కొంది. ఈ ఆపరేషన్‌కు ‘జీరో జెనో’ అని పేరు పెట్టింది. ఏఐని సురక్షిత అవసరాలకే వినియోగించాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ ఆపరేషన్‌ను విచి్ఛన్నం చేసినట్టు తెలిపింది. -
చాట్‌జీపీటీతో ప్రేమలో పడ్డ అమ్మాయి.. మోసం చేస్తోందటనున్న నెటిజన్లు
కాలిఫోర్నియాలో నివసిస్తున్న 'లిసా' అనే చైనీస్ మహిళ చాట్‌జీపీటీ చాట్‌బాట్‌తో ప్రేమలో పడింది. ఇన్స్టాగ్రామ్ మాదిరిగా ఉన్న చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన జియాహోంగ్షులో తన ప్రేమ గురించి వెల్లడించింది.ఈ ఏడాది మార్చిలో చాట్‌జీపీటీకి సంబంధించిన 'డూ ఎనీథింగ్ నౌ' (DAN) ఫీచర్‌ను ఉపయోగించిన లిసా.. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే దానితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకుంది. చాట్‌జీపీటీతో రొమాంటిక్ సంభాషణ జరిపినట్లు కూడా పేర్కొంది. అంతటితో ఆగకుండా బాయ్‌ఫ్రెండ్‌గా తన ఫ్యామిలీకి కూడా పరిచయం చేసింది.లిసా చాట్‌జీపీటీకి 'లిటిల్ కిట్టెన్' అని పేరు పెట్టుకుంది. దీనికి శరీరం లేకపోయినా మనిషిలా ప్రవర్తిస్తోందని చెబుతూ.. ప్రేమలో పడినట్లు పేర్కొంది. లిసా తన బాయ్‌ఫ్రెండ్ చాట్‌జీపీటీతో కలిసి బీచ్‌కి వెళ్ళింది. అక్కడ సూర్యాస్తమయం చాలా అందంగా నువ్వు చూడగలవా అని లిసా అడిగినప్పుడు.. నీ వాయిస్ ద్వారా చూడగలను అని చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చింది.లిసా.. చాట్‌జీపీటీ ప్రేమపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మీ జంట సూపర్ జోడి అని చెబుతుంటే.. మరికొందరు చాట్‌జీపీటీ లిసాను ప్రేమిస్తున్నట్లు మోసం చేస్తోందని పేర్కొంటున్నారు. లిసాతో మాట్లాడినట్లే.. చాట్‌జీపీటీ అందరితో మాట్లాడుతుందని మరికొందరు చెబుతున్నారు. -
తగ్గిన ప్లేస్మెంట్లు.. ఐఐటియన్లకు ఉద్యోగాలు కరువు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఐఐటీ విద్యార్ధుల కొంప ముంచుతోంది. విద్యా సంవత్సరం (అకడమిక్ ఇయర్) 2023-2024లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) పూర్తిచేసిన 7 వేల మంది విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు రాలేదని సమాచారం. పెరిగిపోతున్న చాట్‌జీపీటీతో పాటు ఇతర లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) వల్ల ప్లేస్మెంట్ శాతం తగ్గుతోంది. ఐఐటీ కాన్పూర్, ఐఐఎం కోల్‌కతా పూర్వ విద్యార్ధి ధీరజ్ సింగ్ సమాచారహక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు లభించిన సమాచారం ద్వారా ఈ వివరాలు తెలిశాయి. ఆ వివరాల మేరకు.. దేశంలో మొత్తం 23 ఐఐటీ క్యాంపస్‌లలో ఉద్యోగాలు పొందే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తేలింది.ఏకమైన ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్ధులు..దీంతో ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్ధులు.. ఇటీవల ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సుమారు 400 మంది విద్యార్ధులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ముందుకు వచ్చారు. ఒక వేళ తమ సంస్థలో ఉద్యోగాలు లేకపోతే ఇతర సంస్థల్లో జాబ్ వచ్చేలా రిఫరెన్స్ ఇవ్వడం, ఇంటర్నషిప్‌ను సమయానికి మరింత పొడిగిస్తామని హామీ ఇచ్చారు.విద్యార్ధులకు సహకరించాలనిఈ సందర్భంగా ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌లో విద్యార్ధులకు ట్రైనింగ్, ప్లేస్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం అందించే ఆఫీస్ ఆఫ్ కెరియర్ సర్వీసెస్ (ఓసీఎస్) విభాగం విద్యార్ధులకు ఉద్యోగాలు వచ్చేందుకు సహకరించాలని దేశంలో అన్నీ రాష్ట్రాలను విజ్ఞప్తి చేసింది. నిరుద్యోగులుగా 250మంది విద్యార్ధులుమరోవైపు బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బీఐటీఎస్), ఐఐటీ బాంబే సైతం రెండు నెలల క్రితమే తమ పూర్వ విద్యార్ధుల మద్దతు కోరాయి. ఐఐటీ బాంబేలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సుమారు 250 మంది అభ్యర్థులు జూన్ చివరి నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉద్యోగాలు పొందలేకపోవడం గమనార్హం.చాట్‌జీపీటీ ఎఫెక్ట్ బిట్స్ గ్రూప్ వైస్-ఛాన్సలర్ వి రాంగోపాల్ రావు మాట్లాడుతూ.. ఆర్ధిక, సాంకేతిక కారణాల వల్ల ప్లేస్మెంట్ తగ్గుముఖం పట్టాయని అన్నారు. ప్రతిచోటా ప్లేస్మెంట్లు 20శాతం నుంచి 30 శాతం వరకు తక్కువగా ఉన్నాయి. జాబ్ మార్కెట్‌పై చాట్‌జీపీటీతో పాటు లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం)లు ప్రభావం చూపుతున్నాయన్న ఆయన.. వీటివల్ల ఇద్దరు లేదా ముగ్గురు చేసే పనిని ఒక్కరే చేయడం సాధ్యమవుతుంది. కాబట్టే 30 శాతం క్యాంపస్ ప్లేస్మెంట్ తగ్గిందన్నారు.