
ChatGPT for Android users: ఓపెన్ ఏఐకిచెందిన పాపులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ చాట్ జీపీటీ ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చాట్ జీపీటీ యాప్ ఎట్టకేలకు వచ్చే వారమే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఇది ఐవోఎస్ యూజర్లకు ఈ ఏడాది మేలోనే అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇపుడిక ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. వచ్చే వారం ఈ యాప్ అధికారికంగా అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పటికే ఈ యాప్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. బ్రౌజర్ ద్వారా అందుబాటులో ఉన్న చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ అప్లికేషన్ వినియోగదారుల కోసం చాట్‌బాట్‌కి సులభంగా త్వరితగతిన సేవలు అందించనుంది. Chat GPT CTO మీరా మురాఠీ చేసిన ట్వీట్ ఇది.
We’re rolling out ChatGPT for Android users next week https://t.co/3tNLNcG5Kw
— Mira Murati (@miramurati) July 21, 2023
చాట్ జీపీటీ రిజిస్ట్రేషన్
♦ గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి చాట్‌జీపీటీ అని సెర్చ్ చేయాలి
♦ ఇన్ స్టాల్ పై క్లిక్ చేసి, ఒకే చేయాలి.
♦ ఒకసారి యాప్ లాంచ్ అయిన తరువాత, ఈ యాప్ ఆటోమేటిక్ గా ఇన్ స్టాల్ అవుతుంది.
♦ అంతేకాదు.. ఆటోమెటిక్ ఇన్ స్టాలేషన్ వద్దు అనుకుంటే అన్ రిజిస్టర్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
కాగా చాట్‌పీజీటీ గతేడాది (2022 నవంబరు) అందుబాటులోకి వచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ఇంటర్నెట్ ప్రపంచంలో సునామిలా దూసుకొచ్చింది. ప్రారంభించిన రెండు నెలల్లోనే 100 మిలియన్లకు డౌన్‌లోడ్లను నమోదు చేసింది. తొలుత వెబ్ అప్లికేషన్‌గా వచ్చినప్పటికీ, ఈ ఏడాది మే లో ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దాదాపు మూడునెలల తరువాత ఇపుడిక ఆండ్రాయిడ్ యూజర్లకు చాట్‌జీపీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.