Android operating system
-
జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సప్ జనవరి 1, 2025వ తేదీ నుంచి కొన్ని ఫోన్లలో పని చేయదని మెటా ప్రకటించింది. ఇప్పటికీ చాలామంది వినియోగదారులు ఆండ్రాయిడ్ పాత వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపింది. దాంతో వాట్సప్ అప్డేట్లు విడుదల చేసినప్పుడు ఆయా డివైజ్‌ల్లో పని చేయడం లేదని పేర్కొంది. వినియోగదారులకు మెరుగైన సర్వీసు, భద్రతను అందించేందుకు కంపెనీ అందిస్తున్న అప్డేట్లను పాత ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న వారు అందుకోలేకపోతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. భవిష్యత్తులో భద్రత కారణాల వల్ల కొన్ని ఫోన్లలో వాట్సప్‌ను నిలిపేస్తున్నట్లు తెలిపింది. జనవరి 1, 2025 నుంచి వాట్సాప్ పని చేయని డివైజ్‌ల లిస్ట్‌కు ప్రకటించింది.సాంసంగ్: గెలాక్సీ ఎస్3, గెలాక్సీ నోట్ 2, గెలాక్సీ ఏస్ 3, గెలాక్సీ ఎస్4 మినీమోటరోలా: మోటో జి (1వ జనరేషన్), రేజర్ హెచ్డీ, మోటో ఈ 2014హెచ్‌టీసీ: వన్ ఎక్స్, వన్ ఎక్స్+, డిజైర్ 500, డిజైర్ 601ఎల్జీ: ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, జీ 2 మినీ, ఎల్ 90సోనీ: ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా ఎస్పీ, ఎక్స్‌పీరియా టీ, ఎక్స్‌పీరియా వీయాపిల్ ఓఎస్‌లోనూ..ఆండ్రాయిడ్‌తోపాటు యాపిల్ ఓఎస్ ఇన్స్టాల్ అయిన కొన్ని పరికరాల్లోనూ వాట్సప్ పని చేయదని మెటా తెలిపింది. అయితే అందుకు మే 5 వరకు గడువు ఉందని పేర్కొంది. జనవరి నుంచి ఐదు నెలల నోటీస్ పీరియడ్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఐఓఎస్ 15.1 వర్షన్ కంటే ముందున్న ఓఎస్‌లు వాడుతున్న డివైజ్‌ల్లో వాట్సప్ పనిచేయదని కంపెనీ తెలిపింది. కంపెనీ వివరాల ప్రకారం ప్రధానంగా ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ వాడుతున్న వినియోగదారులపై ఈ ప్రభావం పడుతుంది.ఇదీ చదవండి: అప్పుడు పరీక్షలో ఫెయిల్.. గూగుల్‌లో జాబ్: జీతం తెలిస్తే..అప్డేట్లు ఎందుకు అవసరం అంటే..ఆన్లైన్ యాప్‌లు నిత్యం కొత్త అప్డేట్లు తీసుకొస్తుంటాయి. కొన్ని అప్డేట్లు వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీసు అందించేలా ఉంటే, మరికొన్ని భద్రత పరమైనవి ఉంటాయి. పాత డివైజ్‌ల్లోని హార్డ్‌వేర్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేయవు. దాంతో కొత్తగా వస్తున్న యాప్ అప్డేట్లు పాత ఓఎస్‌ల్లో పని చేయవు. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏదైనా అప్డేట్లు వస్తున్నప్పుడు అందుకు వీలుగా ఓఎస్‌లు, డివైజ్‌ల్లోని యాప్‌లను అప్డేట్ చేసుకోవడమే మేలని కొందరు సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
కొత్త ఆండ్రాయిడ్15లో అబ్బురపరిచే ఫీచర్లు
సరికొత్త గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15 అందుబాటులోకి వచ్చేసింది. స్మార్ట్ఫోన్లను మరింత మెరుగ్గా చేసేందుకు ఇందులో అనేక కొత్త ఫీచర్లను జోడించారు. వీటిలో అబ్బురపరిచే కొన్ని ఫీచర్లను ఇక్కడ తెలుసుకుందాం..ప్రైవేట్ స్పేస్ప్రైవేట్ స్పేస్ అనేది వర్చువల్ లాకర్. వ్యక్తిగతమైన, గోప్యమైన యాప్‌లను ఇక్కడ ఉంచవచ్చు. ఈ యాప్‌లను మీరు మాత్రమే యాక్సెస్ చేయగలిగేలా భద్రతను ఇస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఫోన్ ఇచ్చే పేరెంట్స్‌కు ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్, షాపింగ్ వంటి యాప్‌లు ఇక్కడ సురక్షితంగా ఉంటాయి.చార్జింగ్ లిమిట్ ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ జీవిత కాలం తగ్గిపోతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆండ్రాయిడ్ 15లో 80% లిమిట్ ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ద్వారా బ్యాటరీ తొందరగా దెబ్బతినకుండా నివారించుకోవచ్చు.థెఫ్ట్ ప్రొటెక్షన్ఆండ్రాయిడ్ 15లో తీసుకొచ్చిన థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్ అసాధారణ చర్యలతో మీ ఫోన్‌ను ఎవరైనా చోరీ చేయడానికి ప్రయత్నించి ఉంటే తెలియజేస్తుంది. ఒక వేళ మీ ఫోన్ చోరీకి గురైతే మీ డేటాను రక్షించడానికి, ఫ్యాక్టరీ రీసెట్ చేయకుండా ఇది ఆటోమేటిక్‌గా లాక్ చేస్తుంది. మీ ఫోన్ నంబర్ని ఉపయోగించి వేరొక ఫోన్ నుంచి మీ ఫోన్‌ను లాక్ చేయవచ్చు.అడాప్టివ్ వైబ్రేషన్కొందరికి రింగ్ టోన్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఫోన్‌ను వైబ్రేషన్ లేదా సైలెంట్ మోడ్‌లో పెట్టుకుంటారు. మీటింగ్స్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు. అయితే దీని వల్ల కొన్నిసార్లు కాల్స్ వచ్చినప్పుడు గుర్తించలేం. దీని పరిష్కారం కోసమే ఆండ్రాయిడ్ 15లో అడాప్టివ్ వైబ్రేషన్ ఫీచర్ ఇచ్చారు. సందర్భానికి అనుగుణంగా దానంతట అదే వైబ్రేషన్‌ను అడ్జెస్ట్ చేస్తుంది.యాప్ పెయిర్స్తరచూ స్ప్లిట్ స్క్రీన్ ఉపయోగించేవారి కోసమే ఈ ఫీచర్. ఏవైనా రెండు యాప్‌లను జతగా వినియోగించేవారు వాటిని సేవ్ చేసుకునే అవకాశం ఇందులో ఉంది. వీటిని హెమ్ స్క్రీన్‌పై షార్ట్‌కట్స్‌గా సేవ్ చేసుకోవచ్చు.యాప్ ఆర్కైవింగ్ఫోన్లో స్టోరేజ్ అయిపోయినప్పుడు పాత యాప్‌లను వదిలించుకోవాలి. అయితే యాప్‌ను అన్ఇన్స్టాల్ చేయడం వలన దాని డేటా మొత్తం పోతుంది. మళ్లీ ఇన్స్టాల్ చేస్తే మొదటి నుండి సెటప్ చేయాలి. దీన్ని పరిష్కరించడానికి గూగుల్ గతంలో ప్లేస్టోర్‌కి యాప్ ఆర్కైవింగ్ని జోడించింది. ఇప్పుడిదే ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 15తో ఇన్‌బిల్ట్‌గా తీసుకొచ్చింది. తొలగించిన యాప్‌ను మళ్లీ ఇన్స్టాల్ చేసినప్పడు పాత డేటా అలాగే ఉంటుంది.శాటిలైట్ ద్వారా ఎస్ఎంస్శాటిలైట్ ద్వారా ఎస్ఎంస్లు పంపించే ఈ సరికొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 15లో ప్రకటించినప్పటికీ ప్రస్తుతానికి దీన్ని ఉపయోగించలేం. క్యారియర్లు ఈ సర్వీస్‌కు ధర నిర్ణయించే పనిలో ఉన్నాయి. దీని కోసం కొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది. -
క్రోమ్‌లో ఐదు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగపడతాయంటే?
కంప్యూటర్ లేదా మొబైల్లో ఏదైనా సెర్చ్ చేయాలంటే చాలామందికి క్రోమ్ గుర్తొస్తుంది. క్రోమ్ ఇప్పుడు యూజర్ల కోసం ఐదు కొత్త ఫీచర్స్ తీసుకువచ్చింది. ఇంతకీ క్రోమ్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్స్ ఏంటి? అవి ఎలా పనిచేస్తాయని విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.👉సమీపంలో ఉండే ఏదైనా స్థలాలను సెర్చ్ చేయాలనుకున్నప్పుడు క్రోమ్ బార్లో ఎంటర్ చేయగానే మీ పనిని మరింత సులభతరం చేయడానికి మూడు ఆప్షన్స్ చూపిస్తుంది. ఉదాహరణకు మీరు ఓ రెస్టారెంట్ లేదా షాపింగ్ మాల్ వెళ్లాలనుకున్నప్పుడు.. క్రోమ్ బార్లో సెర్చ్ చేయగానే దానికి కింద కాల్, డైరెక్షన్, రివ్యూ అనేవి కనిపిస్తాయి. ఇవి షార్ట్‌కట్ బటన్స్ అన్నమాట. ఈ ఫీచర్ ఇప్పుడు కేవలం ఆండ్రాయిడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో యాపిల్ క్రోమ్‌లో కూడా అందుబాటులోకి వస్తాయి.👉ఐప్యాడ్లు, ఆండ్రాయిడ్ టాబ్లెట్లు వాటి పెద్ద స్క్రీన్ పరిమాణాలను సద్వినియోగం చేసుకోవడానికి.. క్రోమ్ అడ్రస్ బార్‌ను రిఫ్రెష్ చేసింది. ఒకసారి అడ్రస్ బార్ ఉపయోగించిన తరువాత.. మళ్ళీ తిరిగి వెళ్తే అప్పటికే హిస్టరీ లేదా వెబ్సైట్ డ్రాప్ డౌన్ క్రింద ట్రెండింగ్ అంశాలను చూపిస్తుంది.👉ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలో షార్ట్‌కట్స్ అందిస్తోంది. ఉదాహరణకు సిటీ మెట్రో కోసం సమయాలను చూడడానికి మీరు సాధారణంగా షెడ్యూల్స్ అని టైప్ చేసి ఉండవచ్చు. దాన్ని మళ్ళీ మీరు సెర్చ్ చేసినప్పుడల్లా వెంటనే కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మీ సమయాన్ని సేవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.👉ఐఓఎస్‌లో ట్రేండింగ్ సెర్చ్.. అంటే మీరు క్రోమ్ సెర్చ్ బార్లో.. సెర్చ్ చేయడానికి ముందే.. ట్రెండింగ్‌లో ఉన్న విషయాలు కింద కనిపిస్తాయి.👉ఐఓఎస్‌లో గతంలో వెతికిన విషయాలకు సంబంధించిన వార్తలు, స్పోర్ట్స్ కార్డులు డిస్కవర్ ఫీడ్‌లో కనిపిస్తాయి. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంది. మీరు మూడు-చుక్కల మెనుని ఎంచుకోవడం ద్వారా క్రోమ్ మొబైల్ యాప్‌లో డిస్కవర్ ఫీడ్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. -
ఆండ్రాయిడ్ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లు
ఆల్ఫాబెట్ ఇంక్ ఇటీవల నిర్వహించిన గూగుల్ I/O 2024 సదస్సులో ఆండ్రాయిడ్ 15 బీటా 2ను పీచర్లను ప్రకటించింది. ఈ ఫీచర్లు ఇప్పటికే పిక్సెల్ మొబైల్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. పిక్సెల్ ఫోన్‌ను గూగుల్ ప్రత్యేకంగా తయారుచేస్తోంది. దాంతో కొత్త ఫీచర్లు తమ వినియోగదారులకు ఇప్పటికే అందుబాటులో ఉంచింది.గూగుల్ ప్రకటించిన ఈ ఫీచర్లను త్వరలో ఆండ్రాయిడ్ వాడుతున్న ఇతర కంపెనీ ఫోన్లలోనూ ప్రవేశపెట్టనున్నారు. డెవలపర్ ప్రివ్యూ లేదా బీటా వెర్షన్లలో పాల్గొంటున్న వారికి ఆటోమేటిక్‌గా బీటా 2 అప్డేట్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.ఆండ్రాయిడ్ 15 బీటా 2లో కొన్ని ఫీచర్లు..ఆండ్రాయిడ్ 15 బీటా 2లో ప్రైవేట్ స్పేస్ సౌకర్యం అందిస్తున్నారు. దీనివల్ల ప్రత్యేక ప్రొఫైల్‌ను క్రియేట్ చేసి కావాల్సిన యాప్‌లను విడిగా సేవ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ లాక్ చేసినప్పుడు అవి కనిపించవు.ప్రైవేట్ స్పేస్‌లోని యాప్‌లన్నీ లాంఛర్లోని ప్రత్యేక కంటైనర్‌లో ఉంటాయి. రీసెంట్ యాప్స్, నోటిఫికేషన్స్, సెటింగ్స్‌లోనూ కనిపించవు.ఫీచర్ యాప్ పెయిర్స్ అనే కొత్త ఫీచర్‌తో స్ప్లిట్ స్క్రీన్ మోడ్‌లో ఒకేసారి రెండు యాప్‌లను లాంఛ్ చేయొచ్చు. తరచూ ఉపయోగించే యాప్‌లను వెంటవెంటనే ఓపెన్ చేయొచ్చు.ఇదీ చదవండి: పాలసీదారులను మోసం చేస్తున్న బీమా ప్లాట్ఫామ్లుహెల్త్ కనెక్ట్ ఫీచర్లో స్కిన్ టెంపరేచర్, ట్రైనింగ్ ప్లాన్స్ అనే విభాగాలు చేర్చారు. దాంతో యూజర్లు తమ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంది. -
మొన్న శాంసంగ్.. తాజాగా యాపిల్ ప్రొడక్ట్‌లపై కేంద్రం హైరిస్క్ అలర్ట్..
కేంద్రప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) ఇటీవల శాంసంగ్ కంపెనీ ఉత్పత్తుల్లో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించిన సంగతి తెలిసిందే. ఫలితంగా సైబర్ నేరస్థులు శాంసంగ్ ఫోన్లు వాడుతున్న లక్షల మంది వినియోగదారుల నుంచి తమ వ్యక్తిగత డేటాను దొంగలించే ప్రమాదం ఉందని సెర్ట్ పేర్కొంది. తాజాగా యాపిల్ ఉత్పత్తులకు కూడా ఇదే తరహాలో ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. ఈ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) వెల్లడించింది. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, ఐపాడ్, యాపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పాటు సఫారీ బ్రౌజర్లో ఈ భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ తన అడ్వైజరీలో వివరించింది. ‘యాపిల్ ఉత్పత్తుల్లో పలు సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయి. దీని వల్ల హ్యాకర్లు యాపిల్ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉంది’ అని సెర్ట్ తెలిపింది. ఈ లోపాలను హ్యాకర్లు గుర్తిస్తే సెక్యూరిటీ పరిమితులను అధిగమించగలరని, ఏకపక్షంగా కోడ్‌ను ఎగ్జిక్యూట్ చేసి కీలక సమాచారాన్ని పొందే ప్రమాదం ఉందని తెలిపింది. ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.2 కంటే ముందు వెర్షన్లు, ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 16.7.3 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్ ఓఎస్ సొనోమా 14.2, వెంట్యురా 13.6.3, మానిటరీ 12.7.2, యాపిల్ టీవీ ఓఎస్ 17.2, యాపిల్ వాచ్ ఓఎస్ 10.2, సఫారీ 17.2 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ వెల్లడించింది. కాగా.. యాపిల్ ఉత్పత్తులకు కేంద్రం గతంలోనూ పలుమార్లు ఇలాంటి అలర్ట్‌లు జారీ చేసింది. ఇదీ సంగతి: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్రం హై అలర్ట్! ఇటీవలే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్‌తో పనిచేసే శాంసంగ్ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వినియోగదారులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి యూజర్లు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ వివరించింది. -
గూగుల్ కొత్త ఫీచర్.. ఆండ్రాయిడ్ ఫోన్లను అలా కూడా వాడొచ్చు!
కోవిడ్ మహమ్మారి అనంతరం జాబ్ ఇంటర్వ్యూలు, ఆఫీస్ మీటింగ్‌లు.. ఇలా అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెబ్‌క్యామ్‌లకు ప్రాధాన్యం బాగా పెరిగింది. స్మార్ట్ఫోన్లతో పోలిస్తే వెబ్‌క్యామ్ నాణ్యత చాలా తక్కువ. కాబట్టి స్మార్ట్ఫోన్లే వెబ్‌క్యామ్‌లుగా మారితే.. బాగుంటుంది కదా.. అవును అలాటి ఫీచర్‌నే గూగుల్ (Google) తీసుకొస్తోంది. ఆన్లైన్ మీటింగ్‌లు, ఇంటర్వ్యూల కోసం ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లకు ఉపయోగించే వెబ్‌క్యామ్‌లకు (Webcam) బదులుగా మంచి కెమెరా ఫీచర్లున్న ఆండ్రాయిడ్ ఫోన్లను (Android Smartphone) ఉపయోగించే ఫీచర్‌పై టెక్ దిగ్గజం గూగుల్ కసరత్తు చేస్తోంది. ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌కైనా.. గూగుల్ రూపొందించిన ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వెబ్‌కెమెరా ఫీచర్‌ను గూగుల్ ఉత్పత్తులకే కాకుండా విండోస్ ల్యాప్‌టాప్, మ్యాక్‌బుక్ లేదా మరొక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా సరే ఉపయోగించుకోవచ్చు. ఇలా పని చేస్తుంది.. ఆండ్రాయిడ్ ఫోన్‌ని పర్సనల్ కంప్యూటర్‌కి కనెక్ట్ చేయాలి. USB ప్రాధాన్యతల మెనూలో 'వెబ్‌క్యామ్ ఫంక్షనాలిటీ' ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో వెబ్‌క్యామ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఫీచర్ ప్రస్తుతానికి బీటా వర్షన్లో ఉంది. "Android 14 QPR1 Beta 1"ని ఇన్స్టాల్ చేసి ఉంటే దీన్ని ఉపయోగించవచ్చు. అక్టోబర్‌లో పిక్సెల్ 8 లాంచ్ తర్వాత స్థిరమైన వెర్షన్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. -
వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. దాని వల్ల ఉపయోగం ఏంటంటే?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మరో అప్డేట్తో ముందుకు వచ్చింది. ఇప్పటికే చాట్ లాక్, స్క్రీన్ షేరింగ్ వంటి ఫీచర్లను అందించిన వాట్సాప్ తాజాగా చాట్‌లో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. వీబీటా ఇన్ఫో ప్రకారం.. వాట్సాప్ యూజర్లు చాట్చేసే సమయంలో గతంలో చేసిన చాట్లను వెతికేందుకు, చదవని మెసేజ్‌లను చదివేందుకు కాంటాక్ట్స్, బిజినెస్ కాంటాక్ట్స్‌ను సులభంగా గుర్తించ వచ్చు. ఇందుకోసం చాట్పేజ్పై భాగంలో సెర్చ్ బార్‌ను తీసుకొని రానుంది. కొత్త ఫీచర్ ఎలా ఉంటుందంటే నివేదిక ప్రకారం.. కొత్త డిజైన్ స్క్రీన్‌షాట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. స్క్రీన్‌షాట్‌లో యాప్ పై భాగంలో బార్ తెలుపు రంగులో కనిపిస్తుంది. అయితే యాప్ పేరుతో సహా ఇతర ఆప్షన్లు గ్రీన్ కలర్లో ఉంటాయి. నావిగేషన్ బార్ సైతం దిగువ భాగంలో ఉన్నట్లు కనిపిస్తుంది. కాగా, వాట్సాప్ ఈ కొత్త డిజైన్.. గూగుల్ డిజైన్3 మార్గదర్శకాలకు అనుగుణంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. -
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా లోపాలు
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ పేర్కొంది. ఆండ్రాయిడ్– 13 సహా పలు వెర్షన్లు వైరస్ల బారిన పడే ప్రమాదం చాలా ఉందని ఆందోళన వెలిబు చ్చింది. వాటి వినియోగంలో జాగ్రత్తగా ఉండాలంటూ యూజర్లకు సోమవారం ’అతి తీవ్ర’ హెచ్చరిక లు జారీ చేసింది. లేదంటే మొబైల్స్ తదితరాల్లో సున్నిత సమాచారం హాకర్ల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని వివరించింది. ఆండ్రాయిడ్ 10, 11, 12, 12ఎల్, 13 వెర్షన్లలో వీటిని ప్రధానంగా గమనించినట్టు చెప్పింది. వీటివల్ల ఫ్రేంవర్క్, ఆండ్రాయిడ్ రన్ టైం, సిస్టం కంపోనెంట్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్స్, కెర్నల్, ఆర్మ్ కంపోనెంట్స్, మీడియా టీ కంపోనెంట్, కలోకాం క్లోజ్డ్ సోర్స్ కంపోనెంట్స్ వంటివాటి పనితీరు లోపభూయిష్టంగా మారుతుందని వివరించింది. అప్డేషన్ ఇలా... ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్ల భద్రత కోసం లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్‌కు తక్షణం అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇందుకు డివైస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టమ్‌పై క్లిక్ చేయాలి..సిస్టమ్ అప్ డేట్స్‌పై క్లిక్ చేయండి. అప్డేట్స్ ఉంటే డౌన్ లోడ్ చేసుకోండి. -
చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్, రిజిస్ట్రేషన్స్ షురూ!
ChatGPT for Android users: ఓపెన్ ఏఐకిచెందిన పాపులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ చాట్ జీపీటీ ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చాట్ జీపీటీ యాప్ ఎట్టకేలకు వచ్చే వారమే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఇది ఐవోఎస్ యూజర్లకు ఈ ఏడాది మేలోనే అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడిక ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. వచ్చే వారం ఈ యాప్ అధికారికంగా అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పటికే ఈ యాప్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. బ్రౌజర్ ద్వారా అందుబాటులో ఉన్న చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ అప్లికేషన్ వినియోగదారుల కోసం చాట్‌బాట్‌కి సులభంగా త్వరితగతిన సేవలు అందించనుంది. Chat GPT CTO మీరా మురాఠీ చేసిన ట్వీట్ ఇది. We’re rolling out ChatGPT for Android users next week https://t.co/3tNLNcG5Kw — Mira Murati (@miramurati) July 21, 2023 చాట్ జీపీటీ రిజిస్ట్రేషన్ ♦ గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి చాట్‌జీపీటీ అని సెర్చ్ చేయాలి ♦ ఇన్ స్టాల్ పై క్లిక్ చేసి, ఒకే చేయాలి. ♦ ఒకసారి యాప్ లాంచ్ అయిన తరువాత, ఈ యాప్ ఆటోమేటిక్ గా ఇన్ స్టాల్ అవుతుంది. ♦ అంతేకాదు.. ఆటోమెటిక్ ఇన్ స్టాలేషన్ వద్దు అనుకుంటే అన్ రిజిస్టర్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. కాగా చాట్పీజీటీ గతేడాది (2022 నవంబరు) అందుబాటులోకి వచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ఇంటర్నెట్ ప్రపంచంలో సునామిలా దూసుకొచ్చింది. ప్రారంభించిన రెండు నెలల్లోనే 100 మిలియన్లకు డౌన్లోడ్లను నమోదు చేసింది. తొలుత వెబ్ అప్లికేషన్‌గా వచ్చినప్పటికీ, ఈ ఏడాది మే లో ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దాదాపు మూడునెలల తరువాత ఇపుడిక ఆండ్రాయిడ్ యూజర్లకు చాట్‌జీపీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
ఆండ్రాయిడ్ ఫోన్ స్పీడ్ తగ్గిందా? ఇదిగో పరిష్కారం!
నేడు ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో మొబైల్ బ్రౌసింగ్ స్పీడ్ తగ్గినట్లు అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి? ఎలా క్లియర్ చేయాలి, అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి మనం మొబైల్ ఫోన్ ఉపయోగించే సమయంలో అనేక బ్రౌజర్లను ఓపెన్ చేస్తుంటాము. అవన్నీ కూడా బ్యాకెండ్‌లో సేవ్ అయి ఉండే అవకాశం ఉంటుంది. దీని కారణంగానే మొబైల్ ఫోన్ వేగం మునుపటి కంటే కొంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆండ్రాయిడ్ ఫోన్లో క్యాచ్ ఫైల్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తరువాత తప్పకుండా స్పీడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లో క్యాచ్ ఫైల్స్ క్లియర్ చేయడం ఎలా? మొదట మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో క్రోమ్ యాప్ ఓపెన్ చేయాలి క్రోమ్ ఓపెన్ చేసిన తరువాత కుడివైపున మూలలో మరిన్ని అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే మెనూలో హిస్టరీ ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత 'క్లియర్ యువర్ బ్రౌసింగ్ డేటా' అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, అందులో ఆల్ టైమ్ మీద క్లిక్ చేస్తే అప్పటికి సేవ్ అయిన హిస్టరీ మొత్తం డిలీట్ అవుతుంది. ఫైల్స్ ఎక్కువగా ఉంటే దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది, దీని ద్వారా మొబైల్ స్పీడ్ తప్పకుండా పెంచుకోవచ్చు. (ఇదీ చదవండి: మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 మొబైల్స్!) మొబైల్ స్పీడ్ తగ్గింది అనిపించినప్పుడు క్యాచ్ క్రమం తప్పకుండా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. క్యాచ్ క్లియర్ అనేది కేవలం మొబైల్ ఫోన్‌కి మాత్రమే కాకుండా అప్లికేషన్లకు కూడా వర్తిస్తుంది. దీన్ని కూడా క్లియర్ చేసుకోవడం వల్ల అప్లికేషన్ వేగం పెరుగుతుంది. -
తస్మాత్ జాగ్రత్త! .. గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ చాట్‌జీపీటీ యాప్స్ కలకలం
టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్ నేరస్తులు తెలివి మీరిపోతున్నారు. ఈజీ మనీ పేరుతో యూజర్ల జేబును ఖాళీ చేసేందుకు అదే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. గత ఏడాది విడుదలైన చాట్‌జీపీటీ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఏఐ టూల్‌తో సైబర్ నేరస్తులు ఆండ్రాయిడ్ యూజర్ల ఫోన్లలో మాల్వేర్ను పంపిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లో సొమ్ము కాజేస్తున్నారు. లేదంటే యూజర్ల డేటాను డార్క్ వెబ్‌లో సొమ్ము చేసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్ పరిశోధకులు చాట్‌జీపీటీ ఫేక్ యాప్స్‌లలో మీటర్ప్రెటర్ ట్రోజన్ అనే మాల్వేర్ను గుర్తించారు. ఈ మాల్వేర్ వేరియంట్లు ప్రత్యేకంగా చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్ ఉపయోగించడానికి ఆసక్తి ఉన్న యూజర్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు గుర్తించారు. కాబట్టి, ఏఐ యాప్స్ పట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో సైబర్ నేరస్తులు ఫేక్ చాట్‌జీపీటీ యాప్స్ సాయంతో పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేసిన కాంటాక్ట్ నెంబర్లకు మెసేజ్‌లు పంపుతున్నారు. ఆ మెసేజ్‌లను క్లిక్ చేయడం ద్వారా మాల్వేర్లు సదరు యూజర్ల ఫోన్లలోకి ఈజీగా చొరబడుతుంది. తద్వారా డబ్బుల కోసం అడ్డదార్లు తొక్కుతున్న కేటుగాళ్లు బాధితుల్ని బెదిరించి వారికి కావాల్సినంత డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ తరహా ఫోన్ నెంబర్లనే మాల్వేర్ క్రియేటర్లు, స్కామ్‌లు, మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న చాట్‌జీపీటీ ఫేక్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ టెక్నాలజీ నిపుణులు యూజర్లను హెచ్చరిస్తున్నారు. డౌన్లోడ్ చేసుకునే సమయంలో రివ్యూలతో పాటు గతంలో ఆ యాప్‌ను ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో గుర్తించాలని చెబుతున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా ఫేక్ యాప్స్ జోలికి పోవద్దని సలహా ఇస్తున్నారు. -
షాకింగ్: 100కు పైగా డేంజరస్ యాప్స్, వెంటనే డిలీట్ చేయకపోతే
యాప్స్‌కు సంబంధించి యూజర్లకు మరో షాకింగ్న్యూస్. స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి భయంకర వైరస్‌లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా డేటాను కొట్టేస్తున్న కేటుగాళ్లపై తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ను పరిశోధకులు గుర్తించారు. గూగుల్ ప్లే స్టోర్ లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన ‘స్పిన్ ఓకే’ అనే కొత్త స్పైవేర్‌ను ఇటీవల గుర్తించారు. పైగా ఈ యాప్స్ 400 మిలియన్లకు పైగా డౌన్లోడ్లు నమోదైనాయి, అంటే దాదాపు 40 కోట్ల మంది సైబర్ ముప్పులో పడిపోయినట్టే. రోజువారీ రివార్డ్‌లు, మినీ గేమ్‌లను ద్వారా ఈ ట్రోజన్ మాల్వేర్ నిజమైందిగా కనిపిస్తుందని, వినియోగదారులను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని గూగుల్‌కి తెలియజేసి. వాటిని తొలగించినప్పటికీ, ఇలాంటి డేంజరస్ యాప్స్‌పై అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తునారు. భవిష్యత్తులో ఇలాంటి యాప్‌లను గుర్తించి, డౌన్లోడ్ చేయొద్దని హెచ్చరించారు. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) ప్రభావితమైన యాప్‌లు ఇవే నాయిజ్: వీడియో ఎడిటర్ విత్ మ్యూజిక్ జాప్యా: ఫైల్ బదిలీ, షేర్ వీఫ్లై: వీడియో ఎడిటర్&వీడియో మేకర్ ఎంవీ బిట్- ఎంవీ వీడియో స్టేటస్ మేకర్ బియూగో- వీడియో మేకర్&వీడియో ఎడిటర్ క్రేజీ డ్రాప్ క్యాష్‌జైన్ – క్యాష్ రివార్డ్ ఫిజ్జో నావల్ – ఆఫ్‌లైన్ రీడింగ్ క్యాష్ ఈఎం: రివార్డ్స్ టిక్: వాట్ టు ఎర్న్ మాల్వేర్ సోకిన యాప్‌లను ఎలా గుర్తించాలి ♦ యాప్ అనుమతులను చెక్ చేసుకోవాలి.యాక్సెస్ లేదా నెట్వర్క్ కనెక్టివిటీ వంటి వాటిని పరిశీలించాలి. ♦ నకిలీ ఆఫర్లు లేదా రివ్యూస్‌లో అధిక ప్రకటనలుంటే పట్ల జాగ్రత్తగా ఉండాలి. యూజర్ అభిప్రాయానికి, సపోర్ట్‌కు స్పందించే డెవలపర్ల విశ్వసనీయతను గమనించాలి. ♦ ఇన్‌స్టాల్‌ల-టు-రివ్యూల రేషియోను గమనించాలి. ఇన్‌స్టాల్‌ల-టు-రివ్యూల నిష్పత్తి ఎంత; ఎంతమంది యాప్‌ను ఇన్స్టాల్ చేసారనే దానితో పోలిస్తే ఎంతమంది రివ్యూ చేశారనేది చూడాలి. డౌన్లోడ్లకు మించి రివ్యూలుంటే అనుమానించాల్సిందే. ♦ యాప్ డెవలపర్‌ని ఇతర సోషల్‌మీడియా హాండిల్స్, చట్టబద్ధతను చూడాలి. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) ♦ స్పెల్లింగ్ లేదా వ్యాకరణ లోపాలు, అస్పష్టమైన సమాచారం లేదా యాప్ ఫంక్షనాలిటీ వివరాల కొరత గురించి జాగ్రత్తగా గమనించాలి. ♦ పాస్వర్డ్లు లేదా క్రెడిట్ కార్డ్ వివరాల వంటి సున్నితమైన డేటాను అభ్యర్థించే యాప్‌ల జోలికి అసలు వెళ్ల వద్దు. ముఖ్యంగా యాప్‌లను డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి. యాప్ అనుమానాస్పదంగా అనిపిస్తే, ఇన్స్టాల్ చేయకపోవడమే మంచిది. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి:సాక్షిబిజినెస్ -
స్మార్ట్ టీవీ కొనుగోలు దారులకు గూగుల్ హెచ్చరిక.. అలాంటి టీవీలతో
స్మార్ట్‌టీవీ కొనుగోలు దారులకు ప్రముఖ టెక్ దిగ్గజం కీలక సమాచారం అందించింది. మార్కెట్లో కొనుగోలు చేస్తున్న ప్రతిటీవీ ఆండ్రాయిండ్ టీవీగా ప్రచారం జరుగుతుందని, అయితే, అందులో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఇటీవల కమ్యూనిటీ పోస్ట్‌లో ఆండ్రాయిడ్ ఓఎస్ పేరుతో టీవీలను విక్రయించినట్లు గూగుల్ గుర్తించింది. వాస్తవానికి అవి ఆండ్రాయిడ్ ఓపెన్ స్టోర్స్ ప్రాజెక్ట్‌ను (aosp)ని ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఆండ్రాయిడ్ టీవీ వర్సెస్ ఏఓఎస్‌పీ గూగుల్ సమాచారం మేరకు..ఆండ్రాయిడ్ టీవీల్లో గూగుల్ యాప్స్ లైసెన్స్ లేకుండానే ప్లే అవుతాయి. ఆండ్రాయిడ్ టీవీ కొన్న ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకోవచ్చు. కానీ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌తో రూపొందించబడిన టీవీల్లో గూగుల్ యాప్స్‌ను ప్లే చేయలేం. అందుకే ఆయా సంస్థలు ప్లే ప్రొటక్ట్ సర్టిఫికెట్ విషయంలో జాగ్రత్త వహిస్తాయి. టీవీ కొనేముందు తీసుకోవాల్సిన చూడాల్సిందిదే కస్టమర్లు తాము కొనుగోలు చేస్తున్న టెలివిజన్ సురక్షితమా? కాదా? అని నిర్ధారించేందుకు ఆండ్రాయిటీవీ వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలని గూగుల్ సిఫార్స్ చేస్తోంది. ఆ వెబ్సైట్లో కొనుగోలుదారులు అధికారిక Android TV, Google TV, Android TV ఉత్పత్తులను చూడొచ్చు. ప్లేస్టోర్‌లోకి వెళ్లి గూగుల్ లైసెన్స్ పొందిందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. టీవీకి ప్లే ప్రొటెక్ట్ సర్టిఫికేట్ లేకపోతే అది గూగుల్ ధృవీకరించలేదని అర్థం. చదవండి👉 నీళ్లను తెగ తాగేస్తున్న చాట్ జీపీటీ! -
ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్..
ఆండ్రాయిడ్ పరికరాల కోసం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఫోన్లలో స్టోరేజ్ సమస్యకు పరిష్కారంగా ‘ఆటో ఆర్కైవ్’ అనే ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తన బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ పేర్కొంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లకు సంబంధించిన ఎలాంటి డేటా తొలగిపోదు. ఇది కేవలం తక్కువగా వాడిన యాప్‌ల డేటాను మాత్రమే ఆర్కైవ్ చేస్తుంది. ఆ యాప్‌లకు సంబంధించిన క్లౌడ్ ఐకాన్ ఫోన్లలో అలాగే ఉంటుంది. ఆటో ఆర్కైవ్ అంటే ఏమిటి? ఆటో ఆర్కైవ్ అనేది యాప్‌ను పూర్తిగా అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లు, ఇతర పరికరాల్లో స్టోరేజ్ స్పేస్‌ను ఖాళీ చేయడానికి రూపొందించిన కొత్త ఫీచర్ . ఈ ఫీచర్‌ను యూజర్లు ఎంచుకుంటే వారి ఫోన్లు, ఇతర ఆండ్రాయిడ్ పరికరాల్లో తక్కువగా వినియోగించే యాప్‌లు పాక్షికంగా తొలగిపోతాయి. దీంతో ఆ మేరకు స్టోరేజ్ స్పేస్ ఖాళీ అవుతుంది. అయితే తమకు సంబంధించిన ముఖ్యమైన డేటా తొలగిపోతుందని యూజర్లు కంగారు పడాల్సిన పని లేదు. యూజర్ల డేటా, పాక్షికంగా తొలగించిన యాప్ ఐకాన్లు కూడా ఫోన్లో అలాగే ఉంటాయి. కాబట్టి ఒకవేళ యూజర్లు తొలగించిన యాప్‌ను మళ్లీ ఉపయోగించాలనుకున్నప్పుడు దాన్ని మరో సారి డౌన్లోడ్ చేసుకుని ఎక్కడి నుంచి యాప్ డేటా తొలగిపోయిందో తిరిగి అక్కడి నుంచి కొనసాగించవచ్చు. అయితే ఆ యాప్ గూగుల్ ప్లేస్టోర్ అందుబాటులో ఉన్నంతవరకే. ఎలా పనిచేస్తుంది? ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏదైనా యాప్‌ను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒకవేళ వారి ఫోన్లు, ఇతర పరికరాల్లో స్టోరేజ్ స్పేస్ తక్కువగా ఉన్నట్లయితే ఆటో ఆర్కైవింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలని వారికి సూచన అందుతుంది. ఆ ఫీచర్‌ను ఎంచుకున్న వెంటనే తక్కువ వినియోగంలో ఉన్న యాప్‌లను గుర్తించి ఆటోమేటిక్‌గా ఆర్కైవ్ చేస్తుంది. ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ వల్ల దాదాపు 60 శాతం వరకు స్టోరేజీ స్పేస్ ఆదా అవుతుంది. గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. యాప్ బండిల్ని ఉపయోగించి రూపొందించిన యాప్‌లకు మాత్రమే ఈ ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ పనిచేస్తుంది. యాప్ బండిల్ అనేది యాప్‌ల రూపకల్పన కోసం 2021 నుంచి తప్పనిసరి చేసిన ఫార్మాట్. -
ఆండ్రాయిడ్ సృష్టికర్త, టెక్ దిగ్గజం బాబ్లీ దారుణ హత్య!
ఆండ్రాయిడ్ సృష్టికర్త, ప్రముఖ మొబైల్ పేమెంట్ సర్వీస్ ‘క్యాష్ యాప్’ ఫౌండర్ బాబ్లీ (Bob Lee) దారుణ హత్యకు గురయ్యారు. ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం..శాన్ ఫ్రాన్సిస్కోలో గుర్తు తెలియని దుండగులు బాబ్లీపై కత్తితో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అతనిని ఆస్పత్రికి తరలించే లోపే మరణించినట్లు శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు తెలిపారు. బాబ్లిని కత్తులతో దాడికి పాల్పడ్డారంటూ మంగళవారం ఉదయం 2.35 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మెయిన్ 300 బ్లాక్ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ప్రాణాలతో కొట్టమిట్టాడుతున్న బాబ్లీని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే దురదృష్టవ శాత్తూ మార్గం మద్యంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ దుర్ఘటనలో శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు ఎటువంటి అనుమానితుల పేర్లను విడుదల చేయలేదు. ఎవరినీ అరెస్టు చేయలేదని న్యూయార్క్ పోస్ట్ నివేదిక తెలిపింది. బాబ్లీ మరణంపై క్యాష్ యాప్ ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మంచి వ్యక్తుత్వం ఉన్న తమ సీఈవో మరణించాడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మొబైల్ కాయిన్ వెబ్సైట్ ప్రకారం బాబ్లీ గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్ తయారీలో ముఖ్యపాత్ర పోషించాడు. టెక్ వరల్డ్‌లో ‘క్రేజీ బాబ్’గా పేరొందిన బాబ్లీ ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సేతో కలిసి పనిచేశారు. జాక్ డోర్సే ఫౌండర్‌గా ‘స్కైర్’ అనే సంస్థను స్థాపించారు. 2010లో ఆ సంస్థ సీటీవోగా, ఆ తర్వాత క్యాష్ యాప్ ఫౌండర్‌గా ఇలా ఫిన్ టెక్, టెక్నాలజీ రంగాల్లో విశేషంగా రాణించారు. ఇప్పుడు బాబ్లీ దారుణ హత్యకు గురికావడం టెక్ రంగాన్ని విస్మయానికి గురి చేస్తోంది. చదవండి👉 అబ్బా ..ఇది కదా ఆఫర్ అంటే, ఐఫోన్ 14ను తక్కువ ధరకే సొంతం చేసుకోండి! -
ఉబెర్ కొత్త డిజైన్: రైడర్లకు కొత్త ఫీచర్లు...ఇకపై ఈజీగా!
ముంబై: రైడ్ షేరింగ్ కంపెనీ ఉబర్ మరింత మెరుగ్గా యాప్‌ను తీర్చిదిద్దింది. రైడ్ సమయంలో యాప్‌ను ప్రతీసారి తెరవకుండానే లాక్ స్క్రీన్‌పైనే లైవ్ యాక్టివిటీతో రైడ్, వాహన వివరాలు, ట్రిప్ స్టేటస్‌ను చూడవచ్చు. తన హోమ్స్క్రీన్, కొత్త ఫీచర్ల రీడిజైన్ చేసింది. కస్టమర్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలిసారి ఇలాంటి మార్పులు ప్రకటించింది. యాప్‌ను మునుపెన్నడూ లేనంత సులభంగా, స్పష్టంగా , పర్సనలైజ్డ్గా తీసుకొస్తున్నామని ఉడెర్ హెడ్ జెన్ యు అన్నారు. తద్వారా క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ రైడ్ ట్రాకింగ్ ఈజీగా ఉండేలా ఇంటర్ఫేస్ని రూపొందించింది. సో నెక్ట్స్ రైడ్ లేదా ఆర్డర్ ఫుడ్ బుక్ చేస్తే, యాప్ కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఐవోఎస్ ఉపకరణాలకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ డివైసెస్‌కు విస్తరించనున్నట్టు కంపెన ప్రకటించింది. సర్వీసెస్ ట్యాబ్ సైతం పొందు పరిచింది. శరవేగంగా లైఫ్ గడిచిపోతున్న ప్రస్తుత తరుణంలో కొన్ని, సెకన్లలో యాప్ ద్వారా నావిగేట్ చేయగలిగే అవసరాన్ని అర్థం చేసుకున్నామని ఉబర్ ఇండియా దక్షిణాసియా సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ అన్నారు. తక్కువ ట్యాప్‌లతో ప్రయాణాలను మరింత సులభంగా బుక్ చేసుకునేందుకు రైడర్లకు సహాయ పడేందుకు హోమ్‌స్క్రీన్‌ను అనుభవాన్ని కూడా మెరుగ్గా అందించనుంది. ఇందుకోసం 'సర్వీసెస్' ట్యాబ్‌ను జోడించింది. దీని ద్వారా కొత్త యాప్‌లో సమీపంలోని మోటో నుండి ఆటో, ఇంటర్సిటీ, అద్దెలు, ఇతర వాటితో పాటు నగరంలోని రైడర్లకు అందుబాటులో ఉన్న అన్ని ఉత్పత్తులను కనుగొనడానికి ఒక-స్టాప్ షాప్‌గా కూడా ఉపయోగపడనుంది. అలాగే కొత్తగా యాడ్ చేసిన 'యాక్టివిటీ హబ్' గత రాబోయే రైడ్లను ఒకే చోట ట్రాక్ చేయడంలో సహాయపడుతుందని ఉబెర్ తెలిపింది. -
సామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా
సైజ్: 6.8 అంగుళాలు బరువు: 234 గ్రా. రిజల్యూషన్: 1440x3088 పిక్సెల్స్ వోఎస్: ఆండ్రాయిడ్ 13, వన్ యూఐ 5.1 మెమోరీ: 256జీబి 8జీబి ర్యామ్ 256జీబి 12జీబి ర్యామ్ 512 జీబి 12జీబి ర్యామ్ కలర్స్: ఫాంటమ్ బ్లాక్, గ్రీన్, క్రీమ్, స్కైబ్లూ, రెడ్, బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ వాట్సాప్ ‘ఫొటో క్వాలిటీ’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఒరిజినల్ క్వాలిటీతో, కంప్రెస్డ్ ఫార్మట్‌లో ఫొటోలను పంపి డాటా సేవ్ చేసుకోవచ్చు. యూజర్లు తమ వాట్సాప్ సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్‌లో (ఐఫోన్) ఒరిజినల్ క్వాలిటీ ఫొటోలు సెండ్ చేయడానికి... ► వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఐకాన్ ట్యాప్ చేయాలి. ► స్టోరేజ్ అండ్ డాటా–ట్యాప్ ► మీడియా అప్లోడ్ క్వాలిటీ–ట్యాప్ ► ఆటో–సెలెక్ట్ -
సొంత ఓఎస్‌పై ప్రభుత్వ భారీ కసరత్తు: ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఖేల్ ఖతం?
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ యూజర్లకు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనుందా? సొంతంగా ఒక దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించి, వినియోగదారులకు మరింత సురక్షితమైన అనుభవాన్ని అందించే ప్రాజెక్ట్‌పై పని చేస్తోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారిక ప్రకటనపై ఆసక్తి నెలకొంది. ఇండ్ ఓఎస్ పేరుతో తీసుకురానుంది. ప్రభుత్వం, స్టార్టప్‌లు , విద్యాసంస్థల చొరవతో దీన్ని రూపొందిస్తోంది. ఎపుడు, ఎలా లాంచ్ చేస్తుందనే దానిపై స్పష్టతేదు. ఇది యూజర్లకు ఒక కొత్త భారతీయ OS సురక్షితమైన అనుభవాన్ని అందించడమే కాకుండా Google, Appleకి దీటుగా గట్టి పోటీ ఇస్తుందని అంచనా. కాగా ప్రస్తుతం, గూగుల్ ఆండ్రాయిడ్ 97 శాతం వాటాతో టాప్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటుండగా, ఐఫోన్కోసం రూపొందించిన ఆపిల్ ఐఓఎస్ వాటా పరిమితంగానే ఉంది. మరోవైపు నోకియా, శాంసంగ్, బ్లాక్‌బెర్రీ నోకియా, మైక్రోసాప్ట్ ,ఫైర్ఫాక్స్ లాంటి దిగ్గజాల ఆపరేటింగ్ సిస్టమ్స్ పెద్దగా ఆదరణకు నోచుకోలేకపోయాయి. ఈ క్రమంలో ఇండ్‌ఓఎస్ ఆవిష్కారంపై భారీ అంచనాలే ఉన్నాయి. -
గూగుల్‌కు సీసీఐ జరిమానా..భారత్‌లో కస్టమర్లు, వ్యాపారాలకు పెద్ద ఎదురుదెబ్బ
మొబైల్ వెబ్ బ్రౌజర్లు, ఆన్లైన్ వీడియో హోస్టింగ్లలో క్రోమ్, యూట్యూబ్ వంటి యాప్‌ల స్థానాన్ని కాపాడుకోవడానికి ఆన్లైన్ సెర్చ్, ఆండ్రాయిడ్ కోసం యాప్ స్టోర్ వంటి మార్కెట్లలో గూగుల్ తన ఆధిపత్య స్థానాన్ని ఉపయోగించుకుందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) గూగుల్‌కు రూ.1,338 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అనుచిత వ్యాపార విధానాలు అమలు చేయడాన్ని మానుకోవాలని ఆదేశించింది. నిర్దిష్ట వ్యవధిలోగా తన తీరును మార్చుకోవాలని సూచించింది. అయితే భారత్ నిర్ణయంపై గూగుల్ స్పందించింది. భారత్ నిర్ణయం.. దేశంలోని వినియోగదారులు, వ్యాపారాలకు పెద్ద ఎదురుదెబ్బ అని గూగుల్ తెలిపింది. ఆండ్రాయిడ్ అనేది వినియోగదారులకు ఏం కావాలో.. దాన్ని ఎంపిక చేసేందుకువ వీలుగా సృష్టించింది ఈ ఆండ్రాయిడ్. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారందరికి మద్దతుగా నిలుస్తుందని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. సీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అటు కొనుగోలుదారులకు ఇటు వ్యాపారస్థులకు ఇది పెద్ద ఎదురు దెబ్బ. సెక్యూరిటీ పరంగా ఆండ్రాయిడ్ ఫీచర్‌ను వినియోగిస్తున్న వారందరూ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మొబైల్ ధరలు పెరుగుతాయని వెల్లడించారు. చదవండి👉 గూగుల్‌కు భారీ షాక్! -
తక్కువ ధరలో ఎల్ఈడీ టీవీలు:గూగుల్‌తో డిక్సన్ జోడీ
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న డిక్సన్ టెక్నాలజీస్ తాజాగా అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్థానికంగా ఆండ్రాయిడ్, గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్స్‌పై ఎల్ఈడీ టీవీలను డిక్సన్ తయారు చేయనుంది. స్మార్ట్ టీవీల కోసం ఆన్‌డ్రాయిడ్, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను గూగుల్ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. తక్కువ ఖర్చుతో కూడిన స్మార్ట్ టీవీని అందించడంతోపాటు, ఎల్ఈడీ టీవీ విభాగంలో దాని మార్కెట్ లీడర్షిప్ను మరింత బలోపేతం చేసుకోవాడనాఇకి ఇది సహాయ పడుతుందని డిక్సన్ టెక్నాలజీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆండ్రాయిడ్, గూగుల్ టీవీలకై భారత్‌లో సబ్ లైసెన్సింగ్ హక్కులను పొందిన తొలి ఒప్పంద తయారీ కంపెనీ తామేనని డిక్సన్ ప్రకటించింది. ఎల్ఈడీ టీవీల తయారీలో దేశంలో అతిపెద్ద సంస్థ అయిన డిక్సన్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 60 లక్షల యూనిట్లు. ఈ భాగస్వామ్యం కారణంగా ఎల్ఈడీల ఉత్పత్తిలో కంపెనీ సామర్థ్యం మరింత బలపడుతుందని సంస్థ వివరించింది. వాషింగ్ మెషీన్లు, ఎల్ఈడీ బల్బులు, ఎల్ఈడీ బ్యాటెన్స్, మొబైల్ ఫోన్స్, సీసీటీవీల వంటి ఉత్పత్తులను సైతం ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. -
కీలక నిర్ణయం, గేమింగ్ యాప్‌ను షట్‌డౌన్ చేయనున్న ఫేస్బుక్!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో ఫేస్బుక్ గేమింగ్ యాప్స్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ సంస్థ యూజర్లు భారీగా తగ్గనున్నారు. 2018లో గేమ్ స్ట్రీమింగ్, గేమింగ్ ఫ్లాట్ ఫామ్‌లో ట్విచ్, యూట్యూబ్‌కు పోటీగా ఫేస్బుక్ అడుగు పెట్టింది. రెండేళ్ల తర్వాత అంటే 2020లో గేమింగ్ యాప్, క్రియేటర్ పోగ్రాంను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ స్ట్రీమింగ్ యాప్ మిక్సర్‌ను సైతం కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో స్పష్టమైన కారణాలేంటనే విషయం వెలుగులోకి రానప్పటికీ..ఫేస్బుక్ తన గేమింగ్ యాప్‌ను స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 28 నుంచి ఆ సేవల్ని వినియోగించుకోలేరని, వెబ్ బేస్డ్ వెర్షన్ గేమింగ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పింది. -
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్..! ఈ యాప్‌ను వెంటనే డిలీట్ చేయండి..! లేకపోతే అంతే సంగతులు..!
రోజురోజుకి టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తుందో...అంతే వేగంతో సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. సైబర్ నేరస్తులు కొంత పుంతలు తొక్కుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. కొత్త మంది హ్యకర్లు ఏకంగా గూగుల్‌ప్లే స్టోర్‌లోకి నకిలీ యాప్స్‌ను చొప్పించి..సదరు యాప్స్ ద్వారా మాల్వేర్స్ను స్మార్ట్ఫోన్లలోకి ఎక్కిస్తున్నారు. ఇలాంటిదే తాజాగా కార్టూనిఫైయర్ యాప్ వెలుగులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్ల ఫేస్బుక్ డేటాను దొంగిలిస్తోన్నట్లు తెలుస్తోంది. లక్ష మందిపై ప్రభావం..! కార్టూనిఫైయర్ యాప్‌లో FaceStealer అనే మాల్వేర్ను గుర్తించారు. కార్టూనిఫైయర్ యాప్(cartoonifier app)తో హ్యకర్లు ఆయా యూజర్ల ఫేస్బుక్ ఖాతాల పాస్‌వర్డ్స్‌ను సొంతం చేసుకుంటున్నట్లు ప్రడియో(Pradeo) వెల్లడించింది. ఇప్పటికే ఈ యాప్‌ను సుమారు లక్షకు పైగా ఆండ్రాయిడ్ యూజర్లు ఇన్స్టాల్ చేసినట్లు ప్రడియో తన నివేదికలో పేర్కొంది. కాగా ఈ యాప్‌పై గూగుల్ ప్రతినిధులు స్పందించారు. 'క్రాఫ్ట్సార్ట్ కార్టూన్ ఫోటో టూల్స్' పేరుతో ఉన్న యాప్ ఇకపై డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేదని, ప్లే స్టోర్ నుంచి తొలగించమని గూగుల్ ప్రతినిధి ప్రముఖ టెక్ బ్లాగింగ్ సంస్థ బ్లీపింగ్ కంప్యూటర్‌కు తెలియజేశారు. ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్న వారు వెంటనే అన్ఇన్స్టాల్ చేయాలని సూచించారు. అంతేకాకుండా గూగుల్ ప్లే స్టోర్‌లో సదరు యాప్స్‌ను చెక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం మంచిందంటూ సూచించారు. ఒక యాప్‌ను డౌన్లోడ్ చేసే ముందు వీటిని దృష్టిలో పెట్టుకోండి. యాప్‌ను ఇన్స్టాల్ చేసే ముందు సంబంధింత యాప్ డెవలపర్ ఎవరో, తనీఖీ చేసి ధృవీకరించాలి. యాప్‌పై గల రివ్యూలను, రేటింగ్లను చూడడం మంచింది. మాల్వేర్ కల్గిన యాప్స్‌ను యూజర్లు రివ్యూలో రిపోర్ట్ చేస్తూ ఉంటారు. యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మైక్రోఫోన్, కాంటాక్ట్స్, ఇతర డేటాను యాక్సెస్ చేసే వాటిని అసలు ఇన్స్టాల్ చేయకండి. ఎల్లప్పుడు Google Play Store లేదా Apple App store నుంచి మాత్రమే యాప్స్‌ను ఇన్స్టాల్ చేయాలి. చదవండి: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన రియల్మీ..! ధర ఎంతంటే..? -
ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త చిక్కు.. యూటూబ్ నుంచి ఆ ఆప్షన్ అవుట్ !
ఓటీటీ కంటెంట్ యాప్‌లు ఎన్ని మార్కెట్లోకి వచ్చినా ఇప్పటికీ వీడియోస్ చూడాలంటూ మొదటగా గుర్తొచ్చేది యూట్యూబ్‌నే. సవాలక్ష టాపిల్లపై ఇక్కడ సమాచారం దొరుకుతుంది. కానీ వాటిని ప్రశాంతంగా చూడనీయకుండా మధ్యలో వచ్చే యాడ్స్ సతాయిస్తుంటాయి. యాడ్స్ లేకుండా యూట్యూబ్ ప్రీమియం పేరిట పెయిడ్ సర్వీసులు కూడా అందిస్తోంది. అయితే ఎటువంటి సొమ్ము చెల్లించకుండా పెయిడ్ సర్వీస్ ఝంజాటం లేకుండా యాడ్స్ ఫ్రీగా యూట్యూబ్ చూసే అవకాశం వాన్సెడ్ యాప్‌తో ఉండేంది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై లభించి ఈ యాప్‌ను ఉపయోగించి యాడ్ ఫ్రీగా యూట్యూబ్ వీడియోలు చూసేవాళ్లు. అయితే యాడ్ ఫ్రీగా కంటెంట్ చూపిస్తున్న వాన్సెడ్కు ఇటీవల చిక్కులు ఎదురయ్యాయి. తమ కంటెంట్‌పై వాన్సెడ్ పెత్తనం ఏంటంటూ లీగల్ కొర్రీలు పడ్డాయి. దీంతో వాన్సెడ్ యాప్ సృష్టికర్త అయిన వెర్జ్ వెనక్కి తగ్గింది. దీంతో వాన్సెడ్ యాప్‌ని వెనక్కి తీసుకుంది. అంతేకాదు ఇప్పటికే డౌన్లోడ్ అయిన యాప్‌లు సైతం త్వరలోనే బంద్ అవుతాయంటూ వెర్జ్ చెబుతోంది. వాన్సెడ్ యాప్ రద్దు కావడంతో ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్‌పై యాడ్ ఫ్రీగా వీడియోలు చూస్తున్న చాలా మందికి ఇక నిరాశే మిగలనుంది. గతంలో యూట్యూబ్ నుంచి వీడియోలు, ఆడియోలు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కలిగించిన ట్యూబ్మేట్ యాప్ విషయంలోనే ఇలానే జరిగింది. చదవండి: యూట్యూబ్ చేస్తున్న అద్భుతం, ఇండియన్ ఎకానమీ సూపరో సూపరు! -
ఉక్రెయిన్‌పై బాంబుల మోత..! రష్యా దాడులను చెక్ పెట్టేందుకు గూగుల్ భారీ స్కెచ్..!
గత 17 రోజల నుంచి ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు విరుచుకుపడుతూనే ఉన్నాయి. రష్యా బలగాలకు ఉక్రెయిన్ సైన్యం ధీటైన జవాబునిస్తున్నాయి. ఇక ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై రష్యా బాంబుల మోత మోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైనికులతో పాటుగా, సామాన్య ప్రజలు కూడా తమ ప్రాణాలను కోల్పోతున్నారు. రష్యన్ వైమానిక బాంబు దాడుల నుంచి ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకు గూగుల్ వారికి సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ముందుగానే పసిగడుతోంది..! రష్యన్ వైమానిక దళం ఉక్రెయిన్‌లోని ఆయా ప్రాంతాల్లో జరిగే ఎయిర్‌స్ట్రైక్స్ గురించి ‘ర్యాపిడ్ ఎయిర్ రైడ్’ ఉక్రెయిన్ ప్రజలను ముందుగానే హెచ్చరికలను జారీ చేయనుంది. ఈ యాప్ ఉక్రెయిన్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. ఈ యాప్‌ను తొలుత భూకంప హెచ్చరికలను గుర్తించడం కోసం గూగుల్ తీసుకొచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో ఉక్రెయిన్‌లోని అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్ అందుబాటులోకి వస్తోందని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ డేవ్ బ్రుక్ వెల్లడించారు. ఉక్రెయిన్లకోసం ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్స్‌లోకి మార్చి 4న గూగుల్ వదిలింది. ఈ యాప్ సహాయంతో వైమానిక దాడుల నుంచి ఉక్రెయిన్ ప్రజలను అలర్ట్ చేస్తోంది. ఈ యాప్‌ను ఉక్రెయిన్ ప్రభుత్వం సహకారంతో ఉక్రేనియన్ డెవలపర్లు ఈ యాప్‌ను రూపొందించారు . ఇప్పుడు ఉక్రేనియన్లు థర్డ్-పార్టీ యాప్ లేకుండానే వారి ఫోన్ లొకేషన్, ఇంటర్నెట్ ఆన్ చేసి ఉంటే వారు వైమానికి దాడుల అలర్ట్‌లను పొందగలరని గూగుల్ పేర్కొంది. చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్..! ఇకపై ఐఫోన్ల నుంచి సులువుగా..! -
ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్..! ఇకపై ఐఫోన్ల నుంచి సులువుగా..!
ఆండ్రాయిడ్ యూజర్లకు టెక్ దిగ్గజం గూగుల్ త్వరలోనే శుభవార్తను అందించనుంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు మధ్య టెక్స్ట్ సందేశాలను మరింత సులభతరం చేయడానికి గూగుల్ ప్రయత్నిస్తోంది. ఐఫోన్ యూజర్లతో చాట్ చేయడం అనేది ఆండ్రాయిడ్ యూజర్లకు ఎల్లప్పుడూ సవాలే.దీనికి కారణం సదరు ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌కు పంపిన స్టికర్స్, ఎమోజీలను వారి సందేశాలలో చూపలేదు. టెక్స్ట్ మెసేజ్స్లో పంపే ఎమోజీ, స్టికర్స్‌ను కేవలం గూగుల్ మెసేజ్స్ యూజర్లు మాత్రమే చూడగలరు. ఇక ఐఫోన్ ఐమెసేజ్స్ ద్వారా పంపినా ఎమోజీ, స్టికర్స్కు బదులుగా టెక్స్ట్ మెసేజ్‌లు ఆండ్రాయిడ్ యూజర్లకు కన్పించేవి. దీన్ని పరిష్కరించడానికి iMessages భాగస్వామ్యంతో ఎమోజీలను గూగుల్ మెసేజెస్ యాప్‌లో ఎమోజీలుగా చూపే కొత్త ఫీచర్‌ను గూగుల్ పరీక్షించడం ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్లో భాగంగా iMessages నుంచి ‘హార్ట్’ ఎమోజీ ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు ఫేస్ విత్ హార్ట్ ఎమోజీ వచ్చేలా గూగుల్ చేసింది. దీంతో iMessages నుంచి ఆండ్రాయిడ్ యూజర్లకు పంపే వివిధ రకాల స్టిక్కర్స్, ఎమోజీలు నేరుగా వచ్చేలా గూగుల్ పనిచేస్తోంది. కాగా ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. రానున్న రోజుల్లో ఈ ఫీచర్ ద్వారా సదరు ఐఫోన్ యూజర్లు ఆండ్రాయిడ్ యూజర్లకు పంపే అన్నీ ఎమోజీ, స్టికర్స్‌ను టెక్స్ట్ మెసేజ్ రూపంలో కాకుండా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో వచ్చేలా గూగుల్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. చదవండి: పెను ప్రమాదంలో పలు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్..!