శాన్‌ఫ్రాన్సిస్కో : వివిధ మొబైల్ ఫ్లాట్‌ఫాంలపై డిసెంబర్ 31, 2017 తర్వాత మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ బ్లాగ్ ద్వారా ధృవీకరించింది. బ్లాక్‌బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, దాని కంటే పాత ఫ్లాట్‌ఫాంలకు వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తున్నట్లు సోమవారం తెలిపింది. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్‌డేట్స్ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా పనిచేయకపోవడం ఆగిపోవచ్చునని వెల్లడించింది. భవిష్యత్తులో తమ యాప్ ఫీచర్లను ఇంకా అభివృద్ధి చేద్దామనుకుంటున్నామని, కానీ ఈ ఫ్లాట్‌ఫాంలకు అంత సామర్థ్యం లేదని చెప్పింది.
ఈ ఓఎస్‌లు వాడుతున్న వారు వెంటనే కొత్త ఓఎస్ వెర్షన్(ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0+, ఐఫోన్ ఓఎస్ 7+, విండోస్ ఫోన్ 8.1+)లోకి అప్‌గ్రేడ్ కావాలని సూచించారు. అప్పుడే మీరు వాట్సప్‌ను వినియోగించుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.
ఇది మాకు ఒక కఠినమైన నిర్ణయం, కానీ వాట్సాప్ ద్వారా వినియోగదారులు మరింత మంది స్నేహితులు, కుటుంబం, ప్రియమైన వారిని తో సన్నిహితంగా ఉండేలా, ఉన్నతమైన ఫీచర్లను మెరుగైన సౌలభ్యాన్ని అందిస్తున్నాం. ఈ క్రమంలో అప్‌గ్రేడ్ చేసుకోవాలసింది రికమెండ్ చేశాం’’ అని వాట్సాప్ తన బ్లాగులో పేర్కొంది.
ఈ సంవత్సరం చివరి నాటికి వాట్సాప్ బంద్ అయ్యే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్
బ్లాక్ బెక్రీ, ఓఎస్, 10
విండోస్ ఫోన్ 8.0 , అంతకంటే పాతవి
దీనితోపాటు నోకియా ఎస్ 40 ఫోన్లలో వాట్సాప్ డిసెంబర్ 31,2018 తరువాత పనిచేయదని పేర్కొంది. ఫిబ్రవరి 1, 2020 తర్వాత ఆండ్రాయిడ్ 2.3.7 , అంతకంటే పాత వెర్షన్‌లలో కూడా వాట్సాప్ సేవలను నిలిపి వేయనుంది.
కాగా 2016 లో వివిధ మొబైల్ ఫ్లాట్‌ఫాంలలో వాట్స్అప్ సేవలు నిలిపివేత గురించి మొదటిసారి ప్రకటించింది. ఆ తరువాత మరికొన్ని ఓఎస్‌లలో ఈ గడువును జూన్ 30, 2017 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. తాజాగా గడువు డిసెంబరు 31, 2017తో ముగియనుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment