OS
-
త్వరలోనే యాపిల్ టెక్ ఫెస్టివల్, ఆతృతగా ఎదురు చూస్తున్న టెక్ లవర్స్!
టెక్ దిగ్గజం యాపిల్ నిర్వహించే టెక్ ఫెస్టివల్ వచ్చేసింది. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ)- 2022ను జూన్ 6నుంచి జూన్ 10వరకు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. అయితే ఈ డెవలర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా యాపిల్ సంస్థ తాను విడుదల చేయబోయే గాడ్జెట్స్ గురించి ప్రకటన చేస్తుంది. అందుకే వచ్చే నెలలో జరగనున్న కాన్ఫరెన్స్ లో యాపిల్ ఏం ప్రకటన చేస్తుందోనని టెక్ లవర్స్‌కు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థ ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ల గురించి డబ్ల్యూడబ్ల్యూడీసీలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఐఓఎస్ 16, ఐపాడ్ ఐఓఎస్ 16, వాచెస్ ఓస్ 9 లలో అదనంగా కొన్ని ఫీచర్లను యాడ్ చేయనుంది. నోటిఫికేషన్ల అప్డేట్తో పాటు కార్ క్రాష్ డిటెక్షన్, ఐపాడ్లలో కొత్త మల్టీ టాస్కింగ్ ఇంటర్ ఫేస్ తో పాటు మిగిలిన గాడ్జెట్ అప్డేట్ల గురించి ప్రకటన చేయనున్నట్లు వెలుగులోకి వచ్చిన పలు నివేదికలు పేర్కొన్నాయి. -
ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు, లిస్ట్‌లో మీ ఫోన్ ఉందమో చెక్ చేసుకోండి!
మీ ఫోన్లో వాట్సాప్ పనిచేయడం లేదా?. ఇటీవల వాట్సాప్ తన ఓస్(ఆపరేటింగ్ సాఫ్ట్వేర్)ను అప్డేట్ చేసింది. దీంతో పాత ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు యాపిల్ ఐఫోన్లు సైతం పనిచేయడం లేదు. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన కొన్ని రిపోర్ట్లు ప్రకారం..బ్రెజిల్లో 100 మిలియన్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం 30 రకాల స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం రిపోర్ట్లు పేర్కొన్నాయి. వాటిలో శాంసంగ్ గెలాక్సీ, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ ఎస్, హెచ్‌టీసీ డిజైర్ 500, సోనీ ఎక్స్‌పీరియా ఎం, ఎల్జీ ఆప్టిమస్ ఎఫ్7 ఫోన్ ఉన్నాయి. అయితే ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయకపోవడానికి కారణంగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయకపోవడమేనని టెక్ నిపుణులు చెబుతున్నారు. జనవరి 2022 నుంచి 30 కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం లేదని స్ప్రౌట్ వైర్డ్ తన నివేదికలో పేర్కొంది. కాగా, ఇటీవల కాలంలో భారీగా అమ్ముడైన పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచి పోయాయి. వాట్సాప్ అప్డేట్ ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్ కంటే తక్కువ ఓఎస్ ఉన్న ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఇక ఐఫోన్లలో ఐఎస్ఎస్ 9 లేదా అంతకంటే తక్కువ ఉన్న ఐఫోన్లలో మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోల్ని ఫార్వర్డ్ చేయలేమని Apple iPhone SE (16GB, 32 GB, and 64GB) Apple iPhone 6S (32GB and 64GB) Apple iPhone 6S Plus (16GB, 32GB, 64GB, and 128 GB) Apple iPhone 6S (128 GB) Apple iPhone 6s (16gb) Mini Samsung Galaxy S3 Samsung galaxy Ace 2 Samsung galaxy core Samsung Galaxy Trend II Samsung galaxy trend lite Samsung Galaxy Xcover 2 LG Act LG Lucid 2 LG Optimus F3 LG Optimus F3Q LG Optimus F5 LG Optimus F6 LG Optimus F7 LG Optimus L2 II LG Optimus L3 II LG Optimus L3 II Dual LG Optimus L4 II LG Optimus L4 II Dual LG Optimus L5 II LG Optimus L5 II Dual LG Optimus L7 II LG Optimus L7 II Dual Archos 53 Platinum Caterpillar Cat B15 Faea F1 HTC Desire 500 Huawei Ascend D2 Huawei Ascend G740 Huawei Ascend Mate Lenovo A820 Sony Xperia M THL W8 Vico darkknight Vico sync five ZTE Grand Memo ZTE Grand S Flex ZTE grand x quad v987 ZTE V956 – UMI X2 చదవండి: వాట్సాప్‌లో యూపీఐ పిన్ మార్చడం ఎలానో తెలుసా..? -
ఆండ్రాయిడ్ 13 ఫీచర్లు లీక్, వారెవ్వా..అదరగొట్టేస్తున్నాయ్!
ప్రస్తుతం అన్నీ స్మార్ట్ ఫోన్లలో ఓఎస్ ఆండ్రాయిడ్ 12 వెర్షన్ నడుస్తోంది. అయితే త్వరలో ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 13 వెర్షన్ అప్డేట్ అవుతుందని పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి.ఆ రిపోర్ట్‌ల ఆధారంగా ఆండ్రాయిడ్ 13 వెర్షన్ ఫీచర్లు అదరగొట్టేస్తున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ ఏడాది మేలో గూగుల్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్ విడుదల చేస్తుండడంతో ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇక ఈ ఆండ్రాయిడ్ 13 వెర్షన్లో ఉన్న సరికొత్త ఫీచర్ల గురించి తెలుసుకుందాం. యాడ్స్‌కు చెక్ పెట్టొచ్చు స్మార్ట్ ఫోన్లో బ్రౌజింగ్ చేసే సమయంలో కొత్త కొత్త వెబ్సైట్లను ఓపెన్ చేస్తుంటాం. ఆ సమయంలో మన పర్మీషన్ లేకుండా వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు మన ఫోన్‌కు వస్తుంటాయి. చిరాకు పెట్టిస్తుంటాయి. కానీ ఆండ్రాయిడ్ 13 వెర్షన్ అప్ డేట్‌తో పర్మీషన్ లేకుండా నోటిఫికేషన్ లు మన ఫోన్‌కు రాలేవు. పైగా నోటిఫికేషన్ కావాలని ఎనేబుల్ చేసినా , బ్లాక్ చేయాలంటే ఈజీగా బ్లాక్ చేయొచ్చు. లాంగ్వేజ్ కూడా ఫోన్లో యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు లాంగ్వేజ్ మార్చుకోవాల్సి వచ్చేది. కానీ ఆండ్రాయిడ్ 13లో అలా కాదు. యూజర్ ఒక్కసారి యాప్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్‌లో లాంగ్వేజ్ మార్చుకుంటే..ఆ లాంగ్వేజ్‌లో కంటెంట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఆండ్రాయిడ్13లో ఉన్నాయని వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. కాగా, గూగుల్ ఆండ్రాయిడ్ 13వెర్షన్ ఈ సంవత్సరంలో మే, సెప్టెంబర్ నెలలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ అనూహ్యంగా ఓఎస్ ఫీచర్లు లీకవ్వడంతో ఆండ్రాయిడ్ 13వెర్షన్‌ను ఉపయోగించుకునేందుకు యూజర్లు టెంప్ట్ అవుతున్నారు. చదవండి: సంచలన ఆవిష్కరణ.. ఇక స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా బంప్స్ కనపడవు! -
స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కింగ్..జనవరి నుంచి ఆ స్మార్ట్ ఫోన్ ఇక కనిపించదు!
స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీని 14ఏళ్లపాటు కింగ్‌లా ఏలిన బ్లాక్ బెర్రీ ఇప్పుడు మరింత కనుమరుగు కానుంది. జనవరి 4నుంచి బ్లాక్ బెర్రీ తన ఆపరేటింగ్ సిస్టమ్ బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ ప్లే బుక్ ఓఎస్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో బ్లాక్ బెర్రీ యూజర్లు వారిఫోన్లలో ఓఎస్ 7.1, బీబీ 10లలో ఫోన్‌కాల్స్, ఎస్ఎంఎస్లతో పాటు ఎమెర్జెన్సీ నెంబర్లు పనిచేయవు. అంతేకాదు బ్లాక్ బెర్రీ సంస్థ సైతం తన యూజర్లను హెచ్చరించింది. సంబంధిత ఫోన్లలో వైఫై, మొబైల్ డేటా, బ్లాక్ బెర్రీ యాప్స్ బ్లాక్ బెర్రీ లింక్, బ్లాక్ బెర్రీ డెస్క్ ట్యాప్ మేనేజర్, బ్లాక్ బెర్రీ ప్రొటెక్ట్, బ్లాక్ బెర్రీ మెసెంజర్, బ్లాక్ బెర్రీ బ్లెండ్ యాప్స్ ఫంక్షనింగ్ పూర్తిగా ఆగిపోనున్నట్లు చెప్పింది. కింగ్ మేకర్ నుంచి ఎందుకు పతనం అయ్యింది ►1984లో కెనడాకు చెందిన మైక్ లాజరడీస్,డౌగ్లస్ ఫ్రాగ్ అనే ఇద్దరు ఇంజినీర్లు రీసెర్చ్ ఇన్ మోషన్ పేరుతో ఓ కంపెనీనీ ప్రారంభించారు. మొదట్లో ఈ కంపెనీ ఐబీఎంకోసం ఎల్ఈడీ సిస్టమ్, మోడెమ్స్ తో పాటు పేజెస్ వంటి లోకల్ నెట్ వర్కింగ్ కనెక్టివిటీ టెక్నాలజీ డెవలప్ చేసింది. అలాగే ఫిల్మింగ్ ఎడిటింగ్ సిస్టమ్‌ను డిజైన్ చేసింది. అందుకు గాను 1998లో ఆస్కార్ అవార్డ్‌ను గెలుచుకుంది. ►ఆ తర్వాత 1989లో కెనడియన్ ఫోన్ కంపెనీ అయిన రోజెర్స్ ఫోన్ మెసేజింగ్ కోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన తన మొబైల్ నెట్‌వర్క్‌లో పనిచేసేలా ఆర్ఐఎమ్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మొబైల్ మెసేజింగ్‌లో ఎక్స్పర్ట్ గా 1996లో ఎంతో వేగంగా ఎస్టాబ్లిష్ అయ్యింది. ►అలా 2000సంవత్సరంలో బ్లాక్ బెర్రీ తన మొట్టమొదటి ఫోన్ బ్లాక్ బెర్రీ 957ను మార్కెట్లో పరిచయం చేసింది. ఈ ఫోన్లో ఉండే క్వాలిటీ కీ ప్యాడ్ బటన్స్ బ్లాక్ బెర్రీ ఫ్రూట్స్ షేప్‌లో ఉంటాయి. అందుకే ఆర్ఐఎం కంపెనీ బ్లాక్ బెర్రీతో మార్కెటింగ్ చేయడం ప్రారంభించాయి. ►అప్పట్లో ఈ బ్రాండ్ ఫోన్ విడుదలైన కొద్దికాలానికే సంవత్సరానికి 50మిలియన్ల ఫోన్లను అమ్మి సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేసింది. అందుకే ఈ డివైజెస్‌ను క్రాక్ బెర్రీ అనిపిలుస్తారు. అమెరికాలో 50శాతం మార్కెట్‌ను వరల్డ్‌వైడ్ 50శాతం మార్కెట్‌ను కలిగి ఉంది. ►ఇప్పుడున్న ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు రాకముందే యూజర్లకు స్మార్ట్ ఫోన్ టెక్నాలజీని పరిచయం చేసింది ఈ బ్లాక్ బెర్రీ. తర్వాత స్మార్ట్ ఫోన్లు ఎన్ని వచ్చినా మర్కెట్లో పోటీని తట్టుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఐకానిక్ కీబోర్డ్ తో బ్లాక్ బెర్రీ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కొంత కాలం బాగున్నా స్టైలిష్ అండ్ డిగ్నిటీకి సింబాలిక్ గా చెప్పుకునే బ్లాక్ బెర్రీని హార్డ్‌వేర్ దిగ్గజం ఆపిల్, సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ కంపెనీలు వరుసగా ఆండ్రాయిడ్ వెర్షన్‌ను విడుదల చేయడంతో చతికిల బడింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త ఇన్నోవేషన్‌తో యూజర్ ను అట్రాక్ట్ చేయలేకపోతుంది. ►బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ 2000తో ఆ కంపెనీ గ్రో అవ్వడానికి మరింత బలం చేకూరినట్లైంది. కానీ ఐఓఎస్, ఆండ్రాయిండ్ కలిసొచ్చినప్పుడు..వాటికి ధీటుగా ఆ ఫోన్ సపోర్ట్ చేయలేకపోయింది. ప్రపంచం మొత్తం అప్డేట్ అవుతున్నా..బ్లాక్ బెర్రీ మాత్రం మూసధోరణిలోనే కొనసాగింది. ►యూజర్లు ఎంటర్టైన్మెంట్ ను బాగా ఇష్టపడేవారు. యూజర్ల అటెక్షన్ను యాపిల్, గూగుల్ లు గ్రాబ్ చేసినట్లుగా.. బ్లాక్ బెర్రీ అట్రాక్ట్ చేయలేకపోయింది. ►ఫోన్ వాడే యూజర్లు ఫోన్లతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో గూగుల్, యాపిల్లు నేర్పించాయి. తమ ఫోన్లతో యూజర్లు ఇంకేం చేయొచ్చో నేర్పించాయి. పగలు, రాత్రి తేడా లేకుండా యూజర్లు ఫోన్లకు అతుక్కుపోయేలా చేశాయి. అలాంటి అప్లికేషన్లు యాప్స్టోర్లను అందిస్తూ వచ్చాయి. ఈ విషయంలో కూడా బ్లాక్ బెర్రీ ఫెయిల్ అయ్యింది. ► బ్లాక్ బెర్రీ మాతృసంస్థ రీసెర్చ్ ఇన్ మోషన్ లిమిటెడ్' టెక్నాలజీ వరల్డ్ ఓ కింగ్ మేకర్. కానీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త ఇన్నోవేషన్స్‌పై ఫోకస్ చేయలేకపోయింది. అందుకే యూజర్ మైండ్ సెట్‌ను క్యాచ్ చేయలేకపోయింది. చదవండి: స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీక్..కొత్త ఏడాది ప్రారంభంలోనే లాంచింగ్..అదిరిపోయే డిజైన్లతో! -
ఆ మొబైళ్లకు పుష్ నోటిఫికేషన్స్ బంద్
శాన్ఫ్రాన్సిస్కో: విండోస్ ఫోన్ 7.5, విండోస్ ఫోన్ 8.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే మొబైళ్లకు పుష్ నోటిఫికేషన్లను నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ మంగళవారం తెలిపింది. ఈ మేరకు తన బ్లాగ్‌లో పేర్కొంది. ఒకసారి మద్ధతు నిలిపివేస్తే ఈ వర్షన్లతో నడుస్తున్న మొబైళ్లకు కంపెనీ నుంచి ఎలాంటి పుష్ నోటిఫికేషన్లు రావు, ‘ఫైండ్ మై ఫోన్’ ఫీచర్ కూడా పనిచేయదు. విండోస్ 8.1, విండోస్ 10 మొబైళ్లకు మాత్రం పుష్ నోటిఫికేషన్లు అందుతూనే ఉంటాయన్నారు. -
ఈ మొబైల్స్‌లో ఇక వాట్సాప్ పనిచేయదు!
శాన్ఫ్రాన్సిస్కో : వివిధ మొబైల్ ఫ్లాట్‌ఫాంలపై డిసెంబర్ 31, 2017 తర్వాత మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ బ్లాగ్ ద్వారా ధృవీకరించింది. బ్లాక్‌బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, దాని కంటే పాత ఫ్లాట్‌ఫాంలకు వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తున్నట్లు సోమవారం తెలిపింది. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్డేట్స్ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా పనిచేయకపోవడం ఆగిపోవచ్చునని వెల్లడించింది. భవిష్యత్తులో తమ యాప్ ఫీచర్లను ఇంకా అభివృద్ధి చేద్దామనుకుంటున్నామని, కానీ ఈ ఫ్లాట్‌ఫాంలకు అంత సామర్థ్యం లేదని చెప్పింది. ఈ ఓఎస్‌లు వాడుతున్న వారు వెంటనే కొత్త ఓఎస్ వెర్షన్(ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0+, ఐఫోన్ ఓఎస్ 7+, విండోస్ ఫోన్ 8.1+)లోకి అప్‌గ్రేడ్ కావాలని సూచించారు. అప్పుడే మీరు వాట్సప్‌ను వినియోగించుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. ఇది మాకు ఒక కఠినమైన నిర్ణయం, కానీ వాట్సాప్ ద్వారా వినియోగదారులు మరింత మంది స్నేహితులు, కుటుంబం, ప్రియమైన వారిని తో సన్నిహితంగా ఉండేలా, ఉన్నతమైన ఫీచర్లను మెరుగైన సౌలభ్యాన్ని అందిస్తున్నాం. ఈ క్రమంలో అప్‌గ్రేడ్ చేసుకోవాలసింది రికమెండ్ చేశాం’’ అని వాట్సాప్ తన బ్లాగులో పేర్కొంది. ఈ సంవత్సరం చివరి నాటికి వాట్సాప్ బంద్ అయ్యే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ బ్లాక్ బెక్రీ, ఓఎస్, 10 విండోస్ ఫోన్ 8.0 , అంతకంటే పాతవి దీనితోపాటు నోకియా ఎస్ 40 ఫోన్లలో వాట్సాప్ డిసెంబర్ 31,2018 తరువాత పనిచేయదని పేర్కొంది. ఫిబ్రవరి 1, 2020 తర్వాత ఆండ్రాయిడ్ 2.3.7 , అంతకంటే పాత వెర్షన్లలో కూడా వాట్సాప్ సేవలను నిలిపి వేయనుంది. కాగా 2016 లో వివిధ మొబైల్ ఫ్లాట్‌ఫాంలలో వాట్స్అప్ సేవలు నిలిపివేత గురించి మొదటిసారి ప్రకటించింది. ఆ తరువాత మరికొన్ని ఓఎస్‌లలో ఈ గడువును జూన్ 30, 2017 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. తాజాగా గడువు డిసెంబరు 31, 2017తో ముగియనుందని తెలిపింది. -
విండోస్‌పై డిస్కౌంట్ ఇవ్వండి
మైక్రోసాఫ్ట్‌ను కోరిన కేంద్రం న్యూఢిల్లీ: భారత్‌లోని యూజర్ల కోసం విండోస్ ఆపరేటింగ్ సిస్టం (ఓఎస్) లేటెస్ట్ వెర్షన్‌ను కొంత డిస్కౌంటు ధరకు అందించాలని సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ను కేంద్రం కోరింది. మాల్వేర్, రాన్సమ్వేర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లు కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు దీనివల్ల కాస్త వెసులుబాటు లభిస్తుందని పేర్కొంది. ‘భారత్‌లోని యూజర్లు పాత ఓఎస్ నుంచి లేటెస్ట్ ఓఎస్ (విండోస్ 10)కి అప్‌గ్రేడ్ అయ్యే వెసులుబాటు కల్పిస్తూ.. వన్ టైమ్ ప్రత్యేక డిస్కౌంటు రేటుపై ఓఎస్‌ను అందించాలని మైక్రోసాఫ్ట్‌ను కోరాం‘ అని నేషనల్ సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ గుల్షన్ రాయ్ తెలిపారు. దీనికి మైక్రోసాఫ్ట్ కూడా సుముఖంగానే ఉందని, సూత్రప్రాయంగా ఈ ప్రతిపాదనకు అంగీకరించిందని ఆయన వివరించారు. డిస్కౌంటు ఎంత ఉండాలనే దానిపై ఇంకా కసరత్తు జరుగుతూనే ఉండగా.. కనీసం రూ. 1,000 లేదా అంతకన్నా కొంత తక్కువగానైనా ఉండాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం విండోస్ 10 హోమ్ ఓఎస్ ధర రూ. 8,000గాను, ప్రొఫెషనల్ వెర్షన్ రేటు రూ. 13,000గాను ఉంది. దేశీయంగా లక్షల కొద్దీ కంప్యూటర్స్ విండోస్ ఓఎస్‌పై పనిచేస్తున్నప్పటికీ.. విండోస్ 10కి అప్‌గ్రేడ్ అయిన వాటి సంఖ్య తక్కువే. -
ఎంపీడీవోలకు బదులు ఓఎస్డీలు
• కొత్త మండలాల్లో నియమించనున్న సర్కారు • జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎస్ రాజీవ్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడే మండలాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవోల)కు బదులుగా.. ప్రత్యేక అభివృద్ధి అధికారుల (ఓఎస్డీ)ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మండలాల్లో ప్రస్తుతం మండల పరిషత్‌లు లేనందున వారిని ఓఎస్డీ (డెవలప్మెంట్)లుగా నియమించి, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించనుంది. ఇందుకు అవసరమైన అధికారులను గుర్తించి ప్రతిపాదనలు రూపొందిం చాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఆదేశించింది. ఇక కొత్త జిల్లాలకు అవసరమయ్యే ఉద్యోగుల వివరాలు, సిబ్బంది ప్రతిపాదనలను అన్ని శాఖల అధికారులు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించింది. ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి ఆర్థిక శాఖలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై శుక్రవారం అన్ని శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సన్నద్ధంగా ఉండండి కొత్తగా ఏర్పడే మండలాలు, డివిజన్లన్నింటిలో అక్టోబర్ 11న దసరా నుంచే కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లను రాజీవ్‌శర్మ ఆదేశించారు. ముఖ్యం గా తొలి రోజున అన్ని మండలాల్లో రెవెన్యూ, వ్యవసాయం, విద్య, పోలీస్, పంచాయతీరాజ్ శాఖలు కొలువు దీరుతాయి. దీంతో ఈ ఐదు శాఖలు వెంటనే తమ సిబ్బంది ప్రతిపాదనలు రూపొందించాలని, ముందుగానే పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కొత్త జిల్లాల్లో ప్రాధాన్యతలకునుగుణంగా అక్కడి ప్రజలకు మెరుగైన సేవలందించే ఏ ర్పాట్లు చేయాల స్పష్టం చేశారు. కొత్త జిల్లాల్లో ఉన్న ప్రత్యేకతలు, భౌగోళిక, సామాజిక పరిస్థితులను బట్టి ఆయా శాఖలకు సరిపడే సిబ్బంది నియామకం జరగాలన్నారు. అన్ని వివరాలతో.. ప్రతి శాఖ పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సిబ్బంది వివరాలు, సిబ్బంది నమూనా, కార్యాలయాల గుర్తింపు, వాహనాల వివరాలు, ఉద్యోగుల సర్దుబాటు తదితర వివరాలన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సీఎస్ సూచించారు. కొత్తగా అవసరమయ్యే పోస్టుల వివరాలను పంపడంతోపాటు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగుల జాబితాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతమున్న ఉద్యోగుల వివరాలు, సిబ్బంది ప్రతిపాదనలను స్పష్టంగా అప్లోడ్ చేయాలని.. ఉద్యోగుల ఆధార్ నంబర్లను సైతం అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. ఆధార్ కార్డు లేని ఉద్యోగులు కొత్తగా కార్డు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ చంద్ర, రంజీవ్ ఆర్ ఆచార్య, ఎస్కే జోషి, ముఖ్య కార్యదర్శులు బి.పి.ఆచార్య, రామకృష్ణారావు, సోమేష్‌కుమార్, అదర్ సిన్హా, సునీల్‌శర్మ, రాజీవ్ త్రివేదీ, సీఎంవో అధికారులు శాంతికుమారి, స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఫైర్ఫాక్స్ దృష్టి
వెబ్ బ్రౌజింగ్‌ను సులభతరం చేసి ఫైర్ఫాక్స్ నెటిజన్ల మనసు దోచుకుంది. ఇప్పుడు ఈ సంస్థ సెల్ఫోన్ల కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. మార్కెట్లో పాతుకుపోయిన ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్‌లకు పోటీ ఇవ్వాలని ఫైర్ఫాక్స్ ఒక ప్రయత్నం చేస్తోంది. ఐదేళ్ల క్రిందట సెల్ఫోన్లలో ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)కు ఎంతో ప్రాధాన్యం ఉండేది. మొబైల్ ఫోన్ల తయారీలో అప్పట్లో కింగ్‌లా ఉన్న నోకియా ఈ ఓఎస్‌కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించక తీవ్రంగా దెబ్బతింది. సరిగ్గా అదే సమయంలో గూగుల్ సంస్థ ఈ విషయాన్ని గుర్తించింది. ఓఎస్‌పై ఆధారపడే భవిష్యత్తులో సెల్‌ఫోన్ అమ్మకాలు జరుగుతాయని గ్రహించింది. ఆ క్రమంలో ఆండ్రాయిడ్ అనే సంస్థను కొనుగోలు చేసింది. తాను సొంతంగా సెల్ఫోన్లు తయారు చేయనప్పటికీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా సెల్‌ఫోన్ రంగాన్ని శాసించే స్థితికి చేరుకుంది. 75 శాతం మార్కెట్ వాటాతో నెంబర్‌వన్‌గా నిలిచింది. యాపిల్ కంప్యూటర్స్ ఐఫోన్ కోసం రూపొందించి ఐఓఎస్ కూడా ఈ క్రమంలో బాగా వెనక్కు వెళ్లిపోయింది. నోకియా తన సింబియాన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎంత ఎగదోసినా లాభం లేకుండా పోయింది. కొత్త గాడ్జెట్లను మెరుపు వేగంతో కాపీ కొట్టే స్యాంసంగ్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ విషయంలో చతికిలబడింది. బడా పేరుతో తీసుకువచ్చిన ఓఎస్ ఫోన్లు ఆదరణ పొందలేదు. ఇంకా బ్లాక్‌బెర్రీతో పాటు పలు సంస్థలు రూపొందించిన ఓఎస్‌లు కూడా మార్కెట్లో నిలబడలేదు. మొబైల్ ఫోన్లు చొచ్చుకురావడంతో మైక్రోసాప్ట్ కూడా విండోస్ మొబైల్ ఓఎస్‌ను రూపొందించింది. అయితే దానికి అంతంతమాత్రంగానే ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో వెబ్బ్రౌజర్గా విజయవంతమైన ఫైర్ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద దృష్టి పెట్టింది. లైనెక్స్ ఆధారంగా ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. దీనిని ఇప్పటికే జెడ్‌టీఈ, సోనీ కంపెనీలు వినియోగిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఫైర్ఫాక్స్ ఫోన్లను కూడా విడుదల చేసింది. మన దేశంలో ఇంటెక్స్, స్పైస్ కంపెనీలు ఫైర్ఫాక్స్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. నోకియా, స్యాంసంగ్, బ్లాక్‌బెర్రీ , మైక్రోసాప్ట్ లాంటి దిగ్గజాలు సరైన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించలేక చతికిలబడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఫైర్ఫాక్స్ రూపొందించిన ఓఎస్ ఏ మేరకు విజయం సాధిస్తుందన్నది ప్రశ్నార్థకమే. అయితే ఈ ఓఎస్ ఓపెన్ సోర్స్ కాబట్టి, సెల్‌ఫోన్ తయారీ కంపెనీలు తమకు కావాల్సిన రీతిలో మార్చుకోవడానికి వీలవుతుంది. ఈ వెసులుబాటు ఆధారంగా ఫైర్ఫాక్స్కు కొంత మేర ఆదరణ లభించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. ** -
విజయవాడ పోలీసు కమిషనరేట్‌కు
నలుగురు అదనపు డీసీపీలు విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనరేట్‌కు నలుగురు అదనపు డీఎస్పీలను కేటాయించిన ప్రభుత్వం.. ఇక్కడ పనిచేస్తున్న ఒక అదనపు ఎస్పీ, ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పనిచేస్తున్న ఇద్దరు డీఎస్పీలు సహా ముగ్గురు అదనపు డీసీపీలను బదిలీ చేసింది. నగర పోలీసు కమిషనరేట్ బలోపేతం చేసేందుకు ఉన్నతాధికారులు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ బదిలీలు జరిగినట్టు పోలీసు వర్గాల సమాచారం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. వచ్చేది వీరు.. గుంటూరు అర్బన్ వెస్ట్‌జోన్ డీఎస్పీగా పనిచేస్తున్న టీవీ నాగరాజుకు అదనపు ఎస్పీగా పదోన్నతి కలిపించి విజయవాడ నగర ట్రాఫిక్ అదనపు డీసీపీగా బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.నాగేశ్వరరరావుకు అదనపు ఎస్పీగా పదోన్నతి కలిపించి నగర క్రైం విభాగం అదనపు డీసీపీగా నియమించారు. కేంద్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) డీఎస్పీగా పనిచేస్తున్న పి. నరసింహారావుకు అదనపు ఎస్పీగా పదోన్నతి కలిపించి సిటీ స్పెషల్ బ్రాంచి (సీఎస్బీ) అదనపు డీసీపీగా నియమించారు. కేంద్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) డీఎస్పీగా పనిచేస్తున్న జి.రామకోటేశ్వరరావుకు అదనపు ఎస్పీగా పదోన్నతి కలిపించి నగర పోలీసు కమిషనరేట్‌లోని పరిపాలన (అడ్మినిస్ట్రేషన్) విభాగం అదనపు డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెళ్లేది వీరు... నగర పోలీసు కమిషనరేట్‌లో అదనపు డీసీపీ(క్రైమ్స్)గా పనిచేస్తున్న వి.గీతాదేవిని విజయవాడ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బదిలీ చేశారు. నగర పోలీసు కమిషనరేట్‌లో పనిచేస్తున్న అదనపు డీసీపీ(పరిపాలన) షకీలా భానుకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆమెను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని సిటీ స్పెషల్ బ్రాంచ్‌లో ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పని చేస్తున్న టి.రవీంద్రబాబును బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలన్నారు.