
స్మార్ట్ టీవీల కోసం దేశీయంగా తొలి ఆపరేటింగ్ సిస్టమ్ జియోటెలి ఓఎస్‌ను ఆవిష్కరించినట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. దీనితో తయారైన థామ్సన్, కొడక్, బీపీఎల్, జేవీసీ వంటి బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ టీవీలు ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఈ ఏడాది మరిన్ని బ్రాండ్స్ చేతులు కలిపే అవకాశం ఉందని వివరించింది.
ఇదీ చదవండి: యూఎస్‌తో డీల్‌పై ఆందోళన అక్కర్లేదు
భారతీయ వినియోగదారుల అవసరాలను తీరుస్తూ, సరికొత్త వినోద అనుభూతిని అందించే కొత్త తరం ప్లాట్‌ఫాంగా జియోటెలి ఓఎస్‌ను జియో అభివరి్ణంచింది. ఈ విభాగంలో గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ, వెబ్‌ఓఎస్, శాంసంగ్ టైజెన్‌లతో జియోటెలి ఓఎస్ పోటీపడనుంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం భారత్‌లో స్మార్ట్ టీవీల మార్కెట్ 1.34 కోట్ల యూనిట్‌గా ఉండగా, ఆదాయాలు సుమారు రూ. 52 వేల కోట్ల స్థాయిలో ఉన్నాయి. ఓపెన్ సెల్స్‌పై కస్టమ్స్ సుంకాలు తగ్గిస్తూ బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలతో స్థానికంగా డిస్‌ప్లేల అసెంబ్లింగ్‌కి ఊతం లభించి, అంతిమంగా తయారీ సంస్థలకు ఖర్చులు 5–10% ఆదా కాగలవని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వీపీ (రీసెర్చ్) నీల్ షా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment