భారతదేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన 'రిలయన్స్ జియో' (Reliance Jio) ఎకనామిక్ రీఛార్జ్ ప్లాన్‌లతో మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. దేశంలోని సుమారు 490 మిలియన్లకు పైగా వినియోగదారులకు కనెక్ట్ అయి ఉండటానికి కంపెనీ ఎప్పటికప్పుడు వినూత్నమైన లేదా సరసమైన రీఛార్జ్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా 49 రూపాయలతో డేటా రీఛార్జ్ అందిస్తోంది.
రూ.49 రీఛార్జ్ ప్లాన్ వివరాలు
జియో డేటా ప్యాక్ కేటగిరీ కింద రూ. 49 రీఛార్జ్ ప్లాన్ ప్రారంభించింది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత డేటా మాత్రమే లభిస్తుంది. అయితే మీరు కాలింగ్, ఎస్ఎమ్ఎస్ సేవలను పొందలేరు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ప్యాక్ వ్యాలిడిటీ కేవలం ఒక రోజు మాత్రమే. అయితే ఒకరోజు అపరిమిత డేటా కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
రిలయన్స్ జియో అందిస్తున్న ఒక్క రోజు అపరిమిత డేటా ప్లాన్.. దాని ప్రత్యర్ధ సంస్థలైన ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (VI), బీఎస్ఎన్ఎల్ వంటి వాటిపై ఒత్తిడిని పెంచింది. కాగా జియో తన కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫ్రెండ్లీ బడ్జెట్ ప్లాన్స్ అందించింది.
2024 జులైలో జియో తన కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్లను ప్రకటించింది. కొత్తగా అమలులోకి వచ్చిన ప్లాన్ ధరలు.. ఉన్న ప్లాన్ ధరల కంటే 20 శాతం ఎక్కువయ్యాయి. దీంతో 155 రూపాయల ప్లాన్ 189 రూపాయలకు, 209 రూపాయల ప్లాన్ 249 రూపాయలకు చేరుతుంది. రూ. 2999 యాన్యువల్ ప్లాన్.. త్వరలో 3599 రూపాయలకు చేరాయి.
ఇదీ చదవండి: స్పామ్ కాల్స్‌కు అడ్డుకట్ట!.. వచ్చేసింది మొబైల్ యాప్
రీఛార్జ్ ప్లాన్ ధరలు భారీగా పెరగడంతో.. చాలామంది బీఎస్ఎన్ఎల్ వైపు తిరిగారు. ఆ తరువాత మళ్ళీ తమ యూజర్లను ఆకర్శించడానికి జియో సరికొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వచ్చినదే.. రూ. 49 డేటా ప్లాన్. ఇది ఇంటర్నెట్ బాగా వాడేవారికి ఎక్కువ ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment