Data Plans
-
వొడాఫోన్ ఐడియా యూజర్లకు శుభవార్త..అదనంగా
ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) తన కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా సంస్థ వీఐ నెట్ వర్క్ సబ్ స్క్రైబర్లు 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం అదనపు డేటాను అందిస్తోంది.ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ‘వీఐ గ్యారెంటీ ప్రోగ్రామ్’ను ప్రకటించింది. 5జీ, 4జీ ఫోన్ వినియోగదారులందరికీ 130 జీబీ డేటాను అందిస్తుంది. ఈ ప్యాక్‌ను ఎంచుకున్న యూజర్లకు మరో ఏడాది పాటు ఈ డేటాను పొందవచ్చని వీఐ పేర్కొంది. 13 వరుస సైకిళ్లకు ప్రతి 28వ రోజు ఆటోమేటిక్‌గా 10జీబీ జమ అవుతుందని కంపెనీ ఒక విడుదలలో తెలిపింది.ఈ సందర్భంగా వీఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా మాట్లాడుతూ..దేశంలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తగినంత డేటా లేకపోవడం వల్ల వారి 4జీ/5జీ స్మార్ట్ ఫోన్ వినియోగం సామర్థ్యాన్ని పెంచుకోవడం లేదని చెప్పారు. -
Jio AirFiber: ఎయిర్‌ఫైబర్ కస్టమర్లకు జియో ఆఫర్లు..
జియో ఎయిర్ ఫైబర్ (Jio AirFiber) కస్టమర్లకు అదనపు డేటా కోసం డేటా బూస్టర్ ప్లాన్లను అందిస్తోంది. నెలవారీ అన్లిమిటెడ్ డేటా కోటా పూర్తయి అదనపు డేటా కావాల్సినవారి కోసం మూడు డేటా బూస్టర్ ప్లాన్లను జియో తీసుకొచ్చింది. జియో కొన్ని నెలలుగా దేశంలోని పలు నగరాల్లో ఎయిర్‌ఫైబర్ సేవలను అందిస్తోంది. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని అందించడానికి 5G టెక్నాలజీని ఉపయోగించే వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్. 1 నుంచి 1.5 Gbps వేగంతో ఇంటర్నెట్ అందించగల దీన్ని నివాస, కార్యాలయ వినియోగం కోసం రూపొందించారు. జియో ప్రకారం.. దాని ఎయిర్ ఫైబర్ వినియోగదారులు నెలకు 1TB హై-స్పీడ్ డేటాను ఆనందించవచ్చు. అయితే ఈ పరిమితిని చేరుకున్న తర్వాత, వేగం తగ్గుతుంది. వినియోగదారులకు మరిన్ని డేటా ఎంపికలను అందించడానికి మూడు రకాల డేటా బూస్టర్ ప్యాక్‌లను అందిస్తోంది. డేటా బూస్టర్ ప్లాన్ వివరాలు 1TB కంటే ఎక్కువ హై-స్పీడ్ డేటా అవసరమయ్యేవారు స్పీడ్ బూస్ట్ పొందడానికి ఈ ప్యాక్‌లను ఎంచుకోవచ్చు. రూ. 101 ప్లాన్: ఈ ప్లాన్ మీ బేస్ ప్లాన్‌తో సమానమైన వేగంతో 100GB అదనపు డేటాను అందిస్తుంది. రూ. 251 ప్లాన్: ఈ ప్లాన్‌తో మీరు మీ బేస్ ప్లాన్‌లో ఉన్న వేగంతో 500GB అదనపు డేటాను పొందుతారు. రూ. 401 ప్లాన్: ఇది మీ బేస్ ప్లాన్‌లో ఉన్నట్టుగానే అదే వేగంతో 1000GB డేటా టాప్ అప్ అందిస్తుంది. -
ICC పురుషుల ప్రపంచ కప్ 2023: ఫ్యాన్స్‌కు ఎయిర్టెల్ గుడ్ న్యూస్
ICC పురుషుల ప్రపంచ కప్ 2023 మెగా టోన్నీ షురూ కావడంతో క్రికెట్ ఫీవర్ ఊపందుకుంది ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ టెలికాం ప్రొవైడర్ ఎయిర్టెల్ రంగంలోకి దిగింది. తన కస్టమర్ల కోసం రెండు అపరిమిత డేటా ప్లాన్లను ప్రకటించింది. 2 రోజులకు డేటా అవసరాలకోసం రూ.99, ఒక రోజు చెల్లుబాటయ్యేలా రూ.49 ల ప్యాక్‌ను లాంచ్ చేసింది. (గుడ్ న్యూస్: కార్ల కొనుగోలుపై మారుతి సుజుకి ఆఫర్లు) ఈ మెగా ఈవెంట్లో తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అలాగే ఈ నెల 14న జరిగే భారత్-పాక్ మధ్య జరగనున్న మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈక్రమంలోనే ప్రీపెయిడ్ డేటా ప్యాక్ లను ప్రకటించింది. (గ్లాస్ సీలింగ్ బ్రేక్స్:ఈ మెకానికల్ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా) రూ.49, రూ.99 డేటా ప్యాక్స్ ICC వరల్డ్ కప్ 2023ను ఎంజాయ్ చేయాలనుకునే క్రికెట్ ఔత్సాహికుల కోసం రెండు ప్రత్యేకమైన డేటా ప్లాన్లను ఆవిష్కరించింది. ఈ డేటా ప్లాన్లు ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి రూ.49తో రీచార్జ్‌పై 6జీబీ డేటా లభిస్తుంది. డేటా వ్యాలిడిటీ ఒక రోజు. అలాగే రూ.99 రీచార్జ్ చేసుకున్న వినియోగదారులు రెండు రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ డేటా లభిస్తుంది. దీంతోపాటు మొబైల్ డేటా ప్లాన్లతో పాటు, ఎయిర్టెల్ డీటీహెచ్ సైతం స్టార్ నెట్ వర్క్ సాయంతో ప్రత్యేక ప్లాన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
న్యూ ఇయర్ ఆఫర్ అదరహో.. ఎయిర్టెల్ యూజర్లుకు 50జీబీ డేటా ఫ్రీ!
కొత్త సంవత్సరం రాబోతున్న సందర్భంగా పలు కంపెనీలు తమ కస్టమర్ల ఆకట్టుకునేందుకు ఆఫర్లును ప్రకటిస్తున్నాయి. దేశీయ టెలికాం రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న భారతీ ఎయిర్టెల్ తాజాగా న్యూ ఇయర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఎయిర్టెల్ వినియోగదారుల కోసం ఉచితంగా 50 జీబీ డేటా (Data) ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫ్రీ డేటా ఆఫర్ పొందాలనుకున్న కస్టమర్లు ఏం చేయాలంటే.. ఎయిర్టెల్ కంపెనీ కొత్త ఏడాదిని పురస్కరించుకుని వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ తీసుకునే యూజర్లకు 5 జీబీ నుంచి 50 జీబీ డేటాను ఆఫర్‌ను అందిస్తోంది. వినియోగదారులు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే.. యాడ్స్ లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయడం, డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు ఇలా వివిధ రకాల ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే.. ఎయిర్టెల్ యూజర్లు వింక్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను నెల రోజులు తీసుకుంటే వారి 5 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రూ. 98కే ఈ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. 50 జీబీ డేటా ఉచితంగా పొందాలంటే మీరు ఏడాది వింక్ మ్యూజిక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని విలువ రూ. 301గా ఉంది. గమనించాల్సిన విషయం ఎంటంటే.. ఇక్కడ ఎవరైతే వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకే ఈ ఉచిత డేటా ఆఫర్ వర్తిస్తుంది. చదవండి: వేల సంఖ్యలో ఉద్యోగాల కోత.. అక్కడ మాత్రం జాబ్ ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయ్! -
డేటా ఎక్కువ వినియోగిస్తున్నారా? జియో కొత్త ప్లాన్ వచ్చేసింది!
వివిధ రకాల ఆఫర్లతో ఆకట్టుకుంటూ కస్టమర్ల సంఖ్య పెంచుకుంటూ పోతోంది ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. తాజాగా మరో సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ డేటా ఎక్కువగా వినియోగించే వారి కోసం 4జీ డేటా యాడ్ ఆన్ ప్రీపెయిడ్ ప్యాక్ (Data Add on plan) తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫిఫా వాల్డ్ కప్ ఖతర్ 2022 జరుగుతున్న నేపథ్యంలో ఫుట్‌బాల్ లవర్స్ కోసం ఈ యాడ్ ఆన్ ప్లాన్‌ని ప్రారంభించింది. ప్లాన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇది రూ.222 ధరకు డేటా యాడ్ ఆన్ ప్లాన్, దీని వ్యాలిడిటీ 30 రోజులు. ఈ ప్యాక్ మొత్తం 50GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అంటే 1GB డేటా కోసం వినియోగదారులు రూ.4.44 చెల్లిస్తారు. దీని గడువు ముగిసేలోపు మొత్తం డేటా ఉపయోగిస్తే, నెట్వర్క్ స్పీడ్ 64Kbpsకి పరిమితం అవుతుంది. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఫుట్‌బాల్ వరల్డ్ కప్ డేటా ప్యాక్‌ను ఇప్పటికే ఉన్న బేస్ ప్లాన్‌తో కలిపి ఉపయోగించాల్సి ఉంటుంది. యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్ కింద అందించే రోజువారీ డేటా అయిపోయిన తర్వాత ఈ 50GB డేటా వాడుకోవచ్చు. ఇదే కాకుండా రూ. 181, రూ. 241, రూ. 301 ధరలతో ఇలాంటి మరిన్ని యాడ్-ఆన్ డేటా ప్యాక్‌లు కూడా జియో అందిస్తోంది. చదవండి ‘మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా’..పిచాయ్ వార్నింగ్..ఆందోళనలో గూగుల్ ఉద్యోగులు! -
ఏపీ ఫైబర్ నెట్ అదిరిపోయే ప్లాన్స్: 245+ ఛానల్స్, అన్లిమిటెడ్ డేటా, ఓటీటీ కూడా..
గ్రామీణ ప్రాంత ప్రజల సౌలభ్యం కొరకు దేశంలోనే మరెవ్వరు అందించలేనటువంటి ట్రిపుల్ ప్లే సర్వీస్‌లను తక్కువ ధరలకే మీ ముందుకు తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL). వినియోగదారులకు సరికొత్త హంగులతో డిఫెరెంట్ ప్యాకేజీలతో ఇంటర్నెట్, టెలిఫోన్, ఓటీటీ సేవలను అతి తక్కువ ధరలలో కస్టమర్లకు అందిస్తోంది. వాటి పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం! హోమ్ లైఫ్ ప్యాకేజీ: రూ.295/- ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్‌తో పాటు 15 ఎంబీపీఎస్(Mbps) ఇంటర్నెట్ స్పీడ్, 200 GB FUP లిమిట్, 2 ఎంబీపీఎస్(Mbps) Post FUB అన్ లిమిటెడ్ నెట్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. ప్రస్తుత ట్రిపుల్ ప్లే సేవలతో పాటు ఓటీటీ ఇంటిగ్రేటెడ్ ప్యాకేజీలు IP టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ ఓటీటీ సౌకర్యంతో: హోమ్ గోల్డ్ ప్యాకేజీ: రూ.499.. 200 + ఛానెల్స్, 20 ఎంబీపీఎస్ స్పీడ్, 150 GB FUP లిమిట్, 2 ఎంబీపీఎస్ Post FUP, ఓటీటీ(OTT) సేవలు.. Aha, Voot Select, Epic On, 1 OTT, Eros Now, Meemoతో పాటు టెలిఫోన్ సౌకర్యం హోమ్ గోల్డ్ ప్లస్ ప్యాకేజీ: రూ.699 240+ ఛానల్స్, 30 ఎంబీపీఎస్ స్పీడ్, 300 GB FUP లిమిట్, 2 ఎంబీపీఎస్ Post FUP, ఓటీటీ సేవలు.. Aha, Eros Now, ShemarooMe, Discovery PLus, Hungama Play, Hungama Music, Epic On, 1 OTT, Eros Now, Meemo తో పాటు టెలిఫోన్ సౌకర్యం. హోమ్ గోల్డ్ ప్లస్ ప్యాకేజీ: రూ.999 245+ ఛానల్స్, 50 ఎంబీపీఎస్ స్పీడ్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్, FUB లిమిట్ లేదు. ఓటీటీ సేవలు.. Aha, Zee5, Voot, Sun nxt Premium, Alt Balaji, Eros Now, Discovery PLus, Hungama Play, Hungama Music, Discovery PLus, Meemo, MX player Gold, Aao NXT,Gaana Plus Epic On, 1 OTT, Eros Now తో పాటు టెలిఫోన్ సౌకర్యం ఓటీటీ , ఇంటెర్నట్, టెలిఫోన్ సౌకర్యంతో ప్లాన్లు ఇవే.. ఓటీటీ మినీ ప్యాకేజీ: రూ.299 (10 ఎంబీపీఎస్ స్పీడ్, 150 GB FUP, 2 ఎంబీపీఎస్ Post FUB, ఓటీటీ సేవలు.. Epic On, 1 OTT, Meemo/Aha, టెలిఫోన్ సౌకర్యం) ఓటీటీ మినీ ప్యాకేజీ: రూ.399 30 ఎంబీపీఎస్ స్పీడ్, 300 GB FUP, 2 ఎంబీపీఎస్ Post FUB, ఓటీటీ సర్వీసులు.. Ah, Voot, epic on, 1 ott, eros now, Meemoతో పాటు టెలిఫోన్ సౌకర్యం) ఓటీటీ మినీ ప్యాకేజీ: రూ.799 50 ఎంబీపీఎస్ స్పీడ్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్..FUP లిమిట్ లేదు, ఓటీటీ సేవలు Aha, Zee5, Voot, Sun nxt Premium, Alt Balaji, Eros Now, Discovery PLus, Hungama Play, Hungama Music, Discovery PLus, Meemo, MX player Gold, Aao NXT,Gaana Plus Epic On, 1 OTT, Eros Now.. టెలిఫోన్ సౌకర్యం) ఈ వివిధ ప్యాకేజీలను ఏపీఎస్ఎఫ్ఎల్ వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీల సమాచారం కొరకు వెంటనే మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి లేదా APSFL కాల్ సెంటర్ -18005995555 కు సంప్రదించాల్సి ఉంటుంది. (అడ్వటోరియల్) -
ఫిఫా వరల్డ్‌కప్ 2022: అదిరిపోయే ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్
సాక్షి, ముంబై: క్రమేపీ యూజర్లను కోల్పోతున్న టెల్కో వోడాఫోన్ ఐడియా ఫిఫా ప్రపంచకప్- 2022 సందర్భంగా కొత్త ప్లాన్లలను ప్రకటించింది. ఫుట్‌బాల్ ప్రియులను ఆకట్టుకునేలా వోడాఫోన్ ఐడియా ఐదు కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లను తీసుకొచ్చింది. జియో ప్లాన్ల మాదిరిగానే వీఐ కూడా అయిదు ప్లాన్లను తీసుకొచ్చింది. ఖతార్, సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న వినియోగ దారులు దీన్ని ఉపయోగించుకోవచ్చు. వీఐ వెబ్సైట్, లేదా వీఐ యాప్ ద్వారా వీటిని కొనుగోలు చేయ వచ్చని తెలిపింది. రూ. 2,999 రోమింగ్ ప్లాన్: ఎస్ఎంఎస్ , వాయిస్ కాల్స్ ఈ ప్లాన్ ఏడు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. వినియోగదారులకు లోకల్ కాల్స్, ఇండియా అవుట్గోయింగ్ కాల్స్ కోసం 200 నిమిషాల టాక్ టైమ్‌ను వినియోగించుకోవచ్చు. ఇది కాకుండా, ఉచిత ఇన్కమింగ్ కాల్స్, 25 SMSలు ఉచితం. అదనంగా, వినియోగదారులకు 2 జీబీ డేటా కూడా. రూ. 3,999 రోమింగ్ ప్లాన్: ఎస్ఎంఎస్ , వాయిస్ కాల్స్ 10 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్‌తో, వినియోగదారులకు 300 నిమిషాల టాక్ టైమ్ వాడుకోవచ్చు, ఇందులో భారతదేశానికి స్థానిక, అవుట్గోయింగ్ కాల్స్ కూడా ఉన్నాయి. వినియోగదారులు 3 జీబీ డేటా , 50 ఎస్ఎంఎస్లు అదనం. రూ. 4,999 రోమింగ్ ప్లాన్: ఎస్ఎంఎస్, వాయిస్ కాల్స్ ఈ ప్లాన్ 14 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుంది. వినియోగదారులకు భారతదేశానికి 500 నిమిషాల లోకల్ , అవుట్గోయింగ్ కాల్స్. అలాగే 5 జీబీ డేటాతో పాటు ఉచిత ఇన్కమింగ్ కాల్స్. అదనంగా 50 ఎస్ఎంఎస్లు ఉచితం. రూ. 5,999 రోమింగ్ ప్లాన్: అన్ని ప్లాన్లలో అత్యంత ఖరీదైన ప్లాన్ ఇది. ఎస్ఎంఎస్, వాయిస్ కాల్స్, 500 నిమిషాల స్థానిక, భారతదేశానికి అవుట్గోయింగ్ కాల్స్ అందిస్తుంది. అలాగే 5 జీబీ డేటాతో పాటు ఉచిత ఇన్కమింగ్ కాల్స్. అదనంగా 100 50 ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇతర దేశాలకు కాల్స్ చేయడానికి సబ్స్క్రైబర్లకు నిమిషానికి రూ.35 వసూలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. -
మొదలైన ఐపీఎల్ ఫీవర్.. జియో కొత్త ఆఫర్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ వచ్చేయడంతో క్రికెట్ లవర్స్ కోసం జియో సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. క్రికెట్ మ్యాచ్ లైవ్‌లను చూసి ఆనందించేందుకు వీలుగా రెండు ప్లాన్లు అందుబాటులోకి తెచ్చింది. రూ.555 జియో క్రికెట్ డేటా యాడ్ ఆన్ ప్యాక్‌లో 55 జీబీ డేటా, వన్ ఇయర్ హాట్‌స్టార్, డిస్నీ ప్లస్ చందాలతో పాటు కాంప్లిమెంటరీగా జియో యాప్స్ యాక్సెస్ ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 55 రోజులు. రూ. 2999 విలువ చేసే వార్షిక ప్లాన్‌లో ప్రతీరోజు 2.5 జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్, డెయిలీ వంద మెసేజ్‌లు, డిస్నీ హాట్ స్టార్ వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్, జియో యాప్ యాక్సెస్ వంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ప్యాక్ 365 రోజుల గడువుతో వస్తుంది. -
జియో పెనుసంచలనం: కేవలం ఒక్క రూపాయికే..
Reliance Jio Becomes the First Operator to Offer a Rs 1 Prepaid Plan with 100 MB Data Valid for 30 Days: దేశీ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో మరో సంచలనానికి తెర తీసింది. ప్రపంచంలోనే అత్యంత కారుచౌక ధరకు ఇంటర్నెట్ ప్యాకేజీని అందిస్తోంది. మంగళవారం గప్‌చుప్‌గా ఈ ప్యాక్‌ను వాల్యూ కేటగిరీలో యాడ్ చేసింది జియో. ప్రీపెయిడ్ రీఛార్జిలో భాగంగా ఒక్క రూపాయికి వంద ఎంబీ ఇంటర్నెట్ డేటా అందిస్తోంది రిలయన్స్ జియో. 100 ఎంబీ 4జీ డేటా.. 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ డేటా అయిపోగానే.. 64 కేబీపీఎస్‌తో ఇంటర్నెట్‌స్పీడ్ అందుతుంది. అంటే.. వాట్సాప్‌లో సాధారణ టెక్స్ట్ మెసేజ్‌లు పంపుకోవచ్చన్నమాట. ఈమధ్యకాలంలో టెలికాం నెట్‌వర్క్‌లు అన్నీ టారిఫ్‌లు పెంచిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో జియో వేసిన ఈ అడుగు కీలకమనే చెప్పాలి. ఇక వాటర్ ప్యాకెట్ ధర కంటే తక్కువకి.. అదీ కేవలం ఒక్క రూపాయికే ఇంటర్నెట్ ప్యాకేజీని అందించడం సంచలనంగా మారింది. ప్రపంచంలో ఇంత తక్కువ ధరకే డేటా ప్యాక్‌ను అందించిన ఘనత ఇప్పుడు రిలయన్స్‌కే దక్కింది. ఇదిలా ఉంటే 15రూ. 1 జీబీ డేటా అందిస్తున్న ప్యాక్ కంటే.. ఇలా ఒక్క రూపాయి ప్యాక్ ద్వారా 10రూ.తోనే వన్ జీబీ పొందే వీలు ఉంటుంది. ఇక జియో అందిస్తున్న ఈ 100 ఎంబీప్లాన్ డేటాప్లాన్.. అన్నేసి రోజుల వాలిడిటీతో ఏ టెలికామ్ ప్రొవైడర్ అందించట్లేదు. పైగా 28 రోజుల వాలిడిటీ కాకుండా.. 30 రోజుల పరిమితితో ఇస్తోంది. నేరుగా మైజియో యాప్ ద్వారా ఈ రీచార్జ్ వెసులుబాటును కూడా అందిస్తోంది రిలయన్స్ జియో. చదవండి: జియో యూజర్లకు గుడ్‌న్యూస్ -
ఒక జీబీ @ రూ.3,659
మొబైల్ ఓపెన్ చేస్తే చాలు.. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఇంకా ఎన్నో యాప్స్.. ఎన్నో పనులు.. ప్రతిదానికీ డేటా అవసరమే. డబ్బులు చెల్లించి డేటాను రీచార్జి చేసుకోవాల్సిందే. మన దగ్గర కొన్నేళ్లుగా డేటా ధరలు బాగా తగ్గిపోయాయిగానీ.. ప్రపంచవ్యాప్తంగా ఇంకా రేట్లు చుక్కలను తాకుతూనే ఉన్నాయి. మరి ఏ దేశంలో సగటున ఒక్కో గిగాబైట్ (జీబీ) డేటాకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? దీనిపై బ్రిటన్‌కు చెందిన కేబుల్ అనే వెబ్సైట్ విస్తృతమైన సర్వే చేసి లెక్కలు తేల్చింది. ఆ వివరాలు తెలుసుకుందామా? 230 దేశాల్లో పరిశీలించి.. అమెరికాకు చెందిన గూగుల్, న్యూఅమెరికాస్ ఓపెన్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ల ఉమ్మడి సంస్థ ఎం–ల్యాబ్, ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన ప్లానెట్ ల్యాబ్ తదితర సంస్థల సహకారంతో కేబుల్ డాట్ యూకే వెబ్సైట్ ప్రతినిధులు ప్రపంచవ్యాప్తంగా మొబైల్ డేటా ప్లాన్లు, ధరలపై సర్వే చేశారు. 230 దేశాల్లో 6000 మొబైల్ డేటా ప్లాన్ల వివరాలను సేకరించి విశ్లేషించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆయా దేశాల్లోని ప్రధాన టెలికాం సంస్థల డేటా ప్యాకేజీలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో గుర్తించిన వివరాలతో తాజాగా ఒక నివేదికను విడుదల చేశారు. ►ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆఫ్రికా ఖండాల పరిధిలోని దీవుల్లో డేటా ధరలు ఎక్కువగా ఉన్నాయి. ►టెలికాం కంపెనీల మధ్య విపరీతమైన పోటీ ఉన్న దేశాల్లో ధరలు తక్కువగా ఉన్నట్టు సర్వే గుర్తించింది. ►ప్రపంచ సగటు డేటా ధరల కంటే అగ్రరాజ్యమైన అమెరికా, దాని పరిసర దేశాల్లో డేటా ధరలు ఎక్కువగా ఉండటం గమనార్హం. అమెరికా (154వ ర్యాంకు), జపాన్ (156వ ర్యాంకు) తదితర దేశాల్లో సగటున ఒక జీబీ రేటు రూ.250కిపైనే ఉంది. ►యూరప్ దేశాల్లో ఫ్రాన్స్ మినహా మిగతా దేశాల్లో డేటా ధరలు చాలా ఎక్కువ. ►పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల్లో ఇండియా కంటే తక్కువ ధరలకు మొబైల్ డేటా అందుబాటులో ఉందని సర్వే పేర్కొంది. ►ఇప్పటికీ 2జీ, 3జీ మొబైల్ నెట్‌వర్క్‌లను వినియోగిస్తున్న దేశాల్లో.. తక్కువ మొత్తంలో డేటాకు ఎక్కువగా చార్జి చేస్తున్నారు. దీనితో మొత్తంగా ఒక్కో జీబీ డేటాకు రేటు వేల రూపాయల్లోకి వెళుతోంది. -
జియో డేటా అయిపోయిందా? ఇలా చేస్తే రీఛార్జ్ చేయకుండానే 1 జీబీ
ముంబై : ఇంటర్నెట్ వాడకానికి సరికొత్త అర్థం చెప్పిన జియో నెట్వర్క్ మరో కొత్త ప్లాన్ ప్రకటించింది. రోజువారీ హై స్పీడ్ డేటా లిమిట్‌తో ఎదురయ్యే ఇబ్బందులు తీర్చేలా ఎమర్జెన్సీ డేటా లోన్ ప్లాన్ ప్రకటిచింది. డేటా లోన్ చాలా మంది వినియోగదారులు తమ రోజువారీ డేటా కోటాను చాలా త్వరగా వినియోగించేస్తున్నారు. ఆ తర్వాత రోజంతా హై స్పీడ్ డేటా లేకుండా ఉండిపోతున్నారు. దీంతో ప్రతి వినియోగదారుడు వెంటనే 1 జీబీ డేటాను టాప్ అప్ చేసుకునేలా కొత్త ప్లాన్ అమల్లోకి తెచ్చింది. ఈ టాప్ అప్ డేటాకి సంబంధించిన రీఛార్జ్ ఎమౌంట్‌ని తర్వాత పే చేయోచ్చు. ఒక్కో ప్యాక్ ధర రూ .11గా ఉంది. దీంతో 1 జీబీ డేటా అదనంగా వస్తుంది. ఈ సౌకర్యం ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో అందిస్తోంది. ఎమర్జెన్సీ డేటాలోన్ పొందాలంటే మై జియో యాప్‌లో మెనూలోకి వెళ్లాలి. అందులో మొబైల్ విభాగాన్ని ఎంపిక చేసుకుంటే అక్కడ ఎమర్జెన్సీ డేటా లోన్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మొదట యాక్టివేట్ నౌ ఆ తర్వాత ప్రోసీడ్ అనే ఆప్షన్లు వస్తాయి. ఈ ప్రాసెస్ ఫాలో అయితే 1 జీబీ డేటా అప్పటికప్పుడు లభిస్తుంది. మొత్తం ఐదు సార్లు ఇలా డేటా లోన్ తీసుకోవచ్చు. చదవండి : Airtel: కస్టమర్లకు నచ్చినట్టుగా ప్లాన్స్ -
Jio : టార్గెట్ ఓటీటీ యూజర్స్... 1095 జీబీ డేటా ప్లాన్
ఓటీటీ యూజర్స్ టార్గెట్‌గా చేసుకుని సరికొత్త డేటాప్లాన్ని ప్రవేశపెట్టింది జియో నెట్వర్క్. డెయిలీ 3 జీబీ డేటాతో ఏడాది గడువుతో కొత్త ప్లాన్‌ను సైలెంట్‌గా ప్రకటించింది. ఇప్పటి వరకు జియో ఆఫర్ చేస్తున్న డేటా ప్యాకేజీల్లో ఇదే అత్యంత ఖరీదైనది. ప్రస్తుతం జియో ప్రస్తుతం డెయిలీ 3 జీబీ డేటాతో రూ. 349, రూ. 401, రూ. 999లతో మూడు ప్లాన్లను అమలు చేస్తోంది. అయితే వీటితో వ్యాలిడిటీ గడువు తక్కువ. రూ. 999 ప్లాన్‌లో సైతం వ్యాలిడిలీ 85 రోజులే వస్తోంది. దీంతో పదే పదే రీఛార్జీ చేసుకోవాల్సి వస్తుంది. మొబైల్లో వీడియో కంటెంట్, ఓటీటీలపై ఎక్కువగా గడిపే తరుచుగా రీఛార్జీ ఇబ్బందులు తప్పించేందుకు ఈ కొత్త ప్లాన్‌ను అమల్లోకి తెచ్చింది. రూ. 3,499 ప్లాన్ జియో కొత్తగా తెచ్చిన రూ. 3,499 ప్యాక్‌లో గడువు 365 రోజులు. రోజుకి 3 జీబీ డేటాను అందిస్తుంది. డేటా గడువు ముగిసిన తర్వాత నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్కి పడిపోతుంది. రోజుకు వంద ఎస్ఎమ్మెస్లు అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో డిస్నీ, హాట్‌స్టార్ వీఐపీ ప్యాకేజీని జియో తొలగించింది. కేవలం జియో అప్లికేషన్లనే ఉచితంగా అందిస్తోంది. చదవండి : నెట్‌ఫ్లిక్స్‌లో ఈ కొత్త ఫీచర్ ఏదో బాగుందే..! -
నెలకు 11 జీబీ డేటా!!
న్యూఢిల్లీ: చౌక డేటా ప్లాన్లు, అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లు, వీడియో సేవలు, 4జీ నెట్వర్క్ విస్తరించడం తదితర అంశాల ఊతంతో దేశీయంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం నెలకు సగటున 11 జీబీ స్థాయిలో వినియోగం ఉంటోంది. టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా రూపొందించిన వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 4జీ ఊతంతో 2019లో డేటా ట్రాఫిక్ 47 శాతం పెరిగింది. 3జీ డేటా ట్రాఫిక్ 30 శాతం క్షీణించింది. మొత్తం డేటా వినియోగంలో 4జీ వాటా 96 శాతంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువగా జీబీకి రూ. 7 స్థాయిలో భారత్‌లో డేటా చార్జీలు ఉన్నాయి. ఆన్లైన్లో అరగంట నిడివి వీడియో చూసేందుకు లేదా 200 పాటలను వినేందుకు సుమారు ఒక జీబీ డేటా సరిపోతుంది. కంటెంట్ నాణ్యతను బట్టి డేటా వినియోగం పెరుగుతుంది. సంపన్న దేశాల స్థాయిలో దేశీయంగా బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు విస్తరించే దాకా మొబైల్ డేటా వినియోగం పెరుగుతూనే ఉండవచ్చని నోకియా ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ మార్వా తెలిపారు. నివేదికలోని మరిన్ని వివరాలు.. ► ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లోనే డేటా వినియోగం అత్యధికంగా ఉంటోంది. ఈ విషయంలో చైనా, అమెరికా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, జర్మనీ, స్పెయిన్‌ల కన్నా ముందు ఉంది. ► 4జీ డేటా వినియోగదారుల సంఖ్య 59.8 కోట్లు కాగా, 3జీ యూజర్ల సంఖ్య 4.4 కోట్లు. ► నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో తదితర ఓవర్ ది టాప్ ప్లాట్‌ఫాంల ఊతంతో దేశీ యం గా వీడియోల వినియోగం భారీగా పెరిగింది. ► ఓటీటీ ప్లాట్‌ఫాంలపై యూజర్లు రోజుకు సగటున 70 నిమిషాలు వెచ్చిస్తున్నారు. ఒక్కో సెషను సగటున సుమారు 40 నిమిషాలు ఉంటోంది. ► 2019లో 4జీ హ్యాండ్సెట్స్ సంఖ్య 50.1 కోట్లకు చేరినట్లు అంచనా. అంతక్రితం ఏడాది ఇది 33 కోట్లు. వాయిస్ ఓవర్ ఎల్టీఈ ఆధారిత స్మార్ట్ఫోన్ల సంఖ్య 43.2 కోట్లకు చేరింది. -
రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫైకి ఇక గుడ్‌బై..!
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సర్వీసుపై గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో అందిసున్న ఉచిత వైఫైను గూగుల్ ఎత్తివేస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ విషయంపై గూగుల్ ఉపాధ్యక్షుడు సీజర్ గుప్తా స్పందిస్తూ.. ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ సేవలు చాలా చవకగా మారిపోయాయి. అందువల్లనే భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, నైజీరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లోనూ ఉచిత వైఫై సేవలను ఎత్తివేయనున్నాం. ఐదేళ్ల క్రితం గూగుల్ స్టేషన్లు ప్రారంభించినప్పటితో పోలిస్తే ఇప్పుడు డేటా వాడకం సులభతరంగా, చవకగా మారింది. మొబైల్ డేటా ప్లాన్లు చాలా తక్కువ రేట్లకు అందుబాటులోకి వచ్చాయి. 2015లో భారతీయ రైల్వే, రైల్ టెల్ భాగస్వామ్యంతో గూగుల్ వేగవంతమైన, ఉచిత పబ్లిక్ వైఫై సేవలను ఆరంభించింది. 2020 నాటికి 400కు పైగా రైల్వే స్టేషన్లలో అమర్చాలని లక్ష్యంగా పెట్టుకోగా.. జూన్ 2018 నాటికే ఆ లక్ష్యాన్ని అధిగమించినట్టు సీజర్ చెప్పారు. మొబైల్ కనెక్టివిటీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు భారత్‌లో మొబైల్ డేటా లభ్యమవుతోంది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే మొబైల్ డేటా ధర 95 శాతం తగ్గింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం దేశంలోని వినియోగదారులు నెలకు సగటున 10 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే గూగుల్ రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సర్వీసు ఎత్తివేత నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. -
జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం రిలయన్స్ జియో తాజా జియో ఫోన్ యూజర్లకోసం రెండు కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.594, రూ.297 దీర్ఘకాల ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. ముకేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ జియో తీసుకొచ్చిన ఈ కొత్త పథకాల ద్వారా జియో ఫోన్ వినియోగదారులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించనుంది. రూ 594 పథకం కింద, జియో ఫోన్ వినియోగదారులు 168 రోజులు (దాదాపు ఆరు నెలల) అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది. అలాగే జియో యాప్స్‌కు ఉచిత యాక్సెస్ అందిస్తోంది. అయితే రోజుకు అపరిమిత హై స్పీడ్ డేటా 0.5జీబీ పరిమితి దాటిన తరువాత డేటా స్పీడ్ 64కేబీపీఎస్‌కు కు తగ్గుతుందని జియో ప్రకటించింది. అలాగే నెలకు 300 ఎంఎంఎస్‌లు ఉచితం. రూ. 297 ప్లాన్‌లో వినియోగదారులు నెలకు 300 ఎస్ఎంఎస్లతో ఉచిత కాలింగ్ సదుపాయంతో పాటు రోజుకు 0.5జీడీ డేటా పొందుతారు. ఈ పరిమితిని దాటినట్లయితే, వేగం 64కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు అంటే మొత్తం 3నెలలు. -
జియో అతి చవకైన 4జీ ప్లాన్స్: డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో కొత్త సాచెట్ ప్లాన్లను ప్రకటించింది. వినియోగదారుల బేస్‌ను భారీగా పెంచుకుంటున్న జియో మరింతగా కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా అతి తక్కువ విలువ చేసే రూ.100 లోపు మూడు 4జీ కొత్త ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. తద్వారా 4జీ డేటాను చాలా సులభ ధరలో తమ కస్టమర్లకు అందిస్తున్నట్టు తెలిపింది. జియో ప్రైమ్ కస్టమర్ల కోసం వీటిని అందుబాటులోకి తెచ్చింది. టెలికాం దిగ్గజం జియో సాచెట్ ప్యాక్ కింద ఈ మూడుకొత్తప్లాన్లను ప్రకటించింది. జియో కస్టమర్లకు అతి వేగవంతమైన 4జీ సేవలను అందించేలా వీటిని అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు మోస్ట్ పాపులర్ పాక్‌లపై భారీ డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేస్తోంది. రూ.19, రూ. 52,రూ.98 విలువ చేసే మూడు కొత్తప్లాన్లను పరిచయం చేసింది. 19 రూపాయలకు ఒకరోజు వాలిడిటీ, 150 ఎంబీ 4జీ హై స్పీడ్ డేటా, 20 లోకల్ ఎస్ఎంఎస్లు ఉచితం 52 రూపాయలకు 10.5 జీబీ 4జీ డేటా, వారం రోజుల వాలిడిటీ, 70 లోకల్ ఎస్ఎంఎస్లు ఉచితం. 98 రూపాయలకు 2.1 జీబీ 4జీబీ డేటా, 14 రోజుల వాలిడిటీ. డెయిలీ లిమిట్ 0.15 జీబీ, 140 ఎస్ఎంఎస్లు ఉచితం. వీటితో పాటు ఇప్పటికే ఉన్నప్లాన్లపై కూడా డిస్కౌంట్‌ను అందిస్తోంది. రూ.199 ప్యాక్‌పై రూ50 లు తగ్గించి రూ149లకే అందిస్తోంది. 1 జీబీ 4జీబీ డేటా, 28 రోజులువాలిడిటీ. అలాగే రూ.399 ప్యాక్ రూ.50 డిస్కౌంట్‌తో రూ.349 లకే లభ్యం. రోజుకి 1 జీబీ చొప్పున మొత్తం 70 జీబీ అందిస్తుంది. రూ. 499 రూ.399 రూ. 449 ప్లాన్లకు కూడా ఈ తగ్గింపును వర్తింప చేస్తోంది. -
ఎయిర్టెల్ ప్లాన్లపై మరింత డేటా
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన ప్లాన్లపై రోజువారీ డేటా పరిమితిని మరింత పెంచింది. రిలయన్స్ జియో, ఇతర ఇంక్యుబెంట్లతో వస్తున్న పోటీ నేపథ్యంలో ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకుంది. సమీక్షించిన ఎయిర్టెల్ రూ.349, రూ.549 ప్లాన్లలో రోజు వారీ లభించే డేటా లిమిట్‌ను 500 ఎంబీ మేర పెంచింది. ఇతర ఉచితాలతో పాటు రోజుకు అదనంగా 500 ఎంబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. దీంతో అప్డేట్ చేసిన రూ.349 ప్లాన్ ద్వారా ఇప్పుడు రోజుకు 1.5 జీబీ కాకుండా 2జీబీ డేటా లభిస్తుంది. అలాగే రూ.549 ప్లాన్‌లో ఇప్పటి వరకు రోజూ 2.5 జీబీ డేటా లభించగా ఇకపై రోజూ 3జీబీ డేటా లభ్యం కానుంది. ఇక ఈ రెండు ప్లాన్ల వాలిడిటీ 28 రోజులుగా ఉంది. అప్డేట్ చేసిన ఈ ప్లాన్లు జియో ప్లాన్లకు తీవ్ర పోటీ ఇవ్వనుందని తెలుస్తోంది. అదేవిధంగా వొడాఫోన్, ఐడియాలు కూడా తమ ప్లాన్లను అప్డేట్ చేయాల్సి ఉంది. రూ.349 ప్లాన్‌ను ఎయిర్టెల్ సెప్టెంబర్‌లో లాంచ్ చేసింది. తొలుత ఈ ప్లాన్‌ను లాంచ్ చేసినప్పుడు, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స, 100 ఎస్ఎంఎస్లతో పాటు రోజుకు 1జీబీ డేటా అందించింది. తర్వాత నవంబర్‌లో డేటా పరిమితిని 1.5జీబీకి పెంచింది. ప్రస్తుతం ఈ పరిమితిని 2జీబీకి పెంచేసింది. దీంతో మొత్తంగా కస్లమర్లు 56జీబీ డేటా పొందనున్నారు. అదేవిధంగా రూ.549 ప్లాన్‌పై కూడా రోజువారీ డేటా పరిమితిని 2.5జీబీ నుంచి 3జీబీకి పెంచింది. డేటాతో పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు, రోమింగ్‌పై ఉచితంగా అవుట్గోయింగ్ కాల్స్‌ను 28 రోజుల పాటు అందిస్తోంది. ఈ పెంపుతో మొత్తంగా 84జీబీ డేటాను ఎయిర్టెల్ సబ్స్క్రైబర్లు పొందుతారు. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్టెల్ రూ.349, రూ.549 ప్లాన్లలో డేటాను పెంచడంతో ఇప్పుడు జియో కన్నా ఎక్కువ మొబైల్ డేటా వినియోగదారులకు లభిస్తుంది. -
బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్
హైదరాబాద్ : బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. ప్రైవేటు టెలికం కంపెనీలకు ధీటుగా మొబైల్ సేవలు విస్తరించేందుకు చర్యలకు దిగింది. ప్రస్తుతం హైదరాబాద్ టెలికం పరిధిలో సుమారు 9 లక్షల వరకు మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. ఉచిత సీమ్ కార్డుల మేళాతో ప్రతి నేల 10 నుంచి 20 వేల వరకు కొత్త వినియోగదారులు ఆకర్షితులవుతున్నట్లు పీజీఎం రాంచంద్ర తెలిపారు. మొబైల్ వోచర్స్ పై పలు ఆఫర్స్లను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఆల్‌ఫ్రీ ప్లాన్ ఆల్ ఫ్రీ ప్లాన్ పేరుతో రూ.144 వోచర్స్లకు 30 రోజుల కాలపరిమితితో అన్నిరకాల నెట్‌వర్క్‌లకు రోజుకు 30 నిమిషాలపాటు ఉచితంగా మాట్లాడుకునే సదుపాయం కల్పించింది. అదేవిధంగా 90 రోజుల కాలపరిమితి గల రూ.439 వోచర్‌కు అన్ని రకాల నెట్‌వర్క్‌లకు రోజుకు 30 నిమిషాల పాటు మాట్లాడుకోవచ్చు. ఈ ఆఫర్ కాలపరిమితి మార్చి 31 వరకు వర్తిస్తుంది. స్పెషల్ టారిప్ వోచర్ స్పెషల్ టారిఫ్ వోచర్ కింద రూ.339 విలువ గల వోచర్‌పై 28 రోజుల కాలపరిమితితో అన్ని రకాల నెట్‌వర్క్‌లకు ఉచిత కాల్స్‌తోపాటు 1జీబీ డాటా అందిస్తోంది. రూ. 139 వోచర్‌పై బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు పరిమితి లేకుండా ఉచిత కాల్స్ తోపాటు300ఎంబీ డాటా అందిస్తోంది. ఈ ఆఫర్స్ మార్చి 17 వరకు ఉంటుంది. అదనపు టాక్‌టైమ్ రూ. 220, రూ. 2000, రూ.2200, రూ. 2500, రూ.3000 టాప్‌ఆప్‌పై ఫుల్ టాక్ టైమ్, రూ. 550 టాప్‌ఆప్‌పై 575, రూ. 1100లకు 1200లు, రూ.3300లకు 3500 , రూ.5500లకు 6000ల ఎక్స్ట్రా టాక్ టైమ్ అందిస్తోంది. డబుల్ డాటా ఆఫర్స్ ఎస్టీవీ కింద డబుల్ డాటా ఆఫర్స్ ప్రకటించింది. 365 కాలపరిమితి గల రూ. 4498 వోచర్‌కు 80 జీబీలు. రూ. 3998లకు 60 జీబీలు, 2798లకు 36 జీబీలు, 1498లకు 18జీబీల డాటా అందిస్తోంది. ఈ ఆఫర్స్ కూడా మార్చి 31 వరకు వర్తిస్తోంది. కొత్త కనెక్షన్లకు 300 ఎంబీ డాటా ఉచితంగా అందిస్తోంది. అదేవిధంగా 5రోజుల కాలపరిమితితో రూ.78లకు 2జీబీ, 14రోజుల కాలపరిమితితో రూ.98లకు 2జీబీ, 15 రోజుల కాలపరిమితితో రూ.155లకు 2జీబీ 10 రోజుల కాలపరిమితితొ రూ.156లకు 3జీబీ, 29 కాలపరిమితితో రూ. 198లకు 3జీబీ, 28 కాలపరిమితితో రూ.198లకు 3జీబీ, 28 కాలపరిమితితో రూ. 291లకు 8జీబీ, 60 రోజుల కాలపరిమితితో 444లకు 8జీబీలు, 60 రోజుల కాలపరిమితితో రూ.451లకు 6జీబీ, 80 టాక్‌టైమ్, 30 రోజుల కాలపరిమితితో రూ.549లకు 15జీబీ, 60రోజుల కాలపరిమితితో రూ.561లకు 11జీబీ, 60 రోజుల కాలపరిమితితో రూ.821లకు 15జీబీ, 30 రోజుల కాలపరిమితితో రూ. 3099లకు 20జీబీ డాటా, 300 ఎస్ఎంఎస్లు, ఉచిత కాల్స్ వరిస్తాయి. కాంబో ఎస్టీవీ కాంబో ఎస్టీవీ ఆఫర్ కింద రెండు రోజుల కాలపరిమితితో రూ. 13లకు 15 రూపాయల విలువగల టాక్‌టైమ్, 10ఎంబీ డాటా, 10రోజుల కాలపరిమితితో రూ.77 వోచర్‌కు 80ల విలువగల టాక్‌టైమ్, 30 ఎంబీల డాటా, 15 రోజుల కాలపరిమితితో రూ.177 వోచర్‌కు 180 రూపాయల విలువగల టాక్ టైమ్తోపాటు 50ఎంబీ అందిస్తోంది. ఈ ఆఫర్ కూడా మార్చి 31 వరకు వర్తిస్తోంది. అదేవిధంగా రూ. 30 రోజుల కాలపరిమితి గల 1099 విలువగల ఎస్‌టీవీకి అన్ లిమిటేడ్ డాటా స్పీడ్ ప్రకటించింది.