ఫిఫా వరల్డ్‌కప్‌ 2022: అదిరిపోయే ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ప్లాన్స్‌ | Vodafone Idea rolls out FIFA World Cup Qatar 2022 roaming packs | Sakshi
Sakshi News home page

ఫిఫా వరల్డ్‌కప్‌ 2022: అదిరిపోయే ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ప్లాన్స్‌

Published Sat, Nov 26 2022 9:00 PM | Last Updated on Sat, Nov 26 2022 9:33 PM

Vodafone Idea rolls out FIFA World Cup Qatar 2022 roaming packs - Sakshi

సాక్షి, ముంబై: క్రమేపీ యూజర్లను కోల్పోతున్న టెల్కో వోడాఫోన్‌ ఐడియా ఫిఫా ప్రపంచకప్‌- 2022 సందర్భంగా కొత్త ప్లాన్లలను ప్రకటించింది. ఫుట్‌బాల్‌ ప్రియులను ఆకట్టుకునేలా వోడాఫోన్ ఐడియా ఐదు కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లను  తీసుకొచ్చింది.  

జియో ప్లాన్‌ల మాదిరిగానే  వీఐ కూడా అయిదు ప్లాన్లను తీసుకొచ్చింది.  ఖతార్, సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న వినియోగ దారులు దీన్ని ఉపయోగించుకోవచ్చు. వీఐ వెబ్‌సైట్, లేదా  వీఐ యాప్‌ ద్వారా వీటిని కొనుగోలు చేయ వచ్చని తెలిపింది. 

రూ. 2,999 రోమింగ్ ప్లాన్:  ఎస్‌ఎంఎస్‌ ,  వాయిస్ కాల్స్‌   ఈ ప్లాన్ ఏడు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.  వినియోగదారులకు లోకల్ కాల్స్‌, ఇండియా అవుట్‌గోయింగ్ కాల్స్‌  కోసం 200 నిమిషాల టాక్ టైమ్‌ను వినియోగించుకోవచ్చు. ఇది కాకుండా, ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్‌,  25 SMSలు  ఉచితం. అదనంగా, వినియోగదారులకు 2 జీబీ  డేటా కూడా.

రూ. 3,999 రోమింగ్‌ ప్లాన్‌: ఎస్‌ఎంఎస్‌ , వాయిస్ కాల్స్‌ 10 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్‌తో, వినియోగదారులకు 300 నిమిషాల టాక్ టైమ్ వాడుకోవచ్చు, ఇందులో భారతదేశానికి స్థానిక, అవుట్‌గోయింగ్ కాల్స్‌ కూడా ఉన్నాయి. వినియోగదారులు 3 జీబీ డేటా , 50 ఎస్‌ఎంఎస్‌లు అదనం. 

రూ. 4,999 రోమింగ్‌ ప్లాన్‌: ఎస్‌ఎంఎస్‌,  వాయిస్ కాల్స్‌   ఈ ప్లాన్ 14 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుంది.  వినియోగదారులకు భారతదేశానికి 500 నిమిషాల లోకల్ , అవుట్‌గోయింగ్ కాల్స్‌. అలాగే 5 జీబీ డేటాతో పాటు ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్‌.  అదనంగా 50 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. 

రూ. 5,999 రోమింగ్‌  ప్లాన్‌: అన్ని ప్లాన్‌లలో అత్యంత ఖరీదైన ప్లాన్‌ ఇది.  ఎస్‌ఎంఎస్‌, వాయిస్ కాల్స్‌, 500 నిమిషాల స్థానిక, భారతదేశానికి అవుట్‌గోయింగ్ కాల్స్‌ అందిస్తుంది. అలాగే 5 జీబీ డేటాతో పాటు ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్‌.  అదనంగా 100 50 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.  ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇతర దేశాలకు కాల్స్‌ చేయడానికి సబ్‌స్క్రైబర్‌లకు నిమిషానికి రూ.35 వసూలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement