
వైట్‌హౌజ్ ఓవెల్ ఆఫీస్‌లో జరిగిన పరిణామాలు.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ అనుసరిస్తున్న వైఖరిని.. తమ సమక్షంలో చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump_, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లు తీవ్రంగా మండిపడ్డారు.
దీంతో ఖనిజ సంపద ఒప్పందాల సంతకం చేయకుండానే జెలెన్‌స్కీ అమెరికా నుంచి వెనుదిరిగారు. ట్రంప్‌నకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పనని జెలెన్‌స్కీ.. ఉక్రెయిన్‌కు వైట్‌హౌజ్(White House) తలుపులు మూసుకుపోయినట్లేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో ఏఐ ఎడిట్‌లు ఎంతగా వైరల్ అవుతున్నాయో తెలిసిందే. గాజా విషయంలో అలాంటి ఓ వీడియోను ఎడిట్ చేసే.. ట్రంప్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తాజా భేటీని.. దాదాపుగా తన్నుకున్నంత పనిగా మార్చేయగా.. అది చక్కర్లు కొడుతోంది.
LMAO! Who created this video?😂 pic.twitter.com/Gr8Pnl2Nz6
— War Intel (@warintel4u) February 28, 2025
ఏరా బుడ్డి.. ఇలాగైతే ఎలా?
బరువు తగ్గేందుకు చాలామంది రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అందులో చిత్తశుద్ధి ప్రదర్శించేది కొందరే. మరి మిగతా వారు?. ఓవైపు డైట్లు గట్రా అంటూనే.. ఇంకోవైపు నోటికి పని చెబుతుంటారు. పైగా ఏం చేసినా బరువు తగ్గడం లేదంటూ తెగ ఫీలైపోతుంటారు. అలాంటి వాళ్లను ప్రతిబింబించేలా ఈ బుడ్డోడి వీడియో అనే కామెంట్ వినిపిస్తోంది ఇప్పుడు.
“I can't lose weight no matter what i do”
Also me after 8 pm: pic.twitter.com/OpNxn3vKjB— NO CONTEXT HUMANS (@HumansNoContext) March 1, 2025
Comments
Please login to add a commentAdd a comment