JD Vance
-
భారతీయ శాకాహార వంటకాలు భేష్: జేడీ వాన్స్
వాషింగ్టన్: అమెరికా నూతన ఉపాధ్యక్షునిగా ఎన్నికైన జేడీ వాన్స్ భారతీయ శాకాహార వంటకాలపై ప్రశంసలు గుప్పించారు. తనకు భారతీయ శాకాహార వంటకాల రుచులను చూపించిన ఘనత తన భార్య ఉషా వాన్స్‌కి దక్కుతుందన్నారు. తామిద్దం డేటింగ్లో ఉన్నప్పుడు ఉష తన కోసం వండిన మొదటి శాఖాహార భోజనం గురించి జేడీవాన్స్ మీడియాకు తెలిపారు.‘జో రోగన్ ఎక్స్పీరియన్స్’ కార్యక్రమంలో వాన్స్ తన ఆహార అభిరుచులు తన భార్య ఉష కారణంగా ఎలా మారాయో తెలిపారు. ప్రత్యేకించి ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటూ, శాకాహార వంటల వైపు మళ్లానని తెలిపారు. ప్రాసెస్ చేసిన మాంసాహారాలపై జో రోగన్ చేసిన విమర్శతో ఈ చర్చ ప్రారంభమైంది. ప్రాసెస్ చేసిన ఆహారాలను రోగర్.. చెత్త అని పేర్కొన్నాడు. ఇటీవలి కాలంలో మొక్కల ఆధారిత ఆహారాలను అలవాటు చేసుకున్న వాన్స్ ఈ మాటను హృదయపూర్వకంగా అంగీకరించారు.ఎవరైనా సరే కూరగాయలను సరిగా తినాలనుకుంటే, అలాగే శాఖాహారిగా ఉండాలనుకుంటే భారతీయ ఆహారాలను తినండి అంటూ రోగన్ సలహా ఇచ్చిన దరిమిలా వాన్స్ దీనిని అంగీకరిస్తూ, తన భార్య నేపథ్యం, ఆమె వంటకాలు.. వాటితో తన జీవన విధానం ఎలా మారిందో తెలిపారు. తాను ఉషా వాన్స్‌ని కలవడానికి ముందు భారతీయ వంటకాలపై తనకు ప్రాథమిక అవగాహన మాత్రమే ఉందని వాన్స్ తెలిపారు. తన భార్య భారతీయ-అమెరికన్ అని, ఆమె చేసే శాఖాహార వంటలు అద్భుతంగా ఉంటాయని వాన్స్ పేర్కొన్నారు.శాకాహార జీవనశైలిని స్వీకరించాలనుకునువారు భారతీయ వంటకాల వైపు మళ్లండి. శాకాహారంలో పలు ఎంపికలు ఉంటాయి. నకిలీ మాంసాన్ని తినడం మానివేయండి అని వాన్స్ అన్నారు. వాన్స్ తన భార్య ఉషాతో డేటింగ్ చేసిన తొలిరోజుల నాటి ఊసులను కూడా ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. తాను తన ఇంట్లో తయారుచేసిన శాఖాహార భోజనంతో ఉషను ఆకట్టుకునేందుకు ప్రయత్నించానని వాన్స్ తెలిపారు. పిజ్జా రోల్స్‌పై పచ్చి బ్రోకలీని ఉంచి, దానిపై మరిన్ని మసాలాలు జల్లి ఓవెన్లో 45 నిమిషాలు ఉంచి, శాఖాహార పిజ్జాను తయారు చేశానని,అయితే అది అత్యంత అసహ్యకరంగా తయారయ్యిందని వాన్స్ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. శాకాహార భోజనం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు తనకు కాస్త సమయం పట్టిందని వాన్స్ తెలిపారు. తన భార్య ఉష కారణంగా భారతీయ వంటకాల రుచులను చూశాక అవి ఎంత గొప్పగా, రుచిగా వైవిధ్యంగా ఉంటాయో గ్రహించానని, భారతీయ శాకాహార ఆహారాన్ని మనేదానితోనూ పోల్చలేమని వాన్స్ పేర్కొన్నారు. భారతీయ శాకాహారం గొప్పదనం తెలుసుకున్నాక తాను శాకాహారిగా మారానని తెలిపారు. కాగా తాను తన తల్లి నుంచి శాకాహర వంటకాలను తయారు చేయడాన్ని నేర్చుకున్నానని ఉషా వాన్స్ ఆ మధ్య మీడియాకు తెలిపారు. ఇది కూడా చదవండి: అమెరికాలో... భారతీయ జానపద కథలకు జీవం -
అమెరికా ఉపాధ్యక్షుడు ‘వాన్స్ భయ్యా, ఉషా భాభీ’ పెళ్లి ఫోటోలు వైరల్
2024 వైట్ హౌస్ రేసులో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి చరిత్రకెక్కాడు. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన భార్య ఉషా చిలుకూరి భర్త, ఉపాధ్యక్షుడిగా జెడి వాన్స్ కూడా విజయం సాధించారు. ఈ సందర్భంలో ఉష. వాన్స్ పెళ్లి ఫోటోలు ట్విటర్లో సందడి చేస్తున్నాయిఅధ్యక్ష ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించిన తర్వాత తన భార్యకు ఒక నోట్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు జేడీ వాన్స్. ముందుగా డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి, "ఈ స్థాయిలో మన దేశానికి సేవ చేయడానికి నాకు అలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికన్ ప్రజలకోసం తన పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది అంటూ వారికీ కృతజ్ఞతలు ప్రకటించారు. ‘‘ఇంతటి ఘనవిజయాన్ని మద్దతిచ్చిన నా అందమైన భార్యకు థ్యాంక్స్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన సతీమణి ఉషి చిలుకూరికి మరో తీపి కబురు కూడా అందించారు. త్వరలోనే ఆమె అమెరికా రెండో పౌరురాలిగా కాబోతుతున్న తొలిభారతీయ మహిళ కాబోతోందని ప్రకటించారు.జెడి వాన్స్ భార్య ఉషా చిలుకూరి న్యాయవాది. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఆమె కుటుంబం 50 సంవత్సరాల క్రితం విదేశాలకు వలస వచ్చింది. ఉష శాన్ డియాగోలో పెరిగింది. యేల్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2014లో వాన్స్‌ను పెళ్లాడారు ఉష. వాన్స్ తాజా విజయంతో శ్వేతజాతీయేతర రెండో మహిళగా ఉష అవతరించనుంది.Vice President JD Vance bhaiyya and Usha bhabhi ☺️ pic.twitter.com/L2HPTVuJfu— The Hawk Eye (@thehawkeyex) November 6, 2024 -
అమెరికా ఉపాధ్యక్షుడిగా ఆంధ్రా అల్లుడు! (ఫొటోలు)
-
US Vice President: వాన్స్ తెలుగువారి అల్లుడే!
నిడదవోలు/ఉయ్యూరు: అమెరికా ఉపాధ్యక్ష పదవిని అధిరోహించబోతున్న రిపబ్లికన్ నేత జేడీ వాన్స్ తెలుగు వారి అల్లుడే. ఆయన భార్య చిలుకూరి ఉషాబాల తెలుగు సంతతికి చెందిన వారే కావడం విశేషం. 38 ఏళ్ల ఉషా అమెరికాలో జన్మంచినప్పటికీ ఆమె తాత, ముత్తాలది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామమని ఆ గ్రామపెద్దలు చెబుతున్నారు. చిలుకూరి ఉషాబాల ముత్తాత రామశాస్త్రి కొంత భూమిని గ్రామంలో ఆలయం కోసం దానంగా ఇచ్చారు. ఆ స్థలంలోనే గ్రామస్తుల సహకారంతో సాయిబాబా ఆలయం, మండపాన్ని నిర్మించారు. వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నివడంపై వడ్లూరు వాస్తవ్యులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయ విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు శాంతమ్మ మరిది రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ. ఆ రాధాకృష్ణ కూతురే ఉష. ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980లలోనే అమెరికాలో స్థిరపడ్డారు. వీళ్ల సంతానం ముగ్గురిలో ఉషా ఒకరు. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలోనూ ఉష పూరీ్వకులున్నారు. ఆమెకు తాత వరసైన రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఈ గ్రామంలోనే నివసిస్తోంది. ఉష పూర్వీకులు దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన వంశవృక్షమే శాఖోపశాఖలుగా, కుటుంబాలుగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై నగరాలుసహా అమెరికా, ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. ఉషా ముత్తాత వీరావధాన్లుకు ఐదుగురు సంతానం. రామశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్యశాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణమూర్తి. వీరందరూ ఉన్నత విద్యావంతులే. ఉష కారణంగా వడ్లూరు గ్రామం పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోందని గ్రామ మాజీ సర్పంచ్ పి.శ్రీనివాసరాజు ఆనందం వ్యక్తంచేశారు. తొలి భారత సంతతి ‘సెకండ్ లేడీ’ అమెరికా అధ్యక్షుడి భార్యను ప్రథమ మహిళగా, ఉపాధ్యక్షుడి భార్యను సెకండ్ లేడీగా సంబోధించడం అమెరికాలో పరిపాటి. భర్త వాన్స్ వైస్‌ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నేపథ్యంలో ఉషా తొలి భారతసంతతి ‘సెకండ్ లేడీ’గా చరిత్ర సృష్టించనున్నారు. కాలిఫోరి్నయాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా జన్మించారు. యేల్ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో డిగ్రీ పట్టా సాధించారు. కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. సహాయకురాలిగా న్యాయ సంబంధమైన విభాగాల్లో చాలా సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. సుప్రీంకోర్టు ఇద్దరు మాజీ న్యాయమూర్తుల వద్ద పనిచేశారు. గతంలో యేల్ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. యేల్ వర్సిటీలో లా అండ్ టెక్ జర్నల్‌కు మేనేజింగ్ ఎడిటర్‌గా ఉన్నారు. చివరిసారిగా ముంగర్, టోల్స్,ఓల్సన్ సంస్థలో పనిచేశారు. యేల్ విశ్వవిద్యాలయంలో ఆమె అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విద్యావంతులైన తల్లిదండ్రులు ఉషా తల్లిదండ్రులు ఇద్దరూ విద్యావంతులే. తల్లి లక్ష్మి అణుజీవశాస్త్రంలో, జీవరసాయన శాస్త్రంలో పట్టబధ్రులు. ప్రస్తుతం ఆమె అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. శాన్‌డియాగోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాలో కార్యనిర్వాహక పదవిలోనూ కొనసాగుతున్నారు. ఉషా తండ్రి రాధాకృష్ణ వృత్తిరీత్యా ఏరోస్పేస్ ఇంజినీర్. ఆయన గతంలో ఐఐటీ మద్రాస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆయన ప్రస్తుతం యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్స్‌లో ఏరోడైనమిక్స్ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. దాంతోపాటే కాలిన్స్ ఏరోస్పేస్లో అసోసియేట్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. వాన్స్‌తో ఉష పరిచయం యేల్ లా స్కూల్లో ఉషా, వాన్స్ తొలిసారి కలిశారు. 2013లో ఇద్దరూ కలిసి వర్సిటీలో ఒక చర్చాకార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాతే ఇద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. 2014 ఏడాదిలో వీరు పెళ్లాడారు. హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లిచేసుకోవడం విశేషం. వీరికి కూతురు మీరాబెల్, కుమారులు ఎవాన్, వివేక్ ఉన్నారు. భర్త వాన్స్‌కు చేదోడువాదోడుగా ఉంటూ విజయంలో ఉషా కీలకపాత్ర పోషించారు. ‘భార్యే నా ధైర్యం. చెబితే నమ్మరుగానీ ఆమె నాకంటే చాలా తెలివైన వ్యక్తి’అని ఉషను పొగడటం తెల్సిందే. రిపబ్లికన్ నేతకు భార్యగా ఉన్న ఉషా దశాబ్దకాలం క్రితం 2014లో డెమొక్రటిక్ పార్టీకి మద్దతు తెలపడం విశేషం. సాయిపురం వాసుల్లో ఆనందం వాన్స్ విజయం సాధించటంతో తెలుగు ప్రజల్లో సంబరం వెల్లివిరిసింది. ప్రత్యేకించి ఉషా పూరీ్వకుల మరో గ్రామమైన సాయిపురం వాసుల్లో ఆనందం వెల్లివిరిసింది. మంగళవారం స్థానికులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.ఆయన భార్య ఉషకు ఏపీలోని వడ్లూరు గ్రామంతో అనుబంధం -
‘హిట్లర్’ చేతే శెభాష్ అనిపించుకుని..
అత్యంత స్వల్పకాలంలో రాజకీయ పదవీ నిచ్చెనను చకచకా ఎక్కేసి ఉపాధ్యక్షుడిగా అవతరించిన జేడీ వాన్స్ ప్రస్థానం ఆసక్తికరం. ఒకప్పుడు ట్రంప్‌ను హిట్లర్ అంటూ బహిరంగంగా విమర్శించిన వాన్స్‌ను ఇప్పుడు అదే ట్రంప్ పిలిచి మరీ తనకు సహసారథిగా ఎంపికచేయడం విశేషం. ఓహియో నుంచి సెనేటర్‌గా ఉన్న వాన్స్ ఉపాధ్యక్ష పీఠంపై కూర్చుంటున్న అతిపిన్నవయసు్కల్లో ఒకరిగా, అత్యల్ప పాలనాఅనుభవం ఉన్న నేతగా రికార్డ్ సృష్టించారు. గతంలో తన జీవితంలో చూసిన సంఘటనల సమాహారంగా 2016లో రాసిన ‘హిల్బెల్లీ ఎలిగే’పుస్తకం విశేష ఆదరణ పొందటంతో వాన్స్ పేరు ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ రచనను తర్వాత సినిమాగా తీశారు. ⇒ జేడీ వాన్స్ పూర్తిపేరు జేమ్స్ డొనాల్డ్ బౌమాన్ ⇒ స్కాచ్–ఐరిష్ మూలాలున్న వాన్స్ 1984 ఆగస్ట్ రెండో తేదీన ఓహియోలోని మిడిల్‌టౌన్‌లో జన్మించారు. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో అమ్మమ్మ, తాతయ్య పెంచి పెద్దచేశారు. అందుకే తండ్రి వారసత్వంగా వచి్చన బౌమాన్ పేరును తీసేసుకుని అమ్మమ్మ వాన్స్ పేరును తగిలించుకున్నారు. ⇒ పేదరికం కారణంగా 17 ఏళ్ల వయసులో ఒక సరకుల దుకాణంలో క్యాషియర్‌గా పనిచేశాడు. 2003లో అమెరికా మెరైన్ కార్ప్స్లో చేరి మిలటరీ జర్నలిస్ట్‌గా పనిచేశాడు. 2005లో ఇరాక్‌లో అమెరికా సైన్యం సహాయక విభాగంలో పనిచేశారు. ⇒ ఓహియో వర్సిటీలో చదువుకున్నారు. యేల్ వర్సిటీలో లా పూర్తిచేసి కొంతకాలం న్యాయవాదిగా న్యాయసేవల సంస్థలో పనిచేశారు. తర్వాత ఒక జడ్జి వద్ద లా క్లర్క్‌గా కొనసాగారు. తర్వాత టెక్నాలజీ రంగంలో వెంచర్ క్యాపిటలిస్ట్ అవతారమెత్తారు. తర్వాత న్యాయసేవల సంస్థనూ స్థాపించారు. ⇒ తొలిసారిగా షెరాడ్ బ్రౌన్పై సెనేట్ ఎన్నికల్లో పోటీకి ప్రయతి్నంచినా కుదర్లేదు. 2016లో ట్రంప్‌ను ‘అమెరికా హిట్లర్’అని సంబోధించి పలు విమర్శలు చేశారు. తర్వాత ట్రంప్‌కు సారీ కూడా చెప్పారు. తర్వాత 2021లో రాజకీయాల్లోకి వచ్చారు. ⇒ 2022లో సెనేట్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి టిమ్ రేయాన్‌ను ఓడించి తొలిసారిగా ఓహియో సెనేటర్ అయ్యారు. తర్వాత ట్రంప్‌కు విధేయునిగా మారారు. దీంతో తన రన్నింగ్మేట్గా వాన్స్‌ను ట్రంప్ ఎన్నుకున్నారు. ⇒ మొదట్లో ట్రంప్ కంటే ముందు వాన్స్‌కే అధ్యక్ష అభ్యరి్థత్వం విషయంలో మద్దతు పలకాలని వ్యాపారవేత్తలు ఎలాన్ మస్‌్క, డేవిడ్ ఓ సాక్స్‌లు భావించారని గతంలో వార్తలొచ్చాయి. యేల్ వర్సిటీలో చదువుకునే రోజుల్లో ప్రేమించిన ఉషను పెళ్లాడారు. ⇒ శ్వేతజాతి కార్మికుల సంక్షేమం గురించి ఎక్కువగా మాట్లాడే వాన్స్ విదేశాంగ విధానంలో చైనాకు బద్ద వ్యతిరేకిగా పేరుంది. ట్రంప్ పేరులోనూ వాన్స్ పేరులోనూ డొనాల్డ్ అనే పేరు ఉండటం గమనార్హం. – వాషింగ్టన్ -
US Election 2024: స్వర్ణయుగం తెస్తా
వాషింగ్టన్: రెండోసారి పరిపాలన మొదలెట్టాక అమెరికాకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తానని కాబోయే నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరిచాక బుధవారం ఫ్లోరిడా రాష్ట్రంలోని వెస్ట్ పామ్ బీచ్ ప్రాంతంలోని పామ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్లో కుటుంబసమేతంగా ‘ఎలక్షన్ నైట్ వాచ్ పార్టీ ’వేదిక మీదకు వచ్చిన ట్రంప్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా సైతం పోడియం మీదకు వచ్చారు. ట్రంప్ సతీమణి మెలానియా, కుమారులు, కోడళ్లు, మనవరాళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు సైతం వేదిక మీదకొచ్చారు. చిరస్మరణీయ విజయం తర్వాత జాతినుద్దేశిస్తూ వందలాది మంది మద్దతుదారుల సమక్షంలో ట్రంప్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. దేశం మునుపెన్నడూ చూడని విజయం ‘‘అమెరికాలో ఇలాంటి విజయాన్ని మునుపెన్నడూ ఎవరూ చూడలేదు. అత్యంత శక్తివంతమైన ప్రజాతీర్పు ఇది. అమెరికా చరిత్రలో అతిగొప్ప రాజకీయ ఉద్యమం ఇది. మా పార్టీ గెలుపుతో అమెరికాకు మళ్లీ స్వర్ణయుగం రాబోతోంది. అమెరికాను మళ్లీ అత్యంత గొప్ప దేశంగా మలిచేందుకు ఈ గెలుపు మాకు సదవకాశం ఇచి్చంది. పాత గాయాలను మాన్పి దేశాన్ని మళ్లీ సరికొత్త శిఖరాలకు చేరుస్తాం. మళ్లీ మేం పార్లమెంట్‌పై పట్టుసాధించాం. హోరాహోరీ పోరు జరిగిన కీలక జార్జియా, పెన్సిల్వేనియా, విస్కాన్సిస్ లాంటి రాష్ట్రాల్లోనూ విజయం సాధించాం. అన్ని వర్గాల సమూహశక్తిగా అతిపెద్ద విస్తృతమైన ఏకీకృత కూటమిగా నిలబడ్డాం. ఇలా అమెరికా చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా యువత, వృద్ధులు, మహిళలు, పురుషులు అంతా రిపబ్లికన్ పారీ్టకే పట్టం కట్టారు. కార్మిక, కార్మికేతర సంఘాలు, ఆఫ్రికన్–అమెరికన్, హిస్పానియన్–అమెరికన్, ఆసియన్–అమెరికన్, అర్బన్–అమెరికన్, ముస్లిం అమెరికన్ ఇలా అందరూ మనకే మద్దతు పలికారు. ఇది నిజంగా ఎంతో సుందరమైన ఘటన. భిన్న నేపథ్యాలున్న వర్గాలు మనతో కలిసి నడిచాయి. అందరి ఆశ ఒక్కటే. పటిష్ట సరిహద్దులు కావాలి. దేశం మరింత సురక్షితంగా, భద్రంగా ఉండాలి. చక్కటి విద్య అందాలి. ఎవరి మీదకు దండెత్తకపోయినా మనకు అజేయ సైన్యం కావాలి. గత నాలుగేళ్లలో మనం ఎలాంటి యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అయినాసరే ఐసిస్‌ను ఓడించాం. నేనొస్తే యుద్ధమేఘాలు కమ్ముకుంటాయని డెమొక్రాట్లు ఆరోపించారు. నిజానికి నేనొస్తే యుద్ధాలు ఆగిపోతాయి. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు దక్కిన అద్భుత విజయమిది. మరోమారు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకుని నాకు అసాధారణ గౌరవం ఇచ్చిన నా అమెరికన్ ప్రజలకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నా ’’అని అన్నారు. సరిహద్దులను పటిష్టం చేస్తా ‘‘ప్రస్తుతం దేశం చాలా కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తక్షణ సాయం అవసరం. దేశ గాయాలను మేం మాన్పుతాం. దేశ సరిహద్దుల వద్ద కాపలాను మరింత పటిష్టం చేస్తాం. అదొక్కటేకాదు దేశం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపుతాం. ప్రతి ఒక్క పౌరుడికి నేనొక్కటే చెబుతున్నా. మీ కోసం, మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా పనిచేస్తా. ప్రతి రోజూ పోరాడతా. మనం, మన పిల్లలు కోరుకునే స్వేచ్ఛాయుత, అత్యంత సురక్షితమైన, సుసంపన్నమైన అమెరికా కోసం నా తుదిశ్వాసదాకా కృషిచేస్తా. అమెరికాకు మళ్లీ స్వర్ణయుగాన్ని తెస్తా. ఈ మహాయజ్ఞంతో నాతోపాటు పాలుపంచుకోవాలనుకునే ప్రతి ఒక్క పౌరుడికీ ఇదే నా స్వాగతం’’అని అన్నారు. బంగరు భవితకు బాటలు వేద్దాం ‘‘మనందరం కలిసి సమష్టిగా అమెరికా ఉజ్జల భవితను లిఖిద్దాం. కలిసి కష్టపడి మన తర్వాత తరాలకు చక్కటి భవిష్యత్తును అందిద్దాం. ఎన్నికల వేళ 900 ర్యాలీలు నిర్వహించుకున్నాం. విస్తృతంగా పర్యటించి ప్రజలకు చేరువకావడం వల్లే ఇప్పుడు విజయ తీరాలకు చేరగలిగాం. ఇప్పుడు దేశం కోసం అత్యంత ముఖ్యమైన పనులను మొదలెడదాం. అత్యంత మెరుగైన అమెరికాను నిర్మిద్దాం’’అని అన్నారు. ఎన్నికల బహిరంగసభలో భవనం పైనుంచి ఒక ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో స్వల్ప గాయంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం, గోల్ఫ్ క్లబ్ వద్ద మరో సాయుధుడి అరెస్ట్ ఘటనలను ట్రంప్గుర్తుచేసుకున్నారు. ‘‘గొప్ప కార్యం మీతో చేయించాలనే మిమ్మల్ని దేవు డు కాపాడాడు అని చాలా మంది నాతో చెప్పారు’’అని ట్రంప్ అన్నారు. ‘‘దేశాన్ని కాపాడి మళ్లీ గ్రేట్‌గా మార్చేందుకే దేవుడు నాకీ అవకాశం ఇచ్చాడనుకుంటా. ఈ మిషన్‌ను మనం పూర్తిచేద్దాం. ఈ పని పూర్తి చేయడం అంత సులభమేం కాదు. శక్తినంతా కూడదీసుకుని దేశభక్తి, పోరాటపటిమ, స్ఫూర్తితో ఈ ఘనకార్యాన్ని సంపూర్ణం చేద్దాం. ఇది ఉత్కృష్టమైన బా ధ్యత. ఇంతటి ఉదాత్తమైన పని ప్రపంచంలోనే లేదు. తొలిసారి అధ్యక్షుడిగా పాలించినప్పుడూ ఒక్కటే ల క్ష్యంగా పెట్టుకున్నా. ఇచి్చన హామీలను నెరవేర్చాల ని. ఇప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానాలను తూ.చా. తప్పకుండా అమలుచేస్తా. ‘మేక్ అమెరికా.. గ్రేట్ ఎగేన్’ను సాకారం చేసేందుకు దేశం నలుమూలల నుంచి నడుంబిగించి కదలండి. ఐక్యంగా నిలబడాల్సిన తరుణమిది. మనందరం ప్రయతి్నంచబోతున్నాం. సాధించబోతున్నాం’’అని ట్రంప్ అన్నారు. ఎలాన్ మస్క్ పై ప్రశంసలు ప్రసంగిస్తూ ట్రంప్ ప్రపంచ కుబేరుడు, ఎన్నికల్లో తన కోసం కోట్లు ఖర్చుచేసిన వ్యాపారదిగ్గజం ఎలాన్ మస్‌్కను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘ఇక్కడో తార(స్టార్) ఉద్భవించింది. అదెవరంటే మన ఎలాన్ మస్‌్క. ఆయనో అద్భుతమైన వ్యక్తి. ప్రజలు ప్రకృతి వైపరీతాల్లో చిక్కుకుపోయినప్పుడు మస్‌్కకు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ వ్యవస్థ ప్రజలకు ఎంతో సాయపడింది. నార్త్‌కరోలినాలో హెలెన్ హరికేన్ వేళ స్టార్‌లింక్ ఎంతో సాయపడింది. అందుకే ఆయన్ను నేను ఇష్టపడతా. అసాధ్యాలను సుసాధ్యం చేశారు. స్పేస్ఎక్స్ వారి స్టార్íÙప్ కార్యక్రమంలో భాగంగా అత్యంత భారీ రాకెట్ బూస్టర్‌ను పునరి్వనియోగ నిమిత్తం మళ్లీ పసిపాపలాగా లాంచ్ప్యాడ్పై అద్భుతంగా ఒడిసిపట్టారు. మస్‌్కకు మాత్రమే ఇది సాధ్యం. ఆ ఘటన చూసి నేను భవిష్యత్తరం సినిమా అనుకున్నా. ఇంతటి ఘనత సాధించిన మస్క్ లాంటి మేధావులను మనం కాపాడుకుందాం. ఎందుకంటే ఇలాంటి వాళ్లు ప్రపంచంలో కొందరే ఉన్నారు’’అని ట్రంప్ అన్నారు. జేడీ వాన్స్‌ను పొగిడిన ట్రంప్ కాబోయే ఉపాధ్యక్షుడు ఇతనే అంటూ జేడీ వాన్స్‌ను ట్రంప్ సభకు పరిచయం చేశారు. ‘‘ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ సరైన వ్యక్తి. ఆయన భార్య ఉషా సైతం అద్భుతమైన మహిళ. పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావం చూపడంలో జేడీ వాన్స్‌కు ఎవరూ సాటిరారు. రిపబ్లికన్ పార్టీని విమర్శించే, ఆగర్భ శత్రువులుగా తయారైన కొన్ని మీడియా కార్యాలయాలకు చర్చకు వెళ్తారా? అని నేను అడిగితే వెంటనే ఓకే అనేస్తారు. సీఎన్ఎన్కు వెళ్లాలా?, ఎంఎస్ఎన్బీసీకి వెళ్లాలా? అని నన్నే ఎదురుప్రశ్నిస్తారు. ముక్కుసూటిగా దూసుకుపోయే, వైరివర్గాన్ని చిత్తుచేసే నేత’’ అంటూ వాన్స్‌ను ట్రంప్ ఆకాశానికెత్తేశారు. శక్తివంతంగా తిరిగొచ్చారు: వాన్స్ ‘‘మళ్లీ గెలిచి అత్యంత శక్తివంతంగా తిరిగొచి్చన అతికొద్ది మంది నేతల్లో ఒకరిగా ట్రంప్ నిలిచారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ పునరాగమనం ద్వారా ట్రంప్ సారథ్యంలో మేం దేశ ఆర్థిక ప్రగతి రథాన్ని ఉరకలు పెట్టిస్తాం. నాపై నమ్మకం ఉంచి ఉపాధ్యక్ష పదవికి నన్ను ఎంపిక చేసిన ట్రంప్‌కు కృతజ్ఞతలు’’అని జేడీ వాన్స్ అన్నారు. -
అద్భుతమైన జంట.. జేడీ వాన్స్, ఉషా వాన్స్‌కు అభినందనలు: ట్రంప్
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, వైఎస్ ప్రెసిడెంట్‌గా జేడీ వాన్స్ విజయం దాదాపు ఖాయమైపోయింది. ఈ క్రమంలో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్లో రిపబ్లిక్ పార్టీ మద్దతుదారుల సభలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. అమెరికా తమకు అపూర్వమైన, శక్తివంతమైన ఆదేశాన్ని ఇచ్చిందని అన్నారు. తన సహచరుడు జేడీ వాన్స్, భారతీయ అమెరికన్ అయిన జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్‌పై ప్రశంసలు కురిపించారు.‘‘మొదటగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్, ఆయన అద్భుతమైన, అందమైన భార్య ఉషా వాన్స్‌ను అభినందిస్తున్నా. ఇక నుంచి మిమ్మల్ని ఉపాధ్యక్షుడు అని గర్వంగా పిలువచ్చు. ఈ ఎన్నికల్లో మనం చరిత్ర సృష్టించాం. ఎవరూ సాధ్యం కాదనుకున్న అడ్డంకులను అధిగమించాం. అమెరికా దేశం ఎన్నడూ చూడని రాజకీయ విజయం. నాకు మద్దతు ఇచ్చిన టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్‌కి కృతజ్ఞతలు’’ అని అన్నారు.ఇక.. ట్రంప్ రన్నింగ్మేట్గా గెలుపు ఖరారు చేసుకున్న జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్.. ఆంధ్రప్రదేశ్‌లోని వడ్లూరు గ్రామంలో జన్మించిన ఇండో అమెరికన్. జేడీ వాన్స్ గెలుపుతో ఆమె అమెరికాకు రెండవ మహిళ(Second Lady) హోదా దక్కించుకోకున్నారు. ఆమె యేల్ లా స్కూల్లో జేడీ వాన్స్‌ను మొదటగా కలుసుకున్నారు. ఈ జంట 2014లో వివాహం చేసుకున్నారు. కాగా.. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉష పేరెంట్స్ రాధాకృష్ణ, లక్ష్మి దంపతులు 1970వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. శాన్ డియాగోలో ఇంజనీరింగ్, మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్లుగా పని చేశారు. గత ఎన్నికల్లో భారతీయ మూలాలున్న కమలా హారిస్ ఉపాధ్యక్షురాలు కాగా.. ఈసారి తెలుగుమూలాలున్న వ్యక్తి భర్త(జేడీ వాన్స్) ఆ పదవిని చేపట్టబోతున్నారు.'Now I Can Say Vice President': Trump hails JD Vance, His wife after 'Political Victory'Watch: https://t.co/Fj7vonSlLl | #USElection2024 #Trump2024 #JDVance #VicePresident #IndianAmerican #UshaVance pic.twitter.com/9DiDFHh1J9— Business Today (@business_today) November 6, 2024Video Credits: Business Todayచదవండి: US Election 2024 నాన్సీ పెలోసీ వరుసగా 20వ సారి గెలుపు, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ -
అల్లుడిపై ట్రంప్ ప్రశంసలు
-
తెలుగింటి అల్లుడిపై ట్రంప్ ప్రశంసలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవిని దాదాపు ఖరారు చేసుకున్న రిపబ్లికన్ పార్టీ అభ్ఘర్థి డొనాల్డ్ ట్రంప్ తమ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సేన్ జేడీ వాన్స్‌పై ప్రసంశలు కురిపించారు. ఈయన భార్య ఉషా చిలుకూరి తెలుగు సంతతికి చెందినవారు.ఇప్పటివరకూ వచ్చిన ఫలితాల ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయ పథాన దూసుకుపోతున్నారు. ఫలితాలు వెలువడుతున్న సమయంలో ట్రంప్ ఫ్లోరిడాలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి సేన్ జేడీ వాన్స్ తనకు అనుక్షణం అండగా నిలిచారంటూ ప్రసంశలు కురిపించారు. అలాగే అతని భార్య, తెలుగింటి ఆడపడుచు ఉషా చిలుకురి వాన్స్‌ను కూడా ట్రంప్ అభినందించారు.జేడీ వాన్స్ భార్య ఉష చిలుకూరి తెలుగు సంతతికి చెందినవారు. గత ఏడాది వరకూ విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేసిన శాంతమ్మ మనుమరాలు ఉషా చిలుకూరి. అమెరికా ఉపాధ్యక్షునిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జేడీ వాన్స్ పేరు ఖరారైన దరిమిలా ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది.ఉషకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో బంధువులు ఉన్నారు. 90 ఏళ్ల వయస్సులోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు పలు పరిశోధనలు సాగిస్తున్న ప్రొఫెసర్ శాంతమ్మకు ఉష మనవరాలు అవుతారు. తెలుగు ప్రొఫెసర్‌గా సేవలు అందించిన శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి కొన్నేళ్ల క్రతమే మృతి చెందారు. సుబ్రహ్మణ్యశాస్త్రి తమ్ముడు రామశాస్త్రి కుమారుడైన రాధాకృష్ణ కుమార్తెనే ఉషా చిలుకూరి. ఇది కూడా చదవండి: మస్క్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు -
చరిత్రలో లేని గెలుపు: ఫలితాలపై స్పందించిన ట్రంప్
ఫ్లోరిడా: అమెరికా ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించలేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ దూసుకుపోతున్న సందర్భంగా ఫ్లోరిడాలో బుధవారం(నవంబర్ 6) ట్రంప్ తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రంప్ మాట్లాడుతుండగా ఆయన అభిమానులు ట్రంప్..ట్రంప్ నినాదాలతో హోరెత్తించారు. తన గెలుపు అమెరికాకు ఉపయోగమని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికన్లకు సువర్ణయుగం రాబోతోందన్నారు. రిపబ్లికన్లకు 300కుపైగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. పాపులర్ ఓట్లు కూడా మాకే ఎక్కువ వచ్చాయి. ఇక అమెరికాలోకి అక్రమ వలసలు ఉండవు. అందరూ చట్టబద్ధంగానే రావాల్సి ఉంటుంది. సరిహద్దులు మూసివేస్తా. అక్రమ వలసలు అడ్డుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తా.‘నా విజయంలో నా వెన్నంటి ఉన్న నా కుటుంబానికి కృతజ్ఞతలు. ఇది మొత్తం అమెరికన్లు గర్వించే విజయం. వైఎస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరి బాగా పనిచేశారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా వాన్స్ ఎంపిక సరైనదేనని తేలింది. తొలుత వాన్స్ ఎంపికపై వ్యతిరేకత వచ్చింది.’అని ట్రంప్ గుర్తు చేశారు. ట్రంప్ ప్రసంగించిన వేదికపైనే ట్రంప్ కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ కూడా ఉన్నారు.#WATCH | West Palm Beach, Florida | Republican presidential candidate #DonaldTrump says, "...This is a movement that nobody has ever seen before. Frankly, this was, I believe, the greatest political movement of all time. There has never been anything like this in this country and… pic.twitter.com/MEcRDSAI72— ANI (@ANI) November 6, 2024 ఇదీ చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాల అప్డేట్స్ -
భారతీయ వంటకాలపై రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పొగడ్తల జల్లు..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరుపున వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆయన మన భారతీయ మూలాలున్న మహిళనే పరిణయమాడారు. ఆ నేపథ్యంలోనే ఆయనకు భారతీయ వంటకాలతో బాగా సుపరిచయం ఉంది. అందువల్ల ఇటీవల వ్యాన్స్ వెల్నెస్ నిపుణుడు జో రోగన్‌తో జరిగిన పాడ్‌కాస్ట్‌లో కూడా భారతీయ వంటకాలపై ఉన్న ఇష్టాన్ని సవివరంగా తెలిపి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా శాకాహార వంటకాల గురించి చాలా గమ్మత్తైన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అవేంటో చూద్దామా..!. వాన్స్ భారతీయ రుచులకు ఫిదా అవ్వడమే గాక వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తూ ఆరోగ్య స్ప్రుహని కలుగజేస్తున్నారు. ముఖ్యంగా మన ఆయుర్వేదంలో ఉపయోగించే మూలికలు వాటి ప్రయోజనాలపై ప్రసంసల జల్లు కురిపించాడు. తాను ఇంట్లో వండిన భారతీయ భోజనమే తింటానని చెప్పారు. అంతేగాదు దానిలో ఉండే పోషక ప్రయోజనాలను హైలెట్ చేసి మరి వివరించారు. అయితే ల్యాబ్‌లో కృత్రిమంగా చేసే మాంసాన్ని చెత్తగా అభివర్ణించాడు. అందుకు బదులు భారతీయ శాకాహారమే చాలా మంచిదని అన్నారు. తన భార్య ఉషా చాలా రుచికరమైన భారతీయ వంటకాలను తయారు చేస్తుందని, ముఖ్యంగా పనీర్ అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు..మొక్కల ఆధారిత ఆహారాలు తీసుకోడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే గాక శరీరానికి కావాల్సిన పోషకాల అందుతాయి. అంతేగాదు అమెరికన్లు 2020-2025 సంవత్సరానికి సంబంధించి ఆరోగ్యం పెంపొందించుకునేలా కొత్త ఆహార మార్గదర్శకాలను ఏర్పరుచుకున్నారు. వాటిలో శాకాహారానికే తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతుంది.బాడీ మాస్ ఇండెక్స్‌ను 0.96 తగ్గిస్తాయి. ఈ ఆహారాలు మధుమేహం మందులను తగ్గించడానికి కూడా అనుమతిస్తాయి. మాంసాహార ఆహారాలతో పోలిస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీని సుమారు 10 శాతం మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది. భారతీయ ప్రధాన ఆహారాల్లో.. పెరుగు, సలాడ్, రోటీ, పప్పులు, బియ్యం, గోధుమపిండి తదితరాలు ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్లు ఏ, సీ, కే, ఫోలిక్ ఆమ్లాలు, కాల్షియం వంటి ఇతర సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, దీర్ఘాకాలిక వ్యాధులను నివారించడానికి తోడ్పడతాయి. (చదవండి: ఒంటికి మంచిదే..మరి పంటికి?) -
ట్రంప్, వాన్స్ లక్ష్యంగాచైనా సైబర్ దాడి
వాషింగ్టన్: చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు , మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ఆయన రన్నింగ్ మేట్ జేడీ వాన్స్‌లు వాడే ఫోన్లు, నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకున్నారని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ట్రంప్–వాన్స్‌ల ఎన్నికల ప్రచార బృందాన్ని అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, ఆమె రన్నింగ్ మేట్ వాల్జ్ ఎన్నికల ప్రచారాన్ని కూడా చైనా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారని బీబీసీ పేర్కొంది. అదే నిజమైతే, ఏ మేరకు సమాచారం నేరగాళ్ల చేతికి చిక్కి ఉంటుందనే విషయం స్పష్టత రాలేదు. అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులు సైబర్ నేరగాళ్లకు లక్ష్యమయ్యారా అనే ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్‌బీఐలు నిరాకరిస్తున్నాయి. చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు దేశంలోని వాణిజ్య టెలీకమ్యూనికేషన్స్ వ్యవస్థల్లోకి దొంగచాటుగా ప్రవేశించిన విషయమై అమెరికా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిందని ఎఫ్‌బీఐ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సీఐఎస్ఏ) ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. అయితే, నేరగాళ్లు చేసిన ప్రయత్నాలను తాము గుర్తించామని తెలిపాయి. ఆ వెంటనే సంబంధిత సంస్థలను అప్రమత్తం చేయడంతోపాటు ఇతర బాధితులను అలెర్ట్ చేసి, అవసరమైన సహాయ సహకారాలు అందించామని ఆ ప్రకటనలో వివరించాయి. కమర్షియల్ కమ్యూనికేషన్స్ రంగంలో సైబర్ రక్షణలను బలోపేతం చేసేందుకు, దాడులను ఎదుర్కొనేందుకు సంబంధిత విభాగాలను సమన్వయం చేస్తున్నామని ఎఫ్‌బీఐ, సీఐఎస్ఏ తెలిపాయి. అయితే, దీనిని ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేసేలా సైబర్ దాడికి జరిగిన యత్నంగా కాకుండా, గూఢచర్యంగాభావిస్తున్నామని న్యాయ విభాగం తెలిపింది.ఈ పరిణామంపై ట్రంప్ ప్రచార బృందం తీవ్రంగా స్పందించింది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవకుండా చేసే కుట్రగా అభివర్ణించింది. ఈ నెల మొదట్లో కూడా హ్యాకర్లు ట్రంప్, వాన్స్‌లే లక్ష్యంగా సైబర్ దాడికి పాల్పడ్డారని సంబంధిత వెరిజోన్ అనే టెలీ కమ్యూనికేషన్ సంస్థ ఆరోపించింది. సెపె్టంబర్లో ఇరాన్‌కు చెందిన ముగ్గురు హ్యాకర్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జోక్యం చేసుకునేందుకు ప్రయతి్నంచినట్లు అమెరికా ప్రభుత్వం ఆరోపించడం తెలిసిందే. -
ట్రంప్ అసమర్థుడు: వాల్జ్
వాషింగ్టన్: అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ విధానాలన్నీ అమెరికాకు తీవ్రంగా చేటు చేశాయని డెమొక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాల్జ్ విమర్శించారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీకి అత్యంత సమీపానికి వచ్చిందంటే ఆయన అసమర్థతే కారణమన్నారు. ఈ ఆరోపణలను ఆయన ప్రత్యర్థి, రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి జె.డి.వాన్స్ తోసిపుచ్చారు. అధ్యక్షునిగా ట్రంప్ పాలనా దక్షత వల్లే ప్రపంచం ఇప్పుడింత సురక్షితంగా ఉందని చెప్పుకొచ్చారు. ఆయన హయాంలో ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు, యుద్ధ భయాలు తలెత్తలేదన్నారు. మంగళవారం రాత్రి సీబీఎస్ న్యూస్ వార్తా సంస్థ వేదికగా జరిగిన ఉపాధ్యక్ష అభ్యర్థుల డిబేట్లో వారిద్దరూ తలపడ్డారు. ‘‘ట్రంప్ అస్థిర మనస్కుడు. పాలనకు పూర్తిగా అనర్హుడని ఆయనతో కలిసి పని చేసిన అత్యున్నత స్థాయి అధికారులంతా ముక్త కంఠంతో చెప్పారు. మా అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌లో గొప్ప నాయకత్వ లక్షణాలున్నాయి’’ అని వాల్జ్ అన్నారు. -
ట్రంప్‌కు పుతిన్ భయపడ్డారా?
న్యూయార్క్: అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో దేశంపై యుద్ధం చేయలేదని రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి, సెనేటర్ జేడీ వాన్స్ అన్నారు. ఆయన ఆదివారం సీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా, రష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాను పోటీదారుగా, ప్రత్యర్థిగా గుర్తిస్తూ ఆ దేశాన్ని ఎదుర్కొవడానికి గల బలమైన అంతర్జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని తమ పార్టీ కోరుకుంటుందని అన్నారు. చైనాను నిరోధించగల అంతర్జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటే మా టార్గెట్‌గా భావిస్తున్నాం. మేము చైనాతో యుద్ధానికి చేయకూడదని అనుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా చైనా మకు విరోధి దేశమే. ఆ విషయం చైనీయులకు కూడా తెలుసు. చైనా టన్నుల కొద్దీ ఫెంటానిల్‌ను తయారు చేస్తుందిని, అమెరికాలోకి అనుమతిస్తున్నారు. అయితే డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఈ విషయంలో ఏమీ చేయలేదని అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ కార్మికులతో కూడిన శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అమెరికాకు ఉంది. చైనాను వాణిజ్యపరంగా ఎదుర్కొవల్సి వస్తే.. పోరాడి గెలుస్తాం. కానీ కమలా హారిస్ చేసిన పనిని మేము చేయలేము. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మంచి సంబంధాలను కలిగి ఉన్నందుకు కమలా హారిస్‌తో సహా డెమోక్రాట్లు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి చేశారనే విషయం మనం గుర్తుంచుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, వ్లాదిమిర్ పుతిన్ మరో దేశంపై యుద్ధం చేయలేదని వాన్స్ అన్నారు. -
వంధ్యత్వం కాదు.. అంధత్వం!
ప్రకృతిలోని జీవరాశులను ప్రేమించే వాళ్లంతా మాతృత్వం కలవారే! దీనికి జెండర్ లేదు. వాత్సల్యం, కరుణే దానికి కొలమానం! అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వాన్ని ఫాలో అవుతున్నవాళ్లకు అర్థమయ్యే ఉంటుంది ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకో! అవును, కమలా హ్యారిస్ గురించి జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ ప్రస్తావన. రాజకీయ ఎన్నికల ప్రచారంలో హుందాతనం.. అగ్రరాజ్యంలోనూ పూజ్యమని అర్థమైంది. అవతలి పక్షాన్ని ఎదుర్కోవడానికి ముఖ్యంగా మహిళానేతల విషయంలో ఎక్కడైనా వాళ్ల దక్షత కన్నా వ్యక్తిగతేచ్ఛలే పరిగణనలోకి తీసుకునేట్టున్నారు.దీనికి అభివృద్ధి చెందిన దేశాలు, వర్తమాన దేశాలనే వ్యత్యాసం లేనట్టుంది. పిల్లల్లేని మహిళలు దుర్భర జీవితాన్ని గడుపుతారని, వాళ్లు సమాజానికి భారమే తప్ప వాళ్ల వల్ల ఒరుగుతున్నదేమీ లేదని రిపబ్లికన్‌పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వాక్రుచ్చాడు. ఈ కామెంట్.. పిల్లల్లేని కమలా హ్యారిస్నుద్దేశించేనని ప్రపంచమంతా గ్రహించి, ఆమె పక్షాన నిలిచింది. పిల్లలను కనాలా వద్దా అనేది పిల్లల్ని కనే శారీరక స్థితి, పెంచే సామాజిక పరిస్థితులను బట్టిమహిళ నిర్ణయించుకోవాలని, ఆ నిర్ణయాధికారం ఆమె హక్కని నాగరిక సమాజం గొంతు చించుకుని అరిచింది. దాని మీద ఉద్యమాలనూ లేవనెత్తింది.ఇంతలోతైన ఆలోచన, అంత విశాలమైన దృక్పథం లేని వాన్స్ లాంటి వాళ్లకు కనీసం దాన్ని ఓ పర్సనల్ చాయిస్‌గా గుర్తించాలనే స్పృహ కూడా లేనట్టుంది. పెళ్లి, పిల్లలు అనేది వ్యక్తిగతం. పిల్లల్లేని చాలామంది ఆడవాళ్లు అనాథలను చేరదీసి, ఇరుగుపొరుగు పిల్లలను పోగేసి.. బంధువుల బిడ్డలను అక్కున చేర్చుకుని వాళ్లను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దిన ఉదంతాలు కోకొల్లలు! ఇందుకు కమలా హ్యారిస్ కూడా ఉదాహరణగా నిలుస్తారు. కడుపున పుట్టిన పిల్లల్లేక΄ోయినా ఆమె అద్భుతమైన మాతృమూర్తి! తన భర్త పిల్లలకు అమ్మతనాన్ని పంచింది. జేడీ వాన్స్ వ్యాఖ్యల క్రమంలో ఆ పిల్లలు కమలా హ్యారిస్ చేయి వదల్లేదు.ఆమె భుజాల చుట్టూ చేయివేసి ఆమె మనోనిబ్బరాన్ని మరింత పెంచుతున్నారు. దీన్ని ప్రపంచమూ హర్షిస్తోంది. అలాంటి మాతృమూర్తి మీద నోరుపారేసుకున్న వాన్స్.. తండ్రైనా హృదయం లేనివాడిగా ముద్రపడ్డాడు. నిజానికి అమెరికా అధ్యక్ష్య పదవికి తమ అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ కమలా హ్యారిస్‌ని ప్రకటించగానే ఆపార్టీ విజయావకాశాలు అనూహ్యంగా పెరిగాయి. ఆ ధాటిని తట్టుకోలేక రిపబ్లికన్‌పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు ప్రతిపక్ష అభ్యర్థి జెండర్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆమె వ్యక్తిగత జీవితం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.కమలా హ్యారిస్ మాతృత్వానికి.. అమెరికా అవసరాలకు లంకె ఏంటి? అక్కడే కాదు ఎక్కడైనా సరే.. స్త్రీల వ్యక్తిగత విషయాలకు.. దేశ పురోగతికి ఏమిటి సంబంధం? ఒకవేళ సంబంధమే ఉంది అనుకుంటే అప్పుడు పురుషుడి వ్యక్తిగత విషయాలూ అంతే ప్రభావం చూపిస్తాయి కదా! పెళ్లి, పిల్లలు.. ఎవరికైనా వాళ్ల వ్యక్తిగతమే! ఒకవేళ వాన్స్ అన్నదే తీసుకున్నా.. పెళ్లి, పిల్లలు అనే బాధ్యత లేని స్త్రీలు దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక పురోగతిలో చెప్పుకోదగ్గపాత్రేపోషిస్తున్నారు. మాతృత్వాన్ని మహత్తర అనుభూతిగా చూపి ఆ బంధనంతో స్త్రీలను కట్టిపడేసి.. తమకుపోటీలేకుండా చూసుకోవాలనుకున్న పురుషాధిపత్య భావజాలం అమెరికన్లలోనూ జాస్తి అని వాన్స్ ద్వారా మరోసారి రుజువైంది. :::సరస్వతి రమ -
‘‘మేముండగా నువ్వు పిల్లలు లేనిదానివెలా’’: జేడీ వ్యాన్స్‌కు ఇచ్చిపడేసిన ‘ఎల్లా’
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో కమలా హారిస్ దూసుకుపోతున్నారు. మరోవైపు అమెరికా సెనేటర్, రిపబ్లిక్ ఉపాధ్యక్ష పదవికి బరిలో ఉన్న జేడీ వ్యాన్స్ గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై తాజాగా దుమారం రేగుతోంది. దీనిపై కమలా భర్త మొదటి భార్య కూతురు ఎల్లా ఎమ్హాఫ్ ఘాటుగా స్పందించారు. అంతేకాదు ఎల్లా తల్లికూడా కమలకు మద్దతుగా నిలిచారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌పై చైల్డ్‌లెస్ క్యాట్ అంటూ గతంలో జేడీ వ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కమల భర్త మొదటి భార్య కెర్స్టిన్ ఎమ్హాఫ్ కమలకు మద్దతుగా నిలిచారు. గత పదేళ్లుగా తన పిల్లలైన కోల్, ఎల్లా ఎమ్హాఫ్కు ఆమె తల్లిగా ప్రేమించారని, తమ కుటుంబానికి ఆమె ఎంతో అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తగవంటూ ఆమె మండిపడ్డారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై కమలా సవతి కుమార్తె (డగ్లస్ ఎమ్హాఫ్ ,కెర్స్టిన్ ఎమ్హాఫ్) ఇన్‌స్టాలో కౌంటర్ ఇచ్చారు. నేను, కోల్ (ఎల్లా సోదరుడు) ఉండగా నువ్వు పిల్లలు లేని దానివి ఎలా అవుతావంటూ కమలపై తన ప్రేమను చాటుకున్నారు. తద్వారా జేడీ వ్యాన్స్‌కు సమాధానం చెప్పారు.2021లో జేడీ వ్యాన్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పిల్లలు లేనివారు పాలించేందుకు తగరంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పిల్లలు లేని స్త్రీల జీవితం దయనీయం. అలాంటి వారు దేశాన్ని కూడా దయనీయంగా మార్చాలనుకుంటారు. కమల లాంటి పిల్లలు లేని వ్యక్తుల చేతిలో అధికారాన్ని పెట్టడంలో అర్థం లేదంటూ వాన్స్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్ కూడా తీవ్రంగా ఖండించారు.కాగా కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమ్హాఫ్ మొదటి భార్య కెర్స్టిన్ ఎమ్హాఫ్. ఈ దంపతులు పిల్లలే కోల్, ఎల్లా ఎమ్హాఫ్. వీరు కమలా హారిస్‌ను మోమలా అని ప్రేమగా పిలుచుకుంటారు. ఎల్లా మోడల్, ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తోంది. అల్లికలద్వారా మంచి కళాఖండాలను తయారు చేయడంలో ఆమె దిట్ట. -
US Presidential Election 2024: ట్రంపే అమెరికా ఆశాకిరణం
మిల్వాకీ: అమెరికా శ్రామిక వర్గం అభ్యున్నతి కోసం చివరి శ్వాస దాకా పాటుపడతానని రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి, ఒహాయో సెనేటర్ జె.డి.వాన్స్ (39) అన్నారు. వారిని అధికార డెమొక్రటిక్ పార్టీ పూర్తిగా విస్మరించిందంటూ మండిపడ్డారు. మిల్వాకీలో జరుగుతున్న రిపబ్లికన్ల నేషనల్ కన్వెన్షన్‌లో వాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యరి్థగా బుధవారం లాంఛనంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాదాసీదా, నిరుపేద మూలాలున్న తాను ఇంత దూరం వస్తానని కల్లో కూడా ఊహించలేదని చెప్పారు. ‘‘జీవితంలో ఒక్క మెట్టూ ఎదుగుతూ వచ్చా. ఒకరకంగా సగటు అమెరికన్ కలగనే జీవితాన్ని ప్రస్తుతం జీవిస్తున్నా. వారంతా భద్రమైన, సురక్షితమైన జీవితం గడిపేలా చేస్తా. ఏ పారీ్టవారన్న దానితో నిమిత్తం లేకుండా ప్రతి అమెరికన్‌కూ నా సర్వస్వం ధారపోస్తా. అమెరికా ఎన్నడూ మరిచిపోలేని ఉపాధ్యక్షుడిగా పేరు తెచ్చుకుంటా’’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. ట్రంప్‌పై ప్రశంసల వర్షం రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై వాన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా మధ్యతరగతికి, శ్రామిక వర్గానికి ప్రస్తుతం ఆయనే ఏకైక ఆశాకిరణమన్నారు. ‘‘ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందే ప్రపంచంలోకెల్లా అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. ఎవరైనా జీవితంలో కలలుగనేవన్నీ ఆయనకు అందుబాటులో ఉన్నాయి. అయినా అమెరికన్లకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని తపించారు. అందుకోసం తిట్లను, వేధింపులను, మరెన్నింటినో సహిస్తున్నారు. నిజానికి ట్రంప్‌కు ఆయనకు రాజకీయాలు అవసరం లేదు. అమెరికా ప్రజలకే ఇప్పుడు ట్రంప్ అత్యవసరం’’ అని చెప్పుకొచ్చారు. అధ్యక్షుడు జో బైడెన్ రాజకీయాలను కేవలం కెరీర్‌గా మలచుకున్న స్వార్థపరుడంటూ వాన్స్ దుయ్యబట్టారు. బైడెన్ మతిలేని వాణిజ్య ఒప్పందాలు, విదేశీ యుద్ధాలకు అర్థం లేని మద్దతు తన స్వస్థలం ఒహాయో వంటి నిరుపేద అమెరికా ప్రాంతాలను సర్వనాశనం చేశాయంటూ మండిపడ్డారు. పాలక వర్గ ప్రతినిధిగా బైడెన్ ప్రతి చర్యా అమెరికన్ల ఉద్యోగాలను విదేశాలపరం చేసింది. మన యువతను యుద్ధక్షేత్రాలకు బలిచి్చంది. ఇరాక్ నుంచి అఫ్గానిస్తాన్ దాకా, ఆర్థిక సంక్షోభం నుంచి మాంద్యం, అక్రమ వలసల దాకా ప్రస్తుత పాలక వర్గం అన్ని రంగాల్లోనూ పదేపదే విఫలమవుతూ వస్తోంది. ఈ సమస్యలన్నింటి నుంచి అమెరికాను గట్టెక్కించే చిట్టచివరి, అత్యుత్తమ ఆశాకిరణం ట్రంప్ మాత్రమే. సగటు అమెరికన్‌కు అగ్రతాంబూలమే ఆయన విజన్. ఆయనను పోగొట్టుకుంటే మనకిక భవిష్యత్తుండదు’’ అన్నారు. ‘‘దేశానికి తొలి ప్రాధాన్యమిచ్చే ట్రంప్‌నే అమెరికన్లు గెలిపించుకోబోతున్నారు’’ అని వాన్స్ జోస్యం చెప్పారు.దక్షిణాసియా వలసదారులపై వాన్స్ ప్రశంసలు దక్షిణాసియా నుంచి వచ్చినవారు అమెరికాను సుసంపన్నం చేశా రని వాన్స్ అన్నారు. భార్య ఉషా చిలుకూరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘దక్షిణాసియా నుంచి వలస వచి్చనవారి కుమార్తెను నేను పెళ్లాడాను. ఆమెకు పెళ్లి ప్రస్తావన చేసినప్పుడు లా స్కూల్ చదువు కోసం, ప్లాట్ కొనుగోలుకు చేసిన 1.2 లక్షల డాలర్ల అప్పులు నా నెత్తిన ఉన్నాయని చెప్పా. అయినా పెళ్లికి అంగీకరించింది’’ అని చెప్పారు. తన వ్యక్తిగత, ఆధ్యాతి్మక జీవితంపై భార్య ప్రభావం ఉందన్నారు. తల్లి బెవర్లీని సభకు పరిచయం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు.భారతీయ వంటలు నేర్చుకున్నారు: ఉషవాన్స్ గొప్ప ఉపాధ్యక్షునిగా తనను తాను నిరూపించుకుంటారని భార్య ఉషా చిలుకూరి (38) విశ్వాసం వెలిబుచ్చారు. వాన్స్ ప్రసంగానికి ముందు ఆయనను రిపబ్లికన్ కన్వెన్షన్‌కు ఆమె లాంఛనంగా పరిచయం చేశారు. ‘‘జేడీది నిరుపేద స్థానిక శ్వేతజాతి కుటుంబం. నాదేమో భారతీయ వలసదారుల కుటుంబం. అలాంటి మేం కలుసుకోగలిగామన్నా, ప్రేమలో పడి పెళ్లి చేసుకోగలిగామన్నా కేవలం అమెరికా గొప్పదనమే అందుకు కారణం’’ అన్నారు. ‘‘నా భారతీయ జీవన శైలి గురించి జేడీ ఆసక్తిగా అన్ని విషయాలూ తెలుసుకున్నాడు. పక్కా మాంసాహారి అయినా నా శాకాహార జీవనశైలికి అలవాటు పడ్డాడు. మా అమ్మనడిగి భారతీయ వంటకాలు చేయడం నేర్చుకున్నాడు’’ అన్నారు. -
ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థి ఉషా‘పతి’
ఉషా చిలుకూరి వాన్స్.. తెలుగు పేరులా ఉంది కదా! అవును.. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ కొత్తగా చర్చనీయాంశమైన పేరు. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేమ్స్ డేవిడ్ వాన్స్ భార్య. కాలిఫోర్ని యాలో పుట్టి పెరిగిన ఆ తెలుగు ఆడబిడ్డ గురించి కొన్ని ముచ్చట్లు.. వాషింగ్టన్: సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహియో సెనేటర్‌గా ఉన్న జేమ్స్ డేవిడ్ వా న్స్ (జేడీ వాన్స్)ను ప్రకటించారు. ఒకప్పుడు ట్రంప్ విమర్శకుడిగా ఉన్న జేడీ వాన్స్ తరువాత ఆయనకు అనుచరుడిగా మారిపో యారు. ట్రంప్‌పై హత్యాయ త్నం జరిగిన వెంటనే.. దీని వెనుక అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉండొచ్చని మొట్టమొదటగా ట్వీట్ చే సింది కూడా జేడీనే. సోమవారం జరిగిన కన్వెన్షన్‌లో అభర్థిత్వం ప్రకటించిన త రువా త ప్రసంగించిన ఆయన.. తన ప్రస్థానం వె నుక భార్య ఉషా చిలుకూరి వాన్స్ సహ కా రం ఎంతో ఉందన్నారు. చరిత్ర విద్యార్థిగా.. ఉషా తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందట ఏపీ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె 1986 జనవరి 6న కాలిఫోర్నియాలోని శాండియాగోలో జన్మించారు. వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన ఉషా.. యేల్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. ఉష అక్కడి లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవ లప్మెంట్ ఎడిటర్‌గా, యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేశారు. కేంబ్రిడ్జిలో ఆమె లెఫ్ట్–వింగ్, లి బరల్ గ్రూప్స్‌తో కలిసి పనిచేశారు. 2014లో వామపక్ష డెమొక్రటిక్ పార్టీలో చేరిన ఉషా.. 2018లో రిపబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకు న్నారు. 2015–2017 వరకు శాన్ఫ్రాన్సిస్కో వాషింగ్టన్ డీసీలోని వివిధ సంస్థల్లో పని చేశారు. యేల్ వర్సిటీలో చదువుతుండగానే ఉషకు జేడీ వాన్స్ పరిచయం. ఇద్దరూ కలిసి పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఈ అనుబంధం ప్రేమగా మారి.. వారిద్దరూ 2014లో కెంటకీలో పెళ్లి చేసుకున్నారు. ఓ పక్క న్యాయ వాదిగా తన విధులు నిర్వహిస్తూనే భర్త రాజకీయ ప్రయాణంలో అండగా ఉన్నారు. జేడీ వాన్స్, ఉష దంపతులకు ఇద్దరు కొడుకులు వివాన్, వివేక్, కూతురు మిరాబెల్ ఉన్నారు. వారిని హిందూ, క్రిస్టియన్ రెండు మత విశ్వాసాలతో పిల్లలను పెంచుతున్నారు. -
నాటి విమర్శకుడే... నేటి వీరాభిమాని
‘‘దేవుడా! ఈ ట్రంప్ ఎంతటి మూర్ఖుడో!’’ ‘‘నేనెప్పుడూ ట్రంప్ మనిషిని కాలేను’’ ‘‘ఆయనంటే నాకస్సలు ఇష్టం లేదు’’అమెరికా మాజీ అధ్యక్షుని గురించి ఆయన సొంత రిపబ్లికన్ పార్టీ నేత వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలివి. ట్రంప్‌ను వాన్స్ ఎంతగా ద్వేషించారంటే, చివరికి ఆయనను అమెరికా హిట్లర్‌గా అభివర్ణించేదాకా వెళ్లారు! ట్రంప్‌ను బూతులు కూడా తిట్టేవారు. దేశ శ్రామిక వర్గానికి భవిష్యత్తుపై ఆశ, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు కలి్పంచకపోతే స్వప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ట్రంప్ వంటి స్వార్థపూరిత నాయకులే పుట్టుకొస్తారంటూ రిపబ్లికన్ పార్టీ విధానాలపైనా విమర్శలు గుప్పించేవారు. అలాంటి వాన్స్ కొన్నేళ్లుగా రిపబ్లికన్ పారీ్టలో ట్రంప్‌కు అత్యంత గట్టి మద్దతుదారుగా మారిపోయారు. అంతటితో ఆగకుండా తాజాగా ఏకంగా ట్రంప్‌కు రన్నింగ్ మేట్ కూడా అయిపోయారు! సోమవారం మొదలైన రిపబ్లికన్ల జాతీయ సదస్సులో పార్టీ అధ్యక్ష అభ్యరి్థగా ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యరి్థగా వాన్స్ ఖరారయ్యారు!! అంతేనా... అన్నీ కుదిరితే 2028లో రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి వాన్సే అవుతారంటూ అమెరికా మీడియాలో ఇప్పటినుంచే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి... నిరుపేద నేపథ్యం ట్రంప్ రన్నింగ్ మేట్ అయిన 39 ఏళ్ల జె.డి.వాన్స్‌ది ఆసక్తికర నేపథ్యం. మాజీ సైనికుడు. విజయవంతమైన వెంచర్ క్యాపిటలిస్టు. బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన పుస్తక రచయిత. రాజకీయ నాయకుడు. ఇలా ఆయన వ్యక్తిత్వానికి ఎన్నో పార్శా్వలున్నాయి. వాన్స్ ఒహాయో మిడిల్ టౌన్లో అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టారు వాన్స్. ఆయన అసలు పేరు జేమ్స్ డొనాల్డ్ బోమన్. తల్లి డ్రగ్స్‌కు బానిస. వాన్స్ పసిపిల్లాడిగా ఉండగానే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయారు. తాత, అమ్మమ్మే ఆయన్ను పెంచి పెద్ద చేశారు. దాంతో వాళ్లనే తల్లిదండ్రులుగా పిలిచేవారు.తన పుస్తకంలో కూడా వారి గురించి రాసుకున్నారు. ఆరేళ్ల వయసులో తల్లి మరొకతన్ని పెళ్లాడింది. ఆయన వాన్స్‌ను దత్తత తీసుకున్నారు. దాంతో తన పేరు నుంచి డొనాల్డ్‌ను తీసేసి మారు తండ్రి పేరులోని డేవిడ్‌ను కలుపుకున్నారు. ఇంటి పేరు కూడా హామెల్గా మారింది. పెళ్లయ్యాక తాత, అమ్మమ్మల గౌరవార్థం వారి ఇంటి పేరు వాన్స్‌ను స్వీకరించారు. అలా జేమ్స్ డేవిడ్ వాన్స్గా మారారు. తొలుత యూఎస్ మరైన్స్లో చేరి సైనికునిగా ఇరాక్‌లో విధులు నిర్వహించిన ఆయన తర్వాత పట్టుదలతో ఉన్నత చదువులు చదివారు.ఒహాయో స్టేట్ వర్సిటీ, యేల్ లా స్కూల్‌కు వెళ్లారు. అనంతరం కాలిఫోరి్నయాలో వెంచర్ క్యాపిటలిస్టుగా చేశారు. తన అనుభవాలు, జ్ఞాపకాలకు హిల్‌బిలీ ఎలిజీ పేరిట 2016లో పుస్తక రూపమిచ్చారు. అమెరికాలోకెల్లా అత్యంత పేదరికం తాండవించే కొండ ప్రాంతానికి చెందిన తన కుటుంబ మూలాలను అందులో ఉన్నదున్నట్టు రాశారు. తమ ఇంట్లో పెద్దవాళ్లు కష్టించి పని చేయకుండా కేవలం సంక్షేమ పథకాలపై ఆధారపడి సమాజానికి భారంగా మారారని విమర్శించారు. అది బెస్ట్ సెల్లర్‌గా నిలవడమే గాక అదే పేరుతో హాలీవుడ్ సినిమాగా కూడా రూపొందింది. దానిపై ప్రశంసలతో పాటు వివాదాలూ వెల్లువెత్తాయి. ఆ పుస్తకంతో అమెరికా అంతటా వాన్స్ పేరు మారుమోగింది. సెనేటర్‌గా నెగ్గేందుకు... 2022లో వాన్స్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఒహాయో నుంచి తొలిసారి సెనేటర్‌గా గెలుపుందారు. అదంత సులువుగా జరగలేదు. ట్రంప్ విమర్శకునిగా ఉన్న ఇమేజీ ఆయనకు పెద్ద అడ్డంకిగా మారింది. దాంతో ఆయనపై గతంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పేందుకు వాన్స్ ఏమాత్రం వెనకాడలేదు. అలా ట్రంప్ ఆమోదముద్ర పొంది సెనేటర్ అయ్యారు. యేల్ వర్సిటీ సహాధ్యాయి అయిన తెలుగు మూలాలున్న ఉషా చిలుకూరిని 2014లో పెళ్లాడారు. వర్సిటీ రోజుల నుంచి తన ఎదుగుదల క్రమంలో ప్రతి దశలోనూ ఆమెది అత్యంత కీలక పాత్ర అని వాన్స్ తరచూ చెబుతారు. అంతర్జాతీయ వ్యవహారాలపై... ట్రంప్ మాదిరిగానే వాన్స్‌కు కూడా అంతర్జాతీయ వ్యవహారాలపై దృఢమైన సొంత అభిప్రాయాలున్నాయి. ‘అమెరికా ఫస్ట్’ అన్న ట్రంప్ నినాదానికి ఆయన గట్టి మద్దతుదారు. వలసలు, వామపక్షవాదులే అమెరికాకు అతి పెద్ద ముప్పంటారు. గాజాతో యుద్ధం కోసం ఇజ్రాయెల్‌కు సైనిక సాయాన్ని బేషరతుగా కొనసాగించాలన్నది వాన్స్ వైఖరి. వ్యాపారపరంగా, ఇతరత్రా చైనాను అమెరికాకు గట్టి ప్రత్యర్థి దేశంగానే చూస్తారాయన.అంతర్జాతీయ వర్తక నిబంధనలను పాటించకపోతే అమెరికా క్యాపిటల్ మార్కెట్ నుంచి చైనాను దూరం పెట్టాలంటూ సెనేట్‌లో ఏకంగా బిల్లే ప్రవేశపెట్టారు! గాజాకు మద్దతు గా విద్యార్థులు ఆందోళనకు దిగిన కాలేజీలకు ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని నిలిపేయాలంటూ కూడా సెనేట్‌లో బిల్లులు పెట్టారు. అలాగే ఉక్రెయిన్‌కు అమెరికా భారీగా నిధులు, సైనిక సాయం చేయడాన్ని వాన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్మతిలేని వలస విధానాల కారణంగా బ్రిటన్ ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటి అణ్వాయుధ ఇస్లామిక్ దేశంగా మారింది! – జె.డి.వాన్స్ట్రంప్కు అపూర్వ స్వాగతండొనాల్డ్ ట్రంప్‌కు రిపబ్లికన్ పార్టీ జాతీయ కన్వెన్షన్‌లో అపూర్వ స్వాగతం లభించింది. హత్యా యత్నంలో గాయమైన కుడి చెవికి బ్యాండేజీతో వచి్చన 78 ఏళ్ల ట్రంప్‌ను చూసి పార్టీ ప్రతినిధులంతా భావోద్వేగానికి లోనయ్యారు. హత్యాయత్నం తర్వాత ఆయన బయటి ప్రపంచానికి కన్పించడం ఇదే తొలిసారి. సమావేశ మందిరం గుండా నడుస్తూ పిడికిలి బిగించి పైకెత్తి ‘ఫైట్’ అంటూ ట్రంప్ బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రతినిధులంతా ఉత్సాహంగా ఆయనతో గొంతు కలిపారు. ట్రంప్ వేదికపైకి చేరుకోగానే ఆయన నామస్మరణతో హాలంతా మారుమోగిపోయింది. అనంతరం అధ్యక్ష అభ్యరి్థగా ట్రంప్‌ను లాంఛనంగా ఎన్నుకున్నారు. కన్వెన్షన్‌ను ఉద్దేశించి ఆయన గురువారం ప్రసంగించనున్నారు. -
ఉషా చిలుకూరిపై ఎలోన్ మస్క్ ట్వీట్ వైరల్
అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్ జేడీ వాన్స్ ఎంపికయ్యారు. అయితే, జేడీ వాన్స్ ఎంపికతో ఆయన సతీమణి ఉషా చిలుకూరికి భారత్ మూలాలు ఉన్నాయని వెలుగులోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.వారిలో అపర కుబేరుడు ఎలోన్ మస్క్ ఉన్నారు.ఇంతకీ ఆయన ఎందుకు స్పందించారు.మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ ఆఫీస్ వేదికగా ట్రంప్ రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్‌గా జేడీ వాన్స్‌ను ప్రకటించారు.అంతకంటే ముందే జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ ప్రొఫైల్‌ను చూసి తాను ముగ్ధుడినయ్యానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వాన్స్ సతీమణి ఉషా చిలుకూరికి అభినందనలు తెలుపుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. వారిలో డాక్టర్ పారిక్ పటేల్ ఎక్స్ వేదికగా ఉషా చిలుకూరి ప్రతిభాపాటవాలపై ప్రశంసలు కురిపించారు. You either hire an Indian CEO or live long enough to see yourself become Indian pic.twitter.com/RmcjFaGrtj— Dr. Parik Patel, BA, CFA, ACCA Esq. (@ParikPatelCFA) July 15, 2024 మీరు భారతీయ సీఈవోలని నియమించుకోండి లేదా మీరే భారతీయుల్లా వ్యవహరించండి అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై ఎలోన్ మస్క్ స్పందించారు.భళ్ళున ఓ నవ్వి నవ్వుతూ ఓ స్మైలీ ఎమోజీని ట్వీట్ చేశారు. ప్రస్తుతం, ఆ ట్వీట్ వైరల్‌గా మారింది 😂— Elon Musk (@elonmusk) July 15, 2024 -
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి.. మన తెలుగింటి అల్లుడే! ఎవరీ ఉషా చిలుకూరి (ఫొటోలు)
-
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ మన తెలుగింటి అల్లుడే! ఎవరీ ఉషా చిలుకూరి?
అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగమ్మాయి ఉషా చిలుకూరి అరుదైన ఘనతను సాధించనున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్, డెమోక్రటిక్‌లు తలపడనున్నాయి. ఈ తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ఖారారు కాగా..వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ఎంపికయ్యారు. మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ ఆఫీస్ వేదికగా ట్రంప్ రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్‌గా జేడీ వాన్స్‌ను ప్రకటించారు.జేడీ వాన్స్ భార్యే ఉషా చిలుకూరి వాన్స్. ఈ ఎన్నికల్లో వాన్స్ గెలిస్తే అమెరికాకి ఉషా చిలుకూరి సెకండ్ లేడీ (రెండో మహిళ)గా చరిత్ర సృష్టించనున్నారు. ఈ సందర్భంగా ఉషా చిలుకూరి ఎవరు? ఆమె తల్లిదండ్రులు, భర్త జేడీ వాన్స్ ఎవరు? అనే వివరాల గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.ఎవరీ ఉషా చిలుకూరి? న్యూయార్క్ టైమ్స్ ప్రకారం..అమెరికాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన న్యాయవాది ఉషా చిలుకూరి. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు వద్ద ఉన్న చిన్న గ్రామమని తెలుస్తోంది. సుధీర్ఘకాలం క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి వెళ్లారు. ఉషా శాన్ డియాగో,కాలిఫోర్నియాలో పెరిగారు.ఉషా చిలుకూరి ఏం చదువుకున్నారు?ఉషా చిలుకూరి శాన్ డియాగో, కాలిఫోర్నియాలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.ఆమె లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం రాంచో పెనాస్క్విటోస్‌లోని మౌంట్ కార్మెల్ హై స్కూల్లో చదివారు.ఆధునిక చరిత్ర ఆమెకు ఇష్టమైన సబ్జెక్ట్. ప్రఖ్యాత యేల్ యూనివర్సిటీలో బీఏ హిస్టరీ పూర్తి చేశారు.ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీలో డిగ్రీ చదివారు.యేల్ యూనివర్సిటీలో చదివే సమయంలో యేలే లా జర్నల్,టెక్నాలజీ విభాగానికి ఎగ్జిక్యూటీవ్ డెవలప్మెంట్ ఎడిటర్‌గా, మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేశారు.అదే సమయంలో అమెరికా సుప్రీం కోర్టులో కేసుల్ని ఎలా వాదించాలి? కేసులో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి?కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాల్ని కోర్టులో సబ్మిట్ చేయాలనే అంశాలపై అమెరికా లా యూనివర్సిటీల్లో అనుభవజ్ఞులైన సుప్రీం కోర్టు లాయర్లతో సుప్రీం కోర్టు అడ్వకేసీ క్లినిక్ అనే కోర్సును అందిస్తాయి. ఆ కోర్స్‌లో మీడియా ఫ్రీడమ్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ క్లినిక్ అండ్ ఇరాకీ రెఫ్యూజీ అసిస్టెన్స్ ప్రాజెక్ట్‌పై పని చేశారు. ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు2013లో యేల్ యూనివర్సిటీ లా కాలేజీలో ఉషా చిలుకూరి జేడీ వాన్స్‌ను తొలిసారి కలుసుకున్నారు. లా కాలేజీలో జరిగిన ‘సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా’ అనే సబ్జెట్‌పై జరిగిన డిస్కషన్ గ్రూప్‌లో ఉషా, వాన్స్‌లు కలిసి పనిచేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అప్పుడే వారి పరిచయం ప్రేమగా మారింది. ఇరుకుటుంబసభ్యుల అంగీకారంతో ఉషా చిలుకూరి, జేడీ వాన్స్‌లు ఒక్కటయ్యారు. వారిద్దరి పెళ్లి హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగింది.జేడీ వాన్స్,ఉష దంపతులకు ముగ్గురు పిల్లలుజేడీ వాన్స్,ఉష దంపతులకు ముగ్గురు పిల్లలు.ఇవాన్,వివేక్ ఇద్దరు కుమారులు కాగా కుమార్తె మిరాబెల్.ప్రముఖ న్యాయవాదిగాకాలికేస్తే మెడకి,మెడకేస్తే కాలికేసే సివిల్ లిటిగేషన్ల పరిష్కారంలో ఆమె దిట్ట. ఉషా 2018లో అమెరికా సుప్రీం కోర్ట్‌కు లా క్లర్క్‌గా పని చేయడం కంటే ముందు 2015 నుండి 2017 వరకు శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ ఈలోని ముంగేర్, టోల్లెస్ అండ్ ఓల్సన్ ఎల్ఎల్పీలో న్యాయవాదిగా పనిచేశారు. రాజకీయాల్లో జేడీ వాన్స్వాన్స్ రాజకీయాల కంటే ప్రముఖ వ్యాపార వేత్తగా, ఇన్వెస్టర్‌గా పేరు సంపాదించుకున్నారు. 2016లో రాజకీయాల్లోకి వచ్చిన వాన్స్.. 2022లో ఓహియో నుంచి అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు. మొదట్లో ట్రంప్ విధానాలను తీవ్రంగా 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుపై విమర్శలు గుప్పిస్తూ..ఆయనను ఇడియట్, అమెరికా హిట్లర్ అంటూ విమర్శలు గుప్పించారు. చివరకు ఆయనకు వీరవిధేయుల్లో ఒక్కరిగా మారారు. పుస్తకం కాస్త.. సినిమాగాఇక వాన్స్ తనలోని రాజకీయ నాయకుడితో పాటు మంచి రచయిత ఉన్నాడంటూ ‘హిల్‌బిల్లీ ఎలెజీ’తో నిరూపించారు. హిల్‌బిల్లీ ఎలెజీ పుస్తకం ద్వారా సంక్షోభంలో ఉన్నశ్వేతజాతి అమెరికన్ల సంస్కృతి, ఉద్వేగం, వ్యక్తిగతం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. వాన్స్ తన జ్ఞాపకాలు, జీవితంలో ఎదురైన సంఘటనలు, అనుభవాల్ని వివరించారు. పేదరికం, వ్యసనం, అస్థిరతతో అతని కుటుంబం, పోషణ కోసం పోరాటాలు, చివరికి తన ప్రయాణం ఎలా సాగిందో వివరించారు. ఆ పుస్తకం ఎక్కువగా అమ్ముడు పోవడంతో అది సినిమాగా తెరక్కిక్కింది. 2020లో రాన్ హోవార్డ్ దర్శకత్వం వహించారు. ట్రంప్‌ను అమెరికా అధ్యక్షుడిని చేసిన వాన్స్అంతేకాదు ఈ పుస్తకం ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు దోహదం చేసింది. ముఖ్యంగా ట్రంప్ ప్రచారంలో తన సందేశాన్ని బలంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద తెల్లజాతి, అమెరికా ఉద్యోగుల ఓటర్లను ఆకర్షించేలా, తనవైపుకు తిప్పుకునేందుకు సహకరించింది. మధ్య అమెరికాలో సాంస్కృతిక, ఆర్థిక అంశాలను లోతుగా విశ్లేషించేందుకు ఉపయోగపడింది. కాగా, 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంలో ఈ ఓటర్లే కీలకమయ్యారు. జనవరి 6, 2021లో అమెరికా క్యాపిటల్ భవంతిపై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడిలో ఈయన కీలక పాత్ర పోషించడం గమనార్హం.జేడీ వాన్స్ విజయంలో ఉషా తన భర్త జేడీ వాన్స్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.తరచూ రాజకీయ కార్యక్రమాలకు అతనికి దిశానిర్ధేశం ఇస్తూ మద్దతుగా నిలిచారు. ఆమె 2016,2022లో సెనేట్ ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రచారం చేశారు. సెనేటర్ అంటే అమెరికాలో ప్రతినిధుల సభను మన లోక్ సభతో పోల్చుకోవచ్చు. సెనేట్ను రాజ్య సభగా చెప్పాలి. ఈ రెండింటిని కలిపి వారు అమెరికన్ కాంగ్రెస్‌గా పిలుచుకుంటారు. ప్రతినిధుల సభ బిల్లులను రూపొందిస్తే ఆ చట్టాలను సెనేట్ ఆమోదించవచ్చు లేదా నిరోధించవచ్చు.