అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరుపున వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆయన మన భారతీయ మూలాలున్న మహిళనే పరిణయమాడారు. ఆ నేపథ్యంలోనే ఆయనకు భారతీయ వంటకాలతో బాగా సుపరిచయం ఉంది. అందువల్ల ఇటీవల వ్యాన్స్ వెల్‌నెస్ నిపుణుడు జో రోగన్‌తో జరిగిన పాడ్‌కాస్ట్‌లో కూడా భారతీయ వంటకాలపై ఉన్న ఇష్టాన్ని సవివరంగా తెలిపి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా శాకాహార వంటకాల గురించి చాలా గమ్మత్తైన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అవేంటో చూద్దామా..!.
వాన్స్ భారతీయ రుచులకు ఫిదా అవ్వడమే గాక వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తూ ఆరోగ్య స్ప్రుహని కలుగజేస్తున్నారు. ముఖ్యంగా మన ఆయుర్వేదంలో ఉపయోగించే మూలికలు వాటి ప్రయోజనాలపై ప్రసంసల జల్లు కురిపించాడు. తాను ఇంట్లో వండిన భారతీయ భోజనమే తింటానని చెప్పారు.
అంతేగాదు దానిలో ఉండే పోషక ప్రయోజనాలను హైలెట్ చేసి మరి వివరించారు. అయితే ల్యాబ్‌లో కృత్రిమంగా చేసే మాంసాన్ని చెత్తగా అభివర్ణించాడు. అందుకు బదులు భారతీయ శాకాహారమే చాలా మంచిదని అన్నారు. తన భార్య ఉషా చాలా రుచికరమైన భారతీయ వంటకాలను తయారు చేస్తుందని, ముఖ్యంగా పనీర్ అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు.
శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు..
మొక్కల ఆధారిత ఆహారాలు తీసుకోడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే గాక శరీరానికి కావాల్సిన పోషకాల అందుతాయి. అంతేగాదు అమెరికన్లు 2020-2025 సంవత్సరానికి సంబంధించి ఆరోగ్యం పెంపొందించుకునేలా కొత్త ఆహార మార్గదర్శకాలను ఏర్పరుచుకున్నారు. వాటిలో శాకాహారానికే తొలి ప్రాధాన్యత ఇచ్చారు.
ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతుంది.
బాడీ మాస్ ఇండెక్స్‌ను 0.96 తగ్గిస్తాయి. ఈ ఆహారాలు మధుమేహం మందులను తగ్గించడానికి కూడా అనుమతిస్తాయి. మాంసాహార ఆహారాలతో పోలిస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీని సుమారు 10 శాతం మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది.
భారతీయ ప్రధాన ఆహారాల్లో.. పెరుగు, సలాడ్, రోటీ, పప్పులు, బియ్యం, గోధుమపిండి తదితరాలు ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్లు ఏ, సీ, కే, ఫోలిక్ ఆమ్లాలు, కాల్షియం వంటి ఇతర సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, దీర్ఘాకాలిక వ్యాధులను నివారించడానికి తోడ్పడతాయి.
(చదవండి: ఒంటికి మంచిదే..మరి పంటికి?)
Comments
Please login to add a commentAdd a comment