న్యూయార్క్: అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో దేశంపై యుద్ధం చేయలేదని రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి, సెనేటర్ జేడీ వాన్స్ అన్నారు. ఆయన ఆదివారం సీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా, రష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
చైనాను పోటీదారుగా, ప్రత్యర్థిగా గుర్తిస్తూ ఆ దేశాన్ని ఎదుర్కొవడానికి గల బలమైన అంతర్జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని తమ పార్టీ కోరుకుంటుందని అన్నారు. చైనాను నిరోధించగల అంతర్జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటే మా టార్గెట్‌గా భావిస్తున్నాం. మేము చైనాతో యుద్ధానికి చేయకూడదని అనుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా చైనా మకు విరోధి దేశమే. ఆ విషయం చైనీయులకు కూడా తెలుసు.
చైనా టన్నుల కొద్దీ ఫెంటానిల్‌ను తయారు చేస్తుందిని, అమెరికాలోకి అనుమతిస్తున్నారు. అయితే డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఈ విషయంలో ఏమీ చేయలేదని అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ కార్మికులతో కూడిన శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అమెరికాకు ఉంది. చైనాను వాణిజ్యపరంగా ఎదుర్కొవల్సి వస్తే.. పోరాడి గెలుస్తాం. కానీ కమలా హారిస్ చేసిన పనిని మేము చేయలేము.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మంచి సంబంధాలను కలిగి ఉన్నందుకు కమలా హారిస్‌తో సహా డెమోక్రాట్లు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి చేశారనే విషయం మనం గుర్తుంచుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, వ్లాదిమిర్ పుతిన్ మరో దేశంపై యుద్ధం చేయలేదని వాన్స్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment