presidencial elections
-
రివైండ్ 2024: ప్రపంచం ఓటేసింది..
అత్యధిక దేశాల్లో ఎన్నికలు జరిగిన సంవత్సరంగా 2024 చరిత్రలో నిలిచిపోనుంది. అమెరికా నుంచి భారత్ దాకా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 73 దేశాలు ఓట్ల పండుగ జరుపుకోవడం విశేషం. 27 సభ్య దేశాలున్న యూరోపియన్ యూనియన్‌కు జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు వీటికి అదనం! ఈ దేశాల్లో దాదాపు 400 కోట్ల పై చిలుకు జనాభా ఉంది. అంటే ప్రపంచ జనాభాలో దాదాపుగా సగం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఏడాది ఎన్నికల క్రతువులో పాల్గొన్నారు. వీటిలో చాలా ఎన్నికలు ఓటర్ల పరిణతికి అద్దం పట్టాయి. ఒక్కో దేశంలో ఒక్కోలా ప్రజలు తీర్పు వెలువరించడం విశేషం. పలు ఫలితాలు ఊహించినట్టు రాగా కొన్ని మాత్రం అనూహ్యాలతో ఆశ్చర్యపరిచాయి. అధికార పార్టీల అక్రమాల నడుమ ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసినవీ ఉన్నాయి... భారత ఓటర్ల పరిణతి భారత్‌లో సాధారణ ఎన్నికలు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామిక క్రతువుగా ఎప్పుడో రికార్డు సృష్టించాయి. ఇంతటి బృహత్తర కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ లేకుండా ప్రశాంతంగా జరిగే తీరు చూసి ప్రపంచమంతా ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటుంది. ఈసారి కూడా అందుకు తగ్గట్టే ఏప్రిల్ నుంచి ఆరు వారాల వ్యవధిలో ఏడు విడతల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 64.64 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఈసారి ఏకంగా ‘400కు మించి’అన్న బీజేపీ చివరికి మెజారిటీకీ కాస్త తక్కువగా 240 లోక్‌సభ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలా ఈసారి ఫలితాలు కూడా అందరినీ ఆశ్చర్యపరచడమే గాక భారత ఓటర్ల పరిణతికి అద్దం పట్టాయి.ట్రంప్.. తగ్గేదేలే...! నానారకాల వాదాలతో విడిపోయిన అమెరికాలో ఈసారి జరిగిన అధ్యక్ష ఎన్నికలు ప్రపంచమంతటినీ అమితంగా ఆకర్షించాయి. డొనాల్డ్ ట్రంప్ హవాకు అద్దం పట్టిన ఎన్నికలుగా నిలిచిపోయాయి. రిపబ్లికన్ల అభ్యరి్థత్వం సాధించడం మొదలుకుని ప్రధాన పోరు దాకా ఆద్యంతం ఆయన కనబరిచిన దూకుడు ఓటర్లను అమితంగా ఆకర్షించింది. ఆయన ‘అమెరికా ఫస్ట్’నినాదం రెండోసారి ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన అధికార పీఠం ఎక్కించింది. డెమొక్రాట్లకు అధ్యక్షుడు జో బైడెనే భారంగా మారారు. సకాలంలో తప్పుకోకపోవడం ద్వారా పార్టీ విజయావకాశాలకు తీవ్రంగా గండి కొట్టిన అప్రతిష్టను మూటగట్టుకున్నారు. భారత మూలాలున్న వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ శాయశక్తులా ప్రయత్నించినా, ఆమెదే పైచేయి అని ప్రధాన మీడియా ఎంతగా హోరెత్తించినా ట్రంప్ ‘తగ్గేదే లే’అన్నారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో ఏకంగా 312 ఓట్లను ఒడిసిపట్టి భారీ మెజారిటీతో విజయ దరహాసం చేశారు. రిషికి ఓటమి సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్ ప్రజలు తమ ఆగ్రహమంతటినీ అధికార కన్జర్వేటివ్ పార్టీపై చూపించారు. ఆ పార్టీ 14 ఏళ్ల ఏలుబడికి తెర దించారు. భారత మూలాలున్న తొలి బ్రిటన్ ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ సారథ్యంలో కన్జర్వేటివ్‌లు దారుణ ఓటమి మూటగట్టుకున్నారు. లేబర్ పార్టీ నేత కియర్స్టార్మర్కు జనం పట్టం కట్టారు.పాక్‌లో ప్రహసనం పాకిస్తాన్లో ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా నిలిచాయి. ప్రధాని షహబాజ్ షరీఫ్ కుటుంబ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్–ఎన్) ఆద్యంతం ఎన్నికల అక్రమాలకు పాల్పడిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్ని చేసినా జైలుపాలైన ఇమ్రా న్‌ఖాన్ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ)ను అడ్డుకోలేకపోయింది. పీటీఐ గుర్తింపునే రద్దు చేసినా స్వతంత్రులుగానే నిలబడి అన్ని పారీ్టల కంటే ఎక్కువ సీట్లు నెగ్గి సత్తా చాటారు. దాంతో నానా పారీ్టలను కలుపుకుని షహబాజ్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచి్చంది. లంకలో నవోదయం : కల్లోల శ్రీలంకలో సుదీర్ఘ వాయిదాల తర్వాత ఎట్టకేలకు నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో వామపక్షవాది అనూర కుమార దిస్సనాయకే సాధించిన విజయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దేశ దుస్థితికి ప్రధాన కారకులని భావించిన రాజపక్స కుటుంబాన్ని జనం రాజకీయంగా సమాధి చేశారు. పుతిన్ ఐదోసారి చెప్పుకోదగ్గ ప్రత్యర్థే లేకుండా జరిగిన ఎన్నికల్లో రష్యాలో పుతిన్ రికార్డు స్థాయిలో ఐదోసారి అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గారు. అది కూడా ఏకంగా 87 శాతం ఓట్లు సాధించారు. సోవియట్ అనంతర కాలంలో రష్యాలో ఇదే అత్యధిక మెజారిటీ. పుతిన్‌కు ప్రధాన అడ్డంకిగా మారడం ఖాయమని భావించిన విపక్ష నేత అలెక్సీ నావల్సీ ఎన్నికలకు ముందు జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించడం పెను దుమారమే రేపింది. వెనెజువెలాలో అధ్యక్షుడు నికొలస్ మదురో విజయమూ వివాదాస్పదమైంది. పారిపోయిన నేతలుపొరుగు దేశం బంగ్లాదేశ్‌లో అనూ హ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అది కూడా జనవరిలో సాధారణ ఎన్నికలు ముగిసి షేక్ హసీనా రికార్డు స్థాయిలో ఐదోసారి ప్రధాని కావడం ద్వారా అధికారాన్ని నిలబెట్టు్టకున్న ఐదు నెలలకే! అజ్ఞాత శక్తి కనుసన్నల్లో సాగినట్టు కని్పంచిన ‘ప్రజా ఉద్యమం’దెబ్బకు ఆమె పదవీచ్యుతురాలయ్యారు. అధికార నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో దాదాపుగా కట్టుబట్టలతో ఉన్నపళంగా దేశం వీడి భారత్‌లో రాజకీయ ఆశ్రయం పొందారు. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక సర్కా రు కొలువుదీరింది. నాడు మొదలైన అల్లర్లు, అరాచకాలు బంగ్లాలో నేటికీ కొనసాగుతున్నా యి. హిందువులతో పాటు మైనారిటీల భద్రతను ప్రమాదంలో పడేశాయి. అసద్‌లకు అల్విదా సిరియాలో అసద్‌ల 50 ఏళ్ల కుటుంబ పాలనకు తిరుగుబాటుదారులు డిసెంబర్లో తెర దించారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కుటుంబంతో పాటు రష్యాకు పారిపోయారు. అలా నియంతృత్వ పాలనకు తెర పడ్డా దేశం మాత్రం అనిశ్చితితో కూరుకుపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నమీబియాకు తొలి అధ్యక్షురాలు
నమీబియా ఎన్నికల్లో అధికార స్వాపో పార్టీ విజయం సాధించింది. నెటుంబో నండీ ఎండైట్వా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పీఠం అధిష్టించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. నమీబియా స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి 30 ఏళ్లుగా స్వాపో పార్టీయే అధికారంలో కొనసాగుతోంది. నమీబియాలో అధ్యక్ష పదవికి, నేషనల్ అసెంబ్లీకి విడిగా ఓటింగ్ జరుగుతుంది. 72 ఎండైట్వా 57 శాతం ఓట్లు సాధించారు. శాంతి, సుస్థిరత కోసం దేశం ఓటేసిందని ఫలితాల అనంతరం ఆమె అన్నారు. 1960ల్లో దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో స్వాపో పార్టీలో చేరిన ఎండైట్వా విదేశాంగ శాఖ వంటి కీలక పదవుల్లో పనిచేశారు. 96 స్థానాలకు స్వాపో పార్టీ 51 స్థానాలు గెలిచి మెజారిటీ సాధించింది. ఇండిపెండెంట్ పేట్రియాట్స్ ఫర్ ఛేంజ్ (ఐపీసీ) పార్టీ 20 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఎన్నికల ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని, ఫలితాలను కోర్టులో సవాలు చేస్తామని ఆ పార్టీ తెలిపింది. నిష్కళంక నేత ఎన్ఎన్ఎన్ అని పిలుచుకునే ఎండైట్వా పార్టీలో దిగ్గజ నేత. ఆఫ్రికా ఖండంలోని అతి కొద్ది నాయకురాళ్లలో ఒకరు. దేశ స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి ఏదో ఒక పదవిలో ఉంటూ వస్తున్నారు. పాస్టర్ కూతురు అయిన ఆమె గొప్ప రాజనీతిజ్ఞురాలిగా ఎదిగారు. గత ఫిబ్రవరిలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆర్థిక దౌత్యాన్ని ఉపయోగించి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగాలను సృష్టిస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. పార్టీలోని అన్ని వర్గాలను ఏకం చేయగలిగారు. నిష్కళంక నేతగా ఆమెకున్న ప్రతిష్ట ఎన్నికల్లో గెలుపు వైపు నడిపించింది. బలమైన గ్రామీణ మూలాలతో 30 లక్షల మంది జనాభా ఉన్న నమీబియా ప్రధానంగా యురేనియం, వజ్రాల ఎగుమతిదారు. దేశంలో మెరుగైన మౌలిక సదుపాయాలు లేవు. నిరుద్యోగం అధికం. దేశ సంపద స్థానికులకు ఉపయోగపడటం లేదు. 15–34 ఏళ్ల మధ్య వయసు్కల్లో నిరుద్యోగం 46 శాతముంది. ఇది జాతీయ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ. అధిక నిరుద్యోగం, అసమానతల కారణంగా స్వాపో పార్టీ గెలుపు కష్టమేనని విశ్లేషకులు భావించారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో బలమైన మూలాలు స్వాపోకు కలిసొచ్చాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హారిస్-ట్రంప్ హోరాహోరీ.. అదే జరిగితే..
న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలు సర్వే నివేదికలు.. ఈసారి ట్రంప్, హారిస్ మధ్య హోరాహోరీ పోటీ తప్పదని వెల్లడించిన విషయం తెలిసిందే. ఓటింగ్ సరళి పరిశీలిస్తే కూడా ట్రంప్-హారిస్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్, హారిస్ ఇద్దరిలో ఎవరికీ మెజారిటీ వస్తుంది? గెలుపెవరిదో చెప్పటం కష్టంగా ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కనీసం 270 ఎలక్టోరల్ ఓట్లు రాని పక్షంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరికీ చెరో 269 ఓట్లు వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత అమెరికా కాంగ్రెస్‌పై పడుతుంది. దిగువ సభ అయిన ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఇందుకోసం జనవరి 6న సమావేశమవుతుంది. ఒక్కో రాష్ట్రానికి ఒకటి చొప్పున 50 ఓట్లు కేటాయిస్తారు. 26, అంతకంటే ఎక్కువ ఓట్లు సాధించే వారే అధ్యక్షుడవుతారు.అయితే.. చివరిసారిగా రెండు శతాబ్దాల కింద, అంటే 1800లో ఇటువంటి పరిస్థితి తలెత్తింది. అధ్యక్ష బరిలోకి దిగిన థామస్ జెఫర్సన్, ఆరన్ బ్లర్ ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దాంతో ప్రతినిధుల సభ ఓటింగ్ జరపగా.. జెఫర్సన్ విజేతగా నిలిచారు. 2020లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో 66 శాతమే మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే.. అమెరికాలో 24 కోట్ల పై చిలుకు అర్హులైన ఓటర్లున్నారు. కానీ ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు మాత్రం 16.14 కోట్ల మందే. ఇది 2020 కంటే కూడా తక్కువ. 2020లో 16.8 కోట్ల మంది నమోదైన ఓటర్లుండగా వారిలో ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసింది 15.9 కోట్ల మంది మాత్రమే. ఈసారి ప్రచార సరళి ఆధారంగా పోటీ హోరాహోరీగా ఉన్నట్లు తెలుస్తోంది. -
అమెరికా ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో నిల్చున్నారు. ఇక.. పోలింగ్ పాల్గొని ఓటు వేయాలని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా పౌరులకు విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్ పేపర్ విధానంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. హ్యాండ్మార్క్డ్ పేపర్ బ్యాలెట్స్ ద్వారా కొందరు, బ్యాలెట్ మార్కింగ్ డివైజ్(BMD)లతో కూడిన పేపర్బ్యాలెట్తో మరికొందరు ఓటేసే ఛాన్స్ ఇచ్చారు. బీఎండీ డిజిటల్ బ్యాలెట్.. ఓటేసి అప్పటికప్పుడే ప్రింట్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈవీఎంల తరహా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్(DRE) ద్వారా కేవలం ఐదు శాతం ఓటేసే ఛాన్స్ ఉంది. హ్యాకింగ్ ఆరోపణలు, ట్యాంపరింగ్ అనుమానాల నేపథ్యంలోనే డీఆర్ఈలకు అమెరికా ఓటర్లు దూరంగా ఉన్నారు.ఇక.. గత ఎన్నికల్లో కేవలం 66 శాతమే పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు నిలబడ్డారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. ట్రంప్-హారిస్ మధ్య పోటీతో అమెరికన్ల తీర్పు ఎలా ఉండనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కనెక్టికట్, ఇండియానా, కెంటకీ, న్యూజెర్సీ, మెయినే, న్యూహాంప్సైర్, న్యూయార్క్ వర్జీనీయాలో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ అయిన వెంటనే కౌంటింగ్ ప్రారంభం కానుంది.ఇక.. రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి కల్లా ఫలితంపై స్పష్టత రానుంది. -
అమెరికా ఎన్నికలు.. తొలి ఫలితం వచ్చేసింది!
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాకముందే తొలి ఫలితం వచ్చేసింది!. తాజాగా న్యూహ్యాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం వెల్లడైంది. డిక్స్‌విల్లే నాచ్‌లో ఆరుగురు ఓటర్లు ఉన్నారు. అందులో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు మూడు చొప్పున ఓట్లు వచ్చాయి. న్యూహ్యాంప్‌షైర్ ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఇక్కడ అర్థరాత్రి నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఇద్దరు అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటాపోటీ నెలకొంది. న్యూ హాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నాచ్‌లో ఇద్దరూ మూడు బ్యాలెట్లను పొందారు. ఇది దశాబ్దాలుగా దేశంలోని మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఇక్కడ ప్రారంభం కావటం గమనార్హం.ఇక.. 2020లో డిక్స్‌విల్లే నాచ్ ఓటర్లు జో బైడెన్ వైపు మొగ్గుచూపారు.This village in New Hampshire was the first to vote at 12 am on November 5th. There are only 6 voters here. All the 6 cast their votes and the votes were immediately counted. The results - Kamala Harris got 3 votes, and Donald Trump got 3 votes. So, it was a tie. pic.twitter.com/QlzBv8oaKd— Sam (@suddensam55) November 5, 2024 -
‘చెత్త ట్రక్’ నడిపిన ట్రంప్.. బైడెన్, కమలకు కౌంటర్
న్యూయార్క్: ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ‘చెత్త’ చూట్టూ రాజకీయం నడుస్తోంది!. తాజాగా.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కౌంటర్ ఇస్తూ బుధవారం ఓ చెత్త ట్రక్‌ను నడిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.‘నా చెత్త ట్రక్ మీకు నచ్చిందా?. కమలా, జో బిడెన్‌ల గౌరవార్థంతో ట్రక్ నడుపుతున్నా’ అని ట్రంప్ మీడియాతో అన్నారు. ‘‘హాస్యనటుడు టోనీ హించ్‌క్లిఫ్ ప్యూర్టోరీకోపై చేసిన వ్యాఖ్యలపై ప్రస్తావించాల్సిన అవసరం లేదు. నాకు ఆ హాస్యనటుడి గురించి ఏమీ తెలియదు. నేను ఆయన్ను ఎప్పుడూ చూడలేదు. ఆయన ఒక హాస్యనటుడు.. ఆయన గురించి చెప్పడానికి ఏం ఉంటుంది’ అని మీడియా ప్రశ్నలను ట్రంప్ దాటవేశారు.TRUMP ARRIVES FOR CAMPAIGN RALLY IN A GARBAGE TRUCK!“How do you like my garbage truck? This truck is in honor of Kamala and Joe Biden.”“For Joe Biden to make that statement — it’s really a disgrace” pic.twitter.com/jA9nEQKvCg— J Stewart (@triffic_stuff_) October 30, 2024ఇటీవల రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న స్టాండప్ కమేడియన్ టోనీ హించ్‌క్లిఫ్ మాట్లాడుతూ ప్యూర్టోరీకోను నీటిపై తేలుతున్న చెత్తకుప్పగా అభివర్ణించారు. దానిపై అమెరికావ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. ప్యూర్టోరీకోపై టోనీ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో అధ్యక్షుడు జోబైడెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిస్పానిక్ గ్రూప్ వోటో లాటినో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసిన అసలైన చెత్త ఆయన (ట్రంప్) మద్దతుదారులు మాత్రమే. వారి రూపంలోనే అసలైన చెత్తాచెదారం కనిపిస్తోంది’’ అని అన్నారు. తాను చెత్త అన్నది ప్యూర్టోరీకోపై అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మద్దతుదారును ఉద్దేశించి మాత్రమేనంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. కానీ బైడెన్ వ్యాఖ్యలపై దుమారం చల్లారడం లేదు. -
USA Presidential Elections 2024: ఓట్లు తగ్గినా... గద్దెనెక్కవచ్చు!
అధ్యక్ష తరహా పాలన ఉన్న చాలా దేశాల్లో ఆ పదవికి ప్రత్యక్ష ఎన్నిక జరుగుతుంది. ప్రజలు తమ ప్రెసిడెంట్‌ను నేరుగా ఎన్నుకుంటారు. అత్యధిక ఓట్లు సాధించే వారే విజేతగా నిలుస్తారు. కానీ అగ్రరాజ్యమైన అమెరికాలో మాత్రం గమ్మత్తైన పరోక్ష ఎన్నిక విధానం అమల్లో ఉంది. అక్కడ అధ్యక్షున్ని ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజీ. మరి పోలింగ్ తేదీన ప్రజలు ఓటేసేది ఎవరికంటారా? ఎలక్టర్లుగా పిలిచే ఈ ఎలక్టోరల్ కాలేజీ సభ్యులకు. అనంతరం వారంతా కలిసి అధ్యక్షున్ని, ఉపాధ్యక్షున్ని నేరుగా ఎన్నుకుంటారు.విన్నర్ టేక్స్ ఆల్! అధ్యక్ష ఎన్నిక విషయంలో అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 48 రాష్ట్రాలు విన్నర్ టేక్స్ ఆల్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దానిప్రకారం ఒక రాష్ట్ర ఎలక్టోరల్ ఓట్లన్నీ ఆ రాష్ట్రంలో మెజారిటీ ఓట్లు సాధించే అభ్యరి్థకే దక్కుతాయి (మెయిన్, నెబ్రాస్కా మాత్రం అభ్యర్థులు సాధించే ఓట్ల ప్రకారం నైష్పత్తిక పద్ధతిలో వారికి ఎలక్టర్లను కేటాయిస్తాయి). దీనివల్ల దేశవ్యాప్తంగా కలిపి అత్యధిక ఓట్లు (పాపులర్ ఓట్) సాధించే అభ్యర్థి కూడా ఓటమి పాలయ్యే ఆస్కారం పుష్కలంగా ఉంది. గతంలో ఇలా జరిగింది కూడా. 2016లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే ఏకంగా 28 లక్షల పై చిలుకు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయినా ఆమె ఏకంగా 74 ఎలక్టోరల్ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు! 2000లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అల్ గోర్ కూడా తన రిపబ్లికన్ ప్రత్యర్థి జార్జి డబ్లు్య.బుష్ కంటే 5.5 లక్షల ఎక్కువ ఓట్లు సాధించారు. అయినా 271 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించిన బుష్కే పీఠం దక్కింది. 1876, 1888ల్లో కూడా పాపులర్ ఓట్ సాధించిన అభ్యర్థులు ఓటమి చవిచూశారు. కాకపోతే ఇప్పటిదాకా జరిగిన 59 అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా 54సార్లు పాపులర్ ఓట్ సాధించిన అభ్యర్థే విజేతగా నిలిచారు. ఎందుకీ ‘కాలేజీ’...? ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ వల్ల చిన్న రాష్ట్రాలకు కూడా అధ్యక్షుని ఎన్నికలో తగిన ప్రాధాన్యం దక్కుతుంది. అంతేగాక అభ్యర్థులు దేశమంతటా కాలికి బలపం కట్టుకుని తిరిగే అవసరముండదు. గెలుపోటములను నిర్దేశించి ఆరేడు స్వింగ్ స్టేట్స్పై గట్టిగా దృష్టి పెడితే సరిపోతుంది. కాకపోతే ఈ విధానంలో లోపాలూ లేకపోలేదు. పాపులర్ ఓట్ సాధించిన వాళ్లు కూడా ఓడే ఆస్కారముండటం వాటిలో ప్రధానమైనది. తమ ఓట్లకు ప్రాధాన్యం లేదనే భావనతో జనం ఓటింగ్‌కు దూరమయ్యే ఆస్కారమూ ఉంటుంది.జనాభాకు తగ్గట్టు... ప్రతి రాష్ట్రానికి జనాభాకు అనుగుణంగా ఎలక్టర్ల సంఖ్యను కేటాయిస్తారు. ఇది ఆ రాష్ట్రానికి కేటాయించిన ప్రతినిధుల సభ, సెనేట్ సభ్యుల సంఖ్యకు సమానంగా ఉంటుంది. ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల సంఖ్య 538. అధ్యక్ష ఎన్నికలో నెగ్గాలంటే వీటిలో కనీసం 270 ఓట్లు అవసరం. కాలిఫోర్నియాలో అత్యధికంగా 54 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లుంటే వ్యోమింగ్, నార్త్ డకోటా, అలస్కా వంటి రాష్ట్రాల్లో కేవలం మూడే ఉన్నాయి. అమెరికాలోనూ అప్పుడప్పుడూ గోడదూకుళ్లు! ఎలక్టర్లు తమ పార్టీ అభ్యరి్థకే ఓటేయాలన్న రాజ్యాంగ నిర్బంధమేమీ అమెరికాలో లేదు! 2016లో ఏడుగురు ఎలక్టర్లు ప్రత్యర్థులకు ఓటేశారు. వీరిలో ఐదుగురు డెమొక్రాట్లు కాగా ఇద్దరు రిపబ్లికన్లు. అయితే వారి చర్య తుది ఫలితంపై ప్రభావం చూపలేదు. హిల్లరీ క్లింటన్‌కు 232 ఎలక్టర్ ఓట్లు రాగా 306 ఓట్లతో ట్రంప్ సునాయాసంగా విజయం సాధించారు. ఇలాంటి గోడదూకుడు ఎలక్టర్లకు సంబంధిత పారీ్టలు జరిమానా విధించడమే గాక వారిపై అనర్హత వేటు కూడా వేయొచ్చు. వారిపై చట్టప్రకారం చర్యలు కూడా చేపట్టమే గాక వారి స్థానంలో వేరేవాళ్లను ఎలక్టర్లుగా నియమించుకునేందుకు వీలు కల్పిస్తూ 32 రాష్ట్రాలు చట్టాలు చేశాయి. సుదీర్ఘ ప్రక్రియ అమెరికాలో అధ్యక్ష ఎన్నిక సుదీర్ఘ ప్రక్రియ. ముందుగా ప్రధాన పార్టీలు తమ అధ్యక్ష అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుడతాయి. ఇది పోలింగ్‌కు దాదాపు 9 నెలల ముందుగానే మొదలవుతుంది... -అధ్యక్ష అభ్యర్థులపై కాకస్‌లు, ప్రైమరీల ద్వారా పార్టీ సభ్యులు, ప్రతినిధులు తమ అభిప్రాయం వెలిబుచ్చుతారు. -అనంతరం ఆగస్టు/సెప్టెంబర్ నెల్లలో పార్టీ జాతీయ సదస్సులో అభ్యరి్థని అధికారికంగా ప్రకటిస్తారు. అక్కడినుంచి ఎన్నికల పోరు ఊపందుకుంటుంది. -ప్రచారం, ప్రధాన అభ్యర్థుల డిబేట్లతో పోరు పతాక స్థాయికి చేరుకుంటుంది. -నవంబర్‌లో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం పోలింగ్ ఉంటుంది. -విజేత ఎవరో పోలింగ్ ముగియగానే ఆ రాత్రే దాదాపుగా తేలిపోతుంది. -అయితే అంతకు కొద్ది నెలల నుంచే ముందస్తు ఓటింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ఈసారి ఇప్పటికే 3.5 కోట్ల మందికి పైగా అమెరికన్లు ముందుగానే ఓటేయడం విశేషం.జనవరి 6న ఫలితం జనవరి 6న అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం జరుగుతుంది. ఎలక్టోరల్ ఓట్ల లెక్కింపు జరిపి అధ్యక్ష, ఉపాధ్యక్షులను అధికారికంగా ప్రకటిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు ఈ ప్రక్రియను సెనేట్ అధ్యక్షుని హోదాలో పర్యవేక్షిస్తారు. నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షుల పేర్లను కూడా ప్రకటిస్తారు. → ఎలక్టోరల్ ఓట్లలో ఏ అభ్యరి్థకీ మెజారిటీ రాకపోతే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత ప్రతినిధుల సభపై పడుతుంది. దాని సభ్యులంతా కలిసి అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు సాధించిన తొలి ముగ్గురు అభ్యర్థుల్లో నుంచి మెజారిటీ ఓటు ద్వారా ఒకరిని అధ్యక్షునిగా ఎన్నుకుంటారు. → ఉపాధ్యక్ష పదవికి కూడా అంతే. ఎవరికీ మెజారిటీ రాకపోతే అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు సాధించిన తొలి ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని సెనేట్ సభ్యులు మెజారిటీ ఓటు ద్వారా ఉపాధ్యక్షునిగా ఎన్నుకుంటారు. → దాంతో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ కొలిక్కి వచి్చనట్టే. చివరగా జనవరి 20న ప్రమాణస్వీకారం ఉంటుంది. ముందుగా ఉపాధ్యక్షుడు, అనంతరం అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ రోజు ఆదివారమైతే కార్యక్రమాన్ని జనవరి 21న నిర్వహిస్తారు. → 1933 దాకా కొత్త అధ్యక్షుడు మార్చి 4న ప్రమాణస్వీకారం చేసేవారు. 1937 నుంచి జనవరి 20కి మార్చారు.అసలు ఎన్నిక డిసెంబర్ 16న!ఓటింగ్ ముగిశాక కూడా అమెరికా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఏకంగా మరో రెండు నెలల పాటు సాగుతుంది! → రాష్ట్రాల స్థాయిలో ఎలక్టర్ల ఎన్నిక ప్రక్రియ దాదాపు నెల పాటు జరుగుతుంది. మెయిన్, నెబ్రాస్కా మినహా మిగతా 48 రాష్ట్రాల్లోనూ మెజారిటీ ఓట్లు సాధించిన పారీ్టకే ఆ రాష్ట్రంలోని మొత్తం ఎలక్టోరల్ ఓట్లూ దక్కుతాయి. → అనంతరం తమ ఎలక్టర్లుగా ఎవరుండాలో సదరు పార్టీ తాలూకు రాష్ట్ర శాఖ నిర్ణయిస్తుంది. → ఎలక్టర్లుగా ఎన్నికైన వారంతా డిసెంబర్లో రెండో బుధవారం తర్వాత వచ్చే సోమవారం ఆయా రాష్ట్రాల రాజధానుల్లో భేటీ అవుతారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులకు విడివిడిగా ఓటేస్తారు. ఒకవిధంగా అధ్యక్షున్ని వాస్తవంగా ఎన్నుకునేది ఈ రోజే! ఈసారి ఎలక్టర్ల భేటీ డిసెంబర్ 16న జరగనుంది. → అనంతరం డిసెంబర్ నెల నాలుగో బుధవారం లోగా, అంటే ఎలక్టర్ల భేటీ జరిగిన 9 రోజుల్లోపు వారి ఓట్లన్నీ సెనేట్ అధ్యక్షునికి చేరాల్సి ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్, హారిస్ ప్రచారంపై చైనా హ్యాకర్ల టార్గెట్!
న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరుపార్టీల అధ్యక్ష అభ్యర్థులు, ఉపాధ్యక్ష అభ్యర్థల ప్రచారంపై చైనా హ్యాకర్లు టార్గెట్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ.. అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ప్రచారానికి అనుబంధంగా ఉన్న వ్యక్తులు ఉపయోగించే ఫోన్లను చైనా హ్యాకర్లు.. హ్యాక్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.అదేవిధంగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ , ఉపాధ్యక్ష అభ్యర్థి జెడి వాన్స్ ప్రచారాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. అయితే.. ట్రంప్, వాన్స్ ప్రచారాన్ని చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు ట్రంప్ బృందం ధృవీకరించకపోవటం గమనార్హం. అయితే హ్యాక్ విషయంలో ట్రంప్ బృందం దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా గెలవకుండా అడ్డుకోవడానికి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ చైనా, ఇరాన్‌లను ప్రోత్సహించారని ట్రంప్ ప్రచార కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ ఆరోపణలు చేశారు.ఈ వ్యవహారంపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది. ‘హ్యాకింగ్‌కు సంబంధించి నిర్దిష్టమైన సమాచారం మాకు తెలియదు. చైనా అన్ని రకాలుగా సైబర్ దాడులు, సైబర్ దొంగతనాలను వ్యతిరేకిస్తుంది. వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది’ అని పేర్కొంది. ‘‘అధ్యక్ష ఎన్నికలు అమెరికా దేశీయ వ్యవహారాలు. వాటిపై చైనాకు ఎటువంటి ఉద్దేశ్యం లేదు. అమెరికా ఎన్నికలలో చైనా జోక్యం చేసుకోదు’’ అని రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు. ఇక.. ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ ప్రచారంపై హ్యాక్ జరిగింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌లోని ముగ్గురు సభ్యులపై ఆమెరికా ఆరోపణలు చేసింది. వారు నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించారని పేర్కొంది.చదవండి: అడ్వాంటేజ్ డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా ఎన్నికల సర్వేలో సూపర్ ట్విస్ట్.. లీడ్‌లోకి ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఎన్నికలు గెలుపు ఎవరిది? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. విజయం కోసం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఇద్దరు అభ్యర్థులు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ మద్దతు కూడగట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు.. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుపై సర్వేలు ఆసక్తికర ఫలితాలను వెల్లడిస్తున్నాయి.అగ్ర రాజ్యం అమెరికాలో నవంబర్ 5వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మధ్య ఆధిపత్యంపై వాల్ స్ట్రీట్ జర్నల్ చేపట్టిన సర్వేలో కీలక విషయాలను వెల్లడించింది. వీరిద్దరి మధ్య స్వల్ప తేడాతో పోటీ కొనసాగుతోందని స్పష్టం చేసింది. తాజా సర్వే ప్రకారం.. ట్రంప్‌నకు 47 శాతం, హారీస్‌కు 45 శాతం మంది ఆదరణ ఉన్నట్టు తెలిపింది. సర్వే మార్జిన్ ప్లస్ లేదా మైనస్ 2.5 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. దీంతో, ట్రంప్ లీడ్‌లోకి వచ్చినట్టు స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడం ఇద్దరు అభ్యర్థులు స్వరం పెంచారు. తాజాగా ట్రంప్‌పై కమల విరుచుకుపడ్డారు. ట్రంప్ అసమర్థుడని, అధ్యక్ష పదవికి కరెక్ట్ కాదని.. ఆయనో నియంత అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో రాజ్యాంగానికి కట్టుబడి ఉండే సైన్యం ట్రంప్‌కు నచ్చదు. అమెరికా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ఆయన చేసిన ప్రతిజ్ఞను గతంలో ఉల్లంఘించారు. గత వారమే తన సహచర అమెరికన్లను అంతర్గత శత్రువులుగా పేర్కొన్నారు అంటూ మండిపడ్డారు. ఇక, తనపై ఆరోపణలకు ట్రంప్ కౌంటరిచ్చారు. ఎన్నికల్లో ఒక వేళ కమలా హారీస్ గెలిస్తే.. అమెరికాలో చైనా ఆడుకుంటుంది. ఆమెకు చిన్న పిల్లను చేసి జిన్‌పింగ్ గేమ్ ఆడుకుంటారని సెటైర్లు వేశారు. -
ట్రంప్ గెలిస్తే.. పుతిన్ కీవ్‌లో కూర్చుంటారు: కమల
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవల్సి వస్తుందని ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ హెచ్చరించారు. విస్కాన్సిన్లోని పార్టీ మద్దతుదారులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.‘‘డొనాల్డ్ ట్రంప్ ప్రమాదకరమైన వ్యక్తి అని అమెరికా ప్రజలు గుర్తించటం చాలా ముఖ్యమని భావిస్తున్నా. ఇదే విషయాన్ని నేను చాలా బహిరంగంగా చెప్పాను. ట్రంప్ మళ్లీ అమెరికాకు అధ్యక్షుడిగా ఎంపికైతే కలిగే పరిణామాలు చాలా క్రూరంగా ఉంటాయి. నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. అమెరికా మిత్రపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ పొగడ్తలకు సులభంగా తన ఆలోచనలను మార్చుకుంటారు. కోవిడ్ సమయంలో ఆయన ఏం చేశారో అందరికీ తెలుసు. తన వ్యక్తిగత ప్రయోజనం కోసం (రష్యన్ అధ్యక్షుడు) వ్లాదిమిర్ పుతిన్‌కు రహస్యంగా కోవిడ్ పరీక్షల పరికరాలు పంపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ పదేపదే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన ఒక రోజులో పరిష్కరిస్తానని చెప్పారు. లొంగిపోవడం ద్వారా అమెరికా ప్రెసిడెంట్ అటువంటి సమస్యను పరిష్కరించాలని అమెరికన్లుగా మనం భావిస్తున్నామని నేను అనుకోను. డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడైతే వ్లాదిమిర్ పుతిన్ ఏకంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో కూర్చుంటారు. ట్రంప్ తనను అభిమానించే వ్యక్తులను సంతోషపెట్టాలని అనుకుంటారు’’ అని అన్నారు. ఇక.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు ట్రంప్ గంతంలో కూడా చేసిన విషయం తెలిసిందే. -
నా పాలన బైడెన్‌కు కొనసాగింపుగా ఉండదు: కమల
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే తన అధ్యక్ష పాలన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలను కొనసాగిపు ఉండదని ఉపాధ్యక్షురాలు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే ప్రత్యేకంగా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఏమీ చేయలేదని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘నేను నా జీవిత అనుభవాలు, వృత్తిపరమైన అనుభవాలు,ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కొత్త ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటాను. నేను అమెరికాలోని కొత్త తరానికి చెందిన నాయకత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా.డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలను కించపరచేందుకు, ప్రజల గౌరవాన్ని తగ్గించేందుకు ఇష్టపడే వ్యక్తి’’ అని అన్నారు.Kamala Harris on what she would do differently from Biden’s presidency: “Let me be very clear: My presidency will not be a continuation of Joe Biden's presidency.” pic.twitter.com/zGzgvB9M20— Elizabeth Weibel (@elfaddis) October 16, 2024 ఇక.. ఇప్పటికే కమలా హరీస్ అధ్యక్షురాల గెలిస్తే తన సొంతమార్గం ఎంచుకుంటారని అధ్యక్షడు జో బైడెన్ పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కోపం ప్రదరిస్తూ అమెరికా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు బాధ్యత వహించకుండా మరోసారి తప్పుకున్నారని డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.చదవండి: ఐవీఎఫ్ తండ్రిని నేను: డొనాల్డ్ ట్రంప్ -
‘కమల మార్క్ పాలన వేరు’.. బైడెన్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హారిస్ గెలిస్తే.. సొంత మార్గాన్ని ఎంచుకుంటారని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే ప్రత్యేకంగా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఏమీ చేయలేదన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ జో బైడెన్ స్పందించారు.‘‘అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే.. ఆమె సొంత మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రతి ప్రెసిడెంట్ కూడా సొంత మార్గాన్ని మాత్రమే ఎంచుకుంటారు. నేనే కూడా అదే చేశాను. నేను మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు విధేయుడిగా ఉన్నా. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన అడుగుజాడల్లో నడిచాను. కానీ నేను అధ్యక్షుడిగా నా స్వంత మార్గాన్ని ఎప్పుడూ తప్పలేదు. .. నాలాగే కమల కూడా చేస్తారు. ఆమె ఇంతవరకు నాకు విధేయంగా ఉన్నారు. అయితే.. ఆమె అధ్యక్షురాలి గెలిస్తే తన సొంత మార్గాన్ని ఎంచుకుంటారు. అమెరికా ప్రజల సమస్యలపై కమల అలోచన విధానం చాలా కొత్తగా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ ఆలోచన విధానం పాతది, విఫలమైంది. ఆయన ఆలోచనల్లో ఎటువంటి నిజాయితీ ఉండదు’’ అని అన్నారు. ఇక.. 2009 నుంచి 2017 వరకు ఒబామా ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: కొరియా దేశాల మధ్య హైఅలర్ట్.. కిమ్ ఆర్మీలోకి భారీ చేరికలు -
రసవత్తర పోరు.. ‘అంకెల్లో’ అమెరికా అధ్యక్ష ఎన్నికలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు ఎంతో రసవత్తరంగా సాగుతోంది. నవంబర్‌లో జరగబోయే ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది, అగ్ర రాజ్యంలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన వివరాలు అంకెల్లో చూసుకుంటే..అధ్యక్ష పదవికి ఇద్దరు పోటీఅమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పలువురు పోటీ పడ్డారు. చివరికి ఎన్నికల బరిలో ఇద్దరు నిలిచారు. వారు డెమోక్రాట్ కమలా హారిస్, రిపబ్లికన్ డోనాల్డ్ ట్రంప్.నవంబర్ ఐదున ఎన్నికలు2024, నవంబర్ 5 ఎన్నికల రోజు. నవంబర్ నెలలో మొదటి సోమవారం తరువాత వచ్చే మంగళవారం నాడు అమెరికాలో సాంప్రదాయకంగా ఎన్నికలు నిర్వహిస్తుంటారు.ఏడు స్వింగ్ స్టేట్స్స్వింగ్ స్టేట్స్ సంఖ్య ఏడు. ఈ రాష్ట్రాల్లో హోరాహోరీ పోరు జరగనుంది. ఈ జాబితాలో అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ ఉన్నాయి. అత్యంత రసవత్తరంగా సాగే అధ్యక్ష ఎన్నికల్లో ఈ రాష్ట్రాలు అత్యంత కీలకం. ఈ జాబితాలోని ఏ రాష్ట్రంలోనైనా కొద్ది ఓట్లు తేడాతో అభ్యర్థులు ఓడిపోయే అవకాశాలుంటాయి.ప్రతినిధుల సభలో 435 స్థానాలు ఖాళీ34 సెనేట్ స్థానాలు కలిగిన ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా ఓటర్లు అధ్యక్షుడిని ఎన్నిక చేయడమే కాకుండా, కాంగ్రెస్ సభ్యులను కూడా ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. సభలోని సభ్యుల పదవీకాలం రెండేళ్లు. ప్రస్తుతం రిపబ్లికన్లకు మెజారిటీ ఉంది. కమలా హారిస్‌కు చెందిన డెమోక్రాట్లు విజయంపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. సెనేట్‌లో ఆరేళ్ల పదవీ కాలానికి 100 సీట్లకు గాను 34 సీట్లు ఖాళీగా ఉన్నాయి. స్వల్పంగా ఉన్న డెమొక్రటిక్ మెజారిటీని తిప్పికొట్టాలని రిపబ్లికన్లు భావిస్తున్నారు.ఓటర్ల గణాంకాలుఅమెరికాలోని ప్రతి రాష్ట్రంలో వేర్వేరుగా ఓటర్ల సంఖ్య ఉంది. సభకు ఎంపికయ్యే వారి సంఖ్య జనాభా ప్రాతిపదికన మారుతుంది. ఉదాహరణకు, గ్రామీణప్రాంతమైన వెర్మాంట్‌లో కేవలం మూడు ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే ఉన్నాయి. కాగా కాలిఫోర్నియాలో 54 ఓట్లు ఉన్నాయి. 50 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో మొత్తం 538 మంది ఓటర్లు ఉన్నారు.పోల్ వర్కర్ల సంఖ్యప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం 2020లో అమెరికా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడటానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన పోల్ వర్కర్ల సంఖ్య 7,74,000. అమెరికాలో మూడు గ్రూపుల ఎన్నికల సిబ్బంది ఉంటారు. వారు ఓటర్లకు సహాయం చేయడం, ఓటింగ్ పరికరాలను ఏర్పాటు చేయడం, ఓటరు ఐడీలను, రిజిస్ట్రేషన్లను ధృవీకరించడం వంటి పనులు చేస్తారు. వీరిని పోల్ వర్కర్లు అని అంటారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం లాంటి ప్రత్యేక విధులను నిర్వహించడానికి ఎన్నికల అధికారులు ఉంటారు. బ్యాలెట్ లెక్కింపును పర్యవేక్షించేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల పరిశీలకులను నియమిస్తాయి. 2020లో ఎన్నిక ఫలితాలను అంగీకరించేందుకు నాటి అధ్యక్షుడు ట్రంప్ నిరాకరించిన నేపధ్యంలో ఇప్పుడు బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై మరింతగా దృష్టి కేంద్రీకరించనున్నారు.244 మిలియన్ ఓటర్లు2024లో ఓటు వేసేందుకు అర్హులైన అమెరికన్ల సంఖ్య 244 మిలియన్ (ఒక మిలియన్ అంటే 10 లక్షలు)అని ద్వైపాక్షిక పాలసీ సెంటర్ తెలిపింది. వీరిలో ఎంత మంది ఓటు వేస్తారనేది వేచి చూడాలి. 2018, 2022 మధ్యంతర ఎన్నికలు, 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ లేనంత అత్యధిక ఓటింగ్ నమోదైనట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి? -
ట్రంప్ ర్యాలీకి సమీపంలో కలకలం.. గన్లతో వ్యక్తి సంచారం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి గన్లతో సంచరించటం కలకలం రేపింది. కాలిఫోర్నియాలోని కోచెల్లాలో నిర్వహించిన ట్రంప్ ర్యాలీ సందర్భంగా ఓ వ్యక్తి రెండు గన్లతో సంచరించాడని ట్రంప్ రక్షణ సహాయకుల బృందం షెరీఫ్ తెలిపింది. అక్రమ షాట్‌గన్ , లోడ్ చేసిన తుపాకీని స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు రివర్సైడ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఆదివారం ప్రకటించింది.A man was arrested near Trump's rally in Coachella, California, on Saturday and charged with illegal possession of a loaded firearm and high-capacity magazine, according to the Riverside County Sheriff. pic.twitter.com/xFPVdUyMeo— ANI (@ANI) October 14, 2024 ఈ విషయంపై తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. తాము వెంటనే అప్రమత్తమయ్యాయని, ట్రంప్‌నకు, ర్యాలీకి హాజరైన వారికి గానీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదని వెల్లడించారు. గన్లను పట్టుకొని సంచరించిన నిందితుడిని లాస్‌వెగాస్‌కు చెందిన వెమ్ మిల్లర్‌గా పోలీసులు గుర్తించారు. ట్రంప్‌పై ఇది మూడో హత్యాయత్నంగా అధికారులు అనుమానిస్తున్నారు.‘‘ఈ ఘటనలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది’ అని అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులను రక్షించే కల్పించే ఎఫ్‌బీఐ, యూఎస్ అటార్నీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. లాస్ వెగాస్‌కు చెందిన 49 ఏళ్ల వెమ్ మిల్లర్ బెయిల్‌పై విడుదలయ్యాడని, జనవరి 2న కోర్టు విచారణను ఎదుర్కొంటాడని షెరీఫ్ బృందం తెలిపింది. జూలైలో పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ ట్రంప్ చెవికి తగులుతూ పక్కకు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ట్రంప్ తృటిలో హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు. అదేవిధంగా సెప్టెంబరులో ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన పామ్ బీచ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర ఆయన్ను హత్య చేయడానికి 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్ వ్యక్తి రైఫిల్‌తో సంచరించినట్లు గుర్తించి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.చదవండి: యూఎస్ పౌరులను చంపిన వలసదారులకు మరణ శిక్ష: ట్రంప్ -
కమలా హారిస్ హెల్త్‌పై డాక్టర్ రిపోర్టు ఇదే..
న్యూయార్క్: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆరోగ్యంతో భేషుగ్గా ఉందని ఆమె డాక్టర్ యూఎస్ ఆర్మీ ఫిజిషియన్ జాషువా ఆర్. సిమన్స్ తెలిపారు. కమల ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్ ఇచ్చిన నివేదికను శనివారం వైట్ హౌస్ విడుదల చేసింది.‘‘కమలా హారిస్‌కు కాలానుగుణంగా వచ్చే అలెర్జీలు, దద్దుర్లు ఉన్నాయి. ఆమె ఇమ్యునైజేషన్లు , నివారణ సంరక్షణ సిఫార్సులు సరిగా ఉన్నాయి. ఆమె ఎప్రిల్నెలలో చేసుకున్న ఫిజికల్ పరీక్ష, సాధారణ రక్త పరీక్షల్లో కూడా ఎటువంటి సమస్య లేదు. కళ్లకు కాంటాక్ట్ లెన్స్‌లు ధరిస్తారు. విటమిన్ D3 సప్లిమెంట్ తీసుకుంటారు. కొన్ని సమయాల్లో అల్లెగ్రా, నాసల్ స్ప్రే , ఐ డ్రాప్స్‌తో పాటు అలెర్జీకి మందులను ఉపయోగిస్తారు. .. కమల తీసుకునే ఆహారం చాలా ఆరోగ్యకరమైంది. హారిస్ పొగాకు ఉత్పత్తులు, అల్కాహాల్ తీసుకోరు. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే అదీకూడా చాలా మితంగా తీసుకుంటారు. అమెరికా అధ్యక్షురాలిగా పనిచేసేందుకు ఆమె చాలా ఫిట్‌గా ఉన్నారు. విధులు నిర్వహించేందుకు అవసరమైన శారీరక, మానసిక స్థితిని కమల కలిగి ఉన్నారు’’ అని డాక్టర్ సిమన్స్ నివేదికలో వివరించారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ వైదొలిగి.. ఉపాధ్యక్షురాలు కమలను అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆరోగ్య సమస్యల కారణంగానే అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలిగినట్లు గతంలో ఆరోపణలు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కమలా హారిస్ తన ఆరోగ్యపరిస్థితి గురించి పూర్తి సమాచారాన్ని విడుదల చేశారు.చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి? -
భారత్‌లో దిగుమతి సుంకాలు అత్యధికం
వాషింగ్టన్: భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి సుంకాలు విధించే దేశమని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్షుడిగా గెలిస్తే అమెరికాకు భారత్ ఎగుమతులపై తానూ సమానస్థాయిలో పన్నులు విధిస్తానని స్పష్టం చేశారు. విదేశీ వస్తువులపై భారత్‌లోనే దిగుమతి సుంకాలు అత్యధికమని, అయితే చిరునవ్వుతో పన్నులు విధిస్తుందని తనదైన శైలిలో ముక్తాయించారు.‘అమెరికాను అత్యంత సుసంపన్నం చేయడానికి నా ప్రణాళికలోని ముఖ్యమైన అంశం.. పరస్పర క్రయ విక్రయాలపై సమానస్థాయిలో పన్నులు విధించడం (ఒక దేశం అమెరికా వస్తువులపై ఎంత శాతమైతే పన్ను వేస్తుందో.. అదే స్థాయిలో అమెరికాకు వాటి ఎగుమతులపై పన్ను వేయడం). సాధారణంగా మనం దిగుమతి సుంకాలు వేయం. అధ్యక్షుడిగా ఉండగా నేనే పన్నులు వేసే ప్రక్రియను మొదలుపెట్టా. చైనా 200 శాతం దిగుమతి సుంకం వేస్తుంది. బ్రెజిల్ కూడా భారీగా పన్నులు విధిస్తుంది. అందరికంటే భారత్ అత్యధికంగా వసూలు చేస్తుంది’ అని ట్రంప్ డెట్రాయిల్‌లో గురువారం ఒక ఆర్థిక విధాన ప్రసంగంలో అన్నారు. అయితే ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించి.. తన మాటల్లోని కాఠిన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ‘భారత్‌తో మనకు సత్సంబంధాలు ఉన్నాయి. నాకూ అంతే. ముఖ్యంగా నాయకుడు మోదీతో. ఆయన గొప్ప నాయకుడు. చక్కటిపాలన అందిస్తున్నారు. చాలావాటిల్లో చైనా కంటే ఎక్కువగా భారత్ పన్నులు వేస్తుంది. కాకపోతే చిరునవ్వుతో.. భారత్ వస్తువులు కొన్నందుకు ధన్యవాదాలు అని చెబుతారు’ అని ట్రంప్ అన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హార్లీ డేవిడ్సన్ మోటర్‌సైకిల్ కంపెనీ ప్రతినిధులు తనకిదే విషయం చెప్పారని వివరించారు. -
Donald Trump: అమెరికాకు గౌరవం తెస్తా
పెన్సిల్వేనియా: అవినీతి లేని వ్యవస్థను, అమెరికా విదేశాంగ విధానానికి తిరిగి ‘గౌరవం’ తీసుకొస్తానని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నేరాలకు మూలమైన ఓపెన్ బోర్డర్‌ను మూసేస్తామని హామీ ఇచ్చారు. జూలై 13న తనపై హత్యాయత్నం జరిగిన మళ్లీ పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో శనివారం ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. వేలాదిగా గుమిగూడిన అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థులు తనపై దు్రష్పచారం చేస్తున్నారని, చంపడానికి కూడా ప్రయతి్నంచారని ట్రంప్ ఆరోపించారు. జూలై 13న తనపై హత్యాయత్నం జరిగిన ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఓ 15 సెకన్ల పాటు కాలం ఆగిపోయింది. ఓ దుర్మార్గుడు చెడు చేద్దామని ప్రయతి్నంచాడు. కానీ విజయం సాధించలేకపోయాడు’’ అని వ్యాఖ్యానించారు. కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమవడం, ఒక వలంటీర్ ఫైర్ చీఫ్ మరణించడం తెలిసిందే.చిందేసిన మస్క్ టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో తొలిసారి కనిపించారు. ఆయనను ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తుతూ వేదికపైకి ఆహా్వనించారు. ట్రంప్ మాట్లాడుతుండగా మస్క్ చిందేసి సభికులను అలరించారు. ట్రంప్‌కు ఓటేయడం కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని చెప్పారు. ట్రంప్ ఓడిపోతే 2024 ఎన్నికలే అమెరికన్లకు చివరివి అవుతాయని హెచ్చరించారు. -
ట్రంప్ ‘ఐ హేట్ టేలర్ స్విప్ట్’ పోస్ట్.. క్యాష్ చేసుకున్న పాప్ స్టార్
అమెరికన్ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలా హారిస్ కి మద్దతుగా నిధులు సేకరిస్తున్నారు. ఐ హేట్ టేలర్ స్విప్ట్ అంటూ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ను టేలర్ స్విప్ట్ అస్త్రంగా మలుచుకున్నారు. ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా స్విప్టీస్ ఫర్ కమలా అని పిలిచే టేలర్ స్విప్ట్ అభిమానుల సంస్థ కమలా హారిస్ ప్రచారం కోసం 40వేల డాలర్లకు పైగా నిధుల్ని సేకరించినట్లు ప్రకటించింది. అమెరికన్ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్.. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి కమలా హారిస్‌కి తాను ఓటు వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే టేలర్ స్విఫ్ట్ నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఐ హేట్ టేలర్ స్విప్ట్ అంటూ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాదు హారిస్ కు మద్దతు పలికిన టేలర్ స్విఫ్ట్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయితే ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ను ఉపయోగించిన టేలర్ స్విప్ట్ అభిమానులు ఈ భారీ మొత్తంలో నిధులు సేకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా .. ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ను మేం ఒక అవకాశంగా మరల్చుకున్నాం. సోషల్ మీడియాలో ట్రంప్ కామెంట్స్ ను ఉపయోగించి ప్రచారం చేశాం. ప్రచారం మంచి ఫలితాల్ని అందించింది.మేము ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మీమ్లను ఉపయోగిస్తాము. వాటి అనుగుణంగా నెటిజన్ల భావోద్వేగాల్ని తమకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలో తెలుసు. వాస్తవానికి ద్వేషించేవారు ద్వేషిస్తారని మాకు (టేరల్ స్విప్ట్ అభిమానులు)తెలుసు. అలా ద్వేషించేవాళ్ల కంటే మేం ఇంకా మంచి పనులు చేయగలమని తెలుసు అని కమల ఫర్ స్విఫ్టీస్ కమ్యూనికేషన్స్ టీమ్ మెంబర్ కార్లీ లాంగ్ వ్యాఖ్యానించారు. -
Kamala Harris: నవతరం నాయకురాలిని
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే తాను భిన్నమైన నేతనని, ‘నవతరం నాయకత్వాన్ని’అందిస్తానని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. మార్పుకు ప్రతినిధిగా అమెరికన్ల ముందు తనను తాను ఆవిష్కరించుకుంటున్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో తలపడుతున్న విషయం తెలిసిందే. ఫిలడెలి్ఫయాలో శుక్రవారం హారిస్ ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ట్రంప్ విద్వేష, విభజన రాజకీయాలతో అమెరికన్లు విసిగిపోయారన్నారు. తనకు తుపాకీ ఉందని, ఎవరి తుపాకీ హక్కులను తాను హరించాలనుకోవడం లేదని తెలిపారు. ఆసల్ట్ స్టైల్ ఆయుధాలపైనే నిషేధం తప్పనిసరని తాను భావిస్తునన్నారు. బైడెన్‌కు మీరెలా భిన్నమో చెప్పాలని యాంకర్ బ్రియాన్ టాఫ్ అడగ్గా.. ‘నైనేతే జో బైడెన్‌ను కాను. నవతరం నాయకత్వాన్ని అందిస్తా’అని కమలా హారిస్ స్పందించారు. గతంలో ఆ నడిచిపోతుందిలే అని తేలికగా తీసుకున్న అంశాలను ఇకపై ఎవరూ నిర్లక్ష్యం చేయలేరన్నారు. పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రులకు ఇచ్చే చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను 6 వేల డాలర్లకు పెంచుతానన్నారు. ఒకరినొకరు వేలెత్తి చూపుకునేలా ప్రొత్సహిస్తున్న నాయకుడిలా (ట్రంప్‌లా) కాకుండా అమెరికన్లను ఏకతాటిపై నడిపే నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తనకు తెలుసన్నారు. -
మళ్లీ చర్చా.. ఆ చాన్సే లేదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో మరో డిబేట్లో పాల్గొనబోనని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన బిగ్ డిబేట్లో డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్‌పై తాను గెలిచానని, ఆమె ఓడిపోయినందునే మరో చర్చ అంటున్నారని తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో గురువారం ప్రకటించారు. జూన్‌లో అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన మొదటి డిబేట్, ఆ తర్వాత హ్యారిస్‌తో మంగళవారం జరిగిన డిబేట్‌ను ప్రస్తావిస్తూ ఇక మూడోది ఉండబోదని స్పష్టం చేశారు. గెలుపు తనదేనని, సర్వేలు కూడా అదే చెబుతున్నాయని ట్రంప్ చెప్పారు. కాగా, ప్రధాన మీడియా సంస్థల సర్వేల ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. బిగ్ డిబేట్‌ను చూసిన వారిలో 63 శాతం మంది కమలా హారిస్ గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేయగా, 37 శాతం మంది మాత్రమే ట్రంప్ వైపు మొగ్గు చూపారని సీఎన్ఎన్ సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. -
USA Presidential Elections 2024: కమలదే పై చేయి
డిబేట్ కోసం ప్రత్యర్థులిద్దరూ ఏబీసీ వేదికపైకి రాగానే హారిసే చొరవ తీసుకుని ట్రంప్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. తద్వారా ముందే పైచేయి సాధించారు. డిబేట్ చక్కగా సాగాలని ఆమె ఆకాంక్షించగా, ‘హావ్ ఫన్’ అంటూ ట్రంప్ స్పందించారు.గంటా నలభై ఐదు నిమిషాల పాటు సాగిన డిబేట్ ముగిశాక మాత్రం కరచాలనం వంటివేమీ లేకుండానే ఎవరికి వాళ్లు వేదిక నుంచి నిష్క్రమించారు.డిబేట్ పొడవునా హారిస్ పదేపదే ట్రంప్‌ను ఉడికించే వ్యాఖ్యలు చేశారు. పలు కేసుల్లో ఆయన దోషి అని ఇప్పటికే నిరూపణ అయిందంటూ ఎత్తిచూపారు. ఆయనపై మరెన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ట్రంప్ మాట్లాడుతుండగా పదేపదే నవ్వులు, ప్రశ్నార్థక చూపులతో ఆయన్ను ఒత్తిడిలోకి నెట్టారు.ఈ ఎత్తుగడలన్నీ బాగా ఫలించాయి. హారిస్ ఇలాంటి విమర్శలు చేసినప్పుడల్లా ట్రంప్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆగ్రహంలో అదుపు తప్పి పదేపదే అబద్ధాలు, అవాస్తవాలు చెప్పారు.ఆఫ్రో అమెరికన్ల ఓట్ల కోసం హారిస్ ఇటీవల ఆమె నల్లజాతి మూలాలను పదేపదే చెప్పుకుంటున్నారన్న తన గత వ్యాఖ్యలపై స్పందించేందుకు ట్రంప్ నిరాకరించారు. హారిస్ మాత్రం పలు సందర్భాల్లో ట్రంప్ చేసిన వివాదాస్పద జాతి వివక్షపూరిత, విద్వేష వ్యాఖ్యలన్నింటినీ ఏకరువు పెట్టారు.వాషింగ్టన్: అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూసిన తొలి, బహుశా ఏకైక ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59)దే పై చేయి అయింది. ఆమె దూకుడు ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (78) వెలవెలబోయారు. మంగళవారం రాత్రి పెన్సిల్వేనియాలో ఏబీసీ వార్తా సంస్థ వేదికగా జరిగిన డిబేట్లో మాజీ అధ్యక్షునిపై హారిస్ ఆద్యంతం స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు. దాదాపుగా ప్రతి అంశంలోనూ ట్రంప్‌ను చిత్తు చేశారు. ఆమె పక్కాగా హోం వర్క్ చేసి వచి్చన తీరు డిబేట్లో అడుగడుగునా కని్పంచింది. తొలుత కాస్త తడబడ్డా డిబేట్ సాగుతున్న కొద్దీ హారిస్ దూకుడు కనబరిచారు. పదునైన పంచ్‌లతో, టైమ్లీ వన్ లైనర్లతో ఎక్కడికక్కడ ట్రంప్‌ను ఇరుకున పెట్టారు. ఆర్థిక వ్యవస్థ మొదలుకుని విదేశీ విధానం, వలసలు, అబార్షన్ల దాకా ప్రతి అంశం మీదా చర్చను తను కోరుకున్న దిశగా నడిపించడంలో విజయవంతమయ్యారు. పూర్వాశ్రమంలో లాయర్ అయిన హారిస్ వాదనా పటిమ ముందు ట్రంప్ నిలువలేకపోయారు. చాలావరకు ఆమె ప్రశ్నలకు, లేవనెత్తిన అంశాలకు వివరణలు ఇచ్చుకోవడానికే పరిమితమయ్యారు. తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్రంప్ ఓ ఆటాడుకోవడం తెలిసిందే. ట్రంప్ పచ్చి అబద్దాలు చెప్పినా బైడెన్ కనీసం వాటిని వేలెత్తి చూపలేకపోయారు. పైగా ప్రసంగం మధ్యలో పదేపదే ఆగుతూ, పదాల కోసం తడుముకుంటూ, వయోభారంతో వణుకుతూ అభాసుపాలయ్యారు. ఈ దారుణ వైఫల్యంతో చివరికి పోటీ నుంచే బైడెన్ తప్పుకోవాల్సి వచి్చంది. ఆయన స్థానంలో అధ్యక్ష రేసులోకి వచ్చిన హారిస్ మాత్రం తాజా డిబేట్లో ట్రంప్‌కు చెమటలు పట్టించారు. ‘‘మన దేశాన్ని ఎలా నడపాలన్న ప్రధానాంశంపై ఈ రాత్రి మీరు ఇంతసేపూ రెండు భిన్నమైన వాదనలు విన్నారు. ఒకటి భవిష్యత్తుపై దృష్టి పెట్టిన నా వాదన. రెండోది గతం గురించి మాత్రమే మాట్లాడిన, దేశాన్ని వెనక్కే తీసుకెళ్లజూస్తున్న ట్రంప్ వాదన’’ అంటూ డిబేట్‌ను అంతే ప్రభావవంతంగా ముగించారు హారిస్.అబార్షన్‌పై హారిస్ → ట్రంప్ గెలిస్తే అబార్షన్లను నిషేధిస్తూ చట్టం తెస్తారు. → గర్భధారణలు, అబార్షన్లను ప్రభుత్వం వేయి కళ్లతో గమనిస్తుంటుంది. → అమెరికన్ల శరీరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోరాదన్నదే నా వైఖరి. → ట్రంప్ మాత్రం మహిళల శరీరాలపై హక్కులు ప్రభుత్వాలవేనంటున్నారు.ట్రంప్ → అబార్షన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలన్నదే నా విధానం. → అదిప్పటికే అమల్లో ఉంది. కనుక దీనిపై అసలు గొడవ గానీ, భిన్నాభిప్రాయాలు గానీ లేవు. → అంతే తప్ప నేనేమీ అబార్షన్లను నిషేధించబోవడం లేదు. → ఈ విషయంలో హారిస్ చెప్పేవన్నీ అబద్ధాలే.ఎన్నికల ర్యాలీలపైహారిస్ → ట్రంప్ ఎన్నికల ర్యాలీలు ఆద్యంతం పరమ బోరుగా సాగుతున్నాయి.→ జనాన్ని ఆకట్టుకునేలా మాట్లాడటంలో ఆయన ఘోరంగా విపలమవుతున్నారు. → విండ్ మిల్లుల వల్ల క్యాన్సర్ వస్తుంది వంటి కామెంట్లతో అభాసుపాలవుతున్నారు. → ట్రంప్ ప్రసంగం వినలేక జనం మధ్యలోనే వెళ్లిపోతున్నారు.ట్రంప్ → అన్నీ శుద్ధ అబద్ధాలు. బైడెన్–హారిస్ విధానాలతో అమెరికా అన్ని రంగాల్లోనూ కుదేలవుతోంది. అందుకే అమెరికన్లు పాత రోజులను కోరుకుంటున్నారు.→ దాంతో నా ర్యాలీలకు జనం పోటెత్తుతున్నారు. → వాటికి అమెరికా చరిత్రలోనూ అపూర్వమైన ఆదరణ దక్కుతోంది. → హారిస్ తన ర్యాలీలకు డబ్బులిచ్చి జనాన్ని రప్పించుకుంటున్నారు.ఆర్థిక వ్యవస్థపైట్రంప్: ఈ విషయంలో నేనేం చేయబోతున్నదీ అందరికీ తెలుసు. నా హయాంలో కరోనా కల్లోలాన్ని తట్టుకుంటూ అమెరికా ఆర్థిక వ్యవస్థను గొప్పగా మలిచా. దాన్ని మరోసారి చేసి చూపిస్తా. పన్నులకు భారీగా కోత పెడతా. హారిస్ మార్క్సిస్టు. మార్క్సిస్టు తండ్రి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విధానాల్లో ఆమె ఇప్పుడు నా భాషనే మాట్లాడుతున్నారు. కానీ గెలిచారంటే మాత్రం దేశాన్ని సర్వనాశనం చేస్తారు. బైడెన్‌కు, ఆమెకు తేడా లేదు. హారిస్: నేను బైడెన్నూ కాను, ట్రంప్‌ను అంతకన్నా కాను. ఈ విషయంలో నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. దేశానికి కొత్త తరం నాయకత్వాన్ని అందిస్తా. ఉత్త మాటలే తప్ప నిజానికి ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళికా లేదు. తన క్షేమం తప్ప ఆయనకు మీరెవరూ పట్టరు. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచి్చన నాకు ఆర్థికంగా దేశానికి ఏం కావాలో బాగా తెలుసు.వలసలపైట్రంప్ సరిహద్దుల నుంచి లక్షలాది మంది చొరబడుతున్నారంటే వలసల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న హారిసే ప్రధాన కారణం. వాళ్లు మన పెంపుడు జంతువులను కూడా తినేస్తున్నారు. ఈ చొరబాట్లు అమెరికాకు చాలా చేటు చేస్తాయి.హారిస్ ట్రంప్ వల్లే వలసల బిల్లు బుట్టదాఖలైందని విమర్శించడం మినహా ఈ అంశంపై పెద్దగా ఏమీ మాట్లాడలేదు. వలసదారులు పెంపుడు జంతువులను తింటున్నారన్న ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికన్లే పెదవి విరుస్తున్న నేపథ్యంలో వాటిపై వ్యూహాత్మక మౌనం పాటించారు.యుద్ధాలు, విదేశీ వ్యవహారాలపై... ట్రంప్ → నేను గెలిస్తే ఉక్రెయిన్ యుద్ధానికి ఒక్క రోజులో ముగింపు పలుకుతా. నేను ప్రెసిడెంట్‌గా ఉంటే యుద్ధం జరిగేదే కాదు. (ఉక్రెయిన్ గెలవాలనుకుంటున్నారా అన్న మోడరేటర్ల ప్రశ్నకు బదులు దాటవేశారు. పైగా యుద్ధానికి మిలియన్ల మంది బలయ్యారని అవాస్తవాలు చెప్పారు) → 2021లో అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం వైదొలగడం దేశ చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన సందర్భం. → ఇజ్రాయెల్‌ను హారిస్ ద్వేషిస్తారు. హారిస్ గెలిస్తే రెండేళ్లలోనే ఇజ్రాయెల్ సర్వనాశనం ఖాయం. అరబ్బులన్నా ఆమెకు ద్వేషమే.హారిస్ → అఫ్గాన్ నుంచి వైదొలగాలన్న బైడెన్ నిర్ణయం నాటి పరిస్థితుల్లో పూర్తిగా సబబే. ట్రంప్ తాలిబన్లతో అత్యంత బలహీన ఒప్పందం చేసుకున్నారు.→ నియంతలంటే ట్రంప్‌కు మహా ఆరాధన.→ నేను ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తానన్నది పచ్చి అబద్ధం. యూదు రాజ్యాన్ని మొదటినుంచీ సమర్థిస్తున్నా. అక్టోబర్ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్‌కు స్వీయరక్షణకు అన్ని హక్కులూ ఉన్నాయి. కానీ అమాయక పాలస్తీనియన్లు భారీ సంఖ్యలో యుద్ధానికి బలవుతున్నారన్నది కూడా వాస్తవమే. కనుక యుద్ధం తక్షణం ఆగాలి. కాల్పుల విరమణ, బందీల విడుదలే అందుకు మార్గం. దానికోసం కృషి చేస్తా.2020 ఎన్నికల ఫలితాలపైట్రంప్: వాటిలో నిజమైన విజేతను నేనే. క్యాపిటల్ హిల్ భవనంపై దాడితో నాకు సంబంధం లేదు. హారిస్: అమెరికా చరిత్రపై చెరగని మచ్చ ఏదన్నా ఉంటే అది కాపిటల్ హిల్‌పై దాడే. దాన్ని మర్చిపోయి ముందుకు సాగాలి. ట్రంప్‌పై హారిస్ పంచ్‌లు → ట్రంప్ ఓ బలహీన నాయకుడు. తప్పుడు నేత. ఆయన్ను చూసి ప్రపంచ దేశాధినేతలంతా నవ్వుతున్నారు. → అధ్యక్ష పదవికి ట్రంప్ కళంకమని ఆయనతో కలిసి పని చేసిన సైనిక ఉన్నతాధికారులే అంటున్నారు. → ట్రంప్ అంటేనే అబద్ధాలు, అభూత కల్పనలు. ఈ డిబేట్లో కూడా ఆయన చేసేదదే. → ట్రంప్ ఎంతసేపూ తన గురించే మాట్లాడతారు. ప్రజలు ఆయనకు అసలే పట్టరు. దేశానికి కావాల్సింది ప్రజల కోసం పాటుపడే నాయకుడే తప్ప ట్రంప్ వంటి స్వార్థపరుడు కాదు. → ఆయన 2020 ఎన్నికల్లో ఓడిపోయారు. 8.1 కోట్ల మంది ఆయనకు అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసన పలికారు (బైడెన్‌కు ఓటేసిన వారి సంఖ్యను ఉటంకిస్తూ). దాన్ని ట్రంప్ ఇప్పటికీ అస్సలు జీరి్ణంచుకోలేకపోతున్నారు.హారిస్‌కే 63 శాతం మంది ఓటు → డిబేట్లో ట్రంప్‌ను హారిస్ చిత్తు చేశారని సీఎన్ఎన్ వార్తా సంస్థ నిర్వహించిన ఫ్లాష్ పోల్‌లో 63 శాతం మంది పేర్కొన్నారు! → ట్రంప్‌కు బాగా అనుకూలమని పేరున్న ఫాక్స్ న్యూస్ కూడా డిబేట్ విజేత హారిసేనని అంగీకరించడం విశేషం. → చర్చకు వేదికైన ఏబీసీ న్యూస్ అభ్యర్థులిద్దరి వ్యాఖ్యలు, ప్రకటనలను లైవ్‌లో అప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసింది.ట్రంప్ చెప్పిన వాటిలో చాలావరకు అవాస్తవాలేనని తేలడం విశేషం. -
ట్రంప్ అమెరికాను చైనాకు అమ్మేశారు : హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ప్రత్యక్ష డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ, గర్భవిచ్ఛిత్తి అంశం, ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం,ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో పాటు ఇతర అంశాలపై చర్చ జరిగింది. డిబెట్లో ట్రంప్-హారిస్‌ల మధ్య మాటలు తూటాల్లా పేలాయి. అధ్యక్షుడిగా ట్రంప్ పాలనలో జరిగి తప్పిదాలను ప్రధాన అంశంగా చర్చిస్తూ హారిస్ పైచేయి సాధించారు. డిబెట్లో ఏబీసీ న్యూస్ యాంకర్లు డేవిడ్ ముయిర్,లిన్సే డేవిస్..ఆర్థిక వ్యవస్థ, కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో చెప్పాలంటూ హారిస్‌ను ప్రశ్నించారు. అందుకు హారిస్ ముందుగా పేదరికం గురించి మాట్లాడారు. తనని అమెరికా అధ్యక్షురాలిగా గెలిస్తే.. పేదరికంపై దృష్టిసారిస్తామని చెప్పారు. చిరు వ్యాపారాల్ని ప్రోత్సహిస్తామన్నారు. చిరు వ్యాపారం చేసే వారికి అండగా నిలుస్తాం. అందుకు వద్ద ప్రణాళికలు ఉన్నాయి’అని వాటి గురించి వివరించారు. అదే సమయంలో హారిస్..ట్రంప్‌ను టార్గెట్ చేశారు. ఒకానొక దశలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన ఘోర తప్పిదాల్ని ప్రాస్తావిస్తూ ట్రంప్‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు. మేం పేదలకు అండగా ఉంటే ట్రంప్ మాత్రం ధనికులకు, కార్పొరేట్ కంపెనీలకు అండగా నిలుస్తారు. ట్యాక్స్ కూడా తగ్గిస్తారు’ అని మండిపడ్డారు.అమెరికాను చైనాకి అమ్మేశారు : హారిస్అమెరికాను నెంబర్‌వన్‌గా నిలపడమే లక్ష్యం. తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ దేశాన్ని సమస్యల్లో వదిలేశారు. ప్రజాస్వామ్యంపై దాడి చేశారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీశారు. దేశాన్ని చైనాకు అమ్మేశారు. ఇప్పటికే ట్రంప్ చేసిన తప్పుల్ని బైడెన్ నేనూ సరిచేశాం. అలాంటి ట్రంప్ మళ్లీ ఎన్నికైతే అమెరికాకు చిక్కులు తప్పువంటూ హారిస్ హెచ్చరించారు.జోబైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ట్రంప్ నాశనం చేసిన ఆర్ధిక వ్యవస్థ తిరిగి గాడిలోకి పెట్టామంటూ నాటి ఆర్థిక పరిస్థితుల్ని ప్రస్తావించగా..డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాంటి ప్రణాళికలు లేవనన్నారు. ట్రంప్ ఏం మారలేదు ఆ తర్వాత ట్రంప్ సైతం కమలా హారిస్‌కు ధీటుగా బదులిచ్చారు. జోబైడెన్ ప్రభుత్వంలో రికార్డ్ స్థాయిలో పెరిగాయంటూ వ్యాఖ్యానిస్తుండగా.. హారిస్ అడ్డుతగిలారు. చూశారా? ట్రంప్ ఏం మారలేదు. అవే అబద్ధాలు. అవే మోసాలు. చెప్పిన అబద్దాల్ని పదే పదే చెబుతున్నారు. ప్రజల అంచనాలకు తగ్గట్లుగా వాదనల్ని వినిపించాలి. అలా కాకుండా ప్రజల్ని మోసం చేసేలా అవే పాత వ్యూహాలు, అబద్దాలు చెప్పడం.. ట్రంప్ వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రతిబింబిస్తున్నాయి.గర్భవిచ్ఛిత్తిపై.. ఇటీవలి కాలంలో అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గర్భవిచ్ఛిత్ (అబార్షన్)సహా పలు అంశాలు చర్చకు వచ్చాయి. డిబేట్ జరిగే సమయంలో ఇరువురు నేతలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు గుప్పించుకున్నారు. అమెరికాలో గర్భవిచ్ఛిత్తిపై నిషేధాన్ని హారిస్ తప్పుబట్టారు. ఆ ప్రక్రియను అనుమతిస్తూ ‘రో వర్సెస్ వేడ్’ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. మహిళల అభివృద్ధి ట్రంప్‌నకు గిట్టదు. అబార్షన్లపై ఆయన నిషేధం విధించాలనుకుంటున్నారు. ఇది మహిళలను అవమానించడమే’ అని హారిస్ అన్నారు.ఇదీ చదవండి : బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సంఇజ్రాయెల్కే మా మద్దతుడిబేట్లో గాజాలో జరుగుతున్న ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై హారిస్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేయగా.. ఆమె అధ్యక్షురాలిగా ఉంటే సాధ్యం కాదంటూ ట్రంప్ విమర్శలు గుప్పించారు. హారిస్ ఇజ్రాయెల్‌తో పాటు అరబ్లను ద్వేషిస్తున్నారు’ అని అన్నారు. అందుకు హారిస్ కలగజేసుకుని.. ట్రంప్ చేస్తున్న వాదనలు నిజం కాదు. ఇజ్రాయెల్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మీ మద్దతు ఎవరికి ఉక్రెయిన్ యుద్ధంపై హారిస్ స్పందిస్తూ.. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నట్లైతే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉండేవారు. పుతిన్ కీవ్‌లో కూర్చుని పోలాండ్‌తో ప్రారంభించి యూరప్‌లోని మిగిలిన ప్రాంతాలపై దృష్టి సారిస్తూ ఉండేవారు అని అన్నారు. యుద్ధంలో రష్యాపై ఉక్రెయిన్ విజయ సాధించాలని కోరుకుంటున్నారా? అని డిబేట్లో ట్రంప్‌ను ఏబీసీ యాంకర్లు ప్రశ్నించారు. అందుకు ట్రంప్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. అయితే యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెమోక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థులు కమలాహారిస్ , డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి టీవీ డిబేట్ అమెరికా వార్తాసంస్థ ఏబీసీ న్యూస్ ఫిలడెల్ఫియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్లో నిర్వహించింది. అమెరికా కాలమాన ప్రకారం రాత్రి 9.00 గంటలకు ప్రారంభం కాగా.. భారత్ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో ప్రారంభమైంది. ఇక డిబెట్ జరిగే న్యూస్ స్టూడియోలో ప్రేక్షకులు ఎవ్వరూ లేదు. ఏబీసీ న్యూస్ యాంకర్లు డేవిడ్ ముయిర్, లిన్సే డేవిస్ చర్చకు కోఆర్డినేటర్లుగా ఉన్నారు. 90 నిమిషాల పాటు జరిగిన ఈ డిబేట్లో రెండు సార్లు స్వల్ప విరామం ఇచ్చారు. డిబేట్ చివరలో చెరో రెండు నిమిషాలు ముగింపు ప్రసంగం చేసేందుకు అనుమతిచ్చారు. -
నేను గెలిస్తే.. వాళ్లు జైలుకే: డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఓవైపు హోరాహోరీగా దూసుకువెళ్తోంది. మరోవైపు.. సెప్టెంబర్ 10న జరిగే డిబేట్‌కు ఇరు పార్టీల అభ్యర్థులు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ‘ఎక్స్’ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా గెలిస్తే.. ఎన్నికల సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినవారిని జైలుకు పంపుతానని హెచ్చరించారు.‘నేను గెలిస్తే మోసం, అధ్యక్ష ఎన్నికల సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినవాళ్లు చట్టపరంగా పూర్తిస్థాయిలో విచారణ ఎదుర్కొంటారు. అంతే కాకుండా దోషులుగా తెలితే.. దీర్ఘకాల జైలు శిక్షలు కూడా అమలు చేస్తాం. ఈ విషయంలో మాత్రం న్యాయ ప్రక్రియలో ఎటువంటి దుర్వినియోగం జరగనివ్వను. కచ్చితంగా కఠినమైన శిక్షలను అమలు చేస్తాం. దయచేసి జాగ్రత్త వహించండి.. ఈ చట్టపరమైన చర్యలు అందరికీ వర్తిస్తాయి. న్యాయవాదులు, రాజకీయ నాయకులు, దాతలు, అక్రమ ఓటర్లు, అవినీతి ఎన్నికల అధికారులకు వర్తిస్తుంది. ఇంతకుముందు చూడని విధంగా అక్రమాలకు పాల్పడినవాళ్లను వెతికిమరీ విచారించి, శిక్షలు విధిస్తాం’’ అని ట్రంప్ అన్నారు. ఎన్నికల వేళ ట్రంప్ చేసిన హెచ్చరికలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.CEASE & DESIST: I, together with many Attorneys and Legal Scholars, am watching the Sanctity of the 2024 Presidential Election very closely because I know, better than most, the rampant Cheating and Skullduggery that has taken place by the Democrats in the 2020 Presidential…— Donald J. Trump (@realDonaldTrump) September 8, 2024ట్రంప్ హెచ్చరిక వ్యాఖ్యల ప్రకారం ఆయన రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే కచ్చితమైన అధ్యక్ష కార్యాలయాన్ని ప్రతీకారం తీర్చుకోవటం కోసమే వినియోగించుకుంటారేమో అని రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు అక్రమ, మోసపూరిత చర్యలకు పాల్పడినట్లు ఆధారాలు లభించకపోవటం గమనార్హం. గత ఎన్నికల్లో ట్రంప్ ఆయన అమలు చేసిన పరిపాన విధానాల వల్లే ఓడిపోయారని కోర్టులు, రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే. -
ప్చ్.. డిబేట్లో కమలను ఓడించడం కష్టం!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పోటాపోటీగా దూసుకుపోతున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ ఈ ఇద్దరి మధ్య జరగబోయే డిబేట్ కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు ఎస్తోంది. తాజాగా ఈ డిబేట్‌పై కమలా హారిస్ భర్త డగ్లస్ ఎంహోఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమలా హారిస్‌తో ట్రంప్ డిబేట్ సమీపిస్తున్న నేపథ్యంలో మీ స్పందన ఏమిటని మీడియా అడిగిన ప్రశ్నకు డగ్లస్ ఎమ్హోఫ్ మాట్లాడారు. ‘ఇప్పటివరకు మా మధ్య జరిగే చర్చలు, వాదనల్లో నేను ఒక్కసారి కూడా గెలవలేదు. ఆమె చాలా గొప్ప డిబేటర్. ఫస్ట్ క్లాస్ ట్రయల్ లాయర్’ అని అన్నారు. కమలా హారిస్ రాజకీయాల్లోకి రాకముందు హారిస్ దంపతులు న్యాయవాదులుగా పని చేశారు. హారిస్ శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా విధులు నిర్వర్తించారు.ఇక.. ఏబీసీ న్యూస్ సెప్టెంబర్ 10న రాత్రి 9 గంటలకు ఉపాధ్యక్షురాలు హారిస్‌కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధ్యక్ష ఎన్నికల రెండో డిబేట్‌ను నిర్వహించనుంది. ఇరునేతలు ముఖాముఖి డిబేట్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఫిలడెల్ఫియాలోని జాతీయ రాజ్యాంగ కేంద్రంలో ఈ డిబేట్ జరుగుతుంది. తొలి డిబేట్లో అధ్యక్షుడు జో బైడెన్‌పై ట్రంప్ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎన్నికల నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేయటంతో వైదొలిగారు. అనంతరం అధ్యక్ష బరిలో దిగిన ఉపాధ్యక్షురాలు కమల ప్రస్తుతం ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. -
‘కమల గెలిస్తే.. భారత్, అమెరికా సంబంధాలు అస్థిరం’
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ఇండో అమెరికన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు ట్రంప్‌పై కమల పైచేయి సాధిస్తూనే ఉన్నారు. ఇండో-అమెరికన్లు అధికంగా ఉండే పలు రాష్ట్రాలోని ఓటర్లు కమలకు అనుకూలంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. తాజాగా ‘‘హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్’’ అనే సంస్థ తమ పూర్తి మద్దతును మాజీ ప్రెసిండెంట్ డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రకటించింది. అంతేకాకుండా కీలకమైన రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా , నార్త్ కరోలినాలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉత్సవ్ సందుజా తెలిపారు. కమల అమెరికా అధ్యక్ష ఎన్నికల గెలుపొందితే.. భవిష్యత్తులో భారత-అమెరికా సంబంధాలు అస్థిరంగా మారుతాయని వ్యాఖ్యానించారు.‘‘కమల అమెరికా ప్రెసిడెంట్ అయితే పలు కీలకమైన పదువుల్లో ఆమె నియమించే వ్యక్తుల వల్ల ఆసియా-అమెరికా ఓటర్లపై తీవ్ర ప్రభావం ఎదుర్కొనున్నారు. ఇప్పటికే ప్రెసిడెంట్ జోబైడె ప్రభుత్వం దేశసరిహద్దు భద్రత, వలసదారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వలసలు పెరగటం వల్ల క్రైం రేటు పెరిగింది. మైనార్టీలు ముఖ్యంగా ఆసియా-అమెరికా వ్యాపారులు ప్రతికుల ప్రభావాలు ఎదుర్కొటుంన్నారు’ అని అన్నారు.‘‘డొనాల్డ్ ట్రంప్ మాత్రం వలస విధానాలు అమలు చేయటంలో పక్కాగా ఉంటారని తెలిపారు. భారత్ నుంచి రక్షణ, టెక్నాలజీ, సహకారం పెంచుకోవటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ట్రంప్ భారత అనుకూలవాది. భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో సంబంధాలను పెంపొందించుకోగలిగారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో అద్భుతమైన సంబంధాన్ని పెంపొందించుకోగలిగారని, చైనాపై భారత్‌ను ఢీకొనేందుకు వీలుగా అనేక రక్షణ ప్రాజెక్టులకు సహకరించారు. చైనాను భారత్ ఢీకొనేందుకు వీలుగా అనేక రక్షణ ప్రాజెక్టులకు సహకరించారు. భారత ప్రభుత్వం, ప్రజల గురించి కమల అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ మాత్రం భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. భారత్-అమెరికా సంబంధాలకు కమల అస్థిరత కలిగిస్తారు’’ అని అన్నారు.