న్యూయార్క్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హరిస్ స్పందించారు. పిరికివాళ్లే అలా మాట్లాడుతారని ఆమె ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. తన రన్నింగ్‌మేట్ టిమ్ వాజ్‌తో కలిసి కమలా హారిస్ పెన్సిల్వేనియా ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.
‘ఇటీవలి కాలంలో రాజకీయాల్లో వక్రబుద్ధి కన్పిస్తోంది. ఎదుటివారిని దెబ్బ కొట్టడం అనేది ఒక నాయకుడి చతురత మీద ఆధారపడి ఉంటుంది. ఇతరులను తక్కువ చేసి చేసి మాట్లాడే వారంతా పిరికివాళ్లే. అలా మాట్లాడేది పిరికివాళ్లే’ అని ట్రంప్‌కు కమల కౌంటర్ ఇచ్చారు.
ఆదివారం పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్ పాల్గొని కమలపై తీవ్ర విమర్శలు చేశారు. ‘చూడటానికి కమల కంటే నేను చాలా బాగుంటాను. ఆమెతో పోల్చితే.. నేను మంచిగా ఉంటానని భావిస్తున్నా. తెలివితేటలు గల వ్యక్తిగా కనిపిస్తాను’అని అన్నారు. ‘‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’’లో కమల అందాన్ని వర్ణిస్తూ కాలమిస్ట్ పెగ్గీ నూనన్ ఓ వ్యాసాన్ని రాశారు. అయితే వ్యాసాన్ని ఉద్దేశించి ట్రంప్.. ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
భిన్న ధ్రువాలు.. విభిన్న వైఖరులు
అలాగే.. రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి డేవిడ్ మెక్‌కార్మిక్‌ను ఉద్దేశించి.. ‘‘డేవిడ్.. దయచేసి స్త్రీని అందంగా ఉన్నారని ఎప్పుడూ పొగడకండి. ఎందుకంటే అది మీ రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతుంది’’ అని అన్నారు. టైమ్ మ్యాగజైన్ కవర్‌పై కమలా ఫొటోను ప్రస్తావిస్తూ.. అందులో ఉన్నది హీరోయిన్లు సోఫియా లోరెన్ లేదా ఎలిజబెత్ టేలర్ అనుకున్నానని సెటైర్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment