అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే తన అధ్యక్ష పాలన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలను కొనసాగిపు ఉండదని ఉపాధ్యక్షురాలు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే ప్రత్యేకంగా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఏమీ చేయలేదని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘నేను నా జీవిత అనుభవాలు, వృత్తిపరమైన అనుభవాలు,ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కొత్త ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటాను. నేను అమెరికాలోని కొత్త తరానికి చెందిన నాయకత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా.డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలను కించపరచేందుకు, ప్రజల గౌరవాన్ని తగ్గించేందుకు ఇష్టపడే వ్యక్తి’’ అని అన్నారు.
Kamala Harris on what she would do differently from Biden’s presidency:
“Let me be very clear: My presidency will not be a continuation of Joe Biden's presidency.” pic.twitter.com/zGzgvB9M20— Elizabeth Weibel (@elfaddis) October 16, 2024
ఇక.. ఇప్పటికే కమలా హరీస్ అధ్యక్షురాల గెలిస్తే తన సొంతమార్గం ఎంచుకుంటారని అధ్యక్షడు జో బైడెన్ పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కోపం ప్రదరిస్తూ అమెరికా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు బాధ్యత వహించకుండా మరోసారి తప్పుకున్నారని డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment