అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాకముందే తొలి ఫలితం వచ్చేసింది!. తాజాగా న్యూహ్యాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం వెల్లడైంది. డిక్స్‌విల్లే నాచ్‌లో ఆరుగురు ఓటర్లు ఉన్నారు. అందులో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు మూడు చొప్పున ఓట్లు వచ్చాయి.
న్యూహ్యాంప్‌షైర్ ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఇక్కడ అర్థరాత్రి నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఇద్దరు అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటాపోటీ నెలకొంది. న్యూ హాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నాచ్‌లో ఇద్దరూ మూడు బ్యాలెట్‌లను పొందారు. ఇది దశాబ్దాలుగా దేశంలోని మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఇక్కడ ప్రారంభం కావటం గమనార్హం.ఇక.. 2020లో డిక్స్‌విల్లే నాచ్ ఓటర్లు జో బైడెన్ వైపు మొగ్గుచూపారు.
This village in New Hampshire was the first to vote at 12 am on November 5th. There are only 6 voters here. All the 6 cast their votes and the votes were immediately counted.
The results - Kamala Harris got 3 votes, and Donald Trump got 3 votes. So, it was a tie. pic.twitter.com/QlzBv8oaKd— Sam (@suddensam55) November 5, 2024
Comments
Please login to add a commentAdd a comment