హోరా హోరీగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక గెలుపు సాధించారు. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించు కోవాలనుకున్న తన కలను సాకారం చేసుకున్నారు. 47వ అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక లాంఛనమే. దీంతో భారత్ సహా ప్రపంచదేశాలు ట్రంప్‌ను అభినందిస్తున్నాయి. మరోవైపు 78ఏళ్ల వయసులో అమెరికా అద్యక్షుడు కాబోతున్న ట్రంప్‌కిష్టమైన పదార్థాలేంటి, మద్యం తాగతాడా? టీ కాఫీలుతాగుతాడా అనేది నెట్టించ చర్చ మొదలంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు ఇష్టమైన ఫుడ్, వంటకాలేంటో ఒకసారి చూద్దాం.
ఫాస్ట్ ఫుడ్ అంటే ప్రాణం
ట్రంప్‌కు ఫాస్ట్ ఫుడ్ అభిమాని. అలాగే మీట్ లోఫ్ చాలా ఇష్టం. డైట్ కోక్, మెక్ డొనాల్డ్స్ ఫుడ్ అంటే మరీ ఇష్టం. ఇంకా బర్గర్ కింగ్, కెఎఫ్‌సీ సహా తో సహా ఫాస్ట్ ఫుడ్‌కి విపరీతమైన అభిమాని. ఈ విషయాన్ని దేశ విదేశాల పర్యటనల్లో ఆయన ఫాస్ట్‌ఫుడ్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే పంది మాంసాన్ని గుడ్లతో కలిపి తినడానికి ఇష్టపడతాడు. అంతేకాదు ఆయన రోజువారీ ఆహారంలోసాధారణంగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కంటే కూడా డిన్నర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
బ్రేక్‌ఫాస్ట్, లంచ్ , డిన్నర్
బేకన్ , గుడ్లు, తృణధాన్యాలు లేదా మెక్‌డొనాల్డ్స్ మెక్‌మఫిన్ తింటాడు. కాఫీ లేదా టీ అస్సలు తాగడు. గతంలో మాజీ ప్రచార నిర్వాహకుడు కోరీ లెవాండోస్కీ రాసిన లెట్ ట్రంప్ బి ట్రంప్ అనే పుస్తకం ప్రకారం ట్రంప్ పగటిపూట ఎక్కువగా తినడానికి ఇష్టపడడు. సాధారణంగా 14 నుండి 16 గంటలు తినకుండానే ఉంటాడు. ఎగ్ మెఫిన్స్ ఫిష్ శాండ్విచ్ చాక్లెట్ షాక్ అన్నా కూడా ఇష్టం.వ నిల్లా-ఫ్లేవర్ ఉన్న కీబ్లర్ వియన్నా ఫింగర్స్‌ను తింటారు.
డైట్ కోక్ అంటే పిచ్చి
మద్యానికి దూరంగాఉండే ట్రంప్ కి అత్యంత ఇష్టమైన పానీయం ఏదన్నా ఉందంటే అది డైట్ కోక్. రోజుకు సుమారు 12 క్యాన్ల డైట్ కోక్ తాగుతాడని చెబుతారు.. ఇక వెజ్ విషయానికి వస్తే ఆటూ చిప స్, లేస్ పొటాటో చిప్స్ ని ఆయన అధికంగా తింటారు. చెర్రీ తో పాటుగా వెనిల్లా ఐస్ క్రీం , చాక్లెట్ కేక్ ఆయనకు నచ్చిన ఆహారాల్లో భాగమే.
Comments
Please login to add a commentAdd a comment